ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం: మార్గాని భరత్‌ | Ex Mp Margani Bharat Ram Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం: మార్గాని భరత్‌

Published Thu, Jul 18 2024 12:47 PM | Last Updated on Thu, Jul 18 2024 12:59 PM

Ex Mp Margani Bharat Ram Comments On Chandrababu

సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో రెడ్ బుక్‌ రాజ్యాంగం అమలవుతుందని.. ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మండిపడ్డారు. వినుకొండలో ఒక యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు ప్రభుత్వమిది అంటూ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నడిరోడ్డుపై  వైఎస్సార్‌సీపీ మైనారిటీ యువకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అసలు విశాఖలో జైలుకెళ్లిన ప్రేమోన్మాది బయటికి వచ్చి బాధితురాలు తల్లిపై దాడి చేశాడు. జరుగుతున్న సంఘటనలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారా?. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు’’ అంటూ మార్గాని భరత్‌ నిలదీశారు.

గడిచిన 40 రోజుల్లో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఎందుకు శ్వేత పత్రం రిలీజ్ చేయటం లేదు. జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వెంటనే స్పందించాలి. రాష్ట్రంలో హత్య రాజకీయాలు పెరిగిపోతున్నాయి. హింసా రాజకీయాల ప్రేరేపించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి’’ అని మార్గాని భరత్‌ డిమాండ్‌ చేశారు. 

పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన దృష్ట్యా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయలేకపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కూడా చంద్రబాబు.. హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరగాల్సిన న్యాయాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ డిమాండ్ కాదా... ఎందుకు చంద్రబాబు డిమాండ్ చేయలేకపోతున్నారు. ఏపీకి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపండి.. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంది’’ అని మార్గాని భరత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement