
తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను కుటుంసభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తుంది. గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న 23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
చదవండి: తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం
అయితే తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఇద్దరు కూమార్తెలు, ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తండ్రి పార్థివ దేహం వద్ద ఆయన పెద్ద కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో అందరిని కలిచి వేసింది. ఆయన మరణంతో భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో తారకరత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.
చదవండి: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత..
ఆయన ముగ్గురు పిల్లల బాగోగులు, చదువులు తానే చూసుకుంటానని, బాబాయ్‌గా తారక్ కుటుంబానికి నిత్యం అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట. ఇక తారకరత్న, బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తారకరత్న కోలుకొని తిరిగిరావాలని బాలయ్య ప్రత్యేక పూజలు కూడా చేశారు. తారకరత్న హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి బాలయ్య అక్కడే ఉండి ఆరోగ్య విషయాలను పర్యవేక్షించారు. బాబాయ్‌గా ఎప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణాంతరం కూడా తన కుటుంబానికి అండగా నిలబడ్డారు.