అలీకి మాతృ వియోగం, చిరు పరామర్శ | Actor Ali Mother Passes Away | Sakshi
Sakshi News home page

అలీకి మాతృ వియోగం, చిరు పరామర్శ

Dec 19 2019 6:41 PM | Updated on Mar 20 2024 5:40 PM

ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి జైతున్‌ బీబీ బుధవారం రాత్రి 11.41 గంటలకు  కన్నుమూశారు. ప్రస్తుతం రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె.. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్‌ చేరుకున్నారు. మరోవైపు అలీ తల్లి జైతున్‌ బీబీ మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు అలీని పరామర్శించారు. జైతున్‌ బీబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇక ప్రముఖ నటుడు చిరంజీవి పరామర్శ సందర్భంగా అలీ కంటతడి పెట్టారు.

మరోవైపు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జైతున్‌ బీబీకి అంత్యక్రియలు నిర్వహఙంచారు. కాగా, తల్లిపై తనకున్న ప్రేమను అలీ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. పలు వేదికలపై కూడా తన తల్లి గురించి అలీ ఎంతో గొప్పగా చెప్పేవారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement