Nandamuri Taraka Ratna
-
నందమూరి తారకరత్న వర్ధంతి.. పిల్లలతో కలిసి అలేఖ్యా రెడ్డి నివాళి (ఫొటోలు)
-
మనం ఇలా విడిపోతామని ఎప్పుడూ అనుకోలేదు: తారకరత్న భార్య ఎమోషనల్
సరిగ్గా రెండేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో, నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆయన చివరికీ కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 18, 2023న నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇవాళ తారకరత్న వర్ధంతి కావడంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ప్రపంచంలో నువ్వు లేని లోటు పూడ్చలేనిదని ఎమోషలైంది. నిన్ను కోల్పోయిన క్షణం కాలం నయం చేయలేని గాయం.. నీ స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. మనం ఎప్పుడూ ఇలా విడిపోవాలని అనుకోలేదు... నువ్వు ఇక్కడ ఉండకపోవచ్చు.. కానీ నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు వదిలి వెళ్లిన కలల్లో వికసిస్తూనే ఉంటుందని రాసుకొచ్చింది. మాటలకు , కాలానికి, జీవితానికి అతీతంగా మేము నిన్ను మిస్ అవుతున్నాం అంటూ అలేఖ్యా రెడ్డి.. తన భర్త తారకరత్నను గుర్తు చేసుకుంది.(ఇది చదవండి: Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత)నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
నందమూరి తారకరత్న కూతురి హాఫ్ శారీ ఫంక్షన్.. ఫోటోలు
-
ఏడాది క్రితం తీవ్ర విషాదం.. తారకరత్న భార్య ఎమోషనల్!
సరిగ్గా ఏడాది క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి హీరో తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. ఆయన మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది.. నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిది.. 18/2/2023 నుంచి నీకు, నాకు ఎలాంటి హద్దులు లేవు. రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఎలాంటి మార్పు ఉండదు. మీ ఉనికి, మీ ప్రేమ, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. ఇది ఎప్పటికీ చావదు.. నువ్వే నా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు !!' అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన ముగ్గురు పిల్లలతో ఉన్న వీడియోను షేర్ చేసింది. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న మరణం అటు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కడవరకు తోడుంటాడనుకుంటే ఇలా అర్థంతరంగా తనువు చాలించడంతో అలేఖ్య రెడ్డి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అప్పటి నుంచి భర్తను తలుచుకుంటూ అతనితో ఉన్న ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది అలేఖ్యా రెడ్డి. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ''ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే!.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళావు. వాటితో నేను ముందుకు వెళతాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను'' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్యా రెడ్డి. ఇక మరొక పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోను, తన కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ.. వీళ్లే తన స్టార్స్ అంటూ పేర్కొంది. కాగా నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. చదవండి: మెసేజ్ చేసినందుకు నేరుగా ఇంటికి వెళ్లిన డైరెక్టర్ View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
భర్తను తలుచుకొని ఎమోషనల్ అయిన తారకరత్న భార్య
నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన చిన్నవయసులోనే అర్థాంతరంగా తనువు చాలించడం కలిచివేస్తుంది. తారకరత్న చనిపోయి సుమారు 2నెలలు కావొస్తున్నా ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి తారకతరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా మరోసారి భర్తను తలుచుకుంటూ అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో తారకరత్న గడిపిన క్యూట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ.. నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నా అంటూ ఇన్‌స్టాలో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు.. మాకే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా జనవరి 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
తండ్రి ఫొటో పట్టుకుని తారకరత్న కొడుకు అలా.. అలేఖ్య పోస్ట్ వైరల్
దివంగత నటుడు నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరైంది. భర్త మరణాంతరం అలేఖ్య ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తరచూ ఎమోషనల్ పోస్ట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ అంతేకాదు వారి పెద్ద కూతురు నిష్క కూడా తండ్రిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంది. తండ్రితో ఉన్న జ్ఞాపకాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరో పోస్ట్ చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో పెద్ద కూతురు నిష్క గురించి ప్రస్తావించే ఆమె తాజాగా తనయుడు ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ఇందులో ఆమె కొడుకు తాన్యారామ్ తారకరత్న ఫొటో పట్టుకుని కనిపించాడు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ ఇక దీనికి అలేఖ్య ‘పెద్దయ్యాక నాన్నలా అవుతాను’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. తాన్యారామ్ తండ్రి ఫొటోను పట్టుకుని ఉన్న ఈ ఫొటో కన్నీళ్లు తెప్పిస్తుంది. అలా చూసి అందరి హృదయాలు బరువెక్కుతున్నాయి. అలా తారకరత్న కొడుకు కాగా తారకరత్నా, అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. పెద్దలను ఎదరించి వీరు ఒక్కటయ్యారు. అది నచ్చని నందమూరి కుటుంబం తారకరత్నా, అలేఖ్యలను దూరం పెట్టారు. అప్పటి నుంచి వేరుగా ఉంటున్న వీరి జీవితంలో తారకరత్న మృతి తీరని విషాదాన్ని నింపింది. -
కూతురితో ఆడుకున్న తారకరత్న.. ఇదే చివరి వీడియో!
నటుడు నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. భర్తే సర్వస్వం అనుకున్న అలేఖ్యా రెడ్డి, తండ్రే ప్రపంచం అనుకున్న నిష్కలను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. తారకరత్న మరణించి నెల రోజులు పూర్తి కావటంతో ఇటీవలే భర్త ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది అలేఖ్య. ఎన్నో కష్టనష్టాలను దాటుకుంటూ వారి ప్రయాణం కొనసాగిందని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత దగ్గరివాళ్లే దూరం పెట్టి నరకం చూపించారని, జీవితమంతా కష్టాలే అనుభవించామంటూ భావోద్వేగానికి లోనైంది. తాజాగా నిష్క.. తండ్రితో కలిసి ఆడుకున్న చివరి వీడియోను షేర్ చేసింది. హిందూపూర్‌కు వెళ్లడానికి ముందు కూతురితో కలిసి గేమ్ ఆడారు తారకరత్న. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు లవ్యూ తారక్ అన్నా అంటూ ఎమోషనలవుతున్నారు. కాగా జనవరి 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. View this post on Instagram A post shared by Nishka Nandamuri (@nishka_nandamuri) -
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి ఇప్పటికే పలుసార్లు భావోద్వేగానికి గురైంది. తారకరత్నను తలుచుకుని ఎమోషనలైంది. ఈ కష్టకాలంలో అన్నీ తానై ముందుండి నడిపించిన వ్యక్తి బాలయ్య. తాజాగా మరోసారి తారకరత్న కుటుంబం పట్ల గొప్ప మనసును చాటుకున్నారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలోని ఓ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టడమే కాకుండా.. పేదలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి స్పందించింది. ఈ మేరకు బాలకృష్ణ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలేఖ్యారెడ్డి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇంతన్నా నేనేమి చెప్పగలను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను. నేను ఏమి చెప్పినా మీరు ముందు తక్కువే అవుతుంది. మీరు బంగారు హృదయం ఉన్న వ్యక్తిల. మీరు నిజంగా ఆ పేరుకు అర్హులు. మీలా మరెవరూ చేయలేరు. మిమ్మల్ని ఓ తండ్రిగా, స్నేహితునిగానే చూశాం. ఇప్పుడు మీలో దేవుణ్ణి చూస్తున్నాం. మీ ప్రేమతో నాకు మాటలు రావడం లేదు. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన బాలకృష్ణ అభిమానులు దేవుడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే బాలకృష్ణ బాలయ్య చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే.. కష్టసుఖాల్లో కొండంత అండగా నిలబడిన అన్నీ తానై నడిపించారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యా రెడ్డి. ప్రస్తుతం బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలిపింది. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
తారకరత్న కోసం బాలయ్య కీలక నిర్ణయం.. అలా జరగకూడదంటూ!
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబాంతో పాటు అభిమానులకు తీరని లోటు. ఆ లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్య పడదు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఇప్పటికే పలుసార్లు భావోద్వేగానికి గురైంది. తారకరత్నను తలుచుకుని ఎమోషనలైంది. అందరికీ అందని లోకాలకు చేరిన తారకరత్న కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే తారకరత్న మరణించిన నెల రోజులు పూర్తి కావడంతో అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ బాలయ్య చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే.. కష్టసుఖాల్లో కొండంత అండగా నిలబడిన అన్నిీ తానై నడిపించారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యా రెడ్డి. ఆస్పత్రికి తారకరత్న పేరు ప్రస్తుతం బాలయ్య తీసుకున్న నిర్ణయం తారకరత్న అభిమానులకు గుర్తుండిపోయేలా ఉండనుంది. తారకరత్న మనమధ్య లేకపోయినా.. ఆయన పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా బాలయ్య నిర్ణయం తీసుకుని మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని బాలయ్య అన్నారు. (ఇది చదవండి: తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి) తన ప్రాణంగా భావించే తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయించారు. అంతేకాకుండా హిందూపురంలో బాలయ్య నిర్మించిన హాస్పిటల్ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టారు. వాటితో పాటు పేదప్రజల వైద్యం కోసం రూ.1.30 కోట్లు పెట్టి ఆపరేషన్ కోసం పరికరాలను ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి వచ్చే చిన్నపిల్లలకు ఉచితంగా భోజనం, మందులు కూడా మూడు నెలల పాటు అందించనున్నారు. తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయేలా బాలకృష్ణ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న మరణించి సుమారు నెల రోజులు కావొస్తుంది. ఇంకా ఆయన లేరన్న విషయాన్ని అభిమానులు, కుటుంసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న మరణంతో ఆయన బార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. తాజాగా బాలయ్య చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ''మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన. కష్టసుఖాల్లో మాకు రాయిలా కొండంత అండగా నిలబడిన వ్యక్తి. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు తండ్రిలా, నీ బెడ్ పక్కనే కూర్చొని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా,నువ్వు రియాక్ట్ అవుతామో అని, నిన్ను నవ్వించడం కోసం జోక్స్ వేస్తూ సరదాగా కనిపించి, ఎవరూ లేని సమయంలో నీకోసం కన్నీరు పెట్టుకున్నారు. చివరి క్షణం వరకు నీకోసం చాలా చేశారు. ఓబు(తారకరత్న ముద్దు పేరు)నువ్వు ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం'' అంటూ అలేఖ్యరెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో బాలయ్య ఉన్న ఫోటోకు తారకరత్నను యాడ్ చేసి ఎవరో ఆ పిక్‌ను అలేఖ్య రెడ్డికి పంపగా, ఇది ఎంతో బాగుందంటూ అలేఖ్య పేర్కొంది. కాగా బాలయ్యకు తారకరత్న అంటే ఎంతో ఇష్టం. గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకెళ్లిన దగ్గర్నుంచి అతని కట్టెకాలే వరకు ఆ కుటుంబానికి బాలయ్య పెద్దదిక్కులా నిలిచాడు. అంతేకాకుండా తారకతర్న-అలేఖ్యరెడ్డిల ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా బాలయ్య వాళ్లకు తోడులా ఉండి భరోసా ఇచ్చినట్లు తారకరత్న గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. తారకరత్న లేఖ
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అటు అభిమానులతో పాటు తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి విషాదంలో మునిగిపోయింది . పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత నిరాశకు లోనైంది. ఇటీవలే తారకరత్నతో చివరిసారిగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు అలేఖ్య రెడ్డి. అయితే గురువారం మార్చి 2, 2023న తారకరత్న పెద్దకర్మ హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరత్న రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. వాలైంటెన్స్ డే సందర్భంగా అలేఖ్యను తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు. నా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని లేఖలో పేర్కొన్నారు తారకరత్న. నా జీవితంలో నువ్వే నా ప్రపంచం బంగారు అని రాశారు. ఇవాళ తారకరత్న పెద్దకర్మ సందర్భంగా ఆ లేఖను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ లేఖ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఆ లేఖతో పాటు తారకరత్నకు ముద్దు పెడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఏది ఏమైనా భార్య, భర్తల మధ్య అనుబంధం ఎంత గొప్పదో ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో లేఖను షేర్ చేస్తూ ..'మన జీవితంలో అన్ని ఒడిదుడుకులు చూశాం. చాలా కష్టాలు పడ్డాం. జీవితంలో అత్యంత కష్టకాలం అనుభవించాం. మన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. మంచి రోజుల కోసం ఎదురు చూశాం. మనిద్దరం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నీ జీవితంలో పడిన కష్టాలు ఎవరికీ తెలియదు. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంతా నీలోనే దాచి.. మాకు అపారమైన ప్రేమను అందించావు. ప్రపంచం ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు మా చుట్టే ఉన్నావు. నేను మరింత ఎత్తుకు ఎదుగుతా నానా. ఈ రోజు నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాం నానా' అంటూ ఎమోషనల్ అయ్యారు అలేఖ్య రెడ్డి. ఏది ఏమైనా దేవుడు ఆ కుటుంబానికి మరింత ధైర్యం ప్రసాదించాలని తారకరత్న అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
తారకరత్న పెద్దకర్మ.. అలేఖ్యను పరామర్శించిన బాలకృష్ణ
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అటు ఫ్యాన్స్, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గురువారం మార్చి 2, 2023న తారకరత్న పెద్దకర్మ హైదరాబాద్ ఫిలింనగర్‌లోని కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. తారకరత్న చిత్రపటానికిి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయసాయి రెడ్డి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డితో బాలకృష్ణ మాట్లాడారు. అలేఖ్యను పరామర్శించిన బాలయ్య ధైర్యంగా ఉండాలని సూచించారు. #NandamuriBalaKrishna & #JrNTR paid tribute to #TarakaRatna at his Pedda Karma Event!!🙏#RIPTarakaRatna @tarak9999 #TeluguFilmNagar pic.twitter.com/QwRLfwTTBG — Telugu FilmNagar (@telugufilmnagar) March 2, 2023 -
ఇదే చివరిదంటే నమ్మలేకపోతున్నా.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇటీవలే తారకరత్న చిన్నకర్మ కూడా నిర్వహించారు కుటుంబసభ్యులు. తాజాగా అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో తారకరత్న, పిల్లలు ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇదే మా చివరి ఫోటో, చివరి ప్రయాణం అని నమ్మడం నా హృదయం పగిలినట్లు ఉంది. ఇదంతా ఒక కల అవ్వాలని కోరుకుంటున్నా. నన్ను "అమ్మా బంగారు" అని పిలిచే మీ స్వరం మరోసారి వినాలని ఉంది.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది చూసిన తారకరత్న అభిమానులు ఆమె మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఆయన మీ భౌతికంగా మీ వెంట లేకపోయినా.. ఎప్పటికీ మీతోనే ఉంటారని ధైర్యం చెబుతున్నారు. ఇప్పటి నుంచి మీరు చాలా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 22 తారకరత్న బర్త్‌డే సందర్భంగా కూడా అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన పెద్దకర్మను మార్చి 2న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
తారకరత్న పెద్దకర్మ తేదీ ప్రకటన.. ఎప్పుడంటే?
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి తీవ్రం విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత విషాదం నెలకొంది. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఇటీవలే తారకరత్న చిన్న కర్మ కూడా నిర్వహించారు. తారకరత్న మరణం తర్వాత నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని వెల్లడించారు. తాజాగా తారకరత్న పెద్ద కర్మ తేదీని కూడా ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులు. ఎంపీ విజయసాయి రెడ్డి, బాలకృష్ణ అంత్యక్రియలు ముగిసేంత వరకూ దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న భార్య విజయ సాయిరెడ్డికి బంధువు కావడంతో దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. అలాగే బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పెద్ద కర్మను దగ్గరుండి పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన కార్డును సోషల్ మీడియాలో షేర్ చేశారు. తారకరత్న కుటుంబ సభ్యులు కార్డుని ప్రింట్ చేయించారు. మార్చి 2న తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్డుపై నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లను ప్రచురించారు. #SHRADHANJALI Sri. NANDAMURI TARAKA RATNA ( ceremony ) Pedda Karma will takeplace on Thursday, 2nd March 2023, 12 : 00pm Onwards at Film Nagar Culural Centre, Hyderabad.#NandamuriMohankrishna #NandamuriBalakrishna #VenumbakaVijayaSaiReddy #NandamuriFamily. pic.twitter.com/jfNa2HrpwE — Telugu Film Producers Council (@tfpcin) February 25, 2023 -
ఎన్నో పోరాటాలు, మన లైఫ్ అంత సాఫీగా ఏం సాగలేదు: అలేఖ్య
జీవితాంతం తోడుండాల్సిన భర్త అర్ధాంతరంగా తనువు చాలిస్తే ఏ భార్య తట్టుకుంటుంది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ మహిళ మనసు ఎంత తల్లడిల్లుతుంది? భర్తే సర్వస్వమనుకున్న అలేఖ్యా రెడ్డిని నందమూరి తారకరత్న అకాల మరణం అశనిపాతంలా తాకింది. తను లేని జీవితాన్ని ఊహించుకోలేక కుమిలికుమిలి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. తాజాగా భర్తపై ఉన్న ప్రేమను బయటపెడుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య. 'జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేశాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వు ఒక వారియర్ నాన్నా.. నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవ్వరూ చూపించలేరు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్న చేయి పట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది. దీనిపై అలేఖ్య స్నేహితురాలు స్పందిస్తూ.. 'మీరెన్ని కష్టాలు పడ్డారో అతి కొద్దిమందికే తెలుసు. ఎంత పోరాడాలో అంతవరకు పోరాడారు. కానీ ఆ దేవుడు కొన్నిసార్లు దయ లేనివాడిగా వ్యవహరిస్తాడు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. ఎల్లప్పుడూ నీవెంటే ఉంటాను అల్లూ' అని రాసుకొచ్చింది. మిగతా నెటిజన్లు సైతం 'మేమంతా మీకున్నాం అక్కా, ధైర్యంగా ఉండండి' అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) చదవండి: శ్రీదేవి లవ్ స్టోరీ తెలుసా? -
తారకరత్న బర్త్ డే.. అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి తీవ్రం విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత కృంగిపోయింది. ఫిబ్రవరి 22 తారకరత్న బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 22 తారకరత్న 40వ పుట్టినరోజు. ఆయన బర్త్ డే సందర్భంగా.. తారకరత్న తన కూతురు నిష్కతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆయన భార్య అలేఖ్యా రెడ్డి. నా జీవితంలో ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే.. నిన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అలేఖ్యా రెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు మిస్ యూ తారకరత్న అన్న పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
తారకరత్న చిన్నకర్మ.. వెక్కివెక్కి ఏడ్చిన అలేఖ్యా రెడ్డి
నటుడు నందమూరి తారకరత్న చిన్నకర్మను బుధవారం ఆయన కుటుంబసభ్యులు నిర్వహించారు. ఫిబ్రవరి 18వ తేదీన తారకరత్న శివైక్యం చెందగా 20న అంత్యక్రియలు జరిపారు. ఆయన భౌతిక కాయాన్ని దహనం చేసిన రెండు రోజులకు చిన్న కర్మ చేశారు. ఈ కార్యక్రమంలో తారకరత్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్ సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీప్రముఖులు పాల్గొని తారకరత్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వెక్కివెక్కి ఏడ్చిన అలేఖ్యా రెడ్డి తారకరత్న ఇక లేరనే విషయాన్ని ఆయన భార్య అలేఖ్యా రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త చిత్రపటాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. తల్లిని ఓదార్చేందుకు నిషిక ప్రయత్నించినప్పటికీ ఆమె కన్నీళ్లు ఆగలేదు. భర్త లేకుండానే భవిష్యత్తు కొనసాగించాలన్న బాధ ఆమెను నిలువెల్లా దహిస్తుండటంతో కన్నీటిపర్యంతమయ్యారు. బరువెక్కిన గుండెతో, కన్నీళ్లతో చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు అలేఖ్య. -
తారకరత్నకు కన్నీటి వీడ్కోలు
రాయదుర్గం, బంజారాహిల్స్: సినీనటుడు నందమూరి తారకరత్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో అంత్యక్రియలను సోమవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. అంతకుముందు ఫిలించాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు ప్రత్యేక వాహనంలో తారకరత్న భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. పెద్ద సంఖ్యలో కుటుంబసభ్యులు, సినీప్రముఖులు, రాజకీయ నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మహాప్రస్థానానికి చేరుకున్న తర్వాత పాడెపైకి తారకరత్న పార్ధివదేహాన్ని చేర్చగానే సినీ హీరో బాలకృష్ణ ఆయన సోదరుడు రామకృష్ణతోపాటు బంధువులు, సన్నిహితులు పాడెమోస్తూ చితి వద్దకు తీసుకొచ్చారు. చితికి తండ్రి మోహనకృష్ణ నిప్పు అంటించారు. ఈ సమయంలో తారకరత్న అమర్‌రహే నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నారాలోకేశ్, మాగంటిబాబు, జవహర్, నారాయణ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితోపాటు నందమూరి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు పాల్గొన్నారు. ఫిలిం చాంబర్లో నివాళులు తొలుత అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉదయం 9 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌కు తీసుకొచ్చి సాయంత్రం 3 గంటల వరకు ఇక్కడే ఉంచారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, తరుణ్, అశోక్ కుమార్, శివాజీ, కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి, కేఏ పాల్ తదితరులు తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
ఫిలిం ఛాంబర్లోకి మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు వేలెత్తి చూపుతూ
నటుడు నందమూరి తారకరత్న ఇక లేరన్న వార్తను కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మనసున్న మారాజు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలువురు సినీప్రముఖులు, అభిమానులు ఫిలిం చాంబర్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అక్కడకు వచ్చి తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించాడు. ఆ తర్వాత బాలకృష్ణ దగ్గరకు వెళ్లి వేలెత్తి చూపుతూ గట్టిగా ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. బాలయ్య కూడా అతడు చెప్పింది శ్రద్ధగా వింటున్నట్లు తలూపాడు. వెంటనే పోలీసులు అతడిని బయటకు తీసుకెళ్లారు. కాగా కాసేపటిక్రితమే తారకరత్న అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. చదవండి: బాలయ్య పెట్టిన ముహూర్తానికే తారకరత్న అంత్యక్రియలు -
నందమూరి తారకరత్నకు కలిసిరాని 9వ సంఖ్య.. అదే శాపంగా మారిందా?
నందమూరి తారకరత్న మృతి ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తుంది. తీవ్ర గుండెపోటుతో గత 27న బెంగళూరులోని నారాయణ హృదయాలలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్నను బతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తారకరత్నకు 9 సంఖ్య కలిసిరాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీలో చాలామంది న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారు. ఇక ఎక్కువగా తొమ్మిది అంకెను లక్కీ నెంబర్ అని భావిస్తారు. కానీ తారకరత్నకు మాత్రం 9కలిసి రాలేదని చెప్పాలి.తారకరత్న ముందుగా ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో 2002లో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అదే ఏడాది వరుసగా 9సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇందులో కేవలం మూడు సినిమాలు మాత్రమే సెట్స్ మీదకి వెళ్లాయి. ఇక గత నెల 27న ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ రెండు అంకెలను కలిపితే వచ్చేది 9 (2+7=9). ఇక ఆయన మరణించిన తేదీ ఫిబ్రవరి 18,(1+8=9) ఈ రెండు అంకెలను కలిపినా తొమ్మిదే వస్తుంది. ఇలా జరిగిన పరిణామాలన్నీ చూస్తే తారకరత్నకు తొమ్మిదవ నెంబర్ కలిసి రాలేదనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. -
బాలయ్య పెట్టిన ముహూర్తానికే తారకరత్న అంత్యక్రియలు
►జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ► మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ► తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు ► ఫిల్మ్ చాంబర్ నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర ► తండ్రి మోహన కృష్ణ చేతుల మీదుగా తారకరత్న అంతిమ సంస్కారాలు ► పాడె మోసిన బాలకృష్ణ, మిగతా కుటుంబసభ్యులు ► కన్నీరుమున్నీరవుతున్న నందమూరి కుటుంబసభ్యులు తారకరత్న మృతితో నందమూరి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే తారకరత్న అకాల మరణం చెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అజాత శత్రువుగా, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం మేరకు మధ్యాహ్నం 3.30గంటల తర్వాత తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్నకు ఆయన తండ్రి మోహన్ కృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తారకరత్న భౌతికకాయం వద్ద విషణ్ణ వదనాలతో కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం
-
కొడుకును అలా చూసి అల్లాడిపోయిన తారకరత్న తల్లిదండ్రులు
తారకరత్న మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న దూరం కావడం కుటుంబంతో పాటు నందమూరి అభిమానుల్ని కలిచివేస్తోంది. 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కాగా అజాత శత్రువుగా, ఎంతో మంచి మనస్తత్వం గల వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న భౌతికకాయన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆయన్ను అలా చలనం లేకుండా చూసి తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎదిగిన కొడుకు ఇలా తమ కళ్ల ముందే అచేతనంగా ఉండటం చూసి అల్లాడిపోయారు. వాళ్లను సముదాయించడం అక్కడున్న వారి తరం కాలేదు. తారకరత్న తల్లిదండ్రుల మనోవేదన చూసి అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. -
నేడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు
-
ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం
నందమూరి తారకరత్న పార్థివదేహన్ని ఆయన నివాసం నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లోనే ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం మహాప్రస్థానంలో నేడు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఫిలిం చాంబర్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం గత నెల 27న నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం(ఫిబ్రవరి 18న) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతిని టాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు ఇటూ నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు చాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తారకరత్న మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. -
తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను కుటుంసభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తుంది. గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న 23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చదవండి: తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం అయితే తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఇద్దరు కూమార్తెలు, ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తండ్రి పార్థివ దేహం వద్ద ఆయన పెద్ద కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో అందరిని కలిచి వేసింది. ఆయన మరణంతో భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో తారకరత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత.. ఆయన ముగ్గురు పిల్లల బాగోగులు, చదువులు తానే చూసుకుంటానని, బాబాయ్‌గా తారక్ కుటుంబానికి నిత్యం అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట. ఇక తారకరత్న, బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తారకరత్న కోలుకొని తిరిగిరావాలని బాలయ్య ప్రత్యేక పూజలు కూడా చేశారు. తారకరత్న హాస్పిటల్లో చేరినప్పటి నుంచి బాలయ్య అక్కడే ఉండి ఆరోగ్య విషయాలను పర్యవేక్షించారు. బాబాయ్‌గా ఎప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణాంతరం కూడా తన కుటుంబానికి అండగా నిలబడ్డారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం
తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను అటు కుటుంసభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడం కలచివేస్తుంది. గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న 23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అజాత శత్రువుగా, ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న తారకరత్న మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా తారకరత్నది ప్రేమ వివాహం.ఆయన నటించిన నందీశ్వరుడికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన అలేఖ్యతో ఆయన ప్రేమలో పడ్డారు.అయితే అలేఖ్యకు ఇదివరకే పెళ్లై విడాకులు తీసుకోవడంతో వీరి పెళ్లికి కుటుంసభ్యులు ఒప్పుకోలేదు. అయినా వెనక్కు తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో తనను పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటగా కుమార్తె పుట్టగా నిషిక అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి. మరొకరు అమ్మాయి. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. వీరి పేర్లలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలు NTR (Nishka, Tanayram, Reya)ఎన్టీఆర్ అని వచ్చే విధంగా పిల్లలకు పేర్లు పెట్టారు. -
తారకరత్నకు సాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్..!
నటుడు తారకరత్న మరణాన్ని కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారక్‌ను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. శంకర్‌పల్లిలోని తారకరత్న నివాసానికి చేరుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆ పార్థివ దేహానికి నివాళులర్పించారు. నందమూరి తారకరత్న 20 ఏళ్ల వయసులోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఒకే రోజు 9 సినిమాలను ప్రకటించి రికార్డు సృష్టించారు. 2002లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో సూపర్ హిట్ సాధించారాయన. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్‌గా మెప్పించారు. ఈ సినిమాలో ఈయన నటనకు నంది అవార్డు కూడా లభించింది. అయితే ఆ తర్వాత తారకరత్నకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని తన కుటుంబానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆ సమయంలోనే చాలా ఇబ్బందులు పడ్డారట తారకరత్న. కనీసం పిల్లల అవసరాలు కూడా తీర్చలేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు నెలకు నాలుగు లక్షల రూపాయలు పంపించారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో తారకరత్న మాట్లాడుతూ.. 'ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఉండడానికి కారణం ఎన్టీఆర్. నా తమ్ముడు లేకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తమ్ముడు అండగా నిలిచాడు.' అని అన్నారు. -
తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత..
నందమూరి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి అస్వస్థత్రకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య నీరసంగా ఉందని తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చిన్న వయసులోనే ఇలా దూరం కావడం అలేఖ్య జీర్ణించుకోలేకపోతుందని కుటుంస సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అలేఖ్యా రెడ్డి తీవ్ర మానసికి ఒత్తిడికి గురవుతుందని, తిరిగి మామూలు మనిషి కావడానికి సమయం పడుతుందని తెలిపారు. కాగా గత 27న తీవ్ర గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరిన తారకరత్న గతరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన్ను బతికించేందుకు విదేశీ వైద్యులను సైతం రప్పించి చికిత్స అందించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలేవీ ఫలించలేదు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అయితే తారకరత్నను ఆసుపత్రిలో చేర్పించిన మొదటి రోజు నుంచే భార్య అలేఖ్యా రెడ్డి అతనితోనే ఉన్నారు. భర్త ఆరోగ్యం కోసం ఆమె నిత్యం పూజలు చేసేవారట. ఈ క్రమంలో తారకరత్న మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. -
నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్న వరుస విషాదాలు
నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నుంచి ఇప్పుడు తారకరత్న వరకు వరుస విషాదాలు నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. వారికి తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే మరికొందరు ఆసక్మికంగా మరణించడం నందమూరి కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చుతోంది. మొదటగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినీ నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 1996లో 'మామ కోడళ్ల సవాల్' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన హరిన్ చక్రవర్తి ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోసించారు. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఆయన్ను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. హరిన చక్రవర్తి సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వీ సైతం రోడ్ యాక్సిడెంట్లోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ 1962లో అరుదైన వ్యాధితో చనిపోయారు. ఆ సమయంలో ఇరుగు పొరుగు షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాకే ఇంటికి వెళ్లారట. కొడుకు మరణవార్తతో తీవ్రంగా కుంగిపోయిన ఆయన ఆ విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయమే పట్టిందట. 1996లో సీనియర్ ఎన్టీఆర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు సాయికృష్ణ 2004లో ఆకస్మికంగా మృతి చెందారు. 2014 లో ఎన్టీఆర్ మరో కుమారుడైన హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిర్మాతగా కొనసాగిన ఆయన నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక పెద్ద కుమారుడు జానకీరామ్ మరణించిన నాలుగేళ్లకు నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. ఓ అభిమాని వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతుండగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే కన్నుమూశారు.ఇక గతేడాది ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడడం ఎన్టీఆర్ కుటుంబాన్ని కలచివేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు తాజాగా తారకరత్న మరణం మరోసారి నందమూరి కుటుంబాన్ని కుదిపేసింది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న ఆయన గతరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇలా కొన్నాళ్లుగా వరుస విషాదాలతో నందమూరి కుటుంబానికి శాపంగా మారింది. -
తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించిన చిరంజీవి, బాలకృష్ణ
నందమూరి తారకరత్న భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఆయన నివాసానికి చేరుకుని తారకరత్న కుటుంబాన్ని పరామర్శించారు. తారకరత్న భార్యను ఓదార్చిన మెగాస్టార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు నందమూరి బాలకృష్ణ సైతం తారకరత్న నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. గుండెపోటుకు గురైన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. త 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను కుప్పంలోకి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అదేరోజు అర్థరాత్రి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అప్పట్నుంచి నిపుణలైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. గత వారం రోజులుగా నిపుణులైన విదేశీ వైద్యులను సైతం రప్పించి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
తారకరత్న నాకు చాలా ఆత్మీయుడు: మంచు మోహన్ బాబు
నందమూరి తారకరత్న మరణం పట్ల మంచు మోహన్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. నందమూరి తారకరత్న మరణ వార్త విని నిజంగా షాక్ అయ్యాను. మనసంతా కలచివేసినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను లండన్ లో, విష్ణు సింగపూర్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా రాలేకపోతున్నాం. నా అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు అయిన తారకరత్న నాకూ, నా కుటుంబానికి చాలా ఆత్మీయుడు. తారకరత్న ఎంత మంచివాడో, ఎంత సౌమ్యుడో, స్నేహశీలో చెప్పటానికి నాకు మాటలు రావడం లేదు. టీవీల్లో అతని మరణ వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే బాధతో గుండె తరుక్కుపోతుంది. తారకరత్న మరణం ఒక్క నందమూరి కుటుంబానికే కాదు ....యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని మంచు మోహన్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. మంచు విష్ణు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించాడు. #TarakaRatna 💔. I hate this. I am not able to believe this. Numb. 💔 — Vishnu Manchu (@iVishnuManchu) February 18, 2023 -
తారకరత్న తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి తారకరత్న ఇకలేరన్న విషయాన్ని యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల వయసులోనే ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్నం తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన తన చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. మోహన కృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా కూడా పనిచేశారు. అంతే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒకవైపు చదువుకుంటూనే కెమెరామెన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఆయన పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారాయన. -
తారకరత్నను వెంటాడిన దురదృష్టం.. మరో మూడు రోజుల్లో..!
నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. నందమూరి అభిమానులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే నందమూరి తారకరత్న జీవితంపై అభిమానుల్లో ఆరా తీస్తున్నారు. ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ఈ సమయంలో ఇలా జరగడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా.. నందమూరి తారకరత్న ఫిబ్రవరి 22న 1983లో జన్మించారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు నందమూరి తారకరత్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాకి వచ్చిన సక్సెస్‌తో ఆయన ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రకటించి వరల్డ్ రికార్డ్ సాధించారు. అయితే వాటిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత తారకరత్న అమరావతి అనే సినిమాలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు సైతం అందుకున్నాడు. రవిబాబు దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. -
మరో 5 రోజుల్లో తారక రత్న కొత్త సినిమా రిలీజ్.. అంతలోనే ఇలా..
నందమూరి తారకరత్న(40) అకాల మరణం టాలీవుడ్లో విషాదం నింపింది. చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తారకరత్న అకాల మరణం కారణంగా ఆయన నటించిన చివరి చిత్రం ‘మిస్టర్ తారక్’ విడుదలను వాయిదా వేశారు. తారక రత్న హీరోగా శంకర్ డోరా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను విడుదల చేయడం సరి కాదని వాయిదా వేసినట్లు చిత్ర దర్శక, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పేర్కొన్నారు. మిస్టరీ, థ్రిల్లర్ సినిమాగా ‘మిస్టర్ తారక్’ తెరకెక్కింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య, ప్రాణ స్నేహితుడు ఒక్కటై మోసం చేస్తే.. హీరో ఏం చేశాడు? అనేది చిత్ర కథగా తెలుస్తోంది. ఇందులో సారా హీరోయిన్ నటించింది. ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ పతాకంపై మధు పూసల నిర్మించారు. -
నందమూరి తారకరత్న మరణానికి కారణాలు ఇవేనా?
నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న ఇకలేరన్న విషయాన్ని నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆశగా చూసిన ఎదురుచూపులు అడియాసలు అయ్యాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 40ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను కుప్పంలోకి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అదేరోజు అర్థరాత్రి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అప్పట్నుంచి నిపుణలైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. గత వారం రోజులుగా నిపుణులైన విదేశీ వైద్యులను సైతం రప్పించి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో తారకరత్న మరణానికి దారితీసిన కారణాలను ఓసారి విశ్లేషిస్తే.. తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో సుమారు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయింది. ఆ సమయంలో రక్తం గడ్డకట్టడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చినట్టు తెలిసింది.గుండె, కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ మెదడు దెబ్బతినడంతో కోలుకోలేకపోయారు. దీనికి తోడు ఆయనకు మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు గుర్తించారు. బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయానికే ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. గుండెలో 90% బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించారు. చిన్న వయసే కావడంతో పరిస్థితి మెరుగు అవుతుందని భావించారు. మధ్యలో పరిస్థితి కొంచెం మెరుగైందని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా, రెండు రోజులుగా పరిస్థితి మరీ క్షీణించడంతో విషమంగా మారింది. ఈ నేపథ్యంలో గతరాత్రి శివరాత్రి పర్వదినాన తారకరత్న శివైక్యం చెందినట్లు ప్రకటించారు. -
తారకరత్న ముద్దు పేరు తెలుసా?
కొన్నాళ్లుగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న మృత్యుంజయుడిగా వస్తారనుకున్నారంతా.. కానీ ఆ పోరాటంలో ఓడిపోయి అసువులు బాశారు. తన కుటుంబాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా అందరికీ తారకరత్నగా పరిచయమైన ఆయనకు ఓ ముద్దుపేరు ఉంది. ఆయన అసలు పేరు ఓబులేసు. ఇంట్లోవాళ్లు ముద్దుగా ఓబు అని పిలుస్తారట. కాగా గత నెల 27న లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆ సమయంలో మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడుకు ఒకవైపు వాపు వచ్చింది. వెంటనే ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించి మెరుగైన వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రెండు రోజులుగా పరిస్థితి విషమించగా మహాశివరాత్రి నాడు శివైక్యమయ్యారు. చదవండి: అప్పటిదాకా ఉత్సాహంగా.. ఉన్నట్టుండి కుప్పకూలిన తారకరత్న -
తారకరత్న భౌతికకాయం చూసి జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం
నటుడు తారకరత్న మృతిని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిలలో తన నివాసానికి తరలించగా పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా తారకరత్న నివాసానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నటుడి పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. -
తారకరత్న భౌతికకాయం చూసి వెక్కివెక్కి ఏడ్చిన కూతురు
నటుడు తారకరత్న మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బెంగళూరు నుంచి నిన్న(శనివారం)రాత్రే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అయితే తన తండ్రిని అలా చలనం లేకుండా ఉండడాన్ని చూసి తారకరత్న కూతురు నిషిక వెక్కివెక్కి ఏడ్చింది. తన తండ్రి ఇక రాడని తెలిసి గుండెలు పగిలేలా రోదించింది. ఈ క్రమంలో కూతుర్ని ఓదార్చుతూ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సైతం కన్నీటి పర్యంతం అవడాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ కుటుంబానికి దేవుడు తీరని లోటు మిగిల్చాడని, ఈ బాధను తట్టుకునే శక్తిని వారికి ఆ భగవంతుడు కల్పించాలని ప్రార్థిస్తున్నారు. -
చాలా త్వరగా వెళ్లిపోయావు సోదరా.. మహేశ్ ఎమోషనల్ ట్వీట్
నందమూరి హీరో తారకరత్న మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రటిస్తున్నారు. తారకరత్న మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. ‘చాలా త్వరగా వెళ్లిపోయాను సోదరా... ఈ దుఃఖ సమయంలో మీ కుటుంబానికి మనోధైర్యం కలిగించాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని మహేశ్ రాసుకొచ్చాడు. Shocked and deeply saddened by the untimely demise of #TarakaRatna. Gone way too soon brother... My thoughts and prayers are with the family and loved ones during this time of grief. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) February 18, 2023 తారకరత్న గారి మరణ వార్త విని చాలా బాధ పడ్డాను. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. Heartbroken to learn of the passing away of #TarakaRatna garu. Gone to soon 💔. My deepest condolences to his family, friends & fans. May he rest in peace. — Allu Arjun (@alluarjun) February 18, 2023 నందమూరి తారకరత్న మరణవార్త విని చాలా బాధ పడ్డాను. ఓ డైనమిక్ వ్యక్తి చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని వెంకటేశ్ ట్వీట్ చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ పాటు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. Extremely sad to hear about the passing of #NandamuriTarakaratna. Such a dynamic person, gone too soon. My heartfelt condolences to his family and friends. May his soul rest in peace🙏🏼 pic.twitter.com/Ntq2sq01SY — Venkatesh Daggubati (@VenkyMama) February 19, 2023 My deepest sympathies for Untimely demise of Dear friend Taraka Ratna 💐 we used to play snooker before Covid -19 ,such a humble & friendly person we lost .. Gone too soon #RIPTarakaRathna pic.twitter.com/m1BBTPOqRT — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) February 19, 2023 Deeply saddened by the passing away of #NandamuriTarakaratna garu. Gone too soon! Our heartfelt condolences to his family, friends and fans. May his soul rest in peace.#RIPTarakaratna #Tarakaratna pic.twitter.com/Z2fXWt2alw — Suresh Productions (@SureshProdns) February 19, 2023 Extremely shocking to learn about the demise of Versatile actor #NandamuriTarakaRatna Garu. May his Soul Rest in Peace & Strength to his family and friends. 🙏#RipNandamuriTarakaratna pic.twitter.com/1qqcOI68TT — UV Creations (@UV_Creations) February 19, 2023 -
తారకరత్న లవ్‌స్టోరీ.. గుడిలో పెళ్లి చేసుకున్న నటుడు
గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన నటుడు నందమూరి తారకరత్న(39) శనివారం తుదిశ్వాస విడిచారు. మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు(ఫిబ్రవరి 22) ఉండగా ఇంతలోనే మరణించడంతో అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహనకృష్ణ తనయుడిగా తారకరత్న 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తారకరత్నకు తెలిసిన స్నేహితుల ద్వారా అలేఖ్యరెడ్డి పరిచయమైంది. ఆమె పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తారక్ సినిమా నందీశ్వరుడికి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. కానీ వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. కారణం అలేఖ్యకు ఇదివరకే పెళ్లై విడాకులు కావడమే! అయినా వెనక్కు తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో తనను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇరు కుటుంబాలు ఈ జంటను చేరదీశాయి. 2013లో వీరి ప్రేమకు గుర్తుగా నిషిక అనే పాప జన్మించింది. పాపు పుట్టాక తన ఆలనా పాలనా చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంది అలేఖ్య. కానీ ఇలా తారకరత్న అర్ధాంతరంగా తనువు చాలించడంతో అలేఖ్య, ఆమె కూతురు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. చదవండి: తారకరత్న చివరి కోరిక ఏంటో తెలుసా? -
Taraka Ratna Death: తారకరత్న భౌతికకాయాన్ని చూసి తల్లడిల్లుతున్న కుటుంబసభ్యులు (ఫొటోలు)
-
సోమవారం తారకరత్న అంత్యక్రియలు
'ఒకటో నెంబర్ కుర్రాడు'తో వెండితెరపై అడుగుపెట్టి పలు సినిమాలు చేసిన టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో తన నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానులు, ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. కాగా గత నెల 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. అక్కడ 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు తుదిశ్వాస విడిచారు. చదవండి: వైరల్‌గా మారిన తారకరత్న చివరి వీడియో -
తారకరత్న నాకు ఎంతో సన్నిహితుడు: అలీ
నందమూరి తారకరత్న మృతిపట్ల ప్రముఖ నటుడు అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఎంతో సన్నిహితుడైన తారకరత్న ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలచవేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలీ తమ్ముడు ఖయ్యూం కూడా తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు. ‘తారకరత్న నేను బావా బావా అని పిలుచుకునే వాళ్ళం. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం దారుణం’ అని ఖయ్యూం అన్నారు. తారకరత్న సినీ కెరీర్ ప్రారంభం నుంచి అలీ గారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తారకరత్నతో అలీ నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. తారకరత్న చివరి పెద్ద సినిమా ఎస్ 5 చిత్రంలో కూడా అలీ నటించారు. -
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తనను బాధించిందని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న సినీ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఇలాంటి బాధాకర సమయంలో తారకరత్న కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం పీఎంఓ ట్వీట్ చేసింది. Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi — PMO India (@PMOIndia) February 19, 2023 రేవంత్ రెడ్డి సంతాపం.. తారకరత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను బాధించిందన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. Deeply saddened by the untimely demise of shri #Tarakaratna garu… My deepest condolences to the friends and family.I pray God to give them strength in this hour of grief. pic.twitter.com/SmPINq1PZb — Revanth Reddy (@revanth_anumula) February 19, 2023 గుండెపోటుతో 23 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన తారకరత్న శనివారం బెంగళూరులోని హృదయాలయలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. బండి సంజయ్ ట్వీట్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తారకరత్న మృతికి సంతాపం తెలిపారు. తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న గారి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏 pic.twitter.com/BXEIVTXwIM — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2023 హరీశ్‌రావు.. తారకరత్న మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆయన కుటుంసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna. Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace. Om Shanti🙏🏾 pic.twitter.com/XRn28J6afq — Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023 డీకే అరుణ బీజేపీ నేత డీకే అరుణ కూడా తారకరత్న మృతికి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. Extremely saddened to learn about the passing of #Telugu actor Shri Nandamuri #TarakaRatna Ji. His sudden demise has left the entire Telugu film industry in a state of shock and mourning. My deepest condolences to his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/6q9bD2ZelS — D K Aruna (@aruna_dk) February 19, 2023 చంద్రబాబు సంతాపం.. తారకరత్న తమ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చి వెళ్లిపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2) — N Chandrababu Naidu (@ncbn) February 18, 2023 నారా లోకేష్.. తారకరత్న మృతి తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G — Lokesh Nara (@naralokesh) February 18, 2023 -
తారకరత్న చేతిపై పచ్చబొట్టు.. ఆ ఆటోగ్రాఫ్ ఎవరిదంటే?
నటుడు నందమూరి తారకరత్న మరణంతో అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తారకరత్న సినిమాల గురించి, ఆయన మంచితనం గురించి అభిమానులు చర్చించుకుంటుండగా ఆయన చేతిపై ఉన్న టాటూ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ టాటూ ఏంటో తెలుసా? అది సింహం బొమ్మ. ఆ బొమ్మ కింద బాలకృష్ణ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. బాలయ్యపై ఉన్న అభిమానంతోనే తారకరత్న ఈ పచ్చబొట్టు వేయించుకున్నారు. తారకరత్న, బాలకృష్ణలకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ అలాంటిది. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయినప్పుడు అంతా తానై చూసుకున్నారు బాలయ్య. తను కోలుకునేందుకు ఆయన చెవిలో మృత్యుంజయ మంత్రం జపించారు. అలాగే బెంగళూరు నారాయణ హృదయాల డాక్టర్స్‌తో మాట్లాడి తనను అక్కడకు షిఫ్ట్ చేయించారు. ప్రత్యేక వైద్యులను పిలిచి మరీ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆస్పత్రి బిల్లులు చెల్లిస్తూ కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తూ ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి తర్వాత తండ్రిగా తారకరత్న బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. చదవండి: ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన తారకరత్న -
తారకరత్న చివరి కోరిక ఇదే.. అది నెరవేరకుండానే!
నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్న ఆయన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. తారకరత్న రాజకీయాల్లోకి రావడమే కాకుండా ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. అటు నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే లోకేశ్‌తో ఆ మధ్య భేటీ కూడా అయ్యారు. మర్యాదపూర్వక భేటీగా బయటకు చెబుతున్నప్పటికీ రాజకీయ పరిణామాలతో పాటు పోటీ చేసే స్థానంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి తోడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి సిద్ధమయ్యాను, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని ఆయన ఓ సందర్భంలో చెప్పడంతో ఆ రూమర్స్ నిజమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే జోరుగా పర్యటనలు చేశారు. కానీ ఇంతలోనే చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఇంత చిన్నవయసులోనే తారకరత్నను తీసుకెళ్లి దేవుడు ఇంత అన్యాయం చేశాడేంటి? అని అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చదవండి: ఇంత చిన్నవయసులోనే వెళ్లిపోయావా?: తారకరత్న మృతిపై సంతాపం -
వైరల్‌గా మారిన తారకరత్న చివరి వీడియో
నటుడు నందమూరి తారకరత్న మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత నెల 27న లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన రోజు తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చింది. బెంగళూరులో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. మధ్య మధ్యలో ఆయన కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా రెండు రోజులుగా పరిస్థితి మరింత క్షీణించింది. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన అన్నిరకాల ప్రయత్నాలు విఫలమవడంతో శనివారం నటుడు కన్నుమూశారు. ఈ క్రమంలో తారకరత్న చివరి క్షణాలు ఇవేనంటూ ఆయన కుప్పకూలిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తారకత్న తెల్లటి షర్ట్‌లో నుదుటన బొట్టుతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట బాలయ్య కూడా ఉన్నారు. నవ్వుతూ, సరదాగా మాట్లాడుతూనే పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. చదవండి: నందమూరి తారకరత్న ఇక లేరు -
Taraka Ratna Unseen Photos: నందమూరి తారకరత్న అస్తమయం.. అరుదైన ఫొటోలు
-
తారకరత్న మృతి పట్ల చిరంజీవి, రవితేజ సంతాపం..
హైదరాబాద్: ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూసిన నందమూరి తారకరత్న(39) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను కలచివేసిందన్నారు. ప్రకాశవంతమైన, ప్రతిభావంతుడైన, ఆప్యాయత గల యువకుడు చిన్నవయసులోనే మరణించాడని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. Deeply saddened to learn of the tragic premature demise of #NandamuriTarakaRatna Such bright, talented, affectionate young man .. gone too soon! 💔 💔 Heartfelt condolences to all the family members and fans! May his Soul Rest in Peace! శివైక్యం 🙏🙏 pic.twitter.com/noNbOLKzfX — Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2023 రవితేజ సంతాపం.. మృత్యువుతో పోరాడి తారకరత్న మరణించారనే విషాద వార్త తెలిసి చాలా బాధపడ్డానని రవితేజ ట్వీట్ చేశారు. ఇతరులపట్ల దయగల స్వభావం కలగిన ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈమేరకు రవితేజ ట్వీట్ చేశారు. Profoundly saddened to learn about the tragic demise of dear Taraka Ratna after battling hard! He will always be fondly remembered for his kind-hearted nature towards everyone! My sincere condolences to his dear ones. Om Shanti 🙏 — Ravi Teja (@RaviTeja_offl) February 18, 2023 -
నందమూరి తారకరత్న మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం కన్నుమూశారు. తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
నందమూరి తారకరత్న గురించి ఈ విషయాలు తెలుసా?
సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి తారకరత్న ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో చిత్రసీమలోకి అడుగు పెట్టారు. ఈ చిత్రం 2002లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సక్సెస్ఫుల్ ఆడియో ఆల్బమ్స్‌తో యువతకు చేరువైంది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేస్తున్న సమయంలోనే ఏకంగా 9 సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు నందమూరి తారకరత్న. కానీ అతనికి అదృష్టం కలిసి రాలేదు. పదిహేనుకు పైగా చిత్రాలు చేసినప్పటికీ తారకరత్నకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ కుమారుడైన నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషించారు. కుటుంబం విషయానికి వస్తే 2012లో నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. తారకరత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య క్యాస్టూమ్ డిజైనర్‌గా కూడా పని చేశారు. నందమూరి తారకరత్న చేసింది కొద్ది సినిమాలే అయినా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. హఠాత్తుగా గుండెపోటుతో ఆయన మరణించడంతో యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఈ విషాద సమయంలో ఆయన నటించిన సినిమాలను ఓసారి గుర్తు చేసుకుందాం. ఒకటో నంబర్ కుర్రాడు(2002) యువ రత్న(2002) తారక్(2003) నో(2004) భద్రాద్రి రాముడు(2004) పకడై(2006) అమరావతి(2009) వెంకటాద్రి(2009) ముక్కంటి(2010) నందీశ్వరుడు(2011) విజేత(2012) ఎదురులేని అలెగ్జాండర్(2012) చూడాలని.. చెప్పాలని(2012) మహా భక్త సిరియాలా(2014) కాకతీయుడు(2015) ఎవరు(2016) మనమంతా(2016) రాజా చేయి వేస్తే(2016) కయ్యూం భాయి(2017) దేవినేని(2021) సారథి(2022) 2022లో 9 అవర్స్ సిరీస్‌లోనూ నటించారు. అమరావతి సినిమాలో నటనకు బెస్ట్ విలన్‌గా నంది అవార్డ్ అందుకున్నారు తారకరత్న. -
Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత
సాక్షి, బెంగళూరు/అమరావతి/శ్రీకాళహస్తి: నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి కన్ను మూశారు. వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని శనివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న మృతిపై రాష్ట్ర సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. విదేశీ వైద్యులను రప్పించినా..: లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన గత నెల 27న గుండెపోటుకు గురైన తారకరత్నకు సుమారు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగి పోయింది. ఆ సమయంలో రక్తం గడ్డకట్టడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి బ్రెయిన్‌కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేస్తూ వచ్చారు. తొలుత బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా వైద్యులను పిలిపించి చికిత్స అందించగా, వారం నుంచి విదేశాల నుంచి ప్రత్యేకంగా న్యూరోసర్జన్లు, న్యూరాలజిస్టులను కూడా రప్పించి చికిత్స అందించారు. అయినప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మధ్యలో పరిస్థితి కొంచెం మెరుగైందని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా, రెండు రోజులుగా పరిస్థితి మరీ క్షీణించడంతో విషమంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం ఆస్పత్రికి చేరుకున్నారు. పూర్తి సమాచారాన్ని వైద్యులు వారికి వివరించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ తొలగించారు. ప్రముఖుల సంతాపం సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తారకరత్న మరణ వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతి, బాధను కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తారకరత్న మరణంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. పాదయాత్ర ప్రారంభం రోజునే.. నందమూరి తారకరత్న గత నెల 27న కుప్పంలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంట ఉన్న నాయకులు ఆయన్ను అక్కడి నుంచి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయనకు పల్స్ అందడం లేదని వైద్యులు తెలిపారు. అక్కడే క్రిటికల్ కేర్ వైద్యం చేశారు. అయితే తారకరత్న గుండెపోటుతో అప్పుడే ప్రాణాలొదిలినా.. లోకేశ్ పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు ఆస్పత్రికి తరలించారనే ప్రచారం జరిగింది. లోకేశ్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఇన్నాళ్లూ మెరుగైన వైద్యం పేరుతో కథ నడిపించారని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎట్టకేలకు పర్వదినమైన శివరాత్రి రోజున తారకరత్న శివైక్యం చెందినట్లు ప్రకటించడం గమనార్హం. అభిమానుల ఆందోళన తారకరత్న మరణవార్త విన్న నందమూరి అభిమానులు నారాయణ హృదయాలయకు వందలాదిగా చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వెనుక గేటు నుంచి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. తమకు చివరి చూపు కూడా దక్కకుండా అలా తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ కాసేపు ఆందోళన చేపట్టారు. -
తారకరత్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. నేడు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొన్న కల్యాణ్ రామ్‌కు తారకరత్న హెల్త్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నాడు. అతనికి మెరుగైన వైద్యం అందుతుంది. అయితే ఇప్పుడు కండీషన్ ఎలా ఉందన్నది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. ఆ విషయాలు హాస్పిటల్ వర్గాలు చెబితేనే బాగుంటుంది. మేం అందరం తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అతనికి మీ అందరి ఆశిస్సులతో తను పూర్తిగా రికవర్ అవుతాడని భావిస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. కాగా గత కొన్నిరోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు తారకరత్న పరిస్థితి ఇప్పడెలా ఉందన్నది అటు కుటుంబసభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు. -
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
తారకరత్న ఆరోగ్యంపై ఎమోషనల్ పోస్ట్ చేసిన చిరంజీవి
సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపింది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ఊరటనిచ్చే విషయం చెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన తారకరతన్న కోలుకుంటున్నారని తెలిసి తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. ‘‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుండి తారకరత్నను కాపాడిన ఆ డాక్టర్లకి, భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను మై డియర్ తారకరత్న’’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఈ పోస్ట్‌తో నెట్టింట వైరల్‌గా మారింది. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. May you have a long and healthy life dear Tarakaratna! — Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023 -
తారకరత్న తాజా హెల్త్ బులెటిన్.. వైద్యులు ఏమన్నారంటే?
