సెంటర్ ప్రారంభిస్తున్న యామిని
మైలవరం: స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రం సేవలు యువత సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ భారతదేశ ప్రభుత్వేతర సేవా సంస్థ జాతీయ అధ్యక్షురాలు సాదినేని యామిని తెలిపారు. మైలవరం డౌన్‌సెంటర్ జెండా చెట్టు వద్ద గల దక్షిణ భారతదేశ ప్రభుత్వేతర సేవా సంస్థ, మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ఐటీ, ఐటీఈఎస్, టూరిజం, మార్కెటింగ్ తదితర 10 రంగాలలో నిపుణులైన శిక్షకుల ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పారు.
తొలిగా కాపు కార్పొరేషన్, ఓ 2 స్కిల్స్ వారి సౌజన్యంతో అర్హులైన కాపు సామాజిక అభ్యర్థులకు బ్యూటీషియన్, హోటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తామన్నారు. మైలవరంలో అతి తక్కువ సమయంలో నాణ్యమైన వసతులు కల్పించిన ట్రస్టు రీజియన్ కోఆర్డినేటర్ కోయ సుధను అభినందించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు, ఓ2 స్కిల్ డెవలప్‌మెంట్ ప్రతినిధి రత్నప్రసాద్, గంటా యేసుబాబు, రమేష్, ఎం. వెంకటసత్యనారాయణ, వి. బాలాజీప్రసాద్, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, చిన్నారి స్నేహం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, విజయా డెయిరీ సూపర్‌వైజర్ శివశంకర్, వీఆర్‌ఓ దేవప్రియుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment