Taraka Ratna
-
క్రిస్మస్ వేడుకల్లో తారకరత్న ఫ్యామిలీ (ఫొటోలు)
-
'ఇటు రావే నా గాజు బొమ్మ'.. ఆ పాటతో తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక!
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలుస వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మరో వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'ఇటు రావే నా గాజు బొమ్మ' అనే సాంగ్‌ను ఈ వీడియోకు జతచేశారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలోని ఈ పాట తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమను తెలిపేలా ఉంది. తన కూతురి కోసం ఒక తండ్రి పడే తపనను ఈ ఒక్క పాటలో చూపించారు. తన ముద్దుల కూతురిని తలచుకుని అలేఖ్య ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కుమార్తెను ముద్దాడింది.తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.తారకరత్న జర్నీకాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
ఏడాది క్రితం తీవ్ర విషాదం.. తారకరత్న భార్య ఎమోషనల్!
సరిగ్గా ఏడాది క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి హీరో తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. ఆయన మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది.. నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిది.. 18/2/2023 నుంచి నీకు, నాకు ఎలాంటి హద్దులు లేవు. రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఎలాంటి మార్పు ఉండదు. మీ ఉనికి, మీ ప్రేమ, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. ఇది ఎప్పటికీ చావదు.. నువ్వే నా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు !!' అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన ముగ్గురు పిల్లలతో ఉన్న వీడియోను షేర్ చేసింది. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
తారకరత్న కూతురు బర్త్ డే (ఫొటోలు)
-
తారకరత్న కూతురు బర్త్ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!
నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య) తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఇవాళ తారకరత్న పెద్ద కూతురు నిష్క బర్త్ డే కావడంలో ఆయన భార్య ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిముషం నుంచి మాకెంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది. నీ నువ్వు, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ కూతురికి బర్త్ డే విషెస్ తెలిపారు. మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ మమ్ము(అమ్మ) ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని ఎమోషనలైంది. అలేఖ్య తన కూతురికి విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిష్కతో పాటు తారకరత్న, అలేఖ్య రెడ్డికి కవల పిల్లలు తాన్యారామ్, రేయాలు కూడా ఉన్నారు. పిల్లల పేర్లలో ఎన్టీఆర్ మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య
నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని ఆయన అలరించారు. ఆపై రాజకీయాల్లో రానించాలనే ఆలచనతో తొలి అడుగు కూడా వేశారు. కానీ చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. సుమారు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వెంటిలేటర్‌పైనే తారకరత్నకు చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇదే ఏడాది ఫిబ్రవరి 18న ఆయన మరణించారు. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సంఘటన చూసిన వారందరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భర్త మరణ వార్తను జీర్ణించుకోలేని అలేఖ్యను ఓదార్చడం ఆ సమయంలో ఎవరి వల్ల కాలేదు. తాజాగ వారి పిల్లల పుట్టినరోజు సందర్భంగా తారకరత్నను అలేఖ్యరెడ్డి గుర్తుచేసుకున్నారు. నేడు తారకరత్న కవలపిల్లులు అయిన తాన్యారామ్, రేయాల పుట్టినరోజు. దీంతో అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ చేశారు. అంతేకాకుండా తారకరత్నతో వారికున్న తీపిగుర్తులకు సంబంధించిన ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేశారు. మొదట వారి పెద్ద కూతురు అయిన నిష్క తారకరత్న ఫోటోకు పువ్వులు పెడుతుండగా ఇద్దరు ట్విన్స్ ఆమెకు సాయిం చేస్తున్నారు. (ఇదీ చదవండి: పూజా హెగ్డేకు సర్జరీ.. అసలు కారణం ఇదే!) ఇలా ఆ ఫోటోలు చూస్తూ.. తారకరత్నను మరోసారి గుర్తుచేసుకున్న ఎవరైనా కూడా భావోద్వేగానికి గురికాక తప్పదు. ఆ వీడియోతో పాటు తారకరత్న గురించి అలేఖ్య రెడ్డి ఇలా రాసుకొచ్చారు. తాన్యారామ్, రేయాలకు ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలోచించినా వారిద్దరికీ పుట్టునరోజు శుభాకాంక్షలను ఆనందంగా చెప్పలేకపోతున్నానని తారకరత్నను ఆలేఖ్య గుర్తుచేసుకున్నారు. 'ఇలాంటి ఆనంద సమయంలో మీరు లేరు. కానీ పిల్లల మొఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. అలా మాతోనే ఉంటావ్. వర్షం కురిసే రోజు ఇంద్రధనుస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు. ఓబు (తారకరత్న), మమ్ము, ఎన్ నిష్క.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని, వేడుకలను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు.' అని ఆలేఖ్య తెలిపారు. పిల్లల పేర్లలో ఎన్టీఆర్ మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?
సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది.వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలుగతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్నవయసులోనే హార్ట్ఎటాక్మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్‌తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదంతాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు.2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు?స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు.దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్‌లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు.హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
అచ్చం తండ్రిలానే ఉన్నాడు.. వైరలవుతున్న తారకరత్న కుమారుడి ఫోటో!
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య, పిల్లలు తీవ్రం విషాదంలో మునిగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తారకరత్న గుండెపోటుతో మరణించారు. అయితే అలేఖ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారక్‌ను తలుచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆమె తన కొడుకు ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అచ్చం తారక్ లాగే ఉన్నాడంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్నకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా తారకరత్నకు ముగ్గురు పిల్లలు నివాళులర్పించారు. తండ్రి ఫోటోను చూస్తూ ఫాదర్స్ డే జరుపుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ తండ్రి లేని బాధ ఎలా ఉంటుందో తెలుసంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!) View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న మరణం అటు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కడవరకు తోడుంటాడనుకుంటే ఇలా అర్థంతరంగా తనువు చాలించడంతో అలేఖ్య రెడ్డి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అప్పటి నుంచి భర్తను తలుచుకుంటూ అతనితో ఉన్న ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది అలేఖ్యా రెడ్డి. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ''ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే!.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళావు. వాటితో నేను ముందుకు వెళతాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను'' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్యా రెడ్డి. ఇక మరొక పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోను, తన కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ.. వీళ్లే తన స్టార్స్ అంటూ పేర్కొంది. కాగా నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. చదవండి: మెసేజ్ చేసినందుకు నేరుగా ఇంటికి వెళ్లిన డైరెక్టర్ View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
భర్తను తలుచుకొని ఎమోషనల్ అయిన తారకరత్న భార్య
నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన చిన్నవయసులోనే అర్థాంతరంగా తనువు చాలించడం కలిచివేస్తుంది. తారకరత్న చనిపోయి సుమారు 2నెలలు కావొస్తున్నా ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి తారకతరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా మరోసారి భర్తను తలుచుకుంటూ అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో తారకరత్న గడిపిన క్యూట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ.. నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నా అంటూ ఇన్‌స్టాలో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు.. మాకే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా జనవరి 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
తండ్రి ఫొటో పట్టుకుని తారకరత్న కొడుకు అలా.. అలేఖ్య పోస్ట్ వైరల్
దివంగత నటుడు నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరైంది. భర్త మరణాంతరం అలేఖ్య ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తరచూ ఎమోషనల్ పోస్ట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ అంతేకాదు వారి పెద్ద కూతురు నిష్క కూడా తండ్రిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంది. తండ్రితో ఉన్న జ్ఞాపకాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరో పోస్ట్ చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో పెద్ద కూతురు నిష్క గురించి ప్రస్తావించే ఆమె తాజాగా తనయుడు ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ఇందులో ఆమె కొడుకు తాన్యారామ్ తారకరత్న ఫొటో పట్టుకుని కనిపించాడు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ ఇక దీనికి అలేఖ్య ‘పెద్దయ్యాక నాన్నలా అవుతాను’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. తాన్యారామ్ తండ్రి ఫొటోను పట్టుకుని ఉన్న ఈ ఫొటో కన్నీళ్లు తెప్పిస్తుంది. అలా చూసి అందరి హృదయాలు బరువెక్కుతున్నాయి. అలా తారకరత్న కొడుకు కాగా తారకరత్నా, అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. పెద్దలను ఎదరించి వీరు ఒక్కటయ్యారు. అది నచ్చని నందమూరి కుటుంబం తారకరత్నా, అలేఖ్యలను దూరం పెట్టారు. అప్పటి నుంచి వేరుగా ఉంటున్న వీరి జీవితంలో తారకరత్న మృతి తీరని విషాదాన్ని నింపింది. -
కూతురితో ఆడుకున్న తారకరత్న.. ఇదే చివరి వీడియో!
నటుడు నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. భర్తే సర్వస్వం అనుకున్న అలేఖ్యా రెడ్డి, తండ్రే ప్రపంచం అనుకున్న నిష్కలను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. తారకరత్న మరణించి నెల రోజులు పూర్తి కావటంతో ఇటీవలే భర్త ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది అలేఖ్య. ఎన్నో కష్టనష్టాలను దాటుకుంటూ వారి ప్రయాణం కొనసాగిందని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత దగ్గరివాళ్లే దూరం పెట్టి నరకం చూపించారని, జీవితమంతా కష్టాలే అనుభవించామంటూ భావోద్వేగానికి లోనైంది. తాజాగా నిష్క.. తండ్రితో కలిసి ఆడుకున్న చివరి వీడియోను షేర్ చేసింది. హిందూపూర్‌కు వెళ్లడానికి ముందు కూతురితో కలిసి గేమ్ ఆడారు తారకరత్న. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు లవ్యూ తారక్ అన్నా అంటూ ఎమోషనలవుతున్నారు. కాగా జనవరి 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. View this post on Instagram A post shared by Nishka Nandamuri (@nishka_nandamuri) -
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి ఇప్పటికే పలుసార్లు భావోద్వేగానికి గురైంది. తారకరత్నను తలుచుకుని ఎమోషనలైంది. ఈ కష్టకాలంలో అన్నీ తానై ముందుండి నడిపించిన వ్యక్తి బాలయ్య. తాజాగా మరోసారి తారకరత్న కుటుంబం పట్ల గొప్ప మనసును చాటుకున్నారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలోని ఓ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టడమే కాకుండా.. పేదలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి స్పందించింది. ఈ మేరకు బాలకృష్ణ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలేఖ్యారెడ్డి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇంతన్నా నేనేమి చెప్పగలను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను. నేను ఏమి చెప్పినా మీరు ముందు తక్కువే అవుతుంది. మీరు బంగారు హృదయం ఉన్న వ్యక్తిల. మీరు నిజంగా ఆ పేరుకు అర్హులు. మీలా మరెవరూ చేయలేరు. మిమ్మల్ని ఓ తండ్రిగా, స్నేహితునిగానే చూశాం. ఇప్పుడు మీలో దేవుణ్ణి చూస్తున్నాం. మీ ప్రేమతో నాకు మాటలు రావడం లేదు. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన బాలకృష్ణ అభిమానులు దేవుడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే బాలకృష్ణ బాలయ్య చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే.. కష్టసుఖాల్లో కొండంత అండగా నిలబడిన అన్నీ తానై నడిపించారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యా రెడ్డి. ప్రస్తుతం బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలిపింది. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
తారకరత్న కోసం బాలయ్య కీలక నిర్ణయం.. అలా జరగకూడదంటూ!
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబాంతో పాటు అభిమానులకు తీరని లోటు. ఆ లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్య పడదు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఇప్పటికే పలుసార్లు భావోద్వేగానికి గురైంది. తారకరత్నను తలుచుకుని ఎమోషనలైంది. అందరికీ అందని లోకాలకు చేరిన తారకరత్న కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే తారకరత్న మరణించిన నెల రోజులు పూర్తి కావడంతో అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ బాలయ్య చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే.. కష్టసుఖాల్లో కొండంత అండగా నిలబడిన అన్నిీ తానై నడిపించారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యా రెడ్డి. ఆస్పత్రికి తారకరత్న పేరు ప్రస్తుతం బాలయ్య తీసుకున్న నిర్ణయం తారకరత్న అభిమానులకు గుర్తుండిపోయేలా ఉండనుంది. తారకరత్న మనమధ్య లేకపోయినా.. ఆయన పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా బాలయ్య నిర్ణయం తీసుకుని మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని బాలయ్య అన్నారు. (ఇది చదవండి: తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి) తన ప్రాణంగా భావించే తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయించారు. అంతేకాకుండా హిందూపురంలో బాలయ్య నిర్మించిన హాస్పిటల్ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టారు. వాటితో పాటు పేదప్రజల వైద్యం కోసం రూ.1.30 కోట్లు పెట్టి ఆపరేషన్ కోసం పరికరాలను ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి వచ్చే చిన్నపిల్లలకు ఉచితంగా భోజనం, మందులు కూడా మూడు నెలల పాటు అందించనున్నారు. తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయేలా బాలకృష్ణ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న మరణించి సుమారు నెల రోజులు కావొస్తుంది. ఇంకా ఆయన లేరన్న విషయాన్ని అభిమానులు, కుటుంసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న మరణంతో ఆయన బార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. తాజాగా బాలయ్య చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ''మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన. కష్టసుఖాల్లో మాకు రాయిలా కొండంత అండగా నిలబడిన వ్యక్తి. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు తండ్రిలా, నీ బెడ్ పక్కనే కూర్చొని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా,నువ్వు రియాక్ట్ అవుతామో అని, నిన్ను నవ్వించడం కోసం జోక్స్ వేస్తూ సరదాగా కనిపించి, ఎవరూ లేని సమయంలో నీకోసం కన్నీరు పెట్టుకున్నారు. చివరి క్షణం వరకు నీకోసం చాలా చేశారు. ఓబు(తారకరత్న ముద్దు పేరు)నువ్వు ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం'' అంటూ అలేఖ్యరెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో బాలయ్య ఉన్న ఫోటోకు తారకరత్నను యాడ్ చేసి ఎవరో ఆ పిక్‌ను అలేఖ్య రెడ్డికి పంపగా, ఇది ఎంతో బాగుందంటూ అలేఖ్య పేర్కొంది. కాగా బాలయ్యకు తారకరత్న అంటే ఎంతో ఇష్టం. గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకెళ్లిన దగ్గర్నుంచి అతని కట్టెకాలే వరకు ఆ కుటుంబానికి బాలయ్య పెద్దదిక్కులా నిలిచాడు. అంతేకాకుండా తారకతర్న-అలేఖ్యరెడ్డిల ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా బాలయ్య వాళ్లకు తోడులా ఉండి భరోసా ఇచ్చినట్లు తారకరత్న గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
నిన్ను చాలా మిస్సవుతున్నా చిన్నమ్మ.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మరణంతో భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తారకరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫోటోను పంచుకున్నారు అలేఖ్యా రెడ్డి. అలాగే తారతరత్న పెద్దకర్మ సందర్భంగా భర్త రాసిన వాలెంటైన్స్ డే నోట్‌ను షేర్ చేసి ఎమోషనలయ్యారు. అయితే తాజాగా తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. నిషిక రాస్తూ.. 'అమ్మా నువ్వు చాలా బాధలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే.. నేను నీకు గుడ్ బై చెప్తా' అంటూ రాసింది. తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ చూస్తే అమ్మపై ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిషిక రాసిన నోట్‌ను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. నిన్ను చాలా మిస్సవుతున్నానంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. -
నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. తారకరత్న లేఖ
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అటు అభిమానులతో పాటు తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి విషాదంలో మునిగిపోయింది . పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత నిరాశకు లోనైంది. ఇటీవలే తారకరత్నతో చివరిసారిగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు అలేఖ్య రెడ్డి. అయితే గురువారం మార్చి 2, 2023న తారకరత్న పెద్దకర్మ హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరత్న రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. వాలైంటెన్స్ డే సందర్భంగా అలేఖ్యను తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు. నా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని లేఖలో పేర్కొన్నారు తారకరత్న. నా జీవితంలో నువ్వే నా ప్రపంచం బంగారు అని రాశారు. ఇవాళ తారకరత్న పెద్దకర్మ సందర్భంగా ఆ లేఖను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ లేఖ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఆ లేఖతో పాటు తారకరత్నకు ముద్దు పెడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఏది ఏమైనా భార్య, భర్తల మధ్య అనుబంధం ఎంత గొప్పదో ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో లేఖను షేర్ చేస్తూ ..'మన జీవితంలో అన్ని ఒడిదుడుకులు చూశాం. చాలా కష్టాలు పడ్డాం. జీవితంలో అత్యంత కష్టకాలం అనుభవించాం. మన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. మంచి రోజుల కోసం ఎదురు చూశాం. మనిద్దరం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నీ జీవితంలో పడిన కష్టాలు ఎవరికీ తెలియదు. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంతా నీలోనే దాచి.. మాకు అపారమైన ప్రేమను అందించావు. ప్రపంచం ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు మా చుట్టే ఉన్నావు. నేను మరింత ఎత్తుకు ఎదుగుతా నానా. ఈ రోజు నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాం నానా' అంటూ ఎమోషనల్ అయ్యారు అలేఖ్య రెడ్డి. ఏది ఏమైనా దేవుడు ఆ కుటుంబానికి మరింత ధైర్యం ప్రసాదించాలని తారకరత్న అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
ఇదే చివరిదంటే నమ్మలేకపోతున్నా.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇటీవలే తారకరత్న చిన్నకర్మ కూడా నిర్వహించారు కుటుంబసభ్యులు. తాజాగా అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో తారకరత్న, పిల్లలు ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇదే మా చివరి ఫోటో, చివరి ప్రయాణం అని నమ్మడం నా హృదయం పగిలినట్లు ఉంది. ఇదంతా ఒక కల అవ్వాలని కోరుకుంటున్నా. నన్ను "అమ్మా బంగారు" అని పిలిచే మీ స్వరం మరోసారి వినాలని ఉంది.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది చూసిన తారకరత్న అభిమానులు ఆమె మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఆయన మీ భౌతికంగా మీ వెంట లేకపోయినా.. ఎప్పటికీ మీతోనే ఉంటారని ధైర్యం చెబుతున్నారు. ఇప్పటి నుంచి మీరు చాలా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 22 తారకరత్న బర్త్‌డే సందర్భంగా కూడా అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన పెద్దకర్మను మార్చి 2న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
తారకరత్న పెద్దకర్మ తేదీ ప్రకటన.. ఎప్పుడంటే?
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి తీవ్రం విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత విషాదం నెలకొంది. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఇటీవలే తారకరత్న చిన్న కర్మ కూడా నిర్వహించారు. తారకరత్న మరణం తర్వాత నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని వెల్లడించారు. తాజాగా తారకరత్న పెద్ద కర్మ తేదీని కూడా ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులు. ఎంపీ విజయసాయి రెడ్డి, బాలకృష్ణ అంత్యక్రియలు ముగిసేంత వరకూ దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న భార్య విజయ సాయిరెడ్డికి బంధువు కావడంతో దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. అలాగే బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పెద్ద కర్మను దగ్గరుండి పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన కార్డును సోషల్ మీడియాలో షేర్ చేశారు. తారకరత్న కుటుంబ సభ్యులు కార్డుని ప్రింట్ చేయించారు. మార్చి 2న తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్డుపై నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లను ప్రచురించారు. #SHRADHANJALI Sri. NANDAMURI TARAKA RATNA ( ceremony ) Pedda Karma will takeplace on Thursday, 2nd March 2023, 12 : 00pm Onwards at Film Nagar Culural Centre, Hyderabad.#NandamuriMohankrishna #NandamuriBalakrishna #VenumbakaVijayaSaiReddy #NandamuriFamily. pic.twitter.com/jfNa2HrpwE — Telugu Film Producers Council (@tfpcin) February 25, 2023 -
ఎన్నో పోరాటాలు, మన లైఫ్ అంత సాఫీగా ఏం సాగలేదు: అలేఖ్య
జీవితాంతం తోడుండాల్సిన భర్త అర్ధాంతరంగా తనువు చాలిస్తే ఏ భార్య తట్టుకుంటుంది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ మహిళ మనసు ఎంత తల్లడిల్లుతుంది? భర్తే సర్వస్వమనుకున్న అలేఖ్యా రెడ్డిని నందమూరి తారకరత్న అకాల మరణం అశనిపాతంలా తాకింది. తను లేని జీవితాన్ని ఊహించుకోలేక కుమిలికుమిలి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. తాజాగా భర్తపై ఉన్న ప్రేమను బయటపెడుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య. 'జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేశాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వు ఒక వారియర్ నాన్నా.. నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవ్వరూ చూపించలేరు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్న చేయి పట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది. దీనిపై అలేఖ్య స్నేహితురాలు స్పందిస్తూ.. 'మీరెన్ని కష్టాలు పడ్డారో అతి కొద్దిమందికే తెలుసు. ఎంత పోరాడాలో అంతవరకు పోరాడారు. కానీ ఆ దేవుడు కొన్నిసార్లు దయ లేనివాడిగా వ్యవహరిస్తాడు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. ఎల్లప్పుడూ నీవెంటే ఉంటాను అల్లూ' అని రాసుకొచ్చింది. మిగతా నెటిజన్లు సైతం 'మేమంతా మీకున్నాం అక్కా, ధైర్యంగా ఉండండి' అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) చదవండి: శ్రీదేవి లవ్ స్టోరీ తెలుసా? -
నందమూరి తారకరత్న చిన్న కర్మ (ఫొటోలు)
-
తారకరత్న చిన్నకర్మ.. వెక్కివెక్కి ఏడ్చిన అలేఖ్యా రెడ్డి
నటుడు నందమూరి తారకరత్న చిన్నకర్మను బుధవారం ఆయన కుటుంబసభ్యులు నిర్వహించారు. ఫిబ్రవరి 18వ తేదీన తారకరత్న శివైక్యం చెందగా 20న అంత్యక్రియలు జరిపారు. ఆయన భౌతిక కాయాన్ని దహనం చేసిన రెండు రోజులకు చిన్న కర్మ చేశారు. ఈ కార్యక్రమంలో తారకరత్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్ సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీప్రముఖులు పాల్గొని తారకరత్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వెక్కివెక్కి ఏడ్చిన అలేఖ్యా రెడ్డి తారకరత్న ఇక లేరనే విషయాన్ని ఆయన భార్య అలేఖ్యా రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త చిత్రపటాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. తల్లిని ఓదార్చేందుకు నిషిక ప్రయత్నించినప్పటికీ ఆమె కన్నీళ్లు ఆగలేదు. భర్త లేకుండానే భవిష్యత్తు కొనసాగించాలన్న బాధ ఆమెను నిలువెల్లా దహిస్తుండటంతో కన్నీటిపర్యంతమయ్యారు. బరువెక్కిన గుండెతో, కన్నీళ్లతో చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు అలేఖ్య. -
Taraka Ratna Funerals : తారకరత్న అంత్యక్రియలు (ఫొటోలు)
-
ఫిలిం ఛాంబర్లోకి మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు వేలెత్తి చూపుతూ
నటుడు నందమూరి తారకరత్న ఇక లేరన్న వార్తను కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మనసున్న మారాజు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలువురు సినీప్రముఖులు, అభిమానులు ఫిలిం చాంబర్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అక్కడకు వచ్చి తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించాడు. ఆ తర్వాత బాలకృష్ణ దగ్గరకు వెళ్లి వేలెత్తి చూపుతూ గట్టిగా ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. బాలయ్య కూడా అతడు చెప్పింది శ్రద్ధగా వింటున్నట్లు తలూపాడు. వెంటనే పోలీసులు అతడిని బయటకు తీసుకెళ్లారు. కాగా కాసేపటిక్రితమే తారకరత్న అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. చదవండి: బాలయ్య పెట్టిన ముహూర్తానికే తారకరత్న అంత్యక్రియలు -
నందమూరి తారకరత్నకు కలిసిరాని 9వ సంఖ్య.. అదే శాపంగా మారిందా?
నందమూరి తారకరత్న మృతి ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తుంది. తీవ్ర గుండెపోటుతో గత 27న బెంగళూరులోని నారాయణ హృదయాలలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్నను బతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తారకరత్నకు 9 సంఖ్య కలిసిరాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీలో చాలామంది న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారు. ఇక ఎక్కువగా తొమ్మిది అంకెను లక్కీ నెంబర్ అని భావిస్తారు. కానీ తారకరత్నకు మాత్రం 9కలిసి రాలేదని చెప్పాలి.తారకరత్న ముందుగా ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో 2002లో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అదే ఏడాది వరుసగా 9సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇందులో కేవలం మూడు సినిమాలు మాత్రమే సెట్స్ మీదకి వెళ్లాయి. ఇక గత నెల 27న ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ రెండు అంకెలను కలిపితే వచ్చేది 9 (2+7=9). ఇక ఆయన మరణించిన తేదీ ఫిబ్రవరి 18,(1+8=9) ఈ రెండు అంకెలను కలిపినా తొమ్మిదే వస్తుంది. ఇలా జరిగిన పరిణామాలన్నీ చూస్తే తారకరత్నకు తొమ్మిదవ నెంబర్ కలిసి రాలేదనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. -
బాలయ్య పెట్టిన ముహూర్తానికే తారకరత్న అంత్యక్రియలు
►జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ► మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ► తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు ► ఫిల్మ్ చాంబర్ నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర ► తండ్రి మోహన కృష్ణ చేతుల మీదుగా తారకరత్న అంతిమ సంస్కారాలు ► పాడె మోసిన బాలకృష్ణ, మిగతా కుటుంబసభ్యులు ► కన్నీరుమున్నీరవుతున్న నందమూరి కుటుంబసభ్యులు తారకరత్న మృతితో నందమూరి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే తారకరత్న అకాల మరణం చెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అజాత శత్రువుగా, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం మేరకు మధ్యాహ్నం 3.30గంటల తర్వాత తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్నకు ఆయన తండ్రి మోహన్ కృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తారకరత్న భౌతికకాయం వద్ద విషణ్ణ వదనాలతో కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
తారకరత్న బౌతికకాయానికి నివాళులర్పించిన తరుణ్
-
తారకరత్న బౌతికకాయానికి నివాళులర్పించిన విక్టరీ వెంకటేష్
-
కొడుకును అలా చూసి అల్లాడిపోయిన తారకరత్న తల్లిదండ్రులు
తారకరత్న మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న దూరం కావడం కుటుంబంతో పాటు నందమూరి అభిమానుల్ని కలిచివేస్తోంది. 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కాగా అజాత శత్రువుగా, ఎంతో మంచి మనస్తత్వం గల వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న భౌతికకాయన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆయన్ను అలా చలనం లేకుండా చూసి తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎదిగిన కొడుకు ఇలా తమ కళ్ల ముందే అచేతనంగా ఉండటం చూసి అల్లాడిపోయారు. వాళ్లను సముదాయించడం అక్కడున్న వారి తరం కాలేదు. తారకరత్న తల్లిదండ్రుల మనోవేదన చూసి అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం
నందమూరి తారకరత్న పార్థివదేహన్ని ఆయన నివాసం నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లోనే ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం మహాప్రస్థానంలో నేడు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఫిలిం చాంబర్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం గత నెల 27న నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం(ఫిబ్రవరి 18న) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతిని టాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు ఇటూ నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు చాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తారకరత్న మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. -
తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను కుటుంసభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తుంది. గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న 23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చదవండి: తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం అయితే తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఇద్దరు కూమార్తెలు, ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తండ్రి పార్థివ దేహం వద్ద ఆయన పెద్ద కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో అందరిని కలిచి వేసింది. ఆయన మరణంతో భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో తారకరత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత.. ఆయన ముగ్గురు పిల్లల బాగోగులు, చదువులు తానే చూసుకుంటానని, బాబాయ్‌గా తారక్ కుటుంబానికి నిత్యం అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట. ఇక తారకరత్న, బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తారకరత్న కోలుకొని తిరిగిరావాలని బాలయ్య ప్రత్యేక పూజలు కూడా చేశారు. తారకరత్న హాస్పిటల్లో చేరినప్పటి నుంచి బాలయ్య అక్కడే ఉండి ఆరోగ్య విషయాలను పర్యవేక్షించారు. బాబాయ్‌గా ఎప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణాంతరం కూడా తన కుటుంబానికి అండగా నిలబడ్డారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తారకరత్న మృతితో అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడిలో ఉంది: విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక, తారకరత్న మరణంపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తారకరత్న మరణం ఎంతో బాధించిందన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి తారకరత్న. 39 ఏళ్ల వయస్సులోనే తారకరత్న అకాల మరణం చెందడం చాలా బాధకరం. ఆయన మరణం ఎంతో బాధించింది. తారకరత్న మరణంతో అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడికి లోనవుతోంది. రేపు(సోమవారం) ఉదయం 10 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు తారకరత్న భౌతికకాయం తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగుతాయని తెలిపారు. -
తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం
తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను అటు కుటుంసభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడం కలచివేస్తుంది. గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న 23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అజాత శత్రువుగా, ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న తారకరత్న మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా తారకరత్నది ప్రేమ వివాహం.ఆయన నటించిన నందీశ్వరుడికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన అలేఖ్యతో ఆయన ప్రేమలో పడ్డారు.అయితే అలేఖ్యకు ఇదివరకే పెళ్లై విడాకులు తీసుకోవడంతో వీరి పెళ్లికి కుటుంసభ్యులు ఒప్పుకోలేదు. అయినా వెనక్కు తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో తనను పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటగా కుమార్తె పుట్టగా నిషిక అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి. మరొకరు అమ్మాయి. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. వీరి పేర్లలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలు NTR (Nishka, Tanayram, Reya)ఎన్టీఆర్ అని వచ్చే విధంగా పిల్లలకు పేర్లు పెట్టారు. -
తారకరత్నకు సాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్..!
నటుడు తారకరత్న మరణాన్ని కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారక్‌ను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. శంకర్‌పల్లిలోని తారకరత్న నివాసానికి చేరుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆ పార్థివ దేహానికి నివాళులర్పించారు. నందమూరి తారకరత్న 20 ఏళ్ల వయసులోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఒకే రోజు 9 సినిమాలను ప్రకటించి రికార్డు సృష్టించారు. 2002లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో సూపర్ హిట్ సాధించారాయన. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్‌గా మెప్పించారు. ఈ సినిమాలో ఈయన నటనకు నంది అవార్డు కూడా లభించింది. అయితే ఆ తర్వాత తారకరత్నకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని తన కుటుంబానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆ సమయంలోనే చాలా ఇబ్బందులు పడ్డారట తారకరత్న. కనీసం పిల్లల అవసరాలు కూడా తీర్చలేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు నెలకు నాలుగు లక్షల రూపాయలు పంపించారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో తారకరత్న మాట్లాడుతూ.. 'ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఉండడానికి కారణం ఎన్టీఆర్. నా తమ్ముడు లేకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తమ్ముడు అండగా నిలిచాడు.' అని అన్నారు. -
తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత..
నందమూరి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి అస్వస్థత్రకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య నీరసంగా ఉందని తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చిన్న వయసులోనే ఇలా దూరం కావడం అలేఖ్య జీర్ణించుకోలేకపోతుందని కుటుంస సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అలేఖ్యా రెడ్డి తీవ్ర మానసికి ఒత్తిడికి గురవుతుందని, తిరిగి మామూలు మనిషి కావడానికి సమయం పడుతుందని తెలిపారు. కాగా గత 27న తీవ్ర గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరిన తారకరత్న గతరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన్ను బతికించేందుకు విదేశీ వైద్యులను సైతం రప్పించి చికిత్స అందించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలేవీ ఫలించలేదు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అయితే తారకరత్నను ఆసుపత్రిలో చేర్పించిన మొదటి రోజు నుంచే భార్య అలేఖ్యా రెడ్డి అతనితోనే ఉన్నారు. భర్త ఆరోగ్యం కోసం ఆమె నిత్యం పూజలు చేసేవారట. ఈ క్రమంలో తారకరత్న మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. -
నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్న వరుస విషాదాలు
నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నుంచి ఇప్పుడు తారకరత్న వరకు వరుస విషాదాలు నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. వారికి తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే మరికొందరు ఆసక్మికంగా మరణించడం నందమూరి కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చుతోంది. మొదటగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినీ నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 1996లో 'మామ కోడళ్ల సవాల్' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన హరిన్ చక్రవర్తి ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోసించారు. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఆయన్ను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. హరిన చక్రవర్తి సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వీ సైతం రోడ్ యాక్సిడెంట్లోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ 1962లో అరుదైన వ్యాధితో చనిపోయారు. ఆ సమయంలో ఇరుగు పొరుగు షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాకే ఇంటికి వెళ్లారట. కొడుకు మరణవార్తతో తీవ్రంగా కుంగిపోయిన ఆయన ఆ విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయమే పట్టిందట. 1996లో సీనియర్ ఎన్టీఆర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు సాయికృష్ణ 2004లో ఆకస్మికంగా మృతి చెందారు. 2014 లో ఎన్టీఆర్ మరో కుమారుడైన హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిర్మాతగా కొనసాగిన ఆయన నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక పెద్ద కుమారుడు జానకీరామ్ మరణించిన నాలుగేళ్లకు నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. ఓ అభిమాని వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతుండగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే కన్నుమూశారు.ఇక గతేడాది ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడడం ఎన్టీఆర్ కుటుంబాన్ని కలచివేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు తాజాగా తారకరత్న మరణం మరోసారి నందమూరి కుటుంబాన్ని కుదిపేసింది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న ఆయన గతరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇలా కొన్నాళ్లుగా వరుస విషాదాలతో నందమూరి కుటుంబానికి శాపంగా మారింది. -
తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించిన చిరంజీవి, బాలకృష్ణ
నందమూరి తారకరత్న భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఆయన నివాసానికి చేరుకుని తారకరత్న కుటుంబాన్ని పరామర్శించారు. తారకరత్న భార్యను ఓదార్చిన మెగాస్టార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు నందమూరి బాలకృష్ణ సైతం తారకరత్న నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. గుండెపోటుకు గురైన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. త 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను కుప్పంలోకి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అదేరోజు అర్థరాత్రి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అప్పట్నుంచి నిపుణలైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. గత వారం రోజులుగా నిపుణులైన విదేశీ వైద్యులను సైతం రప్పించి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
Taraka Ratna Death: తారకరత్న భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
తారకరత్న తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి తారకరత్న ఇకలేరన్న విషయాన్ని యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల వయసులోనే ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్నం తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన తన చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. మోహన కృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా కూడా పనిచేశారు. అంతే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒకవైపు చదువుకుంటూనే కెమెరామెన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఆయన పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారాయన. -
నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్న కోడలి నాని, ఆలీ
-
తారకరత్న మృతి బాధాకరం.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, తారకరత్న మృతిపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్‌కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త ప్రకటించి ఉండాలి. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారు. తండ్రీకొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని వ్యాఖ్యలు చేశారు. -
తారకరత్నను వెంటాడిన దురదృష్టం.. మరో మూడు రోజుల్లో..!
నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. నందమూరి అభిమానులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే నందమూరి తారకరత్న జీవితంపై అభిమానుల్లో ఆరా తీస్తున్నారు. ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ఈ సమయంలో ఇలా జరగడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా.. నందమూరి తారకరత్న ఫిబ్రవరి 22న 1983లో జన్మించారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు నందమూరి తారకరత్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాకి వచ్చిన సక్సెస్‌తో ఆయన ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రకటించి వరల్డ్ రికార్డ్ సాధించారు. అయితే వాటిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత తారకరత్న అమరావతి అనే సినిమాలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు సైతం అందుకున్నాడు. రవిబాబు దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. -
మరో 5 రోజుల్లో తారక రత్న కొత్త సినిమా రిలీజ్.. అంతలోనే ఇలా..
నందమూరి తారకరత్న(40) అకాల మరణం టాలీవుడ్లో విషాదం నింపింది. చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తారకరత్న అకాల మరణం కారణంగా ఆయన నటించిన చివరి చిత్రం ‘మిస్టర్ తారక్’ విడుదలను వాయిదా వేశారు. తారక రత్న హీరోగా శంకర్ డోరా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను విడుదల చేయడం సరి కాదని వాయిదా వేసినట్లు చిత్ర దర్శక, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పేర్కొన్నారు. మిస్టరీ, థ్రిల్లర్ సినిమాగా ‘మిస్టర్ తారక్’ తెరకెక్కింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య, ప్రాణ స్నేహితుడు ఒక్కటై మోసం చేస్తే.. హీరో ఏం చేశాడు? అనేది చిత్ర కథగా తెలుస్తోంది. ఇందులో సారా హీరోయిన్ నటించింది. ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ పతాకంపై మధు పూసల నిర్మించారు. -
నందమూరి తారకరత్న మరణానికి కారణాలు ఇవేనా?
నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న ఇకలేరన్న విషయాన్ని నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆశగా చూసిన ఎదురుచూపులు అడియాసలు అయ్యాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 40ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను కుప్పంలోకి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అదేరోజు అర్థరాత్రి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అప్పట్నుంచి నిపుణలైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. గత వారం రోజులుగా నిపుణులైన విదేశీ వైద్యులను సైతం రప్పించి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో తారకరత్న మరణానికి దారితీసిన కారణాలను ఓసారి విశ్లేషిస్తే.. తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో సుమారు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయింది. ఆ సమయంలో రక్తం గడ్డకట్టడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చినట్టు తెలిసింది.గుండె, కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ మెదడు దెబ్బతినడంతో కోలుకోలేకపోయారు. దీనికి తోడు ఆయనకు మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు గుర్తించారు. బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయానికే ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. గుండెలో 90% బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించారు. చిన్న వయసే కావడంతో పరిస్థితి మెరుగు అవుతుందని భావించారు. మధ్యలో పరిస్థితి కొంచెం మెరుగైందని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా, రెండు రోజులుగా పరిస్థితి మరీ క్షీణించడంతో విషమంగా మారింది. ఈ నేపథ్యంలో గతరాత్రి శివరాత్రి పర్వదినాన తారకరత్న శివైక్యం చెందినట్లు ప్రకటించారు. -
తారకరత్న ముద్దు పేరు తెలుసా?
కొన్నాళ్లుగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న మృత్యుంజయుడిగా వస్తారనుకున్నారంతా.. కానీ ఆ పోరాటంలో ఓడిపోయి అసువులు బాశారు. తన కుటుంబాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా అందరికీ తారకరత్నగా పరిచయమైన ఆయనకు ఓ ముద్దుపేరు ఉంది. ఆయన అసలు పేరు ఓబులేసు. ఇంట్లోవాళ్లు ముద్దుగా ఓబు అని పిలుస్తారట. కాగా గత నెల 27న లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆ సమయంలో మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడుకు ఒకవైపు వాపు వచ్చింది. వెంటనే ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించి మెరుగైన వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రెండు రోజులుగా పరిస్థితి విషమించగా మహాశివరాత్రి నాడు శివైక్యమయ్యారు. చదవండి: అప్పటిదాకా ఉత్సాహంగా.. ఉన్నట్టుండి కుప్పకూలిన తారకరత్న -
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
-
నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్న ప్రముఖులు
-
తారకరత్న భౌతికకాయం చూసి జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం
నటుడు తారకరత్న మృతిని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిలలో తన నివాసానికి తరలించగా పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా తారకరత్న నివాసానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నటుడి పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. -
తారకరత్న భౌతికకాయం చూసి వెక్కివెక్కి ఏడ్చిన కూతురు
నటుడు తారకరత్న మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బెంగళూరు నుంచి నిన్న(శనివారం)రాత్రే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అయితే తన తండ్రిని అలా చలనం లేకుండా ఉండడాన్ని చూసి తారకరత్న కూతురు నిషిక వెక్కివెక్కి ఏడ్చింది. తన తండ్రి ఇక రాడని తెలిసి గుండెలు పగిలేలా రోదించింది. ఈ క్రమంలో కూతుర్ని ఓదార్చుతూ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సైతం కన్నీటి పర్యంతం అవడాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ కుటుంబానికి దేవుడు తీరని లోటు మిగిల్చాడని, ఈ బాధను తట్టుకునే శక్తిని వారికి ఆ భగవంతుడు కల్పించాలని ప్రార్థిస్తున్నారు. -
తారకరత్న లవ్‌స్టోరీ.. గుడిలో పెళ్లి చేసుకున్న నటుడు
గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన నటుడు నందమూరి తారకరత్న(39) శనివారం తుదిశ్వాస విడిచారు. మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు(ఫిబ్రవరి 22) ఉండగా ఇంతలోనే మరణించడంతో అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహనకృష్ణ తనయుడిగా తారకరత్న 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తారకరత్నకు తెలిసిన స్నేహితుల ద్వారా అలేఖ్యరెడ్డి పరిచయమైంది. ఆమె పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తారక్ సినిమా నందీశ్వరుడికి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. కానీ వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. కారణం అలేఖ్యకు ఇదివరకే పెళ్లై విడాకులు కావడమే! అయినా వెనక్కు తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో తనను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇరు కుటుంబాలు ఈ జంటను చేరదీశాయి. 2013లో వీరి ప్రేమకు గుర్తుగా నిషిక అనే పాప జన్మించింది. పాపు పుట్టాక తన ఆలనా పాలనా చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంది అలేఖ్య. కానీ ఇలా తారకరత్న అర్ధాంతరంగా తనువు చాలించడంతో అలేఖ్య, ఆమె కూతురు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. చదవండి: తారకరత్న చివరి కోరిక ఏంటో తెలుసా? -
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి
-
సోమవారం తారకరత్న అంత్యక్రియలు
'ఒకటో నెంబర్ కుర్రాడు'తో వెండితెరపై అడుగుపెట్టి పలు సినిమాలు చేసిన టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో తన నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానులు, ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. కాగా గత నెల 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. అక్కడ 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు తుదిశ్వాస విడిచారు. చదవండి: వైరల్‌గా మారిన తారకరత్న చివరి వీడియో -
తారకరత్న నాకు ఎంతో సన్నిహితుడు: అలీ
నందమూరి తారకరత్న మృతిపట్ల ప్రముఖ నటుడు అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఎంతో సన్నిహితుడైన తారకరత్న ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలచవేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలీ తమ్ముడు ఖయ్యూం కూడా తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు. ‘తారకరత్న నేను బావా బావా అని పిలుచుకునే వాళ్ళం. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం దారుణం’ అని ఖయ్యూం అన్నారు. తారకరత్న సినీ కెరీర్ ప్రారంభం నుంచి అలీ గారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తారకరత్నతో అలీ నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. తారకరత్న చివరి పెద్ద సినిమా ఎస్ 5 చిత్రంలో కూడా అలీ నటించారు. -
తారకరత్న చేతిపై పచ్చబొట్టు.. ఆ ఆటోగ్రాఫ్ ఎవరిదంటే?
నటుడు నందమూరి తారకరత్న మరణంతో అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తారకరత్న సినిమాల గురించి, ఆయన మంచితనం గురించి అభిమానులు చర్చించుకుంటుండగా ఆయన చేతిపై ఉన్న టాటూ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ టాటూ ఏంటో తెలుసా? అది సింహం బొమ్మ. ఆ బొమ్మ కింద బాలకృష్ణ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. బాలయ్యపై ఉన్న అభిమానంతోనే తారకరత్న ఈ పచ్చబొట్టు వేయించుకున్నారు. తారకరత్న, బాలకృష్ణలకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ అలాంటిది. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయినప్పుడు అంతా తానై చూసుకున్నారు బాలయ్య. తను కోలుకునేందుకు ఆయన చెవిలో మృత్యుంజయ మంత్రం జపించారు. అలాగే బెంగళూరు నారాయణ హృదయాల డాక్టర్స్‌తో మాట్లాడి తనను అక్కడకు షిఫ్ట్ చేయించారు. ప్రత్యేక వైద్యులను పిలిచి మరీ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆస్పత్రి బిల్లులు చెల్లిస్తూ కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తూ ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి తర్వాత తండ్రిగా తారకరత్న బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. చదవండి: ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన తారకరత్న -
నందమూరి తారకరత్న కన్నుమూత
-
తారకరత్న చివరి కోరిక ఇదే.. అది నెరవేరకుండానే!
నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్న ఆయన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. తారకరత్న రాజకీయాల్లోకి రావడమే కాకుండా ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. అటు నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే లోకేశ్‌తో ఆ మధ్య భేటీ కూడా అయ్యారు. మర్యాదపూర్వక భేటీగా బయటకు చెబుతున్నప్పటికీ రాజకీయ పరిణామాలతో పాటు పోటీ చేసే స్థానంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి తోడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి సిద్ధమయ్యాను, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని ఆయన ఓ సందర్భంలో చెప్పడంతో ఆ రూమర్స్ నిజమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే జోరుగా పర్యటనలు చేశారు. కానీ ఇంతలోనే చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఇంత చిన్నవయసులోనే తారకరత్నను తీసుకెళ్లి దేవుడు ఇంత అన్యాయం చేశాడేంటి? అని అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చదవండి: ఇంత చిన్నవయసులోనే వెళ్లిపోయావా?: తారకరత్న మృతిపై సంతాపం -
వైరల్‌గా మారిన తారకరత్న చివరి వీడియో
నటుడు నందమూరి తారకరత్న మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత నెల 27న లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన రోజు తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చింది. బెంగళూరులో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. మధ్య మధ్యలో ఆయన కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా రెండు రోజులుగా పరిస్థితి మరింత క్షీణించింది. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన అన్నిరకాల ప్రయత్నాలు విఫలమవడంతో శనివారం నటుడు కన్నుమూశారు. ఈ క్రమంలో తారకరత్న చివరి క్షణాలు ఇవేనంటూ ఆయన కుప్పకూలిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తారకత్న తెల్లటి షర్ట్‌లో నుదుటన బొట్టుతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట బాలయ్య కూడా ఉన్నారు. నవ్వుతూ, సరదాగా మాట్లాడుతూనే పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. చదవండి: నందమూరి తారకరత్న ఇక లేరు -
తారకరత్న మృతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం
సాక్షి, అమరావతి: నందమూరి తారకరత్న మృతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తారకరత్న శనివారం రాత్రి కన్ను మూశారు. వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని శనివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. చదవండి: నందమూరి తారకరత్న కన్నుమూత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/7JRmclqyLv — Vijayasai Reddy V (@VSReddy_MP) February 18, 2023 -
తారకరత్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. నేడు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొన్న కల్యాణ్ రామ్‌కు తారకరత్న హెల్త్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నాడు. అతనికి మెరుగైన వైద్యం అందుతుంది. అయితే ఇప్పుడు కండీషన్ ఎలా ఉందన్నది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. ఆ విషయాలు హాస్పిటల్ వర్గాలు చెబితేనే బాగుంటుంది. మేం అందరం తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అతనికి మీ అందరి ఆశిస్సులతో తను పూర్తిగా రికవర్ అవుతాడని భావిస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. కాగా గత కొన్నిరోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు తారకరత్న పరిస్థితి ఇప్పడెలా ఉందన్నది అటు కుటుంబసభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు. -
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
మెరుగవుతోన్న తారకరత్న ఆరోగ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, బనశంకరి: నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. పురోగతి కనిపిస్తోందని తెలిపారు. డాక్టర్లు మంచి చికిత్స అందిస్తున్నారని, బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారని చెప్పారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిన 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ఇవాళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. గుండెతో పాటు రక్తప్రసరణ బాగుందని, రేపటి కల్లా మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: నాకు తెలిసిన బ్రహ్మనందం ఓ లెక్చరర్: మెగాస్టార్ -
తారకరత్న ఆరోగ్యంపై ఎమోషనల్ పోస్ట్ చేసిన చిరంజీవి
సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపింది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ఊరటనిచ్చే విషయం చెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన తారకరతన్న కోలుకుంటున్నారని తెలిసి తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. ‘‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుండి తారకరత్నను కాపాడిన ఆ డాక్టర్లకి, భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను మై డియర్ తారకరత్న’’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఈ పోస్ట్‌తో నెట్టింట వైరల్‌గా మారింది. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. May you have a long and healthy life dear Tarakaratna! — Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023 -
ఇంకా వెంటిలేటర్‌పైనే తారకరత్న.. రిపోర్టులు వచ్చాక క్లారిటీ
నందమూరి తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని నందమూరి రామకృష్ణ తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగుపడిందని అయితే సిటీ స్కాన్ రిపోర్టు వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందన్నారు. తారకరత్నకు అసలు ఎక్మోనే పెట్టలేదు. అతని అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయి. కొంత ఆక్సిజన్ సొంతంగానే తీసుకుంటున్నారు. క్రమంగా కోలుకుంటున్నాడు. పూర్తిగా రికవర్ అయ్యేందుకు సమయం పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. కాగా శుక్రవారం కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మొదలుపెట్టిన పాదయాత్రలో తారకరత్న ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే! -
ముగిసిన అబ్జర్వేషన్.. తారకరత్న హెల్త్‌పై అప్పుడే క్లారిటీ!
నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. అయితే తారకతరత్నకు ఈరోజు నిర్వహించే వైద్య పరీక్షలు కీలకం కానున్నాయి. ఈరోజు ఆయనకు ఎమ్ఆర్ఐ(MRI)స్కాన్ తీయనున్నారు. దీని ఆధారంగా ట్రీట్మెంట్ కొనసాగించనున్నారు. ఈనెల 27న తారకరత్న గుండెపోటుకు గురికాగా అప్పటి నుంచి పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. -
తారకరత్న గురించి గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్
సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అతని ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉన్న నేఫథ్యంలో కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్య అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తుండగా నిన్న(ఆదివారం)తారక్, కల్యాణ్ రామ్‌లు కుటుంబసమేతంగా బెంగళూరులోని హాస్పిటల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు మంచు మనోజ్ తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు వెళ్లారు. అతని ఆరోగ్యంపై వైద్యులను అడిగిన తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'తారకరత్నను చూడటం జరిగింది. రికవరీ అవుతున్నాడు. త్వరలోనే కోలుకొని బయటకు వచ్చేస్తాడు. తారకరత్న స్ట్రాంగ్ ఫైటర్. అతనికి ఇది టెస్టింగ్ టైమ్. నేను వందశాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల తారకతరత్న త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. visited #Tarakratna and am filled with hope and optimism for his future. He has our unwavering support and I'm sure with the grace of God and all the prayers of the people who care for him, he will make a full recovery soon and be back home with us. Love u babai 🙏🏼❤️ — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 29, 2023 -
తారకరత్న క్రిటికల్ కండీషన్ నుంచి బయట పడ్డారని చెప్పలేం: జూ. ఎన్టీఆర్
నందమూరి తారకరత్నను చూసేందుకు జూ. ఎన్టీఆర్ బెంగళూరు చేరుకున్నారు. కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితపై వైద్యులను తెలుసుకున్న అనంతరం తారక్ మీడియాతో మాట్లాడారు. 'అన్నయ్య(తారకరత్న) చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోంది. ప్రస్తుతం పోరాడుతున్నారు. క్రిటికల్ కండిషన్ నుంచి బయట పడ్డారని చెప్పలేం. కుటుంబసభ్యుడిగా ఇక్కడికి వచ్చాను. డాక్లర్లు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం, ప్రార్థనలు అవసరం' అని పేర్కొన్నారు. ఇక కల్యాణ్ రామ్ మాట్లాడుతూ... 'మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు త్వరగా కోలుకొని మన ముందుకు రావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అని తెలిపారు. -
నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. చికిత్సకు స్పందిస్తున్నారు : బాలయ్య
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. చికిత్స కొనసాగుతుందని, అతను కోలుకుంటాడన్న నమ్మకం తమకు ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్‌పైనే ఉన్నారు. స్టంట్ వేయడం కుదరలేదు, మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రత్యేక వైద్య బృందం అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. నిన్నటితో పోలిస్తే ఇవాల్టికి కాస్త మూమెంట్ ఉందని డాక్టర్లు చెప్పారు. తారకరత్న కోలుకుంటాడన్న నమ్మకం మాకు ఉంది. బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు ఉందన్నది తెలియాల్సి ఉంది. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్థించండి. అభిమానుల ప్రార్థనలతో త్వరగా కోలుకుంటాన్న నమ్మకం ఉంది'' అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. -
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్మెంట్ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు జూ ఎన్టీఆర్ ఇవాళ(ఆదివారం)బెంగళూరుకు వెళ్లనున్నారు. కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇప్పటికే తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు ఫోన్ చేసి ఎన్టీఆర్ ఆరా తీశాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరుకు చేరుకుంటున్నారు.కాగా తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. @tarak9999 @NANDAMURIKALYAN Visit In #TarakaRatna #TarakaratnaHealthUpdate #TarakaRathna #JrNTR #NandamuriBalakrishna pic.twitter.com/IPT3czlQTo — Ram_Yash (@mynameismr6) January 29, 2023 -
తారకరత్నకు మెలెనా? ఈ వ్యాధి గురించి తెలుసా..
సాక్షి, బెంగళూరు: తీవ్ర గుండెపోటుతో నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరి ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో ఆప్డేట్ అందింది. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర (GI) మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం బ్లీడింగ్ సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో.. ఎగువ జీర్ణాశయాంతరం దిగువ భాగంలో ఉండే.. పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరగవచ్చు. కారణాలు.. ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్త నాణాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలెనా సంభవిస్తుంది. మెలెనా లక్షణాలు.. మెలెనా వల్ల మలం నల్లగా, బంక మాదిరి స్థితిలో బయటకు వస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. హెమటోచెజియా స్థితికి.. మెలెనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. అనీమియాతో పాటు బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. రక్తం తక్కువగా పోయే స్థితిలో.. చిన్నపేగులో రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సలు పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్తో పాటు ఎండోస్కోపీ థెరపీలు, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలు, రక్త మార్పిడి లాంటి చికిత్సలు అందిస్తారు. అయితే.. మెలెనా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావ స్థితి నెలకొంటుంది. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం కారణంగానే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందువల్ల కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. మెలెనా.. రక్తపోటు కూడా నేపథ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ యొక్క అప్లికేషన్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం తారకరత్న విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, అయినప్పటికీ నైపుణ్యం కలిగిన వైద్య బృందంచే అధునాతన చికిత్స అందిస్తోందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
ఈ వార్త తీవ్రంగా కలిచివేసింది: సాయి ధరమ్ తేజ్
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే నందమూరి కల్యాణ్‌రామ్ ట్వీట్ చేయగా.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్త తనకు తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ట్వీట్ సాయి ధరమ్ తేజ్ రాస్తూ..' ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. తారకరత్న అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, మరింత దృఢంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ఆశిస్తున్నా. మా ప్రార్థనలు మీకు ఎప్పుడు అండగా ఉంటాయి. ' అని పోస్ట్ చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Disheartening to know this. Wishing a speedy recovery for #TarakaRatna Anna. Keeping you in all our prayers that you come back healthy & stronger 🙏 — Sai Dharam Tej (@IamSaiDharamTej) January 28, 2023 -
క్రిటికల్‌గా తారకరత్న ఆరోగ్యం.. రిలీజ్ వాయిదా వేసుకున్న కల్యాణ్ రామ్
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హెల్త్ బుటిటెన్ విడుదల చేసిన వైద్యులు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్స్ చేయడం సరికాదనుకున్నారు నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్ ఫిబ్రవరి10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాధే వెన్నల’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ఫుల్‌సాంగ్‌ను రేపు(ఆదివారం)సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అమిగోస్ మేకర్స్ ప్రకటించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date. Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU — Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023 -
తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్ రామ్..
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా హీరో కల్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా..“నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ”అంటూ ట్వీట్ చేశారు. నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను . Get well soon and get back to complete health brother. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 28, 2023 -
మాసివ్ హార్ట్ఎటాక్తోనే కుప్పకూలిన తారకరత్న!
సాక్షి, చిత్తూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఏస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందుతుండగా.. బెంగళూరు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం కుప్పంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మొదలు సందర్భంగా.. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్లు వేయలేదు. యాంజియోగ్రామ్ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్ వేస్తారా?.. ఇతర ట్రీట్మెంట్లు అందిస్తారా? అనేది వేచిచూడాలి. తారకరత్నకు భారీగా గుండెపోటు వచ్చిందని, అయితే ఆస్పత్రిలో వైద్యులు 40 నిమిషాలపాటు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారాయన. బాలకృష్ణ రాకతో ఆయన రికవరీ కావడం ఆశ్చర్యంగా ఉందని, బాలకృష్ణే దగ్గరుండి చూసుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తారకరత్నకు ప్రాణాపాయం తప్పిందని భావనలో ఉన్నామని బుచ్చయ్యచౌదరి చెప్పారు. అవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని, తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇక పరిస్థితిపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ లెఫ్ట్ సైడ్ వచ్చిందని తెలిపారు. ఎడమ వైపు 90 శాతం బ్లాక్ అయ్యింది. అయితే మిగతా రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పరిస్థితి మెరుగవుతోందని, వైద్యులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయినప్పటికీ బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి పాజిటివ్‌గానే ఉందని, దేవుడి దయతో పాటు కుటుంబం సభ్యుల ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో.. ఆయన మండిపడ్డారు. అంతకు ముందు.. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తారకరత్నను గ్రీన్‌ఛానల్ ద్వారా కుప్పం ఈపీఎస్ ఆస్పత్రి నుంచి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. -
‘ఎస్ 5: నో ఎగ్జిట్’ రివ్యూ
టైటిల్: ఎస్ 5: నో ఎగ్జిట్ నటీనటులు: తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ తదితరులు నిర్మాతలు: అదూరి ప్రతాప్‌రెడ్డి, దేవు శ్యాముల్, షైక్ రహీమ్, గాదె మిల్కిరెడ్డి, గౌతమ్ కొండెపూడి దర్శకత్వం: భరత్ కోమలపాటి సంగీతం: మణిశర్మ విడుదల తేది: డిసెంబర్ 30, 2022 కథేంటంటే.. సుబ్బు(తారకరత్న).. ముఖ్యమంత్రి సుబ్రహ్మణ్యం నాయుడు(సాయి కుమార్) కొడుకు. తండ్రికి రాజకీయంగా అండగా ఉంటాడు. తనను ప్రాణంగా ఇష్టపడే కొడుకు బర్త్‌డే వేడుకలను కాస్త వెరైటీగా చేద్దామని ట్రైన్లో ప్లాన్ చేస్తాడు సీఎం. బర్త్‌డే పార్టీ కోసమని సుబ్బు, స్నేహితుల కోసం విశాఖ పట్నం వెళ్లే ట్రైన్లో స్పెషల్ బోగీని ఏర్పాటే చేస్తాడు. ఆ బోగిలోకి అనుకోకుండా సన్నీ(ప్రిన్స్)కి సంబంధించిన బృందం ఎక్కుతుంది. సుబ్బు, సన్నీ టీమ్ మధ్య గొడవ జరుగుతుంది. దీంతో సన్నీ టీమ్ మధ్యలోనే ట్రైన్ దిగేందుకు సిద్దమవుతుంది. కానీ డోర్స్ ఓపెన్ కావు. అంతేకాదు బోగీలో ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా మాయవుతుంటారు. ఇంతలోనే ఆ బోగీ అగ్ని ప్రమాదానికి గురవుతుంది? అసలు ఆ బోగీ డోర్స్ ఎందుకు ఓపెన్ కాలేదు? అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? కొడుకు బర్త్‌డే వేడుకలను ట్రైన్లోనే జరపాలని ముఖ్యమంత్రి ఎందుకు ప్లాన్ చేశాడు? బోగీలో దాగి ఉన్న సీక్రెట్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. అధికారం కోసం కొంతమంది ఎంతటి క్రూరమైన నిర్ణయాలైన తీసుకుంటారనేది ఈ సినిమా ద్వారా చూపించాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో తడబడ్డాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథను మొదలెట్టాడు. ట్రైన్లో జరిగే సన్నివేషాలను అలీ ‘బిగ్‌బాస్’షోతో పోల్చడం నవ్వులు పూయిస్తుంది. దెయ్యం ఒక్కొక్కరిని మాయం చేయడం.. అసలు ఏం జరుగుతుందో తెలియక బోగీలో వాళ్లు టెన్షన్ పడడం ఆసక్తికరంగా అనిపించనప్పటికీ.. కొన్ని లాజిక్ లేని సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కాస్త ఆకట్టుకుంటాయి. ఇక నటీనటుల విషయానికొస్తే.. తారకరత్న గెటప్ బాగుంటుంది. కానీ అతని నటన అంతగా ఆకట్టుకోలేకపోయింది. దొంగల ముఠా సభ్యునిగా ప్రిన్స్ నటన పర్వాలేదు. సీఎం పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయాడు. టీసీగా అలీ, యూట్యూబర్‌గా సునీల్ కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. రఘు, మెహబూబ్ దిల్సే తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గటుగా ఉన్నాయి. -
తొలి సంపాదన రూ.350.. పూరీ, చార్మీ చాలా ప్రోత్సహించారు: భరత్
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయికుమార్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎస్ 5: నో ఎగ్జిట్’. భరత్ కోమలపాటి దర్శకత్వంలో ఆదూరి ప్రతాప్‌రెడ్డి, దేవు శ్యాముల్, షైక్ రహీమ్, గాదె మిల్కి రెడ్డి, గౌతమ్ కొండెపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఈ చిత్రదర్శకుడు భరత్ మాట్లాడుతూ– ‘‘మాది అనంతపురం. ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యాక హీరో అవుదామని 2003లో హైదరాబాద్ వచ్చాను. సినిమా ప్రారంభమైంది కానీ, ఆగిపోయింది. ఆ తర్వాత డ్యాన్సర్‌గా చాన్స్ వచ్చింది. తొలి సంపాదన 350 రూపాయలు. ఆ తర్వాత ‘ఆట’ షోలో పాల్గొన్నాను. కాన్సెప్ట్స్‌తో సాంగ్ కొరియోగ్రఫీ చేసుకుంటున్నానని తెలిసి పూరి జగన్నాథ్, చార్మీగార్లు ప్రోత్సహించారు. కొరియోగ్రాఫర్‌గా ‘జ్యోతిలక్ష్మి’ నా తొలి సినిమా. ఎన్టీఆర్‌గారి ‘టెంపర్’కూ చేశాను. ఇక ‘ఎస్ 5: నో ఎగ్జిట్’ విషయానికి వస్తే...ఇందులో సుబ్బు అనే పాత్రను తారకరత్న పోషించారు. ఆయన సీఎం సాయి కుమార్ కొడుకు. తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు ఓ కోచ్ ను బుక్ చేసుకుంటారు. ఇందులోని వారంతా బోగిని అలంకరించుకుని పార్టీ చేసుకుంటారు. అప్పుడు సడెన్ గా కోచ్ డోర్స్ క్లోజ్ అవుతాయి. నో ఎగ్జిట్ అన్నమాట. ఆ తర్వాత అగ్నిప్రమాదం జరుగుతుంది. అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కథనం ఊహకందదు. ఇందులో పొలిటికల్ డ్రామా కూడా చూపిస్తున్నాం. తారకరత్న 45 డేస్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆయన ఎక్కువగా మాట్లాడకుండా తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకునే వ్యక్తి. నాన్న చెప్పిందే చేస్తా నాకేం తెలియదు అన్నట్లు ఉంటాడు. అలాగే టీసీ పాత్రలో అలీ గారు, మరో కీ రోల్ లో సునీల్ గారి నటన ఆకట్టుకుంటుంది.మణిశర్మగారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది’అన్నారు. ‘ఈ సినిమాను 200 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. సాగా ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది.. ఈ చిత్రంతో మా టీమ్ అందరికి మంచి పేరొస్తుందని ఆశిస్తున్నాం’అని అన్నారు నిర్మాత గౌతమ్. -
SSMB28: మహేశ్ సినిమాలో విలన్‌గా నందమూరి హీరో? ట్వీట్‌తో క్లారిటీ!
Taraka Ratna As Villain In Mahesh Babu SSMB28 Movie?: సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉన్న మహేశ్ త్వరలోనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఎస్ఎస్ఎమ్బీ28(#SSMB28) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చదవండి: మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్ దీనిపై సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే రోజున(మే 31) స్పష్టత వచ్చే అవకాశం ఉందని వినికిడి. ఇక జూలైలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నందమూరి హీరో తారకరత్న ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఓటీటీకి శివకార్తికేయన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘డాన్’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్ అయితే ఇందులో వాస్తవమెంత అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఆ సందేహాలకు తెర దించుతూ తారకరత్న తాను మహేశ్ 28వ సినిమాలో చేయనున్నట్టు ఒక ట్వీట్ వదిలాడు. విలనిజానికి సంబంధించిన ఒక ఎమోజీని జోడించాడు. గతంలో తారకరత్నా పలు చిత్రాల్లో విలన్‌గా చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆయన పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఆసక్తి నెలకొంది. #SSMB28 💉👺 — Nandamuri TarakaRathna (@NTarakarathna) May 28, 2022 -
హాట్‌స్టార్‌లో మరో కొత్త వెబ్‌సిరీస్, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
వినోదాన్ని అందించేందుకు ఓటీటీలు సై అంటున్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను మాత్రమే అందించకుండా ఒరిజినల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. సరికొత్త కథలు, వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాయి. దేశంలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ తాజాగా 9 హవర్స్ అనే మరో కొత్త వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయనుంది. అందులో భాగంగా శనివారం నాడు 9 అవర్స్ టీజర్ విడుదలయింది. 'మర్చిపోకండి.. మళ్లీ హాజరు సమయానికి మీకు మధ్య 9 గంటలు మాత్రమే!' అన్న సింగిల్ డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. ముగ్గురు ఖైదీలు తప్పించుకునేందుకు వేసిన ఒక్క ప్లానే 9 అవర్స్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌లో తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుషాలిని, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించగా ప్రీతి, అంకిత, జ్వాల, మోనిక ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్ 2 నుంచి అన్ని ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. చదవండి: జాన్ అబ్రహం, రకుల్ మూవీ 'యాక్షన్', ఎప్పటినుంచంటే? -
నటుడు తారకరత్న బంధువులపై దాడి..
సాక్షి, బంజారాహిల్స్ : సినీ నటుడు నందమూరి తారకరత్న బంధువులపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి దాడి చేసి పరారైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని సాగర్ సొసైటీ ఫ్లాట్ నంబర్ 35లో విజయవాడకు చెందిన బెజవాడ బాలకృష్ణ(33) అనే తారకరత్న బంధువు అద్దెకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తన సోదరుడు ఎం.కృష్ణాత్మ(45) అనే ఈవెంట్ మేనేజర్‌తో కలిసి టీ తాగుతున్నాడు. ఇదే సమయంలో నలుగురు ఆగంతకులు ఉదయం 10.30 గంటల ప్రాతంలో ఇంట్లోకి ప్రవేశించి వీరిద్దరి కళ్లల్లో కారం పొడి చల్లారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. కొద్దిసేపట్లోనే ఆ నలుగురు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఈ దాడిలో కృష్ణాత్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికి తల, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కోలుకున్న తర్వాత రాత్రి తారకరత్నలో కలిసి పోలీసులకు తమపై దాడి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు 30 నుంచి 35 ఏళ్ల వయసు వారై ఉంటారని తెలిపారు. వారు తమపై ఎందుకు దాడి చేశారు, వారు ఎవరై ఉంటారన్న వివరాలు తెలియదని తెలిపారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు వచ్చిన కారు నంబర్ కోసం ఆరా తీస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 452, 324 కింద కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు. -
ఎమ్మెల్సీ గంగులను కలిసిన తారకరత్న
సాక్షి, ఆళ్లగడ్డ: సినీ హీరో నందమూరి తారకరత్న శనివారం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జమ్మలమడుగు మండలం గండికోటలో జరుగుతున్న చిత్రం షూటింగ్ నిమిత్తం వచ్చిన తారకరత్న తిరుగు ప్రయాణంలో వైఎస్సార్సీపీ నాయకుడు గిరిధర్‌రెడ్డితో కలసి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని కలిశారు. (కోనేటి ఆదిమూలంకు సీఎం జగన్ పరామర్శ) అహోబిలేశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ముందుగా మఠం మేనేజర్ వైకుంఠం, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.