సినీనటుడు నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. కొన్ని మీడియాల్లో ఆయనకు ఎక్మోపై చికిత్స అందించినట్లు వచ్చిన కథనాలపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు ఎక్మోపై ఎలాంటి చికిత్స అందించలేదని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరాలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
ఇంకా వెంటిలేటర్‌పైనే తారకరత్న.. రిపోర్టులు వచ్చాక క్లారిటీ
నందమూరి తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని నందమూరి రామకృష్ణ తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగుపడిందని అయితే సిటీ స్కాన్ రిపోర్టు వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందన్నారు. తారకరత్నకు అసలు ఎక్మోనే పెట్టలేదు. అతని అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయి. కొంత ఆక్సిజన్ సొంతంగానే తీసుకుంటున్నారు. క్రమంగా కోలుకుంటున్నాడు. పూర్తిగా రికవర్ అయ్యేందుకు సమయం పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. కాగా శుక్రవారం కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మొదలుపెట్టిన పాదయాత్రలో తారకరత్న ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే! -
ముగిసిన అబ్జర్వేషన్.. తారకరత్న హెల్త్‌పై అప్పుడే క్లారిటీ!
నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. అయితే తారకతరత్నకు ఈరోజు నిర్వహించే వైద్య పరీక్షలు కీలకం కానున్నాయి. ఈరోజు ఆయనకు ఎమ్ఆర్ఐ(MRI)స్కాన్ తీయనున్నారు. దీని ఆధారంగా ట్రీట్మెంట్ కొనసాగించనున్నారు. ఈనెల 27న తారకరత్న గుండెపోటుకు గురికాగా అప్పటి నుంచి పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. -
తారకరత్న గురించి గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్
సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అతని ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉన్న నేఫథ్యంలో కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్య అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తుండగా నిన్న(ఆదివారం)తారక్, కల్యాణ్ రామ్‌లు కుటుంబసమేతంగా బెంగళూరులోని హాస్పిటల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు మంచు మనోజ్ తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు వెళ్లారు. అతని ఆరోగ్యంపై వైద్యులను అడిగిన తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'తారకరత్నను చూడటం జరిగింది. రికవరీ అవుతున్నాడు. త్వరలోనే కోలుకొని బయటకు వచ్చేస్తాడు. తారకరత్న స్ట్రాంగ్ ఫైటర్. అతనికి ఇది టెస్టింగ్ టైమ్. నేను వందశాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల తారకతరత్న త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. visited #Tarakratna and am filled with hope and optimism for his future. He has our unwavering support and I'm sure with the grace of God and all the prayers of the people who care for him, he will make a full recovery soon and be back home with us. Love u babai 🙏🏼❤️ — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 29, 2023 -
తారకరత్న క్రిటికల్ కండీషన్ నుంచి బయట పడ్డారని చెప్పలేం: జూ. ఎన్టీఆర్
నందమూరి తారకరత్నను చూసేందుకు జూ. ఎన్టీఆర్ బెంగళూరు చేరుకున్నారు. కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితపై వైద్యులను తెలుసుకున్న అనంతరం తారక్ మీడియాతో మాట్లాడారు. 'అన్నయ్య(తారకరత్న) చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోంది. ప్రస్తుతం పోరాడుతున్నారు. క్రిటికల్ కండిషన్ నుంచి బయట పడ్డారని చెప్పలేం. కుటుంబసభ్యుడిగా ఇక్కడికి వచ్చాను. డాక్లర్లు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం, ప్రార్థనలు అవసరం' అని పేర్కొన్నారు. ఇక కల్యాణ్ రామ్ మాట్లాడుతూ... 'మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు త్వరగా కోలుకొని మన ముందుకు రావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అని తెలిపారు. -
నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. చికిత్సకు స్పందిస్తున్నారు : బాలయ్య
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. చికిత్స కొనసాగుతుందని, అతను కోలుకుంటాడన్న నమ్మకం తమకు ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్‌పైనే ఉన్నారు. స్టంట్ వేయడం కుదరలేదు, మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రత్యేక వైద్య బృందం అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. నిన్నటితో పోలిస్తే ఇవాల్టికి కాస్త మూమెంట్ ఉందని డాక్టర్లు చెప్పారు. తారకరత్న కోలుకుంటాడన్న నమ్మకం మాకు ఉంది. బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు ఉందన్నది తెలియాల్సి ఉంది. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్థించండి. అభిమానుల ప్రార్థనలతో త్వరగా కోలుకుంటాన్న నమ్మకం ఉంది'' అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. -
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్మెంట్ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు జూ ఎన్టీఆర్ ఇవాళ(ఆదివారం)బెంగళూరుకు వెళ్లనున్నారు. కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇప్పటికే తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు ఫోన్ చేసి ఎన్టీఆర్ ఆరా తీశాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరుకు చేరుకుంటున్నారు.కాగా తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. @tarak9999 @NANDAMURIKALYAN Visit In #TarakaRatna #TarakaratnaHealthUpdate #TarakaRathna #JrNTR #NandamuriBalakrishna pic.twitter.com/IPT3czlQTo — Ram_Yash (@mynameismr6) January 29, 2023 -
క్రిటికల్‌గా తారకరత్న ఆరోగ్యం.. రిలీజ్ వాయిదా వేసుకున్న కల్యాణ్ రామ్
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హెల్త్ బుటిటెన్ విడుదల చేసిన వైద్యులు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్స్ చేయడం సరికాదనుకున్నారు నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్ ఫిబ్రవరి10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాధే వెన్నల’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ఫుల్‌సాంగ్‌ను రేపు(ఆదివారం)సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అమిగోస్ మేకర్స్ ప్రకటించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date. Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU — Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023 -
తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్ రామ్..
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా హీరో కల్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా..“నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ”అంటూ ట్వీట్ చేశారు. నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను . Get well soon and get back to complete health brother. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 28, 2023 -
మాసివ్ హార్ట్ఎటాక్తోనే కుప్పకూలిన తారకరత్న!
సాక్షి, చిత్తూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఏస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందుతుండగా.. బెంగళూరు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం కుప్పంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మొదలు సందర్భంగా.. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్లు వేయలేదు. యాంజియోగ్రామ్ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్ వేస్తారా?.. ఇతర ట్రీట్మెంట్లు అందిస్తారా? అనేది వేచిచూడాలి. తారకరత్నకు భారీగా గుండెపోటు వచ్చిందని, అయితే ఆస్పత్రిలో వైద్యులు 40 నిమిషాలపాటు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారాయన. బాలకృష్ణ రాకతో ఆయన రికవరీ కావడం ఆశ్చర్యంగా ఉందని, బాలకృష్ణే దగ్గరుండి చూసుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తారకరత్నకు ప్రాణాపాయం తప్పిందని భావనలో ఉన్నామని బుచ్చయ్యచౌదరి చెప్పారు. అవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని, తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇక పరిస్థితిపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ లెఫ్ట్ సైడ్ వచ్చిందని తెలిపారు. ఎడమ వైపు 90 శాతం బ్లాక్ అయ్యింది. అయితే మిగతా రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పరిస్థితి మెరుగవుతోందని, వైద్యులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయినప్పటికీ బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి పాజిటివ్‌గానే ఉందని, దేవుడి దయతో పాటు కుటుంబం సభ్యుల ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో.. ఆయన మండిపడ్డారు. అంతకు ముందు.. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తారకరత్నను గ్రీన్‌ఛానల్ ద్వారా కుప్పం ఈపీఎస్ ఆస్పత్రి నుంచి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. -
నారా లోకేష్ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత
సాక్షి, కుప్పం: నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. లక్ష్మిపురం మసీదు వద్ద అదుపు తప్పి వాహనంపై నుంచి కిందకిపడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. -
నందమూరి తారకరత్న 'సారథి' మోషన్ పోస్టర్ విడుదల
నందమూరి తారకరత్న హీరోగా నటించిన తాజా చిత్రం సారథి. జాకట రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైశాలి హీరోయిన్గా నటించారు. పంచభూత క్రియేషన్స్‌పై పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి. సిద్ధేశ్వర్ రావు నిర్మించిన ఈ మూవీ మోషనల్ పోస్టర్ని విడుదల చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఖోఖో గేమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచన అందరిలో రేకెత్తించేలా మా సినిమా ఉంటుంది. కరోనా మహమ్మారిలో ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమాను పూర్తి చేసినందుకు తారకరత్నికి ధన్యవాదాలు. సిద్ధార్థ్ వాటికన్ సంగీతం అలరిస్తుంది' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి. -
ఎవర్నీ తక్కువ చేసి చూపించలేదు
