ఓ యువతిని చీరలతో కట్టేసి ఆమె వంటిపై నగలను దోచుకుని పరారయ్యారు ఇద్దరు దుండగులు.
రాజమండ్రి రూరల్: ఓ యువతిని చీరలతో కట్టేసి ఆమె వంటిపై నగలను దోచుకుని పరారయ్యారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామం నవభారత్‌నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగింది. ఎమ్.అమల అనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు దుండగులు ప్రవేశించి ఆమెను చీరలతో కట్టేశారు. అనంతరం ఆమె మెడలో ఉన్న గొలుసు, ఇతర బంగారు ఆభరణాల(ఐదున్నర కాసుల)ను దోచుకుని పరారయ్యారు.