
నందమూరి తారకరత్న మృతిపట్ల ప్రముఖ నటుడు అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఎంతో సన్నిహితుడైన తారకరత్న ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలచవేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలీ తమ్ముడు ఖయ్యూం కూడా తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు. ‘తారకరత్న నేను బావా బావా అని పిలుచుకునే వాళ్ళం. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం దారుణం’ అని ఖయ్యూం అన్నారు.
తారకరత్న సినీ కెరీర్ ప్రారంభం నుంచి అలీ గారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తారకరత్నతో అలీ నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. తారకరత్న చివరి పెద్ద సినిమా ఎస్ 5 చిత్రంలో కూడా అలీ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment