Social media
-
వీడియో: ట్రంప్ కూతురా మజాకా.. ప్రత్యర్థిని పడగొట్టిన ఇవాంక ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంక ట్రంప్(43) ప్రాచీన సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ జియూ–జిత్సూ(జుజుత్సూ)లో చక్కటి ప్రావీణ్యం సంపాదించారు. ఆమె జుజుత్సూలో శిక్షణ పొందుతున్న వీడియోను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మియామీలోని ఓ వ్యాయామశాలలో ఇవాంక ట్రంప్ జుజుత్సూ నైపుణ్యాలను ప్రదర్శించారు. తన ప్రత్యర్థని క్షణాల్లో మట్టికరిపించారు. నీలం రంగు బెల్ట్ ధరించిన ఇవాంక తన హస్త లాఘవంతో అందరినీ ఇంప్రెస్ చేశారు. జుజుత్సూలో ఆమె బలం, క్రమశిక్షణ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో బ్లూబెల్ట్ సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. ఇవాంక ట్రంప్ జుజుత్సూను నిత్యం సాధన చేస్తుంటారు.ఇక, డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇవాంక ట్రంప్ ఆయనకు సీనియర్ సలహాదారుగా సేవలందించారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబ బాధ్యతలకే పరిమితం అవుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ కుటంబ, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తనకు దొరికిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. Ivanka Trump is a Jiu-Jitsu badass pic.twitter.com/IFtJROhjTt— Sara Rose 🇺🇸🌹 (@saras76) March 22, 2025 -
ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్‌లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందట. -
‘బాంబు పేలింది’.. భూకంపం అనుభవాల వెల్లువ
న్యూఢిల్లీ: ఈరోజు (సోమవారం) ఢిల్లీ ప్రజలు తెల్లవారుజామున నిద్ర నుంచి లేస్తూనే భూకంప ప్రభావానికి లోనయ్యారు. భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 36 నిముషాలకు సుమారు 55 సెకెన్లపాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. భూకంపం వచ్చిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను పలువురు ట్వట్ల ద్వారా పంచుకున్నారు. Earthquake in Delhi NCR pic.twitter.com/XQwyhc8PvI— Navneet K Singh (@Navneet_K_Singh) February 17, 2025‘ఎక్స్’ ప్లాట్‌ఫారంపై నవనీత్ సింగ్ అనే యూజర్ భూకంపం సమయంలో తమ ఇంటిలో కదులుతున్న ఫ్యానుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మరో యూజర్ బాంబు పేలిందని అనుకున్నామని రాశారు.You know it's a massive one when it forces you out of your sleep and out of bed. #earthquake— Sarah Waris (@swaris16) February 17, 2025@swaris16 అనే యూజర్ ‘ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధం నిద్ర ఎగిరిపోయేలా చేసింది’ అని రాశారు. దీనిని చూసిన ఒక యూజర్ ‘ఆ శబ్ధం ఉలిక్కిపడేలా చేసిందని’ పేర్కొన్నారు.Severe #earthquake tremors in #Delhi at 0537 amI was in hospital. Yet to evacuate all a patients down. Told those who can walk to go down— Anish K Gupta (@optionurol) February 17, 2025అనిష్ అనే యూజర్ ‘ఢిల్లీలో ఉదయం 05:37కు తీవ్రమైన ప్రకంపన వచ్చింది. ఆ సమయంలో నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఇక్కడి సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు’ అని రాశారు.Very strong earthquake for a couple of seconds here in delhi. The whole society is up!— Worah | #WalkingInDelhi (@psychedelhic) February 17, 2025ఇంకొక యూజర్ ‘ఢిల్లీలో కొద్ది సెకెన్లపాటు భూకంపం వచ్చింది. సొసైటీలోని వారంతా ఉలిక్కిపడ్డారు’ అని రాశారు. మరొకరు ‘ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు. -
ఫ్యామిలీ ట్రిప్‌లో అనసూయ చిల్.. న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ
తమిళనాడు ఫ్యామిలీ ట్రిప్‌లో అనసూయ చిల్..గోవా ట్రైబల్ ఫెస్టివల్లో శ్రద్ధాదాస్ డ్యాన్స్..న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని..2024 జ్ఞాపకాలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్..మలేషియాలో శివం భజే హీరోయిన్ దిగాంగన సూర్యవన్షి...న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న ఆలియా భట్.. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Susank Bharadwaj (@susank.bharadwaj) -
నా పార్ట్నర్ సూపర్: భార్య దేవిశాతో సూర్యకుమార్(ఫొటోలు)
-
బృందావనంలో గోపికలుగా ఎంత ముద్దుగున్నారో.. గుర్తు పట్టారా? (ఫోటోలు)
-
డిజిటల్ దివా ఆఫ్ ది ఇయర్: ఎవరీ సిండ్రిల్లా
-
వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం.. భార్య బాలీవుడ్ నటి: ఎవరీ బిలియనీర్? (ఫోటోలు)
-
ప్రియుడితో స్టార్ సింగర్ ఎంగేజ్మెంట్ : డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది ఈ హాలీవుడ్ బ్యూటీ. ప్రియుడు బెన్నీ బ్లాంకోతో ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన సెలెనా గోమెజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చేతి డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో రిలేషన్ ఎప్పటినుంచో వార్తల్లో ఉన్నప్పటికీ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. చిరకాల ప్రయాణం షురూ(ఫరెవర్ బిగిన్స్ నౌ) గురువారం (డిసెంబర్ 12) ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది ‘సింగిల్ సూన్’ సింగర్ . దీనికి స్పందించిన ఆమె కాబోయే భర్త బెన్నీ బ్లాంకో ఈ పోస్ట్‌పై ‘హే వెయిట్... ఆమె నా భార్య’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ లవ్‌బర్డ్స్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అద్భుతమైన మార్క్విస్ సాలిటైర్ డైమండ్ రింగ్‌తో సెలెనా గోమెజ్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Selena Gomez (@selenagomez) బెన్నీ బ్లాంకో ఎవరు?బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్‌ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్లో తమ సంబంధాన్ని ధృవీకరించారు. -
జబర్దస్త్ యాదమ్మ రాజు భార్య స్టెల్లా మెటర్నిటీ ఫోటోషూట్
-
భారతీయ డిజైనర్ రూపొందించిన గౌనులో ఐరిష్ నటి..క్యూట్ బబ్లీ లుక్స్..!
-
తెరమీద కనిపిస్తే చాలు,అదో అందమైన ఫీలింగ్, నటి లేటెస్ట్ ఫోటోలు
-
తల్లీ.. నీకు సెల్యూట్!
నాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన దత్త పుత్రుడిని వీపుకు కట్టుకుని జవనాశ్వాన్ని దౌడు తీయిస్తూ బ్రిటిష్ వారిపై కత్తి ఝళిపిస్తే, నేడు ఈ రాజ్‌కోట్ యువతి తన బిడ్డను మోటార్ బైక్ పైన కూర్చోబెట్టుకుని, వీపుకు బ్యాగు తగిలించుకుని, డెలివరీ ఏజెంట్‌గా జీవన పోరాటం సాగిస్తోంది! ఈ దృశ్యాన్ని చూసిన ‘విష్విద్’ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఆమెను వీడియో తీసి, బ్యాక్‌గ్రౌండ్‌లో కత్తి పట్టిన ఝాన్సీరాణిని ఆమెకు జత కలిపి పెట్టిన పోస్ట్‌కు ఇప్పటివరకు 9 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. నెటిజెన్ లు తమ కామెంట్లలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘‘బైక్ నడుపుతున్నావ్.. బద్రం సిస్టర్’’ అని జాగ్రత్తలు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. కాళ్లకు చెప్పులు తొడుక్కోవాలని మరికొందరు కోరుతున్నారు. ఈ యువతి గత నెల రోజులుగా డెలివరీ ఏజెంటుగా పని చేస్తోంది. ఇన్ స్టాలో వెల్లడైన వివరాలను బట్టి.. ఈమె హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసింది. పెళ్లయ్యాక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. ఇక ఇప్పుడైతే.. ‘‘బిడ్డ తల్లివి కదా.. ఉద్యోగం ఎలా చేస్తావ్?’’ అని అడుగుతున్న వారే ఎక్కువమంది! చివరికి డెలివరీ ఏజెంట్ ఉద్యోగాన్ని ఎంచుకుని, తనతోపాటు కొడుకునూ వెంట బెట్టుకుని ధైర్యంగా జీవనయానం సాగిస్తోంది. -
అరెస్ట్ పై.. పట్నం నరేందర్ రెడ్డి భార్య.. కీలక వ్యాఖ్యలు
-
ముక్కుపుడకతో మత్తెక్కిస్తున్న శ్రీలీల.. కొత్త లుక్ (ఫొటోలు)
-
‘ఆయన దేవుడు’ వీరాభిమాని గుండెలపై శాశ్వతంగా రతన్ టాటా
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని దుఃఖసాగరంలో ముంచేసింది. పారిశ్రామిక వేత్తగానే కాకుండా, ప్రముఖ దాతగా మానవతావాదిగా నిలిచిన ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ అభిమానులు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అయితే ఈ విషయంలో మరో అడుగు ముందు కేశాడు రతన్ టాటా అభిమాని ఒకరు. ఏకంగా ఆయన టాటూను గుండెలపై ముద్రించుకుని అపారమైన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా మారింది.రతన్ టటా ఫొటోను ఒక అభిమాని గుండెపై టాటూగా ముద్రించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను టాటూ ఆర్టిస్ట్ మహేష్ చవాన్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను నెటిజనులను ఆకట్టుకుంటోంది. రతన్ టాటాను తమ దేవుడిగా భావిస్తున్నట్లు వీడియోలో ఆ యువకుడు తెలిపాడు. ఈ సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఒక విషయాన్ని కూడా వెల్లడించాడు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితడు వైద్యం కోసం ఎంతో కష్టపడ్డాడని ఆ సమయంలో టాటా ట్రస్ట్ ఆదుకుని, వైద్యం అందించి అతడి ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నాడు. అందుకే తాను రతన్ టాటా ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నానని తెలిపాడు.దీంతో ‘‘దేశం ఒక తన రతన్ (రత్నం)ని కోల్పోయింది అని ఒకరు, నిజంగానే ఆయన చాలా గ్రేట్, నిజమైన కోహినూర్‌ను కోల్పోయాం’’ అంటూ నెటిజన్లు ఆయనకు నివాళి అర్పించారు. ఈ వీడియో లక్షలకొద్దీ లైక్స్‌ను 80 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది. కాగా గతవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో 86 ఏళ్ల రతన్ టాటా కన్నుమూశారు. భారతీయ వ్యాపారరంగంలో ఒక శకం ముగిసింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mahesh Chavan (@themustache_tattoo) -
బ్లాక్ శారీలో త్రిప్తి డిమ్రీ.. దుర్గామాత పూజలో శ్రద్ధాదాస్
దుర్గామాత పూజలో హీరోయిన్ శ్రద్దాదాస్ బ్లాక్ శారీలో యానిమల్ బ్యూటీ హోయలు.. స్టన్నింగ్ అవుట్ ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. శారీలో కీర్తి సురేశ్ అందాలు.. బతుకమ్మ సంబురాల్లో అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ సాకర్ దిగ్గజాల్లో ఒకరిగా ఎదిగిన ఈ పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్.. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన ఘనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మైదానంలోనే కాదు ఆఫ్‌ది ఫీల్డ్‌లో కూడా రికార్డులు కొల్లగొట్టడంలో రొనాల్డోకి మించిన వారే లేరు. ఇటీవలే తన కెరీర్లో 900 గోల్‌లను సాధించి చరిత్ర సృష్టించిన రొనాల్డో.. తాజాగా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.సోషల్ మీడియా కింగ్..రొనాల్డో తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. తద్వారా సోషల్‌మీడియాలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు.తాజాగా ఈ విషయాన్ని రొనాల్డోనే అభిమానులతో పంచుకున్నాడు. "మనం చరిత్ర సృష్టించాము. 1 బిలియన్(100 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాము. ఇది కేవలం సంఖ్యమాత్రమే కాదు. కోట్లాది మంది ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. మదీరా వీధుల్లో ఫుట్‌బాల్ ఆడే స్థాయి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడగలిగాను. నేను ఎల్లప్పుడూ నా కుటుంబం కోసం, మీ కోసమే ఆడాను. ఇప్పుడు ఏకంగా వంద కోట్ల మంది నా వెనక ఉన్నారు. నా కెరీర్లో నేను చవిచూసిన ఎత్తుపల్లాల్లో, నేను వేసే ప్రతీ అడుగులోనూ మీరున్నారు. అభిమానుల ఆదరాభిమానాలతోనే నా ఈ ప్రయాణం సాధ్యమైంది. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నన్ను సపోర్ట్ చేసి నా జీవితంలో భాగమైనందుకు అందరికి ధన్యవాదాలు. మనం ఇంకా చాలా సాధించాలి. మనమంతా కలిసి ముందుకు సాగుతాం అని ఎక్స్‌లో రొనాల్డో రాసుకొచ్చాడు. కాగా రొనాల్డో ఇటీవలే యువర్ క్రిస్టియానో" పేరుతో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించగా.. 90 నిమిషాల వ్యవధిలోనే ఇది ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను పొందాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాలో ఈ ఫుట్‌బాల్ స్టార్‌ను 63.9కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ‘ఎక్స్’లో 11.3 కోట్ల మంది, ఫేస్బుక్లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు... We’ve made history — 1 BILLION followers! This is more than just a number - it’s a testament to our shared passion, drive, and love for the game and beyond.From the streets of Madeira to the biggest stages in the world, I’ve always played for my family and for you, and now 1… pic.twitter.com/kZKo803rJo— Cristiano Ronaldo (@Cristiano) September 12, 2024 -
స్మార్ట్‌ఫోనా? టైం బాంబా భయ్యా ఇది! వైరల్ వీడియో
పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. పగలూ రాత్రి స్మార్ట్ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్న రోజులివి. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే వైర్లెస్ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనీ, గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి, అలసట, నిద్రకు భంగం వంటి ప్రతికూల ప్రభావాలకు ఈ సెల్ రేడియేషన్ కారణమని అనేక పరిశోధనలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు స్మార్ట్పోన్ఎక్కువగా వాడటం కంటి సమస్యలు, చేతి, మెడ కండరాలు సమస్యలు కూడా వస్తాయి.తాజాగా స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోస్కోప్‌లో పరిశీలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీద ఉంటుందని గతంలో అనేక పరిశోధనలు హెచ్చరించాయి. ఇదే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.Smartphone under a Microscope📹 Rajinder Singhpic.twitter.com/UsHH3AUrvW— Science girl (@gunsnrosesgirl3) August 28, 2024ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయమైన మొబైల్ ఫోన్ వాడకంలో తప్పనిసరి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఫోన్ వాడకాన్ని నియంత్రించడం, అలాగే వాడిన తరువాత, ఆహారం తీనేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ను రోజులో ఒకసారైనా శానిటైజ్‌తో జాగ్రత్తగా తుడవం( తడిచిపోయేలా కాదు) చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచాలి. -
పిల్లల్లేకుండా, సోలోగా హాలిడే ట్రిప్, తొలి అనుభవం : నటి ఫోటోలు వైరల్
సాధారణంగా మహిళలు పెళ్లి , పిల్లలు తరువాత చాలా బాధ్యతల్లో మునిగిపోతారు. పిల్లల పెంపకంలో సెలబ్రిటీలైనా, సినీ తారలైనా అమ్మలకు ఈ బాధ్యత తప్పదు. ఈ క్రమంలో తమ ఉద్యోగాల్ని, తన అభిరుచుల్ని ఆంక్షాల్ని కూడా పక్కన పెట్టి మరీ పిల్లల పెంపకంలో మునిగి పోతారు. వాళ్లు కాస్త పెద్దవాళ్లయిన తరువాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం, మరికొంతమంది స్నేహితులతో హాలిడే ట్రిప్‌లు, తమ కలలకు పదును పెట్టడం లాంటివి చేస్తారు. సినీ నటి సమీరా రెడ్డి పిల్లలు, గిల్లలు ఇలాంటి బాదర బందీ ఏ మాత్రం లేకుండా మరింత గ్రాండ్‌గా సోలో ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. "మీరు పిల్లలు లేకుండా సోలో హాలిడే ఎంజాయ్ చేశారా? నా మొదటి అనుభవం’’ అంటూ గ్రీస్‌లో గడిపిన మెమరబుల్ ఫోటోలను షేర్ చేసింది. దీంటో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
జిమ్ డ్రెస్‌లో పరిణీతి చోప్రా.. కేతికశర్మ సొగసులు.. అనసూయ మెరుపులు
జిమ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్న పరిణీతి చోప్రామేరే పాస్ గాడీ హై అంటూ మోటార్ బైక్ రైడ్ చేస్తున్న ఆదాశర్మవైట్ శారీలో మెస్మరైజ్ చేస్తానంటూ కేతిక శర్మ ఫోజోలుసరికొత్త లుక్‌లో కనిపించిన సమంతజిమ్ డ్రెస్‌లో పరిణీతి చోప్రా.. కేతికశర్మ సొగసులు.. అనసూయ మెరుపులు View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
#Vinesh Phogat కుట్ర? కఠిన వాస్తవమా? గుండె పగిలిందంటున్న నెటిజన్లు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆశలు అడియాసలయ్యాయి. భారత్‌కు మరో పతకం ఖాయమని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వేళ భారతీయ క్రీడాభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకున్న ఆనంద క్షణాలో ఆమెపై అనర్హత వేటు పడటం సంచలనంగా మారింది. 50 కేజీల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ బరువున్నకారణంగా ఆమెను అనర్హురాలిగా ఒలింపిక్ సంఘం ప్రకటించింది.This is Conspiracy against Vinesh Phogat.This is a SCAM 💔 pic.twitter.com/nN6mgmVa5Y— Harsh Tiwari (@harsht2024) August 7, 2024HEART-BREAKING TURN AROUND OF INDIAN OLYMPIC HISTORY - VINESH PHOGAT 💔 - This pain will stay forever. pic.twitter.com/x4geviOJHD— Johns. (@CricCrazyJohns) August 7, 2024బరువు నియంత్రణకోసం 14 గంటలు నీరు కూడా తాగలేదు వినేశ్. బరువు తగ్గడానికి నిద్ర పోలేదు అయినా 100 గ్రాములు ఎక్కువ కావడం ఆమెతోపాటు, కోట్లాదిమంది భారతీయులను గుండెల్ని బద్దలు చేసింది. కానీ నీళ్లు తాగని కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడంతో వినేశ్ ఆస్పత్రి పాలైంది. దీంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు బావురుమన్నారు. కుట్ర జరిగిందా, కఠిన వాస్తవమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 100 గ్రా. కోసమా అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. నమ్మశక్యంగా లేదు.. గుండె కొట్టించుకున్నాసరిపోయేదిగా!ఇది అసలు నమ్మశక్యంగా లేదు. 100 గ్రాముల కోసం అనర్హత వేటా? ఈ మాత్రం బరువు తగ్గేందుకు నెత్తి మీద వెంట్రుకలు తీయించుకున్నా సరిపోతుంది అంటూ ప్రముఖ యూ ట్యూబర్ ధృవ్ రాఠీ ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు గుండె పగిలిన ఎమోజీలను పోస్ట్ చేశారు. మరోవైపు ‘నువ్వు విజేతవే.. వినేశ్... అధైర్యపడవద్దు’ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఈ బాధ తీరనిది అంటూ మరికొందరు ట్వీట్ చేశారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడాని కంటే ముందు మహిళా రెజర్లపై లైంగిక ఆరోపణల పోరాటంలో వినేశ్ ఫోగట్ ముందు వరుసలో నిలిచారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఆ రోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
'దయచేసి ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దు'.. విశ్వక్ సేన్ విజ్ఞప్తి!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్. గోదావరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విశ్వక్ లైలా చిత్రంలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తన కెరీర్లో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. అయితే తాజాగా విశ్వక్ సేన్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు.తాజా పోస్ట్‌లో విశ్వక్ సేన్ రాస్తూ..'అందరికీ హాయ్.. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌కు చిన్న విరామం మాత్రమే. మీరు ఎవరు చింతించాల్సిన పనిలేదు. ట్విట్టర్ ఖాతాను నా టీమ్ నిర్వహిస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేషన్ గురించి ఒత్తిడికి గురికావద్దని' సూచించారు.అంతేకాకుండా.. 'ఇటీవల నా సోషల్ మీడియా ఖాతా డియాక్టివేషన్ కారణంగా అందరూ మేసేజులు పెడుతున్నారు. అంతా బాగానే ఉందా అని. ఇది చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించదు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. అయితే విశ్వక్ సేన్ నిర్ణయంపై ఫ్యాన్స్ నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. Hey everyone, just a heads up—I posted a story about starting a social media detox. It's a small break from Instagram, nothing to worry about. Try being productive during this time! My team mostly manages my Twitter, so don't stress over my Instagram deactivation. Lately, I've…— VishwakSen (@VishwakSenActor) July 5, 2024 -
సుమ యోగా డే వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా మన దేశంలో జమ్ము కశ్మీర్లో 50 వేల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాగే దేశ వ్యాప్తంగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు యోగాసనాలతో సందడి చేశారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ప్రముఖ యాంకర్ సుమ కనకాల అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? వాటి లాభాలను వివరిస్తూ ఇన్‌స్టాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రతీ పండుగకు ఏదో ఒక విశేషమైన వీడియోను పంచుకునే సుమ యోగా డేనుకూడా అలా వినియోగించుకుందన్న మాట. యోగాసనాలతో విన్యాసాలు చేస్తూ హిల్లేరియస్ రీల్‌పై నెటిజన్లు కూడా ఫన్నీగా కమెంట్స్ చేశారు. అయితే ‘‘ఎందుకొచ్చిన తిప్పలు అక్కా..హాయిగా మూడు ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, 6 ఇంటర్వ్యూలు చేసుకోక’’ అని ఒకరు, ‘ఈ వయసులో ఈ ప్రయోగాలు అవసరమా, లైక్స్ కోసం కాకపోతే’ అని మరొకరు, ‘‘ఇంత టైం ఎక్కడ దొరకుతుందక్కా నీకు’’ అంటూ మరొక అభిమాని వ్యాఖానించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ వయసులో ఉన్నవారైనా యోగాను సాధన చేయవచ్చు. కాకపోతే నిపుణుడైన గురు సమక్షంలో చేయడం ఉత్తమం. -
రష్యన్ మహిళకు వింత అనుభవం : రీల్ తెచ్చిన తంటానేనా?
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్‌పై ఒక పాస్‌పోర్ట్ అధికారి ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వడంతో పాటు మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు కాల్ చేయాలని పేర్కొన్నాడన్న ఆరోపణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి, నెక్ట్స్ టైం వచ్చినపుడు సంప్రదించాలని పేర్కొన్నట్టు దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్ పాస్‌ను కూడా చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్ కూడా నిర్వహించింది.అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol)అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్‌ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే సదరు ఆ అధికారి అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని QR కోడ్‌తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది. గోడపై పోస్టర్ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్‌కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol) భారతదేశంలో పర్యటిస్తూ తన అనుభవాలతో వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంద్వారా పాపులర్ అయింది దినారా. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లి పోయింది. మాస్కో నుండి ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది. -
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్‌స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్‌లోని ఆనంద్‌లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్‌ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్‌కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్‌కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
ఓటు వేయకుంటే రూ. 350 జరిమానా? నిజమెంత?
దేశంలో ఒకవైపు లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ. 350 జరిమానా ఉంటుందని, ఈ మెత్తం సదరు ఓటరు బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుందని ఆ పోస్టులో తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేని ఓటర్లు.. వారు మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు వారి నగదు జరిమానా కింద కట్ అవుతుందని కూడా ఆ పోస్ట్‌లో తెలియజేస్తున్నారు. ఈ ఉదంతంపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని, కమిషన్ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ ప్రచారం అబద్ధమని పేర్కొంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది. 𝗙𝗮𝗹𝘀𝗲 𝗰𝗹𝗮𝗶𝗺 : नहीं दिया वोट तो बैंक अकाउंट से कटेंगे 350 रुपएः आयोग 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 : यह दावा फर्जी है, चुनाव आयोग द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।#FakeNews #ECI #VerifyBeforeYouAmplify pic.twitter.com/yqnzWwrw6E — Election Commission of India (@ECISVEEP) April 2, 2024 -
కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!
సమ్మర్ వచ్చేసింది...ఎండలు మండిపోతున్నాయని కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కల్తీ కోకా కోలా డ్రింక్ బాటిల్స్ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!) ఈ వీడియో ప్రకారం కోకా కోలా లేబుల్స్ వేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఒక వ్యక్తి డ్రింక్‌ను నింపుతున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందిరా ఇది.. ఎపుడు చూడలే అంటూ ఒకింత ఆందోళనగా కమెంట్స్ చేస్తున్నారు. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ఈ కోకాకోలా ఫ్యాక్టరీలో తయారైనా ఒకటే, బాత్ రూంలో తయారైనా ఒకటి పెద్దగా తేడా ఏముంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోకాకోలాను ట్యాగ్‌ను గమనార్హం. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకా కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) A forward doing the rounds. Things get ...... With @CocaCola pic.twitter.com/vAhxcDhb1F — R. Balakrishnan (@BalakrishnanR) March 29, 2024 -
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
విదేశాల్లో చదువు : ఫన్ అన్నారు, అంట్లు కడిగితే తప్పేంటి?
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడం ఒకప్పుడు కాస్ట్లీ వ్యవహారంగా ఉండేది.అది గొప్పోళ్లకే సొంతం అన్నట్టు ఉండేది. కానీ చాలామంది బ్యాంకు లోన్లు తీసుకొని మరీ చదువు కోవడానికి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఇలా పలుదేశాలకి ఎగిరిపోతున్నారు. తీరా అక్కడికెళ్లాక చాలామంది విద్యార్థులు కల్చర్ పరంగా, ఆర్థికంగా ఇలా రక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్వతంత్రంగా, భద్రంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అన్ని నిబంధనలూ, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఒక పక్క చదువుకుంటూనే ఏదో ఒక జాబ్ చేస్తూ కష్టపడాలి. మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. కానీ అపుడు మాత్రమే, అక్కడి ఖర్చులు లోన్లు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు విద్యార్థులు. కొందరు చదువుతున్న కాలేజీల్లోనే అసిస్టెంట్లుగా పనిచేస్తారు. పనికొందరు మాత్రం వంట చేయడం, గిన్నెలు కడగటం, పిల్లల సంరక్షణా కేంద్రాలు, మొదలు పెట్రోలు బంక్, ఇతర దుకాణాల్లో పనిచేస్తారు. తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు ఇలా అంట్లు కడుగుతున్న వీడియో నొక దాన్ని ఒకరు షేర్ చేశారు. విద్యార్థి నాన్-స్టిక్ పాన్‌ను కడుగుతున్న ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశాడు. ‘‘విదేశాలకి స్టడీకోసంవెళ్లండి, సరదాగా ఉంటుంది అన్నారు." క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు యూజర్లు ఈ పోస్ట్‌ను సానుకూలంగా అర్థం చేసుకోగా, మరికొందరు మాత్రం అంట్లు కడిగితే తప్పేంటి, చిన్న చిన్న పనులైనా నేర్చుకుని ఉండాలి అంటూ మండి పడ్డారు. విదేశాల్లో అయినా ఇండియాలో అయినా ఎవరో ఒకరు అంట్లు కడగాల్సిందే.. వాటంతట అవి శుభ్రపడవు. కాకపోతే నువ్వు ఇంటికొచ్చాక ఇంకొకరు చేస్తారు. లేదా పెళ్లి అయ్యాక నీకోసం ఆ పనులు మరొకరు చేయాలని భావిస్తావ్.. అంతే తేడా. దీన్ని ఫన్‌గా అనుకోకుండా, జీవితమంతా ప్రతిరోజూ మీకోసం మీరు పనులు చేసుకోవాలని అర్థం చేసుకోండి అని కమెంట్ చేయడం గమనార్హం. go study abroad it’ll be fun they said pic.twitter.com/3yoj19uKyC — Dew (@itmedew) March 19, 2024 -
వాన్ని వదలొద్దు గీతాంజలి భర్త ఆవేదన
-
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!
‘మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది లేదా ప్రేమిస్తున్నాడు అనేది క్షణాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి ఒక మార్గం ఉంది. అదే ఆరెంజ్ పీల్ థియరీ’ అంటూ ఇంటర్నెట్లో మొదలైన సందడి వైరల్ కావడానికి ఎంతో టైమ్ పట్టలేదు. లవ్ లిట్మస్ టెస్ట్‌గా భావించే ‘ఆరెంజ్–పీల్–థియరీ’ సోషల్ మీడియా వైరల్ ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్‌లో భాగంగా ఎన్నో మీమ్స్ వస్తున్నాయి. తాజాగా కమేడియన్ అంచల్ అగర్వాల్ ‘ఆరెంజ్ పీల్ థియరీ’పై తన తల్లితో కలిసి చేసిన వీడియో వైరల్ అయింది. 7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇంతకీ ఏమిటి ఆరెంజ్ పీల్ థియరీ? సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఆరెంజ్‌ను లవర్‌కు చూపిస్తూ....‘నా కోసం ఈ ఆరెంజ్ తొక్క తీయగలవా?’ అని అడగాలి.లవర్ వెంటనే ‘ఓకే’ అంటే మనది నిజమైన ప్రేమ! ఇది సిల్లీ టెస్ట్‌గా అనిపిస్తున్నప్పటికీ ఇంటర్నెట్ లోకవాసులలో చాలామంది దీన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. ఈ వైరల్ ట్రెండ్ పుణ్యమా అని ఆరేంజ్ ఫలాలు తెగ అమ్ముడవుతున్నాయట! View this post on Instagram A post shared by Aanchal Agrawal (@awwwnchal) (చదవండి: షాకింగ్ ఘటన అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి) -
Ayodhya Ram Mandir: మరలా ఆ ముగ్గురి దర్శనం
రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది. -
సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్'
నిర్మల్: సంక్రాంతి అంటే రంగవల్లులకు పేరు. అయితే ఆ సంక్రాంతి ముగ్గులో విభిన్నతను ప్రదర్శించాలనుకున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన చిత్రకారుడు అడ్డిగ శ్రావణ్ కుమార్.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత వయసు ప్రమేయం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు బానిసగా మారుతున్నారు. అధికసమయాన్ని వీటికే వెచ్చిస్తున్నారు. ఇదే అంశాన్ని స్థానిక మంజులాపూర్ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్ తన ఇంటిముందు స్వయంగా వేసిన ముగ్గులో సందేశం రూపంలో అందించాడు. రోడ్డుపై వచ్చిపోయే వారు సందర్శించేలా ‘‘డోంట్ బి అడిక్టెడ్’’ అంటూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గులో పలు సామాజిక మాధ్యమాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాడు. ఫేస్బుక్, ఇంస్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, జిమెయిల్, గూగుల్ క్రోమ్ వంటి పలు ఇంటర్నెట్ సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ వాటికే అడిక్ట్ అవుతున్న తీరును ఇలా సృజనాత్మకంగా ప్రదర్శించడం పలువురిని ఆలోచింపజేస్తోంది. చాలామంది విభిన్నరీతిలో ఇచ్చిన సందేశాన్ని ప్రశంసిస్తున్నారు. ఇవి కూడా చదవండి: సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ? -
క్రిస్మస్ ఎనర్జీ
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించి బాలీవుడ్ సెలబ్స్ సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాత, కొత్త అనే తేడా లేకుండా తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. తారలలో కొందరు తమ క్రిస్మస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. క్రిస్మస్ తన ఫేవరెట్ ఫెస్టివల్ అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘క్రిస్మస్కు సంబంధించి బాల్యజ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బాగా నచ్చే పండగ ఇది. నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువగా బహ్రెయిన్‌లో జరిగాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పుడు క్రిస్మస్కు ముందురోజు రాత్రి బొమ్మల దుకాణంలో అందమైన బార్బీ బొమ్మను చూశాను. అది నాకు బాగా నచ్చింది. అదేరోజు అర్ధరాత్రి ప్రార్థనల తర్వాత శాంటా క్లాజ్ నుంచి అచ్చం అలాంటి బొమ్మే అందింది. ఓ మై గాడ్, శాంటా ఈజ్ సో కూల్ అనుకున్నాను’ అంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది ఫెర్నాండేజ్. ‘క్రిస్మస్ ఎనర్జీ’ పేరుతో క్రిస్మస్ జ్ఞాపకాల ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంలో ముందుంటుంది శ్రద్ధా కపూర్. -
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. -
అంకుల్.. నా పేరెందుకు స్మరిస్తున్నారంటూ రేణు దేశాయ్ ఫైర్
సినీ నటి రేణు దేశాయ్ సుదీర్ఘ విరామం తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ద్వారా ఇటీవలే వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రతో ఆమె మెప్పించారు. చాలాకాలం తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని ప్రేక్షకులను పలకరించారు. ఆమె రీ ఎంట్రీతో పాటు మరో పెళ్లి అంశంపై ఓ సీనియర్ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన చేసిన కామెంట్స్ క్లిప్పింగ్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సందించారు రేణు. సమాజంలో మహిళలను తక్కువగా చూడడం తగదని ఆమె సూచించారు. ఇదే వీడియోను షేర్ చేస్తూ, ఆ జర్నలిస్టును ఉద్దేశించి రేణు దేశాయ్ ఇలా అన్నారు. 'నా పేరు పదే పదే స్మరించి యూట్యూబ్‌లో కొన్ని వ్యూస్ సంపాదిస్తున్నారు. ఇలా నా పేరు ద్వారా మీరు డబ్బులు సంపాదించుకుంటున్నందుకు నాకు కూడా సంతోషమే.. కానీ ఇలా కుర్చీలో కూర్చొని సినీ నటులపై నాలుగు గాసిప్స్ చెప్పడం కంటే మీ టాలెంట్‌తో డబ్బు సంపాదిస్తే బాగుండేది. మీకు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. మీ జీవిత అనుభం నేర్పింది ఇదేనా.. ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. నా పేరును వదిలేసి దైవ నామస్మరణ చేయండి. నేను మిమ్మల్ని ఎక్కడా కలవలేదు. కాబట్టి నా గురించి నీకు ఏం తెలుసు..? మహిళలను దుర్గాదేవిగా, కాళీమాతగా చూడటం మన సాంస్కృతిక ప్రాముఖ్యత అని మరిచిపోవద్దు. మగవారి పేరు, ప్రోత్సాహం లేకుండా మహిళలు ఏం చేయలేరని మీలాంటి వారు మాట్లాడుతుంటారు.' అని రేణు తెలిపింది. ఈ వ్యాఖ్యలు కేవలం తన గురించి మాత్రమే కాదని, సమాజంలో మహిళలపై కొందరు మగవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిపేందుకే ఈ పోస్ట్ చేశానని రేణు దేశాయ్ తెలిపారు. చివరిగా రేణు ఈ వ్యాఖ్యలను కూడా జోడించింది. 'ఈ పోస్ట్‌కి నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మా కుమార్తెలు, మనవరాలు మంచి భవిష్యత్తు కోసం చర్చను సృష్టించడం కోసం మాత్రమే.' అని తెలిపారు. రేణు దేశాయ్ మరో పెళ్లి అంశాన్ని సదరు జర్నలిస్ట్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా మగవారు అయితే మరో పెళ్లి చేసుకోవచ్చని తెలిపాడు. అదే సమయంలో స్త్రీల గురించి తక్కువగా చేసి మాట్లాడటం ఆమె తప్పుబట్టింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఫుల్‌గా చిల్ అవుతోన్న నిహారిక.. పొట్టి నిక్కర్లో ఫరియా అబ్దుల్లా!
► ఫుల్‌గా చిల్ అవుతోన్న నిహారిక ► పొట్టి నిక్కర్‌తో డ్యాన్స్ చేస్తోన్న ఫరియా అబ్దుల్లా ► రెడ్ డ్రెస్‌లో శ్రద్ధాదాస్ హోయలు ► షార్ట్ జీన్స్ డ్రెస్‌తో కవ్విస్తోన్న ఆషిక రంగనాథ్ ► స్టన్నింగ్ లుక్‌లో దివి అందాలు View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
దీపావళికి కలర్‌పుల్ దీపాలు కావాలా? ఈ వీడియో చూస్తే మీరు ఫిదానే!
Diwali Special Magic Candle lights: దీపాల పండుగ దీపావళి వచ్చేస్తోంది. దీపావళి సందర్భంగా నూనె దీపాలతోపాటు, రంగు రంగుల కొవ్వొత్తులతో ఇంటిని అందంగా అలంకరించుకోవడం అలవాటు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో, కలర్‌ఫుల్ క్యాండిల్ లైట్స్‌ను తయారు చేసుకోవాలని భావిస్తున్నారా.మీలాంటి వారికోసమే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇది ట్విటర్లో 40 లక్షలకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది మరింకెందుకు ఆలస్యం.. మీరు మెచ్చే, మీకు నచ్చే అందమైన కాండిల్ లైట్స్ ఎలా తయారు చేసుకోవాలా చూసేయండి మరి. Very cool idea!pic.twitter.com/WjGQL49hTq — Figen (@TheFigen_) October 29, 2023 -
ప్రముఖ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో లీక్.. ఇంటర్నెట్లో వైరల్
ఇంటర్నెట్, సోషల్ మీడియా రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అనేక సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అలీజా సహర్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలీజా సహర్ పాకిస్థాన్‌లో ఉన్న ప్రముఖ యూట్యూబర్. అలీజా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్థాన్ పల్లెటూరి జీవితాన్ని చూపించేది. ఈ యూట్యూబర్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. పాకిస్థానీ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో వైరల్ అలీజా సహర్ ప్రతిరోజు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్తాన్ గ్రామీణ జీవితాన్ని చూపించేది. దీంతో ఆమె ఈ ఛానెల్ ద్వారా ప్రజాదరణ పొందింది. యూట్యూబ్, టిక్‌టాక్ ద్వారానే దాదాపు 15 లక్షల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. వారందరి కోసం పాకిస్తానీ గ్రామ ప్రజల జీవితం, వంట పద్ధతి, సంస్కృతి వంటి కంటెంట్‌ను చూపించేది. అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అలీజా సహర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: కల్పికతో ఎఫైర్ లేదు.. ఆమె చేసిన రచ్చకు కారణం ఇదే: అభినవ్ గోమటం) ఏం జరిగింది..? అలీజా సహర్ ఒక వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడింది. ఆ సమయంలో జరిగిన కొన్ని కార్యకలాపాలు వీడియో కాల్లో రికార్డ్ చేయబడ్డాయి. దానిని ఆ వ్యక్తి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆమె తెలుపుతుంది. నివేదికల ప్రకారం ఆ వీడియో కాల్లో అలీజా సహర్ తన దుస్తులు తొలగించి శరీరాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలతో పాటు కొంత అసభ్యకరమైన మాటలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో పాకిస్థానీ సోషల్ మీడియా స్టార్ చిక్కుల్లో పడింది. అయితే, అలీజా సహర్ ఇప్పటికీ దీని గురించి స్పందించి అందులో ఉండేది తాను కాదని ఎవరో వీడియోను ఎడిట్ చేశారంటూ ఆమె పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెళ్లింది. కానీ నెటిజన్లు మాత్రం వీడియోలో ఉండేది పక్కాగా ఆమెనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ అలీజా సహర్ పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)ని ఆశ్రయించి.. తన ప్రైవేట్ వీడియోను లీక్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఖతార్‌లో నివసిస్తున్న అతన్ని ఎఫ్ఐఏ గుర్తించినట్లు ఆమె తెలిపింది. ఈ విషయాన్ని అలీజా తన వీక్షకులకు చెప్పింది. సైబర్ క్రైమ్ టీమ్ కూడా తనకు సహాయం చేసేందుకు వచ్చిందని ఆమె తెలిపింది. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఆన్లైన్ కమ్యూనిటీకి తన యూట్యూబ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. View this post on Instagram A post shared by Aliza Sehar Official (@aliza.sehar.official) -
ఇన్‌స్టా కొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. కొత్త ఫీచర్స్ పొందుతున్నాయి. తాజాగా మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ఓ చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అదెలా పనిచేస్తుందో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోటోను లూపింగ్ వీడియోతో నోట్స్‌లో అప్డేట్ చేయగలుగుతారు. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! డెమో వీడియో ప్రకారం, వినియోగదారులు నోట్‌ని క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రొఫైల్ ఫోటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. దీని నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్‌లో పోస్ట్ చేయవచ్చు. ఇది తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. -
నాలాంటి బాధ ఎవరికీ రాకూడదని కోరుకున్నా: నయని పావని
బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్ మీడియా స్టార్ నయని పావని. అయితే హౌస్‌లో అడుగుపెట్టిన వారానికే ఎలిమినేట్ అయి అందరినీ షాకింగ్‌కు గురిచేసింది. ఈ ఎలిమినేషన్‌తో ఫుల్ ఎమోషనల్ అయ్యారు నయని పావని. ఏడుస్తూనే హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఎలిమినేషన్ తర్వాత ఇంటికెళ్లిన పావని.. తల్లిని చూసి కంటతడి పెట్టుకుంది. ఈ షో వల్ల నయని పావని ఇంటికొచ్చేసినప్పటికీ ఫుల్ పాపులారిటీ అయితే తెచ్చుకుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన నయని పావని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నాన్న గురించి తలుచుకుంటూ ఫుల్ ఎమోషనల్ అయింది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) నయని పావని మాట్లాడుతూ.. 'మా ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకునేదాన్ని. మా నాన్న చనిపోయాక ఏం చేయాలన్నా ఖర్చు అవుతుంది. అది వీళ్లేవరికి అర్థం కాదు. కొందరు చాలా దారుణంగా మాట్లాడతారు. మీ నాన్న చనిపోయాక ఇలాంటి డ్రెస్సులు వేస్తారా? అని కామెంట్స్ పెడతారు. కొందరి కామెంట్స్ చూసి నాకు చాలా డిప్రెషన్‌కు గురయ్యాను. అసలు దానికీ, దీనికి సంబంధమేంటి? మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నా వీడియోలు, ఫోటోలు చూడకండి. ఆ సమయంలో అలాంటి కామెంట్స్ నాపై తీవ్ర ప్రభావం చూపాయి. అవీ చూసి నాకు చాలా బాధేసింది. మా ఫ్యామిలీ అంతా బాధలో ఉన్నాం. ఆ సమయంలో అందరూ ఇంత ఈజీగా ఎలా కామెంట్ చేస్తారా అనిపించింది. మాకు డబ్బులు సంపాదించాలని నాన్న ఎప్పుడూ చెప్పలేదు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదని అనేవారు. నన్ను చాలా గారాభంగా పెంచారు. మా నాన్నకు సర్జరీ సమయంలో ఫ్రెండ్స్, బంధువులు ఎవరూ ఫోన్ చేయలేదు. ఆ రోజు రాత్రి ఏడుస్తూనే ఉన్నా. నాకు ఎవరూ కాల్ చేయలేదంటీ? అని ఎంతో బాధగా అనిపించింది' అంటూ కన్నీటి పర్యంతమైంది. (ఇది చదవండి: బద్రి సినిమా ఇప్పుడే రిలీజైనట్లు ఉంది: రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!) -
మూగజీవిపై ప్రేమ అంటే ఇదే..!
ఈ రోజుల్లో సాటి మనుషులపై, జంతువులపై దయ, ప్రేమ చూపేవారు చాలా అరుదైపోయారు. ఆపదలో ఉన్న జంతువులను, మనుషులను కనీసం పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో ఎవరైనా ఇతరులకు తోచిన సహాయం చేస్తూ కనిపించినప్పుడు జనం ఆ వ్యక్తిని అమితంగా గౌరవిస్తారు. ఇతరుల మీద దయ, ప్రేమలను ఎవరైనా చూపిస్తే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన కుక్కను కాపాడుతూ కనిపించాడు. ‘ఎక్స్’లో గుడ్ న్యూస్ కరస్పాండెంట్ పేరుతో పోస్ట్ అయిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్లను చేరుకునేందుకు ఆ వ్యక్తి ట్రాఫిక్‌ను ఎంతో ధైర్యంగా దాటాడు. ఆ కుక్కకు ప్రేమతో కూడిన స్పర్శను అందించాడు. ఈ అద్భుతమైన క్లిప్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో 43 వేలకు మించిన వీక్షణలను దక్కించుకుంది. ఈ వీడియో మూగజీవాలపై చూపాల్సిన సానుభూతి గురించి తెలియజేస్తుంది. ఇది కూడా చదవండి: 4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? An angel saving another angel This kind soul spotted an abandoned puppy on a busy freeway and rushed to save him from a certain injury or worse. The herododges traffic and approaches the dog gently to gain his trust, petting him sweetly. pic.twitter.com/MtmxPQ8f77 — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 1, 2023 -
కారు చీకటిలో పెద్దపులి.. వీడియో వైరల్!
ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఇది ఊహకు వస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ 17 సెకన్ల వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని తేరాయ్కు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @prashant_lmp పేరుతో ఉన్న ఖాతాతో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన జనం తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియోను చూసినప్పుడు దీనిని వాహనంలో నుండి చిత్రీకరించారని గమనించవచ్చు. కారు బానెట్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ ‘ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లా తేరాయ్లోని కొన్ని చెరకు పొలాల్లో పులులు సరదాగా తిరుగుతాయి. ఈ వీడియో కుక్రా ప్రాంతానికి చెందినది’ అనిరాశారు. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)అధికారి రమేష్ పాండే ..‘చెరకు పొలాలు అటు వేటగాళ్లకు, ఇటు వేటాడే క్రూర జంతువులకు ఇష్టమైన ప్రదేశం. అందుకే ఇటువంటి చోట్ల మనుషులు, క్రూరమృగాలు ఎదురుకావడం జరుగుతుంటుంది. శీతాకాలంలో ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయి. కారు హెడ్ లైట్ల కాంతి పెద్దపులిపై పడుతుండటం వీడియోలో కనిపిస్తుంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? यूपी के तराई में पड़ने वाले लखीमपुर खीरी जिले में टाइगर्स कुछ ऐसे गन्ने के खेतों में मस्ती भरी चाल से घूमते हैं। वीडियो कुकरा इलाके की बताई जा रही। #Canetigers@rameshpandeyifs @DudhwaTR @raju2179 pic.twitter.com/ewhdJvbcPJ — Prashant pandey (@prashant_lmp) September 30, 2023 -
కువైట్‌లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!
కువైట్ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు, ఏపీఎన్ఆర్టీసీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు, ఏపీఎస్ఎస్డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్ పాల్గొన్నారు. కువైట్ నలుమూలాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దాదాపు 400 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ: జగనన్న మీద అభిమానమే మనల్ని అందరినీ ఒక చోటకు చేర్చింది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి. 175/175 టార్గెట్‌గా అందరం కలిసి పని చేద్దాం, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మేడపాటి వెంకట్ గారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పేదల పక్షపాతి. అనుక్షణం పేదల కోసం పాటు పడుతున్నారు.. రాష్ట్ర ప్రజలకే కాదు ప్రవాసాంధ్రులకు సైతం ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చల్లా మధు సూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు మన సీఎం వైఎస్ జగన్ గారు తీసుకు వచ్చారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీఠ వేయడమే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న గొప్ప నాయకుడికి మనం అందరం అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. (చదవండి: దుబాయ్‌లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం) -
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
దిక్కుల దివ్యగీతాలకు వారసులు, లోకపు భాగ్య విధాతలు పిల్లలు. పాపం పుణ్యం తెలియని ఈ పాపలకు ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’ గురించి పిల్లలకు సింపుల్ లాంగ్వేజ్‌లో, సులభంగా అర్థమయ్యేలా ఒక టీచర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్’ ‘ఈ వీడియోను ప్రతి స్కూల్లో పిల్లలకు చూపించాలి’... అంటూ నెటిజెన్స్ స్పందించారు. రోషన్ రాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
ఆ హీరో కోసం పది వేల వాట్సాప్ గ్రూప్‌లు.. ప్లాన్ అదుర్స్!
కోలీవుడ్ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. దీనికి కారణం ఆయన తన ప్రజా సంఘం ద్వారా తలపెడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలే. విజయ్ తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకు పోతున్నారు అనే చెప్పాలి. నటుడుగా అశేష ప్రజాదరణ పొందుతున్న విజయ్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్న విజయ్ ఇటీవల సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇటీవలికాలంలో విజయ్ ప్రజా సంఘం కార్యదర్శి బుస్సీ ఆనంద్ నిత్యత్వంలో స్థానిక పనైయూర్ లోని విజయ్ అభిమాన సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని 24 నియోజక వర్గాలకు చెందిన పలువురు సంఘ కార్యకర్తలు హాజరయ్యారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఎంతో తెలుసా..?) ఈ కార్యక్రమంలో టెక్నాలజీ వాడుకునే విధంగా 1600 వాట్సాప్ గ్రూప్‌లో ఏర్పాటు చేశారు ఈ సంఖ్యను 10 వేలకు చేర్చాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా గతంలో ఎండీఎంకే నేత విజయకాంత్ కూడా ఇదేవిధంగా తన అభిమానులను ప్రజల్లోకి పంపారు. కాగా నటుడు విజయ్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకపోయినా కొన్నింట్లో అయినా సత్తాచాటాలని యత్నిస్తున్నట్టు విజయ్ ప్రజా సంఘం నాయకుడొకరు పేర్కొన్నారు. -
1985లో టెన్త్.. 2023లో పీయూసీ.. విద్యాదాహాన్ని తీర్చుకుంటున్న ఆటోడ్రైవర్
బెంగళూరుకు చెందిన నిధి అగర్వాల్ ఇటీవల ఎక్స్(ట్విట్టర్)లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ట్వీట్ చేశారు. ఆటో డ్రైవర్ భాస్కర్‌తో తనకు ఎదురైన అద్భుత అనుభవాన్ని ఆమె ఆ పోస్టులో తెలియజేశారు. భాస్కర్ ఇటీవలే తన ప్రీ- యూనివర్శిటీ(పీయూసీ) పరీక్ష రాశారని తెలిపారు. నిధి తన పోస్టులో ఆటో డ్రైవర్ భాస్కర్ 1985లో స్కూలు మానివేసినప్పటి నుంచి ఉన్నత విద్య చదవాలనే తపనతో ఉన్నారన్నారు. ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఒక ఫొటోతో పాటు నిధి అగర్వాల్ ఇలా రాశారు ‘ఈరోజు ఓలాక్యాబ్స్ ఆటో ద్వారా భాస్కర్ పరిచయం అయ్యారు. ఈ రోజే ఆయన పీయీసీ పరీక్షలోని ఆంగ్ల ప్రశ్నాపత్రం రాశారు. భాస్కర్ 1985లో 10వ తరగతి పాసయ్యాక ఈ ఏడాది పీయూసీ పరీక్ష రాశారు. భాస్కర్ పిల్లలు స్కూలులో చదువుతున్నారు. భాస్కర్‌కు చదువుపై ఉన్న శ్రద్ధ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది’ అని రాశారు. నిధి అగర్వాల్ అందించిన ఈ పోస్టు ఇంటర్నెట్లో సందడి చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ పోస్టుకు 1,500కు మించిన వీక్షణలు దక్కాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో ఇటువంటి అనేక కథలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! "Introducing Baskar ji, my @Olacabs auto companion today. He faced his English paper today, he is writing PUC exams this year after cleaning 10th in 1985. Father of two, with kids in 3rd and 6th grade. His enduring smile was truly motivating! @peakbengaluru pic.twitter.com/5R21YtdomZ — Nidhi Agarwal (@Ngarwalnidhi) August 26, 2023 -
ఇదేందిది.. కారు కాని కారు.. బానే పోతోందే..!
ఎక్కడ ఏకాస్త ప్రతిభ ఉన్నా అది సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కొందరు కార్లు, హెలికాప్టర్ల తయారు చేస్తుండగా, మరికొందరు స్కూటర్లు, ఇటుకలతో కూలర్లు తయారు చేస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు చక్రాలతో కూడిన విచిత్ర వాహనం కనిపిస్తుంది. వాహనానికి బైక్ ఇంజిన్ అమర్చారు. స్టీరింగ్ కోసం ప్రత్యేక డిజైన్ చేశారు. పాత వస్తువులతో వాహనం బాడీ తయారు చేశారు. అలాగే పాత టైర్లను అమర్చి వాహనానికి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిని చూసినవారికి మొదట నవ్వు వస్తుంది. తరువాత ఈ వినూత్న వాహన తయారీదారులను మెచ్చుకోకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విట్టర్లో @being_happyyy అనే పేరు కలిగిన అకౌంట్లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో దేశీయ ఆవిష్కరణ అని రాశారు. 29 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు వాహనం మీద కూర్చుని కనిపిస్తారు. ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ లభిస్తున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో.. Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD — Neeraj M (@being_happyyy) July 27, 2023 -
ఈఎస్జీ కింద 6 కొత్త విభాగాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈఎస్జీ విభాగం కింద (పర్యావరణం, సామాజికం, పరిపాలనా అనుకూలమైన) 6 కొత్త విభాగాలను ప్రవేశపెట్టేందుకు సెబీ అనుమతించింది. ఎక్స్‌క్లూజన్స్, ఇంటెగ్రేషన్, బెస్ట్ ఇన్ క్లాస్, పాజిటివ్ స్క్రీనింగ్, ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, సస్టెయినబుల్ అబ్జెక్టివ్స్ ఈ విభాగాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు థీమ్యాటిక్ విభాగం కింద ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక్క ఈఎస్జీ పథకం ఆవిష్కరణకే అనుమతి ఉండడం గమనార్హం. ఈఎస్జీ కింద నూతన విభాగానికి కేటాయింపులు అనేవి తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది. పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్టులకు ఈ రూపంలో కావాల్సిన నిధుల మద్దతు లభిస్తుందని సెబీ తన ఆదేశాల వెను క లక్ష్యాన్ని వివరించింది. ఈఎస్జీ పథకాల పే రుతో సమీకరించిన ని« దులను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ విభాగంలో పనిచేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈఎస్జీ పథకాల కింద సమీకరించిన మొత్తం నిధుల్లో 65 శాతాన్ని లిస్టెడ్ కంపెనీల్లోనే పెట్టాలని సెబీ నిబంధన విధించింది. మిగిలిన 35 శాతాన్ని వ్యాపార బాధ్యత, సస్టెయినబులిటీ రిపోరి్టంగ్ వివరాలను (బీఆర్ఎస్ఆర్) వెల్లడించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని పేర్కొంది. -
13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్లో షాక్ ఇచ్చింది!
వీడియో గేమ్స్ అడిక్షన్ ఇంటింటి వ్యసనాయణం! అది చైనా, హేనన్ ప్రావిన్స్‌లోని ఒక కుటుంబానికి ఎలాంటి షాక్‌ను ఇచ్చిందో చదవండి. ఆ కుటుంబంలోని పదమూడేళ్ల అమ్మాయికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. నిద్రాహారాలు మరచిపోయి మరీ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది.. ఇల్లు, బడి అనే తేడా లేకుండా! ఆ అమ్మాయికున్న ఈ అలవాటును ఇంట్లో పెద్దలు నిర్లక్ష్యం చేసినా బడిలో టీచర్ మాత్రం లక్ష్యపెట్టింది. ఆ పిల్ల తల్లిదండ్రుల దృష్టికీ తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి మీద ఓ కన్నేసి ఉంచింది ఆమ్మ. ఎన్నో రోజులు గడవకముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అమ్మ కంట్లో పడింది. ఏంటా అని చూస్తే.. తన కూతురు ఖర్చు పెట్టిన డబ్బు తాలూకు బ్యాంక్ స్టేట్మెంట్స్ వీడియో అది. ఒకటి కాదు రెండు కాదు 51,72,646 రూపాయలు. అది ఆ పిల్ల అమ్మానాన్న కొన్నేళ్లుగా కూడబెట్టిన మొత్తం! ఒక్క పూటలో అలవోకగా ఖర్చుపెట్టేసింది. అంతా ఆన్లైన్ పేమెంటే. కూతురికి ఎప్పుడైనా అర్జంట్‌గా ఏదైనా అవసరం వస్తుందేమో ఎంతకైనా మంచిది అని అమ్మాయికి తన డెబిట్ కార్డ్ పిన్ నంబర్ చెప్పింది. ఇంకేముంది ఆ కూతురు కొత్త వీడియో గేమ్స్ కొనడానికి, ఆడుతున్న గేమ్స్‌కి కావల్సిన పాయింట్స్‌ని సంపాదించడానికీ తల్లిదండ్రుల సేవింగ్స్‌ని ఖర్చుపెట్టింది ఆ పిన్ నంబర్ ఉపయోగించి. తన ఈ సీక్రెట్ ఫ్రెండ్స్‌కి తెలిసిపోయి.. బ్లాక్మెయిల్ చేసేసరికి వాళ్లకూ కావల్సిన వీడియో గేమ్స్‌ని కొనిపెట్టి మొత్తం డబ్బును హుష్ కాకి చేసేసింది. ఈ వ్యవహారం తల్లి కంట పడకుండా చక్కగా ఫోన్లోంచి ఆ ట్రాన్జాక్షన్ హిస్టరీని డిలీట్ చేసింది. పదమూడేళ్ల అమ్మాయి రికార్డ్ స్థాయిలో వీడియో గేమ్స్ కొనేసరికి అది సోషల్ మీడియాలో వైరలై.. ట్రాన్జాక్షన్ స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చి.. అమ్మకు షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ల తమ కష్టాన్ని కూతురు సింపుల్‌గా స్వైప్ చేయడంతో నెత్తీనోరు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ వ్యసనాయణం మనకూ షాక్ ఇవ్వకుండా జాగ్రత్తపడదాం! (చదవండి: బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!) -
‘రెండు రోజులు లేటయ్యింది.. సారీ ప్రియా..’ అంటూ నవవివాహిత ఆత్మహత్య
రాజస్థాన్‌లోని బాడ్మేర్లో తన ప్రియురాలికి పెళ్లి కావడంతో కలత చెందిన ప్రియుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ప్రియుని ఆత్మహత్య విషయం తెలుసుకున్న నవవివాహిత తనకు పెళ్లి అయిన మూడవ రోజున బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకునేముందు సోషల్ మీడియాలో తన ప్రియుని ఫొటోతో పాటు ‘మనం జీవించినా, మరణించినా కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం.. మరి నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?’ అని రాస్తూ.. ‘ఈ బాధిత ప్రపంచంలో నన్ను ఎందుకు వంటరిగా వదిలేశావు? మరే పర్వాలేదు.. ఇప్పుడు నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నువ్వు ఎప్పటికీ నా ప్రాణానివే. రెండు రోజులు లేటయ్యింది. సారీ ప్రియా’ అని రాసింది. ఈ విషాదకర ఉదంతం ఘోరీమన్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని షోభాలా జైత్మాలాలో చోటుచేసుకుంది. జూలై 4న వివాహం మీడియాకు అందిన సమాచారం ప్రకారం షోభాలా జైత్మాలాకు చెందిన అనిత(22), పుర్ఖారామ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరూ కాంపిటీటివ్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు జూలై 4న వివాహం జరిగింది. దీంతో తీవ్రంగా కలతచెందిన పుర్ఖారామ్ జూలై 4న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 5న ఆ ప్రియురాలికి తన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసింది. బావిలో తేలిన నవవివాహిత మృతదేహం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగా పెళ్లయిన అనిత తన ఇంటి నుంచి పాలు తీసుకువచ్చేందుకు పశువులశాలకు వెళ్లింది. ఎంతసేపయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెదుకులాట సాగించారు. వారికి ఒక బావి దగ్గర ఒక పాల పాత్ర కనిపించింది. దీంతో వారు అనుమానంతో బావిలోకి తొంగి చూశారు. బావిలో వారికి అనిత మృతదేహం తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, అది పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమికుల ఆత్మహత్య గ్రామంలోని వారందరినీ శోకసంద్రంలో ముంచింది. ఇది కూడా చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
వీడియో వైరల్.. దెబ్బకు దేవుడు కనిపించడమంటే ఇదే..
లక్నో: మనుషులు చేసే కొన్ని చేష్టలు అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకు వస్తాయి. ముఖ్యంగా జంతువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. జంతువుల విషయంతో ఓవర్‌గా బిహేవ్ చేస్తే అవి ఇచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు మరి.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ముగ్గురు వ్యక్తులు ఏనుగులతో సెల్ఫీలు దిగుదామని డేర్ చేసి అతి చేశారు. దీంతో, గజరాజులకు మండిపోయి.. వాటి వెంటపడ్డాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ.. లేస్తూ.. పడుతూ.. ఏనుగుల దాడి నుంచి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు నేపాల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో దుద్వా టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తుండగా అక్కడ ఏనుగుల గుంపు వారికి కనిపించింది. ఇంకేముంది.. వారి చేతిలో సెల్‌ఫోన్స్ తీసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో, వారి చేష్టలకు ఏనుగులకు చిర్రెత్తుకొచ్చింది. అనంతరం.. ఏనుగులు ఒక్కసారిగా వారి పైకి దూసుకొచ్చాయి. వెంటనే వణికిపోయి భయంతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పరుగులు తీశారు. ఈ క్రమంలో పరుగులో అదుపుతప్పి ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఎలాగోలా ఏనుగుల బారినుంచి వారు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. लखीमपुर खीरी के दुधवा नेशनल पार्क में कुछ लोग हाथी के साथ सेल्फी ले रहे थे, अचानक हाथियों ने सभी को दौड़ा लिया।#LakhimpurKheri #DudhwaNationalPark #UttarPradesh #elephant #elephantattack #ViralVideos #lakhimpur #kheri #kheriviralvideo pic.twitter.com/4IH2Rkpj5c — Daily Insider (@dailyinsiderup) July 5, 2023 ఇది కూడా చదవండి: వీడియో: ఫారినర్‌ను అసభ్యంగా తాకుతూ ఆ ఆటోడ్రైవర్ వేధింపులు.. వైరల్ -
'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, గవర్నర్ తమిళిసై ముందే కంటతడి పెట్టారు. తెలంగాణాలో పుట్టిన బిడ్డనని.. ఇక్కడే పెరిగానంటూ ఈ బ్యూటీ చేసిన వైరల్ కామెంట్లు అప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అవి మరిచిపోక ముందే సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..) తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. గురుపూర్ణిమ సందర్భంగా ఇలా షేర్ చేశారు. 'మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని... నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు 'గురువు' కాదు, మీకు దారి చూపించేవారు 'గురువు' అవుతారు. గురువు మీ శ్వాస కావచ్చు, మీ హృదయ స్పందన కావచ్చు లేదా మీ విముక్తి కావచ్చు.' అని ఆమె రాసుకొచ్చింది. దీంతో ఆమె ఎవరి గురించి రాశారు..? ఎవరికి సలహాలిస్తున్నారు..? అంటూ పూనమ్ పోస్ట్‌పై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. గతేడాదిలో 'నాతిచరామి' అనే చిన్న సినిమాలో నటించారు. ప్రస్థుతానికి పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) -
ఆరెంజ్ డ్రెస్‌లో కృతి శెట్టి పోజులు.. దివి హాట్ లుక్స్!
►ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నశోభిత ►ఆరెంజ్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న కృతి శెట్టి ►అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసిన భూమి ఫడ్నేకర్ ►హీరోయిన్ దివి హాట్ ఫోజులు View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
ఎంత పెద్ద గాంగ్ స్టార్ అయితేనేంటీ? నేను ఫైటర్ ను
-
యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్
-
వీడియో: వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. ప్రయాణికుల ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రైళ్లు ఇప్పటికే పలు ప్రమాదాల్లో దెబ్బతిన్న విషయం తెలిసిందే. అంతకుముందు జంతువులు ఢీకొనడంతో రైలు ముందు భాగం దెబ్బతిన్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక, తాజాగా వర్షాల నేపథ్యంలో రైలులో వర్షపు నీరు కారడంతో ఆ నీళ్లు బోగీలోకి ప్రవేశించాయి. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన కేంద్రం కేరళకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్లో స్వయంగా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. అయితే, ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో డొల్లతనం బయటపడింది. వర్షాల కారణంగా రైలులోకి వర్షపు నీరు రైలు బోగీల్లో కారింది. కాగా, భారీ వర్షాలకు ఈ రైలు చూరు లీక్ కావడంతో బోగీల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోను కేరళ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనిపై సెటైరికల్ కామెంట్స్ చేసింది. వందే భారత్‌లో ప్రయణికులకు గొడుగులు సప్లై చేసే పరిస్థితి ఏర్పడిందంటూ కామెంట్స్ పెట్టింది. Farewell blankets, hello umbrellas: Vande Bharat redefines comfort. pic.twitter.com/8mTKeaqkYL — Congress Kerala (@INCKerala) June 14, 2023 ఇదిలా ఉండగా.. కిందటి నెలలో కురిసిన భారీ వర్షాలకు ఒకసారి ఈ రైలు టాప్ లీక్ కావడం వల్ల వర్షపు నీరు లోనికి ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో సిబ్బంది దీనికి మరమ్మతు చేశారు. నీరు లోనికి ప్రవేశించకుండా రబ్బర్ బెండ్స్ అమర్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే తరహా పరిస్థితి కనిపించింది. మరోవైపు.. ఈ ఘటనపై దక్షిణ రైల్వే స్పందించింది. కేరళ లేదా సంబంధిత రైలు సేవలను అందించే ఏ ఇతర దక్షిణాది రాష్ట్రం నుండి ఇలాంటి ఘటనలు జరిగినట్టు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది. కేరళలో నడుస్తున్న వందే భారత్‌లో అలాంటి ఘటన జరగలేదు అంటూ ట్విట్టర్లో తెలిపింది. ఇది కూడా చదవండి: బీజేపీకి ఊహించని షాక్.. సీనియర్ నేత ఔట్ -
సొంత ఉద్యోగులే భారీ షాకిచ్చారు
-
పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి..
ప్రియురాలికి ఖరీదైన గిఫ్టులు ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేయాలని చాలామంది యువకులు తపన పడిపోతుంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తించిన ఒక యువకునికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలామంది డబ్బులు ఆదా చేసేందుకు వివిధ పద్దతులను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా అరటిపండ్లను తొక్కతోనే విక్రయిస్తుంటారు. అయితే తూకానికి అరటి పండ్లను కొనుగోలు చేసినప్పుడు తొక్కతో పాటు బరువు చూస్తే.. అది కాస్త అధిక బరువు ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు డబ్బులను ఆదా చేసేందుకు అరటి పండ్ల తొక్కలను తీసి, దానిలోని పండు భాగానికి తూకం వేసి, తన ప్రియురాలి కోసం కొనుగోలు చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ పీనాసితనాన్ని అందరికీ చూపించేందుకు ఆ యువతి ఈ ఘటనను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక యువకుడు అరటిపండు తొక్కలను వేరుచేసి, తరువాత వాటి బరువును తూచడం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన అరటి పండు బరువు తగ్గుతుందని, ఫలితంగా వాటి ఖరీదు కూడా తగ్గుతుందని అతని ఆలోచన. ఈ వీడియో చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్.. ‘మీరు ఇలాంటి బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితాంతం రోదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని రాయగా, మరొకరు ‘మీరు ఈ బాధల నుంచి బయపడండి. వెంటనే ఆ వ్యక్తి దూరంకండి’ అని రాశారు. ఇది కూడా చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
ఆహ...భలే జంప్ చేశారు.. Wow.. what a jump
-
అనుకోని అదృష్టం.. చేపల వేటకు వెళ్తే నోట్ల కట్టలు ప్రత్యక్షం..
పాట్నా: అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. చేపలు పట్టేందుకు కాలువలో దిగిన వారికి అనూహ్యంగా కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. దీంతో, ఎవరికి దొరికినన్ని నోట్లు వాళ్లు తీసుకెళ్లారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రోహతక్ జిల్లాలోని ససారంలో ఉన్న సోన్ హైలెవల్ కెనాల్లో చేపల వేట కోసం మొరాదాబాద్ వంతెన వద్దకు శనివారం ఉదయం స్థానికులు కొందరు వెళ్లారు. ఈ క్రమంలో వారికి కరెన్సీ నోట్ల కట్టలున్న మూటలు కనిపించడంతో నమ్మలేకపోకపోయారు. తొలుత అవి నకిలీ నోట్లని అనుకున్నారు. కానీ, అసలైనవేనని తెలియడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో, వెంటనే వాటిని చేజిక్కించుకోడానికి ఎగబడ్డారు. ఈ విషయం బయటకు తెలియడంతో అటుగా వెళ్లే వారందరూ నోట్ల కోసం కాలువలోకి దిగి దొరికినంత తీసుకెళ్లారు. కాగా, వారికి దొరికిన నోట్లలో ఎక్కువగా రూ.10 నోట్లు ఉండగా.. రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు కూడా ఉన్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ నోట్లు కాల్వలోకి ఎలా వచ్చాయి? అని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే.. -
బక్కచిక్కిన లుక్ లో మెహరీన్ తిట్టిపోస్తున్న నెటిజన్లు
-
అయ్ బామ్మోయి!
సంప్రదాయ దుస్తుల్లో బామ్మలు వీధుల్లో స్కేట్బోర్డింగ్ చేస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదు. బామ్మలు నిజమే. స్కేట్బోర్డింగ్ మాత్రం ఏఐ సృష్టి! ఆశిష్ జోస్ అనే ఆర్టిస్ట్ ప్రాంప్ట్–బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ‘మిడ్‌జర్నీ’ని ఉపయోగించి ఈ చిత్రాలను సృష్టించాడు. ‘స్కేటింగ్ నానీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మూడు రోజుల వ్యవధిలోనే 1.17 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘సాహసానికి వయసు అడ్డు కాదు’లాంటి ఎన్నో కామెంట్స్ కనిపించాయి. -
విజయ్ దళపతి 99 నిమిషాల్లో సరికొత్త రికార్డు
-
వరల్డ్ నెం.1 యూట్యూబర్ చనిపోయాడని ట్వీట్.. లక్ష మంది లైక్.. చివర్లో ట్విస్ట్
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే వార్తలన్నీ నిజాలు కావు. అత్యుత్సాహంతో కొందరు నిజా నిజాలు నిర్ధరించుకోకుండా ఫేక్ వార్తలను గుడ్డిగా షేర్ చేస్తుంటారు. ఫలితంగా అమాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. నెం.1 యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు ఉన్న మిస్టర్ బీస్ట్(అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్) చనిపోయాడనే ఓ వార్త సామాజిక మాధ్యమాలను షేక్ చేసింది. 'డొనాల్డ్సన్ చనిపోయాడు. దీన్ని నమ్మలేకపోతున్నా. అతను ఇంత తర్వగా వెళ్లిపోతాడని ఊహించలేదు. ఈ లెజెండ్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు' అని ఓ యూజర్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. డొనాల్డ్ సన్ ఫొటోను కూడా షేర్ చేయడంతో ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. I cant believe mrbeast died... gone too soon man.. you'll never be forgotten you legend ❤️ pic.twitter.com/3Fr4h3PQAy — duck (@ExtremeBlitz__) March 15, 2023 దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది కచ్చితంగా ఫేక్. ఇలాంటి న్యూస్ షేర్ చేసేవారికి అసలు బుద్ధిలేదు. అది అసహ్యం తెప్పించే జోక్‌లా ఉంది. అని ఓ యూజర్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. మరికొందరు మాత్రం మిస్టర్ బీస్ట్ నిజంగానే చనిపోయాడనుకుని నమ్మారు. ఇది నిజమా? ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకొందరేమో ఇలాంటి సున్నితమైన విషయాలపై ఫేక్ న్యూస్ ఎలా వ్యాప్తి చేస్తారు? అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఏదేమైనా మిస్టర్ బీస్ట్ చనిపోయాడనే పోస్టును 1.4 కోట్ల మంది వీక్షించారు. లక్ష మందికిపైగా లైక్ చేశారు. దీంతో డొనాల్డ్సన్ దీనిపై స్వయంగా స్పందించాడు. ఈ పోస్టును లక్ష మంది ఎందుకు లైక్ చేశారో నాకు అర్థం కావడం లేదంటూ నవ్వులు పూయించాడు. అయితే డొనాల్డ్సన్ చనిపోయాడని పోస్టు పెట్టిన వ్యక్తి దీనికి మళ్లీ రియాక్ట్ అయ్యాడు. నా పోస్టుకు రిప్లై ఇవ్వడానికే అతను మళ్లీ తిరిగివచ్చాడు అని చమత్కరించాడు. 10 వేల డాలర్లు (సుమారు రూ. 8,30,000) ఇస్తే ఈ పోస్టును డిలీట్ చేస్తా అన్నాడు. కానీ డొనాల్డ్సన్ దీనిపై మళ్లీ స్పందించలేదు. దీంతో ఆ పోస్టు అలానే ఉంది. కాగా.. మిస్టర్ బీస్ట్ పేరుతో ఉన్న డొనాల్డ్సన్ యూట్యూబ్ ఛానల్‌కు అత్యధికంగా 13.7కోట్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. చదవండి: గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. మైండ్ బ్లాంక్ ఇదేనేమో.. -
అమృత్‌పాల్ సింగ్: సినిమాను మించిన ట్విస్ట్.. వేషం మార్చుకుంటూ..
అమృత్‌పాల్ సింగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఖలిస్తాన్ వేర్పాటువాది అయిన అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మామూలుగా ప్రయత్నించడం లేదు. సినిమా రేంజ్లో నిందితుడు.. పోలీసులు కళ్లుగప్పి వేషాలు మారుస్తూ తప్పించుకుంటున్నాడు. హాలీవుడ్ సినిమాలో ఛేజింగ్ సీన్స్‌ను తలపిస్తూ అమృత్‌పాల్ పంజాబ్ నుంచి బయటపడినట్టు సమాచారం. ఇక, దశావతారం సినిమాలో గేటప్స్ మార్చినట్టు అమృత్‌పాల్ వేషధారణ మార్చుకుంటూ కార్లు నుంచి బైక్.. బైక్ నుంచి వివిధ వాహనాలు మార్చుకుంటూ పోలీసుల వ్యూహాలకే చెక్ పెడుతున్నాడు. అమృత్‌పాల్ సింగ్ ఇప్పటి వరకు దాదాపు ఐదుకు పైగా వేషాలు మారుస్తూ బయట తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడి ఫొటోలు కూడా బయటకు రిలీజ్ చేశారు. ఈ ఫొటోలు చూసి పోలీసులు కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదేవిధంగా ఇతరులు గుర్తుపట్టకుండా అతను తన మత దుస్తులకు బదులు చొక్కా, ప్యాంటు ధరించినట్లు పోలీసు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. 🇮🇳 #Watch | 'Waris Punjab De' chief #AmritpalSingh was seen escaping in an SUV in Jalandhar on March 18. He is still on the run. (CCTV visuals) #india #mostliked pic.twitter.com/9LPIeuFdZ6 — Imminent Global News (@imminent_news) March 21, 2023 ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ కోసం పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌ను దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ కారులో టోల్గేట్ దాటిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమృత్‌పాల్ చివరిసారిగా మెర్సిడెస్ ఎస్యూవీ వాహనంలో తప్పించుకున్నాడు. అయితే, ప్రస్తుతం అతను మారుతీ సుజికీ బ్రిజా కారులో జలంధర్‌లోని టోల్‌గేట్‌ను దాటుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇక, చివరగా బైక్‌పై తన మద్దతుదారులతో వెళ్తున్న పుటేజీ కూడా బయటకు వచ్చింది. #BREAKING #Trending #Viral #CCTVFootage of #fugitive #AmritpalSingh fleeing on a bike after changing clothes from a Gurudwara in nangal Ambian village . @PunjabPoliceInd #PunjabPolice #Khalistan #Khalistanis #AmritpalMisleadingPunjab #Amritpal_Singh #PunjabNews #Sikhs pic.twitter.com/BmCGEscP2s — Sumedha Sharma (@sumedhasharma86) March 21, 2023 ఇది కూడా చదవండి: 80వేల మంది పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. పాక్ ఏజెంట్‌గానే సూసైడ్ ఎటాక్స్‌కు ప్లాన్ -
Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలను రెండేళ్ల తర్వాత పునరుద్ధరించింది మెటా. ఆయన వల్ల ఎలాంటి ముప్పు లేదని నిర్ధరించుకున్న తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2021 జనవరి 6న సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించారు. క్యాపిటల్ హిల్స్ భవనంలో హింస చెలరేగేలా తన ఫాలోవర్లను ప్రేరేపించినందుకు మెటా ఆయన ఖాతాలను నిరవధికంగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఖాతాలను తిరిగి పునరుద్ధరిస్తామని ఈ ఏడాది జనవరిలోనే మెటా ప్రకటించింది. ట్రంప్‌కు ఇన్‌స్టాగ్రాంలో 23 మంది మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్బుక్లో 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా సామాజిక మాధ్యమాల వేదికగానే ఆయన భారీగా ఫండ్స్ సమకూర్చుకున్నారు. వచ్చే ఏడాది అంటే 2024లో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలను పునరుద్ధరించడం ఊరటినిచ్చే అంశమే. అయితే ఖాతాలు పునురుద్ధరించిన తర్వాత ట్రంప్ ఇంకా ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. తన సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించిన తర్వాత ట్రంప్ తన సొంత సంస్థల ద్వారా 'ట్రుత్ సోషల్' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. ఇతర సామాజిక మాధ్యమాలు తనకు అవసరం లేదని చెప్పారు. దీంతో గతేడాది నవంబర్లోనే ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినప్పటికీ అందులో యాక్టివ్‌గా ఉండటం లేదు. మరి ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలనైనా తిరిగి వినియోగిస్తారో లేదో చూడాలి. చదవండి: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..! -
వంచనకు పరిచయం.. సామాజిక మాధ్యమాల్లో వేదికగా..
అనంతపురంలోని పాతూరుకు చెందిన స్వాతి (పేరు మార్చాం) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బెంగళూరుకు చెందిన అబ్బాయి వలలో పడింది. ఉన్నఫళంగా ఒకరోజు ఇంటినుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. చివరకు పోలీసుల జోక్యంతో అమ్మాయిని వెతికి ఇంటికి తెచ్చారు. ధర్మవరానికి చెందిన అమ్మాయి కావ్య (పేరు మార్చాం) అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఒకరోజు ఉన్నఫళంగా అబ్బాయితో వెళ్లిపోయింది. ఇరవై రోజుల తర్వాత ఫోన్ కాల్స్ ఆధారంగా కనుక్కుని అమ్మాయిని తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అబ్బాయితో వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. వీరిద్దరే కాదు ఎంతోమంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాల ద్వారా ముక్కూమొహం తెలీని వ్యక్తులు విసిరిన వలలో చిక్కుకుని మోసపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు కచ్చితంగా తమ పేరుపై ఖాతాలు తెరిచేస్తున్నారు. ప్రతిదీ అందులో షేర్ చేసుకుంటున్నారు. అలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడెక్కడి వారో పరిచయమవుతున్నారు. అలా చాటింగ్‌తో స్నేహం పెంచుకుంటున్నారు. ప్రత్యక్షంగా వారిని చూడకపోయినా.. వారి గుణగణాలు, నేపథ్యం తెలియకపోయినా గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటువంటి తరుణంలో అమ్మాయిలను కొందరు అబ్బాయిలు ట్రాప్‌లో పడేస్తున్నారు. క్రమక్రమంగా అమ్మాయిలు తమ కెరీర్‌ను పక్కనపెట్టి పోకిరీల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలాంటి మాధ్యమాల ద్వారా నష్టపోతున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొంపముంచుతున్న ఇన్స్టాగ్రామ్ ఇటీవలి కాలంలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులంటూ పరిచయమైన ఈ ఫోన్లు ఇప్పుడు పర్సనల్ ఖాతాల వరకూ వెళ్లాయి. ప్రతి అమ్మాయి.. అబ్బాయి ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా చాటింగ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నామన్న కనీస అవగాహన కూడా లేకుండా అబ్బాయిలకు వ్యక్తిగత వివరాలు షేర్ చేస్తున్నట్టు వెల్లడైంది. దీన్ని కొందరు అబ్బాయిలు అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. అమ్మాయిలు నష్టపోయే వరకూ వాస్తవ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మాయిలు నష్టపోయాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిని చదువు మాన్పిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాది వ్యవధిలో 71 మంది అమ్మాయిలు ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా అబ్బాయిల వలలో పడినట్టు తేలింది. బాధితుల్లో అమ్మాయిలే ఎక్కువ సామాజిక మాధ్యమాల బాధితుల్లో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఎక్కువయ్యాయి. నెలకు ఐదారు కేసులు వస్తున్నాయి. తల్లిదండ్రుల కోరిక మేరకు వివరాలు గోప్యంగా ఉంచి అబ్బాయిలను మందలించి పంపిస్తున్నాం. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు షేర్ చేయద్దు. –ఆళ్ల శ్రీనివాసులు, డీఎస్పీ, ‘దిశ’ పోలీస్ స్టేషన్ వ్యసనంగా మారింది రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షితులు కావడమనేది ‘ఎమోషనల్ డిపెండెన్సీ’ అంటారు. ఆ గ్రూపులో తిరిగే వారిని బట్టి కూడా ఉంటుంది. ముందుగా దీనిపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. నాలుగు రోజుల కిందట 8వ తరగతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కోసం ఏడుస్తోందని తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చారు. ఇలా అలవాటు చేయడం వల్ల వాళ్లు దానికి బానిసల్లా మారి నష్టపోతున్నారు. –డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం (చదవండి: ‘నారాయణ’ ఒత్తిళ్లు తాళలేకనే ఆత్మహత్యాయత్నం.. యాజమాన్యం లెటర్ డ్రామా.. విద్యార్థికి సీరియస్!) -
పార్కులో కూర్చుంటే జరిమానా
సాక్షి, కృష్ణరాజపురం: మా సేవలు ఊరికే రావు. ప్రజలకు భద్రత కల్పించాలంటే.. చాలా ఖర్చవుతుంది అన్నట్టుగా ఉంది కొందరు ఖాకీల వ్యవహారశైలి. వారి వల్ల నిజాయతీగా పనిచేసేవారిని కూడా అనుమానంతో చూసే పరిస్థితి నెలకొంది. ఐటీ సిటీలో సంపిగెహళ్లి, ఆడుగోడి పోలీసులు ప్రజల నుంచి డబ్బు తీసుకోవడం రచ్చ కావడం మరిచిపోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ఉద్యానవనంలో కూర్చుని ఉన్న స్నేహితులను ఓ కానిస్టేబుల్ బెదిరించి వారి వద్ద నుంచి రూ. 1000 వసూలు చేశాడు. ఫొటోలు తీసి, డబ్బు ఇవ్వాలని.. వివరాలు.. జనవరి 29వ తేదీన నగరంలోని వైట్‌ఫీల్డ్ వద్ద కుందళహళ్లిలో ఉన్న ఉద్యానవనంలో ఆర్ష లతీఫ్ అనే యువతి, స్నేహితునితో కూర్చుని ఉంది. కులాసాగా మాట్లాడుకుంటూ ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి వారిని తన మొబైల్‌తో ఫొటోలు తీయసాగాడు. ఇక్కడ పార్కులో ఏం చేస్తున్నారు?, ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు అని వారిని గదమాయించాడు. తాము ఏమీ చేయడం లేదని, ఊరికే కూర్చుని ఉన్నామని చెప్పారు. పార్క్‌లో కూర్చోడానికి కూడా పర్మిషన్ కావాలా? అని యువతీ యువకుడు అడిగారు. దాంతో కానిస్టేబుల్.. ఏమిటీ రూల్స్ మాట్లాడుతున్నారు? రండి స్టేషన్‌కు వెళదాము, అక్కడ అన్నీ బయటకి వస్తాయని బెదిరించారు. ఇక్కడే అయితే రూ. వెయ్యి జరిమానా కట్టి వెళ్లిపోండి. స్టేషన్‌కు వస్తే మీకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించి, వారి వద్ద నుంచి రూ . వెయ్యి ఫోన్ పే ద్వారా వేయించుకున్నాడు. తరువాత తమ బాధాకర అనుభవం ఇదీ యువతి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ బాగోతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: వధువు కావాలా.. నాయనా?) -
మండపంలో హైడ్రామా: పెళ్లైన గంటకే ట్విస్ట్.. షాక్‌లో బంధువులు!
అతిథిలు, బ్యాండ్ చప్పుళ్ల మధ్య అంగరంభ వైభవంగా వారిద్దరికీ పెళ్లి జరిగింది. కానీ.. పెళ్లైన గంటకే వరుడు చేసిన పనికి అక్కడున్న వారంతా షాకయ్యారు. పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలోని సంబల్ జిల్లాలోని సైద్‌నగలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 5 ఏండ్ల క్రితం వివాహమైంది. కాగా, వీరిద్దరి మధ్య గొడవల కారణంగా భార్యాభర్తలిద్దరూ విడిగా ఉంటున్నారు. గొడవల కారణంగా ఆమె.. భర్తకు దూరంగా తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో భర్త.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో, కొన్ని నెలలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అనంతరం, ఒకరిపై ఒకరికి ఇష్టంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో అతడు.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పెళ్లి మండపానికి చేరుకుని గొడవకు దిగింది. తాను ఉండగా రెండో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించింది. దీంతో, ఒక్కసారిగి ఖంగుతిన్న వధువు కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో పోలీసు కేసుతో ఇబ్బందులు కలుగుతాయని భావించిన పెద్దలు పంచాయితీ పెట్టారు. పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ వ్యక్తి పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చి.. అదే మండపంతో ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. -
బీజేపీ మహిళా నేతల మధ్య కోల్డ్‌వార్.. వేదికపైనే డిష్యుం డిష్యుం..
బీజేపీ మహిళా నేతలు అందరూ చూస్తుండగానే స్టేజీపై ఒకరొనొకరు చేయిచేసుకున్నారు. స్టేజ్‌పై కూర్చునే సీట్ల వ్యవహారంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీకామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని తలైయా ఫీల్డ్ గ్రౌండ్లో జరిగిన 25వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయడం కోసం బీజేపీ నేతలు వచ్చారు. ఈ సందర్బంగా నేతలంతా స్టేజ్‌పై కూర్చున్నారు. అనంతరం.. బీజేపీ మహిళా నేతలు చంద్రప్రభ తివారీ, నీలం చౌబే మధ్య సీట్ల విషయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వీరి మధ్య ఉన్న విభేదాలు అందరి ముందే బహిర్గతమయ్యాయి. చంద్రప్రభ తివారీ వేదికపై సీటు కోసం వెతుకుతున్నప్పుడు నీలం చౌబే ఆమె వద్దకు వచ్చి ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టింది. అనంతరం, వీరిద్దూ మాటల వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత ఒకరినొకరు సభావేదికపైనే తోసుకున్నారు. ఇంతలో అక్కడున్న మిగతా నేతలు కల్పించుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో వేదికపై రాష్ట్ర మంత్రులు కమల్ పటేల్, బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఎమ్మెల్యే సంజయ్ పాఠక్, ఇతర నేతలు కూడా ఉన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఇదేందయ్యా రాహుల్.. కాంగ్రెస్ కార్యకర్తకు చేదు అనుభవం!
దేశంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర ముగిసింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జోడో యాత్ర కొనసాగుతోంది. అయితే, రాహుల్ యాత్రపై అటు బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. యాత్రలో జరుగుతున్న చిన్న తప్పిదాలను ఎత్తిచూపుతూ బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే భారత్ జోడో యాత్రలో చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ చేసిన పనిని బీజేపీ హైలైల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి పలు ప్రశ్నలు సంధించింది. కాగా, రాజస్థాన్‌లో రాహుల్ యాత్ర సందర్బంగా మంగళవారం జరిగిన ఓ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ క్రమంలో సభావేదిక మీదకు కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా నేతలు ఒకానొక సమయంలో ఒకరినొకరు తోసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, సభ ముగిసిన అనంతరం.. కొందరు కార్యకర్తలు రాహుల్ గాంధీతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ తరుణంలో కొందరు కార్యకర్తలు రాహుల్ మీదకు దూసుకొచ్చారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, ఓ కార్యకర్త తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా సహనం కోల్పోయిన రాహుల్ గాంధీ.. ఫోన్‌ను కోపంతో పక్కకు జరిపారు. ఈ క్రమంలో సీరియస్ కూడా అయ్యారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోకు రాహుల్ గాంధీ ఎందుకంత చిరాకుగా ఉన్నారు? అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ యాత్రపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెంచింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్ అనుసరించడం సాధ్యం కాకపోతే.. దేశ ప్రయోజనాల దృష్ట్యా యాత్రను వాయిదా వేయాలని రాహుల్, అశోక్ గెహ్లాట్‌ను కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయా లేఖ రాశారు. యాత్రలో టీకాలు తీసుకున్న వారు మాత్రమే పాల్గొనాలి అని స్పష్టం చేశారు. Rahul Gandhi loses cool on stage during Bharat Jodo Yatra event, BJP calls him 'frustrated'#RahulGandhi #Congress #BharatJodoYatra #BJP #ViralVideo pic.twitter.com/hZuqs1YPJt — Free Press Journal (@fpjindia) December 21, 2022 -
సోషల్ హల్చల్: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్ డ్రెస్‌లో కియారా లుక్స్
ప్రతి రోజు సోషల్ మీడియాలో సినీ తారలు తమ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సినీ తారలపై ఓ లుక్కేద్దాం. బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అందాలు రెడ్ డ్రెస్‌లో కవ్విస్తున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ బ్లూ డ్రెస్‌లో హెబ్బాపటేల్ హోయలు బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హాట్ లుక్స్ ఖతార్ టూర్ ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ఫ్యాషన్ లుక్‌లో రవీన్ టాండన్ స్టన్నింగ్ లుక్‌లో అదరగొట్టిన పూజా హెగ్డే View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sonalee Kulkarni (@sonalee18588) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
వీడియో: అంత బలుపెందుకు.. నువ్వు సెలబ్రెటీవా!
మూగ జీవాలను హింసించిన కేసుల్లో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం లేదా హిట్స్ కోసం కొందరు మూగజీవాలను శారీరకంగా భాధివంచారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కారణమైన ఓ ఈ-సెలబ్రెటీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మోజ్-ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్ కాజల్ అనుచితంగా ప్రవర్తించింది. అయితే, సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేయడం కోసం ఆమె.. ఓవర్‌గా బిహేవ్ చేసింది. కాగా, వీడియోలో కుక్కపై లేని ప్రేమను నటించి.. దాన్ని మచ్చిక చేసుకున్నట్టు ప్రవర్తించి.. చివరకు కుక్కను కాలితో తన్నింది. అనంతరం.. కాజల్ నువ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. How can you be so insensitive toward these voiceless souls If you cant love them dont hurt them #AnimalAbuse#DogsOnTwitter pic.twitter.com/8HaC2zD7Ea — Vidit Sharma 🇮🇳 (@TheViditsharma) November 30, 2022 కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వీడియోను యూపీ, నోయిడా పోలీసులకు రీట్వీట్ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇన్ఫ్లుయెన్సర్ కాజల్‌కు మోజ్ యాప్‌లో దాదాపు 2.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక, ఇన్‌స్టాగ్రామ్‌లో సంఖ్య 121K మంది ఫాలోవర్స్ కాజల్‌ను ఫాలో అవుతున్నారు. @Uppolice @noidapolice please take stringent action against this sadistic, violent "social media influencer" and "content creator" kajal something — for Aslan! پربھا آپا (@prabha_j) November 30, 2022 -
ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ.. ఎందుకో తెలుసా?
లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించారు బీజేపీ ఎంపీ. ప్రభుత్వ కార్యాలయంలో భూమికి సంబంధించిన పట్టాల విషయంలో ఓ రైతు వద్ద లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగిపై బీజేపీ ఎంపీ చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో బీజేపీ ఎంపీ చంద్రప్రకాశ్జోషి (సీపీ జోషి).. ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగి భూ పట్టాలకు సంబంధించి బదాయింపు విషయంలో ఓ రైతు నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేసినట్టు రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో సదురు ఉద్యోగిని పిలిపించిన ఎంపీ సీపీ జోషి.. ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎంపీ సీపీ జోషి ఆ ఉద్యోగిని నిలదీస్తున్న సమయంలో.. 15వేలు లంచం అడిగినట్లు కొందరు రైతులు ఎంపీ ఎదుట నినాదాలు చేశారు. దీంతో, రైతులు, ఉద్యోగుల ముందే లంచం అడిగిన ఉద్యోగిపై ఎంపీ చేయిచేసుకున్నారు. అయితే, డిపార్ట్మెంట్ ఉద్యోగుల ముందే చెయ్యి చేసుకోవడం వల్ల ఆ ఎంపీపై విమర్శలు వస్తున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కేకలు వేస్తూ హుషారుగా డ్యాన్స్.. ఇంతలోనే కుప్పకూలి..
దేవుడు గీసిన నుదుటి రాతను ఎవరూ మార్చలేరు అంటారు. విధి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుందంటారు పెద్దలు. విధి ఆడిన వింత నాటకంలో ఓ మనిషి సెకన్లలో ప్రాణం వదిలాడు. పండుగ పూట కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతున్న వేళ.. అతడి ప్రాణం గాలిలో కలిసిపోతుందని వారు ఊహించిఉండరు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, పండుగ సందర్భంగా ఇంట్లోని సభ్యులందరూ ఎంతో ఆనందంగా దాండియా ఆడుతున్నారు. పెద్దలు కేకలు వేస్తూ.. చిన్నారులు ఈలలు వేస్తూ.. కర్రలతో దాండియా ఆడుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి దాండియా ఆడుతూ.. సెకన్ల వ్యవధిలో కింద కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడి వద్దకు పరిగెత్తుకువచ్చారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్టు నిర్ధారించారు. దీంతో, ఎంతో ఆనందంగా ఉన్న వారి ఇంట్లో ఒక్కసారిగి విషాదఛాయలు అములుకున్నాయి. కాగా, దాండియా ఆడుతూ అతను గుండెపోటు కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఇక, ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. -
ఒకే ఫ్రేమ్‌లో రెబల్ స్టార్స్.. ఏం ఎడిటింగ్ రా బాబు.. వీడియో అదిరిపోయింది
సోషల్ మీడియాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృష్ణంరాజుపై చేసిన ఓ వీడియో వైరలవుతోంది. ఇద్దరిని మిక్స్ చేస్తూ ఎడిటింగ్ చేసిన వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఒకవైపు కృష్ణంరాజు నటించిన పాత్రలు, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను మిక్స్ చేసి వీడియో రూపొందించారు. అందులోని ప్రతి యాక్షన్ సన్నివేశం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 'ఏం ఎడిటింగ్ రా మామా సూపర్బ్' అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ప్రభాస్ సేమ్ మేనరిజం' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ చిత్రం షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇటీవలే అనారోగ్యంతో ప్రభాస్ పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. #Prabhas𓃵 anna posted this video in both Fb & insta🥰 Congrats bro @AyyAyy0 ❤️pic.twitter.com/k8v0fWySdb — saaho (@saahoupendra548) September 24, 2022 -
అదృష్టమంటే మీదే సామీ.. రాత్రికి రాత్రే రైతులు కోటీశ్వరులయ్యారు!
అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో ఎవరిని వరిస్తుందో చెప్పులేము. దశ తిరిగితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు.. అలాగే బిక్షగాడు కూడా అయ్యే అవకాశమూ లేకపోలేదు. తాజాగా ఓ రైతు ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని బ్రిజ్‌పుర్‌కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు ఆరుగురు స్నేహితులతో కలిసి కొంత కాలం క్రితం.. లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. అనంతరం, వజ్రాల వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక నెలపాటు నిరంతరాయంగా శ్రమించినా వజ్రం దొరకలేదు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. వజ్రాన్ని ఎలాగైనా సాధించాలన్న సంకల్పంతో ముందుకుసాగాడు. ఈ క్రమంలో గురువారం వారికి గనిలో విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. ఎంతో ఆనందపడిన రాజేంద్ర గుప్త దాన్ని వెంటనే వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు చూపించారు. వజ్రాన్ని పరిశీలించిన అధికారులు.. వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో, వారి ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును.. సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. ఇలా రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులయ్యారు. ఈ విషయం కాస్తా దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. Madhya Pradesh News: पन्ना में एक साथ चार लोगों को अलग-अलग खदानों में मिले बेशकीमती हीरे#siamond #mpnews #pannanewshttps://t.co/2QnRAKyMeZ pic.twitter.com/HuPYudd62j — NaiDunia (@Nai_Dunia) September 22, 2022 -
తాను ఊపిరొదిలి, ఇతరులకు ప్రాణభిక్ష
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సోమనహళ్లి తండాకు చెందిన రక్షిత (17) బ్రెయిన్‌డెడ్ కాగా, ఆమె అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. గుండె, శ్వాసకోశం, కిడ్నీలు, మూత్రకోశ, కళ్లు తదితర 9 అవయవాలను సేకరించారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. గుండెను 9 ఏళ్లు బాలునికి అమర్చారు. తద్వారా ఆమె ఊపిరి వదులుతూ పలువురికి ప్రాణం నిలిపింది. విద్యార్థుల కన్నీటి నివాళి శ్వాసకోశాన్ని చెన్నైకి తరలించగా, మూత్రపిండాలను మంగళూరుకు పంపారు. కళ్లను చిక్కమగళూరు ఐ బ్యాంక్‌లో భద్రపరిచారు. ఆమె నుంచి సేకరించిన 9 అవయవాలను 9 మందికి అమర్చవచ్చని వైద్యులు తెలిపారు. ఆదివారం బస్సు దిగుతూ కింద పడిన రక్షిత బ్రెయిన్ డెడ్ కావడం తెలిసిందే. గురువారం ఉదయం చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు ఆమె దేహం నుంచి అవయవాలను సేకరించి భద్రపరిచారు. తరువాత రక్షిత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం బసవనహళ్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి తీసుకెళ్లి విద్యార్థుల అంతిమ దర్శనం కోసం ఉంచారు. విద్యార్థులు, బోధన సిబ్బంది రక్షితకు కన్నీటి నివాళులు అర్పించారు. రక్షిత తల్లిదండ్రుల మానవత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిస్వార్థంగా అవయవదానం చేసి పలు కుటుంబాలకు సాయం చేశారని సోషల్ మీడియాలోనూ అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: రూ. 35 కోట్లు విలువ చేసే విగ్రహం..అమెరికాలో ప్రత్యక్షం) -
వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి..
ఆయనో డాక్టర్.. కానీ మానవత్వం మరిచి ఓ మూగజీవాన్ని దారుణంగా హింసించాడు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను చేసిన పనికి నెటిజన్లు దుమ్మెతిపోస్తున్నారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ కారు డ్రైవర్.. ఓ కుక్కను తన కారుకు కట్టి నడిరోడ్డు మీద లాక్కెళ్లాడు. కారును స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో కుక్క వేగంగా పరిగెత్తలేక కిందపడిపోయింది. అయినప్పటికీ అతను మాత్రం కారును ఆపలేదు. కాగా, కారు వెనుక వస్తున్న ఓ బైకర్.. కారును అడ్డుకునే పయత్నం చేశాడు. కారుకు బైకును అడ్డంగా పెట్టడంతో డ్రైవర్ కారును ఆపాడు. ఈ క్రమంలో అక్కడున్న మరికొంత మంది కారు వద్దకు చేరుకుని కుక్కను విడిపించారు. ఈ ప్రమాదంలో కుక్కకు తీవ్ర గాయాలు కాగా ఆసుప్రతికి తరలించారు. అనంతరం.. డ్రైవర్‌ను ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది డాక్టర్ రజనీష్ గ్వాలాగా గుర్తించారు. దీంతో, ఈ ఘటనపై కొందరు వ్యక్తులు పోలీసులు, ఎన్జీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎన్జీవోల ఫిర్యాదు మేరకు పోలీసులు జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్‌కు కనికరం లేదని, మానవత్వం అంటే తెలియదని కామెంట్స్ చేస్తున్నారు. The person who did this he is a Dr. Rajneesh Gwala and dog legs have multiple fracture and this incident is of Shastri Nagar Jodhpur please spread this vidro so that @CP_Jodhpur should take action against him and cancel his licence @WHO @TheJohnAbraham @Manekagandhibjp pic.twitter.com/leNVxklx1N — Dog Home Foundation (@DHFJodhpur) September 18, 2022 -
క్వీన్ ఎలిజబెత్–2 మృతి.. కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి.. హక్కుదారు ఎవరు?
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 105 క్యారెట్ల అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ను ఇకనైనా స్వదేశానికి అప్పగించాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14 శతాబ్దం ఆరంభంలో దక్షిణ భారతదేశంలో తవ్వకాల్లో లభించినట్లు చరిత్రలో నమోదయ్యింది. తర్వాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్ తమదేనంటూ భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్ దేశాలు వాదిస్తున్నాయి. వజ్రానికి అసలు హక్కుదారులు ఎవరన్నదానిపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు బ్రిటన్ రాణి మృతిచెందారంటూ కాబట్టి కోహినూర్‌ను భారత్‌కు అప్పగించాలని ట్విట్టర్లో జనం డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని రాణి హోదాలో ఆయన భార్య కెమిల్లా పార్కర్ ధరిస్తారు. కోహినూర్ వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. -
వీడియో వైరల్ చేద్దామనుకున్నాడు.. పాపం తానే వైరల్ అయ్యాడు
సాక్షి, వరంగల్: అప్పట్లో టిక్‌టాక్ పిచ్చితో కొందరు యూత్ ఫేమస్ అవడం కోసం తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో చూసే ఉంటాము. ప్రస్తుతం రీల్స్ చేసేందుకు సోషల్ మీడియాలో పేరు కోసం కొందరు వింత చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కేంద్రంలో వడ్డేపల్లికి చెందిన అజయ్ ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్ పక్కన వీడియో చేస్తుండగా ఖాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే?
ఎయిర్‌హెస్టెస్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది.. విమాన ప్రయాణీకులకు వెల్కమ్ చెప్పడం, లోపల అతిథి మర్యాదలు చేయడం. కాగా, ఓ మహిళా ఎయిర్‌హెస్టెస్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. దుబాయ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలోకి ఎక్కేందుకు ఓ చిన్నపిల్లవాడు పాస్‌పోర్టు, వీసాతో వెళ్లాడు. ఇంతలో విమానం గేటు వద్ద ఓ ఎయిర్‌హెస్టెస్.. అతని చేతిలోని బోర్డింగ్ పాస్ తీసుకొని కౌగిలించుకుంది. వెంటనే అతడిని హత్తుకుని చిరునవ్వుతో స్వాగతం పలికింది. ఎందుకంటే ఆ విమానం ఎక్కిన ప్యాసింజర్.. సదరు ఎయిర్‌హోస్టెస్ కుమారుడు కావడమే. ఆ తర్వాత వెనక్కు తిరిగి కెమెరా వైపు చేతులు ఊపుతూ లోపలకు వెళ్లాడు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) ఈ వీడియోను షేర్ చేసిన సదరు ఎయిర్‌హోస్టెస్..‘నా జీవితంలో విమానంలోకి ఆహ్వానించిన అతి పెద్ద వీఐపీ’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. బావోద్వేగానికి గురువుతున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) -
ఎవరి పేరు చెబితే... పొట్టలు చెక్కలవుతాయో.... వాళ్లే వీళ్లు!
నవ్వడానికి... బడా బ్యాంకు బ్యాలెన్స్ అక్కర్లేదు. ఆధార్ కార్డ్ అంతకంటే అక్కర్లేదు. ఫ్రీగా నవ్వండి టెన్షన్ల నుంచి ఫ్రీ అవ్వండి’ అంటున్నారు ఈ రాజులు. నవ్వులరాజ్యం రారాజులు.. వార్తల నుంచి వంటల వీడియోల వరకు మనం రోజూ సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో గడుపుతుంటాం. ‘స్టాటిస్టా’ లెక్కల ప్రకారం భారతీయులు రోజుకు సుమారు 2 గంటల 36 నిమిషాల సమయాన్ని సోషల్‌మీడియా కోసం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ‘కంటెంట్ క్రియేటర్’గా మారడం అనేది ట్రెండీయెస్ట్ కెరీర్‌గా మారింది. అనుకున్నంత మాత్రాన ‘కంటెంట్ క్రియేటర్’ అయిపోతారా? అనే ప్రశ్నకు ‘అదేం కాదు’ అని రెండు ముక్కల్లో జవాబు చెప్పవచ్చు. కంటెంట్ క్రియేటర్స్‌గా రాణించడానికి తారకమంత్రాలు...కష్టపడేతత్వం, సృజనాత్మకత, స్థిరత్వం. ఫోర్బ్స్ ఇండియా, ఐన్సిఏ (గ్రూప్ఎం–సెల్ఫ్ ఇన్ఫ్లూయెన్సర్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ సొల్యూషన్స్) తాజాగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, ఫిట్నెస్, ఫుడ్, టెక్, ట్రావెల్, సోషల్‌వర్క్...ఇలా తొమ్మిది విభాగాల్లో నుంచి ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాను రూపొందించింది. ఈ తొమ్మిది విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది. కామెడీ విభాగంలో స్టార్స్‌గా మెరుస్తున్న కొందరు యువకులు... ఇరవైనాలుగు సంవత్సరాల నిర్మల్ పిళ్లై కామెడీ కెరీర్‌ను సీరియస్ బిజినెస్‌గా చూస్తాడు. చెన్నైకి చెందిన ఈ మలయాళీ కుర్రాడు కాలేజీ రోజుల్లో కలం పట్టుకున్నాడు. కామెడీ ప్లేలు రాశాడు. అయితే అవి కాలేజీ ఆడిటోరియంకే పరిమితం. కరోనా కాలంలో, లాక్డౌన్ రోజుల్లో అతడి కామెడీ స్కిట్లకు సోషల్ మీడియా వేదిక అయింది. ఫస్ట్ వీడియోనే వైరల్ అయింది. ‘ఎవరీ పిళ్లై?’ అనే ఆసక్తిని పెంచింది. ప్రసిద్ధ ‘హ్యారీపోటర్’ను హాస్యరీతిలో అనుకరిస్తూ తాను సృష్టించిన కామెడీకి ఎంతో పేరు వచ్చింది. ప్రయాణంలో ఉన్నప్పుడు చుట్టు జరిగే సంభాషణలను వినడం, హావభావాలను గమనించడం పిళ్లై అలవాటు. వాటిలో నుంచే కామెడినీ సృష్టించడానికి అవసరమైన అంశాలను ఎంచుకుంటాడు. భోపాల్‌లో ఏప్రిల్ 1 సాయంత్రం.. ‘ఏప్రిల్‌ఫూల్ డే’ సందర్భంగా కామెడీ షో ఏర్పాటు చేశారు. ఇలాంటి షో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దిల్లీ నుంచి ఎవరో కుర్రాడు వస్తున్నాడట...అనుకున్నారు జనాలు. దిల్లీ కుర్రాడు వచ్చేశాడు. ఆ ఉక్కపోతల ఎండాకాలపు సాయంత్రం ఊహించని భారీవర్షం మొదలైంది. అది మామూలు వర్షం కాదు. నవ్వుల వర్షం! ‘తోడా సాప్ బోలో’ షోతో దేశ, విదేశాల్లో స్టాండ్–అప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు అభిషేక్. అభిషేక్‌ను చూసీ చూడగానే... ‘ఈ కుర్రాడా! కమెడియన్ పోలికలు బొత్తిగా లేవు. ఏం నవ్విస్తాడో ఏమో’ అనుకుంటారట ప్రేక్షకులు. ఎప్పుడైతే అతడు మైక్ అందుకుంటాడో వారు మైమరిచి నవ్వుతారు. పాత నవ్వులను గుర్తు తెచ్చుకొని మళ్లీ నవ్వుతారు. ‘అబ్బ! ఏం నవ్వించాడ్రా కుర్రాడు’ అని అభిషేక్‌కు మౌఖిక సర్టిఫికెట్ ఇస్తారు. గుర్‌గ్రామ్‌కు చెందిన విష్ణు కౌశల్ కామెడీ కంటెంట్ క్రియేటర్. నిత్యజీవిత వ్యవహారాలు, సంఘటనల్లో నుంచి కంటెంట్‌ను తీసుకొని కామిక్ వీడియోలను రూపొందిస్తుంటాడు. ఆ వీడియోల్లో మనల్ని మనం చూసుకోవచ్చు. ‘అరే! నాకు కూడా అచ్చం ఇలా జరిగిందే’ అనుకోవచ్చు. యూట్యూబ్ కామిక్ వీడియోల నుంచి మొదలైన విష్ణు ప్రస్థానం ఇప్పుడు వోటీటీ కామెడీ సిరీస్, అడ్వర్టైజ్మెంట్ల వరకు వచ్చింది. ‘హాబీగా మొదలు పెట్టాను. ఇప్పుడు నవ్వించడమే నా వృత్తి అయింది’ నవ్వుతూ అంటున్నాడు విష్ణు కౌశల్. ‘ఈయన పరమ సీరియస్ మనిషి. నవ్వించండి చూద్దాం’ అని థానే (మహారాష్ట్ర)కు చెందిన ధృవ్ షా, శ్యామ్ శర్మలతో ఎప్పుడూ పందెం కాయవద్దు. ఈ హాస్యద్వయం గాలి తగిలితే ఆ సీరియన్ మనిషి నవ్వడమే కాదు, నవ్వు......తూనే ఉంటాడు! ఫోర్బ్స్ ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటుచేసుకున్న కామెడిస్టార్స్లో వీరు కొందరు మాత్రమే. మరొక సందర్భంలో మరి కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. చదవండి: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు -
Nagin Dance: నడిరోడ్డుపై శ్రీదేవీ పాటకు నాగిని డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
Nagin Dance On Truck Horn: పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అనే సామెతకు కొందరు యువకులు తగిన న్యాయం చేశారు. రోడ్డుపై నాగిని డ్యాన్స్‌లు చేస్తూ కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు బైక్ రైడర్స్ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నాగిని డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నార్త్ కర్నాటకలో కొందరు బైక్ రైడర్లు రోడ్డుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ హారన్ మోగించాడు. ఆ హారన్ నాగిన్ డ్యాన్స్‌కు సంబంధించింది. దీంతో, బైకర్లు రోడ్డు పక్కనే బైకులను పార్కింగ్ చేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో డ్రైవర్‌ను సాంగ్ పెట్టమని సైగలు చేశారు. అదే జోష్‌లో ట్రక్కు డ్రైవర్.. శ్రీదేవి నటించిన 'నాగీనా'లోని "మెయిన్ తేరీ దుష్మాన్" సాంగ్‌ను ప్లే చేశాడు. దీంతో, రైడర్లు మరింత రెచ్చిపోయారు. రోడ్డు మీద పడుకుని దొర్లుతూ.. డ్యాన్స్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. मजे है जैसे में आप ले पाओ वैसे लो 🤣#BachelorNation #party #nagindance pic.twitter.com/d0z9zvYsc1 — नटखट निड 🚩 (@natkhatnids) July 12, 2022 ఇది కూడా చదవండి: లైవ్‌లో కుర్రాడి దవడ పగలగొట్టిన రిపోర్టర్.. ఎట్టకేలకు ఆమె స్పందన -
బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన భార్యపై ఇలా విమర్శలు
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్‌కు తదుపరి ప్రధాని రేసులో ప్రముఖంగా మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ పేరు వినిపిస్తోంది. రిషి సునాక్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. దీంతో, ఆయనకు పలువురు ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా రిషి సునాక్ భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి వార్తల్లో నిలిచారు. కాగా, రిషి సునాక్ ప్రధాని రేసులో ఉన్నట్టు ప్రకటించిన తర్వాత ఆయన మీడియాకు కనిపించలేదు. దీంతో జర్నలిస్టులు ఆయన కోసం ఇంటి వద్ద వేచి ఉన్నారు. ఈ క్రమంలో సునాక్ భార్య.. అక్షతా మూర్తి స్వయంగా తానే వచ్చి టీ, స్నాక్ అందించారు. దీంతో, ఆమె సోషల్ మీడియాలో వార్తలో నిలిచారు. ఈ ఘటనపై కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు. ఎన్నో కోట్లకు అధిపతికి అయిన అక్షతా మూర్తి ఎంతో సంప్లిసిటీతో జర్నలిస్టులకు టీ అందించారని.. ఆమె నిరాడంబరతను ఇది నిదర్శనమంటూ మెచ్చుకుంటున్నారు. ఇక, ఆమె టీ ఇచ్చిన ఒకో టీ కప్పు ధర దాదాపు రూ.3,600(38 పౌండ్లు) ఉంటుందని తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె తమ గొప్పతనాన్ని చూపించడం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ టీ కప్పు ఖరీదుతో ఓ కుటుంబం రెండు రోజుల పాటు జీవించవచ్చు అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అక్షతా మూర్తి చేసిన పని సునాక్‌ను విమర్శలకు గురిచేసింది. ఇక, అక్షత మూర్తికి ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. కాగా, వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో నాన్-డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని అక్షతా మూర్తి పన్నులు కట్టకుండా ఎగవేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై.. కొద్ది రోజుల క్రితం అక్షతా మూర్తి ప్రతినిధి స్పందిసూ.. తాము చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ☕️ After his shock resignation last night, Rishi Sunak's wife Akshata Murthy brings out a round of tea for journalists waiting for him to show his face. pic.twitter.com/Yt8ldN2aX9 — ITV News Calendar (@itvcalendar) July 6, 2022 ఇది కూడా చదవండి: రోడ్డుపైకొచ్చిన బోరిస్ మైనపు విగ్రహం.. ఫోటోలు వైరల్ -
దిక్కుమాలిన టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్! ఏడుగురు చిన్నారులు బలి
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే.. దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్‌లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్‌టాక్ తీసుకొచ్చిన 'బ్లాకౌట్ ఛాలెంజ్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. ఏమిటీ బ్లాకౌట్ ఛాలెంజ్? యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్‌టాక్.. బ్లాకౌట్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్.. ఆక్సిజన్ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. బ్లాకౌట్ ఛాలెంజ్ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్‌టాక్‌పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్‌లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్లో పెన్సిల్వేనియాలో 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. టిక్‌టాక్ ప్రమాదకరమైన ఛాలెంజ్‌లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్ అండర్సన్ తల్లి తవైన అండర్సన్. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్‌ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చదవండి: మాల్ పార్కింగ్‌లో శవమై కనిపించిన టిక్‌టాక్ స్టార్ -
పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే హల్చల్.. వీడియో వైరల్
పాట్నా: ఆయనో ఎమ్మెల్యే.. అధికారం ఉంది కదా అని.. పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశాడు. పోలీస్ స్టేషన్‌లోని అధికారి సీటులో కూర్చుని ఓ కేసు గురించి వాకబు పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. వివరాల ప్రకారం.. బీహార్‌లో బీజేపీ ఎమ్మెల్యే మురారి మోహన్ ఝా.. గత వారం ఆయన తన నియోజకవర్గానికి వెళ్లిన క్రమంలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను కొట్టిన ఘటన గురించి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు గురించి వాకబు చేసేందుకు దర్భంగా జిల్లాలోని కియోటి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే డైరెక్ట్‌గా ఎస్హెచ్ఓ కుర్చీలో కూర్చుని కేసుకు సంబంధించిన ఫైల్ తనిఖీ చేశారు. ఆ సమయంలో స్టేషన్లో జర్నలిస్టులు, ప్రజలు ఉన్నారని స్టేషన్ డైరీని బహిరంగంగా తాను చూపలేనని ఎస్హెచ్ఓ.. ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయన అదేదీ పట్టించుకోకుండా స్టేషన్లో బెదిరింపులకు పాల్పడుతూ హల్ చల్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం బీహార్‌లో సర్కస్‌ను నడుపుతోందని సీఎం నితీష్ కుమార్‌పై సెటైర్లు విసిరారు. स्टेशन डायरी गायब मिली तो बीजेपी विधायक ने SHO की क्लास लगा दी... वीडियो दरभंगा का है जहां विधायक मुरारी मोहन झा निरीक्षण करने पहुंचे थे#Darbhanga #SHO #MurariMohanJha #ViralVideo pic.twitter.com/4yjUszLcfA — Gourav Sharma (@hindgourav) April 2, 2022 -
మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కచ్చా బాదమ్ భుబన్.. వీడియో వైరల్
కచ్చా బాదమ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ కచ్చా బాదమ్ సాంగ్.. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఫేమస్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌తో నెటిజన్లు ఈ పాటను ఆస్వాదించారు. వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ సరదాకు పాడిన ఓ సాంగ్ తనను ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసింది. దీంతో భుబన్ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. కచ్చా బాదమ్ సాంగ్ తర్వాత భుబన్‌కు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఈ క్రేజ్‌లో అవతారమే పూర్తిగా మారిపోయింది. తాజాగా కోల్‌కతాలోని ఓ పోష్ క్లబ్లో అతగాడు రాక్‌స్టార్ అవతారంలో ప్రదర్శన కూడా ఇవ్వడం చూసి అందరూ షాకయ్యారు. ఈ క్రమంలో దక్కిన కొద్దిపాటి రెమ్యునరేషన్‌తో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. ఒక్కసారిగా అదృష్టం అడ్డం తిరిగింది. కారు నేర్చుకుంటున్న క్రమంలో అతడు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడికి ఛాతీలో బలమైన గాయమైంది. దీంతో ఆసుపత్రిలో చేరి చిక్సిత పొందాడు. అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి బయటకు రావడమే తరువాయి.. మరోపాటతో మళ్లీ సోషల్ మీడియాను తనవైపు తిప్పుకున్నారు. ‘నా కొత్త కారు’ అంటూ భుబన్ పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ‘కచ్చా బాదామ్’ భూబన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్‌స్టా రీల్స్‌తో కచ్చా బాదామ్ ఫేమస్ అయ్యింది. మొదట్లో సాంగ్ వైరల్ అయినప్పుడు.. తనకు క్రెడిట్ దక్కలేదని గోల చేసిన భూబన్, తీరా అది దక్కాక పూర్తిగా మారిపోయాడు. Kacha Badam Kaku new song after his accident ‼️💥#BhubanBadyakar#KachaBadam#BadamKaku pic.twitter.com/BOaAJhLRAq — I Love Siliguri (@ILoveSiliguri) March 5, 2022 -
సోషల్ మీడియా పోస్టులకు బెదిరిపోను
గోకవరం: తనను తిడుతూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు బెదిరిపోనని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా పైకి లేస్తుందన్నారు. అలాగే ఎవరో తిడుతున్నారని బలమైన ఆలోచనలను తాను వదలి పెట్టనన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మీడియాకు విడుదల చేశారు. ఇటీవల తాను రాసిన లేఖలకు కొంతమంది పెద్దలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తన న్యాయమైన ఆలోచనలను అమలు చేయొద్దని చెప్పడానికి ఇతరులెవరికీ హక్కు లేదన్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొందరు నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటిస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే వారిని దగాకోరులు, దొంగలు అని చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తనను సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారన్నారు. చివరికి ప్రముఖుల గురించి ఒక మాట రాసినా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిని మంచి అని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తోందని గుర్తు చేశారు. 1989 నుంచే తనకు ఎన్నో ఆశలు, ఆలోచనలు ఉన్నాయన్నారు. ఐదేళ్ల క్రితం దళిత నేత డాక్టర్ రత్నాకర్ తన వద్దకు వచ్చి మూడో ప్రత్యామ్నాయం గూర్చి మాట్లాడారని తెలిపారు. అలాగే రెండేళ్ల క్రితం బీసీ నేత కుడుపూడి సూర్యనారాయణరావు ‘నిత్యం ఒకే బొమ్మ కాదు, బొమ్మ తిరగేయాలి’ అని తనతో చెప్పారన్నారు. రత్నాకర్ లేవనెత్తిన విషయాన్ని సూర్యనారాయణతో చర్చించానని తెలిపారు. చిన్న ప్రయత్నంగా ప్రత్యామ్నాయం అనేదాన్ని మొదలు పెడదామని చెప్పానన్నారు. -
మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు!
Woman thought husband wanted a divorce: మన జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించకుండానే హఠాత్తుగా జరిగిపోతుంటాయి. అంతేగాదు అవి ఒక్కోసారి మనకు మంచి ఆనందాన్నిఇస్తే మరికొన్ని సంఘటనలు చేదు అనుభవాన్ని మిగులుస్తాయి. ఐతే మన అనుకున్న వాళ్లు చిన్న మాట అనగానే అపార్థం చేసుకుని అభద్రత భావానికి గురవుతాం. కానీ వాళ్లు మన మంచికోరే వాళ్లని చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం. అచ్చం అలానే స్పెయిన్‌కి చెందిన ఒక మహిళతో తన భర్త హఠాత్తుగా ఒక విషయం గురించి సీరియస్‌గా మాట్లాడాల్సి ఉందనంగానే ఆమె దారుణంగా ఊహించుకుని భయపడింది. భర్త ఊహించని సర్ఫ్రైజ్ ఇవ్వడంతో ఒక్కసారిగా కళ్లు తిరిగినంతపనైంది. (చదవండి: అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!!) అసలు విషయంలోకెళ్తే...స్పెయిన్‌కి చెందిన టెర్రీ ఎడ్గెల్ అతని భార్య జూడ్ తాము సెలవుల్లో హాయిగా గడిపేందుకు ఒక మంచి ఇల్లు కోసం వెతుకుతున్నారు. ఐతే టెర్రీ ఎడ్గెల్ తన భార్య జూడ్కి కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ సమీపంలోని 200 ఏళ్ల పెన్లిన్ కోటలో నివశించాలనేది చిన్ననాటి కల. అందుకోసం ఆమెకు తెలియకుండా వేలంలో రూ. 5 కోట్లకు ఆ కోటను కొన్నాడు. అంతేకాదు ఆమెను ఆ కోటకు తీసుకువెళ్లి సర్ఫ్రైజ్ చేయాలనుకున్నాడు. ఈ మేరకు టెర్రీ ఎడ్గెల్ ఒకరోజు తన భార్యను పిలిచి నీతో చాలా సీరియస్ ఒక విషయం గురించి మాట్లాడాలని చెబుతాడు. దీంతో భర్త తనను వదిలించేసుకోవాలనుకుంటున్నాడు, బహుశా విడాకులు ఇచ్చేస్తాడేమో! అందుకోసమే ఇలా అంటున్నాడని భయపడుతుంది. ఐతే ఆమెకు ఇష్టమైన కోట దగ్గరికి తీసుకువెళ్లి జరిగిన విషయమంతా చెబుతాడు. అంతే! ఒక్కసారిగా ఆమె షాక్‌కి గురై ఎగిరిగంతేసింది. ఈ మేరకు జూడ్ తాను చాలా భయపడ్డానని, కళ్లు తిరిగినంత పనయ్యిందని అంటోంది. ప్రస్తుతం తనకు చాలా ఆనందంగా ఉందని. పైగా తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడూ ఇలాంటి ఇల్లు కావాలని అనుకున్నట్లు మీడియాకు చెప్పుకొచ్చింది. అయితే ఫారెస్ట్ గ్రూప్ సీఈవో అయిన టెర్రీ చాలా బిజీగా ఉండటంతో ఆ కోట పునరుద్ధరణ పనులన్నీ జూడ్ దగ్గరుండి చూసుకుంటుంది. అంతేకాదు ఆమె సైట్ మేనేజర్, స్పెషలిస్ట్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్, ఆర్కియాలజిస్ట్, హెరిటేజ్ స్పెషలిస్టులు, ఇంజనీర్‌తో సహా స్పెషలిస్ట్ ట్రేడ్ వర్కర్ల బృందాన్ని ఏర్పాటు చేసి ఆ కోటను సరికొత్త హంగులతో తీర్చి దిద్దేందుకు సమయాత్తవుతోంది జూడ్. ఈ మేరకు ఆ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మూడేళ్లు పడుతుందని, 2024 కల్లా ఆ కోటలోకి ప్రవేశించాలని ఎదురుచూస్తున్నట్టు ఆ జంట చెబుతోంది. (చదవండి: డేటింగ్ యాప్‌లో పరిచయం.. మత్తిచ్చి చంపి తినేశాడు!) -
రాకాసి పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!
The Crab Can Be Seen Clutching The End Of Golf Club: మనం ఇంతవరకు చాలా రకాల జంతువులు, సరీసృపాలకు సంబంధించిన వీడియోలను చాలనే చూశాం. పైగా అవి చేసే రకరకాల విన్యాసలు చూస్తే భయంకరంగానూ ఆశ్యర్యంగాను అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కొడక భారీ పీత గోల్ప్ స్టిక్‌ని భలే సులభంగా విరిచేసింది. (చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో స్థానికుడు పాల్ బుహ్నర్ అతని స్నేహితులు గోల్ఫ్ క్లబ్లో ఒక పెద్ద పీతను చూశారు. ఆ పీత చూడటానికి చాలా పెద్దగా ఉంది. అది గోల్ఫ్ స్టిక్(ఐరన్)ని ఏదో చెకోడిలు విరిచినట్టుగా పటపటమంటు విరిచేస్తుంది. పైగా అలా మూడు గోల్ఫ్ స్టిక్ల్ని విరిచేస్తుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కెర్రీ బుహ్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైగా తన భర్త పాల్ బుహ్నర్ గోల్ప్ సందర్బంగా ఈ వీడియోని చిత్రికరించారు అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: రూ.లక్షకో డ్రైవింగ్ స్కూల్) -
చిచ్చర పిడుగు! ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టేందుకు కొత్త ఎత్తులు..
పరీక్షల టైంలో విద్యార్ధులు కాపీ కొట్టకుండా టీచర్లు వెయ్యి కళ్లతో కాపేసుంటారు. ఐనా! కొందరుంటారులే.. అబ్బో కాపీ కొట్టడానికి మామూలు తెలివితేటాలు చూపించరు. ఇలా కూడా కాపీ కొడతారా అనే రేంజిలో ఉంటాయి మరి పథకాలు. అసలే కరోనా కాలంలో అంతంత మాత్రపు అత్తెసురు చదువులతో ఊగిసలాడుతుంటే, కొంతమంది విద్యార్ధులు ఎలాగోల పాస్ అయితే చాలు దేవుడా అన్నట్లు పరిస్థితులను తమకనుగునంగా ఎలా మార్చుకుంటున్నారో ఈ వీడియోపై జస్ట్ ఓ శాంపిల్ లుక్కెయ్యండి. క్లాస్ రూంలో మాస్కులు ధరించి ఎగ్జాం రాస్తున్న విద్యార్ధులు ఈ వీడియోలో కనిపిస్తారు. వీళ్లలో ఓ విద్యార్ధి మాస్కులోపల స్లిప్ పెట్టి దానిని చూసి పరీక్ష రాయడం కనిపిస్తుంది. ఐతే వెనుక కూర్చున్న విద్యార్ధి ఆశ్చర్యంతో నవ్వడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతుంది. కపీ ఇలా కూడా జరుగుతుందని ఎవరూహించరని ఒకరు, కరోనా విపత్తును అవకాశంగా మార్చుకున్నాడని మరొకరు ఇలా నెటిజన్లు సరదాగా వేల కామెంట్లు చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు అది అంత మంచి మార్గం కాదనేది మనందరికీ తెలిసిందే! ఏదిఏమైనా కష్టపడేవారి కోసమే రాజమార్గాలు తెరచుకుంటాయనేది నిత్యసత్యం. మీరేమంటారు...? చదవండి: Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు! View this post on Instagram A post shared by memes | news | comedy (@ghantaa) -
New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది!
New Year's Traditions From Around the Globe 2020, 21 సంవత్సరాల్లో.. ఎందరో ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. అప్పటివరకూ కళ్ల ముందున్న ఆత్మీయులు హఠాత్తుగా తిరిగిరానిలోకాలకు చేరారు. ఈ కరోనా మారణహోమం చాలదన్నట్టు ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేశాయి. దురదృష్టం తిష్టేసుకు కూర్చున్నట్లు ఉందీ పరిస్థతి చూడబోతే! మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. శతకోటి ఆనందాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో అడుగిడాలని వెయ్యి ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఐతే న్యూ ఇయర్ రోజున ఈ విధంగా చేస్తే సంవత్సరమంతా మంచే జరుగుతుందని ప్రపంచంలోని వివిధ దేశాలు భిన్న ఆచారాలను, నమ్మకాలను పాటిస్తున్నాయి. ఆవూసులేంటో తెలుసుకుందాం.. స్పెయిన్ ఈ దేశంలో నూతన సంవత్సరంలోకి అడుగిడిన మొదటి రోజు 12 ద్రాక్ష పండ్లను తింటే ఏడాది పొడవునా సంతోషంగా ఉంటారని నమ్ముతారు. ఈ సంప్రదాయం 1909లో ప్రారంభమైంది. బ్రెజిల్ సముద్రం అలల్లో తెల్లటి పువ్వులు విసిరి బ్రెజిల్ దేశ ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పూలతోపాటు చాలా మంది పర్ఫ్యూమ్స్, నగలు, దువ్వెనలు, లిప్‌స్టిక్‌లను కూడా సముద్రంలోకి విసిరేస్తారు. ఇలా కొత్త సంవత్సరం రోజున సముద్ర దేవత 'యెమాంజ'కి కానుకను సమర్పించడం ద్వారా తమ కోరికలు తీరుస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. డెన్మార్క్ డిసెంబర్ 31 రాత్రి ఈ దేశ ప్రజలు పాత ప్లేట్లు, స్పూన్లు పొరుగిళ్ల మీదకు విసిరేస్తారట. జనవరి 1వ తేదీ ఉదయం ఇంటి తలుపు తియ్యగానే ఎన్ని ఎక్కువ విరిగిన పాత్రలుంటే ఆ సంవత్సరమంతా అంత అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. ఇతర దేశాల్లో ఇలా.. ►థాయిలాండ్‌లో తుపాకులను గాలిలో పేల్చడం ద్వారా చెడు ఆత్మలను భయపెట్టడం ఆచారం. ►సౌత్ ఆఫ్రికాలోని ఈక్వెడార్‌కు చెందిన ప్రజలు ప్రసిద్ధ వ్యక్తుల దిష్టిబొమ్మలను తగలబెట్టడం ఆచారంగా కొనసాగుతోంది. తద్వారా గడచిన సంవత్సరం తాలూకు చెడును నాశనం చేసి, కొత్త సంవత్సరం తాజాగా ప్రారంభమౌతుందనేది వారి నమ్మకం. ►అనేక దేశాల్లో చర్చ్ లేదా గడియారం గంటలు వినడం ఆచారం. ►డచ్‌లో రింగ్ ఆకారంలో ఉండే ఏదైనా ఆహారాన్ని తింటారు. పూర్ణ వృత్తం వారి భవిష్యత్తును అదృష్టమయం చేస్తుందని నమ్ముతారు. ఇక మనదేశంలోనైతే న్యూ ఇయర్ రోజున కొత్తకొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆచారంగా వస్తుంది. నమ్మకం ఏదైనా.. మనసావాచాఖర్మనా ఇతరులకు కీడు తలపెట్టకుండా, అందరి ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తే సంవత్సరమేదైనా, ఎక్కడున్నా, ఎందరిలో ఉన్నా అదృష్టం మనవెంటే ఉంటుంది. ‘యద్భావం తద్భవతి' సూక్తి భావం కూడా ఇదే. పాటిద్దామా.. చదవండి: ‘నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా మరింతగా వెలుగుతోంది'! -
ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్‌లో న్యూస్ పేపర్ కంటింగ్ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్‌ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్‌తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు. చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి!
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ పిచ్చి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తుమ్మినా..దగ్గినా సెల్ఫీనే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా..చివరికి ప్రాణాలు పోతున్నా ఈ విపరీత ధోరణిలో మార్పు రావడంలేదు. సెల్పీ మోజులో ప్రపంచాన్నే మర్చి పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీల కోసం ఎగబడుతూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందంగా ముస్తాబై బయటకు వచ్చిన యువతి సెల్ఫీ కోసం ప్రయత్నించింది. తన అందాన్ని కెమెరాలో బంధించాలని తాపత్రయ పడిన ఆ అమ్మాయి సమీపంలోని కాలువ ఒడ్డున నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. చివరకు అదుపు తప్పి బురదలో పడిపోయింది. నవ్వాలో.. చిరాకు పడాలో అర్థం కావడం లేదు. జాలేస్తోంది అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram A post shared by hepgul5 (@hepgul5) -
అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్!
Dangerous Stunt Of Guinness Records: రికార్డులను బద్దలు కొట్టాలని ఈ జిందగీలో ఎవరికి ఉండదు! ఐతే.. ఇతను చేసిన విన్యాసం ముందు అవన్నీ దిగదుడుపేనని అంటున్నారు నెటిజన్లు.. పాపం! అంతటి ప్రమాదకరమైన స్టంట్ చేసినా ‘మేము గిన్నిస్ రికార్డులో నీ పేరు నమోదు చేయం’ తేల్చిచెప్పారా అధికారులు! ఏం చేశాడో మీరే చూడండి.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జాకీ బిబ్బీ ఏకంగా 11 అత్యంత విషపూరితమైన పాములను నోట్లో కుక్కుకుని ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010లో కూడా ఇటువంటి ఫీటే చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఐతే ఇప్పుడు తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసి మరొకమారు రికార్డును తిరగరాయాలని అనుకున్నాడు. కానీ అందుకు గిన్నిస్ బుక్ అధికారులు ససేమిరా అన్నారు. దీనిని సంబంధించిన ఫొటోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక ఫేస్బుక్లో చూడొచ్చు. ఒక నివేదిక ప్రకారం.. జాకీ ఈ పాములన్నీంటినీ నోట్లో కుక్కుకోవడానికి చేతులను ఉపయోగించలేదట. నోటితోనే వాటిని నేరుగా పట్టుకున్నాడట. అర్థమైందా.. ఇదెంతటి ప్రమాదకరమైన స్టంటో! వాటిల్లో ఏ ఒక్కపాము కరచినా అతని ప్రాణాలు పోగొట్టుకునేవాడు. తెలిసి.. తెలిసి ఈ విన్యాసం చేశాడితడు. ఐతే గిన్నిస్ అధికారులు అందుకు భిన్నంగా ఆలోచించారు. ‘ఇకపై ఈ రికార్డును అస్సలు పర్యవేక్షించడం లేదు. ఎందుకంటే.. చాలా మంది ప్రజలు అలాంటి రికార్డు కోసం తమ జీవితాలతో ఆటలాడుకునే ప్రమాదం ఉంది. మరొకరు ఈ స్టంట్ చేయాలని కోరుకోవడంలేదని’ తేల్చిచెప్పారు. నిజమే కదా! సరదా ప్రాణాలను తీసేంతగా ఉండకూడదు.. చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! -
కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్ కపుల్..
Groom starts crying when he sees bride on wedding day: పెళ్లి రోజున గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లికూతురి డ్రెస్‌లో చూసి ఆనందభాష్పాలను దాచలేకపోయాడా పెళ్లికొడుకు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అసలేంజరిగిందంటే.. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న అలెగ్జాండ్రియాను చూసిన వరుడు డెమెట్రియస్ క్యాషరీస్ భావోధ్వేగంతో కన్నీరు పెట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. బ్యూటిఫుల్ వైట్ పెవిలియన్ గౌను ధరించిన వధువు పుష్పగుచ్చం పట్టుకుని తండ్రితోపాటు రావడం చూసిన వరుడు తన కన్నీళ్లను ఆపుకోలేకపోతాడు. దీనిని సంబంధించిన వీడియోను మగ్నోలియా రోడ్ ఫిల్మ్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు భిన్న కామెంట్ల రూపంలో ప్రశంజల జల్లును కురిపిస్తున్నారు. ‘ఓమై గాడ్! ఈ వీడియో నన్ను కూడా ఏడిపిస్తోంది. మీకు శుభాకాంక్షలు' అని ఒకరు, ‘ఈ వీడియో నిజమైన ప్రేమను తెలియజేస్తుంది. మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. నాకు మీరు తెలియకపోయినా.. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చాలా భావోధ్వేగంతో కామెంట్ చేశారు. మరి మీరేమంటారు.. చదవండి: Dental Care Tips In Telugu: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా? ఐతే ఇలా చేయండి.. View this post on Instagram A post shared by Magnolia Road Film Co. (@magnoliaroadfilmco) -
వైరల్: ట్రైన్లో సీట్ దొరకలేదు.. ఏం పర్లేదు, ఇలా హాయిగా పడుకోవచ్చు
వీకెండ్స్‌లో, పండుగ సమయాల్లో రైలు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నెల రోజుల ముందు టికెన్ రిజర్వేషన్ చేసుకుంటే గానీ సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఇక అకస్మికంగా ఊరేళ్లాలనుకుంటే బస్సులో సీట్ దొరుకుతుందేమో కానీ రైల్లో అయితే కష్టం. జనరల్ టికెట్ తీసుకొని నిల్చొని ప్రయాణం చేయాల్సిందే. మనలో చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ వ్యక్తి మాత్రం ఇబ్బందులను దాటుకొని వినూత్న ఆలోచన చేశాడు. రైలులో తనకంటూ ప్రతేక సీట్‌ను ఏర్పాటు చేసుకొని హాయిగా పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల క్రితం మీమ్స్ పేజ్ షేర్ చేసింది. చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా? ‘భారతీయుల తెలివితో మీరెప్పుడూ సరిపోలేరు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూవ్స్, వేలల్లో లైకులు వచ్చి చేరుతున్నాయి. దీనిలో అసలేముందంటే.. రైలులో కోచ్ పూర్తిగా నిండిపోవడంతో ఓ వ్యక్తికి సీట్ దొరకలేదు. అయితే రాత్రి పడుకోడానికి అతనికి నేల తప్ప మరెక్కడ చోటు లేకపోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తికి అద్భుతమైన ఆలోచన తట్టింది. తన దగ్గరున్న బెడ్‌షీట్‌ను తీసుకొని ఒక చివర లగేజ్ హోల్డర్‌కు, మరో సీటుకు కలిపి గట్టిగా కట్టాడు. దీంతో కోచ్ మధ్యలో ఊయల లాగా ఏర్పడింది. వెంటనే పెక్కి ఎక్కి ఆ ఊయలలో హాయిగా పడుకుంటాడు. చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!! View this post on Instagram A post shared by MEMES.BKS🤟🙂 (@memes.bks) దీనిని చూసిన తోటి ప్రయాణికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. అతడి తెలివిని తలుచుకొని నవ్వుకుంటారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇలా అయితే ట్రైన్ టికెట్ కూడా అవసరం లేదు. ఇతనికి తెలివి బాగా ఉంది. ఇలా పడుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇంకోసారి ట్రైన్లో వెళ్లేటప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. -
తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..!
Cutting this ‘onion’ won't make your eyes watery: ఉల్లిపాయలను కట్ చేయడం కూడా ఓ రకమైన స్టంట్ లెక్కే! ఎంతటి ఘరనా ధైర్యవంతులకైనా కంట్లో నీళ్లు ఇట్టే తెప్పించగలవు. ఆ ఘాటుకు ముక్కు ఛీదేసి.. కళ్లు నులుమేసి.. ఆ కాసేపట్లోనే సతమతంచేసేస్తుంది.. ఉల్లి. కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిగడ్డలుంటే ఎంతబాగుంటుందో.. అని అనుకోని వారు ఉండరేమో! ఐతే ఈ వీడియోలో కనిపించే ఉల్లిని కట్ చేస్తే మాత్రం కళ్లు చెమ్మగిల్లవట!! కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిపాయలా? ఆశ్చర్యంగా ఉందే.. ఎక్కడున్నాయ్! ఇదేనా మీ సందేహం. ఆ విశేషాలు మీకోసం.. గతనెల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఉల్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఏ రకమైన ఉల్లి అయ్యుంటుందనేది.. ప్రతి ఒక్కరి అనుమానం. విషయం తెలిశాక ముక్కుమీద వేలేసుకున్నారంత! చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. నిజానికి.. అచ్చం ఉల్లిలాగే కనిపించే, ఉల్లి రూపంలో తయారు చేసిన రియలిస్టిక్ కేక్ అది. దీనిని చూసిన నెటిజన్లు రియాక్షన్లయితే.. ‘అది నిజమైన ఉల్లికానప్పుడు దానికి ఉల్లి తొడుగు ఎందుకు తొడిగారు' అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు, ఆనియన్ స్కిన్ కూడా నిజమైనది కాదనీ. వెనీలాతో తయారుచేసినదని.. దాన్ని భేషుగ్గా తినొచ్చని ఈ ఉల్లి కేక్‌ను తయారు చేసిన బేకర్ రిప్లై ఇచ్చాడు. ‘అబద్ధం చెప్పకండి.. పై పొర నిజమైనదే' అని ఒకరు ప్రశ్నిస్తే, ‘అద్భుతమైన స్కిల్.. మనసుకు హత్తుకునేలా ఉంద'ని మరొకరు ప్రశంశించారు. మరి మీరేమంటారు? చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
మగ చైనా.. బరువును మోయడం ఎందుకు?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! వాళ్లు మాత్రం... ప్రపంచంలోని ధనికులైన టెక్నోక్రాట్లు ఎందరో తమ ప్రైవేట్ జెట్లలో వచ్చి, ఖరీదైన ఫైవ్‌స్టార్ విలాస హోటళ్లలో దిగి, చుట్టూ జనం సాగిరాగా భారీ పర్యటనలు జరిపేవాళ్లంతా ఇక ‘కాప్ 26’ సమావేశాల్లో రెండు వారాల పాటు మన జీవిత ప్రమాణాలను ఎలా తగ్గించుకోవాలో ఉపన్యాసాలిస్తారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది? – పాల్ జోసెఫ్ వాట్సన్, రాజకీయ వ్యాఖ్యాత మగ చైనా షీ జిన్‌పింగ్ సారథ్యం చైనాలో మొదలయ్యాక– భార్యలుగా, తల్లులుగా మహిళల పాత్ర గురించి ఆయన నొక్కిచెప్పారు. అంతకంటే ముఖ్యం, నిర్దాక్షిణ్యంగా స్త్రీవాద కార్యకలాపాలను అణిచివేశారు. టెలివిజన్లలో సౌకుమార పురుషులు కనబడకుండా నిషేధించారు. ‘మీటూ’కు సంబంధించిన వ్యాఖ్యల్ని తొలగించారు. – ప్రసన్న విశ్వనాథన్, సంపాదకుడు గతపు బరువెందుకు? ఇండియా ఎందుకు ఈ కామన్వెల్త్ బరువును మోయడం? స్వతంత్ర దేశాలు ఇంకా ఎందుకు బ్రిటన్ రాణిని తమ దేశాధినేతగా ఉంచుకుంటున్నాయి? ఈ దేశాలన్నీ ఇంకా ఎందుకు తమ వలసవాద పాలన తాలూకు సంస్థలతో సహజీవనం చేయాలి? – పాల్కీ శర్మ ఉపాధ్యాయ్, జర్నలిస్ట్ తమదాకా వస్తే... ఆహార కొరతతో అలమటిస్తున్న అఫ్గానిస్తాన్ పట్ల అంతర్జాతీయ సమాజం తన మోయక తప్పని బాధ్యతను వీలైనంత త్వరగా నిర్వర్తించాలి. కానీ మనలో మనమాట... మూడు నెలల క్రితం దాకా కూడా, అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం అందుకుంటున్నందుకు గత ప్రభుత్వాన్ని ఇదే తాలిబన్లు ‘తోలుబొమ్మ ప్రభుత్వం’ అని నిందించేవాళ్లు. – నతీఖ్ మాలిక్జాదా, జర్నలిస్ట్ మధ్యేమార్గం తీవ్రమైన అభిప్రాయాలు మనల్ని జీవితంలో ఎటూ తీసుకెళ్లలేవు. మనసు మీద ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉన్న ఒక ఉచితమైన మార్గం, దేనిమీదా తీవ్రమైన అభిప్రాయాలు లేకుండా ఉండటం. – వాలా అఫ్షార్, డిజిటల్ ఇవాంజెలిస్ట్ అక్కర్లేని పరీక్షలొద్దు ఏ లక్షణాలూ లేనివారికి కూడా సీటీ ఆంజియోను సిఫారసు చేస్తున్న డాక్టర్లందరూ కచ్చితంగా అక్రమ ప్రాక్టీస్ నేరస్థులే. కానీ మన ‘ఎయిమ్స్’ మాత్రం అలాంటి అంశాల మీద నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించి, డాక్టర్లు అందరూ అనుసరించేలా చేయకుండా పట్టించుకోకుండా ఉంటోంది. – డాక్టర్ నరైన్ రూపానీ, సర్జన్ ప్రేమ చాలు... తీవ్ర జాతీయవాదం దేశభక్తి కాదు. సొంత దేశాన్ని ప్రేమించడానికి ఇంకో దేశాన్ని ద్వేషించాల్సిన పని లేదు. – కపిల్ దేవ్, పాకిస్తాన్ యాక్టివిస్ట్ -
ఓటీటీలో దూసుకుపోతున్న 'రాజ రాజ చోర'
దసరా కానుకగా 'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు నచ్చడంతో దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసిన నెటిజన్లు సోషల్‌మీడియాలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ... అనేకమంది కామెంట్లు పోస్టులు పెడుతున్నారు. థియెట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి 'జీ5' టీం కృతజ్ఞతలు తెలిపింది. రచయిత - దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఓ బేబీ' దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో "మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే... ఇప్పుడు డిజిటల్ తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది" అన్నారు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత - దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు. టీవీ, ప్రింట్ ప్రమోషన్ల నుంచి డిజిటల్ మీడియా వరకు... ఇన్ఫ్లుయెన్సర్ల నుండి మీమ్ పేజీల వరకూ... సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే 'రాజ రాజ చోర' ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. 'జీ 5'లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది. అక్టోబర్ 22న 'జీ 5'లో 'హెడ్స్ & టేల్స్' విడుదల కానుంది. దీంతో మరింత ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన 'కలర్ ఫోటో' సినిమా టీమ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ముగ్గురు మహిళలు, భగవంతుడు చుట్టూ తిరిగే అందమైన కథతో 'హెడ్స్ అండ్ టేల్స్' రూపొందింది. ఇందులో భగవంతుడిగా సునీల్ నటించగా... 140కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కంటెంట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చదవండి: MAA: బాలయ్యను కలిశాను, త్వరలో చిరంజీవిని కలుస్తా: మంచు విష్ణు -
బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!
డజను గుడ్లు పగలకుండా షాప్ నుంచి ఇంటికి తీసుకురావడానికి తలమునకలైపోతాము. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరినీ అబ్బురపరిచాడు. తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు కొట్టాడు కూడా. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చదవండి: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!! పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్ మ్యాన్’గా అందరికీ సుపరిచితుడు. అందుకు ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ప్రపంచమంతా తిరిగి తన ట్యాలెంట్‌ను వివిధ దేశాల్లో ప్రదర్శించాడట. అంతేకాకుండా పలు టెలివిజన్ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. దీనితో అతడు వరల్డ్ ఫేమస్ ఎగ్‌మ్యాన్‌గా అందరికీ గుర్తుండిపోయాడు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ఈ వీడియోలో ఇతను ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్ నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు స్పెషల్ షోలో దీనిని తలపై పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించాడు. దీనిని చూసిన గిన్నీస్ రికార్డు అధికారులు ‘వావ్’అనకుండా ఉండలేక పోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ‘ఇది చాలా ఇమ్ప్రెస్సివ్గా ఉంది’ అని ఒకరు, ‘మొత్తం ఎగ్స్ బరువు ఎంత ఉంటుందని’ మరొకరు సరదాగా కామెంట్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!
పెళ్లిళ్ల సీజన్ వస్తే కళ్యాణమండపాలు ఏ విధంగా కళకళలాడుతాయో సోషల్ మీడియాలో కూడా వధువరులు వీడియోలతో నిండిపోతుంటాయ్. ఈ రోజుల్లో యువతీయువకుల వివాహ క్షణాలు వారికి చాలా ముఖ్యమైనవే కాకుండా మధురమైనవి కూడా. ఒకప్పుడంటే వాటని మనం వీడియో రూపంలో భద్రపరిచి చూసుకోవాలి. అయతే నేటి నెటిజన్ యుగంలో ఇలాంటి మధర క్షణాలున్న కొందరి వీడియోలు వైరల్‌గా మారి సోషల్ మీడియాలో కనపడుతుంటాయి. ఈ రోజుల్లో పెళ్లంటే డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. తాజాగా ఓ పెళ్లిలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట దూసుకుపోతోంది. ఇటీవల పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ స్టెప్స్ వెయ్యాల్సిందేనంటూ బంధువులు, స్నేహితులు బలవంతంగానైనా చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... అలా అందరి ముందూ డాన్స్ చెయ్యాలంటే కొంతమంది ఇబ్బంది పడేవాళ్లు ఉన్నారు. తాజాగా ఓ వీడియోలో కూడా ఓ వరుడు డాన్స్ వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. వధువు మాత్రం అందరి ముందు డ్యాన్స్ ఇరగదీసింది. సింపుల్‌గా.. సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి. ఆ వధువు డాన్స్ చూసి వరుడే కాదు... పెళ్లికి వచ్చిన వారంతా స్టన్ అయ్యారనుకోండి. అందరూ ఆమె చేస్తున్న డ్యాన్స్‌కి ఫిదా అయ్యి తన వైపే చూస్తున్నారు. వారే కాక నెటిజన్లు కూడా వధువు డ్యాన్స్ సూపర్ అంటు కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by ||•__couple__official__•|| (@couple_official_page) -
Viral Video: దాహంగా ఉంది.. కొంచెం నీళ్లు ఇస్తారా.. వామ్మో కోబ్రా..!!
మీకు పాములంటే చచ్చేంత భయమా? ఏమడుగుతున్నారండి.. పాములంటే భయపడనివారెవరన్నా ఉంటారా? ఇదేనా మీ సమాధానం.. ఐతే ఈ వీడియోను మీరు చూడాల్సిందే.. అట్లాంటి ఇట్లాంటి పాము కాదు కింగ్ కోబ్రా.. జంతువులు మనుషులకు సహాయం చేసే వీడియోలు వందలకొద్దీ చూసుంటారు. కానీ ఈ వీడియోలో మనిషే కింగ్ కోబ్రాకి హెల్ప్ చేస్తున్నాడు. అంత కష్టమేమొచ్చిందా పాముకు..! అసలేంజరిగిందంటే.. వాతావరణం బాగా వేడిగా ఉండటంతో దాహమేసిన కోబ్రా ఒక కాలనీలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన వారంతా భయంతో పరుగులు తీశారు. ఐతే ఒకతను మాత్రం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బకెట్‌తో నీళ్లు నింపి కోబ్రాకి స్నానం చేయించాడు. అంతేకాకుండా తాగడానికి నీళ్లు కూడా అందించడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్ల రూపంలో అతన్ని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. పాముకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత యేడాది జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఏకంగా 33 లక్షల మంది వీక్షించారు. మానవత్వం ఇంకా బతికేఉందని దీనిని చూసిన వారంతా అంటున్నారు. ఐతే ఇటువంటి విషపూరిత జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే వ్యవహారం బెడిసికొట్టి మొదటికేమోసం వస్తుందనేది వాస్తవం. మీ అభిప్రాయమేమిటి..!! చదవండి: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే! View this post on Instagram A post shared by Sachin Sharma (@helicopter_yatra_) -
టీమిండియా మహిళా క్రికెటర్ తో శిఖర్ ధావన్ పెళ్లి..?
Rumours On Dhawan Second Marriage: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం హైలెట్ అవుతుందో తెలియదు. కొన్ని రూమర్స్గా మిగిలిపోతాయి.. కొన్ని నిజాలుగా తేలుతాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకుంటే టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే కొద్ది రోజులు కిందట శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, ఓ భారత మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. శిఖర్ ధావన్, సదరు మహిళా క్రికెటర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయేషాతో విడిపోవడానకి ఇదే కారణమంటూ కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఇందులో నిజం ఉందా లేదంటే.. గాసిప్స్ రాయుళ్ల పనేనా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: CSK VS RR: ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’ -
వివాదాల నుంచి రిలాక్స్ అవ్వడానికే సర్ఫింగ్ చేస్తున్నారా!: న్యూయార్క్ టైమ్స్
న్యూయార్క్: క్వాలిటీ కంట్రోల్ మెకానిజంలో ఫేస్బుక్ దారుణంగా విఫలం అవుతోందని, ఫేస్‌బుక్‌ను డర్టీగా మార్చేసిందంటూ... ది స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించి సంగతి తెలిసిందే. అయితే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు స్వతహాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దిగ్గజంగా అభివర్ణించే ఫేస్బుక్ తన సొంత రూల్స్‌ను పక్కనపెట్టేస్తోందంటూ విమర్శిస్తున్నారు. అంతే కాదు యూజర్లను ‘హైప్రొఫైల్’ కోణంలో విభజించి.. వివక్ష ప్రదర్శిస్తోందంటూ సర్వత్రా విమర్మలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ డేటా లీకేజ్ కాకుండా పలు చర్యలు తీసుకున్నారు. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు జూకర్ బర్గ్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కూడా దృష్టి సారిస్తున్నట్లు మార్క్‌జూకర్ బర్గ్ తెలిపిన ఈ వివాదలు మాత్రం ఆగడం లేదు. పైగా సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ చేసిన వివాదాస్పదం చేస్తున్నారు. (చదవండి: డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించకూడదట!) ఈ మేరకు న్యూయర్క్ టైమ్స్ పత్రిక మార్క్ జూకర్ బర్గ్‌ని వివాదాలకు దూరంగా సర్ఫింగ్ చేస్తూ రిలాక్స్ అవుతన్నారా! అంటూ ఒక కథనం ప్రచురించింది. ఇటీవల ఆయన అమెరికా జెండా పట్టుకుని హైడ్రోఫోలింగ్ చేస్తున్న ఒక వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశాడు. దీంతో న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలతో ఆయనపై విమర్శలు కురిపించింది. ఈ మేరకు మార్క్ జూకర్ బర్గ్ మాట్లాడుతూ.. "హైడ్రోఫోలింగ్ అనేది ఒక జల క్రీడ. పైగా ఇది నా హాబీ. ఇలా చేయడం నా కెంతో సంతోషాన్ని ఆనందాన్నికలిగించింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి" అన్నారు. నా వ్యక్తిగత అభిరుచిలపై కూడా విమర్శలు కురిపించకండి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తానెప్పుడు విరామం దొరికినపుడల్లా కుటుంబం, స్నేహితులు రైడింగ్లతోనూ గడుపుతుంటానని పేర్కొన్నాడు. దయచేసి నా వ్యక్తిగత సంతోషాల్ని కూడా వివాదాస్పదం చేయంకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి) -
బైక్ పై వెళ్తున్న దంపతులపై అకస్మాత్తుగా దూసుకెళ్లిన గేదె
పూణే: ఒకోసారి ప్రమాదం అనేది ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అస్సలు ఊహించలేం. ఏమీ చెయ్యకుండా ఇంట్లోనే కూర్చున్నా కూడా అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలతో ఊహించని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. దానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జుబేర్ షేక్ అనే వైద్యుడు తన భార్యతో కలిసి పూణేలోని ఖడ మార్కెట్ ప్రాంతంలో బైక్ మీద వెళ్తున్నాడు. అదే సమయంలో అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి తన గేదెలను తీసుకెళ్లున్నాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఊహించని ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. షాపింగ్ పూర్తి చేసుకుని బైక్‌పై వెళ్తున్న వైద్యుడిపైకి ఒక గేదె దూసుకెళ్లి తన కొమ్ములతో దాడి చేసింది. దీంతో బైక్‌పై నుంచి భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో వైద్యుడు జుబైర్ చేతి వేళ్లు విరిగిపోయాయి. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇదే విషయంపై జుబైర్ దంపతులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆదారంగా విచారణ కొనసాగించారు. రద్దీ ప్రాంతంలోకి గేదెలను తీసుకొచ్చి ప్రమాదానికి కారణమయ్యారంటూ రజాక్, అతడి సోదరులు సదాకత్, నదాఫత్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ దంపతులకు నష్ట పరిహారం చెల్లించాలని పోలీసులు రజాక్ మరియు అతని సోదరులకు తెలిపారు. ఇక ఈ సంఘటణకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు
సాక్షి, మంచిర్యాల: మెట్టినింటికి వెళ్లేటప్పుడు అప్పగింతల్లో కొత్తగా పెళ్లయిన వధువు కన్నవారిని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఈ సీన్ ఎక్కడైనా చూస్తాం. కానీ ఈ వధువు మాత్రం కాస్త డిఫరెంట్. కట్టుకున్న భర్తతో జీవితాంతం సంతోషంగా ఉంటాననే ఆనందంతో స్టెప్పులేసింది. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవవధువు సాయి శ్రీయ అప్పగింతల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇటీవల బాగా హిట్ అయిన ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని గాయని మోహన భోగరాజు పాడిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’ పాటకు కట్టుకున్న భర్త ముందు ఆడి కొత్త జీవితంలోకి భర్తను మనసారా ఆహ్వానించింది. పాటలోని పదాలకు అనుగుణంగా స్టెప్పులేస్తూ నూతన వరుడిని ఆకట్టుకుంది. ‘పట్టుచీరనే గట్టుకున్నా.. గట్టుకున్నుల్లో గట్టుకున్నా’అంటూ తన సింగారాన్ని ఒలకపోసింది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’అంటూ చేతిని తన భర్తకందించింది. ‘నువ్వు నన్నేలుకున్నావురో దండ మెల్లోన ఏస్తానురో.. నేను నీ యేలు వట్టుకోని మల్లె జల్లోన ఎడతానురో’అంటూ తన ఆనందం వ్యక్తపరిచింది. ‘మంచి మర్యాదలు తెలిసినదాన్ని.. మట్టి మనుషుల్లోనా పెరిగినదాన్ని’అంటూ నిష్కపటత్వాన్ని ఆవిష్కరించింది. ‘నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో.. మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో.. ఏడు గడపలల్ల ఒక్కదాన్నిరయ్యో.. మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో..’అంటూ తన కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని తన భర్తకు వివరించింది. ‘ఎన్ని మారాలు జేస్తు ఉన్నా నన్ను గారాలు జేసుకొని.. చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను’అంటూ తాను ఎంత గారాబంగా పెరిగిందో చెప్పుకొచ్చింది. డ్యాన్స్ చేస్తున్న పెళ్లి కూతురు సాయి శ్రీయ ‘నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా వెట్టినంకుల్లో, వెట్టినంకా.. సిరిసంపద సంబురం గల్గునింకా గల్గునింకుల్లో, గల్గునింకా’అంటూ తాను అడుగు పెడితే అత్తవారింటికి ఐశ్వర్యాలే అంటూ పాటలోని చరణాలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పెళ్లి కూతురు భలేగా డ్యాన్స్ చేసిందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. బయట కూడా ఈ డ్యాన్స్ గురించే చర్చించుకుంటున్నారు. కొత్త దంపతులు ఇలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలంటూ కామెంట్లు పెడుతూ విష్ చేస్తున్నారు. ట్రెండ్ సృష్టించిన వధువు: ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో వధువు చేసిన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, గత రెండు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో 3.5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. కుటుంబసభ్యులు, వధూవరులు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సరదాగా చేసిన డ్యాన్స్ ఇంత ప్రాచుర్యం పొందుతుందని అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. సాయి శ్రీయ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. వరుడు అశోక్ జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్ .. భర్త ఫిదా) ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్.. కరీంనగర్‌కు చెందిన మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి పి.నరహరి ఈ పాటపై స్పందించారు. ‘పెళ్లి కూతురు.. పెళ్లికొడుకు కోసమే డ్యాన్స్ చేసింది. సంతోషంగా అతన్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తోంది. నిజమైన ప్రేమ.. అతడి బుల్లెట్టు బండిపై సవారీ చేయాలనుకుంటోంది’అని ట్వీట్ చేశారు. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: ప్రధాని మోదీకి ప్రత్యేక ఆలయం.. ఎక్కడో తెలుసా? -
పోస్ట్ వైరల్: పుట్టిన రోజు బతకాలని లేదన్న నటి
తమిళనాట బిగ్ బాస్‌తో పాటు కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయ్యింది నటి యషిక ఆనంద్. కొద్ది రోజులు కిత్రం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదం గురైన సంగతి తెలిసిందే. దీంతో యాషిక కొద్ది రోజులుగా బెడ్డుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. తాజాగా ఈ నటి ఆగస్ట్ 4న తన పుట్టి రోజు సందర్భంగా భావోద్వేగానికి లోనవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. యాషికకు జరిగిన ప్రమాదంలో తాను తీవ్రంగా గాయపడినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో తన స్నేహితురాలిని పోగొట్టుకుంది. ఇక అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ అమ్మడు ఇటీవలే కోలుకుంది. అయితే పూర్తిగా ఆరోగ్యవంతురాలు కావడానికి కొంత కాలం పడుతుందని వైద్యులు తెలిపారట. కాగా బుధవారం యాషిక తన స్నేహితురాలి మరణం తట్టుకోలేక సోషల్ మీడియాలో తన బాధని పోస్ట్ రూపంలో పంచుకుంది. అందులో.. తనకు బతకాలని లేదంటూ ఎమోషనల్ అయ్యింది. తను చేసిన తప్పుకు ఆమె స్నేహితురాలు ఎప్పటికి తనని క్షమించదని, వారి కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చినందుకు అనుక్షణం తాను కుమిలిపోతున్నట్లు తెలిపింది. ఐసీయూలో ఉన్నప్పటికీ ప్రతిక్షణం తనకు నా స్నేహితురాలే గుర్తుకొచ్చింది. ఆమె జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతాయని ఈ అమ్మడు చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఏదేమైనా కూడా బర్త్ డే రోజే బతకాలని లేదనడం మాత్రం ఆమె ఫాలోవర్లను కాస్త బాధపెట్టిందనే చెప్పాలి. యాక్సిడెంట్ జరిగితే అయితే మీరేం చేస్తారు.. ధైర్యంగా ఉండాలంటూ నెటిజన్లు యాషికకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. -
క్లబ్‌హౌజ్‌లో ఎంట్రీ ఇప్పుడు మరింత ఈజీ..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్ క్లబ్‌హౌజ్. ఈ యాప్‌తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. క్లబ్‌హౌజ్ యాప్‌ను మార్చి 2020లో విడుదల చేశారు. క్లబ్‌హౌజ్‌కు భారీగా ప్రాచుర్యం రావడంతో దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ కూడా ఆడియో రూపంలో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇతర సోషల్ మీడియా యాప్స్ మాదిరిగా కాకుండా, క్లబ్‌హౌజ్‌లో చేరాలంటే కేవలం అందులో ఉన్న సభ్యులు ఆహ్వానిస్తేనే చేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు, లేదా ఇతరులు ఆహ్వానిస్తేనే తప్ప అందులో చేరే అవకాశం లేదు. ఆహ్వానం లేకుండా ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవాలనుకునే వారిని వెయిటింగ్ లిస్టులో చూపిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ ప్రకారం కొత్త యూజర్లకు క్లబ్‌హౌజ్ అందుబాటులో వస్తోంది. తాజాగా క్లబ్‌హౌజ్ అధిక సంఖ్యలో యూజర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఇన్విటేషన్ కోడ్ లేకుండా యూజర్లు ఇకపై క్లబ్‌హౌజ్‌లో జాయిన్ కావచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది. వెయిటింగ్ లీస్ట్ పద్దతిని కూడా ఎత్తి వేసింది. క్లబ్‌హౌజ్ లాంటి సర్వీసులను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఇన్స్టాగ్రామ్, ట్విటర్, రెడ్డిట్, టెలిగ్రాం వంటివి తమ సొంత వర్షన్లతో యాప్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాయి. క్లబ్‌హౌజ్ ప్రకారం.. ప్రస్తుతం క్లబ్‌హౌజ్‌లో డేలీ రూమ్స్ సంఖ్య 50 వేల నుంచి 5 లక్షలకు పెరిగింది. అంతేకాకుండా క్లబ్ హౌజ్ టెడ్ టాక్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. -
పెళ్లిలో తలపాగ నేలకేసి కొట్టిన వరుడు.. వైరల్ వీడియో..
న్యూఢిల్లీ: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, ఈ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ వివాహం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. తాజాగా, ఈ పెళ్లి కూడా ఒక వెరైటీ సంఘటనతో వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ వివాహంలో మండపాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. బంధువుల మధ్య సిందూర్ అనే కార్యక్రమం ప్రారంభమైంది. సాధారణంగా, ఈ వేడుకలో వరుడు, వధువు నుదుట.. తల కొప్పులో కుంకుమ పెట్టడం ఆచారం. అయితే, వధువు వేదిక మీద కూర్చోని ఉంది. ఈ క్రమంలో వరుడు, పెళ్లికూతురికి బొట్టు పెట్టడానికి వేదిక దగ్గరకు చేరుకున్నాడు. కుంకుమ పెట్టాడానికి సిద్ధమయ్యాడు.. అయితే, ఇంతలోనే వధువు ఒక్కసారిగా కిందపడి పోయింది. దీంతో వరుడు షాక్ గురయ్యాడు. పాపం.. అతనికి ఏంజరిగిందో అర్థం కాలేదు. కాసేపటికి, వధువు ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన అతను.. వెంటనే తన తలపాగను తీసిపాడేశాడు. అంతటితో ఆగకుండా కోపంతో.. మెడలోని పూలమాల తీసి నెలకేసి కొట్టాడు. ఈ క్రమంలో వరుడిని ఆపటానికి బంధువులు ప్రయత్నించారు. అయినా.. వరుడు ఎవరిమాట లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. వధువుకి ఏమయ్యిందో..’, ‘ఆ యువతికి పెళ్లి ఇష్టంలేదు కాబోలు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
బిడ్డ కిడ్నాప్.. పట్టు వదలని తండ్రి, ఏకంగా 24 ఏళ్లు
బీజింగ్: సాధారణంగా ఎక్కడైనా పిల్లలు తప్పిపోయినా, కిడ్నాప్‌కు గురైనా తల్లిదండ్రులు వారి కోసం నెలలు, ఏళ్ల తరబడి వెతికి చివరకు ఆశలు వదులుకుంటారు. కానీ చైనాలో మాత్రం ఓ తండ్రి తప్పిపోయిన తన కుమారుడి కోసం 24 ఏళ్ల పాటు వెతికాడు. ఏకంగా సుమారు 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఏ దేవుడు కరుణించాడో చివరకు తన కుమారుడు ఆచూకీ లభించింది. వివరాలు.. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్సుకు చెందిన గువా గాంగ్‌టాంగ్ కుమారుడు రెండేళ్ల వయసులో కిడ్నాప్‌కు గురైయ్యాడు. ఈ సంఘటన 1997లో జరిగింది. అప్పటినుంచి తన బిడ్డకోసం దేశవ్యాప్తంగా వెతకడం ప్రారంభించాడు. కానీ ఆచూకీ లభించలేదు.. అయినా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో గాంగ్‌టాంగ్ చాలా ఇబ్బందులు ఎదర్కొన్నాడు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలు పాలైన సంఘటలు ఉన్నాయి. గువా గాంగ్‌టాంగ్ కథ ఆధారంగా 2015లో ఓ సినిమా కూడా తీశారు. ఆ సినిమాలో హాంగ్‌కాంగ్ సూపర్‌స్టార్ ఆండీ లువా నటించారు. ఆ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. అలా వెతుకుతుండగా దాదాపు 24 ఏళ్ల నిరీక్షణ తరువాత తన కూమరుడిని కలుసుకున్నాడు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా పిల్లవాడి ఆచూకీ గుర్తించినట్లు తాజాగా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. కాగా, ఈ కిడ్నాప్ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. చైనాలో పిల్లల అపహరణలు ఎక్కువగా జరగుతుంటాయి. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పిల్లలు కిడ్నాప్‌కు గురవుతూ ఉంటారు. అయితే బిడ్డ కోసం గువా గాంగ్‌టాంగ్ పట్టుదలను అభినందిస్తూ సోషల్ మీడియోలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
అందుకే నా కుమారులతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా..!
జకార్తా: సాధారణంగా తల్లిదండ్రులందరు తమ పిల్లల కోసం పరితపిస్తుంటారు. తమ వారు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారికి కావాల్సింది కొనిస్తారు. అయితే, కొంత మంది పిల్లలు ఆన్లైన్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఆశ్లీల వీడియోలు చూస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో చదువుతూనే ఉంటాం. కొంత మంది పిల్లలు పాశ్చాత్య పోకడలకు పోయి.. ప్రతి చిన్న విషయాలకు అబద్ధాలు చెబుతూ.. కన్న వారిని సైతం, మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. అయితే, ఈ తల్లి అందరిలా కాకుండా.. కాస్త వెరైటీగా ఆలోచించింది. ‘పిల్లలకు ఏది వద్దంటే.. అదే చేస్తారు’. కాబట్టి వారికి దాంట్లో మంచి..చెడులను చెప్పాలనుకుంది. అందుకే తన పిల్లలతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తూ వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పించింది. దీంతో ఈమె వార్తలలో నిలిచింది. వివరాలు.. ఇండోనేషియాకు చెందిన ప్రముఖ పాప్ స్టార్ యుని శరాకు ఇద్దరు కొడుకులు. ఈ మధ్య ఆమె ఒక యూట్యూబ్ ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 47 ఏళ్ల వయసున్న యూనీ, తన ఇద్దరు కొడుకులు.. కెవిన్ సియాహన్, సెల్లో నియాహన్లతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తానని బాంబ్ పేల్చింది. ప్రస్తుత స్మార్ట్ యుగంలో పిల్లలను చెడు వ్యవసనాల బారిన పడకుండా చూడటం దాదాపు అసాధ్యం. ఒకవేళ మనం వారిని దీనిపై కట్టడి చేస్తే.. మనకు తెలియకుండా ఎలాగైనా దొంగ చాటున చూసేస్తారు. అందుకే వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పిస్తున్నానని యూనీ తెలిపింది. తన పిల్లలు శృంగారాన్ని ఓ బూతూలా కాకుండా.. ఓపేన్ మైండెడ్‌గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కాగా, పిల్లలకు లైంగిక జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పింది. అయితే, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు.. ‘నీకేమైన బుద్ధుందా.. ఇదేం పైత్యం’ అంటూ.. తిట్టిపోస్తూంటే.. మరికొందరు ‘ఆమె చేస్తుంది సరైన పనే’ అంటూ యూని శరాను సపోర్ట్ చేస్తున్నారు. చదవండి: మనుషుల కంటె ఏనుగులే నయం.. వైరల్ వీడియో.. View this post on Instagram A post shared by WahyuSetyaningBudi✨ (@yunishara36) -
Dolly Singh: కాలీ లడకీ... డాలీసింగ్!
సన్నగా, నల్లగా ఉండడంతో.. తోటి విద్యార్థులంతా ‘ కాలీ లడ్కీ’, ‘సుఖీ దాండి’, బ్యాగ్ ఆఫ్ బోన్స్’ అంటూ డాలీసింగ్‌ను ఆటపట్టిస్తుండేవారు. ఖండించాల్సిన టీచర్లు సైతం కొన్నిసార్లు డాలీ వేసుకున్న డ్రెస్ పార్టీకి నప్పదని చెప్పి వెనక్కి పంపించేవారు. ఇటువంటి ఎన్నో అవహేళనలను ఎదుర్కొంటూ కూడా ఫ్యాషన్ టెక్నాలజీ చదివి, సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేసింది డాలీ. ఫ్యాషన్ బ్లాగర్, కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. నైనిటాల్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1993లో డాలీ సింగ్ పుట్టింది. డాలీ సింగ్ తల్లిదండ్రులకు ‘అప్నా బజార్’ పేరిట ఒక గిఫ్ట్ షాపు ఉంది. ఈ షాపు మీద వచ్చే కొద్దిపాటి ఆదాయమే వారి జీవనాధారం. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ డాలీ సింగ్, తన తమ్ముడితో కలిసి స్కూలుకు వెళ్లి చక్కగా చదువుకునేది. స్కూల్లో తన బక్కపలుచని శరీరాన్ని తోటి విద్యార్థులు గేలిచేసినప్పటికీ చురుకుగా చదువుతూ.. క్లాస్‌లో ఫస్ట్ వచ్చేది. స్పిల్ ది సాస్.. డిగ్రీ తరువాత ఎమ్బీఏ చదివేందుకు క్యాట్ పరీక్ష రాసింది. కానీ ఎమ్బీఏలో సీటు రాలేదు. దీంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ)ఎంట్రన్స్ రాయగా.. ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఢిల్లీ ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. పీజీ చదువుతూనే మరోపక్క ‘స్పిల్ ది సాస్’ పేరిట ఫ్యాషన్ బ్లాగ్‌ను ప్రార ంభించింది. ఈ బ్లాగ్‌లో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఫోటోలను పోస్టు చేసేది. వీటితోపాటు దుస్తుల ఫ్యాషన్ వీడియోలు, యాక్సెసరీస్, బడ్జెట్ ధరలో ఫ్యాషన్ దుస్తుల షాపింగ్ ఎలా చేయాలి... వంటి అంశాలపై వీడియోలను పోస్టు చేసేది. తల్లి, తండ్రి, తమ్ముడితో డాలీసింగ్ పీజీ ప్రాజెక్టులో భాగంగా డాలీ సింగ్ ఆన్లైన్ ప్లాట్‌ఫాం ‘ఐ దివ’ లో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక ఐ దివాలో కంటెంట్ క్రియేటర్‌గా చేరి.. నిర్మాతగా, రచయితగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభంలో వీడియోలు షూట్ చేయడం కాస్త కష్టంగా ఉండడంతో...రెండేళ్ల తరువాత ఐ దివ డైరెక్టర్ ‘సౌత్ ఢిల్లీ గర్ల్స్’ పేరిట షోను ప్రారంభించారు. ఈ షోలో డాలీసింగ్ కుషా కపిలతో కలిసి చాలా వీడియో సీరిస్ చేసింది. ఈ సీరిస్ బాగా పాపులర్ అయింది. డాలీసింగ్ కెరియర్లో ఇదో మైలురాయి. ఈ షోతో డాలీకి అపారమైన పాపులారిటి వచ్చింది. సౌత్ ఢిల్లీ గర్ల్స్ సిరీస్ తరువాత డాలీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘జీనత్’ ‘మిసెస్ కపూర్’, ‘నటాషా’ ‘రెక్లెస్ రేణు’, గుడ్డీ బాబాయ్’, ‘బబ్లీ’ వంటి వీడియోలు డాలీసింగ్కు మంచి గుర్తింపు తెచ్చాయి. నైనిటాల్‌లోని డాలీ సింగ్ ఇంటిని ‘మై రియల్ హౌస్ టూర్’ పేరిట ఎడిటింగ్ చేయని వీడియో అప్లోడ్ చేసింది. వాస్తవానికి దగ్గరగా ఉన్న వీడియో కావడంతో వ్యూవర్స్ బాగా ఇష్టపడ్డారు. రాజుకీ మమ్మీ.. ‘రాజుకీ మమ్మీ’ టాక్ షో ద్వారా చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీలను డాలీ ఇంటర్వ్యూ చేసింది. ప్రియాంకా చోప్రా, ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దికీ, పంకజ్ త్రిపాఠి వంటి వారితో కలిసి చేసిన క్యారెక్టర్ వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. డాలీ సింగ్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫ్యాషన్ బ్లాగ్‌ను ఫాలో అయ్యే వారిసంఖ్య లక్షల్లోనే ఉంది. ఒకపక్క ఫ్యాషన్ బ్లాగర్‌గా, యూట్యూబ్ సిరీస్‌లో తీరికలేకుండా గడుపుతున్న డాలీ గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘భాగ్ బీని భాగ్’ సిరీస్‌లో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. -
వైరల్ వీడియో: బర్త్ డే పార్టీ లో సింహాం చీఫ్ గెస్ట్
ఇస్లామాబాద్: ఎక్కడైనా బర్త్ డే పార్టీ అంటే సాధారణంగా మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను ను ఆహ్వనిస్తాము. కానీ పాకిస్థాన్ చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా సింహాన్ని ముఖ్య అతిధి గా తీసుకు వచ్చింది. ఈ మృగరాజుని కుర్చీలో కూర్చోబెట్టి చైన్లతో కట్టేసింది. సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుక జరుపుకుంది. అయితే బర్త్ డే పార్టీ కు సంభందిచిన ఓ వీడియో ను సుసాన్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఓ సింహాన్ని గొలుసులతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు ఆటలు ఆడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె చిక్కుల్లో పడింది. సుసాన్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేసిన వీడియో ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది. దీంతో వారు ఈ వీడియోను తమ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి సుసాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము బర్త్ డే పార్టీలకు వ్యతిరేకం కాదు..కానీ ఇలా మీరు మూగజీవాలను పార్టీలకు తీసుకొచ్చి కట్టేసి ఇలా ఆనందం పొందడం తప్పు. మిమ్మల్ని కూడా పార్టీకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి ఇలానే ఓ కూర్చీ కి కట్టిపడేస్తే మీకు కూడా తెలుస్తుందని వీడియోకు కామెంట్ ట్యాగ్ చేశారు. అయితే ఈ వేడుకలో సింహానికి మత్తుమందు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వీడియోపై విమర్శలు రావడంతో పోస్ట్ చేసిన 24 గంటల్లో దానిని సుసాన్ ఖాన్ డిలీట్ చేసింది. అయితే ఆ మహిళతోపాటు ఆ పార్టీలో ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.క ఇదే విషయంపై వన్యప్రాణుల సంరక్షణ సంఘం ప్రతినిధులు ఓ ఆన్లైన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వేడుకల్లో వన్యప్రాణులను ఉపయోగించకూడదని ఆన్లైన్ వేదికగా 1500 సంతకాలు సేకరించారు. View this post on Instagram A post shared by Project Save Animals (@projectsaveanimals) చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే? -
పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్
భువనేశ్వర్: శ్వాస అందక.. ఎవరైనా ప్రాణాపాయ స్ధితిలో ఉంటే నోట్లో నోరు పెట్టి ఊపిరి అందించడం చూసివుంటాము. అయితే, జంతువులు, సరిసౄపాలకు ఆ సమస్య వస్తే సాయం అందించేదెవరు? వాటి ప్రాణం నిలిపేదెవరు? ముఖ్యంగా విష సర్పాలు కనిపిస్తేనే అంత దూరం పరుడెత్తడం మానవ నైజం. కానీ, ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఓ యువకుడు ఏకంగా ప్రాణాపాయంలో ఉన్న పాముకు ఊపిరి ఊది ప్రాణం పోసాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్కన్‌గిరిలోని నౌగుడా గ్రామంలో ఓ ఇంట్లో పాము చొరబడింది. దానిని చూసి స్థానికులు వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ స్నేహాశీష్ అనే యువకుడికి సమాచారం ఇచ్చారు. అతడు స్థానికంగా పాములను పట్టి అడవుల్లో వదిలిపెడుతుంటాడు. ఇంట్లోకి చొరబడిన పామును చాకచక్యంగా పట్టి బయటకు తీసుకొచ్చాడు. అది దాదాపు 10 అడుగుల పొడవు ఉంది. కానీ ఆ పాము అపస్మారక స్థితికు చేరుకుంది. శ్వాస అందక పాము విలవిల్లాడుతోందని గుర్తించిన.. స్నేహాశీష్ ఊపిరి ఊదితే బతుకుతుందని అనుకున్నాడు. కానీ, పాము ఊపిరి ఊదడం ఎలా అని చూస్తుండగా.. అక్కడ ఓ స్ట్రా కనిపించింది. దాన్ని తీసుకుని పాముని పట్టుకుని దాని నోట్లోకి స్ట్రా పెట్టి ఊపిరి ఊదాడు. అలా కొన్నిసార్లు చేసినా పాము కదల్లేదు. దాదాపు 15 నిమిషాలపాటు స్నేహాశీష్ పాముకు ఊపిరి అందిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఆ పాము స్పృహలోకి వచ్చింది. పాముకు ప్రాణాపాయం తప్పిందనుకున్న తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇక పాముకు ప్రాణం పోసిన యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి:Odisha: హిజ్రాలకు పోలీసు ఉద్యోగాలలో అవకాశం.. -
అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో!
మనలోఎవరికైనా.. పాము కనిపిస్తే ఏంచేస్తారని ఒకవేళ అడిగితే.. ‘ ఇంకేంచేస్తాం.. గట్టిగా అరుస్తూ.. అక్కడి నుంచి పారిపోతామని’ చెప్తాం. అయితే, మరికొందరు భయస్తులు, పామును చూడటం అటుంచి, ఒకవేళ దాని పేరు తలుచుకున్న కూడా భయంతో వణికి పోతారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఒక యువతి మాత్రం కింగ్ కోబ్రాను చూసినా భయం లేకుండా ఒంటి చేత్తో పట్టేసుకుంది. అయితే, ఆ పామును పట్టేక్రమంలో ఆమె మొహంలో భయం కించెత్తైనా లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. నాగేశ్వరీ అనే యువతికి పాములను పట్టుకోవడం అంటే ఇష్టం. ఈ క్రమంలో ఎక్కడ పాములు కనిపించినా కూడా. వెంటనే సదరు స్థానికులు నాగేశ్వరీకి సమాచారం ఇస్తారు. దీంతో ఆమె అక్కడికి చేరుకొని ఆపాముని పట్టుకుంటుంది. అయితే, ఈ వీడియోలో కూడా నాగేశ్వరీ ఒక పామును పట్టుకోవడం కనిస్తోంది. దీనిలో ఒక పెద్ద నాగుపాము రాళ్ల వెనుక ఉండటాన్ని నాగేశ్వరీ గమనించింది. ఆమె వెంటనే, రాళ్లను పక్కకు జరిపి ఒంటి చేత్తోనే ఆ పాముని పట్టేసుకుంది. అయితే, ఆ యువతి మొహంలో ఏమాత్రం భయం కనిపించడంలేదు. ‘పాపం.. ఆ పాము మాత్రం, నాగేశ్వరీ చేతిలో నుంచి విడిపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలన్ని చేస్తోంది’. ఆ యువతి అదేదో.. ఉడుము పట్టులా.. గట్టిగా పట్టుకొని, ఒక చేతిలో జారీపోతే.. మరో చేతిలో మార్చి మరీ పట్టుకుంటోంది. అంతటితో ఆగకుండా, పామును పట్టుకున్న సంతోషంలో ఆ యువతి నవ్వుతూ.. స్థానికులు తీస్తున్న ఫోటోలకు ఫోజిచ్చింది. ఆమె పాములను పట్టుకుని ‘నాగేశ్వరీ స్నేక్ లవర్..అనే ’తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇంత ధైర్యమా తల్లి నీది..’ పాము ఎంత పెద్దదిగా ఉందో.. పాపం.. పాము వదిలించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది..‘ ఇంతకీ పాముని ఏంచేశారో చెప్పలేదు..‘దాని ప్రాణాలు కాపాడిన మీకు హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: కరోనా భయంతో స్వీట్ వద్దన్నాడు! కోపంతో నేలకేసికొట్టిన వధువు -
ముంబైలో భారీ వర్షాలు..సోషల్ మీడియాను ముంచెత్తుతున్న మీమ్స్..
ముంబై: మహారాష్ట్రలో రుతుపవనాల రాకతో ముంబై నగరంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరంలో నిన్నటి నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. కాగా ఈ నెల 9 నుంచి 13 వరకు ముంబైతో పాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. మరోవైపు తొలకరి జల్లులను ముంబై వాసులు ఎంజాయ్ చేస్తున్నారు. ముంబై వర్షాలపై నెటిజన్లు మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. ముంబైలో వర్షం ఒక గంటపాటు పడితే ఒకే గానీ..ఏకధాటిగా కురిస్తే మాత్రం అంతే సంగతులు..! అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. మరో నెటిజన్ ముంబై స్టైల్ క్రికెట్ అంటూ వర్షంలో క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. నగరంలో పడుతున్న భారీ వర్షాలకు ముంబైలో వాటర్ పార్క్‌లు వెలిశాయని ఓ నెటిజన్ వీడియోను పోస్ట్ చేశాడు. మరో నెటిజన్ అబ్బా..! ఈ సారి వాతావరణశాఖ వర్షాలపై ఇచ్చిన అంచనా నిజమైందని తెలిపాడు. ప్రస్తుతం ట్విటర్లో #Mumbairains ట్రెండింగ్‌లో ఉంది. దాంతో పాటుగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ ట్విటర్లో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ వర్షంలో ఫోటో దిగుతూ ఫోజ్ ఇచ్చాడు. #MumbaiRains Residents of Mumbai at the start of monsoon rain in city v/s when it keeps pouring for days! pic.twitter.com/yePyl7qe7f — Vishal Verma (@VishalVerma_9) June 9, 2021 Cricket, Mumbai style.#MumbaiRains pic.twitter.com/6FOD04nUrh — Kapil (@KapilKandhare) June 9, 2021 #MumbaiRains magica water park is now open in Mumbai #mumbairain pic.twitter.com/0OhmTAyr2W — MUMBAI (@Johnson95951064) June 9, 2021 చదవండి: ఎంత పని చేశావమ్మా... ఏనుగు! -
బహుశా ఈ పిల్లికి భయానికి మీనింగ్ తెలియదు అనుకుంటా ..!
మనలో చాలా మందికి పాములంటే సచ్చేంతా భయం. అవి మనకు కనిపించగానే వెన్నులో వణుకు పుడుతుంది. కాగా ఓ పిల్లి మాత్రం ఎలాంటి జంకు లేకుండా తీక్షణంగా పామునే చూసింది. దీంతో పాము మెరుపు వేగంతో పిల్లిపై దాడికి యత్నించగా.. పిల్లి రెప్పపాటు క్షణంలో దాడి నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ వీడియోను ఒడిశాకు చెందిన ఓ నెటిజన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లను ట్యాగ్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Heart trembling scene.@ParveenKaswan@susantananda3 pic.twitter.com/ikclMTjCN0 — 𝗥𝗮𝗯𝗶𝗻𝗱𝗿𝗮 𝗠𝗶𝘀𝗵𝗿𝗮🇮🇳 (@CMRabindra) June 7, 2021 -
పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. వైరల్ వీడియో
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వాలు అనేక ఆంక్షలను విధించాయి. ఈ నిబంధనలు వివాహాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా ఎంతో ఆడంబరంగా, బంధువులు, స్నేహితుల సమక్షంలో జరగాల్సిన వేడుక కాస్తా కొద్ది మంది సమక్షంలోనే జరుపుకోవాల్సి వస్తోంది. అయితే, లాక్ డౌన్ పుణ్యామా అని ఇటీవల జరిగిన అనేక పెళ్లిళ్లలో ఏదో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుండగా దానికి సంబంధించిన క్లిప్పింగ్‌లు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇక్కడ చెప్పుకునే పెళ్లి వేడుక కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ పెళ్లిలో వధువు, తన చేతిలో కొన్ని పువ్వులను పట్టుకుని స్టేజీ మీదకు ఎక్కి కాబోయే వరుడి ముందుకు వెళ్లి నిలుచుంది. సాధారణంగా ఆ పువ్వులను వరుడి తల మీద కానీ లేదా పాదాల మీద గానీ వేస్తుందనుకున్నారంతా! కానీ, అనూహ్యంగా ఆమె కోపంతో తన చేతిలోని పువ్వులను వరుడి ముఖం మీదకు విసిరి కొట్టింది. ఊహించని చర్యతో షాకైన వరుడు ఏంచేయాలో అర్థంకాక బిత్తర ముఖం పెట్టుకొని అలాగే నిల్చుండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఆ అమ్మాయికి పెళ్లంటే ఇష్టం లేదేమో’, ‘అయినా, ఇదేం ఆటిట్యూట్’, ‘ ఇంకా.. నయం వరుడిని కొట్టలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఒక వివాహంలో వరుడు వెరైటీగా వధువు కాళ్లకు దండం పెట్టగా, మరో వివాహంలో వధువు, వరుడు బాటిల్‌తో ఆడుకున్నారు. ఇంకో పెళ్లిలో కొత్త పెళ్లికూతురు ఏకంగా స్టేజీపై తుపాకీని కాల్చడం వంటి ఘటనలు కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే! చదవండి : పెళ్లిలో వధువు కాళ్లు మొక్కిన వరుడు.. ఎందుకో తెలుసా -
ఆనందయ్య మందు నేనూ ఇస్తా.. యువకుడి పోస్ట్
సాక్షి, మిర్యాలగూడ : కరోనాకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు తాను ఇస్తానని ఓ ఆకతాయి సోషల్ మీడియా గ్రూప్‌ల్లో చేసిన ప్రచారం హల్చల్ చేసింది. గురువారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని బాల్నెపల్లికి చెందిన ఆకతాయి కుర్ర రమేష్ తాను కరోనాకు ఆనందయ్య తరహా ఆయుర్వేద మందు ఇస్తానని వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టు వైరల్ అయ్యింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి కరోనా బాధితులు, వారి బంధువులు రమేష్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు సైతం రమేష్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించేందుకు రమేష్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామి ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. చదవండి: నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్ -
డర్టీ కామెంట్స్: చిక్కుల్లో రణ్‌దీప్ హుడా
ముంబై: కులాల్ని కించపరిచేలా కామెంట్లు చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. మున్మున్ దత్తా, యూవికా చౌదరి కామెంట్లపై రచ్చ.. ఆపై వాళ్లు దిగొచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో రణ్‌దీప్ హుడాను చేర్చారు నెటిజన్స్. బాలీవుడ్లో ఫైనెస్ట్ ఆర్టిస్ట్‌గా పేరున్న రణ్‌దీప్.. యూపీ మాజీ సీఎం మాయావతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. అయితే రణ్‌దీప్ ఆ కామెంట్లు చేసి చాలా కాలం అవుతుండడం విశేషం. డర్టీ కామెంట్లు గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌దీప్ హుడా.. యూపీ మాజీ సీఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘మీకిప్పుడు ఒక డర్టీ జోక్ చెప్పబోతున్నా’.. అంటూ.. మాయావతి వేషధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. రణ్‌దీప్ హుడా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెపాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక మాజీ మహిళా సీఎం, ఆమె సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ రణ్‌దీప్‌పై మండిపడుతున్నారు. ఆడవాళ్ల పట్ల అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వదలకూడదని చెబుతూ.. #ArrrestRandeepHooda హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రణ్‌దీప్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రణ్‌దీప్‌కు కులగజ్జి ఉందని, మానవత్వం లేనోడంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని సినిమాల్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రణ్‌దీప్ రియాక్ట్ కావాల్సి ఉంది. ఇక 2012లో మాయావతిపై అభ్యంతరకర ట్వీట్ చేసిన స్టాండప్ కమెడియన్ అభిష్ మాథ్యూ.. రీసెంట్గా నెటిజన్స్ ఆగ్రహంతో క్షమాపణలు చెప్పాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
వైరల్: దుస్తులు చించేసి, మరీ ఘోరంగా..
‘‘ఐదుగురు రాక్షసులు ఒక అమ్మాయిని దుస్తులు చించేసి.. శారీరకంగా హింసించారు. ఆపై వీడియోలు తీసి షేర్ చేశారు. హింసించిన వాళ్లలో ఒక మహిళ కూడా ఉంది’’.. మానవత్వం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘోరమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియలో దుమారం రేపుతోంది. అత్యాచార అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని, ఘటనకు కారకులైనవాళ్లను కఠినంగా శిక్షించాలని #justiceforloviassumi హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌ను కుదిపేస్తోంది. ఇందులో వాస్తవమెంత ఉందంటే.. జోధ్‌పూర్(రాజస్థాన్) : ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు ఉత్తర భారతాన్ని కుదిపేస్తోంది. నాగాలాండ్‌కు చెందిన లోవి.. జోధ్‌పూర్‌లో ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది. మే 23న తానుంటున్న గదిలో ఆమె ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ లోపు ఇంటర్నెట్లో ఒక వీడియో రిలీజ్ అయ్యింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియో అది. ఆ వీడియోను ఇంటర్నెట్లో ఉంచారు. కొందరు లోవీ అస్సుమీ ఉరికి వేలాడుతున్న ఫొటోలను, వేధింపుల వీడియోను, అందులోని స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవి అస్సుమీ అని, ఆ అవమాన భారం తట్టుకోలేకే ఆమె సూసైడ్ చేసుకుందని ప్రచారం మొదలైంది. దీంతో ఆమెకు న్యాయం జరగాలని సోషల్ మీడియా ఉద్యమిస్తోంది. వేర్వేరే ఘటనలు అయితే నాగాలాండ్ యువతి సూసైడ్‌కి, ఆ వీడియోలకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ అడిషినల్ డీజీపీ రాబిన్ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. అవి రెండు వేర్వేరు ఘటనలని, ఈమేరకు జోధ్‌పూర్ డీజీపీతో సంప్రదించి ధృవీకరించినట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్ యువతి సూసైడ్‌కి ముడిపెట్టి వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు, ఈ మేరకు దర్యాప్తు జరపాలని గుజరాత్, మిజోరాం, రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో కొందరు యూట్యూబర్లు ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మృగాల్ని శిక్షించాల్సిందే! అయితే ఘటనలో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే.. నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్బుక్లో ఒక ప్రకటన పోస్ట్ చేశారు. వీడియోలో ఐదుగురు ఉన్నారని, వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని తెలిపింది. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలిదు. కానీ, నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని అస్సాం పోలీసులు వెల్లడించారు. అయితే వీడియోల్లో ఆ గ్యాంగ్ ఇద్దరు అమ్మాయిలపై దాష్టీకానికి పాల్పడినట్లు గుర్తించామని కొందరు చెప్తున్నారు. -
Shanta Verma: వయసా? హహ్హా...
50 వచ్చేశాయి.. 60 వచ్చేశాయి.. బాబోయ్ 70 వచ్చేశాయి. ఉత్తరప్రదేశ్ శాంతా వర్మకు 76. ‘అప్పుడే ఏం వయసొచ్చిందనీ?’ అంటుందామె నవ్వుతూ. హాయిగా భర్తతో కలిసి వీడియోలు చేస్తుంది. నవ్వుతుంది. ఫ్యాషన్ దుస్తులు ధరిస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులతో 16000 మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. ‘కృష్ణా రామా అనుకునే వయసు’ అని ఎవరైనా అంటే ఆమెకు కోపం వస్తుంది. ‘ఈ స్టీరియోటైప్స్ను బద్దలు కొట్టండి. సంతోషంగా జీవించండి’ అంటుందామె. వయసును ఫీలవుతూ కుంగుబాటు తెచ్చుకునేవారు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 76 ఏళ్ల శాంతా వర్మ తన జీవితంలో ఎన్నో సుదీర్ఘమైన రోజులు, నెలలు, సంవత్సరాలు చూసి ఉంటుంది. కాని ఇప్పుడు ఆమె నిజంగా బతుకుతున్నది ‘30 సెకన్ల’లో. అవును. ఆమె చేసే 30 సెకన్ల వీడియోలు ఆమెను సంతోషంగా ఉంచుతున్నాయి. పాపులర్ చేస్తున్నాయి. అభిమానులను సంపాదించి పెడుతున్నాయి. వయసు గడిచిపోయింది అనుకుంటుంటారు కొందరు ఒక వయసు వచ్చాక. కాని శాంతా వర్మ వయసు మొదలైంది అనే భావనలో ఉంటారు. ఆమె ఇప్పుడు సోషల్ మీడియా సన్సెషన్. వీడియోల్లో ఆమె చీరలో సంప్రదాయంగా ఆమె దేవుని పటానికి దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన గదిలోకి రాగానే ఫోన్ అందుకుంటుంది. ఆ ఫోన్లో చూసిన ఫ్యాషన్ దుస్తులను మనకు చూపించి క్షణాల్లో వాటిలోకి మారిపోతుంది. మహా మహా మోడల్స్‌కు లేనంత గ్రేస్‌తో అంటే ఏమాత్రం ఎబ్బెట్టుగా లేకుండా వాటిలో కనిపిస్తుంది. మోడ్రన్ దుస్తుల్లో ఆమె అంత చక్కగా కనిపించడం నిజంగా విశేషం. మరో వీడియోలో హైహీల్స్ చెప్పుల డబ్బా విప్పుతుంది. ఒక హై హీల్‌ను ఎగరేస్తుంది. అంతే. విఠలాచార్య సినిమాలో లాగా ఆ హైహీల్స్‌తో వాటికి తగ్గ షర్ట్ అండ్ స్కర్ట్‌లో కుర్చీలో దర్జాగా కనిపిస్తుంది. మరో వీడియోలో మనవరాలితో కలిసి కోడి కూత పెట్టినట్టు పెడుతూ స్టెప్పులేస్తుంది. ‘ఇన్స్టాగ్రామ్’లో 30 సెకన్ల వీడియోలు పెట్టే వీలుంది. ‘రీల్స్’ అనే ఇన్స్టాగ్రామ్ ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాంటి 30 సెకన్ల వీడియోలతో శాంతా వర్మ పాపులర్ అయ్యింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ పేరు ‘మిస్టర్ అండ్ మిసెస్ వర్మ’. జీవిస్తున్న క్షణాలు శాంతా వర్మ సొంత ఊరు ఉత్తరప్రదేశ్‌లోని భోకర్హెడి అనే చిన్న పల్లెటూరు. 15 ఏళ్ల వయసులో యశ్పాల్ సింగ్‌తో పెళ్లయ్యింది. ‘ఆ తర్వాత నా జీవితం అంతా అత్తామామలను చూసుకోవడం, పిల్లలని పెంచడం, వంట చేయడం, ఇల్లు కట్టుకోవడంతోనే సరిపోయింది. స్త్రీలకు కలలు, ఆకాంక్షలు, సరదాలు, ముచ్చట్లు ఎన్నో ఉండొచ్చు. కాని వాటికి టైమ్ లేకుండానే జీవితం గడిచిపోతుంది. కాని జీవితాన్ని ఎప్పుడైనా మొదలెట్టొచ్చని నాకు ఇప్పుడు అనిపిస్తోంది’ అంటుంది శాంతా. 82 ఏళ్ల భర్తతో కలిసి హర్యానాలోని కల్క అనే చిన్న ఊళ్లో స్థిరపడిన శాంతా వర్మ అక్కడ తన కొడుకు, కోడలు, మనవరాలితో కలిసి జీవిస్తోంది. ‘గత సంవత్సరం లాక్డౌన్లో నా మనవరాలు జనిత నాకు ఇన్‌స్టాగ్రామ్‌ను పరిచయం చేసింది. ఇక అంతే. దానికి నేను అతుక్కుపోయాను’ అంటుంది శాంతా వర్మ. నిజానికి శాంతా వర్మ మనవరాలు జనిత తాతగారి కోసం ఇన్స్టాగ్రామ్ పేజీని మొదలెడదామనుకుంది. మొదలెట్టింది కూడా. ఎందుకంటే యశ్పాల్ సింగ్ మంచి జోకులు కట్ చేయగల సమర్థుడు. ఆయన మీద వీడియోలు షూట్ చేస్తుంటే శాంతా వర్మ వచ్చి తాను అంతకన్నా బాగా చేయగలనని చూపించింది. దాంతో ఇద్దరి మీదా వీడియోలు మొదలెట్టింది మనవరాలు. మెల్లగా శాంతావర్మ ప్రతిభ బయటికి వచ్చి ఆమెకు అభిమానులు పెరిగారు. ‘నేను మా ఆయన్ని సరదాగా విమర్శిస్తూ చేసే వీడియోలు నెటిజన్స్‌కు నచ్చుతున్నాయి. మగాళ్లను ఏదో ఒకటి అనాలని ఆడవాళ్లకు ఉంటుంది కదా’ అంటుంది శాంతా వర్మ. భర్త మీద వంక పెట్టి ఆమె మగవాళ్లలోని లోపాలను సరదాగా ఎద్దేవా చేస్తూ ఉంటుంది. 61 ఏళ్ల దాంపత్యం శాంతావర్మకు, యశ్పాల్ సింగ్‌కు పెళ్లయ్యి 61 ఏళ్లు. ‘ఇన్ని సంవత్సరాలలో మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు’ అంటుంది శాంతా వర్మ పెళ్లయిన కొత్తల్లో బుల్లెట్ నడపాలని తాను అనుకుంటే భర్త నేర్పడానికి ప్రయత్నించే ఫొటోను చూపెడుతూ. ఆమె భర్త అందుకుంటూ ‘ఆమె ఈ వీడియోలు చేసి తన ప్రతిభను చూపడం మొదలెట్టాక ఉదయాన్నే నా మార్నింగ్ వాక్ అయ్యాక మా ఇంటి తోటలోని పూలను కోసి ఆమెకు బొకేలా అందించడం తప్పక చేస్తున్నాను. ఆమె సిగ్గుపడుతుంది గాని నేను చేయగల పని అదే’ అంటాడు. భార్యకు పూలు అప్పుడప్పుడన్నా కానుక గా ఇద్దాం అనుకునే వయసులో ఉన్న భర్తలు తక్కువ. కాని యశ్పాల్ తన ప్రేమ ప్రకటనకు వయసు లేదు అనుకుంటున్నాడు. 16000 మంది అభిమానులు శాంతా వర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 16 వేల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఒక నానమ్మ తన భర్తతో కలిసి ఉత్సాహంగా జీవించడం వారిలో స్ఫూర్తి నింపుతోంది. మంచి మంచి బట్టల్లో వీడియోలు చేస్తూ బోర్డమ్ను నిర్లిప్తతను నిస్సత్తువను వాళ్లు వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటే సంతోషపడుతున్నారు. శరీరం ఏ మంచి ప్రకటనకు అయినా సిద్ధంగా ఉంటుంది. మనసులో జీవం ఉండాలి. ఆ జీవాన్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తే బతుకంతా పాటలాగా సాగిపోతుందని నిరూపిస్తోంది శాంతా వర్మ. – సాక్షి ఫ్యామిలీ -
వైరల్ తూకిత్తా .. మైకిత్తా.. అంటున్న చేపలు
సముద్ర జలాలపై హక్కుల కోసం ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి. .. కావేరి నదీ జలాల వినియోగం విషయంలో తమిళనాడు, కర్నాటకలు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి. ఆఖరికి మంచినీటి కొళాయి దగ్గర కుమ్ములాటలు మనందరికీ సుపరిచితమే. రెండు వర్గాల మధ్య క్షణాల్లో మంటలు పుట్టించగల శక్తి నీటి సొంతం. ఆ శక్తి ఎలాంటిదంటే నిత్యం నీటిలో ఉండే చేపలు సైతం గొడవలు పెట్టుకునేంత. రెండు సముద్రపు చేపలు ఒకదానిపై మరొకటి దుమ్ముత్తి పోసుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బయటి ప్రపంచంలో నీరు లేక గొడవలు జరుగుతుంటే నీటిలో ఉండి కూడా చేపలు పౌరుషంగా పొట్లాటకు దిగడం చూపరులను ఆకట్టుకుంటోంది Arguing on Twitter.. 😅 pic.twitter.com/0656I4ephJ — Buitengebieden (@buitengebieden_) May 24, 2021 -
Viral Video: గొర్రెకు మసాజ్ చేస్తున్న పిల్లి
పిల్లి ఏం చేసినా క్యూట్‌గా ఉంటుందంటారు క్యాట్ లవర్స్. కానీ దొంగలా పాలు తాగి ఏమీ ఎరగనట్టు నటించే ఆ మూగజీవిని చూస్తే చిర్రెత్తిపోతారు మరికొందరు. అయితే ఇక్కడ మాత్రం ఓ పిల్లి ఎలాంటి దొంగ వేషాలు వేయకుండా ఓ గొర్రెకు మసాజ్ చేసి నిద్ర పుచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో గొర్రె , పిల్లి మంచి ఫ్రెండ్స్‌గా మారాయి. గొర్రె కింద పడుకుంటే పిల్లి దాని వీపు మీద ఎక్కింది. ఏదో పరుపుపై పడుకున్నట్లుగా హయిగా అక్కడే సెటిలైంది. అంతటితో ఆగకుండా అది గొర్రెకు మసాజ్ చేయడం మొదలు పెట్టింది. పిల్లి తన రెండు కాళ్లతో గొర్రెను పైకి కిందకు నొక్కుతుంటే అది హాయిగా పడుకుంది. నిండుగా ఉన్న గొర్రె బూరులో పిల్లి తల దూర్చి మరీ పడుకుంది. ఇంత జరుగుతున్నా గొర్రె మాత్రం ఎటూ కదలకుండా నిద్రలో మునిగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'పిల్లి ఎంత బాగా మసాజ్ చేస్తుంది', 'గొర్రె అలసిపోయిందేమో.. కనీసం లేవడం లేదు', 'అది పిల్లి చేస్తున్న మసాజ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లుంది', 'పిల్లి మాకు కూడా మసాజ్ చేస్తుందా..' అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
కుళ్లిన మాంసంతో కిక్కు ఏంటి రా బాబు..!
పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి. ఈ సామెత ప్రపంచంలో ఉండే మానవుల అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కొక్కరికి ఒక్కొ విధంగా ఉంటాయని తెలియజేసే సందర్భంలో ఈ సామెత వాడతారు. అంతేందుకు మన చుట్టూ ఉన్నవారు రకరకాల అభిరుచులను కలిగి ఉంటారు. వారి ఆహారపు అలవాట్లు కూడా వింతగా ఉంటాయి. కొంతమంది తమనీ తాము మర్చిపోవడానికి మద్యం, గంజాయిని ఎక్కువగా సేవిస్తుంటారు. అది వారికి ఒక వ్యసనంలా తయారవుతుంది. ఇంతకుముందు చెప్పిన సామెత ప్రకారం ఒక్కొక్కరు, ఒక్కొ విధంగా చెడు అలవాట్లను అలవర్చుకుంటారు. తాజాగా మత్తు బాగా రావడం కోసం ఓ వ్యక్తి చేసిన వింత ప్రయత్నానికి సంబంధించి ఇంటర్నెట్లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం బాగా వైరలయ్యింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే కుళ్లిన మాంసం. ఔను మీరు విన్నది నిజమే...! కుళ్లిన మాంసాన్ని తిని సదరు వ్యక్తి మత్తులో ఊగిపోతున్నాడు. ఈ విషయాన్ని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కుళ్లిన మాంసం తింటే మత్తులో ఊగిపోవచ్చునని తన స్నేహితుడు చెప్పిన వెంటనే, ఆచరించాడు. అంతేకాకుండా కుళ్లిన మాంసాన్ని తినడం ద్వారా తనకి ఏం జరగలేదనే విషయాన్ని కూడా ఇతరులతో పంచుకున్నాడు. ఇంకా ఈ కుళ్లిన మాంసం ఎంతో రుచిగా ఉందని తెలిపాడు. ఈ విషయాన్ని 2017లోనే కుళ్లిన మాంసంతో కిక్కు వస్తుందని ఓ యూట్యూబర్ ఒక వీడియోలో తెలిపాడు. ఇలాంటి కుళ్లిన మాంసం తినడంతో ఆరోగ్యరీత్యా ఇబ్బందులకు గురవుతారని వైద్య నిపుణులు వెల్లడించారు. కుళ్లిన మాంసం కొన్ని సార్లు విష పదార్థంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. అసలు కుళ్లిన మాంసం జోలికి పోకుండా ఉండటమే మంచిదని వైద్యులు చెప్తున్నారు చదవండి: వైరల్: ఓ పక్క ఆక్సిజన్ పీలుస్తూ, మరోపక్క గుప్పుమంటూ సిగరెట్ -
‘అమ్మ.. మాస్క్ రెండూ కాపాడేవే’
ముంబై: దేశవ్యాప్తంగా కరోనావైరస్ చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వారాంతపు కర్ఫ్యూలు, కఠినమైన నిబంధనలను విధిస్తున్నాయి. కాగా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ముంబై పోలీసులు సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సోషల్ మీడియాలో మాస్క్‌కు ఉన్న ప్రాముఖ్యం తెలియజేస్తూ ఓ ఫొటో విడుదల చేశారు. మాస్క్, అమ్మను రెండింటి మధ్య పోలికలు ఏమిటో తెలుసా అంటూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అమ్మ మనకు జన్మనించి నవమాసాలు మోసి, తన పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూస్తుంది. అలాగే ప్రతి ఒకరు విధిగా మాస్క్ ధరిస్తే అది కూడా మనల్ని కరోనా వైరస్ నుంచి కాపాడుతుందనే సందేశం ఆ ఫొటో ద్వారా తెలిపారు. కాగా ఆ ఫొటోలో ‘మా’ అనే హిందీ పదానికి ఎస్కే అక్షరాలను జోడించి మాస్క్ అని అర్ధం వచ్చేలా చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముంబై పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. What do moms and masks have in common?#TakingOnCorona pic.twitter.com/lHRFZCzaiL — Mumbai Police (@MumbaiPolice) April 19, 2021 చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! -
ఇలాంటి లడ్డు నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్!
న్యూఢిల్లీ: మ్యాగీ ఈ పేరు తలుచుకోగానే ప్రతి ఒక్కరి నోట్లో నీరు ఊరుతాయి. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీకి పట్టే సమయం కూడా చాలా తక్కువ. ఇది ఇన్స్టాంట్ మ్యాగీగా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీని ప్యాకింగ్ చేసేటేప్పుడే అన్ని రకాల పదార్ధాలతో కలిసి ఉంటుంది. దీన్ని వేడినీళ్లలో వేయగానే.. మంచి రుచికరమైన మ్యాగీ క్షణాల్లో మన ముందుంటుంది. అయితే, కొంతమంది మాత్రం ట్రెండ్‌ను ఫాలో కాకుండా సెట్ చేశారు. మ్యాగీతో లడ్డు చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నారో.. ఏమో గానీ.. వెంటనే వారి ఆలోచనను అమలు చేసేశారు. మ్యాగీతో లడ్డు ప్రయోగం చేశారు. ఇంతటితో ఆగకుండా దానిపై అందంగా కాజునికూడా ఉంచారు. ఇప్పుడు, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వావ్.. దీన్ని చూస్తే నోటిలో నీరు ఊరుతోంది.. ఎలా తయారు చేశారంటూ’.. సరదాగా కామెంట్లు పెడుతున్నారు. -
ఈ వ్యక్తి పందెం కోసం ఏకంగా పాములతో...
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పాలి. మొన్నటి వరకు ఐస్ బకెట్ ఛాలెంజ్, ఫ్లిప్ ఛాలెంజ్‌లంటూ రకరకాల పేర్లతో ఇవి సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇందులో కొన్ని సెలబ్రిటీలను సైతం ఆకట్టుకొని వారిని కూడా పాల్గొనేలా చేశాయి. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడం, ఇలాంటి ఛాలెంజ్‌లు నెటిజన్లను ఆకట్టుకోవడంతో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా మరో కొత్త ఛాలెంజ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే, ఈ ఛాలెంజ్‌లో డబ్బులు కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఛాలెంజ్ అంత సులువని మాత్రం అనుకోకండి. ఛాలెంజ్‌లో పాల్గొంటే..మనీ మీ సొంతం చాలెంజ్ ఏమనగా.. పాములతో ఉన్న ఓ బాత్ టబ్‌లో 30 సెకండ్లు గడిపితే ఏకంగా రూ.7 లక్షలను బహుమతిగా అందిస్తున్నాడు ఈ ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. ఇదొక్కటే కాదండోయ్ ఈ లిస్ట్‌లో మరిన్ని మన కోసం ఉన్నాయి. ఒక గాజు బాక్సులో డబ్బులను పెట్టి అందులో పెద్ద సైజు బొద్దింకలను వేశాడు. వాటిని తాకకుండా ఎంత డబ్బు తీసుకుంటే అంత మనదేనంటూ మరో ఛాలెంజ్ విసిరాడు. సాలీడులను శరీరంపై పారించడం, భరించలేని వాసన వస్తున్న కుళ్లి పోయిన కాయగూరల టబ్‌లో పడుకోవడం లాంటి చిత్ర విచిత్రమైన ఛాలెంజ్‌లతో యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడమే కాకుండా, ఏకంగా రెండు కోట్లకుపైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. టై చేయాలనుకునే వారు చేయండి. పాములంటే భయపడే వాళ్లు మాత్రం ఈ ఛాలెంజ్‌కు జర దూరంగా ఉండండి. ( చదవండి: ఈ సెక్యూరిటీ గార్డ్ పని చూస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే! ) -
వినూత్న ప్రచారం: ఇది మీరు కూడా చేయగలరు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రను గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అనేక జిల్లాలు, నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. గత వారం రోజుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా కరోనా సోకింది. మరోవైపు పుణేలో మినీ లాక్డౌన్ ప్రకటించారు. శనివారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదు. పుణె మున్సిపల్ కార్పొరేషన్లో శనివారం ఒక్కరోజే 5,778 కరోనా కేసులు నమోదు కాగా 37 మంది మృతి చెందారు. ఈనేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తేవడానికి పుణె పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా బారినపడకుండా అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. కాగా, కొంత మంది ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడానికి నిరాకరిస్తున్నారు. అలాంటివారిని ఉద్దేశించి పుణే పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ‘మాస్క్ పెట్టుకోవడం చిరాకుగా ఉంది. అసలు మాస్క్ ను అసలు ధరించలేను’ అంటూ చెప్పే వారి కోసమే ఈ వీడియో అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. దివ్యాంగులు మాస్క్ పెట్టుకోవడానికి లేని ఇబ్బంది సాధారణ ప్రజలకు ఏంటి? మాస్క్ ను ఎల్లప్పుడూ ధరించాలని, బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలనేది వీడియో సారాంశం. ‘It’s feels so hot, can’t wear this mask’ - If you have used these words recently, then this video is for YOU.#WearAMask #COVIDSecondWave #coronavirus pic.twitter.com/9qKjXPCvLw — PUNE POLICE (@PuneCityPolice) April 4, 2021 చదవండి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ -
ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్
బ్యాంకాక్: వ్యాపారాల్లోకి ఈ-కామర్స్ రంగ ప్రవేశంతో వస్తువుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులు ఈ కామర్స్‌పైనే ఆధారపడి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అమ్మకాలు ఎంత గణనీయంగా పెరిగాయో అంతే సంఖ్యలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. ఒక వస్తువు తక్కువ ధర వస్తూంటే ముందు వెనుకా ఆలోచించకుండా వెంటనే ఆర్డర్ చేసి మోసపోయే సంఘటనలు కూడా పెరిగాయి. వినియోగదారులు అత్యాశ, నిర్లక్ష్యం ఈ ఇలాంటి మోసాలకు పెట్టుబడి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి థాయిలాండ్‌లో వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా విలాసానికి మారు పేరైన ఐఫోన్అంటే మరీ మోజు ఎక్కువ. ఈ ఉత్సాహంతోనే మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకు ఐఫోన్న వస్తోందని ఒక పిల్లాడు పప్పులో కాలువేశాడు. థాయ్‌లాండ్‌కు చెందిన టీనేజర్ తక్కువ ధరకే ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు. వెంటనే ఆర్డర్ చేశాడు. ఐఫోన్ ఎప్పుడొస్తుందా! అని కళ్లల్లో వత్తులు వేసుకొని, ఎదురుచూస్తూ ఉన్నాడు. చేసిన ఆర్డర్ రానే వచ్చింది. సాధారణంగా అయితే స్మార్ట్‌ఫోన్ పార్శిల్ చిన్నగా ఉంటుంది. కానీ తనకొచ్చిన భారీ పార్శిల్ చూసి నిర్ఘాంతపోయాడు. పార్శిల్ ఓపెన్ చేసిన అతగాడికి దిమ్మదిరిగా మైండ్ బ్లాక్ అయింది. విషయం ఏమిటంటే..ఐఫోన్ కు బదులు ఐఫోన్ ఆకారంలో ఒక కాఫీ టేబుల్ వచ్చింది. తీరిగ్గా విషయాన్ని పరిశీలించాక జరిగిన మోసం అర్థం అయింది ఇ-కామర్స్ సంస్థ ప్రకటనలోని వివరాలన్నీ సరిగ్గా చూసుకోకుండా ఆర్డర్ చేసి మోస పోయానని గుర్తించాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదీ సంగతి..ఫ్రీ, డిస్కౌంట్లు లాంటి ఆఫర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. లేదంటే ఇలాంటి షాక్‌లు తప్పవు. తస్మాత్ జాగ్రత్త! చదవండి: పోలీస్ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు -
సెక్స్‌డాల్‌తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు!
కజకిస్థాన్: అతడొక మంచి బాడీబిల్డర్..అందగాడు. అతని కోసం అందమైన అమ్మాయిలు క్యూలో నిలుచుంటారు. కానీ అతను మాత్రం.. ఒక సెక్స్టాయ్ మీద మనసు పడ్డాడు. అంతేకాకుండా, దాన్ని పెళ్లి కూడా చేసుకున్నాడు. 8 నెలలకే విడాకులు కూడా ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కజకిస్థాన్‌కు చెందిన యూరి టోలోచ్కో ‘మార్గో ’ అనే సెక్స్‌టాయ్‌ను వివాహం చేసుకున్నాడు. దీన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత నిజమైన భార్యభర్తల మాదిరిగానే మాఇద్దరికి పడట్లేదని మరొసారి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. క్రిస్టమస్‌కి ముందు తన టాయ్ కిందపడి విరిగిపోయింది. అయితే, టాయ్‌ను బాగుచేయడానికి స్టోర్‌కి పంపానని తెలిపాడు. ఈ క్రమంలో టోలోచ్కో ‘లోలా’ అనే మరొక టాయ్‌తో ప్రేమలో పడ్డానని తెలిపాడు. లోలా చాలా నాజుకుగా, అచ్చం అమ్మాయిలాంటి శరీరాన్ని కల్గిఉందని తెలిపాడు. టోలోచ్కో 8 నెలల తర్వాత తన ‘మార్గోటాయ్’కు డైవర్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, టోలోచ్కో సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు తన కొత్తటాయ్ను పరిచయం చేశాడు. దీనిపేరు ‘లోలా’ అని.. తొందర్లోనే ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని పోస్ట్ చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం..‘సెక్స్టాయ్తో పడక సుఖం మాత్రమే...కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది’.. ‘ఇదేం వింతరా బాబోయ్’ అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భర్తను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య! -
ఏది వాస్తవం.. ఏది కాదు.. ప్రజలకు తెలియాలి
సాక్షి, అమరావతి: వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించే హక్కు ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ‘ఏపీ ఫ్యాక్ట్ చెక్’ ఏపీ ప్రభుత్వం తరఫున వేదికగా నిలవాలని సూచించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్, ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీడియాలో, సోషల్ మీడియాలో కొందరు దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం ఆధారాలతో ఖండిస్తుందన్నారు. ‘జరుగుతున్న ప్రచారం ఎలా తప్పో సాక్ష్యాధారాలతో చూపిస్తారు. నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తారు. ఇదీ ఏపీ ఫ్యాక్ట్ చెక్ ముఖ్య ఉద్దేశం. దురుద్దేశ పూర్వక ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రచారం తొలుత ఎక్కడి నుంచి మొదలైందో గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశ పూర్వకంగా దెబ్బ తీసే హక్కు ఏ ఒక్కరికీ లేదు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించే హక్కు ఎవ్వరికీ లేదు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించే పనులు ఎవరూ చేయకూడదు’ అని సీఎం చెప్పారు. దురుద్దేశ ప్రచారానికి చెక్ పెట్టాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారన్నారు. ఆలయాల్లో ఘటనలకు సంబంధించిన కేసుల్లో టీడీపీ వాళ్ల ప్రమేయాన్ని విచారణలో నిర్ధారించారని, ఇలాంటి వాటికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని పేర్కొన్నారు. వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వ్యవస్థకు మేలు జరిగేలా ఫ్యాక్ట్ చెక్ పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జి.వి.డి కృష్ణమోహన్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, డీఐజీ (టెక్నికల్ సరీ్వసెస్) జి.పాలరాజు, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆ హక్కు ఎవరికీ లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్, ట్విట్టర్ అకౌంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియాలో, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికలుగా ప్రభుత్వం ఖండిస్తుందన్నారు. నడుస్తున్న ప్రచారం ఎలా తప్పో సాక్ష్యాధారాలతో చూపిస్తారు. నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తారు. ఏపీ ఫ్యాక్ట్‌చెక్ ముఖ్య ఉద్దేశం ఇదేనని సీఎం పేర్కొన్నారు. దురుద్దేశపూర్వక ప్రచారంమీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదు. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. చదవండి: హైకోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ.. చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం -
వైరల్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు 5 లీటర్ల పెట్రోల్!
భోపాల్: పెట్రోధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. కొన్నిరాష్టాల్లో పెట్రోధరలు ఇప్పటికే సెంచరీ దాటేయగా, మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువలో ఉన్నాయి. డీజీల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తమదైన శైలీలో వ్యంగ్యంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కాగా, ఇటీవల భోపాల్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్.. పెట్రోల్ ధరల సమస్యను ప్రత్యేకమైన రీతిలో హైలైట్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్‌కు 5 లీటర్ల పెట్రో క్యాన్‌ను నిర్వాహకులు బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, సలావుద్దీన్ అబ్బసీ ఈ పెట్రో అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ భోపాల్ కాంగ్రెస్ నాయకుడు మనోజ్‌శుక్లా ఆధ్వర్యంలో జరిగింది. అయితే, ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ ముందు నిలబడి పెట్రోల్ రేటు సెంచరి కొట్టేసిందోచ్ అంటూ తన నిరసనను బ్యాట్ పైకెత్తి మరీ చూపించాడు.. కాగా, కరూర్ జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ యజమాని తిరుక్కురుల్ పద్యాలను తప్పులు లేకుండా చదివిన విద్యార్థులకు 1 లీటర్ పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పెట్రో బేజారు..సైకిల్ షి‘కారు’ -
చిరుత పులి..మెరుపు వేగానికి కేరాఫ్ అడ్రస్
-
వైరల్: దమ్ముంటే పులికి ఎదురుపడు!
కోల్‌కత: సాదారణంగా పులిని మనం జంతు ప్రదర్శనశాలలో దూరం నుంచి చూస్తాం. అదిగానీ గాండ్రించిందా భయపడ్డం ఖాయం. బయట ఎక్కడైనా పొరపాటున కనిపించినా ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెడతాం. అటువంటిది ఓ ఇద్దరు యువకులు మాత్రం నది దాటుతున్న పులిని వెంబడించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ అడవుల్లో జరిగింది. సుందర్బన్ అడవుల్లో ఎక్కువ సంఖ్యలో పులులు కనిపిస్తుంటాయి. అయితే ఒక నది దాటుతున్న పులిని అక్కడే ఉన్న యువకులు మర పడవలో బాగ్ బాగ్ (పరుగెత్తు) అని అరస్తూ దాన్ని వెంబడించారు. ఇక కుర్రాళ్ల అరుపులతో పులి వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది.(చదవండి: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!) అయితే ఈ దృశ్యాలను సదరు యువకులు తమ సెల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో యువకుల వెర్రి పనిపై విమర్శలు వస్తున్నాయి. చావు కొనితెచ్చుకోవడం అంటే ఇదే అంటు కామెంట్లు చేస్తున్నారు. అడవుల్లోనూ జంతువులకు స్వేచ్ఛ లేదని అంటున్నారు. పులిని నీటి కాదు రా.. దమ్ముంటే నేలపై వెంబడించు. తిక్క మరీ ఎక్కువైతే ఎదురుపడు అని మరికొందరు చాలెంజ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారి రమేష్ పాండే ఈ వీడియోను షేర్ చేస్తూ.. పులితో కుర్రాళ్ల పిచ్చి పని చూడండి. వీళ్లకు ఈ ‘సాహసం’ అవసరమా అని క్యాప్షన్ జత చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఫేస్‌బుక్‌కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్
తాజా వాట్సాప్-ఫేస్బుక్ డేటా షేరింగ్ వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రజలు కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి ప్రైవసీ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు యూజర్ల యాక్టీవీటి మీద నిఘా పెంచడంతో చాలా మంది యూజర్లు ఇతర యాప్ ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యుఎస్ ఆధారిత సోషల్ నెట్వర్క్ "మీవే" గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన సోషల్ యాప్‌గా నిలిచింది. కేవలం ఒక్క వారంలోనే 2.5 మిలియన్లకు పైగా యూజర్లు దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు.(చదవండి: 'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్‌పే) 2016లో ప్రారంభించినప్పటి నుంచి 2020 అక్టోబర్ వరకు ఈ సోషల్ నెట్వర్క్ యాప్ ను తొమ్మిది మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం 15.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. "మీవే" ఇప్పుడు 20 భాషలకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం హాంకాంగ్‌లో నెం.1సోషల్ యాప్ గా "మీవే" కొనసాగుతుంది. కంపెనీ తెలిపిన వివరాలు ప్రకారం యూజర్ల డేటాను గౌరవించే సోషల్ నెట్‌వర్క్‌ను నిలిచినందున దీనిని చాలా మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇది సోషల్ నెట్వర్క్ యాడ్ ఫ్రీగా కొనసాగనుంది. 2021 జనవరి 15నాటికి ప్రపంచంలోనే గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ పరంగా నెం.3గా.. సోషల్ మీడియా డౌన్లోడ్ పరంగా నెం.1గానూ కొనసాగుతుంది. ఇప్పటివరకు వాట్సాప్ కు పోటీగా సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లు ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటికీ ప్రత్యామ్నాయంగా "మీవే" యాప్ నిలిచింది. యాడ్ ఫ్రీగా కొనసాగుతుండటంతో ఎక్కువ మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎక్స్ ట్రా ఫీచర్లతో ప్రీమియం మోడల్స్ ను మించిపోయేలా ఉంది. -
ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. సుబ్బరంగా మెక్కాడు
లండన్: ఫుడ్ డెలివరీ బాయ్‌ల నిర్వాకాలకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు వచ్చాయి. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్‌ని మార్గమధ్యలోనే ఒపెన్ చేసి తినడం వంటి వార్తలు గతంలో చాలా చూశాం. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసి.. వారు బుక్ చేసుకున్న ఆహారాన్ని తాను తినేశాడు. అది కూడా ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్ ఇంటి బయటనే కూర్చుని దర్జగా లాగించేశాడు. సదరు కస్టమర్ డెలివరీ బాయ్ చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. వివరాలు.. లండన్ కెంటిష్ టౌన్లో నివాసం ఉంటున్న మహిళ స్థానిక మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇక దాన్ని ట్రాక్ చేస్తుండగా.. ఇంటి దాక వచ్చిన ఆర్డర్ సడెన్‌గా క్యాన్సిల్ అయ్యింది. తన ప్రమేయం లేకుండా ఆర్డర్ ఎలా క్యాన్సిల్ అయ్యిందని ఆలోచిస్తుండగా.. తన ఇంటి బయట మెక్‌డొనాల్డ్స్ డెలివరీ బాయ్ కూర్చుని.. ఫుడ్‌ని ఒపెన్ చేయడం చూసింది. (చదవండి: వూహాన్లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్) అనుమానంతో తనకు పంపిన డెలివరీ బాయ్ నంబర్‌కు కాల్ చేయగా.. తన ఇంటి బయట ఉన్న వ్యక్తి ఫోన్ రింగవ్వటం.. అతడు కట్ చేయడం ఆమె గమనించింది. ఆ తర్వాత సదరు డెలివరీ బాయ్ అక్కడే ఇంటి బయట కూర్చుని ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్‌ని సుబ్బరంగా లాగించేశాడు. ఈ తతంగం మొత్తాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోది. ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మా ఆహారం, సేవలతో కస్టమర్లు మనసు గెలుచుకోవాలనేది మా లక్ష్యం. ఇక ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే.. మాకు తెలియజేయండి. ఇలాంటి వాటిని మేం అస్సలు సహించం. ఇక ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
‘నాకు సిగ్గేస్తుంది.. ఫోటోలు తీయొద్దని చెప్పు’
చెన్నై: మనుషులు ప్రైవసీకే విలువ ఇవ్వం.. ఇక జంతువుల ప్రైవసీని పట్టించుకుంటామా.. లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడంటే అప్పుడు విపరీతంగా ఫోటోలు తీయడం సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఇదే పని చాలామందికి. ఇక జంతువులను ఫోటోలు, వీడియోలు తీయడం కొందరికి చాలా సరదా. వాటికి ఇబ్బంది కలగనంతవరకు ఓకే. కానీ చిరాకు అనిపించింది అనుకోండి.. అప్పుడు మన ఫోటో గొడెక్కుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఫోటోలంటే సిగ్గుపడే ఆ ఏనుగు తనను ఫోటోలు తీయొద్దని చెప్పమంటూ మావటి దగ్గరకి వెళ్లి ఎంతో ముద్దుగా చెప్తుంది. ఆ వ్యక్తి ఏనుగును కన్విన్స్ చేసి.. ఫోటోలు దిగడానికి ఒప్పిస్తాడు. ప్రసుత్తం వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (చదవండి: గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి) ఆ వివరాలు.. ఈ వీడియో తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయంలో తీశారు. ఇక దీనిలో కనిపించేది ఆండాల్ అనే ఆడ ఏనుగు. ఇక వీడియోలో ఓ గుమ్మంలో మావటి కూర్చుని ఉంటాడు. ఏనుగు అతడి దగ్గరకు వెళ్లి తన భాషలో మావటితో ‘ఫోటోలు తీయొద్దని చెప్పు.. నాకు సిగ్గేస్తుంది’ అని చెప్తుంది. అతడు ఏనుగు తొండాన్ని కౌగిలించుకుని.. ‘పర్లేదు.. వాళ్లు నీతో ఫోటో దిగాలని ఆశపడుతున్నారు. వెళ్లి దిగు’ అంటూ నచ్చజెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక మావటి అడిగిన ప్రశ్నలకు ఏనుగు తల ఊపుతూ సమాధానాలు ఇవ్వడం వీడియోలో హైలెట్. ఏనుగు-మావటిల మధ్య జరిగిన సంభాషణ తీరు చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఎంత ముద్దుగా మాట్లాడుతుందో.. భాష తెలియకపోతనేం.. భావం అర్థం అవుతుంది కదా’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
నా కొడుకు వస్తే సర్వనాశనమే: ట్రంప్ తల్లి
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు మూటగట్టుకోనంత అపఖ్యాతిని డొనాల్డ్ ట్రంప్ మూటగట్టుకున్నారు. ఆయన చేష్టలు, నిర్ణయాలతో విమర్శల పాలయ్యారు. ఇక తాజాగా అధ్యక్ష ఎన్నికల ఓటమి తర్వాత ట్రంప్ తీరు మరి దారుణంగా తయారయ్యింది. ఇక క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఆయన ప్రతిష్ట మరింత దిగజారింది. ట్రంప్ వైఖరిని అన్ని దేశాల అధినేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సంబంధించిన ఓ పాత వార్త క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వారు ట్రంప్ గురించి ఆయన తల్లి సరిగ్గా అంచనా వేశారు.. ఆమె జోస్యం నిజమయ్యింది అంటున్నారు. ఇంతకు ఆ పేపర్ క్లిప్పింగ్‌లో ఏం ఉంది అంటే ట్రంప్‌ని ఉద్దేశించి ఆయన తల్లి మేరీ అన్నే మాక్లియోడ్ ట్రంప్ ‘నా కుమారుడు ఓ ఇడియట్.. ఒప్పుకుంటాను. తనకు కామన్సెన్స్ శూన్యం. సామాజిక అంశాలు, బాధ్యత అస్సలే తెలియదు. కానీ తను నా కుమారుడు. తను రాజకీయాల్లోకి రాడని నా విశ్వాసం. ఒకవేళ అదే నిజమయ్యి.. తను పాలిటిక్స్‌లోకి వస్తే ఇక సర్వనాశనమే’ అని ఉన్న ఈ పేపర్ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక ‘బిడ్డ గురించి తల్లికే బాగా తెలుస్తుంది.. ట్రంప్ గురించి ఎంత బాగా అంచనా వేశారో’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్: ట్రంప్) ఆ క్లిప్పింగ్ ఫేక్: రాయిటర్స్ అయితే ఈ పేపర్ క్లిప్పింగ్ గతేడాది ఏప్రిల్‌లో తొలిసారి సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో రాయిటర్స్ ఇది నిజమా, కాదా తెలుసుకునే ప్రయత్నం చేసింది. చివరకు ఈ పేపర్ క్లిప్పింగ్ ఫేక్ అని.. ట్రంప్ గురించి అతడి తల్లి అన్నే మేరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడా రికార్డవ్వ లేదని వెల్లడించింది. ఈ ఫోటోపై కనీసం తేదీ, మూలాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫేక్ అనే స్పష్టం చేసింది. ఈ క్లిప్పింగ్ ఫేక్ అయినప్పటికి ట్రంప్ మాత్రం అమెరికా ప్రతిష్టని సర్వనాశనం చేశాడని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. -
విద్వేషకారులను వదలొద్దు.. కఠినంగా శిక్షించాలి
రాజకీయ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు జరుగుతున్నాయి. ఎవరూ లేని ప్రదేశాల్లో, అర్ధరాత్రి పూట, అందరూ పడుకున్నాక, తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లోని గుడులపై దాడులు చేస్తున్నారు. వాటిలోని విగ్రహాలను పగలగొడుతున్నారు. ఆ మర్నాడు వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి మీడియా సంస్థలు వాటిని అదే పనిగా ప్రసారం చేస్తున్నాయి. దాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. విగ్రహాల విధ్వంసం ఘటనలను లోతుగా దర్యాప్తు చేయండి. ఆ ఘటనలకు బాధ్యులైన వారెవరో అందరికీ తెలిసేలా ప్రదర్శించండి. ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అన్యాయమైన పనులు చేసే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్న సందేశం స్పష్టంగా ఇవ్వాలి. వారి పట్ల కఠినాతికఠినంగా వ్యవహరించాలి. సాక్షి, అమరావతి: కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతూ, విగ్రహాలను ధ్వంసం చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయొద్దని, ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవైనా ఘటనలు జరిగితే ఖండించాలని, మత సామరస్యం కోసం పాటుపడే వారికి సహకరించాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆదేశించారు. విగ్రహాలను ధ్వంసం చేసే పనులను చేపడితే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలని పునరుద్ఘాటించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన స్పందన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు ► సోమవారం పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడాను. మనం డీల్ చేయాల్సిన పరిస్థితుల గురించి కూడా వివరంగా మాట్లాడాను. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ జరుగుతోంది. ఇది చాలా కొత్త అంశం. ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు పట్టుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పోయి కొత్త ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ► ఇంటింటికీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. జీర్ణించుకోలేక, తట్టుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలందుతున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక, అలాంటి పనులకు ఒడిగడుతున్నారు. ► దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టాలి. కఠినంగా వ్యవహరించాలి ► వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఇప్పటికే గుళ్లలో 36 వేల సీసీ కెమెరాలు పెట్టాం. ఆ విధంగా గుడులు, గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. నిజానికి గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ► ఈ రాజకీయ గెరిల్లా వార్ ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు ప్రచారం కావాలి. మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు పెంచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. -
ఇది రాజకీయ గెరిల్లా యుద్ధం
సాక్షి, అమరావతి: మెరుగైన పరిపాలన దిశగా ప్రభుత్వంతో కలసి పోలీస్‌శాఖ అడుగులు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలన్నారు. తిరుపతిలో నాలుగు రోజుల పాటు జరిగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్‌ను సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి మాట్లాడారు. ఆలోచనలు, పనితీరు మెరుగు పరచుకునేందుకు ‘ఇగ్నైట్’ పేరుతో పోలీస్‌శాఖ దీన్ని తొలిసారిగా నిర్వహిస్తోంది. డ్యూటీ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఒక పద్ధతి ప్రకారం పన్నాగంతో కుట్రలు పన్నుతుంటే మన ఆలోచనలు కూడా మారాలి. ఇలాంటి రాజకీయ గెరిల్లా వార్ఫేర్ (యుద్ధం) ఎలా డీల్ చేయాలో, టెక్నాలజీని ఉపయోగించుకు ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. మీ ఇగ్నైట్ కార్యక్రమాల్లో దీన్ని కూడా చేర్చాలి. ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి సంప్రదాయానికి నాంది పలుకుతున్నాం. ఏటా టాలెంట్‌ను ప్రదర్శించడం, కలసి చర్చించడం ద్వారా మన సామర్థ్యం పెరుగుతుంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. స్ఫూర్తి రగిలించేలా.. ‘ఇగ్నైట్ అంటే రగిలించడం అని అర్థం. ఇది పోలీస్ శాఖలో మరింత స్ఫూర్తిని రగిలించాలి. పోలీసుశాఖను సెన్సిటైజ్ చేసే దిశగా, ఆలోచనను రగిలించే కార్యక్రమాలు ఏటా జరిగితే సమర్థత, అవగాహన పెరుగుతుంది. దురదృష్టవశాత్తు గత ఆరు సంవత్సరాలుగా ఇది జరగలేదు. డ్యూటీ మీట్లో పోలీస్ సిబ్బంది నైపుణ్యాలు. వివిధ క్రైం సీన్లను పరిశీలించి దర్యాప్తును ఎలా ముందుకు తీసుకువెళతారో ప్రదర్శిస్తారు. సైబర్ క్రైౖం, మహిళలపై నేరాలు, టెక్నాలజీ వినియోగంపై చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా ఐఐటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థలు టెక్నాలజీపై పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించేందుకు ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాం. పనితీరు విషయంలో మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాలి. ఇంకా మెరుగ్గా పని చేయాలంటే ఏం చేయాలి? మన వద్దకు వచ్చినప్పుడు ప్రజలు సంతోషంగా వున్నారా? పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారు సంతోషంగా వున్నారా? వారి ముఖంలో చిరునవ్వును చూడగలుగుతున్నామా? అనే అంశాలను పరిశీలించుకోవాలి. కలియుగంలో క్లైమాక్స్ పరిస్థితులు... గతంలో పోలీసు శాఖ వస్తువులు ఎత్తుకుపోయే దొంగతనాలను విచారించేది. ఇళ్లకు తాళాలు పగలకొడితే ఆ దొంగలను పట్టుకునేందుకు కేసులు పెట్టి విచారించేది. కానీ ఈ రోజు పరిస్థితులు అలా లేవు. కాలాలు మారాయి. సైబర్ నేరాలు వచ్చాయి. సోషల్ మీడియా పేరుతో యథేచ్ఛగా అబద్ధాలు చెబుతున్న యుగంలో ఉన్నాం. వైట్ కాలర్ నేరాలు పెరిగిపోయాయి. ఈ కలియుగంలో క్లైమాక్స్‌కు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
అశ్లీల దృశ్యాలు, ఐటెంసాంగ్స్ వల్లే: శివానంద్
రాంచీ: జార్ఖండ్‌లో జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ స్పందించారు. సమాజంలో అత్యాచారాలు పెరగడానికి మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు లభించడమే కారణమని అన్నారు. సినిమాలలో ఐటెమ్‌సాంగ్స్, ఫోన్లలో అశ్లీల వీడియోలు లైంగిక దాడులు జరగడానికి ముఖ్య కారణమని, ఇలాంటివి ఉన్నంతకాలం చట్టాలు కూడా ఈ దారుణాలను ఆపలేవని పేర్కొన్నారు. ఎలాంటి అత్యాచారాలు, నేరాలు జరగని గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరగడం అక్కడ సంస్కృతిని నాశనం చేస్తున్నాయన్నారు. ‘‘గిరిజన ప్రాంతంలో మహిళలపై అత్యాచారం జరుగుతుందని ఎవరూ ఊహించరు. గిరిజన సంస్కృతిలో అత్యాచారాలు అనేవి ఇంతవరకు జరగలేదు. కాని ఆధునిక యుగం మొదలయ్యాక ప్రస్తుత మహిళలను ఆట బొమ్మలాగా చూస్తున్నారు’’ అని తివారీ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌లోని డుమ్కాలో 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణలు రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా సంచలనం సృష్టించిన విషయం విధితమే. మంగళవారం సాయంత్రం డుమ్కా జిల్లాలోని ముఫాసిల్ ప్రాంతంలో మహిళపై 17 మంది సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితురాలి భర్తను కట్టేసి అత్యాచారం చేశారు. అనంతరం మహిళ ఫిర్యాదు చేయగా, నిందితుల్లో ఒకరిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి జార్ఖండ్ ప్రభుత్వాన్ని నిందించారు. ఇది జార్ఖండ్ ప్రభుత్వం తప్పు అని, అత్యాచారాల నిషేదానికి చట్టాలు తీసుకొచ్చి వాటిని అమలు చేయాలన్నారు. నిందితులను కఠినంగా శికక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించి ఈ అత్యాచారాన్ని సుమోటోగా గుర్తించింది. లైంగిక వేధింపుల కేసుల్లో 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఎంహెచ్ఏ మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ జార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో చర్య తీసుకున్న సమగ్ర నివేదికను కూడా కోరింది. బాధితురాలు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఘటన జరిగిందని, దర్యాప్తు పప్రారంభించినట్లు డీజీపీ సుదర్శన్ మండల్ తెలిపారు. వైద్య పరీక్ష నిమిత్తం బాధితురాలిని హాస్పటల్‌కి పంపామని పేర్కొన్నారు. -
రంగులు మారే వింతైన పాము
హనోయ్: అమెరికా, వియత్నాం శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఓ కొత్తరకం, వింతైన పామును కనుగొన్నారు. వియత్నాం అడువులు, కొండప్రాంతాల్లో బయోడైవర్సీటీపై పరిశోధనలు చేస్తున్న వారు హా జియాంగ్ ప్రావిన్స్‌లో రంగురంగుల ఆ పామును గుర్తించారు. వెలుతురులో దాని చర్మంపై ఉన్న పొలుసులు నీలంనుంచి ఆకుపచ్చకు రంగులు మారటం గమనించారు. చూసిన వెంటనే అది ఓ పామని గుర్తించలేకపోయారు. ఆ వింత పాముకు ‘అచలినస్ జుగోరమ్’ అని నామకరణం చేశారు. అంతేకాకుండా అది అత్యంత అరుదైన జాతికి చెందిందని తెలుసుకున్నారు. 2019లో దీన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లోని విషయాలను తాజాగా ‘కోపియా’ అనే జర్నల్‌లో మంగళవారం ప్రచురించారు. దీనిపై ఆరే మిల్లర్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘‘ అది చాలా అద్భుత క్షణం. ఆ జీవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. చాలా ప్రత్యేకంగా.. నిజానికి అదేంటో చూసిన వెంటనే మేము తెలుసుకోలేకపోయాము’’ అని అన్నారు. -
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ లతో జాగ్రత్త!
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ సోషల్ మీడియా యుగంలో.. సంతోషమైనా.. విచారమైనా.. విడాకులైనా.. పుట్టుకైనా.. చావైనా.. ఇట్టే ప్రపంచానికి తెలిసిపోవాల్సిందే. చాలా మంది సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టులకు ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి అనే దానిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మనకు ఎంత మంచి జరుగుతుందో.. అంత కన్నా ఎక్కువే చెడు జరుగుతుంది. సోషల్ మీడియాలో మంచి వార్తల కన్నా నకిలీ వార్తలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఇలువంటి పోస్టుల ద్వారా మనకు తెలియకుండానే మనం పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ. ఏదైనా మితంగా వాడితే మంచిది.. లేకపోతె అనేక అనర్దాలకు దారి తీస్తుంది. అందుకే మీరు సోషల్ మీడియా ద్వారా ప్రమాదంలో పడకుండా ఉండటానికి కొన్ని విషయాల గురించి మీకు తెలియజేస్తాము. (చదవండి: ఐఫోన్ 12 సిరీస్ తయారీ ఖర్చు ఎంత?) ఇంతకుముందు సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల గురించి పెద్దగా పట్టించుకోని ఆయా సంస్థలు.. తాజాగా ఇలా చేసేవారిమీద ఓ కన్నేసి ఉంచుతున్నాయి. అందుకు తగ్గట్టుగా వారి పాలసీలను మార్చుకుంటున్నాయి. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటివి ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరెవరు ఏం పోస్టులు చేస్తున్నారు..? అందులో నిజమెంత..? వంటివన్నీ ఈ బృందాలు పరిశీలిస్తాయి. తరుచూ ఫేక్ న్యూస్ పోస్ట్ చేసేవారి ఖాతాలను బ్లాక్ చేయడం.. వారు ఇంకా అలాగే చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా చేస్తున్నాయి. మీరు ఎప్పటికి కరోనా వైరస్‌కు సంబంధించిన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. ఇవి ఆయా సామాజిక మాధ్యమ సంస్థల విధానాలకు వ్యతిరేకంగా ఉంటే అవి మీ పై కేసు పెట్టవచ్చు. అలాగే ఇతరులు ఫార్వార్డ్ చేసిన నకిలీ సందేశాలను ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయవద్దు. ఇవి కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయొచ్చు. దీని ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. మీరు పని చేసే సంస్థ యొక్క ఫోటోలను కూడా పోస్ట్ చేయవద్దు. ఇలా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నాయి. సంస్థకు సంబంధించిన విషయాలు గానీ.. ఫోటోలు గానీ పోస్టు చేయడాన్ని ఆ సంస్థలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఎన్నికలప్పుడు గాని, ఇతర సమావేశాలు నిర్వహించేటప్పుడు రెచ్చగొట్టే పోస్టులు, హింసాత్మక పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అంతే. అలాంటి పోస్టులకు భారీ మూల్యం చెల్లించాల్సిందే. సోషల్ మీడియా సంస్థలే గాక.. పోలీసులు, నిఘా విభాగం, సైబర్ పోలీసులు వీటి మీద నిఘా వేసి ఉంచుతారు. -
వైరల్ : ఏనుగు పిల్ల, కుక్క వీడియో
ఏనుగు పిల్ల, కుక్కతో పచ్చిక బయళ్లలో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత అటవీశాఖ అధికారి సుశాంతా నందా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "స్నేహనికి ఆకారం, పరిమాణంతో సంబంధం లేదు" అని క్యాప్షన్ జతచేశారు. ఎనిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో ఏనుగు పిల్ల తన స్నేహితులలో ఒకరైన కుక్కతో ఆడుతూ కనిపించింది. పచ్చిక బయళ్లలో ఇద్దరూ ఆడుతూ ఒకదాని వెనక మరొకటి పరిగెడుతూ ఆనందిస్తున్నాయి. ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు 11,000 మంది వీక్షించారు. అనేక మంది లైక్స్, రీట్వీట్లు కూడా చేశారు. "అబ్బా... ఎంత బాగుంది" అన్నారు ఓ నెటిజన్. మరొక వ్యాఖ్య, "ఈరోజు ఒక గొప్ప వీడియో చూశాను" లాంటి చాలా వ్యాఖ్యలు వచ్చాయి. Friends come in all size and shapes... pic.twitter.com/PaDOQzG6c4 — Susanta Nanda (@susantananda3) November 26, 2020