structure
-
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
సొంత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న మసీదు కమిటీ
ముంబై: ముంబైలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు ముగిసింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్య చేపట్టింది.అక్రమ నిర్మాణం కూల్చివేతలో ముందుగా మసీదుపై అక్రమంగా నిర్మించిన గోపురాన్ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. దీనికిముందు మసీదు ట్రస్టు అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని పచ్చటి పరదాతో కప్పివుంచింది. బీఎంసీ బృందం మసీదును పరిశీలించేందుకు వచ్చి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.అయితే ఈ మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మసీదు ట్రస్టు స్వయంగా హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో మసీదు కూల్చివేత పనులను సోమవారం ప్రారంభించింది. హిమాచల్‌లోని కులులో అక్రమ మసీదు నిర్మాణంపై హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూణెలో అక్రమంగా నిర్మితమైన మసీదు, మదర్సా కూల్చివేత పనులను పూణే మహానగర పాలక సంస్థ చేపట్టింది.ఇది కూడా చదవండి: ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా? -
జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లు!
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) నివేదిక పేర్కొంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదికలోని అంశాలను చదివి వినిపించారు. గ్రౌండ్ పెన్‌ట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని కూడా సర్వేలో తేలింది. ‘మసీదులో చేసిన మార్పులను ఈ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్లంభాలను, ప్లాస్టర్‌ను చిన్నచిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు’అని ఏఎస్ఐ నివేదిక పేర్కొన్నట్లు జైన్ వివరించారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలలో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన మొత్తం 34 శాసనాలు ప్రస్తుత, పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయని జైన్ పేర్కొన్నారు. ‘ఇవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలు. ఇవి ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మత్తు సమయంలో ఇవి ఉపయోగించబడ్డాయి. దీనిని బట్టి పూర్వం అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి, దానికి సంబంధించిన భాగాలను తిరిగి వాడినట్లుగా రుజువవుతోంది. ఈ శాసనాల్లో జనార్థన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయి’అని నివేదికలో ఉన్నట్లు జైన్ చెప్పారు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాసి మసీదు సముదాయాన్ని హిందూ, ముస్లిం పక్షాలకు ఇవ్వాలంటూ వారణాసి కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ నివేదిక వెలుగులోకి రావ డం గమనార్హం. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
టేప్, జిగురు లేకుండా ప్లేయింగ్ కార్డు స్ట్రక్చర్‌తో రికార్డు సృష్టించాడు!
కోల్‌కతాకు చెందిన పదిహేను సంవత్సరాల అర్నవ్ దాగ ప్రపంచంలోనే పెద్దదైన ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్‌ను సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. కోల్‌కత్తాలోని ప్రసిద్ధ నిర్మాణాలు రైటర్ బిల్డింగ్, షాహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ ఆధారంగా చేసుకొని ఈ నిర్మాణం చేశాడు. పని ప్రారంభించడానికి ముందు ఈ నాలుగు నిర్మాణాల దగ్గరకు వెళ్లి వాటి ఆర్కిటెక్చర్‌ను పరిశీలించాడు. ఈ స్ట్రక్చర్ కోసం 143,000 ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించాడు. టేప్, జిగురు ఉపయోగించకుండానే 40 అడుగుల ఎత్తుతో ఈ స్ట్రక్చర్‌ను సృష్టించాడు. దీనికోసం 41 రోజుల పాటు కష్టపడ్డాడు. ‘పూర్తయి పోయింది అనుకున్న నిర్మాణం కొన్నిసార్లు హఠాత్తుగా కుప్పకూలిపోయేది. మళ్లీ మొదటి నుంచి పని మొదలు పెట్టాల్సి వచ్చేది. విసుగ్గా అనిపించేది. అయినా సరే కష్టపడేవాడిని’ అంటున్నాడు అర్నవ్. గతంలో బ్రియాన్ బెర్గ్ అనే వ్యక్తి 34 అడుగుల ఎత్తుతో ఉండే ప్లేకార్డ్ స్ట్రక్చర్‌ను సృష్టించాడు. బెర్గ్ రికార్డ్‌ను అర్నవ్ బ్రేక్ చేశాడు. (చదవండి: స్కిప్పింగ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్! వీడియో వైరల్) -
ఎఫ్‌పీఐలకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: సమాచార వెల్లడి అంశంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీలు) నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సవరించింది. ఎఫ్‌పీఐల నిర్మాణం(స్ట్రక్చర్), యాజమాన్యం(కామన్ ఓనర్షిప్) తదితర అంశాలలో ప్రస్తావించదగ్గ మార్పులు ఉంటే 7 పని దినాలలోగా తెలియజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా రిజిస్టర్కాదలచిన ఎఫ్‌పీఐల విషయంలో అవసరాన్నిబట్టి అదనపు డాక్యుమెంట్లను దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించనుంది. తాజా మార్గదర్శకాలతో సెబీ నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో ఈ నెల 14 నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తద్వారా నిబంధనలను మరింత పటిష్ట పరచింది. వెరసి స్ట్రక్చర్, యాజమాన్య నియంత్రణ తదితర అంశాలలో అక్రమ లేదా తప్పుదారి పట్టించే మార్పులు చోటుచేసుకుంటే సెబీతోపాటు, తత్సంబంధిత డిపాజిటరీకు ఏడు పనిదినాలలోగా వివరాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇదేవిధంగా విదేశీ నియంత్రణ సంస్థలు ఏవైనా చర్యలు తీసుకుంటున్నా నిర్ణత గడువులోగా వెల్లడించవలసి ఉంటుంది. జరిమానాలు, దర్యాప్తులు, పెండింగ్ కార్యాచరణ తదితర అంశాలుంటే వారం రోజుల్లోగా తెలియజేయాలి. ఎఫ్‌పీఐ లేదా ఇన్వెస్టర్ గ్రూప్ యాజమాన్య నియంత్రణ, స్ట్రక్చర్ అంశాలలో ప్రత్యక్ష లేదా పరోక్ష మార్పులు చోటు చేసుకుంటే తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఇదేవిధంగా డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఈ సమాచారాన్ని సెబీకి రెండు రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. -
7 శాతం కంపెనీల్లోనే ‘వృద్ధి’ సామర్థ్యాలు
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీ అండతో వృద్ధిని పెంచుకునే సరైన సంస్కృతి, సంస్థాగత నిర్మాణం కేవలం 7 శాతం కంపెనీల్లోనే ఉన్నట్టు ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. అంటే 93 శాతం కంపెనీల్లో ఈ సామర్థ్యాలు లేవని తేల్చింది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, భారత్‌లోని 2,700 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది. అధిక నాణ్యత, పారదర్శక డేటా, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతి అన్నవి కష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితుల్లోనూ కంపెనీలు లాభాల్లో వృద్ధిని నమోదు చేయడానికి తోడ్పడుతున్న అంశాలుగా ఈ నివేదిక పేర్కొంది. నూతన ఉత్పత్తులను వేగంగా మార్కెట్‌కు తీసుకురావడం అన్నది ముఖ్యమని, ఇది మొదటగా ప్రవేశించిన అనుకూలతలు తెస్తుందని తెలిపింది. ‘‘విజయానికి మూడు భిన్నమైన అంశాలు తోడ్పడతాయి. డేటాను అంతర్గతంగా వినియోగించడం, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతిని ఏర్పాటు చేయడం, డిజిటల్ వృద్ధిని అందిపుచ్చుకునే సంస్థాగత నిర్మాణం అవసరం’’అని ఈ నివేదిక వివరించింది. -
నిర్మాణ రంగానికి ఊతం
1. ముందే విద్యుత్, నీటి కనెక్షన్ల దరఖాస్తు.. గతంలో నిర్మాణం పూర్తయి ఓసీ వచ్చిన తర్వా తే వాటర్ వర్క్స్, ట్రాన్స్‌కో విభాగాల కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ, తాజా నిబంధనతో ఓసీ రాకముందే డెవలపర్లు విద్యుత్, వాటర్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనెక్షన్లు మాత్రం ఓసీ మంజూరయ్యాకే ఇస్తారు. కొన్ని చోట్ల వాటర్ వర్క్స్ విభాగానికి పూర్తి స్థాయిలో నల్లా లైన్స్ లేవు. టెండర్లు పిలవటం, పనులు పూర్తవటం వంటి తతంగమంతా జరగడానికి 3–9 నెలల సమయం పట్టేది. ఈ లోపు నిర్మాణం పూర్తయినా సరే కస్టమర్లు గృహ ప్రవే శం చేయకపోయే వాళ్లు. ఎందుకంటే మౌలిక వసతులు లేవు కాబట్టి! కానీ, ఇప్పుడు దరఖాస్తు చేయగానే వెంటనే అధికారులు ఆయా ప్రాం తాల్లో కనెక్షన్లు ఉన్నాయా? లేవా? చెక్ చేసుకునే వీలుంటుంది. దీంతో నిర్మా ణంతో పాటూ వసతుల ఏర్పాట్లు ఒకేసారి జరుగుతాయి. 2. వెంటిలేషన్స్లో గ్రీన్.. హరిత భవనాల నిబంధనల్లో ప్రధానమైనవి.. భవ న నిర్మాణాల్లో సాధ్యమైనంత వరకూ సహజ వనరుల వినియోగం. ఉదయం సమయంలో ఇంట్లో లైట్ల వినియోగం అవసరం లేకుండా సహజ గాలి, వెలుతురు వచ్చేలా గదుల వెంటిలేషన్స్ ఉం డాలి. అందుకే తాజాగా గదుల వెంటిలేషన్స్ గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలనే నిబంధనలను తీసుకొచ్చారు. దీంతో ఇంట్లో లైట్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఫలితంగా కరెంట్ ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. 3. సెట్‌బ్యాక్స్ తగ్గింపు.. 120 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనా ల చుట్టూ 20 మీటర్ల వెడల్పు ఖాళీ స్థలం వదిలితే సరిపోతుంది. గతంలో వీటికి సెట్‌బ్యాక్స్ 22.5 మీటర్లుగా ఉండేది. 55 మీటర్ల వరకూ ఎత్తు భవనాలకు గరిష్టంగా చుట్టూ వదలాల్సిన స్థలం 16 మీటర్లుగా ఉండగా.. ఆపై ప్రతి 5 మీటర్లకు 0.5 మీటర్ల ఖాళీ స్థలం పెరిగేది. కానీ, తాజా నిబంధనలతో 120 మీటర్ల ఎత్తు దాటితే గరిష్టంగా 20 మీటర్ల సెట్‌బ్యాక్ వదిలితే సరిపోతుంది. 4. రోడ్ల విస్తరణకు స్థలం ఇస్తే.. నగరంలో రోడ్ల విస్తరణలో స్థలాల సమీకరణ పెద్ద చాలెంజ్. దీనికి పరిష్కారం చెప్పేందుకు, స్థలాలను ఇచ్చేవాళ్లను ప్రోత్సహించేందుకు నిబంధనల్లో మార్పు చేశారు. రోడ్ల విస్తరణకు ముందు ఉన్న విధంగానే భవనం నమూనా, ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు ఉన్న ఎత్తు సేమ్ అదేగా ఉండాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి అనుమతించిన విస్తీర్ణం మాత్రం గతం కంటే మించకుండా ఉంటే చాలు. 5. టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఇప్పటివరకు టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్స్ అనేవి స్టార్ హోటళ్లు, ప్రీమియం అపార్ట్మెంట్లలో మాత్ర మే కనిపించేవి. కానీ, తాజా సవరణల్లో టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఏర్పాటును చేర్చారు. అపార్ట్మెంట్ పైకప్పును పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. పైగా టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్, దాని కింది ఫ్లోర్‌లోనే క్లబ్ హౌస్ వంటి వసతులుంటా యి కాబట్టి కస్టమర్లు పూర్తి స్థాయిలో వసతులను వినియోగించుకుంటారు. అపార్ట్మెం ట్ చల్లగా ఉంటుంది. ఏసీ వినియోగం తగ్గు తుంది. నిర్వహణ పటిష్టంగా ఉన్నంతకాలం బాగుంటుంది. – సాక్షి, హైదరాబాద్ ఇంపాక్ట్ ఫీజు సంగతేంటి? ఓసీ రాకముందే బీటీ, సీసీ రోడ్లు నిర్మా ణం పూర్తి చేయాలనే నిబంధనను తీసుకొ చ్చారు. ఇది ఆహ్వానించదగ్గదే. కానీ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ కోసం వసూలు చేస్తున్న ఇంపాక్ట్ ఫీజును ఇందులో నుంచి మినహాయించాలనేది డెవలపర్ల డిమాండ్. 6 ఫ్లోర్ల తర్వాత నుంచి ఇంపాక్ట్ ఫీజుగా చ.అ.కు రూ.50 వసూలు చేస్తున్నారు. నిజానికి నిర్మాణ కార్యకలాపాలతో అభి వృద్ధి జరిగి ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇంపాక్ట్ ఫీజులతో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, తాజా నిబంధనల్లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కూడా నిర్మాణదారులే చేయాలి. ఆ తర్వాతే ఓసీ మంజూరు చేస్తామనడం సరైనది కాదు. ఇంపాక్ట్ ఫీజు ఎస్క్రో ఖాతాలో ఉంటుంది ఈ సొమ్ముతో డెవలపర్లు వసతులను ఏర్పా టు చేయాలి లేదా ఆయా ఖర్చును ఇంపాక్ట్ ఫీజు నుంచి మినహాయించాలి. -
2025లోపు రామమందిరం: భయ్యాజీ
ప్రయాగ్‌రాజ్: అయోధ్యలో రామమందిర నిర్మాణం 2025లోపు పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మందిర నిర్మాణం ప్రారంభించాలన్నారు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లుగానే మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుందని ప్రధాని మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాక భయ్యాజీ పైవిధంగా స్పందించారు. -
