న్యూయార్క్: క్వాలిటీ కంట్రోల్ మెకానిజంలో ఫేస్‌బుక్ దారుణంగా విఫలం అవుతోందని, ఫేస్‌బుక్‌ను డర్టీగా మార్చేసిందంటూ... ది స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించి సంగతి తెలిసిందే. అయితే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు స్వతహాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దిగ్గజంగా అభివర్ణించే ఫేస్‌బుక్ తన సొంత రూల్స్‌ను పక్కనపెట్టేస్తోందంటూ విమర్శిస్తున్నారు. అంతే కాదు యూజర్లను ‘హైప్రొఫైల్’ కోణంలో విభజించి.. వివక్ష ప్రదర్శిస్తోందంటూ సర్వత్రా విమర్మలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ డేటా లీకేజ్ కాకుండా పలు చర్యలు తీసుకున్నారు.
యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు జూకర్ బర్గ్ గత కొంత కాలంగా యూజర‍్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్‌లపై కూడా దృష్టి సారిస్తున్నట్లు మార్క్‌జూకర్ బర్గ్ తెలిపిన ఈ వివాదలు మాత్రం ఆగడం లేదు. పైగా సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ చేసిన వివాదాస్పదం చేస్తున్నారు.
(చదవండి: డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించకూడదట!)
ఈ మేరకు న్యూయర్క్ టైమ్స్ పత్రిక మార్క్ జూకర్ బర్గ్‌ని వివాదాలకు దూరంగా సర్ఫింగ్ చేస్తూ రిలాక్స్ అవుతన్నారా! అంటూ ఒక కథనం ప్రచురించింది. ఇటీవల ఆయన అమెరికా జెండా పట్టుకుని హైడ్రోఫోలింగ్ చేస్తున్న ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. దీంతో న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలతో ఆయనపై విమర్శలు కురిపించింది. ఈ మేరకు మార్క్ జూకర్ బర్గ్ మాట్లాడుతూ.. "హైడ్రోఫోలింగ్ అనేది ఒక జల క్రీడ. పైగా ఇది నా హాబీ. ఇలా చేయడం నా కెంతో సంతోషాన్ని ఆనందాన్నికలిగించింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి" అన్నారు.
నా వ్యక్తిగత అభిరుచిలపై కూడా విమర్శలు కురిపించకండి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తానెప్పుడు విరామం దొరికినపుడల్లా కుటుంబం, స్నేహితులు రైడింగ్‌లతోనూ గడుపుతుంటానని పేర్కొన్నాడు. దయచేసి నా వ్యక్తిగత సంతోషాల్ని కూడా వివాదాస్పదం చేయంకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చదవండి: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి)
Comments
Please login to add a commentAdd a comment