
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టించింది.
ఇటీవలే తారకరత్న చిన్నకర్మ కూడా నిర్వహించారు కుటుంబసభ్యులు. తాజాగా అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో తారకరత్న, పిల్లలు ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇదే మా చివరి ఫోటో, చివరి ప్రయాణం అని నమ్మడం నా హృదయం పగిలినట్లు ఉంది. ఇదంతా ఒక కల అవ్వాలని కోరుకుంటున్నా. నన్ను "అమ్మా బంగారు" అని పిలిచే మీ స్వరం మరోసారి వినాలని ఉంది.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఇది చూసిన తారకరత్న అభిమానులు ఆమె మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఆయన మీ భౌతికంగా మీ వెంట లేకపోయినా.. ఎప్పటికీ మీతోనే ఉంటారని ధైర్యం చెబుతున్నారు. ఇప్పటి నుంచి మీరు చాలా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 22 తారకరత్న బర్త్‌డే సందర్భంగా కూడా అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన పెద్దకర్మను మార్చి 2న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు.