skill developement centre
-
నైపుణ్య శిక్షణలో విశ్వరూపం
సాక్షి, విశాఖపట్నం: ‘యువత మన భవిష్యత్తు. చదువులు, నైపుణ్య శిక్షణలో సమూల మార్పులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నాం. రాబోయే రోజుల్లో నైపుణ్య శిక్షణలో విశ్వరూపం చూపిద్దాం. అందుకే ఈ ‘భవిత’ కార్యక్రమం’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడాప్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమాన్ని మంగళవారం విశాఖలోని పీఎంపాలెం వి–కన్వెన్షన్ హాల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, విడదల రజని, పారిశ్రామిక ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... జాబ్ ఓరియెంటెడ్‌గా రాష్ట్ర్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చి అనుసంధానించే కార్యక్రమ్రాన్ని నిర్వహిస్తున్నాం. ఏ చదువైనా జాబ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. క్వాలిటీ చదువులు మనకు అందుబాటులో లేకపోతే పూర్తిగా వ్యర్థమైపోయినట్లే. అందుకే జాబ్ ఓరియెంటెడ్‌గా క్వాలిటీ చదువులతో మార్పులు తెస్తున్నాం. నాణ్యమైన విద్యని స్కూల్స్ నుంచి కాలేజీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు.. అన్ని చోట్లా అందిస్తూ అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేయడం నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా ఎలా ముందుకు వెళ్తున్నామో అందరికీ తెలిసిందే. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్, టోఫెల్ శిక్షణ, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్ ద్వారా విద్యలో నాణ్యత పెంచుతున్నాం. డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ఇలాగే అడుగులు వేస్తున్నాం. ♦ తొలిసారిగా కాలేజీల్లో కరిక్యులమ్ మార్చడం, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ, తప్పనిసరి ఇంటర్న్‌షిప్, ఆన్లైన్ వర్టికల్స్, క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగం చేయడం లాంటివన్నీ చేస్తున్నాం. హార్వర్డ్, ఎల్సీఈ, ఎల్బీఎస్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల కోర్సులను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చి సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం. వాటి ద్వారా దరఖాస్తు చేసుకుంటే మంచి జీతాలతో ఉన్నత ఉద్యోగాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తరహా మార్పు ఒకటో తరగతి చదువుతున్న పిల్లాడి దగ్గర నుంచే మొదలవుతోందని గర్వంగా చెబుతున్నా. ♦ ఐటీఐ, పాలిటెక్నిక్, స్కిల్ కాలేజీల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. వచ్చే టర్మ్‌లో ఈ మార్పులు విశ్వరూపం దాలుస్తాయి. తొలిసారిగా 158 పారిశ్రామిక సంస్థలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కలిపి మొత్తం 208 ఇన్స్టిట్యూషన్లు మన పిల్లల ట్రైనింగ్, కోర్సుల్లో భాగస్వాములై శిక్షణ అందించి ఉద్యోగాలిచ్చే కార్యక్రమం జరుగుతోంది.దాదాపు 87 పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే 2019కి ముందు (టీడీపీ హయాంలో) అక్రిడిటేషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీ కేవలం ఒక్కటి మాత్రమే ఉండటం దురదృష్టం. కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువులు ఎలా ఉన్నాయి? అక్రిడిటేషన్ ఉందా? అనేది కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఎన్బీఏ అక్రిడిటేషన్‌ని 32 పాలిటెక్నిక్ కాలేజీలు పొందాయి. క్వాలిటీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేస్తాం. హబ్ ద్వారా ఒకే చోట ఐటీఐ, పాలిటెక్నిక్, పదోతరగతి డ్రాపవుట్స్ కోసం ట్యూటరింగ్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో స్కిల్ కాలేజీ ఉంటుంది. వీటన్నింటి పైన ఒక స్కిల్ యూనివర్సిటీ కోర్సుల్ని డిజైన్ చేస్తుంది. పరిశ్రమల్ని కాలేజీల్లో భాగస్వాముల్ని చేస్తుంది. చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం వచ్చేలా అడుగులు పడుతున్నాయి. ♦ ఇప్పటివరకూ 53 వేల మంది శిక్షణ పూర్తి చేసుకొని 26 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన భవిత కార్యక్రమం ఇకపై పైలట్‌గా కాకుండా ప్రతి నియోజకవర్గంలో విస్తరించే దిశగా శ్రీకారం చుడుతున్నాం. సీఎం సమక్షంలో ఎంవోయూలు ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి నైపుణ్య శిక్షణ అందించేందుకు పలు సంస్థలు ఆరు ఎంవోయూలు చేసుకున్నాయి. ♦ విశాఖ పోలీస్ కమిషనరేట్‌తో మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యుర్షిప్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వైజాగ్ పోలీస్ వర్క్‌ఫోర్స్ నైపుణ్య సామర్థ్యాలు పెంపొందించేలా జాయింట్ సర్టిఫికేçÙన్ కోర్సులు అందించేలా సహకారం అందించనున్నారు. ♦ ఏపీఎస్ఎస్డీసీతో హియర్ టెక్నాలజీస్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు లొకేషన్ సొల్యూషన్స్ కోసం ప్లాట్ ఫామ్ అందించేలా 60–90 రోజుల సర్టిఫికేషన్ కోర్సు అందించేందుకు ఒప్పందం జరిగింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ, తాజ్హోటల్స్, ఎస్ఐహెచ్ఎం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పర్యాటకం,హాస్పిటాలిటీ రంగంలో శిక్షణ అందించడం, ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు, ఉపాధి అవకాశాలు సృష్టించేలా ఒప్పందం కుదిరింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ, డిక్సన్ టెక్నాలజీస్, నాలుగు ఐటీఐలు, మూడు పాలిటెక్నిక్ కాలేజీల మధ్య ఎలక్ట్రానిక్, మెకానికల్ రంగంలో ఇండస్ట్రీ స్పెసిఫిక్ ల్యాబ్ ఏర్పాటు చేయడం, పరిశ్రమకు అనుగుణంగా శిక్షణ, ఉపాధి పొందేలా ట్రైనింగ్ ఇవ్వడం మొదలైన అంశాల్ని అందించేలా ఎంవోయూ జరిగింది. ♦ వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఏపీఎస్ఎస్డీసీ మధ్య ఎంవోయూ జరిగింది. కాలేజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపించనున్నారు. వీల్స్ ఇండియా ద్వారా అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అందించనున్నారు. ♦డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ఎడ్యుకేషన్, అవెరా ఏఐ మొబిలిటీ మధ్య ఈవీ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపనకు మార్గం సుగమం చేసేలా, పరిశ్రమలు సందర్శించేందుకు ఏర్పాటు చేసేలా ఎంవోయూ జరిగింది. ♦ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(డీఈటీ), ఎల్ అండ్ టీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీఐ కోర్సులతో సమానంగా ఈ లెర్నింగ్ మాడ్యుల్స్ అందించడం, ఎల్ అండ్ టీ బృందం ద్వారా విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాన్ని ఈ ఎంవోయూ ద్వారా అందించనున్నారు. 10 స్కిల్ సెంటర్లకు శంకుస్థాపన.. ఎంపీ ల్యాడ్స్ ద్వారా రూ.7 కోట్లతో 10 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.44.32 కోట్లతో 43 పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణ పనులను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.43.77 కోట్లతో 22 ఐటీఐల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భవిత కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు భవిత లోగో, యాంథమ్, స్కిల్ యూనివర్స్ యాప్, ఫ్లాగ్‌ని ఆవిష్కరించారు. అంతకు ముందు వీ కన్వెన్షన్‌కు చేరుకున్న సీఎం తొలుత స్కిల్ ఇన్స్టిట్యూట్స్ స్టాల్స్‌ని సందర్శించారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీలు తయారీ, విమాన విడిభాగాల తయారీ శిక్షణ తదితర స్టాల్స్‌ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. -
Oct 12th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Live Updates.. 09:13 PM చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు: హెల్త్ బులిటెన్ ►చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసిన జైలు అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది బీపీ: 140/80 టెంపరేచర్: నార్మల్ పల్స్: 87 Spo2: 97 Heart: s1 s2 Lungs: క్లియర్ ఫిజికల్ యాక్టివిటీ : గుడ్ ►చర్మ సంబంధిత సమస్య గురించి చంద్రబాబు జైలు అధికారులకు తెలియజేశారు ►జైల్లో వైద్యాధికారిణి పరీక్ష చేసి మాకు నివేదిక ఇచ్చారు ►మా అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి చర్మవ్యాధి నిపుణులు వచ్చి చంద్రబాబును పరీక్షించారు ►చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది ►ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు :::రాజ్ కుమార్ , డిప్యూటీ సూపరిండెంట్, రాజమండ్రి కేంద్ర కారాగారం 08:46 PM సుప్రీంకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు ►ఫైబర్ నెట్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు ►మంగళగిరి పోలీస్ స్టేషన్ హెడ్(SHO) ను ప్రతివాదిగా చేరుస్తూ పిటిషన్ 08:38 PM రేపు సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ విచారణ ►రేపు చంద్రబాబు లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ ►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం ►సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా ? లేదా? అన్నది తేల్చనున్న సుప్రీం కోర్టు ►చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన హరీష్ సాల్వే ►రేపు సీఐడీ తరపు వాదనలు వినిపించనున్న రోహత్గి, రంజిత్ కుమార్ 07:35 PM మరికాసేపట్లో చంద్రబాబు హెల్త్ బులిటెన్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు డెర్మటాలజీ ప్రాబ్లం ►స్పెషలిస్ట్ వైద్యులకు రిఫర్ చేసిన జైలు అధికారులు ►చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన రాజమండ్రి జీజీహెచ్ డెర్మటాలజిస్టులు ►కొన్ని మెడిసిన్స్, లోషన్లు వాడాలని సూచించిన వైద్యులు ►చంద్రబాబు ఒంటిపై రేషస్తో అలర్జీ:డాక్టర్ సత్యనారాయణ ►చర్మ సమస్యకు మందులు రాసిచ్చాం:డాక్టర్ సత్యనారాయణ ►మరి కొద్దిసేపట్లో చంద్రబాబు హెల్త్ బుల్ టెన్ విడుదల చేయనున్న జైలు అధికారులు 07:15 PM ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? సీఎంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే.. మంత్రి హోదాలో కొడుకు నారా లోకేష్ కూడా అవినీతి బాటలోనే.. కేవలం పాలు, పెరుగు వ్యాపారం చేసి కోట్లు సంపాదించారని నారా భువనేశ్వరి అనడం జోక్ పాలు, పెరుగుతో కోట్లు ఎలా సంపాదించారో ఆ కిటుకు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపి ఫైబర్ నెట్ లో స్కాం జరిగింది :::ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పున్నూరు గౌతమ్ రెడ్డి 06:55 PM రాజమండ్రి జైలుకు చేరుకున్న వైద్య బృందం ►టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ►జైల్లో వైద్య పరీక్షల కోసం వెళ్లిన జీజీహెచ్ వైద్య బృందం ►చంద్రబాబును పరీక్షించనున్న డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీతల బృందం 06:31 PM ముగిసిన నారాయణ అల్లుడి విచారణ.. మళ్లీ పిలిచే ఛాన్స్ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ విచారణ ►అమరావతిలో భూముల కొనుగోలు లావాదేవీల పై ప్రశ్నించిన సీఐడీ ►సీఐడీ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పునీత్ ►మాటి మాటికి కార్ లోకి వెళ్లి ఫోన్ మాట్లాడి విచారణకు హాజరైన పునీత్ ►ఎన్ స్పైరా నుండి ఎందుకు రామకృష్ణ హౌసింగ్ కి డబ్బులు పంపారు? ►రామకృష్ణ హౌసింగ్ నుండి మళ్ళీ నిధులు ఎందుకు ఎన్ స్పైరా సంస్థకు వచ్చాయి? ►అమరావతిలో చట్టవిరుద్దంగా అసైన్డ్ భూములు ఎందుకు కొనుగోలు చేశారు? ►అమరావతి రైతులకు చెల్లించే కౌలు మొత్తం నారాయణ సంస్థల ఖాతాలోకి ఎందుకొచ్చాయి? ►నారాయణ ద్వారా IRR అలైన్మెంట్ మార్పుల సమాచారం పొందిన విషయంపై ప్రశ్నలు ► పునీత్ ని మరోసారి సీఐడీ ప్రశ్నించే అవకాశం 06:12 PM చంద్రబాబు కోసం డెర్మటాలజిస్ట్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు ►చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్య ►వెంటనే అప్రమత్తమైన జైలు అధికారులు ►రాజమండ్రి జీజీహెచ్ నుంచి డెర్మటాలజిస్టు రాక ►వెను వెంటనే పరీక్షలు చేయించిన జైలు అధికారులు ►చంద్రబాబు విషయంలో నిరంతరం అలర్ట్ గా ఉన్న జైలు అధికారులు ►జైలు వద్ద గట్టి భద్రత కూడా 05:30 PM చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత ►రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు నాయుడికి స్వల్ప అస్వస్థత ► చర్మ సంబంధితగా గుర్తింపు ►చర్మ వ్యాధి వైద్య నిపుణులను పంపించాలని జైలు అధికారులు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంటుకు లేఖ ►అత్యవసరంగా పంపించాలని లేఖలో వినతి ►ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరును కేటాయించిన జీజీహెచ్ అధికారులు 4:52 PM అమిత్ షాకు అన్నీ చెప్పా: నారా లోకేష్ ►కేంద్ర హోం మంత్రి కలవాలనుకుంటున్నట్టు కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు. ►చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై హోం మంత్రి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించా. ►చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాను. ►ఆయనకు భద్రతా పరంగా ఉన్న ఆందోళన గురించి కూడా చెప్పాను. ►సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. ►అన్నింటి గురించి అమిత్ షాకు చెప్పా. ►అరెస్ట్‌లో బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు. ►నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరా. 04:20 PM ఫైబర్‌నెట్ పీటీవారెంట్కు కోర్టు అనుమతి ►ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం ►చంద్రబాబు పీటీ వారెంట్‌ను ఆమోదించిన ఏసీబీ కోర్టు ►పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ పోలీసులు ►సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశం ►ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలన్న కోర్టు ►రేపటి సుప్రీం తీర్పు వస్తే.. ఇంటర్వెన్ కావొచ్చని బాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచన 03:13 PM లోకేష్ ప్రధాన అనుచరుడి ఇంట ఐటీ సోదాలు ►టీడీపీ నేత, నారా లోకేష్ ప్రధాన అనుచరుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు ►కాకినాడలో.. మూడు బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ►దాదాపు 5 గంటలకు కొనసాగుతున్న సోదాలు ►ఆక్వా, క్వారీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టిన చంద్రమౌళి ►ఆదాయంలో తేడాలు చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ ►బినామీ ల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిన్నట్లు గుర్తింపు 02:51 PM ఒక్క సెంట్ భూమి కూడా పంచని ఘనత చంద్రబాబుది ►చంద్రబాబు జైల్లో కూర్చుంటే సొంత పుత్రుడు బాగానే ఉన్నాడు ►దత్తపుత్రుడు మాత్రం రోడ్లు మీద దొల్లుతున్నాడు ►గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమిని కూడా కొనలేదు ►ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చి కొత్తగా ఊర్లు నిర్మించిన ఘనత సీఎం జగన్‌ది ►ఓట్లు లేని విద్యార్థులు కోసం కూడా 65వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్ సర్కార్‌ది :::మంత్రి కారుమూరి కామెంట్స్ 02:10 PM అమ్మా.. మీ మరిది అవినీతికి పాల్పడ్డాడు ►చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు ►13సార్లు సంతకం పెట్టినా.. చట్టం వర్తింపజేయడానికి వీల్లేదని ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ►ఒక ఫేక్ ఎగ్రిమెంట్‌తో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది. ►ఆ ఒప్పందం ఫేక్ అని.. తమకు సంబంధం లేదని సీమన్స్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ►సాక్షాత్తు మీ మరిది ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ చేశారో.. ఆయన పీయే వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ►అంతేకాదు రూ.119 కోట్లకు సంబంధించి వ్యవహారంలో నోటీసులు కూడా ఇచ్చింది ►బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్ 1/3. అమ్మా పురందేశ్వరిగారూ... మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. 2/3. ఒక ఫేక్ ఎగ్రిమెంట్‌తో స్కిల్… pic.twitter.com/nuT2FCcX9X — Vijayasai Reddy V (@VSReddy_MP) October 12, 2023 02:09 PM ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు అర్హుడు కాడు ►అంగళ్ల విధ్వంసం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ►తీర్పు రిజర్వ్ చేసి రేపు వెల్లడిస్తామన్న కోర్టు ►పోలీసుల తరఫున న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు నాయుడు అంగళ్ళలో కార్యకర్తలను రెచ్చగొట్టాడు ►చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఎలా రెచ్చగొట్టాడో మా దగ్గర ఆధారాలు ఉన్నాయ్ ►అంగళ్ళలో చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టిన వీడియోలను పెన్ డ్రైవ్ లో న్యాయస్థానానికి అందించిన లాయర్లు ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు కి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దు ►ముందస్తు బెయిల్ కు చంద్రబాబునాయుడు అర్హుడు కాడని వాదించిన పోలీసుల తరపు లాయర్లు 1:35 PM అంగళ్లు కేసుపై రేపు కోర్టు తీర్పు.. ►అంగళ్లు విధ్వంసం కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►కేసుపై కోర్టులో పూర్తైన ఇరుపక్షాల వాదనలు ►తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ►రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడిస్తామన్న కోర్టు. ►స్కిల్ స్కాం కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►41A నోటీసులు ఫాలో అవుతామని చెప్పిన సీఐడీ లాయర్లు. ►లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు. 1:00 PM యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన ►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు ►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు ►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు ►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను ►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్ ►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు ►రాజకీయాలకు బ్రాహ్మణీ, భువనేశ్వరీ దూరంగా ఉంటారని మొన్న రాజమండ్రిలో ప్రకటించిన లోకేష్ ►ఎన్టీఆర్ కూతురే అయినా భువనేశ్వరీ ఇంతవరకు బయటకు రాలేదని సమర్థించుకున్న లోకేష్. 11:45 AM లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►స్కిల్ స్కాంలో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ముందస్తు బెయిల్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా ►విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 11:00 AM చంద్రబాబుకు మళ్లీ ఎదురుదెబ్బ ►చంద్రబాబుకు హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది ►చంద్రబాబు బెయిల్‌పై విచారణ ఈనెల 17కు వాయిదా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు ►స్కిల్ స్కాంలో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ►ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ ►విచారణను వాయిదా వేసిన హైకోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం. 10:20 AM రెండో రోజు సీఐడీ ఆఫీసుకు నారాయణ అల్లుడు పునీత్ ►ఏపీ సీఐడీ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ►రెండోరోజు పునీత్‌కు విచారించనున్న సీఐడీ ►అమరావతి ఐఆర్ఆర్ అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఐడీ విచారణ ►పునీత్ నిర్వహిస్తున్న సంస్థ నుండి ఐఆర్ఆర్ పరిధిలో భూముల కొనుగోలు ►నారాయణ సంస్థలు, భూములకు లబ్ది చేకూరేలా అలైన్మెంట్ మార్పులు ►నారాయణ సంస్థల నుండి జరిగిన ఆర్థిక లావాదేవీలపై పునీత్‌ను విచారించనున్న సీఐడీ 10:15 AM పురంధేశ్వరికి కౌంటర్.. ►బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలకు పురంధేశ్వరి సమాధానమేంటి?. ►బావను కాపాడాలనే ఆరాటంలో అసలు విషయం మరిస్తే ఎలా.. ఎలాగైనా @JaiTDP, @BJP4India పార్టీల మధ్య "బావ" సారూప్యత తీసుకురావాలని @naralokeshని వెంటబెట్టుకుని మరీ ఢిల్లీ వెళ్ళారా @PurandeswariBJP? అయినా @ncbn అరెస్ట్ వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. కేంద్ర ప్రభుత్వం ఉంది అని ఆరోపణలు చేస్తోంది మీ బావగారి పార్టీ నాయకులే. కాబట్టి ఈ ప్రశ్న… https://t.co/Y8OYgjpXD0 — YSR Congress Party (@YSRCParty) October 11, 2023 8:40 AM ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నేడు విచారణ ►చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది వాదన ►పీటీ వారెంట్‌పై సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు ►పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు సమ్మతి ►ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాదనలు విననున్న ఏసీబీ కోర్టు ►వాదనలు అనంతరం నిర్ణయం వెల్లడించనున్న ఏసీబీ కోర్టు ►అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ►అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు ►ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం 8:30 AM జైలులో 33వ రోజు చంద్రబాబు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 33వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబును జైల్లో ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తున్న అధికారులు ►కోర్టు నిబంధనల ప్రకారం స్పెషల్ ఎమినిటీస్‌ను చంద్రబాబుకు కల్పించిన అధికారులు ►ప్రతిరోజు రెండుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేస్తున్న జైలు అధికారులు ►యథావిధిగా చంద్రబాబుకు కొనసాగుతున్న భద్రత. 8:15 AM విజయవాడ కోర్టుల్లో పలు కేసులు విచారణ ►స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల పిటిషన్ ►నేడు విచారణకు రానున్న కేసు. ►అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ. ►లోకేశ్‌కు వచ్చిన ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగింపు ►ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైబర్ గ్రిడ్కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్‌పై విచారణ ►నిన్న ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్ ►ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ►ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం ►ఇంటి దగ్గరే న్యాయవాది సమక్షంలో విచారించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని నిన్న ఆదేశాలు 8:00 AM ఢిల్లీలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం ►తమ పెద్దమ్మ, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి అమిత్‌షాతో నారా లోకేశ్ భేటీ ►భేటీలో పాల్గొన్న టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ►చంద్రబాబుపై కేసులు, అనంతర పరిణామాలు, జైల్లో చంద్రబాబు పడుతున్న ఇబ్బందులు వివరించిన లోకేశ్. 7:00 AM PT వారంటుపై నేడు విచారణ ► ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ నేటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో నిన్న ఫైబర్ నెట్ కుంభకోణంపై స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి ► ఫైబర్ నెట్ స్కాం లో రూ. 115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► సిట్ దర్యాప్తు లో చంద్రబాబు పాత్ర బయటపడడంతో కేసు నమోదు ► ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే FIR లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారు ► ఫైబర్ నెట్ స్కాం లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది ► చంద్రబాబు సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి. రింగ్ మాయ.. ఆవుల ముందస్తు బెయిల్ 17న విచారణ ► ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ► తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్ మళ్లీ ఢిల్లీకి లోకేష్ ► విజయవాడ నుంచి ఢిల్లీకి నారా లోకేష్ ► ఎల్లుండి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ ► పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో మాట్లాడతానన్న లోకేష్. -
స్కిల్ హబ్, కాలేజీల ప్రారంభానికి ఏర్పాట్లు
సాక్షి, మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పార్లమెంటు నియోజవర్గాల పరిధిలో స్కిల్ కాలేజీలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్కిల్ హబ్‌ల ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని సమావేశ మందిరంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు చెందిన 150 మంది ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీ స్థాపనలో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ హబ్‌లు, కాలేజీలు ఆ నియోజకవర్గంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ లేదా, ఐటీఐ, లేదా డిగ్రీ కాలేజీల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ కాలేజీల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వెంటనే ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు రావాలన్నారు. అందుకు అనుగుణంగా కోర్సుల ప్రారంభానికి ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. యువతీయువకులకు ఉద్యోగావకాశాలు రాష్ట్రంలోని యువతీయువకులందరూ ఉపాధి అవకాశాలు పొందే విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు భాస్కర్ చెప్పారు. ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లోని పాలిటెక్నిక్, ఐటీఐ, కాలేజీల ప్రిన్సిపాల్స్, టీపీవోలు, నోడల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో ఆయన విడివిడిగా శనివారం సమావేశమయ్యారు. ముందుగా ఆయన పలు ప్రరిశ్రమలకు చెందిన వివిధ హోదాల్లోని 30 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో ఆయన విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రీకి పనికొచ్చే నైపుణ్యాభివృద్ధి కోర్సుల ఏర్పాటు విషయమై ఆయన చర్చించారు. ప్రతి కోర్సు పరిశ్రమతో అనుబంధంగా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంటు కోర్సు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి ఆ పరశ్రమలే ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు. జూలై 1వ తేదీ నాటికి స్కిల్ హబ్‌లు, స్కిల్ కాలేజీలు ప్రారంభమవుతాయని డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. పలువురు పరిశ్రమల ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారు. తమ పరిశ్రమల్లో ఉన్న శిక్షణ కేంద్రానికి శిక్షణనిచ్చే ఫ్యాకల్టీ కావాలని, మరికొందరు తమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే తామే శిక్షణనిస్తామన్నారు. కొందరు ప్రతినిధులు మాట్లాడుతూ స్కిల్ కాలేజీల్లో అవసరమైన ల్యాబ్‌లు పెట్టి తాము శిక్షణనిస్తామని ఇందుకు అవసరమైన స్థలం ఇవ్వాలని కోరారు. దీనిపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని భాస్కర్ అన్నారు. కార్యక్రమంలో ఎపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీవీ రామకోటిరెడ్డి, కార్పొరేట్ కనెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.సత్యప్రభ ప్రసంగించారు. కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవీవీ సత్యనారాయణమూర్తి, భీమిలి, నర్శీపట్నం, అనకాపల్లి ఆముదాలవలస, పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్ మురళీకృష్ణ, జీవీ రామచంద్రరావు, కె.వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాస్, డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, ఏపీఎస్ఎస్డీసీ వైజాగ్ నోడల్ ఆఫీసర్ సాయికుమార్ పాల్గొన్నారు. (చదవండి: సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు) -
గ్రేట్ లెర్నింగ్.. ఇకపై బైజూస్ ఆధ్వర్యంలో
ఇండియాలో మోస్ట్ పాపులర్ ఎడ్యుకేషనల్ యాప్‌గా పేరొందిన బైజూస్ తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటి వరకు అకడామిక్ ఓరియెంటెండ్ సర్వీసెస్‌పై ఎక్కువగా ఫోకస్ చేయగా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్, సర్టిఫికేట్ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. అందులో భాగంగా గ్రేట్లెర్నింగ్ను స్వంతం చేసున్నట్టు ప్రకటించింది. బిలియన్ డాలర్లు ఉన్నత విద్యకు సంబంధఙంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న గ్రేట్ లెర్నింగ్‌ను బైజూస్ సొంతం చేసుకోనుంది. సుమారు 600 మిలియన్ డాలర్లతో గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేసింది. అంతేకాదు హైయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన సెగ్మెంట్లో భారీగా విస్తరించేందుకు మరో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. మొత్తంగా ఉన్నత విద్య, కెరీర్ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో వన్ బిలియన్ డాలర్ల పెట్టుబడికి బైజూస్ సిద్ధమైంది. ఇండిపెండెంట్‌గానే బైజూస్ స్వంతం చేసుకున్నప్పటికీ గ్రేట్ లెర్నింగ్ యాప్‌ను ఇండిపెండెంట్‌గానే కొనసాగనుంది. బైజూస్ నేతృత్వంలో గ్రేట్ లెర్నింగ్ ఫౌండర్ మోహన్ లక్ష్మణరాజు, కో ఫౌండర్లు హరి నాయర్, అర్జున్ నాయర్లు గ్రేట్ లెర్నింగ్‌ను ఇకపై ముందుకు తీసుకెళ్లనున్నారు. పైగా బైజూస్ నుంచి భారీగా పెట్టుబడులు రానుండటంతో మరింత సమర్థంగా గ్రేట్ లెర్నింగ్‌ను తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేట్ లెర్నింగ్ ఆన్లైన్లో అందిస్తోంది. ఈ యాప్‌కు 15 లక్షల మంది వినియోగదారులు 170 దేశాల్లో ఉన్నారు. గ్రేట్లెర్నింగ్కి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, నేషనల్ యూనివర్సిటీ సింగపూర్, ఐఐటీ బొంబాయి వంటి ప్రముఖ సంస్థల సహాకారం అందిస్తున్నాయి. అవకాశాలు సృష్టిస్తాం గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేయడంపై బైజూస్ ఫౌండర్, సీఈవో బైజూ రవీంద్రన్ స్పందిస్తూ..‘ నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం, తిరిగి నేర్చుకోవడం అనేవి ముఖ్యమైన నైపుణ్యాలు. మాకు ఎందులో అయితే ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడ అవకాశాలు సృష్టిస్తాం, కొత్త దారులు వేస్తాం. మాకు ఎక్కడ అనుభవం లేదో కూడా తెలుసు. అక్కడ అనుభవం ఉన్న వారితో అవకాశాలు సృష్టిస్తాం’ అంటూ పేర్కొన్నారు. -
20 స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 15వ తేదీకల్లా సమగ్ర పరిశ్రమ సర్వే పూర్తి చేయాలని పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన సర్వే తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై మంత్రి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. స్కిల్ కాలేజీలు, యూనివర్శీటీల ఏర్పాటు పనులపై అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో ఇరవై స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు వెల్లడించగా.. మరో 5 కాలేజీలకు కేటాయింపులో ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీతో పాటు విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాలో ముందుగా స్కిల్ కాలేజీల ప్రారంభం విషయంలో సమాలోచనలు చేశారు. డిసెంబరులో నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో, ఎండీ అర్జా శ్రీకాంత్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, తదితరులు హాజరయ్యారు. -
నిరుద్యోగుల కోసం.. స్కిల్ డెవలప్మెంట్!
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ గెలవడం కోసం 2014 ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలన్నారని.. బాబు వచ్చాడు కానీ జాబ్ ఎవరికి రాలేదని రాజమండ్రి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భారత్‌రామ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి పార్లమెంటు పరిధిలో పది ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో స్కిల్ డెవెలప్మెంట్ ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. కేవలం కంప్యూటర్ సైన్స్ కాకుండా అన్ని విభాగాలకు సంబంధించిన విద్యార్ధులకు స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్లో శిక్షణ కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అర్హులందరికి సంక్షేమ పధకాలు అందాలని ఉద్దేశంతో వైఎస్ జగన్ శ్రమిస్తున్నారని మార్గాని భరత్ తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం సీఎం జగన్ మార్పుకు నాంది పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన చేసిన విధంగా హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయని ఎంపీ మార్గాని భారత్ రామ్ తెలిపారు. -
నిధుల వినియోగ బాధ్యత ఆర్థిక శాఖకు: సీఎం జగన్
-
సీఎం జగన్ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికై నెలరోజుల్లోగా పాఠ్య ప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడం యూనివర్శిటీల బాధ్యత అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ యూనివర్శిటీ పరిధిలో ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ అంటే రాష్ట్రవ్యాప్తంగా 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. (చదవండి : హామీల తక్షణ అమలుకై ఏపీ సర్కారు ప్రత్యేక జీవో) ఇందుకోసం ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అదనంగా ఏడాదిపాటు అప్రెంటిస్ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అప్రెంటిస్ పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా శిక్షణ అవసరమనుకుంటే.. మళ్లీ నేర్పించాలని అధికారులకు తెలిపారు. ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. ‘ ప్రభుత్వ శాఖల్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై విడివిడిగా నిధులు ఖర్చు చేయడాన్ని నిలిపివేయాలి. నిధుల వినియోగ బాధ్యతలను ఆర్థిక శాఖకు అప్పగిస్తున్నాం. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజి రూపురేఖలు కూడా మారాల్సిందే. గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల మ్యాపింగ్ జరగాలి. స్థానికంగా వారి సేవలను వినియోగించుకునేలా ఒక యాప్‌ను రూపొందించాలి. దీని వల్ల ప్రజలకు నైపుణ్యం ఉన్న మానవవనరులు అందుబాటులోకి వస్తాయి’ అని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు నెలరోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ప్రారంభం
మైలవరం: స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం సేవలు యువత సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ భారతదేశ ప్రభుత్వేతర సేవా సంస్థ జాతీయ అధ్యక్షురాలు సాదినేని యామిని తెలిపారు. మైలవరం డౌన్సెంటర్ జెండా చెట్టు వద్ద గల దక్షిణ భారతదేశ ప్రభుత్వేతర సేవా సంస్థ, మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఐటీ, ఐటీఈఎస్, టూరిజం, మార్కెటింగ్ తదితర 10 రంగాలలో నిపుణులైన శిక్షకుల ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పారు. తొలిగా కాపు కార్పొరేషన్, ఓ 2 స్కిల్స్ వారి సౌజన్యంతో అర్హులైన కాపు సామాజిక అభ్యర్థులకు బ్యూటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తామన్నారు. మైలవరంలో అతి తక్కువ సమయంలో నాణ్యమైన వసతులు కల్పించిన ట్రస్టు రీజియన్ కోఆర్డినేటర్ కోయ సుధను అభినందించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఓ2 స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధి రత్నప్రసాద్, గంటా యేసుబాబు, రమేష్, ఎం. వెంకటసత్యనారాయణ, వి. బాలాజీప్రసాద్, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, చిన్నారి స్నేహం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, విజయా డెయిరీ సూపర్వైజర్ శివశంకర్, వీఆర్ఓ దేవప్రియుడు పాల్గొన్నారు. -
'వరంగల్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్'
వరంగల్: యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వరంగల్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ గురూజీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం చక్కటి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక నగరంగా ఓరుగల్లుకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.