
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. నేడు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొన్న కల్యాణ్ రామ్‌కు తారకరత్న హెల్త్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నాడు.
అతనికి మెరుగైన వైద్యం అందుతుంది. అయితే ఇప్పుడు కండీషన్ ఎలా ఉందన్నది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. ఆ విషయాలు హాస్పిటల్ వర్గాలు చెబితేనే బాగుంటుంది. మేం అందరం తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అతనికి మీ అందరి ఆశిస్సులతో తను పూర్తిగా రికవర్ అవుతాడని భావిస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు.
కాగా గత కొన్నిరోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు తారకరత్న పరిస్థితి ఇప్పడెలా ఉందన్నది అటు కుటుంబసభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment