ఏడాది క్రితం తీవ్ర విషాదం.. తారకరత్న భార్య ఎమోషనల్! | Nandamuri Taraka Ratna Wife Alekhya Reddy Post After 1 Year | Sakshi
Sakshi News home page

Nandamuri Taraka Ratna: 'నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు'.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్!

Published Sun, Feb 18 2024 4:33 PM | Last Updated on Sun, Feb 18 2024 5:30 PM

Nandamuri Taraka Ratna Wife Alekhya Reddy Post After One Year - Sakshi

సరిగ్గా ఏడాది క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి హీరో తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్‌ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. ఆయన మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. 

అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది.. నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిది.. 18/2/2023 నుంచి నీకు, నాకు ఎలాంటి హద్దులు లేవు. రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఎలాంటి మార్పు ఉండదు. మీ ఉనికి, మీ ప్రేమ, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. ఇది ఎప్పటికీ చావదు.. నువ్వే నా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు !!' అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన ముగ్గురు పిల్లలతో ఉన్న  వీడియోను షేర్ చేసింది. 

కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్‌ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement