ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.ఇన్‌స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలతో ఫేస్‌బుక్‌తో పాటు అనుసంధానంగా ఉన్న ఇన్‌స్ట్రాగ‍్రామ్ యూజర్లు తగ్గిపోతున్నారు.వారికోసం వందల కోట్లు ఖర్చు చేసేందుకు మార్క్‌జుకర్ బెర్గ్ సిద్ధమయ్యారు.
ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్..ఇన్‌స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటూ ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్‌లైన్’ పేరుతో నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక వెలుగులోకి రావడంతో ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు ఇతర సోషల్ మీడియా సైట్స్‌ను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. అందుకే చేజారిపోతున్న యజర్లను అట్రాక్ట్ చేసేందుకు, కొత్త యూజర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇన్‌స్ట్రాగ్రామ్ ఈ ఏడాది వార్షిక యాడ్ బడ్జెట్‌లో టీనేజ్ యూజర్స్ కోసం సుమారు 390 మిలియన్ డాలర్లను (ఇండియన్ కరెన్సీలో రూ. 29,26,36,50,000.00) యాడ్స్ రూపంలో మార్క్‌జుకర్ బెర్గ్ ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు.
అదే సమయంలో ఇన్ స్ట్రాగ్రామ్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్‌లకు వరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇన్ స్ట్రాగ్రామ్ నుంచి 35శాతం మంది యూజర్లు స్నాప్ చాట్‌కు ,30శాతం మంది యూజర్లు టిక్ టాక్ వైపు మొగ్గుచూపారని పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.అయితే వారిని నియంత్రించేందుకు యాడ్స్‌పై భారీ ఖర్చు పెట్టనుంది. ముఖ్యంగా టీనేజ్ యూజర్లు తగ్గిపోవడంపై ఇన్ స్ట్రాగ్రామ్ ముప్పుగా భావిస్తోంది. అందుకే యాడ్స్ లేదా, ఇతర మార్కెటింగ్ స్ట్రాటజీల్లో 13 నుంచి 15 సంవత్సరాల వయస్సున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న కిడ్స్ యూజర్ బేస్ పెంచుకునేందుకు 'Instagram kids' పేరుతో యాప్‌ను బిల్డ్ చేస్తోంది. ప్రస్తుతం ఆ యాప్‌ను బిల్డ్ చేయడం నిలిపివేసినట్లు ఇన్‌స్టా హెడ్ ఆడమ్ మోసేరి తెలిపారు.
చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment