
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య, పిల్లలు తీవ్రం విషాదంలో మునిగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తారకరత్న గుండెపోటుతో మరణించారు. అయితే అలేఖ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారక్‌ను తలుచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆమె తన కొడుకు ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అచ్చం తారక్ లాగే ఉన్నాడంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
(ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి)
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్నకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా తారకరత్నకు ముగ్గురు పిల్లలు నివాళులర్పించారు. తండ్రి ఫోటోను చూస్తూ ఫాదర్స్ డే జరుపుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ తండ్రి లేని బాధ ఎలా ఉంటుందో తెలుసంటూ కామెంట్స్ పెడుతున్నారు.
(ఇది చదవండి: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!)