
ప్రతికాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యువతులపై లైంగిక వేధింపులు రోజు రోజుకు మరింత ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి విషయాలు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. కొందరు అలాంటి విషయాలను చెప్పుకోలేక లోలోపల మధనపడుతుంటే, మరి కొందరు ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కొంటున్నారు. తాజాగా గచ్చిబౌలికి చెందిన ఓ యువతిని బ్లాక్‌మెయిల్ చేసున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సంఘటన గురువారం గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజమండ్రికి చెందిన మొహమ్మద్ ఖాదర్ బుఖారి గత కొద్ది రోజులుగా యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ తనకు డబ్బులు పంపాలని లేకపోతే నగ్న ఫొటోలు ఫేస్‌బుక్, వాట్సప్‌లో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువతి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖాదర్ బుఖా పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment