Teenage
-
కోటిన్నర బంగారం కేవలం రూ.680కే అమ్మిన టీనేజర్!
ఓ బాలికకు తన స్నేహితుల్లో ధరించిన పోగులు,ముక్క పుడకలు నచ్చాయి. వెంటనే వాటిని కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ చేతిలో డబ్బులు లేవు. ఇంట్లో వాళ్లను అడిగితే కోప్పడతారు. అందుకే ఏదో ఒకటి చేసి గిల్ట్ నగల్ని కొనుగోలు చేయాలని అనుకుంది. ఇందుకోసం తన తల్లి ధరించే రూ.1.16 కోట్ల బంగారాన్ని కేవలం రూ.680కే అమ్మేసింది. ఆ తర్వాత ఏమైందంటే? సౌత్ చౌనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని షాంఘైకు చెందిన బాలిక లిప్ స్టడ్లు, చెవిపోగులు కొనుగోలు చేసేందుకు మిలియన్ యువాన్ (రూ.1.16 కోట్లు) విలువైన తన తల్లి ఆభరణాలను దొంగిలించింది. వాటిని కేవలం 60 యువాన్లకు (రూ.680) విక్రయించింది.కుమార్తె చేసిన నిర్వాకం తెలియని తల్లి వాంగ్ వెంటనే పుటువో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలోని వాన్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో దొంగతనం జరిగిందని, కోట్లు విలువ చేసే బంగారం నగలు మాయమైనట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వాంగ్ ధరించే జేడ్ బ్రాస్లెట్లు, నెక్లెస్‌లు, డైమండ్లు పొదిగిన ముక్కపుడకల్ని ఆమె కుమార్తె అమ్మినట్లు గుర్తించారు. వాస్తవానికి ఆ బాలిక సైతం తాను అమ్మింది గిల్ట్ నగలనే అనుకుంది. ఇదే విషయంపై తల్లిని ఆరా తీయగా.. తన కుమార్తె లిప్ స్టడ్స్ కోసమే బంగారాన్ని అమ్మినట్లు చెప్పింది. ‘ఆ రోజు నా కుమార్తె నన్ను డబ్బులు అడిగింది. ఎంత అని అడగ్గా 60యువాన్లు అని చెప్పింది. ఎందుకు అని అడగ్గా..తన స్నేహితులు లిప్ స్టడ్స్ ధరించారని, అవి తనకు బాగా నచ్చాయని .. తాను కూడా ధరించాలని తన కోరికను చెప్పింది.లిప్ స్టడ్ ఖరీదు 30 యువాన్లు (రూ.340), మరియు ఆమె 30 యువాన్ల ధరతో మరో జత చెవిపోగులు కావాలని వివరించింది. వాటి మొత్తం ఖరీదు 60 యువాన్లు అని తెలిపింది. కానీ తాను ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పింది. తల్లి,కుమార్తెల మధ్య జరిగిన సంభాషణ విన్న పోలీసులు.. తల్లి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని గిల్ట్ నగలు అనుకుని బంగారాన్ని అమ్మినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అనంతరం, బాలిక బంగారాన్ని ఎక్కడ అమ్మింది? ఎవరికి అమ్మింది? ఎంతకు అమ్మింది? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక తిరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరికి బాలిక బంగారం ఎవరికి విక్రయించిందో గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందించారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది. -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి నిజంగా అలా అన్నారా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆ మధ్య పని గంటల మీద చేసిన వ్యాఖ్యలు.. ఎంత దుమారం రేపాయో తెలియంది కాదు. దానికి ఇప్పుడు కొనసాగింపుగా.. ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా ఇన్ఫోసిస్ మూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఇంతకు ముందు వారంలో 70 పనిగంటల(70 Hours) ఉండాల్సిందేనని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్ఫోసిస్ మూర్తి.. ఇప్పుడు యువతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత పరిమితంగా ఉంటే దేశానికి అంత మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే జీవితంలో విజయం బాట పడతారు అంటూ ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. దీంతో ఆ వార్త ఆధారంగా నారాయణమూర్తి(Narayana Murthy)పై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఆయనకేమైందంటూ.. పలువురు విమర్శించడం, ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు విషయం తెలిసింది. పీటీఐ ఫ్యాక్ట్ చెక్(PTI Fact Check)లో నెట్టింట్ హల్చల్ చేస్తున్న ఆ వార్త తాలుకా స్క్రీన్ షాట్ ఫేక్‌గా నిర్ధారణ అయ్యింది. అది డిజిటల్‌గా ఎడిట్ చేసిందని తేలింది. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థ కూడా తన సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. -
టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!
ఇల్లు అంటే మొదట చెప్పుకోవాల్సింది వంటిల్లే. ఇల్లు ఎంత పెద్దదైనా చిన్నదైనా ప్రధానంగా ఉండాల్సిన గది వంటగది. ఆ వంటగదిలోకి అడుగుపెట్టకుండా పెద్దయిపోయే పిల్లల తరం కాదిది. సరదాగా వంటగదిలో ప్రయోగాలు చేస్తున్న కొత్త యువతరం మొదలైంది. రాబోయే ఏడాది యూత్ ట్రెండ్ అంతా వంటగది కేంద్రంగా ఉండబోతోంది. అలాగే టీనేజ్‌లో ఉన్న పిల్లలకు తల్లితో అనుబంధం పెరిగేది వంటగదిలోనే. ఇందుకోసం చదువుకున్న తల్లి పాటిస్తున్న నాలుగు సూత్రాలివి. పిల్లలను వంటగదిలోకి ఆహ్వానించేటప్పుడు, వారి చేత వంట చేయించేటప్పుడు వాళ్లకు ఇష్టమైన వంటనే చేయాలి, వారి చేత చేయించాలి. వంటల పుస్తకం లేదా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోమని సూచించాలి. ఇంటికోసం వంట చేయడమే కాకుండా చారిటీ కోసం వంట చేయడం అలవాటు చేయాలి. ఏదైనా వండి వాటిని అమ్మగా వచ్చిన డబ్బును అనాథలకు ఇవ్వడం ఒక పద్ధతి. అలాగే అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో ఉండే వాళ్ల కోసం వండి తీసుకెళ్లి పంచడం అలవాటు చేయాలి. తల్లి తనతోపాటు పిల్లలను కూడా కుకరీ క్లాసులకు తీసుకెళ్లడం ద్వారా అందరూ కలిసి ఒక కొత్త వంటను నేర్చుకోవడం, కలిసి వండడం గొప్ప అనుభూతి. అనుబంధాల అల్లిక కూడా. పిల్లలకు ఒక మోస్తరుగా వంట వచ్చిన తర్వాత ఓ చిట్కా పాటించవచ్చు. ఒక రోజు పూర్తిగా లంచ్‌కి అవసరమైన మెనూ అంతా వాళ్లే సిద్ధం చేయాలి. అంటే ఆ ఒక్కరోజుకు చెఫ్‌గా నియామకం అన్నమాట. ఏం వండాలో నిర్ణయించుకుని, అవసరమైన వాటిని మార్కెట్ నుంచి తెచ్చుకుని, వండి, వడ్డించడం వరకు వారిదే బాధ్యత అన్నమాట. ఆ రోజు సర్వీస్‌కి గాను బయటి నుంచి వచ్చిన షెఫ్కి ఇచ్చినట్లే పిల్లలకు కూడా పేమెంట్ ఇవ్వాలి. మోడరన్ ఉమెన్ చాలామంది ఇలా పిల్లలను వారానికోరోజు షెఫ్ డ్యూటీకి సిద్ధం చేస్తున్నారు కూడా. ఏం వెతికారో తెలుసా? మన యువత 2024లో కూడా ఇంటర్నెట్లో వంటల కోసం విపరీతంగా సెర్చ్ చేసినట్లు చె΄్తోంది గూగుల్. ఇంతకీ ఈ ఏడాది ఏయే వంటకాల కోసం వెతికారో తెలుసా? పోర్న్‌స్టార్ మార్టినీ... దీని పేరు మీద అనేక అభ్యంతరాలున్నాయి. కానీ అదే పేరుతో వ్యవహారంలో ఉంది. ఈ లండన్ లోకల్ డ్రింక్‌ని వెనీలా వోడ్కా, ఫ్రూట్ లిక్కర్, వెనీలా షుగర్లతో చేస్తారు. రెండవ స్థానంలో మన మామిడికాయ పచ్చడి ఉంది. మూడవ స్థానంలో ఉత్తరాది వంటకం ధనియా పాంజిరి ఉంది. ధనియాల పొడి, చక్కెర, నెయ్యి, రకరకాల గింజలతో చేస్తారు. ఇది కృష్ణాష్టమి రోజు చేసే నైవేద్యం. ఆయుర్వేదం సూచించిన ఆరోగ్య మూలికలతో చేసే ఔషధాహారం. నాలుగో స్థానంలో ఉన్న మన ఉగాది పచ్చడే. ఐదవస్థానంలో ఉన్న ఆహారం ఉత్తరాది రాష్ట్రాల చర్నామృత్. పాలు, చక్కెర, పెరుగు, తేనె, నెయ్యి, తులసి ఆకులు, డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వుతో చేస్తారు. మన పంచామృతం వంటిది. పూజాదికాలలో భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా పంచుతారు. ఆరో స్థానంలో ఉన్నది భూటాన్ వాళ్ల ఇమాదత్శీ. మీగడ పెరుగులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు నానబెట్టి తింటారు. ఆహారప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఉదయాన్నే తాగే వెచ్చటి కాఫీ కోసం అది కూడా రెస్టారెంట్ స్టైల్ క్రీమీ కాఫీ ఎలా చేయాలోనని సెర్చ్ చేశారు. ఎనిమిదో స్థానంలో ఉన్నది కంజి. ఇది ఉత్తరాదిన హోలీ సందర్భంగా తాగే డ్రింక్లాంటిదే. బీట్రూట్, క్యారట్, ఆవాలు, ఇంగువతో చేసి రాత్రంతా పులియ బెడతారు. యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. శక్కర్ పారా... ఇది మహారాష్ట్ర వంటకం. గోధుమ పిండి, చక్కెర కలిపి చేస్తారు. గోధుమ పిండిలో చక్కెర బదులు ఉప్పు, జీలకర్ర కలిపి కూడా చేస్తారు. పిల్లలకు చక్కటి చిరుతిండి, పెద్దవాళ్లకు టీ టైమ్ స్నాక్. ఇక పదవ వంటకం చమ్మంతి... ఇది కేరళ కొబ్బరి పచ్చడి. మన తెలుగు వాళ్లకు కూడా అలవాటే. కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండుతో చేస్తారు. ఇడ్లీ, దోశె, అన్నంలోకి కూడా బాగుంటుంది. గూగుల్ ఇచ్చిన లిస్ట్ చూస్తే ఈ వంటకాల గురించి సెర్చ్ చేసింది యూత్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఇవన్నీ సులువుగా చేయగలిగిన వంటలే. పండుగల సమయంలో మాత్రమే చేసే ధనియా పాంజిరి, ఉగాది పచ్చడి, చర్నామృత్ల కోసం సెర్చ్ చేశారంటే వాళ్లు వంటలో చెయ్యి తిరిగిన వాళ్లు కాదని ఒప్పుకోవాల్సిందే. అలాగే మామిడికాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి కూడా. ఇక మనవాళ్లు ఆసక్తిగా బయటి వంటకాల కోసం తొంగి చూసింది లండన్ డ్రింక్, క్రీమీ కాఫీల విషయంలో మాత్రమే. ఇవి కూడా యూత్ ఇంటరెస్ట్ జాబితాలోనివే. మరో విషయం... బాదం పప్పులు నానబెట్టి రోజూ తినడానికి కారణాలు, ప్రయోజనాలను తెలుసుకున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్ గురించి కూడా. -
టీనేజ్ అకౌంట్' కు తాళం
సామాజిక మాధ్యమంలో అకౌంట్ లేదని ఎవరైనా చెబితే వెంటనే.. ‘ఇంకా ఏ కాలంలో ఉన్నారండీ.. నాకైతే రెండు మూడు ఖాతాలున్నాయి. ఒక్కో దాంట్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు’ అంటూ గొప్పలు చెప్పుకునే వారు కోకొల్లలు. సోషల్ మీడియాను కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పరిచయాల వరకూ పరిమితమైతేనో, వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటేనో పర్లేదు. కానీ.. అదుపు తప్పి అనర్థాలు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. ఎంతోమంది జీవితాలు కేవలం సోషల్ మీడియా ప్రభావం వల్ల నాశనమవుతున్నాయి.పిల్లలు, యుక్తవయసు వారు (టీనేజర్లు) సోషల్ మీడియాకు బానిసలుగా మారుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో పలు దేశాలు కొన్ని వయసుల వారు సామాజిక మాధ్యమాన్ని వినియోగించడంపై ఆంక్షలు పెడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్ వంటి సంస్థలు తమ ఖాతాదారుల వ్యక్తిగత సమాచార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. – సాక్షి, అమరావతిఖాతా కోసం వయసు ఎక్కువని అబద్ధాలుపిల్లలు, టీనేజర్స్, పెద్దలు అనే తేడా లేకుండా రోజుకి సగటున మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని, దీనివల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక పరిశోధనలు తేల్చాయి. సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ యూజర్‌కు 13 ఏళ్ల వయసు ఉండాలి. తప్పుడు సమాచారంతో ఈ–మెయిల్ ఐడీలు తయారు చేసుకుని, 8 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు కూడా ఖాతాలు తెరుస్తున్నారు.8 నుంచి 17 సంవత్సరాల వయసు వారిలో 22% మంది సోషల్ మీడియా యాప్‌లలో తమకు 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నట్టు అబద్ధం చెబుతున్నారని అమెరికా సంస్థ ‘ఆఫ్కామ్’ అధ్యయనంలో తేలింది. 15 నుంచి 18 ఏళ్ల వయసులో శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. అటువంటి సమయంలో సోషల్ మీడియాకు అలవాటు పడితే వారి ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయని, రకరకాల వింత, వికృత ప్రవర్తనలను నేర్చుకుంటారని వైద్యులు చెబుతున్నారు. రానున్న 2025 సంవత్సరంలో ‘ఆన్లైన్ భద్రతలో నిజమైన మార్పు’ రావాలని టెక్ నిపుణులు సోషల్ మీడియా సంస్థలను కోరుతున్నారు.వారి ఖాతాలకు ఆటోమేటిక్ ప్రైవసీ సోషల్ మీడియా వేదికల్ని నిర్వహిస్తున్న సంస్థలు ఇటీవల ఖాతాదారుల భద్రతపై దృష్టి సారించాయి. అనేక సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. యువతకు సోషల్ మీడియాను సురక్షితమైనదిగా ఉంచడానికి ఇన్‌స్ర్ట్రాగామ్ ‘టీన్ అకౌంట్’లను తీసుకువచి్చంది. అలాగే రోజూ వేల సంఖ్యలో వయసు తప్పుగా నమోదు చేసిన వారి ఖాతాలను కొన్ని సంస్థలు తొలగిస్తున్నాయి. అలాగే టీనేజర్ల ఖాతాలకు ఆటోమేటిక్‌గా లాక్ (ప్రైవసీ) వేసేస్తున్నాయి.అంటే వారి ఖాతాను వారు అనుమతించిన స్నేహితులు మాత్రమే చూడగలరు. ఇతరులకు వారి వివరాలు కనిపించవు. మెషిన్ లెరి్నంగ్ టెక్నాలజీ ఇందుకు సహకరిస్తోంది. ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్‌ను పటిష్టం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆస్ట్రేలియా ఓ అడుగు ముందుకు వేసి, 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించడాన్ని నిషేధించింది.మార్చాల్సింది తల్లిదండ్రులే సోషల్ మీడియాలో సన్నిహితులతో, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. అది సైబర్ కేటుగాళ్లు దొంగిలించి, వాటిద్వారా బెదిరిస్తూ.. డబ్బులు గుంజుతారు. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అందుకే పదేళ్లు నుంచి 20 ఏళ్లలోపు వయసు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చేయాలి. ఇంటి పనుల్లోనూ భాగం చేయాలి. తల్లిందండ్రులు పిల్లలతో ముచ్చటిస్తుండాలి. ప్రతి చిన్న ఘటనను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాన్పించాలి. చదువుపై దృష్టి కేంద్రీకరించేలా అలవాటు చేయాలి. -
మరణించిన టీనేజర్ కుటుంబానికి రూ. 2,624 కోట్ల పరిహారం
న్యూయార్క్: అమెరికాలో అమ్యూజ్మెంట్ పార్క్‌లో నిట్టనిలువుగా కిందకు దూసుకొచ్చే ‘ఫ్రీ ఫాల్ టవర్ డ్రాప్ రైడ్’లో ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఒక టీనేజర్ కుటుంబానికి రూ.2,624 కోట్ల భారీ నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఐకాన్ పార్క్‌లో ఫన్‌టైమ్ హ్యాండిల్స్ అనే సంస్థ ఈ రైడ్‌ను నిర్వహించింది. 400 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి గంటకు 112 కిలోమీటర్లవేగంతో కిందకు దూసుకొస్తుంది. 2022 మార్చిలో 14 ఏళ్ల టైర్ శాంప్సన్ తన తోటి ఫుట్‌బాల్ టీమ్‌తో ఈ రైడ్ ఎక్కాడు. ఆరు అడుగుల ఎత్తు 173 కేజీల బరువున్న శాంప్సన్‌ను నిబంధనలకు విరుద్ధంగా రైడ్‌కు అనుమతించారు. వ్యక్తి 129 కేజీలకు మించి బరువుంటే ఈ రైడ్‌కు అనుమతించకూడదు. రెండుసార్లు పైకీ కిందకు సురక్షితంగా వెళ్లొచ్చిన శాంప్సన్ మూడోసారి పట్టుతప్పి 70 అడుగుల ఎత్తులో టవర్ నుంచి వేగంగా కిందకు పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ‘అధిక బరువు’, సేఫ్టీ సీట్ లాక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శిక్షగా ఫన్‌టైమ్ హ్యాండిల్స్ సంస్థకు 310 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం నుంచి శాంప్సన్ తల్లిదండ్రులకు తలో 155 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. -
నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!
‘నువ్వు మాట్లాడకూడదు’ అని బెదిరింపులు ఎదుర్కొన్న అమ్మాయి గురించి ఇప్పుడు ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటోంది. ‘నువ్వు ఇంటికే పరిమితం కావాలి’ అనే అప్రకటిత నిషేధానికి గురైన అమ్మాయి గురించి..‘నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలి’ అంటున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల నీలా ఇబ్రహీమి ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ (కిడ్స్ రైట్స్ ప్రైజ్) గెలుచుకుంది. మహిళలు, బాలికల హక్కుల కోసం బలంగా తన గొంతు వినిపించినందుకు నీలా ‘కిడ్స్ రైట్స్ ప్రైజ్’కు ఎంపికైంది....‘కిడ్స్ రైట్స్’ ఫౌండేషన్ అందించే అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి మానవహక్కులు, సామాజిక న్యాయానికి సంబంధించి గణనీయమైన కృషిచేసిన వారికి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల నుంచి 165 మంది నామినీల నుంచి గట్టి పోటీని అధిగమించి ఈ బహుమతికి ఎంపికైంది నీలా ఇబ్రహీమి.‘నీలా ధైర్యసాహసాలకు ముగ్ధులం అయ్యాం’ అన్నారు ‘కిడ్స్ రైట్స్ ఫౌండేషన్’ ఫౌండర్ మార్క్ డల్లార్ట్.లింగ సమానత్వం, అఫ్గాన్ మహిళల హక్కుల పట్ల నీలా పాట, మాట ఆమె అంకితభావం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారాయి. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించినట్లుగానే మహిళల హక్కులను కాలరాయడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు ప్రాథమిక పాఠశాలకు మించి చదువుకోకూడదు. మహిళలు మార్కులు, జిమ్, బ్యూటీ సెలూన్లకు వెళ్లడాన్ని నిషేధించారు. మహిళలు ఇల్లు దాటి బయటికి రావాలంటే పక్కన ఒక పురుషుడు తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికితోడు కొత్త నైతిక చట్టం మహిళల బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించింది. ఈ పరిస్థితినిఐక్యరాజ్యసమితి ‘లింగ వివక్ష’గా అభివర్ణించింది. తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఇది నిరాధారమని, దుష్ప్రచారం అని కొట్టి పారేసింది. మహిళల హక్కులపై తాలిబన్ల ఉక్కుపాదం గురించి నీలా పాడిన శక్తిమంతమైన నిరసన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట అఫ్గాన్ సమాజంపై చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. నీలా ‘ఐయామ్ మైసాంగ్’ మూవ్మెంట్ మహిళల హక్కులపై గొంతు విప్పడానికి ఎంతోమందికి స్ఫూర్తినీ, ధైర్యాన్ని ఇచ్చింది.‘నేను చేసిన పని రిస్క్‌తో కూడుకున్నది. అది అత్యంత ప్రమాదకరమైనదని కూడా. అయితే ఆ సమయంలో నాకు అదేమీ తెలియదు. ఎందుకంటే అప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది నీలా. ‘అంతర్జాతీయ బాలల శాంతి బహుమతిని గెలుచుకోవడం అంటే అఫ్గాన్ మహిళలు, బాలికల గొంతు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించడం. తాలిబన్ల ΄పాలనలో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళల హక్కుల కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటాను’ అంటూ పురస్కార ప్రదానోత్సవంలో మాట్లాడింది నీలా.నీలా పట్ల అభిమానం ఇప్పుడు అఫ్గాన్ సరిహద్దులు దాటింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారు. అఫ్గాన్‌ను విడిచిన నీలా ఇబ్రహీమి ‘30 బర్డ్స్ ఫౌండేషన్’ సహాయంతో కుటుంబంతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ‘నేను నా కొత్త ఇంట్లో సురక్షితంగా ఉన్నాను. అయితే అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమ్మాయిల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ప్రపంచంలో ఏ ్ర΄ాంతంలో మహిళల హక్కులు దెబ్బతిన్నా అది యావత్ ప్రపంచంపై ఏదో ఒకరకంగా ప్రభావం చూపుతుంది’ అంటుంది నీలా. ‘హర్ స్టోరీ’ కో–ఫౌండర్‌గా అఫ్గానిస్థాన్‌లోని అమ్మాయిలు తమ గొంతు ధైర్యంగా వినిపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తోంది.అఫ్గాన్‌లో మహిళా విద్య, హక్కులకు సంబంధించి జెనీవా సమ్మిట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ. యూకే హౌజ్ ఆఫ్ లార్డ్స్, కెనడియన్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మాంట్రియల్ సమ్మిట్, టెడ్ వాంకూవర్లాంటి వివిధ కార్యక్రమాలలో తన గళాన్ని వినిపించిన నీలా ఇబ్రహీమీ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాతో కలిసి పనిచేస్తోంది. -
ఇన్‌స్టాలో ఇక వయసు దాచలేరు
టీనేజీ యూజర్లు అసభ్య, అనవసర కంటెంట్ బారిన పడకుండా, వాటిని చూడకుండా కట్టడిచేసేందుకు, వారి మానసిక ఆరోగ్యం బాగుకోసం సామాజికమాధ్యమం ఇన్‌స్టా గ్రామ్ నడుం బిగించింది. ఇందుకోసం ఆయా టీనేజర్ల వయసును కనిపెట్టే పనిలో పడింది. తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారంతో లాగిన్ అయినాసరే ఇన్‌స్టా గ్రామ్ యాప్‌ను వాడుతున్నాసరే దానిని కనిపెట్టి అడ్డుకునేందుకు కృత్రిమ మేథ సాయం తీసుకుంటామని దాని మాతృసంస్థ ‘మెటా’వెల్లడించింది.ఎలా కనిపెడతారు? అడల్ట్ క్లాసిఫయర్ పేరిట కొత్త ఏఐ టూల్‌ను మెటా వినియోగించనుంది. దీంతో యూజర్ల వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించుకోవచ్చు. ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్‌ను యూజర్ వీక్షిస్తున్నాడు?, ఆ యూజర్ ప్రొఫైల్‌లో పొందుపరిచిన వివరాలతో వయసుపై తొలుత ప్రాథమిక అంచనాకొస్తారు. తర్వాత ఈ యూజర్‌ను ఏఏ వయసు వాళ్లు ఫాలో అవుతున్నారు?, ఈ యూజర్‌తో ఎలాంటి కంటెంట్‌ను పంచుకుంటున్నారు?, ఎలాంటి అంశాలపై ఛాటింగ్ చేస్తున్నారు? ఏం ఛాటింగ్ చేస్తున్నారు? వంటి విషయాలను వడబోయనున్నారు. ఫ్రెండ్స్ నుంచి ఈ యూజర్లకు ఎలాంటి బర్త్‌డే పోస్ట్‌లు వస్తున్నాయి వంటివి జల్లెడపట్టి యూజర్ వయసును నిర్ధారిస్తారు. ఆ యూజర్ 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్‌గా తేలితే ఆ అకౌంట్‌ను వెంటనే టీన్ అకౌంట్‌గా మారుస్తారు. ఈ అకౌంట్ల వ్యక్తిగత గోప్యత సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఈ యూజర్లకు ఏ వయసు వారు మెసేజ్ పంపొచ్చు? అనేది ఏఐ టూల్ నిర్ణయిస్తుంది. ఈ టీనేజర్లు ఎలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు అనే దానిపై కృత్రిమ మేథ టూల్దే తుది నిర్ణయం. ప్రస్తుతం చాలా మంది టీనేజర్లు లైంగికసంబంధ కంటెంట్‌ను వీక్షించేందుకు, తల్లిదండ్రులకు తెలీకుండా చూసేందుకు తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారం ఇచ్చి లాగిన్ అవుతున్నారు. వీటికి త్వరలో అడ్డుకట్ట పడనుంది.వచ్చే ఏడాది షురూ అడల్ట్ క్లాసిఫయర్ను వచ్చే ఏడాది నుంచి అమలుచేసే వీలుంది. 18 ఏళ్లలోపు టీనేజర్ల ఖాతాలను టీన్ అకౌంట్లుగా మారుస్తాయి. అయితే త్వరలో 18 ఏళ్లు నిండబోయే 17, 16 ఏళ్ల వయసు వారికి కొంత వెసులుబాటు కల్పించే వీలుంది. అంటే నియంత్రణ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇది కూడా కాస్తంత కష్టంగా మార్చొచ్చు. సామాజికమాధ్యమ వేదికపై హానికర అంశాలను పిల్లలు చూసి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మెటా ఈ దిశగా యాప్‌లో మార్పులు చేస్తోంది. టీనేజీ అమ్మాయిలపై ఇన్‌స్టా గ్రామ్ పెను దుష్ప్రభావాలు చూపుతోందని ప్రజావేగు ఫ్రాన్సెస్ హాగెన్ సంబంధిత అంతర్గత పత్రాలను బహిర్గతం చేయడంతో ఇన్‌స్టా గ్రామ్ నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు అధికమయ్యాయి. కొత్త టూల్ కారణంగా టీనేజీ యూజర్ల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చేమోగానీ సమస్యకు పూర్తి పరిష్కారం లభించకపోవచ్చని స్వయంగా మెటానే భావిస్తోంది. ఎవరైనా యూజర్ తాను టీనేజర్‌ను కాదు అని చెప్పి టీన్అకౌంట్ను మార్చాలనుకుంటే ఆ మేరకు లైవ్‌లో నిరూపించుకునేలా కొత్త నిబంధన తేవాలని చూస్తున్నారు. బయటి సంస్థకు ఈ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. సంబంధిత యూజర్ వీడియో సెల్ఫీ లైవ్‌లో తీసి పంపితే ఈ బయటి సంస్థ వీడియోను సరిచూసి అకౌంట్ స్టేటస్‌పై తుది నిర్ణయం తీసుకుంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
టీనేజీలోనే గంజాయి
సాక్షి, హైదరాబాద్: గంజాయి, మద్యం, సిగరెట్, డ్రగ్స్ వినియోగం, వాటికి బానిసలై పోవడం సాధారణంగా యువకులు, పెద్దల్లోనే చూస్తుంటాం. కానీ టీనేజ్ పిల్లలు కూడా ఈ చెడు అలవాట్లకు ఎక్కువగా లోనవుతున్నారట. ఆ మాటకొస్తే పిల్లల్లో ఎక్కువ శాతం గంజాయి సేవిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మానసిక రుగ్మతల కారణంగా టీనేజీ పిల్లలు ఈ వ్యసనాల బారిన పడుతుండటం. మానసిక సమస్యలు కూడా పెద్దవారికే అధికంగా ఉంటాయని అనుకుంటాం. కానీ పెద్ద వయస్సు వారికంటే యువతీ యువకుల్లోనే మానసిక రుగ్మతలు అధికంగా ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)లు తేలి్చచెప్పాయి.‘యువకులు, చిన్న పిల్లల మానసిక ఆరోగ్యంపై మార్గదర్శకత్వం’పేరుతో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ తాజాగా ఓ నివేదిక విడుదల చేశాయి. ఐదేళ్ల నుంచి 24 ఏళ్లలోపు వారికి సంబంధించిన మానసిక సమస్యలపై పలు ఆసక్తికర అంశాలను పొందుపరిచాయి. మానసిక రుగ్మతల నుంచి టీనేజీ పిల్లలను రక్షించాలంటే చట్టాలు సరిగా ఉండాలని, సామాజిక భద్రత..ఆర్థిక భరోసా ఉండాలని, మౌలిక సదుపాయాలు కలి్పంచాలని సూచించాయి. నివేదికలో ఏముందంటే.. పెద్దలు తట్టుకుంటారు.. పిల్లలు కుంగిపోతారు మూడో వంతు మానసిక సమస్యలు 14 ఏళ్లలోపే మొదలవుతాయి. అందులో సగం 10 ఏళ్లలోపే ప్రారంభం అవుతాయి. 15–19 ఏళ్ల వయస్సు బాల బాలికల్లో మద్యం తాగేవారు 22 శాతం ఉన్నారు. అలాగే పెద్దల కంటే టీనేజీ పిల్లల్లోనే గంజాయి వాడకం ఎక్కువగా ఉంది. ఆ వయస్సు వారిలో 5.5 శాతం మంది టీనేజీ పిల్లలు గంజాయి తాగుతున్నారు. ఆ వయస్సులోనే మద్యం, డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. 13–19 ఏళ్ల మధ్య వయస్సులోని టీనేజీ పిల్లల్లో ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మత ఉంది. పెద్ద వారు మానసిక సమస్యలను తట్టుకోగలరు. కానీ చిన్న పిల్లలు తట్టుకోలేరు. చదువు, కెరీర్ వంటివి వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. 15–19 మధ్య వయస్సు వారిలో మానసిక సమస్యలు అత్యధికంగా 15 శాతం ఉండటం గమనార్హం. ఆ వయస్సులో చదువు కీలకమైన దశలో ఉంటుంది. కెరీర్‌ను నిర్ణయించుకునే దశ, ప్రేమలు, ఆకర్షణలు వంటివివారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆ వయస్సువారే వివిధ మానసిక కారణాల వల్ల నేరస్థులుగా మారుతున్నారు. ఆత్మహత్యలూ 15–24 ఏళ్లలోపు వారిలోనే అధికంగా ఉంటున్నాయి. అందులో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. బాలికలు ఎక్కువగా భావోద్వేగపరమైన ఒత్తిడికి (ఎమోషనల్ డిస్టర్బెన్స్) గురవుతుంటారు. పిల్లల్లో కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటివి కూడా మానసిక రుగ్మతకు సంబంధించిన అంశాలే. పెద్దవారిలో డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి కీలకంగా ఉంటాయి. అతిగా తినడమూ, తక్కువ తినడమూ మానసిక వ్యాధి లక్షణాలే. 40 ఏళ్లలోపు వరకు మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. 70 ఏళ్లు పైబడిన వారిలో మతిమరుపు వస్తుంది. ఏ వయస్సు వారిలో మానసిక రుగ్మతలు ఎంత శాతం అంటే.. ⇒ 5–9 మధ్య వయస్సు వారిలో 8 శాతం ⇒ 10–14 ఏళ్లు 15 శాతం ⇒ 15–19 ఏళ్లు 15 శాతం ⇒ 20–24 ఏళ్లు 14 శాతం ⇒ 25–29 ఏళ్లు 13 శాతం ⇒ 30–34 ఏళ్లు 12 శాతం ⇒ 35–39 ఏళ్లు 11 శాతం ⇒ 40–44 ఏళ్లు 9 శాతం ⇒ 45–49 ఏళ్లు 7 శాతం ⇒ 50–54 ఏళ్లు 6 శాతం ⇒ 55–59 ఏళ్లు 5 శాతం ⇒ 60–64 ఏళ్లు 3 శాతం ⇒ 65–69 ఏళ్లు 3 శాతం ⇒ 70 ఏళ్లకు పైబడి 2 శాతం ప్రాథమిక ఆరోగ్యంలో ఇది భాగం కావాలి లింగ భేదాలు కూడా మానసిక సమస్యలకు కారణంగా ఉంటున్నాయని ఆ నివేదిక తేలి్చంది. పురుషులు కుటుంబ బాధ్యతలు, అనేక ఇతర సమస్యలతో మద్యానికి బానిసలవుతున్నారు. అలాగే బయటకు చెప్పలేని పరిస్థితులూ ఉంటున్నాయి. ఉద్యోగం, ఉపాధి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వంటివి ఇబ్బందికి గురిచేస్తాయి. మానసిక రుగ్మతలకు వైద్యం చేసే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రాథమిక ఆరోగ్యంలో కలపాలి. ప్రస్తుతం ప్రాథమిక, జిల్లా ఆసుపత్రుల్లో మానసిక సమస్యలకు సంబంధించిన వైద్యులు లేకపోవడాన్ని నివేదిక ఎత్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై ఆయా దేశాల బడ్జెట్లలో కేవలం 0.1 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 80 శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యంపై ఒక ప్రత్యేక వ్యవస్థ అనేది లేనేలేదు. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రొఫెసర్ అనెస్థీíÙయా, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..⇒ టీనేజీ పిల్లలు బయటి పరిస్థితులు, ఇంటి పరిస్థితులకు మధ్య ఘర్షణతో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ⇒ 5–9 ఏళ్ల పిల్లలపై స్నేహితులు, తల్లిదండ్రులు పెంచే విధానం, స్కూలు, పరిసరాల ప్రభావం ఉంటుంది. ⇒ ఆర్థిక, సామాజిక, లింగపరమైన అసమాన త్వం, సామాజిక బహిష్కరణ వంటి వాటి వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ⇒ పేదరికం, యుద్ధ వాతావరణంలో ఉండే పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో తల్లి మద్యానికి బానిసైతే పుట్టే పిల్లల్లో మానసిక సమస్యలు రావొచ్చు. ⇒ తల్లిదండ్రులకు మానసిక సమస్యలుండటం, తల్లిదండ్రులు..కుటుంబ కలహాలు, తల్లిదండ్రులు విడిపోవడం, పిల్లలను హాస్టళ్లలో చేర్చ డం వంటివి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ మానసిక రుగ్మతకు గురైన వారికి త్వరగా చికిత్స చేస్తే పెద్దయ్యేసరికి మొండిజబ్బుగా మారకుండా చూసుకోవచ్చు. ⇒ కరోనా సమయంలో అన్ని వయస్సుల వారిలో మానసిక వ్యాధులు 25 శాతం పెరిగాయి. ఉద్యోగాలు పోవడం, చదువు మధ్యలో ఆపేయడం, ఆప్తుల్ని కోల్పోవడం, ఆసుపత్రుల పాలు కావడం లాంటి అనేక కారణాలతో మానసిక సమస్యలు పెరిగాయి. -
అకడమిక్ ప్రెజర్‌తో తస్మాత్ జాగ్రత్త!
యవ్వనం అంటేనే ఒక తుఫాను. అనేకానేక శారీరక, మానసిక, భావోద్వేగ, హార్మోన్ల మార్పులు ఒక్కసారిగా చుట్టుముడతాయి. వాటిని అర్థం చేసుకోలేక యువత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇవి చాలవన్నట్టు పదోతరగతి, ఇంటర్మీడియట్లలో చదువుల ఒత్తిడి పెరుగుతోంది. అది ప్రాణాలు బలికోరేంత ప్రమాదకరంగా మారుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (Nఇఖఆ) డేటా ప్రకారం 2020లో సుమారు 10,500 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల్లో 40 శాతం చదువుల ఒత్తిడితో ముడిపడి ఉన్నవేనని విద్యా మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. మరికొందరు తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు తేలింది. తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు..తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లల మీద వాళ్ల స్థాయికి మించిన ఒత్తిడి పెడుతున్నారు. ఇంట్లో ఉంటే చదువుకు ఇబ్బంది పడతారని హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇక కార్పొరేట్ కళాశాలలు కల్పించే ఒత్తిడి చెప్పనలవికాదు. వారం వారం పరీక్షలు నిర్వహిస్తూ, వాటిలో వచ్చే మార్కులను బట్టి క్లాసులు మారుస్తూ మరింత ఒత్తిడి పెంచుతున్నారు.‡ తూతూమంత్రంలా ఏడాది చివర స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. మొదటిసారి ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండటం, ఆటపాటలు, వ్యాయామం లేకుండా నిరంతరం పరీక్షలు, గ్రేడ్ పాయింట్లు, ర్యాంకులు వంటివన్నీ విద్యార్థుల ఆత్మవిశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. పర్ఫెక్షనిజం ప్రభావం.. ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలని టీనేజర్లు భావిస్తారు. అందుకోసం అసాధ్యమైన టార్గెట్స్ పెట్టుకుంటారు. వాటిని సాధించేందుకు నిద్రమాని చదువుతుంటారు. కానీ పర్ఫెక్షనిజం ఫిక్స్డ్ మైండ్‌సెట్‌కు దారితీస్తుంది. చదువుకూ, వ్యక్తిత్వానికీ తేడా తెలుసుకోలేరు. పర్ఫెక్షనిజం వల్ల తమ తెలివితేటలు, సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయని టీనేజర్లు నమ్ముతారు. ఇది వైఫల్యాలు శాశ్వతమని భావించేట్లు చేస్తుంది. దీంతో చిన్న ఫెయిల్యూర్ ఎదురైనా తట్టుకోలేక ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారు. ఇష్టంలేని చదువులు..చాలామంది విద్యార్థులు క్రీడలు, సంగీతం, డిస్కష¯Œ ్స, వాలంటీరింగ్ లాంటి భిన్న రంగాల్లో రాణించాలనుకుంటారు. కానీ ఆ వైపుగా ప్రోత్సహించే తల్లిదండ్రులు తక్కువ. దాంతో ఇష్టంలేని చదువులు టీనేజర్లలో ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు వారం వారం పరీక్షలు, మార్కులు, గ్రేడ్లు– టీనేజర్లను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాలపరంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తున్నాయి. ప్రతి పనికీ వంద శాతం సమయం ఇవ్వలేకపోతున్నామనే అపరాధభావానికి లోనుచేస్తున్నాయి.బ్యాలెన్స్ ముఖ్యం.. అకడమిక్ ప్రెజర్ తగ్గాలంటే టీనేజర్లను తమకు నచ్చింది చదవనివ్వాలి. ఏం చదివామనేది కాదు, ఎలా చదివామనేది ముఖ్యమని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇష్టంగా చదివినప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. చదువుతో పాటు స్పోర్ట్స్ లేదా వ్యాయామానికి అవకాశం కల్పించాలి. కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడం మాత్రమే సక్సెస్ అని భావించకుండా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆనందమే అసలైన సక్సెస్ అని నిర్వచించాలి.చదువుల ఒత్తిడికి కారణాలు.. 👉తమ పిల్లలు అత్యున్నత కెరీర్లో ఉండాలనే తల్లిదండ్రుల అంచనాలు · ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, ఉన్నత విద్యాసంస్థల కోసం తీవ్ర పోటీ · క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ కన్నా మార్కులు, ర్యాంకులపైనే ఎక్కువ దృష్టి పెట్టడం · పాఠశాలల్లో, కళాశాలల్లో కౌన్సెలింగ్ సౌకర్యాలు తక్కువగా ఉండటం 👉 ఆటపాటలకు అవకాశం లేకపోవడం, కోచింగ్, ట్యూషన్ల వల్ల అదనపు భారం · తగిన వనరుల్లేకుండానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో పోటీ 👉 అకడమిక్స్‌ను, ట్రెడిషనల్ జెండర్ రోల్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి యువతులపై అదనపు ఒత్తిడిఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యూహాలు.. 👉 మీ బలాలను అర్థం చేసుకుని వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోండి · తప్పులు, వైఫల్యాలను అర్థం చేసుకుని, వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగే గ్రోత్ మైండ్ సెట్‌ను పెంపొందించుకోండి · చదువు ఎంత ముఖ్యమో నిద్ర, వ్యాయామం, విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తించండి · సరైన టైమ్ మేనేజ్మెంట్ పద్ధతులు నేర్చుకుని, అమల్లో పెట్టండి · ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నప్పుడు మీలో మీరే బాధపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైకాలజిస్టుల సహాయం తీసుకోండి. -
ఈ అమ్మాయి జీనియస్.. 16 ఏళ్లకే రూ.100 కోట్ల కంపెనీ
సాధారణంగా 16 ఏళ్ల వయస్సులో పిల్లలు పదో తరగతి పూర్తి చేసి తర్వాత ఏం చదవాలో నిర్ణయించుకునే పరిస్థితిల ఉంటారు. కానీ ఈ అమ్మాయి అలా కాదు.. అప్పటికే కోట్లాది రూపాయల కంపెనీని స్థాపించింది. చిన్న వయసులోనూ అద్భుత విజయాలు సాధించవచ్చిన నిరూపించింది. స్ఫూర్తిదాయకమైన ఆ జీనియస్ అమ్మాయి విజయగాథ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..ప్రాంజలి అవస్తీ అమెరికాలో ఉంటుంది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో భారత్ నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యంత పరిజ్ఙానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించిన ఆమె 16 సంవత్సరాల వయస్సులోనే 2022లో తన ఏఐ స్టార్టప్, డెల్వ్ డాట్ ఏఐ (Delv.AI)ని స్థాపించింది. ఆమె వినూత్న ఆలోచనలు, అంకితభావం తన స్టార్టప్‌ను అతి తక్కువ సమయంలోనే అస్థిరమైన ఎత్తులకు చేర్చాయి. ప్రస్తుత దీని విలువ రూ. 100 కోట్లు.రెండేళ్లు కంప్యూటర్ సైన్స్, గణితాన్ని అభ్యసించిన తరువాత, అవస్తి 13 సంవత్సరాల వయస్సులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలోనే ఆమె మనసులో డెల్వ్ డాట్ ఏఐ ఆలోచన మొలకెత్తింది. మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలో పనిచేసిన ప్రాంజలి డేటాపై విస్తృతమైన పరిశోధన చేసింది. అనేక సమస్యలను పరిష్కరించడానికి ఏఐ కీలకమని గ్రహించింది.డెల్వ్ డాట్ ఏఐ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డేటా ఎక్స్ట్రాక్షన్ మెరుగుపరచడం, డేటా సిలోస్‌ను తొలగించడం చేస్తుంది. ఆన్లైన్ కంటెంట్ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో రీసెర్చర్లకు సహాయం చేస్తుంది. గతేడాది ప్రాంజలి స్టార్టప్‌కు రూ.3.7 కోట్ల నిధులు వచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. 10 మంది ఉద్యోగులు దాకా ఇక్కడ పనిచేస్తున్నారు. -
వైరల్ వీడియోల కోసం మరీ ఇలానా..! ఏకంగా రైలు పట్టాలనే..!
ఇటీవల సోషల్ మీడియా పిచ్చి మాములుగా లేదు. ఎంతలా అంటే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసేందుకు ఎలాంటి పిచ్చి పనులు చేసేందుకైనా వెనకాడటం లేదు. వ్యూస్, లైక్‌లు, ఫాలోవర్లు ఇదే లోకం, లక్ష్యం అన్నట్లుగా ఎలా పడితే అలా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అది సమంజసమైన వీడియోనేనా, నెటిజన్లకు ఉపయోగపడుతుందా అనేది అనవసరం. కొందరైతే ఘోరం ప్రమాదాలను సృష్టించి ఇతరుల ప్రాణాల రిస్క్‌లో పడేసి మరీ వీడియోలు తీసేస్తున్నారు. ఇలాంటి పనే చేశాడు 17 ఏళ్ల కుర్రాడు.ఏం చేశాడంటే..అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్‌లో వీడియో వైరల్ చేయాలనే కోరికతో దారుణానికి ఒడిగట్టాడు. వీడియో కోసం అని ఏప్రిల్‌లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్‌ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్‌లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు తప్పాయి.ప్రమాదం సృష్టించిన ఈ బాలుడే మళ్లీ రైల్వే అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరో కీలక స్విచ్‌లను మార్చినట్లు గుర్తించారు. ఎందుకనో పోలీసులు అనుమానంతో సమాచారం అందించిన బాలుడినే గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. విచారణలో ఆ బాలుడు..తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించాలనుకున్నట్లు తెలిపాడు. కానీ ఆ స్విచ్ మార్పులతో తనకు సంబంధం లేదని బుకాయించాడు. అయితే అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ప్రమాదానికి ముందు వాహనంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. అతడు బాలుడితో సరిపోలాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ ప్రమాదం కారణంగా ఒహామా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్‌కు, బీఎన్ఎస్ఎఫ్ రైల్వేకు దాదాపు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట.(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
టీనేజ్ అమ్మాయిలా కనిపించాలని లేదు: టబు
అందరివాడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ టబు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన మెప్పించింది. తెలుగులో అంతకుముందే విక్టరీ వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగమ్మ ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. మూడు దశాబ్దాలకు పైగా తనదైన నటనతో మెప్పిస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో కలిసి ఔరోన్ మే కహన్ దమ్ థాలో కనిపించనుంది. ఈ మూవీ ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సందర్భంగా తాజాగా టబు ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ద్వారా మరింత యవ్వనంగా కనిపించనున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి టబు స్పందిస్తూ.. తెరపై టీనేజ్ అమ్మాయిలా నటించాలని తనకు లేదని అన్నారు. తాను ప్రస్తుతం ఎలా ఉన్నానో.. అలాగే కనిపిస్తానని వెల్లడించింది. దర్శకుడు నీరజ్ పాండే కూడా తన వయస్సును తగ్గించి చూపే సాహసం చేయలేదని తెలిపింది. గతంలో నటీనటులు వయస్సుకి తగిన పాత్రలే చేసేవారని.. ఇటీవలి కాలంలో పాతనటులు సైతం యంగ్ పాత్రల్లో నటిస్తున్నారని టబు వివరించింది. కానీ ఈ సినిమాలో నాకు 30 ఏళ్ల అమ్మాయిలా చేయడం ఇష్టం లేదని తెలిపింది. ఈ చిత్రంలో నా వయస్సును దాచే ప్రయత్నం చేయలేదని పేర్కొంది. కాగా.. ఔరాన్ మే కహన్ దమ్ థా మూవీని రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేయనున్నారు. -
యువత.. తన కాళ్లపై తాను నిలవాలి!
మనుషులు తప్ప జీవ ప్రపంచంలోని ఏ జీవి అయినా పెరిగి పెద్దదైన తరువాత తల్లితండ్రులపై ఆధారపడటం తగ్గిస్తుంది. తన కాళ్లమీద తాను స్వతంత్రంగా నిలబడడానికి ప్రయత్నిస్తుంది. మనుషుల్లో కూడా చాలా సమాజాల్లో యువత టీనేజ్ దాటే సమయానికి బతకడం నేర్చుకుంటుంది. మన భారతీయుల్లోనే తల్లి తండ్రులపై ఎక్కువకాలం ఆధారపడుతున్నారు.అమెరికాలో ఒకవ్యక్తికి 15 ఏళ్లు వచ్చాయంటే, తల్లి తండ్రులకు అతన్ని ఇక పెంచి పోషించాల్సిన బాధ్యతల నుండి విముక్తి లభించినట్లే. ఒకసారి కళాశాలలో అడుగు పెడితే, వారి ఖర్చులకు డబ్బు వారే సంపాదించుకోవాలి. చదువుకుంటూ, పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకోవటం విదేశాలలో చూస్తుంటాము. కానీ మన దేశంలో ఉద్యోగం వచ్చేంత వరకు తల్లి తండ్రులే పోషించాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వృద్ధులైన తల్లి తండ్రులను పోషిస్తూ, ఇటు ఎదిగి వచ్చిన పిల్లలను కూడా పోషించటం వల్ల మధ్యతరగతి వర్గం చితికి పోతున్నారన్నది వాస్తవం. అదే ఎదిగి వచ్చిన పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం నేర్చుకుంటే, కొంతైనా భారం తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుకై వెళ్లే యువత అక్కడ చిన్న చిన్న ఉద్యాగాలు చేసుకుంటూ... తమ ఖర్చులకు తాము సంపాదించుకుంటూ చదువుకునే వాళ్ళు. అక్కడి యువతను చూసి మనవాళ్లూ అదే దారిలో నడిచేవాళ్లు. కాని, ఇప్పుడు అక్కడ కూడా తల్లితండ్రుల మీద ఆధారపడే యువత ఎక్కువ అవుతోంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లి తండ్రుల మీద ఆధారపడే యువత సంఖ్య పెరిగిపోతోంది. జంతువుల్లో కంగారూలు పిల్లల్ని చాలా కాలం మోస్తూ ఉంటాయి. అటువంటి తల్లి తండ్రులు మన దేశంలో ఎక్కువ ఆవుతున్నారు. దీనికి కొంత కారణం మన సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అనుబంధాలు కారణం. ఎదిగి వచ్చినా బతకలేని బిడ్డలను నెత్తి మీద మోస్తూ అప్పుల పాలవుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనీసం పెళ్ళి చేస్తేనన్నా బాధ్యతలు తెలిసివస్తాయని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసినా వీరి ధోరణిలో మార్పు రావటం లేదు. పైపెచ్చు కొడుకుతో పాటు కోడలిని కూడా పోషించాల్సి వస్తోంది. ఒకప్పుడు 1970వ దశకంలో చదువు లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే వాళ్ల సంఖ్య ఎక్కువగా వుండేది. లండన్, జపాన్ వంటి దేశాల్లో సైతం వీరి సంఖ్య ఎక్కువగా వుండేది. వీళ్ళను ‘ఫీటర్’ అని పిలిచే వాళ్ళు. ఎప్పుడు అయితే కంప్యూటర్ సెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరిగాయో వీరి సంఖ్య తగ్గుతూ వచ్చింది. కాని, మళ్ళీ ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నత చదువులు చదువుతున్న వారి సంఖ్య పెరిగినంతగా ఉద్యోగాలు పెరగకపోవటం, చదివిన చదువులు బతకటం ఎలాగో నేర్పక పోవటం, విలాస జీవనానికి అలవాటు పడటం, ధరల పెరుగుదల వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. చిన్నదైనా పెద్దదైనా సిగ్గుపడకుండా ఏదో ఒక పనిలో చేరి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. ‘శ్రమ విలువ తెలిసిన వాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బులతో బతకాలని కోరుకుంటారు. కాని, పరాన్న జీవులే వయసు మీద పడుతున్నా తల్లితండ్రుల దగ్గర చెయ్యి చాస్తూవుంటారు. నేటి ఇంటర్నెట్ యుగంలో... సామాజిక మాధ్యమాలు, చలన చిత్రాల వల్ల చెడు అలవాట్లకు గురై తమ శ్రమ విలువను గుర్తించ లేకపోతున్నారు. ఇటువంటి వాళ్లు మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువగా కనబడుతుంటారు. దేశంలో అంత కంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగం కూడా దీనికి కారణమే. ప్రభుత్వాలు ఉపాధి కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేకపోత మనదేశానికి వరంగా భావిస్తున్న యువశక్తి శాపంగా మారి పరాన్న జీవుల సమాజంగా తయారవుతుంది అనటంలో ఏ సందేహం లేదు.ఈదర శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ -
సిగరెట్స్ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం..
సిగరెట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా టీనేజర్స్ దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అలానే ఇక్కడొక యువతి దీనికి అడిక్ట్ అయ్యి చావు అంచులదాక వెళ్లి వచ్చింది. అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడింది. ఆమె సిగరెట్ వేపింగ్ మాదిరిగా ప్రమాదకరమైనది కాదనుకుని చేజేతులారా ఇంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నానని బాధగా చెప్పింది. అసలేంటి ఈ వేపింగ్? సిగరెట్స్ కంటే ప్రమాదకరమా..?యూకేకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి వేపింగ్‌కి అడిక్ట్ అయ్యింది. దీంతో ఊపిరితిత్తుల్లో గాయమై ఒక్కసారిగా పనిచేయడం మానేశాయి. ఇది ఆమె సరిగ్గా మే11న తన స్నేహితురాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జరిగింది. నిద్రలోనే శ్వాస సంబంధ సమస్యలతో శరీరం అంతా నీలం రంగంలోకి మారిపోవడం జరిగింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షల్లో న్యూమోథోరాక్స్‌కి గురవ్వడంతో ఊపరితిత్తులు పనిచేయడం మానేశాయని చెప్పారు. వెంటనే ఆమెకు ఊపరితిత్తుల భాగాన్ని తొలగించాలని వెల్లడించారు. ఇక్కడ న్యూమోథోరాక్స్ అంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోయి ఊపరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో అక్కడ గాయం అయ్యి ఒక్కసారిగా ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. అలాగే రోగి శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ టీనేజ్ అమ్మాయికి వైద్యులు సుమారు ఐదున్నర గంటల పాటు సర్జరీ చేసి తక్షణమే డ్యామేజ్ అయిన ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. తాను చాలా భయానకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, వేపింగ్ ఇంత ప్రమాదమని అస్సలు అనుకోలేదని కన్నీటిపర్యతమయ్యింది. ఇక దాని జోలికి వెళ్లనని, జీవితం చాలా విలువైనదని దాన్ని సంతోషభరితంగా చేసుకోవాలని చెబుతోంది. ఇంతకీ ఏంటీ వేపింగ్..?వేపింగ్ అంటే..?బ్యాటరీతో నడిచే ఎలెక్ట్రానిక్ 'ఈ సిగరెట్' పరికరం నుంచి వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు. 'ఈ-సిగరెట్స్' బ్యాటరీతో పని చేస్తాయి. మామూలు సిగరెట్స్‌లో పొగాకు మండి పొగ వస్తుంది. ఈ-సిగరెట్స్‌లో పొగాకు, ఫ్లేవర్స్, కెమికల్స్‌తో నిండిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్‌ని వేడి చేస్తే పొగ / వేపర్ వస్తుంది. ఈ పొగని పీల్చడమే వేపింగ్ అంటే. ఇది సిగరెట్ కంటే ప్రమాదకారి కాదు. కానీ దీనిని స్మోకింగ్ మానడానికి ఒక మెట్టుగా మాత్రమే ఉపయోగిస్తారని చెబుతున్నారు నిపుణులు . అయితే ఇది కూడా ఆరోగ్యాని అంత మంచిది కాదనే చెబుతున్నారు. అంతేగాదు వేపింగ్ ఎడిక్షన్కి గురైతే..బాధితులు ఒక వారానికి 400 సిగరెట్లు సేవించడం వల్ల వచ్చే దుష్ఫరిణాన్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులుదుష్పలితాలు..వేపింగ్ ఊపిరితిత్తులని డామేజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ని బాడీలోకి రిలీజ్ చేసి కేన్సర్ రావడానికి కారణం అవుతాయి. రోగ నిరోధక శక్తి బాగా బలహీన పడుతుంది. పిల్లలూ, టీనేజ ర్స్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. స్త్రీలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ-సిగరెట్స్ యూజ్ చేస్తే అబార్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..) -
చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి
మార్కులు రాలేదని తల్లి పెద్ద ర్యాంకు రాలేదని తండ్రి ఫలానా కోర్సు చదవాలని తల్లి ఆ కాలేజీలోనే చేర్పిస్తానని తండ్రి టీనేజ్ పిల్లలకు ఇది కీలక సమయం. వారు ఇంటర్లో, డిగ్రీలో చేరాలి. కాని పిల్లల మాట వింటున్నారా? మీరే గెలవాలని పట్టుబడుతున్నారా? అప్పుడు పిల్లలు లోలోపల నలిగి పోవడం కన్నా ఏం చేయలేరు. పత్రికల్లో వస్తున్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి.‘నువ్వు ఆ కోర్సు చేయాలనేది మా కల’ అనే మాట తల్లిదండ్రుల నుంచి వెలువడితే అది పిల్లల నెత్తిమీద ఎంత బరువుగా మారుతుందో పిల్లలకే తెలుసు. టీనేజ్ మొదలయ్యి టెన్త్ క్లాస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ‘కలలు వ్యక్తపరచడం’ తల్లిదండ్రులు మొదలెడతారు. టెన్త్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో, ఇంటర్లో ఏ స్ట్రీమ్‌లోకి వెళ్లాలో, అందుకు ఏ కాలేజీలో చేరాలో, ఆ కాలేజీ ఏ ఊళ్లో ఉంటే బాగుంటుందో ఇన్ని డిసైడ్ చేసి పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు వినాలి. వారికి ఏ అభిప్రాయం లేకుండా ఆ కోర్సు పట్ల ఆసక్తి ఉంటే మంచిదే. వారికి మరేదో ఇంటరెస్ట్ ఉండి, ఇంకేదో చదవాలని ఉంటే... ఆ సంగతి చెప్పలేకపోతే ఇబ్బంది. అది భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టగలదు.ఏంటి... ఆ కోర్సా?ఆ ఇంట్లో తండ్రి అడ్వకేట్, తల్లి గవర్నమెంట్ ఉద్యోగి. కుమార్తెకు మేథ్స్గాని, బయాలజీగాని చదవాలని లేదు. హాయిగా టీచర్‌గా సెటిల్ అవ్వాలని ఉంది. తన స్కూల్లో చక్కగా తయారై వచ్చే టీచర్ పిల్లల పేపర్లు దిద్దే సన్నివేశం ఆ అమ్మాయికి ఇష్టం. తాను కూడా టీచరయ్యి పేపర్లు దిద్దాలని అనుకుంటుంది. టెన్త్ అవుతున్న సమయంలో ‘టీచర్ అవుతాను’ అని కూతురు అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ‘మన హోదాకు టీచర్ కావడం ఏం బాగుంటుంది... మన ఇళ్లల్లో టీచర్లు ఎవరూ లేరే’ లాంటి మాటలు చెప్పి ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చేయలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. డిప్రెషన్ తెచ్చుకుంది. అదే ‘టీచర్ కావాలనుకుంటున్నావా? వెరీగుడ్. అక్కడితో ఆగకు. నువ్వు హార్వర్డ్‌లో ప్రోఫెసర్ అవ్వాలి. అంత ఎదగాలి’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే హార్వర్డ్‌కు వెళ్లకపోయినా ఒక మంచి యూనివర్సిటీలో లెక్చరర్ అయినా అయ్యేది కదా.అన్నీ మాకు తెలుసుతల్లిదండ్రులకు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి ఉంటుంది. నిజమే. కాని వాళ్లు ఇప్పుడున్న స్థితి రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల దారుల్లో ప్రయత్నించి ఒక మార్గంలో సెటిల్ అయి ఉంటారు. తమ లాగే తమ పిల్లలు కూడా కొన్ని దారుల్లో నడవాలని అనుకోవచ్చు అని భావించరు. అన్నీ తమ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు, ఓవర్ కన్సర్న్ చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఉదాహరణకు ఒకబ్బాయికి ‘నీట్’లో మెడిసిన్ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. కాని డెంటిస్ట్రీ సీటు వచ్చే ర్యాంకైతే వచ్చింది. అబ్బాయికి ఆ కోర్సు ఇష్టమే. కాని తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలాగైనా ఎంబిబిఎస్ మాత్రమే చదవాలనేది ‘కల’. ‘లాంగ్ టర్మ్ తీసుకో’ అని సూచించారు. లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం వృథా అవుతుంది... పైగా ఈసారి ఎంట్రన్స్‌లో కూడా మంచి ర్యాంక్ వస్తుందో రాదో అనే భయం ఆ అబ్బాయికి ఉన్నా బలవంతం చేస్తే ఎంత చెప్పినా వినకపోతే ఆ అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అవ్వడా?ప్రతిదీ నిర్ణయించడమేతల్లిదండ్రుల స్తోమత పిల్లలకు తెలుసు. వారు చదివించ దగ్గ చదువులోనే తమకు ఇష్టం, ఆసక్తి, ప్రవేశం ఉన్న సబ్జక్టును చదవాలని కోరుకుంటారు. పైగా తమ స్నేహితుల ద్వారా వారూ కొంత సమాచారం సేకరించి ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు చదవాలని నిశ్చయించుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికి ఏ మాత్రం విలువ లేకుండా ఎలాగైనా చేసి రికమండేషన్లు పట్టి తాము ఎంపిక చేసిన కాలేజీలోనే చదవాలని శాసిస్తారు. ఇది అన్నివేళలా సమంజసం కాదు. ఒత్తిడి వద్దుటీనేజ్ సమయంలో పిల్లల భావోద్వేగాలు పరిపక్వంగా ఉండవు. కొంత తెలిసీ కొంత తెలియనితనం ఉంటుంది. ఆసక్తులు కూడా పూర్తిగా షేప్ కావు. ఇంటర్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి వారికి ఎన్నో సందేహాలుంటాయి. ఎంపికలు ఉంటాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ‘తాము చదివించాలనుకున్న కోర్సు’ కోసం ఏకంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇంట్లో ఉండి చదివే వీలున్నా రెసిడెన్షియల్ కాలేజీల్లో పడేస్తున్నారు. అంతంత మాత్రం చదువు చెప్పినా పర్లేదని మెడిసన్ పట్టా ఉంటే చాలని ఆసియా దేశాలకు సాగనంపుతున్నారు. పిల్లలతో ఎంతో మాట్లాడి, కౌన్సెలింగ్ చేసి, మంచి చెడ్డలన్నీ చర్చించి, వారికి సంపూర్ణ అవగాహన కలిగించి రెండు ఆప్షన్లు ఇచ్చి వారి ఆప్షన్లు కూడా పరిగణించి సానుకూలంగా ఒక ఎంపిక చేయడం ఎప్పుడూ మంచిది. లేదంటే ‘కోటా’ లాంటి కోచింగ్ ఊర్లలో జరుగుతున్న విషాదాలు, హైదరాబాద్‌లాంటి చోట్ల ఇల్లు విడిచి పోతున్న సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది. -
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌చేసిన వ్యక్తి ఒమర్‌ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్‌తో వెలుగులోకి కిడ్నాపర్‌కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్‌చేశారు. ఈ పోస్ట్‌ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్‌ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్‌కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మరో బ్యూటీ!..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అది మరువకు మునుపే మరో బ్యూటీ తన కిరీటాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. అందాల తారలు వరుస ప్రకటనలు అమెరికా అందాల పోటీల నిర్వాహకులను తీవ్ర గందరగోళంలో పడేశాయి. నోలియా రాజీనామా చేసిన రెండు రోజులకే 17 ఏళ్ల మిస్ టీన్ యూఎస్ఏ ఉమా సోఫియా తాను కూడా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మెక్సికన్ ఇండియన్ అమెరికన్ అయిన ఉమా సోఫియా నా విలువలు సంస్థ తీరుతో పూర్తిగా సరిపోవడం లేదని అందువల్ల తాను తన స్థానం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను ఈ అత్యున్నత టైటిల్‌ని గెలుకోవడంలో సహకరించిన తన కుటుంబం, తన రాష్ట్ర ప్రజలు, తన సహ మోడళ్లకు ఎంతగానో రుణపడి ఉన్నాను.వారందిరి ఆదరాభిమానానికి కృతజ్ఞతలు అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. జాతీయ స్థాయిలో తొలి మెక్సికన్ ఇండియన్ అమెరికన్‌గా తన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని పేర్కొంది. ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..ఉమా సోఫియా శ్రీవాస్తవ అమెరికా తొలి మెక్సికన్ ఇండియన్ అమెరికన్ మిస్ న్యూజెర్సీ టీన్. యూఎన్ అంబాసిడర్ కావలన్నది ఆమె కల. ఆమె భారతదేశంలోని అనగారిన పిల్లలకు చక్కటి విద్య, సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడటానికి లోటస్ పెటల్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తుంది. ఉమాసోఫియా తన దివైట్ జాగ్వర్ పుస్తకాన్ని రచించారు. ఆమె మొత్తం నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె ఒక పియానిస్ట్ దట్స్ ఫ్యాన్ బిహేవియర్‌ని నడుపుతోంది. ప్రస్తుతం ఆమె జూనియర్ కళాశాల విద్యను అభ్యసిస్తోంది.(చదవండి: తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!) -
హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..
అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు చాలమంది. ఇలా అందం కోసం చేయించుకున్న సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒకటో రెండో సర్జరీలు అయితే ఓకే. కానీ ఇక్కడొక అమ్మాయి తనకు నచ్చిన హీరోయిన్లా ఉండాలని ఎన్ని సర్జరీలు చేయించుకుందో వింటే కంగుతింటారు. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఝూ చునా జస్ట్ 13 ఏళ్ల వయసుకే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలనుకుంది. తనకు ఇష్టమైన నటి ఎస్తేర్ యులా ఉండాలని కోరుకుంది. ఇలా ఈ ఏజ్‌లోనే ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకోవాడానికి ప్రధాన కారణం..ఆమె స్నేహితులు, బంధువులు తన తల్లి కంటే అందంగా లేవని చెప్పడం తట్టుకోలేకపోయింది. అదీగాక తన తోటి విద్యార్థులు కూడా అందంగా ఉండటం వల్లే కాన్ఫిడెంట్‌గా ఉన్నారని నమ్మింది. ఇవన్నీ కలగలసి చునాని ఆత్మనూన్యత భావంలోకి నెట్టి..తన రూపాన్ని మార్చుకోవాలనే చర్యకు ప్రేరేపించాయి. అలా చునా 13 ఏళ్ల నుంచి ప్లాస్టిక్ సర్జరీల చేయించుకోవడం ప్రారంభంచింది. అయితే ఆమె తల్లి తొలి ఆపరేషన్‌కి సపోర్ట్ చేసి డబుల్ కనురెప్పల ప్రక్రియకు అనుమతించింది. ఆ తర్వాత నుంచి చునా ఒక్కొక్కటిగా రూపాన్ని మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమైపోయింది. అలా పాఠశాల విద్యకు కూడా దూరమయ్యింది. ఇలా ఆమె దాదాపు అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలను దాదాపు వందకు పైగా చేయించుకుంది. వాటిలో రినోప్లాస్టి, బోన్ షేవింగ్ వంటి క్రిటికల్ ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఉన్నాయి. డాక్టర్లు తన కళ్లను పెద్దవి చేసే పని చేయడం కుదరదని హెచ్చరించారు. అయినా సరే లెక్కచేయక వేరే డాక్టర్ని సంప్రదించి చేయించుకుంది. ఆ సర్జరీల్లో అత్యంత పెయిన్‌తో కూడిన సర్జరీ బోన్ షేవింగ్. దీన్ని ఏకంగా పది గంటలపాటు చేస్తారు వైద్యులు. దీని కారణంగా 15 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఇన్ని నరకయాతనలు అనుభవించినా కూడా.. ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా అచ్చం తను ఇష్టపడే హీరోయిన్లా ఉండే సర్జరీలు చేయించుకోవడం ఆపకపోవడం కొసమెరుపు. ఇక్కడ ఏ వైద్యుడు ఆమెకు ఒక్కసారి ప్లాస్టిక్ సర్జరీ చేశాక మరో సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చేవాడు కాదు. అయినా ఆ తిరస్కరణలు కూడా పట్టించుకోకుండా ఇంకో డాక్టర్ ..ఇంకో డాక్టర్ అంటూ సంప్రదిస్తూ ఆపరేషన్ చేయించుకుంది. ఇలా ఆమె వందకు పైగా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు రూ. 4 కోట్లకు పైగా ఖర్చు చేసిందట. అయితే ఇన్ని ఆపరేషన్లకు చునా తల్లి కూడా సపోర్ట్ చేయలేదు. ఇక ఆమె తండ్రి చునా కొత్త రూపాన్ని అస్సలు అంగీకరించ లేదు. అలాగే ఆమె స్నేహితులు సైతం ఆమె కొత్త రూపాన్ని చూసి చునా అని గుర్తుపట్టులేకపోయారు. ఏదీఏమైతేనే చునా అనుకున్నది సాధించి అన్ని బాధకరమైన సర్జరీ ప్రక్రియలను చేయించుకుని మరీ తనకు ఇష్టమైన హీరోయిన్లా మారాలనే కలను నిజం చేసుకుంది. ప్రస్తుతం చునాకి 18 ఏళ్లు. ఇక తన శస్త్రచికిత్సా ప్రయత్నాలను కూడా ముగించినట్లు ప్రకటించింది. మరీ ఇంతలా అందం కోసం ప్రాణాలనే పణంగా పెట్టే వెర్రీ మనుషులు ఉంటారా? అనిపిస్తుంది కదూ!.. (చదవండి: చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం
అమ్మానాన్నా మాట్లాడుతున్నా సరే, వినకుండా విసురుగా వెళ్లిపోవడం వ్యంగ్యంగా మాటలు అనేయడం నాటకీయంగా కళ్లు తిప్పడం ఉన్నట్టుండి తమ గదిలోకి వెళ్లి ‘ధఢేల్’న తలుపులు వేసుకోవడం ఇలాంటివెన్నో సంఘటనలు... టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులకు తెలియని విషయమేమీ కాదు. ఒంటరి తల్లులకు పిల్లల పెంపకం మరింత కష్టంగా ఉంటుంది. పిల్లల చంచలమైన భావాలను నియంత్రించలేక తల్లులు చాలాసార్లు మౌనంగా మారిపోతుంటారు. ఇంట్లో టీనేజర్లు సృష్టించే యుద్ధ వాతావరణంలో ఎవరు గెలుస్తారో ప్రతి పేరెంట్కు తెలుసు కాబట్టి ఆర్‌ఎమ్‌ఎఫ్ మంత్రాన్ని మననం చేసుకోండి అంటున్నారు నిపుణులు. రెస్ట్ మామ్ ఫేస్ (ఆర్‌ఎమ్‌ఎఫ్) అనే ఈ మంత్రం అమ్మ ముఖకవళికలను పిల్లల ముందు ఎలా ప్రదర్శించాలి, అందుకు తగిన సాధన ఏ విధంగా చేయాలో నిపుణులు చెబుతున్నారు. ‘టీనేజ్‌లో ఉన్న మా అమ్మాయి విషయంలో చాలాసార్లు నా ప్రవర్తన ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుంది. చికాకు పరిచే సంఘటనలు ఎదురైనప్పుడు నా ఎమోషన్స్‌ని సమర్థంగా నియంత్రించలేక పోతుంటాను’ అంటుంది కార్పొరేట్ ఆఫీసులో హెడ్‌గా పనిచేసే కౌముది. ‘మా అబ్బాయితో గొడవపడటం, పదే పదే చెప్పడం, గతంలో చేసిన ్రపామిస్లను గుర్తుచేయడం అదేపనిగా జరుగుతుంటుంది. కానీ, ఆ వెంటనే తప్పనిసరై నాకు నేనే తగ్గడం, మౌనంగా ఉండటం, లేదంటే సర్దిచెప్పడం.. ఎప్పుడూ జరిగే పనే’ అంటుంది బొటిక్‌ను నడిపే వింధ్య. ‘కుటుంబ ఆకాంక్షలను పిల్లలు తీర్చాలనే లక్ష్యంగానే నేటి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటోంది. తల్లులు టీనేజ్ పిల్లల విషయంలో తమను తాము నియంత్రించు కోవడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది’ అని తెలియజేస్తుంది హోలీ గ్రెయిల్ ఆఫ్ పేరెంటింగ్ మ్యాగజైన్. ఎలాంటి భావోద్వేగాలను ముఖంలో చూపని తటస్థ స్థితిని రెస్టింగ్ మామ్ ఫేస్ సాధన చేస్తే సరైన ప్రయోజనాలను ΄÷ందవచ్చు అని చెబుతోంది. అదెలాగో చూద్దాం. తటస్థంగా.. సాధారణంగా ఎలాంటి వ్యక్తీకరణ లేని స్త్రీ ముఖాన్ని చూసిన వాళ్లు అహంకారమనో లేదా నిరాడంబరత అనో నిర్ధారించుకుంటుంటారు. సంతోషించే సమయంలోనూ వీరు ‘తటస్థ’ ముఖాలతో ఉండటం చూస్తుంటాం. చూసేవారికి వీరి ముఖాల్లో ప్రశాంతత కూడా కనిపిస్తుంటుందని పరిశోధకులు గ్రహించారు. అందరూ ఇలా ఉండలేరు. కానీ, పిల్లల ముందు తమ భావోద్వేగాలను బయటకు చూపకుండా తమని తాము నిభాయించుకుంటూ ఉండాలంటే ్రపాక్టీస్ అవసరం. విశ్రాంతికి 30 సెకన్లు అమ్మల ముఖం పిల్లల ముందు సరైన విధంగా ఉండాలంటే...ఫేస్ యోగాను సాధన చేయాలి. కోపంగా ఉన్న పిల్లలతో మాట్లాడేముందు ముఖ కండరాలకు కూడా విశ్రాంతి అవసరం అని తమకు తాముగా చెప్పుకోవాలి. రెండు పిడికిళ్లతో ముఖాన్ని రుద్దుకుంటున్నట్టు, కోపాన్ని కూల్ చేసుకుంటున్నట్టు ఊహించుకోవాలి. గాఢంగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. అయితే, అది ఎదుటివారికి నిట్టూర్పులా ఉండకూడదు. మీ ముఖ కండరాలలో చికాకు, ఆశ్చర్యం, విమర్శిం చడం ... వంటివన్నీ తీసేసి, స్పష్టంగా అనుకున్న విషయాన్ని చెప్పేయాలి. చిన్నపిల్లలు యుక్తవయసులో ఉన్నా, పెద్దవారైనప్పుడైనా ఈ ఆర్‌ఎమ్‌ఎఫ్ ఉపయోగకరంగా ఉంటుంది. నిజాయితీగా ఈ వ్యూహాన్ని అమలుపరిస్తే ప్రయోజనకరమైన మార్పులు కనిపిస్తాయి. గొడవ పడే సమయాల్లో ఎలాంటి బోధలు చేయద్దు. అలాగే శిక్షించవద్దు. పిల్లలు వారి భావోద్వేగాలను స్వీయ – నియంత్రణ చేయగలిగేలా చేయడమే లక్ష్యంగా ఉండాలి. మీ బిడ్డ తన ఆందోళనను, అసంతృప్తిని మరింత ఆమోదయోగ్యమైన మార్గాల్లో వ్యక్తపరచలేకపోతే అకస్మాత్తుగా దాడికి దిగవచ్చు. లేదంటే తనని తాను బాధించుకోవచ్చు. అందుకని సమస్యను కూల్‌గా పరిష్కరించాలి. బంధాలు పదిలం.. ‘తల్లి మెరుగైన ఆలోచనతో ఉంటే పిల్లలతో స్నేహాలను, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంచుకోగలదు. కానీ, నియంత్రణతో సరైన ప్రయోజనాలను రాబట్టలేరు’ అంటారు సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ రైటర్ అలిజా. పిల్లల ఆకలి తీరినప్పుడు వారి కోపం చల్లబడుతుంది. అందుకని వారికి ఆరోగ్యకరమైన చిరుతిండిని అందిస్తుండాలి. దీంతో పిల్లల దృష్టి మారిపోతుంది. కానీ, అన్ని విషయాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు ఆర్ఎమ్ఎఫ్ని సాధన చేయడమే మేలు అనేది నిపుణుల మాట. -
తిట్టడం సులభం.. ఫలితం అనూహ్యం
ఇంటికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన టీనేజ్ కుమారుణ్ణి తల్లిదండ్రులు మందలిస్తే ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన ఇది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను సరి చేయాలని ఆందోళన చెందడం మంచిదే కాని పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని వారి పొరపాట్లకు కారణాలను తెలుసుకోకుండా వారు చెప్పేది అర్థం చేసుకోకుండా తిడితే అసలుకే ప్రమాదం వస్తుంది. టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి? ఇంటర్ చదివే కుర్రాడు కాలేజ్ అయిపోయాక రెండు గంటల ఆలస్యంగా ఇంటికొచ్చాడు. తల్లిదండ్రుల ఆలోచన: వీడు టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. ఏ పనికిమాలిన బ్యాచ్తోనో తిరుగుతున్నాడు. ఏదో సినిమాకు వెళ్లి ఉంటాడు. ఇలా అయితే వీడు ర్యాంక్ తెచ్చుకున్నట్టే. వీడు ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ఇవాళ వీడికి బాగా పడాలి. కుర్రాడి ఆలోచనలు: ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్లాసులు చాలా స్ట్రెస్‌గా ఉంటున్నాయి. కొంచెం కూడా రిలాక్స్ అవడానికి లేదు. మా బ్యాచ్ అంతా కాసేపు బేకరీకి వెళ్దామంటున్నారు. నేను వెళ్లకపోతే వాళ్లు నన్ను ఐసొలేట్ చేస్తారు. అలుగుతారు. బ్యాచ్ నుంచి కట్ చేస్తారు. అందరూ వెళుతుంటే నేనెందుకు వెళ్లకూడదు. వెళ్లి ఇంటికి వెళతా. రెండు వెర్షన్లు సరైనవే. కాని ఒక వెర్షన్ వారికి ఆధిపత్యం ఉంటుంది. మరో పక్షం వారికి ఆందోళన ఉంటుంది. తల్లిదండ్రులు ఇంటి యజమానులు. కుర్రాడికి కూడా యజమానులు. వారు యజమానులు కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడవుతారంటే ఆ కుర్రాడు ఏదీ దాచకుండా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు. చెప్పుకునే వాతావరణం ఉన్నప్పుడు. దానిని అర్థం చేసుకుని ఎంతవరకు అలౌ చేయాలో అంత వరకూ అలౌ చేయగలిగినప్పుడు. పై సందర్భంలో ఆ కుర్రాడు ‘మా బ్యాచ్ అంతా బేకరీకి వెళ్దామంటున్నారు’ అని కాల్ చేస్తే తల్లిదండ్రులు ‘సరే.. వెళ్లు. కాని దాని వల్ల నీ టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగని వెళ్లకపోతే బాగుండదు. ఒక గంట సేపు ఉండి వచ్చెయ్’ అనగలిగితే ఆ కుర్రాడు 45 నిమిషాలే ఉండి వచ్చే అవకాశం ఉంది. కాని తిడతారనే భయంతో చెప్పకుండా, లేట్‌గా ఇంటికొచ్చినప్పుడు... తల్లిదండ్రులు ముందు వెనుకా చూడకుండా చెడామడా తిడితే ఆ చిన్న హృదయం ఎంత ఇబ్బంది పడుతుంది? సెన్సిటివ్ పిల్లలు అయితే అఘాయిత్యానికి పాల్పడితే? అంగీకరించాలి: టీనేజ్‌లోకి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రస్తుత స్థితిని అంగీకరించాలి మొదట. తమ టీనేజ్ కాలానికి ఇప్పటి టీనేజ్ కాలానికి కాలం చాలా మారిపోయి ఉంటుందని గ్రహించాలి. తమలాగే తమ పిల్లలు ఉండాలనుకుంటే అది కాలానికి విరుద్ధం. ఈ కాలంలో పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటారు. అందులో ఏ మేరకు చెడు ఉందో చూసి దానిని పరిహరించడానికి మాత్రమే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలకు సవాళ్లు: మీ పిల్లలు మీకు సమస్య సృష్టిస్తున్నారా? లేదా మీరు మీ పిల్లలకు సమస్య సృష్టించారా? మీ పిల్లలు వారికి ఇష్టమైన కోర్సు చదివేలా చూశారా? వారు యావరేజ్ స్టూడెంట్ అయినా ఫస్ట్ ర్యాంక్ రావాలని వెంట పడుతున్నారా? వారి జ్ఞాపకశక్తి పరీక్షలకు వీలుగా ఉందా? వారికి అన్ని సబ్జెక్ట్‌లు అర్థం అవుతున్నాయా? వారికి పరీక్షల వొత్తిడి ఎలా ఉంది? వారికి ఏ మాత్రమైన ఆహ్లాదం అందుతోంది? ఇవన్నీ గమనించకుండా పిల్లలు మరబొమ్మల్లా ఎప్పుడూ చెప్పినట్టల్లా వింటూ కేవలం పుస్తకాలు మాత్రమే పట్టుకుని కూచోవాలని ఆశిస్తే ఆ పిల్లలకు ఉక్కిరిబిక్కిరి ఎదురవుతుంది. దాని నుంచి బయటపడాలని తల్లిదండ్రులకు తెలియకుండా దొంగపద్ధతులకు దిగుతారు. అది తల్లిదండ్రులకు ఇంకా తప్పుగా కనిపిస్తుంది. వారు తప్పు చేసేలా చేసింది తల్లిదండ్రులే మరి. పనిష్మెంట్ వద్దు ఇన్స్పిరేషన్ ముఖ్యం: పిల్లలు టీనేజ్‌లోకి వచ్చాక మానసికంగా, శారీరకంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు. ఆ సమయంలో వారు ఫోకస్ పెట్టి చదవాలని అనుకున్నా కొన్ని డిస్ట్రాక్షన్లు ఉంటాయి. అంతేగాక ఈ సమయంలో వారు ఎన్నో సందేహాలతో ప్రవర్తనకు సంబంధించి సంశయాలతో ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో సన్నిహితంగా ఉంటూ వారితో సంభాషిస్తూ ‘ఏదైనా మాతో చెప్పి చేయండి’ అనే విధంగా మాట్లాడితే చాలా సమస్యలు తీరుతాయి. చదువు పట్ల, ప్రవర్తన పట్ల వారిని తల్లిదండ్రులు ఇన్‌స్పయిర్ చేసేలా ఉండాలి తప్ప పనిష్మెంట్ చేసేలా ఉండకూడదు. తిట్టడం, కొట్టడం అనేవి కాదు చేయాల్సింది. బుజ్జగించడం, బతిమాలడం కూడా కాదు. కేవలం స్నేహంగా గైడ్ చేయడం. వారి వల్ల జరిగే తప్పులను, పొరపాట్లను జడ్జ్ చేయకుండా వారి వైపు నుంచి ఆలోచించి వారికి అర్థమయ్యేలా సరి చేయడం. టీనేజ్‌లో ఉన్న పిల్లలకు పెద్దవాళ్లు చెప్పేది అర్థమవ్వాలంటే వారు పెద్దవాళ్లంత వయసుకు చేరాలి. కాబట్టి తల్లిదండ్రులే పిల్లల వయసుకు దిగి పిల్లలతో వ్యవహరించడం ఇరుపక్షాలకు శ్రేయస్కరం. -
సీబీఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో... డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు
న్యూఢిల్లీ: టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం.. తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సీబీఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి ఛాప్టర్లను తమ 9వ తరగతి ‘వాల్యూ ఎడిషన్’ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసి మెలసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. ‘డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్: అండర్స్టాండింగ్ యువర్సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్ధాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలవంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్‌ఫిషింగ్’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్’, ‘సైబర్ బులీయింగ్’ పదాలకు అర్ధాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. ‘క్రష్’, ‘స్పెషల్’ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు. -
పీరియడ్ నొప్పిని భరించలేక ఆ మాత్రలు వేసుకుంది! అంతే..
మహిళలకు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి సహజంగానే వస్తుంది. కొందరికీ మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటుంది. కొద్దిమందిలో మొదటి రెండు రోజులు తట్టుకోలేని నొప్పి ఉంటుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో పెయిన్ తట్టుకోలేకపోతే వైద్యుల సూచించిన లేదా నొప్పి ఉపశమించే మందులను వాడుతుంటారు మహిళలు. అలానే ఇక్కడొక అమ్మాయి కూడా మాత్రలు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని లైలా అనే అమ్మాయి పిరియడ్ నొప్పి భరించలేక అల్లాడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆ నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని సూచించారు. లైలా వారి చెప్పినట్లే నవంబర్ 25 నుంచి ఆ టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించింది. అంతే ఆ ట్యాబ్లెట్లు వాడిన మూడు వారాల తర్వాత నుంచి ఆమెకు తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమేణ పరిస్థితి సీరియస్‌గా మారిపోయింది. డిసెంబర్ 5 నుంచి తీవ్రమైన వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. ఇక క్రమక్రమంగా పరిస్థితి విషమించడం మొదలైంది. ఆమె కడుపు నొప్పిని తాళ్లలేక పోవడంతో కుటుంబ సభ్యలు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని అనుమానించారు. కానీ సీటీ స్కాన్‌లో వైద్యులకే దిమ్మతిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపు నొప్పి ..అంటే కడుపులో సమస్య అనుకుంటే అసలు సమస్య బ్రెయిన్లోనే ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరచడమే గాక కలవరపరిచింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వారు వెంటనే డిసెంబర్ 13న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయితే ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఆ మాత్రలు వేసుకుంటే త్గగుతుంది అనంగానే ఆమెలా అనాలోచితంగా వేసుకోవద్దు. ఒక వేళ అలా వేసుకోవాలనుకున్నా ముందు మీ పెద్దవాళ్లకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది. మాత్రలు అందరీకి ఒకేలా రియాక్షన్ ఇవ్వవు. దీన్ని కూడా గుర్తించుకోవాలి. మన శరీర ఆరోగ్య పరిస్థితి, మనకున్న ఆహారపు అలవాట్లు అన్నింటిని పరిగణించి వైద్యులు మాత్రలు ఇస్తారు. ఒక్కొసారి డాక్టర్లు ఇచ్చినవే మనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా తెలిసిన మాత్రలో లేక ఎవరో చెప్పారనో ఎలాంటి మందులు తీసుకోవద్దు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగల్చకండి అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!) -
13 ఏళ్లకే ‘అత్యంత మేధావి’గా.. తెలంగాణ కొత్తగూడెం మిస్ టీన్!
ఖమ్మం/కొత్తగూడెం: అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న సియాటల్ నగరంలో ఈనెల 16న ‘సామాజిక విద్యాపరమైన సమతుల్యత’ అంశంపై జరిగిన ఈవెంట్లో కొత్తగూడేనికి చెందిన పదమూడేళ్ల బాలిక అవ్యుక్త గెల్లా ప్రతిభ కనబరిచి అత్యంత మేధావి అవార్డుకు ఎంపికైంది. అమెరికాలో ఉంటున్న గెల్లా గణేష్ – రాధిక కుమార్తె అవ్యుక్తతో పాటు 13 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 30 మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ టీన్ విభాగంలో అవ్యుక్త పలు అంశాలపై తన ప్రసంగంతో ఆకట్టుకోగా అవార్డుకు ఎంపిక చేశారు. ఈమేరకు ఆమె తాతయ్య, అమ్మమ్మ అయిన కొత్తగూడేనికి చెందిన వసుంధర వస్త్ర దుకాణం యజమానులు తాటిపల్లి శంకర్‌బాబు – రాజేశ్వరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది! -
మిస్సింగ్ కేసుని చేధించిన ఆ 'ఎమోషనల్ ఫేస్బుక్ సందేశం"
ఈ రోజుల్లో పొరపాటున పిల్లలు తప్పిపోతే దొరకడం చాలా కష్టం. పోలీసులు చుట్టు తిరిగినా దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పిల్లలను ఎత్తకుపోయే ముఠాలు, మానవ అక్రమ రవాణ తదితరాల కారణంగా ఆచూకి అంత ఈజీ కాకుండా పోయింది. ఐతే ఈ ఆధుననిక టెక్నాలజీ ఈ విషయంలో సహకరిస్తుందని చెప్పాలి. ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ సెకన్లలో చేరి ఏదో రకంగా వాళ్ల ఆచూకీ లభించి కుటుంబ చెంతకు చేరిన ఎన్నో ఉదంతాలు చూశాం. అలాంటి ఆశ్చర్యకర ఉదంతమే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యూకేకి చెందిన అలెక్స్ బట్టీ ఆరేళ్ల వయసులో తప్పిపోయాడు. స్పెయిన్‌లో ఉండగా సెలవుల్లో తన అమ్మ, తాతయ్యలతో కలిసి ఊరికి వెళ్తుండగా తప్పిపోయాడు. అప్పటి నుంచి అతడి మిస్ కేసింగ్ కేసు పరిష్కారం కానీ కేసుగా ఉండిపోయింది. ఇంటర్నెట్లో అతడి ఆచూకీ కోసం ఓ ప్రకటన కూడా ఉంది. అయితే ఆ చిన్నారి అలెక్స్ ఇప్పుడూ అనూహ్యంగా 17 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ పర్వాతాల్లో ఓ వాహనదారుడికి కనిపించాడు. దీంతో అతను ఆ టీనేజర్ని ఇక్కడ ఎందుకు ఉన్నావని ఆరా తీయగా నాలుగు రోజుల నుంచి ఈ పర్వతాల నుంచే నడుచుకుంటూ వస్తున్నట్లు తెలిపాడు. వెంటనే అతడు ఆ బాలుడి పేరుని ఇంటర్నెట్లో టైప్ చేసి చెక్‌చేయగా అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. దీంతో అతను వెంటనే ఆ టీనేజర్ని పోలీసులకు అప్పగించాలనుకున్నాడు. అంతేగాదు అలెక్స్ ఆ వాహనదారుడి ఫోన్ సహాయంతో ఫేస్బుక్లో యూకేలో ఉన్న తన అమ్మమ్మ తాతయ్యల కోసం ఓ సందేశం పెట్టాడు. ఆ సందేశంలో "హలో అమ్మమ్మ నేను అలెక్స్. నేను ఫ్రాన్స్ టౌలౌస్‌లో ఉన్నాను. మీకు సందేశం చేరుతుందని ఆశిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను ఇంటికి రావాలనుకుంటున్నా".అని ఉద్వేగభరితంగా సందేశం పెట్టాడు. ఇది వారికి రీచ్ అవ్వడమే గాక ఒక్కసారిగా ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఆ టీనేజర్ తొలిసారిగా తన అమ్మమ్మను కలుసుకోనున్నాడు. ప్రస్తుతం ఆ టీనేజర్ టౌలౌస్‌లోని ఒక యువకుడి సంరక్షణలో ఉన్నాడని ఏ క్షణమైన నగరానికి రావొచ్చని పోలీసులు తెలిపారు. అదృశ్యమయ్యే సమయానికి అలెక్స్ వసయు 11 ఏళ్లు కాగా ఆరేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోనున్నాడు. ఐతే ఈ ఆరేళ్లలో ఎక్కడ ఉన్నాడు, ఎలా మిసయ్యాడు అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: 220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!) -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
టీనేజ్ పిల్లలను ఇలా హ్యాండిల్ చేస్తే.. దెబ్బకు మాట వింటారు
‘మా అమ్మాయి నిన్నమొన్నటి వరకూ చెప్పినట్లు వినేది. ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు తెలుసులే అన్నట్లు మాట్లాడుతోంది. ఈ పిల్లతో వేగేదెట్లా’ ఓ తల్లి కలవరం. ‘నేనేం చెప్పినా మావాడు ఎదురు మాట్లాడుతున్నాడు. కొంచెం గొంతు పెంచితే చేతిలో ఉన్నది పగలకొట్టేస్తున్నాడు. ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడంలేదు’ ఓ తండ్రి బాధ. టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులందరిదీ ఇదే స్థితి. మొన్నటివరకు పిల్లిపిల్లల్లా తమ వెనుకే తిరిగిన బిడ్డలు ఇప్పుడు ఎదురు మాట్లాడుతుంటే భరించలేరు. బాధపడుతుంటారు. టీనేజ్ గురించి, ఆ వయసులో వారి తీరు గురించి తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ వయసు పిల్లలతో ఎలా మాట్లాడో తెలుసుకుంటే వారిని అదుపు చేయడం, సరైన మార్గంలో నడిపించడం చాలా సులువైన విషయం. ఇదో విప్లవాత్మక దశ.. టీనేజ్ లేదా కౌమార దశ అనేది చాలా విప్లవాత్మకమైన దశ. హర్మోన్ల పని తీరు ఉధృతమవుతుంది. శారీరకంగా మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు.. కోరికలు పుడుతుంటాయి. సమాజాన్ని మార్చేయాలని.. ప్రపంచాన్ని జయించాలనే ఆవేశం ఈ వయసులో అత్యంత సహజం. బాల్యం నుంచి వయోజనుడిగా మారే క్రమంలో తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్తుంటారు. అది తమ సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో భాగమే తప్ప తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత కాదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. వారి విమర్శలను సీరియస్‌గా తీసుకుని బాధపడకుండా లేదా గొడవ పడకుండా వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. స్నేహితుడిలా మాట్లాడాలి.. వయసుకు వచ్చిన పిల్లల్ని మనతో సమానంగా చూడాలని పెద్దలు చెప్తుంటారు. ఈ మాట పాటిస్తే చాలు బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయి. చిన్నపిల్లలను తిట్టినట్టు తిట్టకుండా, కొట్టకుండా.. స్నేహితులతో మాట్లాడినట్లు మంచిగా మాట్లాడాలి. ఆ మేరకు కమ్యూనికేషన్‌ను మార్చుకోవాలి. వాళ్లు పెరిగి పెద్దవాళ్లవుతున్నారని, సొంతగా నిర్ణయించుకునే, నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్లకు ఉందని గుర్తించాలి, గౌరవించాలి. తమ జనరేషన్‌కు, పిల్లల జనరేషన్‌కు అభిప్రాయాలు, అభిరుచుల్లో తేడాలుంటాయని గుర్తించాలి, గౌరవించాలి. అప్పుడే వారితో సరైన రీతిలో కమ్యూనికేట్ చేయగలం. సవాళ్లు విసరొద్దు.. ఇంట్లో టీనేజ్ పిల్లలున్నప్పుడు వాదోపవాదాలు సహజం. అయితే ఆ సమయంలో ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. టీనేజర్ మన పెంపకాన్ని విమర్శిస్తున్నప్పుడు బాధగానే ఉంటుంది. అయినా సరే మనల్ని మనం సమర్థించుకోవడం మానేయాలి. ‘నాకు చేతనైంది నేను చేశా, నువ్వేం చేస్తావో చేసి చూపించు’ లాంటి సవాళ్లు విసరకూడదు. దానికన్నా ఏమీ మాట్లాడకపోవడం మంచిది. పిల్లలపై మాటల్లో గెలవడం కంటే, వాళ్ల మనసుల్లో నిలవడం ముఖ్యమని గుర్తించాలి. ఇలాంటి మాటలన్నీ తాత్కాలికమని అర్థం చేసుకోవాలి. ‘మేం పేరెంట్స్‌మి, మా మాట వినాలి’ అనే అహాన్ని లేదా అధికారాన్ని వదులుకుంటేనే ఇవన్నీ సాధ్యం. టీనేజర్ మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు.. 1. నువ్వు చెప్పేది వింటున్నాను. ఇంకా బెటర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. 2. ఐయామ్ సారీ, ఇంకొంచెం బెటర్‌గా చేసి ఉండాల్సింది. 3. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో నాకన్నా నీకు ఎక్కువ తెలుసు. 4. నువ్వు బాధపడేలా చేసినందుకు సారీ. 5. మన మధ్య విషయాలు కష్టంగా ఉన్నాయని తెలుసు. దీన్ని బెటర్ చేసేందుకు ఇద్దరం కలసి పనిచేద్దాం. 6. ఏం జరిగినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకో. మన మధ్య బంధం బలంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉన్నా. మీ టీనేజర్ కష్టపడుతున్నప్పుడు.. 1. నేను నీకు ఎలా హెల్ప్ చేయగలనో చెప్పు. 2. నీకు నేనున్నాను. 3. నేను నిన్ను, నీ సామర్థ్యాన్ని నమ్ముతాను. 4. అవును, అది చాలా కష్టంగా ఉంది. 5. అవును, అది కష్టమని నువ్వు అనుకోవడం కరెక్టే. 6. తప్పులు చేయడం ఓకే. అందరం చేస్తాం. టీనేజర్ పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి.. 1. ఐ లవ్ యూ ఫర్ హూ యూ ఆర్. 2. నీతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. 3. ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. 4. నువ్వు సాధించిన దాని గురించి కాదు.. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ హూ యు ఆర్. 5. మనిద్దరం కలసి మంచి జ్ఞాపకాలను సృష్టించడం నాకు చాలా ఇష్టం. 6. నువ్వు నా దగ్గరకు రావడం, నాతో ఉండటం నాకు చాలా ఇష్టం. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
అబ్బాయిలాగా..టీనేజ్‌లో స్వరం మారిపోయింది, ఏం చేయాలి?
నేనొక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ని. మా హాస్టల్లో ఒక పన్నెండేళ్ల పాపకు స్వరం మారిపోయింది.. ఆ ఏజ్‌లో మగపిల్లలకు మారిపోయినట్టుగా. అయితే ఆ పాప ఇంకా పెద్దమనిషి అవలేదు. ఆ గొంతుతో ఆ అమ్మాయి చాలా సిగ్గుపడుతోంది. దాంతో మాట్లాడ్డమే తగ్గించేసింది. ఇలా అయితే పాప కాన్ఫిడెన్స్ కోల్పోతుందేమోననే భయంతో .. పరిష్కారం కోసం మీకు రాస్తున్నాను. – పేరు, ఊరు వివరాల్లేవు. వయసు పెరిగేకొద్దీ .. ప్యూబర్టీ టైమ్‌కి ఆడపిల్లల్లో చాలా మార్పులు వస్తాయి. (వాయిస్ బాక్స్) కూడా థిక్ అండ్ లార్జ్ అవుతుంది. అంతేకాదు ప్యూబర్టీ టైమ్‌కి సైనస్ క్యావిటీస్, గొంతు వెనుక భాగం కూడా ఎన్లార్జ్ అవుతాయి. వాయిస్ మారడానికి ఇవీ కారణమే. అందుకే 11 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న మగపిల్లల్లోనే కాదు ఆడపిల్లల్లోనూ గొంతు మారడాన్ని గమనిస్తాం. ఇలా హఠాత్తుగా తన వాయిస్ అబ్బాయి వాయిస్‌లా హార్డ్‌గా అవడంతో అమ్మాయి ఇబ్బంది పడుతుండవచ్చు. కాబట్టి వీటన్నిటినీ వివరిస్తూ అదెంత సర్వసాధారణమైన విషయమో చెబుతూ సైకాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలి. అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. స్పీచ్ థెరపీ, గొంతును తగ్గించి మాట్లాడ్డం వంటివి కొంతవరకు సహాయపడతాయి. అయితే జన్యుపరమైన కారణాల వల్లా కొంతమంది అమ్మాయిల్లో మేల్ వాయిస్ ఉంటుంది. కొందరికి అవాంఛిత రోమాలు కూడా రావచ్చు. అంటే ఆండ్రోజెన్ (మేల్ హార్మోన్) హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు. ఒవేరియన్ సిస్ట్స్ వల్ల కూడా ఇలా అవొచ్చు. కాబట్టి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలి. కొన్ని కేసెస్‌లో న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల కూడా ఇలా మారవచ్చు. స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉంటే వాయిస్ చేంజ్‌ను అడాప్ట్ చేసుకునే కౌన్సెలింగ్‌ని ఇప్పించాలి. విటమిన్ బీ12, విటమిన్డి సప్లిమెంట్స్ కూడా కొంతమందిలో ఈ హార్డ్ వాయిస్‌ని తగ్గిస్తాయి. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఆ ఇరాన్ యువతి మృతి
దుబాయ్: ఇరాన్లో కొద్ది వారాల కింద హిజాబ్ ధరించకుండా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ అంతుబట్టని రీతిలో తీవ్ర గాయాలపాలైన టీనేజ్ యువతి మరణించింది. కొద్ది రోజుల కోమా అనంతరం ఆమె తుదిశ్వాస విడిచినట్టు ప్రభుత్వ మీడియా శనివారం ఈ మేరకు వెల్లడించింది. అరి్మత గెర్వాండ్ అనే ఆ యువతి అక్టోబర్ 1న టెహ్రాన్‌లో మెట్రోలో ప్రయాణిస్తూ గాయపడింది. ఆమె ట్రైన్లోంచి ప్లాట్‌ఫాంపైకి వచ్చి పడుతున్న వీడియో బయటికి వచి్చంది. మెట్రోలో ఏమైందో ఇప్పటిదాకా బయటికి రాలేదు. హిజాబ్ ధరించనందుకే పోలీసులు ఆమెకు ఈ గతి పట్టించి ఉంటారని హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాది కింద ఇలాగే హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మహ్సా అమినీని మోరల్ పోలీసులు తీవ్రంగా కొట్టడం, ఆమె జైల్లో మరణించడం, దానిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెర్వాండ్ మృతితో మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
సబ్బుతో స్కిన్ క్యాన్సర్‌కి చెక్..14 ఏళ్ల బాలుడి సరికొత్త ఆవిష్కరణ
క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే. బాగా డబ్బుంటే విదేశాల్లో పేరుగాంచిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని బయటపడుతుంటారు ప్రముఖులు, సెలబ్రెటీలు. అలాంటి భయానక క్యాన్సర్ వ్యాధుల్లో ఒకటి ఈ స్కిన్ క్యాన్సర్. అలాంటి స్కిన్ క్యాన్సర్‌ని తక్కువ ఖర్చుతోనే ఈజీగా నయం చేసేలా ఓ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు ఓ టీనేజర్. ఈ ఆవిష్కరణతో ఆ యువ శాస్త్రవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎవరా టీనేజర్? ఏమిటా ఆవిష్కరణ..?. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల హేమన్ బెకెలే స్కిన్ క్యాన్సర్‌ని జయించేలా సబ్బుని కనిపెట్టాడు. అది కూడా తక్కువ ఖర్చతోనే నయం అయ్యేలా రూపొందించాడు. ఈ సబ్బు ధర కేవలం రూ. 800/-. ఈ సరికొత్త ఆవిష్కరణగానూ ఆ బాలుడు టాప్ యంగ్ సైంటిస్ట్‌గా అవార్డును గెలుచుకున్నాడు. ఈ సబ్బు అందరికీ అందుబాటులో ఉండేలా ఆ బాలుడు లాభప్రేక్షలేని ఓ సంస్థను కూడా స్థాపించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ బాలుడికి ఈ ఆవిష్కరణను కనుగొనడానికి త్రీఎం డిస్కవరరీ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్తల సలహాదారు డాక్టర్ మహ్ఫుజా అలీ సాయం చేశారు. బెకెలేకి జీవశాస్త్రం, సాంకేతికపై మంచి ఆసక్తి. ఇదే ఈ ఆలోచనకు పురిగొల్పింది. అదే అతడిని యూఎస్‌లో ఏటా నిర్వహించే 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్‌లో పాల్గొనేలా చేసింది. దాదాపు తొమ్మిది మంది పోటీ పడిన ఈ చాలెంజ్‌లో అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్‌గా విజయం కైవసం చేసుకుని దాదాపు రూ. 31 లక్షల ఫ్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఇథియోపియాకు చెందిన బెకెలే తాను అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతుండటం చూశానని చెప్పుకొచ్చాడు. అప్పుడే దీన్ని నయం చేసేలా ఏదైనా కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. దీనికి ఈ ఛాలెంజ్ పోటీనే సరైన వేదికగా భావించానని చెప్పుకొచ్చాడు. ఇక బెకెలే రూపొందించిన ఈ సబ్బు పేరు స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్. ఈ సోప్ చర్మాన్ని రక్షించే డెన్డ్రిటక్ కణాలను పునరుద్ధరింంచి, స్కిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతుందని బెకెలే పేర్కొన్నాడు. అదీగాక ఇంతవరకు మార్కెట్లో స్కిన్ క్యాన్సర్‌కి సంబంధించి క్రీమ్‌లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయని, సబ్బుని ఉపయోగించడం ఇదే తొలిసారి అని యంగ్ ఛాలెంజ్ ప్రెజెంటేషన్ ప్యానల్ వివరించాడు బెకెలే. సమాజానికి తన వంతుగా సాయం అందించేలా ఈ స్కిన్ క్యాన్సర్‌ని అతి తక్కువ ఖర్చుతోనే జయించేలా తాను కనుగొన్న ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి ఓ కొత్త ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నానని ప్యానెల్ సభ్యులకు వివరించాడు బెకెలే. (చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
టేప్, జిగురు లేకుండా ప్లేయింగ్ కార్డు స్ట్రక్చర్‌తో రికార్డు సృష్టించాడు!
కోల్‌కతాకు చెందిన పదిహేను సంవత్సరాల అర్నవ్ దాగ ప్రపంచంలోనే పెద్దదైన ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్‌ను సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. కోల్‌కత్తాలోని ప్రసిద్ధ నిర్మాణాలు రైటర్ బిల్డింగ్, షాహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ ఆధారంగా చేసుకొని ఈ నిర్మాణం చేశాడు. పని ప్రారంభించడానికి ముందు ఈ నాలుగు నిర్మాణాల దగ్గరకు వెళ్లి వాటి ఆర్కిటెక్చర్‌ను పరిశీలించాడు. ఈ స్ట్రక్చర్ కోసం 143,000 ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించాడు. టేప్, జిగురు ఉపయోగించకుండానే 40 అడుగుల ఎత్తుతో ఈ స్ట్రక్చర్‌ను సృష్టించాడు. దీనికోసం 41 రోజుల పాటు కష్టపడ్డాడు. ‘పూర్తయి పోయింది అనుకున్న నిర్మాణం కొన్నిసార్లు హఠాత్తుగా కుప్పకూలిపోయేది. మళ్లీ మొదటి నుంచి పని మొదలు పెట్టాల్సి వచ్చేది. విసుగ్గా అనిపించేది. అయినా సరే కష్టపడేవాడిని’ అంటున్నాడు అర్నవ్. గతంలో బ్రియాన్ బెర్గ్ అనే వ్యక్తి 34 అడుగుల ఎత్తుతో ఉండే ప్లేకార్డ్ స్ట్రక్చర్‌ను సృష్టించాడు. బెర్గ్ రికార్డ్‌ను అర్నవ్ బ్రేక్ చేశాడు. (చదవండి: స్కిప్పింగ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్! వీడియో వైరల్) -
టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. ముఖ్యంగా బాలికలను ఉద్ధేశించి.. రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని, ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పింది. అబ్బాయిలు కూడా మహిళల విషయంలో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని పేర్కొంది. పరస్పర సమ్మతితో సెక్స్‌లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. మైనర్ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొనందుకు గతేడాది ఓ టీనేజర్‌కు సెషన్స్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ చిత్తరంజన్ దాస్, పార్థ సారథి సేన్లతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అత్యాచారం కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు టీనేజీ అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది. విచారణ సందర్భంగా... తన ఇష్టపూర్వకంగానే టీనేజర్‌తో రిలేషన్లో ఉన్నానని కోర్టుకు సదరు బాలిక కోర్టుకు తెలిపింది. అతన్ని పెళ్లి కూడా చేసుకున్నానని పేర్కొంది. అయితే 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం అనే విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది. కాగా, పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు వస్తుంది. చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి! టీనేజీలో సెక్స్ అనేది సాధారణమైన విషయమని, అయితే అలాంటి కోరికలను ప్రేరేపించడం అనేది వ్యక్తుల చర్యలపై ఆధారపడి ఉంటుందని బెంచ్ పేర్కొంది. యుక్త వయసు బాలికలు రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు మొగ్గు చూపరాదని, లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల సుఖం కోసం ఆశపడితే సమాజంలో చెడ్డపేరు వస్తుందని, అలాంటి పనులకు పాల్పడవద్దని హితవు పలికింది. బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. అదే విధంగా టీనేజీలోని అబ్బాయిలు కూడా అమ్మాయిలను గౌరవించాలని తెలిపింది. వారి హక్కులను, గోప్యతను, ఆత్మగౌరవవాన్ని, ఆమె శరీర స్వయంప్రతిపత్తిని కాపాడేలా వ్యవహరించాలని తెలిపింది. ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలని, మంచి-చెడుల గురించి చెప్పాలని సూచించింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా వారితో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచించింది. యుక్త వయస్సులో లైంగిక సంబంధాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలను నివారించడానికి పాఠశాలలో లైంగిక విద్య అవసరమని నొక్కి చెప్పింది. -
ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్‌యాక్షన్‌కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ప్రధాన నిందితుడి అరెస్టు? లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని కేసులో పోలీసుల కృషిని కొనియాడిన ఏఎస్పీ.. వారిపై కూడా చర్యలు తప్పవు.. -
ఇంటి ప్రేమే అసలు వైద్యం
సమాజంలో టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్ పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆత్మహత్యలు తార్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి. కాని తల్లిదండ్రులు మేల్కొనడం లేదు. టీనేజ్‌లో ఉన్న పిల్లల మూడ్స్‌ను గమనించి వారిని అక్కున చేర్చుకోవాల్సింది మొదట తల్లిదండ్రులే. వైద్యం మొదలవ్వాల్సింది ఇంటి నుంచే. డిప్రెషన్ సూచనలు కనిపించే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం. ఏదో భయం. ఆందోళన. తల్లిదండ్రుల అంచనాకు తగినట్టు లేనని భయం. మార్కులు తగినన్ని తేలేకపోతున్నానని భయం. పాఠాలంటే భయం. పరీక్షలంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. స్నేహితులు లేరని భయం. స్నేహితులతో స్నేహం చెడుతుందేమోనని భయం. ఎవరితో చెప్పుకోవాలో తెలియని భయం. ఎవరితోనూ చెప్పుకోలేనేమోనని భయం. టీనేజ్ పిల్లలు ఎదిగీ ఎదగని లేత వయసు పిల్లలు. వారికి అన్నీ సందేహాలే. ఆందోళనలే. మన దేశంలో 13–17 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు కోటిమంది టీనేజ్ పిల్లలు డిప్రెషన్ బారిన పడుతున్నారని ఒక అంచన. డిప్రెషన్లో భయం, ఆందోళన ఉంటాయి. ఈ వయసులో మొదలైన డిప్రెషన్ కొందరిని ముప్పైల్లో, నలబైల్లో ప్రవేశించే వరకు వెంటాడుతుంది. కొందరిని జీవితాంతం వెంటాడవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలు చీమను కూడా భూతద్దంలో చూసి భయపడతారు. తమ సమస్యకు సమాధానం లేదేమో, ఎవరి నుంచీ దొరకదేమో అనిపించడమే డిప్రెషన్ అత్యంత ప్రమాదకరమైన స్థితి. సమస్యకు పరిష్కారం చావు అనిపించడం దీని పర్యవసానం. ఇంతవరకూ వచ్చే లోపు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకుంటే వారు ఆ స్థితిని దాటుతారు. లేదంటే అపాయంలో పడతారు. కారణాలు టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తేల్చలేము. చదువుకు సంబంధించిన ఒత్తిడి, తల్లిదండ్రులతో బలమైన అనుబంధం మిస్ కావడం, ర్యాంకుల బరువు, భవిష్యత్తుపై బెంగ, రూపం గురించిన చింత, మెదడులో అసమతుల్యత... ఏమైనా కావచ్చు. మనదేశంలోని సీబీఎస్ఈ స్కూళ్లల్లో సర్వే చేస్తే చాలామంది పిల్లలు తమకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు. లక్షణాలు ఉత్సాహం చూపకపోవడం, చిరాకు, కోపం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, నిద్ర సరిగా ఉండకపోవడం, అలసట, ధ్యాస లేకపోవడం, సరిగా చదవలేక పోవడం... ఏం చేయాలి? ముందు తల్లిదండ్రులు, తదుపరి స్కూళ్లు శ్రద్ధ వహించాలి. ► తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న పిల్లలతో నిత్యం సంభాషణ జరపాలి. వారితో కూచుని వారు నిస్సంకోచంగా తమ సమస్యలు చెప్పుకోనివ్వాలి. వారు చెప్పేది కొట్టేయకుండా, బదులు తిట్టకుండా అర్థం చేసుకోవాలి. సమస్య మూలాల వరకూ వెళ్లాలి. వారికి చాలా ప్రేమను ఇస్తూ కౌన్సిలింగ్ చేయాలి. రెండు శాతం కంటే తక్కువ మంది పిల్లలకు మందులతో వైద్యం అవసరం కావచ్చు. ► తల్లిదండ్రులు పిల్లల శ్రద్ధ, శక్తిని అంచనా వేస్తూ వారికి లక్ష్యాలు ఇవ్వాలి. వారికి పూర్తిగా ఇష్టం లేని, వారు చేయలేని చదువులో ప్రవేశ పెట్టరాదు. వారు గట్టి స్నేహితులు కలిగి ఉండేలా చూడాలి. ఆ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పిల్లలు వారితో గడిపేలా చేయాలి. పిల్లలను గాయపరిచే మాటలు తల్లిదండ్రులు మాట్లాడటం బొత్తిగా మానుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. ► స్కూళ్లు విధిగా కౌన్సిలర్లను ఉంచాలి. తరగతి వారీగా, ప్రతి విద్యార్థిని మెంటల్ హెల్త్ విషయంలో అంచనా కట్టాలి. వారి సమస్యను అర్థం చేసుకుని టీచర్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించడమే కాక తల్లిదండ్రులకు సమస్య తెలపాలి. అసలు సమస్య మనదేశంలో దాదాపు 4 వేల మంది సైకియాట్రిస్ట్‌లు, వెయ్యి మంది క్లినికల్ సైకాలజిస్ట్‌లు ఉన్నారు. వీరంతా పెద్ద ఆస్పత్రుల్లో లేదా సొంత క్లినిక్‌లలో ఉంటారు. టీనేజ్ పిల్లలకు వీరితో యాక్సెస్ ఉండదు. స్కూళ్లల్లో మానసిక సమస్యలు గమనించి భరోసా ఇచ్చే కౌన్సెలర్ల వ్యవస్థ ఇప్పటికీ ఏర్పడలేదు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు తమకు మానసికంగా ఇబ్బంది ఉన్నట్టు గ్రహించడం కూడా తెలియదు. కనుక పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళుతున్నారు. -
'నాకే సలాం కొట్టవా..?' బాలునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి
ధన్‌బాద్: తనకు నమస్కారం చేయలేదని జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుని కుమారుడు ఓ బాలునిపై దాడి చేశాడు. పిస్టల్‌తో బెదిరించి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రణ్విజయ్ సింగ్ కుమారుడు రణ్వీర్ సింగ్. ధన్బాద్లో తాను వెళ్లే క్రమంలో నమస్కారం చేయలేదని 17 ఏళ్ల ఆకాశ్ చందల్ అనే బాలునిపై దాడి చేశారు. కారులో బలవంతంగా ఎక్కించి విపరీతంగా కొట్టారు. అనంతరం ఓ టీషాపు వద్దకు తీసుకెళ్లి మళ్లీ దాడి చేశారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. తొమ్మిదో తరగతి చదువుతున్నానని తెలిపిన చందల్.. ట్యూషన్‌కు వెళ్లి వచ్చే క్రమంలో దాడి జరిగిందని చెప్పాడు. తాను ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిలబడగా.. ఐదు కార్లు తమ ముందుగా వెళ్లాయని తెలిపాడు. ఇంతలో కారులోంచి రణ్వీర్ సింగ్ దిగి తనకు నమస్కారం పెట్టమని వేధించారు. సలాం కొట్టడానికి నిరాకరించగా.. కారులోకి ఎక్కించుకుని కొట్టారని చెప్పాడు. ఓ బాడీగార్డు తనను పట్టుకెళ్లి రణ్వీర్ సింగ్ పాదాల వద్ద పడేశాడని పోలీసులకు తెలిపాడు. "Parnam kaahe nahi kiya re Madh**d!" Dhanbad, Jharkhand: Ranveer, the son of a Congress leader Ranvijay Singh, brutally beat a student with the butt of a pistol for not touching his feet. An FIR has been registered after immense pressure. pic.twitter.com/VjdrTfg4xc — Treeni (@_treeni) August 29, 2023 ఈ దాడిపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు .. రణ్వీర్ సింగ్‌కు ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నంలోనే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. అందులో తన కొడుకు ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు కూడా లేవని చెప్పారు. వీడియోపై దర్యాప్తు చేయాలని అన్నారు. ఇదీ చదవండి: 'పాక్‌కు ఎందుకు వెళ్లలేదు..?' విద్యార్థులపై టీచర్ అనుచిత వ్యాఖ్యలు.. -
మద్యం మత్తులో యువతి హల్చల్.. రోడ్డుపై గంట పాటు చుక్కలు చూపించింది
బనశంకరి(బెంగళూరు): మద్యం అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు తాగిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వారి ఇళ్లకు వెళ్తుంటారు. అయితే కొందరు మాత్రం కిక్కు ఎక్కువై రోడ్డు మీద నానా రభస చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇటీవల ఈ తరహా ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అధికారులు వీరి మీద చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా ఓ యువతి పీకల దాకా మద్యం సేవించిన మత్తులో హల్చల్ చేసింది. ఈఘటన నగరంలో జరిగింది. మత్తులో తూలుతూ కాలినడకన వస్తున్న ఆమెను కొందరు వెళ్లి రక్షించే ప్రయత్నం చేయగా వారిని దుర్భాషలాడింది. ఆమెను ఎలాగైన సురక్షితంగా ఇంటిక పంపాలని రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రయత్నం చేశారు. కానీ మహిళా పోలీసు సిబ్బంది లేనికారణంగా యువతిని ఆటోలో కూర్చోబెట్టడానికి ఇబ్బంది పడ్డారు. గంటపాటు ప్రయత్నించిన అనంతరం మరో యువతి సాయంతో ఆమెను ఇంటికి సురక్షితంగా తరలించారు. చదవండి హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు -
అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!
ఒకప్పుడు యాభైఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చాలామందికి పాతికేళ్లకంటే ముందే తెల్లజుట్టు వచ్చేస్తోంది. దాంతో ఉన్న వయసు కంటే పెద్దగా కనిపించడం, దానిని కప్పి పుచ్చుకోవడానికి తలకు రకరకాల హెయిర్ డైలు, షాంపూలు వాడటం... వాటిలోని రసాయనాల ప్రభావంతో సైడ్ ఎఫెక్టులు రావడం... వీటన్నింటి బదులు అసలు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుందో చెబుతూ...దానిని నివారించడానికి తగిన సూచనలు, సలహాలతో కూడిన కథనం ఇది. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి గల అనేక కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ప్రధానం. డైట్లో పోషకాల కొరత ఉండకూడదు. తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉండే ఆహారాలని తినాలి. శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తుంది. కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీ, బీన్స్ ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసువడం వల్ల తెల్లజుట్టు సమస్యను వాయిదా వేయచ్చు. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్‌ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి ఒకటి. ఓ గ్లాసుడు నీళ్లలో ఒకటిన్నర చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. మీ తలకు సరిపడేటన్ని మందార ఆకులు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. హెర్బల్ హెన్నాలో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టు ఉన్న వారు పెనంపై రెండు చెంచాల పసుపును వేసి వేడి చేసి నల్లగా మారేంత వరకు మాడ్చాలి. చల్లారిన తర్వాత దీనికి సరిపోయేంత కొబ్బరినూనె లేదా నువ్వులనూనెలో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!) -
45 ఏళ్ల వరుడు..13 ఏళ్ల వధువు.. బాలికను తీసుకుని పరార్
సాక్షి, నవీపేట (నిజామాబాద్ జిల్లా): జిల్లాలోని నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అబ్బాపూర్ (బి) తండాలో ఓ తండ్రి రూ.60 వేలకు ఆశపడి 13 ఏళ్ల తన కూతురుకు బాల్య వివాహం జరిపించేశాడు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బాలిక తండ్రిని నిలదీయడంతో అప్పటికే పెళ్లికొడుకు బాలికతో కలిసి పరారయ్యాడు. ఫకీరాబాద్ గ్రామానికి చెందిన మలావాత్ సాయెబ్‌రావ్ (45)కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాపూర్ (బి) తండాకు చెందిన ఓ వ్యక్తి తన కూతుర్ని సాయెబ్రావ్కు ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను సాయెబ్‌రావ్ వద్ద నుంచి రూ.60 వేలను బాలిక తండ్రి తీసుకున్నాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఇరువురు బంధువుల సమక్షంలో బాలికకు పెళ్లి జరిపించేశారు. అయితే బాల్యవివాహం గురించి తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వెళ్లి బాలిక తండ్రిని, పెళ్లిపెద్దలను నిలదీయగా వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆ యువకులు హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయెబ్‌రావ్ బాలికను తీసుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న డీసీపీవో చైతన్యకుమార్, చైల్డ్‌హెల్ప్‌లైన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ జ్యోత్స్నదేవి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి గ్రామానికి వెళ్లి విచారించారు. బాలిక తండ్రి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయెబ్రావ్తో పాటు పెళ్లికి సహకరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై జీపీ కార్యదర్శి షేక్ అహ్మద్ పాషా ఫిర్యాదు చేశారు. -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? ఆ మాయలో పడకండి
సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్న అట్రాక్షన్స్కు లోనై ‘లవ్’ పేరుతో ట్రాఫికింగ్ బారిన పడుతున్న అమ్మాయిల వ్యథలు ఇటీవల ఎన్నో ఉంటున్నాయి. ఈ సమస్య సమాజంలో ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుందో, ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెప్పే విషయాలను ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’’ మనం మాట్లాడుకోవాల్సిందే! ఆన్లైన్ లవ్ మాయలో పడొద్దు! ‘ప్రియ (పేరుమార్చడమైనది) కనిపించక రెండు రోజులవుతోంది. ఏం జరిగిందో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కంప్లైంట్ ఇచ్చిన ఒక రోజులోనే ప్రియని తీసుకొచ్చి, తల్లిదండ్రులకి అప్పజెప్పారు పోలీసులు. వారు చెప్పిన విషయం విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ప్రియ వయసు పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. కరోనా టైమ్‌లో ఆన్లైన్ క్లాసెస్ కోసం తండ్రి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఇప్పటికీ ఆ ఫోన్ తనే వాడుతోంది. మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు విక్కీ. ఫ్రెండ్‌గా ఆమె మంచి చెడులు కనుక్కుంటూ, చాటింగ్ చేస్తూ ఉండేవాడు. మొదట వాయిస్ కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్ మాట్లాడుతుండేవాడు. అతను చెప్పే ప్రేమ కబుర్లు ప్రియకు బాగా నచ్చాయి. అమ్మానాన్నలు ఎంతసేపూ చదువు చదువు అని అంటుంటారు. కానీ, వాటి గురించి విక్కీ మాట్లాడడు. ఒక్కరోజు విక్కీ చాట్ చేయకపోయినా, ఫోన్లో మాట్లాడకపోయినా ప్రియకు ఊపిరాడనట్లుండేది. విక్కీ ఏం చెప్పినా ప్రియ వెనకాడకపోయేది. రోజు రోజుకూ విక్కీ లేకపోతే తను బతకలేనని అనిపించసాగింది ప్రియకు. దీంతో ఓ రోజు విక్కీ చెప్పిన చోటుకు వెళ్లిపోవాలనుకుంది. దాంతో తల్లికి తెలియకుండా డబ్బులు తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందనే భయం ఓ వైపు, కూతురు ఏమైందోననే భయం మరోవైపు వారిని కుదిపేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్‌తో.. ప్రియ ముంబైకి చేరుకున్నట్టు కనిపెట్టిన పోలీసులు, ఆమెను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఇలాంటి కథనాలు ఇటీవల మనం తరచూ వింటున్నాం. పెద్ద శిక్ష ♦ ఆన్లైన్లోనే కాదు బయట కూడా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి చిన్న చిన్న ఆకర్షణ పథకాలను అమలు చేసేవారుంటారు. ♦ మైనర్ అమ్మాయిలు/అబ్బాయిలు పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే కానుకలకు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. ♦ అవతలి వారు చెప్పేది నిజం అని నమ్మి, ఇంటిని వదిలి వెళ్లిపోతుంటారు. ♦ ఇంట్లో ప్రేమ దక్కలేదనో, మరో కారణం చేతనో బయటి వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుంటారు. అలవాట్లు రుగ్మతలు అవుతున్నాయి. రుగ్మతలుగా మారడం వల్లే నేరాలు కూడా భిన్నంగా మారిపోయాయి. ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత పెరిగిందో, చెడు అంతకన్నా ఎక్కువ పెరిగింది. కొందరికి ఇదొక ఉపయోగకరమైన అడిక్షన్‌గా కూడా మారింది. ప్రతిదీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో అందరిలోనూ కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరిగాయి. దేనికోసం మనం ముందుకు వెళుతున్నాం అనే స్పష్టత ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. షార్ట్‌కట్స్‌లో సంపాదించాలనే ఆలోచన వల్ల కూడా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. చూడకూడనివి ఎక్కువ చూడటం వల్ల మనస్తత్వాలు మారుతున్నాయి. ఫోన్ చూడద్దని, ఇంటర్నెట్ చూడద్దని, ఎక్స్పోజర్ తగ్గించుకోమని చెప్పలేం. ఇవన్నీ మన జీవితంలో భాగమైనప్పుడు ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడం మాత్రమే ఈ రోజుల్లో కుటుంబాలకు అవసరం. ఈ రోజుల్లో మైనర్లు ఇంటర్నెట్లో ఎక్కువ ఉంటున్నారు. వారిని గమనిస్తూ, మంచి చెడులను చర్చిస్తూ ఉండాలి. ప్రేమ, పెళ్లి పేరుతోనో వెళ్లిపోయారని, వీటిని మిస్సింగ్ కేస్ కింద చూడం. కిడ్నాప్ కింద రిజిస్టర్ చేస్తాం. ట్రేస్ అవగానే రేప్ సెక్షన్స్ యాడ్ చేస్తాం. ఒక్కసారి పోక్సో కేసు కింద నమోదు చేసిన తర్వాత నేరస్తులకు శిక్ష భారీ ఎత్తున పడుతుంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ కింద కేస్ బుక్ అవుతుంది. మైనర్ని తీసుకువెళ్లి, పెళ్లి చేసుకున్నా అది చట్టరీత్యా నేరం. మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరు మిస్ అయినా దానిని ట్రాఫికింగ్‌కు సంబంధించిన సెక్షన్స్ కింద కేస్ రిజిస్టర్ చేస్తాం. రూరల్, అర్బన్ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్లైన్ ప్రేమల జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. – సుమతి, ఐపీఎస్, డీఐజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ ఇదొక వ్యసనం పరిచయం లేని వ్యక్తులు తమ పట్ల చూపే కన్సర్న్ని నిజమైన ప్రేమ అనుకొని భ్రమిస్తుంటారు కొందరు. ఈ మోహం ఆమె/ అతడి ఆరోగ్యం, భవిష్యత్తు సంబంధాలను ప్రభావితం చేస్తుంది. న్యూరలాజికల్ కెమికల్ అయిన ఫినైల్ ఇథైలమైన్ పెరగడం వల్ల ప్రేమభావాలు కలుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మోహానికి గురైన వ్యక్తులు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి అలవాట్లకు కూడా లోనవుతుంటారు. వారిలో ఆనందపు స్థాయులను పెంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందుకు సినిమాలు, ఇంటర్నెట్ పోర్న్ సదుపాయాలు కూడా పిల్లల మెదళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇదొక వ్యసనం అని చాలామంది గుర్తించరు. ఆన్లైన్ రిలేషన్షిప్స్ తల్లిదండ్రులకు తెలియడం లేదు. పిల్లల ఆన్లైన్ నెట్వర్కింగ్ గురించి తల్లితండ్రులకు, కౌన్సెలింగ్ థెరపీ ద్వారా పిల్లల్లోనూ మంచి మార్పులు తీసుకురావచ్చు. స్కూళ్లు, కాలేజీల్లో కూడా ‘లవ్, రిలేషన్షిప్స్’ డిజిటల్ వాడకం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విషయాల పైన అవగాహన తరగతులు తీసుకోవాలి. – డాక్టర్ గిడియన్,డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి -
స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు..
న్యూయార్క్: 15 ఏళ్ల అమెరికా టీనేజర్ స్పైడర్ మ్యాన్ వేషధారణలో పార్కుకు వెళ్తే అక్కడి ఆకతాయి యువత బాలుడిని ఎగతాళి చేసి గాయపరిచారు. పాపం స్పైడర్ మ్యాన్ కు ముక్కు నుండి రక్తం ధారకట్టడంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. వారు దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హడ్సన్ ఫాల్స్ కు చెందిన 15 ఏళ్ల అయిడిన్ పెడోన్ న్యూయార్క్ లోని ఒక పార్కు వారు నిర్వహించిన సూపర్ హీరో థీమ్ లో పాల్గొనేందుకు తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని పార్కుకి వెళ్ళాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కొంతమంది టీనేజర్లు అయిడిన్ చుట్టూ చేసిరి మొదట ఎగతాళి చేశారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి అయిడిన్ ముఖంపై బలంగా కొట్టింది. దాంతో తూలిపడబోయిన అయిడిన్ ఆపుకుని స్పైడర్ మ్యాన్ మాస్క్ తొలగించగా ముక్కు మీద తీవ్ర గాయం కావడంతో రక్తం బొటబొటా కారింది. ఈ సంఘటన జరుగుతుండగా పార్కులో మిగతావారు ఫోన్లో ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తూ కనిపించడం విశేషం. This is actually disgusting… I hope there were consequences for what they did to that poor boy pic.twitter.com/vQ2hHEDcU4 — FadeHubb (@FadeHubb) July 1, 2023 స్థానిక మీడియా న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయిడిన్ చికిత్స పొందుతున్నాడని, గో ఫండ్ మి అనే పేజీ ప్రతినిధులు మరోసారి అయిడిన్ ఇలా దెబ్బలు తినకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చందాలు వసూలు చేయగా ఇప్పటికి 10,000 యూఎస్ డాలర్లు( రూ 8.21 లక్షలు) పోగయ్యాయని అన్నారు. ఆరో తరగతి చదువుతున్న అయిడిన్ కు ఆత్మన్యూనతా భావం ఎక్కువని, స్కూల్లో తరచుగా సహచరులు తనని ఆటపట్టిస్తూ ఉండటంతో ఆ భావం నుండి బయటపడేందుకు ఆదివారం తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడని, తీరా అక్కడ ఇలా జరగడం అమానుషమని అన్నారు. చుట్టూ ఉన్నవారు దాడిని ఆపకపోగా వీడియోలు తీస్తూ నవ్వుతుండడం మరింత బాధించిందని తెలిపారు. అయిడిన్ తల్లి ఫిర్యాదు మేరకు హడ్సన్ ఫాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన టీనేజ్ అమ్మాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన.. -
కూతురిపై ఉన్న నమ్మకం గెలిచినా!..బయటపడ్డ మరో నిజం ఆ తల్లిని..
పాపం నిండా 15 ఏళ్లు నిండని ఓ టీనేజర్.. శరీరంలో ఏదో మార్పు. అర్థం కాలేదు. విపరీతమైన వెన్ను నొప్పి. కూర్చొలేదు, నుంచోలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక వైద్యులను సంప్రదించింది. పలు వైద్య పరీక్షల తర్వాత బయటపడ్డ నిజం విని నమ్మలేకపోయింది. తల్లిదండ్రులు ఏం అంటారో తెలియక తల్లడిల్లింది. వైద్యులు చెప్పింది నిజం కాదని ఆ అమ్మాయి నమ్మకం. కానీ చివరికి పరీక్షలు తర్వాత బయటపడ్డ మరో నిజం మరింత ఘోరంగా, దారుణంగా ఉంది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న హాలీ అనే టీనేజ్ అమ్మాయి 2019 జనవరిలో వెన్ను నొప్పితో తల్లడిల్లింది. దీంతో ఆస్పత్రి వెళ్లింది. పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ప్రెగ్నెంట్ అని తేల్చారు. దీంతో ఆ అమ్మాయికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైయ్యింది. ఆమెకు గట్టి నమ్మకం తాను ప్రెగ్నెంట్ కాదని. ఎందుకంటే ఆమె అప్పుడు 15 ఏళ్ల మాత్రమే. ఈ విషయం విని తన తల్లిదండ్రులు ఏం అనుకుంటారోనని చాలా భయపడింది. ఐతే ఆమె తల్లి దీన్ని నమ్మలేదు. మరోవైపు ఆమె బరువు తగ్గిపోవడం, తలనొప్పి, అలసట వంటి విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె తల్లిదండ్రలు జోక్యంతో ఆమెకు మరిన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి అల్ట్రాసౌండ్ పరీక్షలో ఆమె కడుపులో బిడ్డ లేదని తేలింది. ఐతే రిపోర్ట్ల్లో గుండె పగిలే మరో నిజం బయటపడింది. ఈ నిజం ఆమెను, తల్లిదండ్రులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ఆ వైద్య పరీక్షల్లో ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉందని తేలింది. ఆ కణుతులు ఊపిరితిత్తుల వరకు వ్యాపించి..స్టేజ్ 4దశలో ఉన్నట్లు వెల్లడైంది. చివరికి పలు చికిత్సలు అనంతరం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది హాలీ. (చదవండి: డయాబెటిస్ పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నారని అర్థం!) -
తల్లిదండ్రుల ఎదుటే బాలుడిని తిన్న మొసలి.. కర్రలతో కొట్టి..
బిహార్: బాలున్ని మొసలి తినేసిందనే కోపంతో కుటుంబ సభ్యులు ఆ మొసలిని కొట్టి చంపారు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది. రాఘవాపుర్ దియారా గ్రామానికి చెందిన అంకిత్ కుమార్(14) ఐదవ తరగతి చదువుతున్నాడు. కొత్త బైక్ కొన్న సందర్భంగా బాలుడు బైక్‌కు పూజ చేయించాలనుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గంగా నది వద్దకు చేరారు. నీటి కోసం నదిలోకి దిగగా.. మొసలి నోట చిక్కాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే బాలున్ని మొసలి తినేసింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు బాలున్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి మొసలిని నది నుంచి బయటకు లాగారు. అనంతరం దాన్ని తాళ్లతో కట్టి, కర్రలతో కొట్టి చంపారు. 'కొత్త బైక్ కొన్నాము.పూజ చేయించడానికి గంగాజలం కోసం నది వద్దకు వెళ్లాము. అక్కడ మొసలి అంకిత్‌ను పట్టి నీళ్లలోకి లాక్కెళ్లింది. బాలున్ని రక్షించే ప్రయత్నం చేశాము.. కానీ కొన్ని శరీర భాగాలు మాత్రమే లభించాయి. ఆ మొసలిని బయటకు లాగి చంపేశాము'అని అంకిత్ తాతయ్య చెప్పారు. ఇదీ చదవండి:సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత -
కోపం వచ్చిందని ఎనిమిదేళ్లుగా..
ఆండ్రెస్ కాంటో అనే ఈ స్పానిష్ కుర్రాడికి కోపం వచ్చింది. ఎవరి మీదంటారా? తల్లిదండ్రుల మీదే! కారణం మరీ పెద్దదేమీ కాదు గాని, అసలు కథలోకి వచ్చేద్దాం. ఎనిమిదేళ్ల కిందట ఆండ్రెస్ పద్నాలుగేళ్ల కుర్రాడు. ట్రాక్సూట్తోనే ఊళ్లోకి బలాదూరుగా తిరగడానికి వెళతానన్నాడు. ట్రాక్‌సూట్‌లో అలా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించారు. అంతే! ఆండ్రెస్కు చర్రున కోపం తన్నుకొచ్చింది. కోపం వస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఆండ్రెస్ కూడా ఊరుకోలేదు. విసవిసా పెరట్లోకి వెళ్లాడు. పెరట్లో పాతకాలం నాటి గడ్డపలుగు కనిపించింది. వెంటనే ఆ గడ్డపలుగు పుచ్చుకుని, చేతులు నొప్పెట్టే వరకు పెరట్లో మట్టిని తవ్విపోశాడు. ఇలా ఒకరోజు రెండురోజులు కాదు, ఎనిమిదేళ్లు అదేపనిగా తవ్విన చోటనే తవ్వుతూ, తాను తలదాచుకోవడానికి అనువైన నేలమాళిగను నిర్మించుకున్నాడు. తనకు అవసరమైన కుర్చీ, బల్ల, మంచం వంటి సామగ్రిని ఇంటి నుంచి అందులోకి చేరవేసుకున్నాడు. వైఫై, స్పీకర్లు, వంట చేసుకోవడానికి ఒక బొగ్గుల పొయ్యి కూడా అందులో అమర్చుకున్నాడు. ఇప్పుడు ఆ నేలమాళిగనే తన ప్రత్యేక స్థావరంగా వాడుకుంటున్నాడు. -
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్‌హౌస్‌పై దాడి
ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. అతను సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్ పోలీసులు అతను లాఫాయోట్ పార్క్ వెలుపల ఉన్న బోలార్డ్‌లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిని తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు. (చదవండి: నమ్మకమే పునాది) -
ఎయిర్‌పోర్ట్‌లో యాపిల్ జ్యూస్ వివాదం..యువతి అరెస్టు
యూపిల్ జ్యూస్‌ని ఎయిర్‌పోర్ట్‌లో అనుమతించ లేదని టీనేజ్ గర్ల్ శివాలెత్తిపోయింది. కోపంతో ఊగిపోయి అధికారులపై దాడి చేసింది. ఈ షాకింగ్ ఘటన యూఎస్‌లో అర్కాన్సాస్‌లోని ఫినిక్స్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఫినిక్స్ స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం సెక్యూరిటీ గుండా 19 ఏళ్ల మకియా కోల్మాన్ వెళ్తోంది. ఐతే ఆమె పెద్ద మొత్తంలో ఆపిల్ జ్యూస్‌ని తీసుకుని వెళ్తోంది. అంత మొత్తంలో జ్యూస్‌ని తీసుకువళ్లేందుకు అనుమతి లేదని ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెకు చెప్పారు. ఈ మేరకు అధికారులు ఆ జ్యూస్‌ని ఆమె నుంచి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తుండగా.. ఆమె తిట్టడం ప్రారంభించింది. వారిలో ఒక అధికారి ఆమెను పక్కకు నెట్టడంతో ఆమె సీరియస్ అయ్యి అధికారులతో గొడవకు దిగింది. ఒక అధికారి చేయి కొరికి, మోచేతులతో కొట్టడం, ఒక అధికారి జుట్టుని పట్టుకుని దాడి చేయడం వంటివి ప్రారంభించింది. ఈ అనూహ్య ఘటనతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫీనిక్స్ పోలీసులు సదరు యువతి కోల్మాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దాడి కారణంగా ఇద్దరు అధికారులు ఆస్పత్రి పాలయ్యారు. ఆ యువతి వీరంగంతో చెక్పాయింట్ని మూసివేసి.. భద్రతా స్క్రీనింగ్ కోసం సుమారు 450 మంది ప్రయాణికులు మరో చెక్పాయింట్కి వెళ్లాల్సి వచ్చింది. (చదవండి: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..) -
చేతిలో స్మార్ట్‌ఫోన్..వెన్నెముక డౌన్!
ఒకప్పుడు రైల్లోనో, బస్సులోనో కూర్చునే చోటు దొరక్క నిలబడాల్సి వచ్చిందని మాత్రమే చింతించేవారు.. మరి ఇప్పుడు మనం మొబైల్‌ను మిస్ అవుతున్నామని అంతకు మించి చింతిస్తున్న పరిస్థితి. (నిలబడీ మొబైల్ వాడేవాళ్లూ ఎక్కువే ఉన్నారనుకోండి). కూర్చునేందుకు కాస్త చోటు దొరికితే చాలు.. టక్కున ఫోన్లో తలదూర్చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. కూర్చున్నా, బెడ్‌పై ఉన్నా, బయట ఎక్కడైనా తిరుగుతున్నా, నడుస్తూ వెళుతున్నా మొబైల్ ఫోన్ చేతిలోనే ఉంటోంది. కానీ ఇదే అతిపెద్ద సమస్యను తెచ్చిపెడుతోంది. ఫోన్ చూడటం కోసం మెడ వంచడం, చేతులను ఎక్కువ సేపు పైకెత్తి ఉంచడం, కూర్చున్నా, పడుకున్నా ఫోన్ చూడటం కోసం ఏదో ఓవైపు వంగిపోతుండటం, స్క్రోలింగ్, టైపింగ్ కోసం వేళ్లను విపరీతంగా వినియోగిస్తుండటం వంటి వాటితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ టెక్ నెక్.. సమస్యతో.. స్మార్ట్‌ఫోన్‌తో గంటల కొద్దీ గడిపేవారు, ఇందులో ముఖ్యంగా టీనేజర్లు ‘టెక్ నెక్’, లేదా ‘న్యూ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’తో బాధపడుతున్నారని తాజా పరిశోధనలు గుర్తించాయి. దీనిద్వారా మెడ, వెన్నునొప్పితోపాటు తలనొప్పి, భుజాల నొప్పులు, చేతుల్లో జలదరింపు, కండరాలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చాలాసేపు మెడ వంచి చూడటం వల్ల.. మెడలోని స్నాయువులు, కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతోందని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ఐఎస్‌ఐఈ) మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ ఛబ్రా హెచ్చరించారు. దీర్ఘకాలికంగా, మెడ కండరాలు అపసవ్యంగా సంకోచించడం వల్ల పుర్రెతో అనుసంధానమైన ఉన్నచోట మంట, నొప్పిని కలిగిస్తుందని.. ఈ నొప్పి ఫాసియా ద్వారా మెడ నుంచి తలకు వ్యాపిస్తుందని వివరించారు. భంగిమ సరిగా లేక.. భారంగా.. మొబైల్‌ను చేతిలో పట్టుకున్నప్పుడు కేవలం వేళ్లు మాత్రమే ఉపయోగిస్తున్నామని అనుకుంటాం. కానీ మన చేతులు, మోచేయి, కండరం, మెడ ఇవన్నీ వినియోగిస్తాం. మొబైల్‌ను చూస్తున్నప్పుడు మెడను కిందకు వంచుతాం. దీనివల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్’కథనం ప్రకారం.. ఇలా మెడ వంచి చూసే భంగిమ వల్ల వెన్నెముకపై తల బరువు పెరుగుతుంది. ‘‘వాస్తవానికి తల నిటారుగా ఉన్న స్థితిలో దాదాపు 5–8 కిలోల బరువుపడుతుంది. తల వంగుతున్నప్పుడు 15 డిగ్రీల దగ్గర.. మెడపై భారం సుమారు 12 కిలోలు, 30 డిగ్రీల దగ్గర 18.14 కిలోలకు 45 డిగ్రీల దగ్గర 22.23 కిలోలకు 60డిగ్రీల దగ్గర 27.22 కిలోలకు పెరుగుతుంది. ఇలా మెడ అతిగా వంగడంతో వెన్నెముక, సపోర్టింగ్ లిగమెంట్లు, కండరాలపై ప్రభావం పడుతుంది..’’అని ఆ కథనం స్పష్టం చేసింది. కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఫోన్ మాట్లాడే సమయంలో నిలబడే, కూర్చునే భంగిమలో లోపాలు మసు్క్యలోస్కెలెటల్ సమస్యలకు కారణం అవుతున్నాయని.. గర్భాశయ, థొరాసిక్, నడుము ప్రాంతాలలో వెన్నెముక దెబ్బతినడంతో అనేక మంది ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా కీళ్ల పనితీరు బాగున్నప్పుడు ఒత్తిడికి గురైనా, విశ్రాంతి సమయంలో మరమ్మతు అవుతాయని వివరిస్తున్నారు. కానీ కీళ్లను అసాధారణ భంగిమలో ఎక్కువసేపు ఉంచడం, ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంచడం వల్ల తీవ్రమైన ఒత్తిడి పడి.. అరిగిపోయి, తిరిగి బాగయ్యేందుకు అవకాశం లేనంతగా దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే? ♦ మెడ భుజం ముందుకు సాగినప్పుడు.. ముందువైపు కండరాలు బిగుతుగా మారుతూ, వెనుక వైపు బలహీనపడతాయి. కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు భంగిమపై శ్రద్ధ చూపడం తప్పనిసరి. ♦ శరీర భంగిమ అనేది ఫిట్‌నెస్‌కు కీలకం. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్ వంటివాటి మీద ఉండగా.. మొబైల్ ఫోన్ వినియోగించడం వంటివి చేయవద్దు. ♦ నిలబడి ఉన్నప్పుడు, ఎవరికైనా మెసేజీలు పంపుతున్నప్పుడు తల పైకి, భుజాలు కిందకు ఉంచాలి. వీలైనంత వరకు మొబైల్‌ను కళ్లకు సమాంతరంగా ఉంచడం సరైన భంగిమ. ♦ కురీ్చలో లేదా సోఫాలో కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ వంగిపోవడం ఏ విధంగానూ ఆరోగ్యకరం కాదు. వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఫోన్ చూడటానికి లేదా టెక్ట్స్ చేయడానికిగానీ మెడ ఎక్కువగా వంచకూడదు. ♦ పడుకున్నప్పుడు ఫోన్ పట్టుకోవడానికి.. మోచేతికి దిండు లేదా మరేదైనా మెత్తని దాన్ని ఆసరాగా తీసుకోవాలి. ♦ భోజనం చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ వినియోగిస్తూ, డ్రైవ్ చేస్తూ.. ఇలా పలు సందర్భాల్లో ఫోన్‌ను కూడా ఉపయోగించడమనే మల్టీ టాస్కింగ్ అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా ఆరోగ్యానికి చేటు తెస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బఫెలో హంప్ కనిపిస్తోంది టెక్ట్స్ నెక్ సిండ్రోమ్, స్పైన్ పెయిన్ వంటివన్నీ మనం నిలబడే, కూర్చునే, శరీరాన్ని ఉంచే తీరులో సమస్య వల్లే తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంపాటు తప్పుడు భంగిమ వల్ల మెడ అలైన్మెంట్ సాగిపోతుంది. దాదాపు 60, 70ఏళ్ల వయసులో సంభవించే మెడలు సాగిపోవడం, ఫ్రోజెన్ షోల్డర్, రౌండెడ్ షోల్డర్ వంటివి 40 ఏళ్ల వయసులోనే వచ్చేస్తున్నాయి. మొత్తంగా సహజమైన శరీర నిర్మాణాన్ని ఈ భంగిమ లోపాలు దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు బాగా తలవంచుకుని పనిచేసే కొందరు బ్యాంకు ఉద్యోగులు వంటివారిలో ఎక్కువగా కనిపించే మెడ వెనకాల సెమీ సర్కిల్ ఇప్పుడు చాలామందిలో కనిపిస్తోంది. బఫెలో హంప్గా పేర్కొనే దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు తప్పవు. ఏదేమైనా భంగిమ లోపాలు సరిచేసుకుంటూనే ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవడమే ఉత్తమం. – డాక్టర్ విజయ్ బత్తిన, ఉఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలి ఇటీవల భుజాల నొప్పులు, మణికట్టు బాధలు చాలా మందిలో గమనిస్తున్నాం. మొబైల్స్‌ని ప్రొఫెషనల్‌గా వాడేవారిలో బొటనవేలు మొద్దు బారడం సహా మరిన్ని సమస్యలు కనపడుతున్నాయి. పడుకునే భంగిమలో పుస్తకం చదివినట్టు ఫోన్ చూడడం సరికాదు. అలాగే వాష్‌రూమ్స్, టాయిలెట్స్‌లో కూడా వాడొద్దు. ఎలాపడితే అలా వాడటం వల్ల భుజాల కండరాలు, చేతులు, మణికట్టు ఒత్తిడికి గురవుతాయి. అయితే ఏది సరైన భంగిమ అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. కాబట్టి వీలైనంత వరకూ ఫోన్ వాడేటప్పుడు మధ్యలో విరామాలు తీసుకోవడం, ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం తప్పనిసరి. – డాక్టర్ శివరాజు, జనరల్ ఫిజీషియన్, కిమ్స్ ఆస్పత్రి -
ప్రధాని మోదీ మెచ్చుకున్న టీనేజ్ గర్ల్.. అసలు ఎవరీ తనిష్క సుజిత్!
తనిష్క సుజిత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థి. 11 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసుకుని.. 15 ఏళ్లకే బీఏ ఫైనల్ పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. దీని అనంతరం లా కోర్పు చదివి భారత ప్రధాన న్యాయమూర్తి కావాలనే లక్ష్యంతో ముందుకు పోతోంది. 2020లో కోవిడ్‌తో తన తండ్రి, తాతలను కోల్పోయిన ఈ యువతి.. ఆ బాధను దిగమింగుకుని మనో ధైర్యంతో తన లక్ష్య సాధనవైపుగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కోసం రాష్ట్ర రాజధాని భోపాల్‌కు వెళ్లిన తనిష్క.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి దాదాపు 15 నిమిషాలు ముచ్చటించారు. తాను బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక యుఎస్‌లో న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నానని, ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తి కావాలని కలలు కన్నానని ప్రధాని చెప్పినట్లు తెలిపింది. "నా లక్ష్యం గురించి విన్న ప్రధాని మెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ న్యాయవాదుల వాదనలు చూడాలని నాకు సలహా ఇచ్చారు. అది నా లక్ష్యాన్ని సాధించడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానిని కలవడం నాకు ఒక కల నిజమైంది" అని ఆమె చెప్పారు. దేవి అహల్య విశ్వవిద్యాలయం సోషల్ సైన్స్ స్టడీస్ విభాగాధిపతి రేఖా ఆచార్య మాట్లాడుతూ.. సుజిత్‌కు 13 సంవత్సరాల వయస్సులో విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రత్యేక ప్రతిభ చూపడంతో బీఏ (సైకాలజీ) మొదటి సంవత్సరంలో ప్రవేశం లభించిందని తెలిపారు. ఆమె ప్రతిభను మెచ్చిన యూనివర్శిటి యాజమాన్యం బీఏ (సైకాలజీ)లో ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. -
మరో యువతితో ప్రేమాయణం.. ఇది తెలియడంతో హైదరాబాద్ వెళ్లి
సాక్షి, నిజామాబాద్(మాక్లూర్): ప్రేమికుడి వేధింపులను తట్టుకోలేక విషం తాగిన యువతి చికిత్స పొందుతూ 9 రోజుల అనంతరం మృతి చెందింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్ భండార్ తండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అభిలాష్, అదే తండాకు చెందిన కెతావత్ రాజేశ్వరి (19) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల అభిలాష్ మరో యువతితో ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలిసిన రాజేశ్వరి అతనితో గొడవ పడింది. దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రెండునెలల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ జ్యూయలరీ షాప్‌లో జాబ్‌లో చేరింది. అయితే అభిలాష్ తరుచూ ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించటంతో తిరిగి మార్చి 20న రాజేశ్వరి తండాకు వచ్చింది. అభిలాష్ నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో గతనెల 23న రాత్రి 8 గంటల సమయంలో విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమించి రాజేశ్వరి శనివారం మృతి చెందింది. విషయం తెలిసిన తండాలోని యువతి బంధువులు అభిలాష్ ఇంటిపై దాడి చేశారు. మృతురాలి తండ్రి దుబాయ్‌లో ఉన్నాడు. తల్లి, అనూష, అన్న తరుణ్ వ్యవసాయ పనులు చేస్తారు. పోలీసులు అభిలాష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
‘చెడు’జోలికి పోకుండా
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే 25.3 కోట్ల మందితో అత్యధికంగా యువత కలిగిన దేశం భారత్. ఈ యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు 10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య కౌమార దశలో (టీనేజిలో) ఉన్నారు. కౌమార దశలో ఉన్న బాలబాలికలు చెడు ప్రభావాలకు గురికాకుండా లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్య సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ క్లినిక్స్‌లో నమోదు చేసుకునే కౌమార బాలల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో, వివిధ రాష్ట్రాలవారీగా కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో నమోదు సంఖ్య, కౌన్సెలింగ్ తీరుపై విశ్లేషణాత్మక నివేదికను ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో వివిధ రాష్ట్రాల్లో క్లినిక్‌లలో నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగిందని నివేదిక తెలిపింది. 2020–21లో కోవిడ్ నేపథ్యంలో ప్రతి లక్ష జనాభాలో 383 మంది ఈ క్లినిక్‌లలో కౌన్సెలింగ్‌కు పేర్లు నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 601కు పెరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో కూడా 2020–21లో ప్రతి లక్ష మందిలో 283 మంది నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 1,673కు పెరిగిందని పేర్కొంది. యుక్త వయస్సులోని యువతీ యువకులను ఆరోగ్యంగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడతారని, ఈ నేపథ్యంలోనే కౌమార దశలోని బాలికలు, బాలురకు పని, విద్య, వివాహం, సామాజిక సంబంధాల విషయంలో చెడు ప్రభావాలకు లోనుకాకుండా చేయడమే స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ అని నివేదిక పేర్కొంది. రాష్ట్రీయ కిశోర్ స్వాస్త్య కార్యక్రమం కింద కౌమార ఆరోగ్య సమస్యలు, పౌష్టికాహారం, లింగ ఆధారిత హింస, నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మానసిక ఆరోగ్యంతోపాటు పెడ ధోరణులకు లోనుకాకుండా వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. శిక్షణ పొందిన సర్విస్ ప్రొవైడర్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఈ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో 36,56,271 మంది బాలురు, 45,73,844 మంది బాలికలు నమోదయ్యారు. 2021–22లో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో 60 శాతం పైగా కౌమార దశలోని బాల బాలికలు క్లినికల్ సేవలు, కౌన్సెలింగ్ పొందినట్లు నివేదిక పేర్కొంది. 2021–22లో దేశం మొత్తమీద 70 శాతం బాలికలు, 66 శాతం బాలురు క్లినికల్ సేవలు పొందారు. అలాగే 76 శాతం బాలికలు, 69 శాతం బాలురు కౌన్సెలింగ్ తీసుకున్నారు. మన రాష్టంలో 2021 నాటికి 5,28,95,000 జనాభా ఉండగా అందులో 8,85,150 మంది కౌమార బాలలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. -
100 మంది టీనేజర్లు కలిసి పార్టీ చేస్కుంటుండగా కాల్పులు..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. జార్జియా రాష్ట్రం డౌగ్లాస్ కౌంటీలోని ఓ ఇంట్లో 100 మంది టీనేజర్లు కలిసి పార్టీ చేసుకుంటుండగా కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి 10:30-11:30 మధ్య ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పార్టీలో ఏదో గొడవ జరిగే కాల్పులు చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అందరూ టీనేజర్లే ఉన్నారని, ఘటన సమయంలో పెద్దలు ఒక్కరైనా ఉన్నారో లేదో తెలియదని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అయ్యాక ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని చెప్పారు. కాల్పులు ఒక్కరే జరిపారా? లేదా ఎక్కువ మందికి ఇందులో ప్రమేయం ఉందా? తెలియాల్సి ఉందన్నారు. చదవండి: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీ కన్నుమూత.. -
అప్పుడే వద్దు.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలివే..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలిసీ తెలియని వయసులో కలిగే లైంగిక కోరికలతో పాటు లైంగిక హింస, బాల్య వివాహాలు.. ఆడుకునే అమ్మాయిల్ని అమ్మల్ని చేస్తున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చిన అమ్మాయిల్లో, వారికి పుట్టే పిల్లల్లో కొన్ని దీర్ఘ కాలిక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఇద్దరూ జీవితాంతం ఇటు శారీరకంగా, అటు మానసికంగా బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక విద్య పట్ల పూర్తి అవగాహన కల్పిస్తేనే ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో మార్పు రాకపోవడం విస్మయపరుస్తోంది. కూతురు రజస్వల కాగానే పెళ్లి చేస్తే సరిపోతుందని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కాగా కొంతమంది అమ్మాయిలు చదువు, కెరీర్, ఉద్యోగాల్లో స్థిరపడటం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం గురించి ఆలోచిస్తూ 26 ఏళ్ల వరకూ వివాహం చేసుకోవడం లేదు.. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూతురికి పెళ్లిచేస్తే తమ బాధ్యత తీరుతుందని, బరువు తగ్గుతుందని పదహారేళ్లకే కానిచ్చేస్తున్నారు. ఈ కారణంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ఇక్కడే కాదు రాయలసీమ జిల్లాల్లోనే చిన్న వయసులో తల్లులవుతున్న వారు చాలా ఎక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యంగా కలుగక మానదు. పదహారేళ్లకే తల్లులుగా.. వివాహ అర్హత వయసే 18 ఏళ్లు ఉండగా పదహారేళ్లకే తల్లులవుతున్న పరిస్థితి చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గడిచిన 11 మాసాల్లో అనంతపురం జిల్లాలో 105 మంది అమ్మాయిలు 16 ఏళ్ల లోపు వయసులోనే గర్భం దాల్చారు. 18 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిల్లో మరో 433 మంది గర్భం దాలి్చన వారిలో ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనూ 16 ఏళ్లలోపు వయసున్న 63 మంది అమ్మాయిలు తల్లులయ్యారు. 18 ఏళ్లలోపు ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వారు మరో 283 మంది ఉన్నారు. వీరిలో 95 శాతం మంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలే. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు వారికి మూడుముళ్ల బంధం వేసి వారి కెరీర్‌కు మధ్యలోనే సమాధి కడుతున్నారు. రాయలసీమ జిల్లాలో కర్నూలు తర్వాత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై అబ్బాయిలతో కలిసి ఇంట్లోనుంచి వెళ్లిపోతున్న పరిస్థితులూ ఉన్నాయి. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలు ►మెటర్నల్ మోర్టాలిటీ అంటే కాన్పు సమయంలో తల్లులు మృతి చెందే అవకాశం ఉంది ►నెలలు నిండక ముందే పుట్టే అవకాశం ►స్టిల్ బర్త్ అంటే కడుపులోనే బిడ్డ చనిపోవడం ►శిశువులు బరువు తక్కువగా పుట్టడం ►తీవ్రస్థాయిలో రక్తపోటు ►శిశువులు సరిగా శ్వాస తీసుకోలేక పోవడం చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు.. చర్యలు తీసుకుంటాం 1098.. ఇది చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. బాల్య వివాహం చేసినట్లు లేదా ఏర్పాట్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే సదరు ప్రాంతానికి వెళ్తాం. అమ్మాయిని కేజీబీవీలో చేర్పించి చదివిస్తాం. చట్టపరంగా తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటాం. చాలామంది అమ్మాయిలు మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై చిన్న వయసులో అబ్బాయిలతో కలిసి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి. – శ్రీదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..?
కెనడా: అదృష్టం తలుపుతడితే ఒక్క రోజులో జీవితాలు మారిపోతాయ్ అంటారు. కెనడాకు చెందిన 18 ఏళ్ల జూలియెట్ లామర్‌కు సరిగ్గా ఇలానే జరిగింది. ఆమె రాత్రికిరాత్రే కోటీశ్వరురాలు అయింది. పుట్టిన రోజు ముందు ఏం కొనాలో తెలియక.. తాతయ్య సూచన మేరకు లాటరీ కొనుగులు చేసిన ఆమెకు ఏకంగా రూ.290 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి ఇంతడబ్బు వస్తే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి ఉంటుంది. కానీ జూలియెట్ మాత్రం అప్పుడే రూ.150 కోట్లు ఖర్చు పెట్టేసింది. లాటరీ డబ్బు రాగానే తన కుటుంబం కోసం ఐదు మెర్సీడెస్ కార్లు కొనుగోలు చేసింది. దీని ధర ఒక్కోటి రూ.2కోట్లు ఉంటుంది. అలాగే రూ.40 కోట్లతో పెద్ద బంగ్లా సొంతం చేసుకుంది. మరో రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌కు యజమాని అయింది. ఇక మిలిన డబ్బును మాత్రం భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంది. అంతేకాదు తన తండ్రి సలహాలు సూచనలో ఈ డబ్బుతో పెట్టుబడులు కూడా పెడతానని చెబుతోంది. జూలియెట్ ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఏమైనా కొనుక్కుందాం అని దుకాణానికి వెళ్లింది. ఏం కొంటే బాగుంటుందని తన తాతయ్యను అడగ్గా.. లాటరీ కొనుగోలు చేయమని అతను సూచించాడు. దగ్గరుండి టికెట్ ఇప్పించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత లాటరీ విషయాన్ని జూలియెట్ మర్చిపోయింది. కానీ పక్కింటి వాళ్లు లాటరీలో డబ్బు గెలుచుకున్నారని తెలిసింది. దీంతో తన లాటరీ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంది. తాను కొనుగోలు చేసిన టికెట్ నంబర్‌కు రూ.290 కోట్లు(48 మిలియన్లు) వచ్చాయని తెలిసి ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయింది. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
డిజిటల్ సర్పం.. విషానికి విరుగుడు
పదిమంది గుమిగూడే స్థలం... అంటే బస్టాప్, రైల్వేస్టేషన్, ఆఖరికి పార్కులకు వచ్చేవారిలో కూడా చాలామంది మొబైల్లోనో, ట్యాబ్‌లోనో తలలు దూర్చి కనిపిస్తారు. అవసరం మేరకు ఉపయోగించడానికి బదులుగా, అంతకంటే ఎక్కువగా ఎప్పుడూ స్క్రీన్కు అతుక్కుపోవడాన్ని ‘డిజిటల్ అడిక్షన్’గా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది విషపదార్థాలను మెదడులోకి నింపుకోవడమేననీ, చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఆ వివరాలివి... పిల్లలతో పాటు పెద్దలు సైతం మొబైల్స్‌నూ, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ వంటి వాటిని వాడుతుంటారు. అయితే వారు పెద్దవాళ్లు కావడంతో కుటుంబ బాధ్యతలకూ, ఆఫీసు పనుల కోసం స్క్రీన్ నుంచి ముఖం తప్పించడం తప్పదు. స్క్రీన్కు అతుక్కుపోవడం టీన్స్‌లో ఎక్కువ... పిల్లల్లో అందునా టీనేజీ పిల్లల్లో ‘స్క్రీన్’ పట్ల అడిక్షన్ ఎక్కువ. తమ చదువుల కోసం, కాలేజీల్లో ఇచ్చే టాస్కులు, ప్రాజెక్టుల కంటే ఎక్కువగా సరదా అంశాలూ, సినిమాలు, గాసిప్స్ కోసమే స్క్రీన్ టైమ్‌ను వెచ్చిస్తుంటారు. అంతకంటే చిన్న పిల్లల్లోనూ... ఇక టీన్స్‌లోకి రాని ఎనిమిది, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల పిల్లలు సైతం డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల్లో తలను ముంచేస్తారు. ఆఖరికి బయటికి వచ్చినప్పుడు కూడా మొబైల్లో ఎన్నో రకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఒక్కోసారి పిల్లల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్లు అల్లరి చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులే ‘మొబైల్స్’ను వాళ్ల చేతికి అందిస్తుంటారు. అదే అలవాటు వాళ్లు టీన్స్‌లోకి వచ్చాక మరీ ముదిరిపోతుంది. ఓ వయసుకు చేరేనాటికి అది ‘డిజిటల్ అడిక్షన్’గా మారిపోతుంది. దీని వల్ల వచ్చే మానసిక సమస్యల విశ్వరూపాల్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మొబైల్లో గేమ్స్ ఆడవద్దన్నందుకు తల్లిదండ్రులతో పోట్లాటలు దగ్గర్నుంచి ఆత్మహత్యల వరకు ఈ దుష్పరిణామాలెన్నో. డిజిటల్ అడిక్షన్‌ను గుర్తించడమెలా? స్క్రీన్ ముందు చాలాసేపు గడపడం: సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తే చాలాసేపు గడపడం. దాంతో చదువూ, హోమ్‌వర్క్, వ్యాయామం, ఫ్రెండ్స్‌తో కలవడం వంటి కార్యకలాపాలకు దూరమవుతుంటారు. స్క్రీన్ ముందు నుంచి తప్పించడం చాలా కష్టం కావడం: పిల్లల చేతుల్లోంచి స్మార్ట్‌ఫోన్ లాగేసుకున్నా లేదా కంప్యూటర్ ఆఫ్ చేయమన్నా వాళ్లకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. బలవంతంగా మొబైల్ లాగేసినా లేదా కంప్యూటర్ ఆఫ్ చేసినా కోపం రగిలిపోవడంతో పాటు చేతుల్లో ఉన్న వస్తువుల్ని విసిరేసి, వైల్డ్‌గా ప్రవర్తిస్తుంటారు. రోజువారీ పనుల్ని పూర్తి చేయకపోవడం: తాము రోజూ చేయాల్సిన క్లాస్వర్క్గానీ లేదా హోమ్వర్క్గానీ చేయకుండా వదిలేస్తారు. ఈ పెండింగ్వర్క్ను తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు అతిగా ఆందోళనపడుతుంటారు. ఒంటరిగా ఉండటం: వీరు స్మార్ట్‌ఫోన్‌లోని యాప్స్‌తో తప్ప ఇతరులతో కమ్యూనికేషన్లో ఉండరు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దేనిపట్లా ఆసక్తితో ఉండరు సరికదా... గతంలో వారికి ఇష్టమైన పెయింటింగ్ లాంటి అభిరుచులకు దూరంగానూ, అనాసక్తితో ఉంటారు. మూడ్ స్వింగ్స్ : తాము చేసే పని పట్ల ఏకాగ్రత కోల్పోతుండటం, దేని పట్లా దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో పాటు త్వరత్వరగా వారి మూడ్స్మారిపోతుండటం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. అంతేకాదు... వారి ప్రవర్తన గమనించి పెద్దవాళ్లు ఫోన్ తీసుకోబోతుంటే దాన్ని దాచుకోవడం, అబద్ధాలు చెప్పడం వంటివీ చేస్తారు. చక్కదిద్దడానికి చిట్కాలివి... పిల్లలు అవసరానికి మించి ‘స్క్రీన్’ను వాడటాన్ని తగ్గించేలా చేయడం ఎలాగో మానసిక నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలివి... ముందు మారాల్సింది పేరెంట్సే: చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌తో చాలా సేపు గడుపుతూ... తమ పిల్లలు మాత్రం వాటికి దూరంగా, క్రమశిక్షణతో ఉండాలనుకుంటారు. ఈ విషయంలో ముందుగా మారాల్సిందీ, పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిందే తల్లిదండ్రులే. ఒకేసారి లాగేయకండి: అడిక్షన్‌కు లోనైన పిల్లల నుంచి స్మార్ట్‌ఫోన్ /ల్యాప్‌టాప్‌ను ఒకేసారి లాగేయకండి. స్విచ్నొక్కినట్టుగా పిల్లలు మారిపోరు. వారు రోజూ డిజిటల్ డివైజ్‌తో ఎంత టైమ్‌ను గడపదలచుకున్నారో వారినే నిర్ణయించుకొమ్మని సూచించండి. నిర్దిష్టంగా ఆ టైమ్‌లో వాళ్లను స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌తో ఆడుకోనివ్వండి. క్రమంగా ఆ టైమ్‌ను తగ్గిస్తూ రావాలి తప్ప ఠక్కున మారిపోవడం అంటూ జరగదు. పైగా అలా చేయడం ఇంకా మరికొన్ని దుష్పరిణామాలు దారితీస్తుంది. స్నేహితుల్ని వ్యక్తిగతంగా కలవమనడం: స్నేహితుల్ని ఫోన్లో లేదా వాట్సాప్‌లో పలకరించడానికి బదులు వ్యక్తిగతంగా కలిసి రమ్మనీ, కలిసి ఆడుకొమ్మని ప్రోత్సహించాలి. అంతేకాదు... పెళ్లిళ్లు, పండుగల వంటి సమయాల్లో వ్యక్తుల్ని, బంధువుల్ని ప్రత్యక్షంగా కలవమని, సామాజిక బంధాల్ని బలోపేతం చేసుకోవడం ఎంత అవసరమో చెప్పాలి. వారీ అలవాటు నుంచి బయటకు వచ్చాక... డిజిటల్ ఉపకరణాలవల్ల వారు కోల్పోబోయిన అంశాలు, వాటి వల్ల కలిగిన నష్టాలతో పాటు... డీ–టాక్సికేషన్ తర్వాత ఇప్పుడు వారికి ఒనగూరిన/ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించవచ్చు. అప్పుడు వారు డిజిటల్ ఉపకరణాలను మరింత సమర్థంగా ఎలా వాడాలో తెలుసు కుంటారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటూ స్వీయనియంత్రణ పాటిస్తారు. (క్లిక్ చేయండి: సోషల్ మీడియా పోస్ట్ వాల్యూకి ఇవే కొలమానం! ఈ చిట్కాలు పాటిస్తే..) డిజిటల్ ఉపకరణాల దుష్ప్రభావాలు నిద్రలేమి, తరచు నిద్రాభంగం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం (లో సెల్ఫ్ ఎస్టీమ్), తరచు తలనొప్పులు, ఒకేచోట కూర్చుని అదేపనిగా గేమ్స్ ఆడుతుండటం వల్ల ఒబేసిటీ, కీళ్లనొప్పులు వంటి అనేక రూపాల్లో కనిపిస్తాయి. అందుకే వీటిని మనకు ఉపయోగపడే మేరకే విచక్షణతో, తెలివిగా వాడుతూ... వీటికి అడిక్ట్ కావడం నుంచి క్రమంగా బయటపడాలి. - డాక్టర్ చరణ్‌తేజ కోగంటి సీనియర్ సైకియాట్రిస్ట్ -
టీనేజ్‌లో గాంధీజీని తీవ్రంగా విమర్శించేవాడిని: కమల్ హాసన్
సినీ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మహాత్మా గాంధీ గురించి చాలా ఆసక్తికర విషయాలు రాహుల్‌కి చెప్పారు. తాను టీనేజ్‌లో ఉండగా జాతిపిత మహాత్మగాంధీని తీవ్రంగా విమర్శించేవాడినని, పైగా ఆ వాతావరణం కూడా అలానే ఉండేదంటూ చెప్పుకొచ్చారు. కానీ తన నాన్న మాత్రం కాంగ్రెస్ వ్యక్తేనని అన్నారు. సంత్సరాలు గడిచేకొద్ది తాను మహాత్మా గాంధీకి అభిమానిగా మారానని చెప్పారు. అందుకే హేరామ్ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. తప్పుచేస్తే క్షమించండి అని చెప్పడం తన పద్ధతి అని కూడా చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్న వారం రోజుల తర్వాత ఇరువురు కలిసి ఇలా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో కమల్‌హాసన్‌కు ప్రియాంక గాంధీ కుమారుడు క్లిక్ చేసిన పులి నీరు తాగుతున్నపెద్ధ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది మీ జీవితం పట్ల దృక్పథం, వైఖరిని చెబుతోంది, పైగా మీరు గొప్ప భారతీయుడు, గొప్ప ఛాంపియన్ అనే వాస్తవాన్ని మాకు తెలియజేస్తుందంటూ రాహుల్ ఈ చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తూ.. కమల్ హాసన్‌తో అన్నారు. అలాగే రాహుల్ ద్వేషం అనేది అంధత్వం, అపార్థం లాంటిదని కామెంట్ చేయగా, అందుకు ప్రతిగా కమల్ ద్వేషానికి ఉన్న మరో చెత్త రూపం 'హత్య' అని చెప్పారు. (చదవండి: ఢిల్లీ మహిళను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన..వెలుగులోకి విస్తుపోయే నిజాలు) -
షాకింగ్ విషయాలు.. ‘సోషల్’ శృతి మించితే అంతే.. రోజుకు 6 గంటలా!
సాక్షి, హైదరాబాద్: కౌమార ప్రాయంలోనే కుర్రకారు సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపేస్తున్నారు. చదువు, కెరీర్, భవిష్యత్‌కు చక్కటి బాటలుపర్చుకోవాల్సిన తరుణంలోనే సామాజిక మాధ్యమాలతో కుస్తీ పడుతూ సమయం వృథా చేసేస్తున్నారట. మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ అత్యధికంగా ఉన్నట్లు టెక్‌సెవీ అనే సంస్థ తాజా అధ్యయనంలో తెలిపింది. మన సుమారు 31 శాతం మంది టీనేజర్స్ రోజుకు 6 గంటల పాటు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం, వాట్సాప్ తదితర మాధ్యమాలతో పాటు ఆన్లైన్ వీడియో గేమ్స్‌లతో టైమ్‌పాస్ చేస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. రోజుకు 3 నుంచి 6 గంటల పాటు సోషల్ మీడియా, గేమ్స్ ఆడుతూ గడుపుతున్నవారు 27 శాతం మంది.. ఒకటి నుంచి మూడు గంటల పాటు గడుపుతున్న వారు 8 శాతం.. కేవలం ఒక గంటపాటైనా సోషల్ ఛాట్, వీడియో గేమ్ ఆడనిదే నిద్రపోని వారు 13 శాతం మంది ఉండడం గమనార్హం. నయాట్రెండ్ మాటెలా ఉన్నా.. ఈ పరిణామంతో తమ పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తుండడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 9 నుంచి 13 ఏళ్లలోపు వారిలోనూ 21 శాతం మంది రోజుకు 6 గంటల పాటు సోషల్ మీడియా, వీడియో గేమ్స్‌తో కుస్తీ పడుతున్నట్లు ఈ అధ్యయనం తెలపడం గమనార్హం. తమ చిన్నారులు వీడియో గేమ్‌లు, సోషల్ మీడియాకు బానిసలుగా మారినట్లు 39 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తుండగా.. మరో 38 శాతం మంది ఈ పరిణామం పట్ల ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిపింది. మరో 23 శాతం మంది చిన్నారులు సోషల్ మీడియా, గేమ్స్, వీడియోలకు బానిసలుగా మారలేదని స్పష్టం చేసినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. శృతి మించితే అనర్థాలే.. ప్రస్తుత సాంకేతిక యుగంలో చిన్నారులకు అన్ని మాధ్యమాలపై అవగాహన తప్పనిసరి అయినప్పటికీ.. ఇదే వ్యసనంగా మారితే అనర్థాలు తప్పవని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు ఏ అంశాలపై సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు? ఎలాంటి చాటింగ్ చేస్తున్నారు? ఏ గేమ్స్ ఆడుతున్నారన్న అంశంపై తల్లిదండ్రులు కనిపెట్టని పక్షంలో అనర్థాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. స్మార్ట్ ఫోనే ముద్దు.. చాక్లెట్.. పిజ్జా.. బర్గర్లతో పాటే టీనేజర్లు స్మార్ట్ ఫోన్‌ను బాగా ముద్దు చేస్తున్నారట. సుమారు 38 శాతం మంది కౌమార దశ బాల, బాలికలు విరివిగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. డెస్క్‌టాప్ కంప్యూటర్లను 31 శాతం మంది.. ల్యాప్‌టాప్‌లను 16 శాతం.. ట్యాబ్లెట్ పీసీలను 5 శాతం మంది వినియోగిస్తున్నారని ఈ అధ్యయనం తెలపడం విశేషం. -
మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు..
-
Video: మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు..
కొంతమంది చాలా ర్యాష్‌గా ప్రవర్తిస్తుంటారు. చేసిందితప్పు అని చెప్తే ఇంకా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. నచ్చచెప్పే ప్రయత్నం, శాంతంగా వివరణ ఇచ్చిన బుర్రకెక్కుదు. పైగా అలా చెప్పిన వాళ్లని తిట్టడమో! లేక వారిపై దాడి చేయడమో చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే యూఎస్‌లోని ఒక రెస్టారెంట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....అమెరికాలోని బియాంకా ప్లోమెరా అనే 19 ఏళ్ల యువతి హ్యాబిట్ బర్గర్ గ్రిల్ రెస్టారెంట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అయితే అక్కగే ఒక దివ్యాంగుడు కూడా పనిచేస్తున్నాడు. కొంతమంది మగవాళ్లు సదరు దివ్యాంగుడిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం ప్రారంభించారు. దీన్ని చూసిన అసిస్టెంట్ మేనేజర్ ప్లోమెరా వారిని అడ్డుకుని మీరు చేసింది కరెక్ట్ కాదు, అతను దివ్యాంగుడు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అంతే ఒక వ్యక్తి అనూహ్యంగా ఆమె ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత వెంటనే ఆమె కూడా ప్రతిదాడి చేయడం ప్రారంభించగా... మళ్లీ యువతి ఘోరంగా దాడి చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో యువతి కుడి కన్నుకి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు మాత్రం ఆమె కన్నుని కాపాడలేకపోయారు. ఫలితంగా ఆమె కుడి కన్నుని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో నెట్టింట హల్చల్ చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు రెస్టారెంట్ వద్దకు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. @raulbrindis Un hombre golpeó repetidamente a Bianca Palomera, 19, asistente. gerente de @habitburger en Mahogany en Antioch después de que ella le dijo que se fuera porque estaba acosando a un adolescente con necesidades especiales. @CaraTurky @DrZpitapita . pic.twitter.com/XTA7Pzym59 — Bunburyfan (@Bunburyfan8) November 17, 2022 (చదవండి: ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు) -
వైద్యుల నిర్లక్ష్యానికి యువ క్రీడాకారిణి బలి
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ యువ క్రీడాకారిణి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్లో చోటుచేసుకుంది. వ్యాసర్పాడికి చెందిన ఆర్.ప్రియ(17) బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫస్టియర్ చదువుతోంది. ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయిన ప్రియ కుడి మోకాలి లిగమెంట్ దెబ్బతింది. దీంతో ఆమె పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఈ నెల 7న మోకాలికి ఆపరేషన్ చేసి, కంప్రెషన్ బ్యాండేజీ వేశారు. బ్యాండేజీ గట్టిగా వేయడంతో లోపల రక్త స్రావం అయి గడ్డకట్టి, మిగతా కాలికి సరిగ్గా రక్త ప్రసరణ జరలేదు. వైద్యులు గమనించకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను రాజీవ్‌గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆర్జీజీజీహెచ్) రెఫర్ చేశారు. వైద్యులు ఈనెల 8న ఆమె కుడి కాలిని తొలగించారు. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స కొనసాగుతుండగానే కిడ్నీలు, లివర్, గుండె విఫలమై మంగళవారం ప్రియ తుదిశ్వాస విడిచిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. నిర్లక్ష్యం వహించిన గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశామన్నారు. ప్రియ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుర్నే పార్టీ మారమన్నారు: సీఎం కేసీఆర్ -
బాలుడి మర్మాంగంపై టపాసులు కాల్చిన యువకులు.. వీడియో తీసి వైరల్
సాక్షి, మేడ్చల్: హైదరాబాద్ శివారులో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన 16 ఏళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చి వీడియోను వైరల్ చేసి దారుణానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీనగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసిరేగడి శివారులో జేఎస్‌డబ్ల్యూ రెడీమిక్స్ ప్లాంట్‌లో పనిచేసేందుకు వచ్చాడు. కాగా కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురి చేస్తున్న తోటి యువకులు బాలుడి మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ ఆ తతంగాన్ని వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సదరు బాలుడి సెల్‌ఫోన్ లాక్కుని బెదిరించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను బాధిత బాలుడి బంధువులు తిలకించడంతో విషయం కుటుంబీకులకు చేరింది. ఆ తర్వాత వారు బాలుడికి ఫోన్ చేసి సంఘటన గురించి ఆరా తీశారు. బాలుడు అది నిజం అని తెలపడంతో బాధితుడి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆ కేసును మంగళవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు మేడ్చల్ ఇన్స్పెక్టర్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: విజిటర్‌గా దుబాయ్‌కు వెళ్లి... జల్సాలకు డబ్బంతా ఖర్చు అవ్వడంతో -
మైనర్లను ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లారు.. ఏం తప్పు చేశారో?
భోపాల్: ఇద్దరు మైనర్లను ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. దొంగతనం చేశారనే ఆరోపణలతో తీవ్రంగా చితకబాది.. రెండు కాళ్లకు తాళ్లు కట్టి రద్దీగా ఉండే ఛాయ్‌త్రోమ్ కూరగాయల మార్కెట్ గుండా ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇద్దరు మైనర్లపై పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఇద్దరిని ట్రక్కుకు కట్టి ఈడ్చకెళ్లిన ఘటనపై వీడియో ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఇదీ జరిగింది.. కూరగాయల మార్కెట్లో లోడ్ దింపుతుండగా ఇద్దరు టీనేజర్లు ట్రక్కు నుంచి డబ్బులు దొంగతనం చేశారని ఇద్దరు వ్యాపారులు, డ్రైవర్ ఆరోపించారు. వారు ట్రక్కులోంచి నగదు తీస్తుండగా తాను చూసినట్లు డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో వ్యాపారులు, అక్కడే ఉన్న కొందర మైనర్లను చితకబాదారు. వారి కాళ్లకు తాడు కట్టి ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇలా కూరగాయల మార్కెట్ మొత్తం తిప్పారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు మైనర్లను అదపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ‘మైనర్ల పట్ల ప్రవర్తించిన తీరు భయానకం, హింసాత్మకం. వారిపైనా మేము చర్యలు తీసుకుంటాం. వీడియో ఆధారంగా వారిని గుర్తిస్తున్నాం.’ అని ఇండోర్ పోలీసు అధికారి నిహత్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
14 ఏళ్ల బాలిక కిడ్నాప్ డ్రామా.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముంబై: చదువుకోమని తల్లి మందలించటంతో ఓ 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నాగ్‌పూర్ నుంచి పక్క జిల్లా చంద్రాపూర్‌కు వెళ్లిన బాలిక తాను కిడ్నాప్‌కు గురయ్యానని ఓ కట్టుకథ అల్లింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. కేసు వివరాలను ఆదివారం వెల్లడించారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ జిల్లాలోని నందన్వన్ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. బస్సులో 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్‌కు సాయంత్రానికి చేరుకుంది. తమ కూతురు కనిపించకపోవటంతో ఆమె కోసం వెతకటం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. ఆచూకీ లభించకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు.. చంద్రాపూర్ చేరుకున్న బాలిక నేరుగా రామ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి కారులో చంద్రాపూర్‌కు తీసుకొచ్చినట్లు చెప్పింది. వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు కట్టుకథ అల్లింది. బాలిక తెలిపిన వివరాలతో నాగ్‌పూర్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు చంద్రాపూర్ పోలీసులు. ఆ తర్వాత వారికి అప్పగించారు. నాగ్‌పూర్‌లోని నందన్వన్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. బాలిక తానే బస్సు ఎక్కి చంద్రాపూర్ వెళ్లినట్లు తేలింది. ఈ వీడియోను చూపించి ప్రశ్నించగా.. తన తల్లి చదువుకోవాలని మందలించటం వల్లే ఇలా చేశానని అంగీకరించింది. ఇదీ చదవండి: ‘సూపర్ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్ -
బస్టాండ్‌లో విద్యార్థి మెడలో తాళి కట్టిన మైనర్..చివరికి తిక్క కుదిరింది!
చెన్నై: నేటి యువత కొన్ని విషయాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. చదువుపై దృష్టిపెట్టాల్సిన వారు ప్రేమ పేరుతో పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇద్దరు టీనేజ్ విద్యార్థులు ఏకంగా బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చిదంబరం జిల్లాలోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద మైనర్ బాలుడు పక్కన యూనిఫాం ధరించి కూర్చొని ఉన్న బాలిక మెడలో మంగళసూత్రం కట్టాడు. చుట్టూ ఉన్న స్నేహితులు వారిని పెళ్లి చేసుకునే విధంగా ప్రోత్సహించడం వీడియోలో వినిపిస్తుంది. కాగా వీడియోలోని యువతి ఇంటర్ చదువుతున్నట్లు, ఆమెను పెళ్లి చేసుకున్న అబ్బాయి పాలిటెక్నిక్ విద్యార్థిగా తెలుస్తోంది. సరదా కోసం చేశారో, ఉద్ధేశ్యపూర్వకంగా ఇలా చేశారో తెలియదు కానీ వీరి ప్రవర్తన చట్టపరమైన చర్యలకు దారితీసింది. నెట్టింట్లో వీడియో చక్కర్లు కొట్టడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిదంబరం జిల్లా పోలీసులు తెలిపారు. చదవండి: ప్రారంభించిన 4 నెలలకే కుంగిన రోడ్డు.. ‘అట్లుందటి ప్రభుత్వ పనితనం’ అంతేగాక ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. టీనేజ్‌లో ఇలాంటి చర్యకు పాల్పడటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఊరికే వదిలిపెట్టవద్దని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘అబ్బాయితోపాటు అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలి. ఈ రోజుల్లో కాలేజీ, స్కూల్ అమ్మాయిల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారిని గమనిస్తూ ఉండాలి. స్కూల్ బ్యాగ్, మొబైల్ ఫోన్‌ని పరిశీలిస్తూ ఉండాలి.’ అని కామెంట్ చేస్తున్నారు. காலேஜ் மாணவிகள் பரவாயில்லை ஆனால் பள்ளி மாணவிகள் நிலை மோசம் ஆகிரது பெற்றோர்கள் மாணவிகளின் ஸ்கூல் பேக் & மொபைலை பெற்றோர்கள் கண்காணிக்கவும்😭😭😭 pic.twitter.com/BUdtkbCGVq — SP Chhandak (@CHHANDAK175) October 10, 2022 -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. న్యూడ్ వీడియోలతో ఎర.. టీనేజర్లే టార్గెట్
హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మధుకర్ (పేరు మార్చాము)కు ఫేస్‌బుక్‌లోని మెసెంజర్ ద్వారా వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేశాడు. వెంటనే అవతలి వైపు నుంచి ఓ చైల్డ్ న్యూడ్ వీడియో ప్లే అయ్యింది. దాని తర్వాత ఓ యూట్యూబ్ లింకు అతని ఫేస్బుక్ మెసెంజర్‌కు వచ్చింది. అది ఓపెన్ చేయగానే తాను వీడియో చూస్తున్నట్టు స్క్రీన్ రికార్డు ద్వారా రికార్డు చేసిన వీడియో కన్పించింది. దీనితో కంగారుపడిన మధుకర్ మెసెంజర్లో అవతలి వైపు ఉన్న సైబర్ నేరస్తుడితో చాట్ చేస్తూ వీడియో తీసెయ్యాలని బతిమిలాడాడు. రూ.5 వేలు పంపిస్తే తీసేస్తామని బెదిరింపులకు దిగడంతో ఫోన్ పే ద్వారా ఒక నంబర్‌కు పంపాడు, అలా మొదలైన బ్లాక్‌మెయిలింగ్ రూ.1.2 లక్షలకు చేరడంతో చివరకు వాళ్ల అన్నకు విషయం చెప్పాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆ వీడియో లింకును యూట్యూబ్ నుంచి తొలగించారు. సాక్షి, హైదరాబాద్: టీనేజర్ల బలహీనత సైబర్ నేరస్తులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు వారిని లక్ష్యంగా చేసుకొని అశ్లీల వీడియోల ఆధారంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ తరహా పోర్నోగ్రఫీ బ్లాక్ మెయిలింగ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా, టిండర్, టెలిగ్రామ్ తదితర సోషల్ నెట్వర్క్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పోర్నోగ్రఫీ వీడియోలు, న్యూడ్ వీడియో కాల్లతో మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. దేశంలో ఇలాంటి కేసులు ఏటా 3 లక్షలు దాటిపోతున్నాయంటే ఏ స్థాయిలో సైబర్ నేరగాళ్లు దండుకుంటున్నారో అర్థమవుతోంది. మధుకర్ విషయంలో అన్న సహాయం చేశాడు కాబట్టి బయటపడ్డాడు. కానీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న మిగతా టీనేజీ పిల్లల మాటేమిటి? సైబర్ నేరస్తుల బెదిరింపులతో ఆత్మహత్యే శరణ్యమనుకున్న ఘటనలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకే ఏడాదిలో 3.8 లక్షల కేసులు ఒక్క 2021 (కరోనా సమయం)లోనే ఈ తరహా కేసులు 3.8 లక్షలు నమోదయినట్టు కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు రాజస్తాన్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఇలాంటి నెట్‌వర్క్‌ను సైబర్ మాఫియా నడిపిస్తోందని దర్యాప్తు విభాగాల ద్వారా బయటపడింది. 2021లో ఢిల్లీ పోలీసులు ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్న 70 మంది ముఠాను అరెస్టు చేశారు. మరోవైపు సైబరాబాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లలోనూ కుప్పలుతెప్పలుగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. పిల్లల్ని ప్రతిక్షణం గమనించాలి టీనేజ్‌లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రతిక్షణం గమనించాలని, రాత్రి వేళల్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర పోలీసులు సూచిస్తున్నారు. యుక్తవయస్సులో పిల్లలు దారితప్పితే ప్రమాదమని పేర్కొంటున్నారు. చిక్కుల్లో పడినప్పుడు చెప్పుకోవడానికి జంకుతారని, అందుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు, పాఠశాలల్లో వేలాది మందిని సైబర్ వారియర్స్‌గా ఏర్పాటు చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వారు వివరిస్తున్నట్టు చెప్పారు. వల ఇలా.. టార్గెట్ చేసిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ముందుగా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. అమ్మాయి పేరుతో ఫేక్ ఐడీ, ఫోటో నకిలీది పెట్టి ఎదుటి వ్యక్తిని బోల్తా కొట్టిస్తారు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయగానే మెల్లిగా చాట్‌లోకి లాగుతారు. అలా మొదలైన చాటింగ్ కాస్తా మొబైల్ నంబర్లు ఇచ్చి పుచ్చుకునే వరకు వెళ్తుంది. ఆ తర్వాత వాట్సాప్ చాట్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేలా చేస్తారు. అడల్డ్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునే వరకు తీసుకువస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. చాట్ కాస్త వీడియో కాల్స్‌లోకి వెళ్లగానే ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్‌లో చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని సైతం న్యూడ్‌చాట్‌లోకి తీసుకువస్తారు. ఈ మొత్తం కాల్ని రికార్డు చేసి తర్వాత అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియో షేర్ చేస్తారు. ఇలా షేర్ చేసిన వీడియోతో బెదిరింపులు ప్రారంభిస్తారు. డబ్బులివ్వకపోతే యూట్యూబ్‌లో పెడతామంటారు. యువతులను బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి అమ్ముకుంటున్నట్టుగా ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు సైబర్ నిపుణులు వెల్లడించారు. ఈ తరహా కాల్స్‌లో 90 శాతం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్య జరుగుతున్నవేనని తెలిపారు. -
వాషింగ్టన్లో కాల్పుల కలకలం... ఇద్దరికి గాయాలు
న్యూయార్క్: వాషింగ్టన్ లీస్ట్రీట్ వీధిలోని ఐడియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బ్లాక్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతలో ఘటన జరిగినట్టు వాషింగ్టన్ పోలీస్ రాబర్ట్ కాంటె తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 15 ఏళ్ల యువకుడు ఆ స్కూల్లోని ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సదరు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న దాదాపు 350 మంది విద్యార్థులను, స్కూల్ సిబ్బందిని ఈ విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ అధికారులు మాట్లాడుతూ...ఈ ఏడాది సుమారు రెండు వేల అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా 800 అక్రమ ఆయుధాలు ఎక్కు ఉన్నాయన్నారు. అదే బుధవారం వేరొక ఘటనలో ఒక భవనం వద్ద మరో బాలుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. (చదవండి: 20 ఏళ్ల యుద్ధానికి తెరపడిన రోజు... అఫ్గాన్‌లో మిన్నంటుతున్న సంబరాలు) -
మిస్సింగ్ కేసుల కలకలం...ప్రేమ.. పెడదోవ
ఇటీవలి కాలంలో ‘అదృశ్యం’ కేసులుపెరిగాయి. ఇందులో ఎక్కువ శాతం టీనేజీ అమ్మాయిలతో మహిళలు ఉండటం కలవరం రేపుతోంది. పిల్లలు విద్య పూర్తి చేశాక.. ఉద్యోగం సంపాదించాక.. వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అయితే చదువుకోవాల్సిన సమయంలోనే పిల్లలు ప్రేమలో పడి తొందరపడుతున్నారు. పెద్దలు ఒప్పుకోరని ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిన డబ్బు అయిపోయి.. కష్టాలు చుట్టు ముట్టి.. ఆదరించే వారు లేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులకూ కన్నీళ్లు మిగులుస్తున్నారు. రాయదుర్గం: విద్యార్థి దశలోనే కొందరు అమ్మాయిలు పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రుల గారాబంతో పాటు పర్యవేక్షణ కొరవడటంతో క్రమశిక్షణ తప్పుతున్నారు. కొందరు స్మార్ట్ఫోన్లలో గేమ్స్‌కు బానిసైతే.. మరికొందరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే చదువును పక్కనపెట్టి ప్రేమలో పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలిసినా.. మందలించినా ... తమ స్వేచ్ఛను వారు ఏదో హరిస్తున్నారనుకుని అనాలోచిత నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తున్నారు. చేజేతులా భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో 2020 నుంచి 2022 జూలై 15వ తేదీ వరకు 2,037 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఇందులో బాలికలు, మహిళలు 1,657 మంది ఉన్నారు. చదువు కోసం పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, గ్రామాల్లో కూలీలు, పరిశ్రమల్లో పనులకెళ్లే మహిళలు ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి వెళ్లిపోవడం.. రోజులు గడిచాక చేసిన తప్పు తెలుసుకుని బాధపడటం చేస్తున్నారు. చివరకు పోలీస్ కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకుని ఇంటిబాట పడుతున్నారు. అదృశ్యం కేసుల్లో మచ్చుకు కొన్ని... రాయదుర్గం పట్టణం చన్నవీరస్వామి ఆలయ సమీపంలో నివసిస్తున్న ఓ యువతి షాపింగ్‌కని ఈ ఏడాది ఏప్రిల్ 26న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మే 4న గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ చేయగా.. గుడ్డిగా నమ్మి.. వెళ్లానని.. తన నిర్ణయం సరైంది కాదని తెలుసుకున్నానని చెప్పడంతో తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపించేశారు. రాయదుర్గం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఏప్రిల్ 25న నీళ్లు తేవటానికని బిందె తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. కొళాయి వద్ద బిందె ఉంచి.. ప్రేమికుడితో ఉడాయించింది. కుటుంబ సభ్యులు మూడు రోజులు వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ ఆధారంగా అదే నెల 30న ఎట్టకేలకు ఆ జంటను పోలీసులు అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు కౌన్సిలింగ్ తీరు... ఇంట్లో నుంచి తీసుకెళ్లిన సొమ్ము అయిపోయిన తర్వాత పరిస్థితి ఆలోచించాలి. అసాంఘిక శక్తుల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటి? ఇష్టాయిష్టాలను తల్లిదండ్రులకు తెలియజేస్తే మంచిది. ఇష్టం లేని వివాహాలు, చదువులు, ఆశించిన ర్యాంకు రాదనే కారణాలు సహేతుకం కాదు. ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని బంధువులు, సమాజం చులకనగా చూస్తుంది. మొదట్లో బాగున్నా తర్వాత సంసారాల్లో కలహాలు మొదలవుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. టీనేజీ అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు చేసే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చూడాలి. (చదవండి: అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి) -
14 ఏళ్ల టీనేజర్‌కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు నిషేధం
ఇదివరకు పూర్వం గ్రామంలో ఎవరైన దారుణమైన పనులు చేస్తే గ్రామపెద్దలు గ్రామ బహిష్కరణ వంటి శిక్షలు వేసేవారు. అదీకూడా అలాంటి పనులు మరెవరు చేయకూడదని అలాంటి శిక్షలు విధించేవారు. రాను రాను అవి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉండటమే కాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కనుమరుగైపోయాయి. ఇంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ స్మార్ట్ యుగంలో కూడా నగర బహిష్కరణలు ఉన్నాయంటే నమ్ముతారా!. ఔను నిజం ఒక దేశంలోని టీనేజర్ని ఒక నగరం మొత్తం బహిష్కరించింది. ఎందుకు బహిష్కిరించారు ఏం జరిగిందనే కదా. వివరాల్లోకెళ్తే....యూకే చెందిన 14 ఏళ్ల కీలాన్ ఎవాన్స్ని ఒక పట్టణం మొత్తం బహిష్కరించింది. కీలాన్ యూకేలోని వెస్ట్ మెర్సియా అనే పట్టణంలో నివశిస్తున్నాడు. ఐతే అతను ఆ పట్టణంలోని వ్యాపారులను, స్థానికులను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఆన్లైన్లో కూడా చాలా మందిని పలు రకాలుగా వేధించాడు. దీంతో ఆ టీనేజర్‌పై చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెస్ట్ మెర్సియా పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు కూడా చేశారు. అంతేకాదు యూకేలోని కోర్టు అతని క్రిమినల్ బిహేవియర్ కారణంగా అతను పట్టణంలో ఉండకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అతను 2025 వరకు కూడా పట్టణంలోకి ప్రవేశించకూడదని చెప్పింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తుల సముహంలో కూడా ఉండకూడదని కూడా పేర్కొంది. ఎప్పుడైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమాన ఎదుర్కొవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ శిక్షలు అతను భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనులు చేయకుండ ఉండేందుకేనని కోర్టు స్పష్టం చేసింది. ఐతే యూకేలో యువకులపై ఇలాంటి శిక్షలు చాలా అసాధారణం. కానీ కీలాన్ దారుణమైన ప్రవర్తన కారణంగానే యూకే ఇలాంటి శిక్షలు విధించింది. (చదవండి: రైల్వే ఫ్లాట్ ఫారం పై పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువకులు: ఫోటో వైరల్) -
టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ!
జూన్ నెల వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలు. పాత సమస్యలే కొత్తగా పుట్టుకొస్తాయి. ‘నేను కాలేజ్‌కి వెళ్లను’ అనిపిస్తుంది టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ మంచి మాటలతో... ఒత్తిడి మూలాలకు మందు వేయవచ్చు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ మొదలవుతోంది. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే క్లాసులు మొదలు పెట్టేశాయి. కొన్ని కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. టెన్త్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కొత్త కాలేజీలో అడుగుపెట్టాలి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రాడ్యుయేషన్ కాలేజీల బాటపట్టాలి. అప్పటివరకు ఆత్మీయతలు పంచుకున్న స్నేహితులు మరోచోట చేరిపోయి ఉంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. కొత్త మనుషుల మధ్య మెలగాలి. కొత్త వాళ్లలో స్నేహితులను వెతుక్కోవాలి. కొత్త మిత్రులు అర్థం అవుతున్నట్లే ఉంటారు, అలాగని పూర్తిగా అర్థం కారు. గతంలో స్నేహితులు, శత్రువుల్లా కొట్టుకున్న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు. అప్పటి శత్రువులు కూడా చాలా మంచివాళ్లనిపిస్తుంటుందిప్పుడు. అలాగని వెనక్కి వెళ్లలేరు, ముందుకు సాగాల్సిందే. ఇది చిన్న సంఘర్షణ కాదు. రెక్కలు విచ్చుకుంటున్న లేత మనసులకు అది విషమ పరీక్ష అనే చెప్పాలి. పిల్లలు రెండు రకాలు ‘‘కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్‌లు, కొత్త కాలేజ్... పట్ల ఉత్సుకత, ఉత్సాహంతో ఉరకలు వేసే పిల్లలు ఒక రకం. వీళ్లలో టీనేజ్ స్ట్రెస్ వంటి ఇబ్బందులుండవు. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెంబేలు పడే వాళ్ల విషయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. టెన్త్ పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురైతే అప్పటికి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించి ఉంటారు. అయితే అలాంటి పిల్లలను కాలేజ్‌లో చేర్చే ముందే వాళ్లకు తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి. కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం అనేది అలాంటి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ తమకు నచ్చిన కాలేజ్ అని, మంచి కాలేజ్ అనే పేరుందని, అక్కడ చదివితే ఐఐటీలో సీటు వస్తుందని తమకు తామే నిర్ణయించేసి ఫీజులు కట్టేస్తారు. పిల్లలు ఆ కాలేజ్‌కి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫీజు వృథా అవుతుందేమో, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో పిల్లలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంటారు’’ అని చెబుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్. మౌనం వీడరు ఇక్కడ విచిత్రం ఏమిటంటే... పేరెంట్స్ ఎంత సున్నితంగా అడిగినా పిల్లలు పూర్తిగా ఓపెన్ కారు. అలాగే పేరెంట్స్ ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినా అవన్నీ నీతిసూత్రాలే అవుతుంటాయి. అందుకే పిల్లలు ‘ఎప్పుడు ఆపేస్తారా’ అన్నట్లు చికాగ్గా ముఖం పెడతారు. ఒక కాలేజ్ కుర్రాడు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు ఠంచన్‌గా లాప్టాప్తో సిద్ధమయ్యేవాడు. పేరెంట్స్ కూడా క్లాసులను జాగ్రత్తగా వింటున్నాడనే అనుకున్నారు. పరీక్షలు రాసిన తర్వాత తెలిసింది అస్సలేమీ చదవలేదని, పాఠాలు వినలేదని. ఆ ఏడాది మొత్తం లాప్టాప్లో వెబ్‌సీరీస్ చూశాడా కుర్రాడు. కొంతమంది జూనియర్ కాలేజ్‌లో యంత్రాల్లా చదివి చదివి విసిగిపోయి ఉంటారు. డిగ్రీ కాలేజ్‌కి వెళ్లగానే వాళ్లకందిన స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలియక అనేక దురలవాట్లకు బానిసలవుతుంటారు. స్వేచ్ఛ కూడా ఒత్తిడి చేసినంత నష్టాన్ని కలిగిస్తోంది. ఆ ఒత్తిడిని ఒక్కసారిగా తీసి పక్కన పెట్టినప్పుడు వచ్చే స్వేచ్ఛతో... అన్నింటికీ ‘ఇట్స్ ఓకే’ అనే కొత్త భాష్యం చెప్పుకోవడం మొదలైంది. చదవడం లేదా, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా, క్లాసులు బంక్ కొడుతున్నారా, బ్యాక్ బెంచ్ స్టూడెంటా... అన్నింటికీ ఇట్స్ ఓకే ఫార్ములానే. దీంతోపాటు బ్యాక్లాగ్ లేని స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా. ఒక కప్పు కింద రెండు ప్రపంచాలు సమాజానికి ఆరోగ్యకరమైన ఒక కొత్త తరాన్ని ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా ఈ తరం పిల్లలు పేరెంట్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఆ డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ కాలేని స్థితిలోనే ఉంటారు. అలాగే పేరెంట్స్ ప్రపంచంలో జీవించడానికి పిల్లలు ఇష్టపడరు. రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నాయిప్పుడు. ఈ క్లిష్టమైన స్థితిలో పేరెంట్స్ పిల్లలతో మరింత స్నేహంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. టీన్స్‌లోకి రాకముందు నుంచే వాళ్లతో స్నేహితులుగా మెలగాలి. పిల్లలు చెప్పే విషయాలను అనుమానించడం మాని అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా విశ్లేషించడం మొదలుపెట్టాలి. ఒక తోటలో చిగురించిన మొలకను పెకలించి మరో చోట నాటితే మొదట వాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. కొత్త చివుళ్లు వేస్తుంది. కొత్త మట్టిసారంలో మరింత ఏపుగా పెరుగుతుంది. ఈ దశలో నిర్లక్ష్యంగా ఉంటే మొక్క వాడిపోతుంది. పిల్లలు కూడా మొక్కల్లాంటి వాళ్లే. టీనేజ్ స్ట్రెస్ లక్షణాలిలా ఉంటాయి అస్థిమితంగానూ ఆత్రుతగానూ ఉండడం, త్వరగా అలసటకు లోనుకావడం, తరచుగా కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరం పెంచుకోవడం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవడం, పనులను వాయిదా వేయడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించరాదు. మొండి నిద్రపోతారు! కొత్త కాలేజ్‌లో అలవాటు పడలేని పిల్లల్లో ఆకలి మందగించడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా వస్తుంటాయి. నిజానికి ఆ లక్షణాలు దేహ అనారోగ్య లక్షణాలు కావు, మానసిక ఆందోళన ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు. కాబట్టి మొదట పిల్లలను జాగ్రత్తగా గమనించాలి, అది నిఘా కాకూడదు. ఎనిమిదిన్నరకు కాలేజ్‌కి రెడీ కావాల్సిన పిల్లలు ఒక్కోసారి తొమ్మిది వరకు నిద్రలేవరు. ఎంత లేపినా సరే మొండిగా నిద్రపోతుంటారు. కాలేజ్ టైమ్ దాటిన తర్వాత వాళ్లే లేస్తారు. ఆ రోజుకు ఏమీ అడగకుండా వాళ్లనలా వదిలేయడమే మంచిది. కాలేజ్‌కి వెళ్లడానికి అయిష్టత వెనుక కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – డా‘‘ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ , యు అండ్ మి – వాకా మంజులారెడ్డి -
తెర పై స్మొ ‘కింగ్స్’
రాజేంద్రనగర్‌కు చెందిన ఓ టీనేజర్ ఒకటి తర్వాత ఒకటిగా ప్యాకెట్ సిగిరెట్లు హాంఫట్ చేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేజీఎఫ్ సినిమాలో హీరోను చూసి ఆ కుర్రాడు ఫాలో అయ్యాడనేది తర్వాత తెలిసిన సంగతి. అయితే ఈ తరహాలో టీనేజర్లపై సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం తీవ్రమవుతోందని, మరింత తీవ్రంగా మారనుందని గతంలోనే నగరం వేదికగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ నేపధ్యంలో టీనేజర్ల భవిష్యత్తు ‘పొగ’చూరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి , హైదరాబాద్: మాస్ మీడియా మరియు ఇంటర్నెట్లోని సెలబ్రిటీల విజువల్స్‌కు ప్రభావితమైన యువకులు మద్యపానంతో పాటు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ (డిప్యూటీ డైరెక్టర్) మేకం మహేశ్వర్ గతంలో నిర్వహించిన అధ్యయనం దీన్ని నిర్ధారించింది. ‘టీనేజర్స్ డైట్ మరియు హెల్త్–రిలేటెడ్ బిహేవియర్‌పై మాస్ మీడియా ప్రభావం’ అనే అంశంపై చేసిన సర్వేలో 15 శాతం మంది అబ్బాయిలు సెలబ్రిటీలను అనుకరించడానికే తాము సిగరెట్ తాగామని స్పష్టం చేశారు. సినిమాతో పాటు వెబ్‌సిరీస్ తదితర సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం వీరిని ప్రభావితం చేశారని తేలింది. మిగతా వయసుల వారితో పోలిస్తే టీనేజర్లపై స్మోకింగ్ సీన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఆన్లైన్ లోకం..అవగాహనే శరణ్యం.. ప్రపంచం అంతా ఆన్లైన్ మీదే నడిచే రోజులు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మోకింగ్ సీన్స్‌కి దూరంగా ఉంచడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ధూమపానం వల్ల కలిగే అనర్ధాలను తరచుగా వారికి వివరించి చెబుతూ ఉండాలని వైద్యులు, మానసిక చికిత్స నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని నియంత్రించడం, వారి అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. టీనేజీకి...చాలా ప్రమాదకరం గతంలో టీనేజర్స్ స్మోకింగ్‌కు ఇంట్లో తండ్రో, తాతో, అన్నో.. ప్రభావం కారణమయ్యేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూపిస్తున్నాయి. సిగరెట్లలలో వందల కొద్దీ హానికారక పదార్ధాలు ఉంటాయి. చిన్నవయసులో అలవాటు పడితే అది ఎదుగుదల హార్మోన్లపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మా పిల్లలకు ఆ అలవాటు కాదులే అనే ధీమాకి పోకుండా...స్మోకింగ్‌ను పిల్లలకు దూరంగా ఉంచడానికి వారిలో ముందస్తుగానే అవగాహన పెంచడం అవసరం. –డా.రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి (చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు) -
ప్రపంచంలోనే పొట్టి టీనేజర్‌గా బహదూర్.. రికార్డు బలాదూర్
World's shortest teen: ప్రపంచంలోనే పొట్టి టీనేజర్ (మగవాళ్లలో)గా నేపాల్‌కు చెందిన డోర్ బహదూర్ ఖపంగి గిన్నిస్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల బహదూర్ కేవలం 73 సెంటీమీటర్ల పొడవే ఉన్నారు. ప్రపంచంలోనే పొట్టి వ్యక్తి రికార్డు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ పేరిట ఉంది. ఈయన ఎత్తు 70 సెంటీమీటర్లు. ఇంతకుముందు ఈ రికార్డు 67 సెంటీమీటర్ల ఎత్తుండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020లో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్‌కు చెందిన జ్యోతి అమ్గే పేరిట ఉంది. ఈమె ఎత్తు కేవలం 62 సెంటీమీటర్లు. (చదవండి: ఇల్లంతా దోచేసి...ప్రేమలేఖ పెట్టి పారిపోయిన దొంగలు) -
Girl Missing: బాలిక అదృశ్యం.. పాపం ఏమైందో?
పెండ్లిమర్రి(అన్నమయ్య జిల్లా): మండలంలోని ఎగువపల్లె గ్రామానికి చెందిన దుత్తలూరు ఖాదర్ మున్ని (16) సోమవారం అదృశ్యం అయినట్లు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆ బాలిక పదో తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉన్నది. తల్లిదండ్రులు ఉదయం కూలీ పనులకు వెళ్లారు. చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు వారు తిరిగి ఇంటికి వచ్చే సరికి బాలిక ఇంటి వద్ద లేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు, బంధువులు గ్రామం చుట్టు పక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా కనిపించలేదు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు నంబర్: 9121100527కు ఫోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు. -
అందరిలో ఒకటే ఉత్కంఠ..ఆమె గోల్ వేయాలని ఐతే..
Basketball game in viral video: చాలా మంది తమ వైకల్యాన్ని ప్రతికూలమైన అంశంగా భావించకుండా తమ శక్తి యుక్తులతో విజేతలగా మారారు. అంతేందుకు ప్రతికూలంగా ఉన్నదాన్ని సైతం అనుకూలంగా మార్చుకుని ఎదురు నిలిచిని వాళ్లు ఉన్నారు. మేము డిసేబుల్డ్ కాదు డిఫరెంట్‌గా చేసేవాళ్లం అని చాటి చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వారెందరో ఉన్నారు. అచ్చం ఆ కోవకే చెందిందే జూల్స్ హూగ్లాండ్ అనే ఏళ్ల అమ్మాయి. ఇంతకీ ఆమె ఏం చేసిందనే కదా! వివరాల్లోకెళ్తే...జూల్స్ హూగ్లాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి దివ్యాంగురాలు. అమెకు కళ్లు కనిపించావు. అయితే ఆమె బాస్కట్ బాల్ కోర్టులో గోల్ చేస్తున్నసమయంలో అక్కడున్న ప్రేక్షకులంతా చాలా నిశబ్దంగా ఉన్నారు. ఆమె గోల్ చేస్తుందా లేదా అన్నట్లుగా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఆమె ఒక హూప్ సాయంతో గోల్ చేయాల్సిన లక్ష్యాన్ని విని, తదనంతరం గోల్ వేస్తుంది. అయితే అక్కడ ఉన్నవారందరిలో ఒకటే ఆత్రుత ఆమె ఎలా వేస్తుందా అని. కానీ ఇంతలో ఆమె బాస్కట్ బాల్ని చాలా కరెక్ట్‌గా గోల్ చేసింది. అంతే అక్కడున్నవారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో సందడి చేశారు. యుఎస్‌లోని జీలాండ్ ఈస్ట్ హైస్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితి..!) -
కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): కళాశాలకు వెళ్లళ్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని శ్రీరాంనగర్‌లో నివసించే హస్నియా బేగం(19) మహబూబియా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నది. ఈ నెల 17న కాలేజీకని వెళ్లిన హస్నియా సాయంత్రం తిరిగి రాకపోవడంతో తండ్రి షేక్ మషువుద్దీన్ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని యువతి కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 90308 42080లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రేమించిన యువతి ఫోన్ స్విచ్ ఆఫ్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. ) -
కొత్త సిమ్ కొనివ్వలేదని ఆత్మహత్య
సాక్షి,గుండాల(ఖమ్మం): సెల్ ఫోన్లోకి సిమ్‌కార్డు కొనివ్వలేదనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. గుండాల మండలం నర్సాపురానికి చెందిన సనప ముసలయ్య – పద్మ దంపతుల కుమారుడు ప్రేమ్‌సాగర్(17) ఉన్నాడు. ఆయన ఫోన్లో ఉన్న సిమ్‌కు సిగ్నల్ సరిగ్గా రానందున మరో సిమ్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. దీనికి వారు నిరాకరించడంతో మనస్తాపంతో గురువారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే ఆయనను గుండాల ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై సురేష్ తెలిపారు. (చదవండి: పెళ్లైన నెలకే భర్తకి షాక్.. ప్రియుడితో కలిసి.. ) -
యువతిపై ప్రియుడి అఘాయిత్యం.. నమ్మి వస్తే స్నేహితులతో కలిసి..
మల్కన్‌గిరి(భువనేశ్వర్): విషం తాగి బబిత హంతాల్(17) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి సమితి, పెద్దవాడ పంచాయతీ, బప్పన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈ యువతి, మత్తిలి సమితి, పూరణగుడకు చెందిన గుప్త బారల్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం ఉదయం ఇంట్లో వాళ్లకు చెప్పి, ప్రియుడి ఇంటికి బబిత వెళ్లింది. అయితే అక్కడ ప్రియుడు తన స్నేహితులతో కలిసి, బబితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రియుడి ఇంట్లోనే విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన యువతిని చికిత్స నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో ఉన్నత వైద్యసేవల కోసం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి యువతిని తరలించారు. అయితే అక్కడే చికిత్స పొందుతుండగా యువతి మృతి చెందడం విచారకరం. ఈ ఘటనపై కన్నీరుమున్నీరు అయిన యువతి తల్లిదండ్రులు మల్కన్‌గిరి పోలీసులను ఆశ్రయించి, న్యాయం చేయాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
పిన్నితో వివాహేతర సంబంధం.. బాబాయ్‌కి తెలిసి..
సాక్షి, తూర్పుగోదావరి(బిక్కవోలు): ఓ బాలుడిపై పైశాచిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై బుజ్జిబాబు శనివారం తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కొమరిపాలేనికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై రెండు రోజుల క్రితం అతడి చిన్నాన్నలు మందపల్లి అప్పన్న, మందపల్లి సతీష్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాలుడి తొడలు, మర్మాంగంపై వాతలు పెట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయలయ్యాయి. బాలుడి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో అతడు కోరుకొండలోని తన పెద్దనాన్న ఇంటి వద్ద ఉండేవాడు. ఇటీవల తండ్రి చనిపోవడంతో బాలుడు స్వగ్రామం కొమరిపాలెం వచ్చాడు. వరుసకు పిన్ని అయిన మహిళకు, బాలుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలియడంతో ఆమె భర్త అప్పన్న, సతీష్ కలిసి బాలుడిపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆ బాలుడు ఈ విషయం పెద్దమ్మకు చెప్పగా, పెద్దనాన్న వెళ్లి దాడికి పాల్పడిన వ్యక్తులను నిలదీశాడు. అతడిపై కూడా వారు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం అనపర్తి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు. అప్పన్న, సతీష్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (ప్రేమించానని నమ్మించి.. ఆమె ఫొటోలు తీసి పెళ్లిళ్లు చెడగొడుతూ..) -
మైనర్‌ను గర్భవతిని చేసిన ఘనుడు.. పెళ్లి చేసుకోవాలని కోరితే..
సాక్షి, నల్గొండ: ఊట్కూర్ మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గర్భవతిని చేయగా బాధిత కుటుంబం శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. వారి కథనం మేరకు.. తమ కుమార్తె పొలం పనులకు వెళ్లేది. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. రెండురోజుల క్రితం బాలిక అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు వైద్యుడికి చూపించగా గర్భవతి అని నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులు కులపెద్దల సమక్షంలో బాలికను పెళ్లి చేసుకోమని కోరగా తిరస్కరించడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ వివరించారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..?) -
సెలవులని ఇంటికొచ్చింది..పని ఉందని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి..
సాక్షి,శాలిగౌరారం: పెళ్లి ఇష్టం లేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాటిపల్లి లింగయ్య–ముత్తమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. లింగయ్య ఏడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి ముత్తమ్మ పిల్లలను పెంచిపెద్దచేయడంతో పాటు నలుగురు కుమార్తెలకు వివాహాలు చేసింది. చిన్నకుమార్తె ప్రియాంక(19) నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో చిన్నకుమార్తె వివాహం కూడా జరిపించేందుకు అంతా సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం కళాశాలలకు సెలవులు ఉండటంతో ఇంటివద్ద ఉన్న ప్రియాంక శనివారం వ్యవసాయ పొలం వద్ద వడ్లు ఎండబోసేందుకు వెళ్లింది. వడ్లు ఎండబోసిన అనంతరం పక్కనే ఉన్న పత్తిచేనులోని వేపచెట్టుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాతా కందిపంట కోసేందుకని అటుగా వెళ్తున్న వారు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటింబికులు ఘటన స్థలానికి చేరుకుని రోదించారు. కాగా, ఈ ఘటనపై రాత్రి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ హరిబాబు తెలిపారు. -
‘నన్ను ఎందుకు అమ్మేశారు’.. పేరెంట్స్‌పై కోర్టుకెక్కిన కొడుకు!
పుట్టగానే ఆ తల్లిదండ్రులు అతన్ని వేరే వాళ్లకు అమ్మేశారు. నాలుగేళ్లు గడిచాక ఆ పిలగాడిని దురదృష్టం వెంటాడింది. దత్తత తీసుకున్న జంట కూడా ఓ ప్రమాదంలో చనిపోవడంతో మళ్లీ అనాథ అయ్యాడు. గత్యంతరం లేక ఆ పెంపుడు తల్లిదండ్రుల బంధువుల ఇళ్లలో పెరిగి పెద్దయ్యాడు. గూడు చెదిరి పోవడంతో ఎగురుకుంటూ కన్నవాళ్ల చెంతకు చేరే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ బిడ్డకు భంగపాటే ఎదురైంది.. చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో ఉంటున్నాడు 17 ఏళ్ల లియు జుజౌ. బంధువుల ఇళ్లలో జీవనం కష్టమవుతుండడంతో.. మరో దారి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో తనకి అసలు తల్లిదండ్రులు వేరే ఉన్నారని తెలుసుకున్న లియు వారి కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంత కాలం వెతికినా ప్రయోజనం లేకపోయింది. దారులు ఇరుకు అవుతున్న క్రమంలో.. ఆన్లైన్లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆపై ఇంటి పేరు ఆధారంగా.. ఎలాగోలా కన్నతండ్రిని కనిపెట్టగలిగాడు. 21 డిసెంబర్ 2021లో లియు.. తన తండ్రిని కలిశాడు. కానీ, అక్కడ అతనికి ట్విస్ట్ ఎదురైంది. లూయు తన కొడుకే కాదని డింగ్ షుంజిక్కులన్ బయటికి పొమ్మన్నాడు. దీంతో పోలీసుల సహకారంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా లియు.. డింగ్ కుమారుడే అని తేలింది. కథలో మరో ట్విస్ట్ ఏంటంటే.. డింగ్‌తో ఉంది లియు కన్నతల్లి కాదు. తన భార్యకు(లియు కన్నతల్లి).. ఆమె ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వడానికే పుట్టిన బిడ్డను(లియు) అమ్మేసినట్లు డింగ్ ఒప్పుకున్నాడు. లియుని అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బును పంచుకుని ఆ జంట విడాకులతో వేరు పడింది. కొంతకాలానికి మళ్లీ వివాహం చేసుకుని వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారు. పేరెంట్స్ దరిద్రపుగొట్టు ప్లాష్‌బ్యాక్ గురించి తెలిశాక లియు ఛీ అనుకున్నాడు. ఆపై కన్నతల్లిని వెతుక్కుంటూ వెళ్లాడు లియు. కొడుకుని సాదరంగా హత్తకున్న తల్లి.. కొడుకు వినిపించిన డిమాండ్ విని షాక్ తింది. తనకు ఇల్లు లేదని, సాయం చేయాలని కోరాడు ఆమెను. ఆమె దానికి నిరాకరించింది. దీంతో కన్నవాళ్లను ఒక దగ్గరికి చేర్చి పంచాయితీ పెట్టాడు లియు. తనకు ఇల్లు కట్టించి తీరాల్సిందేనని లియు డిమాండ్ చేయగా.. చదువుకోవడానికి ఫీజులు చెల్లిస్తామని, బతకడానికి కొంత డబ్బు ఇస్తానని ఆ తండ్రి మాత్రం అంగీకరించాడు. దీంతో లుయు కొర్టుకెక్కాడు. తనకు కోర్టులో న్యాయం జరుగుతందని ఆశిస్తున్నాడు. తనను పెంచుకున్న తల్లిందండ్రులు ఇచ్చిన ఇల్లు మొత్తం శిధిలావస్థలో ఉందని, కనీసం దానిని బాగు చేసిచ్చినా చాలని అంటున్నాడు పాపం లియు. -
మాయదారి అలవాటు.. పిచ్చోళ్లు అవుతున్న పిలగాండ్లు
ఆదిలాబాద్: సాంకేతిక పరిజ్ఞానం మనిషిలోని సృజనాత్మకతను రోజురోజుకూ నీరు గారుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి సాంకేతికత ఆసరా తీసుకుని దానికి బానిస అవుతున్నాడు. మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న చిన్నారులు బయటి ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. యువత, టీనేజర్లు స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. శారీరక శ్రమ లేక బద్ధకం పెరిగి అనారోగ్యం బారిన పడిన ఆస్పత్రుల పాలవుతున్నారు. వినిపించని బామ్మల కథలు.. గతంలో చిన్నారులు పాఠశాల ముగియగానే ఇంటి వద్ద అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల పంచన చేరేవారు. వారు చెప్పే పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్రం వంటి నీతి కథలను శ్రద్ధగా వినేవారు. దీంతో పిల్లల్లో వినికిడి సామర్థ్యం పెరగడంతోపాటు ఏకాగ్రత, శ్రద్ధ వంటి అంశాలు మెరుగుపడేవి. నీతి కథల ద్వారా నైతిక విలువలు నేర్చుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్నకుటుంబాలు పెరగడంతో పిల్లలకు కథలు చెప్పేవారు కరువయ్యారు. నేటి పిల్లలు పాఠశాల నుంచి రాగానే టీవీ, మొబైల్ ఫోన్లను వదలడం లేదు. మరోవైపు టీనేజ్ పిల్లలు, యువత మొబైల్ ఫోన్ల వాడకంతో అశ్లీలత వైపు అడుగులు వేస్తున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి విపరీత పోకడలు టీనేజ్ పిల్లలను నేరాలను చేయడానికి సైతం ఉసిగొల్పుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పుస్తక పఠనంపై తగ్గిన ఆసక్తి.. డిజిటల్ లర్నింగ్, ఆన్లైన్ తరగతులు రాకతో రోజురోజుకూ పుస్తకం ప్రాధాన్యత తగ్గుతోంది. ఫలితంగా విద్యార్థులు పఠనంపై ఆసక్తి చూపడం లేదు. అరచేతిలోనే ప్రాపంచిక విషయాలు తెలుస్తుండటంతో లైబ్రరీలవైపు పిల్లల అడుగులు పడడం లేదు. ఫోన్లలో ఈ–బుక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువసేపు వాటిని చూడటంతో చిన్నారుల కళ్లు త్వరగా అలిసిపోతున్నాయి. ఫలితంగా ఈ–బుక్ పఠనంలోనూ వారి ఆసక్తి సన్నగిల్లుతోంది. సరైన వినియోగంతోనే.. ఆధునిక యుగంలో మానవ జీవన వృద్ధి, అవసరాలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా కీలకం. విద్య, వైద్యం, నిర్మాణం, పారిశ్రామికం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా సర్వం సాంకేతికమయమే. విద్యాబోధన రంగాల్లో కూడా గణనీయ మార్పులు వచ్చాయి. సానుకూల ఫలితాలను ఇస్తున్న సాంకేతికత దుష్ప్రభావాలను సైతం చూపుతోంది. ఇదే విషయమై పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థుల శారీరక, మానసిక, నైతిక అభివృద్ధికి తోడ్పడాలని నిపుణులు సూచిస్తున్నారు. గంటల తరబడి స్మార్ట్ ఫోన్లను పిల్లలకు ఇవ్వకుండా కట్టడి చేస్తూ, పుస్తక పఠనం, క్రీడలపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు. అప్పుడే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. తగ్గిన శారీరక శ్రమ ‘దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుంది’ అని ఒక మేధావి అంటాడు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకుంటే శారీరక సామర్థ్యం మానసిక స్థైర్యం పెరుగుదలకు ఉపయోగపడుతుంది అనే విషయం అర్థమవుతోంది. సాంకేతిక ఆధునిక యుగంలో పిల్లలు ఆటపాటలు, క్రీడలకు దూరం అవుతున్నారు. ఫలితంగా శారీరకంగా బలహీనులుగా మారి, మానసికంగా జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఏ చిన్న ఓటమి వచ్చినా కుంగుబాటుతో ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. వాస్తవిక ప్రపంచానికి దూరం మొబైల్ ఫోన్లను అధికంగా వినియోగించడంతో పిల్లలు వాస్తవిక ప్రపంచానికి దూరమవుతున్నారు. ఫైటింగ్ గేమ్స్, రేసింగ్ గేమ్స్ ఆడటంతో వారిలో సహనం క్రమక్రమంగా తగ్గిపోయి, ప్రతి విషయానికి ఉద్రిక్తతకు లోనవుతారు. టెక్ గ్యాడ్జెట్స్ అధికంగా వినియోగిస్తుండటంతో కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్ తగ్గిపోతాయి. పిల్లలకు శారీరక శ్రమ కలిగించే ఆటలు, క్రీడలపై ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – ఓంప్రకాశ్, మానసిక వైద్యనిపుణుడు పిల్లలకు సమయం కేటాయించాలి మొబైల్ ఫోన్లను అధికంగా వాడుతుండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫోన్ల వాడకంతో తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోతోంది. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లలకు మొబైల్ ఫోన్లను అందించే విషయంలో కట్టడి చేస్తూ.. వారికి కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు అనుబంధాలు, నైతిక విలువలను గుర్తించి జీవితంలో ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. – సాధన, డెప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ -
టీనేజర్ల టీకాలోనూ ఏపీ టాప్
సాక్షి, అమరావతి: పిల్లల వ్యాక్సినేషన్లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. నిర్దేశించిన లక్ష్యంలో శుక్రవారం నాటికి 72 శాతం మందికి వైద్య, ఆరోగ్య శాఖ టీకా ప్రక్రియను పూర్తిచేసి దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో కేవలం 28 శాతం మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉంది. దేశంలో ఇప్పటివరకూ 50 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ, హిమాచల్‌ప్రదేశ్‌లు మాత్రమే ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 68.40 శాతం మంది పిల్లలకు టీకా వేశారు. దక్షిణాదితో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క పెద్ద రాష్ట్రంలోనూ 50 శాతానికి మించి టీకా పంపిణీ కాకపోవడం గమనార్హం. సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. మరోవైపు.. దేశవ్యాప్తంగా గత సోమవారం నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా పంపిణీ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో అర్హులైన 24,41,000 మంది పిల్లలకు వారం రోజుల్లో టీకా పంపిణీ పూర్తిచేసేలా సర్కారు కార్యాచరణ రూపొందించింది. దీంతో శుక్రవారం నాటికి 17,52,581 మందికి టీకాలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకాలు వేయడంతో పాటు, వీటి పరిధిలో ఉన్న విద్యా సంస్థల వద్దకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 1,55,086 మందికి టీకా పంపిణీ చేయాల్సి ఉండగా 91.11 శాతం అంటే 1,41,304 మందికి టీకా పంపిణీ జరిగింది. అదే విధంగా తూర్పు గోదావరిలో 86.36 శాతం, నెల్లూరులో 84.76 శాతం, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 53.59 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. -
కోవిడ్ టీకా తీసుకునేందుకు టీనేజర్ల అనాసక్తి
గ్రేటర్ జిల్లాల్లో టీనేజర్లు కోవిడ్ టీకా తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి ఈ నెల 3 నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్ చేపట్టగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 20 శాతం మంది టీనేజర్లు కూడా టీకా వేసుకోలేదు. ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండగా..మరోవైపు టీకా వేసుకునేందుకు ముందుకు రాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది సాక్షి హైదరాబాద్: తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాల్లోనే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా టీకాలు వేసుకుని ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలువాల్సిన వారు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవడంలోనే కాదు...టీకాలు వేసుకునేందుకు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. టీనేజర్లకు టీకాలు వేసే విషయంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి వరుస స్థానాల్లో నిలవగా..22వ స్థానంలో హైదరాబాద్, 26వ స్థానంలో మేడ్చల్, 29వ స్థానంలో రంగారెడ్డి జిల్లాలు నిలవడం, మిగతా జిల్లాలతో పోలిస్తే రాజధాని జిల్లాలు వెనుకబడి పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ...టీకా వేసుకుంటే జ్వరం, ఒంటి నొప్పులు వంటి కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అపోహతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించకపోవడం కూడా టీకాల్లో వెనుకబడి పోవడానికి కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసుకుంటారా..? వెనుకాడుతారా...? కోవిడ్ నియంత్రణలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ డోసు టీకాల విషయంలో ఆశించిన దానికంటే అధికశాతం వ్యాక్సినేషన్ పూర్తైంది. ఈ విషయంలో ఇతర జిల్లాలకు గ్రేటర్ జిల్లాలు మార్గదర్శకంగా నిలిచాయి. అయితే టీనేజర్లకు టీకాలు వేసే విషయంలో మాత్రం బాగా వెనుకబడ్డాయి. 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి కోవాగ్జిన్ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 1,84,822 మంది ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం రోజు నాటికి 55,347 మందికి టీకాలు వేశారు. మేడ్చల్ జిల్లాలో 1,65,618 మంది లబ్ధిదారులు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 46,970 మందికి టీకాలు వేశారు. రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది టీనేజర్లు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 35,104 మందికి మాత్రమే టీకాలు వేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శనివారం నుంచి ఈ నెల 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు కాలేజీలు, విద్యాసంస్థల్లో టీకాలు వేస్తున్నప్పటికీ చాలా మంది ఆసక్తి చూపడం లేదు. సాధారణ రోజుల్లోనే ఆసక్తి చూపని వారు సెలవుల్లో స్వయంగా ఆరోగ్య కేంద్రాలకు చేరుకుని టీకాలు వేసుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కరోజే 1902 కేసులు గ్రేటర్ జిల్లాల్లో కోవిడ్ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1452 కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాల్లో 232 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాల్లో 218 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఈ సంఖ్య 1902కు చేరడం గమనార్హం. ఒక వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా..సిటిజన్లు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మాస్క్‌లు లేకుండా హోటళ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నారు. విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారు. పెరుగుతున్న తీవ్రత ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరిస్తుండటం, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురై...ఆస్పత్రుల్లో చేరుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1318 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 373 మంది ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతుండగా, 945 మంది ఐసీయూ, వెంటిలేటర్ పడకలపై చికిత్స పొందుతుండటం గమనార్హం. కేసులు మరింత పెరుగుతుండటంతో నగరంలోని గాంధీ, టిమ్స్ సహా కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రుల్లో వైద్యులు అ ప్రమత్తమయ్యారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలను సమకూర్చడంతో పాటు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుం టున్నారు.