rajamundry
-
రాజమండ్రిలో సందడి చేసిన సినీ హీరోయిన్ శ్రీలీల
-
జైల్లో నా భర్తకు ఏమైనా అయితే.. ఇంటూరి రవికిరణ్ భార్య వార్నింగ్
-
‘చంద్రబాబు కన్నా డ్రామా చేసేవారే నయం’
సాక్షి, రాజమండ్రి: వరద బాధితులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘వరద బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయటం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫొటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో పరిహారం, రేషన్, అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నీటి మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. .. వాలంటీర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానని చెప్పి వ్యవస్థనే నిర్మూలించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసేత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీలు ఎత్తెస్తాడేమో అనిపిస్తుంది. తల్లికి వందనం పథకానికి మంగళంపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం. ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తామన్నారు.. ఇప్పటివరకు ఏమి సృష్టించలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా ఎక్కడుంది. సహాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. .. ఇసుక కొండలు ఏమైపోయాయి. ఇసుక గుట్టలను స్థానిక ఎమ్మెల్యేలు మింగేశారు. నాలుగు రోజుల్లోనే బకాసురుల్ల మింగేశారు. స్థానిక ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే రూ. 10 కోట్లఇసుక మింగేశారు. ఉచిత ఇసుక ఎవరికిచ్చారు? రాజమండ్రి వ్యాప్తంగా సెటిల్మెంట్ బ్యాచ్‌లే నడిపిస్తున్నాయి. పేకాట క్లబ్ నడుపుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలి? జిల్లా పోలీసు అధికారులను పేకాట డబ్బులు నడుపుకుంటామని ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. ఇదెక్కడి ప్రభుత్వం. గతంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇసుక వల్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి కమిషన్ కట్టమని ఒత్తిడి తీసుకొస్తున్నారు’అని భరత్ అన్నారు. -
సీనియర్ నేతకు పొగ పెడుతున్న బాబు.. ఆ నియోజకవర్గం ఎంటీ?
గోదావరి జిల్లాల్లో అదొక కీలకమైన నియోజకవర్గం. పచ్చ పార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటినుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు చంద్రబాబు. జనసేన, టీడీపీల్లో ఎవరు పోటీ చేసినా ఈసారి అక్కడ గెలిచేది ఫ్యాన్ పార్టీయే. అయితే టీడీపీ, జనసేన సీటు ఆశిస్తున్న ఇద్దరూ పోటీ చేసేది మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది. ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ, జనసేన అభ్యర్ధులు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన పార్టీలు అసలీ స్థానానికి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తారోనని రెండుపార్టీల క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఇరువురు అభ్యర్ధులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెపుతున్నా, తామే అభ్యర్ధులమంటూ క్యాడర్‌కు బహిరంగంగానే చెపుతున్నారు. అయితే రాజమండ్రిలో టీడీపీ తరపున ఆరుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు పొగ పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదిరి టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్. తనకు ఏ మాత్రం అన్యాయం జరిగిందని భావించినా, వెంటనే తీవ్ర స్థాయిలో పార్టీని, అధినేతను విమర్శిస్తూ అలిగి కావాల్సినంది సాధించుకోవడం ఆయనకు అలవాటు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటం బుచ్చయ్య చౌదిరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. ఓవైపు తానే అభ్యర్ధిని చెపుతున్నా, కచ్చితంగా ఈస్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడుపడటంలేదు. రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ ఎప్పటినుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి పదిరోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీచేస్తానంటూ చెపుతున్నారు. టిక్కెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటుంటుందని, దీనికోసం ఎంతటివారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చయ్య చౌదిరికి సంకేతాలిస్తున్నారు. అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇపుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటిరోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి, తాను రాజమండ్రి రూరల్ స్థానం నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా బుచ్చయ్యకు టిక్కెట్ రాదని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయనే అభ్యర్ధంటూ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయడానికైనా సిద్ధమని చెపుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా జలక్ ఇస్తున్నారు బుచ్చయ్య. సింహం బయటకు వచ్చేవరకేనంటున్న బుచ్చయ్య చౌదిరికి ఈసారి చంద్రబాబు నిజంగానే టిక్కెట్ ఇస్తారో లేక పక్కన పెట్టేస్తారో చూడాలి. చదవండి: ‘మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’ -
శ్వాస విడిచిన యాస.. ఈవీవీ బా.. ఇక లేరు..
రాజమహేంద్రవరం రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ప్రముఖ రచయిత, గోదారి యాస నా శ్వాస అంటూ గోదావరి జిల్లా యాస భాషలను కాపాడుకునేందుకు అనునిత్యం కృషిచేసిన గోదారోళ్ళ కితకితలు ఫేస్బుక్ గ్రూప్ సృష్టికర్త ఈదల వీరవెంకట సత్యనారాయణ(ఈవీవీ) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం బొమ్మూరులోని శివాలయం సమీపంలో ఉన్న ఈవీవీ స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని బంధువులు, స్నేహితులు, గ్రూపు సభ్యులు, కోకోకోలా కంపెనీ ఉద్యోగులు అధికసంఖ్యలో వచ్చి సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఈవీవీ భౌతికకాయాన్ని ర్యాలీగా ఇన్నీసుపేటలో రోటరీ కైలాసభూమికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈవీవీ మరణవార్త తెలియగానే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఫేస్బుక్ మిత్రులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈవీవీ భార్య, ఇద్దరు కుమార్తెలను, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. గోదారోళ్ల కితకితలు ఐదవ ఆత్మీయ కలయికలో గ్రూపు సభ్యులతో ఈవీవీ సత్యనారాయణ (పాతచిత్రం) గోదావరి యాసపై విపరీతమైన మక్కువతో... గోదావరి యాసపై విపరీతమైన మక్కువ కలిగిన ఈదల వీరవెంకట సత్యనారాయణ(ఈవీవీ) 2016లో గోదారోళ్ళ కితకితలు పేరిట ఫేస్బుక్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఉన్నవారినో ఒకటి చేశారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జీవం పోస్తూ మంచి రచయితగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత జరిగిన ఓ ప్రమాదంలో ఓ స్నేహితుణ్ణి కాపాడి సంచలనంగా మారారు. ప్రాణం కాపాడిన ఫేస్బుక్ స్నేహం అంటూ అప్పట్లో వార్తకథనాలు ప్రసారం కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం కొద్దిరోజులకే గ్రూప్ లక్షమందిని చేరుకుని ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంది. గ్రూప్ పెట్టిన దగ్గర నుంచి ఈవీవీ హాస్యకథనాలతో పాటు మధ్యతరగతి ప్రజల స్థితిగతులపై కట్టిపడేసే కథనాలను పోస్ట్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. గోదారోళ్ళకితకితలు గ్రూప్ సభ్యులందరిని ఆత్మీయ కలయిక పేరుతో ఏటా ఒకే వేదికపై తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ఫేస్బుక్ గ్రూప్ సభ్యుల సంఖ్య రెండులక్షలకు పైగా చేరుకుంది. ఈవీవీ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమార్తెలు సినిమా నటుడిగా... ఈవీవీ ఇటీవలే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. నాగార్జున, నాగచైతన్య బంగార్రాజు సినిమాలో ఒక కీ రోల్లో నటించి అందరినీ మెప్పించారు. షార్ట్ఫిల్మ్స్లో నటించారు. గోదారోళ్ల గుండెల్లో పదిలం అందరికీ నవ్వులు అందిస్తూ ఆయుష్షు పెంచే ఉద్యమంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఈవీవీ ఆయుష్షు అర్థంతరంగా ముగియడమేమిటి ! గోదారోళ్ళ యాసకు, ఎటకారాలకు చావుండదు. మన ఈవీవీ చిరంజీవి, గోదారోళ్ళ యాసలో, శ్వాసలో గుండెల్లో పదిలంగా ఉంటాడు. – కర్రి రామారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరం -
రాజమండ్రి లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం
-
హైదరాబాద్ టూ రాజమండ్రి.. ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించనున్న సంస్థ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్ తన సేవలను ఫిబ్రవరి 23 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. వివిధ పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి 5 నుండి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్–విద్యానగర్–హైదరాబాద్, విద్యానగర్–బెంగళూరు–విద్యానగర్, బెంగళూరు–బీదర్–బెంగళూరు, హైదరాబాద్–రాజమండ్రి–హైదరాబాద్, హైదరాబాద్–నాందేడ్–హైదరాబాద్, ముంబై–నాందేడ్–ముంబై, ముంబై–కొల్హాపూర్–ముంబై, ముంబై–జల్గావ్–ముంబై రూట్లలో సర్వీసులు ఉంటాయని ట్రూజెట్ ఎండీ వి.ఉమేశ్ సోమవారం వెల్లడించారు. -
విషాదం... అఖండ మూవీ చూస్తూ బాలయ్య అభిమాని మృతి
Hero Balakrishna Fan Died While Watching Akhanda Movie: ప్రస్తుతం ఎక్కడ చూసిన అఖండ మానియ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంటూ విజయం వైపు దూసుకెళుతోంది. దీంతో అఖండ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ జోష్‌లో ఉన్న హీరో బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అఖండ సినిమా చూస్తున్న ఆయన అభిమాని ఒకరు మృతి చెందారు. బాలయ్య వీరాభిమాని, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ అఖండ సినిమా చూస్తూ హఠాన్మరణం చెందాడు. స్థానిక శ్యామల థియేటర్లో ఆయన అఖండ సినిమా చూస్తూ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చదవండి: సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా? అది గమనించిన థియేటర్ యాజమాన్యం ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. సినిమా చూస్తున్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో జాస్తి రామకృష్ణ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. రాజమండ్రి సమీపంలోని నామవరం వీఎస్ మహల్ థియేటర్ దగ్గర నుంచి ఆయన కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారు జాస్తి రామకృష్ణ. ఆయన మరణంపై జిల్లాలోని ఇతర ఎగ్జిబిటర్లు సంతాపం తెలిపారు. రామకృష్ణ మరణం జిల్లాకు తీరని లోటు అని అన్నారు. రామకృష్ణ మరణంపై బాలయ్య అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: వరుసగా ఎదురవుతున్న ఘోర పరాజయాల నేపథ్యంలో టీడీపీ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏంచేయాల్లో తెలియక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. పార్టీ బలహీనపడిన నేపథ్యంలో కొంతకాలంగా టీడీపీలో నాయకత్వ మార్పుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. తాజాగా పార్టీ నాయకత్వ మారుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందంటూ ఆయన చేసిన కీలక వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి -
రాజమహేంద్రవరంలో ‘టక్ జగదీష్’
రాజమహేంద్రవరం రూరల్: నగరంలో ‘టక్ జగదీష్’ సందడి చేశాడు. షైన్ స్క్రీన్స్ సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా, శివ నిర్వాణ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా పరిచయ వేడుక వీఎల్ పురం మార్గాని ఎసేట్స్లో శనివారం రాత్రి ఘ నంగా జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్నారు. సినిమాలోని ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్లకు వెళ్లేటప్పుడు ఇంటి వద్ద అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం అంటూ.. నాని వేదిక దిగి వచ్చి ఒక తల్లి కాళ్లకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నాడు. తల్లిదండ్రులు గర్వపడేలా తన అభిమానులు ఉండాలని ఫ్యాన్స్‌కు నాని సూచించాడు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు నగరాన్ని హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. టక్ జగదీష్ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ, ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యి, నాని సినీ జీవితంలో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, టక్ జగదీష్ చిత్రంలో జగపతిబాబు, నాని అన్నదమ్ములుగా నటించి అందరినీ అలరించనున్నారన్నారు. తొలుత ఎంపీ భరత్‌రామ్ చేతుల మీదుగా సినిమాలోని పాట ‘నీటి నీటి చుక్క’ లిరిక్‌ను విడుదల చేయించారు. నటుడు నరేష్, నిర్మాతలు సాహు గారపాటి, రాహుల్ పెద్ది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, అనుశ్రీ ఫిలింస్ అధినేత ఆల్తి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, టీ టైమ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ, భరత్‌రామ్ చేపట్టిన హరిత – యువత కార్యక్రమంలో భాగంగా మార్గాని ఎస్టేట్స్‌లో హీరో నాని మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీ భరత్‌రామ్ ఘనంగా సత్కరించారు. చదవండి: ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మూవీ రివ్యూ చెర్రీ బర్త్‌డే: మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది -
కుర్రాళ్లను పాడు చేస్తున్నారు.. బండారం బయటపెడతా
రాజమహేంద్రవరం: నగరంలో కుర్రాళ్లను పాడు చేస్తూ, శాంతిభద్రతల విఘాతానికి కారణమవుతున్న టీడీపీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు బండారం బయటపెడతామని, ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెడతామని వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిరెడ్డి వాసు కుర్రాళ్లను వివిధ కేసులలో ఇరికించి, వాళ్లను బయటకు తీసుకు వచ్చేందుకు, బెయిల్ పెట్టేందుకు అప్పులు ఇచ్చి, ప్రోనోట్లు రాయించుకుని, ఎన్నో కుటుంబాలను సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో నెల రోజుల వ్యవధిలో ఐదు వరుస హత్యలు జరిగాయని, వాటి వెనుక ఎవరి హస్తముందో పోలీసులు త్వరలోనే బయట పెట్టనున్నారని అన్నారు. ఆదిరెడ్డి వాసు డాక్టర్లను భయపెట్టి బలవంతంగా చీటీలు వేయిస్తున్నారన్నారు. ఆయన ఇంట్లో సోదాలు చేస్తే వందలాది ప్రోనోట్లు బయట పడతాయన్నారు. సిటీ ఎమ్మెల్యే భవాని ఉన్నట్టే తెలియడం లేదని, ఆమె స్థానంలో భర్త ఆదిరెడ్డి వాసు, మామ అప్పారావు చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం గూర్చి టీడీపీ శ్రేణులు మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు. ఆదిరెడ్డి కుటుంబంలోని మనిషిని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించామా అని నగర ప్రజలు మధనపడుతున్నారన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజల మద్దతుతో వైఎస్సార్ సీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ గురించి వారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో ఎటువంటి విన్యాసాలు చేశారో ప్రజలకు తెలుసునని చెప్పారు. ప్రొటోకాల్ గురించి ఎవరి దగ్గరో నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. మీడియా నిజానిజాలు తెలుసుకుని రాయాలని, కొన్ని మీడియాలు చూపించే విషయాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆకుల అన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్‌లీడర్, రాష్ట్ర కార్యదర్శి పోలు విజయలక్ష్మి, బీసీ సెల్ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కాటం రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ పీఏ అరెస్ట్
తూర్పు గోదావరి: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు బుధవారం శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే ఘటనలో పోలీసులు మొదట టీడీపీ నేత బాబుఖాన్ చౌదరిని అరెస్టు చేశారు. కానీ ఈ అంశంలో బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవ్వగా అప్పటినుంచి అతను పరారీలో ఉన్నాడు. తాజాగా పరారీలో ఉన్న సందీప్ శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు సందీప్‌కు రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. -
గోదావరి మధ్యలో దుంగపై కూర్చొని..
రాజమహేంద్రవరం క్రైం: భార్యతో గొడవ పడి గోదావరిలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వృద్ధుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడిన సంఘటన టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక తాడితోటకు చెందిన జి.అప్పారావు (73) కొంత కాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అతడు గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఇస్కాన్ టెంపుల్ వద్ద రేవులోకి వచ్చి గోదావరిలో దూకాడు. అయితే ఈత రావడంతో అప్పారావు ప్రవాహానికి కొట్టుకు వెళ్లసాగాడు. గోదావరి గట్టున ఆల్కాట్‌తోట రైతుబజార్ వద్ద ఉన్న కేతావారిలంక వద్దకు వచ్చేసరికి దుంగ కనిపించడంతో దానిని పట్టుకుని కూర్చున్నాడు. అతడిని గమనించిన స్థానికులు హుటాహుటిన 100 నంబర్‌కు సమాచారం అందించారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు టూ టౌన్ మహిళా ఎస్సై జె.లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ దొర సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇన్చార్జ్ అగ్నిమాపక అధికారి ఉమామహేశ్వరరావు, డ్రైవర్ అండ్ ఆపరేటర్ వై.అనిల్‌కుమార్, ఫైర్ మెన్ ఎస్.రాంబాబు, జేబీ సాగర్, జీపీఎం కుమార్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. గోదావరి మధ్యలో దుంగపై ఉన్న అప్పారావు వద్దకు తాడుకు లైఫ్ జాకెట్ కట్టి విసిరారు. అతడు ఆ తాడు పట్టుకున్న తరువాత ఒడ్డుకు చేర్చారు. అప్పారావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆ కేసు దర్యాప్తులో వేగం పెంచండి: డీజీపీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటన దర్యాప్తులో వేగం పెంచాలని జిల్లా ఎస్పీని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ కేసులో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరానికి పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, తప్పుడు సమాచారాన్ని చేర వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. (శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు) ఈ నెల 18 రాత్రి మునికూడలి గ్రామం వద్ద ఇసుక లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగింది. దీంతో కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో కారులో అటుగా వచ్చిన మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్ భర్త కవల కృష్ణమూర్తి ‘ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.. లారీని వదిలేయండి’ అని చెప్పడంతో ఆ యువకులు ఆయనతో కూడా గొడవకు దిగి కారు అద్దాలను పగులగొట్టారు. అడ్డుకోబోయిన అడప పుష్కరం అనే అతడిని కొట్టారు. దీంతో గొడవ పడిన ఐదుగురు యువకులపై అడప పుష్కరం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సోమవారం ఇన్చార్జ్ ఎస్సై ఫిరోజ్ షా నిందితుల్లో ఒకరైన ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ట్రిమ్మర్ తెప్పించి అతడి గడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించి విడిచిపెట్టారు. ఈ కేసులో ఇన్చార్జ్ ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. -
రాజమండ్రిలో మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్ అయిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ఆయన శనివారం మీడయాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు మొదటిదశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి యాభై ఎకరాల స్థలం అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానుందన్నారు. వెయ్యి పడకల ఆసుపత్రిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు అవుతుందన్నారు. (విశాఖ విషాదం: ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ) అవసరమైతే మరో 30 ఎకరాల భూసేకరణ ప్రయత్నాలు చేస్తామని రాజా తెలిపారు. ఇప్పటికే రెండు మూడు చోట్ల ప్రభుత్వ భూములు పరిశీలించామని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల రాజమండ్రిలో ఏర్పాటు చేస్తే స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఎంత ఖర్చయినా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటి స్థలం అందించాలనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కల అని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే చర్యలు చేపడుతున్నామని జక్కపూడి రాజా తెలిపారు. (గ్యాస్ లీక్‌పై విచారణకు హైపవర్ కమిటీ) -
సీఎం వైఎస్ జగన్‌కు ఉండవల్లి లేఖ
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోరిక అని పేర్కొన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ, రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని సూచించారు. (అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?) -
నిరుద్యోగుల కోసం.. స్కిల్ డెవలప్మెంట్!
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ గెలవడం కోసం 2014 ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలన్నారని.. బాబు వచ్చాడు కానీ జాబ్ ఎవరికి రాలేదని రాజమండ్రి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భారత్‌రామ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి పార్లమెంటు పరిధిలో పది ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో స్కిల్ డెవెలప్మెంట్ ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. కేవలం కంప్యూటర్ సైన్స్ కాకుండా అన్ని విభాగాలకు సంబంధించిన విద్యార్ధులకు స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్లో శిక్షణ కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అర్హులందరికి సంక్షేమ పధకాలు అందాలని ఉద్దేశంతో వైఎస్ జగన్ శ్రమిస్తున్నారని మార్గాని భరత్ తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం సీఎం జగన్ మార్పుకు నాంది పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన చేసిన విధంగా హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయని ఎంపీ మార్గాని భారత్ రామ్ తెలిపారు. -
నేడు తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం
-
ఖమ్మం దారి..నరకంలో సవారీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రవి కుటుంబం సంక్రాంతి పండగను సొంతూళ్లో జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాజమండ్రి బయలుదేరింది. భోగి మంటలు వేసే సమయానికి గమ్యం చేరుకోవాలన్న ఉద్దేశంతో ముందురోజు రాత్రి 7.45కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. కానీ రాజమండ్రి చేరుకునేసరికి ఉదయం 8 దాటింది. ప్రయాణ సమయం ఏకంగా 12 గంటలకుపైగా కొనసాగింది. దీంతో తిరుగు ప్రయాణంలో రిజర్వ్ చేసుకున్న ఆర్టీసీ టికెట్‌ను రద్దు చేసుకుని మరీ ప్రైవేటు బస్సు ఎక్కారు. తిరుగు ప్రయాణం రాత్రి 10కి ప్రైవేటు బస్సులో బయలుదేరారు. ఉదయం 6.15కు లక్డీకాపూల్ చేరుకున్నారు. ఎందుకీ తేడా.. ఆర్టీసీ బస్సు ప్రధాన నినాదం భద్రత. అంతర్గత నినాదం పొదుపు మంత్రం. ఒకటి ప్రయాణికులకు క్షేమదాయకమైతే.. రెండోది సంస్థకు లాభసాటి. నాన్‌స్టాప్‌గా తిరిగే బస్సులను వీలైనంత దగ్గరి దారిలో పంపటం ద్వారా డీజిల్ ఖర్చును తగ్గించుకోవాలని ఆర్టీసీ ఆలోచిస్తుంది. ఇందుకోసం సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులను దగ్గరి దారిలో గమ్యం పంపే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే నాన్‌స్టాప్ బస్సులను ఈ ఉద్దేశంతోనే ఖమ్మం మీదుగా గోదావరి జిల్లాలోకి ప్రవేశించే కొవ్వూరు మార్గాన్ని ఎంచుకుంది. విజయవాడ మీదుగా కంటే ఇది దగ్గరిదారి కావటమే కారణం. ఇక్కడే సమస్య ఎదురైంది. గత కొన్నేళ్లుగా సరైన నిర్వహణ లేకపోవటంతో ఈ దారి బాగా దెబ్బతిన్నది. మెయింటెనెన్స్ పనులు నామమాత్రంగా ఉండటంతో ఇటీవలి భారీ వర్షాలకు పెద్ద గోతులు పడి మారుమూల పల్లె దారికంటే హీనంగా తయారైంది. ముఖ్యంగా వైరా–సత్తుపల్లి మధ్య దాదాపు పది కిలోమీటర్ల మేర రోడ్డుమీద ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. మళ్లీ ఏపీ పరిధిలో జంగారెడ్డి గూడెం–రాజమండ్రి మధ్య ఇలాగే తయారైంది. ఇతర కొన్ని చోట్ల కూడా కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా మారింది. దీంతో బస్సులు బాగా నెమ్మదిగా వెళ్తే తప్ప క్షేమంగా గమ్యం చేరని పరిస్థితి. ఏమాత్రం వేగంగా వెళ్లినా అదుపుతప్పి బోల్తా కొట్టే ప్రమాదం ఉంది. ఈ దారిలో ప్రస్తుతం దాదాపు పది ప్రాంతాల్లో ఇలాగే బోల్తాపడ్డ లారీలు కనిపిస్తున్నాయి. దీంతో నెమ్మది ప్రయాణం తీవ్ర జాప్యానికి కారణమవుతోంది. విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లేందుకు 8 గంటల సమయం పడుతుండగా, ఖమ్మం మీదుగా 12 గంటల సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో నాన్‌స్టాప్ సర్వీసులకు ఇదే రోడ్డు సూచించడంతో ఆ బస్సులో వెళ్లివచ్చే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు ప్రయాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండగా మరోవైపు గోతుల వల్ల వెన్నుపూస సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవలి సంక్రాంతి ప్రయాణాలు వారికి ప్రత్యక్ష నరకాన్ని చవిచూపాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్ టికెట్ బుక్ చేసుకున్నవారిలో కొందరు వెళ్లేప్పుడు దుస్థితి చూసి వచ్చేప్పుడు టికెట్ రద్దు చేసుకుని విజయవాడ మీదుగా వచ్చే బస్సులను ఆశ్రయించటం విశేషం. ఆ రోడ్డుకు ఆ దుస్థితి ఎందుకు.. రెండేళ్ల క్రితం వరకు ఇది రాష్ట్ర రహదారి. ఆ సమయంలో కూడా దీనిపై దృష్టి పెట్టకపోవటంతో ఇది గోతులుగానే ఉండేది. కానీ అడపాదడపా చేపట్టే రెన్యూవల్స్‌తో కాస్త మెరుగుపరుస్తూ నెట్టుకొచ్చేవారు. రెండేళ్ల క్రితం దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించారు. అంటే నేషనల్ హైవే విభాగం దీన్ని విస్తరించి మెరుగు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్రం నిధులు ఇవ్వాలి. ఎన్నికల సమయం కావటంతో దాదాపు ఏడాదిన్నరగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ దీన్ని పెండింగ్‌లో ఉంచింది. జాతీయ రహదారిగా ప్రకటించినందున రాష్ట్ర అధికారులు దీన్ని పట్టించుకోలేదు. ఫలితంగా అసలు మరమ్మతులే లేకపోవటంతో అత్యంత దారుణంగా తయారైంది. దీంతో ఆ దారిగుండా వెళ్లే వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. త్వరలో పనులు రోడ్లు, భవనాల శాఖ అధికారులు జాతీయ రహదారిగా డిక్లేర్ చేసినందున కొంతకాలంగా మేం మరమ్మతులు చేపట్టలేదు. జాతీయ రహదారిగా మార్చే పనిలో జాప్యం జరిగినందున ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రెన్యూవల్స్ చేపట్టనున్నాం. రోడ్డు బాగా దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించాం. దాదాపు రూ.7 కోట్లతో త్వరలో పనులు చేపడతాం ప్రత్యామ్నాయంపై దృష్టి: ఆర్టీసీ అధికారులు రాజమండ్రికి అది దగ్గరి దారి కావటంతో ప్రధాన సర్వీసులను అటుగా తిప్పుతున్నాం. కానీ రోడ్డు బాగా దెబ్బతిన్నందున ఇటు ప్రయాణికులకు ఇబ్బంది కావటంతోపాటు అటు బస్సులు దెబ్బతినే పరిస్థితి ఉంది. స్థానిక డిపో అధికారులతో చర్చించి బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపే దిశగా చర్యలు తీసుకుంటాం. -
టీడీపీ నేత ఇంటిపై పోలీసుల దాడి
రాజమహేంద్రవరం రూరల్: పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలోని బుచ్చియ్యనగర్ డెయిరీ కాలనీలో ఉంటున్న టీడీపీ నేత పిన్నింటి వెంకట రవి శంకర్ ఇంటిపై బుధవారం మధ్యాహ్నం బొమ్మూరు పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో టీడీపీ నేతతో పాటు మరో వ్యక్తి ఇద్దరు మహిళలతో పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. టీడీపీ నేత పిన్నింటి వెంకట రవిశంకర్ ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఎస్సై శుభశేఖర్, సిబ్బందితో ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో రవిశంకర్ గదిలో ఇద్దరు అమ్మాయిలతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వందే కిశోర్ అనే వ్యక్తిని, రవిశంకర్‌లను బొమ్మూరు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వ్యభిచారం చేస్తున్నారన్న దానిపై ఎస్సై శుభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నేత రవిశంకర్‌ను తప్పించేందుకు టీడీపీ యువనేత ఒకరు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వెండి వ్యాపారం చేసే రవిశంకర్ వద్దకు వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు అమ్మాయిలు వచ్చారని నమ్మించే ప్రయత్నాలు చేశారు. కాని సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు లభించాయి. మూడు రోజులుగా టీడీపీ నేత ఇంటి వద్ద కార్లు, అమ్మాయిల హడావుడి ఉన్నట్టు పోలీసులు విచారణలో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. -
అలీకి మాతృ వియోగం, చిరు పరామర్శ
-
ఆంగ్లం వద్దన్నవారు బడుగు వర్గాల వ్యతిరేకులే!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఇంగ్లిషు మీడియం వద్దన్న వారంతా బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకులేనని ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా లద్దిక మల్లేష్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన పలు విషయాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు.. సాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై మీ స్పందన..? నారాయణమూర్తి: రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన జగనన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాక్షి: ఎందుకో వివరంగా చెప్పగలరా..? నారాయణ మూర్తి: ఇప్పటి వరకు డబ్బున్న వారు మాత్రమే వేలు, లక్షలు వెచ్చించి కాన్వెంట్లలో, స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నారు. వారంతా ఇంగ్లిష్ మీడియంలో చదవడం వల్ల విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో, ఉన్నత పదవుల్లో ఉంటున్నారు. కేవలం బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇంటర్వ్యూలలో, పెద్ద, పెద్ద కంపెనీలకు ఎంపిక కాలేక పోతున్నారు. అదే వీరందరూ కూడా ఇంగ్లిష్ మీడియంలో చదవగలిగితే రేపు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. సాక్షి: భవిష్యత్తులో రోబోటిక్స్, ఎరోనాటిక్స్ మయం కాబోతుంది. వాటిలో జాబ్‌లు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లిష్ పరిజ్ఞానం కావాలి కదా..? నా.మూ: నిజం చెప్పావు బ్రదర్.. భవిష్యత్తు అంతా సాంకేతిక కోర్సులు, రోబోటిక్స్‌తో నిండిపోనున్నాయి. వాటిలో జాబ్‌లు సంపాదించాలంటే తప్పకుండా ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. సాక్షి: తెలుగు భాషకు ఏదో ముప్పు వచ్చిందని బాధపడుతున్నారా? నా.మూ: తెలుగు భాషకు ఏదో ముప్పు వచ్చిందని బాధపడుతున్న వారి పిల్లలు, మనవళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా..? ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారా..? మన ఇంటిలో మాట్లాడుకునేది మాతృ భాష తెలుగు, కాని మన ఇంటిలో వారిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? నాన్నా, అమ్మ, అన్నయ్య, బాబాయ్, అత్త అనే పదాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయ్. మమ్మి, డాడీ, బ్రో, అంటీ, అంకుల్ ఈ పిలుపులతో పిలిచినప్పుడు తెలుగు భాష గుర్తుకురాలేదా..? ఇంటిలో పిల్లలకు పాత తరం వారు వారి తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు పేర్లు పెట్టేవారు. కాని నేడు మున్ని, ట్వింకిల్ అనే మోడ్రన్ పేర్లతో పిలుస్తున్నారు. అప్పుడు తెలుగు గుర్తుకు రాలేదా? సాక్షి: తెలుగు మీడియం వల్ల మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నా.మూ: మాది పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. నేను బీఏ వరకు చదువుకున్నాను. అదికూడా తెలుగు మీడియంలోనే చదువుంతా సాగింది. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి స్కూల్లో తెలుగు మీడియం అమలు చేయడంతో మా ఆనందానికి అంతు లేదు. కాని మాకు అప్పుడు ఇంగ్లిష్ భాష గురించి తెలియలేదు. బీఏ, ఎంఏలు, బీకాం, బీస్సీలు తెలుగు మీడియంలో చదివిన మాకంటే ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారు మాత్రమే ఉద్యోగాలు సాధించగలిగారు. అది అప్పుడే కాదు. ఇప్పుడూ ఉంది. తెలుగు మీడియం విద్యార్థి, ఇంగ్లిష్ మీడియం చదివిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎన్నికైన వారి నిష్పత్తి తీసుకుంటే ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారు ఎక్కువగా ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. సాక్షి: ఇంగ్లిష్ మీడియంలో చదివితే తప్పేంటి? నా.మూ: బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. మిగిలిన వారంతా ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. తెలుగును కాపాడేది ఈ బడుగు, బలహీన వర్గాల పిల్లలేనా? ప్రశ్నించే వారి పిల్లలకు తెలుగును కాపాడే అవసరం లేదా. జగన్ గారు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్ ఎలా తప్పనిసరి చేశారో.. అదే విధంగా కార్పొరేట్ స్కూళ్లలో కూడా తెలుగు సబ్జెక్ట్ తప్పని సరి చేయాలి. బ్రదర్ ఈ విషయాన్ని ప్రముఖంగా రాయండి. ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్ళందరూ బడుగు, బలహీన వర్గాల వారికి వ్యతిరేకమే. జగన్ గారికి మరోసారి ధన్యవాధాలు. అంటూ ఇంటర్వ్యూ ముగించారు. -
గోదావరి నదిలో చేపలను విడిచిపెట్టిన మత్స్యశాఖ
-
రాజమండ్రికి భీష్మ
దీపావళికి ఓ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు వెండితెర నయా ‘భీష్మ’. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నేటి నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుందని సమాచారం. అక్కడ ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలిసింది. అలాగే ఈ దీపావళికి సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
కాపులను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే...!
సాక్షి, రాజమహేంద్రవరం: గురివింద తన నలుపు ఎరగదన్న సామెతను తలపిస్తోంది చంద్రబాబు తీరు. అధికారంలో ఉన్నన్నాళ్లు తప్పులమీద తప్పులు చేశారు. తీరా అధికారం కోల్పోయేసరికి నీతి వాక్యాలు వల్లిస్తున్నారని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.కాకినాడలో రెండు రోజులపాటు తెలుగుదేశం పార్టీ నేతలతో నియోజకవర్గాల సమీక్షల్లోను, సమీక్షల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశాల్లో బాబు పలుకులు పాత చింతకాయ పచ్చడిని తలపించాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా జనాన్ని భ్రమింపచేయడంలో సిద్ధహస్తులనే పేరున్న చంద్రబాబు పార్టీ ఘోర ఓటమి తరువాత తొలిసారి జిల్లాకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో బాబు మాటలతో పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్తేజం ఎంత నింపారో చెప్పలేము కానీ పలికిన ప్రతి పలుకులో పచ్చి అబద్ధాలు వండి వార్చినట్టుగా కనిపించింది. అధికారంలో ఉంటే ఒకరకంగా, ప్రతిపక్షంలోకి వస్తే మరో రకంగాను మాట్లాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటారు. అదే విషయాన్ని ఈ పర్యటనలో బాబు నిరూపించుకున్నారు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో కూడా ఆయనకు మరెవరూ సాటిరారంటారు. ఖాకీలకు ‘పచ్చ’ చొక్కాలేసిందెవరో... చంద్రబాబు సీఎంగా ఉన్న గత ఐదేళ్లూ పోలీసులకు పచ్చచొక్కాలు అంటే వేయలేదు కానీ అంతకంటే ఎక్కువగానే ఉపయోగించుకున్నారు. చివరకు పోలీసు బాస్ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావులను వినియోగించి పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించారు. ఈ విషయం పలు సందర్భాల్లో పత్రికలకు పతాక శీర్షికలయ్యాయి. అటువంటిది అధికారం కోల్పోయే సరికి ఒక్కసారే పోలీసు వ్యవస్థ అంతా నిర్వీర్యమై పోయినట్టు, వైఎస్సార్సీపీ చెప్పినట్టే నడుస్తున్నారని అవాకులు, చవాకులతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. పోలీసు డ్రెస్ వేసుకునేది ప్రజా సేవ కోసమంటూ నీతి పలుకులు పలకడం చర్చనీయాంశమైంది. బాబు మరో అడుగు ముందుకేసి పోలీసులు దిగజారిపోయారంటూ కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అవమానకరంగా మాట్లాడటంపై పోలీసు వర్గాలు మండిపడుతున్నాయి. నిరుద్యోగులకు తాను ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న నిరుద్యోగ భృతి మాటే ఎత్తని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి గ్రామ, వార్డు వలంటీర్లను నియమిస్తే వారిని ‘బస్తాలు మోసే’ వారిగా అభివర్ణిస్తూ అవమానకరంగా మాట్లాడటం విజ్ఞులను విస్మయానికి గురిచేసింది. జిల్లాలో ఒకేసారి 24 వేల మంది వలంటీర్లను నియమించి గ్రామాల్లో నిరుద్యోగానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రభుత్వ ప్రయత్నాన్ని స్వాగతించాల్సింది పోయి కువిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు సొంత పార్టీలో కూడా చంద్రబాబు తీరు సరికాదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించేది లేదని సీఎం జగన్ పదేపదే చెబుతుంటే చంద్రబాబు మాత్రం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వాక్రా యానిమేటర్లను తొలగించేస్తున్నారని ప్రజలను పక్కదోవపట్టించారు. రూ.3000 వేతనం ఉన్న ఆశ వర్కర్లకు సీఎం అయ్యాక జగన్ ఏకా ఎకిన రూ.10 వేలు వేతనం పెంచి వారికి సమాజంలో గౌరవాన్ని రెట్టింపుచేశారు. కానీ 30 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆశ వర్కర్లను బెదిరిస్తున్నారని వాస్తవాలకు ముసుగేసే ప్రయత్నం చేశారు. పోలవరం సహా నీటివపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతిని వెలికి తీసేందుకు సీఎం జగన్ రివర్స్ టెండర్లతో ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం జగన్‌కు ఇరిగేషన్‌పై అవగాహన లేదని వ్యాఖ్యానించడంలో రాజకీయకోణమే కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. కాపుల విషయంలో రాజకీయమే... ఎన్నికల్లో ఓటు బ్యాంక్‌గా పరిగణించి ఎన్నికలయ్యాక కాపులను నమ్మించి దగా చేసి ఇప్పుడేమో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం తపా అని ప్రశ్నించడంపై ఆ సామాజికవర్గం మండిపడుతోంది. తన సహజ నైజాన్ని మరోసారి బాబు చాటుకోవడానికి ఎక్కడా వెనుకాడలేదు. హైదరాబాద్ అభివృద్ధి, ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, సైబరాబాద్ తన గొప్పతనమేనని మరోసారి పాత పాటనే అందుకున్నారు. పార్టీ సమీక్షలు కూడా మొక్కుబడిగానే పూర్తి చేయడంపై పార్టీ శ్రేణులు అసహనాన్ని వ్యక్తం చేశాయి. ఒకేసారి రెండు, మూడు నియోజకవర్గాల సమీక్షలను నిర్వహించడం, ఒక నియోజకవర్గం నుంచి ఒకరు లేదా, ఇద్దరికి మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వడంపై పార్టీ నేతలు బాబు తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారిని ఉద్దేశించి ఒకరిద్దరు పోతే పోయేదేమీ లేదనడం పార్టీ ఘోర ఓటమి తరువాత కూడా బాబులో మార్పు రాలేదనే విషయం రుజువైందంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరినీ సమన్వయం చేసుకుంటూ అండగా ఉన్న పార్టీ సీనియర్ నేతలను దూరంగా ఉండాలనడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవన్దీ అదే బాట జనసేన అధినేత పవన్‌కల్యాణ్Š సైతం బాబు బాటనే పట్టారనిపించారు. పవన్ పర్యటన జిల్లాలో ఒకే ఒక సీటు, అదీ కూడా బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డ కోనసీమలోని రాజోలు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. గురువారం రాత్రి 8 గంటలకు దిండి వచ్చిన పవన్ అప్పటికే మేధోమథనం పేరుతో పార్టీ పీఏసీ సభ్యులు నిర్వహించిన సమీక్షలో ఇలా ముఖం చూపించి అలా వెళ్లిపోవడంతో పార్టీ అభిమానులు నిరాశకు గురయ్యారు. నియోజకవర్గాల్లో పనిచేసిన పార్టీ నేతలు, అభిమానులతో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను దగ్గరకు కూడా రాకుండా అడ్డుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ తోపులాటల్లో కానిస్టేబుల్‌కు గాయాలపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు అమరావతి అంతా అవినీతి మయమైందని, రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని నిప్పులు చెరిగిన పవన్ ఇప్పుడు అమరావతికి వంత పాడటం బాబు రెండు నాల్కల ధోరణికి ఏమాత్రం తీసిపోనిదిగా కనిపించింది. బాబు, పవన్ ఒకే తానులో ముక్కలనే అభిప్రాయం ఆయా వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. -
బర్త్‌డే వేడుకల్లో అపశ్రుతి
-
అది తప్పని నిరూపిస్తా : పవన్ కల్యాణ్
రాజమండ్రి: తాను కాపు అని అందరూ అంటున్నారనీ, కానీ తనకు కులం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాక్యానించారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఉద్వేగంగా ప్రసగించారు. 2014లో ఏమీ ఆశించకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చానని చెప్పారు. తాను సీఎం కుమారుడిని కాదని, కేవలం సాదాసీదా కానిస్టేబుల్ కుమారుడిని మాత్రమేనని అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీలా తన దగ్గర డబ్బులు లేవని అన్నారు. పవన్ బలం గోదావరి జిల్లాలేనని కొందరు అంటున్నారని, అది తప్పని నిరూపిస్తా అన్నారు. సీమలో తనకూ బలం ఉందని తొడగొట్టి చెప్పాలా సూటిగా ప్రశ్నించారు. జనం కోరుకుంటే తెలంగాణాలో కూడా రాజకీయాలు చేస్తానని చెప్పారు. కులాలను కలిపేది జనసేన మాత్రమేనని వ్యాక్యానించారు. తెలంగాణాలో ఆంధ్రావాళ్లను కొందరు నీచంగా చూశారని ఆరోపించారు. ఏపీలో అధికారం కేవలం రెండు కులాల మధ్యే ఊగిసలాడుతోందని ఆరోపించారు. ప్రతికుటుంబానికి రూ. 10 లక్షల భీమా జనసేన అధికారంలోకి రాగానే అన్నికులాల విద్యార్థులకు ఒకటే హాస్టల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల బీమా కల్పిస్తానని తెలిపారు. ప్రతి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతుకు సాయం చేస్తామని వెల్లడించారు. అలాగే రైతులకు ఉచితంగా సోలార్ మోటార్ పంపులు అందిస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఒకటి నుంచి పీజీ వరకు అంతా ఉచితంగా విద్యనందిస్తామని అన్నారు. డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానం
-
ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానం: ఉండవల్లి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ పరిధిలో సీబీఐ ఎలాంటి దాడులు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి కచ్చితంగా తీసుకోవాలంటూ జారీ చేసిన జీవోపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాజమండ్రిలో శుక్రవారం ఉండవల్లి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై నేరుగా సీబీఐ దాడులు చేయవచ్చునని అన్నారు. దానికి ఎవరి అనుమతి అవసరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, దాని ఆధీనంలో ఉన్న అంశాలపై విచారణ కావాలంటే కోరవచ్చునని వ్యాక్యానించారు. చంద్రబాబు తన 15 ఏళ్ల పాలనలో ఎప్పుడూ కూడా సీబీఐ ఎంక్వైరీ కోరలేదని గుర్తు చేశారు. ఏ విషయంపై నైనా కోర్టు ఆదిశిస్తే సీబీఐ ఎంక్వైరీ చేయవచ్చునని తెలిపారు. ప్రభుత్వం సీబీఐని రావడానికి వీల్లేదని చెబితే చెల్లదన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కల్యాణ్ సింగ్ సర్కార్, పప్పూ యాదవ్ కేసుల్లో ఇదే జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానమని పేర్కొన్నారు. జీవో ఇవ్వడమే హాస్యాస్పదమని సీనియర్ న్యాయవాదులు చెబుతుంటే ఎందుకు చంద్రబాబు ఐటీ రైడ్లను, సీబీని వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. బాబు ఏపీ పరువు తీస్తున్నారని వాపోయారు. నిష్ప్రయోజనమైన జీవో విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మైనస్సేనన్నారు. పోలవరంపైనే కేంద్రం ఇప్పటివరకూ సీబీఐ విచారణకు ఆదేశించలేదని తెలిపారు. మీ పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిగితే అది కేంద్రం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఐటీ రైడ్లు చేయడం ద్వారా తనను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఓ సీఎం చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రం పరువు తీసే చర్య ఇది..ఇప్పటికైనా పునరాలోచించి నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే బాబుకు ఆనందం ఎందుకు
-
‘ఎవరి అభిమానో త్వరలోనే తెలుస్తుంది’
రాజమండ్రి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆనందం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉండవల్లి విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత బాబు ప్రెస్మీట్లో నవ్వుతూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిందితుడికి నార్కో టెస్టు చేయిస్తే నిజాలు బయటకొస్తాయన్నారు. వైఎస్సార్ కుటుంబానికి డ్రామాలంటే ఇష్టం ఉండదని ఉండవల్లి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ బాధ్యత లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. అసలు జగనే కావాలనే చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. కావాలనే హత్యాయత్నం చేయించుకోవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఆ అభిమాని ఏ పార్టీకి చెందినవాడో త్వరలోనే తెలుస్తుందన్నారు. ఇంకా మట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జెట్ గ్రౌటింగ్ పూర్తయిందని ప్రకటించారు...అది కాస్తా వర్షాలకు కొట్టుకుపోయిందని మళ్లీ చెప్పారని వెల్లడించారు. టీడీపీ అనుకూల పేపరైన ఈనాడులోనే దీనిపై కథనం కూడా వచ్చింది. జెట్ గ్రౌటింగ్ అసలు అంచనాల్లోనే లేదు..ఎంత చెల్లించాలో కూడా తెలియదని చెప్పింది. పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్లు ఎంత చెబితే అంత చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పోలవరం విషయంలో బిల్లులు అసలు కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారని ముందే చెప్పాను..అదే విషయం కాగ్ తేల్చింది. 2019లో మే నాటికి నీరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే మేలో నీరుండదు. నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని ఉండవల్లి తెలిపారు. అధిక సొమ్ము ఇచ్చి పనిచేయిస్తున్నప్పుడు నాణ్యత విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారని ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలన్నీ తాత్కాలికమేనని, శాశ్వత కట్టడం ఒక్కటి కూడా లేదని తెలిపారు. ఆఖరికి హైకోర్టు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కూడా ఈ తాత్కాలిక భవనాలు నిర్మించేటపుడు టీడీపీని అడగలేదని చెప్పారు. ఇవన్నీ కూడా టీడీపీ, బీజేపీలు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలేనని చెప్పారు. రాజకీయం కూడా ఓ వృత్తిలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
సినిమాలు లేని హీరో గరుడ అంటూ..
రాజమండ్రి: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు సరిగా లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో సోము వీర్రాజు మాట్లాడుతూ..సినిమాలు లేని హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ అల్లకల్లోలం చేస్తున్నాడని విమర్శించారు. ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు ప్రభుత్వం మతితప్పి మాట్లాడుతోందని దుయ్యబట్టారు. శివాజీ చెబుతున్నట్లు ఆపరేషన్ గరుడ నిజమే అయితే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎందుకు శివాజీని పిలిపించి వివరాలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై దాడి చంద్రబాబు స్క్రిప్ట్‌లో భాగమేనని ఆరోపణలు చేశారు. శివాజీ లాంటి జీరోను ఉపయోగించుకుని చంద్రబాబు పరిపాలించే హక్కు కోల్పోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌పై దాడి రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. -
ఆ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదు: ఉండవల్లి
రాజమండ్రి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఎన్ఓలో ప్రసంగించిన అంశాన్ని ఏపీ ప్రభుత్వ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ.. జీరో బడ్జెట్ పేరిట నేచురల్ ఫార్మింగ్ గురించి వివరించి, రూ.16 వేల 600 కోట్ల ఎంవోయూను చంద్రబాబు, సిఫ్ సంస్థతో ఎందుకు చేసుకున్నారని సూటిగా అడిగారు. దేశం మొత్తం మీద వచ్చిన పెట్లుబడుల్లో 20 శాతం మనకే వచ్చిందని,18 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు వచ్చాయని గతంలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించాలని, ఇప్పటికైనా యదార్థాలు మాట్లాడాలని ఉండవల్లి కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల జనాన్ని పోలవరం ప్రాజెక్టు చూపించటానికి తీసుకు వెళ్లినందుకు 20 కోట్ల రూపాయల వ్యయం చేయటం దారుణమన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించాలని కోరారు. ఇదే విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థను ప్రశ్నిస్తే ఆర్టీఐలోని సెక్షన్ 8 ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారని వెల్లడించారు. రామోజీ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం గురించి 2005లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి తన ఆత్మకథలో రాసుకున్నారని తెలిపారు. రామోజీరావు శిక్షలకు అతీతుడు అనే పద్ధతిలో అందరూ వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. -
జక్కంపూడి రాజా దీక్ష భగ్నం..
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు గురువారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి రాజా నిరాకరించారు. పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేసే వరకు దీక్ష విరమించబోనని ఆయన స్పష్టం చేశారు. రఘుదేవపురంలో పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, వరికుప్పలు కాలిపోయిన రైతులను ఆదుకోవాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, పోలవరం జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది కాలనీకి భూసేకరణలో ఉన్న రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ జక్కంపూడి రాజా నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ సీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి రాజాను పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, అనంత బాబు ,తోట నాయుడు, విశ్వరూప్, వేణు గోపాల్ కృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి లతోపాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజాని పరామర్శించారు. ఓవైపు రైతుల కోసం జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష కొనసాగిస్తుండగా మరోవైపు ఆయన సోదరుడు గణేష్ కోరుకొండ మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ సీపీ నవరత్నాలు గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. -
పాపికొండలు యాత్ర: పడవలో మంటలు
-
పాపికొండలు విహారయాత్రలో ప్రమాదం
సాక్షి, రాజమహేంద్రవరం: పాపికొండలు విహారయాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలు యాత్రకు పర్యాటకులతో బయల్దేరిన ఓ బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. బోటులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. విహారయాత్రకు వినియోగించిన బోటు పాతది కావడం వల్ల ఇంజన్ హీట్ ఎక్కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో 80 మంది పర్యాటకులు ఉన్నారు. ఘటన గురించి తెలుసుకున్న వీరవరపులంక వాసులు పలువురు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికుల సాయంతో మిగతావారిని కూడా రక్షించారు. మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ప్రయాణికులను అక్కడి నుంచి తరలించి వైద్య సేవలు అందించారు. చంద్రబాబు ఆరా పాపికొండలు యాత్రకు వెళ్లిన పడవ ప్రమాదానికి గురైన ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ప్రయాణికుల క్షేమ సమాచారంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. -
ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రిలో ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఓఎన్జీసీకి చెందిన హెలికాఫ్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణంతో ల్యాండింగ్ కష్టమై ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అయితే స్థానికంగా ఉన్న రావులపాలెం వద్ద పొలాల్లో హెలికాఫ్టర్‌ను ఫైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో హెలికాఫ్టర్‌లో ఉన్న సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈరోజు ఉదయం నుంచి రాజమండ్రిలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్టు చెట్లు, భారీ హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. మరోవైపు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. -
సాక్షి ఎఫెక్ట్ : టీడీపీ నేత అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్ / కడియం : ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఓ టీడీపీ నేత దౌర్జన్యంగా పొక్లైన్లతో అక్రమ క్వారీ తవ్వకం .. కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా సంబంధితాధికారుల ప్రేక్షకపాత్ర.. బాధితులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం.. దీంతో ఆ బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించగా రంగంలోకి దిగింది. వరుస కథనాలతో చట్రం బిగించింది. తొలుత బుకాయింపులకు దిగిన ఆ అక్రమదారుడు చివరకు దిగిరాక తప్పలేదు. రాజకీయ ఒత్తిళ్లతో వెనుకడుగు వేసిన పోలీసులు ఈ బాగోతాన్ని ‘సాక్షి’ ససాక్ష్యాలతో బయటపెట్టడంతో చట్టం ఉచ్చులో చిక్కాడు. ఎట్టకేలకు నిందితుడు వెలుగుబంటి వెంకటాచలాన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కొడైకెనాల్లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం రాజమహేంద్రవరం తీసుకువచ్చారు. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు శ్రీరాములు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని సంబంధిత అధికారులను నిలదీశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ సంఘటనా స్థలంలోనే ఆరు రోజులు నిరసన దీక్ష కూడా చేశారు. వెంకటాచలంపై అక్రమ క్వారీయింగ్‌తోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం పోలీసులు నమోదు చేశారు. పోలీసు విచారణ నేపథ్యంలో వెలుగుబంటి వెంకటాచలం అజ్ఞాతంలోకి జారుకున్నారు. డీఎస్పీ పి. నారాయణరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం వెంకటాచలాన్ని కొడైకెనాల్లో అదుపులోకి తీసుకుని శనివారం రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. 7వ అదనపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసుల దాగుడుమూతలు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడిన నిందితుడు వెలుగుబంటి వెంకటాచలం అరెస్టుపై పోలీసులు దాగుడుమూతలాడారు. నాలుగు ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ. 8.61 కోట్ల అక్రమాలు చేసిన నిందితుడిని మూడు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు నిందితుడిని తీసుకువచ్చారని తెలియడంతో పత్రికా విలేకరులు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. చివరకు అక్కడినుంచి వెంకటాచలాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పోలీస్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. కడియం, రూరల్ మండలాల నుంచి పలువురు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని పైరవీలకు తెరదీశారు. చిన్న,చిన్న దొంగతనాలు చేసిన నిందితులను విలేకర్ల సమావేశం పెట్టి మరీ హాజరుపరిచే పోలీసులు కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని రహస్యంగా కోర్టుకు తరలించడం విమర్శలకు తావిచ్చింది. వేమగిరి అక్రమ క్వారీయింగ్‌కు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల అండ ఉందని ఆందోళనకారులు చేస్తున్న ఆరోపణలు నిజం చేసే విధంగా శనివారం పోలీసులు వ్యవహరించారు. నిందితుడికి రాచమర్యాదలు చేయడంతోపాటు, విలేకర్లకు ఏమాత్రం చిక్కకుండా రహస్యంగా తమ పని తాము పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తాలే చేతులు మారినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’గా తమ పరిస్థితి మారిందని ఓ పోలీసు ఉన్నతాధికారి విలేకర్ల ముందు వ్యాఖ్యానించారంటే పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఈ మేరకు ఉందో అర్థమవుతోంది. సాక్షి కథనాలతో వెలుగులోకి.. జనవరి 26న ‘వెలుగుబంటి విధ్వంసం’ శీర్షికతో అక్రమ క్వారీయింగ్‌ను తొలిసారిగా ‘సాక్షి’ జిల్లా ఎడిషన్ మొదటి పేజీలో వెలుగులోకి తీసుకువచ్చింది. జనవరి 31న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీరాములు అక్రమ క్వారీయింగ్ ప్రాంతాన్ని పరిశీలించి మైన్స్, రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశారు. ఫిబ్రవరి 15న వేమగిరిలో జరిగిన అక్రమ క్వారీయింగ్‌లో జరిగిన నష్టాన్ని ‘ఆ తూట్లు విలువ రూ. 8.61 కోట్లు’ శీర్షికతో ‘సాక్షి’ మరో కథనాన్ని ప్రచురించింది. అనంతరం క్వారీయింగ్ కారణంగా నష్టపోతున్న కుటుంబాలు పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. -
భూరాబంధులు
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఈనాం, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పలుకుబడి ఉన్నవారు దొంగ సర్వే నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఇదేవిధంగా నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విలువైన భూములపై భూ రాబందులు స్వైరవిహారం చేస్తున్నాయి. నకిలీ దస్తావేజులతో కోట్లాది రూపాయల విలువైన భూములను హస్తగతం చేసుకున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిస్తున్న దాఖలాలు కానరావడంలేదు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆవ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చదరపు గజం ధర ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంది. ఇక్కడే వెంకటేశ్వర హోల్‌సేల్ మార్కెట్ కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూమి బంగారంతో సమానం. దీంతో కొంతమంది బడాబాబుల కన్ను ఈ భూములపై పడింది. అంతే.. సర్వే నంబర్ 327గా ఉన్న ఈ భూములకు అనుబంధంగా 612, 613, 614, 617, 618 సర్వే నంబర్లతో నకిలీ దస్తావేజులు సృష్టించి ఈ భూములను ఆక్రమించారు. వీరిలో ఓ మాజీ శాసనసభ్యుడు, నగరంలోని ప్రముఖ ఎముకల డాక్టర్, రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు, ఇతర ‘పెద్దలు’ ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 87.87 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ వందల కోట్లు ఉంటుంది. వీటిల్లో అత్యధిక భాగం ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. వెంకటేశ్వర జనరల్ మార్కెట్ వెనక ఆక్రమణలో ఉన్న భూములు ఆ భూముల కథ ఇదీ.. బ్రిటిషు వారి హయాంలో సర్వే నంబర్ 327, 330, 332, 465తో పాటు ఇంకా అనేక సర్వే నంబర్లలోని భూములను దేవాదాయ, ఈనాం కింద పలువురికి కేటాయించారు. ఈ సర్వే నంబర్లలో దాదాపు 22 ఎకరాలను షాహీ ఈనాం కింద ప్రథమ ఈనాందారు ఖాజా జహురుల్లా కుమారుడు దబీర్ మహ్మద్ గాలబ్, ఆయన కుమారులకు శాశ్వత వంశపారంపర్యంగా వచ్చింది. 1902 వరకూ రెవెన్యూ పత్రాల్లో వారి పేర్లున్నాయి. గోదావరికి పలుమార్లు వచ్చిన వరదల వల్ల ఆ భూములు మునిగిపోయాయి. బీఎస్ నంబర్లు 315, 316, 317, 318, 319, 332ఏ, 334, 342లలోని టైటిల్ డీడ్ భూములు, బీఎస్ నంబరు 333బి జిరాయితీ డ్రై, 317ఏ కాలువ, 315 కుంట, 333ఎ, బి ఆవ వెరసి.. 87.87 ఎకరాల భూమిలో దుబ్బు పెరిగిపోయింది. దీంతో వాటిని కొలవడానికి వీలులేదని విలేజ్ నంబర్ 66 డైగ్లాడ్(పాత రికార్డు)లో స్పష్టంగా పేర్కొన్నారు. అందుచేత ఈ సర్వే నంబర్లలోని 87.87 ఎకరాల భూమిని సర్వే నంబర్ 327గా నమోదు చేసినట్లు చూపారు. ఇదే ఆక్రమణదారులకు అవకాశంగా మారింది. ఆ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి, రకరకాల డివిజన్లు సృష్టించి, ఆ భూములను యథేచ్ఛగా ఆక్రమించారు. సర్వే నెంబర్ 327/11లో 2.2 ఎకరాల భూమి తమవని హెచ్చరిక బోర్డు పెట్టిన ఆక్రమణదారులు కల్లుగీత సొసైటీ భూముల కబ్జా సర్వే నంబర్ 327లో సుమారు 16 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో కల్లుగీత కార్మికుల సొసైటీకి కేటాయించారు. వాటిపై దాదాపు 20 కుటుంబాలు ఆధారపడి జీవించేవి. అయితే ఈ భూములను ఓ మాజీ శాసనసభ్యుడు ఆక్రమించాడు. ఆయా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు వివిధ కోర్టుల్లో దావాలు వేయగా అవన్నీ సదరు మాజీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో సొసైటీ వారు, వారి వారసులు తమకు కేటాయించిన 16 ఎకరాలూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. కొంతమంది అధికారులు ఆ మాజీ శాసనసభ్యుడికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సొసైటీ సభ్యులు, ఈనాం భూముల వారసుదారులు కలిసి ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా అతీగతీ లేదు. తమకే ఇవ్వాలంటున్న బాధితులు 1902 రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 327లో 8.88 ఎకరాలు దబీర్ ఇమామ్ మొహిద్దీన్, కాశిమ్ సాహెబ్, ఫకీర్ సాహెబ్, మరో ముగ్గురికి కేటాయించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూములను సర్వే చేసి తమకు అప్పగిచాలని 1998లో వారి వారసులు జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ ఏడున ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా దీనిపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 2000 సంవత్సరంలో చలనా కూడా తీశారు. వారసుల వద్ద పత్రాలు తీసుకున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. 2015లో ‘మీ ఇంటికి – మీ భూమి’లో దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఆక్రమణదారుల నుంచి ఈనాం, దేవాదాయ భూములను కాపాడాలని, తమ భూములను తమకు కేటాయించాలని హక్కుదారులు విజ్జప్తి చేస్తున్నారు. భూ రికార్డులు గందరగోళం ఆవలో మొత్తం విస్తీర్ణం 87.87 ఎకరాలు. ఆ భూమిలో నీరు చేరి ఉండడం వల్ల కొలవడానికి వీలు లేకుండా ఉందంటూ రికార్డుల్లో ఉంది. అక్కడ అనేక వివాదాలున్నాయి. సర్వే నంబర్లు సబ్ డివిజన్ అయ్యాయి. సర్వే నంబర్ 327లో 19.20 ఎకరాలు వెబ్లాండ్ రికార్డు ప్రకారం ఇళ్లస్థలాలుగా కనిపిస్తోంది. 87.87 ఎకరాలపై పూర్తిస్థాయిలో సర్వే చేస్తేనే కానీ ఎవరి భూమి ఎవరిదో చెప్పలేం. అక్కడ ఒక్కో సర్వే నంబర్లోని భూమిపై నాలుగైదు యాజమాన్య హక్కు పత్రాలున్నాయి. – కె.పోశయ్య, తహసీల్దార్, రాజమహేంద్రవరం రూరల్ -
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలవరం భూసేకరణ స్పెషల్ సబ్‌కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగి ప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. జీలుగుమిల్లికి చెందిన ఓ రైతు నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిహారం చెల్లించేందుకు రైతును లంచం అడగడటంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రైతు నుంచి సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జైలు నుంచి సత్యంబాబు విడుదల
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : అయేషా మీరా కేసులో ఎనిమిదిన్నర ఏళ్లు జైలులో ఉన్న సత్యంబాబు ఆదివారం ఉత్కంఠ వాతావరణంలో సెంట్రల్‌జైలు నుంచి విడుదల అయ్యారు. బరువెక్కిన గుండెలతో కన్నీటి పర్యంతం అవుతూ అతను చెబుతున్న సంఘటనలు జైలు వద్దకు వచ్చిన వారి హృదయాలను కదించాయి. పోలీసుల చిత్రహింసలకు కొంతకాలం నడవలేకపోయానని, జైలులో ఉండగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నట్టు చెప్పారు. ఆరోగ్యం కుదుట పడిన తరువాత స్టీల్ వర్కుషాపులో పని చేస్తూ కొంత సొమ్ము సంపాదించానన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో జైలులో డిగ్రీ పూర్తి అంబేడ్కర్ స్ఫూర్తితో జైలులో అంబేడ్కర్ ఓపె¯ŒS యూనివర్శిటీ ద్వారా డిగ్రీ చదివానని అతడు చెప్పారు. సత్యంబాబుకు సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్ష¯ŒS సొసైటీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీ¯ŒSకుమార్, దళిత సంఘాల నాయకులు బేతాళ వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘ నాయకులు పల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దర్యాప్తు అధికారులపై చర్యలకు ముప్పాళ్ల డిమాండ్ సత్యంబాబును అక్రమంగా కేసులో ఇరికించిన దర్యాప్తు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస జాగ్రత్తలు పాటించని దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సత్యంబాబును జైలుపాలు చేసిన ప్రభుత్వమే అతడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. జైలులో డిగ్రీ పూర్తి చేసిన సత్యం బాబుకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగి అసలు నేరస్తులను వదిలేశారని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆయేషా మీరా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
ఎగసిన దేశభక్తి తరంగం
- రాజమహేంద్రవరంలో 4 వేల మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన - పాల్గొన్న 10 వేల మంది - వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శ్రీహరిని అభినందించిన ప్రముఖులు సాక్షి, రాజమహేద్రవరం : గోదావరి తీర నగరం రాజమహేంద్రవరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి తరంగాలు ఉవ్వెత్తున ఎగిశాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంతా శ్రీహరి గురువారం 4 వేల మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఈ ప్రదర్శనను అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రజల్లో దేశభక్తి, ఐక్యత పెరుగుతాయని వారన్నారు. అనంతరం ఈ ప్రదర్శన టీటీడీ కల్యాణ మండపం, నందం గనిరాజు జంక్షన్, కంబాలచెరువు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా పుష్కర ఘాట్ వరకూ సాగింది. జాతీయ పతాకాలు చేబూని స్కేటింగ్ చేస్తూ చిన్నారులు, బుల్లెట్లపై సాగుతూ యువకులు ఈ ప్రదర్శనలో పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు 10 వేల మంది విద్యార్థులు, నగర యువత, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, సుధారాణి, పిల్లి నిర్మల, బొండేసి మాధవి, మెర్సీప్రియ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఏఎస్పీ గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీకాంత్, జె.కులశేఖర్, రామకృష్ణ, పలువురు సీఐలు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. జాతీయ భావం వెల్లివిరిసేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ బొంతా శ్రీహరిని నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. -
రైతు బజారుల్లో బినామిల హవా
హోటళ్లకు భారీగా సరఫరా ప్రజలకు దక్కని కూరగాయాలు జాడలేని రైతులు పట్టించుకోని అధికారులు దళారుల బారిన పడకుండా కష్టానికి తగిన ప్రతిఫలం పొందేందుకు రైతుల కోసం రెండు దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన రైతుబజారులు నేడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. రైతులే తమ పొలాల్లో పండించిన స్వచ్ఛమైన తాజా కూరగాయలను రైతు బజారుకు తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అందంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బినామీ పేర్లతో బయటి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. రైతులు రైతుబజారుల బయట సైకిళ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎస్టేట్ అధికారులతో పాటు, ఉన్నతాధికారులకు తెలిసిందే. కానీ పట్టించుకోరంతే - కోటగుమ్మం (రాజమహేంద్రవరం) జిల్లాలో రాజమహేంద్రవరంలో ఏడు, కాకినాడలో రెండు, అమలాపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి, రామచంద్రపురంలో ఒకటి, రావులపాలెంలో ఒకటి, మండపేటలో ఒక రైతు బజారు ఉంది. రాజమహేంద్రవరానికి దోసకాయలపల్లి, కోరుకొండ, సీతానగరం, బొబ్బిల్లంక, మునగాల, తదితర ప్రాంతాలు, మిగిలిన రైతు బజార్లకు ఆయా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు పండించి తీసుకువస్తుంటారు. జిల్లా నలుమూలలకు చెందిన సుమారు 1200 మంది రైతులు, పొదుపు మహిళా సంఘాలకు, వారి ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ఉన్న రైతు బజార్లు పర్యవేక్షణ లోపాల వల్ల అస్తవ్యస్తంగా మారుతున్నాయి. రైతుల స్థానంలో బినామీ వ్యాపారులు లాభపడుతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, ఉద్యానశాఖ ఉద్యోగుల ఉదాసీన విధానం వల్ల సమస్యలు శృతి మించుతున్నాయి. గుర్తింపు కార్డులు లేకుండానే.. జిల్లాలో 14 రైతు బజార్లు ఉన్నాయి. అయితే పలు రైతు బజార్లలో చాలా మంది రైతులు గుర్తింపు కార్డులు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే కార్డులు చిరిగిపోయాయంటున్నారు. మరికొందరు కార్డులు పోగొట్టుకున్నారు. ఇదే ఆసరాగా కొందరు ఎస్టేట్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సుల నెపంతో బినామీ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూరలు పక్కదారి.. ఉదయమే పార్లర్లు, రెస్టారెంట్ల సిబ్బంది వచ్చి అధిక పరిమాణంలో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల తాము వచ్చేసరికి రైతుబజారులో కూరగాయాలు చాలా వరకు అయిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇక తూనికల్లో తేడాలు సరేసరి. కొన్ని స్టాళ్లలో ఎలక్ట్రానిక్ కాటాలు మూలకు చేరాయి. మర్చిపోయిన జంబ్లింగ్ జాయింట్ కలెక్టర్లు మారిపోయినా బజార్లలో జంబ్లింగ్ జరగలేదు. గతంలో ఏడాదికోసారి జంబ్లింగ్ పద్దతిని పాటించే వారు. అయితే ఎనిమిదేళ్లుగా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫైలు ఉన్నతాధికారుల వద్ద ఉందంటూ మార్కెటింగ్ శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఒక్కో రైతు బజారులో ఒక ఎస్టేట్ ఆఫీసర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. బియ్యం వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. దాంతో పాత వ్యాపారులే ఇక్కడ పాతుకుపోయారన్న విమర్శలు ఉన్నాయి. సమస్యలతో సతమతమవుతున్న రైతు బజార్లను అధికారులు గాడిలో పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. -
మాస్టర్ ప్లాన్‌పై అఖిల పక్షం వేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్ కోటగ్ముమం (రాజమహేంద్రవరం) : రాజమహేందవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఇటీవల ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ఏకపక్షంగా జరిగిందని, దీనిపై అఖిలపక్షం వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 గ్రామాలను విలీనం చేస్తూ తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌పై గ్రామసభలు పెట్టి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అనుచరులకు లాభం చేకూర్చే విధంగా మాస్టర్ ప్లాన్ మార్పులు చేశారని ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం విలీన మండలాల్లో తమ పార్టీ 25 రోజుల పాటు 250 గ్రామాల్లో పాదయాత్ర చేస్తే అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. విలీన మండలాలను చంద్రబాబు ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యానికి గురి చేస్తోందన్నారు. తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలను కూడా ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. పీహచ్‌సీల్లో గర్భిణులు ప్రసవానికి ఇంటి నుంచి బకెట్లతో నీరు మోసుకోవాల్సిన దుస్థితన్నారు. 50 రోజులు దాటినా ప్రజలకు నోట్ల కష్టాలు తీరలేదని, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఎం నాయకులు ఎస్ఎస్ మూర్తి, బీబీ నాయుడు, ఎన్ భీమేశ్వరరావు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. -
మాస్టర్‌ప్లాన్‌లో మాయాజాలం
పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు ప్రజాప్రతినిధుల సిఫార్సులు పంచాయతీల్లోని భూములకు కార్పొరేటర్ల వత్తాసు ప్రతిపాదించిన రోడ్లు ఉపసంహరణ, జోన్లు మార్పు చేతులు మారిన కోట్ల రూపాయలు బహుమతులుగా ప్లాట్లు, పొలాలు పేదల ఇళ్లు పోతున్నాయన్నా పట్టించుకోని నేతలు సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య నగరంగా, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం నగర విస్తరణకు తాజాగా ఆమోదించిన నూతన మాస్టర్‌ప్లాన్‌లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. రోడ్ల వెడల్పు, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, జోన్ల ఎంపికలో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో కేవలం రోడ్ల విభజన, జోన్ల ఏర్పాటు వంటి వాటినే ప్రస్తావించగా, వాటిని కూడా అధికారపార్టీ నేతలు తమ స్వలాభం కోసం నచ్చినట్లుగా మార్చుకున్నారు. తమ ఆస్తుల విలువ పెరగడం కోసం ఆయా ప్రాంతాల్లో అవసరం లేకున్నా రోడ్లు వేయడం, తమ, తమ అనునూయల ఆస్తులకు నష్టం వాటిల్లుతుందంటే ఆ ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అనేక మాయా జాలాలు మాస్లర్ ప్లాన్‌లో చేశారు. పలువురు సీనియర్ కార్పొరేటర్లు అధికార బలంతో తమ పరిధికాని డివిజన్లు, పంచాయతీల్లోని ప్రజల వినతులకు సిఫార్సులు చేసి ఆమోదించుకోవడం విశేషం. ఈ వ్యవహారాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. రోడ్డు వెడల్పు చేయడం వల్ల తమ ఇళ్లు పోతున్నాయని పేదలు, మధ్య తరగతి ప్రజలు విన్నవించినా పట్టించుకోని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పాలక మండలి, అధికార పార్టీ ఎమ్మెల్యే, పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన సిఫార్సులకు మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ‘సై’ అంది. కార్పొరేటర్ల అభ్యంతరాలు, సూచనలతో మొదలు... రాజమహేంద్రవరం నగరంలో 2031 సంవత్సరం నాటికి అభివృద్ధిని అంచనా వేస్తూ 2014లో నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. నగర చుట్టుపక్కల ఐదు కిలోమీట్లర పరిధిలోని ప్రాంతాలను నగరంలో కలుపుతూ ఈ మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేశారు. నగర చుట్టుపక్కల ఉన్న 13 పంచాయతీలు కొత్తగా మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు, సూచనలు తెలపాలంటూ యంత్రాంగం నగర ప్రజలను కోరింది. దీనిపై దాదాపు 600 సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో రోడ్లు వెడల్పులు పెంచడం, తగ్గించడం, జోన్ల మార్పిడి, నూతన రోడ్లు ఉపసంహరణ వంటి ప్రతిపాదనలున్నాయి. వీటిపై నగరపాలక మండలి చర్చించి ఆమోదయోగ్యమైన సలహాలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంది. మాస్లర్ప్లాన్పై పాలక మండలి మూడుసార్లు సమావేశమైంది. మొదటిసారి ఇతర అంశాలు ఉండడం, ప్రజల అభ్యంతరాలు, సూచనలు ఆంగ్లంలో ఉండడంతో తెలుగులోకి మార్చి ఇవ్వాలని వాయిదా వేశారు. రెండోసారి కార్పొరేటర్ల అభ్యంతరాలు తెలపడానికి ప్రత్యేకంగా వాయిదా వేశారు. ఇక్కడే పలువురు కార్పొరేటర్లు 50 అభ్యంతరాలు, సిఫార్సులు చేశారు. ఈ నెల 3వ తేదీన మూడోసారి మాస్టర్ ప్లాన్‌పై సమావేశమైన పాలక మండలి ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర కార్పొరేటర్లు చర్చ జరగాలని పట్టుబట్టినా ఎకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. ‘పరిధి’దాటిన సిఫార్సుల ‘చిత్రాలు’... మాస్టర్ ప్లాన్‌పై కార్పొరేటర్ల అభ్యంతరాలు తెలపడం కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యూహాత్మకంగా రెండోసారి పాలక మండలి సమావేశాన్ని వాయిదా వేయించారు. ఇక్కడే మాస్టర్ ప్లాన్‌లో అనేక ‘చిత్రాలు’ చోటుచేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. పలువురు కార్పొరేటర్లు, అధికార పార్టీ ప్రజాప్రతినిధికి కాసుల వర్షం కురిపించుకునే అవకాశం కుదిరింది. నగరంతోపాటు మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి వచ్చే పంచాయతీల ప్రజలు తమ పొలాలు, ఆస్తులు కాపాడుకునేందుకు వారిని ఆశ్రయించారు. తమ పొలం, ప్లాట్లు నుంచి పోతున్న రోడ్లను ఉపసంహరించడం, వెడల్పు తగ్గిండం, జోన్లు మార్పు వంటి వినతులు అందజేశారు. రోడ్ల వెడల్పు పెంచడం వల్ల దుకాణాలు, రోడ్ల పక్కన విలువైన స్థలాలు కోల్పోతుండడంతో వ్యాపారస్తులు, రియల్ వ్యాపారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి, నగరపాలక మండలిలో అధికారపార్టీ ముఖ్య నేతలను ఆశ్రయించారు. కానుకగా కాసులు, ప్లాట్లు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులు వల్ల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. నగదుతోపాటు నచ్చిన వారికి వారివారి రియల్ వెంచర్లలో ప్లాట్లు కానుకగా ఇచ్చినట్లు తెలిసింది. మరికొందిరికి విలువైన బహుమతులు సిఫార్సులు చేయించుకున్నవారు అందించినట్లు నగరంలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎన్నికల్లో మా కార్పొరేటర్ పెట్టిన ఖర్చు మాస్టర్‌ప్లాన్ వల్ల తీరిందని వారి ఆనుచరులు చర్చించుకుంటున్నారు. నగర అభివృద్ధిని ఫణంగా పెట్టి అధికారపార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న పలువురు కార్పొరేటర్లు తమ ఆస్తులను కాపాడుకోవడం లేదా విలువ పెంచుకోవడం కోసం అధికారాన్ని బాగా ఉపయోగించుకున్నారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇవీగో సిఫార్సులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాట్ల సుభద్రాదేవీతోపాటు ఇతరులకు చెందిన ప్లాట్లలో రోడ్డు వెళుతుండడంతో ఆ రోడ్డును ఉపసంహిరించాలని సిఫార్సు చేసి తొలగింపజేశారు. 10వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కోలమూరు పంచాయతీలో మూడు ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌కు మార్చాలని సిఫార్సు చేశారు. 8వ డివిజన్ కార్పొరేటర్‌గా, టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న వర్రే శ్రీనివాసరావు పిడింగొయ్యి గ్రామ పంచాయతీలో 60 అడుగుల రోడ్డు ప్రతిపాదన ఉపసంహరించాలంటూ సిఫార్సు చేశారు. 9వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న కోసూరి ఛండీప్రియ కోలమూరు గ్రామంలో ఏడు ఎకరాల భూమి ఎన్విరాన్మెంటల్ బఫర్ జోన్ నుంచి నివాస ప్రాంత జోన్‌గా మార్చాలంటూ సిఫార్సు చేశారు. 44, 48, 38 డివిజన్ల కార్పొరేటర్లుగా ఉన్న పాలవలస వీరభద్రం, గరగా పార్వతి, నండూరి వెంకటరమణ కోలమూరు, పిడింగొయ్యి పంచాయతీల్లో పరిశ్రమజోన్లో ఉన్న భూమిని రెసిడెన్సియల్ జోన్ మార్చాలని సిఫార్సు చేశారు. -
ఖాకార్షా కొలువు మహిమలకు నెలవు
కులమతాలకు అతీతంగా భక్తుల పూజలు నేటి నుంచి ఉరుస్ ఉత్సవాలు నగరంలో అతిపురాతనమైన దర్గా కులమతాలకు అతీతంగా ప్రజల పూజలందుకుంటున్న సయ్యద్‌షా ఖాకార్షా ఖాదరీ ఔలియా దర్గా ఉరుస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న ఖురాన్, 8న గంథోత్సవం, 9న మిలాద్ ఉన్నబి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అతిపురాతనమైన దర్గా గురించి... – రాజమహేంద్రవరం కల్చరల్ మహా ప్రవక్త హజ్రత్ మహ్మద్ ఆదేశాల మేరకు, ఇస్లాం పరిరక్షణ కోసం సయ్యద్‌షా ఖాకార్షా ఖాదరీ ఔలియా గోదావరీ తీరానికి బాగ్దాద్ నుంచి తరలి వచ్చారు. రాజరాజనరేంద్రుని కాలం కన్నా ముందే, క్రీ.శ. 850–950 మధ్యకాలంలో ఆయన ఈ ప్రాంతాతానికి వచ్చి, ఇక్కడ జీవించారు. బాబాలకు గురుబ్రహ్మ అయిన పిరానీ ఫీర్ దస్తగిర్ గౌస్ అజంకు ఈయన నాల్గవ తరానికి చెందిన వ్యక్తి. రైల్వేస్టేషన్ సమీపంలో... రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేçÙనుకు సమీపంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పక్కనే ఉన్న హజ్రత్ ఖాకార్షా ఖాదరీ ఔలియా దర్గాను నిత్యం భక్తులు సందర్శిస్తుంటారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఒక చింతచెట్టు ఉండేది. నిత్యం దైవారాధనలో కాలం గడిపే ఖాకార్షా తన జీవిత కాలంలో అనేక మహిమలు చూపారని నేటికీ భక్తులు చెబుతుంటారు. ఎన్నో మహిమలు ఖాకార్షా చిన్నగా దగ్గితే, ఆ శబ్దం సుమారు నాలుగయిదు కిలోమీటర్ల దూరం వినిపించేదట. దీంతో ఆ శబ్దం విన్న దుష్టశక్తులు పారిపోయేవట. ఆయన తన శిషు్యడు ఫనా ఫిల్లాషాను జీవసమాధి చేసి, మూడు రోజుల తరువాత సజీవంగా బయటకు తీసుకువచ్చారని చెబుతారు. ఖాకార్షా ధ్యానంలో ఉండగా ఒక పులి వచ్చి, ఆయన ఎదుటనే కూర్చునేదని, పాము పడగ విప్పి ఆయన సన్నిధిలో ఉండేదని భక్తులు చెబుతారు. క్రూరజంతువులు తమ స్వభావాలను విడిచి, సాధుజంతువులుగా మసలేవని చెబుతారు. నేటికీ ఓ పాములపుట్ట దర్గా ప్రాంగణంలో ఉంది. చిన్నపిల్లలంటే ఖాకార్షాకు ప్రాణం. తన వద్ద ఉన్న కమండలం వంటి పాత్ర నుంచి బిర్యానీ తీసి పిల్లలకు తినిపించేవారట. గోదావరి నది ఒడ్డున (నేటి గౌతమిఘాట్ ప్రాంతంలో) ఆయన కొబ్బరి చిప్పలోకి నదీ జలాలను తీసుకుని, తన కంబళి నుంచి దారపు పోగులను తీసి ఒత్తిగా చేసి అందులో ఉంచి దీపాలను వెలిగించేవారట. అనారోగ్యానికి గురయిన భక్తులకు ఆయన కలలో కనబడి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటారని చెబుతారు. సంతానం లేనివారు, శారీక, మానసిక బాధలతో ఉన్నవారు దర్గాను దర్శిస్తే స్వస్థత పొందుతామని భక్తుల విశ్వాసం. కులమతాలకు అతీతంగా నిత్యం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. భగవంతుడిని ఆరాధించాలి ప్రతి ఒక్కరూ భగవంతుని ఆరాధనలో జీవితం గడపాలని, మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలని ఖాకార్షా జ్ఞానబోధ చేసేవారుట. ఆయన దర్గా సమీపంలోనే ఆయన సోదరి బషీర్ ఫాతిమా అమ్మాజాన్ దర్గా ఉంది. ఈ ప్రాంగణంలోనే గౌస్ అజం (బాగ్దాద్), గరీబ్ నవాజ్ (అజ్మీర్), కొత్తలంక బాబా, తాజుద్దీన్ (నాగపూర్), కరీముల్లాషా ఖాదరీ తదితర ఔలియాల జెండాలు ఉన్నాయి. -
ఇంటివద్ద కూనిరాగాలు కూడా తీసేవారు కాదు
‘సాక్షి’తో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పెద్ద కుమారుడు అభిరామ్ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘నాన్నగారు కచేరీలకు వెళ్లేటప్పుడు ముందుగా ఎటువంటి ప్రిపరేషన్‌కూ ఇష్టపడేవారు కాదు. ఇంటివద్ద కూనిరాగాలు కూడా తీసేవారు కాదు’’ అని ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పెద్ద కుమారుడు అభిరామ్ అన్నారు. మంగళంపల్లి చితాభస్మాన్ని ఆయన అభిమానుల సందర్శనార్థం కోటిలింగాలరేవు వద్ద ఉంచారు. ఈ సందర్భంగా తమ్ముళ్లు సుధాకర్, వంశీమోహన్, సమీప బంధువులతో నగరానికి వచ్చిన అభిరామ్.. తన తండ్రి, సంగీత సామ్రాజ్య సార్వభౌముడు మంగళంపల్లి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మమ్మల్ని ఎప్పుడూ మందలించిన దాఖలాలు లేవు. మాతో ఎంతో సరదాగా, ఆత్మీయంగా ఉండేవారు. బాగా చదువుకోమని మాత్రం చెప్పేవారు. సాధారణంగా గాయకులు శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉంటారు. నాన్నగారు ఇటువంటి నియమాలను ఖాతరు చేసేవారు కాదు. గాయకులు ఏమేం తినకూడదని చెబుతారో అవన్నీ తినేవారు. చాలా సందర్భాల్లో కచేరీకి వెళ్లేముందు ఐస్‌క్రీమ్ తీసుకుని వెళ్లేవారు. బంగాళదుంప వేపుడు, చారు అంటే ఆయనకు ఇష్టం. భారతీయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఆ మహనీయుని స్వగ్రామం శంకరగుప్తంలో ఆయన జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేపడతాం’’ అని అభిరామ్ చెప్పారు. మంగళంపల్లి మనుమడు, వంశీమోహన్ కుమారుడు అయిన బాలమురళి అభి మాట్లాడుతూ, ‘‘నేను ఆ ఇంటిలోనే పుట్టి తాతగారి శిక్షణలోనే పెరిగాను. ఎక్కువ సమయం ఆయనతోనే గడిపే భాగ్యం నాకు దక్కింది’’ అని అన్నారు. ‘‘మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాకు బాబాయ్ అవుతారు. అమలాపురం ఎప్పుడు వచ్చినా, ఆయన మా ఇంటిలోనే బస చేసేవారు. శంకరగుప్తంలో బాలమురళి పేరిట ముఖద్వారం కట్టించాను. ఆయన నన్ను పెద్ద కొడుకుగా చూసుకునేవారు’’ అని అమలాపురానికి చెందిన మంగళంపల్లి విజయమోహన మురళీకృష్ణ చెప్పారు. -
చలో మనీ
రాజమహేంద్రవరం కేంద్రంగా పెద్దనోట్ల మార్పిడి వ్యాపారం 30 శాతం కమీషన్లు ఇస్తామంటూ బేరసారాలు ఇతర రాష్ట్రాలS నుంచి వస్తున్న నల్ల కుబేరులు ఏటీఎంలో నగదు నింపే సిబ్బందే సూత్రధారులు బ్యాంకు అధికారుల పాత్రపైనా పోలీసుల అనుమానం రైలులో దొరికిన ఓ ఆసామి టీటీలకు రూ.లక్ష రూ.2 వేల నోట్లు ఇచ్చిన వైనం అదేమిటంటే సరిపోదా అంటూ మరో లక్ష కట్ట విసిరిన నిందితుడు రెండు రోజుల కిందట సామర్లకోట రైల్వే స్టేషన్లో రూ.15 లక్షల 2 వేల నోట్లతో ఒకరు శనివారం రూ.50 లక్షల రూ.1000 నోట్లతో రాజమహేంద్రవరంలో మరొకరు సాక్షి, రాజమహేంద్రవరం / సామర్లకోట : రోజువారీ అవసరాలకు కూడా నగదు లేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రోజుల తరబడి వేచి చూస్తున్నా నాలుగు వేలు కూడా లభించడం లేదు. అలాంటిది కొందరు బ్యాంకు అధికారులు, ఏటీఎంలలో నగదు నింపే సంస్థ సిబ్బంది కమీషన్ వ్యాపారులతో కుమ్మక్కై నగదును బయటికి తరలించేస్తున్నారు. ఏటీఎంలలో ‘సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే సంస్థ నగదును నింపుతుంటుంది. ఈ కంపెనీకి చెందిన మేనేజర్ దాసరి శ్రీనివాసు జిల్లాలోని ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సమయంలో తన అనుచరుల ద్వారా కొంత నగదును పక్కదారి మళ్లిస్తున్న ఘటన ఇటీవల బయటపడింది, ఇటీవల దాసరి శ్రీనివాసు సామర్లకోటలో టికెట్ లేకుండా రైల్వే ఏసీ బోగీలో ఎక్కారు. జీఆర్పీ పోలీసులు ప్రశ్నించగా వారిపై లక్ష రూపాయల రూ.2000 నోట్ల కట్టను విసిరేశాడు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే మరో కట్టను విసిరాడు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో జీఆర్పీ పోలీసులు తనిఖీ చేయగా రూ.15 లక్షలు దొరికాయి. అవన్నీ రూ.రెండు వేల నోట్లు. జీఆర్పీ పోలీసులు అతన్ని విశాఖ పోలీసులకు అప్పగించగా వారు తమదైన శైలిలో విచారించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.కోటి విలువైన రూ.రెండువేల నోట్లు దారిమళ్లించినట్లు ఒప్పకున్నాడు. తాజాగా శనివారం రాజమహేద్రవరం రైల్వే స్టేషన్లలో చెన్నైకు చెందిన మది అలిగన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో జీఆర్పీ పోలీసులు విచారించారు. అతని వద్ద రూ.50 లక్షల విలువైన రూ.1000 నోట్లు లభించాయి. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. జోరుగా కమీషన్ వ్యాపారం... జిల్లాలో రాజమహేద్రవరం కేంద్రంగా పెద్దనోట్ల మార్పిడి కమీషన్ వ్యాపారం జరుగుతోందన్న ప్రచారం పక్షం రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దాసరి శ్రీనివాసు వ్యవహారం, శనివారం రాజమహేద్రవరం రైల్వే స్టేషన్ లో రూ.50 లక్షల పెద్దనోట్లతో తమిళనాడుకు చెందిన వ్యక్తి పట్టుబడడంతో ఆరోపణలు బలపడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో వ్యాపారం, వైద్యంపరంగా రాజమహేంద్రవరం ముఖ్య కేంద్రంగా బాసిల్లుతోంది. నగరంలో కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్దనోట్ల మార్పిడిని వ్యాపారంగా మలుచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిమాండ్‌ను బట్టి 30 నుంచి 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని సమాచారం. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే 30 శాతం పన్ను దానిపై 200 శాతం జరిమానాతో రూ.లక్షకు రూ.10 వేలు కూడా రాదు.40 శాతం కమీషన్ పోయినా రూ.లక్షకు రూ.60 వేలు మిగులుతాయన్న ఆలోచనతో చాలా మంది నోట్లను మార్చుకునేందుకు వీరిని ఆశ్రయిస్తున్నారు. ఓ రాజకీయ నేత ఈ కమీషన్ వ్యాపారంలో తనమునకలై ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మధ్య ఓ వైద్యుడు తన వద్ద ఉన్న రూ. 50 లక్షలు మార్చుకునేందుకు ప్రయత్నించగా కమీషన్ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి ఆగినట్లు సమాచారం. బ్యాంకు అధికారులపై పోలీసులు నిఘా.. ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపుతున్నా ఆ వివరాలు ఎప్పటికప్పడు సంబంధిత బ్యాంకు అధికారులకు తెలుస్తుంటుంది. బ్యాంకు అధికారులు పాత్ర లేకుండా ఏటీఎంలలో నగదు నింపే సంస్థ సిబ్బంది నగదును దారి మళ్లించలేరని పోలీసులు భావిస్తున్నారు. రూ.450 కోట్లు పక్కదారి పట్టినట్లు శుక్రవారం ఆర్బీఐ ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఇటువైపు దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కమీషన్ వ్యాపారం జోరందుకోవడంతో పోలీసులు బ్యాంకు అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆయా బ్యాంకుల అధికారులు, సిబ్బంది కదలికలపైనా పోలీసు శాఖ నిఘా పెట్టింది. -
రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం
రాజమండ్రి: వస్త్రదుకాణ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన రాజమండ్రిలోని తాడితోటలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక మహత్మాగాంధీ హోల్‌సేల్ మార్కెట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు షాపులు పూర్తిగా కాలి బూడిదకాగా పక్కనే ఉన్న మరో 11 షాపులకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం దుకాణ సముదాయంలోని 106 వ షాపు నుంచి 119వ షాపు వరకు దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. -
కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి ఎమెస్కో అధినేత విజయకుమార్ రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే.. సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్‌లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను. నవలలకు ఆదరణ తగ్గింది నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి. కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్‌లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం. పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్‌లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే -
కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి ఎమెస్కో అధినేత విజయకుమార్ రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే.. సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్‌లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను. నవలలకు ఆదరణ తగ్గింది నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి. కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్‌లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం. పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్‌లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే. -
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచాలి
ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలు నన్నయ వర్సిటీ వీసీ ముత్యాలునాయుడు నగరంలో పుస్తక ప్రియుల పాదయాత్ర రాజమహేంద్రవరం కల్చరల్ : విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ఇకపై ఏటా పుస్తక ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఎన్టీఆర్ ట్రస్టు, నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో భాగంగా మంగళవారం పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల ప్రాంగణం నుంచి పాదయాత్రను వీసీ ప్రారంభించారు. విద్యార్థుల్లో పుస్తకాలు చదవడం తగ్గిపోయిందని, చదవాల్సిన పుస్తకాలు చదవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర వై.జంక్షన్ వరకూ వెళ్లి తిరిగి కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమెస్కో అధినేత విజయకుమార్, కన్వీనర్ డాక్టర్ టి.సత్యనారాయణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీరామ్మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. సాహితీవేత్తలు ఏరీ? తెలుగువారి సాంస్కృతిక రాజధానిలో సాహితీ వేత్తలకు లోటు లేదు. మంగళవారం జరిగిన పుస్తకప్రియుల పాదయాత్రలో సాహితీవేత్తలు కనపడలేదు. తమకు ఆహ్వానాలు రాలేదని రచయితలు చెబుతుండగా, పంపామని నిర్వాహకులు తెలుపుతున్నారు. పుస్తక సంబరాల ప్రారంభానికి నాందిగా నిర్వహించవలసిన పాదయాత్ర,ను మూడు నాలుగు రోజులకు నిర్వహించడం సరికాదని పలువురు పుస్తక విక్రేతలు వ్యాఖ్యానించారు. -
మనస్పర్థలు...అభివృద్ధిపై నీలినీడలు
నగరపాలక సంస్థలో అంతర్యుద్ధం మేయర్, కమిషనర్ మధ్య సమన్వయలోపం మేయర్ అనుమతికి విరుద్ధంగా ఎజెండాలోకి అంశాలు స్థాయీ సంఘం సమావేశంలో మరోసారి బయటపడిన విభేదాలు సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కమిషనర్ వి.విజయ రామరాజు, మేయర్ పంతం రజనీ శేషసాయిల మధ్య సమన్వయ లోపం నగర అభివృద్ధికి శాపంగా మారింది. కలిసి పని చేయాల్సిన మేయర్, కమిషనర్ ఎవరి దారి వారిదన్నట్లుగా కొద్ది నెలలుగా వ్యవహరిస్తుండడంతో కౌన్సిల్లో ఆమోదం పాందిన పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారంటే నగర అభివృద్ధిపై ఏ మేరకు నీలినీడలు కమ్ముకుంటున్నాయో బయటపడుతోంది. మూడు నెలలకోసారి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధిపై పలు నిర్ణయాలు తీసుకుంటారు. మిగిలిన రోజుల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రతి వారం మేయర్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో స్థాయీ సంఘం సమావేశం జరుగుతుంది. ఈ రెండు సమావేశాల్లో తీసుకున్న పలు ప్రతిపాదనలు, తీర్మానాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించి సభ్యుల ఆమోద ముద్రతో పనులకు శ్రీకారం చుట్టారు. దీనికి భిన్నంగా నిప్పూ, ఉప్పుగా కమిషనర్, మేయర్ ఉండడంతో వారం వారం జరగాల్సిన స్థాయీ సంఘం సమావేశం కూడా జరగడం లేదు. దీంతో ప్రగతి పడకేస్తోంది. మరోసారి విభేదాలుబట్టబయలు... తాజాగా సోమవారం జరిగిన స్థాయీ సంఘం సమావేశం వాయిదా పడడం మరోసారి మేయర్, కమిషనర్ మధ్య జరుగుతున్న వర్గపోరును బహిర్గతం చేసింది. గత నెల 25న 16 అంశాలతో రూపొందించిన ఎజెండాను నగరపాలక సంస్థ సెక్రటరీ మేయర్ అనుమతి కోసం పంపారు. అదే నెల 28న సమావేశం నిర్వహించాలని మేయర్ నిర్ణయించారు. అనంతరం సెక్రటరీ సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి కమిషనర్ ఆదేశాలతో మరో తొమ్మిది అంశాలు ఉన్నాయంటూ 28న మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పటికే నిర్ణయించిన ప్రకారం 16 అంశాలతో నవంబర్ 7న స్థాయీ సంఘం సమావేశం నిర్వíßంచాలని మేయర్ ఇన్ చార్జ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అధికారికి సూచించారు. అయితే సోమవారం 25 అంశాలతో కూడిన ఎజెండా స్థాయీ సంఘం సమావేశం ముందుకు వచ్చింది. తన నిర్ణయానికి వ్యతిరేకంగా 25 అంశాలతో ఎజెండా పెట్టడడంతో మేయర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే సమావేశాన్ని మేయర్ వాయిదా వేయడాన్ని అధికార పార్టీకి చెందిన సంఘ సభ్యులు వ్యతిరేకిస్తూ ఇన్ చార్జి సెక్రటరీకి లేఖ రాశారు. చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేకపోయినప్పటికీ సభ్యులు లేఖ రాయడం గమనార్హం. ఈ ఘటనతో మేయర్, అధికార పార్టీ సభ్యుల మధ్య ఉన్న లుకలుకలు మరింత ముదిరి పాకానపడ్డట్టయింది. -
సెల్‌టవర్‌లో అగ్నిప్రమాదం
రాజమండ్రి: ఓ భవనం పై ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్ టవర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ భవనం పై ఉన్న ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీల సంయుక్త టవర్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచరం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే టవర్ పూర్తిగా కాలి బూడిదైంది. -
ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
రాజమహేంద్రవరం క్రైం : ఆంధ్రాబ్యాంక్ విద్యుత్‌నగర్ బ్రాంచీలో చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దుండగుడు బ్యాంక్ వెనుక భాగంలోని గేటు నుంచి చొరబడి, షట్టర్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఏటీఎంను, మెయిన్ లాకర్ ను కూడా పగులగొట్టి చోరీకి యత్నించాడు. అవి ఫలించకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బుధవారం ఉదయం 8.30 కు బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఎంవీఎన్ మధుసూదనరావు బ్యాంక్ షట్టర్లు తెరిచి ఉండడాన్ని గమనించి, డీజీఎం భాస్కరరావుకు సమాచారమిచ్చారు. డీజీఎం ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి, క్రైం డీఎస్పీ త్రినాథరావు, తూర్పు మండలం డీఎస్పీ రమేష్‌బాబు, ప్రకాష్ నగర్ సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. బ్యాంక్‌లోని సీసీ ఫుటేజ్‌ను ఎస్పీ పరిశీలించారు. చీకటిగా ఉండడం వల్ల దుండగుడు స్పష్టంగా కనిపించలేదు. ప్రకాష్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టీటీకి పెరుగుతున్న ఆదరణ
మేయర్ రజనీ శేషసాయి రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ ప్రారంభం మూడు రోజులు జరగనున్న పోటీలు రాజమహేంద్రవరం సిటీ : టేబుల్ టెన్నిస్‌కు ఆదరణ పెరుగుతోందని మేయర్ పంతం రజనీ శేషసాయి అన్నారు. స్థానిక జేఎన్ రోడ్డులోని ఎస్వీ ఫంక్షన్ హాలులో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. మొదటి ఆటను మేయర్, కార్పొరేటర్ చండీప్రియ ఆడి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఏపీ టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు వి.భాస్కరరామ్ ఆధ్వర్యాన రాజమహేంద్రవరం టేబుల్ టెన్నిస్ అసోషియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలు మూడు రోజులపాటు జరగనున్నాయి. క్యాడెట్ బాలురు, బాలికలు; సబ్ జూనియర్ బాలురు, బాలికలు; జూనియర్ బాలురు, బాలికలు; యూత్ బాలురు, బాలికలు, మెన్ అండ్ వుమెన్ విభాగాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. మొదటి రోజు క్వాలిఫయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ వీఆర్ ముక్కామల తెలిపారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు తరలివచ్చారన్నారు. ఎనిమిది టేబుళ్లపై 600 మ్యాచ్‌లు నిర్వహిస్తామని, వీటికి 20 మంది రిఫరీలుగా వ్యవహరిస్తారని వివరించారు. చివరి రోజు 20 మ్యాచ్‌లు మాత్రమే ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం టోర్నమెంట్లో బాలుర విభాగం నుంచి 80, మెన్స్ 65, యూత్ 85, జూనియర్స్ 85 దరఖాస్తులు అధికంగా వచ్చాయన్నారు. చీఫ్ రిఫరీగా ఎం.వేణుగోపాల్ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్, టోర్నమెంట్ నిర్వాహకులు జేవీవీ అప్పారెడ్డి, వీటీవీ సుబ్బారావు, ఫల్గుణ్ తదితరులు పాల్గొన్నారు. -
మాసిపోతున్న ప్రభలు
సాక్షి, రాజమహేంద్రవరం :తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, కళల పరిరక్షణ, అధ్యయనమే ధ్యేయంగా తెలుగు భాష ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి ఎ¯Œæటీ రామారావు 1985లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దానికి అనుబంధంగా తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో 1987లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠానికి అంకురార్పణ చేశారు. ప్రవేశాలు, పరిశోధనలతో మొన్నటివరకూ ఈ పీఠం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది. కానీ రాష్ట్ర విభజన అనంతరం పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఆ ప్రభలు మాసిపోతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో రాజమహేంద్రవరంలోని సాహిత్య పీఠంతోపాటు, కూచిపూడి, శ్రీశైలంలోని పీఠాల్లో ప్రవేశాలు, బోధనలకు అతీగతీ లేకుండా పోయింది. దీనిపై తెలుగు భాషావేత్తల ఆందోళనల నేపథ్యంలో రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వ విద్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఏడాది కిందట ఇచ్చిన ఈ హామీ ఎప్పటిలానే అమలుకు నోచుకోలేదు. ఏవీ నాటి కళకళలు? ఏటా 40 మంది పీజీ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, 19 మంది పీహెచ్డీ విద్యార్థులతో రాజమహేంద్రవరం సాహిత్య పీఠం కళకళలాడేది. ప్రస్తుతం ఆ వెలుగులు కరువయ్యాయి. తెలంగాణ పరిధిలోకి వెళ్లిన తెలుగు విశ్వ విద్యాలయం ఆరు నెలలు ఆలస్యంగా ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. దీంతో పీజీలో 20 సీట్లకుగానూ తొమ్మిది మందే చేరారు. వీరికి కూడా సకాలంలో పరీక్షలు నిర్వహించలేదు. ఎనిమిది మంది అధ్యాపకులకుగానూ ఒక్కరే బోధన చేస్తున్నారు. అధ్యాపకుల కొరత కారణంగా మొదటి సంవత్సరం పాఠ్యాంశాలు పూర్తయ్యేసరికే మొదటి సంవత్సరం విద్యార్థులు రెండో ఏడాదిలోకి వెళ్లిపోయారు. కానీ, వీరంతా ప్రస్తుతం మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్న దుస్థితి నెలకొంది. ముగ్గురు విద్యార్థులు మాత్రమే పీహెచ్డీ చేస్తున్నారు. పరిశోధనలు చేసి పత్రాలు సమర్పించిన వందలాది మంది విద్యార్థులకు అధ్యాపకుల కొరత కారణంగా ఇప్పటికీ పట్టాలు అందలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా పీజీ మొదటి ఏడాది ప్రవేశాలకు అనుమతి లభించలేదు. దీంతో తెలుగు భాష అభ్యసించాలనుకున్న ఔత్సాహిక విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వారి మాతృభాష పరిరక్షణకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పరిశోధనలకు పెద్ద పీట వేయడం వంటి అనేక చర్యలు చేపడుతూండగా.. మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉండడం దురదృష్టకరమని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 513 మంది విద్యార్థులకు ఎంఏ, 390 మందికి ఎంఫిల్, 341 మందికి పీహెచ్డీ పట్టాలు అందించిన ఘన చరిత ఉన్న సాహిత్య పీఠానికి పూర్వవైభవం తేవాలని కోరుతున్నారు. మాటలు అలా.. చేతలు ఇలా.. తెలుగు వ్యావహారికా భాషోద్యమానికి నేతృత్వం వహించిన ‘ఆది’ గురువు గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తెలుగును పరిరక్షిస్తామని ప్రసంగాలు.. కవులు, రచయితలకు సత్కారాలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. మరోపక్క తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకుండా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. గతంలో డిగ్రీ మొదటి ఏడాది రెండు సెమిస్టర్లు, రెండో ఏడాది రెండు సెమిస్టర్లలో తెలుగు సబ్జెక్ట్ ఉండేది. ప్రస్తుతం మొదటి మూడు సెమిస్టర్లకే తెలుగును పరిమితం చేశారు. రెండో ఏడాది నాలుగో సెమిస్టర్‌ను ఎత్తివేశారు. దీనివల్ల తెలుగులో ఎంఏ చేయాలనుకున్న విద్యార్థులకు అవకాశం ఉండదు. ఫలితంగా నూతన ఉపాధ్యాయుల రాక తగ్గిపోయి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు భాష బోధన కుంటుపడనుంది. -
కడుపుకోత మిగిల్చిన క్షణికావేశం
క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులను బలిగొంది. అప్పటి వరకూ తల్లితో కలసి ఆడుకున్న చిన్నారులు.. కొద్ది క్షణాల్లోనే మృత్యు ఒడికి చేరారు. వారిని ఎత్తుకున్న తల్లి అమాంతం గోదావరిలోకి దూకగా, తల్లి ఆప్యాయంగా ఎత్తుకుందనుకున్నారు కానీ, తమను బలి చేసేందుకు మృత్యుదేవతగా మారిందని పనిగట్టలేకపోయారు వారు. – రాజమహేంద్రవరం క్రైం/ కడియం/ ధవళేశ్వరం వేమగిరి గ్రామానికి చెందిన పసువాదుల విజయలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో గోదావరిలోకి దూకిన సంఘటనలో, చిన్నారులు మరణించగా.. జాలర్లు కాపాడడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ధవళేశ్వరం సీఐ ఆశీర్వాదం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేమగిరికి చెందిన పసువాదుల విజయలక్ష్మికి సత్యసుబ్రహ్మణ్యం ఆచార్యులుతో వివాహమైంది. వీరికి పిల్లలు ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల సత్చ్చంద్రాచార్యులు, నర్సరీ చదువుతున్న మూడేళ్ల శ్రీనిధి ఉన్నారు. ఆచార్యులు కోకోకోలా కంపెనీలో, విజయలక్ష్మి టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆచార్యులు బావ మరణించడంతో తన అక్క, ఆమె ఇద్దరు పిల్లలు, ఆచార్యులు తల్లిదండ్రులు కూడా వీరి వద్దే ఉంటున్నారు. దీంతో వేరే కాపురం పెడదామని విజయలక్ష్మి ఎప్పటి నుంచో భర్తను కోరుతోంది. అందుకు భర్త నిరాకరించడంతో, మనస్తాపం చెందిన విజయలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం భర్త ఇంటి వద్ద ఉండగానే పిల్లలను తీసుకుని ఆమె బయటకు వచ్చింది. హాస్పటల్‌కు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పింది. ధవళేశ్వరంలోని రామ పాదాల రేవు వద్దకు చేరుకుని, అక్కడున్న ఆశ్రమం వద్ద చాలాసేపు కూర్చుంది. ఈ సమయంలో భర్త ఆచార్యులు ఫోన్ చేసి, ఎక్కడున్నావని అడిగితే, స్నేహితురాలి ఇంటి వద్ద ఉన్నట్టు చెప్పింది. అనంతరం సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసింది. చాలాసేపటి వరకు తల్లితో చిన్నారులు ఆడుకున్నారు. సాయంత్రం 6.30 ప్రాంతంలో ఇద్దరు పిల్లలను ఎత్తుకుని, రేవు నుంచి గోదావరిలోకి దిగిపోయింది. దీనిని అక్కడున్న ఓ యువకుడు గమనించి కేకలు వేశాడు. అక్కడున్న జాలర్లు అప్రమత్తమై, మోటారు నావలో విజయలక్ష్మి వద్దకు చేరుకున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను కాపాడారు. ఇద్దరు పిల్లలు నదిలో కొట్టుకుపోయారు. ఒడ్డుకు చేరిన విజయలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. కొద్దిసేపటి తర్వాత పనివాళ్ల మృతదేహాలను జాలర్లు ఒడ్డుకు చేర్చారు. భర్త ఆచార్యులు ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. తీరని వేదన మిగిలింది కుటుంబ కలహాలతో విజయలక్ష్మి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కన్నబిడ్డలను తీసుకుని ఆమె చేసిన ఆత్మహత్యా యత్నం.. ఆమెకే కడుపుకోతను మిగిల్చింది. ఇంటి నుంచి బయలుదేరి, గోదావరి ఒడ్డుకు చేరుకునే వరకూ ఆమె పిల్లలతోనే ఆనందంగా గడిపింది. తమను ఎక్కడికి తీసుకెళుతుందో తెలియక పిల్లలు అమాయకంగా ఆమె వెంట నడిచారు. పిల్లలతో ఆమె నదిలో దూకడంతో, చిన్నారులు నీరు తాగి మరణించారు. జాలర్ల సాయంతో ఒడ్డుకు చేరిన ఆమె పిల్లలు చనిపోయారన్న విషయం తెలిసి అపస్మార స్థితికి చేరుకుంది. ఇంతటి పరిస్థితి ఎదురవుతోందని ఊహించని కుటుంబ సభ్యులూ తీవ్ర శోకంలో మునిగిపోయారు. వేమగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రాజమహేంద్రవరంగా పేరు మార్చండి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరం పేరును ఇంకా చాలా ప్రాంతాల్లో, చాలామంది రాజమండ్రిగానే వినియోగిస్తున్నారని రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్డీఓ శ్రీరామచంద్రమూర్తి అన్నారు. వెంటనే ఆ పేరు మార్చాలని సూచించారు. నగరంలోని సినిమా థియేటర్లు, హోటళ్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో మంగళవారం ఆయన సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమండ్రికి బదులుగా రాజమహేంద్రవరం అని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర సంస్థలన్నీ తమ బోర్డులు, తదితర విషయాల్లో రాజమహేంద్రవరం అనే రాయాలన్నారు. -
చింతూరు లో పేలిన మందుపాతర
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి- పేగ మార్గంలోని శుక్రవారం మందు పాతర పేలింది. దీనిని మావోయిస్టులు అమర్చినట్లుగా అనుమానిస్తున్నారు. అటవీప్రాంతంలో సంభవించిన ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనా స్థలిని జిల్లా పోలీసు అధికారులు పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. -
విద్యుత్ శాఖ గెస్ట్‌హౌస్‌లో రాసలీలలు..
రాజమహేంద్రవరం: బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ అధికారి గెస్ట్ హౌస్‌లో మహిళతో సరసాలాడుతూ.. పోలీసులకు చిక్కాడు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) చింతూరు ఏడీఈ మధుసూదనరావు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో మహిళతో రాసలీలలాడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలు.. మధుసూదనరావు శ్యామలానగర్‌లోని పాత సోమాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఏపీ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ గెస్ట్‌హౌస్‌లో ఒక మహిళతో ఉండగా శనివారం పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని విచారించగా.. మోహన్ అనే కాంట్రాక్టర్ రూమ్ బుక్ చేశాడని.. పని ఉంది రమ్మంటే తాను వచ్చానని బుకాయించడానికి యత్నించాడు. కాగా శుక్రవారం రాత్రి అదే గదిలో మరో యువతితో గడిపినట్టు పోలీసులు సాక్ష్యాలతో సహా చెప్పేసరికి గతుక్కుమన్నాడు. మధుసూదనరావుతో పాటు అతనితో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని కోర్టుకు తరలిస్తామని తెలిపారు. కాగా మధుసూదనరావు గతంలో రెండుసార్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. -
లారీ బోల్తా: ఇద్దరికి గాయాలు
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయాల పాలయ్యారు. పోర్టు రోడ్డులోని గామన్ వంతెన లారీ బోల్తా పడగా డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. క్రేన్‌ను తెప్పించి డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. -
రాజమండ్రి తొలి మేయర్ మృతి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పొరేషన్ తొలిమేయర్ ఎంఎస్ చక్రవర్తి(50) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటు రావడం వల్ల ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. టీడీపీకి చెందిన చక్రవర్తి 2002 నుంచి 2006 వరకు రాజమండ్రి మేయర్‌గా పనిచేశారు. ఆయన మృతితో రాజమండ్రిలో విషాదం నెలకొంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు చక్రవర్తి మృతి పట్ల సంతాపం తెలియజేశారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రాజమండ్రి: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక అపార్ట్‌మెంట్‌ను కేంద్రంగా చేసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 3 లక్షల నగదుతో పాటు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టంగ్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
గంగానమ్మకు గిరిజన మహిళ బలి
-
గంగానమ్మకు గిరిజన మహిళ బలి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన వై రామవరం మండలం చింతకర్ర పాలెంలో ఓ గిరిజన మహిళను స్థానికులు బలిచ్చారు. ఆమె వల్లే తమ గ్రామానికి అరిష్టం చుట్టుకుందనే మూఢనమ్మకంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, గత కొద్ది రోజులుగా ఓ పదిమంది వ్యక్తులు ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని వారే లేని పోని నమ్మకాలు అమాయక గిరిజనులకు కల్పించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లగా చింతకర్ర గ్రామంలో గంగానమ్మ దేవత ఆలయం ఉంది. దానికి ఎదురుగానే కేర చినలక్ష్మీ అనే గిరిజన మహిళ ఇళ్లు ఉంది. ఆమె ఆ గ్రామంలో కూలీ చేసుకొని బతుకుతుంటుంది. అయితే, ఇటీవలె ఆ గ్రామంలో ఓ సోది చెప్పే మహిళ గ్రామానికి అరిష్టం చుట్టుకుందని, అందువల్లే వర్షాలు రావడం లేదని, పంటలు పండలేదని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారితో కూడి స్థానికులు ఆమెను గంగానమ్మ దేవతకు బలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ఆమెను బలిచ్చే సమయంలో చిత్ర హింసలకు గురిచేసేముందు ఎన్ని అరుపులు అరిచినా కనీసం ఒక్కరు కూడా సహాయం చేసేందుకు రాలేదు అని తెలుస్తోంది. ఆమె శరీరంపై కర్పూరం పెట్టి గాయపరిచారని, అనంతరం తలపై చెంబుతో బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు. -
టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
రాజమండ్రి: టీడీపీ నేతలపై రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమది నీతి, నిజాయితీలతో కూడిన పార్టీ అని.. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. గురువారం ఉదయం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుసుకుని మాట్లాడాలని రాజేంద్రప్రసాద్ అనటం సరికాదన్నారు. తమకు టీడీపీ నాయకులు హితభోద చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించటంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టీడీపీ దేనని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగానా, వ్యక్తిగతమా అనేది స్పష్టం చేయాలని రాజేంద్రప్రసాద్ బుధవారం డిమాండ్ చేశారు. -
ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా దగ్థమైంది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ తీయడం వల్లే మంటలు చెలరేగయని తెలుస్తోంది. ట్యాంకర్ డ్రైవర్ వెంటనే అప్రమత్తం అవ్వడంతో ఘోర ప్రమాదం తప్పింది. మంటలను గుర్తించిన వెంటనే డ్రైవర్ వాహనాన్నిరోడ్డు పక్కన ఆపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. -
రాజమండ్రిలో రియల్టర్ దారుణహత్య
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం నాగదేవి థియేటర్ సమీపంలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి కోర్లంపేటకాలనీకి చెందిన కటికతల వెంకట శేషు(53)గా గుర్తించారు. శేషును గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. వ్యాపార లావాదేవీల్లో గొడవ జరగడం వల్లే హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
వాహనం ఢీకొని యువకుడి మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నయువకుడిని ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిచెందిన యువకుడు రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన శివ(18)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'3 నిమిషాల్లోనే స్నానాలు ముగించండి'
రాజమండ్రి : తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు గోదావరి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. కోటిలింగాల రేవులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గంటలకు 70 వేల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా గోదావరిలో బ్యాక్టీరియా పెరుగుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకోలీ బ్యాక్టీరియా విజృంభిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలాంటి నీళ్లలో ఎక్కువ సేపు ఉండరాదని వారు పేర్కొన్నారు. ఈకోలి బ్యాక్టీరియా ఉన్నందున 3 నిముషాల్లోనే భక్తులు స్నానాలు పూర్తి చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
వర్షంలోనే పుణ్యస్నానాలు
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో తొమ్మిదవ రోజు బుధవారం భక్తుల తాకిడి కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం, పట్టిసీమ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. భక్తులు వర్షంలోనే గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర ఘాట్ భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోనే ఉదయం భారీ వర్షం కురుస్తోంది. -
పుష్కర స్నానమాచరించిన ఎమ్మెల్యే రోజా
-
పుష్కర స్నానమాచరించిన ఎమ్మెల్యే రోజా
రాజమండ్రి: రాజమండ్రి వీఐపీ పుష్కరఘాట్ వద్ద సందడి నెలకొంది. ఉదయం నుంచి పలువురు వీఐపీలు పుష్కరస్నానాలకు క్యూకట్టారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా కుటుంబ సమేతంగా వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. గోదావరమ్మ తల్లికి నీరాజనాలు అర్పించారు. కాగా వరుస సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో రాజమండ్రి వైపు వెళ్లే రహదారులు వాహనాలతో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలుచోట్ల వాహనాలు పెద్ద ఎత్తున స్తంభించిపోయాయి. -
18న ఏపీ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ త్వరలో సమావేశం నిర్వహించనుంది. తన కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 18న(శనివారం) రాజమండ్రిలో సమావేశం నిర్వహించనున్నారు. రాజమండ్రి షెల్టాన్ హోటల్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. గోదావరి పుష్కరాల నిర్వహణ, రాజధాని మాస్టర్ ప్లాన్‌పై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. -
మరో బోటు ఆచూకీ లభ్యం
రాజమండ్రి: ఈ నెల 16వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ గల్లంతయిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ బోటు బంగ్లాదేశ్ తీరానికి చేరుకుంది. ఈ బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగివచ్చారు. వీరంతా తొండంగి మండలం పాతపెరుమాళ్లపురానికి చెందిన మత్య్సకారులు. మరోవైపు కాకినాడ దుమ్మలపేటకు చెందిన మత్స్యకారులు ఇప్పటికీ విశాఖతీరంలో లంగరు వేసిన ఓ ప్రైవేటు నౌకలోనే ఉన్నారు. ఇంజన్ చెడిపోవడంతో సముద్రంలో చిక్కుకున్న వీరిని ఈ నెల 22న ఓ ప్రైవేట్ మర్చంట్ నౌక రక్షించింది. 23న ఈ నౌక విశాఖ తీరానికి చేరుకున్నా..పోర్టులోకి అనుమతి లేకపోవటంతో తీరంలోనే లంగరు వేసింది. ఐతే ఈ నౌకలో ఉన్న ఏడుగురు మత్స్యకారులను కాకినాడ తీసుకువచ్చేందుకు అధికారులు చొరవచూపించడం లేదు. నౌక పోర్టులోకి వచ్చిన తర్వాతే కాకినాడకు తీసుకు వస్తామని మత్స్యకారులకు అధికారులు సూచిస్తున్నారు. -
కోటి లింగాల రేవును సందర్శించిన బాబు
రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాజమండ్రిలోని కోటి లింగాల రేవును పరిశీలించారు. ఈ నెల చివరిలోగా ఘాట్లకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. త్వరిత గతిన ఘాట్ పనులు పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. పనుల విషయంలో జాప్యం జరిగితే సహించేది లేదని అన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో శరవేగంగా నది ప్రవాహ ప్రాంతంలోని పలు చోట్ల పుష్కర స్నానాల కోసం ఘాట్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. -
గొంతు కోసుకుని ఖైదీ ఆత్మహత్యాయత్నం
రాజమండ్రి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ సత్యనారాయణపురంకు చెందిన టి.మోహన వెంకట దుర్గా ప్రసాద్ ఓ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రాజమండ్రి జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. అయితే, తనకు న్యాయవాదిని కేటాయించలేదంటూ దుర్గా ప్రసాద్ సోమవారం మధ్యాహ్నం స్నానాల గది తలుపు రేకుతో పీక కోసుకున్నాడు. రక్తస్రావం అవుతున్న అతన్ని జైలు సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. -
రాజమండ్రిలో చోరీ
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగరంలోని హుకంపేటలోని ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో సోమవారం రాత్రి జొరబడిన దుండగులు 100 గ్రామాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే అరకిలో వెండి వస్తువులును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు. -
రాజమండ్రిలో గవర్నర్
తూర్పుగోదావరి(రాజమండ్రి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం రాజమండ్రిలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కోటిలింగాలఘాట్‌ను పరిశీలించారు. కోరకొండ మండలం శ్రీరంగపట్నంలో ‘నీరు - చెట్టు’ కార్యక్రమంలో పాల్గొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.ఆలయంలో చిన్నారులు చేస్తున్న నృత్యాన్ని గవర్నర్ దంపతులు తిలకించారు.