alekhya
-
నందమూరి తారకరత్న వర్ధంతి.. పిల్లలతో కలిసి అలేఖ్యా రెడ్డి నివాళి (ఫొటోలు)
-
మనం ఇలా విడిపోతామని ఎప్పుడూ అనుకోలేదు: తారకరత్న భార్య ఎమోషనల్
సరిగ్గా రెండేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో, నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆయన చివరికీ కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 18, 2023న నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇవాళ తారకరత్న వర్ధంతి కావడంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ప్రపంచంలో నువ్వు లేని లోటు పూడ్చలేనిదని ఎమోషలైంది. నిన్ను కోల్పోయిన క్షణం కాలం నయం చేయలేని గాయం.. నీ స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. మనం ఎప్పుడూ ఇలా విడిపోవాలని అనుకోలేదు... నువ్వు ఇక్కడ ఉండకపోవచ్చు.. కానీ నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు వదిలి వెళ్లిన కలల్లో వికసిస్తూనే ఉంటుందని రాసుకొచ్చింది. మాటలకు , కాలానికి, జీవితానికి అతీతంగా మేము నిన్ను మిస్ అవుతున్నాం అంటూ అలేఖ్యా రెడ్డి.. తన భర్త తారకరత్నను గుర్తు చేసుకుంది.(ఇది చదవండి: Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత)నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
'ఇటు రావే నా గాజు బొమ్మ'.. ఆ పాటతో తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక!
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలుస వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మరో వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'ఇటు రావే నా గాజు బొమ్మ' అనే సాంగ్‌ను ఈ వీడియోకు జతచేశారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలోని ఈ పాట తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమను తెలిపేలా ఉంది. తన కూతురి కోసం ఒక తండ్రి పడే తపనను ఈ ఒక్క పాటలో చూపించారు. తన ముద్దుల కూతురిని తలచుకుని అలేఖ్య ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కుమార్తెను ముద్దాడింది.తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.తారకరత్న జర్నీకాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
Alekhya Punjala: కళలతో కరిక్యులమ్
అలేఖ్య పుంజాల... శాస్త్రీయనాట్య పుంజం. ఆమెది యాభై ఏళ్ల నాట్యానుభవం... ముప్పై ఏళ్ల బోధనానుభవం. ఆమె మువ్వలు... కథక్... ఒడిస్సీ.. భరతనాట్యం... కూచిపూడి... అడుగులను రవళించాయి. రాష్ట్రపతి నుంచి పురస్కారం... ఆమెలో సాక్షాత్తూ అమ్మవారిని చూస్తూ ప్రేక్షకులు చేసిన అభివందనం... ఇప్పుడు సంగీతనాటక అకాడెమీకి వన్నెలద్దే బాధ్యతలు... ఆమె నాట్యముద్రలతో పోటీ పడుతున్నాయి. తెలంగాణ సంగీతనాటక అకాడెమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ’సాక్షి ఫ్యామిలీ’తో ఆమె చెప్పిన సంగతులివి.‘‘తెలంగాణలో కళారీతులు వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రజాబాహుళ్యంలోకి వచ్చాయి. మరుగున పడిన మరెన్నో కళారీతులను అన్వేíÙంచాల్సి ఉంది. నా వంతుగా పరిశోధనను విస్తరించి మరిన్ని కళారీతులను ప్రదర్శన వేదికలకు తీసుకు రావాలనేదే నా లక్ష్యం. సంగీత, నాటక అకాడెమీ కళాకారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కళాకారులందరినీ ఒక త్రాటి మీదకు తీసుకురావాలి. అసలు తెలంగాణ ఉనికి కళలే. ఒక ప్రదేశం గుర్తింపు, అక్కడ నివసించే ప్రజల గుర్తింపు కూడా ఆ సంస్కృతి, కళలతో ముడిపడి ఉంటుంది. తరతరాలుగా కళాకారులు గడ్డు పరిస్థితుల్లో కూడా కళను వదిలేవారు కాదు. కళను బతికించడమే తమ పుట్టుక పరమార్థం అన్నట్లుగా కళాసాధన చేశారు. ప్రస్తుతం మన విద్యావిధానంలో కళలకు సముచిత స్థానం కల్పిస్తూ కరిక్యులమ్ రూ΄÷ందాలి. అందుకోసం కళారీతుల గురించి అధ్యయనం చేస్తున్నాను. కళాంశాన్ని పాఠ్యాంశంగా రూ΄÷ందించాలి. పిల్లలు జీవన శాస్త్రీయ విషయాలతోపాటు శాస్త్రీయ కళలను కూడా పాఠాలుగా చదవాలి.సోషల్ మీడియా దన్ను మా తరంలో కళాసాధనను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవడానికి భయపడే వాళ్లు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. టెక్నాలజీ విస్తృత మైంది. ఇప్పుడు కళాకారులు సోషల్ మీడియానే పెద్ద కళావేదికగా మలుచుకుంటున్నారు. మా తరంలో కళాకారుల్లో సగానికి పైగా కళాసాధనలోనే జీవితాన్ని వెతుక్కునేవారు. కొంతమంది కళకు దూరమై బతుకుతెరువు బాట పట్టేవారు. ఈ తరంలో నా దృష్టికి వచి్చన విషయాలేమిటంటే... కళాసాధనలో అనతికాలంలోనే గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. సంతృప్తికరమైన గుర్తింపు లేకపోతే కళను వదిలేస్తున్నారు. కొనసాగేవాళ్లు పదిశాతానికి మించడం లేదు. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తెలిస్తే గుర్తింపు కూడా అనతికాలంలోనే వస్తుంది. ఈ టెక్నాలజీ యుగంలో వృత్తి–ప్రవృత్తి రెండింటికీ న్యాయం చేసే అవకాశం ఉంది. జీవిక కోసం ఒక ఉద్యోగం చేసుకుంటూ కళాసాధన, కళాప్రదర్శనలు కొనసాగించండి. కళ కోసం చదువును నిర్లక్ష్యం చేయవద్దు. చదువు కోసం కళకు దూరం కావద్దు. రాబోయేతరాల కోసం ఈ వంతెనను నిలబెట్టండి. ఇప్పుడు మన శాస్త్రీయ కళారీతులు విశ్వవ్యాప్తమయ్యాయి. విదేశాల్లో ప్రదర్శనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కళాసాధనలో సవాళ్లు మహిళలకు ఎదురయ్యే సవాళ్లు దేహాకృతిని కాపాడుకోవడంలోనే. సంగీతసాధనకు దేహాకృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి కాదు, నాట్యకారులకు దేహాకృతితోపాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం. ప్రసవం, పిల్లల పెంపకం కోసం ఎక్కువ విరామం తీసుకుంటే కళాసాధనకు దూరమైపోతాం. పిల్లలను పెంచుకుంటూ తమ మీద తాము కూడా శ్రద్ధ తీసుకున్న నాట్యకారులే ఎక్కువ కాలం కొనసాగగలరు. మహిళలకు ఎదురయ్యే పెద్ద చాలెంజ్ ఇదే. కుటుంబం సహకరిస్తే కళకు సంబంధం లేని ఉద్యోగం చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ కూడా కళాసాధన కొనసాగించవచ్చు.’’ లకుమాదేవి గొప్ప వ్యక్తిత్వం గల మహిళడాక్టర్ సి. నారాయణరెడ్డిగారితో కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన రాసిన ‘కర్పూర వసంతరాయలు’ గేయకావ్యాన్ని విన్నాను. 14వ శతాబ్దంలో కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో నర్తకి లకుమాదేవి. కావ్యంలో లకుమాదేవి పాత్ర అద్భుతంగా ఉంది. ఆ పాత్రను ప్రదర్శించడానికి నారాయణరెడ్డి గారి అనుమతి తీసుకున్నాను. నాకిష్టమైన పాత్రల్లో మండోదరి, దుస్సల, రుద్రమదేవి, వేలు నాచియార్ పాత్రలు ముఖ్యమైనవి. వేలు నాచియార్ తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన మహిళా పాలకురాలు, బ్రిటిష్ పాలకులతో పోరాడిన యోధ. ఆ పాత్రను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ‘వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్’ నాట్యరూపకంలో ప్రదర్శించాను. నేను అమ్మవారి పాత్ర ప్రదర్శించినప్పుడు నాలో అమ్మవారిని చూసుకుని ఆశీర్వాదం కోసం సాష్టాంగ ప్రణామం చేసిన ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పది. వారి అభిమానానికి సదా కృతజ్ఞతతో ఉంటాను.ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
ఉగాది రోజు ఊహించని అతిథి.. అలేఖ్య తారకరత్న ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో తారకరత్న కుటుంబం ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి తెలుగు నూతన సంవత్సర పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఉగాది వేడుకలకు స్వయంగా తానే తారకరత్న ఇంటికి వెళ్లారు. పండుగ రోజు సంతోషంగా వారితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అలేఖ్య తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా లైఫ్‌లో నాన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అంకుల్ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయి. కష్ట, సుఖాల్లోనూ ఎప్పుడు మా వెంటే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి. ఎలక్షన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం ప్రత్యేకంగా రావడం ఇంతకు మించిన సంతోషం లేదు. ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసు. ఉగాది రోజును మాకు స్పెషల్‌గా మార్చిన విజయ్‌సాయి అంకుల్‌పై మా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది' అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. కాగా.. గతేడాది గుండెపోటుతో తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
ఏడాది క్రితం తీవ్ర విషాదం.. తారకరత్న భార్య ఎమోషనల్!
సరిగ్గా ఏడాది క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి హీరో తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. ఆయన మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది.. నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిది.. 18/2/2023 నుంచి నీకు, నాకు ఎలాంటి హద్దులు లేవు. రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఎలాంటి మార్పు ఉండదు. మీ ఉనికి, మీ ప్రేమ, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. ఇది ఎప్పటికీ చావదు.. నువ్వే నా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు !!' అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన ముగ్గురు పిల్లలతో ఉన్న వీడియోను షేర్ చేసింది. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
తారకరత్న కూతురు బర్త్ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!
నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య) తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఇవాళ తారకరత్న పెద్ద కూతురు నిష్క బర్త్ డే కావడంలో ఆయన భార్య ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిముషం నుంచి మాకెంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది. నీ నువ్వు, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ కూతురికి బర్త్ డే విషెస్ తెలిపారు. మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ మమ్ము(అమ్మ) ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని ఎమోషనలైంది. అలేఖ్య తన కూతురికి విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిష్కతో పాటు తారకరత్న, అలేఖ్య రెడ్డికి కవల పిల్లలు తాన్యారామ్, రేయాలు కూడా ఉన్నారు. పిల్లల పేర్లలో ఎన్టీఆర్ మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
'బేబి' మూవీ టీమ్ నుంచి మరో ప్రేమకథ
సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా కొత్త సినిమా షురూ అయింది. సుమన్ పాతూరి దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ్రపారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్ కొట్టగా, డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రవిశంకర్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందించగా, హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సంకృత్యాన్ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన కథ ఇది. నేను, ఎస్కేఎన్, సందీప్ రాజ్, అలేఖ్య.. మేమంతా ఫ్రెండ్స్. ఈ సినిమా వారితో కలిసి చేస్తుండటంతో మరింత బాధ్యతగా భావిస్తున్నా’’ అన్నారు సాయి రాజేశ్. ‘‘ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చిన నా ఫ్రెండ్ సాయి రాజేశ్‌కు థ్యాంక్స్’’ అన్నారు సుమన్ పాతూరి. ‘‘హీరోయిన్గా చేయాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు అలేఖ్య హారిక. ‘‘తెలుగు అమ్మాయిలను ్ర΄ోత్సహించాలనే నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలనే హీరోయిన్గా తీసుకుంటున్నాను’’ అన్నారు ఎస్కేఎన్. ఈ చిత్రానికి కెమెరా: అస్కర్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సహనిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, రమేశ్ పెద్దింటి. -
ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య
నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని ఆయన అలరించారు. ఆపై రాజకీయాల్లో రానించాలనే ఆలచనతో తొలి అడుగు కూడా వేశారు. కానీ చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. సుమారు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వెంటిలేటర్‌పైనే తారకరత్నకు చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇదే ఏడాది ఫిబ్రవరి 18న ఆయన మరణించారు. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సంఘటన చూసిన వారందరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భర్త మరణ వార్తను జీర్ణించుకోలేని అలేఖ్యను ఓదార్చడం ఆ సమయంలో ఎవరి వల్ల కాలేదు. తాజాగ వారి పిల్లల పుట్టినరోజు సందర్భంగా తారకరత్నను అలేఖ్యరెడ్డి గుర్తుచేసుకున్నారు. నేడు తారకరత్న కవలపిల్లులు అయిన తాన్యారామ్, రేయాల పుట్టినరోజు. దీంతో అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ చేశారు. అంతేకాకుండా తారకరత్నతో వారికున్న తీపిగుర్తులకు సంబంధించిన ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేశారు. మొదట వారి పెద్ద కూతురు అయిన నిష్క తారకరత్న ఫోటోకు పువ్వులు పెడుతుండగా ఇద్దరు ట్విన్స్ ఆమెకు సాయిం చేస్తున్నారు. (ఇదీ చదవండి: పూజా హెగ్డేకు సర్జరీ.. అసలు కారణం ఇదే!) ఇలా ఆ ఫోటోలు చూస్తూ.. తారకరత్నను మరోసారి గుర్తుచేసుకున్న ఎవరైనా కూడా భావోద్వేగానికి గురికాక తప్పదు. ఆ వీడియోతో పాటు తారకరత్న గురించి అలేఖ్య రెడ్డి ఇలా రాసుకొచ్చారు. తాన్యారామ్, రేయాలకు ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలోచించినా వారిద్దరికీ పుట్టునరోజు శుభాకాంక్షలను ఆనందంగా చెప్పలేకపోతున్నానని తారకరత్నను ఆలేఖ్య గుర్తుచేసుకున్నారు. 'ఇలాంటి ఆనంద సమయంలో మీరు లేరు. కానీ పిల్లల మొఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. అలా మాతోనే ఉంటావ్. వర్షం కురిసే రోజు ఇంద్రధనుస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు. ఓబు (తారకరత్న), మమ్ము, ఎన్ నిష్క.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని, వేడుకలను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు.' అని ఆలేఖ్య తెలిపారు. పిల్లల పేర్లలో ఎన్టీఆర్ మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
ఎమోషనల్ వృషభ
జీవన్, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషభ’. అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో యుజిఓస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో మంచి ఎమోషన్ ఉన్నట్లనిపిస్తోంది’’ అని ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ‘‘1966–1990 నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆధ్యాత్మికంగా వెళుతూనే మనుషులకు, పశువులకు మధ్య ఉండే బాండింగ్‌ని చూపించాం’’ అన్నారు అశ్విన్. ‘‘ఓ పల్లె లోని చిన్న గుడిలో ఈ కథ నా మదిలో మెదిలింది’’ అన్నారు ఉమాశంకర్. -
అచ్చం తండ్రిలానే ఉన్నాడు.. వైరలవుతున్న తారకరత్న కుమారుడి ఫోటో!
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య, పిల్లలు తీవ్రం విషాదంలో మునిగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తారకరత్న గుండెపోటుతో మరణించారు. అయితే అలేఖ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారక్‌ను తలుచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆమె తన కొడుకు ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అచ్చం తారక్ లాగే ఉన్నాడంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్నకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా తారకరత్నకు ముగ్గురు పిల్లలు నివాళులర్పించారు. తండ్రి ఫోటోను చూస్తూ ఫాదర్స్ డే జరుపుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ తండ్రి లేని బాధ ఎలా ఉంటుందో తెలుసంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!) View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
అలేఖ్యకు రూ.50వేలు ఆర్థికసాయం అందజేత
నల్గొండ: గుర్రంపోడు మండలం కొత్తలాపురం గ్రామానికి చెందిన కట్టెబోయిన అలేఖ్య నిడమనూరు ఆదర్శ పాఠశాలలో చదువుతూ ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కేన్సర్‌తో బాధపడుతూ ఫిబ్రవరి 11న మృతిచెందింది. ఆమె తండ్రి వారిని వదిలి వెళ్లిపోయాడు. ‘పది’లో సత్తా చాటిన విద్యార్థిని, అలేఖ్యకు బాసటగా నిలుస్తాం అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాలకు పలువురు దాతలు స్పందించి ఆమెకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు పటాన్చెరువు సీఐ నూకల వేణుగోపాల్‌రెడ్డి తాను చేపట్టిన వన్ చాలెంజ్ ద్వారా హైదరాబాద్‌లోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్న కట్టెబోయిన అలేఖ్యను బుధవారం కలిసి రూ.50వేలు ఆర్థికసాయం అందజేశారు. సాయం అందిచాలనుకునే వారు: కట్టెబోయిన అలేఖ్య యూనియన్ బ్యాంక్(పెద్దవూర బ్రాంచ్) A/C NO: 194612120000001 IFSC CODE:UBIN 0819468 -
ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న మరణం అటు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కడవరకు తోడుంటాడనుకుంటే ఇలా అర్థంతరంగా తనువు చాలించడంతో అలేఖ్య రెడ్డి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అప్పటి నుంచి భర్తను తలుచుకుంటూ అతనితో ఉన్న ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది అలేఖ్యా రెడ్డి. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ''ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే!.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళావు. వాటితో నేను ముందుకు వెళతాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను'' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్యా రెడ్డి. ఇక మరొక పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోను, తన కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ.. వీళ్లే తన స్టార్స్ అంటూ పేర్కొంది. కాగా నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. చదవండి: మెసేజ్ చేసినందుకు నేరుగా ఇంటికి వెళ్లిన డైరెక్టర్ View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
భర్తను తలుచుకొని ఎమోషనల్ అయిన తారకరత్న భార్య
నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన చిన్నవయసులోనే అర్థాంతరంగా తనువు చాలించడం కలిచివేస్తుంది. తారకరత్న చనిపోయి సుమారు 2నెలలు కావొస్తున్నా ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి తారకతరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా మరోసారి భర్తను తలుచుకుంటూ అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో తారకరత్న గడిపిన క్యూట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ.. నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నా అంటూ ఇన్‌స్టాలో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు.. మాకే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా జనవరి 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
తండ్రి ఫొటో పట్టుకుని తారకరత్న కొడుకు అలా.. అలేఖ్య పోస్ట్ వైరల్
దివంగత నటుడు నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరైంది. భర్త మరణాంతరం అలేఖ్య ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తరచూ ఎమోషనల్ పోస్ట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ అంతేకాదు వారి పెద్ద కూతురు నిష్క కూడా తండ్రిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంది. తండ్రితో ఉన్న జ్ఞాపకాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరో పోస్ట్ చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో పెద్ద కూతురు నిష్క గురించి ప్రస్తావించే ఆమె తాజాగా తనయుడు ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ఇందులో ఆమె కొడుకు తాన్యారామ్ తారకరత్న ఫొటో పట్టుకుని కనిపించాడు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ ఇక దీనికి అలేఖ్య ‘పెద్దయ్యాక నాన్నలా అవుతాను’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. తాన్యారామ్ తండ్రి ఫొటోను పట్టుకుని ఉన్న ఈ ఫొటో కన్నీళ్లు తెప్పిస్తుంది. అలా చూసి అందరి హృదయాలు బరువెక్కుతున్నాయి. అలా తారకరత్న కొడుకు కాగా తారకరత్నా, అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. పెద్దలను ఎదరించి వీరు ఒక్కటయ్యారు. అది నచ్చని నందమూరి కుటుంబం తారకరత్నా, అలేఖ్యలను దూరం పెట్టారు. అప్పటి నుంచి వేరుగా ఉంటున్న వీరి జీవితంలో తారకరత్న మృతి తీరని విషాదాన్ని నింపింది. -
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి ఇప్పటికే పలుసార్లు భావోద్వేగానికి గురైంది. తారకరత్నను తలుచుకుని ఎమోషనలైంది. ఈ కష్టకాలంలో అన్నీ తానై ముందుండి నడిపించిన వ్యక్తి బాలయ్య. తాజాగా మరోసారి తారకరత్న కుటుంబం పట్ల గొప్ప మనసును చాటుకున్నారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలోని ఓ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టడమే కాకుండా.. పేదలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి స్పందించింది. ఈ మేరకు బాలకృష్ణ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలేఖ్యారెడ్డి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇంతన్నా నేనేమి చెప్పగలను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను. నేను ఏమి చెప్పినా మీరు ముందు తక్కువే అవుతుంది. మీరు బంగారు హృదయం ఉన్న వ్యక్తిల. మీరు నిజంగా ఆ పేరుకు అర్హులు. మీలా మరెవరూ చేయలేరు. మిమ్మల్ని ఓ తండ్రిగా, స్నేహితునిగానే చూశాం. ఇప్పుడు మీలో దేవుణ్ణి చూస్తున్నాం. మీ ప్రేమతో నాకు మాటలు రావడం లేదు. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన బాలకృష్ణ అభిమానులు దేవుడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే బాలకృష్ణ బాలయ్య చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే.. కష్టసుఖాల్లో కొండంత అండగా నిలబడిన అన్నీ తానై నడిపించారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యా రెడ్డి. ప్రస్తుతం బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలిపింది. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
పెళ్లి తర్వాత మనపై వివక్ష, జీవితమంతా కష్టాలే: అలేఖ్య
నందమూరి తారకరత్న.. అలేఖ్యా రెడ్డి.. ఇద్దరూ కలిసి జీవించడానికి ఒక యుద్ధమే చేశారు. అన్ని అడ్డంకులను జయించి ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకుని దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారి ప్రేమకు గుర్తుగా కూతురు నిషిక, కవలలు తాన్యారామ్, రేయా జన్మించారు. కానీ తన కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టివేస్తూ ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు తారకరత్న. పిల్లల కోసం కన్నీళ్లు దిగమింగుకుని గుండె నిండా భారంతో క్షణమొక యుగంలా జీవిస్తోంది అలేఖ్య. తారకరత్న మరణించి నేటికి సరిగ్గా నెల రోజులు.. దీంతో తనతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ తను లేని లోటు గురించి బాధపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య. 'నువ్వు మమ్మల్ని వదిలి నేటికి సరిగ్గా నెల రోజులవుతోంది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉన్నాయి. మన పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమ ప్రయాణంలో నేను కొంత బెరుకుగా ఉన్నా నువ్వు మాత్రం మనం కచ్చితంగా కలిసి జీవించబోతున్నామంటూ ఎంతో నమ్మకంగా ఉన్నావు. అప్పటి నుంచి ఆ క్షణం కోసం ఎంతో పోరాడావు. చివరికి మన పెళ్లి జరిగింది. అయినా ఈ వివాహంపై ఒక గందరగోళం. మనపై వివక్ష.. అయినప్పటికీ నువ్వు నా చెంత ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. నిషికమ్మ పుట్టాక మన జీవితమే మారిపోయింది. మన ఆనందం రెట్టింపైంది. కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి. మనపై చిమ్ముతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు మనం కళ్లకు గంతలు కట్టుకుని బతికాం. నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కనేవాడివి. 2019లో కవలల జననంతో నీ కల నిజమైంది. నీ చివరి శ్వాస వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ గుండెలో ఉన్న బాధ ఎవరికీ అర్థం కాలేదు సరికదా కనీసం దాన్ని పట్టించుకోలేదు కూడా! మనకు బాగా కావాల్సినవాళ్లే మన మనసుకు పదేపదే గాయం చేస్తే దాన్ని భరించలేము. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. మన ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు సపోర్ట్‌గా ఉన్నవారిని కూడా మనం చాలాకాలం క్రితమే కోల్పోయాం.. తర్వాత నిన్ను కూడా కోల్పోయాం.. నువ్వు రియల్ హీరో.. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న మరణించి సుమారు నెల రోజులు కావొస్తుంది. ఇంకా ఆయన లేరన్న విషయాన్ని అభిమానులు, కుటుంసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న మరణంతో ఆయన బార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. తాజాగా బాలయ్య చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ''మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన. కష్టసుఖాల్లో మాకు రాయిలా కొండంత అండగా నిలబడిన వ్యక్తి. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు తండ్రిలా, నీ బెడ్ పక్కనే కూర్చొని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా,నువ్వు రియాక్ట్ అవుతామో అని, నిన్ను నవ్వించడం కోసం జోక్స్ వేస్తూ సరదాగా కనిపించి, ఎవరూ లేని సమయంలో నీకోసం కన్నీరు పెట్టుకున్నారు. చివరి క్షణం వరకు నీకోసం చాలా చేశారు. ఓబు(తారకరత్న ముద్దు పేరు)నువ్వు ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం'' అంటూ అలేఖ్యరెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో బాలయ్య ఉన్న ఫోటోకు తారకరత్నను యాడ్ చేసి ఎవరో ఆ పిక్‌ను అలేఖ్య రెడ్డికి పంపగా, ఇది ఎంతో బాగుందంటూ అలేఖ్య పేర్కొంది. కాగా బాలయ్యకు తారకరత్న అంటే ఎంతో ఇష్టం. గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకెళ్లిన దగ్గర్నుంచి అతని కట్టెకాలే వరకు ఆ కుటుంబానికి బాలయ్య పెద్దదిక్కులా నిలిచాడు. అంతేకాకుండా తారకతర్న-అలేఖ్యరెడ్డిల ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా బాలయ్య వాళ్లకు తోడులా ఉండి భరోసా ఇచ్చినట్లు తారకరత్న గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
నిన్ను చాలా మిస్సవుతున్నా చిన్నమ్మ.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మరణంతో భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తారకరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫోటోను పంచుకున్నారు అలేఖ్యా రెడ్డి. అలాగే తారతరత్న పెద్దకర్మ సందర్భంగా భర్త రాసిన వాలెంటైన్స్ డే నోట్‌ను షేర్ చేసి ఎమోషనలయ్యారు. అయితే తాజాగా తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. నిషిక రాస్తూ.. 'అమ్మా నువ్వు చాలా బాధలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే.. నేను నీకు గుడ్ బై చెప్తా' అంటూ రాసింది. తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ చూస్తే అమ్మపై ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిషిక రాసిన నోట్‌ను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. నిన్ను చాలా మిస్సవుతున్నానంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. -
నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. తారకరత్న లేఖ
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అటు అభిమానులతో పాటు తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి విషాదంలో మునిగిపోయింది . పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత నిరాశకు లోనైంది. ఇటీవలే తారకరత్నతో చివరిసారిగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు అలేఖ్య రెడ్డి. అయితే గురువారం మార్చి 2, 2023న తారకరత్న పెద్దకర్మ హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరత్న రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. వాలైంటెన్స్ డే సందర్భంగా అలేఖ్యను తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు. నా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని లేఖలో పేర్కొన్నారు తారకరత్న. నా జీవితంలో నువ్వే నా ప్రపంచం బంగారు అని రాశారు. ఇవాళ తారకరత్న పెద్దకర్మ సందర్భంగా ఆ లేఖను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ లేఖ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఆ లేఖతో పాటు తారకరత్నకు ముద్దు పెడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఏది ఏమైనా భార్య, భర్తల మధ్య అనుబంధం ఎంత గొప్పదో ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో లేఖను షేర్ చేస్తూ ..'మన జీవితంలో అన్ని ఒడిదుడుకులు చూశాం. చాలా కష్టాలు పడ్డాం. జీవితంలో అత్యంత కష్టకాలం అనుభవించాం. మన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. మంచి రోజుల కోసం ఎదురు చూశాం. మనిద్దరం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నీ జీవితంలో పడిన కష్టాలు ఎవరికీ తెలియదు. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంతా నీలోనే దాచి.. మాకు అపారమైన ప్రేమను అందించావు. ప్రపంచం ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు మా చుట్టే ఉన్నావు. నేను మరింత ఎత్తుకు ఎదుగుతా నానా. ఈ రోజు నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాం నానా' అంటూ ఎమోషనల్ అయ్యారు అలేఖ్య రెడ్డి. ఏది ఏమైనా దేవుడు ఆ కుటుంబానికి మరింత ధైర్యం ప్రసాదించాలని తారకరత్న అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
ఇదే చివరిదంటే నమ్మలేకపోతున్నా.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇటీవలే తారకరత్న చిన్నకర్మ కూడా నిర్వహించారు కుటుంబసభ్యులు. తాజాగా అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో తారకరత్న, పిల్లలు ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇదే మా చివరి ఫోటో, చివరి ప్రయాణం అని నమ్మడం నా హృదయం పగిలినట్లు ఉంది. ఇదంతా ఒక కల అవ్వాలని కోరుకుంటున్నా. నన్ను "అమ్మా బంగారు" అని పిలిచే మీ స్వరం మరోసారి వినాలని ఉంది.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది చూసిన తారకరత్న అభిమానులు ఆమె మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఆయన మీ భౌతికంగా మీ వెంట లేకపోయినా.. ఎప్పటికీ మీతోనే ఉంటారని ధైర్యం చెబుతున్నారు. ఇప్పటి నుంచి మీరు చాలా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 22 తారకరత్న బర్త్‌డే సందర్భంగా కూడా అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన పెద్దకర్మను మార్చి 2న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
ఎన్నో పోరాటాలు, మన లైఫ్ అంత సాఫీగా ఏం సాగలేదు: అలేఖ్య
జీవితాంతం తోడుండాల్సిన భర్త అర్ధాంతరంగా తనువు చాలిస్తే ఏ భార్య తట్టుకుంటుంది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ మహిళ మనసు ఎంత తల్లడిల్లుతుంది? భర్తే సర్వస్వమనుకున్న అలేఖ్యా రెడ్డిని నందమూరి తారకరత్న అకాల మరణం అశనిపాతంలా తాకింది. తను లేని జీవితాన్ని ఊహించుకోలేక కుమిలికుమిలి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. తాజాగా భర్తపై ఉన్న ప్రేమను బయటపెడుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య. 'జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేశాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వు ఒక వారియర్ నాన్నా.. నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవ్వరూ చూపించలేరు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్న చేయి పట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది. దీనిపై అలేఖ్య స్నేహితురాలు స్పందిస్తూ.. 'మీరెన్ని కష్టాలు పడ్డారో అతి కొద్దిమందికే తెలుసు. ఎంత పోరాడాలో అంతవరకు పోరాడారు. కానీ ఆ దేవుడు కొన్నిసార్లు దయ లేనివాడిగా వ్యవహరిస్తాడు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. ఎల్లప్పుడూ నీవెంటే ఉంటాను అల్లూ' అని రాసుకొచ్చింది. మిగతా నెటిజన్లు సైతం 'మేమంతా మీకున్నాం అక్కా, ధైర్యంగా ఉండండి' అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) చదవండి: శ్రీదేవి లవ్ స్టోరీ తెలుసా? -
తారకరత్న బర్త్ డే.. అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి తీవ్రం విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత కృంగిపోయింది. ఫిబ్రవరి 22 తారకరత్న బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 22 తారకరత్న 40వ పుట్టినరోజు. ఆయన బర్త్ డే సందర్భంగా.. తారకరత్న తన కూతురు నిష్కతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆయన భార్య అలేఖ్యా రెడ్డి. నా జీవితంలో ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే.. నిన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అలేఖ్యా రెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు మిస్ యూ తారకరత్న అన్న పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
తారకరత్న మృతితో అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడిలో ఉంది: విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక, తారకరత్న మరణంపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తారకరత్న మరణం ఎంతో బాధించిందన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి తారకరత్న. 39 ఏళ్ల వయస్సులోనే తారకరత్న అకాల మరణం చెందడం చాలా బాధకరం. ఆయన మరణం ఎంతో బాధించింది. తారకరత్న మరణంతో అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడికి లోనవుతోంది. రేపు(సోమవారం) ఉదయం 10 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు తారకరత్న భౌతికకాయం తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగుతాయని తెలిపారు. -
తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం
తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను అటు కుటుంసభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడం కలచివేస్తుంది. గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న 23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అజాత శత్రువుగా, ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న తారకరత్న మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా తారకరత్నది ప్రేమ వివాహం.ఆయన నటించిన నందీశ్వరుడికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన అలేఖ్యతో ఆయన ప్రేమలో పడ్డారు.అయితే అలేఖ్యకు ఇదివరకే పెళ్లై విడాకులు తీసుకోవడంతో వీరి పెళ్లికి కుటుంసభ్యులు ఒప్పుకోలేదు. అయినా వెనక్కు తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో తనను పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటగా కుమార్తె పుట్టగా నిషిక అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి. మరొకరు అమ్మాయి. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. వీరి పేర్లలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలు NTR (Nishka, Tanayram, Reya)ఎన్టీఆర్ అని వచ్చే విధంగా పిల్లలకు పేర్లు పెట్టారు. -
తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత..
నందమూరి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి అస్వస్థత్రకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య నీరసంగా ఉందని తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చిన్న వయసులోనే ఇలా దూరం కావడం అలేఖ్య జీర్ణించుకోలేకపోతుందని కుటుంస సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అలేఖ్యా రెడ్డి తీవ్ర మానసికి ఒత్తిడికి గురవుతుందని, తిరిగి మామూలు మనిషి కావడానికి సమయం పడుతుందని తెలిపారు. కాగా గత 27న తీవ్ర గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరిన తారకరత్న గతరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన్ను బతికించేందుకు విదేశీ వైద్యులను సైతం రప్పించి చికిత్స అందించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలేవీ ఫలించలేదు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అయితే తారకరత్నను ఆసుపత్రిలో చేర్పించిన మొదటి రోజు నుంచే భార్య అలేఖ్యా రెడ్డి అతనితోనే ఉన్నారు. భర్త ఆరోగ్యం కోసం ఆమె నిత్యం పూజలు చేసేవారట. ఈ క్రమంలో తారకరత్న మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. -
తారకరత్న భౌతికకాయం చూసి వెక్కివెక్కి ఏడ్చిన కూతురు
నటుడు తారకరత్న మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బెంగళూరు నుంచి నిన్న(శనివారం)రాత్రే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అయితే తన తండ్రిని అలా చలనం లేకుండా ఉండడాన్ని చూసి తారకరత్న కూతురు నిషిక వెక్కివెక్కి ఏడ్చింది. తన తండ్రి ఇక రాడని తెలిసి గుండెలు పగిలేలా రోదించింది. ఈ క్రమంలో కూతుర్ని ఓదార్చుతూ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సైతం కన్నీటి పర్యంతం అవడాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ కుటుంబానికి దేవుడు తీరని లోటు మిగిల్చాడని, ఈ బాధను తట్టుకునే శక్తిని వారికి ఆ భగవంతుడు కల్పించాలని ప్రార్థిస్తున్నారు. -
అమ్మ తపనే ఆయువై..
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): సముద్ర కెరటాలకు కొట్టుకుపోయిన బాలిక మృత్యువును జయించింది. ఒడిశాలోని రాయగడకు చెందిన ఓ కుటుంబం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు వచ్చింది. ఆ కుటుంబంలోని తొమ్మిదేళ్ల బాలిక అలేఖ్య సముద్రంలోకి దిగి కేరింతలు కొడుతుండగా కెరటాలకు కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు గమనించి మునిగిపోయిన బాలికను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే బాలిక నీళ్లు తాగి స్పృహ కోల్పోయింది. నోటి వెంట నురగలు వచ్చాయి. దీంతో బాలికను చూసి ఆమె తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. ఇంతలో స్థానిక యువకులు బాలికకు ప్రథమ చికిత్స చేశారు. కడుపు, ఛాతీ మీద గట్టిగా రుద్దినా చిన్నారిలో కదలిక రాలేదు. బాలిక తల్లి గట్టిగా హత్తుకున్న క్రమంలో ఒక్కసారిగా స్పృహ రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. వెంటనే చికిత్స నిమిత్తం బాలికను కేజీహెచ్‌కు తరలించారు. తమ కంటిపాపను కాపాడిన స్థానికులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలని.. వరుడికి వాట్సాప్‌లో ఫొటోలు పంపిన ప్రియుడు, దాంతో
ద్వారకాతిరుమల: ప్రియురాలి వివాహాన్ని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపాడు ఆమె ప్రియుడు. దీంతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకోగా బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జాజులకుంటకు చెందిన బత్తుల అలేఖ్య (24) ఇంటి వద్ద ఉంటూ ప్రైవేట్‌గా చదువుతోంది. రెండేళ్ల క్రితం ఆమె డీఎడ్ చదువుతుండగా నల్లజర్లకు చెందిన కారు డ్రైవర్ బైపే రవితేజతో ప్రేమలో పడింది. ఇంట్లో విషయం తెలవడంతో ఈనెల 1న కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ముంగమూరి బుచ్చిబాబుతో ఆమె పెళ్లి కుదిర్చారు. ఈనెల 4న నిశ్చితార్థ వేడుక జరగ్గా, (ఈనెల 8న) బుధవారం భోజనాలు, 9న గురువారం వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన ప్రియుడు రవితేజ ఆమె వివాహాన్ని చెడగొట్టాలని భావించి తనతో అలేఖ్య సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను అతడి స్నేహితుడు మరై సునీల్ సెల్‌ఫోన్ నుంచి పెళ్లికొడుకు ఫోన్‌కు వాట్సాప్ ద్వారా ఈనెల 7న పంపాడు. దీంతో మనస్తాపం చెందిన అలేఖ్య ఇంట్లోని బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు గుర్తించి తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రవితేజ, సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు. -
ప్రయాణం
‘‘బాబూ.. కారు ఆపు...’’ దాదాపు అరిచినంత పనిచేశాడు సృజన్. ఆ కేకకు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచింది అలేఖ్య. సడెన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. ‘‘వాట్ హ్యాపెండ్ సృజన్’’ గాబరాగా అడిగింది. ఆ మాట వినిపించుకోకుండానే.. ‘‘కాస్త వెనక్కి పోనియ్’’ చెప్పాడు డ్రైవర్‌కి. మెల్లగా రివర్స్ పోనిచ్చాడు డ్రైవర్. ‘‘ఆ..ఆ...స్టాప్.. స్టాప్. ఇక్కడ ఆపు’’ సృజన్.కారు ఇంకా పూర్తిగా ఆగకముందే హడావిడిగా డోర్ తెరుచుకుని దిగేశాడు. విస్తుపోతోంది అలేఖ్య భర్త ప్రవర్తన చూసి. కారు ఆగాక తనూ దిగింది. కారుకు రెండు అడుగుల దూరంలో ఉన్న ఓ వ్యక్తి వైపు పరిగెత్తాడు సృజన్. ‘‘నమస్కారం సర్..’’ అన్నాడు.ఆ వృద్ధుడు వణుకుతున్న చేతిని నుదుటికి అడ్డం పెట్టుకుంటూ పరీక్షగా చూశాడు సృజన్‌ను. ‘‘సర్.. నేను.. సృజన్‌ను. సాయిలు చిన్న కొడుకును’’ అతనికి జ్ఞప్తికి తెప్పించే ప్రయత్నం చేశాడు.‘‘ఏ సాయిలు? పెద్ది సాయిలా?’’ సృజన్‌ను పరీక్షగా చూస్తూ అన్నాడు ఆ పెద్ద మనిషి. ‘‘ఆ... అవును సర్. పెద్ది సాయిలు కొడుకునే..’’ వినమ్రంగా చెప్పాడు ‘‘కెనడాలో ఉంటున్నావట కదా..?’’ పెద్ద మనిషి.ఎండ మండిపోతోంది. అలేఖ్యకు చిరాగ్గా ఉంది. ‘‘సృజన్...’’ పిలిచింది. ఆమె వైపు తిరిగి ‘‘ఇటు రా’’ అన్నట్టు సైగ చేసి.. ‘‘అవును సర్.. కెనడాలో ఉంటున్నాను. ఆరేళ్లవుతోంది’’ అన్నాడు. ఈలోపే అలేఖ్యవాళ్లను చేరింది. ‘‘సర్.. అలేఖ్య.. నా భార్య’’ అంటూ ఆమెను పరిచయం చేశాడు. ‘‘నమస్తే’’ చెప్పింది అలేఖ్య ముభావంగానే. ‘‘నమస్తే బేటా..’’ వృద్ధుడు. ‘‘ఓకే..’’ అని చిన్నగా ఆమెతో చెప్పి.. ‘‘సర్.. ఎండలో ఇలా నిలబడ్డారు..’’ అడిగాడు సృజన్. ‘‘బంధువులదేదో పంచాయితీ ఉంటే.. రామాయంపేట్ వచ్చినా.. ఇప్పుడు ఇక్కడి నుంచి సదాశివ్నగర్వెళ్లాలే.చుట్టపాయన దింపిండు ఇక్కడ బస్దొరుకుతదని. ఒక్క బస్ ఆప్తలేరు బాబూ’’ అన్నాడు నీరసంగా వృద్ధుడు.‘‘రండి.. సర్.. మేం నిజామాబాద్ పోతున్నాం. దార్లోనే కదా.. సదాశివ్ నగర్లో దింపుతాం’’ అన్నాడు సృజన్. ‘‘మీకు ఇబ్బందేం లేదు కదా..’’ అన్నాడు. ‘‘అయ్యో.. ఏం లేదు సర్ రండి’’ అంటూ అతని బ్యాగ్ భుజాన వేసుకొని నడిపించుకుంటూ కారు దగ్గరకు తీసుకొచ్చాడు సృజన్. వెనకాలే అలేఖ్య. అయిష్టంగా. సృజన్ ఏం చెప్పబోతున్నాడో అర్థమై ముందు సీట్లో కూర్చుంది. వెనక సీట్లో ఆ వృద్ధుడు, సృజన్ కూర్చున్నారు. కారు స్టార్ట్ అయింది. సృజన్ బాల్య జ్ఞాపకాల వాక్ప్రవాహమూ మొదలైంది. ‘‘సర్.. మీరు అప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉండేవారు?! మీ వల్లే మా జనరేషన్ అంతా అవేర్ అయింది’’ అని ఆ వృద్ధుడితో అని వెంటనే ముందు సీట్లో ఉన్న అలేఖ్య భుజం మీద తడుతూ ‘‘అలేఖ్యా.. నీకుతెల్సా.. మాయలు, మంత్రాలు, చేతబడులు లేవని అవన్నీ మ్యాజిక్ ట్రిక్స్ అని మా ఊళ్లో వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సర్.. ఎవ్రీ సండే పంచాయితీ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ షో చేసేవారు’’ అంటూ ఉత్సాహంగా చెప్తున్నాడు సృజన్. మొహమాటానికి నవ్వుతూ వింటోంది అలేఖ్య. సృజన్ తనకు పరిచయమైన నాలుగేళ్లలో ఈ విషయాలను లక్షాతొంభైసార్లు విన్నది. ఇప్పుడు లక్షాతొంభై ఒకటవ సారి వింటోంది. కాకపోతే సృజన్ ఎడ్మైర్ చేసే వ్యక్తి సమక్షంలో. తన భర్త ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నాడంటే.. ఆ సర్ గురించి తనకు ఎన్నోమార్లు చెప్పిన విషయాన్ని ఇప్పుడు పరిచయంలో యాది మరిచిపోయేంతగా. సృజన్ మళ్లీ ఆ పెద్ద మనిషి వైపు తిరిగి.. ‘‘సర్.. మీకు గుర్తుందా? ఊర్లో సన్న మల్లేశం వాళ్ల అమ్మకు దయ్యం పట్టిందని అందరూ అంటే.. దయ్యాల్లేవ్.. భూతాల్లేవ్... కావాలంటే చూడండి.. నేను ఈ రాత్రికి శ్మశానంలో పడుకుంటా.. అని చాలెంజ్ చేసి మరీ మీరు ఆ రాత్రి శ్మశానంలో పడుకున్నారు. ఊరు ఊరంతా భయపడ్డది.. రాత్రికిరాత్రే మీకు ఏదో అయిపోతుందని. తెల్లవారి మీరు ఊళ్లోకి వచ్చి పంచాయితీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడితే కూడా భయపడి ఎవ్వరూ రాలే. తర్వాత మీరే అందరి ఇళ్లకు పోయి.. దయ్యాల్లేవ్ ఏమి లేవు. రాత్రి నేను శ్మశానంలో నిక్షేపంగా పడుకొని వచ్చా.. ఆరోగ్యంగా ఉన్నా’’అని చెప్పారు... గుర్తుందా సర్!! సర్.. నిజంగా మీరు గ్రేట్. మీరంటే నాకెంత ఇన్సిపిరేషనో.. చెప్పలేను’’ సృజన్ కళ్లల్లో ఆ పెద్దాయన పట్ల ఆరాధన.. మాటల్లో గౌరవం పొంగిపొర్లుతున్నాయి. ఇదంతా ఆ పెద్దాయనకూ ఇబ్బందిగానే ఉంది. అందుకే సృజన్ వాగ్ధాటికి అడ్డుకట్ట వేస్తూ.. ‘‘ఇప్పుడు నా గురించి ఎందుకులే కానీ.. నీ గురించి చెప్పు సృజన్. కెనడాలో ఏం చేస్తున్నావ్?’’ అడిగాడు.‘‘రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను.. సర్.. నాకు సైన్స్ మీద ఇష్టం పెరగడానిక్కూడా మీరే కారణం.. ’’ మళ్లీ అభిమానం కురిపించబోయాడు.‘‘సరే..సరే గానీ.. పెళ్లెప్పుడు అయింది? చాలా రోజుల తర్వాత ఇండియా వస్తున్నట్టున్నావ్?’’ పెద్దాయన.‘‘అవున్సార్. కెనడా వెళ్లినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైమ్ రావడం. సర్.. నాది లవ్‌మ్యారేజ్. పెళ్లై వన్ ఇయర్ అవుతోంది. పేరెంట్స్ ఒప్పుకోక.. ఇంటికి రాలేదు. ఇప్పుడిప్పుడే మాటలు కలిశాయి. అందుకే అమ్మవాళ్లను కలవడానికి వస్తున్నాం..’’ అన్నాడు. అలేఖ్య వెనక్కి తిరిగి ఆ పెద్దాయనను చూసి మర్యాదపూర్వకంగా నవ్వింది. ‘‘బాగుంది సృజన్.. మీ జంట.. నా ఆశీర్వాదాలు..’’ అన్నాడు ఆ పెద్దాయన సృజన్ భుజమ్మీద చేయి వేస్తూ. ‘‘సృజన్.. సదాశివనగర్ బోర్డ్ ...’’ మాటల్లో పడి అసలు విషయం మరిచిపోయిన భర్తకు గుర్తుచేసింది ఆ బోర్డ్‌ను చూపిస్తూ. ‘‘ఆ.. కొంచెం.. ముందుకు పోయాక ఆపయ్యా...’’ డ్రైవర్‌కు చెప్పాడు పెద్దాయన. ‘‘అయ్యో.. రోడ్డు మీదెందుకు సర్.. ఎక్కడికి వెళ్లాలో చెప్తే అక్కడే దింపేస్తాం..’’ అన్నాడు సృజన్. ‘‘పర్లేదు.. ఇక్కడి నుంచి దగ్గరేనడుస్తూ వెళ్లిపోతా’’ నిశ్చయంగా చెప్పాడు తర్వాత వాదనకు తావివ్వకుండా పెద్ద మనిషి. మాటల్లో గమ్యం రానే వచ్చింది. పెద్ద మనిషి దిగాడు. సెండాఫ్ ఇవ్వడానికి సృజన్, అలేఖ్యా కూడా దిగారు.ఆయన వెనుతిరగగానే ఇద్దరూ వెనక సీట్లో సర్దుకున్నారు. కారు దూసుకెళ్లింది. అలేఖ్యను ఆప్యాయంగానే ఆహ్వానించారు సృజన్ కుటుంబ సభ్యులు. స్నానాలు.. భోజనాలు అన్నీ అయ్యాయి. కెనడా నుంచి తెచ్చిన కానుకలు ఒకొక్కటే ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇస్తున్నారు అలేఖ్య, సృజన్‌లు. వాటిల్లో అందమైన ఓ చేతి కర్ర కూడా ఉంది. అది తీస్తుండగా.. సృజన్ తండ్రి అన్నాడు.. ‘‘ఒరేయ్.. నేనింకా అంత ముసలాణ్ణి కాలేదురా.. చేతికర్ర ఊతం పట్టుకోడానికి?’’ అని. ‘‘అయ్యో.. నాన్నా.. ఇది మీకోసం కాదు. శంకర్ సర్ కోసం తెచ్చా!’’ అన్నాడు సృజన్. ‘‘ఏదీ.. సైన్స్ శంకర్ సర్ ఆ...ఆ..’’ సందేహం నివృత్తి చేసుకోవడానికి అడిగాడు సృజన్ తండ్రి. ‘‘అవున్నాన్నా.. మాకు రామాయంపేట్ దగ్గర కనిపిస్తే.. మేమే కార్లో తీసుకొచ్చాం.. సదాశివనగర్ దాకా. ఏదో పనుందని అక్కడ దిగిపోయిండు..’’ అన్నాడు సృజన్ ఆ కర్రను అటూ ఇటూ తిప్పిఅభిమానంగాచూసుకుంటూ.ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ‘‘ఏ శంకర్ సర్? శ్మశానంలో పడుకునే శంకర్ సర్ గురించే కదా నువ్ చెప్తుంది?’’ సృజన్ తండ్రి విస్మయంగా. ‘అవున్నాన్నా.. ఎందుకట్ల అడుగుతున్నారు?’’ వాళ్ల తీరు వింతంగా అనిపించింది సృజన్‌కు. ‘‘ఒరేయ్.. ఆయన చనిపోయి రెండేళ్లవుతోంది.. ఎవర్ని చూసి ఎవరు అనుకున్నావో..?’’ సృజన్ వాళ్లమ్మ. ఆ మాటకు సృజన్ చేతిలోంచి కర్రజారి కిందపడింది. చేష్టలుడిగి చూస్తోందిఅలేఖ్య భయంగా! - సరస్వతి రమ -
అదే మా సక్సెస్
‘‘అక్కడొకడుంటాడు’ చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్లు సాధారణంగా ఉన్నా మౌత్ టాక్‌తో ఆదివారం నుంచి కలెక్షన్లు బాగా పెరిగాయి. ‘భారతీయుడు, అపరిచితుడు’ చిత్రాల కోవలో మా సినిమాలో అండర్ కరెంట్‌గా డ్రంకన్ డ్రైవ్ పైన సందేశం ఉంటుంది. ఇది పూర్తి కమర్షియల్ చిత్రం. నిర్మాత సి.కల్యాణ్‌గారి వల్లే మాకు మంచి థియేటర్లు లభించాయి’’ అని శివ కంఠంనేని అన్నారు. రామ్ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘కొత్తదనానికి పట్టం కడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిది. చివరి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తోంది. మేము అనుకున్నట్టు ప్రేక్షకులకు చేరువయ్యాం’’ అన్నారు. ‘‘సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను కూర్చోబెడుతోంది. అదే మా సక్సెస్’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక, డిస్ట్రిబ్యూటర్ దాసరి శ్రీనివాస్, చిత్ర నిర్వాహకులు ఘంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎక్కడుంటాడు?
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్ కార్తీక్, శివ హరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరో, హీరోయిన్లుగా, రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ ఈ చిత్రం ఆడియో సీడీలను విడుదల చేసి, నిర్మాత సి. కల్యాణ్‌కి ఇచ్చారు. ‘‘అక్కడొకడుంటాడు.. ఎక్కడుంటాడు? ఎందుకుంటాడు? అనే విషయం సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అని శివ కంఠంనేని అన్నారు. ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు శ్రీపాద విశ్వక్. ‘‘పైరసీలో కాకుండా థియేటర్లో చూస్తేనే మా సినిమా సాంకేతికంగా ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. ‘అల్లరి’ రవిబాబు మాట్లాడారు. -
ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది
శివ కంఠమనేని టైటిల్ రోల్లో రామ్ కార్తీక్, రసజ్ఞ, శివ హరీశ్, అలేఖ్య హీరో హీరోయిన్లుగా శ్రీపాద విశ్వక్ తెరకెక్కించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ –‘‘టైటిల్‌లానే సినిమా కూడా వెరైటీగా ఉంటుంది. ప్రతి సన్నివేశం, ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది. పెళ్లి కావాల్సిన ఓ ప్రేమ జంట అనుకోకుండా యాక్సిడెంట్లో చిక్కుకుని అందులో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అడవిలోకి ప్రవేశిస్తారు. అక్కడ నా పాత్ర ప్రవేశిస్తుంది. నాకు, వాళ్లకూ మధ్య ఏం జరిగింది అన్నది కథ. నేను అంధుడి పాత్రలో కనిపిస్తా’’ అన్నారు. ‘‘30 ఏళ్ల నుంచి సినిమాతో అనుబంధం ఉంది. ప్రతి శుక్రవారం పేపర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ కాన్సెప్ట్ మీద సినిమా తీశాం. క్వాలిటీగా తీశాం. మా సినిమా చూసి నచ్చడంతో రిలీజ్ విషయంలో నిర్మాత సి. కల్యాణ్‌గారు సహకారం అందించారు’’ అన్నారు రావుల వెంకటేశ్వరరావు. -
స్నేహితుల సాయంతో...
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె. శివశంకర్ రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. శ్రీపాద విశ్వక్ దర్శకుడు. రామ్ కార్తీక్, శివ హరీశ్, అలేఖ్య, రసజ్ఞ దీపికా హీరో, హీరోయిన్లు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రముఖ హీరో నాగశౌర్య విడుదల చేయగా, ఈ చిత్రంలోని ‘ఆడి పాడి గడిపేద్దాం..’ అనే పాటను ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు విడుదల చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి’’ అన్నారు నాగశౌర్య. ‘‘టైటిల్ పాత్రలో శివ కంఠంనేని బాగా ఒదిగిపోయారు’’ అన్నారు కేయస్ రామారావు. ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే అనర్థాలను మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు శివ కంఠంనేని. శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. ఆ ప్రేమ జంట ఎలా బయటపడుతుందనే అంశంతో లె రకెక్కిన చిత్రమిది. త్వరలోనే సినిమాలోని అన్ని పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. -
అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు!
రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞదీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. ‘అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు...’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘డ్రంకన్ డ్రైవ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా నేను చూశా. మంచి సందేశం ఉంది. శివ కంఠంనేని సీనియర్ నటుల కోవలో తన పాత్రలో ఒదిగిపోయాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా నేను కూడా చూశా. కొత్త నిర్మాతలు తీశారనే భావన ఎక్కడా కలగదు. పేరెంట్స్‌తో పాటు యువత చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు అశోక్ కుమార్. ‘‘మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులను కదలనివ్వకుండా కూర్చోబెట్టే చిత్రమిది’’ అన్నారు శివ కంఠంనేని. ‘‘ఈ నెలాఖరులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీపాద విశ్వక్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహనిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి. -
మద్యం తాగి వాహనాలు నడిపితే?
శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞ దీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సందేశాత్మకంగా మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రేక్షకులకు ప్రతిక్షణం ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది’’ అన్నారు. ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో ప్రమాదం ఎదురవుతుంది. దాని నుంచి ఆ ప్రేమజంట ఎలా బయటపడ్డారన్నదే చిత్ర ప్రధానాంశం’’ అని శ్రీపాద విశ్వక్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహ నిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి. -
కామెడీ సోడా
మానస్, కారుణ్య, మహిమా అలేఖ్య ముఖ్య తారలుగా హరిబాబు మల్లూరి దర్శకత్వంలో ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మించనున్న ‘సోడా గోలీసోడా’ ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత సత్య సింధూజ క్లాప్ ఇవ్వగా, స్వామిగౌడ్ కెమేరా సిచ్చాన్ చేశారు. నటుడు శివాజీరాజా గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సమాజంలో పరిస్థితులను ఆవిష్కరించే సందేశాత్మక చిత్రమిది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం. పాలకొల్లు, హైదరాబాద్‌లలో టాకీ, అవుట్ డోర్లో సాంగ్స్ షూటింగ్ చేస్తాం’’ అన్నారు హరిబాబు మల్లూరి. ‘‘మంచి చిత్రాలు అందించాలనే సంకల్పంతో నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నం ఈ సినిమా’’ అన్నారు సత్య సింధూజ. నిర్మాత రాజ్ కందుకూరి, మానస్ తల్లి పద్మిని తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలకు వెళ్లమన్నందుకు..
పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని తల్లి మందలించడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం రామ్‌నగర్‌లో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అలేఖ్య ఈ రోజు పాఠశాలకు వెళ్లకపోవడంతో.. తల్లి ఎందుకు వెళ్లలేదని మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి మంటలతో పాటు కేకలు రావడం గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కాలేజీ భవనంపై నుంచి దూకిన విద్యార్థిని
కాలేజీ హాస్టల్ భవనంపై దూకడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని దర్పల్లి మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన అలేఖ్య నిజామాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లోఉంటోంది. మంగళవారం ఉదయం ఆమె హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు చికిత్సనందిస్తున్నారు. కాగా, హాస్టల్ భవనంలోని మెట్లపై నుంచి అలేఖ్య జారి పడిపోయిందని కళాశాలవారు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినే దూకినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఓ లెక్చరర్ వేధింపులు కారణమని కొందరు విద్యార్థులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల అదుపులో అలేఖ్య
* పోలీసుల కళ్లుగప్పి కెనడాకువెళ్లే ప్రయత్నం * చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు శాఖ * ఆమెతో పాటు తల్లిదండ్రుల అరెస్టు చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బీమా కంపెనీలో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన అకౌంటెంట్ అలేఖ్య(24)ను పోలీసులు పట్టుకున్నారు. పది మందికి పైగా బీమా సొమ్ము చెల్లించిన వారి నుంచి రూ.31 లక్షలు కాజేసిన విషయంపై బ్రాంచ్ మేనేజరు శ్రీధర్ మంగళవారం చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటికప్పుడు స్పందించిన సీఐ సూర్యమోహనరావు బుధవారం ఉదయానికే నెల్లూరులోని అలేఖ్య స్వగ్రామానికి చేరుకున్నారు. అలేఖ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు(55), రాజ్యలక్ష్మి (50)లను సైతం అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించి, ఇక్కడ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాతాదారులు చెల్లించే నగదును అలేఖ్య తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా రూ.31 లక్షలు జమ చేసింది. ఏ రోజుకారోజు బ్యాంకు ఖాతాల్లో జమయ్యే నగదును ఆమె తల్లిదండ్రులు విత్‌డ్రా చేసుకునే వాళ్లు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ఐసీఐసీఐ బీమా కంపెనీ ప్రతినిధులు అలేఖ్య తల్లిదండ్రుల ఖాతాల్లో ఉన్న నగదును ఫ్రీజింగ్ చేయాలని నెల్లూరులోని బ్యాంకు అధికారులను కోరడంతో ఖాతాలో ఉన్న రూ.2 లక్షలు మాత్రం ఇటీవల విత్‌డ్రా కాకుండా చేయగలిగారు. అలేఖ్య తండ్రి నెల్లూరు ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. ఇతను కొంత కాలంగా మెడికల్ సెలవులో ఉన్నాడు. నిందితులకు పట్టుకోవడానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. గత నెల 23న ఈ కుంభకోణం వెలుగు చూడడం.. అదే నెల 19నే అలేఖ్య ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. అంటే ముందుగానే ప్రణాళిక రూపొందిం చుకున్నారు. దీనికితోడు అలేఖ్య తన తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మితో కలిసి కెనడా వెళ్లడానికి పాస్‌పోర్టులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పాస్‌పోర్టు రావడం కాస్త ఆలస్యం కావడంతో దానికోసం వేచి చూస్తూ పోలీసులకు దొరికిపోయారు. అలేఖ్య, వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మిపై ఛీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐ సూర్యమోహనరావు వారిని అరెస్టు చేసి, చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. వీళ్లకు 14 రోజుల రిమాండు విధిస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిందితులను చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు. పోలీసులను పలువురు అభినందించారు. -
కావలి చైర్మన్ అలేఖ్యకు హైకోర్టులో షాక్!
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు మారినవారికి ఎదురుదెబ్బలు తప్పడంలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మునిసిపల్ చైర్మన్ అలేఖ్యకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె అనర్హతపై స్టేను హైకోర్టు గురువారం నాడు ఎత్తేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అలేఖ్య.. ఆ తర్వాత పార్టీ మారారు. దాంతో అలేఖ్య చైర్మన్ పదవికి అనర్హురాలంటూ కావలి ఆర్డీవో నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు ఆమె అనర్హతపై ఉన్న స్టేను కోర్టు ఎత్తేసింది. అనర్హత పిటిషన్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. -
ఆభిజాత్యం
సాయంత్రం ఆ నంబరు నుంచి కాల్ వచ్చింది. ఒక్క ఉదుటన ఎత్తింది అలేఖ్య. కానీ మాట్లాడలేదు. ప్రభాత భానుడు తూర్పున తన పయనం ఆరంభించిన చాలాసేపటికి బద్దకంగా లేచింది అలేఖ్య. ఇంతకుముందు ఆమెకు ఈ వెసులుబాటు ఉండేది కాదు. కొడుకును స్కూలుకు తయారుచేసి, భర్తను ఆఫీసుకు పంపడానికి భానుడి కంటే ముందే లేచేది. పక్షం క్రితం భర్త పోవడంతో ఆమె దైనందిన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మొన్న దినం జరిగే నాటివరకూ ఇంటి నిండా అయినవాళ్ల హడావుడికి తోడు పలకరింపులకు వచ్చే పోయే వాళ్లతో సమయం గడిచిపోయేది. ఇప్పుడు గత రెండు రోజులుగా ఆమె, అత్తామామలూ తన కొడుకూ మిగిలారు ఆ ఇంట. ఇంటి పనులు వేగంగా చక్కబెడుతూనే ఓ కన్ను వీధిగుమ్మం మీద వేసి ఉంచింది. ఆమె ఎవరికోసమో ఎదురుచూస్తుంది. భానుడు నడి నెత్తికి చేరాడు. ఆమె ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. మెలకువ వచ్చి గడియారం చూసేసరికి 8 గంటలయ్యింది. పిల్లాడి స్కూలు బస్సు ఇంకో పావుగంటలో వచ్చేస్తుంది. భర్త ఉంటే సెల్‌ఫోనులో అలారం పెట్టి లేపేవాడు. ఆయన టూరుకు వెళ్లాడు. తనను తాను తిట్టుకుంటూ కొడుకును లేపి హడావుడిగా తయారుచేసి, పాలు తాగించి, వీధి చివరి టిఫిన్ సెంటర్లో ఇడ్లీ కట్టించుకు వచ్చేసరికి బస్సు వెళ్లిపోయింది. ఆటోలో వాడిని స్కూలు వద్ద దించి వచ్చి టీవీ పెట్టింది అలేఖ్య. ‘షిర్డీ యాత్రలో విషాదం: అర్ధరాత్రి జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 32 మంది ప్రయాణికుల దుర్మరణం’. వార్తా ఛానళ్లు అన్నీ అదే చూపిస్తున్నాయి. ‘సాయినాథా...’ ఒక్కసారి అనుకొని సినిమా ఛానలు పెట్టుకుంది ఆమె. కొంతసేపటికి ముందుగా అన్న వచ్చాడు. శనివారం సెలవు కావటంతో చూసిపోవటానికి వచ్చాడనుకుంది తను. వెనుక ఇంకొంతమంది బంధువులు, మిత్రులు వచ్చారు. ఏదో మాట్లాడుతున్నారు. మనసు ఏదో కీడు శంకించింది. టీవీలో మృతుల పేర్లు చెపుతున్నారు. తన భర్త పేరు విని మూర్ఛపోయింది అలేఖ్య. ప్రతి నెలలాగే బెంగళూరు హెడ్ ఆఫీసుకు టూర్ వెళుతున్నానన్న ఆయన, షిర్డీ బస్సు ప్రయాణంలో మరణించడం నమ్మబుద్ధి కాలేదు. కానీ శవం వద్ద దొరికిన ఆధారాలతో పోలీసులు మృతి చెందింది సంతోషేనని తేల్చారు. అన్నింటికంటే అశనిపాతం ఏంటంటే ట్రావెల్స్ వారి దగ్గర ఉన్న ప్రయాణికుల వివరాలలో మిస్టర్ అండ్ మిసెస్ అని తన భర్త పేరుమీద రెండు టికెట్లు జారీ చేయబడి ఉండటం! ఆయనతో వెళ్లిన ఆ రెండో మనిషి ఎవరో తెలియలేదు. అర్ధరాత్రి హైదరాబాదుకు చేరిన శవాన్ని తీసుకొని, తమ ఊరు పయనమయ్యింది అలేఖ్య. మూడోనాటి నుంచే ఆ రెండో మనిషి గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది ఆమె. పోలీసులు ప్రమాదం జరిగి తెల్లవారాక చిన్న చిన్న గాయాలతో బయటపడిన వారు తమ తోవ తాము చూసుకున్నారని, అందరి వివరాలు దొరకడం కష్టమన్నారు. భర్త పనిచేసే కంపెనీవాళ్లు ఆనాటి ఆ బస్సులో ఆ సంస్థవారు ఇంకెవ్వరూ ప్రయాణించలేదని తెలిపారు. పరిచయస్తులందరినీ ఎవరితోనైనా చనువుగా ఉండేవారా అని అడిగి చూసింది. ఆఫీసులో కానీ బయట కానీ ఎటువంటి ఆధారమూ దొరకలేదు. సామాజిక నెట్‌వర్క్‌లలో అతని ఎకౌంట్లు వెదికితే, బాల్యమిత్రులు మొదలు, ఇప్పటి సహోద్యోగుల వరకూ దాదాపు పదిహేను వందల మంది స్నేహితులుగా నమోదై ఉన్నారు. పాస్వర్డ్ తెలీక, ప్రొఫైలు మాత్రమే చూడగలుగుతుంది. వారి మధ్య సాగిన సంభాషణలు ఏవీ చూడలేకపోయింది. ఆయన పర్సనల్ ఈమెయిల్, పాస్వర్డ్ లేక మొరాయించింది. ఆఫీసువాళ్లు అఫీషియల్ మెయిల్ వివరాలు బయటకు ఇవ్వడం కుదరదన్నారు. ప్రమాద స్థలంలో మొబైల్ ఫోన్ దొరకలేదు కానీ, అతని వ్యక్తిగత నంబర్ తాను మళ్లీ తీసుకుంది. ఆ సిమ్ వేరే ఫోన్లో వేసి పెట్టింది. అలాగే భర్త ఆఫీస్ నంబర్, వ్యక్తిగత నంబర్ల యొక్క గత ఆరు మాసాల కాల్ డేటాను సంపాదించి పరిశీలించింది. ముఖ్యంగా చివరి రెండు రోజులలో అతనికి వచ్చిన, అతను చేసిన నంబర్లన్నింటికీ కాల్ చేసింది. చాలామంది ప్రతిస్పందించారు కానీ, కొందరు దొరకలేదు. ఆఫీస్ నంబరుతో మాట్లాడినవారందరూ సిబ్బంది, క్లయింట్లు కాగా, వ్యక్తిగత నంబర్‌కు చేసినవారందరూ తనకు తెలిసినవారే. సంతోష్‌కు డైరీ రాసే అలవాటు లేదు. అప్పుడప్పుడు బ్లాగులో, ఫేస్బుక్లో ఫొటోలు పెట్టి, వాటి గురించి ఏదో కామెంట్ చేసేవాడు కానీ, అవన్నీ తమ పర్యటనలు, బాబుకు సంబంధించినవే. అత్తా మామలను అడిగితే తమకు తెలీదన్నారు. ఏమీ పాలుపోక తీవ్రంగా ఆలోచించింది. అయితే పెద్దకర్మ దగ్గరపడటంతో ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టింది. రెండు రోజులలో కర్మ అనగా అర్ధరాత్రి 12 గంటలకు భర్త నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఇంకా నిద్రపోని అలేఖ్య, అది చూసి ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఉచిత ఎస్సెమ్మెస్ సర్వీసు ద్వారా వచ్చిన ఆ సందేశం, ‘హ్యాపీ బర్త్‌డే బంగారం!’ అని. ముందు పంపిన వారి నంబర్, తరువాత ఆ సందేశం చూసి వెంటనే ఆ నంబర్‌కు డయల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా అటు వైపు ఫోన్ ఎవరూ లేపలేదు. భర్త నంబర్ నుంచే తిరిగి మెసేజ్ పెట్టింది ‘థాంక్యూ బంగారం’ అని. అయినా రెస్పాన్స్ రాలేదు. మిగతా రాత్రంతా ఆమె ఆ ఫోన్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. పోయిన ఏడాది భర్త పుట్టినరోజు వేడుకను తలుచుకుంటూ ఉదయాన్నే మళ్లీ ఆ నంబర్‌కు ప్రయత్నించింది. ఈసారి తన, మామగారి, ఇంటి ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి కూడా చేసింది కానీ, ఉపయోగం లేదు. కొంతసేపటికి అవతలి ఫోన్ స్పందించడం మానేసింది. బ్యాంకులు, ఇన్సురెన్స్ సంస్థలతో పాటు కొంతమంది విషయం తెలీనివారు సంతోష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలేఖ్య అందరికీ తిరిగి ఫోన్ చేసి మాట్లాడింది. కానీ రాత్రి 12 గంటలకు ముందుగా ‘బంగారం’ అని విష్ చేసినవారు మాత్రం ఆమె ఫోన్‌కు గానీ, మెసేజ్‌కు గానీ సమాధానం చెప్పలేదు. తరువాతి రోజు కార్యక్రమానికి వచ్చినవారందరినీ ఆ నంబర్ గురించీ, ఆ రోజు భర్తతో ప్రయాణించినామె గురించీ అడిగింది. ఆమె వలవలు వివర్ణం అయ్యాయి కానీ ఎటువంటి వివరాలూ తెలియరాలేదు. కార్యక్రమం పూర్తయ్యాక పుట్టింటివారు, అత్తింటివారే మిగిలారు. బాబు చదువు, తన భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారు. సంతోష్‌కు ఒక్కడే కొడుకు కాబట్టి పెద్ద గొడవలు లేవు. అలేఖ్య మాత్రం ఆ నంబరుకు ట్రై చేస్తూనే ఉంది. చివరికి ఆ నంబరు నుంచి ఒక ఎస్సెమ్మెస్ వచ్చింది. ‘ఎవరు మీరు?’ (హూ ఈజ్ దిస్) అని. వెంటనే డయల్ చేసింది అలేఖ్య, మళ్లీ స్పందన కరువయ్యింది. కానీ ఆమె తన ప్రయత్నం ఆపలేదు. చివరికి ఒక టెక్స్ట్ పంపింది - ‘నేను శ్రీమతి సంతోష్. ఒక్కసారి మీతో మాట్లాడాలి’ అని. ఫోను చేత పట్టి ఎదురు చూడసాగింది.సాయంత్రం ఆ నంబరు నుంచి కాల్ వచ్చింది. ఒక్క ఉదుటన ఎత్తింది అలేఖ్య. కానీ మాట్లాడలేదు. ఓ క్షణం తరువాత అటు నుంచి ఓ ఆడగొంతు ‘హలో’ అంది. ఏదో అర్థం అయిన అలేఖ్య, ‘‘నేను సంతోష్ భార్యనండీ! మీరూ..?’’ అంది. ‘‘నేను అతని ఫ్రెండ్నండీ’’ దిటవుగానే చెప్పింది అవతలి ఆమె. గొంతు పోల్చుకునే ప్రయత్నం చేస్తూ, ‘‘ఆయన ఈ మధ్యన...’’ చెప్పలేకపోయింది భార్య. ‘‘తెలుసండీ’’ స్నేహితురాలి గొంతులో బాధ ధ్వనించింది. ‘‘ఆ రోజు ఆయనతో కలిసి ప్రయాణించింది... మీరేనా?’’ అడిగేసింది. అటు నుంచి సమాధానం రాలేదు.మళ్లీ తనే, ‘‘చూడండీ! నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవరినీ ఏమీ అనలేను. ఆయన గురించి తెల్సుకోవాలి అంతే. మీరేనా లేక ఇంకెవరన్నానా? మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్!’’ అటు నుంచీ ముక్కులు ఎగరేస్తున్న శబ్దం వినబడుతుంది అంటే అవతలామె దుఃఖిస్తుంది. అలేఖ్యకు జవాబు దొరికింది. ‘‘ఆయన గురించి ఒక్కసారి మీతో మాట్లాడాలి.’’‘‘ఇంకేముందండీ మాట్లాడటానికి? ఇక్కడితో వదిలెయ్యండి. మళ్లీ ఫోన్ చేయకండి. ప్లీజ్, సారీ!’’ అని పెట్టేసింది అవతలి ఆమె. అలేఖ్య మళ్లీ మళ్లీ కాల్ చేస్తూనే ఉంది. విసిగి ఒక మెసేజ్ పంపింది, ‘‘ఈ నంబరు సాయంతో నిన్ను వెదికి పట్టుకోగలను. నిన్ను వేధించే ఉద్దేశం నాకు లేదు. ఒక్కసారి నిన్ను కలిసి మాట్లాడాలి అంతే. దయచేసి అర్థం చేసుకో.’’ కొంతసేపటికి అవతలి నుంచి ఫోన్ వచ్చింది... ‘‘చెప్పండి!’’ ‘‘ఆయన గురించి మాట్లాడాలి. ఫోన్లో కాదు, మనం కలవాలి. ఒకే ఒక్కసారి. మళ్లీ జీవితంలో నిన్ను డిస్టర్బ్ చేయను. ఏ ఊరో అడ్రెస్ చెప్పండి’’ సూటిగా అడిగింది అలేఖ్య. కాసేపు తటపటాయించిన అవతలామె చివరికి తనే సంతోష్ ఇంటికి వచ్చి కలుస్తానంది. తన మగని జీవితంలోని చీకటి కోణం మీద వెలుగు పొడ సోకేది నేడే. అందుకే ఆమె ఎదురుచూపులు. పొద్దుట నుంచీ ఏ వాహనం అలికిడి అయినా మనసు ఉద్వేగానికి గురవుతుంది. ఊళ్లోవాళ్లు, చుట్టాలు ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు. కానీ తాను ఎదురుచూస్తున్న మనిషి రాలేదు. భానుడు పడమటింట తన పయనం ముగించే సమయంలో పక్కింటి రామారావుగారి కుమార్తె భావిక, చేతిలో స్వీటు డబ్బాతో వచ్చింది. అత్తగారు ఆమెతో ముందు గదిలో మాట్లాడుతుంటే, అలేఖ్య లోపలి గదిలో అసహనంగా తిరుగాడుతుంది. కొద్దిసేపటి తరువాత భావిక తనను సమీపించి నిలబడింది. గత పక్షం రోజులుగా అలవాటైన విధంగా నిట్టూర్చి, ఆమెకు దారి చూపిస్తూ ముందు గదిలోకి నడిచింది అలేఖ్య. ‘‘మాట్లాడాలన్నారు’’ మెల్లగా అంది భావిక. అర్థంకాక చూస్తున్న తనతో, ‘‘ఫోన్ చేశారు కదా. మాట్లాడాలనీ...’’ ఒక్కో మాటా కూడగట్టుకు పలుకుతుంది ఆ అమ్మాయి.‘‘ఆ ఫోను చేసింది నువ్వా? భావీ... ఆ నంబరు నీదా? అంటే...’’ అయోమయంతో మాట పెగలలేదు అలేఖ్యకు. తల నిలువుగా ఆడిస్తూ కన్నీరు పెట్టింది తనకు పెళ్లినాటి నుంచీ పక్కింటి అమ్మాయిగా తెలిసిన భావిక. ‘‘ఎంసెట్టు ఒకేసారి రాశాం. నాకు సీటు వచ్చింది. సంతోష్ లాంగ్ టర్మ్ చేశాడు. మరుసటి యేడాది అతనికి సీటు వచ్చినా మా కాలేజీలోనే చేరాడు. ఒకే ఊరివాళ్లం కాబట్టి బుక్స్, హాస్టల్ వంటి వివరాలతో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. చదువులు అయ్యాక, పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ కులాల అడ్డుగోడలు, ఆస్తిపాస్తుల అంతరాలతో పెద్దవాళ్లు కాదన్నారు’’ చెప్పుకుపోతుంది భావిక. నిశ్చేష్ఠురాలై వింటోంది అలేఖ్య. ‘‘క్యాంపస్ సెలక్షన్స్‌లో అతనికి ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు కానీ మా అనుబంధం కొనసాగింది. ఖాళీగా ఉన్న నన్ను కంప్యూటర్ కోర్సు చేస్తే మంచి ఉద్యోగం వస్తుందని సిటీకి తీసుకెళ్లి ఇన్స్టిట్యూట్లో చేర్చాడు. అది పూర్తయ్యాక, పూణేలోని ఓ కంపెనీ ఇంటర్వ్యూ వచ్చింది. డెరైక్ట్ బస్సు దొరక్క, షిర్డీ వెళ్లి వెళ్దాం అని ఆ రోజు ఇద్దరం బయలుదేరాం. కానీ సగం దారిలోనే...’’ వెక్కిళ్లు పెడుతుంది భావిక. అసంకల్పితంగానే అలేఖ్య ఆమెను ఓదార్చింది. ‘‘నాకూ తలకు దెబ్బ తగిలింది’’ నుదుటి మీద గాయంపై చెయ్యి పెట్టి చూపి, ‘‘కానీ తెల్లారాక తెలివొచ్చింది. సంతోష్‌లో మాత్రం చలనం లేదు. స్పృహ కోల్పోయాడనుకున్నా. అక్కడకి చేరుకున్న డాక్టర్లు పరీక్షించి ప్రాణం పోయిందని చెప్పారు. నాకు చెమటలు పట్టాయి. కాళ్లు, చేతులు ఆడలేదు. భయం వేసింది. ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయా. అలాగని అతన్ని వదిలేసి పోలేదు. అంకుల్‌కు, వాళ్ల ఆఫీస్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చా. షోలాపూర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయి, అంబులెన్స్ బయలుదేరే వరకూ అక్కడే ఉన్నా. కానీ మీ ముందు రాలేకపోయా...’’ కొంగుతో ముఖం తుడుచుకుంది భావిక. ‘‘నన్ను క్షమించండి. సంతోష్‌ను నేను ఎప్పటికీ మరువలేను.’’‘‘అందుకే పోయినవాడికి బర్త్‌డే విషెస్ చెప్పావు’’ నిష్ఠూరంగా అంది అలేఖ్య. ‘‘నేనా? లేదే...’’ వెంటనే అంది భావిక. ‘‘మొన్న ఆయన పుట్టినరోజు నాడు, రాత్రి 12 గంటలకు వచ్చింది ‘బంగారం’ అని. అసలు దాని ద్వారానే నీ నంబర్ తెలిసింది’’ అని ఫోన్ చూపించింది.‘‘మర్చిపోతానని నెలలో పుట్టినరోజు ఉన్నవాళ్లందరికీ ఫస్టు తారీఖునే సిస్టమ్‌లో మెసేజ్ షెడ్యూల్ చేసి పెడతాను. ఇది ఆటోమేటిక్‌గా అలా వచ్చిందే తప్ప, మిమ్మల్ని బాధపెట్టాలని కాదండి. అసలు జరిగినదానికి మీ కన్నా ఎక్కువ...’’ ఎప్పుడొచ్చిందో తెలీదు అత్తయ్య భావికను చాచి లెంపకాయ కొట్టింది. ‘‘ఎంత పని చేశావే దౌర్భాగ్యురాల. నా కడుపున చిచ్చుపెట్టి నంగనాచిలాగా మళ్లీ నా ఇంటికే వస్తావా? ఎంత ధైర్యమే నీకు...’’ అంటూ జుట్టు పట్టుకొని చెంపలు వాయించేసింది. వెంటనే అలేఖ్య అడ్డం వెళ్లి వాళ్లను విడదీసింది. భావిక రెండు చేతులూ జోడించి ఏడుస్తుంది. అత్తగారు ఆవేశంతో ఊగిపోతుంది. ‘‘వెళ్లు భావీ! మీ ఇంటికి వెళ్లిపో! ఈ విషయం ఇక్కడితో మర్చిపో’’ ఆమెను వీధి గుమ్మం వైపు తోసుకుపోయింది అలేఖ్య. పరిగెడుతున్న భావిక మీదకు లంఘించిన అత్తగార్ని జబ్బపట్టి వెనక్కు లాగింది కోడలు. ‘‘ఎందుకు వదిలేశావమ్మా దాన్ని. నీకెంత అన్యాయం చేసింది అది’’ ఉద్రేకంతో అంది అత్త. ‘‘ఆమెను ఏం చేస్తే మాత్రం పోయిన నీ కొడుకు తిరిగొస్తాడాత్తయ్యా?’’ ‘‘అది కాదు అలేఖ్యా! మరి నువ్వే కదా ఆ రెండో సీటు మనిషి ఎవరో కనుక్కోవాలని గొడవ చేశావు.’’‘‘తెలుసుకోవాలనుకున్నానత్తయ్యా. నేను ఏం లోటు చేశానని మీ అబ్బాయి ఇంకో స్త్రీకి చేరువయ్యాడో అడిగి తెలుసుకుందామనుకున్నాను. కానీ ఇది నాతో పెళ్లికి ముందే ఏర్పడిన బంధం. దాన్ని కొనసాగించారు అంతే. ఇందులో నా తప్పేమీ లేదు. నాకు ఆ అవగాహన చాలు’’ కళ్లు తుడుచుకుంటూ స్థిరంగా చెప్పింది అలేఖ్య. - అనీల్ ప్రసాద్ లింగం -
స్త్రీ ఓ గులాబి
మాదాల హరికృష్ణ, ప్రదీప్‌రెడ్డి, అలేఖ్య, గోగిశెట్టి సునీల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘గులాబి’. మాదాల కోటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి టైటిల్ లోగోను ఆవిష్కరించగా, యక్కలి రవీంద్రబాబు ప్రచార చిత్రాలను విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించడం ఎలా? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, పవన్ శేష్ స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అశోక్, ఛాయాగ్రాహణం: కల్యాణ్ సమీ. -
స్త్రీ ఓ గులాబి
మాదాల హరికృష్ణ, ప్రదీప్‌రెడ్డి, అలేఖ్య, గోగిశెట్టి సునీల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘గులాబి’. మాదాల కోటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి టైటిల్ లోగోను ఆవిష్కరించగా, యక్కలి రవీంద్రబాబు ప్రచార చిత్రాలను విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించడం ఎలా? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, పవన్ శేష్ స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అశోక్, ఛాయాగ్రాహణం: కల్యాణ్ సమీ.