నందమూరి తారకరత్న హీరోగా నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్ లైన్. వంగవీటి రాధా పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, కేఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘తెరవెనుక కష్టాలున్న ప్రాజెక్ట్స్‌లో క్వాలిటీగా చేసిన సినిమాల్నీ హిట్ అయ్యాయి. అలాంటి కోవలో వస్తున్న ‘దేవినేని’ కూడా విజయం సాధించాలి. ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్‌తో సినిమా చేయడం చాలా కష్టం. ఈ సినిమాతో ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. శివనాగేశ్వర రావు మాట్లాడుతూ–‘‘నేను తీసిన ఈ ‘దేవినేని’ బయోపిక్ కాదు. దేవినేని, వంగవీటి గార్ల మీద అభిమానంతోనే ఈ సినిమా తీశా. ఈ రెండు కుటుంబాల్లో ఎవర్నీ తక్కువగా చూపించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కేసులు వేశారు. చిన్న నిర్మాతలైనా ఈ సినిమాను ఎంతో కష్టపడి నిర్మించారు. దయచేసి ఈ గొడవలను ఆపి, పాజిటివ్‌గా ఆలోచించి సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం రియలిస్టిక్‌గా ఉంటుంది’’ అన్నారు నిర్మాత రాము. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. చదవండి: శృతి ప్రియుడికి థాంక్స్ చెప్పిన కమల్! ఫొటోగ్రాఫర్‌కు బాలీవుడ్ హీరో హెచ్చరిక! -
త్వరలో ‘దేవినేని’ మోషన్ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'.. 'బెజవాడ సింహం' ఉపశీర్షిక. జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనందున డీటీఎస్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.... ఈ చిత్రంలో నటించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారన్నారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ ఆకట్టుకున్నారన్నారు. ఇక దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటించాడని పేర్కొన్నాడు. (చదవండి: అందుకే నటించేందుకు ఒప్పుకున్నా) సురేష్ కొండేటి-వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడని, అలాగే సురేంద్ర పాత్రలో ఏంఎన్ఆర్ చౌదరి నటిస్తున్నారని చెప్పారు. దేవినేని మురళిగా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగిలిన పలు పాత్రల్లో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందని, నేడు డిటీఎస్ కార్యక్రమం జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రంలో మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారని తెలిపారు. అయితే దేవినేని సినిమా బెజవాడలో ఇద్దరు మహనాయకుల నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆ నాయకుల మధ్య స్నేహం, వైరంలో పాటు కుటుంబ నేపథ్యంలో సాగే సెంటిమెంట్‌ను కూడా దర్శకుడు జోడించాడు. ఇక బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. అలాగే 1983లో విజయవాడకు మొదటి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా వెళ్లిన కేఎస్ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: నర్రా శివ నాగు, నిర్మాతలు: జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కోటి, కో.డైరెక్టర్: శివుడు వ్యవహరిస్తున్నారు. -
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి
ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. అందులో భాగంగా దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’. ఈ సినిమాలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘దేవినేని’లో బెజవాడ లోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా.. దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడు. అలాగే సురేంద్ర పాత్రలో ఏం ఎన్ ఆర్ చౌదరి నటిస్తున్నారు. దేవినేని మురళి గా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగతా పాత్రలో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరీపేట హైవే లో భారీగా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ... ‘నా కెరీర్లో ఇది సెకండ్ పేజ్. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నాకు చిన్నప్పుడు మా నాన్న గారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ టైములో కె ఎస్ వ్యాస్ గారు విజయవాడ కి ఫస్ట్ పవర్ఫుల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ నేను చేయడం అనేది రేర్ ఇన్సిడెంట్. శివనాగు గారు వండర్ ఫుల్ డైరెక్టర్ . ఈ క్యారెక్టర్ని మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. -
30 ఏళ్ల తర్వాత నటిస్తున్నా
నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. దేవినేని నెహ్రూ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీనియర్ నటి జమున కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు. జమున మాట్లాడుతూ– ‘‘నేను సినిమారంగం నుంచి తప్పుకుని 30 ఏళ్లు అయింది. రిటైర్ అయిన నన్ను మళ్లీ కెమెరా ముందు నిలబెట్టి సినిమా రంగులు వేసి నటించేలా చేశారు శివనాగు. ఇది కాకుండా అన్నపూర్ణమ్మగారి సినిమాలో నేను ఒక రాణి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. శివనాగు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయాలనుకునే ముందు విజయవాడ మొత్తం తిరిగి వివరాలు తెలుసుకున్నాను. 1977లోని కథ ఇది. మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసి, దసరాకి సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులైన వ్యక్తి, పెదనాన్నలాంటివారు నెహ్రూగారు. ఆయన పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు తారకరత్న. ‘‘దేవినేని చిత్రాన్ని నిర్మిస్తుండటం నా అదృష్టం’’ అన్నారు రాము రాథోడ్. -
ప్రాణం ఖరీదు ఎంత?
చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1978లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపొందడం విశేషం. ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ పొందింది. నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. ‘ప్రాణం ఖరీదు’ ఎంత? ఆ టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. మా సినిమా బాగుందంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్. -
చిక్మగళూరులో...
నందమూరి తారకరత్న, మేఘశ్రీ జంటగా శివప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అమృత వర్షిణి’. చాందిని క్రియేషన్స్ పతాకంపై నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. తారకరత్న మాట్లాడుతూ– ‘‘కథ నచ్చడంతో పాటు అభిరుచి ఉన్న దర్శక, నిర్మాతలు కావడంతో ఈ సినిమా చేస్తున్నాను. అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు. ‘‘ఫస్ట్ సిట్టింగ్‌లోనే తారకరత్నగారు స్టోరీ ఫైనలైజ్ చేశారు. యూత్‌కు, ఫ్యామిలీస్‌కు నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. చిక్మగళూరులో సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు శివప్రభు. ‘‘నిర్మాతగా నా తొలి సినిమా ఇది. శివప్రభు కన్నడంలో నాలుగు సినిమాలు చేశాడు. ఈ నెల 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని నాగరాజు నెక్కంటి అన్నారు. ‘‘ఈ సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్రలో నటిస్తున్నా’’ అన్నారు మేఘశ్రీ. ఈ చిత్రానికి కెమెరా: సభా కుమార్, సంగీతం: జెస్సీ గిప్ట్, మాటలు–సహ దర్శకత్వం: సతీష్ కుమార్, సహ నిర్మాత: మంజునాథ. -
‘బిగ్‌బాస్ 2’లో నందమూరి హీరో?
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షోకు ఎంత క్రేజ్ వచ్చిందో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఇలాంటి రియాల్టీ షోలు కేవలం బాలీవుడ్ వాళ్లే కాదు మనోళ్లు కూడా రక్తికట్టించగలరని నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ రెండో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండో సీజన్‌కు నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సారి ఇంకొంచెం మసాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండో సీజన్లో పాల్గొనే వ్యక్తులు వీరే నంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అవి నిజం కాదంటూ ఆ షోలో మేము పాల్గొనడం లేదంటూ కొందరు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా నందమూరి హీరో తారకరత్న ఈ షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం మాత్రం రాలేదు. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే బిగ్ బాస్ బృందం కానీ, తారకరత్న కానీ స్పందించేవరకు వేచి చూడాలి. -
‘ఖయ్యం భయ్యా’ సందడి
భోగాపురం: స్థానిక సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో ‘ఖయ్యం–భయ్యా’ చిత్ర షూటింగ్ చురుగ్గా సాగుతోంది. గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఇతివృత్తంతో సాగే చిత్రంలో ఒక పాట చిత్రీకరణను మంగళవారం ఇక్కడ చేపట్టారు. చిత్రంలో నందమూరి తారకరత్న, హర్షిత (కన్నయ్య ఫేం), ప్రియ (తొలి పరిచయం) హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నట్టు యూనిట్ సభ్యులు తెలిపారు. మైసమ్మ ఐపీఎస్ సినిమా దర్శకుడు భరత్ దర్శకత్వంలో, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తయ్యిందని, మార్చిలో సినిమా విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పాటకు స్వర్ణ కొరియోగ్రాఫర్ చేశారు. తారకరత్న, హర్షితలతో కూడిన బృంద నృత్యకారుల సెప్పులను చిత్రీకరించారు. -
నయీమ్ కథతో ఖయ్యుమ్
గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితకథ ఆధారంగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖయ్యుమ్ భాయ్’. ఏసీపీగా నందమూరి తారకరత్న, ఖయ్యుమ్గా కట్టా రాంబాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కట్టా శారదా చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘నయీమ్ చిన్ననాటి నుంచి ఎన్కౌంటర్లో మరణించిన ఘటన వరకూ సినిమాలో చూపిస్తున్నాం. సినిమాలో యాక్షన్ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కట్టా రాంబాబు. నటులు ‘బాహుబలి’ ప్రభాకర్, చిన్నా, బెనర్జీ, ఫైట్ మాస్టర్ విజయ్, దర్శకుడు భరత్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర. -
క్లైమాక్స్‌లో కేక...
నందమూరి తారకరత్న, రేవంత్, నోయెల్, ‘మిర్చి’ హేమంత్... ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిన ‘రాజా మీరు కేక’లో ఈ నలుగురూ కీలక పాత్రలు చేశారు. నలుగురిలో రాజు ఎవరు? అనడిగితే... ‘వచ్చే నెల వరకూ ఆగండి. సినిమా చూపిస్తాం’ అని టి. కృష్ణకిశోర్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్. ఎం ఈ చిత్రం నిర్మించారు. యాంకర్ లాస్య ఓ హీరోయిన్గా నటించారు. ఆడియో ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కొత్త కథతో తీసిన చిత్రమిది. క్లైమాక్స్‌లో తారకరత్న నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంత అద్భుతంగా నటించారు’’ అన్నారు కృష్ణ కిశోర్. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్.