
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కూటమి ప్రభుత్వంలో స్కీములు అమలు చేయడం లేదను కానీ స్కాములు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పారు కదా అని అధికారులు ఆలోచించకుండా అరెస్టులకు పాల్పడితే కచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఉర్సా కంపెనీ ద్వారా వేల కోట్ల రూపాయలు విలువైన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇది అధికార దుర్వినియోగం కాదా?. నీతి నిజాయితీలకు మారుపేరైన ఐపీఎస్ అధికారి సీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేయటం దారుణం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోంది. జిందాల్ లాంటి సంస్థలను అవమానపరుస్తుంది. దావోస్ వెళ్ళిన చంద్రబాబు ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేసుకోగలిగారా?.
ఉర్సా భూముల స్కామ్ నుండి ప్రజలను డైవర్ట్ చేయటానికి మాజీ ఏపీఎస్ ఆఫీసర్ సిఎస్సార్ ఆంజనేయులును అరెస్టు చేశారు. చంద్రబాబు చెప్పారు కదా అని అధికారులు ఆలోచించకుండా అరెస్టులకు పాల్పడితే కచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం ఏమిటి?.
రాజమండ్రిలో అవినీతి జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. నగరంలో అధికార పార్టీ నేతలు భూములను కబ్జా చేసే ప్రయత్నాలు అడ్డుకుంటాం. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల వద్ద అనధికార పర్మిట్ రూములు విషయంలో కచ్చితంగా ఆందోళన చేస్తాం. రాజమండ్రిలో మెజారిటీ రావడానికి నీ గొప్పతనం నీ కుటుంబం గొప్పతనం కాదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్. వైఎస్సార్‌సీపీ రాజకీయ భిక్ష పెట్టంది. బొల్లినేనిలో మృతి చెందిన యువతికి ప్రభుత్వం తరఫున ఇప్పటివరకూ ఎటువంటి సహాయం అందించలేదు. ఈవీఎం ఎమ్మెల్యేకు ఇంగ్లీషే రాదనుకున్నాను.. తెలుగు కూడా సరిగ్గా రాదని అర్థమైంది.. పుట్టినరోజుకి నివాళులర్పించడమేమిటి?. మాల వేసుకుని ఎమ్మెల్యే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ప్రజా సంబంధాల వ్యవహారాలు సోషల్ మీడియాలో వస్తే కచ్చితంగా స్పందించాలి.

ప్రైవేట్ ఆసుపత్రిల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం జరుగుతుందా?. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు చేపడుతూ.. స్కాంను గత ప్రభుత్వానికి అంటకట్టడం దారుణం. చంద్రబాబు సమయంలోనే కొత్త డిస్టరీలకు అనుమతులు వచ్చాయి. లిక్కర్ వ్యవహారంతో సంబంధంలేని మిషన్ రెడ్డిని ఎందుకు లాగుతున్నారు. ఇవి కేవలం ప్రభుత్వం అనుసరిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఉర్సా భూముల కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రముఖులను ప్రభుత్వం అరెస్టు చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి’ అని హెచ్చరించారు.