
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ గెలవడం కోసం 2014 ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలన్నారని.. బాబు వచ్చాడు కానీ జాబ్ ఎవరికి రాలేదని రాజమండ్రి వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భారత్‌రామ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి పార్లమెంటు పరిధిలో పది ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో స్కిల్ డెవెలప్‌మెంట్ ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
కేవలం కంప్యూటర్ సైన్స్ కాకుండా అన్ని విభాగాలకు సంబంధించిన విద్యార్ధులకు స్కిల్ డెవెలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అర్హులందరికి సంక్షేమ పధకాలు అందాలని ఉద్దేశంతో వైఎస్ జగన్ శ్రమిస్తున్నారని మార్గాని భరత్ తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం సీఎం జగన్ మార్పుకు నాంది పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన చేసిన విధంగా హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయని ఎంపీ మార్గాని భారత్ రామ్ తెలిపారు.