కోల్‌కతాకు చెందిన పదిహేను సంవత్సరాల అర్నవ్ దాగ ప్రపంచంలోనే పెద్దదైన ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్‌ను సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. కోల్‌కత్తాలోని ప్రసిద్ధ నిర్మాణాలు రైటర్ బిల్డింగ్, షాహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ ఆధారంగా చేసుకొని ఈ నిర్మాణం చేశాడు. పని ప్రారంభించడానికి ముందు ఈ నాలుగు నిర్మాణాల దగ్గరకు వెళ్లి వాటి ఆర్కిటెక్చర్‌ను పరిశీలించాడు.
ఈ స్ట్రక్చర్ కోసం 143,000 ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించాడు. టేప్, జిగురు ఉపయోగించకుండానే 40 అడుగుల ఎత్తుతో ఈ స్ట్రక్చర్‌ను సృష్టించాడు. దీనికోసం 41 రోజుల పాటు కష్టపడ్డాడు. ‘పూర్తయి పోయింది అనుకున్న నిర్మాణం కొన్నిసార్లు హఠాత్తుగా కుప్పకూలిపోయేది. మళ్లీ మొదటి నుంచి పని మొదలు పెట్టాల్సి వచ్చేది. విసుగ్గా అనిపించేది. అయినా సరే కష్టపడేవాడిని’ అంటున్నాడు అర్నవ్. గతంలో బ్రియాన్ బెర్గ్ అనే వ్యక్తి 34 అడుగుల ఎత్తుతో ఉండే ప్లేకార్డ్ స్ట్రక్చర్‌ను సృష్టించాడు. బెర్గ్ రికార్డ్‌ను అర్నవ్ బ్రేక్ చేశాడు.
(చదవండి: స్కిప్పింగ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్! వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment