Younger
-
93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!
ఓ వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా దేహ ధారుడ్యంతో పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారు. అతడి శరీరాకృతిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతమైన ఫిట్నెస్కి గల కారణాలేంటని అధ్యయనం చేసే పనిలో పడ్డారు పరిశోధకులు. ఐరిష్కి చెందిన 93 ఏళ్ల రిచర్డ్ మెర్గాన్ అనే వ్యక్తి చూడటాని 40 ఏళ్ల వ్యక్తిలా చురుగ్గా ఉన్నాడు. పైగా 70 ఏళ్ల వయసులో రోయింగ్(పడవ రేస్)ను ప్రారంభించినప్పటికీ నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడిని చూస్తే యువకుడి మాదిరిగా మంచి శరీరాకృతితో ఉంటాడు. శాస్త్రవేత్తలు సైతం అతడి హృదయ స్పందన రేటుని చూసి ఆశ్చర్యపోతున్నారు. మోర్గాన్ ఫిట్నెస్ ప్రయాణం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై పరిశోధకులు అధ్యయనం చేయడంతో ఒక్కసారిగా అతను వార్తల్లో నిలిచాడు. అంతేగాదు అతని శరీరంలోని 80% కండర ద్రవ్యరాశి, గుండె పనితీరుని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం 40 ఏళ్ల వ్యక్తిని పోలి ఉందని చెప్పారు. అతను మనందరికీ ప్రేరణ అని చెబుతున్నారు. అతని జీవన శైలి, ఆహార పద్ధతులు, చేసే వ్యాయమాలు తదితరాలను పరిశీలించింది పరిశోధకుల బృందం. అంతేగాదు అతడి శారీరక పనితీరు, పోషకాహారం తీసుకోవడం తదితరాలను బయో ఎలక్ట్రిక్ ఇంపెడెన్స్ ద్వారా అంచనా వేసింది. ఇక అతను ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం, హృదయ స్పందన రేటు, తదితర వాటిని రోయింగ్ ఎర్గోమీటర్తో కొలిచారు. అందుకు సంబంధించిన అధ్యయనం గురించి గత నెలలో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురితమయ్యింది. ఇక మోర్గాన్ తాను 73 ఏళ్ల వయసులో వ్యాయామం ప్రారంభించానని, ఆ తర్వాత రోయింగ్ క్రీడలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చానని చెప్పుకొచ్చారు. తనకు వ్యాయామం చేయడంలో ఆనందం ఉందని తెలిశాక ఇక ఆపలేదని, అదే ఈ రోయింగ్ క్రీడో పాల్గొనేలా చేసిందని చెప్పారు మోర్గాన్. వ్యాయామం మంచి ఫిట్నెస్గా ఉండేలా చేయడమే గాక సర్వసాధారణంగా వయసు రీత్యా వచ్చే శరీరంలోని వృద్ధాప్య ప్రభావాలను అరికడుతుందని మోర్గాన్‌పై జరిపిన పరిశోధనలో తేలిందని చెబుతున్నారు పరిశోధకులు. ఇక అతను మంచి ఫిట్‌నెస్‌లో.. వ్యాయామం స్కిప్ చేయకపోవడం, బరువుకి సంబంధించిన వ్యాయామాలు, ప్రోటీన్ ఆహారం తదితరాలు తన రోజూ వారీ జీవశైలిలో ఉండే ప్రాథమిక మూల స్థంభాలని చెప్పారు పరిశోధకులు. ఇంకేందుకు ఆలస్యం వయసుతో సంబంధం లేకుండా చక్కగా మంచి వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా ఉండటమే గాక వృధాప్య ప్రభావం పడకుండా చూసుకోండి. (చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడికి చూపించిన ప్రధాని మోదీ!) -
రోహిత్ శర్మ సొంత తమ్ముడి కవల పిల్లల బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రొట్టె కోసం రక్తపాతం..అన్నను హత్య చేసిన తమ్ముడు!
యూపీలోని కాన్పూర్‌లో రొట్టె ముక్కకోసం అన్నదమ్ములు రక్తం కళ్లజూసుకున్నారు. రొట్టె కోసం జరిగిన వివాదంలో తమ్ముడు అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అన్నయ్య.. తమ్ముని కోసం ప్రత్యేకంగా రొట్టెలు తయారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అన్నను హత్య చేసిన తమ్ముడు అంతటితో ఆగక సోదరుని మృతదేహంతో ఏమి చేశాడో తెలిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ ఉదంతం కాన్పూర్‌లోని బిల్హౌర్ పరిధిలోని నానామవు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలో కల్లూ, భూరా అనే అన్నదమ్ములుంటున్నారు. వీరిలో కల్లూ పెద్దవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే అతని సోదరుడు భూరాకు వివాహం జరిగింది. అతని భార్య రక్షాభంధన్ కోసం పుట్టింటికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు భర్తకు, కల్లూకు వంటవండేది. తాజాగా భూరా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతూ అన్నతో తాను ఇంటికి వచ్చేసరికి రొట్టెలు తయారు చేసిపెట్టాలని కోరాడు. అయితే రాత్రి భూరా ఇంటికి వచ్చేసరికి కల్లూ అతని కోసం రొట్టెలు తయారు చేయలేదు. వెంటనే కోపంతో రగిలిపోయిన భూరా తన అన్నను ‘రొట్టెలు ఎందుకు తయారు చేయలేదని’ అడిగాడు. దానికి సమాధానంగా కల్లూ ‘నువ్వు నాకు రొట్టెలు తయారు చేయలేదు కనుక నేను నీకు రొట్టెలు తయారు చేయలేదు’ అని అన్నాడు. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇంతలో తమ్మడు ఇంటి బయట ఉన్న పెద్ద బండరాళ్లు తీసుకు వచ్చి ఏకధాటిగా అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మృతిచెందినా తమ్ముని ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అన్న మృతదేహానికి తాడుకట్టి, దానికి లాక్కుంటూ గ్రామం శివారులకు తీసుకువచ్చాడు. అక్కడున్న నదిలోని పడవలో అన్న మృతదేహాన్ని ఉంచి, నది మధ్యలో దానిని వదిలివేశాడు. అయితే తమ్ముడు అన్న మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నప్పుడు గ్రామానికి చెందిన కొందరు దానిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్ ఢులా మాట్లాడుతూ తమ విచారణలో నిందితుడు.. రొట్టె కోసం తనకు, తన అన్నకు వివాదం జరిగిందని, ఈ నేపధ్యంలోనే తాను అన్నను హత్యచేశానని తెలిపాడన్నారు. నదిలోని కల్లూ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
తగ్గుతున్న జనాభా.. చైనా కీలక నిర్ణయం..
చైనాలో జననాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతూ యుక్తవయస్సు వారు తగ్గిపోతున్నారు. యుక్త వయస్కులు పెళ్లికి దూరంగా ఉండటమే దీనికి కారణం అని గుర్తించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికూతురు వయస్సు 25 ఏళ్లు, అంతకంటే తక్కువగా ఉంటే రూ.11,340 నగదును కానుకగా ఇవ్వనుంది. ఈ మేరకు హాంకాంగ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రోత్సాహంతోనైనా యువత త్వరగా పెళ్లి చేసుకుని జననాల సంఖ్యను పెంచుతారని ప్రభుత్వం భావిస్తోంది. సరైన వయస్సులో చేసుకునే మొదటి పెళ్లికి మాత్రమే ఈ కానుక వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనాలో గత ఆరు దశాబ్దాలుగా జనాభా రేటు ఘణనీయంగా తగ్గిపోతోంది. వృద్దుల సంఖ్య పెరుగుదలతో ఆందోళన చెందుతున్న అధికారులు.. జననాల సంఖ్యను పెంచడానికి అనేక చర్యలను తీసుకుంటున్నారు. చైనాలో సాధారణంగా పెళ్లికి కనీస వయ్సస్సు అబ్బాయికి 22, అమ్మాయికి 20గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఆర్థికపరమైన చిక్కులతో పాటు ఒంటరి మహిళలు పిల్లలను కనే చట్టాలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది. 2022లో వివాహాల సంఖ్య 68 లక్షలు కాగా.. 1986 తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. 2021 కంటే 2022లో 8 లక్షల వివాహాలు తక్కువగా అయ్యాయి. జననాల రేటులో ప్రపంచంలోనే అతి తక్కువ స్థానానికి చైనా చేరుకుంది. 2022లో రికార్డ్ స్థాయిలో 1.09గా నమోదు కావడం గమనార్హం. పిల్లల సంరక్షణకు అధిక ఖర్చు కావడం వల్ల చాలా మంది తల్లులు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు. అదీగాక మహిళల పట్ల వివక్ష కూడా ఇందుకు శాపంగా మారింది. ఇదీ చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి -
ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు
సాక్షి, అనంతపురం: ‘పెళ్లయినా ఫర్వాలేదు. కానీ నన్ను ప్రేమించాలి. చిన్ననాటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు నాతో మాట్లాడడం మానేస్తే ఎలా? ప్రేమించకపోతే కత్తితో గొంతు కోసుకుంటా’ అని ఓ వివాహితను బెదిరిస్తున్న యువకుడు చివరకు అన్నంత పనీ చేశాడు. కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన శుక్రవారం అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు పాపంపేటలో చోటు చేసుకుంది. అనంతపురం రూరల్ పరిధిలోని ఎల్బీ నగర్‌కు చెందిన గోపాల్‌నాయక్ కుమారుడు బాలాజీ నాయక్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. అతని చిన్ననాటి స్నేహితురాలు పాపంపేటలో ఉంటోంది. ఆమెకు నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. కానీ, బాలాజీ నాయక్ ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు. విసిగిపోయిన ఆమె రెండు నెలల నుంచి మాట్లాడడం మానేసింది. బాలాజీనాయక్ శుక్రవారం పాపంపేట చేరుకుని ఆమె స్నేహితురాలి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే లోపలికి వెళ్లి తనను ప్రేమించాలని మరోసారి వేధించాడు. తనకు వివాహమైందని, వేధించడం మానుకోవాలని చెప్పినా వినలేదు. చివరకు అదే ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు కోసుకున్నాడు. భయాందోళనలకు గురైన ఆమె విషయాన్ని బాలాజీ నాయక్ సోదరులు ఎం.రవీంద్ర నాయక్, మని నాయక్‌కు తెలియజేసింది. వారు వెళ్లి చూడగా బాలాజీ నాయక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఆర్జీఎఫ్.. ఇది మన కేజీఎఫ్) -
చిచ్చర పిడుగు!...13 ఏళ్ల వయసులో 17 కంప్యూట్ భాషలు...
కొంతమంది పిల్లలు అత్యంత చురుకుగా అతి చిన్న వయసులోనేఅన్ని నేర్చుకుంటారు. జౌరా! అనిపించేలా పెద్దలే ఇబ్బంది పడి నేర్చుకున్న వాటిని సైతం అలవొకగా నేర్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక చిన్నారి అతి పిన్న వయసులోనే కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రోగామింగ్ లాంగ్వేజ్‌లను సునాయాసంగా నేర్చకున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?... వివరాల్లోకెళ్తే....తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిప అర్నవ్ శివరామ్ 13 ఏళ్ల వయసులోనే 17 కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. అంతేకాదు ఆ చిన్నారి అతి పిన్నవయసులో కంప్యూటర్ భాషలను నేర్చుకున్న వారిలో ఒకడిగా నిలిచాడు. శివరామ్ 4 వతరగతి చదువుతున్నప్పుడే కంప్యూటర్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. జావా, ఫైథాన్‌తో సహా మొత్తం 17 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్చుకున్నాడు. అంతేకాదు భారత్‌లో తక్కువ పెట్టుబడితో ఆటో పైలెట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రూపొందించాలని యోచిస్తున్నట్లు శివరామ్ తెలిపాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందంటూ ప్రశంసిస్తున్నారు. Tamil Nadu | Coimbatore's Arnav Sivram becomes one of the youngest children to have learnt 17 computer languages at the age of 13 I started learning computers when I was in 4th grade. I have learnt 17 programming languages including Java & Python, he said pic.twitter.com/FTehgFHrBt — ANI (@ANI) July 2, 2022 -
ఢిల్లీ వీధుల్లో దారుణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో దారుణం బుధవారం మధ్యాహ్నం జరిగింది. తమ కుటుంబంలో యువకుడి ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ 20ఏళ్ల యువతిని కొందరు నిర్భంధించి లైంగిక దాడి జరిపారు. అనంతరం అత్యాచార బాధితురాలిని నిందితులు తీవ్రంగా హింసిస్తూ కస్తూర్బా నగర్ వీధుల్లో నడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం సృష్టించాయి. యువతి ముఖానికి నల్లరంగు పూసి, జుట్టు కత్తిరించి, మెడలో చెప్పు వేలాడదీసి నిందితులు అవమానించడం వీడియోల్లో కనిపించింది. ఈ ఘటనలో పాల్గొన్నారని భావిస్తున్న 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు కాగా నలుగురు పురుషులు. 11మందిలో ఇద్దరు 18ఏళ్లలోపు వారు కావడం గమనార్హం. బాధిత యువతి భర్తతో కలిసి ఆనంద్ విహార్ ప్రాంతంలో నివసిస్తుంది. ఆమె పుట్టిల్లు కస్తూర్బా నగర్లో ఉంది. నిందితుల కుటుంబంలోని ఒక కుర్రాడితో ఆమెకు స్నేహం ఉందని, గత నవంబర్‌లో ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు ఈ యువతే కారణమని నిందితులు ఆరోపిస్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రతీకారం కోసం వేచి చూసిన నిందితులు గుణపాఠం నేర్పాలంటూ సదరు యువతిని అపహరించారన్నారు. ఆమెపై లైంగిక దాడి జరిపారని తెలిపారు. ఘటన సమాచారం తెలియగానే స్పందించామని, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని 12 సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఐర్లాండ్.. ముంబై.. ధులే..!
ముంబై: మహారాష్ట్రలోని ధులేకు చెందిన ఓ యువకుడు ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన ఐర్లాండ్ లోని ఫేస్బుక్ అధికారులు వెంటనే ముంబై పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని గుర్తించి, యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అంతా 50 నిమిషాల్లోపే పూర్తయింది. ధులే పోలీస్ ఠాణాలో హోంగార్డ్‌గా చేస్తున్న వ్యక్తి కుమారుడు(23) ఆదివారం చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దీనిని ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ సిబ్బంది గమనించి వెంటనే ముంబైలోని సైబర్ క్రైం పోలీస్ డిప్యూటీ కమిషనర్ రశ్మి కరండికర్కు ఫోన్ చేసి తెలిపారు. ఆమె వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తంచేశారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులు రాత్రి 9 గంటలకల్లా ధులేలోని భోయి సొసైటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో గాయపడి ఉన్న బాధిత యువకుడిని గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి, ప్రాణాపాయం నుంచి కాపాడారు. సోమవారం అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని ఎస్పీ చిన్మయ్ పండిట్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడబోయిన ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
ఎస్ఐ చేయి చేసుకున్నాడని యువకుడు ఆత్మహత్యయత్నం
-
చీటూరులో మరో యువకుడి ఆత్మహత్యాయత్నం
లింగాలఘణపురం జనగామ : మండలంలోని చీటూరులో మరో యువకుడు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అప్రమత్తమై మందు డబ్బాను లాక్కొని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఇప్పటికే చీటూరులో నాలుగేళ్లలో పది మంది యువకులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా యుక్త వయసులోనే మద్యానికి బానిసలవడం, చిన్న విషయాలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు ఆత్మహత్యలకు పాల్పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యువతలో మనో ధైర్యం కల్పించే విధంగా కౌన్సెలింగ్ నిర్వహిం చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికే పది మంది యువకులు ఆత్మహత్య చేసుకోవడం, ఒకరిద్దరు యువకులు కూడా తాము చనిపోతామం టూ తల్లిదండ్రులకు చెబుతుండడం గమనార్హం. చావుతో ఏదీ పరిష్కారం కాదు యువకులు ఆత్మహత్యలకు పాల్పడితే సమస్యలు పరిష్కా రం కావు. సమస్యలు ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. యుక్తవయసులో చనిపోవడంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై దష్టి సారించాలి. –పసుల సోమనర్సయ్య, మాజీ ఎంపీపీ, చీటూరు యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలి గ్రామంలోని యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఇప్పటికే నాలుగేళ్లలో పది మందికి పైగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌన్సెలింగ్‌తో యువకుల్లో మనోధైర్యం కల్పించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న యుక్త వయసు వారే చనిపోవడం గ్రామంలో ఆందోళన కలిగిస్తోంది. – ఉప్పల మధు, ఎంపీటీసీ సభ్యుడు, చీటూరు -
నా ప్రేమకు సెలవు
టెక్కలి రూరల్/కాశీబుగ్గ/వీరఘట్టం: వన్‌సైడ్ లవ్ ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని బలిగొంది. తనలోని ప్రేమభావాలను బహిర్గతం చేయలేని ఓ యువకుడు తనలో తానే కుమిలిపోతూ చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం టెక్కలి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వీరఘట్టంకు చెందిన ఉగిరి హర్షవర్ధన్(19) టెక్కలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకెండియర్(మెకానికల్ ఇంజినీరింగ్) చదువుతున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తూ.. ఆ విషయం ఆమెకు చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. యువకుడి సెల్‌ఫోన్ వాట్సాఫ్ ప్రొఫైల్‌లో ‘నాప్రేమకు సెలవు’ అనే ఫొటో పెట్టడంపై ఈ మృతి వెనుక ప్రేమ వ్యవహారమే నడిచిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్కలిలో మృతదేహం గుర్తింపు.. టెక్కలి మండలం రావివలస సమీపంలోని రైలు పట్టాలపై బుధవారం ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనంతరం జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్పీ కానిస్టేబుల్ కోదండరావు ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాగా, మెడ మీదుగా రైలు వెళ్లినా తల, మొండెం దగ్గరగానే ఉండటంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరఘట్టంలో విషాదఛాయలు.. హర్షవర్ధన్ మృతి వార్త వినగానే స్వగ్రామం వీరఘట్టంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుమారుడు ఇక లేడనే సమాచారం తెలిసి తల్లిదండ్రులు రాంప్రసాద్, మణమ్మలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతిచెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే కుటంబు సభ్యులు, బంధువులు పలాస బయలుదేరివెళ్లారు. -
మరాఠా బంద్ అసంపూర్ణం
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరు తూ ముంబైలో మరాఠాలు బుధవారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రిజర్వేషన్ల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి సంఖ్య రెండుకు చేరింది. మరాఠాలకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పలు సంస్థలు ముంబై బంద్‌కు పిలుపునివ్వడం తెలిసిందే. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి లాఠీ చార్జీ చేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మధ్యాహ్నానికే బంద్‌ను విరమిస్తున్నట్లు చెప్పారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఫడ్నవిస్ చెప్పారు. -
లక్ష్యాన్ని చేరుకోలేకపోయా.. క్షమించండి
కొందుర్గు(షాద్‌నగర్): ఉన్నత చదువులు చదివించడానికి తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేక ఇంటర్‌తోనే విద్యను ఆపేయాలనుకున్న సమయంలో విద్య నేర్పే గురువులు ముందుకొచ్చి వారి ఖర్చులతో ఉన్నత చదువులు చదివించారు. గురువులు ఆశించిన లక్ష్యం చేరుకోక ముందుగానే ఆ యువకుడు తనను క్షమించాలని కోరుతూ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లి గ్రామానికి చెందిన ఉప్పల బుచ్చయ్య, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు శ్రీధర్, శ్రీకాంత్‌తోపాటు కూతురు సరిత ఉన్నారు. వీరు శ్రీధర్‌ను ఇంటర్ వరకు చదివించారు. అనంతరం ఆర్థిక పరిస్థితుల రీత్యా చదువు మాన్పించాలని భావించారు. అప్పట్లో శ్రీధర్ గురువులు శ్యామ్‌సుందర్, మంజుల సహాయమందించి శ్రీధర్‌ను పీజీ వరకు చదివించారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించాలని సూచించారు. ప్రస్తుతం శ్రీధర్ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ (కెమిస్ట్రీ) విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్లుగా ఈ ఉద్యోగం నుంచి వచ్చే డబ్బులతో తల్లిదండ్రులను పోషిస్తూ, తమ్ముడు శ్రీకాంత్‌ను చదివిస్తున్నాడు. మనస్తాపంతో ఆత్మహత్య.. ఈ నెల 18న రాత్రి శ్రీధర్ విధులు ముగించుకొని కంపెనీ నుంచి బయలుదేరి జీడిమెట్లలోనే ఉంటున్న అద్దె ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. దారిలో ఓ మహిళకు బైక్ తగలడంతో ఆమె కాలు విరిగింది. బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీధర్‌ను పోలీసులు మందలించారు. మరుసటిరోజు మహిళ కాలు బాగుచేయించడానికి రూ.2 లక్షలు ఇవ్వాలని మహిళ తరఫు బంధువులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీధర్ మనస్తాపానికి గురయ్యాడు. తన అద్దె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, గురువులు తన ను క్షమించాలని కోరుతూ, అమ్మనాన్నల బాగోగు లు చూసుకోవాలని తమ్ముడు శ్రీకాంత్‌కు సూచిస్తూ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ మృతికి పోలీసులే కారణమా.. శ్రీధర్ ఆత్మహత్యకు పోలీసులే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని పోలీసులు బాధించారని, దెబ్బలు కూడా కొట్టారని తెలిపారు. వారి భయంతోనే శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. -
లక్ష్యం మరచి.. పెడదారి పట్టి..
పులివెందుల : భవిష్యత్‌లో మంచి జీవితాన్ని గడపాల్సిన నిరుద్యోగ యువత ఇటీవల కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అనుకున్న లక్ష్యాన్ని చేరకపోగా వారి దారి పెడదారిపడుతోంది. ఇందుకు ఆర్థికపరమైన అంశాలు, దురలవాట్లకు లోనై తాము తల్లిదండ్రులను డబ్బులు అడగలేని పరిస్థితులలో చెడు సహవాసలతో మద్యం, గుట్కా, గంజాయి, డ్రగ్స్ తదితర దురలవాట్లకు బానిసలవుతున్నారు. డబ్బును అవలీలగా సంపాదించుకోవాలన్న పరిస్థితులలో యువత అసాంఘిక కార్యలాపాల వైపునకు దారి మళ్లుతోంది. అంతేకాక ఇటీవల కాలంలో కొంతమంది యువకులు దురదృష్టవశాత్తు కిరాయి హంతకులుగా మారుతున్న వైనాన్ని గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో పులివెందుల పట్టణంలో ఇటీవల జరిగిన కొన్ని హత్యల పరంపరలో 20 నుంచి 25 ఏళ్ల వయస్సుగల యువకులు కీలకంగా ఉండటం గమనార్హం. నేరస్తులుగా మారుతున్న యువత: ఈ మధ్య కాలంలో పట్టణంలోని జయమ్మకాలనీలో రెండు హత్యలతోపాటు పెద్ద మసీదు వద్ద యువకుని గొంతు కోసి హతమార్చిన కేసులోనూ, వారం రోజుల క్రితం రంగేశ్వరరెడ్డి హత్య కేసులోనూ పాలుపంచుకున్నది అంతా 25 ఏళ్లలోపు ఉన్న యువకులే కావడం విశేషం. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో శాంతి భద్రతల విషయంలో ప్రశాంతంగా ఉన్న పులివెందుల పట్టణంలో జరిగిన హత్యల ఉదంతాలు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇందులో ప్రేమ వ్యవహారాలు, పాత కక్షలు, ఆర్థికపరమైన చిన్నపాటి తగదాలు కూడా కారణాలుగా ఉండటం పరిస్థితి దయనీయమైన గుర్తుకు తెస్తోంది. ఇందుకు కొన్ని సహవాస దోషాలతో యువకుల తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ కన్నబిడ్డలు భవిష్యత్‌లో తమకు ఆసారగా ఉంటారన్న ఆశతో వారికి అడినవన్నీ ఇస్తున్నా కొంతమంది యువకులు కొన్ని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితుల వైపునకు దారి మళ్లడం దురదృష్టకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇం దుకు చాలావరకు సంబంధిత యువకులు పుట్టి పెరి గిన వాతావరణం వారి తల్లిదండ్రుల జీవన శైలి, వారి తల్లిదండ్రుల అమిత ప్రేమ, సమాజంలో వారిని బాగుపరచాలన్న ఉద్దేశం, వారి కుటుంబా లకు దగ్గరగా ఉన్న వారికి కూడా లేకపోవడం తది తర కారణాలు కారణ భూతాలుగా కనిపిస్తున్నాయి. మద్యానికి అలవాటు: పదవ తరగతిలో ఉండగానే కొంతమంది విద్యార్థి దశ నుంచి మద్యం, ధూమ పానానికి, నిషేధిత మందుల వాడకానికి, ప్రమాదకరమైన గుట్కా, గంజాయి లాంటి డ్రగ్స్‌కు అలవాటుపడటం తదితర కారణాలు కూడా ప్రస్తుతం యువత పెడదారి పట్టేందుకు కారణమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాంశాలుగా ఉన్న వాటిని నిర్మూలించేందుకు సంబంధిత యువకుల కుటుంబ నేపథ్యం నుంచి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహిస్తున్న పోలీసు యంత్రాంగం సమాజంలో కీలక భూమికను పోషిస్తున్నా... ప్రభుత్వం కూడా యువతను పెడదారి పట్టించే అంశాలకు కట్టడి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే కొంతమంది యువకులు కొన్ని కారణాలవల్ల మాదక ద్రవ్యాలకు అలవాటుపడి గతి తప్పిన పరిస్థితులలో వారిని మానసిక వైద్యశాలల్లో మానసిక వైద్య నిపుణులచే సకాలంలో సరైన చికిత్సను అందిస్తే వారు మళ్లీ సాధరణ జన జీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
రజనీకాంత్‌కు యంగ్లీడర్స్ మ్యాగజైన్ అందజేత
తాండూరు టౌన్ : యంగ్లీడర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురితమైన మ్యాగజైన్‌ను ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పైలట్ రోహిత్‌రెడ్డి ఆదివారం సినీ హీరో రజనీకాంత్‌కు అందజేశారు. యంగ్లీడర్స్ ఫౌండేషన్‌కు సంబంధించిన ఆడియో సీడీని సైతం మొట్టమొదటిగా రజనీకాంత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పైలట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా స్థాపితమైన యంగ్లీడర్స్ సంస్థ పలు కార్యక్రమాలతో ప్రజలకు చేరువయిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. సంస్థకు సంబంధించిన ఆడియో, మ్యాగజైన్‌ను రజనీకాంత్‌కు అందజేసి, సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించామన్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో చిరకాలం నిలవాలని రజనీకాంత్ ఆశీర్వదించినట్లు పైలట్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య
రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన కడేం బాలకిషన్(30) అనే యువకుడి ఆత్మహత్య ఘటన పలు అనుమానాలకు దారి తీసింది. మృతుడు శనివారం ఉదయం ఉప్పల్వాయి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడి భార్య మానస కుటుంబీకులు ఆత్మహత్య ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. ఉప్పల్వాయికి చెందిన మహిళతో అక్రమ సంబంధమే తన భర్త మృతికి కారణమంటూ పోలీసులకు తెలిపింది. తన భర్త ప్రాణహాని ఉందని డైరీలో రాసుకున్నాడని బోరున విలపించింది. ఘటన స్థలంలో మద్యం సీసాలు, పత్తి మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు బాలకిషన్ రామారెడ్డితో పాటు వివిధ గ్రామాల్లో సింకార్డులను విక్రయిస్తూ జీవనం గడుపుతున్నాడు. శుక్రవారం మృతుడి భార్య మానస తల్లిగారి ఇంటికి వెళ్లింది. శుక్రవారం రాత్రి ఫోనులో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఫోను అందుబాటులోకి రాలేదని భార్య తెలిపింది. మృతుడు బాలకిషన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రామారెడ్డి ఎస్ఐ సురేష్ తెలిపారు. -
యువకుడి బలవన్మరణం
కల్వకుర్తి టౌన్ : సొంత ఇంట్లో ఓ యువకుడు ఫ్యా న్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కల్వకుర్తి లో శుక్రవారం చో టుచేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. పట్టణం లోని వాసవీనగర్కాలనీలో నివాసం ఉంటున్న మహేష్(25) అనే యువకుడు శుక్ర వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకి దించి పోస్టుమా ర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
మత్తు మందు ఇచ్చి.. వీడియోలు తీసి
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ) : స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఓ యువకుడు సమీపంలోని యువతిపై కన్నేశాడు. మంచినీళ్లు కావాలని పలు మార్లు మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు.. మంచివాడిగా నటిస్తూ తన ఇంటికి తీసుకువెళ్లి తల్లిదండ్రులను పరిచయం చేస్తానన్నాడు... నమ్మి ఇంటికి వెళ్లిన యువతికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు... విషయం బయటకు చెబితే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అచ్చం సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని టేనర్‌పేట అడ్డరోడ్డులో చోటు చేసుకుంది. స్థానికంగా ఓ స్కూల్లో పనిచేస్తున్న యువతి (20) తన అన్నయ్యతో కలిసి ఉంటోంది. యువతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. అన్నయ్య మానసిక పరిస్థితి సరిగా ఉండదు. చిట్టినగర్ దుర్గాసి రాములు వీధికి చెందిన పొట్నూరి లక్ష్మణ్ స్నేహితులతో కలిసి స్కూల్ గ్రౌండ్‌కి క్రికెట్ ఆడేందుకు వచ్చేవాడు. క్రికెట్ ఆడే సమయంలో లక్ష్మణ్ స్కూల్ ఆవరణలో ఉండే యువతిని గమనించాడు. ఆమెతో మాటలు కలిపేందుకు పదే పదే మంచినీళ్లు కావాలని అడిగే వాడు. చివరకు యువతి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేయడం, మెస్సేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. నమ్మకంగా ఉండటంతో లక్ష్మణ్‌తో యువతి మాట్లాడేది... ఒక రోజు ఆమెను తన ఇంటికి రావాలని, తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పి నమ్మించాడు. బైక్‌పై ఇంటికి తీసుకు వెళ్లగా... ఇంట్లో అందరూ బయటకు వెళ్లారని చెప్పి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడమే కాకుండా సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అంతే కాకుండా యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. అప్పటి నుంచి పలు మార్లు బైక్‌పై పార్కుకు, సినిమాలకు, ఆలయాలకు తిప్పేవాడు..అయితే రెండు నెలల కిందట యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అప్పటి నుంచి లక్ష్మణ్ తప్పించుకుని తిరగడమే కాకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. అతని స్నేహితులను ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు గురువారం కొత్తపేట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితుడి కోసం వెతకటం ప్రారంభించారు. -
బస్సులో యువతి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ బస్సులో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి భద్రాచలంలో యువతి బస్సు ఎక్కినట్లు తెలిసింది. బస్సు వీఎం బంజరు వద్దకు రాగానే యువతి నోటి నుంచి నురగలు వస్తుండటం తోటి ప్రయాణికులు గమనించి డ్రైవర్‌కు, కండక్టర్‌కు తెలిపారు. దీంతో వారు బస్సును ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు, యువతి మృతిచెందినట్లు ధృవీకరించారు. ఐడీ కార్డు ఆధారంగా మృతురాలు విజయవాడకు చెందిన లావణ్యగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇటీవలే యువతికి పెళ్లిచూపులు కూడా జరిగినట్లు తెలిసింది. చేతిపై మిస్ యూ డాడీ అంటూ పెన్నుతో యువతి రాసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమంచిపల్లిలో వ్యక్తి దారుణ హత్య
అనుమంచిపల్లి (జగ్గయ్యపేట) : ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన గ్రామంలో శుక్రవారం అర్దరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పసుపులేటి బ్రహ్మయ్య (38) వ్యవసాయ కూలీ రైతు. గ్రామంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. ఈ క్రమంలో రాత్రి గ్రామంలో బ్రహ్మం గారి జెండా ఊరేగింపు ఉంది. దీంతో ఊరేగింపునకు కావాల్సిన పూజా సామాగ్రి కొనుగోలు చేసి ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఇచ్చి బయటకు వెళ్లి వస్తానని చెప్పి రాత్రి 8 గంటల సమయంలో వెళ్లిపోయాడు. 12 గంటలు దాటినా భర్త ఇంటికి రాలేదని భార్య సుజాత అత్తమామలు, మరిదిలకు చెప్పటంతో వారు కూడా గ్రామంలో గాలించారు. అతని ఫోన్ కూడా స్విచ్ఆఫ్ చేసి ఉండటంతో ఆందోళన చెందిన వారు గ్రామ పెద్దలకు తెలిపారు. రాత్రి కావటంతో ఉదయం ఆచూకీ తెలుసుకుందామని చెప్పటంతో కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. పంట పొలాల్లో శవంగా.. శుక్రవారం రాత్రి వెళ్లిన బ్రహ్మయ్య 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కనున్న 24 గంటల కాటా సమీపంలోని పంట పొలాల్లో రక్తపు మడుగులో శవంగా కనిపించాడు. ఉదయం అటుగా వెళ్తున్న రైతులు గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిల్లకల్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. హత్యకు ముందు మృతుడు బ్రహ్మయ్యతో పాటు మరి కొంత మంది మద్యం సేవించినట్లు, ఆ తర్వాతే హత్య జరిగిందని ఆ ప్రాంతంలోని మద్యం సీసాలను బట్టీ నిర్దారించారు. మృతుడిని పెద్ద బండరాయితో తలపై మోదటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హత్య వార్త దావానలంగా వ్యాపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. సీఐ జయకుమార్ వచ్చి హత్య జరిగిన తీరును, మృతుడి భార్య, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ యువజన నాయకుడు సామినేని ప్రశాంత్ సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీసు జాగిలంతో గాలింపు.. మచిలీపట్నం నుంచి పోలీసు జాగిలం (రాజా) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం మాస్టర్ రవి పర్యవేక్షణలో హత్య జరిగిన ప్రదేశం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర గ్రామంలోని మూడు గృహాల వద్దకు వెళ్లి తారసలాడి మళ్లీ హత్య జరిగిన ప్రదేశానికి వచ్చింది. దీంతో పోలీసులు గ్రామంలోనే కొందరు హత్యకు ప్రేరేపించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య చేశారా, లేక చేతబడి చేయిస్తున్నాడనే వదంతుల కారణంగా చంపేశారా అన్న అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. -
యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ పట్టుబడ్డ యువకుడు
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యువతులపై లైంగిక వేధింపులు రోజు రోజుకు మరింత ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి విషయాలు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. కొందరు అలాంటి విషయాలను చెప్పుకోలేక లోలోపల మధనపడుతుంటే, మరి కొందరు ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కొంటున్నారు. తాజాగా గచ్చిబౌలికి చెందిన ఓ యువతిని బ్లాక్మెయిల్ చేసున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజమండ్రికి చెందిన మొహమ్మద్ ఖాదర్ బుఖారి గత కొద్ది రోజులుగా యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ తనకు డబ్బులు పంపాలని లేకపోతే నగ్న ఫొటోలు ఫేస్బుక్, వాట్సప్‌లో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువతి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖాదర్ బుఖా పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
మైనర్ బాలికతో ప్రేమ.. టవరెక్కిన యువకుడు
సాక్షి, నల్గొండ : తమ ప్రేమను బతికంచండంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి సెల్ టవర్ ఎక్కిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కొండమల్లేపల్లికి గ్రామానికి చెందిన ఓ యువకుడు మంగళవారం ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధించారని, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని లేదంటే దూకుతానని హెచ్చరిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది యువకుడికి నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. మా అమ్మాయి మైనర్ ఆ యువకుడిపై అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ అయిన తమ కుమార్తెను ఆ యువకుడు ప్రలోభాలకు గురి చేశాడని వారు మండిపడ్డారు. తమ కూతురికి మైనారిటీ తీరలేదని, అందుకే ఇప్పుడు పెళ్లి చేయలేమని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తమ కూతురుని బంధించలేదని, మైనారిటీ తీరకుండా వివాహం ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. సూసైడ్‌నోట్.. సెల్‌టవర్ ఎక్కిన ఆ యువకుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో.. గత నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని, ప్రేమ విషయం తెలిసి తనపై ఆమె తల్లిదండ్రులు అక్రమ కేసులు పెట్టించారని ఆ యువకుడు పేర్కొన్నాడు. ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతోనే తమ ప్రేమను అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. గతంలో తమను కొట్టారని.. అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామని నోట్లో తెలిపాడు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని, ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను బంధించి చిత్రవదలకు గురిచేస్తున్నారని తన లేఖలో వివరించాడు. -
వీడియో ఒకరిది.. చావు మరొకరిది..
న్యూయార్క్ : ఓ యువకుడికి సంబంధించిన వ్యక్తిగత వీడియో మరో యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఉదంతం న్యూయార్క్ సిటీలోని బ్రాంక్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూయార్క్‌లోని బ్రాంక్స్కు చెందిన లెసాండ్రో గజ్మన్ ఫెలిజ్(15)ను గత గురువారం రాత్రి 11 గంటల సమయంలో కొంత మంది యువకులు కత్తులతో వెంబడించారు. అతడు ప్రాణభయంతో దగ్గరలోని ఓ దుకాణంలోకి పరుగులు తీసినా విడిచి పెట్టలేదు. దుకాణం లోపల దాక్కున్న అతన్ని బయటకు లాగి కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తి పోట్లతో ఉన్న గజ్మన్ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొద్ది దూరం పరుగులు తీసిన వెంటనే అతను ఓ చోట కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతన్ని గుర్తించిన కొందరు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గజ్మన్ మృతి చెందాడు. అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. ఓ యువకుడు తన మిత్రుడి సోదరితో కలిసి ఉన్న వ్యక్తిగత వీడియోను సోషల్ మీడియాలో ఉంచాడని, ఆ యువకుడిని చంపాలనుకుని పొరపాటున అదే పోలికలతో ఉన్న గజ్మన్‌ను చంపామని వారు తెలిపారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పెళ్లికి ఒప్పుకోలేదని..
పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు యువ తి కుంటుంబ సభ్యులపై దారుణానికి ఒడిగట్టాడు. యువతి, తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ çసంఘటనలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి, తిరువణ్ణామలై : పెళ్లికి అంగీకరించలేదని యువతి, తల్లిదండ్రులపై దాడిచేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో యువతి, తల్లి మృతిచెందగా, యువతి తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కణ్ణమంగళం సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని కనికాపురానికి చెందిన శివరామన్(54) వ్యవసాయ కూలీ. ఇతని భార్య చామండీశ్వరి(44), వీరి కుమార్తె నిర్మల(24) ఎంఏ, బీఎడ్ పట్టభద్రురాలు. ఇదే గ్రామానికి చెందిన రాజవేలు కుమారుడు అన్బయగన్(34) వీరికి బంధువు అవుతాడు. ఇతను నిర్మలను వివాహం చేసుకోవాలని ఆశతో ఉన్నాడు. నిర్మల చదువుకు అయ్యే ఖర్చులు పూర్తిగా అన్బయగన్ పెట్టినట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం శివరామన్ ఇంటికి వెళ్లి నిర్మలను వివాహం చేసుకుంటానని అన్బయగన్ కోరాడు. ఇందుకు చామండీశ్వరి నిరాకరించడం, నిర్మల కూడా వివాహం చేసుకోనని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన అన్బయగన్ ఇంట్లో ఉన్న కత్తితో చామండీశ్వరి, శివరామన్, నిర్మలను పొడిచాడు. నిర్మల, చామండీశ్వరి అక్కడిక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలతో శివరామన్ కేకలు వేశాడు. దీంతో అన్బయగన్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ కేకలు విన్న స్థానికులు ఇంటికి వచ్చి శివరామన్‌ను ఆస్పత్రికి తరలించారు. శివరామన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అనంతరం అన్బయగన్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ పొన్ని, డీఎస్పీ సెంథిల్, కణ్ణమంగళం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
నింద మోపారని యువకుడి ఆత్మహత్య
కురవి(డోర్నకల్) : తనపై దొంగతనం నెపం మోపి, తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యాతండాలో శుక్రవారం సాయంత్రం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనంప్రకారం... జగ్యా తండాకు చెందిన బానోతు శ్రీను(21) తన భార్య సంధ్య, కూతురితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. ఇదే తండాకు చెందిన నూనావత్ కరుణాకర్ మానుకోటలోని వసుమతిరెడ్డి ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనుతో ఫోన్లో మాట్లాడి, దూరంగా బతకడం ఎందుకని, ఇక్కడికి వస్తే పని ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. దీంతో శ్రీను తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి తండాకు వచ్చాడు. కరుణాకర్ తాను పనిచేసే ఆస్పత్రిలోనే శ్రీనును వాచ్‌మెన్‌గా పనికి కుదిరించాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉండే సామగ్రి ఒక్కొక్కటి కనిపించడం లేదని, నువ్వే ఆ సామగ్రిని ఎత్తుకెళ్లావంటూ శ్రీనుపై కరుణాకర్‌తోపాటు, ఆస్పత్రిలోని మేడమ్ నిందలు మోపారు. కాగా ఆస్పత్రిలోని కొలకుండ అనే వస్తువు కూడా మాయమైందని, దీన్ని కూడా నీవే తీశావని, నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని శుక్రవారం శ్రీనును కరుణాకర్‌తోపాటు, ఆస్పత్రిలోని మేడమ్ బెదిరించారు. తాను దొంగతనం చేయలేదని పలుమార్లు బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. దీంతో తీవ్రమనోవేదనకు గురైన శ్రీను శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్‌నోట్‌లో ‘నా పేరు శ్రీను, నా చావుకు డీఆర్ కరుణాకర్, అందులో పనిచేసే మేడమ్ కారణం’ అని రాశాడు. ఆ తర్వాత ఇంటి పై కప్పుకున్న కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతలో బయటికి వెళ్లిన భార్య సంధ్య తలుపులు నెట్టి చూసేసరికి భర్త మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా కేకలు పెడుతూ బయటికి పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై నాగభూషణం వచ్చి శవపంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్నేహితుడికి ప్రేమ వివాహం జరిపించి..
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడికి ప్రేమ వివాహం జరిపించిన ఓ యువకుడు తదనంతర పరిణామాలను ఊహించుకొని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భువనగరి జిల్లా వలిగొండకు చెందిన సిరికొండ వెంకటేశ్(22) మాదాపూర్ ఇజ్జత్‌నగర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన ఊరికి చెందిన స్నేహితుడు మహేష్ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాల్సిందిగా వెంకటేశ్‌ను కోరాడు. దీంతో స్నేహితుడికి మద్దతుగా నిలిచిన వెంకటేశ్ పెళ్లి చేశాడు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడ్డాడు. ఆ భయంతోనే తాను అద్దెకుంటున్న గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహితపై నలుగురు అత్యాచారం..
-
దారుణం.. వివాహితపై నలుగురు అత్యాచారం..
సాక్షి, నాగర్‌కర్నూల్ : మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు చేసింది. అయిన దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో గత రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గత రాత్రి నలుగురు యువకులు వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధమైన ఘటనలు చోటు చేసుకోవడం భాధాకరమని అన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
యువకుడి ఆత్మహత్య.. కలకలం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కీసర మండలం దమ్మాయిగూడలో ఫైనాన్సియర్ ఒత్తిడితో మంగళవారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. మహమ్మద్ హనీఫ్ దమ్మాయిగూడలో పిల్లలకు ట్యూషన్ చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. అతను నాగారం నుంచి దమ్మాయిగూడకు వచ్చి వెళ్లేవాడు. ఆ సమయంలో షాహిదా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. మమహ్మద్ హనీఫ్‌కు కొంత డబ్బు అవసరమైంది. షాహిదాను కలిసి తెలిసిన వారి వద్ద రూ. 1,40,000 అప్పుగా ఇప్పింమని అడిగాడు. కాప్రా మండలం, సాయినగర్‌కు చెందిన శ్రీకాంత్ గౌడ్ అనే ఫైనాన్స్ వ్యాపారి వద్ద షాహిదా అప్పు ఇప్పించింది. కానీ మహమ్మద్ తీసుకున్న అప్పు కట్టలేదు. దీంతో శ్రీకాంత్ గౌడ్ షాహిదాను నువ్వు కట్టాల్సిందే అని హెచ్చరించాడు. అనంతరం మహమ్మద్, షాహిదాల మధ్య మంగళవారం మధ్యాహ్నం గొడవ జరిగింది. అతను ఆవేశంగా ట్యూషన్ చెప్పే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని గొళ్ళెం పెట్టుకున్నాడు. కోపం వచ్చినప్పుడు తరచూ ఇలానే చేసేవాడని షాహిదా పట్టించుకోలేదు. అతను ఎంతసేపటికి బయటకు రాలేదు. అనుమానం వచ్చి షాహిదా కిటికిలో నుంచి చూసింది. అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నిర్జీవంగా కనిపించాడు. వెంటనే ఆమె 100 నంబర్‌కి ఫోన్ చేసి జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలం చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతని మరణ వార్త విని కుటుంబ సభ్యలు షాక్‌కు గురయ్యారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కొడుకు చావుకు శ్రీకాంత్ గౌడ్, షాహిదాలే కారణమని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. -
‘కరెంట్’తో చేపల వేట.. షాక్‌తో మృతి
పటాన్చెరు టౌన్ : విద్యుత్ తీగలను నీటి గుంతలో వేసి చేపలు పట్టేందుకు యత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్టారెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని పోచారం పరిధిలోని గణపతి గూడెంకు చెందిన ప్రవీణ్ కుమార్(22) ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం ప్రవీణ్ కుమార్ అతని స్నేహితులు ఠాగుర్శివ, ఎర్దనూర్ ప్రశాంత్ పోచారం సమీపంలో ఉన్న ఈర్లమల్లన్న గుడి సమీపంలోని గుంతలో చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ మద్యం సేవించారు. అనంతరం సమీపంలోని కరెంటు తీగలకు వైరు వేసి ఇంకో చివరను గుంతలో వేసి చాపలు పట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్నేహితులు ఠాగుర్ శివ, ప్రశాంత్ ప్రవీణ్ కుమార్‌ను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందిన్నట్లు డాక్టర్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
టెక్కలి రూరల్: మండంలోని చాకిపల్లి కొత్తూరు జాతీయ రహదారి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రట్టి గురుచరణ్ (22) అనే యువకుడు మృతి చెందాడు. టెక్కలిలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న గురుచరణ్ స్థానికంగా ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఉదయం విధులను ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే బైకుపై కొత్తూరులోని బంధువుల ఇంటికి వెళ్లి మామిడిపండ్లు తీసుకొని తిరిగి వస్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో గురుచరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం దక్కేదని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. గురుచరణ్ మృతి చెందాడన్న వార్త తెలియగానే తండ్రి ప్రభాకరరావుతో పాటు పెట్రోల్ బంకు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్ఐ సురేష్‌బాబు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
చేపల వేటకు వెళ్లి..
జన్నారం(ఖానాపూర్) : మరో రెండు రోజుల్లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ వెళ్లే యువకున్ని విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కబలించింది. ఎదిగిన కొడుకు కుటుంబ బరువు మోస్తాడనే సమయంలో మృత్యువాత పడటంతో ఆ కుటుంబం రోదన మిన్నంటింది. శనివారం జరిగిన ఘటన వివరాలను లక్సెట్టిపేట్ సీఐ శ్రీనివాస్, జన్నారం ఎస్సై ఫరీద్ వివరించారు. మండలంలోని మొర్రిగూడ గ్రామానికి చెందిన లావుడ్యా కిషన్‌నాయక్, యశోదబాయిలకు ఒక కుమారుడు, ఒక్క కూతురు. కుమారుడు సుమన్(23) గత సంవత్సరం డిగ్రీ పూర్తి చేశాడు. శనివారం ఉదయం స్నేహితులు నవీన్, మధు, సురేందర్, రాజు, శ్రీనుతో కలిసి సరదాగా చేపలు పట్టేందుకు సమీపంలోని బద్దుబాయి పొలంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. కర్రకు కరెంటు తీగలు అమర్చి నీటిలో పెట్టి చేపలు చనిపోగానే బయటకు తీస్తారు. ఈ క్రమంలో తీగలు నీటిలో వేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోతూ కుడిచేతితో వైర్‌ను పట్టుకున్నారు. దీంతో షాక్ తగిలి అక్కడ సృహ కోల్పోయి పడిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే జన్నారం ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి తల్లిదండ్రులతోపాటు అక్క ఉంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాస్, ఎస్సై ఫరీద్‌లు పరిశీలించారు. మృతుడి తండ్రి కిషన్‌నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కోచింగ్ వెళ్దామనుకుని.. ఇటీవల ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని కోచింగ్ వెళ్లాలనుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడానికి మాట్లాడుకున్నాడు. అయితే రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం కోచింగ్ వెళ్దామని ఆగాడు. రోజు క్రికెట్ ఆడుకునే కొడుకు ఈ రోజు చేపలకని పోయి కానరాని లోకాలకు వెళ్లాడని కుటుంబీకులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. -
చిల్లర అడిగాడని కోపంతో రెచ్చిపోయి..
-
చిల్లర అడిగితే.. చితక్కొట్టాడు..!
సాక్షి, వనపర్తి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బస్ కండక్టర్ రౌడీలా ప్రవర్తించాడు. ఈ ఘటన వనపర్తి బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఓ యువకుడు తనకు రావాల్సిన రూ.3 చిల్లరను కండక్టర్‌ను అడిగాడు. కోపంతో ఆ కండక్టర్ రెచ్చిపోయి ఆ యువకుడ్ని బస్టాండ్‌లోని కంట్రోల్ రూమ్‌లో వేసి చితకబాదాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే తమదైన శైలిలో పోక తప్పదని వారు హెచ్చరించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సంబంధిత అధికారులు ఎవరూ కూడా అడ్డుచెప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వెంటాడి.. కొడవళ్లతో నరికి
ఎమ్మిగనూరు : పట్టణంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గీతానగర్‌లో నివాసం ఉంటున్న తెలుగు శ్రీనివాసులు కుమారుడు హరికుమార్ (24)ను గుర్తు తెలియని వ్యక్తులు వేటాడి హతమార్చారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక గాంధీ నగర్‌లోని గోబీ సెంటర్ వద్ద ఉన్న హరిని గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో వెంబడించారు. ప్రాణ భయంతో ఆదోని బైపాస్ రోడ్డులోని సుబ్బాజి డాబాలో తలదాచుకునేందుకు వెళ్లగా.. కొడవళ్లతో నరికారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రసాద్, ఎమ్మిగనూరు, నందవరం ఎస్ఐలు హరిప్రసాద్, జగన్ మోహన్ యాదవ్‌లు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ బాలాజీకుమార్ ప్రథమ చికిత్స నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగానే హరికుమార్ ఊపిరి వదిలాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న శ్రీనివాసులు దంపతులు ఆస్పత్రి ప్రాంగణంలో ఆర్తనాదాలు చేశారు. ప్రేమ వ్యవహారమా.. లేదా ఇతర కారణాలతో హరి హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
సూర్యలంక బీచ్‌లో విద్యార్థి గల్లంతు
గుళ్ళపల్లి(చెరుకుపల్లి): అమ్మ వెళ్లొస్తానని చిరునవ్వుతో వెళ్లిన కన్నబిడ్డ కనపడకుండా పోయాడన్న వార్త విని ఆ తల్లి తల్లడిల్లింది. కుమారుడు సరదాగా స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. మండలంలోని మెట్టగౌడవారిపాలెం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్, ఉషారాణి దంపతులకు కుమార్తె వీణ, కుమారుడు పవన్(18) సంతానం. శ్రీనివాస్ ఆర్మీలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందాక గుళ్లపల్లిలో కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. పవన్ ఖాజీపాలెం కేవీఆర్, కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా బాపట్లలోని సూర్యలంక బీచ్ సముద్ర స్నానానికి వెళ్లాడు. నీళ్లలో మునుగుతుండగా అలల ధాటికి సముద్రంలోకి వెళ్లి గల్లంతైపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం రాత్రి వరకు సముద్రంలో గాలించినా పవన్ ఆచూకీ కనిపించలేదు. తిరిగి సోమవారం రాత్రి గాలింపు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. మూడు కుటుంబాలకు ఒక్కడే వారసుడు దాసరి శ్రీనివాసరావు అన్నదమ్ములు ముగ్గురికీ పవన్ ఒక్కడే వారసుడు. పవన్ సముద్రంలో గల్లంతు కావడంతో ఆ మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నవతరం
ఏడాదిలోపే లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నేతలు తమ కార్యకలాపాలను క్రమంగా ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో దశాబ్దాల తరబడి రాజకీయాల్లో కొనసాగుతున్న నేతలే వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలపై కన్నేసిన యువ, ఔత్సాహిక నేతలు కూడా అవకాశం దక్కితే ఎన్నికల బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో అరంగేట్రానికి ఉత్సాహం చూపుతున్న నేతల్లో ఎక్కువమంది పేరొందిన రాజకీయ నేతల వారసులే కావడం గమనార్హం. వీరితో పాటు ప్రవాస భారతీయులు, ఔత్సాహికులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పక్షాల టికెట్ల పందేరం ఎన్నికల నాటికి వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై తరచూ చర్చ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని భావిస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల తరఫునా పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని ముఖ్య రాజకీయ నేతల వారసులతో పాటు, ప్రవాస భారతీయులు, ఔత్సాహిక నేతలు కూడా పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ అరంగేట్రానికి ఆసక్తి చూపుతున్న వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీ అవకాశం దక్కని చోట కొత్త అభ్యర్థులు, లేదా వారసులు టీఆర్ఎస్ పక్షాన బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ, టీజేఎస్ తరఫునా యువ నాయకులు, రాజకీయేతర సంస్థలకు చెందిన వారు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు టికెట్ దక్కని పక్షంలో భవిష్యత్తులో ఇతర రాజకీయ అవకాశాలైనా వస్తాయనే ఆశతో ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు టికెట్ దక్కని పక్షంలో భవిష్యత్తులో ఇతర రాజకీయ అవకాశాలైనా వస్తాయనే ఆశతో ఉన్నారు. వీరి ప్రయత్నాలకు ఆయా పార్టీల అధిష్టానం ఎంత మేర ప్రాధాన్యత ఇస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ కార్యదర్శి ఎం.ఎ.ఫహీంతో పా టు సిద్దిపేటకు చెందిన ఎన్ఆర్ఐ గంప వేణుగోపాల్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఫహీం, వేణుగోపాల్ రాష్ట్ర రాజకీయాల జోలికి వెళ్లకుండా, ఏఐసీసీ అధిష్టానం వద్ద తమ పలుకుబడితో టికెట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఇద్దరు రాజకీయ దిగ్గజాల వారసులు బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. దివంగత బాగారెడ్డి కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెలే గీతారెడ్డి కూతురు మేఘనారెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే యోచనలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన టీపీసీసీ బస్సు యాత్రలో భాగంగా జహీరాబాద్‌లో జరిగిన సభ ఏర్పాట్లను మేఘనా రెడ్డి పర్యవేక్షించడంతో అరంగేట్రం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రెండు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్ వారసుల రంగ ప్రవేశంపై జోరుగా చర్చ జరుగుతోంది. దామోదర జన్మదినం సందర్భంగా ఆయన కూతురు త్రిష ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. తాజాగా నియోజకవర్గంలో హరీశ్‌రావు పర్యటన సందర్భంగా బాబూమోహన్ కుమారుడు ఉదయ్ పేరిట పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ తన తండ్రి ముత్యంరెడ్డి చేసిన సేవలను గుర్తు చేస్తూ, కేడర్‌ను కలుస్తున్నారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో యువ నాయకత్వం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే యోచన తో ఉంది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కు మారుడు అభిషేక్ (బీజేపీ), పటాన్చెరు జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ (టీడీపీ) ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు అమీన్పూర్ సర్పంచ్ కాటా శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్), గోదావరి అంజిరెడ్డి (కాంగ్రెస్) పోటీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సాపూర్‌లో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను ఆశించే అవకాశం ఉంది. హత్నూర జెడ్పీటీసీ సభ్యురాలు పల్లె జయశ్రీ కూడా టీఆర్ఎస్ టికెట్‌ను కోరాలనే యోచనలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మేనల్లుడు సంతోష్‌రెడ్డి ఇటీవల నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రవాస భారతీయుడు ఆత్మకూరు నాగేశ్ కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితిని టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ నుంచి ప్రతాప్‌రెడ్డి చేరికతో జశ్వంత్‌కు ఎంత మేర అవకాశం దక్కుతుందో చూడాల్సిందే. సిద్దిపేట జిల్లా పరిధిలో కొత్తగా చేరిన హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు చెప్తున్నారు. -
గోదావరి నదిలోకి దూకిన యువకుడు..
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకేశాడు. ఈ ఘటన శుక్రవారం రాజమండ్రి రైలు కమ్ రోడ్డు వంతెన వద్ద చోటుచేసుకుంది. వివరాలివి.. కిరణ్ అనే యువకుడు తల్లి, సోదరుడితో కలిసి కొవ్వూరి వైపు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా వాహనం ఆపేసి వంతెన పై నుంచి గోదావరి నదిలోకి దూకాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. ఆ తల్లి రోదన మాత్రం ప్రతీ ఒక్కరిని కలచివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పుట్టిన రోజు నాడే మృత్యు ఒడికి..
మహబూబాబాద్ రూరల్ : పుట్టిన రోజునాడే ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. స్నేహితులతో కలిసి బైక్‌పై దైవదర్శనానికి వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలంలోని బేతోలు గ్రామంలోగల జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథ నం ప్రకారం... మహబూబాబాద్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మంచాల చినవెంకన్న ఏకైక కుమారుడు నవీన్(18) పట్టణంలోని వికాస్ జూనియర్ కళాశాలలో ఎంఎల్టీ పూర్తి చేశాడు. డిగ్రీ అడ్మిషన్ పొందేందుకు ద్రువీకరణ పత్రాలు అవసరం ఉండడంతో మానుకోట మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం బుధవారం తన పుట్టిన రోజు కావడంతో మానుకోట పట్టణ శివారులోని గిరిప్రసాద్‌నగర్ కాలనీకి చెందిన ముంజల ప్రశాంత్‌కు చెందిన పల్సర్ వాహనంపై కురవి వీరభద్ర స్వామి దర్శనానికి బయల్దేరాడు. కోడి నవీన్ డ్రైవింగ్ చేస్తుండగా ముత్యాల సాగర్, ముంజల ప్రశాంత్, మంచాల నవీన్ కూర్చున్నారు. వారు బేతోలు గ్రామంలోని జాతీయ రహదారిపైకి చేరుకోగానే ఎదురుగా గేదెలు వస్తుండడంతో బైక్ వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్తున్నారు. ఇదే సమయంలో కురవి వైపు వెళ్తున్న కారు కూడా ఒక్కసారిగా వారి బైక్ పక్కకు వచ్చింది. ఈ క్రమంలో బైక్‌ను కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పగా వెనక కూర్చున్న మంచాల నవీన్ కిందపడిపోయాడు. పక్కనే ఉన్న రూట్బోర్డుకు బైక్ ఢీకొంది. స్థానికులు గమనించి అతడిని 108లో ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కోడి నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా పుట్టిన రోజునే మృత్యు ఒడికి చేరిన నవీన్ మృతదేహంపైపడి అతడి బంధువులు రోదించిన తీరు అందరిని కలచి వేసింది. నవీన్ మృతదేహాన్ని మానుకోట జిల్లా కోర్టు మాజీ ఏజీపీ కొంపెల్లి వెంకటయ్య, జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి అయిలయ్య, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు గార్లపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బూర్ల ప్రభాకర్ సందర్శించారు. సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై నాగభూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచాల నవీన్ మృతదేహం -
ఉద్యోగం రాలేదని మనస్తాపంతో..
వికారాబాద్ అర్బన్ : ఎంబీఏ చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం రోజు ఈ సంఘటన చోటు చేసుకోవడం నిరుద్యోగులను తీవ్రంగా నిరాశ పరిచింది. మండల పరిధిలోని ధన్నారం గ్రామానికి చెందిన నర్సింలు పట్టణంలోని ధర్మ విద్యాలయం ఎయిడెడ్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమారుడు మల్లేశంను బాగా చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలనుకున్నాడు. ఆయన ఆశయం నెరవేర్చేందుకు కుమారుడు మల్లేశం (27) చిన్ననాటి నుండి కష్ట పడి చదువుతూ మంచి మార్కులు సాధిస్తూ వస్తున్నాడు. 10వ తరగతి వరకు వికారాబాద్‌లోని శిశుమందిరం పాఠశాలలో, ఇంటర్ ఓ ప్రైవేటు కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో చదివి మంచి మార్కులతో ఉతీర్ణత సాధించాడు. డిగ్రీ పూర్తి కాగానే పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదివాడు. ఎంబీఏ చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఇటీవలే బ్యాంకు ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. గత రెండేళ్లుగా గ్రూప్–2 ఉద్యోగం కోసం తీవ్రంగా చదువుతున్నట్లు కుటుంబీకులు, మిత్రులు తెలిపారు. సుమారు రూ. 50వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల వికారాబాద్ పట్టణంలోని తన ఇంటి వద్దనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చదువు పూర్తయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తీవ్రంగా మనస్థాపానికి గురయ్యాడు. దీంతో శుక్రవారం ఉదయం ఇంట్లో నుండి వెళ్లిపోయిన మల్లేశం అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటన స్థలానికి వెళ్లి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఎదిగిన కుమారుడు తిరిగి రాని లోకాలకు పోవడంతో వారి ఆవేదనకు హద్దుల్లేవు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మృతదేహాన్ని వికారాబాద్ తీసుకొచ్చారు. శనివారం రాత్రి వారి స్వగ్రామం ధన్నారంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
అమ్మ ఆశలు ఆవిరి !
చందంపేట(దేవరకొండ) : పుట్టుకతో వికలాంగుడైన కుమారుడిని ఉన్నత స్థితిలో చూడాలనుకుంది. ఐదేళ్ల క్రితమే భర్త చనిపోయినా ఇద్దరు పిల్లలను ఏ లోటు లేకుండా చదివిస్తూ వచ్చింది. అమ్మ పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నానంటూ మనస్తాపంతో కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం చందంపేట మండలం పోలేపల్లి పంచాయతీ పరిధిలోని గన్నెర్లపల్లిలో జరిగింది. గన్నెర్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, బాలయ్య దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలయ్య ఐదేళ్ల క్రితమే చనిపోగా.. లక్ష్మమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పో షిస్తోంది. పుట్టుకతోనే వికలాంగుడైన కుమారుడు కొండ్రపల్లి శ్రీకాంత్(22)కు ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చింది. కుమారుడు చదివి ప్రయోజకుడై కుటుంబ పోషణ బాధ్యతలు తీసుకుంటాడని గంపెడు ఆశలు పెట్టుకుంది. దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ. చదువుతున్న శ్రీకాంత్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో డిగ్రీ ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందాడు. తల్లికి, కుటుంబానికి ఏ విధంగా తోడ్పాటు అందించలేకపోతున్నానని దిగులుతో శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న ఆ తల్లి గుండెలలిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఎదిగొచ్చిన కుమారుడు మృతి ఆ తల్లిని మరింత కుంగదీసింది. -
బైక్ డ్రెయినేజీలో.. శవం రైలు పట్టాల పక్కన
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్) : జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. యువకుడి బైక్ డ్రెయినేజీలో, యువకుడి రక్తం రైలు పట్టాల పక్కన కంకరపై, మృతదేహం రైలు ట్రాక్‌కు సమీపంలో పడి ఉండటంపై అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఆ యువకుడు రైలు ఢీకొని చనిపోయాడని సివిల్ పోలీసులు, డ్రెయినేజీలో పడ్డాకే యువకుడు చనిపోయాడని, కేసు మాది కాదంటే మాది కాదని సివిల్, రైల్వే పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రైల్వే ఎస్ఐ ప్రణయ్‌కుమార్ యువకుడు రైలు ఢీకొని చనిపోలేదని మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారు. నాల్గొటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నాల్గోటౌన్ ఎస్ఐ–2 చాందయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నగరంలోని ముబారక్‌నగర్ తారక్‌నగర్‌కు చెందిన గురువప్పా వంశీధర్(23) శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. శనివారం తెల్లవారుజామున మరో స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లాడు. బైక్ ఎల్మమ్మగుట్ట సోని ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే రోడ్డు పక్కనున్న పెద్ద డ్రెయినేజీలో పడిపోయింది. దీంతో బైక్ నడుపుతున్న వంశీధర్ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. వంశీధర్‌తో ఉన్న స్నేహితుడు వెళ్లిపోయాడు. అనంతరం గంట తర్వాత స్థానికులు అక్కడ చూడగా వంశీధర్ రైల్వే ట్రాక్‌కు సమీపంలో మృతిచెంది ఉండటంతో అవాక్కయ్యారు. ఈ విషయంపై స్థానికులు నాల్గోటౌన్ పోలీసులకు, రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. యువకుడు ముబారక్‌నగర్ తారక్‌నగర్‌కు చెందిన వాడుగా గుర్తించారు. దాంతో పోలీసులు తారక్‌నగర్‌కు వెళ్లి వంశీధర్ ఫొటోను చూపిస్తే అక్కడివారు గుర్తించి వంశీధర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వంశీధర్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాల్గోటౌన్ ఎస్ఐ తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
కోస్గి (కొడంగల్) : జీవనోపాధి కోసం ఓ ఎన్జీఓలో పని చేస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఓ యువకుడు బుధవార ం పట్టణ శివారులో దారుణ హత్యకు గురయ్యా డు. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన రాము(35) వాసన్ స్వచ్ఛంద సంస్థలో గత నాలుగేళ్లుగా కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్ మండలాలకు సంబంధించిన రైతు సంఘాలకు కోఆర్గినేటర్గా పనిచేస్తున్నాడు. కోస్గిలో భార్యాపిల్లలతో అద్దెకు నివాసం ఉంటూ విధులు నిర్వహించేవాడు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం పాతర్లగడ్డ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కృష్ణయ్య ప్రాథమిక పంచనామా నిర్వహించారు. అక్కడ లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా రాముగా గుర్తించారు. అనంతరం పేట సీఐ రామకృష్ణ క్లూస్‌టీంతో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రస్తుతానికి రాముతోపాటు సంస్థలో పనిచేస్తున్న రాఘవేందర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా పట్టపగలు ఓ యువకుడు దారుణ హత్యకు గురి కావడంతో పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది. -
యువకుడిపై ఆటోడ్రైవర్ అత్యాచారం
బనశంకరి: ఓ ఆటోడ్రైవరు ఓ యువకుడిపై అ త్యాచారానికి పాల్పడిన ఘటన చెన్నమ్మకెరె అ చ్చుకట్టుపోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వె లుగుచూసింది. ఉద్యోగనిమిత్తం 8 నెలల క్రి తం నగరానికి వచ్చిన బయటిరాష్ట్రానికి చెందిన మను అనే యువకుడు నగరంలోని మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 23 తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఇట్టిమడుకు చెందిన రాజేశ్‌కు చెందిన ఆటోలో బసవనగుడికి వెళ్లడానికి నాయండహళ్లి వద్ద మను ఆటో ఎక్కాడు. ఇట్టిమడు సమీపంలోని తన ఇంటి వద్దకు ఆటోను తీసుకెళ్లిన రాజేష్..దుస్తులు మార్చుకొని వస్తానని చెప్పి వెళ్లాడు. తర్వాత యువకుడిని రెండవ అంతస్తులోకి రావాలని పిలిచాడు. ఏదైనా సహాయం కోసం పిలుస్తున్నారని భావిం చి వెళ్లిన మనుపై రాజేష్ అత్యాచారానికి పాల్ప డ్డాడు. గదిలో జరిగిన దృశ్యాలన్నింటినీ విడీ యో తీశానని పోలీస్‌స్టేషన్ కు వెళ్తే వాటిని యూ ట్యూబ్‌లో పెడతానని అని బెదిరించాడు. అనంతరం యువకుడిని బసవనగుడిలో వదిలిపెట్టి ఉడాయించాడు. జరిగిన విషయాన్ని మను తన సంస్థ అధికారులకు తెలియజేశాడు. వారు బాధితుడితో కలిసి చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటోడ్రైవరుకోసం గాలింపుచర్యలు చేపట్టారు. -
ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య
జయపురం : ఒడిశా–ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులలో మావోయిస్టులు వారి కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి కాదు, మందుపాతరలు పెట్టి భద్రతా దళాలను ముఖ్యంగా బీఎస్ఎఫ్ జవాన్లను మావోయిస్టులు టార్గెట్ చేస్తూ పులువురిని హత మారుస్తుండగా కూంబింగ్ ఆపరేషన్లు, ఎన్కౌంటర్ల ద్వారా జవాన్లు మావోలను మట్టుపెడుతున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఫారెస్టు డిపోలను తగుల బెట్టడం, రోడ్లు వేయకుండా నిరోధించడంతో పాటు పోలీస్ ఇన్ఫార్మర్లుగా అనుమానించి ప్రజలను చంపుతున్నారు. అటువంటి సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమ జిల్లా దోరణపాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒక యువకుడిని మావోయిస్టులు కొట్టి చంపారు. హత్యకు గురైన వ్యక్తిని దొరణపాయి పోలీస్‌స్టేషన్ పరిధి పూనమపల్లి గ్రామవాసి బంజమ సుజడగా గుర్తించారు. దాదాసు 15మంది నుంచి 20 మంది మావోయిస్టులు ఆ గ్రామానికి వచ్చి బంజమ సుజడను ఇంటినుంచి పిలిపించి ప్రజల సమక్షంలో పెట్టారు. అనంతరం పోలీస్ఇన్ఫార్మర్ అని ఆరోపించి కొట్టి చంపారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ముఖ్యంగా పోలీస్ఇన్ఫార్మర్లకు ఇదే గతి పడుతుందని గ్రామస్తులను మావోయిస్టులు హెచ్చంచినట్లు సమాచారం. ఈ సంఘటనతో ఆ గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. -
సమాధానాలు చెప్పలేదని ముస్లిం యువకుడిపై..
కోల్‌కతా : అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని రైలులో ప్రయాణిస్తున్న ముస్లిం యువకుడిపై తోటి ప్రయాణికులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. మాల్దా జిల్లాకు చెందిన ఓ ముస్లిం యువకుడు హౌరాలో వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడు మే14వ తేదిన హౌరా నుంచి ఇంటికి వెళ్లడానికి రైలు ఎక్కాడు. కొద్ది సేపటి తర్వాత అతని సీటు పక్కన కూర్చున్న నలుగురు వ్యక్తులు అతన్ని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోది, జాతీయగీతం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల గురించిన ప్రశ్నలు అతన్ని అడిగారు. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదన్న కోపంతో అతనిపై చేయి చేసుకున్నారు. అనంతరం ఆ నలుగురు బండేల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎన్జీవో ‘‘బంగ్ల సంసృ్కతి మంచ’’ నిందితులపై కాలియాచక్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
రణరంగంగా తూత్తుకుడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: వేదాంత కంపెనీ స్టెరిలైట్ కాపర్ యూనిట్‌కు వ్యతిరేకంగా తూత్తుకుడిలో వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. బుధవారం పోలీసులు జరిపిన కాల్పులకు 22 ఏళ్ల యువకుడు బలయ్యాడు. మంగళవారం నాటి కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కూడా మృతిచెందాడు. దీంతో రెండ్రోజుల వ్యవధిలో ఇక్కడ మృతిచెందిన వారి సంఖ్య 13కు పెరిగింది. ఆందోళనకారులు అన్నానగర్‌లో బుధవారం కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పోలీసులపైకి రాళ్లు, ఇటుకలు రువ్వడంతో వారు కాల్పులు జరిపారు. తూత్తుకుడి హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. మరోవైపు, స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రెం డు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. -
యువకుడి ప్రాణం కాపాడిన వాట్సప్ పోస్టు
గద్వాల అర్బన్: ప్రేమ విఫలమైందని మనస్థాపానికి చెందిన ఓ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.. హైదరాబాద్ నుంచి కర్నూల్ రైలు ఎక్కి స్నేహితులకు వాట్సప్ ద్వారా ‘‘ఐ మిస్ యూ’’ అంటూ ఫొటో మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకున్నాడు.. అనుమానించిన స్నేహితులు కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు సమాచారం అందజేసి రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే తేరుకున్న రైల్వే పోలీసులు ఆ యువకుడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన సంఘటన ఆదివారం రాత్రి గద్వాల పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా.. కర్నూల్ పట్టణానికి చెందిన మణిరత్నంకు తల్లిదండ్రులు లేరు. మామ దగ్గర పెరిగాడు. ఉపాధి నిమిత్తం బావ సురేష్ వద్ద ఉంటూ.. హైదరాబాద్‌లో ఓల్వా క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు. ఆమె ఇటీవలే వివాహం చేసుకొని వెళ్లిపోయింది. మనస్థాపానికి గురై చనిపోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో కాచిగూడలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. అనంతరం సెల్ఫీ దిగి ‘‘ఐ మిస్ యూ’ అంటూ స్నేహితులకు వాట్సప్ ద్వారా పోస్ట్ చేశాడు. స్నేహితుల సమాచారం మేరకు.. ఏదో జరుగుతుందని అనుమానించిన స్నేహితులు మణిరత్నం బావ సురేష్‌కు సమాచారం అందజేశారు. వెంటనే వీరందరూ కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే పోలీసులకు విషయం చెప్పారు. దీంతో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల పోలీసులను రంగంలోకి దింపారు. చివరకు రాత్రి 11గంటల సమయంలో గద్వాలకు చేరుకున్న రైలులో గద్వాల పోలీసులు వాట్సప్‌లో వచ్చిన ఫొటో ఆధారంగా యువకుడిని గుర్తించి ఆధీనంలోకి పెట్టుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అర్ధరాత్రి గద్వాలకు చేరుకున్నారు. మానసికంగా కృంగిపోయిన యువకుడికి పోలీసులు సుమారు రెండుగంటల వరకు కౌన్సిలింగ్ ఇచ్చి తెల్లవారుజామున కర్నూల్‌కు పంపించారు. యువకుడిని కాపాడిన గద్వాల రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అర్థరాత్రి యువకుడు దారుణహత్య..
సాక్షి, హైదరాబాద్ : ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఖైరతాబాద్‌లోని బీజేఆర్ నగర్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు శివకిరణ్ అనే యువకుడ్ని కత్తులతో నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు బోరబండకు చెందిన శివకిరణ్గా గుర్తించారు. హత్య కేసుతో పాటు చాలా కేసుల్లో శివకిరణ్ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. -
జీడిమెట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో టీఎస్ఐఐసీ కాలనీ వద్ద జరిగింది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఘటన స్థలంలోని మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతిచెందిన యువకులు సురారం సాయిబాబా నగర్‌కి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కలకలం.. యువకుడు దారుణ హత్య..
సాక్షి, ఏలూరు : ఓ బ్రాందీ షాపు వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్ సమీపంలో చోటుచేసుకుంది. మృత్యుడు ఏలూరుకి చెందిన శ్రీహర్షగా గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
స్థిరపడలేక పోయానని యువకుడి ఆత్మహత్య
బీర్కూర్ : మండలంలోని వీరాపూర్‌కు చెందిన యు వకుడు మావురం సాయిలు అలియాస్ సాయిరాం(25) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సంపత్‌కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మృదు స్వభావి అయిన సాయిరాం స్థానిక పాఠశాలలో వీవీగా పనిచేస్తున్నాడు. గతంతో ఎమ్మెస్సీ పరీక్షల్లో కొన్ని పేపర్లు ఫెయిలయ్యాడు. మళ్లీ రెండుమూడు రోజుల్లో పరీక్ష ఉందనగా పాస్ అవుతానో లేదోననే బెంగ తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తమ్ముడు ఎమ్మెస్సీ పాస్ అయి పోయాడని తాను మాత్రం ఇంకా పాస్‌కాలేదని ఉద్యోగం సాధించి తాను జీ వితంలో ఎప్పటికి స్థిరపడుతానో అంటూ మదన పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చెక్కుల పంపిణీ కేంద్రానికి సాయిరాం తల్లి గంగవ్వ వెళ్లగానే గడియ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళలను వేధిస్తున్న యువకుడి అరెస్టు
కాశీబుగ్గ : మహిళలకు అసభ్యకర చిత్రాలు, సంభాషణలు పంపుతున్న యువకుడిని కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస రైల్వేస్టేషన్ పరిధిలోని రైల్వే కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ గఫూర్ తనతో మాట్లాడాలని వాట్సాప్, మెసేజ్, ఇతర లైవ్చాట్ల అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మహిళలను వేధిస్తున్నాడు. వీటిపై పలాస స్టార్ ఆస్పత్రికి చెందిన సిబ్బంది కమలకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ నిందుతుడిని అరెస్టు చేసి పాతపట్నం సబ్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. -
వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవాల్సింది పోయి డబ్బుల కోసం వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువకుడు బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శివశంకర్ (26) బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ బాచుపల్లిలోని శ్రీలక్ష్మీ ట్రావెల్స్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అవసరాల కోసం స్నేహితులైన బాబి, జగదీశ్‌ల వద్ద రూ.30 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు సకాలంలో చెల్లించక పోవడంతో స్నేహితులిద్దరూ వేధించ సాగారు. గత 15 రోజుల నుంచి శివశంకర్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు. విషయాన్ని ట్రావెల్స్ నిర్వాహకులకు చెప్పి, కొంత డబ్బు అడ్వాన్సు ఇమ్మనగా.. అందుకు వారు నిరాకరించినట్టు తెలిసింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివశంకర్ బుధవారం రాత్రి ఎస్ఆర్ నగర్ సమీపంలోని బాపూనగర్‌లో గల శ్రీలక్ష్మీ వైన్‌షాపు పక్కలైన్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే 80 శాతం కాలిన గాయాలకు గురయ్యాడు. పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకుని తీవ్ర గాయాలకు గురైన శంకర్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి చిన్నమ్మ రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. శివశంకర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి.. డ్రైవర్‌పై దాడిచేశాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గాజుల మల్లేషం కూలీ పని చేస్తుంటాడు. సాయంత్రం మోటకొండూర్ మండలం అమ్మనబోలు నుంచి యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామం నుంచి భువనగిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును గ్రామంలోకి రాగానే రాళ్లతో దాడికి దిగి నిలిపాడు. చొక్కా, ప్యాంట్ విప్పుకుంటూ బస్సులోకి వెళ్లి డ్రైవర్ రమేష్‌పై దాడి చేశాడు. దీనిని గమనించిన కండక్టర్, సుమారు 20 మంది ప్రయాణికులు భయాందోళనతో బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో డ్రైవర్ కాపాడేందుకు వచ్చిన గ్రామస్తులను తీవ్రమైన పదజాలంతో దూషిస్తు దాడికి యత్నించాడు. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి, గ్రామానికి చెందిన కొందరు ధైర్యంతో మల్లేష్‌ను తాళ్లతో కట్టేశారు. సంఘటన స్థలానికి యాదగిరిగుట్ట పోలీసులు చేరుకుని విషయం తెలుసుకున్నారు. మల్లేష్‌ను యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
స్నేహితుడు లేని లోకంలో ఉండలేక..
రామారెడ్డి(ఎల్లారెడ్డి) : వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఊరు వేరైనా ఎప్పుడూ కలిసే ఉండే వారు. వారం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం వారిద్దరిని విడదీసింది. మిత్రుడు చనిపోవడంతో కుంగిపోయిన యువకుడు మంగళవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ లోని ఎల్లారెడ్డి మండలంలోని ఉప్పల్వాయిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఉప్పల్వాయి గ్రామానికి చెందిన గాంధారి వినోద్ (19), రామారెడ్డి గ్రామానికి చెందిన ఉస్కే సందీప్ ప్రాణ స్నేహితులు. అయితే, వారం క్రితం రామారెడ్డి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్ దుర్మరణం చెందాడు. మిత్రుడి మరణంతో వినోద్ కుంగిపోయాడు. వారం నుంచి తిండి తినడమే మానేశాడు. మనోవేదనకు గురైన అతడ్ని తల్లి ఎంతగా ఓదార్చింది. కానీ, సందీప్‌ను తలచుకుంటూ రోజూ తల్లడిల్లి పోయేవాడు. తల్లి మంగళవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లి, వినోద్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చి చూసే వరకూ వేలాడుతూ కనిపించడంతో ఆమె గుండెలు బాదుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
భీమవరంలో యువకుడి దారుణహత్య
సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక బ్యాంక్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రొయ్యల కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నారిశెట్టి వెంకట సునీల్ నలుగురు స్నేహితులతో కలిసి గతరాత్రి మద్యం సేవించాడు. అనంతరం ఆ నలుగురు కలిసి సునీల్‌పై దాడి చేసి హత్య చేశారు. కాగా పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అక్క ఊరిలో ఉత్సవాలకు వచ్చి..
పుల్కల్(అందోల్) : అక్క ఊరిలో జరుగుతున్న ఉత్సవాలను చూడడానికి వచ్చిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోర్పోల్లో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఉప్పరిగూడెంకు చెందిన దూసరి శేఖర్(19) కోర్పోల్‌లోని తన అక్క ఊరిలో జరుగుతున్న జాతరకు వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో బట్టలు ఊతికేందుకు వెళ్లాడు. అందరూ ఒడ్డున బట్టలు ఊతుకుతుండగా శేఖర్ స్నానం చేసేందుకు చెరువు లోకి దిగాడు. ఈత వచ్చినప్పటికీ చెరువు అవతలి వైపుకు వెళ్లి తిరిగి వస్తుండగా నీటిలో మునిగి పోయాడు. రెండేళ్ల క్రితం మిషన్ కాకతీయలో బాగంగా చెరువులో పూడిక తీయడంతో నీళ్లు అధికంగా ఉన్నాయి. మనుగుతున్న శేఖర్‌ను గమనించిన వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బయటకు తీసే ప్రయత్నం చేయగా అప్పడికే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పుల్కల్ ఎస్ఐ ప్రసాద్‌రావు విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్ఐ తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతి.. వీరయ్య– నర్సమ్మ దంపతులకు శేఖర్ ఒక్కడే కొడుకు, ఇద్దరు ఆడ పిల్లలు. రెండు సంవత్సరాల క్రితం శేఖర్ తండ్రి వీరయ్య గుండె పోటుతో మృతి చెందాడు. శేఖర్ సంగారెడ్డిలోని ఓ స్వీట్ హౌజ్‌లో పనిచేస్తూ తల్లిని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
బొండపల్లి: మండలంలోని బిళ్లలవలస జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై బొలేరో వాహనం ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలం ఎం. వెంకటాపురం గ్రామానికి చెందిన మత్స గణేష్ (24), మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన సొడ్రోతు నాగరాజు (26) సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామానికి వెళ్లారు. అక్కడ పని ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరారు. బిళ్లలవలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొట్టడంతో వాహనం నడుపుతున్న గణేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుకు కూర్చున్న నాగరాజు త్రీవంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సుదర్శన్ సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. మృతుడు గణేష్‌కు తల్లి లక్ష్మి, సోదరుడు వెంకటేష్ ఉన్నారు. ఈ సంఘటనతో ఎం. వెంకటాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
జబాగుడలో పిడుగుపడి యువకుడి మృతి
జయపురం : నవరంగ్‌పూర్ జిల్లా డాబుగాం సమితిలోని జబాగుడ గ్రామంలో పిడుగు పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆ గ్రామ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. ఇంటికి పెద్ద కొడుకు అకస్మాత్తుగా పిడుగు పడి కళ్ల ముందే మరణించడంతో తల్లి దండ్రులు భోరున విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మోహన హరిజన్ పెద్ద కుమారుడు కృష్ణ హరిజన్(22) ఉదయం లేచి ఇంటి ముందు వరండాలో పళ్లు తోముకుంటున్నాడు. ఆ సమయంంలో అకస్మాత్తుగా పెనుగాలులు వీస్తూ పిడుగులు పడ్డాయి. ఒక పిడుగు కృష్ణ హరిజన్‌పై పడడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. ఇంటిలో ఉన్న వారు ఆ దృశ్యాన్ని చూసి విలçపిస్తూ వెంటనే డాబుగాం హాస్పిటల్‌కు ఫోన్ చేసి 108 అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. కృష్ణ హరిజన్‌ను పరీక్షించిన వైద్యుడు అప్పటికే చనిపోయాడని ప్రకటించారు. ఈ విషయం డాబుగాం పోలీసులకు తెలియడంతో సబ్ఇన్స్పెక్టర్ మహమ్మద్ స్వరాజ్, ఏఎస్సై రేణు ప్రధాన్‌లు సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకున్నారు. సంఘటనపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేశారు. కృష్ణ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. చేతికంది వచ్చిన పెద్ద కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతో తండ్రి మోహన హరిజన్ కుమారుడి మృతదేహంపై పడి రోదించడం చూపరుల హృదయాలను కలిచివేసింది. -
దళిత యువకుడిని చితక బాదిన ఎస్సై!
సాక్షి, రంగారెడ్డి, పరిగి : ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చిన ఓ దళిత యువకున్ని పోలీసులు చితకబాదారు.. దెబ్బలకు స్పృహ కోల్పోయి పడిపోవటంతో హుఠాహుటిన అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు బాధిత యువకుడు తెలిపిన వివరాలు...పరిగి మండల పరిధిలోని తొండపల్లి గ్రామానికి చెందిన రాజు అనే దళిత యువకుడిని ఓ కేసు విషయంలో పరిగి పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సాయంత్రం సెకెండ్ ఎస్ఐ ఓబుల్‌రెడ్డి రబ్బరుతో ఇష్టారాజ్యంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. దీంతో నలుగురు పోలీసులు 108 అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని బాధిత యువకుడు, అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజుతో డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడారు. అయితే కడుపు నోస్తుందని తీసుకు వచ్చి పోలీసులు అడ్మిట్ చేస్తే సెలైన్ ఎక్కించి ట్రీట్మెంట్ చేశామని వైద్యురాలు సునిత తెలిపారు. ఇదే విషయమై డీఎస్పీని వివరణ కోరగా తాను అదే విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ ఘటనను కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి వెంకటయ్య ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
పరిగి పోలీస్‌స్టేషన్‌లో దారుణం
వికారాబాద్ జిల్లా : పరిగి పోలిస్ స్టేషన్లో దారుణం జరిగింది. ఓ కేసు విషయంలో రాజు అనే యువకుడిని స్థానిక ఎస్సై ఓబుల్ రెడ్డి చితకబాదారు. ఎస్సై దెబ్బలు తాళలేక రాజు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసుల దెబ్బలు తాళలేకే స్పృహ కోల్పోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మీడియాకు తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హూటాహుటిన బాధితుడిని పోలీసులు ఇంటికి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువకుడికి దేహశుద్ధి
చెన్నారావుపేట(నర్సంపేట) : యువతిని వేధించిన యువకుడికి దేహశుద్ధి చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరుపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పబ్బతి ప్రవీణ్ ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని గత కొద్దిరోజులుగా ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేగాక యువతి అక్కకు కూడా ఫోన్ చేస్తు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆ యువకుడిని బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టి చితకబాదారు. దెబ్బలకు యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అక్కడి నుంచి కుటంబ సభ్యులు వెళ్లిపాయారు. యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇదంతా గ్రామస్తుల కళ్లెదుటే జరగడంయ గమనర్హాం. యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
ముండ్లమూరు: మండలంలోని ఈదర గ్రామానికి చెందిన క్రిష్టపాటి కొండారెడ్డి (28)ని ప్రత్యర్థులు అతి కిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ సంఘటన రమణారెడ్డిపాలెం–అయోధ్యనగర్ గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈదర గ్రామానికి చెందిన క్రిష్టపాటి వెంగళరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిలు ద్విచక్ర వాహనంపై దర్శి కోర్టుకు వాయిదాకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ప్రత్యర్థులు మార్గమధ్యంలోని రమణారెడ్డిపాలెం–అయోధ్యనగర్ గ్రామాల మధ్య రెండు ద్విచక్ర వాహనాలపై అడ్డగించి వేట కొడవళ్లతో దాడికి దిగారు. తండ్రికొడుకులు కింద పడిపోయారు. వెంగళరెడ్డిపై దాడి చేయడంతో గాయాలతో సమీప గ్రామం రమణారెడ్డిపాలెంలోకి పరుగు తీశాడు. దాడిని గమనించిన స్థానికులు అటుగా రావడంతో దుండగులు కొండారెడ్డిని వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపి అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వెంగళరెడ్డిని తొలుత స్థానికులు వైద్యశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దుండగులు మళ్లీ దాడి చేస్తారన్న భయంతో కుటుంబ సభ్యులు వచ్చేంత వరకూ క్షతగాత్రుడిని గ్రామంలోనే ఉంచాల్సి వచ్చింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలతో ఉన్న వెంగళరెడ్డిని ఓ ప్రైవేటు వాహనంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. మృతుడు కొండారెడ్డికి భార్య రాజ్యలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. హత్య సమాచారం తెలుసుకున్న దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావులు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు కారణాలు స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుడు వెంగళరెడ్డి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామానికి చెందిన క్రిష్టపాటి కొండారెడ్డి హత్యకు గురికావడంతో పాటు అతడి తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాతకక్షల నేపథ్యంలోనే హత్య: గ్రామానికి చెందిన కొందరితో మా కుటుంబ సభ్యులకు వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి. కొంతకాలంగా వారికి మాకు గొడవలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కోర్టు వాయిదా కోసం దర్శి వెళ్లి వస్తుండగా ఈదర గ్రామానికి చెందిన బండి చిన్నపరెడ్డి, బండి నాగిరెడ్డి, బాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు వెంబడించి నాపై దాడి చేసి నా బిడ్డను హత్య చేశారు.-వెంగళరెడ్డి, క్షతగాత్రుడు -
ఆవుల్ని పెంచుకోండి.. పాన్‌షాప్ పెట్టుకోండి..
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యావంతులైన యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలని లేదంటే పాన్‌షాప్ పెట్టుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల చుట్టూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరగడం వల్ల జీవితంలో విలువైన సమయం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. త్రిపుర వెటర్నరీ కౌన్సిల్ ఆదివారం నాడిక్కడ నిర్వహించిన ఓ సెమినార్లో బిప్లవ్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంట్లో ఓ ఆవు ఉండాలి. ఒక్కో లీటర్ ఆవుపాలు ప్రస్తుతం రూ.50గా ఉంది. పదేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరగడానికి బదులుగా పాలు అమ్ముకుని ఉంటే ప్రస్తుతం ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు ఉండేవి. కనీసం రూ.75 వేల పెట్టుబడితో కొంచెం కష్టపడితే నెలకు వీరు రూ.25,000 ఆర్జించవచ్చు. కానీ గత 25 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు సంస్కృతే దీనికి అడ్డంకిగా మారింది’ అని వ్యాఖ్యానించారు. ‘కనీసం 10 మంది నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించాలని అధికారులకు నేను చెప్పాను. ఆవుల్ని, పందుల్ని, కోళ్లను పెంచుకోవడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. రాబోయే మూడు నెలల్లో 3,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని వెల్లడించారు. గతంలో ఓ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పకోడీలు అమ్ముకుని రోజుకు రూ.200 ఆర్జించేవారిని నిరుద్యోగులుగా పరిగణించలేమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విద్యావంతులు వ్యవసాయం చేయలేరన్న సంకుచిత మనస్తత్వమే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమని బిప్లవ్ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు సివిల్స్ పరీక్షను సివిల్ ఇంజనీర్లే రాయాలనీ, మెకానికల్ ఇంజనీర్లు రాయకూడదంటూ బిప్లవ్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. -
ప్రేమ విఫలం : లైవ్‌లో ఆత్మహత్య
సాక్షి, గద్వాల : ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. లైవ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మండలం జక్కేరెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతి నిరాకరించడంతో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహేందర్ ఓ పురుగుల మందుల కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. -
పుట్టిన రోజే సరదా విషాదమైంది..!
సాక్షి, బుక్కపట్నం: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. అదీ తన పుట్టిన రోజే ఈ ఘటన జరిగింది. బంధువులు తెలిపి వివరాల మేరకు.. కృష్ణాపురం గ్రామానికి చెందిన చండ్రాయుడు కుమారుడు సూరి(18) తన పుట్టిన రోజు సందర్భంగా సమీపంలో ఉన్న వ్యయసాయ బావిలోకి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. గట్టు మీద నుంచి దూకిన సూరి ఎంతసేపటికీ బయటకు రాక పోవటంతో స్నేహితులు గ్రామస్తులకు తెలిపారు. వారు వచ్చి బావిలోంచి సూరిని బయటకు తీసుకొచ్చినా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. పుట్టిన రోజే తన కుమారుడు పరలోకాలకు పోయాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యవంతం అయ్యారు. -
ఆదుకుంటే నూరేళ్ల జీవితం!
చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పటికే నలుగురు సంతానంలో ఇద్దరు మృత్యు ఒడికి చేరగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఎవరైనా కిడ్నీ దాతలు ఆదుకుంటే ఆ యువకుడు నిండు నూరేళ్లు బతుకుతాడు. లేదా ఆర్థిక సాయం చేసినా పెద్ద ఆస్పత్రి వారే క్నిడ్నీ సమకూర్చి ఆయుష్షు పోస్తారు. కానీ ప్రస్తుతం ఈ పేదల దగ్గర రెండు ఆప్షన్లకూ దిక్కు లేకపోవడంతో కుమారుడిని చూసి శోకిస్తున్నారు. యర్రగొండపాలెం టౌన్ : యర్రగొండపాలెంలోని జామియా మసీదు వీధిలో నివాసం ఉంటున్న గోపిరెడ్డి ఈశ్వరమ్మ, రామిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం క్రితం ఒక కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరొక కుమార్తె అనారోగ్యంతో మరణించింది. రెండెకరాల పొలం ఉన్నప్పటికీ, వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి. సొంత ఇల్లు లేదు. దీంతో భార్యా భర్తలు కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు మగ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. పెద్ద కుమారుడు గోపిరెడ్డి అంజిరెడ్డి (21) 10వ తరగతి వరకు చదివి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నాడు. అయితేగత సంవత్సరం దసరా పండగకు ముందు అంజిరెడ్డికి కాళ్ల వాపు, జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించినప్పటికీ, నయం కాక పోవడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లారు. అక్కడ అంజిరెడ్డికి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు రెండు కిడ్నీలు పనిచే యడం లేదని, డయాలసిస్ చేయాలని చెప్పారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో, మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యశాలకు వెళ్లారు. అక్కడ అంజిరెడ్డికి మళ్లీ వైద్యపరీక్షలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ ఉచితంగా చేస్తామని, అయితే కిడ్నీ ఇచ్చేందుకు దాతలు అవసరమని చెప్పారు. ఇది సాధ్యం కాకపోవడంతో హైదరాబాద్‌లోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వెళితే, కిడ్నీ కూడా తామే ఏర్పాటు చేస్తామని, ఇందుకు రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వీరి దగ్గర ఎందుకుంటుంది? దీంతో డయాలసిస్ చేయించుకుని మందులు వాడుతుండాలని చెప్పారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఎన్ఆర్ఐలో డయాలసిస్ చేయించుకుని మందులు వాడుతున్నారు. డయాలసిస్‌కే బోలెడు ఖర్చు ఒక్కసారి డయాలసిస్ చేయించుకోవాలం టే రూ. 2వేలు ఖర్చు అవుతాయి. వారంలో 3 సార్లు హాస్పిటల్‌కు వెళ్లి డయాలసిస్ చేయించుకునేందుకు, మందులు, రవాణా చార్జీలు మొత్తం కలిసి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇంత భారం మోయలేక ప్రస్తుతం మార్కాపురం ఏరియా వైద్యశాలలోనే ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు బాధితుడు తెలిపాడు. ఆపరేషన్ చేసి, కిడ్నీ అమర్చేంతవరకు ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. తన బ్లడ్ గ్రూప్ బీ–పాజిటీవ్ అని తన పరిస్థితి గ్రహించి, ఎవరైనా కిడ్నీ ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తే, ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ ఉచితంగా చేయించు అంజిరెడ్డి తెలిపాడు. లేదా హైదరాబాద్‌లోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వెళితే కిడ్నీ కూడా వైద్యులే ఏర్పాటు చేస్తారని చెప్పాడు. కుమారుడి ఆరోగ్యపరిస్థితి చూసి, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు. ప్రభుత్వం కానీ దాతలు కానీ సహకరించి, తమ కుమారుడికి వైద్యం చేయించాలని అంజిరెడ్డి తల్లిదండ్రులు గోపిరెడ్డి ఈశ్వరమ్మ, రామిరెడ్డి వేడుకుంటున్నారు. వైద్య పరంగా లేదా ఆర్థికంగా సాయం అందించాలనుకున్న దాతలు సెల్ నంబరు 9701922801ను సంప్రదించవచ్చు. అంజిరెడ్డి గోపిరెడ్డి ఎస్బీఐ అకౌంట్ నంబర్ 34407845821, సీఐఎఫ్ నంబర్ 87851910505 కు సాయం చేయవచ్చు. -
మావోల్లో కలిసేందుకు అనుమతివ్వండి
జయపురం : దేశంలో మావో యిస్టులు, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. పోలీసు బలగాలు, జవాన్లు మావోయిస్టుల స్థావరాలపై దాడులు జరుపుతూ వారిని మట్టుపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయినా మావోయిస్టుల ప్రభావం తగ్గటం లేదు సరికదా గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా యువత మావోయిస్టుల ఉద్యమాలలో చేరుతున్నారు. అందుకు కారణాలను పాలకులు విశ్లేషిస్తున్నట్టు కనపడడం లేదు. ముఖ్యంగా మౌలిక సౌకర్యాలు లేకపోవటం, ఆహార భద్రత, జీవించే హక్కు కనిపించకపోవటం వల్లే పలువురు గ్రామీణ ప్రాంత యువత మావోల పోరాటాల బాటపడుతున్నట్టు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. వారి అభిప్రాయంలో అవాస్తవంలేదని ఒడిశా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండాగాం జిల్లాలో శనివారం చోటుచేసుకున్న సంఘటన వెల్లడిస్తుంది. వోయిస్టులకు అడ్డగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక యువతి కొండాగాం జిల్లా కలెక్టర్‌ను కలిసి తాను మావోస్టుల సంఘంలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అందుకు కారణం వారి జీవనాధారమైన చిన్న కాఫీ దుకాణాన్ని తొలగించటమేనట. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే కాకుండా సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో చర్చనీయమైంది. లలిత పోయమ్ అనే ఆ యువతి కుటుంబం రోడ్డుపక్కన చిన్న టీ దుకాణం పెట్టుకొని బతుకుతుంది. కొండాగాం జిల్లా బొడకురిసినా గ్రామం వద్ద ప్రభుత్వ స్థలంలో ఆమె తాత ఎంతో కాలంగా ఒక చిన్న టీ దుకాణం పెట్టుకొని తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ప్రభుత్వ స్థలంలో చట్టవిరుద్ధంగా దుకాణం పెట్టారని చెçప్పి ప్రభుత్వ అధికారులు ఈ దుకాణాన్ని పడగొట్టారు. ఉన్న ఒక్క జీవనాధారం పోవటంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. జీవించేందుకు మరో మార్గంలేక పలుఇబ్బందులు పడుతున్నామని, టీ దుకాణాన్ని అదే స్థలంలో పెట్టేకునేందుకు అనుమతించాలని, ఆర్థిక సహాయం కూడా చేయాలని ఆ యువతి జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన అభ్యర్థనను అంగీకరించకపోతే తాము మావోయిస్టుల ఉద్యమంలో చేరుతామని స్పష్టం చేసింది. మావోయిస్టుల ఉద్యమంలో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కొండాగాం జిల్లా కలెక్టర్‌ను ఆమె అభ్యర్థిచిందని సమాచారం. కేవలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే కాదు ఆ రాష్ట్ర సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని అందుచేతనే యువతీ యువకులు మావోయిస్టుల బాట పడుతున్నారని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అందుచేత ప్రభుత్వాలు స్పందించి ప్రజలకు మౌలిక అవసరాలు తీర్చటంతో పాటు వారు జీవించేందుకు తగిన పరిస్థితులు కల్పిస్తే లలిత పోయమ్ లాంటి యువతీయువకులు మావోయిస్టులలో చేరుతామని ఎన్నడూ అనరని అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
విషాదం: యువతి, యువకుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఇంట్లో ఎవరులేని సమయంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఖైరతాబాద్ సీబీఐ క్వార్టర్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలివి.. వర్షశ్రీ(22), మహేశ్వర రెడ్డి(25)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహేష్ ఉరివేసుకోగా, యువతి కిటికీకి బట్ట బిగించుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ బంధువుల పెళ్లికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కన్నీరే మిగిలింది
మోర్తాడ్: ఆర్నెళ్ల కింద రోడ్డు ప్రమాదంలో మరణించిన భర్త లేని లోటుతో విషాదంలో ఉన్న మందగొల్ల మౌనికను మరో విషాదం వెంటాడింది. వేసవి సెలవుల కోసం తన పెద్దమ్మ ఇంటికి వెళ్లిన మందగొల్ల సాయి చైతన్య(11) బుధవారం ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. దీంతో తీరని దుఖంలో ఉన్న మౌనికకు ఇక కన్నీరే మిగిలింది. వరుస ప్రమాదాలు వెంటాడటంతో మౌనిక వేదన వర్ణనాతీతంగా ఉంది. మోర్తాడ్ మండలం వడ్యాట్‌కు చెందిన ముత్తెన్న మోర్తాడ్ నుంచి తన సొంత గ్రామానికి బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్ని మరణించాడు. దీంతో పుట్టెడు దుఖంలో ఉన్న ముత్తెన్న భార్య తన కొడుకులను సాకుతూ కాలం వెళ్లదీస్తోంది. అయితే సాయి చైతన్య మౌనిక సోదరి స్వగ్రామం జగిత్యాల్ జిల్లా మల్లాపూర్‌కు వేసవి సెలవుల కోసం వెళ్లాడు. భర్త ప్రమాదంలో మరణించగా ఆ దుఖం నుంచి తేరుకోకముందే పెద్ద కొడుకు మరణించడంతో మౌనిక వేదనను చూసి అందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
పుంగనూరు : పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ అరుణ్ కుమార్‌రెడ్డి కథనం మేరకు.. స్థానిక కోనేటిపాళ్యంకు చెందిన లేట్ రమేష్ కుమారుడు అనీల్(25) గోకుల్‌వీధిలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు. తిరిగి దుకాణానికి ద్విచక్రవాహనంలో వస్తుండగా బైపాస్ రోడ్డులో పుంగనూరు నుంచి తమిళనాడుకు ఆవులతో వెళుతున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అనీల్‌ను స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి ఇష్టం లేదని యువకుడి ఆత్మహత్య
మనోహరాబాద్(తూప్రాన్): పెళ్లి ఇష్టం లేదని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామస్తులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన ఎర్కలి భిక్షపతి, పెంటమ్మల పెద్ద కొడుకు నరేష్(22) నిత్యం మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామ శివారులోని ప్రైవేట్ పరిశ్రమలో పని చేయడానికి రైలులో వెళ్లేవాడు. మంగళవారం ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి డబిల్పూర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులకు సమాచారం అందింది. దీంతో వారంతా అక్కడికి తరలివెళ్లారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని పంచనామా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉండేవాడని, పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
చెరువులో మునిగి యువకుడు మృతి
పెద్దముడియం : మండల పరిధిలోని పెద్దపసుపుల గ్రామంలో చెరువులో మునిగి మస్తాన్ (18) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల మేరకు మస్తాన్ మంగళవారం మధ్యాహ్నం సమయంలో చెరువుకట్ట మీద వెళుతూ కాలుజారి నీటిలో పడ్డాడు. సమీప గ్రామస్తులు కాపాడేందుకు ప్రయత్నించే లోపే మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను జమ్మలమడుగు వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట పెద్దపసుపుల మాజీ సర్పంచ్ రమణారెడ్డి, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శులు కుళాయిబాషా, మున్నా తదితరులు పాల్గొన్నారు. -
స్థల వివాదంలో యువకుని హత్య
చేతగుడిపి(తర్లుపాడు) : గడ్డి వామి స్థలం వద్ద తగదాతో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని చేతగుడిపి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పొట్టేళ్ల రామాంజనేయులు(32) హత్యకు గురయ్యాడు. తర్లుపాడు ఎస్సై టి.లక్ష్మారెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన బైనబోయిన రామయ్య, బైనబోయిన లక్ష్మయ్య, పొట్టేళ్ల ఆంజనేయులకు గత కొంతకాలంగా వామి గడ్డి స్థలం వివాదం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఘర్షణలో ఇరువర్గాలపై కేసులు నమోదైంది. సోమవారం పొదిలి మెజిస్ట్రేట్ కోర్టులో వామి గడ్డి స్థలం వివాదం కేసు, రాజీ పరిష్కారం చేశారు. అనంతరం స్వగ్రామానికి చేరిన ఇరు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పొట్టేళ్ల రామాంజనేయులను వరుసకు మామలైన బైనబోయిన రామయ్య, బైనబోయిన లక్ష్మయ్యలతో పాటూ మరికొంత మంది మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై తెలిపారు. తర్లుపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : స్నేహితుడి మృతికి పరోక్షంగా తనే కారణమని మనస్తాపానికి గురైన యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలోనే స్నేహితులిద్దరూ మృత్యువాత పడటం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పోలీసుల కథనం మేరకు... నగరంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన జయశేఖర్, శకుంతలమ్మ దంపతుల కుమారుడు ప్రశాంత్ (23), విశాఖపట్నంకు చెందిన కండక్టర్ హరిప్రసాద్ కుమారుడు హేమంత్ (23) స్నేహితులు. హేమంత్ పీవీసీ పైపులు, డ్రిప్ పరికరాలకు సంబంధించిన బిజినెస్‌ను అనంతపురంలోని బళ్లారిరోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ప్రారంభించానుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం నగరానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపి.. రాత్రికి ఎస్టేట్ సమీపంలోనే పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి దాటాక (ఆదివారం వేకువజామున ఒంటి గంట)ద్విచక్రవాహనాల్లో ఇళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రశాంత్ వేగంగా వస్తూ పీటీసీ ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో మృతి చెందాడు. ప్రశాంత్ మృతికి పరోక్షంగా తానే కారణమనే భావనతో హేమంత్ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రాజీవ్‌కాలనీ సమీపాన రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని, మార్చురీకి తరలించారు. సోమవారం ఆధార్ కార్డ్ ఆధారంగా ప్రశాంత్ స్నేహితుడు హేమంత్ మృతదేహంగా గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఇంటికి పెద్ద దిక్కనకున్న ఒక్కగానొక్క కొడుకు శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంలో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. చేతికొచ్చిన కొడుకు తమకు ఆసరాగా ఉంటాడకుంటే తలకొరివిపెట్టాల్సి వస్తోందని విలపిస్తున్నారు. గోదావరిఖని సీఐ చిలుకూరి వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గోదావరిఖని–యైటింక్లయిన్‌కాలనీ ప్రధాన రహదారిపై కోల్‌కారిడార్ రోడ్డు పోతనకాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడిపెల్లి సందీప్(24) అక్కడికక్కడే మృతి చెందగా, ప్రయాణిస్తున్న మరో యువకుడు వూతం రంజిత్ తీవ్రగాయాల పాలయ్యాడు. గోదావరిఖనిలో జరిగిన ఓ వేడుకలో క్యాటరింగ్ పనుల కోసం వెళ్లి పల్సర్ వాహనంపై తిరిగి వస్తుండగా పోతనకాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ టేలర్‌కు వెనకభాగాన బలంగా ఢీకొన్నారు. సందీప్ యెటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్ వాసి. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించడం పలువుర్ని కలిచివేసింది. సీఐ వెంకటేశ్వర్లు కేనుసమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై అనుమానాలు.. కాగా సంఘటన స్థలంలో మరో ద్విచక్రవాహనానికి చెందిన ముందుభాగం డూమ్ పడిపోయి ఉండడంతో ప్రమాదంపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. వేరే ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొన్నారా? లేక నేరుగా ట్రాక్టర్‌ను ఢీకొట్టి అదుపు తప్పి వేరే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో రోడ్డు వెంట చీకటి ఉండటం కూడా సంఘటనకు కారణమని తెలుస్తోంది. -
హిజ్రా ఇంట్లో యువకుడి ఆత్మహత్య కలకలం
సాక్షి, చోడవరం (విశాఖ): స్థానిక వెంకన్నపాలెం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు.. హిజ్రా ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని మృతి చెందాడు. తన తల్లి పాపలక్ష్మి చిన్నతనంలో వదిలివేయడంతో సంగం సురేష్‌కుమార్(18) అనే యువకుడు శివాలయం వీధిలో ఉంటున్న వరసకు పెద్దమ్మ అయిన కర్రిసూరమ్మ వద్ద పెరిగాడు. గాయత్రీ పాన్‌షాప్‌లో ఇతను పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 11గంటల వరకూ సురేష్ ఇంటికి చేరలేదు. దీంతో పెద్దమ్మ నిద్రపోయింది. విశాఖపట్నం జిల్లా వెంకన్నపాలెంలో నివాసముంటున్న లోవ అనే హిజ్రా తెల్లవారుజామున తన రూమ్‌కు వెళ్లగా తలుపు లోపల గడి పెట్టి ఉంది. కిటికిలోంచి చూడగా సురేష్ ఫ్యాన్‌కి ఉరేసువేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే సురేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ మునాఫ్, ఏఎస్ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు. గత వినాయక నవరాత్రుల నుంచి హిజ్రా లోవతో సురేష్‌కు స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి వెంకన్నపాలెంలో ఆమె రూమ్‌కు తరుచూ వెళుతున్నాడు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వచ్చి ఇలా జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇంటర్మీడియెట్ వరుకూ చదివిన సురేష్ ప్రస్తుతం పాన్‌షాప్‌లో పనిచేస్తున్నాడని అతని పెద్దమ్మ సూరమ్మ చెప్పింది. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మునాఫ్ తెలిపారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. మృ తుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ పట్టణంలో ఆర్టీసీ కాలనీలో నివాసముండే తోట శ్రీనివాస్ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ డిపో క్లర్క్ (ఏడీసీ)గా పని చేస్తున్నారు. శ్రీనివాస్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా రెండో కుమారుడైన తోట రంజిత్‌కుమార్ (25) పట్టణంలోని ఓ చిట్‌ఫండ్స్‌లో పని చేస్తున్నాడు.. తనకు వేతనం పెంచాలని సంస్థ యజ మానిని కోరగా రంజిత్‌కుమార్ చేసే ఉద్యోగానికి బదులు మరో ఉద్యోగం విధులు నిర్వర్తించాలని, అప్పుడు వేతనం పెంచుతానని చెప్పారు. దీంతో కొద్ది రోజుల క్రితం రంజిత్‌కుమార్ అక్కడ పని బంద్‌చేసి అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆ సంస్థ కాకుంటే మరో సంస్థలో పని చేయవచ్చని తండ్రి శ్రీనివాస్ మృతుడు రంజిత్‌కుమార్‌కు తెలిపాడు. అదే ఆలోచనతో ఉంటూ, మనస్తాపానికి గురైన అతడు గురువారం ఉదయం తల్లిదండ్రులు దేవాలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్లో మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్సై బి. సంతోష్‌రావు తెలిపారు. -
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్చల్
మడికొండ:సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేసిన సంఘటన మడికొండలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మడికొండ గ్రామానికి చెందిన తాటి బద్రి అనే వ్యక్తి మడికొండ శివారులో ఉన్న రామన్ స్కూల్లో పని చేస్తూ జీవిస్తున్నాడు. గత నెల రో జుల క్రితం పాఠశాల యజమాన్యం పనిలో నుంచి తీసివేయడంతో మానసికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చె ప్పారు. గురువారం ఎవరికి చెప్పకుండా మడికొండ జాతీ య రహదారి పక్కన లోతుకుంట వద్ద ఉన్న సెల్ టవర్ ఎ క్కడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అం దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బద్రిని తాళ్లతో కట్టి కిందకు దించారు. తిరిగి గంట తర్వాత మళ్లీ టవర్ పైకి ఎక్కి నాకు ఉద్యోగం ఇప్పించాలని, లేదంటే కిందకు దూకుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని టవర్ పైకి ఎందుకు వెళ్లావని బద్రిని అడగటంతో స్కూల్ నుంచి తనను తీసివేశారు, మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని బద్రి చెప్పాడు. దీంతో రామన్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్‌కుమార్‌ను అక్కడికి పిలిపించి మాట్లాడించి కిందకు దింపారు. -
అమ్మాయిల విషయం.. యువకుడి హత్య
సాక్షి, యశ్వంతపుర: అమ్మాయిల విషయంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ యువకుడు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన కర్ణాటకలోని కామాకిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. యువతుల వ్యవహారంలో ఇటీవల మెజిస్టిక్ వద్ద రెండు గ్యాంగ్‌లు కొట్టుకున్నారు. ఈ విషయంపై మాట్లాడాలని కెంగేరికి చెందిన కోటేశ్వర(21)ను అతని ముగ్గురు స్నేహితులు ఫోన్ చేసి రమ్మన్నారు. అతను కామాక్షిపాళ్య సమీపంలోని ఉన్న మైదానానికి వెళ్లాడు. ఆ సమయంలో మరో ఎనిమిది మంది అక్కడకు చేరుకుని మారణాయుధాలతో కోటేశ్వర, అతని స్నేహితులపై దాడి చేసి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురినీ చికిత్స నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మోదీ చెన్నై పర్యటన..యువకుడి ఆత్మాహుతి
-
మోదీ పర్యటన..చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం తమిళనాట చర్చనీయాంశమైంది. చెన్నైలోని ఈరోడ్ కి చెందిన ధర్మలింగం... కావేరి జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరాశకు లోనయ్యాడు. కావేరి బోర్డు ఏర్పాటుపై ప్రధాని స్పందికపోవడంతో మోదీ పర్యటన నిరసిస్తూ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇంటి గోడపై రాసి అనంతరం ధర్మలింగం ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మంటల్లో కాలిపోతున్న యువకుడిని ఇరుగు పొరుగువారు గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందాడు. ఈ సంఘటనతో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా నిరసనకారులు ఆందోళనలకు దిగారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహానంది : నల్లమల ఘాట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శిరివెళ్ల ఎస్ఐ తోటసాయినాథ్ తెలిపిన వివరాల మేరకు..శిరివెళ్ల మండలం పచ్చర్లకు చెందిన మండ్ల పాములేటి(21)ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో రుణానికి సంబంధించి కంతులను చెల్లించేందుకు నంద్యాలకు చెందిన చిన్నపాములేటి(వరుసకు అన్న), మిత్రుడు రాజశేఖర్‌లతో కలిసి ఇంటి నుంచి బయలుదేరారు. కొద్దిదూరంలోకి వెళ్లగానే వేగంగా వస్తున్న ఓ తుపాన్ వాహనం ఢీకొట్టడంతో మండ్ల పాములేటికి తలకు, ఛాతీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో ఇద్దరూ గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావమై నొప్పులతో అల్లాడుతున్న పాములేటిని ఆస్పత్రికి తరలించేందుకు వాహనం సౌకర్యం లేకపోవడంతో గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు అష్టకష్టాలు పడి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమిచండంతో కోలుకోలేక మృతి చెందాడు. అతడి మృతితో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. శిరివెళ్ల ఎస్ఐ తోట సాయినా«థ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
పరవాడ(పెందుర్తి): ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దేశపాత్రునిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకొంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాని మణికంఠ (21) అదే గ్రామానికి ఓ యువతిని ప్రేమించాడు. తను ప్రేమించిన యువతిని వేరొకరికిచ్చి వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. ప్రేమ విఫలమైన కారణంగా విరక్తి చెందిన మణికంఠ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని మృతి చెందాడు. సోమవారం ఉదయం తన తల్లి కనకలక్ష్మి విధులకు వెళ్లిన తరువాత మణికంఠ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి ఫ్యాన్‌కు వేలాడుతున్న కొడుకును చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పరవాడ సీఐ బి.సీహెచ్.స్వామినాయుడు, ఎస్ఐ జి.వెంకటరావులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి చెడగొట్టాడనే..
అంబర్‌పేట: పట్టపగలు యువకుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. నిందితులను అరెస్టు చేసిన అంబర్‌పేట పోలీసులు సోమవారం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గోల్నాక, మారుతీనగర్‌కు చెం దిన కొప్పుల సతీష్‌గౌడ్(27) ఫైనాన్స్ వ్యాపా రం చేసేవాడు. ఏడేళ్ల క్రితం అతను గోల్నాకకు చెందిన హిమబిందును ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా సతీష్‌గౌడ్ భార్య హిమబిందు సోదరికి గత నెల 14న నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఆమె అదృశ్యం కావడంతో వివాహం ఆగిపోయింది. ఇందుకు సతీష్ గౌడ్ కారణ మని బావించిన హిమబిందు సోదరుడు వెంకటేష్, కాచిగూడకు చెందిన తన చిన్నాన్నసురేష్తో కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 5న సతీష్‌గౌడ్‌ను దిల్‌సుఖ్‌నగర్‌కు పిలిపించారు. భార్యతో కలిసి వచ్చిన సతీష్‌గౌడ్‌ను మాట్లాడి పంపిస్తామని హిమబిందుకు చెప్పి ఆటోలో ఎక్కించుకొని మలక్‌పేట వైపు తీసుకెళ్లారు. మలక్‌పేట వద్ద ఆటోలోంచి దింపి స్కార్ఫియో కారులో ఎక్కిం చుకొని గోల్నాక వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో అతని మెడకు నైలాన్ తో ఉరిబిగించి హత్య చేశారు. అనంతరం గోల్నాక చౌరస్తా వద్ద మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ కేసులో హతుడి బావమరిది, చిన్నమామతో పాటు హత్యకు సహకరించిన రాజు, సంతోష్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి స్కార్ఫియో వాహనం, నాలుగు సెల్ఫోన్లు, నైలాన్ తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ముద్దనూరు రోడ్డుపై బొలెరో, ప్రైవేటు బస్సు ఆదివారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ శనివారపు హరీష్‌రెడ్డి(20) దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివశంకర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిలంకూరుకు చెందిన హనుమంతరెడ్డి, లక్ష్మీదేవి కుమారుడు హరీష్‌రెడ్డి. ఆయనకు సొంతంగా బొలెరో వాహనం ఉంది. ఈ క్రమంలో డ్రైవింగ్ చేస్తూ చిలంకూరు నుంచి ఎర్రగుంట్లకు బయలుదేరారు. ఐసీఎల్ క్వారీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొంది. బొలెరో బస్సు ముందు భాగంలోకి దూసుకొని పోయింది. దీంతో హరీష్‌రెడ్డి తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. బొలెరోలో ఇరుక్కున్న మృతదేహాన్ని.. రెండు క్రేన్లు తెప్పించి గంట పాటు శ్రమించి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దాడి కేసులో యువకుడి అరెస్టు
పామూరు: వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు. పట్టణానికి చెందిన గద్దే గోపీని వ్యక్తిగత కలహాలతో గత నెల 7వ తేదీన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా శనివారం దాడికి పాల్పడిన వెంకటేశ్వర్లును అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు. -
యువకుడి ప్రాణాలు బలిగొన్న ఫ్లెక్సీ కర్రలు
మిర్యాలగూడ అర్బన్ : మున్సిపల్ శాఖ, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ బహిరంగ సభలో గుర్తింపు తెచ్చుకోడానికి ఆ పార్టీ నాయకులు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని చింతపల్లి ఇందిరమ్మకాలనిలో నివాసముంటున్న బూతరాజు వేణు(25) తన ద్విచక్ర వాహనంపై అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌రోడ్డు మీదుగా చింతపల్లికి వెళుతున్నాడు. ఈ క్రమంలో హనుమాన్‌పేట ఫ్లై ఓవర్‌పై ఫ్లెక్సీకర్రల లోడుతో నిలిపిన టాటాఏసీ ఆటోను వెనుకనుంచి వచ్చి ఢీ కొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న ఫ్లెక్సీ కర్రలు వేణు ఛాతిభాగంలో దిగాయి. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. 108సహాయంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి 15రోజుల క్రితమే వివాహం.. కాగా బూతరాజు భిక్షం, యాదమ్మలకు కుమార్తె, ఇద్దరు కుమారులు వారిలో రెండోవాడైన వేణు పట్టణంలో ఎలక్ట్రికల్ హౌసింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 14వ తేదీన డదేవులపల్లి గ్రామానికి చెందిన అనూషతో వివాహం అయింది. కాగా మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రేమించలేదని కత్తితో దాడి
గుంటూరు : తనను ప్రేమించలేదనే కారణంతో ఓ యువతిపై చిన్నా అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన యువతి తల్లీ, చెల్లెలికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన పాత గుంటూరులో శుక్రవారం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒకవైపు పేదరికం.. మరోవైపు జీవితంలో ఇంకా స్థితపడలేదనే మనోవేదనకు గురైన ఓ యువకుడు మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి ఇంటి సమీపంలోనే ఉన్న సెల్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుంభం గోవర్ధన్(22) అనే యువకుడు డిగ్రీలో ఫేయిల్ అయిన సబ్జెక్టులను ఇటీవలే రాశాడు. మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోగా కుటుంబసభ్యులు బంధువులకు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. గురువారం సాయంత్రం సెల్ టవర్ కంపెనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా దుర్వాసన వెదజల్లడంతో లోపలికి వెళ్లి చూసే సరికి కుల్లిపోయిన మృతదేహం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి ఎస్సై చంద్రశేఖర్ చేరుకుని మృతుడి జేబులోని పర్సు, ఫోన్‌ను పరిశీలించగా కుంభం గోవర్ధన్ మృతదేహంగా గుర్తించారు. పేదరికం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి తండ్రి చంద్రమౌళి, ఇద్దరు సోదరులున్నారు. సోదరుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
కోల్‌కతాలో పాములపాడు వాసి దుర్మరణం
పాములపాడు/ఆత్మకూరు రూరల్: పాములపాడుకు చెందిన ఓ యువకుడు కోల్‌కతాలో దుర్మరణం చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు గురువారం తెలిపారు. మృతుడు కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కలబండి రాముడు, ఏసురత్నమ్మ దంపతుల కుమారుడు సురేష్(25) అలియాస్ సుంకన్న లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఆత్మకూరుకు చెందిన లారీ డ్రైవర్ సిరాజ్‌తో కలసి కోల్‌కతా వెళ్లాడు. ఈనెల 2వ తేదీన అక్కడికి చేరుకున్నారు. ఈనెల 3వ తేదీన లారీ లోడింగ్ కోసం సిటీలోకి లోకల్ డ్రైవర్ తీసుకెళ్లడంతో లారీ డ్రైవర్, క్లీనర్ సిటీ బయటనే ఉన్నారు. ఈ క్రమంలో సురేష్ అక్కడి నుంచి బయటకు వెళ్లి వస్తానంటూ వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం డ్రైవర్ సిరాజ్ గాలించాడు. కాగా ఓ ప్రాంతంలో సురేష్ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్లు మృతుడిది ఆత్మకూరు ప్రాంతంగా గుర్తించి వాట్సప్ ద్వారా ఫొటోలు ఇక్కడి వారికి పంపారు. పూర్తి సమాచారం లేకపోవడంతో ఆలస్యంగా గురువారం మృతుడి కుటుంబ సభ్యులకు ఫొటోలు చేరడంతో గుర్తించి బోరుమన్నారు. వెంటనే లారీ డ్రైవర్ సమాచారం చేరవేశారు. మృతదేహం కోసం నిరీక్షణ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సురేష్ మృతదేహం కోసం బంధువులు నిరీక్షిస్తున్నారు. స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కుటుంబీకులు, బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు లారీ యజమాని ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డిని కలిసేందుకు గురువారం బంధువులు పెద్ద ఎత్తున ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి చేరుకున్నారు. కాగా యజమాని అందుబాటులో లేరు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చి కోల్‌కతా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. -
యువకుడి దారుణ హత్య
మెదక్‌రూరల్: ప్రేమించిన పాపానికి ఇంత కిరాతకంగా చంపేస్తారా..? అంటూ మృతుడి బంధువులు రోదించిన తీరు అందరిని కలచివేసింది. బండరాయితో మోదీ ముఖాన్ని గుర్తుపట్టరానంతగా చిధ్రం చేసి , శరీరంపై కత్తితో పొడిసి, మర్మాంగాలపై రాళ్లను పడేసి అతీ కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం దాయర వీధికి చెందిన మహ్మద్ గఫ్ఫర్‌ఖాన్–ఆసియాలకు ఇద్దరు కుమారులున్నారు. రెండో కుమారుడు మోహీన్‌ఖాన్(22) రెండు నెలల క్రితం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించి ఇతర ప్రాంతానికి కొద్ది రోజులు తీసుకెళ్లారని, ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ యువతిని తీసుకొచ్చి అప్పగించినట్లు తెలిపారు. ఈ విషయంలో మోహీన్‌పై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి మెదక్ కోర్టులో సోమవారం పేషీకి హాజరై రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌కు బస్‌లో తిరుగు పయాణమయ్యాడు. బస్సులో ప్రయాణించాల్సిన మోహీన్ మెదక్–చేగుంట ప్రధాన రహదారి పక్కన ఖాజీపల్లి గ్రామ శివారులో దుండగుల చేతిలో అతికిరాతకంగా హత్యకు గురయ్యాడు. శరీరంపై కత్తితో పోడిసి, ముఖాన్ని గుర్తుపట్టరాని విధంగా బండరాయితో మోది కిరాతకంగా చంపేసి రోడ్డు పక్కనే పడేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమిస్తే చంపుతారా..? హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఏపీ13జీ7809 ఇండికా కారును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ప్రేమించిన పాపానికే చంపేసి ఉంటారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మోహీన్‌పై ఇప్పటికే హత్యాయత్నం, అత్యాచారం కింద రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు చెపుతున్నారు. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్‌లు లింబాద్రి, శ్రీకాంత్, సందీప్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్‌టీం బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యానేరంగా పోలీసులు కేసు నమోదుచేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ క్రమంలో మృతుడి బంధువులు నిందితులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అడ్డుకున్నారు. దీంతో త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు నచ్చజెప్పి పోస్టుమార్టంకి తరలించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
అమ్మా... తలవరం జంక్షన్లో చిన్న పని ఉంది, ఫ్రెండ్ వస్తానన్నాడు చూసుకుని వస్తాను. అని ఇంటి వద్ద చెప్పి వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ట్రాక్టర్ రూపంలో మృత్యువు అతడిపైకి దూసుకొచ్చింది. తన కుమారుడిని ట్రాక్టర్ ఢీకొట్టిందనే వార్త తెలిసేసరికి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం జరిగిందోనని ఘటనా స్థలానికి వచ్చేసరికి రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్న కొడుకుని చూసి గుండెలు బాదుకుంటూ విలపించారు. ఆ తల్లిదండ్రుల ఆక్రందన.. ఆవేదనను చూసి కంటతడి పెట్టనివారు లేరు. వీరఘట్టం/పాలకొండ రూరల్: పాలకొండ మండలం బెజ్జి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన బొత్స దాసు అలియాస్ గిరి(24) మృతి చెందాడు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తలవరం గ్రామానికి చెందిన బొత్స మేరమ్మ, రమణల ఒక్కగానొక్క కుమారుడు దాసు. మూడేళ్ల క్రితం రాజమండ్రిలో డిప్లామో పూర్తిచేశాడు. పెద్దగా ఆర్థిక స్థోమత లేకపోవడంతో పై చదువులు చదవాలనే తపనతో ఓ ప్రైవేటు సంస్థలో ఏడాది నుంచి కొరియర్‌గా చేస్తున్నాడు. ఫ్లిప్‌కార్డ్, అమెజాన్ తదితర యాప్‌ల్లో ఆన్లైన్ ద్వారా వస్తువులను బుకింగ్ చేసుకునే వారికి సకాలంలో వస్తువులు అందజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నాడు. ఈ జాబ్ కంటే మంచి అవకాశం రావడంతో రెండు రోజుల్లో విశాఖపట్టణం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తలవరం జంక్షన్లో ఓ ఫ్రెండ్‌ను కలిసేందుకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బైక్‌పై వెళుతుండగా బెజ్జి రోడ్డులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో దాసు మృతి చెందాడు. దాసుకు ఇంజనీరింగ్ చదువుతున్న ఓ చెల్లెలు ఉంది. మిన్నంటిన రోదన తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనను చూసిన దాసు తల్లిదండ్రులు మేరమ్మ, రమణ ఒక్కసారిగా కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు సపర్యలు చేయడంతో కొద్ది సేపటికి మేల్కొని రక్తపుమడుగులో ఉన్న కొడుకు మృతదేహం వద్ద బోరున విలపించారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి తమను ఆదుకుంటావని అనుకుంటే మమల్ని ఒంటరిని చేశావా నాయనా... అంటూ ఆ తల్లి గుండెలు బాధుకుంటూ రోదించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం... అతి వేగం.. ఓ యువకుని ప్రాణం తీసింది. పనసనందివాడ ఇసుక ర్యాంపునకు వెలుతున్న ట్రాక్టర్ బెజ్జి రోడ్డులో మామిడితోటకు సమీపంలో ఉన్న మలుపు వద్ద అతివేగంతో వస్తూ ఎదురుగా వస్తున్న దాసు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాసు రోడ్డుపై దూరంగా పడిపోయాడు. తలకు హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ కూడా తుల్లిపోవడంతో రోడ్డుకు అతడి తల బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. డీఎస్పీ పరిశీలన ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడనే వార్త తెలియగానే పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులను అడిగారు. మృతుడు తల్లి మేరమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయాలని సీఐ సూరినాయుడిని, వీరఘట్టం ఎస్సై అప్పారావును ఆదేశించారు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరిలించారు. ఈ ప్రమాద ఘటనపై ఎస్సై జి.అప్పారావు కేసు నమోదు చేశారు. -
లవ్ ఎఫైర్: యువకుడి దారుణ హత్య
సాక్షి, మెదక్: ఓ యువకుడిని దుండగులు ముఖంపై బండరాయితో కొట్టి అతికిరాతకంగా చంపేశారు. ఈ ఘటన మెదక్ మండలం ఖాజీపల్లి గ్రామశివారులో మంగళవారం చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి ఇంత కిరాతకంగా చంపేస్తారా..? అంటూ మృతుడి బందువులు రోదించిన తీరు అందరిని కలచివేసింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మెదక్ పట్టణం దాయర వీధికి చెందిన మహ్మద్ గఫ్పర్ ఖాన్- ఆసియాలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడైనా మోహీన్‌ఖాన్(22) మెదక్-చేగుంట ప్రధాన రహదారి పక్కన ఖాజీపల్లి గ్రామశివారులో దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. ప్రేమనే హత్యకు కారణమని అనుమానం.. అతనిపై కత్తితో దాడిచేసి, ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా బండరాయితో కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను మోహిన్‌ఖాన్ ప్రేమించి మరొక ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో ఆ బాలికను తీసుకొచ్చి అప్పగించినట్లు చెప్పారు. కోర్టుకెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఈ విషయంలో మోహీన్‌పై గతంలో కేసు నమోదు అయింది. దీనికి సంబంధించి మెదక్ కోర్టులో సోమవారం పేషిక హజరై రాత్రి 8 గంటలకు హైదరాబాద్ బస్‌లో తిరుగపయనమయ్యాడని మృతుడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. కానీ రోడ్డు పక్కనే దుండగుల చేతిలో కిరాతకంగా హత్యకు గురికావడం పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన కొద్ది దూరంలోనే ఏపీ13జి 7809 ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమించినందుకు చంపేసి ఉంటారిని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది వరకు మోహీన్‌పై హత్యాయత్నం, అత్యాచారం కింద రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీం బృందం కూడా పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
అదృష్టం అంటే ఆ అమ్మాయిదే..!
కెనడా : ఆ అమ్మాయిది మధ్యతరగతి కుటుంబం. అయినా బతకడానికి ఏ పని చేయక్కర్లేదు. ఆమె కుటుంబం కూడా ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా జీవితాంతం అలా బతికేయెచ్చు. ఆమె ఇంట్లో వాళ్లు ఏ పని చేయకపోయినా వారానికి వెయ్యి డాలర్లు అప్పనంగా వాళ్ల అకౌంట్లో పడతాయి. ఏంటి ఎందుకు అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన చార్లీ లగార్డే అనే యువతికి తన పుట్టిన రోజున లాటరీ తగిలింది. లాటరీయేగా ఏంటి గొప్ప అనుకుంటున్నారా..? అది మామూలు లాటరీ కాదు. అలాగని కోట్లు ఒకటే సారి వచ్చి పడవు. ఆమె బతికున్నంత కాలం వారానికి వెయ్యి డాలర్లు.. మన రూపాయల్లో అక్షరాల యాభై వేల రూపాయలు .. నెలకు మూడు లక్షల రూపాయలు చార్లీ అందుకోనుంది. కొద్ది రోజుల క్రితమే మొదటి వారానికి సంబంధించిన డబ్బును ఆమె అందుకుంది. ఈ సందర్భంగా చార్లీ మాట్లాడుతూ.. వచ్చిన డబ్బుతో ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని తెలిపింది. ఇప్పుడు ఇలాంటి లాటరీ మనకు కూడా తగిలితే బాగుండనిపిస్తుంది కదూ... -
లారీ ఢీకొని యువకుడి మృతి
మధిర: మండలంలోని సిరిపురం గ్రామ సమీపంలో ఆదివారం లారీ టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. తల్లాడ మండలం స్టేజి పినపాక గ్రామానికి చెందిన కమతం ప్రవీణ్(18), గన్నవరంలో ఏరోనోటికల్ ఇంజనీరింగ్ కోర్సుకు కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజులు సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు పినపాకలో బయలుదేరి వైరా వచ్చాడు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా, తన గ్రామానికే చెందిన స్నేహితుడు చొప్పర విద్యాసాగర్, బైక్‌పై వస్తూ కనిపించాడు. తాను గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు విజయవాడ వెళ్లాలని, మధిర రైల్వే స్టేషన్ వరకు వస్తానని అన్నాడు. ఇద్దరూ బైక్‌పై మధిర వెళుతున్నారు. జాలిముడి ప్రాజెక్టు పనులకు ఏర్పాటుచేసిన టిప్పర్ లారీ, సిరిపురం వద్ద విద్యాసాగర్, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఓవర్టేక్ చేసి, ఎటువంటి సిగ్నల్ లేకుండా ఒక్కసారిగా కుడివైపు తిరిగింది. దీంతో, బైక్‌ను ఆ టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ ప్రైవేటు వాహనంలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ప్రవీణ్ మృతిచెందాడు. ప్రవీణ్, మధిర పట్టణానికి చెందిన మన్నెపల్లి వరప్రసాద్–రత్నకుమారి దంపతుల మనుమడు. -
వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి
టెక్కలి/టెక్కలిరూరల్: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో.. మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రంలో 110 పడకల ఏరియా ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం అందజేయడంతోనే స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన యువకుడు సంకిలి తిరుపతిరావు(27) మృతిచెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. తిరుపతిరావుకు కడుపునొప్పి, తలనొప్పి రావడంతో భార్య పుష్పతో పాటు స్థానికులు ఆయనని శనివారం టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు జ్యోతి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో, శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ‘108’లో రిమ్స్‌కు తరలించగా, తిరుపతిరావు మృతిచెందారు. టెక్కలి ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలు జ్యోతి సక్రమంగా వైద్యసాయం అందజేయలేదని, మరో వైద్యుడు లక్ష్మణరావుకు సమాచారమిచ్చినా స్పందించలేదని మృతుని కుటుంబసభ్యులతో పాటు వీధి ప్రజలంతా అర్ధరాత్రి ఒంటి గంట సమయం నుంచి 2 గంటల వరకు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సురేష్‌బాబు అక్కడికి చేరుకుని వారిని వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వీరు.. ఆదివారం ఉదయం మళ్లీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. లోపలికి ప్రవేశించి వైద్యురాలు జ్యోతిని నిలదీస్తూ ఫర్నీచర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం గేటు వద్ద బైఠాయించి జ్యోతి, సూపరింటెండెంట్ కె.కేశవరావుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు తమ్మన్నగారి కిరణ్, యు.శంకర్, శ్యామలరావు, వార్డు సభ్యుడు దోని బుజ్జి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుపతిరావు కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్థికసాయంతో పాటు ఆయన పిల్లలకు వసతి గృహంలో సీట్లు వచ్చేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్ ఆరా తీశారు. వైద్యురాలు జ్యోతి మాట్లాడుతూ తిరుపతిరావును అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని, వైద్యం అందించాక పరిస్థితి విషమించిందని తెలిపారు. టెక్కలి సీఐ కె.భవానీప్రసాద్, పలాస సీఐ తాతారావు, ఎస్ఐ లు సురేష్‌బాబు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
చలివాగులో పడి యువకుడి మృతి
పరకాల/రేగొండ : బైక్ అదుపు తప్పి వంతెనకు ఢీకొనడంతో వాగులో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పరకాలలో ఆదివారం చోటుచేసుకుంది. భూపాలపల్లి జయశంకర్ జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కన్నెవెన ఓంకార్ ద్విచక్ర వాహానంపై పరకాల నుంచి తిరిగి గ్రామానికి వెళ్తున్న క్రమంలో పట్టణ శివారులోని చలివాగు వంతెనపై రెయిలింగ్‌కు ద్విచక్ర వాహనం రాడ్(ఫుట్ రెస్ట్ ) తగిలింది. దీంతో బైక్ రోడ్డుపై పడిపోగా ఓంకార్ ఎగిరి వాగులోని బండ రాయిపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఓంకార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి సోదరుడు సుమన్‌కు తీవ్రగాయాలు కాగా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఏడాది క్రితమే నాగలక్ష్మి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే భర్తను కోల్పయిన నాగలక్ష్మి.. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కలిచివేసింది. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఓంకార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ఆస్పత్రికి తరలించారు. కాగా కొన్నేళ్ల క్రితం ఓంకార్ తండ్రి ఓదెలు కూడా ఇదే తరహాలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఇద్దరి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య
ముండ్లమూరు (తాళ్లూరు): ముండ్లమూరు మండలం చిన ఉల్లగల్లు–రెడ్డినగర్ మధ్య పొలాల్లో జమ్మిచెట్టుకు గుర్తు తెలియని యువకుడు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశుపోషకులు జమ్మిచెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓ యువకుడు నాలుగు రోజులుగా సమీప పొలాల్లోనే సంచరిస్తున్నాడని పశుపోషకులు తెలిపారు. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని పేర్కొంటున్నారు. మృతదేహాన్ని దర్శి సీఐ శ్రీనివాసరావు, ముండ్లమూరు ఎస్ఐ శివనాంచారయ్య పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలను తరలించారు. మృతుడు బూడిద రంగు ప్యాంట్, ఎర్ర, నలుపు చారల టీషర్ట్ ధరించి ఉన్నాడు. ప్యాంట్‌కు పెయింట్లు అంటి ఉన్నాయి. మృతుడు పెయింటరై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఏటీఎం కేంద్రంలో యువకుడి హత్య
కోల్‌సిటీ (రామగుండం): ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మారుతీనగర్‌కు చెందిన బైకనవేని శ్రీనివాస్(26) క్యాటరింగ్, పాల వ్యాపారం చేస్తున్నాడు. ఇంటికి సమీపంలోని అడ్డగుంటపల్లిలో ఉండే కనవేణి రమేశ్, ఆయన సోదరుడు సురేశ్‌ను క్యాటరింగ్‌కు తీసుకెళ్తుండేవాడు. ఇటీ వల మనస్పర్ధల కారణంగా వారిని తీసుకెళ్లడం మానేయడంతో సురేశ్ కక్ష పెంచుకున్నాడు. శనివారం శ్రీనివాస్ తన తల్లి వితంతు పింఛన్ డబ్బును డ్రా చేసేందుకు సమీపంలోని ఏటీఎంకు వెళ్లాడు. అకస్మాత్తుగా ఏటీఎంలోకి చొరబడిన సురేశ్ రోకలిబండతో శ్రీనివాస్ తలపై మోదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. -
బైకు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
ఆమనగల్లు : తల్లిదండ్రులు బైకు కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఆమనగల్లు ఎస్సై మల్లీశ్వర్ కథనం ప్రకారం... ఆకుతోటపల్లికి చెందిన మహేశ్(22).. తల్లిదండ్రులను బైక్ ఇప్పించాలని కోరగా వారు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్‌కు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు. మృతుడి తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆహుతైన యువతి
రాయగడ : రాయగడ జిల్లా మునిగుడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హటొమునిగుడ గ్రామానికి చెందిన సుస్మితమహనందియా(17) అనే యువతి గ్రామానికి దగ్గరలోని బురిజిగుడ అడవిలో సగం కాలిపోయి పడి ఉంది. సగం కాలి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. హటొమునిగుడకు చెందిన సుస్మిత మహనందియా ఈనెల 24వతేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గాలిస్తున్న పోలీసులకు బురిజిగుడ అడవి ప్రాంతంలో కాలిపోయి పడి ఉన్న సుస్మిత మృతదేహం కనిపించింది. ఆమె సగం కాలిపోయి మృతిచెంది శరీరం కుళ్లిపోయి ఉంది. పోలీసులు వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారంతా సంఘటనా స్థలానికి వచ్చి భోరున రోదించారు. సుస్మితమహనందియాకు ఎటువంటి ప్రేమ, ఇతర వ్యవహారాలు లేకపోయినప్పటికీ ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. గుర్తుతెలియని దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసి కాల్చివేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? కుటుంబసభ్యులు ఎవరైనా ఈ పని చేశారా అన్నది విచారణలో తెలియాల్సి ఉంది. -
వివాహేతరం సంబంధం..యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా: అనకాపల్లి రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చోడవరానికి చెందిన ఇలిశెట్టి రాజశేఖర్(30)గా గుర్తించారు. వివాహేతర సంభంధమే ఈ ఆత్మహత్యకు కారణమని రాజశేఖర్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు చోడవరానికి చెందిన మిత్రులకు పంపిన సెల్ఫీ వీడియో ద్వారా తెలిసింది. రాజశేఖర్‌కు 5 సంవత్సరాల క్రితం రాణి అనే యువతితో వివాహం జరిగింది. పిల్లలు లేరు. ఆరు నెలల క్రితం నుంచి చోడవరం అంబేరుపురానికి చెందిన ఓ మతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. భర్త వదిలివేసిన ఆమెకు ఒక పాప ఉంది. శుక్రవారం ఉదయం 5గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మిత్రులకు వాట్సప్ ద్వారా తెలియపర్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై గ్యాంగ్ రేప్
దమ్మపేట: బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం రాచూరిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కుక్కునూరు మండలం నల్లకుంటకు చెందిన బాలిక (15) రాచూరిపల్లిలో తమ బంధువుల ఇంటి వద్ద ఈ నెల 20న జరిగిన ఓ వేడుకకు హాజరైంది. 22న ఉదయం రాచూరిపల్లికి చెందిన తన స్నేహితురాలితో కలిసి గ్రామ శివారులోని జామాయిల్ తోటలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో తోటలో మద్యం తాగుతున్న ఏడుగురు యువకులు వీరి వెంట పడ్డారు. రాచూరిపల్లికి చెందిన బాలిక తప్పించుకోగా, నల్లకుంటకు చెందిన బాలికపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. స్వగ్రామానికి వెళ్లిన బాలిక ఈ విషయం ఎవరికీ చెప్పలేక బాధ పడసాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆరా తీయగా, విషయం బయటపడింది. దీంతో కుటుంబసభ్యులతో కలిసి బాలిక గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): పెళ్లి తప్పిపోయిందన్న మనస్థాపంతో ఓ బంగారు బట్టీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నబజారు కామాటివీధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. మహారాష్ట్ర సంగాలి జిల్లా వీటా తాలూకా గోసేవాగ్ గ్రామానికి చెందిన సావంత్ సంతోష్‌గోవింద్ 15 ఏళ్ల క్రితం నెల్లూరు నగరానికి వచ్చాడు. కొరడావీధిలో నివాసం ఉంటూ బట్టీ వ్యాపారం చేసుకుంటూ చేస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం అతని బంధువైన వీటా తాలూకా కాలంబి గ్రామానికి చెందిన సచిన్ శివాజీథోరాట్ (26), అతని చిన్నాన కొడుకు అశోక్‌లు ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. సంతోష్ వద్ద బట్టీ వ్యాపారం చేస్తూ కామాటివీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసమున్నారు. కొంతకాలం తర్వాత వేరుగా బట్టీ వ్యాపారం ప్రారంభించారు. ఈక్రమంలో సచిన్ మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో సోదరుడు అశోక్‌పై పలుమార్లు దాడిచేశాడు. ఇటీవల సచిన్‌కు పెళ్లి దాదాపు ఖరారైంది. ఈనేపథ్యంలో వారంరోజుల క్రితం సచిన్ అశోక్‌ను మద్యం మత్తులో ఇబ్బందులకు గురిచేశాడు. అతని చేష్టలను తాళలేక అశోక్ నాలుగురోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి జరిగిన విషయాన్ని అందరికి చెప్పాడు. ఈవిషయం కాస్తా పెళ్లికుమార్తె కుటుంబసభ్యులకు తెలిసి వారు పెళ్లిని రద్దుచేసుకున్నారు. దీంతో సచిన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రెండురోజులుగా ఫూటుగా మద్యం సేవించి బట్టీలోనే ఉన్నాడు. బు«ధవారం ఉదయం బట్టీలో లైట్లు వెలిగి ఉండటాన్ని గుర్తించిన సంతోష్‌గోవింద్ తలుపులు తెరిచే ప్రయత్నం చేశాడు. అవి రాకపోవడంతో కిటికీలోనుంచి చూడగా సచిన్ నోట్లోనుంచి నురగ కక్కుకుని పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా సచిన్ మృతిచెంది ఉన్నాడు. ఈవిషయంపై సంతోష్‌గోవింద్ మూడోనగర పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఎస్సై ఎస్.వెంకటేశ్వరరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. పురుగుమందు తాగి.. సూళ్లూరుపేట: మండలంలోని మంగానెల్లూరు ఎస్టీ కాలనీకి చెందిన నాగముంతల ఎలీషా (23) అనే యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడని ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఎలీషా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారంరోజులు పనికి వెళ్లకపోవడంతో అతని తండ్రి చిన్నబ్బయ్య తిట్టాడు. దీంతో మనస్థాపం చెంది ఈనెల 24వ తేదీన ఎలీషా పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే అతడిని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 27న ఎలీషా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందడంతో చిన్నబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై తిరుపతిలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'విధి' కాటేసింది...!
అందొచ్చిన కొడుకు...ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. ఆ ఆనందంలోనే తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తున్నారు. వీరి సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో ఆ యువకుడిని కాటేసింది. విధుల నిర్వహణకని బయలుదేరిన చెట్టంత కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరి రోదనలు చూసి చూపరులు కంటతడి పెట్టారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... పూసపాటిరేగ: మండలంలోని కామవరం గ్రామ సమీపంలో ఆర్అండ్బీ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే...నెల్లిమర్ల మండలం వెంకన్నపాలెంకు చెందిన కరణపు రాజశేఖర్(23) రెడ్డీస్ ఫ్యాక్టరీలో విధుల నిమిత్తం తమ స్నేహితుడు పెద్దింటి పవన్‌కుమార్‌తో కలిసి మోటారుసైకిల్‌పై తమ స్వగ్రామం నుంచి మంగళవారం ఉదయం బయలుదేరారు. కామవరం గ్రామం సమీపిస్తుండగా ఉదయం 8.30 గంటల సమయంలో స్కూల్ పిల్లల కోసం టాటాఏస్ వాహనం కనిమెల్ల వైపు వెళ్తుండగా ఎదురెదురుగా టాటాఏస్, బైక్ బలంగా ఢీకొన్నాయి. రాజశేఖర్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకొంది. చేతికందొచ్చిన కుమారుడు... ప్రమాదంలో రాజశేఖర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికందొచ్చిన కుమారుడు ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో తండ్రి అప్పలనాయుడు రోదిస్తూ తల్లడిల్లిపోయారు. ఈయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తమ బిడ్డ లేకుండా ఎలా బతికేదని తల్లిదండ్రులు సత్యవతి, అప్పలనాయుడు రోదించడంతో చూపరులు కంటతడి పెట్టుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్ఐ జి.కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రచ్చబండ సాక్షిగా..
నిడమనూరు (నాగార్జునసాగర్) : ఎర్రబెల్లి గ్రామానికి చెందిన పెదమాం రజనీకాంత్(25)ను శనివారం ఉదయం అదే గ్రామానికి చందిన ముడి నాగయ్య కత్తితో పొడవడంతో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నట్టు తెలిసింది. ఎర్రబెల్లికి చెందిన దాసరి వెంకన్న దామరచర్ల మండలం కల్లేపల్లి మైసమ్మ వద్ద మొక్కు తీర్చుకునేందుకు ఈనెల 22న వెళ్లాడు. బంధువులైన ముడి నాగయ్య, పెదమాం రజనీకాంత్‌లను పిలవడంతో ఇద్దరూ సైతం అక్కడికెళ్లారు. రజనీకాంత్ తన భార్యతో వివాహేతర పెట్టుకున్నాడనే అనుమానం ఉన్నదని, అతన్ని ఎందుకు పిలి చారం టూ ముడి నాగయ్య దాసరి వెంకన్నను, రజనీకాంత్‌ను తిట్టాడు. తనను అకారణంగా దూషించాడని రజనీకాంత్.. శనివారం పెద్దమనులను పిలిచి పంచాయితీ పెట్టిం చాడు. పెద్దలు మాట్లాడుతుండగానే నాగయ్య, రజనీకాంత్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. రజనీకాంత్ మొదట ఆవేశంగా తనను తిడతావా అంటూ ముడి నాగయ్యపైకి దూసుకెళ్లాడు. అదే క్రమంలో నాగయ్య అప్పటికే తన వద్ద దాచుకున్న చుర కత్తితో రజనీకాంత్‌ను పొడిచాడు. వెంటనే చికిత్స కోసం మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గ్రామంలో ఉద్రిక్తత నాగయ్యను వెంటనే అరెస్ట్ చేసి శిక్షిం చాలని రజనీకాంత్ బంధువులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని నాగయ్య ఇంటి వద్ద ఉంచే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. మిర్యాలగూడ, హాలి యా సీఐలు రమేష్, ధనుంజయగౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి సోదరు డు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మైనర్ బాలికపై యువకుల దాడి
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేటలోని అంజనపురి కాలనీలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు దాడి చేశారు. బాధితురాలిని హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అర్దరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
పరిశ్రమలో విషవాయువు వెలువడి..
చిట్యాల (నకిరేకల్) : పరిశ్రమలో విషవాయువు వెలువడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని అతులిత రసాయన పరిశ్రమలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని ఏపూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉప్పల అంజయ్య కుమారుడు సాయికిరణ్(20) రెండు నెలలుగా మండలంలోని అతులిత రసాయన పరిశ్రమలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం పరిశ్రమలోని ఓ యూనిట్లో అకస్మాత్తుగా విషవాయువులు వెలువడ్డాయి. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న సాయికిరణ్ ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో సాయికిరణ్‌ను పరిశ్రమ నిర్వహణ అధికారులు ఆ గ్రామ శివారులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సాయికిరణ్‌ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. పరిశ్రమ ఎదుట ఆందోళన.. సాయికిరణ్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్నేహితులు పరిశ్రమ వద్దకు భారీగా చేరుకున్నారు. సా యికిరణ్ మృతదేహాన్ని పరిశ్రమ ఆవరణలో ఉంచి ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సాయికిరణ్ మృతి చెందాడని ఆరోపించారు. యజమాన్యం సాయికిరణ్ కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పరిశ్రమ యజమాన్యం కొంత పరిహారం చెల్లించేందుకు అంగీకరించటంతో ఆందో ళన విరమించారు. కాగా చేతికందిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
నాన్నకి లేకుండా ఒక్కడివే తాగుతావా.?
సాక్షి, హైదరాబాద్(చిలకలగూడ) : మీ నాన్నకి లేకుండా రెండు క్వార్టర్ల మద్యం ఒక్కడివే తాగుతావా అని తల్లి మందలించినందుకు కుమారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నామాలగుండుకు చెందిన మహేష్ (24), దేవయ్య తండ్రికొడుకులు. వీరు అడ్డాకూలీలుగా పని చేస్తున్నారు. ఈనెల 18న కూలికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ చెరో క్వార్టర్ చొప్పున రెండు క్వార్టర్ల మందు తెచ్చుకున్నారు. అయితే రాత్రి తండ్రికి తెలియకుండా మహేష్ ఒక్కడే మద్యం మొత్తం తాగేశాడు. ఈ విషయమై అతని తల్లి లక్ష్మీ కుమారుడిని నిలదీసింది. పండగపూట తండ్రికి మద్యం లేకుండా చేశావని మందలించింది. దీంతో మద్యం మత్తులో ఉన్న మహేష్ మనస్థాపానికి లోనై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధకు తాళలేక కేకలు వేయడంతో తల్లితండ్రులతోపాటు స్థానికులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
సత్తుపల్లి: అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయటంతో ఓ యువకుడు మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ ఎం.వెంకటనర్సయ్య కథనం ప్రకారం సత్తుపల్లి పట్టణానికి చెందిన కటికల రాజేష్(27) టాటా మోటర్స్ ఖమ్మంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మృతుడు రాజేష్ సత్తుపల్లికి చెందిన అజయ్‌కుమార్‌కు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తానని రూ.20 వేలు తీసుకున్నాడు. సోనాలిక ట్రాక్టర్ ట్రాన్స్‌పోర్టు మేనేజర్ శివారెడ్డికి ఒక ట్రాక్టర్‌కు సంబంధించిన ఫైనాన్స్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. అదేవిధంగా మోటారు సైకిల్ మెకానిక్‌లు అజార్, సుధాకర్ల వద్ద రూ.10 వేలు చొప్పున అప్పు తీసుకున్నాడు. మరో పదిమంది వద్ద రుణాలు ఇప్పిస్తానని అప్పు చేసినట్లు తెలిసింది. సత్తుపల్లి నుంచి ఖమ్మంకు మకాం మార్చాడు. సోమవారం రాజేష్ సత్తుపల్లి వచ్చాడని అప్పులు ఇచ్చినవాళ్లు తెలుసుకొని డబ్బులు చెల్లించాలని పట్టుపట్టడంతో వాగ్వాదం జరిగింది. 100కు ఫోన్.. మృతుడు తల్లి విమలాదేవి 100కు ఫోన్ చేసి మా ఇంటి వద్ద గొడవ జరుగుతుందని చెప్పటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజేష్ ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోవటంతో కంగారుపడిన తల్లి దండ్రులు రాజేష్‌తో మాట్లాడించే ప్రయత్నం చేస్తుండగానే తలుపు తీయకుండా గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి బిగించుకుంటున్నాడు. కిటికిలో నుంచి గమనించి రాజేష్‌ను కాపాడేందుకు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లే సరికే అప్పటికే అపస్మారక స్థితికి వెళ్లాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళుతుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రాజేష్ మృతికి అప్పులు ఇచ్చిన వారు బలవంతం చేయటమే కారణం అంటూ తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
గూడూరు: ఆ ఇంట్లో మరో పది రోజుల్లో వివాహ శుభకార్యం జరుగనుండగా కుటుంబసభ్యులు.. పెళ్లి బట్టలు, ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసుకుని ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పెళ్లితో ఓ ఇంటివాడు కాబోతున్న ఆ యువకుడిని చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువకుడు అనూహ్య రీతిలో హత్యకు గురికాగా కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. పలువురినీ కంటతడి పెట్టించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట శివారు గుంజేడు రహదారిలో శనివారం రాత్రి జరింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. చిన్నఎల్లాపురం శివారు హాముతండాకు చెందిన జరుపుల పంతులునాయక్–పెంటి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరినాయక్‌కు పెళ్లి కాగా, చిన్న కొడుకు జరుపుల అశోక్ (29) తండాలో ఓ డబ్బాలో కిరాణ దుకాణాన్ని నడుపుతూ తల్లిదండ్రులకు బాసటగా ఉంటున్నాడు. ఇటీవల వీరి ఇంటి పక్కన గల ఓ వ్యక్తితో మధ్య ఇంటి స్థలాల గెట్టు పంచాయితీ మొదలైంది. ఈ క్రమంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగానే సదరు వ్యక్తి జరుపుల అశోక్, తండ్రి పంతులును చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన అశోక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం అశోక్‌కు వివాహం నిశ్చయమైంది. ఈనెల 28న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి బట్టలు తీసుకునేందుకు శనివారం అశోక్ తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సంపేటకు వెళ్లారు. పెళ్లి పత్రికల ముద్రణ ఆలస్యమవడంతో అశోక్ ముందుగా తల్లిదండ్రులను ఇంటికి పంపించాడు. రాత్రి 8 గంటలకు పత్రికలు తయారు కాగా వాటిని తీసుకుని 9 గంటల సమయంలో నర్సంపేట నుంచి ఆటోలో బయలు దేరాడు. భూపతిపేట చెక్‌పోస్టు స్టేజీ వద్ద దిగిన అశోక్ తన సైకిల్ తీసుకుని ఇంటికి బయలుదేరినట్లు ఆటోడ్రైవర్ చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. తెల్లవారేసరికి దారి పక్కన శవమై.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలో ఓ వ్యవసాయ బావి వద్ద అశోక్ రక్తపు మడుగులో మృతిచెంది పడి ఉండడాన్ని స్థానికులు చూశారు. వెంటనే హాముతండా వాసులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు పంతులు–పెంటి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో మానుకోట డీఎస్పీ నరేష్కుమార్, సీఐ రమేష్‌నాయక్, ఎస్సైలు యాసిన్, రామారావు సిబ్బంది అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి స్థలం గెట్టు విషయంలో కక్ష కట్టి బోడ దేవుసింగ్ కుటుంబ సభ్యులే తన కొడుకును హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు పంతులు, పెంటి ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానితుడి ఇంటిని వెళ్లగా తాళం వేసి ఉంది. ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా, రాత్రి వేములవాడ వెళ్లామని, తిరిగి వస్తున్నామని సమాధానం ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ‘మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సినోడివి.. కక్ష గట్టి పాడె ఎక్కించారా’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఇదిలా ఉండగా తన తమ్ముడి మృతికి పక్కింటి బోడ దేవుసింగ్తో పాటు, వారి కుటుంబ సభ్యులే కారణమంటూ అశోక్ సోదరుడు హరినాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు దేవుసింగ్తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఉద్యోగం వచ్చిన వారం రోజులకే.
రామభద్రపురం: ఒక్కగానొక్క కుమారుడు. ఉద్యోగం వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. ఉద్యోగం వచ్చింది.. మిమ్మల్ని బాగా చూసుకుంటానన్న కుమారుడు అర్ధంతరంగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సోంపురం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఇట్లామామిడిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి గణపతి (28) దుర్మరణం చెందాడు. ఇతనికి వారం రోజుల కిందటే కొమరాడ మండలం మాదలింగి పీహెచ్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చింది. ఆదివారం ఉగాది పండుగ కావడంతో తల్లిదండ్రులతో గడిపేందుకు గణపతి స్వగ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా స్నేహితులతో సరదాగా గడిపాడు. స్నేహితుడు ధనుకొండ రమేష్ ఇంట్లో భోజనం చేశాడు. అనంతరం స్నేహితుడి ఆటోలో రామభద్రపురం బయలుదేరారు. సరిగ్గా సోంపురం వద్ద గల చెరువు వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తూ ఆటో చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెడ్డి తిరుపతి, పార్వతి సంఘటనా స్థలానికి చేరుకుని కుమారుడు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకే నీకు నూరేళ్లూ నిండిపోయాయా నాయనా? అంటూ వారు రోదిస్తున్న తీరు చూసి అక్కడి వారి కళ్లు చెమర్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాడంగి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డీడీ నాయుడు తెలిపారు. -
షాడో ఎమ్మెల్యేదే పెత్తనం
తెలుగుదేశం పార్టీతోపాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ‘పెద్దాయన’ అనే మంచి పేరున్న ఉన్నం హనుమంతరాయచౌదరికి ఎమ్మెల్యే అయిన తర్వాత పరపతి పూర్తిగా మసకబారింది. ఇందుకు కారణం ఆయన కుమారుడు, యువనేత మారుతీచౌదరి వ్యవహార శైలి. రెండో కుమారుడు ఉదయ్‌కుమార్ చౌదరి కూడా భూ వివాదాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ‘షాడో’ ఎమ్మెల్యేగా పేరొందిన మారుతిచౌదరి శుక్రవారం అనంతపురంలోని హంద్రీనీవా కార్యాలయంలో ఇంజినీర్లపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడిన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ ఘటన జిల్లాలో రచ్చరచ్చగా మారింది. యువనేత వైఖరిని అటు టీడీపీ, ఇటు అధికార వర్గాలు చీదరించుకుంటున్నాయి. – కళ్యాణదుర్గం తండ్రిపదవి.. తనయుడి పెత్తనం 2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారం చేపట్టగానే యువనేత మారుతీ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే అయిన తండ్రి ఉన్నం హనుమంతరాయ చౌదరిని డమ్మీ చేసేశారు. అధికార యంత్రాంగంతో పాటు పార్టీని కూడా తన కనుసన్నల్లోనే నడుచుకునేలా ఆంక్షలు విధించారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టు పనులు ఎవరితో చేయించాలి..? అధికారులను ఎవరిని వేయించుకోవాలి? వారు వినకపోతే బదిలీ చేసి ఎవరిని నియమించుకోవాలనేదే ఆ యువనేత నిత్యకృత్యం. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. ఆయన చెప్పిందే వేదం.. నియోజకవర్గంలో మారుతీచౌదరి చెప్పిందే వేదం. రెండేళ్ల క్రితం మడకశిర ప్రాంతంలో టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా అనారోగ్యం పాలై తిరిగి కంబదూరు తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన అధికారిని సీట్లో కూర్చోకుండా పార్టీ యంత్రాంగంతో నడిపిన తతంగం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బ్రహ్మసముద్రం మండలంలో నిజాయతీగా పనిచేసిన ఓ ఎస్ఐ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోగా ఆ మండల తెలుగు తమ్ముళ్లు రుబాబు చేశారు. చివరకు అందరూ నాన్‌బెయిలబుల్ కేసులో ఇరుక్కుపోయారు. వీరిని కాపాడేందుకు సదరు ఎస్ఐను ఇక్కడి నుంచి పంపించేశారు. ఆ ఎస్ఐనే కాదు నిజాయతీగా పనిచేస్తున్న యువ డీఎస్పీని కూడా బదిలీ చేయించారు. నియోజకవర్గ కేంద్రానికి ముఖద్వారమైన మండల కేంద్రంలో పనిచేసిన ఓ తహసీల్దార్ వీరు చెప్పినట్లు నడుచుకోలేక విసుగెత్తి బదిలీచేయించుకున్నారు. చెప్పినట్టు వినలేదని ఇటీవల ఒక సీఐను వీఆర్‌కు పంపారు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ యువనేత జోక్యం పెరిగిపోతోంది. నియోజకవర్గంలో ఏ స్థాయి అధికారి బదిలీపై రావాలన్నా..కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవాలన్నా యువనేతను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వ్యతిరేకిస్తే ‘అధికారాలు’ కత్తిరింపు నియోజకవర్గంలో ఏ స్థాయి ప్రజాప్రతినిధులైనా యువనేత చెప్పినట్లు నడుచుకోకుంటే వారికి అధికారాలు కత్తిరించేస్తున్నారు. కళ్యాణదుర్గం ఎంపీపీ మంజులా కొల్లప్ప, బ్రహ్మసముద్రం ఎంపీపీ మంజులతో పాటు దుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ రామలక్ష్మిలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని పాలన సాగించకుండా అడ్డంకులు సృష్టించాడు. ఇద్దరు దళిత ఎంపీపీలకు అధికారాలు కత్తిరింపు చేయడంతో చివరకు వారు యువనేత వద్ద తలొగ్గి పనులు చేయించుకోక తప్పలేదు. రోడ్ల విస్తరణ విషయంలో చైర్పర్సన్ బీకే రామలక్ష్మికీ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. యువనేత వ్యవహర శైలిపై అధికారులు, ప్రజల్లోనే కాదు.. టీడీపీలోని నాయకుల్లోనూ అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. వినకుంటే దౌర్జన్యం శెట్టూరు, కళ్యాణదుర్గం మండల సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న గాలిమరల పనులను మారుతీచౌదరి అడ్డుకుని కాంట్రాక్టర్లను వెనక్కుపంపారు. చివరకు యాక్సిస్, ఎకోరియన్, గ్రీన్కో, హీరో, సుజలాన్, విండ్ పవర్ కంపెనీలు ఏ పని చేయాలన్నా ఆయన్ను సంప్రదించే చేస్తున్నాయి. గాలిమరల బిడ్డింగ్‌లను వేయడం మొదలుకుని మట్టిరోడ్లు, విద్యుత్ లైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు ఆయన చెప్పిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారు. ఈ విషయంలో కిందిస్థాయి టీడీపీ నేతలకు ఒక్క పనికూడా ఇవ్వకపోవడంతో యువనేతపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. 2014 డిసెంబర్లో బోయలపల్లి గ్రామ సమీపాన రైల్వే పనులు చేస్తుండగా కాంట్రాక్టర్ కమీషన్లు ఇవ్వలేదని ఏకంగా జేసీబీలు ధ్వంసం చేసి హంగామా సృష్టించారు. బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి, చెలిమేపల్లి వద్ద వేదావతి నదిలో ఇసుక దందాకు పాల్పడ్డారు. -
బైక్ కొనుక్కుని వెళుతూ..
విజయనగర్‌కాలనీ: బైక్ కొనుక్కుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన సుజిత్, షేక్ ఫారూక్ (21) స్నేహితులు. వీరు గురువారం ఓఎల్ఎక్స్లో ప్రకటన చూసి గుడిమల్కాపూర్‌కు చెందిన ఉమర్ అనే వ్యక్తి వద్ద కేటీఎం డ్యూక్ కొనుగోలు చేశారు. అనంతరం టోలిచౌకిలోని స్నేహితులను కలిసి అర్ధరాత్రి రేతిబౌలి నుంచి మెహిదీపట్నం వెళ్తుండగా పిల్లర్ నెం. 22 వద్ద రేతిబౌలి నుంచి యూ టర్న్ తీసుకుంటున్న ఇండికా క్యాబ్ వెనుకనుంచి వేగంగా ఢీ కొంది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సుజిత్‌కు స్వల్ప గాయాలు కాగా వెనుక కూర్చున్న షేక్ ఫారూక్ రోడ్డుపై ఎగిరి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వారిని నానల్ నగర్‌లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన షేక్ ఫారూక్‌ను మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఫారూక్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
శృంగవరపుకోట: ప్రేమోన్మాదంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ నిర్లక్ష్యం చేస్తున్నందున ఆమెపై దాడికి యత్నించడమే గాకుండా... అడ్డుకున్న వ్యక్తి చేతి వేళ్లు నరికిన సంఘటన శృంగవరపుకోట పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కలకలం రేపిన సంఘటనకు సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పట్ణణంలో నడబండ ప్రాంతంలో నివాసం ఉంటున్న నానిగిరి నాగరాజు అనే యువకుడు మెకానిల్ డిప్లొమా పూర్తిచేసి మూడేళ్ల క్రితం స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ విభాగంలొ శ్రామిక్ గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో డిపోలో వున్న వాటర్ ప్లాంట్ దుకాణంలో గంట్యాడ మండలం కొండతామరాపల్లికి చెందిన ఓ వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ వివాహిత భర్త, కుమార్తె ఏడేళ్ల క్రితమే చనిపోగా ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఆ మహిళ ఇటీవలే వాటర్‌ప్లాంట్‌లో పని మానేసి ఆకులడిపో వద్ద ఆదిమూలం మధు అనే యువకుడు ప్రారంభించిన ఐస్‌క్రీమ్ పార్లర్లో పనికి కుదిరింది. ఇటీవల ఆమె నాగరాజును నిర్లక్ష్యం చేస్తుండటంతో తట్టుకోలేక పగ పెంచుకుని గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో పార్లర్‌కు వెళ్లి ఆమెపై దాడి చేశాడు. ఇంతలో దుకాణం యజమాని మధు అడ్డుకునే ప్రయత్నం చేయగా కుడిచేతి నాలుగు వేళ్లు తెగిపడ్డాయి. స్థానికులు హుటాహుటిన మధును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. హత్యకు పాల్పడిన నాగరాజు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ప్రాధమిక చికిత్స అనంతరం మధును విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగర్ కాలువలో ఇద్దరి గల్లంతు
వర్ని(బాన్సువాడ): ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి.. చదువుల ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఐదుగురు స్నేహితులు నిజాంసాగర్ కాలువలో సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు గల్లంతయ్యారు. వర్ని మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థులు సోహెల్ (17), ప్రభురాజ్ (17) బుధవారం చివరి పరీక్ష రాశారు. పుస్తకాలతో కుస్తీ పట్టి అలసిపోయిన ఆ మిత్రులు ఇద్దరు సహా ఐదుగురు స్నేహితులు గురువారం సరదాగా స్నానం చేయడానికి సత్యనారాయణ పురం సమీపంలో గల నిజాంసాగర్ కాలువలోకి దిగారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సోహెల్, ప్రభురాజ్ కొట్టుకుపోయారు. వీరిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తోటి స్నేహితులతో పాటు సమాచారమందుకున్న బంధువులు కాలువ వెంబడి సాయంత్రం వరకు గాలించారు. రబీ పంటల కోసం వారం రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏడు అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంటుందని స్థానికులు తెలిపారు. విద్యార్థులు గల్లంతు కావడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని..
సాక్షి, సిరిసిల్ల: నేరళ్ల ఘటన మరువకముందే మరో దాష్టీకానికి పాల్పడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. తమ అక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడన్న ఆక్రోశంతో ఓ యువకున్ని దారుణంగా కొట్టారు. బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లకు చెందిన సదానందం అనే యువకుడు పోలీసులు చేస్తున్న అక్రమాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ పేరుతో యువకున్ని పిలిచి తీవ్రంగా కొట్టారు. తనను వేములవాడ పోలీసులు నిర్భందించి తీవ్రంగా కొట్టారని సాక్ష్యాలతో సదానందం కోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా పోలీసుల అరాచకాలపై ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడటాన్ని తప్పుబడుతున్నారు. -
అత్యవసరంలో స్పందించిన రక్తదాత
కొడవలూరు: మై పాడుకు చెందిన ఓ యువకుడు అత్యవసర సమయంలో ఓ మహిళకు రక్తదానం చే సి ఆదుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. నె ల్లూరు నారాయణ వైద్యశాలలో ప్రసవం నిమిత్తం తులసి అనే మహిళ చేరగా, ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. అందుకోసం ఏ నెగటివ్ రక్తం అవసరమైంది. ఆ గ్రూపు రక్తం ఆస్పత్రిలో అందుబాటులో లేకపోగా, బ్లడ్ బ్యాంక్‌లలోనూ లభించలేదు. దీంతో ఆమె బంధువులు కొడవలూరు మండలానికి చెందిన మీకోసం మేము ఫౌండేషన్ సభ్యులను సంప్రదించారు. వారిలోనూ ఎవరికీ ఆ గ్రూపు రక్తం ఎవరికీ లేదు. మరో వైపు గర్భిణికి శస్త్ర చికిత్స అత్యవసరంగా పరిణమించింది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఆ గ్రూపు రక్తం కలిగిన మైపాడుకు చెందిన దేవిరెడ్డి శివప్రశాంత్రెడ్డి అనే యువకుడిని ఫౌండేషన్ అధ్యక్షుడు పోసిన సునీల్‌కుమార్ ఫోన్లో సంప్రదించి రక్తమివ్వాలని కోరారు. అత్యవసరాన్ని గ్రహించిన ఆ యువకుడు మానవతతో స్పందించి ఆ రాత్రే ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేసి ఆ మహిళ శస్త్ర చికిత్సకు దోహద పడ్డాడు. తులసి ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చిందని ఫౌండేషన్ అ«ధ్యక్షుడు తెలిపారు. -
సమ్‌థింగ్ స్పెషల్
అస్సలు అనిపించదు. జస్ట్... గెస్ కూడా చేయలేం.. మోహన్‌లాల్ ఏజ్‌ని. అంతలా ఆయన ‘ఒడియన్’ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఆల్మోస్ట్ 20 కేజీల బరువు తగ్గారు. ఇంతగా కష్టపడి యంగ్ లుక్‌లోకి వచ్చారంటే.. సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఏదో ఉండే ఉంటుంది. అదేంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడడానికి మరెంతో టైమ్ లేదు. ఎందుకంటే ‘ఒడియన్’ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టారై్టపోయింది. మోహన్‌లాల్, మంజు వారియర్, ప్రకాశ్ రాజ్ ముఖ్య తారలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివకుమార్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఎంతో పేరు తెచ్చుకున్న ఆర్టిస్టులు ఓ కొత్త దర్శకుణ్ణి నమ్మి అవకాశం ఇచ్చారంటే కథలో మంచి దమ్ము ఉండి ఉంటుందని ఊహించవచ్చు. మేజికల్ థ్రిల్లర్‌గా 1950–2000 టైమ్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో మోహన్‌లాల్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా మరో లుక్‌ను రిలీజ్ చేశారు మోహన్‌లాల్. -
గన్‌తో బాలుడి సెల్ఫీ.. దూసుకుపోయిన బుల్లెట్
ఢిల్లీ : సెల్ఫీతో చెలగాటం మనిషికి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది. రోజూ ఎక్కడో ఒక చోట సెల్ఫీ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఢిల్లీలోని సరితా విహార్ ఏరియాలో చోటుచేసుకుంది. మైనర్ బాలుడు గన్నుతో సెల్ఫీ తీసుకుంటుండగా అది పేలి పక్కన ఉన్న వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అతను అక్కడిక్కడే మరణించాడు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23ఏళ్ల యువకుడు ఢిల్లీ సరితా విహార్ ఏరియాలోని తన బంధువు ఇంటిలో ఉంటున్నాడు. అతని కజిన్ మైనర్ బాలుడు తండ్రి గన్నుతో సెల్ఫీ తీసుకుంటుండగా అది కాస్తా పేలింది. ప్రక్కనే ఉన్న యువకుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మైనర్‌కు బుల్లెట్లతో నిండిన లైసెన్స్డ్ గన్ ఇచ్చినందుకు గానూ బాలుడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. అసలు ఈ ఘటన అనుకోకుండా జరిగిందా లేదా పథకం ప్రకారమే చేశారా అన్న విషయాలను దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. -
మరుగుదొడ్డి గుంతలో పడి యువకుడి మృతి
జహీరాబాద్ టౌన్: మరగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి చెందినట్లు జహీరాబాద్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ (24) బంధువుల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. బంధువుల ఇంటిలో పెళ్లి ఉండగా మృతుడు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. బుధవారం రాత్రి మద్యం తాగి పనులు చేస్తున్న సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి పరిసర ప్రాంతం చీకటిగా ఉండడంతో మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతను గమనించక అందులో పడిపోయాడు. తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇలా ఉండగా ఎమ్మెల్సీ ఫరిదొద్దీన్ విషయం తెలుసుకుని జహీరాబాద్ ఆస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
యువకుడు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో పేర్లు
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఓ అపార్టుమెంట్లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేష్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. స్నేహితుల మాటల నమ్మి బ్యాక్ డోర్లో ఉద్యోగం కోసం మహేష్ లక్షల డబ్బు కట్టాడు. చాలా రోజులైనా స్నేహితులు ఉద్యోగం చూపించలేదు. అంతేకాక ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో రూమ్‌లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు. బయటకు వెళ్లి వచ్చిన మిత్రులకు మహేష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ కూడా దొరికింది. ఆ నోట్లో ఉద్యోగం పేరుతో మిత్రులు మోసం చేశారని తెలిపాడు. అంతేకాక నోట్లో పలువురి పేర్లు ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
‘అంతిమ’ ప్రయాణం
కారేపల్లి: హోలీ పండగకు వచ్చి..తిరిగి హైద రాబాద్‌కు బయల్దేరిన ఓ యువకుడు రైలు నుంచి జారిపడి దుర్మరణం చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసు కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గొల్లపల్లి లక్ష్మాతండాకు చెందిన బాణోతు యుగంధర్ (25) ఈ ప్రమాదంలో చనిపోయాడు. పాలిటెక్నిక్ డిప్లొమా, టీటీసీ పూర్తి చేసిన ఇతను హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఇటీవల హైదరాబాద్ నుంచి ఇంటికి (లక్ష్మాతండా) వచ్చాడు. హోలీ పండగను ఆనందంగా జరుపుకొని ఆదివారం రాత్రి 10గంటల సమయంలో బొమ్మనపల్లిలో లారీ ఎక్కి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కాకతీయ ఫాస్ట్ పాసింజర్ రైలు ఎక్కిన యుగేందర్, రైలు డోర్ వద్ద కూర్చొని ఉంటాడని, గాంధీపురం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కొమ్ముగూడెం గేటు అతి మూల మలుపు వద్ద వెనుకనుంచి డోర్ వేగంగా నెట్టివేయడంతో అదుపు తప్పి రైలు కిందపడి మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన కొమ్ముగూడెం గ్రామస్తులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం రైలు కిందికి దూసుకుపోవటంతో..సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకుపోయి..నుజ్జునుజ్జుగా మారింది. ఘటనా స్థలంలో ఆ«ధార్ కార్డు, చేతివేలికి ఉన్న ఉంగరం, సెల్‌ఫోన్ ఆ«ధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యుగేందర్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడా..? లేక ఆత్మహత్యానా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాంధీపురం రైల్వే స్టేషన్ నుంచి కారేపల్లి రైల్వే స్టేషన్ వరకు రైల్వే ట్రాక్ అత్యంత మూలమలుపు కలిగి ఉంటుంది. ఇక్కడ బోగీలు ఓవైపునకు ఒంగినట్లు అవుతాయి. అప్పుడు డోర్ వద్ద ఉన్న వారు ప్రమాదాలకు గురవుతుండడం ఇటీవల పెరిగింది. లక్ష్మాతండాలో విషాదం.. టేకులపల్లి: చేతికి అందొచ్చిన కొడుకు ఉద్యోగం చేసి ఇంటికి ఆసరాగా ఉంటాడనుకుంటే..ఇలా దుర్మరణం చెందడంతో..అతడి స్వగ్రామం బొమ్మనపల్లి పంచాయతీ లక్ష్మాతండాలో విషాదం అలుముకుంది. మాజీ సర్పంచ్ బాణోతు ఆల్యానాయక్, సోనా దంపతుల కుమారుడైన ఇతను ఇంటర్మీడియట్ వరకు కొత్తగూడెంలో చదివాడు. డిప్లొమా, ఉపాధ్యాయ శిక్షణ హైదరాబాద్‌లో పూర్తి చేసి, ఇటీవల టీఆర్టీ పరీక్ష కూడా రాశాడు. హోలీ పండగకు స్వగ్రామానికి వచ్చి..ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరి..ఇలా ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, టేకులపల్లి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్ సందర్శించారు. -
బాలికపై ఏడాదిగా అత్యాచారం
రామాయంపేట(మెదక్): బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న మండలంలోని కాట్రియాలకు చెందిన సంతోష్‌రెడ్డి అనే యువకునిపై శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..సంతోష్‌రెడ్డి మండలంలోని లక్ష్మాపూర్‌లో డిష్ నడిపిస్తాడు. అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి మోసగించి ఏడాదిగా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తన తల్లికి తెలపడంతో, ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆవు ఆయువు తీసింది..
సాక్షి, శంషాబాద్(రాజేంద్రనగర్): ఓ ఆవు యువకుడిని తాడుతో సహా ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాల పాలై దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామంలో చోటుచేసుకుంది. అయినాల హరీష్‌రెడ్డి(21) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తల్లి ఉమకు చేదోడువాదోడుగా ఉంటూ పొలం పనులతో పాటు ఆవుల పోషణ చూస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో తమ మూడు ఆవులను మేపడానికి గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఒక ఆవుకు కట్టిన తాడును తన నడుముకు చుట్టుకున్నాడు. ఇంతలో ఆవు బెదిరి తాడుతో పాటు అతన్ని ఈడ్చుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని అరుపులు విన్న సమీపంలోని రైతులు అక్కడకు వెళ్లేసరికే హరీష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఏడాది కిందట తండ్రి మృతి.. హరీష్ తండ్రి వెంకట్‌రెడ్డి ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం తల్లి ఉమ మోయడంతో హరీష్ ఆమెకు చేదోడుగా ఉండేవాడు. ఇతనికి ఓ చెల్లెలు ఉంది. చేతికంది వచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లి రోదనలు మిన్నంటాయి. -
దుబాయ్‌లో రాష్ట్ర యువకుడి ఆత్మహత్య
మేడిపెల్లి: ఎన్నో ఆశలతో దుబాయ్ లో అడుగుపెట్టిన ఓ యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం గోవిందారం వాసి పెద్ది శ్రీనివాస్(36) పదేళ్ల క్రితం రూ.2 లక్షలు అప్పు చేసి దుబాయ్ వెళ్లాడు. ఏడాదికోసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తున్నాడు. అక్కడ పనులు లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం తిరిగి వచ్చాడు. ఇక్కడ కూడా పనులు దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. దీంతో మూడు నెలల క్రితం మళ్లీ గల్ఫ్‌బాట పట్టాడు. సిరిసిల్లకు చెందిన ఓ ఏజెంటుకు రూ.70 వేలు చెల్లించి దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఇస్తున్న జీతం తన ఖర్చు లకే సరిపోవడం లేదు. కుటుంబపోషణ కూడా భారంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన గదిలో ఆదివారం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
స్నేహితురాలిని కాపాడబోయి యువతి మృతి
పోలవరం: గోదావరిలో ప్రమాదవశాత్తు పడి మునిగిపోతున్న స్నేహితురాలిని కాపాడబోయి ఓ యువతి మరణించింది. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన ర్యాలి సాయిరమ్య(18) గూటాల పంచాయతీ కొత్తపట్టిసీమ గ్రామం వద్ద ఆదివారం గోదావరిలో మునిగిపోయి మరణించింది. కొవ్వూరులోని ఏబీఎన్పీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్య స్నేహితులతో కలసి కొత్తపట్టిసీమలోని మరో స్నేహితురాలైన వలవల శ్రీవల్లి ఇంటికి శనివారం సాయంత్రం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు చూడాలని రాత్రి వారంతా అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం స్నేహితులైన శ్రీవల్లి, ఊనగట్లకు చెందిన గూడపాటి సాయిభవాని, కొవ్వూరుకు చెందిన ప్రత్యూషలతో కలిసి గోదావరినదికి స్నానానికి వెళ్లింది. నది ఒడ్డున నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా, సాయిభవాని తలపై నీళ్లు చల్లుకునేందుకు నదిలోకి వంగింది. ఆమె నిలబడిన రాళ్లు నాచుపట్టి ఉండటంతో నదిలోకి జారిపడింది. ఆమెను కాపాడేందుకు సాయిరమ్య ప్రయత్నించగా, ఇద్దరూ నదిలో మునిగిపోయారు. కేకలు వేయటంతో దగ్గరలో ఉన్న యువకులు వచ్చి సాయిభవానీని కాపాడారు. ఈమె పోలవరం వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకుంది. సాయిరమ్య మృతి చెందింది. పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు స్బిబందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దొమ్మేరులో విషాదఛాయలు కొవ్వూరులో విషాదఛాయలు సాయిరమ్య మృతితో ఆమె స్వగ్రామం దొమ్మేరులో విషాదఛాయలు అలముకున్నాయి. ర్యాలి శ్రీనివాసరావు ప్రథమ కుమార్తె ఆమె. అపురూపంగా చూసుకునే రమ్య మృతితో కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. సర్పంచ్ ముదునూరి జ్ఞానేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకుడు ముదునూరి నాగరాజు సాయిరమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సాయిరమ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
అమ్మను రైలెక్కించి వచ్చేస్తున్నా..
పెళ్లకూరు: ఆస్పత్రికి వెళ్లేందుకు అమ్మను రైలెక్కించి త్వరగా వచ్చేస్తున్నానంటూ భార్యకు చెప్పిన పది నిమిషాలకే ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. అతి వేగంగా వచ్చిన లారీ ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని చింతపూడికి చెందిన మల్లారపు నాగేంద్రబాబు (23) శనివారం తన తల్లి కృష్ణమ్మను నెల్లూరులోని ఆస్పత్రికి పంపించేందుకు బైక్‌లో నాయుడుపేటకు తీసుకువచ్చి రైలెక్కించాడు. అంతలో భార్యకు ఫోన్ చేయడంతో అమ్మను జాగ్రత్తగా రైలెక్కించాను.. తిరిగి వచ్చేస్తున్నానంటూ చెప్పాడు. నాయుడుపేట నుంచి చింతపూడికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఎగువచావలి వద్ద గేదెలు అడ్డు రావడంతో అదుపుతప్పి రోడ్డుమీద పడ్డాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం ఆరణి ప్రాంతం నుంచి తవుడు లోడుతో హైదరాబాదుకు వెళుతున్న లారీ అతివేగంగా నాగేంద్ర నడుము మీద ఎక్కింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబును నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట సీఐ మల్లికార్జున్‌రావు, ఏఎస్సై కోటీశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్రబాబు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని స్వా« దీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన తొమ్మిది నెలలకే.. నాగేంద్రబాబుకు తొమ్మిది నెలల కిందట నాయుడుపేట మండలం పండ్లూరుకు చెందిన ప్రమీలతో వివాహం అయింది. నాగేంద్రబాబు తండ్రి అంతకు ముందే చనిపోయాడు. నాగేంద్రబాబు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెళ్లైన తొమ్మిది నెలలకే భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక మాకు దిక్కెవరంటూ భార్య ప్రమీల, తల్లి కృష్ణమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు పోలయ్య, చెంగయ్య, పరశురాం, నాగభూషణం ఉన్నారు. లారీ ఢీకొని యువకుడి దుర్మరణం మరొకరికి గాయాలు వరికుంటపాడు: లారీ ఢీకొని ఓ యు వకుడు దుర్మరణం పాలవగా, మ రొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన ప్రకాశం జిల్లా పామూరు విరాట్‌నగర్ సమీపంలో శనివారం జరిగింది. తొడుగుపల్లికి చెందిన ఎన్.నవీన్ (21), టి. సుబ్బరాయు డు బైక్‌పై పామూరు మీదుగా వరికుంటపాడు వెళ్లేందుకు బ యల్దేరారు. పామూరు పట్టణంలో నుంచి వరికుంటపాడు వెళ్లేందుకు బైపాస్‌రోడ్డు ఎక్కుతుండగా దుత్తలూరు వైపు నుంచి కలిగిరి వైపు వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం పామూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోనం నెల్లూరు తరలించగా సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. -
పట్టపగలే యువకుడి హత్య..
పట్టపగలే ఓ యువకుడి హత్య జరిగింది. తనను తిట్టాడని కక్ష పెంచుకున్న వెల్డింగ్ వర్కర్ అందరూ చూస్తుండగా కొడవలితో విచక్షణారహితంగా నరకడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక సంఘటన స్థలం నుంచి నిందితుడు పరారయ్యాడు. గార్లదిన్నె: వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం యువకుడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన గార్లదిన్నెలో కలకలం రేపింది. పో లీసులు తెలిపిన మేరకు.. రాజశేఖర్ (26) కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి మం జూరైంది. సకాలంలో పూర్తి చేసుకుంటేనే బిల్లు మంజూరు చేస్తామంటూ అధికారులు చెబుతుండటంతో రాజశేఖర్ నిర్మాణ పనులు చకచకా చేయిస్తున్నాడు. పైకప్పు రేకులకు సంబంధించి వెల్డింగ్ పని కోసం రఫీ అనే వర్కర్‌కు ఒప్పించాడు. అతడు వస్తానని చెప్పి మూడు రోజులుగా తిప్పుకుంటున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన రాజశేఖర్ శుక్రవారం వెల్డింగ్ పనులు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావంటూ వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో వెల్డర్‌ను తిట్టాడు. ‘రేపు వచ్చి పని పూర్తి చేస్తా’ అంటూ వెల్డర్ తెలిపాడు. సరేనని వెళ్లిపోయిన రాజశేఖర్.. శనివారం ఉదయాన్నే ద్విచక్రవాహనంలో వెల్డింగ్‌షాపు వద్దకు వెళ్లాడు. సామాన్లు ఇంటివద్ద ఉన్నాయని చెప్పి రాజశేఖర్ బైక్‌లోనే రఫి కలిసి వెళ్లాడు. ముందు రోజు తనను తిట్టాడన్న కసితో రగిలిపోతున్న రఫి ఇంటివద్ద ఉన్న కొడవలి తీసుకుని ఒక్కసారిగా రాజశేఖర్‌పై విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా నరకడంతో రోడ్డుపైనే కుప్పకూలాడు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. భీతావహ దృశ్యం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహంపై పడి బంధువులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ శివనారాయణస్వామి, ఎస్ఐ రామ్‌ప్రసాద్ తెలిపారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
యువకుడిని బలిగొన్న పోలీసు వాహనం
సుజాతనగర్ : గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆటోను పోలీసుల వాహనం ఢీకొంది. యువకుడిని బలిగొంది. కొణిజర్ల మండలానికి చెందిన ముండ్లగిరి కిశోర్(23), యామాల ప్రవీణ్, తంబళ్ళ అశోక్, ముత్తమాల కిశోర్, కాసిమల్ల రాజేష్.. ఎయిర్టెల్ కంపెనీలో ఇన్స్టాలేషన్ పనులు చేస్తుంటారు. ఇదే పనిపై ఈ నెల 17న భద్రాచలం వెళ్లారు. 22వ తేదీన పని ముగించుకున్నారు. అదే రోజు రాత్రి 9.00 గంటల సమయంలో ఆటోలో కొణిజర్లకు బయల్దేరారు. సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామ సమీపంలోగల అయ్యప్ప టెంపుల్ వద్ద వీరి ఆటోను, ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ప్రయాణిస్తున్న పోలీసు వాహనం (టాటా సుమో, టీఎస్09 పీఏ1538) ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న కొణిజర్ల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ముండ్లగిరి కిశోర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముత్తమాల కిశోర్, యామాల ప్రవీణ్, తంబళ్ళ అశోక్, కాసిమల్ల రాజేష్‌ను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. వీరిలో తంబళ్ళ అశోక్, యామాల ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగ్రాతుల నుంచి వివరాలను సుజాతనగర్ ఎస్సై ఇ.రతీష్ సేకరించారు. టాటా సుమో డ్రైవర్ ఉప్పర శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. ముండ్లగిరి వెంకటేశ్వర్లు–భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్నవాడైన కిశోర్, గత మూడు నెలలుగా ఎయిర్టెల్ టవర్ పనులు చేస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. -
పెట్రోలు పోసి యువకుని దారుణ హత్య
కొత్త తుంగపాడు (రాజానగరం): కొత్త తుంగపాడు శివారు జి.ఎర్రంపాలెం వెళ్లే దారిలో సగం పైగా కాలి పడి ఉన్న ఒక వ్యక్తి మృతదేహం ఆయా గ్రామాల్లో గురువారం సంచలనం కలిగించింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కట్టెలతో కాల్చి, ఆనవాలు లేకుండా చేయాలని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ప్రయత్నించి ఉండ వచ్చునని, మృతుని శరీరంలో తల, ఒక చేయి పూర్తిగా కాలకుండా మిగిలిపోయాయని, కట్టెలు, పెట్రోలు పోసి, తగులబెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం అటుగా వెళ్లిన పై రెండు గ్రామాలవారు చూసినా గాని, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు భయపడ్డారు. చివరికి విషయం తెలుసుకున్న వీఆర్వో హరి మోహన్ గురువారం రాజానగరం పోలీసులకు మృతిపై ఫిర్యాదు చేశారు. మృతుడు చైతన్యనగర్వాసి సంఘటనా స్థలాన్ని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ నాగరాజు, ప్రకాష్‌నగర్ సీఐ భాస్కరరావు, రాజానగరం ఎస్సై జగన్మోహన్లు సందర్శించి మృతుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కడియం మండలం మాధవరాయుడుపాలెం శివారు చైతన్యనగర్‌కు చెందిన చందక ప్రవీణ్ కుమార్ (20) మూడు రోజులుగా కనిపించడం లేదని తెలుసుకున్నారు. ఇటీవల అతడు దంతాలకు క్లిప్పింగ్ చేయించాడు. మృతదేహం పండ్లకు కూడా క్లిప్పింగ్ ఉండడంతో ఇది ప్రవీణ్ మృతదేహమేనని నిర్థారించారు. ఇదే విషయాన్ని పోస్టు మార్టం అనంతరం ప్రవీణ్ తల్లి రాజమ్మ, అక్క సిరియాల పద్మ, పెదనాన్నలు లక్ష్మీనారాయణ, అప్పారావు గుర్తించినట్టు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. వివాహేతర సంబంధమే కారణమా? బీ ఫార్మశీ చదివిన ప్రవీణ్ రాజమహేంద్రవరంలోనే పనిచేస్తున్నారు. అక్కడ పని చేస్తున్న యువతితో అతను చనువుగా ఉండటం ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారంలో, అది నచ్చని సహోద్యోగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు భావిస్తున్నారు. కాగా ఘటన స్థలాన్ని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గిరజాల వీర్రాజు సందర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
స్టేషన్ ఎదుట ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రేమించిన యువతిని తనకు కాకుండా చేస్తున్నారంటూ ఓ యవకుడు గురువారం కొత్తపేట పోలీస్‌స్టేషన్ ఎదుట బస్సు కింద పడేందుకు ప్రయత్నించాడు. ఆ యువకుడిని వారించేందుకు పోలీసులు, కుటుంబీకులు తీవ్రంగా ప్రయత్నించారు. సేకరించిన వివరాల ప్రకారం... ఇస్లాంపేటకు చెందిన అనస్ అదే వీధిలో ఉంటు న్న యువతిని ప్రేమించాడు. రెండు రోజుల కిందట ఇద్దరు ఇంటి నుంచి పరారై పెళ్లి చేసుకుని తమ పెద్దల నుంచి రక్షణ కావాలంటూ సీపీని ఆశ్రయించారు. సీపీ కార్యాలయం నుంచి కొత్తపేట పోలీ స్‌స్టేషన్‌కు చేరింది. యువతి ప దో తరగతి మార్కుల జాబితా తీసుకురావాలని పోలీసులు పేర్కొన్నారు. గురువారం ఉదయానికి అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో వెళ్లేందుకు ససేమిరా అనడంతో యువకుడు పోలీస్‌స్టేషన్ బయటకు వచ్చి అటుగా వెళుతున్న సిటీ బస్సు చక్రాల కింద తలపెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, అక్క డే ఉన్న మరి కొంతమంది యువకుడిని అడ్డుకున్నారు. కేటీ రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
నాన్నా.. నీ వెంటే..
చిత్తూరు, కురబలకోట: తండ్రి మరణాన్ని ఆ కుమారుడు జీర్ణించుకోలేకపోయాడు. తన జీవితం కూడా వ్యర్థమని భావించాడు. తండ్రి మరణించిన కొద్దిసేపటికే తనువు చాలించాడు. కురబలకోట మండలంలోని శ్రీరాములవారిపల్లెలో గురువారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం శ్రీరాములవారిపల్లెకు చెందిన ఎం. చలపతి (60)కి ముగ్గురు కుమారులు. వీరంతా పెయింటర్లుగా స్థిరపడ్డారు. ఇద్దరికి వివాహమైంది. వీరు వేరే గ్రామాల్లో ఉంటున్నారు. జయకుమార్ (28)కు పెళ్లి కాలేదు. ఇతను తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం తల్లి చనిపోయింది. ఇటీవల తండ్రి కూడా కాలు దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. ఇంట్లో చలపతి, ఆయన తనయుడు జయకుమార్ మాత్రమే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలపతి అనారోగ్యంతో చనిపోయాడు. దీన్ని తట్టుకోలేక ఆయన తనయుడు మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సకాలంలో స్థానికులు గుర్తించలేకపోయారు. వారు చూసేటప్పటికే ఉరికి శవం వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులంతా చేరుకున్నారు. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. జయకుమార్ మృత దే హాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్ర భుత్వాస్పత్రికి తరలించినట్లు్ల ఎస్ఐ వెంకటేశ్వరులు చెప్పారు. -
కత్తితో విద్యార్థినిపై యువకుడి దాడి
ఖమ్మం జిల్లా : పోలీసులు, ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా ఆడవారిపై దాడులు ఆగటం లేదు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా ప్రేమసైకోగాళ్లకు భయమే లేకుండా పోయింది. తాజాగా ఓ యువకుడు తనను ప్రేమించలేదనే కారణంతో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లులోని ఓ సినిమా హాలు వద్ద జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంటర్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న యమున(17) అనే విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమించమంటూ రామలింగయ్య అనే యువకుడు వేధిస్తున్నాడు. తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో గురువారం కత్తితో యమునపై దాడి చేశాడు. ఈ ఘటనలో యమునకు ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్రగాయాలు అయ్యాయి. రామలింగయ్య గతంలో లైంగిక వేధింపుల కేసులో పోస్కో చట్టం కింద అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మార్పు మా నుంచే రావాలి..
సిరిసిల్లటౌన్: ఆడపిల్లల ఆలోచనల సరళి మారినప్పుడే గుర్తింపు వస్తుందని.. నాలుగుగోడల మధ్యనే ఉండాలన కుండా విద్యతో సమాజాన్ని చదవాలని..అప్పుడే స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకగలుగుతారని సిరిసిల్లకు చెందిన న్యాయవాది బూర్ల కళ్యాణి అన్నారు. మహిళా సాధికారతపై ‘సాక్షి’తో ఆమె అభిప్రాయాలు పంచుకున్నారు. కండెలు చుట్టినా.. సిరిసిల్లలోని వెంకంపేట. నాన్న చక్రపాణి నేతకార్మికుడు. అమ్మ లావణ్య గృహిణి. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండేవాళ్లం. మగపిల్లలు లేకపోవడంతో నాన్న సాంచాలు నడుపుతుంటే ఆయనకు సాయంగా కండెలు చుడుతూ ఉండేవాళ్లం. అక్క జ్యోతి బీఎడ్, చెల్లి డిగ్రీ పూర్తి చేశారు. ఆర్థికంగా అంతంతే ఉండడంతో పదోతరగతి దాకా వెంకంపేట ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియెట్ సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాను. మేనత్త స్ఫూర్తితో.. కోర్టులో ఏపీపీవోగా పనిచేస్తున్న మేనత్త వనజ స్ఫూర్తితోనే న్యాయవాద వృత్తిలోకి వచ్చాను. ఇంటర్ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యునివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేశాను. ఏడాదిగా సిరిసిల్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న. అమ్మనాన్నల కష్టం ఎప్పటికీ గుర్తొస్తుంటుంది. ముగ్గురు ఆడపిల్లలమైనప్పటికీ వెనుకడుగు వేయకుండా ఎంతో బాధ్యతగా పెంచారు. మహిళా వివక్షపై.. కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకనే ఆడవారిపై వివక్ష ఎక్కువవుతున్నాయి. ఒక ఇంట్లో అత్త తన కొడుకు తనకు కాకుండా భార్యకు దగ్గరవుతున్నాడన్న ఆలోచనలతో కోడలిపై పగ సాధిస్తుంది. మరికొన్ని కేసుల్లో మగవారికి బయట పనుల్లేక పోవడంతో ఇంటికి వచ్చి భార్యతో గొడవలు పడుతున్నారు. కుటుంబ బాధ్యతల్లో మహిళలూ భాగస్వాములవుతున్న నేపథ్యంలో అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారు. చాలా మంది అమ్మాయిలను చదివించడంలో కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం కరువవుతుంది. వరకట్నాల కోసం దాడులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు సైతం మగపిల్లలకు ఆడవారిపై సదుద్దేశం కలిగేలా పెంచాలి. ఆత్మస్థైర్యంతో ముందుకుపోవాలి మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. ఈరోజుల్లో సోషల్‌మీడియాలో వస్తున పోస్టింగ్‌లు, చాటింగ్లకు ఆకర్షితులై స్నేహం చేయడం మంచిదికాదు. అక్షరజ్ఞానంతోనే సంఘంలోని చీకట్లను చీల్చగలం. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. -
బ్యాడ్మింటన్ ఆడుతూ కానరాని లోకాలకు..
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుకు గురై యువకుడు మృతిచెందిన ఘటన ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన ముదిన వెంకటాచారి (38) లింగపాలెం మండలం రంగాపురంలో విద్యుత్‌శాఖ ఆర్సీ (బిల్లు కలెక్టర్)గా పనిచేస్తున్నారు. షటిల్‌పై ఆసక్తితో స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి సత్తెన్నగూడెంలో జరుగుతున్న టోర్నమెంట్‌కు వెళ్లారు. అక్కడ షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై సేదతీరుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. సహచరులు హుటాహుటిన ద్వారకాతిరుమలలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులులు ఉన్నారు. చారీ గతంలో ప్రముఖ దినపత్రికలో కొంతకాలం విలేకరిగా పనిచేశారు. -
ప్రేమించి..ప్రాణం తీసుకున్నారు!
చీరాల: వారు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కలి సి ఉండాలన్న ఆ ప్రేమికుల కోరికను పెద్దలు అంగీకరించలేదు. వివాహ బంధం వారి కలయికకు అడ్డుగా మారింది. పెద్దలను ఒప్పించే ధైర్యం లేక సమాజం చిన్నచూపు చూస్తోం దని భావించి ప్రేమికుల దినోత్సవం రోజే యువకుడు, వివాహిత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సమయంలో వేటపాలెం మండలం రామన్నపేట రైల్వేగేటు సమీపంలో జరగగా గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వారిలో వివా హితది చీరాల మండలం దేవాంగపురి గ్రామం కాగా యువకుడిది చీరాల మండలం గాంధీనగర్ పంచాయతీలోని ఎంజీసీ కాలనీ. మృతులు ఒకే సామాజిక వర్గం వారు. ఏం జరిగిందంటే.. మండలంలోని గాంధీనగర్ పంచా యతీ ఎంజీసీ కాలనీకి చెందిన యువకుడు చితిరాయిలా సాయిరాం (24), జాండ్రపేట పోస్టాఫీసు ప్రాంతానికి చెందిన వివాహిత పొట్టి రమ్య (24)లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రమ్యకు భర్త రవికుమార్, 5 ఐదేళ్ల కుమారుడు, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివాహిత, అవివాహితుడు ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. తమ నిర్ణయాన్ని పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించడం.. కలిసి ఉండలేమని బాధ.. వెరసి అర్ధాంతరంగా తనువు చాలించాలని నిర్ణయించుకుని రైలు కిందపడి కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. కొంపముంచిన క్షణికావేశం కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసిన యువకుడు.. తాను జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రమ్య క్షణికావేశానికిలోనై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసునమోదు సంఘటన స్థలాన్ని చీరాల జీఆర్పీ ఎస్ఐ జి.రామిరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద రైల్వే ప్రమాద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమ్య, సాయిరాం మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. శవ పరీక్ష నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. -
తిరునాళ్లకని వెళ్లి శవమయ్యాడు!
ప్రకాశం , పామూరు: పట్టణానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. కొత్త వాటర్‌ట్యాంక్ వీధికి చెందిన పోలిబోయిన నారాయణ (22) ఎలక్ట్రికల్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివరాత్రి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం తిరునాళ్లకని వెళ్లాడు. సీఎస్‌పురం మండలం నారాయణస్వామి దేవస్థానం వద్ద రాత్రి 11 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బుధవారం ఉదయం పామూరు పట్టణ సరిహద్దుప్రాంతం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరువూరు గ్రామ పొలాల్లోని చెట్టుకు ఎవరో చున్నీతో ఉరివేసుకుని మృతిచెందినట్లు గొర్రెల కాపరుల ద్వారా పామూరు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు మృతుడు పామూరుకు చెందిన పోలిబోయిన నారాయణగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుని మృతివార్త తెలుసుకున్న తల్లి సుగుణమ్మ, సోదరుడు ప్రభు, వదినలు సంఘటనా స్థలానికి చేరుకుని నారాయణ మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. కాగా తమ కుమారుని ఎవరోహత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు ఆరోపిస్తున్నారు. మృతునివద్ద మాత్రం తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదంటూ ఉత్తరం లభించింది. అయితే అఘాయిత్యానికి ముందు అతనే ఉత్తరాన్ని రాశాడా, లేక భయపెట్టి రాయించారా, వేరేవ్యక్తులు రాశారా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పండగనాడు తిరునాళ్లకు వెళ్లిన కుమారుడు తిరిగివస్తాడని ఎదురు చూసిన తల్లి, సోదరుడు, కుటుంసభ్యులు.. నారాయణ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనా స్థలం నెల్లూరు జిల్లాకు చెందిన ప్రాంతం కావడంతో వరికుంటపాడు పోలీసులు కేసునమోదుచేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. -
ప్రాణస్నేహితుల మధ్య ప్రేమ పగ
దొడ్డబళ్లాపురం: ప్రేమికుల రోజు వారి జీవితాల్లో విషాదం నింపింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు మిత్రులు గొడవపడి కత్తితో పొడవడంతో ఒకరి ప్రాణం పోయింది. ఈ సంఘటన తాలూకాలోని కంచిగనాళ గ్రామంలో చోటుచేసుకుంది. కంచిగనాళ గ్రామం నివాసులయిన సంతోష్ (24), హరీష్ (24) చిన్నప్పటి నుండి ఆప్త స్నేహితులు. సంతోష్ వ్యవసాయం చేసుకుంటుండగా, హరీష్ చదువు సగంలో వదిలేసి షేర్ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. ఇలా ఉండగా ఏడాది కాలంగా హరీష్, ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి పరస్పరం ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో ఆ యువతి తమ కులం అమ్మాయి కావడంతో సంతోష్ కూడా ఇష్టపడి ప్రేమించడం ప్రారంభించాడు. ఈ విషయంలో స్నేహితులు కొంతకాలంగా శత్రువులుగా మారారు. తరచూ అమ్మాయి ప్రేమ కోసం కొట్టుకున్నారు. ఈ క్రమంలో గత వారం అమ్మాయికి హరీష్ ఆటోలో అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ హరీష్‌తో ఘర్షణపడి బెదిరించాడు. ఈ విషయమై హరీష్ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ కోసం గ్రామానికి వచ్చి సంతోష్ ఇంటికి వెళ్లారు. దీనిని అవమానంగా భావించిన సంతోష్ మంగళవారం రాత్రి గ్రామంలోని అశ్వత్థకట్ట వద్ద హరీష్‌తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే సంతోష్ కత్తితో హరీష్ గొంతు, ఎద భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. సంతోష్ పరారయ్యాడు. గ్రామస్థుల్లో భయాందోళన ప్రేమ పేరుతో యువకులు జీవితాలను నాశనం చేసుకోగా, ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న కంచిగనాళ గ్రామంలో కొత్తగా కుల కక్షలు రాజుకోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్, సంతోష్, వీరి ప్రేమికురాలి ఇళ్లు గ్రామంలో ఒకే వీధిలో ఉండడంతో ఎప్పుడేం గలాటా జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్, ఏఎస్పీ మల్లికార్జున్, డీవైఎస్పీ నాగరాజు, సీఐ సిద్ధరాజు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమలేఖలో కొత్త విషయాలు గురువారం నాడు మృతుని తల్లితండ్రులు హరీష్‌కు సంబంధించిన వస్తువులు పరిశీలించగా కొన్ని లవ్ లెటర్లు లభించాయి. అవన్నీ హరీష్ ప్రేమిస్తున్న అమ్మాయి రాసినవే. ఆమె ఇద్దరు యువకులతోనూ ప్రేమ సాగిస్తోందని తేలింది. ముఖ్యంగా అమ్మాయి హరీష్ వల్ల గర్భవతి అయిన సంగతి తెలిసింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులే సంతోష్‌ను ఉసిగొల్పి తమ కొడుకును హత్య చేయించారని హరీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తక్కువ కులానికి చెందిన తమ కుమారుడికి అమ్మాయినిచ్చి వివాహం చేయడం ఇష్టంలేకే హత్య చేయించారని చెబుతున్నారు. -
ప్రియుడిపై చీటింగ్ కేసు..
సుజాతనగర్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్సై రతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. ములకలపల్లి మండలం పూసుగూడేనికి చెందిన బోడ రాజమ్మ, సుజాతనగర్ మండలం సీతంపేటబంజరకు చెందిన లావుడ్య వెంకటేశ్వర్లు బీఈడీ చదువుతున్న సమయంలో స్నేహితులు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి మధ్య శారీరకంగా కూడా చనువు ఏర్పడింది. ఇటీవల వివాహం చేసుకుందామని వెంకటేశ్వర్లును రాజమ్మ కోరగా అందుకు నిరాకరించి ముఖం చాటేశాడు. దీంతో రాజమ్మ ప్రియుడి ఇంటి ఎదుట వారం రోజులపాటు మౌనదీక్ష చేసింది. అదే సమయంలో ఇరువురూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం సైతం చేశారు. అయినప్పటికీ వెంకటేశ్వర్లు మాత్రం రాజమ్మను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో అతనిపై సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లుతోపాటు అతనికి సహకరించిన బంధువులు తులసీరాం, బానోతు ధన్‌రాజ్, రవి, పుష్పావతి, కుషాదేవి, సరస్వతి, కవితపై సైతం కేసు నమోదైనట్లు ఎస్సై రితీష్ తెలిపారు. -
యువకుడి దుర్మరణం
కూసుమంచి : మండలంలోని జక్కేపల్లి, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం చనుపల్లి గ్రామాల మధ్యనున్న పాలేరు వంతెనపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో జక్కేపల్లి గ్రామస్తుడు కొదమగుండ్ల ప్రేమ్ కుమార్(30) మృతిచెందాడు. చనుపల్లికి చెందిన ట్రాక్టర్, చెరకు లోడుతో రాజేశ్వరపురంలోని ఫ్యాక్టరీకి వస్తోంది. ప్రేమ్‌కుమార్, తన కుమారుడు అభిరామ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై చనుపల్లి సమీపంలోగల శివాలయానికి ఉదయం ఆరు గంటల సమయంలో వెళుతున్నాడు. వంతెన పైకి రాగానే, ఎదురుగా వస్తున్న చెరకు ట్రాక్టర్ తగిలింది. ఇద్దరూ కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలతో ప్రేమ్‌కుఆర్ అక్కడిక్కడే మృతిచెందాడు. అతని కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వారి కుటుంబీకులు, బందువులు వచ్చారు, భోరున విలపించారు. తమ కుటుంబాన్ని ట్రాక్టర్ యజమాని ఆదుకోవాలన్న డిమాండుతో మృతదేహంతో వంతెన పైనే ఆందోళనకు దిగారు. కూసుమంచి ఏఎస్ఐ రవూఫ్ వచ్చారు. ఆ ఆందోళనకారులతో మాట్లాడారు. తమకు యజమాని న్యాయం చేసేంతవరకు మృతదేహాన్ని తొలగించేది లేదంటూ అక్కడే టెంట్ వేసుకుని ఆందోళనను ఉధృతం చేశారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. శివరాత్రి విధుల్లో ఉన్న ఎస్ఐ రఘు, జక్కేపల్లి చేరుకున్నారు. మృతుని కుటుంబీకులతో, ట్రాక్టర్ యజమానితో చర్చించారు మృతుని కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు ట్రాక్టర్ యజమాని అంగీకరించటంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరి ఆత్మహత్య
అనారోగ్యం భరించలేక యువతి... కారేపల్లి : అనారోగ్య సమస్యలను భరించలేని ఓ యువతి తీవ్ర మనోవేదనతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని బాజుమల్లాయిగూడెం గ్రామంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన కత్తికోల శ్రీవాణి (21) గత ఏడాది డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. పదేళ్ల క్రితమే తల్లి మృతిచెందింది. తండ్రి వెంకటేశ్వర్లు, అన్నలు నాగేంద్రబాబు, రాకేష్‌తో కలిసి ఉంటోంది. ఐదేళ్ల క్రితం శ్రీవాణికి వెన్నునొప్పి శస్త్ర చికిత్స జరిగింది. అయినప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే అంగవైకల్యం ఏర్పడింది. శరీర ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది. ఆమె, సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కొన్ని గంటల తరువాత తండ్రి వెంకటేశ్వర్లు వచ్చేసరికి నిశ్చల స్థితిలో కనిపించింది. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ అదే రోజు రాత్రి మృతిచెందింది. ఆమె సోదరుడు నాగేంద్రబాబు ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ శశిధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో యువకుడు.. టేకులపల్లి : మద్యానికి బానిసగా మారిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ భూక్య కృష్ణ నాయక్ తెలిపిన వివరాలు... స్థానిక బి–కాలనీ తండాకు చెందిన బానోతు వెంకన్న(24)కు, దేవితో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వెంకన్న, కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు. ఆమె విసుగెత్తింది. సోమవారం గట్టిగా మందలించింది. ఇలాగే రోజూ తాగొస్తే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళతానని బెదిరించింది. దీంతో అతడు మంగళవారం మద్యంమత్తులో పురుగుమందు తాగాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయన భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లైన మూడు నెలలకే..
‘సంతోషం తప్ప బాధ ఎలాంటిదో తెలియదు. మా అమ్మ కష్టపడి అలా పెంచింది. తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అమ్మకంటే ఎక్కువగా చూసుకున్నాను. అవతలి నుంచి ఇసుమంత ప్రేమ దొరకలేదు. దూరంగా పెడుతూ వేధించడం మొదలుపెట్టింది. సర్దుకుపోదామనుకున్నా. చివరకు నన్ను ఎంతగానో ప్రేమించే మా అమ్మపై చేయిచేసుకునేంత వరకు వెళ్లా. అయినా, ఆమెలో మార్పు రాలేదు. తర్వాత ఆమె మా ఇంట్లోని సంతోషాన్ని తీసుకెళ్లేందుకొచ్చిందని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నన్ను తమ్ముడిలో చూసుకోండి అమ్మా..నాన్నా’ అంటూ సెల్ఫోన్లో వాయిస్ రికార్డు చేసి తమ్ముడికి పంపి రైలు కింద పడి తనువు చాలించాడు గోనెగండ్లకు చెందిన వినయ్‌కుమార్. కర్నూలు/గోనెగండ్ల/ పత్తికొండ రూరల్/: కర్నూలు శివారులోని కార్బైడ్ ఫ్యాక్టరీ మెయిన్‌గేట్ వద్ద సోమవారం రాత్రి వినయ్‌కుమార్ (24) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. గోనెగండ్ల పట్టణానికి చెందిన సుబ్రమణ్యంశెట్టి , విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వినయ్‌కుమార్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తమ్ముడు వంశీకృష్ణతో కలసి పత్తికొండలోని సాయిబాబా గుడి దగ్గర కిరాణం అంగడి నిర్వహిస్తున్నాడు. మేనమామ సొంతూరైన వెల్దుర్తిలో సౌజన్య అనే అమ్మాయిని ప్రేమించి నవంబర్ 1న పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే మరొక యువకుడితో ఆమె ప్రేమలో పడటంతో వినయ్‌కుమార్‌కు దూరంగా ఉంటోంది. పెళ్లి అయినప్పటినుంచి కూడా కాపురం చేయకపోగా విడాకులు కావాలని భర్తతో గొడవ పడేది. 20 రోజుల క్రితం ఇదే విషయంలో ఘర్షణపడి పుట్టింటికి చేరుకుంది. సోమవారం ఉదయం వినయ్‌కుమార్‌కు.. అత్త అమృతవల్లి ఫోన్ చేసి సౌజన్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కర్నూలు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపింది. వెంటనే తమ్ముడు వంశీతో కలసి వచ్చి గాయత్రి ఎస్టేట్‌లోని ఆసుపత్రిలో భార్యను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ సమయంలో కూడా వారి మధ్య సంసార విషయమై గొడవ జరిగింది. సాయంత్రం తల్లితో కలసి సౌజన్య వెల్దుర్తికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన వినయ్‌కుమార్ మద్దూర్‌నగర్‌లో పని ఉంది.. చూసుకుని వస్తానంటూ తమ్ముడికి చెప్పి కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కీమెన్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదంలో చేతులు, కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. షర్ట్ జేబులో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. శోకసంద్రంలో తల్లిదండ్రులు వినయకుమార్ మరణ వార్త తెలియగానే తల్లిదండ్రులు, తమ్ముడు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లైన దంపతులు సుఖసంతోషాలతో ఉంటారనుకుంటే ఇలా జరిగిందం టూ వారు రోదిస్తున్న తీరు స్థానికుల ను కంటతడి పెట్టించింది. తర్వాత మృతదేహాన్ని గోనెగండ్లకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అన్న ఆత్మహత్యకు వదిన, ఆమె కుటుంబసభ్యులే కారణమని వంశీ తెలిపారు. -
లాడ్జిలో యువకుడి ఆత్మహత్య
నాయుడుపేటటౌన్: పట్టణంలోని బైపాస్‌రోడ్డుపై ఉన్న ఓ లాడ్జిలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు లాడ్జి నిర్వాహకులు సోమవారం సాయంత్రం గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు.. చీరాల పట్టణంలోని ఈపూరుపాళెంకు చెందిన ఎన్.రవితేజ (25) స్వరాజ్ ట్రాక్టర్ల కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. నాయుడుపేట స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో విధులు నిర్వహిస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి ఈ లాడ్జిలో ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ట్రాక్టర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కే శ్రావణ్‌కుమార్‌తో కలిసి మధ్యాహ్నం ఒక సినిమా, రాత్రి సినిమాను వరుసగా చూసి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో లాడ్జిలోని గదికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నప్పటికీ సమాధానం లేకపోడంతో అనుమానంతో సాయంత్రం లాడ్జి వద్దకు వచ్చి పరిశీలించగా గదిలో తలుపు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించారు. ఈ విషయమై లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై రవినాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గదిలో టీవీ ఆన్ చేసుకుని ప్లాస్టిక్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. అయితే ఈ యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైన కారణమా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గదిలో లభించిన అతని సెల్‌ఫోన్, డైరీ తదితరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో వచ్చి... ముఖంపై కారం చల్లి
విశాఖ క్రైం: గురుద్వార మందిరానికి వెళ్లి ప్రార్థన చేసి వస్తున్న ఓ యువతి ముఖంపై కారం చల్లి కారులో తీసుకెళ్లిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తీసుకొచ్చిన కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీతమ్మధార బాలయ్యశాస్త్రి లే అవుట్లో అమృత హిల్స్ అపార్టుమెంట్లో కాన్పూర్‌కు చెందిన పునీత్‌కౌర్ తోటి ఉద్యోగులతో కలిసి నివసిస్తోంది. శంకరమఠం రోడ్డు శాంతిపురంలో గల ఐఐటీ, ఎన్ఐటీ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పునీత్‌కౌర్ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పునీత్‌కౌర్ గురుద్వార కూడలిలో గల గురుద్వార మందిరానికి ప్రార్థన చేసుకునేందుకు వచ్చింది. అనంతరం మందిరం నుంచి బయటకు వచ్చిన సమయంలో గేటు వద్ద ఎంహెచ్ 05డీహెచ్ 6130 నెంబర్ గల కారులో ఉన్న ప్రసన్న ఠాణే మాటలు కలిపి ముఖంపై కారం చల్లాడు. అనంతరం తనతోపాటు కారులో తీసుకుపోయేందుకు యత్నించాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో యువతి అరవడంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి ప్రసన్న ఠాణేను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ బెండి తిరుమలరావు సంఘటనా స్థలికి చేరుకుని ప్రసన్న ఠాణేను అదుపులోకి తీసుకున్నారు. పునీత్‌కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ రాజు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసుకున్నారు...
రోజూ మద్యం తాగి వచ్చి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న భర్త వేధింపులు తాళలేక విజయనగరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా...బలిజిపేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు దుర్వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డా డు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, బొబ్బిలి: బలిజిపేట మండల కేంద్రానికి చెందిన పి.శ్రీకాంత్(20) అనే యువకుడు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి క్రిమి సంహారక మందు తాగడంతో స్థానికులు అక్కడి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఏ పనులు చేయకుండా ఉండటంతో పాటు దుర్వ్యసనాలకు అలవాటు పడటంతో ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారన్న ఉక్రోషంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు సూర్యనారాయణ, సత్యవతి బోరున విలపిస్తున్నారు. బలిజిపేట ఎస్ఐ సింహాచలం కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. భర్త వేధింపులు తాళలేక... విజయనగరం టౌన్: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని ఉడాకాలనీలో గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... స్థానిక ఉడాకాలనీ ఫేజ్–3 ఆంజనేయ స్వామి గుడి వద్ద నివాసముంటున్న అద్దెపల్లి రమాదేవి (27) భర్త ఎవిఎస్.రాజుతో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి వెంకట్ చరణ్ అనే బాబు ఉన్నాడు. స్థానిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా రాజు నిత్యం మద్యం సేవించి, ఇంటికి వచ్చి భార్య రమాదేవిని దుర్భాషలాడడం, కొట్టడం, తిట్టడం వంటివి చేస్తూ ఇబ్బందులు పెడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం భార్యను వేధించసాగాడు. అనంతరం కొడుకును పాఠశాలకు తీసుకెళ్లి, ఇంటికి వచ్చి చూడగా ఆమె ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కి ఉరి వేసుకుందని గ్రహించాడు. రాజు సమీపంలో ఉన్న వారి సాయంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు మృతి చెందిందని నిర్ధారించారని పోలీసులకు తెలిపాడు. గతంలో రాజుకు ఇద్దరు భార్యలుండేవారు. వారు సహజ మరణం చెందడంతో పెద్దల సమక్షంలోనే మూడో భార్యగా రమాదేవిని చేసుకున్నాడు. వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
భవనంపై నుంచి పడి యువకుడు మృతి
సాక్షి, చందానగర్: హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారా నగర్లో భవనంపై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. భవనం రెండవ అంతస్తుపై నుండి ఉమర్ పాషా (27) అనే వ్యక్తి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఏడాది క్రితమే వివాహం అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధి ఆస్పత్రికి తరలించారు. ప్రదవశాత్తు జరిగిందా లేక హత్యా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.