సాక్షి, తూర్పుగోదావరి: హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. వైఎస్ జగన్ ఏయే అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చివరకు సత్యమే గెలుస్తుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది. హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పోలవరానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీ పూర్తి వివరాలు పీపీఏ, సీడబ్ల్యూసీకి నివేదిక అందించింది.
నూతన డయాఫ్రం వాల్ నిర్మించాలి. డయాఫ్రం వాల్ చిన్నాభిన్నం అయిపోవడానికి చంద్రబాబు కారణం కాదా?. నదిని డైవర్ట్ చేయడానికి మొదట అప్రోచ్ ఛానల్ కట్టాలి స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి. 2016 డిసెంబర్‌లో డయాఫ్రం వాల్ ప్రారంభించారు. 2018 నాటికి కాఫర్ డ్యామ్ పూర్తయింది. ఈసీఆర్‌ఎఫ్ కింద ఉన్న ఫౌండేషన్ అయిన డయాఫ్రం వాల్‌కు రక్షణ లేకపోవడంతో దెబ్బతింది. ఏ రకమైన రక్షణ లేకపోవడం వల్ల కాఫర్ డ్యాం నిర్మాణం దెబ్బ తిందని కమిటీ తేల్చింది. దీనంతటికీ కారణం చంద్రబాబు కాదా?.
డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు కనిపించకపోతే, యథావిధిగా ఈసీఆర్‌ఎఫ్ పూర్తి చేసేస్తే భవిష్యత్తులో ఎటువంటి అనర్థం జరిగేది. కాఫర్ డ్యాంలు కట్టకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టారు?. కాంక్రీట్ పనులు పూర్తి చేస్తే కమిషన్ డబ్బులు వస్తాయని ఆశించి చంద్రబాబు ముందు ఈ పనులు చేపట్టారు. కాపర్ డ్యామ్ కింద 40 మీటర్ల మేర జెట్ గ్రౌటింగ్ జరగాలి. చంద్రబాబును పోలవరం ద్రోహి అని పిలవాలి. పోలవరానికి చేటు చేసిన వ్యక్తిని తెలుగు ప్రజల ద్రోహి అని ఎందుకు అనకూడదు?. రాష్ట్రానికి ఇంత అనర్ధం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. పోలవరానికి సంబంధించి చంద్రబాబు చేయని తప్పంటూ లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: తిరుపతి లడ్డూ వివాదం: దర్యాప్తు నిలిపివేసిన సిట్
Comments
Please login to add a commentAdd a comment