ali
-
'ఇంత చెత్తగా ఆడుతారని ఊహించలేదు.. నన్ను క్షమించండి'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. టోర్నీ ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఈ మెగా టోర్నీకి ముందు తాము చేసిన వ్యాఖ్యలను పాక్ మాజీ ఆటగాళ్లు వెనక్కి తీసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు పాకిస్తాన్ చేరుతుందని, తుది పోరు లాహోర్ వేదికగా జరుగుతుందని అలీ అంచనా వేశాడు. అయితే పాక్ లీగ్ స్టేజిలోనే నిష్క్రమించిడంతో తాజాగా అలీ క్షమాపణలు చెప్పాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాలని తను కోరుకుంటున్నట్లు అతడు తెలిపాడు."ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహెర్ వేదికగా జరుగుతుందని, పాక్ టైటిల్ పోరుకు ఆర్హత సాధిస్తుందని చెప్పినందుకు నన్ను క్షమించిండి. ఈ టోర్నీలో పాకిస్తాన్ టీమ్ ఇంత చెత్తగా ఆడుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ అధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మర్చి 9న దుబాయ్ వేదికగా ఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్‌లు తలపడితే బాగుంటుంది. మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను తలపిస్తుందని అనుకుంటున్నాను" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.బై బై అకీబ్..!ఇక ఈ ఘోర ప్రదర్శన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తమ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలిగించాలని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న అకిబ్ పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది.ఈ టోర్నీ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టు వైట్‌బాల్ సిరీస్‌లో తలపడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. దీంతో న్యూజిలాండ్ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త హెడ్‌కోచ్ అవకాశముందని పీసీబీ మూలాలు వెల్లడించాయి. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో రావల్పిండి వేదికగా తలపడనుంది.చదవండి: మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్ -
టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. సెలబ్రేషన్స్ చూశారా!
టాలీవుడ్ కమెడియన్ నటుడు అలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడీతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.జుబేదాను పెళ్లాడిన అలీ..అయితే జుబేదాను పెళ్లాడిన అలీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2022 డిసెంబర్లో పెద్దకూతురు ఫాతిమా పెళ్లిని గ్రాండ్‌గా చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా అలీ సైతం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మనం కూడా చూసేద్దాం.గ్రాండ్‌గా అలీ పెళ్లి వేడుక..ఇటీవల తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలీ దంపతులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి వివాహా వేడుక జరుపుకున్నారు. తమ ఇద్దరు కూతుర్ల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియో జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. వారి సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
‘నిన్ను నన్ను కన్న ఆడది..రా!’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆగ్రాకి స్వాగతం
అలీ ప్రధాన పాత్రలో ‘వెల్కమ్ టు ఆగ్రా’ అనే హిందీ సినిమా రూపొందుతోంది. ఆశిష్ కుమార్ దూబే రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ‘వెల్కమ్ టు ఆగ్రా’ సినిమాప్రారంభోత్సవంలో భాగంగా ముహూర్తపు సన్నివేశాన్ని ముంబైలో చిత్రీకరించారు.ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ– ‘‘ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా జరిగే ప్రేమకథే ఈ సినిమా. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు దర్శక– నిర్మాతలకు కృతజ్ఞతలు. గతంలో సల్మాన్ ఖాన్ వంటి పలువురు హీరోల కాంబినేషన్లో హిందీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. ‘వెల్కమ్ టు ఆగ్రా’లో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేయనుండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఈ మూవీలో అన్షుమాన్ ఝా, సారా అంజలి, ఆకాశ్ ధబాడే, రౌనక్ ఖాన్, ఫైజల్ మాలిక్, అంచల్ గాంధీ, కైరా చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
సినీ నటుడు అలీకి నోటీసులు
-
సల్మాన్ కంటే అతనే బెటర్.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్‌ఫ్రెండ్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్‌తో పోల్చింది. అతనికంటే సల్మాన్ ఖాన్ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ అలీ.. సల్మాన్‌తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్‌స్టార్ బిష్ణోయ్ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు. సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్‌తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెటర్ అని సోమీ అలీ చెప్పింది.గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్‌తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. -
సాజిద్ మాయాజాలం
రావల్పిండి: ఇంగ్లండ్ బ్యాటర్ల బలహీనతపై పాకిస్తాన్ దెబ్బ కొట్టింది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను రూపొందించి మూడో టెస్టులో శుభారంభం చేసింది. గురువారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 68.2 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్లు సాజిద్ అలీ, నోమన్ అలీ తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. రావల్పిండిలోనూ ఈ ఇద్దరు మరోసారి ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెట్టారు. ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ 128 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మరో వికెట్ లెగ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్‌కు లభించింది. ఒకదశలో ఇంగ్లండ్ జట్టు 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జేమీ స్మిత్ (119 బంతుల్లో 89; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగ చకచకా పరుగులు చేశాడు.గుస్ అట్కిన్సన్ (39; 5 ఫోర్లు)తో కలిసి జేమీ స్మిత్ ఏడో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. ఓపెనర్లు బెన్ డకెట్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్రాలీ (29; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 56 పరుగులు జత చేశారు. క్రాలీని నోమన్ అలీ అవుట్ చేశాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అబ్దుల్లా షఫీఖ్ (14; 1 ఫోర్), సయీమ్ అయూబ్ (19; 1 ఫోర్), కమ్రాన్ గులామ్ (3) అవుటయ్యారు. షాన్ మసూద్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఇజ్రాయెల్‌కు మూడింది
టెహ్రాన్: బద్ధ శత్రువైన ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంపై ఇటీవల తాము చేసిన క్షిపణి దాడుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. యూదు పాలకుల నేరాలకు ఇది కనిష్ట శిక్ష అని పేర్కొన్నారు. తమ సైనిక దళాలు అద్భుతమైన కార్యం నిర్వర్తించాయని కొనియాడారు. అవసరమైతే హెజ్‌పోల్లా, హమాస్ తదితర గ్రూపులతో కలిసి ఇజ్రాయెల్‌పై మరోసారి దాడులు చేస్తామని తేల్చిచెప్పారు. ‘‘ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, లెబనాన్‌లో జరుగుతున్న పోరాటాలకు మద్దతిస్తున్నాం. శత్రువును ఓడించి తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘అఫ్గానిస్తాన్ నుంచి యెమన్ దాకా, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ దాకా ముస్లిం దేశాలన్నీ ఈ ప్రయత్నంలో ఒక్కటి కావాలి.ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్‌కు మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి’’ అంటూ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉనికిలో ఉండబోదని జోస్యం చెప్పారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఇటీవలి క్షిపణి దాడుల తర్వాత తొలిసారిగా ఆయన ప్రజలకు దర్శనమిచ్చారు. శుక్రవారం టెహ్రాన్‌లోని మొసల్లా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ జన సందోహాన్నిఉద్దేశించి చరిత్రాత్మక ప్రసంగం చేశారు. రైఫిల్ చేబూని ఆద్యంతం భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఖమేనీ బహిరంగంగా మాట్లాడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. హెజ్‌పోల్లా చీఫ్ నస్రల్లాను బంకర్ బాంబులతో ఇజ్రాయెల్ హతమార్చిన వెంటనే ఆయనను హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు వార్తలు రావడం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇలా జనం మధ్యలోకి రావడమే గాక చరిత్రాత్మక మసీదును వేదికగా చేసుకుని ప్రసంగించడానికి చాలా ప్రాధాన్యత ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరిక సంకేతాలు పంపడంతో పాటు ఆ దేశంపై పోరులో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని పశ్చిమాసియాలోని హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి సాయుధ గ్రూపులకు భరోసా ఇవ్వడం ఖమేనీ ఉద్దేశమని విశ్లేíÙస్తున్నారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం తప్పదని కూడా ఖమేనీ ప్రసంగం సంకేతాలిచి్చందంటున్నారు. ప్రధానంగా ఫార్సీలోనూ, పాలస్తీనా, లెబనాన్ మద్దతుదారు కోసం మధ్యలో అరబిక్‌లోనూ ఆయన 40 నిమిషాలపాటు మాట్లాడారు. ‘‘గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలో పాలస్తీనా ప్రజలు చేసిన దాడిలో న్యాయముంది. పాలస్తీనా పౌరుల చర్య చట్టబద్ధమే. ఇజ్రాయెల్‌పై మా దాడులు కూడా చట్టబద్ధమే’’అని ఉద్ఘాటించారు. నస్రల్లా మార్గం స్ఫూర్తిదాయకం ఖమేనీ ప్రసంగానికి ముందు టెహ్రాన్‌లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తోపాటు ఇరాన్ ఉన్నతాధికారులు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్స్ హాజరయ్యారు.చేతిలో రైఫిల్ వెనక...ఖమేనీ తన ప్రసంగం సందర్భంగా రైఫిల్ చేతబట్టడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది రష్యాలో తయారైన డ్రాగనోవ్ రైఫిల్. ఇజ్రాయెల్ విషయంలో వెనుకడుగు వేసే సమస్యే లేదని, తీవ్ర ప్రతిఘటన తప్పదని తన చర్య ద్వారా ఆయన స్పష్టమైన సంకేతాలిచి్చనట్టు భావిస్తున్నారు. శత్రువుపై పోరాడాలని, విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రజలకు ఖమేనీ పిలుపునివ్వడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో డీలా పడ్డట్టు కని్పస్తున్న సైన్యంతో పాటు దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయన ప్రయత్నించారంటున్నారు.ఆ మసీదే ఎందుకు?ఖమేనీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చేందుకు రాజధాని టెహ్రాన్‌లోని చరిత్రాత్మక ఇమామ్ ఖొమేనీ మసీదును ఎంచుకున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మసీదుకు ఇరాన్లో విశేషమైన ప్రాముఖ్యముంది. దీన్ని గతంలో షా మసీదుగా పిలిచేవారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవంలో ఈ మసీదు కీలక పాత్ర పోషించింది. నగరంలో ఇదో ల్యాండ్‌మార్క్. ప్రజా పోరాటాలకు, నిరసన గళానికి చిహ్నం. అప్పట్లో ఈ మసీదు కేంద్రంగానే ప్రజలు ఉద్యమించారు. ఇరాన్ పాలకుడు షా మొహమ్మద్ రెజా పహ్లావీని గద్దె దించారు. అనంతరం అయతొల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఆవిర్భవించింది. ఇస్లామిక్ జాతీయవాద నినాదం కింద పలు రాజకీయ పక్షాలు ఏకమవడానికి ఈ మసీదు వేదికగా ఉపయోగపడింది. -
భారత ఫుట్‌బాలర్ అన్వర్ అలీపై నిషేధం
కోల్‌కతా: ఆటగాళ్ల బదిలీకి సంబంధించి ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన భారత ఫుట్‌బాల్ ప్లేయర్ అన్వర్ అలీపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చర్యలు తీసుకుంది. అతనిపై నాలుగు నెలల నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత అన్వర్ ఆ కాంట్రాక్ట్‌ను పాటించకుండా అనూహ్యంగా ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు మారాడు. మరోవైపు వచ్చే ఏడాది వరకు కొత్త ఆటగాళ్లను తీసుకోవడంపై నిషేధం ఉన్నా సరే... దానిని ధిక్కరించి ఢిల్లీ ఎఫ్‌సీ కూడా అన్వర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అంశం తీవ్ర వివాదం రేకెత్తించింది. దాంతో విచారణ జరిపిన ఏఐఎఫ్ఎఫ్ అన్వర్‌పై నిషేధంతో పాటు భారీ జరిమానా విధించింది. అన్వర్ అలీ నుంచి రూ.12 కోట్ల 90 లక్షలు నష్టపరిహారం పొందేందుకు మోహన్ బగాన్ క్లబ్ జట్టుకు అర్హత ఉందని స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని ఈస్ట్ బెంగాల్ క్లబ్, ఢిల్లీ ఎఫ్‌సీ, అన్వర్ కలిసి చెల్లించాలని ఏఐఎఫ్ఎఫ్ ఆదేశించింది. -
సంగీత ప్రియులను అలరించనున్న ‘జావేద్ అలీ’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ జావేద్ అలీ తన స్వరాలతో నగరవాసులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వరల్డ్ మ్యూజిక్ డే ఫెస్టివల్లో భాగంగా ఈనెల 21న నగరంలోని ప్రిజంలో జావేద్ అలీ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్, స్కిల్బాక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ షో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుందని హంగామా డిజిటల్ మీడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌమిని పాల్ తెలిపారు. జోధా అక్బర్ ఫేమ్ ’జాష్్న–ఈ–బహారా’, పుష్ప...’శ్రీవల్లి’, బజరంగీ భాయిజాన్లోని ’తు జో మిలా’ వంటి హిట్ సాంగ్స్‌తో సంగీత ప్రియులను సమ్మోహనం పరచనున్నారని, కాన్సర్ట్ టికెట్లు స్కిల్బాక్స్లో అందుబాటులో ఉన్నాయని సౌమిని అన్నారు. ఈ కాన్సర్ట్‌కు సంబంధించి.. ‘ప్రత్యక్ష ప్రదర్శన ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటుందని, హైదరాబాదీ అభిమానులను అలరించడానికి ఇదొక మంచి అవకాశమని’ సింగర్ జావేద్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. అద్భుతమైన మ్యూజిక్ నైట్ కోసం తానూ ఎదురు చూస్తున్నానని అందులో వెల్లడించారు. -
కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి హీరో.. ఫస్ట్ లుక్ లాంచ్
డిఫరెంట్ సినిమాలు తీస్తూ కొత్త దర్శకులు ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఓ సినిమానే 'ప్రణయ గోదారి'. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించగా, ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)పోస్టర్ చూస్తుంటే గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు కనిపిస్తున్నాయి. నది ఒడ్డున హీరో హీరోయిన్ సైకిల్‌పై ప్రయాణం చేయడం చూస్తుంటే వింటేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనిపిస్తోంది. మార్కండేయ సంగీతమందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.(ఇదీ చదవండి: 12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్) -
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.చాలా కాలం తర్వాత ఈ సీనియర్ నటి బాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్ కమెడిన్ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడు. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్ కొడుతూ సందడి చేయాలి. నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్ అయింది. -
విజయవంతంగా TAL జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ TAL జాతీయ బ్యాడ్మింటన్‌షిప్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని ఆస్టర్లీ స్పోర్ట్స్, అథ్లెటిక్స్ సెంటర్లో మార్చి 16-, ఏప్రిల్ 6న పోటీలు నిర్వహించింది. లండన్‌తో పాటు యూకేలోని ఇతర సమీప కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మెన్స్ డబుల్స్, మెన్స్ 40+ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, విమెన్స్ 35+ డబుల్స్, అండర్-16.. ఇలా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తంగా 250 మంది బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇందులో భాగమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ హాస్య నటులు అలీ విజేతలకు బహమతులు అందజేశారు. -
యాక్టర్ ఆలీ చేతులమీదగా అతియాస్ కిచెన్ గొప్ప ప్రారంభం (ఫొటోలు)
-
టాలీవుడ్లో మరో నిర్మాణ సంస్థ.. ప్రారంభించిన అలీ!
టాలీవుడ్లో మరో నూతన నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ‘శివమ్ మీడియా’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. తాజాగా శివమ్ మీడియా లోగో, బ్యానర్‌ను ప్రముఖ నటుడు అలీ, నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్ కడియాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. 'శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది' అని అన్నారు. అనిల్ కడియాల మాట్లాడుతూ– 'శివమల్లాల మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్ మీడియా’ అనే బ్యానర్ ద్వారా సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. 'ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తోంది. ఈ విషయంలో నేను ఎంతో ఫీలవుతున్నా. మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. శివమ్ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ.. 'నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం చాలా సంతోషం. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తా' అని అన్నారు. -
సాగుబడి: 15 నిమిషాల్లోనే.. ఎడ్ల బండితో పిచికారీ!
కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి తగ్గించుకునే ఆలోచనతో ఓ యువరైతు వినూత్న స్ప్రేయర్‌ను రూపొందించారు. ఎడ్లబండిపై పెట్టుకొని ఉపయోగించుకునేందుకు ఈ స్ప్రేయర్ అనువైనది కావటం విశేషం. అందరి మన్ననలు అందుకుంటున్న మక్దుం అలీపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామానికి చెందిన మక్దుం అలీ(38)కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే చదువు ఆపేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. సాగునీటి ఇబ్బందులున్నప్పటికీ.. రెండెకరాల్లో కంది, ఆముదాలు, పత్తితోపాటు మరో ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరగడం, రాబడి తగ్గుతుండడంతో ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు. పురుగు మందులతోపాటు కూలీల ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగుచూసింది. ఎడ్ల బండిపై 5 హెచ్‌పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైఫర్ మోటర్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్లతో సుమారు రూ.45 వేల వ్యయంతో అలీ దీన్ని రూపొందించారు. ఎడ్ల బండిపై కూర్చున్న రైతు బండిని తోలుకెళ్తూ ఉంటే.. బండి వెనుక వైపు బిగించిన రెండు స్ప్రేగన్లు ఏకకాలంలో పిచికారీ చేస్తాయి. అటు 20 అడుగులు, ఇటు 20 అడుగుల (దాదాపు ఆరు సాళ్ల) వరకు పురుగుల మందును ఈ యంత్రం పిచికారీ చేస్తుంది. మనిషి అవసరం లేకుండానే రెండు స్ప్రేగన్లు, రెండు డ్రమ్ముల ద్వారా 15 నిమిషాల్లోనే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తాయి. ఎడ్లబండిపై కూర్చునే వ్యక్తికి, ఎద్దులకు మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో వెనుక వైపున పురుగుమందు పిచికారీ అవుతున్నందున ఇబ్బంది ఉండదు. అలీని కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా ‘ఇంటింటా ఇన్నోవేషన్’కు ఎంపిక చేశారు. టీహబ్ అధికారులూ ప్రశంసించారు. – పెరుమాండ్ల కిషోర్ కుమార్, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఫొటోలు: సుదర్శన్‌గౌడ్, నర్వ స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ.. రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద ఎక్కువ. పంటలపై వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్క రోజులోనే పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించొచ్చు. నేను రూపొందించిన స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ చేయొచ్చు. దీంతోపాటు నిర్దేశించిన మేరకు ఖచ్చితత్వంతో ఎరువులు వేసేలా రూ.500 ఖర్చుతో పరికరాన్ని రూపొందించాను. కూలీలు అవసరం లేకుండా రైతు ఒక్కరే ఎరువులు వేసుకోవచ్చు. శాస్త్రవేత్త కావాలన్నది నా సంకల్పం. అయితే ఆర్థిక స్థోమత లేమి కారణంగా చదువు మధ్యలోనే ఆగింది. నాకున్న ఆలోచనతో స్ప్రేగన్ తయారు చేసిన. ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరుతున్నా. – మక్దుం అలీ (97038 20608), యువ రైతు, కల్వాల్, నర్వ ► గుంటూరులో చిరుధాన్య వంటకాలపై శిక్షణ.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10–5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666 / 95538 25532కు ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు తెలిపారు. ఇవి చదవండి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు! -
మెగాస్టార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నటుడు అలీ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ విభూషణ్ పొందిన చిరుకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని తర్వాత ఈ అవార్డ్ అందుకున్న నటుడిగి మెగాస్టార్ ఘనత సాధించారు. అంతే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్స్ బాబీ, గోపించద్ మలినేని, నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవిశంకర్ కూడా మెగాస్టార్‌ను అభినందించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ అప్డేట్స్ రానున్నాయి. Blockbuster directors @dirbobby, @megopichand, Producers #NaveenYerneni, @mythriravi & comedian #Ali met and conveyed their best regards to #PadmaVibhushanChiranjeevi garu for being bestowed with the prestigious #PadmaVibhushan award ✨@Kchirutweets @MythriOfficial… pic.twitter.com/0z8YD9DG5U — Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2024 -
పవన్ కళ్యాణ్, లోకేష్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అలీ
-
2024 జగనన్న వన్స్ మోర్.. అలీ
-
తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం/తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను ఎలు గెత్తి చాటారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో వేల్పూరు రోడ్డులో యాత్ర ప్రారంభమై నరేంద్ర సెంటర్ వరకు సాగింది. బస్సు యాత్రకు నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి బాణసంచా, పూలవర్షంతో బ్రహ్మరథం పట్టారు. తణుకు సెంటర్లో వేలాది జనం సమక్షంలో జరిగిన సభలో మంత్రులు, నేతలు ప్రసంగించారు. రామోజీకి ఎందుకింత కడుపుమంట? : మంత్రి జోగి రమేష్ బడుగు, బలహీన వర్గాలు సాధించిన సామాజిక సా«దికారతను ఓ వేడుకలా నిర్వహిస్తూ చేపట్టిన సాధికార బస్సు యాత్రలపై రామోజీరావుకు ఎందుకింత కడుపు మంట అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. సభ మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి, సభ అయిపోయి జనాలు వెళ్లాక ఖాళీ కుర్చీ ఫొటోలు తీసి జనాలు రాలేదంటూ రామోజీరావు, రాధాకృష్ణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అక్కసుతో విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వెనుక బడిన వర్గాల వారిని చట్ట సభలకు పంపించి వారిని ధైర్యంగా నిలబడేలా చేసింది సీఎంజగన్ మాత్రమేనన్నారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత జగన్‌కు దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. సీఎం జగన్ అందించిన సంక్షేమంలో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దకిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రూపాయి అవినీతికి తావు లేకుండా లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశారన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఒక్క జగన్ హయాంలోనే 2.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వీటిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ సమవేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్‌పై దేశవ్యాప్తంగా నమ్మకం: అలీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలుకు సూచనగా ఇప్పు డు చేస్తున్నవి యాత్రలు మాత్రమేనని, 2024లో జాతర జరగబోతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మోత మోగించిన సీఎం జగన్.. ఈ సారి 175కి 175 నియోజకవర్గా లనూ కైవసం చేసుకుంటారని తెలిపారు. సీఎం జగన్‌పై అందరికీ అపార నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైజాగ్ సమ్మిట్‌కు అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఏపీలో పరిశ్రమలు ఏర్పా టు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని, ఇదంతా సీఎం సుపరిపాలనతోనే సాధ్యమైందన్నారు. -
నాకు ఆరు భాషలు వచ్చు..పవన్ కళ్యాణ్ కు అలీ కౌంటర్..
-
31 లక్షల ఇళ్ల పట్టాలు రెడీ..అలీ కామెంట్స్
-
వినుకొండ బహిరంగ సభలో ఆలీ పంచులే పంచులు..!
-
ఆరు నూరైనా మళ్లీ జగనే సీఎం: వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, పల్నాడు: సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవ కల నెరవేరిందని, తిరిగి ఆయనే ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ కీలక నేతలు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వివరించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఎంతో చేశాడు. ఇవాళ ఆయా వర్గాలకు చెందినవాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానేత తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కారణం. వినుకొండలో మంచి నీటి సమస్యను పరిష్కరించాం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేయలేదు. కానీ, అధికారం ఇస్తే మాత్రం బెంజ్ కారు ఇస్తానంటారు.. రైతు రుణ మాఫీ చేస్తానంటారు. వినుకొండలో ఒక్క అభివృద్ధి పని చేశామని టీడీపీ నేతలు చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సామాజిక విప్లవం రావాలని విప్లవకారులు కోరుకున్నారు. ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదని చంద్రబాబు అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. వైఎస్ జగన్ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. పేద వాడు చదువుకోవాలని, వైద్యం చేయించుకోవాలని జగన్ ఆలోచించి అనేక కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు దళిత హక్కులను కాలరాశారు. అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసి ముళ్ళపొదల్లో చంద్రబాబు కడితే.. విజయవాడ నడిబొడ్డున జగన్ అంబేద్కర్‌కు భారీ విగ్రహం పెట్టారు. వైఎస్ జగన్ మరో అంబేద్కర్.. పూలే. చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. మోసకారి. ఆరు నూరైనా తిరిగి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేసిన కార్యక్రమాలు సాధికారితకు నిదర్శనం. జాషువా పుట్టి పెరిగిన గడ్డ వినుకొండ. జాషువా జయంతిని అధికారికంగా జరుపుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. కోర్టులో కూడా అబద్దం చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టులను మోసి చేసిన వ్యక్తి మనల్ని మోసం చేయడా?. బ్రహ్మన్నకు(ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడును ఉద్దేశించి..) మరోసారి అవకాశం ఇవ్వండి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. మంచి చేయకపోతే ఎవరినైనా ఏట్లో వేస్తామని వినుకొండ ప్రజలు గత ఎన్నికల్లో చెప్పారు. ఈ ప్రాంతం వెనుకబడిన ఉండటానికి ప్రధాన కారణం నీళ్ళు లేకపోవడమే. వరికిపూడిసెల తీసుకొచ్చి బొల్లాపల్లి మండలానికి సాగు త్రాగు నీరు ఇస్తామని చెప్పాం. ఇందులో భాగంగానే అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 17న మాచర్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి పనులు కూడా ప్రారంభిస్తాం. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. జగన్ అన్న కటౌట్ చూపించి సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తాం. జగన్ లేకుండానే ఇంతమంది వస్తే.. జగనన్న వస్తే జనసునామీ వచ్చేది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సాధికారిత సాధ్యమవుతుంది. పదవుల్లో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చారు. వార్డు మెంబర్ నుండి రాజ్యసభ ఎంపీ వరకూ అవకాశం ఇచ్చారు. రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే) ద్వారా పేదలకు పంచారు. ఒక బీసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. పద్నాలుగు ఏళ్ళు సీఎంగా చేసి.. నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తోకను బీసీలు కత్తిరించబోతున్నారు. చంద్రబాబును దళితులు ఓడించి.. ఆయన్ని ఆత్మవిమర్శ చేసుకునేలా చేయబోతున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ మాట్లాడుతూ.. బ్రహ్మ నాయుడుని యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎత్తుకొని జగన్ ముందు వరుసలో కూర్చో బెట్టారు. వైఎస్ తోనూ ఆయన కుమారుడు జగన్ తోనూ నా ప్రయాణం సాగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఎక్కడికైనా వెళ్తాను. మైనారిటీలు త్వరలోనే శుభ వార్త వింటారు. -
కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం!
సాక్షి, సంగారెడ్డి/పటాన్చెరు: ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బీడీఎస్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ గోల్కొండకు చెందిన మహమ్మద్ సయిద్(20), నుమాన్ అలీ(19), హసీం, మజిద్, ఫైజల్ ఆహారం తీసుకునేందుకు కారులో శనివారం రాత్రి సంగారెడ్డి వైపు బయలుదేరారు. పటాన్చెరు మండలం కర్ధనూర్ ఓఆర్ఆర్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సయిద్, అలీ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో మజీద్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: 'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం! -
కూతురు ముందే పిస్టల్‌తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘గోలీ కొట్టుకుంటా’.. అంటూ రెండుమూడు రోజులుగా సన్ని హితుల వద్ద చెపుతున్న రాచకొండ ఏఆర్ ఎస్సై మహ్మద్ ఫజల్ అలీ (59) పిస్టల్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న అలీ, తన చిన్న కుమార్తెతో కలసి ఆదివారం ఉదయం డ్యూటీలో చేరడానికి వచ్చి, ఆమె సమక్షంలోనే ఉసురు తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆర్థిక కారణాల నేపథ్యంలో అలీ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఫజల్ అలీ రాచకొండ కమిషనరేట్‌లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసినా.. భర్తలతో విడాకులు తీసుకున్న వీళ్లు ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ఓ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న కుమార్తె వివాహం చేయాలని భావించిన అలీ.. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.10 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు కేవలం రెండేళ్లు మాత్రమే సర్విసు ఉండటంతో బ్యాంకు అధికారులు రుణ దరఖాస్తును తిరస్కరించారు. రెండు వారాల క్రితం బ్యాంకు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఫజల్ అలీ, రుణం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. నోట్ బుక్‌లో రాసుకుని.. ఈ క్రమంలో రెండుమూడు రోజులుగా తన సన్నిహితులు, సహోద్యోగుల వద్ద ఆర్థిక ఇబ్బందులు, రుణం సమస్య గురించి చెప్పుకుంటున్న ఫజల్ అలీ నిరాశతో ‘గోలీ కొట్టుకుంటా’అంటూ వాపోయారు. ఓ నోట్ బుక్‌లోనూ తన ఆర్థిక పరిస్థితుల విషయం రాసి ఆ పేజీని తన వెంట ఉంచుకున్నారు. ఆదివారం ఉదయం చిన్న కుమార్తె ఫాతిమాను తీసుకొని శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్దకు డ్యూటీ కోసం వచ్చారు. ముందుగా ఆ సమీపంలో ఒక హోటల్ వద్ద కూతురిని దించి మంత్రి ఇంటికి వెళ్లారు. డ్యూటీ ఎక్కిన తర్వాత తన సర్వీస్ పిస్టల్ (9 ఎంఎం క్యాలిబర్) తీసుకొని కుమార్తె ఉన్న చోటుకి వచ్చారు. వీడియో తీయా ల్సిందిగా కుమార్తెకు చెప్పి తన సెల్‌ఫోన్ ఇచ్చారు. కొన్ని మాటలు నవ్వుతూ చెప్పిన అలీ, ఆపై ఫోన్ తీసుకుని, ఆమెను వెళ్లమని చెప్పారు. కుమార్తె వెనక్కు తిరిగిన వెంటనే ఫోన్ జేబులో పెట్టుకుని పిస్టల్‌తో తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకున్నారు. కుడి చెవిపై నుంచి దూసుకుపోయిన తూటా ఎడమ వైపు నుంచి బయటకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అలీ కుటుంబీకులకు అప్పగించారు. కాగా, ఫజల్ అలీ తండ్రి ఇబ్రహీం అలీ కూడా గతంలో హైదరాబాద్‌లో ఏఆర్ ఎస్ఐగా పనిచేశారు. ఆయన కూడా ఇలాగే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంతో 1986లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏఎస్ఐ ఫజల్ మృతి పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫజల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటుడు!
యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటుడు అలీ మర్చంట్. తాజాగా తన చిరకాల స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అలీ.. ముచ్చటగా మూడోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!) వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. సినీతారల కోసం ప్రత్యేకంగా నవంబర్ 15 న ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాగా.. అలీ మర్చంట్ ఇంతకుముందే నటి సారా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే విడిపోయారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్‌ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. తాజాగా మూడోసారి తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు. కాగా.. అలీ 'యే రిష్తా క్యా కెహ్లతా హై', 'బాందిని', 'యే హై ఆషికి' వంటి సీరియల్స్‌లో నటించారు. అంతే కాకుండా లాక్అప్ -1 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆయన భార్య ఆండ్లీబ్ మోడల్‌గా రాణిస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!) View this post on Instagram A post shared by Ali Mercchant (@alimercchant) -
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, కర్ణాటకలో సుదీప్..!
-
అమ్మాయిల అంతరాత్మ
ఎలీనా, లాస్య స్మైలీ, తన్వీ, శశిరేఖ ముఖ్య తారలుగా, జయక్రిష్, సమీర్, అర్జున్, మల్లిక్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరాత్మ’. ఎమ్. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తుమ్మల మనోజ్ యాదవ్, రావూరు సురేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. తొలి సన్నివేశానికి ఏసీపీ బాలకృష్ణా రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నటుడు అలీ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ‘‘నలుగురు అమ్మాయిల మధ్య సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు నాగ రాజశేఖర్. ఐఏఎస్ ఆఫీసర్ మురళీమోహన్ ఓ అతిథిగా పాల్గొన్న ఈ చిత్రానికి సంగీతం: జీఎమ్ సతీష్, కెమెరా: నాగరాజు. -
ఆలీ నేను మంచి ఫ్రెండ్స్ కానీ ఒకటే గొడవ..!
-
ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లో అలీ మీట్ అండ్ గ్రీట్
-
మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎల్రక్టానిక్ మీడియా) అలీ అన్నారు. వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం బ్రిస్బేన్‌లో “మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అలీ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్‌ను గెలిపించుకునేందుకు ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తండ్రి వైఎస్సార్ చూపిన బాటలో సీఎం జగన్ నడుస్తూ ప్రజా సంక్షేమంలో నాలుగు అడుగులు ముందుకేస్తూ కొత్త ఒరవడిని సృష్టించారని ప్రశంసించారు. ప్రజలే తన బలమని విశ్వసించి వారితోనే పయనం సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా క న్వినర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, ఇరువూరి బ్రహ్మరెడ్డి, జస్వంత్‌రెడ్డి బొమ్మిరెడ్డి , కోట శ్రీనివాస్‌రెడ్డి, రఘు రెడ్డి బిజివేముల, గజ్జల చంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
జగన్‌ని మళ్లీ సీఎం చేద్దాం: ఎన్నారైలకు అలీ పిలుపు
బ్రిస్బేన్: వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించుకుని.. తద్వారా జరగబోయే రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ఎన్నారైలకు పిలుపు ఇచ్చారు నటుడు, వైఎస్సార్సీపీ నేత.. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అలీ. సీఎం జగన్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిదని.. మరోసారి ఆయన్ని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలంతా భాగం కావాలని అలీ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. ఈ ఈవెంట్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి తోపాటు ఇరువూరి బ్రహ్మ రెడ్డి, జస్వంత్ రెడ్డి బొమ్మిరెడ్డి , కోట శ్రీనివాస్ రెడ్డి, రఘు రెడ్డి బిజివేముల మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వాళ్లు మారితే దేశం మారుతుంది : ఆలీ (నటుడు)
-
డబ్బింగ్ పనుల్లో ‘మిస్టరీ’
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని తన పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘ఇదొక థ్రిల్లర్ కామెడీ సినిమా. సాయి అనుకున్న కథని అనుకున్నట్లుగా తీశాడు. నా పాత్ర డబ్బింగ్ పూర్తయింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది. టీమ్ అందరికి నా అభినందనలు’అని అన్నారు. -
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్‌కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
అమెరికాలో అలీ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
Mystery Movie: ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా ఆలీ
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆలీ పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రం ఫోరెన్సిక్ ఆఫీసర్ సాయి పాత్రలో ఆలీ కనిపిస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ ‘దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చేపినపుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది’ అని తెలిపారు. ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం. ఆలీ డిఫరెంట్‌గా ఉంటుంది. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’అని హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ అన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘మిస్టరీ’..షూటింగ్ షురు
తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్‌ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్. పవర్ ఫుల్ పోలీస్‌గా రవిరెడ్డి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. -
నేనంటే ఆయనకు చాలా ఇష్టం..
-
డాలస్ : అమెరికాలో అంగరంగ వైభవంగా నాటా వేడుకలు (ఫొటోలు)
-
అమెరికా వెళ్తున్న అలీ ఫ్యామిలీ (ఫొటోలు)
-
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్‌లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
నంది అవార్డు ప్రతి ఆర్టిస్ట్ కల
‘‘1964 నుండి నంది అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డు అందుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్ కల. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి థ్యాంక్స్. అలాగే సీనియర్ నటుల పేరుతో స్మారక అవార్డ్స్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్‌లో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్‌ను అలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నంది అవార్డ్స్ పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు. -
రంజాన్ స్పెషల్: చిరంజీవిని కలిసిన అలీ..ఫోటోలు వైరల్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
రామబాణంలో సీన్ లీక్ చేసి నవ్వులు పూయించిన అలీ
-
iBOMMAలో సినిమా చూసే వాళ్ళ పై ఆలీ సీరియస్ కామెంట్స్
-
హైదరాబాద్‌లో ‘నాట్స్’ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అలీ పెద్ద మనసు.. మెరిట్ స్టూడెంట్స్‌కు చేయూత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతుంటాడు. తాజాగా అలీ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. విద్యా వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కు చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆస్ట్రేలియన్ అర్వేంసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యంతో మెరిట్ విద్యార్థులకు చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పించబోతున్నారు. ఈ విషయంపై తాజాగా అలీ మీడియాతో మాట్లాడుతూ..చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఏమి చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికి అర్వేంసిస్ సభ్యులు సభ్యులు ముందుకు రావడం సంతోషంగా ఉంది. వీళ్లు విద్య వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కి చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. ఇదేకాదు ఒకవేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరిస్తే.. ఇండియా నుంచి 20 మంది రైతులను అక్కడకు తీసుకెళ్లి ఉపాధి అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను’అని అలీ అన్నారు. -
నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్న కోడలి నాని, ఆలీ
-
తారకరత్న నాకు ఎంతో సన్నిహితుడు: అలీ
నందమూరి తారకరత్న మృతిపట్ల ప్రముఖ నటుడు అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఎంతో సన్నిహితుడైన తారకరత్న ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలచవేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలీ తమ్ముడు ఖయ్యూం కూడా తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు. ‘తారకరత్న నేను బావా బావా అని పిలుచుకునే వాళ్ళం. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం దారుణం’ అని ఖయ్యూం అన్నారు. తారకరత్న సినీ కెరీర్ ప్రారంభం నుంచి అలీ గారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తారకరత్నతో అలీ నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. తారకరత్న చివరి పెద్ద సినిమా ఎస్ 5 చిత్రంలో కూడా అలీ నటించారు. -
Pudami Sakshiga: వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ
Pudami Sakshiga 2023: రెడ్యూస్.. రీయూస్.. రీసైకిల్! వాడకం తగ్గించుకోవడం... వాడేసినవే మళ్లీ వాడటం... పడేసిన వాటితో కొత్తవి తయారు చేసుకుని వాడుకోవడం..! ఏమిటీ కర్మ! అవును కర్మే. మనిషి వల్ల పుడమికి పట్టిన కర్మ! అవసరం ఉన్నవీ లేనివి కొని, అవసరం తీరీ తీరకుండానే పడేస్తున్నాం. కొత్తవి కొంటున్నాం. కుండెడన్నం కోసం బండెడన్నం వండేస్తున్నాం. ఫ్రిజ్‌ని రైతుబజార్‌ని చేస్తున్నాం. వార్డ్రోబ్ పొట్ట పగిలేలా బట్టల్ని కుక్కేస్తున్నాం. భారీ ఫర్నీచర్‌తో ఇంటినంతా నింపేస్తున్నాం. బకెట్ల కొద్దీ నీళ్ల ట్యాంకుల్ని ఖాళీ చేస్తున్నాం! ఇ.ఎం.ఐ.ల కొద్దీ మన దగ్గర డబ్బుంటే ఉండొచ్చు. పుడమి దగ్గర ఇప్పుడు.. దాదాపుగా నో స్టాక్! పంచభూతాల షార్టేజ్!! తక్షణం మన వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ! ఈ కఠోర వాస్తవంపై ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్తో గత మూడేళ్లుగా సమాజానికి అవగాహన కల్పిస్తూ వస్తున్న.. ‘సాక్షి మీడియా గ్రూప్’ ఈ ఏడాది ‘రెడ్యూస్..రీయూజ్.. రీసైకిల్..’ అనే థీమ్‌తో ఈవెంట్‌ని నిర్వహించింది. వాడకం తగ్గించి, వృథాను నివారించి, వ్యర్థాలను తగ్గిస్తేనే పుడమి తిరిగి జవసత్వాలు పుంజుకుంటుందని ఈ టాకథాన్ ద్వారా పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, కళాకారులు, సినీ హీరోల చేత చెప్పించింది. హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది. ∙∙ మూడో ఎడిషన్‌లో ధరిత్రిని కాపాడుకోవాలి, భూమిని కాలుష్య కాసారం కానీయకుండా భవిష్యత్తరాలకు అందించాలి అనే లక్ష్యంతో సాక్షి మీడియా గ్రూపు చేపట్టిన ప్రచారోద్యమమే ‘పుడమి సాక్షిగా..’ ఇప్పటివరకు రెండు ఎడిషన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మొదటి ఎడిషన్‌లో... ప్రమాదం అంచుకు ఎలా చేరాం? పుడమికి మనం ఏం తిరిగి ఇవ్వాలి? పర్యావరణానికి ఏం అవసరం? అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెండో ఎడిషన్‌లో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సకల ప్రాణులకూ ఆవాసంగా నేల, తక్కువ కాలుష్యంతో విద్యుత్ ఉత్పాదన అనే అంశాలను ప్రధానంగా చర్చించింది. ఈ మూడో ఎడిషన్‌లో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. ప్రముఖుల సూచనలను, సలహాలను స్వీకరించింది. సాక్షి ‘ఫన్ డే’ ద్వారా వాటిని పాఠకులకు అందించింది. సాక్షి టీవీ ద్వారా గురువారం వీక్షకులకు అందిస్తోంది. నాకు నచ్చిన ప్రోగ్రాం సామాజిక బాధ్యతను కర్తవ్యంగా తీసుకుని సాక్షి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది, అందులో నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్.. పుడమి సాక్షిగా. భగవంతుడు మనకిచ్చిన వరం పర్యావరణం. ఈ వరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళి అందరిదీ. నేటి తరాలు బాధ్యతగా జీవిస్తేనే భావితరాలకూ ఈ వరం అందుతుంది. – రోజా, పర్యాటక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది సాక్షి తీసుకున్న ‘పుడమి సాక్షిగా..’ అనే ఈ గొప్ప ఇనీషియేటివ్‌లో అందరం భాగస్వాములం కావాలి. పుడమి అంటే తల్లి. తల్లిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మనిషిదీ. ఏపీ ప్రభుత్వం ఇటీవలే ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ అనే అమెరికన్ ఎన్జీవోతో ఎం.ఓ.యు. కుదుర్చుకుని విశాఖ బీచ్‌లో పోగయ్యే ప్లాస్టిక్‌ని రీయూజ్ చేయిస్తూ గొప్ప సంస్కరణకు నాంది పలికింది. పుడమి సంరక్షణకు ప్రజల్ని చైతన్యం చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీ రైతు.. భూమి.. పుడమి సాక్షి మీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తోంది. వ్యవసాయం విషయానికి వస్తే.. ప్రకృతి సాగు విధానాల వల్ల పుడమి కి ఎంతో మేలు జరుగుతోంది. ఏపీలో రైతు భరోసా కేంద్రాలు, రైతు సాధికార సంస్థల ఏర్పాటుతో రైతుకు, భూమికి, పుడమికి ప్రయోజనకరమైన ఫలితాలను సాధిస్తున్నాం. – కాకాని గోవర్ధన్, వ్యవసాయశాఖ మంత్రి, ఏపీ గ్రీన్ వెజిటేషన్కు ప్రాధాన్యం సాక్షి చేపట్టిన ‘పుడమి సాక్షిగా..’ ఒక మంచి ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా నేడు కలవరం కలిగిస్తున్న ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రత్యేకమైన పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. కోటీ యాభై ఎకరాల వ్యవసాయ భూమి సాగు అయ్యేలా నీటి అందించి, గ్రీన్ వెజిటేషన్ని సాధిస్తోంది. – నిరంజన్ రెడ్డి, సహకార శాఖ మంత్రి, తెలంగాణ పాఠశాల స్థాయి నుంచే కలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యం అయ్యేది కాదు. అందరూ బాధ్యత తీసుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. పాఠశాల నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇన్సెంటివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది. ఉదా.. క్లాస్ రూమ్‌ని శుభ్రంగా ఉంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి. ఇప్పుడు మనం ప్రకృతి పట్ల శ్రద్ధ వహిస్తేనే భవిష్యత్ తరాలు పచ్చగా ఉంటాయి. – అడివి శేష్, సినీ హీరో ఎకో–ఫ్రెండ్లీ స్కూల్ క్యాంపస్ ‘పుడమిసాక్షిగా..’ టాకథాన్కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వాతావరణ మార్పులు భూతాపానికి కారణం అవుతున్నాయనే అంశంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున ఈజిప్ట్‌లో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరై అధ్యయన పత్రం సమర్పించాను. మా స్కూల్ క్యాంపస్ లో కూడా ఎన్విరాన్మెంట్ పిట్స్, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గించుకున్నాం. – అంకిత్ సుహాస్, కాప్–27 డెలిగేట్ వస్తు వినియమం బాగా తగ్గాలి గత దశాబ్దంగా మన దగ్గర ఉన్న గణాంకాలని బట్టి చూస్తే అర్బన్‌కి, రూరల్‌కు మధ్య వస్తు వినియోగ సంస్కృతిలో ఏ విధమైన తేడా కనిపించని పరిస్థితి. గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు రెండిటినీ స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ హ్యాండిల్ చేస్తోంది. వీటిని కంపేర్ చేసినప్పుడు.. కొనే రాశిలో తేడా ఉందేమో కానీ, ఇంటింటి నుంచీ వచ్చే రోజువారీ వ్యర్థాలు దాదాపు ఒకే మొత్తంలో ఉంటున్నాయి. వ్యర్థాలు ఎక్కువైతే పుడమికి ముప్పు కనుక రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ మన తక్షణ అవసరం. – సంపత్ కుమార్, ఐ.ఎ.ఎస్. స్వచ్ఛాంధ్ర ఎండీ పిల్లలకు క్లీన్లీనెస్ నేర్పాలి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. ఇదే తెలుసు మనోళ్లకి. కానీ, రాబోయే తరానికి మనం ఏం ఇస్తున్నాం అనేది ఒక్కసారి మన మనస్సాక్షిని అడగాలి. పుడమిసాక్షిగా.. నేను ప్రతి మనిషికీ చెప్పేది ఒకటే.. మనం ఇవ్వాల్సింది మన పిల్లలకి విద్య. నేర్పాల్సింది క్లీన్లీనెస్. పర్యావరణాన్ని మనం శుభ్రంగా ఉంచితే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. మన దేశం శుభ్రంగా ఉంటుంది. మనం అందరికీ ఇన్సిపిరేషన్ అవుతాం. – అలీ, మీడియా అడ్వైజర్, ఏపీ మెటీరియలిజం వల్లే ఇదంతా..! మన జీవన విధానం ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. పుడమికి హితంగా మన అలవాట్లు మార్చుకోవాలి. ఆర్టీసీలో మేము రీయూజ్ అనే కాన్సెప్ట్‌ని అవలంబిస్తున్నాం. మెటీరియలిజంకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం కోసం సాక్షి మీడియా గత మూడేళ్లుగా ‘పుడమి సాక్షిగా..’ అనే ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తూ, టాకథా¯Œ ని నిర్వహించడం అభినందనీయం. – వి.సి.సజ్జనార్, ఐపీఎస్, టి.ఎస్.ఆర్టీసీ ఎండీ త్రిబుల్ ‘ఆర్’ ప్రస్తుతావసరం ఇటువంటి ముఖ్య అంశంపై డిబేట్ ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు. 25 ఏళ్ల క్రితం గూంజ్ సంస్థ ప్రారంభమైంది. తిండి, బట్ట, నివాసం అనే కనీస అవసరాలలో మేము దుస్తులపై దృష్టి పెట్టాం. దుస్తులను విరాళంగా సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు అందిస్తున్నాం. ఆ విధంగా సంపన్నుల దగ్గరి వేస్టేజ్‌ని రీయూజ్‌కు అందిస్తున్నాం. సంపన్నులను పరోక్షంగా రెడ్యూస్కు ప్రేరేపిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఆర్ ఆర్‌తోనే పుడమిని సంరక్షించుకోగలం. – మీనాక్షీ గుప్తా, ‘గూంజ్’ సంస్థ చదవండి: ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది.. ఎంత గ్రాండ్‌గా జరిగిందో..
ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూతురు ఫాతిమా ఇటీవలె పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవీ, నాగార్జున సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలీ సినిమాలు ,టీవీ షోల ద్వారా అలరిస్తుండా, ఆయన భార్య జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈమె యూట్యూబ్ ఛానల్‌కు ఇప్పడు సుమారు 6లక్షల 91వేల సబ్స్రైబర్లు ఉన్నారు. కూతురి పెళ్లి షాపింగ్ దగ్గరి నుంచి హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం సహా ప్రతి వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇక జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా కూతురు ఫాతిమా పెళ్లి ఎలా జరిగింది? మండపం దగ్గరికి తీసుకొచ్చిన్నప్పటి నుంచి పెళ్లి తంతులో కూతురు ఎమోషనల్ అయిన క్షణాల వరకు.. వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసిన అలీ కూతురి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో వీడియోలో చూసేయండి. -
సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసిన అలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు మహ్మద్ అలీ గురువారం సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించిన విషయం విదితమే. చదవండి: (CM YS Jagan: ఇంటింటా మనం.. అదే మన లక్ష్యం) -
‘కథ వెనుక కథ’లో చాలా మంచి కథలు ఉన్నాయి
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘కథ వెనుక కథ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ పతాకాలపై అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటుడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ– ‘‘కథ వెనుక కథ మంచి కథ. దండమూడి అవనింద్ర కుమార్గారిది గోల్డెన్ హ్యాండ్. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది’ అని అన్నారు. ‘‘కథ వెనుక కథ’లో చాలా కథలున్నాయి’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ సినిమాలో మంచి ట్విస్ట్‌లు ఉన్నాయి’’ అన్నారు అవనింద్ర కుమార్. ‘‘నిర్మాత అవనింద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిగార్ల వల్లే ఈ సినిమాను లార్జ్ స్కేల్లో చేస్తున్నాం’’ అన్నారు కృష్ణచైతన్య. -
అలీ కుమార్తె వివాహం.. మరి అల్లుడి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్‌లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వినిపించాయి. సాధారణంగా నటీనటులు పెళ్లిళ్లు జరిగితే వధువు, వరుడు వివరాలపై ఆరా తీస్తుంటారు. తాజాగా అలీ అల్లుడు ఎవరా అని కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. (చదవండి: నా కూతురిని ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు: అలీ) అలీ పెద్ద కూతురు ఫాతిమా ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్‌గా నిలిచింది ఫాతిమా. ఇక అల్లుడు షెహయాజ్ కూడా డాక్టరే కావడం విశేషం. జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహయాజ్. అతనికి అన్న, సోదరి ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు వరుడి వదిన కూడా డాక్టరే కావడం మరో విశేషం. వీరంతా గుంటూరుకు చెందిన వారు కాగా.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. అతని కుటుంబ సభ్యులు అందరూ ఉన్నత విద్యావంతులే. ఇక అలీ కూతురు డాక్టర్ చదివేసరికి.. అల్లుడు కూడా డాక్టరే కావాలని.. షెహయాజ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా.. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా పరిచయమైన అతడు.. ప్రస్తుతం హాస్యనటుడిగా మాత్రమే కాకుండా హీరోగా, నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నారు. టీవీ షోకు హోస్ట్ గానూ నిరూపించుకున్నారు. -
అలీ కూతురు రిసెప్షన్ కి హాజరైన సీఎం జగన్
-
అలీ కూతురి వివాహ వేడుకలో అక్కినేని దంపతులు.. ఫోటోలు వైరల్
ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం నవంబర్ 27న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రోజు జరిగిన అలీ కూతురు వివాహానికి నాగార్జున అక్కినేని తన భార్య అమలతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నాగార్జున దంపతులు పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్) వివాహ వేడుకకు హాజరైన నాగార్జున, అమల నూతన జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి నాగార్జునతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు అలీ ఆహ్వానాలు అందించారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి అలీ తన భార్య జుబేదా సుల్తానా బేగంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి శుభలేఖలు అందించారు. కాగా.. అలీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. టాలీవుడ్లో నటుడు అలీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీలో కలిపి దాదాపు 1000 చిత్రాలకు పైగా నటించారు. 1979లో నిండు నూరేళ్లు చిత్రంతో అరంగేట్రం చేశారాయన. -
డేర్ అండ్ డాషింగ్ ఆయన పేరులోనే ఉంది: అలీ
-
Hyderabad: గవర్నర్ తమిళిసైను కలిసిన అలీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిశారు. అలీ దంపతుల పెద్ద కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బుధవారం గవర్నర్ తమిళిసైని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రికను స్వీకరించిన తమిళిసై తప్పకుండా వివాహానికి హాజరు అవుతానని అలీకి మాటిచ్చారు. చదవండి: (కమెడియన్ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?) -
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2024లో ప్రజలు మళ్లీ సీఎం జగన్‌కు పట్టం కట్టడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ మనసున్న నాయకుడు...ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తున్నారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే.. అందరం అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలి’’ అని అలీ అన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
రాజకీయాల్లో సహనం ఎంతో అవసరం
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో సహనం ఎంతో అవసరమని, అది కోల్పోయి మాట్లాడితే జనమే రాజకీయ నేతలపై తిరగబడతారని సినీనటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా)గా నియమితులైన అలీ చెప్పారు. ఆయన బుధవారం సతీసమేతంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ఆయన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న తన కుమార్తె వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు వచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ కార్డు సీఎంకి అందజేశానన్నారు. సీఎం జగన్ తనకు అద్భుత అవకాశం ఇచ్చారని, ఆయన ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. గతంలో రాఘవేంద్రరావు ఈ పదవిలో ఉన్నారని గుర్తుచేశారు. దీనికి అలీ అయితే కరెక్ట్ అని సీఎం తనని నియమించారన్నారు. తన వల్ల సీఎం జగన్‌కు ఎంతపేరు తీసుకురావాలో అంతా తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. రాజకీయాల్లో సహనం ఉన్న వారు గొప్ప నేతలు అవుతారని చెప్పారు. సీఎం జగన్ అలా ఉండి ప్రజాసమస్యలపై తిరుగులేని పోరాటాలు చేయటం వల్లే, తిరుగులేని మెజార్టీ సాధించి, సీఎం పదవి అధిరోహించారన్నారు. పదవుల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వారు సీఎం జగన్‌లా ఉండాలని చెప్పారు. బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవటం నేతలకు సరైంది కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని నేతలు గ్రహించాలని సూచించారు. గతంలో అలీ పాత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇకముందు సీఎం జగన్ ఆదేశాలను శిరసావహించి ముందుకు కదులుతానని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనిషి అని పేర్కొన్నారు. అన్నివర్గాల్లో పేదల కోసం, ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై లబ్ధిపొందారన్నారు. ప్రజలు పథకాలను ఆదరిస్తున్నారని చెప్పారు. ఈసారి 175కి 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి జగన్ 2024లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ సీఎంగా ఎన్నికవుతారని పేర్కొన్నారు. ఆ క్రతువులో తనవంతు పాత్ర పోషిస్తానన్నారు. ఇక నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా మరో అలీని చూస్తారని ఆయన చెప్పారు. -
నా కూతురి పెళ్లికి సీఎం జగన్ కానుక ఇచ్చారు : అలీ
-
సీఎం జగన్ అడుగు జాడల్లో నడుస్తా: అలీ
సినీ నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానికి మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా అలీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తాజాగా అలీ స్పందించాడు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడంతో పాటు, పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని... తన సేవలను సీఎం జగన్ గుర్తించారని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు. ఈ పదవిని తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెప్పారు. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరే ఆయనకు కూడా జీతభత్యాలు అందనున్నాయి. -
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ
టైటిల్: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నటీనటులు: అలీ, నరేశ్, పవిత్రా లోకేశ్, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ తదితరులు నిర్మాణ సంస్థ: అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత : కొనతాల మోహన్ దర్శకత్వం: శ్రీపురం కిరణ్ సంగీతం: రాకేశ్ పళిడమ్ సినిమాటోగ్రఫీ: ఎస్. మురళి మోహన్‌రెడ్డి ఎడిటర్: సెల్వకుమార్ విడుదల తేది: అక్టోబర్ 28, 2022(ఆహా) కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 28) ప్రముఖ ఓటీటీ ఆహాలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీనివాసరావు(నరేశ్), పవిత్ర లోకేశ్(సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కొడుకు, కూతురులను ప్రేమగా చూసుకుంటూ జీవితం కొనసాగిస్తుంటారు. మరోవైపు సమీర్(అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్‌కి వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. తన ఫ్యామిలీని చక్కగా చూసుకునే సమీర్కి సెల్ఫీలు, సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అలీకి ఉన్న సోషల్ మీడియా పిచ్చి.. శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేస్తుంది. నెట్టింట సమీర్ పెట్టిన ఓ పోస్ట్ కారణంగా శ్రీనివాసరావు జీవితంలోకి అనేక సమస్యలు వచ్చిపడతాయి. సమాజం అంతా అతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇంతకీ సమీర్ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్ రావు ఫ్యామిలి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేకే ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శ్రీపురం కిరణ్. సోషల్ మీడియాలో పెట్టే తప్పుడు పోస్టుల ద్వారా ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయో, దాని వల్ల కొందరి జీవితాలు ఎలా తారుమారు అవుతాయో తెరపై చక్కగా చూపించాడు. సినిమా అంతా చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. నరేశ్, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుడి హృదయాలను హత్తుకుంటాయి. ఇది ఎమోషనల్‌గా సాగే కథ అయినప్పటికీ.. హాస్యానికి కూడా కొదవ ఉండదు. హీరో లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథ చాలా నెమ్మదిగా సాగడం సినిమా స్థాయిని తగ్గిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకి థియేటర్స్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియదు కానీ.. ఓటీటీకి మాత్రం పక్కా సెట్ అయ్యే మూవీ. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం ఇది. ఎవరెలా చేశారంటే.. అలీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఎంత నవ్వించగలడో..అంత ఏడిపించగలడు. ఈ సినిమాలో సమీర్ పాత్రకు న్యాయం చేశాడు. సోషల్ మీడియా, సెల్ఫీల పిచ్చి ఉండే పాత్ర తనది. ఇక సినిమాకు ప్రధాన బలం నరేశ్, పవిత్రా లోకేశ్. కథంతా వీరి చుట్టే తిరుగుతుంది. తెరపై నరేశ్, పవిత్రా లోకేశ్‌ల ఎమోషనల్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మూగ వ్యక్తిగా నరేశ్ నటన అద్భుతంగా ఉంది. కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో నటించిన లాస్య చక్కగా నటించింది. ఆమె పాత్ర కారణంగానే సినిమాలో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంటుంది.మనో, తనికెళ్ల భరని, మౌర్యానితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. ఏ.ఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్ పళిదం ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫర్ మురళి మోహన్‌రెడ్డి , ఎడిటర్ సెల్వకుమార్ పని తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓ మంచి సినిమాతో అలీ నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టాడని చెప్పొచ్చు. -
ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా నటుడు అలీ
-
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ
సాక్షి, విజయవాడ:సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ మీడియా ఏపీ ప్రభు త్వ సలహాదారునిగా సినీనటుడు మహ్మద్ అలీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారని జీఏడీ ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అందరికి నచ్చుతుంది: అలీ
కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్, టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళం లో చూసిన ‘వికృతి’ సినిమా నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారి సీనియర్ నటులందరినీ తీసుకొని తీసిన ఈ సినిమాకు కొత్త దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయడం గొప్ప విషయం’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ... ‘నేను, అలీ ఒకే టైమ్‌లో కేరీర్ స్టార్ట్ చేశాము. అలీ, నేను కలసి చూసిన మెదటి సినిమా ‘మనీ’. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గార్లు యమలీల సినిమా ద్వారా ఆలీని హీరోగా పరిచయం చేశారు. అప్పట్లో అది ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఆలా ఎదుగుతూ వచ్చిన ఆలీ ఈ రోజు మంచి సబ్జెక్టును సెలెక్ట్ చేసుకొని, చాలా మంది సీనియర్ నటులను సెలక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు. అలీ మాట్లాడుతూ.. మలయాళం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరేష్ గారు నేను పోటాపోటీగా నటించాం . 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి గారితో కలిసి మళ్ళీ నటించడం ఆనందంగా ఉంది. ఒక మంచి వాతావరణంలో దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నెల 28న ఆహా లో విడుదల అవుతున్న ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు. ‘ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 28న విడుదల అవుతున్న ఈ సినిమా అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని కోరుతున్నాను’అని దర్శకుడు కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, చిత్ర నిర్మాత కొణతాల మోహనన్ కుమార్ ,నటులు పృథ్వీ , శివబాలాజీ, భద్రం తదితరులు పాల్గొన్నారు. -
‘ఆహా’లో అలీ ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’
కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్ పళిదంను ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం అక్టోబర్ 28న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరి వల్ల అమాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆలీ హీరోగా, నరేష్ - పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల దారులుగా నటించగా, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Oka photo online lo sanchalanam chesthe. Ela untundi? 🤔 Daani venuka story enti? Watch the official remake of Vikruthi #AndaruBaagundaliOnAHA Premieres Oct 28#Ali pic.twitter.com/R8rA4yO6EZ — ahavideoin (@ahavideoIN) October 24, 2022 -
అప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్‌పై స్పెషల్ స్టోరీ.. పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఏడవ ఏటే బాలనటుడిగా.. స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్ ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రహ్లాద పాత్రలో రోజా రమణి ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు. ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్‌గానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్‌తో పోటీ పడుతూ నటించి మెప్పించింది. శంకరాభరణంతో నంది అవార్డు చైల్డ్ ఆర్టిస్ట్‌గా,హీరోయిన్గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. సిరివెన్నెల.. పెద్ద సంచలనమే బాలనటిగానూ, హీరోయిన్‌గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్‌గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి. -
అప్పుడు అందరం బాగుంటాం
కృష్ణ, ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి. యశోదమ్మ, టి. చేతన్ నిర్మించిన చిత్రం ‘నేచర్’. ఈ సినిమాలోని ‘నిన్నే చూడందే..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను రిలీజ్ చేసిన అలీ మాట్లాడుతూ – ‘‘నాకు ఇళయరాజాగారి పాటలంటే ఇష్టం. ఈ పాట ఆయన పాటలను గుర్తు చేసింది. యం.ఎల్. రాజా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘నేచర్’ టైటిల్ బాగుంది. ప్రకృతి బాగుంటే మనందరం బాగుంటాం’’ అన్నారు. ‘‘ప్రకృతిని ఇష్టపడే ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక ఎన్ని కష్టాలు పడ్డాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది ఈ సినిమా కథ’’ అన్నారు అశ్విన్ కామరాజు. ‘‘ఈ సినిమాకు పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు ఎమ్ఎల్ రాజా. ‘‘సుధాకర్, రవి టీచర్స్. ఈ సినిమాకి ఇద్దరూ చక్కటి కథను రెడీ చేశారు’’ అన్నారు గౌతమ్ రాజు. -
కమెడియన్ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె లైగర్ సినిమాలో నటించారు. ఈమధ్య సినిమాల కంటే బుల్లితెరపై హోస్ట్‌గా,జడ్జిగా అలరిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య జుబేదా అలీ సైతం సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌తో పాపులారటీ దక్కించుకున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉండగా అలీ పెద్ద కుమెర్తె ఫాతిమా రెమీజు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఎంగేజ్మెంట్ వీడియోను జుబేదా అలీ తన ఛానెల్లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. చదవండి: కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్ చూశారా? అయితే అలీకా కాబోయే అల్లుడు ఏం ఎవరు, ఏం చేస్తారు? అంటూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగింది. అయితే అలీ అల్లుడు డాక్టర్ అని తెలుస్తుంది. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ డాక్టర్లేనట. అలీ కూతురు ఫాతిమా సైతం ఈమధ్య మెడిసన్ కంప్లీట్ చేసింది. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ అంటూ అలీ దంపతులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఘనంగా కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా అలీ కూతురు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అలీ-జుబేదా దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్దకూతురు ఫాతిమా ఇటీవలే మెడిసిన్ కంప్లీట్ చేసింది. త్వరలోనే ఈమె మెట్టినింట్లో అడుగపెట్టనుంది. కాగా యూట్యూబ్ వీడియోలతో జుబేదా సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే ఆమె ఛానెల్‌కు 5లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తాజాగా తన కూతురి ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. -
నేను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులే కారణం: కమెడియన్ అలీ
సినీ నటుడు అలీకి జీవన సాఫల్య రజిత కిరీట జాతీయ పురస్కారాన్ని అందజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనచారి మాట్లాడుతూ.. పీవీ నరసింహరావు ప్రతికూలపరిస్థితులలో జాతీయ స్థాయికి ఎదిగారని అలీ కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సినీ రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారని కొనియాడారు. నటుడు అలీ మాట్లాడుతూ చిన్న దర్జీగా మా నాన్న పనిచేసేవారని, అలాంటి కుటుంబం నుంచి ఈ స్థాయికి రావటానికి ప్రేక్షకులే కారణమని అన్నారు. పీవీ ప్రభాకర్‌రావు, గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి, తదితరులు పాల్గొన్న సభకు సురేందర్ స్వాగతం పలుకగా దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు 101 జయంతిని పురస్కరించుకుని 101 మంది నృత్యకళాకారులు విభిన్న నృత్యాలు చేయగా సంస్థ అధ్యక్షురాలు పుష్ప రికార్డ్ పత్రం అందుకొన్నారు. చదవండి: థియేటర్లో రెండే, ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్‌కు రెడీ! సెట్లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది -
సీఎం జగన్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వైఎస్సార్ సీపీ నాయకుడు, సినీ నటుడు అలీ కొనియాడారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు పూర్తవడంతో పాటు త్వరలో ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం వైఎస్సార్ సీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో అలీ పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో అవినీతికి తావులేకుండా ప్రజల వద్దకే సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ ఆస్ట్రేలియా కో–ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీగా సంఖ్యలో హాజరయ్యారు. -
స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి..
F3 Success Meet Vizag, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మహిళా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఎఫ్–3 (F3) సినిమా అఖండ విజయం సాధించిదని ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. ఆర్.కె.బీచ్ దరి గోకుల్‌పార్కులో శనివారం రాత్రి ఎఫ్–3 ఫన్టాస్టిక్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకెప్పుడూ స్పెషల్ అన్నారు. తన తొలి సినిమా కలియుగ పాండవులు షూటింగ్ విశాఖ బీచ్‌రోడ్డులోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను విశాఖలో చిత్రీకరించామన్నారు. తాను నటించిన దృశ్యం–2, నారప్ప వంటి సినిమాలు ఓటీటీలో మాత్రమే విడుదల కావడంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని పేర్కొన్నారు. ఎఫ్–3 సినిమాకు అభిమానులు విజయం చేకూర్చారని సంతోషం వ్యక్తం చేశారు. మరో హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ 'అభిమానుల ఆదరణే తమకు వందకోట్ల ఆదాయంతో సమానం. విశాఖ నోవాటెల్ హోటల్లోనే దర్శకుడు అనిల్ ఎఫ్–3 సినిమా కథ రాసుకున్నారు. మళ్లీ అవకాశం వస్తే కథ వినకుండానే వెంకటేశ్‌తో సినిమా చేస్తాను.' అని పేర్కొన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్య, పరుగు సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అమెరికాలో కూడా ఇదే ఆదరణ లభించడం అపూర్వమన్నారు. ఈ రోజుకు సినిమా విడుదలై 9 రోజులవుతుందని.. రూ.100 కోట్ల గ్రాస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జగదాంబ వంటి 1,100 సీట్లు ఉన్న థియేటర్లో ఎఫ్–3 హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోందని జగదాంబ థియేటర్ అధినేత జగదీష్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్–4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 'విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ముందు నేను చేసిన చాలెంజ్‌తో మీడియా కూడా షాక్ అయింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను నేను, హీరో వెంకటేశ్ ఎంతో రుచి చూశాం' అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశానన్నారు. ఈ సినిమాలో ఆలీ పాత్ర నచ్చిందా అని ప్రేక్షకులను అడిగారు. తనకు ఎఫ్–2 కంటే ఎఫ్–3 సినిమా అంతకుమించి ఆనందం ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చాలా బాగా పండాయన్నారు. తన సినిమా కథలన్నీ వైజాగ్‌లోనే రాసుకున్నానని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఎఫ్–3 చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇదే రోడ్డుపై ఎన్నో షూటింగ్‌లు చేశానని నటుడు అలీ చెప్పారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో వెంకటేశ్, వరుణ్‌తేజ్, అనిల్ సినిమాలోని ఓ పాటకు నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. సే నో టు ప్లాస్టిక్ ఎఫ్–3 విజయోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖలో ఆదివారం నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామన్నారు. విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. -
నాటక కళాకారులను గుర్తుతెచ్చే ‘ఉత్సవం’
నాటక కళా రంగం గొప్పదనం గురించి తెలియజేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా దీలీప్, రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల కానుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడని, కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ అద్భుతమైన విజువల్స్‌తో ‘ఉత్సవం’ను అందంగా తీర్చిదిద్దారని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. -
నార్త్ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ
‘సౌత్ సినిమాలు అంటే నార్త్ వాళ్లకు ఒకప్పుడు బాగా ప్రేమ ఉండేది. ఇప్పుడు ఇంకా ప్రేమ వచ్చింది. అలాగే వీళ్లు మనల్ని తొక్కేస్తున్నారనే భయం కూడా వాళ్లకు మొదలైంది’ అని కమెడియన్ అలీ అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. స్టార్ ఇమేజ్ ఉంది. 43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్ తగ్గింది. ఎందుకు? బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీల సీరియల్ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరో చేశాడు. స్టార్ దర్శకుడిగా ఉన్న ఆయన.. అందరినీ ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనకా ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీగారు ఎందుకు ఈ సినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడం లేదు. కథ విని నా క్యారెక్టర్ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎఫ్ 3లో పూర్వ అలీగారిని చూడగలమా? తప్పకుండా చూస్తారు. నా క్యారెక్టర్లో అంత సత్తా ఉంది. లొకేషన్లో కూడా టెక్నీషయన్స్ బాగా ఎంజాయ్ చేశారు. శిరీష్ గారు అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎఫ్3లో మీ క్యారెక్టర్ పేరు? పాల బేబీ. వడ్డీకి తిప్పే క్యారెక్టర్ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం.. సినిమా ఎండింగ్లో మీకు ఆ విషయం తెలుస్తుంది (నవ్వుతూ..). సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మంది ఆరిస్టులు నటించారు. ఎవరెలా చేశారు? ఒకరిని మించి ఒకరు నటించారు. ఎవ్వరినీ తగ్గించలేం. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం. ‘కొన్ని సీన్స్ మిస్ అయిపోయామే.. మళ్లీ వెళ్లాలిరా’ అనేలా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్ కామెడీ టైమింగ్ గురించి? వాళ్లు పుట్టిందే ఇండస్ట్రీలో. ఇద్దరూ బాగా చేశారు. వారితో పాటు మిగతా నటీనటులు కూడా చక్కగా నటించారు. సినిమాల్లో హీరోలిద్దరికి ఓ లోపం ఉంది. వెంకటేశ్‌కు రేచీకటి అయితే.. వరుణ్‌కు నత్తి.. మరి మీకేముంది? నాకు గన్ ఉందిగా (నవ్వుతూ..) అనిల్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సినిమాలో ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ అనిల్‌లో అది కొంచెం కూడా కనిపించదు. అందరు వచ్చారా? టిఫిన్ చేశారా? ఓకే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని సింపుల్‌గా అనేస్తాడు. అతి తక్కువ వయసులో ఇంతమంది ఆర్టిస్టులను మేంటేన్ చేయడం అనేది గొప్ప విషయం. ఒకప్పుడు రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావు సినిమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. అనిల్‌లో అంత సత్తా ఉంది కాబట్టే.. దిల్ రాజు గారు కూడా ఎంత మంది ఆర్టిస్టులు కావాలంటే.. అంతమందిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాంటి నిర్మాత దొరకడం అనిల్ అదృష్టం. వెంకటేశ్‌తో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది? ఆయనతో నేను చేసిన సినిమాలు అన్ని కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు ఎక్స్పర్ట్స్ పొలిటికల్ కెరీర్ గురించి? నన్ను హీరోగా క్రియేట్ చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి అయితే.. పొలిటికల్ లీడర్‌గా క్రియేట్ చేయబోతున్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిగారే. ఆయన నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారు అంతే. ఏదో ఒకరోజు కాల్ వస్తే వెళ్తా.. మీ సమక్షంలోనే(మీడియా) ఆ విషయాన్ని పంచుకుంటా(నవ్వుతూ..) ఫైనల్‌గా ఎఫ్3 గురించి ఏం చెప్తారు? ఇది ఒక అద్భుతమైన సినిమా. పైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది. కొత్త సినిమాల గురించి? అంటే సుందరానికి, ఎఫ్3, లైగర్, ఖుషీ, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నా. ఒకప్పుడు మనం సినిమాల్లో అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్‌వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్ నేర్పించి, డబ్బింగ్ చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్ వాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని పిలుస్తున్నారు. -
మళ్లను పరామర్శించిన సినీనటుడు ఆలీ
సాక్షి, సీతమ్మధార(విశాఖ ఉత్తర): మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తల్లి సన్యాసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సినీనటుడు ఆలీ సీతమ్మధారలోని మళ్ల నివాసానికి గురువారం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆలీ ప్రార్థించారు. చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) -
ఎఫ్ 3 ఒక మంచి ట్రీట్‌లా ఉంటుంది – వెంకటేశ్
‘‘అందరి అభిమానులకు, కుటుంబ ప్రేక్షకులకు ‘ఎఫ్ 3’ చిత్రం ఒక ట్రీట్‌లా ఉంటుంది. అందరూ వచ్చి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ ప్రేక్షకులకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకున్నాం. ‘ఎఫ్ 3’లో రే చీకటి ఉన్న పాత్ర చేశా’’ అన్నారు. (చదవండి: నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్) వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ‘ఎఫ్ 3’ ఫ్రెష్‌నెస్‌ని, నవ్వులను తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ ఏమీ ఆలోచించకుండా మీ కుటుంబాలతో కలిసి వచ్చి ‘ఎఫ్ 3’ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ‘ఎఫ్ 2’ అనేది ప్రాక్టీస్ మ్యాచ్‌లాంటిది.. ‘ఎఫ్ 3’ అనేది మెయిన్ మ్యాచ్.. ఈ మ్యాచ్‌లో సిక్స్ కాదు.. బాల్ స్టేడియం బయటకి వెళుతుంది. మీ అందరికీ ‘ఎఫ్ 3’ నచ్చుతుంది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ –‘‘ఎఫ్ 3’ ట్రైలర్లో చూపించింది కొన్ని నవ్వులు మాత్రమే.. సినిమాలో అంతకుమించిన నవ్వులను మీ కోసం దాచి ఉంచాం. ‘ఎఫ్ 3’లో మోర్ ఫన్ అని పెట్టాం. ఈ రోజు ట్రైలర్‌కి వచ్చిన స్పందనను బట్టి చెబుతున్నాం.. ‘ఎఫ్’ ఫర్ ఫ్యామిలీ. ఎంటర్టైన్మెంట్ చేయడంలో వెంకటేశ్‌గారు ఎవరెస్ట్.. ఆ ఎవరెస్ట్ పక్కన నటించేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ని చూస్తే ‘ఇంత కామెడీ చేయగలడా?’ అంటారు. ఈ ఫ్రాంచైజీని నిర్మించడానికి సపోర్ట్ చేసిన నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. అలీ మాట్లాడుతూ – ‘‘ఈ చంటి (వెంకటేశ్‌ని ఉద్దేశించి) ‘ఎఫ్ 3’లో మామూలుగా చేయలేదు. ఇక్కడ మా చంటి (వరుణ్ తేజ్‌ని ఉద్దేశించి).. వీరిద్దరూ ఈ సినిమాని తమ భుజాలపై మోశారు’’ అన్నారు. -
కూతురి గురించి గుడ్‌న్యూస్ షేర్ చేసిన కమెడియన్ అలీ
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన సీతాకోకచిలుక’చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అనతికాలంలోనే స్టార్ కమెడియన్‌గా పాపులర్ అయ్యారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారాయన. ఇక అలీ భార్య జుబేదా ఈ మధ్యే యూట్యూబ్‌లో ఎంట్రీ ఇచ్చి రకరకాల వీడియాలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వీరికి ముగ్గురు సంతానం. తాజాగా అలీ పెద్దకూతురు ఫాతిమా గురించి ఓ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకున్నారు. ఫాతిమా డాక్టర్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ అంటూ అలీ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా తన కూతురు డాక్టర్ కావడం అలీ కోరిక అని తెలుస్తుంది. అలీ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫాతిమాకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అలీ, బ్రహ్మానందం
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని ప్రముఖ తెలుగు నటులు బ్రహ్మానందం, అలీ ఆదివారం పరామర్శించారు. అశ్విని, రాఘవేంద్ర రాజ్‌కుమార్ తదితరులను వారు పలకరించి, పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చదవండి: (యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!) -
కమెడియన్ అలీతో హీరోయిన్ పెళ్లి, పత్రికల్లో ఫొటో!
అలనాటి హీరోయిన్ మాలశ్రీ చెల్లెలు శుభశ్రీ కూడా కథానాయికగా రాణించింది. మలయాళ చిత్రాలతో పాటు ఊహ, పెదరాయుడు వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అసలు పేరు భారతి పాండే. కానీ ఆమె పోషించిన శుభశ్రీ పాత్ర పాపులర్ కావడంతో అదే ఆమె అసలు పేరుగా మారిపోయింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తను చిన్నపిల్లలతో ఆడుకునే సమయంలో ఓ అబ్బాయి వచ్చి సైట్ కొట్టేవాడంది. అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. అతడు డైమండ్ రింగ్‌ను తొలి బహుమతిగా ఇచ్చాడంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది శుభశ్రీ. తాను స్కూలుకు వెళ్లకుండా ఉండటానికే సినిమాల్లోకి వచ్చానంది. కాగా శుభశ్రీ, అలీ 'అల్లరి పెళ్లికొడుకు' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాలో వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే ఆ పెళ్లి ఫొటో బయటకు వచ్చింది. దీంతో ఓ మ్యాగజైన్ అలీ, శుభశ్రీ పెళ్లైపోయిందంటూ ఓ కథనం రాయగా అది చూసి అలీ భార్య షాకైందట! ఆ సంఘటనను తలుచుకుని శుభశ్రీ పడీపడీ నవ్వింది. చదవండి: అదే జరిగితే రాజమౌళిని చంపేస్తారు.. ఎన్టీఆర్ Ghani Movie Review: ‘గని’ పంచ్ ఎలా ఉందంటే.. -
చిరంజీవికి సీఎం అత్యంత గౌరవమిచ్చారు.. అదంతా తప్పుడు ప్రచారం: అలీ
సాక్షి, అమరావతి: మెగాస్టార్ చిరంజీవిని, ఆయనతోపాటు వచ్చిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్, సినీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ తదితర సినీ ప్రముఖులను ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత గౌరవించారని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత అలీ చెప్పా రు. అవమానించడానికి ఎవరైనా ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, దానిని ఎవరూ విశ్వసించరని చెప్పారు. అలీ కుటుంబ సమేతంగా మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తర్వాత మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి భేటీ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంటి బయటకు వచ్చి మెగాస్టార్‌ను ఆహ్వానించి.. ఆయనపై తనకున్న గౌరవాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. భోజనం చేసిన తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్‌తో చిరంజీవి చర్చించారన్నారు. ఆ తర్వాత సీఎంవో ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినీ ప్రముఖులు సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారని చెప్పారు. ఆ సమావేశంలో తాను కూడా ఉన్నానని, అప్పుడు వ్యక్తిగతంగా సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడలేకపోయానని చెప్పారు. సామాన్యులకు తక్కువ ధరకే వినోదం అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆశయమన్నారు. రూ.కోటితో తీసిన సినిమా.. రూ.వంద కోట్లతో తీసిన సినిమా రెండూ లాభాలు గడించేలా విధానపరమైన నిర్ణయం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటారన్నారు. త్వరలోనే తెలుగు సినిమా కష్టాలు తీరతాయని ధీమా వ్యక్తం చేశారు. ‘అప్పటి ఎన్నికల్లో పోటీ చేయమన్నారు’ 2004 నుంచే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ, సీఎం వైఎస్ జగన్‌తోనూ తనకు అనుబంధం ఉందని అలీ చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో ఏమీ ఆశించకుండా వైఎస్సార్సీపీలో చేరానన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరినా.. సమయం లేకపోవడంతో పోటీ చేయలేకపోయానన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో మంగళవారం కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్‌ను కలిశానని చెప్పారు. తనకు త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారని, ఇందుకు సంబంధించిన ప్రకటన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. -
త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు: అలీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో అలీ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ను కలిశాను. త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని ఆయన చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాం. త్వరలోనే నా పదవిపై పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుంది. రెండు వారాల్లోనే ప్రకటన ఉంటుందని అనుకుంటున్నాను.ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నా. సామాన్యులకు కూడా సినిమా టికెట్ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. చిన్న సినిమాకు కూడా లాభం ఉండాలన్నదే మా ఉద్దేశం అని అలీ అన్నారు. చదవండి: తిరుపతిలో స్టూడియోలు ఏర్పాటు చేస్తాం: మంచు విష్ణు -
త్వరలో గుడ్‌న్యూస్ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు: అలీ
-
ముగిసిన కమెడియన్ అలీ తమ్ముడి షూటింగ్
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘భళా చోర భళా’. ఎ. ప్రదీప్ దర్శకత్వంలో ఈ సినిమాను ఎ. జనని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘సరికొత్త కథాంశంతో ‘భళా చోర భళా’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాలో మంచి కామెడీతో పాటు థ్రిల్ చేసే మిస్టరీ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ఎ. ప్రదీప్. ఈ సినిమాకు సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి. -
సీఎం జగన్ పాలన అద్భుతంగా ఉంది: సినీ నటుడు అలీ
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అద్భుతంగా ఉందని సినీ నటుడు అలీ అన్నారు. కేఎల్‌యూ డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో అన్ని వర్గాలకు వైఎస్ జగన్ సమన్యాయం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. చదవండి: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం టాలీవుడ్లో సమస్యగా మారిన ఆన్లైన్ టికెట్ల విధానం, బెనిఫిట్ షో వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, హామీ కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం మరింత సంతోషం కలిగించిందన్నారు. ఇప్పటి వరకు తాను 5 భాషల్లో 1124 సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు. -
తెలుసా..! స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరింది అతనేనట!
‘పాక్స్తాన్’ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్.. 3, హంబర్‌స్టోన్ ఇంటిలోని ఒకగది గోడమీద రాసున్నాయి ఆ అక్షరాలు (పాకిస్తాన్ కాదు). రాసినవాడు జిన్నా కాదు, చౌధురి రహమత్ అలీ. ఆ పద సృష్టికర్త అలీయే. భారత స్వాతంత్య్రోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం నడపాలని ఆశించినవాడు, స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరినవాడు ఇతడే. ఎవరీ అలీ? తూర్పు పంజాబ్, హోషియార్‌పూర్‌లోని కామేలియా అతడి స్వస్థలం. 1897 నవంబర్ 16న బాలాచౌర్లో పుట్టాడు. 1930లో ఇంగ్లండ్ వెళ్లి 1931లో కేంబ్రిడ్జ్ పరిధిలోని ఇమ్మాన్యుయేల్ కళాశాలలో చేరాడు. అలీ మిత్రుడు అబ్దుల్ కరీం కథనం ప్రకారం తన మిత్రులు పీర్ అహసనుద్దీన్, ఖ్వాజా అబ్దుల్లతో కలసి థేమ్స్ ఒడ్డున నడుస్తుండగా అలీకి ఆ పేరు స్ఫురణకు వచ్చింది. అలీ కార్యదర్శి ఫ్రాస్ట్ మాటలలో అయితే, ఒక రోజున బస్సు టాప్ మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆ పేరు స్ఫురించింది. ఆ హ్రస్వనామమే (పి.ఎ.కె. స్తాన్) తరువాత ‘ఐ’ చేరి పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ అంటే పర్షియన్లో పవిత్రభూమి. బహుశా భారత్, పాక్ చరిత్రలలో అలీ అంతటి వివాదాస్పద వ్యక్తి కనిపించడు. భారత్‌లో సరే, పాకిస్తాన్ చరిత్రలో కూడా ఇతడికి కొద్దిపాటి స్థానం కూడా కనిపించనిది అందుకే కాబోలు. కానీ పాక్స్తాన్ జాతీయోద్యమ నిర్మాతగా ఇతడు తనను తాను ప్రకటించుకున్నాడు. నిజానికి బొంబాయి కేంద్రంగా ‘పాకిస్తాన్’ పేరుతో పత్రికను ప్రచురించడానికి 1928లో ఒక పత్రికా రచయిత దరఖాస్తు చేశాడు. అతడు కశ్మీర్‌కు చెందిన గులాం హసన్ షా కాజ్మీ. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫలితాలు రహమత్‌ను బాగా నిరాశపరచాయి. ఆ సమావేశాలకు వెళ్లిన భారతీయ బృందాన్ని క్షమించకూడదన్నాడు. ఆ సమావేశాలకు డాక్టర్ ఇక్బాల్ కూడా హాజరయ్యారు. అప్పుడే రహమత్ ఆయనను ఇంగ్లండ్‌లో కలుసుకున్నాడు. తరువాత 1932 నాటి అలహాబాద్ ముస్లింలీగ్ సమావేశాలలో డాక్టర్ ఇక్బాల్ చేసిన ప్రతిపాదన కూడా అలీకి నిరాశ కలిగించింది. వాయవ్య ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్న ఐదు ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి, బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉంచాలని ఇక్బాల్, లీగ్ కోరడం అలీకి నచ్చలేదు. దక్షిణాసియాలో ముస్లింలకో స్వతంత్ర దేశం అన్నది అతడి నినాదం. అసలు పరమతానికి చెందిన ఏ పేరూ ఆసియాలో మిగిలి ఉండకూడదని అతడి నిశ్చితాభిప్రాయం. రహమత్ అలీ ప్రతిపాదించిన పిఎకెలో, పి అంటే పంజాబ్, ఎ అంటే అఫ్గానిస్తాన్ (మొత్తం వాయవ్య సరిహద్దు), కె అంటే కశ్మీర్, ఎస్ అంటే సింధ్, స్తాన్ అంటే బలూచిస్తాన్‌కు సంకేతాక్షరాలు. బ్రిటిష్ ఇండియా పటంలోని బెంగాల్, అస్సాంలకు బంగిస్తాన్ అన్న పేరూ పెట్టాడు. ఉస్మాన్స్తాన్ (నిజాం రాజ్యం), ముస్లింలు అధికంగా ఉండే ఇంకొన్ని ప్రాంతాల మీద ఆకుపచ్చ రంగు పులిమి ఒక సరికొత్త భౌగోళిక పటాన్ని అతడు రచించాడు. ఆ పచ్చరంగు ప్రాంతాలే పాక్స్తాన్. ఈ ఊహనంతటినీ 1933 జనవరి 28న విడుదల చేసిన చరిత్ర ప్రసిద్ధ ‘నౌ ఆర్ నెవర్’ కరపత్రంలో అలీ వివరించాడు. దీనర్థం ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ అని. దీనికే ‘మనం బతికేందుకా! నశించిపోతూ ఉండడానికా?’ అన్న ఉపశీర్షిక కూడా ఉంది. మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరైన భారతీయ బృందాన్ని దృష్టిలో ఉంచుకునే అతడు ఈ కరపత్రం రాశాడని చెబుతారు. దీనికే ‘పాకిస్తాన్ ప్రకటన’ అంటూ పాకిస్తాన్ పత్రిక ‘డాన్’ పేరు పెట్టడం గమనార్హం. ఈ కరపత్రం బహిర్గతమైన సంవత్సరం తరువాత 1934 జనవరి 28న ఇంగ్లండ్‌లోనే ఉన్న జిన్నాను రహమత్ అలీ తన నివాసానికి పిలిచి వివరించాడని కోలిన్స్, లాపిరే (‘ఫ్రీడవ్‌ు ఎట్ మిడ్నైట్’), రషీదా మాలిక్ (‘ఇక్బాల్: స్పిరిచ్యువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్’) వంటి రచయితలు వేర్వేరు రీతులలో తెలియచేశారు. లండన్‌లోని వాల్డెర్ఫ్ హోటల్లో జిన్నా కోసం బ్లాక్‌టై పార్టీ ఏర్పాటు చేసి.. అలీ ఇవన్నీ చెప్పినట్టు కోలిన్స్, లాపిరే రాశారు. 3, హంబర్‌స్టోన్ ఇంటికే జిన్నా వచ్చారని ఎక్కువమంది రాశారు. చిత్రంగా ‘పాకిస్తాన్ ఆలోచనే అసాధ్యం’ అంటూ ఆ క్షణంలోనే జిన్నా చెప్పారని కోలిన్స్, లాపిరే చెబితే, ‘కాలం గడవనీ! వాళ్ల సంగతి వాళ్లే (భారతీయ ముస్లింలు) చూసుకుంటారు’ అని సర్ది చెప్పినట్టు ఇతర రచయితలు రాశారు. ఏమైనా 1934 వరకు కూడా పాకిస్తాన్ ఆలోచనకు ఎవరూ సానుకూలంగా లేరన్నది నిజం. ఇది కాలేజీ కుర్రాళ్ల రగడ అనే మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లిన పెద్దలు భావించారు. రహమత్ అలీ మరికొన్ని కరపత్రాలు కూడా వెలువరించాడు. ‘పాక్స్తాన్: ది ఫాదర్ల్యాండ్ ఆఫ్ పాక్స్తానీ నేషన్’ అన్న పుస్తకం కూడా రాశాడు. ఇస్లాంను ఆవిష్కరించే క్రమంలో ప్రవక్త అరబ్ తెగలను ఏకం చేసిన క్రమమే దక్షిణాసియాలో ముస్లింలకో దేశం అన్న తన లక్ష్యానికి ప్రేరణ అని అలీ చెప్పుకున్నాడు. తమ పూర్వికులు ఆరంభించిన స్థలాలు, పట్టణాలు, కొండల పేర్ల మార్పు ఉద్యమం కొనసాగాలనీ ఆశించాడు. హిమాలయాలను ‘జబాలియా’ అని, బంగాళాఖాతాన్ని ‘బంగి ఇ ఇస్లాం’ అని, ఆసియా ఖండాన్ని ‘దినియా’అని పిలిస్తేనే సార్థకమని భావించాడు. బుందేల్‌ఖండ్ మాల్వాలను సిద్దిఖిస్తాన్ అని, బిహార్, ఒడిశాలను ఫారూకిస్తాన్ అని, రాజస్థాన్‌ను ముయిస్తాన్ అని, మొత్తం హిందూస్థాన్‌ను హైదర్స్తాన్ అని, దక్షిణ భారతదేశాన్ని మాప్లిస్తాన్ అని పిలవడం సరైనదని వాదించాడు. పశ్చిమ సింహళానికి షఫిస్తాన్ అని, తూర్పు సింహళానికి నాసరిస్తాన్ అని కూడా పేర్లు పెట్టాడు. వీటిలో మొదట సాధించవలసినది మాత్రం పాక్స్తాన్ అని అనుకున్నాడు. జాతీయోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం సాగించడానికి రహమత్ అలీ ప్రయత్నించాడు. 1940 నాటి లాహోర్ సమావేశంలో మొదటిసారిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ చేశాడు జిన్నా. ఆ సమావేశానికి రహమత్ కూడా హాజరయ్యాడు. దేశ విభజన తరువాత 1948 ఏప్రిల్ 6న అలీ లాహోర్ చేరుకున్నాడు. యమునా నదే హిందుస్థాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య సహజ సరిహద్దు అని, ఢిల్లీ, ఆగ్రాలు లేని పాకిస్తాన్‌ను ఎలా అంగీకరించారని ధ్వజమెత్తడం ఆరంభించాడు. తను పచ్చరంగు పూసి, సూచించిన ప్రాంతాలతో పాకిస్తాన్ ఎందుకు సాధించలేదన్నదే అతడి ప్రశ్న. జిన్నా ‘ఖాయిద్ ఏ ఆజమ్’ (మహా నాయకుడు జిన్నా బిరుదు) కాదు, ‘క్విస్లింగ్ ఏ ఆజమ్’(మహా ద్రోహి) అని విమర్శలు ఆరంభించాడు. దీనితో ప్రధాని లియాఖత్ అలీఖాన్ పాక్ నుంచి రహమత్‌ను బహిష్కరించాడు. అతడి ఆస్తులను జప్తు చేయించాడు. తిరిగి కేంబ్రిడ్జ్ చేరుకున్న అలీ 1951 ఫిబ్రవరి 3న దాదాపు అనాథగా చనిపోయాడు. కేంబ్రిడ్జ్‌లో అతడి ఆచార్యుడు ఎడ్వర్డ్ వెల్బోర్న్ డబ్బు ఇచ్చి అంత్యక్రియలు జరిపించాడు (ఈ ఖర్చులను తరువాత పాకిస్తాన్ హైకమిషన్ చెల్లించింది). మరణానంతరమైనా తన అవశేషాలు స్వస్థలం కామేలియాకు పంపించాలని తన న్యాయవాదిని అలీ కోరినట్టు చెబుతారు. కానీ 2006లో జరిగిన ఈ ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో సాగలేదు. 1947లో మౌంట్‌బాటన్‌తో జిన్నా చెప్పిన ‘మాత్ ఈటెన్ పాకిస్తాన్’ (అసంపూర్ణ పాకిస్తాన్) అన్నమాటకీ, ‘కశ్మీర్ లేని పాకిస్తాన్ ఏమిటీ?’ అన్న రహమత్ వాదనకీ ఏమైనా వ్యత్యాసం ఉందా? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ క్రైం స్టోరీ: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
పునీత్ భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళులు
-
చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి
Puneeth Rajkumar Funerals : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. చిన్న వయసులోనే పునీత్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్ అన్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించిన ఎన్టీఆర్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించారు. వీరితో పాటు శ్రీకాంత్, అలీ కూడా పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ మరణం తీరని లోటన్న శ్రీకాంత్.. ఆయన కటుంబసభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. మరోవైపు పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి రాజ్‌కుమార్ బెంగళూరుకు చేరుకుంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు పునీత్ అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య! పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. -
కమెడియన్ అలీ ఇంటిని ఎప్పుడైనా చూశారా?
Ali Home Tour: యూట్యూబ్.. ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని వాళ్లకు కూడా బోలెడంత పాపులారిటీ తెచ్చి పెడుతుంది. ఒకే ఒక్క వీడియోతో అటు డబ్బుతో పాటు బోలెడంత అభిమానం కూడా సొంతం చేసుకోవచ్చు. అందుకే సెలబ్రిటీలు సైతం సొంతంగా యూట్యూబ్ చానెల్స్ పెడుతున్నారు. క్రియేటివ్ వీడియోస్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు యూట్యూబ్ చానెల్స్‌తో సత్తా చాటుతున్నారు. తాజాగా కమెడియన్ అలీ భార్య జుబేదా సైతం యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఇంటికి సంబంధించి ‘మై హోమ్ టూర్’ పేరుతో ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హాలు, డైనింగ్ ఏరియా, నమాజ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి సౌకర్యాలతో ఉన్న జుబేదా అలీ ఇల్లు మొత్తం ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరలోనే పూర్తి వీడియో రిలీజ్ కానుంది. అప్పటివరకు ప్రోమోపై ఓ లుక్కేయండి. -
సోషల్ హల్చల్: బాధను ఇలా దాచమంటున్న మోనాల్, కింగ్-కాంగ్‌తో ధనుష్
► కింగ్-కాంగ్‌కు గ్రాండ్ వెల్కమ్ అంటూ ఇంటికి ఆహ్వానించిన హీరో ధనుష్ ► అప్పట్లో ఇనోసెంట్ని అంటూ చీరకట్టు ఫొటోలు షేర్ చేసి అనన్య ► బ్లాక్ డ్రెస్‌లో వయ్యారాలు పోతున్నా ఐశ్వర్య రాజేష్ ► నవ్వుతో బాధను ఇలా కప్పేయమంటున్న బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ► ఫ్యాన్స్‌ను షూక్రియా అంటూ పలకరించిన భూమిక ► కూతురికి నటుడు ఆలీ బర్త్‌డే విషెస్ View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) View this post on Instagram A post shared by Ali (@ali_the_actor) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
అలాంటి కథలంటే ఇష్టం: సమంత
‘‘నాకు వాస్తవంతో కూడిన జీవిత కథలంటే చాలా ఇష్టం. అలాంటి స్టోరీతో అలీగారు నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ హిట్ అవ్వాలి’’ అని హీరోయిన్ సమంత అన్నారు. అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ సమర్పణలో మోహన్ కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్ నిర్మించారు. ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు రాకేశ్ పళిదం ఈ సినిమాకు సంగీతదర్శకుడు. ఈ చిత్రంలోని మూడో పాటను సమంత విడుదల చే శారు. అలీ మాట్లాడుతూ – ‘‘నేను అడగ్గానే మా సినిమాలోని మూడో పాటను సమంత రిలీజ్ చేయడం హ్యాపీ. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ హిట్ సాధించాలి’’ అన్నారు. -
సోషల్ హల్చల్: సునీత మెలోడీ.. అలీ కామెడీ
మహేశ్ బాబు గారాల పట్టి సితార పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నమ్రత తన కూతురికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ క్యూట్ ఫోటోని అభిమానులతో పంచుకుంది. చాలా కాలం తర్వాత సినిమా సెట్లో అనుభూతి పొందుతున్నా అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్ 2020లో అసంపూర్తిగా అగిపోయిన ప్రాజెక్ట్ అంటూ యాంకర్, నటి విష్ణు ప్రియ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. సింగర్ సునీత నోట మరో మెలోడీ సాంగ్ రాబోతుందట. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొన్న కమెడియన్ అలీకి ‘బిగ్‌బాస్’ఫేమ్ సోహైల్ స్వాగతం పలికాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
సాలిడ్‌గా ఎంట్రీ ఇచ్చిన అలీ..'బిగ్‌బాస్' కోసమేనా?
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది యూట్యూబ్, ఇన్‌స్టా స్లార్లుగా పుట్టుకొచ్చారు. ఇక ప్రముఖ హీరో, హీరోయిన్లు సైతం సైతం సినిమా ప్రమోషన్స్ కోసం వీళ్ల సాయం కోరతారంటే ఈ సోషల్ స్టార్స్ హవా ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా డిజిటల్ మీడియాకి దూరంగా ఉన్న పలువురు స్టార్స్ ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చేశారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ కమెడియన్ అలీ కూడా చేరిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చీ రావడంతోనే 23వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇక ఇన్‌స్టా ఎంట్రీ సందర్భంగా అలీ చేసిన మొదటి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాలోకి రావడం రావడంతోనే తన సొంత సినిమాను ప్రమోట్ చేసుకున్నారు అలీ. అలీ సొంత బ్యానర్లో రూపొందిన 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అనే చిత్రంలోని ఓ సాంగ్ షూట్ సందర్భంగా తీసుకున్న ఫోటోనే ఇన్‌స్టా మొదటి పోస్ట్‌లో షేర్ చేసుకున్నారు. ఇది అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని, ఇకపై ఈ అకౌంట్‌ను తానే హ్యాండిల్ చేస్తున్నట్లు అలీ పేర్కొన్నారు. ఇక అలీ ఇన్‌స్టా అకౌంట్‌పై పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తూ 'వెల్కం టూ ఇన్‌స్టా ఫ్యామిలీ అలీగారు' అంటూ పోస్టులు షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు సడెన్‌గా అలీ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇవ్వడం బిగ్‌బాస్ కోసమేనా అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో అతి త్వరలోనే బిగ్‌బాస్ సీజన్-5 ప్రసారం అవ్వనున్న సంగతి తెలిసిందే. సీజన్-5లో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే బిగ్‌బాస్ షో నిర్వాహకులు అలీని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సడెన్‌గా అలీ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇవ్వడంతో ఇది బిగ్‌బాస్ కోసమేనంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Ali (@ali_the_actor) -
కమెడియన్ అలీ సినిమాకు ప్రభాస్ ప్రమోషన్స్
కమెడియన్, నటుడు అలీ నిర్మాతగా మారారు. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. 'అలీవుడ్ ఎంటర్టైన్మెంట్' పతాకంపై అలీ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఫూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రానికి గుడ్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ..అలీవుడ్ బ్యానర్ హాలీవుడ్ స్టైల్లో ఉందని, అలీ నిర్మాతగా మారి సినిమాలు తీయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్‌ను ప్రభాస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆలీ తెలిపారు. ప్రభాస్‌తో కలిసి ‘యోగి’, ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’,‘ బిల్లా’ సహా అనేక సినిమాల్లో నటించానని, తనమీద అభిమానంతో ఇండియాలో లేనప్పటికీ తన సినిమా కోసం వీడియో చేసి పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న అలీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అలీ ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా తనకు చిత్రపరిశ్రమలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణరెడ్డిలు గెస్ట్ రోల్ పోషించగా, నరేష్, శివబాలాజీ, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన రాకేశ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయనున్నారు. చదవండి : ఈ వార్త నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే! 'కథ వేరేలా ఉందే'.. అనిల్ రావిపూడిని కలిసిన సోహైల్ -
అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారు - సినీ నటుడు అలీ
-
వెండితెరపై చెన్నూరు చిన్నది..!
సాక్షి, చెన్నూర్: చిన్ననాటి నుంచి ఆమెకు నాటకాలు, డ్రామాలు అంటే మక్కువ. ఆ మక్కువే నేడు సినిమాలో చాన్స్ దక్కించింది. చదువుకునే సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంలో వెబ్‌సీరిస్‌లోకి అడుగుపెట్టింది. “వరంగల్ వందన’ వెబ్‌సీరిస్‌లో తన నటనకు మంచి మార్కులు దక్కించుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో నంబర్‌వన్ స్థానంలోకి చేరింది. ఇటీవల సినిమాలో సైతం చాన్స్ దక్కించుకుంది. ఫలితంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం నుంచి వెండితెరపై మెరవనున్న తొలి మహిళగా సుష్మగోపాల్ నిలవనుంది. సినీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డితో సుష్మగోపాల్ చెన్నూర్‌కు చెందిన సుష్మ... చెన్నూర్‌కు చెందిన ప్రైవేట్ వైద్యుడు తిప్పార్తి వేణుగోపాల్, శ్రీకళ దంపతుల కుమార్తె సుష్మగోపాల్. చెన్నూర్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంది. 2019న హైదరాబాద్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా.. వరంగల్ వందన వెబ్‌సీరిస్‌లో చాన్స్ దక్కింది. రచయిత ప్రజా ప్రభాకర్, డైరెక్టర్ శృతి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెబ్ సీరిస్‌లో నటించింది. ఇప్పటివరకు 80కి పైగా వెబ్ సీరిస్‌లో నటించిన సుష్మగోపాల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండింగ్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. ఓవైపు వెబ్‌సీరిస్‌లో నటిస్తూనే ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ చేస్తూ మరోవైపు వెబ్ సీరిస్‌ల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం సినిమాలో నటించే చాన్స్ రావడంతో సుష్మగోపాల్తో పాటు ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో .. సినీ రంగ ప్రవేశం వెబ్‌సిరీస్‌లో రాణిస్తున్న సుష్మగోపాల్కు ఒక్కసారిగా వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. సినీ నటుడు అలీ, నరేశ్ నటిస్తున్న అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాను శ్రీపురం కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలో ప్రధాన పాత్రధారి చెల్లె పాత్రలో సుష్మ నటిస్తోంది. 10 లక్షల చేరువలో వెబ్‌సీరిస్ వరంగల్ వందన వెబ్‌సీరిస్ ఏడాదికి లక్ష మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. దీంతో వరంగల్ కలెక్టర్ పాటిల్ ప్రశాంత్‌జీవన్ వెబ్ సిరీస్ బృందాన్ని అభినందించి మెమోంటో అందజేశారు. ప్రస్తుతం వరంగల్ వందన యూట్యూబ్ వెబ్ సిరీస్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 10లక్షల సబ్ స్క్రైబర్‌కు చేరువలో ఉంది. సుష్మగోపాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 50వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. చదువుతో పాటు... చదువుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లాను. మా అన్నయ్య విష్ణు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్ చదువుతూనే వెబ్‌సిరీస్‌లో నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఓ సినిమాలో చాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో మంచి పేరు తీసుకువచ్చే పాత్ర చేస్తా. మంచి నటిగా పేరు సంపాదించాలనేదే నా లక్ష్యం. – తిప్పార్తి సుష్మగోపాల్, సినీనటి, చెన్నూర్ -
అలీ అడిగితే కాదంటారా!
వీకే నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అందరూ బావుండాలి, అందులో నేనుండాలి’. మలయాళంలో విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఈ సినిమా రీమేక్. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ సమర్పణలో బాబా అలీ, మోహన్‌కుమార్ కొణతాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రాణస్నేహితులు దర్శక-నిర్మాతలు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుతూ.. ‘‘అలీతో 27 ఏళ్ల క్రితం మేం ‘యమలీల’ చిత్రం చేసినప్పుడు ఎలా ఉన్నాడో 1100 చిత్రాల్లో నటించిన తర్వాత కూడా ఏ మాత్రం మార్పు లేకుండా అలానే ఉన్నాడు. అలీ ఫోన్ చేసి నేను నిర్మాతగా, హీరోగా సినిమా చేస్తున్నాను. మీరు నా సినిమాలో చిన్న పాత్ర చేయాలని అడిగాడు. అలీ అడగటం.. మేము కాదనడమా? అందుకే ఓకే అని చక్కని సీన్లో నటించాం’’ అన్నారు. అలీ మాట్లాడుతూ.. ‘‘27 ఏళ్ల క్రితం నాకు ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ చిత్రంలో వేషమిచ్చిన ఈ ఇద్దరూ తర్వాత నన్ను ‘యమలీల’తో హీరోగా నిలబెట్టారు. అందుకే నేను ఏ పనిచేసినా వాళ్లు లేకుండా చేయను. సెంటిమెంట్‌గా ఈ సినిమాలో వాళ్లిద్దరికీ చిన్న వేషం ఇచ్చాను. ఈ చిత్రం తర్వాత ఇద్దరూ నటులుగా బిజీ అవుతారు (నవ్వుతూ)’’ అన్నారు. -
కబడ్డీ ఆడిన నటుడు అలీ..
సాక్షి, అవనిగడ్డ: టాలీవుడ్ సినీ నటుడు ఆలీ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆదివారం సందడి చేశారు. అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొని కబడ్డీ కోర్టులో కూతపెట్టి పోటీలను ప్రారంభించారు. అలీతో కలిసి స్థానిక ఆర్డీవో ఖాజావలీ కూడా కబడ్డీ ఆడి అలరించారు. అనంతరం పోలో విజేతలుగా నిలిచిన వారికి అలీ చేతుల మీద బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఆటలపోటీలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆటలపోటీలు నిర్వహించడం పట్ల జిల్లా ఎస్పీకి అలీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువతను సన్మార్గంలో నడిపించడానికి జిల్లా ఎస్పీ ఆలోచన అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని అలీ కోరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్పి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. చదవండి : నా మేనకోడలిని ఆశీర్వదించండి అదే విధంగా మండల పరిధిలోని పులిగడ్డ ఇరిగేషన్ అతిథి గృహంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సతీష్ దర్శకత్వంలో అలీ ముఖ్యపాత్రలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ని ఆదివారం నిర్వహించారు. సమాజంలో మూఢ నమ్మకాలు రూపుమాపాలనే సందేశంతో రూపొందిస్తున్న ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో అలీ నటిస్తున్నారు. ఇరిగేషన్ అతిథి గృహం ప్రాంగణంలో అలీపై పలు దృశ్యాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నజీర్బాషాతో పాటు పలువురు నేతలు అలీని కలిసి, ఆయనను ఘనంగా సత్కరించారు. షూటింగ్ విషయం తెలుసుకున్న పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పులి గడ్డకు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. -
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ ప్రారంభం
-
అందరూ బాగుండాలి...
‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే మంచి కథ ఉన్న సినిమాలో అలీ, నరేశ్ నటిస్తుండడం సంతోషంగా ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నటుడు అలీ ‘అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అలీ, సీనియర్ నరేశ్, మౌర్యాని ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీబాబ, కొనతాల మోహనకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కెమెరామేన్ ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నేను, ఈ చిత్రదర్శకుడు కిరణ్ చెన్నైలో రూమ్ మేట్స్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వికృతి’ సినిమాకు ఇది రీమేక్’’ అన్నారు అలీ. ‘‘అలీ ఓ చిత్రం చేస్తున్నాడంటే దానికి ఒక బ్రాండ్ వస్తుంది’’ అన్నారు నరేశ్. ‘‘బుధవారమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు శ్రీపురం కిరణ్. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్ పళిడమ్, కెమెరా: ఎస్. మురళీ మోహన్ రెడ్డి. -
నా మేనకోడలిని ఆశీర్వదించండి: అలీ
సాక్షి, రాజమండ్రి(తూర్పు గోదావరి జిల్లా): ప్రముఖ హాస్యనటుడు అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అలీ పెద్దక్క కూతురు సల్మా వివాహం సోమవారం రాత్రి రాజమండ్రిలో జరిగింది. సల్మా, అహ్మద్ అలీల పెళ్లి వేడుకలో రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్, ఇతర ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. సల్మాకు తండ్రి లేకపోవటంతో తండ్రి స్థానాన్ని మేనమామ అలీ తీసుకుని పెళ్లి వేడుకని అంగరంగా వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు అందరి దీవెనలు ఉండాలని అలీ కోరుకున్నారు. -
ఆ వార్త ఎంతగానో కుంగదీసింది: అలీ
సాక్షి, హైదరాబాద్: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై సినీనటుడు అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అలీ కన్నీటిపర్యంతమయ్యారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ఎస్పీబీ మరణం నన్ను ఎంతగానో కుంగదీసింది. కుటుంబ పెద్దను కోల్పోయా. ఆయన లేని లోటు పూడ్చలేనిది. బాలు ఎందరికో స్పూర్తిగా నిలిచారు. ఎన్నో భాషల్లో వేలకొద్ది పాటలు పడే అవకాశం ఎస్పీబీకే దక్కింది. నేను బాబాయ్ అని పిలిచేవాడిని. నన్ను కన్నకొడుకులా ఆదరించారు. చరణ్‌తో సమానంగా నన్ను చూసుకునేవారు. బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని పేర్కొన్నారు. కాగా, అనారోగ్యానికి గురైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలోని తమరాయిపక్కంలోని బాలు ఫామ్‌హౌజ్‌లో ఆయన అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. బాలు అంత్యక్రియలను తమిళనాడు సర్కార్ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనుంది. (చదవండి: బాలు నటించిన సినిమాలు) -
సీఎం జగన్‌ను కలిసిన నటుడు అలీ
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తార’ని అలీ అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున ఆయన విస్తృత ప్రచారం చేశారు. కరోనా సంక్షోభంతో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. థియేటర్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినిమా పరిశ్రమకు చెందిన వారు కోరుతున్నారు. (చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం) -
ఆలీ పేరిట నకిలీ ట్విట్టర్ అకౌంట్
-
ఆలీ పేరిట నకిలీ ట్విటర్ అకౌంట్
సాక్షి, హైదరాబాద్: తన పేరిట నకిలీ అఫిషియల్ ట్విటర్ అకౌంట్ నడుస్తోందని తెలుసుకుని సినీ నటుడు ఆలీ షాక్ తిన్నారు. వెంటనే సైబరాబాద్‌లోని క్రైమ్ డిపార్టుమెంటు డిప్యూటీ కమిషనర్ రోహిణి ప్రియదర్శినికి శనివారం ఫిర్యాదు చేశారు. (14 వేల మద్యం బాటిళ్లు ధ్వంసం) 2017 నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆలీ పేరిట అధికారిక ట్విటర్ అకౌంట్‌ను నడుపుతున్నాడు. సందర్భానుసారంగా వీడియోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు. పలువురు నటీనటులకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెట్టాడు. ఆ అకౌంట్ తనది కాదని, తన పేరిట అకౌంట్ రన్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆలీ తన ఫిర్యాదులో కోరారు. (అమెజాన్ ఆపిల్ డేస్ సేల్ : తగ్గింపు ధరలు) -
ఈసారి పవన్ కళ్యాణ్ వాటిని పంపించలేదు
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ స్నేహానికి మంచి పేరుంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. సినిమాల్లోనూ వాళ్లిద్దరూ ఒకే సీన్లో కనిపించారంటే కామెడీ పంట పండినట్టే. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. గతేడాది ఎన్నికల సమయంలోనూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్లో ఇంటిపట్టునే ఉంటున్న అలీ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. పవన్ తనకు ప్రతి ఏడాది మామిడి పండ్లు పంపేవారని పేర్కొన్నారు. కానీ ఈసారి మాత్రం తనకు మామిడి పండ్లు అందలేదని కాస్త నిరాశకు లోనయ్యారు. (అలీ @ కలామ్) పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది పంపించలేదేమోనని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదైనా వాటిని పంపుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి దగ్గర నుంచి ఆవకాయ పచ్చడి వచ్చేదన్నారు. కాగా పవన్ కళ్యాణ్‌తో కలిసి అలీ చివరిసారిగా కాటమరాయుడు సినిమాలో కనిపించారు. ఇదిలా వుండగా దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా హాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో 'కలామ్' పాత్రను అలీ పోషిస్తున్నారు (నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు) -
మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ
కరోనా వైరస్ నియంత్రణకు 21రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో హాస్యనటుడు అలీ... ఇంటి పనులతో బిజీ బిజీగా ఉన్నారు. షూటింగ్‌లతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ దొరకని ఆయన ఇప్పుడు ఇంట్లో వాళ్లు చెప్పిన పనులు చేస్తున్నారు. ’రోజూ కార్లు కడుగుతున్నా.. ఇంట్లో పని చేస్తున్నా. కాయగూరలు కట్ చేస్తున్నా. ఇల్లంతా శుభ్రపరుస్తున్నా. (కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్) అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నా. ఇంకా మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా.. వంట పని లాంటివి. నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాణ్ణి.. అందుకని నన్ను బాడుగ (అద్దె) కట్టమనేవాళ్లు కాదు. అప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ణి. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాణ్ణి. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏం మనం స్నానం చేయడం లేదా? వేరే వాళ్లు చేయిస్తున్నారా? చిన్నప్పుడంటే తల్లిదండ్రుల చేయించేవాళ్లు.’ అని తెలిపారు. (బుల్లితెర కార్మికులకు యాంకర్ ప్రదీప్ చేయూత) -
బయోపిక్ నం 3
దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పటికే వచ్చాయి. నిర్మాత అనిల్ సుంకరతో కలసి, అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జగదీష్ దానేటి, జానీ మార్టిన్ దర్శకత్వంలో ఇండో–హాలీవుడ్ చిత్రంగా కలామ్ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించారు. కలామ్గా అలీ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కలామ్ జీవితంపై సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు కలామ్‌పై సినిమా తీసే రైట్స్ మా దగ్గరే ఉన్నాయి మరెవ్వరూ సినిమా తీయడానికి వీల్లేదు అని అభిషేక్ ఆర్ట్స్ సంస్థ›పేర్కొంది. దాంతో ఆసక్తి ఏర్పడింది. -
అలీ @ కలామ్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ బయోపిక్ హాలీవుడ్లో తెరకెక్కుతోంది. కలామ్ పాత్రను నటుడు అలీ పోషిస్తున్నారు. పప్పు సువర్ణ నిర్మాణంలో జగదీష్ దానేటి, జానీ మార్టిన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆదివారం ఢిల్లీలో విడుదల చేశారు. ‘‘సినీ జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. కలామ్గారితో ఫొటో దిగితే చాలనుకున్నాను. ఆయన బయోపిక్‌లో నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు అలీ. ‘‘అలీగారికి ఇది 1,111వ చిత్రం. ఈ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు’’ అన్నారు జగదీష్ దానేటి. -
హాలీవుడ్‌కి హాయ్
సౌత్ నుంచి నార్త్ వరకూ తన ఎంటర్టైన్మెంట్ ఎక్స్‌ప్రెస్‌తో ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు అలీ. ఇప్పుడీ స్టార్ కమెడియన్ ప్రయాణం హాలీవుడ్‌లోనూ మొదలుకానుంది. జగదీష్ దానేటి దర్శకత్వంలో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఈ ఇండో–హాలీవుడ్ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిల్మ్స్, పింక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తాయి. ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి విషయమై సమాచార, ప్రసారాల శాఖమంత్రి ప్రకాష్ జవడేకర్‌ను న్యూఢిల్లీలో కలిశారు అలీ, దర్శకుడు జగదీష్ దానేటి. అలీ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ సినిమా చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. హలీవుడ్ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అలీగారిని హాలీవుడ్‌కి పరిచయం చేయడం అదృష్టంలా భావిస్తున్నాను’’ అన్నారు జగదీష్ దానేటి. -
హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అలీ
బాలనటుడిగా ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన అలీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచారు. తాజాగా ఈ స్టార్ కమేడీయన్.. హాలీవుడ్లో తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు జగదీష్ దానేటి దర్శకత్వంలో అలీ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్రబృందం మీడియాకు వెల్లడించింది. ఒక స్ట్రయిట్ హాలీవుడ్ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని తెలిపింది. ఈ ఇండో హాలీవుడ్ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిల్మ్స్, పింక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు చెప్పింది. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుమతుల విషయమై నటుడు అలీ, దర్శకుడు జగదీష్.. సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘హాలీవుడ్ సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. హాలీవుడ్ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్ జవదేకర్గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. జగదీష్ మాట్లాడుతూ.. ‘ఇండో హాలీవుడ్ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్లో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని తెలిపారు. -
అలీబాబా 26 నవ్వులు
అలీబాబానా! ఈ బాబా ఎవరు! ఊర్కే.. రైమింగ్ కోసం. మరి.. ఆ ఇరవై ఆరు?! టైమింగ్ కోసం. అలీకి పెళ్లై ఇరవై ఆరేళ్లయింది. అలీ ఒక్కరికే పెళ్లవడం ఏంటి? ఆవిడేమైపోయారు! ఉన్నార్లెండి.. పేరుకు ఇద్దరు అయినా.. ఒకరిగా.. ఒకరికొకరుగా ఉంటారు మరి. నవ్వులు అన్నారు.. అవేమిటి.... వాటికీ రైమింగ్, టైమింగ్ ఉందా? అవి ఉంటే సినిమా అయ్యేది. లేవు కాబట్టే.. చక్కటి దాంపత్యం అయింది. చదవండి.. మీ కోసం అలీ దంపతుల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ►ఈ 23తో మీ పెళ్లయి 26ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల వైవాహిక జీవితం ఎలా గడిచింది? అలీ: తెలియలేదు. 26 ఏళ్లుగా నీతో (భార్యని ఉద్దేశిస్తూ) కాపురం చేస్తున్నానా? అనిపిస్తోంది. జుబేదా: అమ్మతో ఇన్నేళ్లు కలిసి ఉంటున్నారంటే మీకు అవార్డు ఇవ్వాలి నాన్నా అని మా పెద్దమ్మాయి అంటుంది (నవ్వుతూ). అలీ: బేసిక్‌గా నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. మా పెద్దక్క పేరు ఫాతిమా. తమ్ముడు నిద్రపోతున్నాడు కదా అని ఆవిడ ఉదయాన్నే నన్ను నిద్రలేపకపోయి ఉంటే నేను సినిమాల్లోకి వచ్చేవాడిని కాదు. మా అమ్మ తర్వాత అమ్మ మా పెద్దక్క. అందుకే మా ఆవిడకి ముందే చెప్పాను.. మనకు కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా మా అక్క పేరు మొదట కానీ చివర కానీ ఉంటుంది అని. మాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. ‘ఫాతిమా’ అని పేరు పెట్టాం. ►మరి అలీగారు తన అక్క పేరు పెడతానంటే మీరు వెంటనే ఓకే అన్నారా? జుబేదా: నాకు పదో తరగతి పూర్తవ్వగానే పెళ్లయిపోయింది. పిల్లలకు ఈ పేరు పెట్టాలనే సొంత ఆలోచన లేదు. మా అత్తగారు, మా ఆయన ఏది చెబితే అదే. ముఖ్యంగా అత్తగారు ఏం చెప్పినా నా మంచికే అనుకునేదాన్ని. పెళ్లికి ముందు మా అమ్మగారింట్లో నేను వంటగదిలోకి వెళ్లింది లేదు. ‘వంటతో మొగుడిని కొంగుకి కట్టేసుకోవచ్చు... నేర్చుకో’ అని మా అత్తగారు వంట నేర్పారు. పెద్దవాళ్ల దగ్గర ఎలా ఉండాలి? భర్తను ఎలా చూసుకోవాలి? వంటివన్నీ ఆమే నేర్పారు. మా అత్తగారు అలా అన్నీ చెప్పారు కాబట్టే ఈరోజు హాయిగా ఉన్నాను అనుకుంటున్నాను. ►ఇంతకీ అత్తగారు చెప్పినట్టు భర్తను కొంగున ముడేసుకున్నారా? అలీ: మొదట్లో మా అమ్మ అంటే తనకు భయం ఉండేది. నేనన్నా భయమే. ఓ పదేళ్ల తర్వాత నాకు భయం మొదలైంది (నవ్వులు). ►26 ఏళ్లు అత్తగారితో ఉన్నారు. ఇప్పుడు ఆమె లేరు. ఎలా అనిపిస్తోంది? జుబేదా: మా అత్తగారికి ముగ్గురు కూతుళ్లు ఉన్నప్పటికీ నన్ను కూడా ఓ కూతురిలా చూసుకున్నారు. నిజం చెప్పాలంటే మా అమ్మ దగ్గర నేనేమీ నేర్చుకోలేదు. అత్తగారి దగ్గర నేర్చుకున్న విషయాలతో మిగతా జీవితం గడిపేస్తాను. ఆవిడ మా మధ్యలేకపోయినా ఉన్నట్లుగా అనుకుంటా. అలీ: మా పెళ్లయిన కొత్తలో ఎన్ని రోజులు అవుట్డోర్ షూటింగ్ ఉన్నా ఆలోచించకుండా వెళ్లిపోయేవాడ్ని. ఇప్పుడు పది రోజులు అవుట్ డోర్ షూటింగ్ అంటే వెళ్లడానికి ఆలోచిస్తున్నాను. అమ్మానాన్నలు ఉన్నారనే ధైర్యం, దీమాతో వెళ్లేవాడిని. ఇప్పుడు ఇద్దరూ లేరు. తనకు నేను, నాకు తను. మా ఇద్దరికీ మా ముగ్గురు పిల్లలు. ►మీ పెళ్లికి ముందు పెళ్లి చూపులేవీ జరగలేదట? జుబేదా: పెళ్లయ్యేవరకూ మావారు నన్ను చూడలేదు. మా అత్తగారే నన్ను సెలెక్ట్ చేశారు. అలీ: అమ్మాయి మీకు నచ్చిందా? అని మా అమ్మానాన్నని అడిగాను. నచ్చిందన్నారు. పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి జనవరి 23న అయితే ఫిబ్రవరి 11న ‘యమలీల’ ఓపెనింగ్. ఏప్రిల్ 28న సినిమా విడుదల. మా అమ్మానాన్న అత్తయ్య, మామయ్య అందరం కలసి సినిమా చూశాం. మంచి టాక్. అప్పటి వరకూ నాకు 30–40 శాతం ఫాలోయింగ్ ఉండేది. ఆ సినిమా తర్వాత 200 శాతం ఫాలోయింగ్ వచ్చింది. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్... అలీ ఇవన్నీ బాగా చేయగలడని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డిగారు గ్రహించి నన్ను హీరోగా పెట్టి ‘యమలీల’ తీశారు. ఆ తర్వాత 53 సినిమాల్లో హీరోగా చేశాను. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఐదు భాషల్లో కలిపి 1100 సినిమాలకు పైగా కమెడియన్‌గా చేశాను. ►అలీగారి అక్కచెల్లెళ్లను, తమ్ముళ్లను మీరు బాగా చూస్తారు. మరి మీ తోడబుట్టినవాళ్లను? జుబేదా: ప్రతి పండగకి మా రెండు వైపుల బంధువులందరూ కలుస్తాం. తన ఫ్యామిలీ వాళ్లనే చూసుకోవాలనే మనస్తత్వం కాదు ఆయనది. అందర్నీ ఒకేలా చూస్తారు. నా తోడబుట్టినవాళ్లను కూడా మావారే చదివించారు. వాళ్లు మంచి పొజిషన్లో ఉన్నారంటే మావారే కారణం. నా మొదటి తమ్ముడు మావారికి మేనేజర్‌గా చేస్తున్నాడు. రెండోవాడు చెన్నైలో ఎల్ అండ్ టీ కంపెనీలో మంచి పొజిషనల్ ఉన్నాడు. మూడోవాడు నాన్న బిజినెస్ చూసుకుంటున్నాడు. మా తమ్ముళ్లు మా ఆయన్ని బావలా కంటే నాన్నలానే చూస్తారు. ►నటుడిగా మంచి పేరు, డబ్బు సంపాదించుకున్నారు. మీ చిన్నప్పుడు మీ నాన్నగారు టైలర్‌గా చేసేవారు. బాల్యం ఎలా ఉండేది? అలీ: మా అమ్మానాన్నలకు మేం ఆరుగురు సంతానం. మా నాన్నగారు టైలర్. మాకు బట్టలకు కొరత లేదు. మాకు నెలకోసారి కొత్తబట్టలు. సాధారణంగా ముస్లిమ్స్ అంటే నాన్–వెజ్ తింటారు. మా అమ్మానాన్న వారంలో మూడు నాలుగు రోజులు పిల్లలకు నాన్–వెజ్ పెట్టాలనుకునేవారు. నాన్నగారికి ఆదాయం బాగానే ఉండేది. దాంతో మాకు తిండికీ బట్టకూ కొరత ఉండేది కాదు. ఇక నా భార్య వచ్చిన తర్వాత ఇంటికి పెద్ద కోడలిగా ఆడపడుచులను, మరుదులను బాగా చూసుకుంటూ వచ్చింది. మా అమ్మ చనిపోయినా నా తమ్ముళ్లు అమ్మ తర్వాత అమ్మ వదిన ఉంది కదా అనుకుంటున్నారు. ►మీ పిల్లల గురించి? అలీ: నా పెద్ద కూతురు ఫాతిమాకి డాక్టర్ అవ్వాలని కోరిక. నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మా అమ్మానాన్న ప్రోత్సహించారు. ఇప్పుడు నేను, మా ఆవిడ తనకు సపోర్ట్ చేస్తున్నాం. థర్డ్ ఇయర్ చదువుతోంది. కొడుకు అబ్దుల్ సుభాన్. మా నాన్నగారు చనిపోయిన పదేళ్లకు నేనో ట్రస్ట్ ఏర్పాటు చేశాను. మే 10న ట్రస్ట్ స్థాపించా. అప్పటికి మా ఆవిడ గర్భవతి. మే 12 మధ్యాహ్నం జనరల్ చెకప్‌కి వెళ్తే వెంటనే ఆపరేషన్ చేశారు. అబ్బాయి పుట్టాడు. అందుకే మా నాన్నగారి పేరు (అబ్దుల్ సుభాన్)ని వాడికి పెట్టా. ఆ ట్రస్ట్ ఇంకా నడుపుతున్నాను. ప్రతి రంజాన్‌కి 3 లక్షల రూపాయిలు తీసి పక్కన పెడతాను. సహాయం చేస్తాను. జుబేదా: మొదటి పాప పుట్టినప్పుడు నాకు థైరాయిడ్ సమస్య వచ్చింది. ఇక పిల్లలు పుట్టరు అన్నారు. నమాజ్ చేశాం. పదేళ్ల తర్వాత పిల్లాడు పుట్టాడు. 8వ నెలకే పుట్టాడు బాబు. బాబు పరిస్థితి కష్టం అన్నారు. అందుకే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలేదు. ఆ తర్వాత మూడో పాప పుట్టింది ►చిన్నప్పటినుంచి సినిమాలు చేస్తూ ఇప్పటికీ బిజీగా ఉన్నారు కదా.. కొంచెం రిలాక్స్ అవ్వాలి అనిపించడంలేదా? అలీ: ఈ లైఫ్ నేను ఊహించలేదు. అందుకే రిలాక్సేషన్ గురించి ఆలోచించడంలేదు. అయితే మనకి ఒక వయసు ఉన్నప్పుడు ఎంత కష్టపడినా ఏం కాదు. వయసొచ్చాక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాత్రే ఎందుకు నిద్రపోవాలని నిశ్చయించారంటే పగలంతా కష్టపడతాం. మన అవయవాలకు కూడా రెస్ట్ కావాలి. ఎక్కువ కష్టం పెడితే రిపేర్ రావచ్చు. ఎందుకు రిపేర్ తెప్పించుకోవాలి? అనుకుంటాను. అందుకే ముందే డే షూట్ ఎన్ని రోజులు, నైట్ షూట్ ఎన్ని? అని క్లియర్‌గా అడిగి తెలుసుకుంటాను. నేను మెంటల్లీ ప్రిపేర్ అవుతాను. ఇంట్లో చెప్పేస్తాను. ►ఒకసారి ఏదో పేపర్లో మీవారు రెండో పెళ్లి చేసుకున్నారని వచ్చిన వార్త చూసి, కంగారుపడ్డారట.. ఆ విషయం గురించి? జుబేదా: పెళ్లయిన తర్వాత మా అమ్మవాళ్లు నన్ను తీసుకెళ్లారు. అప్పట్లో తారా సితార అనే మ్యాగజీన్ వచ్చేది. అందులో షూటింగ్ విశేషాలు, ఇంకా సినిమాల విశేషాలు చాలా వచ్చేవి. ఆ పత్రికలోనే అలీకి, శుభశ్రీకి పెళ్లయిందనే వార్త చదివాను. అయితే అది సినిమా సీన్ అని కింద ఉంది. అది చదవలేదు. ముందు మా నాన్నగారు చదివి బాగా కంగారు పడిపోయారు. నిన్ను ఇటు తీసుకురాగానే అక్కడ పెళ్లి చేసుకుంటున్నాడా? అని అన్నారు. నువ్వు వెంటనే బట్టలు సర్దుకో.. ఇంటికి వెళ్లు అన్నారు. నేనూ కంగారు పడ్డాను. ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే మావారే డోర్ తీశారు. నిన్నే కదా వెళ్లావ్. అప్పుడే వచ్చేశావేంటి? అని అడిగారు. అదేం పట్టించుకోకుండా శుభశ్రీ ఎక్కడ? అని ఇల్లంతా వెతికాను. ఏంటి? వెతుకుతున్నావు అని అడిగారాయన. ‘పేపర్లో చూశాను.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని’ అంటే, సరిగ్గా చదివావా? అని అడిగి ఆ పేపర్ చూపించారు. అప్పుడు షూటింగ్లో పెళ్లి సీన్ అని చదివి, నవ్వుకున్నాం. అయితే ఇంటికి వచ్చేటప్పుడు బస్‌లో ‘అంతే.. నా లైఫ్ అయిపోయింది’ అని ఏడుస్తూ కూర్చున్నాను. ఆయన మీద నమ్మకం లేక కాదు. ‘యాక్టర్‌ని చేసుకుంటున్నావు.. జాగ్రత్త’ అని పెళ్లికి ముందు నా ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాటల ప్రభావంతోనే భయపడ్డా. ►కొందరు హీరోయిన్ల గురించి అలీగారు చేసిన కామెంట్స్‌కి సోషల్ మీడియాలో విమర్శలు రావడం గురించి... అలీ: ‘మా ఆయన స్టేజ్ మీద మాట్లాడే మాటలు కేవలం నవ్వించడానికే. దీన్ని నవ్వుగా తీసుకోవాలి తప్ప మా ఆయన్ను నవ్వులపాలు చేయకండి’ అని జుబేదా ఆ విమర్శలకు సమాధానం చెప్పింది. ఇన్ని తెలివితేటలు తనకెలా వచ్చాయా అని ఆశ్చర్యపోయా. జుబేదా: మావారు స్త్రీలను ఎంత గౌరవిస్తారో నాకు తెలుసు. అలాంటి ఆయన మీద ఇలాంటి కామెంట్స్ రావడంతో బాధపడ్డాను. చంద్రుడికి ఒక మచ్చలాగ ఈ కామెంట్స్ వచ్చాయి. అలీ: సోషల్ మీడియాలో కంట్రోల్ లేదు. ఇప్పుడేం మాట్లాడాలన్నా కొలతలు పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. జుబేదా: ఏం మాట్లాడితే ఏం అవుతుందో అని తక్కువ మాట్లాడేస్తున్నారు. ఆయన కామెడీని నేను మిస్ అవుతున్నాను. ►దాదాపు 20 ఏళ్లు టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైయస్సార్సీపీలో చేరడానికి కారణం ఏంటి? 1999లో టీడీపీలో చేరాను. నాకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లైఫ్ ఇచ్చింది రామానాయుడుగారు. ‘రేయ్.. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. ప్రచారానికి రావాలిరా’ అన్నారాయన. అలాగే గురువుగారు.. వస్తున్నాం అని వెళ్లాను. కంభంపాటి రామ్మోహన్రావుగారు అని ఉన్నారు. ఆయన మాకు ఇన్చార్జ్. ఆయన మమ్మల్ని 15 రోజులు తిప్పారు. అప్పుడు టీడీపీ కమ్ బీజేపీ రెండూ మిక్స్ ఉండేది. అప్పుడు బాబ్రీ మసీదు ప్రాబ్లమ్ వస్తే, ‘బీజేపీ కలిసి ఉన్న టీడీపీకి నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు?’ అని చాలామంది మస్లిమ్లు నా మీద రివర్శ్ అయ్యారు. ‘నేను బీజీపీ తరఫున రాలేదు. వచ్చింది టీడీపీ తరఫున.. అపార్థం చేసుకోవద్దు’ అని చెప్పాను. నేనేదో పెద్దది ఆశించలేదు. అరే.. షూటింగ్ మానుకుని వచ్చాడు అనే గుర్తింపు లేదు. ఒక మనిషిని ఇంతలా వాడుకుంటారా? అని బాధ కలిగింది. 2004లో మళ్లీ రమ్మంటే వెళ్లాను. అప్పుడూ గుర్తింపు లేదు. అప్పుడే రాజశేఖర రెడ్డిగారు అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ఏవీయస్‌గారికి ఆరోగ్యం బాగా లేకపోతే నేను, జయసుధగారు, సీసీ రెడ్డిగారు, ఎన్. శంకర్‌గారు.. రాజశేఖర రెడ్డిగారిని కలిశాం. చీఫ్ మినిస్టర్ ఫండ్ నుంచి వెంటనే 3 లక్షలు ఇచ్చారు. మేం టీడీపీ అని తెలుసు. అయితే తనను నమ్ముకుని వచ్చారు కాబట్టి ఇచ్చారు. అదే లక్షణం జగన్మోహన్రెడ్డిగారికి వచ్చింది. ఎందుకు ఇంకా టీడీపీలో కంటిన్యూ అవ్వాలి అనుకున్నాను. 2015లో నెక్ట్స్ సీఎం మీరే అని జగన్‌గారితో అన్నాను. ఒకసారి తిరుపతి వెళుతుంటే, ఫ్లయిట్లో కలిశాం. 2017 డిసెంబర్ 29న నా స్నేహితుడు శ్రీను వాళ్ల అబ్బాయి ఎంగేజ్మెంట్కి వెళుతుంటే, ఫ్లయిట్లో జగన్‌గారు ఉన్నారు. అప్పుడు తీసిన మా ఫొటో సోషల్ మీడియాలో బాగా తిరిగింది. దాంతో వైసీపీలో చేరుతున్న అలీ అని వార్త వచ్చింది. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా చాలామంది చాలా మాట్లాడారు. నేను వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. సంస్కారం అడ్డొచ్చింది. వన్ ఫైన్ డే.. వైసీపీ కండువా కప్పుకున్నాను. అదే రోజు సాయంత్రం ఎలక్షన్ కోడ్ వచ్చింది. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అన్నారు కదా.. అందుకని కావలి నుంచి ప్రచారం మొదలుపెట్టాను. నేను ప్యాకేజీ మాట్లాడుకున్నానని అన్నారు. కానీ ఏదీ ఆశించి ఈ పార్టీలోకి రాలేదు. ఈ వ్యక్తి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఉద్దేశం. నేనెప్పుడూ ఏ పార్టీ నుండి ఏమీ ఆశించలేదు. నాక్కావల్సింది కొంచెం గౌరవం, మర్యాద అంతే. ►మీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగడానికి కారణాలు? ఏమైనా సలహాలు? జుబేదా: భర్త అంటే మా ఆయనలా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఇద్దరూ ఒకేసారి కోపం తెచ్చుకోకూడదు. నాకు కోపం వస్తే ఆయన సైలెంట్ అయిపోతారు. ఆయనకు కోపం వస్తే నేను సైలెంట్ అయిపోతా. మా గొడవల్ని మా బెడ్రూమ్ దాటి బయటకు రానివ్వలేం. ‘కోపం వస్తే రూమ్‌లోకి వెళ్లి గొడవపడదాం. కానీ పిల్లల ముందు ఎప్పుడూ వాదించుకోవద్దు’ అని నాతో చెబుతుంటారు. అలీ: రూమ్‌లోకి వెళ్లాక భార్యాభర్త కరాటే చేస్తారో జూడో చేస్తారో మీ ఇష్టం (నవ్వుతూ). క్షణికావేశం కాపురం చెడగొడుతుంది, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అందుకే సర్దుకుపోవాలి. జుబేదా: భార్యాభర్తల మధ్య గొడవ గంటా రెండు గంటల్లో ముగిసిపోవాలి. రోజుల తరబడి సాగదీయకూడదు. అది మంచిది కాదు. – డి.జి. భవాని -
అలీకి మాతృవియోగం
ప్రముఖ హాస్యనటుడు అలీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతన్ బీబీ (75) అనారోగ్యంతో మృతిచెందారు. రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె అనారోగ్యంతో ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.41కి కన్నుమూశారు. జైతన్ బీబీ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి హైదరాబాద్‌లోని అలీ స్వగృహానికి తీసుకొచ్చారు. బాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ తన తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కి చేరుకున్నారు. తల్లి పట్ల అలీకి ఉన్న ప్రేమానురాగాల గురించి తెలిసిందే. తల్లితో తన అనుబంధం గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. జైతన్ బీబీకి ఐదుగురు సంతానంలో పెద్ద కుమారుడు అలీ, రెండో కుమారుడు ఖయ్యుం కాగా ముగ్గురు అమ్మాయిలు. జైతన్ బీబీ మరణవార్త తెలుసుకున్న చిరంజీవి.. అలీ ఇంటికెళ్లి ఆమెకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలువురు సినీ, టీవీ, రాజకీయ ప్రముఖులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు జైతన్ బీబీ మృతికి సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. పరామర్శిస్తున్న చిరంజీవి -
అలీకి మాతృ వియోగం, చిరు పరామర్శ
-
అలీకి పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు అలీ కుటుంబానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘అలీ మాతృమూర్తి జైతున్ బీబీ తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధ అనిపించింది. బీబీగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంతో బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా అలీ తల్లి జైతున్ బీబీ నిన్న రాత్రి ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. చదవండి: అలీకి మాతృ వియోగం -
అలీకి మాతృ వియోగం, చిరు పరామర్శ
ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి జైతున్ బీబీ బుధవారం రాత్రి 11.41 గంటలకు కన్నుమూశారు. ప్రస్తుతం రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె.. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు అలీ తల్లి జైతున్ బీబీ మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు అలీని పరామర్శించారు. జైతున్ బీబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇక ప్రముఖ నటుడు చిరంజీవి పరామర్శ సందర్భంగా అలీ కంటతడి పెట్టారు. మరోవైపు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జైతున్ బీబీకి అంత్యక్రియలు నిర్వహఙంచారు. కాగా, తల్లిపై తనకున్న ప్రేమను అలీ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. పలు వేదికలపై కూడా తన తల్లి గురించి అలీ ఎంతో గొప్పగా చెప్పేవారు. -
ప్రియాంక తల్లిదండ్రులు నాతో అదే చెప్పారు: అలీ
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకరెడ్డి ఘటన చాలా బాధాకరమని, వారి ఇంట్లో జరిగిన అన్యాయం ఇంకెవరి ఇంట్లో జరగకూడదని సినీనటుడు అలీ అన్నారు. శనివారం ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రియాంక తల్లిదండ్రులతో నేను మాట్లాడినప్పుడు వారు ఒకటే డిమాండ్ చేశారు. తమ కూతురు ఎలాంటి పరిస్థితుల్లో మృతి చెందిందో అలాగే నిందితులను కూడా అలాగే తగలబెట్టాలి అని కోరారు. ప్రియాంక తల్లిదండ్రుల కడుపుకోత వర్ణణాతీతంగా ఉంది. నా కూతురు కూడా డాక్టర్ చదువుతోంది. డాక్టర్ అయిన కూతురు చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధ పడుతుందో అర్థం చేసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాన’ని అలీ అన్నారు. పోలీసులూ.. మారండి: భట్టి ప్రియాంకరెడ్డి హత్య సభ్య సమాజం తలదించుకునే దాడి అని, మృగాల్లాగే అమ్మాయిపై దాడి చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ప్రియాంక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని, నిందితులని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా విక్రమార్క డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు శిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు. పోలీసులు కూడా ఎవరికైనా ఆపద వస్తే తక్షణమే స్పందించాలని సూచించారు. వారి స్టేషన్ పరిధిలోకి వచ్చినా రానున్న కూడా బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి తాము సహకరిస్తామన్నారు. కొంతమందితోనే ఫ్రెండ్లీగా పోలీసులు: శ్రీధర్‌బాబు ప్రియాంక హత్య ఘటనపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా దిగ్బ్రాంది చెందారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సోనియ గాంధీ తమతో మాట్లాడి వివరాలు అడిగారని వెల్లడించారు. పోలీసులు కొంతమందితోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం చెందినట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారని అన్నారు. నిందితులపై కట్టిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత వార్తలు ‘బహిరంగంగా కాల్చి చంపండి’ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రియాంక కేసులో ఇదే కీలకం నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు -
సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్ ముందుంటారు
‘‘వేదికపై ఉన్న అలీ, రఘుబాబు మా పార్టీలో (వైఎస్సార్సీపీ) ఉన్నారు. వారందరి సూచనలతో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి మా సీఎం జగన్మోహన్ రెడ్డిగారు సుముఖంగా ఉన్నారు’’ అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ఇంట్రడక్షన్ ‘నారాయణతే నమో నమో..’ లిరికల్ వీడియో సాంగ్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ రెడ్డి 20 ఏళ్లుగా నాకు మంచి స్నేహితుడు. వెంకటేశ్వర స్వామివారి కీర్తన పాటని నాతో ఎందుకు రిలీజ్ చేయించారో పాట చూశాక అర్థం అయింది. పాటని చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నా దైవం, పితృ సమానులు సుబ్బారెడ్డిగారితో నా అనుబంధం 20 ఏళ్లుగా కొనసాగుతోంది. దివంగత నేత వై.యస్. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ కుటుంబానికి, పార్టీకి న్నెముకగా ఉండి ఎన్నో సేవలందిస్తున్నారు సుబ్బారెడ్డిగారు. యస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్) బోర్డ్ డైరెక్టర్ పదవీ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆయన నాపై పెట్టిన నమ్మకానికి నిజాయతీగా పని చేస్తా’’ అన్నారు. ‘‘రామానాయుడుగారు, ‘దిల్’ రాజుగారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాను. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరు. సంగీత దర్శకుడు రఘు కుంచె, పాటల రచయిత శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ఎడిటర్ తమ్మిరాజు, నటుడు రవి ప్రకాష్, కెమెరామేన్ అంజి, లైన్ ప్రొడ్యూసర్ యమ్‌యస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే వారు గొప్ప నటులయ్యారు
‘‘దర్శకుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో నటుడిగా దాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నేనెప్పుడూ దర్శకుణ్ణి ఇబ్బంది పెట్టలేదు. ‘వీడు బాగా నవ్విస్తాడు, ఏడిపిస్తాడు’ అని ప్రేక్షకులు ఎవర్ని భావిస్తారో వారే గొప్ప నటుడు’’ అన్నారు నటుడు అలీ. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా తెరకెక్కిన ‘రాజుగారి గది 3’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన అలీ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ‘రాజుగారి గది 3’ ఒకఎత్తు. విభిన్నమైన భావోద్వేగాలున్న పాత్రను నాకు ఇచ్చారు ఓంకార్. డైరెక్టర్‌గా తనకు చాలా క్లారిటీ ఉంది. ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో రాబట్టుకుంటారు. మొదటి రెండు భాగాలకంటే ఈ సినిమా చాలా బావుంటుంది. ఛోటా కె.నాయుడు విజువల్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ చిత్రంతో అశ్విన్ నటుడిగా మరో ఎత్తుకి ఎదుగుతాడు. సెకండ్ హాఫ్‌లో సాయిమాధవ్ బుర్రా గారి డైలాగ్స్‌కు థియేటర్లో నవ్వులే. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. డీటీఎస్ మిక్సింగ్ చేసిన వ్యక్తి చూసిన ప్రతిసారీ నవ్వుతూనే ఉన్నారని నాకు తెలిసింది. దీన్ని బట్టి థియేటర్లో ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. బ్రహ్మానందం, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణగార్లు నాకు నచ్చిన హాస్యనటులు. రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి కామెడీ యాక్టర్స్ అయ్యారు. కామెడీ ఎంత మోతాదులో ఉండాలో వాళ్లకు తెలుసు. అందుకే గొప్ప హాస్యనటులుగా పేరు తెచ్చుకున్నారు’’ అన్నారు. -
నచ్చకపోతే తిట్టండి
‘‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమా నచ్చితే ఇతరులకు చెప్పండి.. నచ్చకపోతే నన్ను తిట్టండి. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తి చూపండి.. సరిదిద్దుకుంటాను’’ అని దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. అలీ, రిషిత జంటగా పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఏపీలో చిత్రీకరించిన తొలి సినిమా మాదే. ఈ సినిమాలో మా హీరో ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లయిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో మా చిత్రం కొనసాగుతుంది. మా కథను దర్శకుడు సుకుమార్‌గారు ఓకే చేసిన తర్వాతే చిత్రీకరణ మొదలుపెట్టాం. దర్శకులు జంధ్యాల, కె. బాలచందర్ గార్ల ఆశీర్వాదం మా సినిమాకి ఉంటుందని భావిస్తున్నా. యాజమాన్య చక్కని సంగీతం అందించారు. ఈ చిత్రంలో అలీని కమర్షియల్ హీరోగా చూపించాను. నేను బ్లాక్‌బస్టర్ తీశానా? సక్సెస్ఫుల్ సినిమా తీశానా? ఫెయిల్యూర్ సినిమా తీశానా? అని నిర్ణయించేది ప్రేక్షకులే. వారి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
పండుగాడు వస్తున్నాడు
అలీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ఈ చిత్రంలో రిషిత కథానాయికగా నటించారు. దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో హీరో అలీ ఎవరికి ఫోటో తీస్తే వారికి పెళ్లి కుదురుతుంది. ఇదే ప్రధానాంశం. కుటుంబ సమేతంగా చూడదగ్గ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. చక్కటి పాటలు, ఫైట్స్‌తో అలీ ప్రేక్షకులను అలరిస్తారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని చిత్రబృందం తెలిపింది. బాబూ మోహన్, వినోద్‌కుమార్, జీవ, సుధ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు యాజమాన్య సంగీతం అందించారు. -
పాటలు నచ్చడంతో సినిమా చేశా
‘‘ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కాల్ చేసి ఆఫీసుకు రమ్మన్నారు. ఆదాయపు పన్ను విషయం ఏమో అనుకున్నా. ‘నా ఫ్రెండ్ సినిమా చేస్తున్నారు.. మీరు అందులో నటించాలి’ అన్నారు. ఆ ఆఫీసర్ ఫ్రెండే మా దిలీప్ రాజా అని తెలిసింది. కట్ చేస్తే... మొదట నాకు కొన్ని పాటలు పంపి వినమన్నారు. ఆ పాటలు నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పా’’ అని అలీ అన్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో అలీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాటలను దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి రిలీజ్ చేశారు. అలీ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేతగా ఉన్న సాంబిరెడ్డిగారు సినిమాలపై ఇష్టంతో నాతో ఈ సినిమా నిర్మించారు. మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లి అయిపోతుంది అనేది ఈ చిత్ర కథ. రెండేళ్లు ఈ కథ కోసం కష్టపడ్డా. జంధ్యాలగారి మార్క్ కామెడీతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దిలీప్ రాజా. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, నటీనటులు బాబూమోహన్, శ్రీకాంత్, నరేష్, ‘అల్లరి’ నరేష్, చార్మి, ఖయ్యుమ్, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు. -
వినోదాల ఎర్రచీర
శ్రీకాంత్ కీలక పాత్రలో, అలీ, బేబీ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు, కమల్ కామరాజు, అజయ్, శ్రీరాం ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సత్యసుమన్ బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలవుతోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యసుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, యాక్షన్, సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. చేజింగ్ సీన్స్, హారర్, కామెడీ హైలైట్. షూటింగ్ ముగింపు దశలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఈ నెల చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రియాంక అగస్టీన్–రఘుబాబు– ఫిష్ వెంకట్ల ప్రత్యేక గీతం మా సినిమాలో మరో హైలైట్’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిల్ల. -
'రిటైర్మెంట్ ఉద్యోగానికి మాత్రమే’
సాక్షి, సిటీబ్యూరో: నెలలో ఆఖరి పనిదినం కావడంతో బుధవారం మూడు కమిషనరేట్ల నుంచి పలువురు అధికారులు పదవీ విరమణ చేశారు. వీరిని కుటుంబీకులతో సహా కమిషనరేట్లకు పిలిపించిన ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం అంకితభావంతో పని చేసిన వారికి ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో 29 మంది, సైబరాబాద్‌లో నలుగురు, రాచకొండలో ఐదుగురు రిటైర్ అయ్యారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమానికి సినీ నటుడు అలీ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. అక్కడి సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌లో ఏసీపీగా పని చేస్తూ పదవీ విరమణ పొందిన జి.విద్యాసాగర్‌కు అలీ సన్నిహితుడు. దీంతో ఆయన ఈ రిటైర్మెంట్ ఫంక్షన్‌కు స్వయంగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులకు రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమే అని, ఎన్నేళ్ళయినా వారి గుండెల నిండా ధైర్యం, తెగువ, అంకితభావం మాత్రం అలానే ఉంటాయని అన్నారు. అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ సమాజాన్ని రక్షించడంలో నిమగ్నమై ఉండే నాలుగో సింహమే పోలీస్ అని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులు 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అయితే తాను 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని అంటూ నవ్వించారు. సినీ దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన వారు సైతం పోలీసు విభాగానికి అనుబంధంగా పని చేసే ఆస్కారం ఉందని అన్నారు. ప్రస్తుతం తాను 60వ వసంతంలోకి అడుగుపెట్టినా... జీవితంలో మంచి సినిమాలు తీయడం, గొప్ప నటులతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. వీరిద్దకీ కమిషనర్ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. -
అలీగారికి పెద్ద అభిమానిని
‘‘అలీ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన వినోదాన్ని చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ‘పండుగాడి ఫోటో స్టూడియో’తో హీరోగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఒక స్టార్ హీరోలా అలీగారిని దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. అలీ హీరోగా దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. పెదరావురు ఫిలిం సిటీ పతాకం సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రెండు సంవత్సరాలు కథ తయారు చేసుకుని దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాంబిరెడ్డిగారికి 22 విద్యాలయాలున్నాయి. చక్కటి అభిరుచితో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా అందర్నీ అలరించనుంది’’ అన్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘జంధ్యాలగారి ఫొటోకి నమస్కరించి ఈ సినిమా ప్రారంభించాం. ఇందులో పాత్రలు విలక్షణంగా, నటీనటుల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తెనాలిలో ఈ నెల 21న నిర్వహించనున్నాం’’ అన్నారు. అలీ, గుదిబండి వెంకట సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ప్రదీప్ దోనెపూడి, మన్నె శివకుమారి, సంగీతం: యాజమాన్య, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి
డబీర్‌ఫురా: అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో పాతబస్తీలోని డబీర్‌పురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కాలిఫోర్నియా ప్రీమాంట్‌లోని వాల్నట్ ఏవ్‌లో నివాసముంటున్న సయ్యద్ వసీం అలీ (27) ఆదివారం తాను ప్రయాణిస్తున్న కారు అవెన్యూ కూడలి వద్ద మరో కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సయ్యద్ వసీం అలీ తీవ్ర గాయాలకు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు వసీం అలీ కుటుంబ సభ్యులు విదేశాంగ వ్యవహరాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్‌ను కలిసి సయ్యద్ వసీం అలీ మృతదేహన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్
డిస్నీ ఇండియా వారు తాజాగా విడుదల చేస్తున్న చిత్రం ‘లయన్ కింగ్’. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన సింహం పేరు సింబ. ఈ ‘లయన్ కింగ్’ కథకి సింబనే హీరో. టీమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. ప్రపంచంలోని అన్ని ముఖ్యభాషల్లో జూలై 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘లయన్ కింగ్’ లో కీలక పాత్ర అయిన ముసాఫాకు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ముసాఫా తనయుడు, సినిమాకు హీరో అయిన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘లయన్ కింగ్’ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. -
ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది
అలీ, రిషిత జంటగా దిలీప్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’ అన్నది ఉపశీర్షిక. పెదరావూరు ఫిలింసిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘జంధ్యాల మార్క్ కామెడీతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో మా హీరో అలీ ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లి అయిపోతుంది. ఇందులోని పాత్రలు విలక్షణంగా, నటీనటుల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. నూతన నటుడు సందీప్ రాజా, టీనా చౌదరి ఈ చిత్రంలో విలక్షణ పాత్రలు పోషించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. బాబుమోహన్, సుధ, జీవా, శ్రీలక్ష్మీ, రామ్‌జగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు
-
అఖండ విజయం మిరాకిల్: అలీ
సాక్షి, విజయవాడ: అపార నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత అలీ అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం మామూలు విషయ కాదని, మిరాకిల్ అని వర్ణించారు. కొత్త ఇంటికి నవధాన్యాలు ఎంత ముఖ్యమో కొత్త రాజధాని అమరావతికి వైఎస్సార్సీపీ నవతర్నాల పథకాలు అంతముఖ్యమని అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రూపు తీసుకొస్తారని ఆకాంక్షించారు. నవతర్నాలతో మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. జగన్ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. మైనార్టీలంతా వైఎస్ జగన్‌కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిర్మాతల్నీ నవ్విస్తారా
సినిమా హిట్ అయినా నిర్మాత నవ్వని సందర్భాలు ఉంటాయి.కలెక్షన్లు కళకళలాడకపోతే ఏం నవ్వు? ఇంగ్లిష్‌లో ఒక వాడుక ఉంది. ‘లాఫింగ్ ఆల్ ది వే టు ద బ్యాంక్’ అని.అంటే ప్రయత్నం ఏం చేసినా చివరకు డబ్బు సాధించారు అని అర్థం.కమెడియన్లు హీరోలుగా చేసి ప్రేక్షకుల్ని నవ్వించిన సందర్భాలు ఉన్నాయి.హీరోలుగానూ ప్రేక్షకులతో పాటు నిర్మాతల్నీ నవ్విస్తే బాగుంటుంది. నవ్విస్తారని ఆశిద్దాం. విలన్ ఫేస్ మీద పంచ్ కొట్టే హీరో మాత్రమే హీరో కాదు. పొట్ట చెక్కలయ్యేలా పంచ్‌లేసే కమెడియన్ కూడా హీరోయే. ఎంత మెయిన్ రోడ్ అయినా ఫుట్‌పాత్ ఉన్నట్టే ఎన్ని పెద్ద హీరోల కథలు ఉన్నా కమెడియన్లకు సరిపడే కథలు ఉండనే ఉంటాయి. అందుకే గతంలో రేలంగి, నగేశ్, రాజబాబు, పద్మనాభం, చలం వంటివారు కమెడియన్లుగా చేస్తూనే హీరోలుగా కూడా రాణించారు. ఆ తర్వాతి తరంలో బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ, వేణుమాధవ్, పృథ్వీలాంటి వారికి అవకాశం వచ్చింది. కృష్ణ భగవాన్ అయితే ఏకంగా సిమ్రాన్ పక్కనే హీరోగా నటించారు. కమెడియన్ వేషాలు ఎన్ని వేసినా హీరోగా మారితే వచ్చే క్యాషు, క్రేజు వేరని సునీల్ లాంటి నటులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. స్క్రీన్ మీద కాసేపుంటేనే ఇంత నవ్వొచ్చిందే సినిమా అంతా ఉంటే ఇంకెంత నవ్వు వస్తుందో అని కమెడియన్ హీరోగా చేస్తే జనం వచ్చే అవకాశం ఉంది కానీ సినిమా అంతా నవ్వించడం, కథను పండించడం అంత సులువేమీ కాదని కొన్ని పరాజయాల వల్ల, కొందరు కమెడియన్ల బ్యాక్ టు పెవిలియన్ వల్ల అర్థమవుతుంది. అయినప్పటికీ కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు జనాన్ని సంతోషపెట్టడానికి కెమెరా ముందుకు వస్తున్నాయి. ఆ వివరాలను చూద్దాం. బ్రహ్మీ ఈజ్ బ్యాక్ బ్రహ్మానందం క్రేజ్ ఉధృతంగా ఉన్న రోజుల్లో జంధ్యాల ఆయనను హీరోగా పెట్టి ‘బాబాయ్ హోటల్’(1992) సినిమా తీశారు. అయితే విడుదలకు ముందు దానికి వస్తున్న క్రేజ్ చూసి ‘ఇది కామెడీ సినిమా కాదు’ అని ట్యాగ్ లైన్ పెట్టాల్సి వచ్చింది. కామెడీ లేకపోతే బ్రహ్మానందం సినిమాకు వెళ్లడం ఎందుకు అని జనం ఆ సినిమా చూళ్లేదు. ఆ తర్వాత బ్రహ్మానందం ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినా ఆయనకు మంచి వేషాలు దొరికిన ‘చిత్రం భళారే విచిత్రం’, ‘మనీ’ వంటి సినిమాలతోనే ఎక్కువ పేరొచ్చింది. 2013లో హీరోగా మళ్లీ ‘జఫ్పా’ అనే చిత్రంలో నటించారు. తాజాగా ఆయనతో ‘బ్రహ్మీ ఈజ్ బ్యాక్’ అనే సినిమా తెరకెక్కనుందని ప్రకటన వచ్చింది. శ్రీధర్ శ్రీపాన దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఇందులో రా (రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా బ్రహ్మానందం నటించనున్నారట. అలీ.. అలాగే.. అలీ హీరోగా నటించిన ‘యమలీల’కు (1994) ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘పిట్టల దొర’(1994), ‘ఘటోత్కచుడు’ (1995), ‘సర్కస్ సత్తిపండు’ (1997) ‘గుండమ్మ గారి మనవడు’ (2007), ‘అలీబాబా ఒక్కడే దొంగ’ (2013) వంటి సినిమాలు చేశారు. తాజాగా అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’ సినిమా రూపొందింది. ‘వీడు ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది’ అనేది ఉపశీర్షిక. దిలీప్ రాజా దర్శకత్వం. రిషిత హీరోయిన్. నాగదేవత శాపం వల్ల 40 ఏళ్లు దాటినా పెళ్లి కాని వ్యక్తి పాత్రలో హీరోగా అలీ నటించారు. శాపం ఉన్న హీరో ప్రేమలో పడితే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే చిత్రకథ. షూటింగ్ పూర్తయింది. జూన్‌లో విడుదల. సప్తగిరి నం.3 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సప్తగిరి కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని అందుకుంది. ‘పరుగు’ (2008), ‘ప్రేమకథా చిత్రమ్’ (2013) వంటి సినిమాలు అందుకు ఫౌండేషన్ వేశాయి. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్న సప్తగిరి 2016లో ట్రాక్ మార్చారు. హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమా చేశారు. అది రిలీజైన ఏడాదికే ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇప్పుడు ‘వజ్ర కవచధర గోవింద’ తో మూడోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అరుణ్ పవార్ దర్శకత్వం. ఓ వజ్రానికి సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డారన్నదే కథ. యాక్షన్, ఫైట్లు కూడా చేస్తున్న సప్తగిరిని ఈ సినిమాలో చూడవచ్చు. షకలక లకలక టీవీ నుంచి సినిమాకి సినిమా నుంచి హీరో కుర్చీకి ఎదగడానికి ఒళ్లొంచి కష్టం చేస్తున్న నటుడు శంకర్. ‘రాజుగారి గది 2’, ‘ఆనందోబ్రహ్మ’ (2017) సినిమాలు శంకర్‌కు హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో గత ఏడాది ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత హీరోగా ‘డ్రైవర్ రాముడు’ సినిమా చేశారు. రాజ్ సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవలే హీరోగా తన మూడో చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లారు శంకర్. ‘నాలుగో సింహం’ టైటిల్‌తో జానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు ‘షకలక’ శంకర్. ముంబై బ్యూటీ అక్షయ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమాల్లో కమెడియన్‌గా అవకాశాలు తగ్గడం వల్లనే తాను హీరోగా మారాల్సి వచ్చిందని ఓ సందర్భంలో శంకర్ పేర్కొనడం విశేషం. ప్రియ మల్లేశం ‘నా సావు నేను సస్తా... నీ కెందుకు’ బుక్ రైటర్ గుర్తున్నాడుగా! ‘పెళ్ళిచూపులు’ (2016)సినిమాలో ఫుల్‌గా నవ్వించిన కమెడియన్ ప్రియదర్శి ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్‌గా చేశారు. ఇప్పుడు ‘మల్లేశం’ అనే బయోపిక్‌లో హీరోగా నటిస్తున్నారు. నేతకు పనికి వచ్చే ఆసు మిషన్‌ను కనుగొని పద్మశ్రీ పురస్కారం పొందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణ యాస ప్రియదర్శికి కొట్టిన పిండి. కనుక ఈ సినిమాలో ఆయన ఆకట్టుకుంటారని ఆశించవచ్చు. చేదు మిఠాయి ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు రాహుల్ రామకృష్ణ. ఈ క్యారెక్టర్లో అటు కామెడీ చేస్తూనే సీరియస్ డైలాగ్స్ కూడా చెప్పారు. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో మరో ముఖ్యపాత్ర దక్కింది. ఆ నెక్ట్స్ ‘సమ్మోహనం’(2018), ‘గీత గోవిందం’(2018) సినిమాల్లో మార్కులు పడ్డాయి. దాంతో డార్క్ కామెడీ ఫిల్మ్ ‘మిఠాయి’లో హీరోగా నటించారు రాహుల్ రామకృష్ణ. ఇందులో కమెడియన్ ప్రియదర్శి మరో లీడ్ క్యారెక్టర్ చేశారు. కానీ ఈ ‘మిఠాయి’ ప్రేక్షకులకు రుచించలేదు. అయితే రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్ర పోషించిన ‘హుషారు’ ప్రేక్షకులకు నచ్చింది. హాలీవుడ్ సినిమా ‘సిల్క్‌రోడ్’లో రాహుల్ ఒక కీలక పాత్రకు సెలక్ట్ కావడం కూడా ఒక మంచి వార్తే. ఇన్పుట్స్: ముసిమి శివాంజనేయులు మళ్లీ హీరోగా...! సునీల్ ‘అందాలరాముడు’ (2006) సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా హిట్. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మర్యాదరామన్న’ సూపర్‌హిట్ సాధించింది. ఆ తర్వాత ‘పూలరంగడు’ (2012) కమర్షియల్‌గా సక్సెస్ కొట్టింది. నాగచైతన్యతో కలిసి ‘తడాఖా’లో లీడ్ రోల్ చేశారు. కమెడియన్‌గా ఏడాదిలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన సునీల్ హీరో అయ్యాక ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో సునీల్ హీరోగా జర్నీకి కామా పెట్టినట్లున్నారు. ప్రస్తుతం కమెడియన్‌గా ఫుల్ బిజీ అయ్యారు. కానీ ఆయనను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఒకటి రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. హీరోనే టార్గెట్‌నా? ‘వెంకీ’,‘ పోకిరి’, ‘ఢీ’, ‘బిందాస్’ వంటి సినిమాల్లో బాల హాస్యనటుడిగా భరత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆడియన్స్ మాస్టర్ భరత్ అని పిలుచుకున్నారు. సునీల్ హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ (2017)సినిమాలో హాస్యనటుడిగా కనిపించిన భరత్ రీసెంట్గా ‘ఏబీసీడీ’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చైల్డ్ కమెడియన్‌గా సక్సెస్ అయిన భరత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ అవుతాడా? లేక భవిష్యత్‌లో హీరోగా కూడా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అన్నది చూడాలి. -
వినోదాల స్టూడియో
హాస్య నటుడు అలీ హీరోగా నటించిన చిత్రం ‘పండుగాడి ఫోటోస్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో రిషిత హీరోయిన్గా పరిచయమవుతున్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ సుకుమార్‌గారు ఓకే చేసిన కథ ఇది. జంధ్యాల మార్క్ కామెడీ ఉంటుంది. ఈ చిత్రంలో హీరోకి 40 సంవత్సరాలు వచ్చేవరకు పెళ్లి కాదనే నాగదేవత శాపం ఉంటుంది. ఆ క్రమంలోనే కంచు కనకరత్నంతో ప్రేమలో పడతాడు హీరో. వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందా? నాగదేవత శాపం వల్ల ఆగిందా? అన్నది ఆసక్తికరం. పూర్తి హాస్యభరిత చిత్రమిది. 1150 చిత్రాల్లో నటించిన అలీగారు ఈ చిత్రంలో హీరోగా మంచి నటనని ప్రదర్శించారు. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
యమలీలకు పాతికేళ్లు
కమెడియన్ అలీ టాప్ ఫామ్‌లో కొనసాగుతున్న సమయంలో అలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘యమలీల’. కిశోర్ రాఠి సమర్పణలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేటితో (ఏప్రిల్ 28) పాతికేళ్లు పూర్తి చేసుకుంది. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు నిండి ఉండటం చిత్రవిజయానికి ఓ కారణం. తల్లిగా మంజు భార్గవి, యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడు పాత్రలో బ్రహ్మానందం, తోట రాముడిగా తనికెళ్ల భరణి ఇలా సినిమాలో ప్రతి పాత్రా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లోడో..’, సిరులొలికించే చిన్ని నవ్వులే..., జుంబారే జుంజుంబారే...’ పాటలు హైలైట్. సూపర్ స్టార్ కృష్ణ, ఇంద్రజ ఓ స్పెషల్ సాంగ్ చేయడం స్పెషల్ అట్రాక్షన్. రిలీజ్ అయిన కొన్ని కేంద్రాల్లో ఏడాది పాటు ఏకధాటిగా ప్రదర్శితం అవ్వడం విశేషం. అలా ‘యమలీల’ అలీ కెరీర్లో ఓ మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది. -
సల్మాన్ ఖాన్ సినిమాలో అలీ!
సల్మాన్ ఖాన్ సూపర్‌హిట్ మూవీ దబాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సిరీస్‌లో భాగంగానే.. దబాంగ్2 ను తెరకెక్కించని సల్మాన్‌కు ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. అయినా ఆ పాత్రపై ఉన్న మక్కువతో దబాంగ్3ని సిద్దం చేస్తున్నాడు. ఇటీవలె మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న దబాంగ్3.. రీసెంట్గా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది. దబాంగ్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన గబ్బర్‌సింగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో అలీ పోషించిన సాంబ క్యారెక్టర్ కూడా హైలెట్ అయింది. అయితే ఇప్పుడీ పాత్రను దబాంగ్3లో కూడా పెట్టాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రలో అలీ నటిస్తున్నారు. తాజాగా జరగుతున్న షెడ్యూల్లో అలీ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్లో అలీ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో సోనాక్షి సిన్హా నటిస్తోంది. -
గ్యాంగ్ వార్
అలీ ప్రధాన పాత్రలో ధన్‌రాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య తారాగణంగా ఎస్. శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగుపడుద్ది’. కిషోర్ రాఠి సమర్పణలో మనీషా అర్డ్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహేష్ రాఠి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ– ‘‘మనీషా బ్యానర్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఫేమస్ అయిన రంగు పడుద్ది డైలాగ్‌నే ఇప్పుడు టైటిల్‌గా పెట్టి ఇదే బ్యానర్లో సినిమా చేశారు. ‘యమలీల’ చిత్రంలోని ‘చినుకు చినుకు..’ పాటను అప్పారావు, హీరోయిన్ హీనల మధ్య రీ క్రియేట్ చేశారు. శ్యామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘చాలాకాలం తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్‌ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే మా చిత్రకథాంశం. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్యామ్‌ప్రసాద్. ‘‘ఈ సమ్మర్ వెకేషన్‌కు అవుట్ అండ్ అవుట్ కూల్ కామెడీ చిత్రం అవుతుంది’’ అన్నారు మహేశ్. -
పవన్‌కు అలీ కౌంటర్
-
పవన్ కళ్యాణ్‌కు అలీ పంచ్
సాక్షి, అమరావతి: రాజమండ్రి సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత అలీ అభ్యంతరం తెలిపారు. తాను ఈ ఎన్నికల ప్రచారంలో పవన్‌కల్యాణ్, లేదా ఆయన పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదని అయినా ఆయన తననుద్దేశించి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈమేరకు సోమవారం రాత్రి అలీ ఒక వీడియోను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్, తన అన్న చిరంజీవి వేసిన బాటలో పైకి వచ్చారని, కానీ తాను అలా కాదని తన కష్టంతోనే సినీ పరిశ్రమలో పైకొచ్చానన్నారు. తనకేదో ఆయన సాయపడినట్లుగా చెప్పుకున్నారని, అది వాస్తవం కాదన్నారు. పవన్ సినీరంగంలోకి అడుగు పెట్టే నాటికే తాను పరిశ్రమలో ఒక స్థానం సంపాదించుకున్నానని గుర్తుచేశారు. ‘ఏ రకంగా పవన్ నాకు సాయపడ్డారు. ఏమైనా సినిమాలు లేకుంటే ఇప్పించారా? కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా? లేక ఇంకేమైనా సాయం చేశారా?’ అని అలీ ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్ పార్టీ పెట్టినపుడు తాను ఆయన కార్యాలయానికి వెళ్లి ఖురాన్ ప్రతిని, ఖర్జూరాలను ఇచ్చి అభినందించి వచ్చానన్నారు. ‘నేను వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరకూడదా ? అదేమైనా తప్పా? రాజ్యాంగ విరుద్ధమా?’ అని అలీ పవన్‌ను ప్రశ్నించారు. తన చుట్టం టికెట్ అడిగితే ఇచ్చానని, అలాంటిది అలీ అడిగితే ఇవ్వనా అని పవన్ వ్యాఖ్యలు చేశారని... తన ఫోన్ నంబర్ ఆయన వద్ద లేదా? అని అలీ ప్రశ్నించారు. -
పవన్ గెలవడు
సీటీఆర్ఐ, (రాజమహేంద్రవరం)/భీమవరం అర్బన్/కరప/అమలాపురం : ‘ఈ ఎన్నికల్లో పవన్ నెగ్గడు..జగన్ సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారని, పవర్ స్టార్ సీఎం..సీఎం అని అరవడం వల్ల ప్రయోజనం లేదని, మీరంతా జనసేనకి ఓట్లు వెయ్యాలని’ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రజలను వేడుకున్నారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, కరప, భీమవరం మండలంలోని గూట్లపాడు రేవుల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. టికెట్లు అమ్ముకునే దుస్థితి వైఎస్సార్‌సీపీదేనని, జనసేనది కాదన్నారు. జగన్ కాపు రిజర్వేషన్ విషయంలో పారిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ తనకు దళితుల మీద ప్రేమ అంటారని, పులివెందుల వెళ్లి చూస్తే వారు దళితులను ఎంత ఇబ్బంది పెడతారో తెలుస్తుందన్నారు. వాళ్ల ఇళ్ల ముందు నుంచి వెళ్లేటప్పుడు చెప్పులు చేతితో పట్టుకుని వెళ్లాలని, ఇదేనా వారు దళితులకు ఇచ్చే గౌరవం అని పవన్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘అలీ నాకు మిత్రుడు. అలీ బంధువుకి నర్సాపురం టికెట్ ఇచ్చాను. కానీ ఆయన ఎందుకు వైఎస్సార్సీపీకి ప్రచారం చేస్తున్నాడో ఆర్థం కావడం లేదని’ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు.. నేను సీఎం అవుతానో లేదో నాకు తెలియదు.. మీరంతా ఓట్లు వేస్తారో లేదో నాకు తెలియదని’ అనడంతో జనం నవ్వుకున్నారు. గూట్లపాడు రేవులో జరిగిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఓటు అనే ఆయుధంతో సమాజమార్పు తీసుకురావడం మీతోనే సాధ్యమని అన్నారు. చంద్రబాబు, జగన్ నన్ను అసెంబ్లీకి రాకుండా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ‘రాయలసీమ అధికార, ప్రతిపక్షం కలిసి దోచుకుతింటారని, అక్కడ వారిని ముప్పావలా, పావలా గాళ్లు అంటారని, తెలుగుదేశం ఇసుక మాఫియాను గొయ్యితీసి కప్పెడతానని, ముఠా రాజకీయాలు చేస్తే వైసీపీని వదిలిపెట్టేది లేదని’ హెచ్చరించారు. ‘రామచంద్ర పురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మెట్ల సత్యనారాయణ కుమారుడు రమణబాబు .. నేను తెలుగుదేశం పార్టీతో లాలూచీ పడినట్టు మాట్లాడుతున్నారు. వారి మాటలు ఉపసంహరించుకోవాలి’ అంటూ విరుచుకుపడ్డారు. కాగా, పవన్‌కల్యాణ్ ప్రసంగానికి స్పందన కరువైంది. చెప్పిందే చెప్పడం, ఒకటి చెబుతూ దానిని మధ్యలో వదిలేసి ఇంకోటి చెప్పడంతో సభకు హాజరైన జనం తీవ్ర అసహనానికి లోనయ్యారు. -
అనిల్‌కుమార్‌ను ఆశీర్వదించండి: అలీ
సాక్షి, నెల్లూరు(సెంట్రల్) : ‘డాక్టర్ పి.అనిల్‌కుమార్ నెల్లూరు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి నిజాయితీగా ఎన్నో పోరాటాలు చేశారు. సిటీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన్ను ఈనెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించండి’ అని సినీ నటుడు అలీ ఓటర్లను కోరారు. నెల్లూరులోని 43వ డివిజన్ జెండావీధి, కోటమిట్ట, మెక్లిన్స్‌రోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే, అభ్యర్థి అనిల్‌కుమార్‌తో కలిసి శనివారం అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ అనిల్ పేదవారి కోసం సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ గెలుపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టోను విడుదల చేయడం జరిగిందన్నారు. మైనార్టీల సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తామని జగనన్న ప్రకటించారన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ఆర్థికంగా సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇమామ్, మౌజన్లకు గౌరవవేతనం రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించారన్నారు. మ్యానిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. నారాయణ నాలుగన్నరేళ్లుగా నగర ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును నారాయణ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. -
దృష్టి ఫ్యాన్‌పై ఉండాలి.. వేలు స్విచ్‌పై ఉండాలి
గాజువాక : ‘ఈనెల 11వ తేదీని అందరూ గుర్తు పెట్టుకోండి. ఆ రోజు మాత్రం మనందరి దృష్టి ఫ్యాన్ గుర్తుపై ఉండాలి. మన వేలు ఈవీఎం స్విచ్‌పై ఉండాలి’ అని సినీ నటుడు అలీ అన్నారు. వైఎస్సార్సీపీ గాజువాక అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి మద్దతుగా ఆయన గాజువాకలో బుధవారం ప్రచారం నిర్వహించారు. నాగిరెడ్డితో కలిసి తొలుత పాతగాజువాక జంక్షన్ 60 అడుగుల రోడ్డులోను, అజీమాబాద్ కాలనీలోనూ ప్రసంగించారు. ముస్లిం మైనార్టీల కోసం దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు. గాజువాక ప్రజల సంక్షేమం కోసం నాగిరెడ్డి విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్క ముస్లిం వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విశాఖ ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణను గెలిపించాలని కోరారు. -
బాబు మాయలో పడొద్దు
ఆనందపురం/పద్మనాభం(భీమిలి):నాలుగున్నేరళ్ల పాటు ఏ వర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు మళ్లీ ఎన్నికల వేళ మహిళల ఓట్ల కోసం పసుపు–కుంకుమ పేరుతో ప్రలోభానికి తెరలేపారని సినీహాస్యనటుడు ఆలీ అన్నారు. బాబు మోసాలను గమనించిన మహిళలు ఈ సారి ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మహిళలే నిర్ణేతలని ఈ సారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకుంటేనే అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. పద్మనాభం మండలంలోని చేరిఖండంలో, ఆనందపురం మండలం నీళ్లకుండీలు జంక్షన్లో మంగళవారం జరిగిన మహిళా ఆత్మీయ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తుందన్నారు. మే 23న వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించి పండగ చేసుకోవడం ఖాయమన్నారు. జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే మాట తప్పని మడం తిప్పని వ్యక్తి అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణను గెలిపించాలన్నారు. వైఎస్సార్ సీపీఎంపీ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మహిళల ఓట్లే లక్ష్యంగా చంద్రబాబు తాత్కాలిక ప్రయోజనాలు కల్పించి మోసం చేయడానికి వస్తున్నాడని జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లలు చదువుకు, రోగాల బారిన పడితే ఆస్పత్రులకు వెళ్లడానికి అప్పులు పాలవడంతో పాటు పొలాలను కూడా అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్య, వైద్యం అంతా ఉచితంగా అందుతాయని మహిళలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మాఫీ అంటూ మహిళలు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ విషయాన్ని పక్కనపెట్టి కొత్త స్కీంలతో మోసం చేయడానికి వస్తున్నారని మహిళలు మోసపోవద్దన్నారు. మహిళలకు రూ.లక్షలాది రూపాయలు వడ్డీ మాఫీ మొత్తాలను బాకీ పడ్డ చంద్రబాబు ఓట్లు కోసం పసుపు–కుంకుమ అంటూ హడావుడి చేస్తున్నారని మహిళలు గమనించాలన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించి ఆదుకుంటారని చెప్పారు. పార్టీ పార్లమెంట్ జిల్లా మహిళా అధ్యక్షరాలు పీలా వెంకటలక్ష్మి మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, మరలా జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాజన్న పాలన వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యం, పార్టీ నగర శాఖ అధ్యక్షురాలు గరికిన గౌరి, ముత్తంశెట్టి జ్ఞానేశ్వరి, ముత్తంశెట్టి ప్రియాంక, కాకర్లపూడి వరహాలరాజు, పద్మనాభం మండల అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, ముఖ్యనాయకులు సుంకర గిరబాబు, చందక బంగారప్పడు, గోపాలకృష్ణమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ యాక్టర్లకు ఏపీలో ఏం పని?
-
దివ్యవాణికి అలీ కౌంటర్..!
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణికి కౌంటర్ వేశారు. ప్యాకేజీ తీసుకుని తాను వైఎస్సార్సీపీలో చేరినట్టు వ్యాఖ్యానించిన దివ్యవాణిపై ఆయన మండిపడ్డారు. ‘ప్యాకేజీ తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మీరు చూశారా.. లేక సెల్ఫీ తీశారా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘టీడీపీలో చేరినందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్తారా’ అని ఎద్దేవా చేశారు. కాగా, పెళ్లిపుస్తకం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్యవాణి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. -
పొలిటికల్ సినిమా కాదు
‘‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ రాజకీయ సినిమా కాదు.. చక్కని కుటుంబ కథా చిత్రం. ‘రక్తకన్నీరు’ టైటిల్ బలంగా ఉన్నా సినిమా వినోదాత్మకంగా ఉంటుంది. అలా మా టైటిల్‌ని చూసి ఇది పొలిటికల్ సినిమా అనుకోవద్దు. చాలా గొప్ప కామెడీ ఉంటుంది’’ అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. బాబూమోహన్, పోసాని, జీవా, అలీ, నవీనారెడ్డి ముఖ్య తారలుగా పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’. పి.రత్నాకర్, భీమనాదం భరత్, శ్రీధర్ చల్లా నిర్మించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌కి వంద కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఈ సినిమా షూటింగ్ చేశాం. టైటిల్ ఏంటన్నది సినిమా పూర్తయ్యే వరకు నిర్మాతలకు కూడా తెలియదు. అలాంటిది ‘ఫలానా టైటిల్‌తో పోసాని ఓ సినిమా తీశారు, అది చంద్రబాబునాయుడుగారిని అన్‌పాపులర్ చేసేలా ఉంది’ అని ఎవరో ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. అతను ఫిర్యాదులో పేర్కొన్న టైటిల్‌కి, మా టైటిల్‌కి చాలా తేడా ఉంది. ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ అన్నది చాలా పాజిటివ్ టైటిల్. ఇందులో చంద్రబాబు గురించి బ్యాడ్‌గా ఉంటే ఏపీలో నన్ను కూడా బ్యాన్ చేయండి. ఆయన్ని విమర్శించడానికి నేను ఈ సినిమా చేయలేదు. ఇందులో ఆయన పేరు, గెటప్, ఆలోచనలు ఏవీ ఉండవు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, హరికృష్ణ, బాలకృష్ణగార్ల పాత్రలు కూడా ఉండవు. ‘మేనిఫెస్టో’ అంశాలపై మాత్రమే చర్చించాం. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన కథ కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందే కథ. ప్రజాస్వామ్యం, ప్రజల క్షేమం గురించి తీశాం. కులం, డబ్బు, మందుని చూసి కాకుండా నిజాయతీగా సేవ చేసేవాడికి ఓటెయ్యండి అని చెబుతున్నాం. దీనికి, బాబుకి ఏంటి సంబంధం? అవినీతి, వెన్నుపోటు పొడిచినవాళ్లు భయపడాలి. కానీ, బాబు అలాంటివి చేయలేదు కదా? నిజాయతీపరుడు కదా? మరెందుకు ఉలిక్కిపడుతున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు చేసుకొని బతకడానికి. ఈ సినిమాకి, బాబుగారికి ఏ సంబంధం లేదు. ఇందులో 2రీళ్లు రాజకీయాలుంటే, మిగిలిన 12 రీళ్లు వినోదం ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, రైతు సమస్యలు, నిరుద్యోగం, ప్రేమికుడి మోసం... ఇలాంటి అంశాలని చూపించాం. ఒకర్ని టార్గెట్ చేయడానికి ఈ సినిమా తీయలేదు. ఈ సినిమాకి కథ, మాటలు నేను రాయలేదు. నా కొడుకు పోసాని ఉజ్వల్ రాశాడు. వాడికిది తొలి సినిమా. ప్రస్తుతం హంగేరీలో ‘మీడియా సైన్స్’ అనే కోర్సు చేస్తున్నాడు. కొత్తగా ఉంటుంది, బాగుంటుంది సినిమా తీయమని చెప్పి ఈ కథ నా చేతిలో పెట్టాడు. నా కొడుక్కి చంద్రబాబు గురించి ఏం తెలుసండి? వాడి వయసు 20ప్లస్. కానీ, ఆలోచనల్లో నాకంటే పదేళ్లు ముందుంటాడు’’ అన్నారు. నటుడు, దర్శక–నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘పోసాని నమ్మింది ధైర్యంగా, ముక్కుసూటిగా చెబుతాడు. ఆయన రచనా శైలికి సెల్యూట్. పాలించేవారెవరైనా ఆడిన మాట తప్పకూడదు. ప్రజల పట్ల పాలకులకు భయం, భక్తి ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకిచ్చిన మాట తప్పొద్దు. ఎవరో ఏదో ఫిర్యాదు చేశారని అమరావతికి రండి అంటూ చెప్పొద్దని నేను ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేస్తున్నా. మేము ప్రజల పక్షం. మాకు సెన్సార్ బోర్డు ఉంది. ఏదైనా అభ్యంతరాలుంటే కట్స్ చెబుతారు. మమ్మల్ని అమరావతి పిలిచించి సంజాయిషీ అడగకండి’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన పోసాని అన్న ‘పోలీస్ బ్రదర్స్’ సినిమాతో రచయితగా మారారు. హరికృష్ణ, కృష్ణగార్లతో పాటు ఇండస్ట్రీలోని కమెడియన్లందర్నీ పెట్టి ‘శ్రావణమాసం’ సినిమా తీశారు. ఆ చిత్రం ఫ్లాప్ అయినా ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా లేదనకుండా ఆస్తులు అమ్మి మరీ చెల్లించిన గొప్ప మనసున్న వ్యక్తి’’ అన్నారు. బాబూమోహన్ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు. ఎందుకు? అని అందరూ అడుగుతుంటే, మంచి పాత్ర వస్తే చేస్తానని చెబుతున్నా. పోసాని మన సినిమా చేయాలనగానే మంచి పాత్ర దొరికిందనుకున్నా’’ అన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అలీ,తనీష్
-
వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా భరత్‌రామ్ నానినేషన్
-
ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో అలీ