ఈ గోడ... చరిత్రకు జాడ!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండడుగుల పొడవున్న భారీ ఇటుకలు.. గోడ తరహాలో వరుసగా పేర్చిన నిర్మాణం.. వృత్తాకారంలో ఉందన్నట్లు వంపు తిరిగిన ఆకృతి.. తాజాగా బయటపడ్డ ఓ గోడ ఆకృతి ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. శాతవాహనుల కాలం నాటి కట్టడంగా భావిస్తున్న ఈ గోడ బౌద్ధ నిర్మాణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా బౌద్ధ స్తూపాలు వృత్తాకారంలో ఉంటాయి. చైత్యాలు ఆంగ్ల అక్షరమాలలోని ‘యు’ఆకృతిలో ఉంటాయి. తాజాగా వెలుగుచూసిన కట్టడం ప్రాథమిక ఆనవాళ్లు వంపు తిరిగి ఉండటంతో స్తూపమో, చైత్యమో అయి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కట్టడం పుట్టు పూర్వోత్తరాలు తేల్చేందుకు పురావస్తుశాఖ నడుం బిగించింది. బుధవారం ఉదయం పురావస్తు శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించి నిగ్గు తేల్చనున్నారు. జనగామకు చేరువలో.. భువనగిరి–జనగామ మధ్యలోని పెంబర్తికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న ఎల్లంల గ్రామ శివారులో ఈ నిర్మాణం వెలుగు చూసింది. చాలాకాలంగా ఇక్కడ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ఐదు రోజుల కింద కూలీలు ఇసుక తవ్వుతుండగా రెండుమీటర్ల లోతులో ఇటుక నిర్మాణం కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఉపాధ్యాయుడు రత్నాకర్‌రెడ్డి వెళ్లి పరిశీలించి అది పురాతన కట్టడంగా భావించారు. రెండు అడుగులకు కాస్త తక్కువ పొడవుతో ఉన్న ఇటుకలు కావటంతో అవి శాతవాహన కాలానికి చెందినవే అయి ఉంటా యని భావించి విషయాన్ని పురావస్తు శాఖ దృష్టికి తెచ్చారు. పురావస్తుశాఖ డైరెక్టర్ విశా లాచ్చి వెంటనే స్పందించారు. వాటిని పరిశీలించాల్సిందిగా అధికారి భానుమూర్తిని ఆదేశించడంతో ఆయన స్థానిక సిబ్బందితో కలసి బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. పర్యాటకానికి ఊతం.. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలు, చైత్యాలు వెలుగు చూశాయి. ఫణిగిరి, ధూళికట్ట, నేలకొండపల్లి, కోటలింగాలలో బౌద్ధ నిర్మాణాల జాడలు బయటపడ్డాయి. బుద్ధుడి బోధనలు వినేందుకు వెళ్లి వచ్చిన బావరి నివసించిన ప్రాంతం కూడా ఇక్కడే ఉండటం విశేషం. ఇక్కడి నుంచే బౌద్ధ మత ప్రచారం ప్రారంభమై చైనా వంటి దేశాలకు పాకిందన్న ఆధారాలు వెలుగుచూడటంతో రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకానికి ప్రాధాన్యం పెరుగుతోంది. నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనంలో తైవాన్‌లాంటి దేశాల సాయంతో బౌద్ధ విశ్వవిద్యాలయ స్థాపనకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే కేంద్రం బౌద్ధ ప్రాంతాల అభివృద్ధికి నిధులనూ కేటాయించింది. ఈ తరుణంలో జనగామ ప్రాంతంలో వెలుగుచూసిన కట్టడం బౌద్ధ నిర్మాణమైతే మరింత ఊతమొచ్చినట్లు అవుతుంది. -
అనుమతి ఒకలా.. కట్టింది ఇంకోలా!
ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ ఎల్బీ నగర్లో 8 వేల గజాల్లో ప్రిన్స్టన్ టవర్ పేరిట వాణిజ్య సముదాయాన్ని నిర్మించింది. ఇందులో ఒక్కో అంతస్తు 30 వేల చ.అ.ల్లో విస్తరించి ఉంది. అయితే వాస్తవానికి నిర్మాణ అనుమతులు ఒకలా ఉంటే నిర్మాణం మాత్రం మరోలా ఉంది. అంటే స్థానిక సంస్థ నుంచి పోడియం టవర్ స్టైల్లో అనుమతులను తీసుకున్న నిర్మాణ సంస్థ.. కట్టింది మాత్రం అందుకు పూర్తి భిన్నంగా! జీ+1 మినహా మిగిలిన అన్ని అంతస్తుల్లోనూ అనుమతులను ఉల్లఘించింది. సెట్బ్యాక్స్లోనూ అతిక్రమణే. పైపెచ్చు జీ+1కు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకుని అన్ని అంతస్తులనూ వినియోగించేస్తుంది కూడా. 1.25 లక్షల చ.మీ. స్థలాన్ని 3 లెవల్స్ పార్కింగ్ కోసం కేటాయించారు. జీ+5 వరకు వాణిజ్య స్థలాన్ని, 6వ అంతస్తులో ఆఫీస్ స్పేస్, ఆ తర్వాతి అంతస్తులో బాంక్విట్ హాల్‌ను అభివృద్ధి చేశారు. అయితే ప్లాన్‌లో 7వ అంతస్తులోని హోటల్ డిజైన్ ఒకలా ఉంటే.. నిర్మాణంలో మాత్రం ఇంకోలా ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 5 శాతం స్థలాన్ని కస్టమర్లు కొనుగోలు చేస్తే.. మిగిలినవి లీజుకు తీసుకున్నారు కూడా. -
నిర్మాణంలో నాణ్యతనిర్వహణలో నిశ్చింత!
‘‘ప్రాజెక్ట్‌ను నిర్మించి.. విక్రరుుంచడంతోనే నిర్మాణ సంస్థ పనైపోరుునట్టు కాదు. సంబంధిత ప్రాజెక్ట్‌లోని ఫ్లాట్ మళ్లీ అమ్మకానికి పెట్టినా నేడక్కడ కొత్తగా నిర్మించే ఫ్లాట్ ధరతో పోటీ పడేలా ఉండాలి. అద్దె విలువలోనూ ఏమాత్రం తగ్గొద్దు’’ ... స్థిరాస్తి కొనుగోలుదారులెవరైనా కోరుకునేదిదే. మరీ, కస్టమర్ల కోరిక తీరాలంటే నిర్మాణంలో నాణ్యత.. నిర్వహణ సరిగ్గా ఉంటేనే సాధ్యమవుతుంది! సరిగ్గా ఇవే మా ప్రాజెక్ట్‌ల ప్రత్యేకత అంటోంది ప్రణీత్ గ్రూప్. ఏడాదిలో ఆంటిలియా ప్రాజెక్ట్‌లో ప్రాపర్టీ విలువ 25 శాతం పెరగడమే ఇందుకు ఉదాహరణగా చెబుతోంది. కస్టమర్ల పెట్టుబడికి రెండింతల లాభాన్ని చూపించాలనేది మా లక్ష్యమంటోంది!! సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో నాణ్యత.. గడువులోగా ఫ్లాట్ల అప్పగింత.. అందుబాటు ధరల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు.. ఇదీ క్లుప్లంగా చెప్పాలంటే ప్రణీత్ గ్రూప్ విజయ రహస్యం! అందుకే ఎనిమిదేళ్లలో బాచుపల్లి, మల్లంపేట, బీరంగూడలో 14 ప్రాజెక్ట్‌ల్లో.. 2,000లకు పైగా కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయగలిగామని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు చెప్పారు. ఇప్పుడిదే లక్ష్యంతో తొలిసారిగా బాచుపల్లిలో 3.5 ఎకరాల్లో జెనిత్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాం. ఆదివారం ప్రారంభించనున్న ప్రాజెక్ట్ వివరాలివే.. ⇔ ఇప్పటివరకు బాచుపల్లి ప్రాంతంలో 6 విల్లాల ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. వీటిలో దాదాపు 500లకు పైగా కుటుంబాలు ఆనంద జీవనం గడుపుతున్నారు. అరుుతే విల్లాలో పొందే సౌకర్యాలు అపార్ట్మెంట్లోనూ అందించాలనే లక్ష్యంతో.. అది కూడా తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో జెనిత్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ⇔ 3.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 5 టవర్లుంటారుు. ప్రతి టవర్‌లో ఐదంతస్తులుంటారుు. మొత్తం 275 ఫ్లాట్లొస్తారుు. 2 బీహెచ్‌కే 165, మిగిలినవి 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటారుు. 830-1,400 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటారుు. ధర చ.అ.కు రూ.2,900. డిసెంబర్ ముగింపు నాటికి చ.అ.కు రూ.150 తగ్గింపు ఉంటుంది. ⇔ 8,500 చ.అ.ల్లో క్లబ్‌హౌజ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, ల్యాండ్ స్కేపింగ్, పైప్ గ్యాస్ లైన్, పవర్ బ్యాకప్ వంటి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాం. 18 నెలల నుంచి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. ఇప్పటికే 60 ఫ్లాట్లు అమ్ముడుపోయారుు కూడా. ⇔ బాచుపల్లిలోని ఇంద్రానగర్‌లో 50 ఎకరాల్లో ఆంటిలియా విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 120-300 గజాల విస్తీర్ణాలుంటే మొత్తం 600 డూప్లె, ట్రిప్లెక్స్ విల్లాలుంటారుు. ధర రూ.60 లక్షల నుంచి ప్రారంభం. 80 శాతం విక్రయాలు పూర్తయ్యారుు. డిసెంబర్ ముగింపు నుంచి 100 విల్లాలను కస్టమర్లకు అందిస్తాం. 2017 ముగింపు నాటికి ప్రాజెక్ట్ మొత్తాన్ని పూర్తి చేస్తాం. ఇక్కడే ఎందుకు కొనాలంటే.. సొంతిల్లు కొనేముందు ఎవరైనా సరే చూసేది.. స్కూలు, ఆసుపత్రి, షాపింగ్ మాల్, ఆఫీసుకు దగ్గరుందా అని! అరుుతే ఈ విషయంలో మాత్రం బాచుపల్లి ముందుందనే చెప్పాలి. ఎందుకంటే బాచుపల్లి చుట్టూ 5-10 కి.మీ. పరిధిలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాల వారికి అనువైన విద్యా సంస్థలున్నారుు. ఓక్రిడ్‌జ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గీతాంజలి, శ్రీ చైతన్య, గాయత్రి, అభ్యాస్, భాష్యం, నారాయణ, గోకరాజు రంగరాజు, వీఎన్ఆర్, బీవీఆర్ఐటీ వంటి అన్ని రకాల విద్యా సంస్థలున్నారుుక్కడ. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీకి బాచుపల్లిలో 100 ఎకరాల స్థలాన్ని కేటారుుంచారు కూడా. ఔటర్ రింగ్ రోడ్డును ఆధారంగా చేసుకొని మరిన్ని విద్యా, వైద్యం, వినోద సంస్థలూ రానున్నారుు. ⇔ బాచుపల్లి నుంచి 6 కి.మీ. దూరంలో ఉన్న నిజాంపేట్, మియాపూర్‌లోని కార్పొరేట్, మల్టీనేషనల్ ఆసుపత్రులున్నాయి. అరుుతే బాచుపల్లి నుంచి నిజాంపేట్‌కు వెళ్లే రోడ్లో 27 ఎకరాల్లో కత్రియా ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సుమారు 1,000 పడకలు అందుబాటులో ఉంటాయని సమాచారం. ⇔ దేశంలోనే అతిపెద్ద బస్ టెర్మినల్ బాచుపల్లికి 3 కి.మీ. దూరంలోనే ఉంటుంది. మియాపూర్‌లో 55 ఎకరాల్లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) ఉంది. ఇందులో 200 డిస్ట్రిక్, 30 సిటీ బస్ బేలుంటారుు. బాచుపల్లి నుంచి 10 కి.మీ. దూరం లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉంటుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ పూర్తయ్యాక.. దాన్ని బాచుపల్లి వరకూ విస్తరణ చేయాలనేది ప్రభుత్వ యోచ న. ప్రస్తుతం బాచుపల్లిలో మంజీరా మంచినీరు సరఫరా అవుతోంది. గోదావరి జలాలు కుత్బుల్లాపూర్ వరకొచ్చారుు. 2-3 ఏళ్లలో బాచుపల్లి కూడా వస్తాయనేది అధికారుల మాట. కస్టమర్ల మధ్య ఐక్యత కోసం 10 నుంచి పీపీఎల్ సీజన్-2 ప్రణీత్ గ్రూప్‌కు చెందిన అన్ని ప్రాజెక్ట్‌ల్లోని కస్టమర్ల మధ్య సత్సంబంధాలు, ఐక్యత కోసం క్రీడలకు శ్రీకారం చుట్టింది సంస్థ. గతేడాదిలాగే ఈసారి కూడా ప్రణీత్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలను నిర్వహిస్తోంది. జనవరి 10న ప్రారంభంకానున్న పీపీఎల్ సీజన్-2లో అవెంజర్స్, బ్లాస్టర్స్, కమాండోస్, గ్లాడియేటర్స్, గెలాక్సియన్స, హరికేన్స, మావిరిక్స్, పాంథర్స్, విక్కింగ్స, జోల్టెన్స పేర్లతో 10 బృందాలు పోటీపడనున్నారుు. 40 రోజుల పాటు 24 మ్యాచ్‌లు జరుగుతారుు. విజేతకు లక్షన్నర, రన్నర్‌కు రూ.75 వేలు, మూడో స్థానానికి రూ.50 వేలు నగదు బహుమతిగా అందిస్తారు. -
‘డబుల్’ పనులు షురూ..
అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు రూ.92.50 కోట్లతో 1384 డబుల్ బెడ్రూం ఫ్లాట్లు అంబేద్కర్‌నగర్‌లో పనులు ప్రారంభం ఇళ్లు ఖాళీ చేస్తే ఎస్ఆర్ నగర్లోనూ నిర్మాణం వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించారు. స్లమ్ ఏరియాలైన హన్మకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్ఆర్ నగర్లో ఉన్న ఇళ్ల స్థానంలో జీ ప్లస్-1, జీ ప్లస్-3 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఫ్లాట్లు నిర్మించాలని జిల్లా యంత్రాం గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ ప్లస్ గృహాల నిర్మాణ ప్రాజెక్టు బాధ్యతలను కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్అం డ్బీ శాఖ చేపట్టింది. హైదరాబాద్‌కు చెం దిన ఒక ప్రైవేటు సాంకేతిక సంస్థ సహా యంతో డీపీఆర్‌ను రూపకల్పన చేశారు. డీపీఆర్‌లో కొన్ని తేడాలు ఉండడంతో మొదటిసారి నిర్వహించిన టెండర్లు రద్దయ్యాయి. పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధమయ్యాక టెండర్లు నిర్వహించడంతో ఖరారు అయ్యాయి. అంబేద్కర్ నగర్లో జీప్లస్-3 నిర్మాణం హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లోని సుమారు ఏడు ఎకరాల స్థలంలో జీ ప్లస్-3 పద్ధతిలో అర్హులుగా గుర్తించిన 592 మందికి రూ.39 కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో డ బుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ఎంజెఆర్ సంస్థ 4.58 శాతం తక్కువ ధరతో ఈ పనులను దక్కించుకుంది. అగ్రిమెంటు పూర్తికావడంతో ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఎస్ఆర్ నగర్లో జీప్లస్-1 ఇళ్ల నిర్మాణం వరంగల్‌లోని ఎస్ఆర్ నగర్లో 17 ఎకరాల్లో జీప్లస్-1 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించనున్నారు. ఇక్కడ అధికారులు జీప్లస్-3 పద్ధతుల్లో ఇళ్లు నిర్మించేం దుకు ప్రయత్నించగా స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో అర్హులుగా గుర్తించిన 792 మందికి రూ.53.50 కోట్ల వ్యయంతో జీప్లస్-1 పద్ధతిలో గ్రేడ్లుగా విభజించి ఇళ్లు నిర్మించనున్నారు. ‘ఎ’ గ్రేడ్‌లో 4+4, బి గ్రేడ్‌లో 2+2, సీ గ్రేడ్‌లో 1+1, డీ గ్రేడ్‌లో 1+1గా జీప్లస్ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ రూ పొందించారు. ఇందులో సి, డి గ్రేడ్ల ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించాల్సి వస్తున్నందున ఏ, బీ గ్రేడ్‌లో ఇళ్లు నిర్మించేం దుకు నిర్ణయించారు. జిల్లాకు చెందిన మంద ఐలయ్య కన్స్ట్రక్షన్ కంపెనీ 1.96 శాతం తక్కువ ధరతో ఈ పనులను దక్కిం చుకుంది. లబ్ధిదారులు వారు ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసిన వెంటనే ఎస్ఆర్నగర్లో పనులు ప్రారంభిస్తామని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. -
అంతర్గత నిర్మాణంతో అసలైనశ్రేయస్సు
సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈ భూమిపై మనిషి శ్రేయస్సు కోసం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖ్యంగా గత వంద సంవత్సరాలుగా ఎంతో కృషి జరిగింది. దీనివల్ల మనకు ఖచ్చితంగా ఎంతో సౌఖ్యమూ, సౌలభ్యమూ ఏర్పడ్డాయి. మన ముందు తరాల వారు ఇటువంటి సుఖమయ జీవితాన్ని కనీసం ‘కల’ కూడా కని ఉండరు. వీటివల్ల మానవాళి మెరుగుపడిందా? మీరు ప్రపంచాన్ని, ముఖ్యంగా పశ్చిమదేశాలను, ఉదాహరణకు అమెరికాను చూసినట్లయితే, నలభై శాతం మంది ప్రజలు తమ మానసిక సమతుల్యత కోసం మందులపై ఆధారపడి ఉన్నారు. ఇది శ్రేయస్సు కాదు. మానవాళి ఎందుకు బాగాలేదు అంటే మనం బాహ్యం గురించిన జాగ్రత్తలు తీసుకున్నాం కాని అంతర్గత క్షేమాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నిజమయిన మానవ శ్రేయస్సు ఒక వ్యక్తి తనలో తాను ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నప్పుడే కలుగుతుంది. మీలో మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఎలా ఉండాలో మీకు తెలియనప్పుడు, మీరు ఉండే ఇల్లు, నడిపే కారు, వేసుకునే బట్టలు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, వీటికోసం మీరు చేసిన కృషి, ఇవన్నీ వ్యర్థం అవుతాయి. మీరు మీ స్వతహాగా ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలిగినప్పుడే, మీ జీవితాన్ని భయమూ, ఆందోళనా లేకుండా గడపగలుగుతారు. నాకేమి అవుతుందో అన్న భయం మీలో ఉన్నంతవరకూ, మీరు కేవలం సగం అడుగులు మాత్రమే వేస్తారు. పూర్తి అడుగులు ఎప్పుడూ వేయరు. కాబట్టి, మనిషి తన పూర్తి సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నప్పుడు, మొదట తనలో ప్రశాంతత, ఆనందంతో కూడిన అంతర్గత స్థిరత్వం కలిగి ఉండాలి. అప్పుడే తను జీవితపు అవకాశాలను అన్వేషించి అందుకోగలుగుతాడు. లేకపోతే, అతని ఆనందం యాదృచ్ఛికం కావడం వల్ల, అతను జీవితం గురించి ఒక పెద్ద సందిగ్ధస్థితిలో ఉంటాడు. మీరు ఎవరయినా, ఎంతటి శక్తిశాలురైనా, బయటి పరిస్థితులు ఎల్లవేళలా 100% మీ అదుపులో ఉండవు. ఎందుకంటే అవి ఎన్నో ఆటంకాలను కలిగి ఉంటాయి. వాటిలో చాలావరకు మీకు తెలియను కూడా తెలియవు. మీకు తెలిసిన కొన్నింటినే మీరు నియంత్రించే ప్రయత్నం చేస్తారు, కాని మిగతావి మీకు అర్థం కూడా కావు. అలాంటప్పుడు నియంత్రించే ప్రసక్తే ఉండదు. అవన్నీ మీకు అనువుగా జరుగుతాయని మీరు ఆశిస్తున్నారు అంతే. కాని, మీ అంతర్గత విషయాలకు వచ్చేసరికి మీరు ఒక్కరే ఉంటారు. కనీసం అవైనా మీరనుకున్న తీరులో జరిగి తీరాలి. లేదంటే మీరు దారి తప్పారని అర్థం. అంతా ఇందువల్లే, అంటే వారి అంతర్గతం వారి ఆధీనంలో లేకపోవడం వల్లే, ఒత్తిడికి గురై, పూర్తిగా అలసిపోతుంటారు. మీ పనిని బట్టి మీరు ఒత్తిడికి గురికారు. మీ వ్యవస్థను మీరు నియంత్రించుకోలేకపోవడం వల్ల ఒత్తిడి జనిస్తుంది. మీరు నిజంగా మీ జీవితంలో నాణ్యత కావాలనుకుంటే, మీ చుట్టూ ఉన్న జీవితంలో అదే నాణ్యత ఉండాలనుకుంటే, మీలోని అంతర్గత పరిస్థితులను స్థిరపరుచుకుని, మీ మనస్సు, మీ భావాలు, మీ వ్యవస్థ బాహ్యజీవితపు ఒడిదుడుకులను అనుసరించకుండా స్థిరంగా ఉండేలా చేయాలిసి ఉంటుంది. మీలో అంతర్గత ఒడిదుడుకులూ, సమస్యలు లేనప్పుడు మీరు బాహ్య సవాళ్ళను సమర్థవంతంగా ఎదురుకోగలరు. మరి అలాంటి అంతర్గత పరిస్థితిని ఏర్పరుచుకునే మార్గమేదయినా ఉందా? తప్పక ఉంది. బాహ్యపరిస్థితులను మనం కోరుకున్నవిధంగా సృష్టించుకోవడానికి శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం వున్న విధంగానే, అంతర్గత పరిస్థితులనూ మనం కోరుకున్నవిధంగా సృష్టించుకోవడానికి శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ప్రపంచాన్ని మనకు అనువుగా నిర్మించుకున్న విధంగానే, మన అంతర్గతాన్ని కూడా మనం మనకు కావలసిన విధంగా నిర్మించుకోగలం. కాబట్టి, మీరు నిజంగా మీ జీవితంలో నాణ్యత మెరుగుపడాలి అనుకుంటే, ఆ దిశగా అడుగులు వేయాలి. మీ అంతర్గత శ్రేయస్సుకోసం మీ సమయాన్ని కొంత వెచ్చించడానికి సిద్ధపడాలి. ఇది జరిగితే, మీరు పనిచేసే విధానంలో అసాధారణ మార్పు గమనిస్తారు. ఇందుకు కావలసిన పరిజ్ఞానం ఉంది. దీన్నే నేను ఇన్నర్ ఇంజనీరింగ్ (అంతర్గత నిర్మాణం) అంటాను. ఇది యోగా ద్వారా సాధ్యం. దీనిద్వారా అత్యున్నతమైన శ్రేయస్సును పొందవచ్చు. ప్రేమాశీస్సులతో, సద్గురు -
తెలంగాణను నిద్ర లేపాం: సుంకిరెడ్డి
సంభాషణ ప్రవాహంలోకి దూకినవాడు లోతును తట్టిందీ లేనిదీ ఎలా తెలుస్తుంది? అరచేతిలో చూపిన అడుగుమట్టే అందుకు రుజువు. తెలంగాణ సమాజానికి ఎదురైన అనేక సవాళ్ల సందర్భాల్లో సుంకిరెడ్డి నారాయణరెడ్డి చరిత్రలోతుల్లోకి దూకాడు. తన రచనల్లో ఆ అడుగుమట్టిని చూపాడు. అనాది కాలం ఉంచి ఆధునిక కాలం వరకూ తెలంగాణ నేలపొరల్లో దాగిన నిజాలను వెలుగులోకి తెచ్చాడు. ఆ ప్రకాశం అనేకులకు ఉత్తేజాన్నిచ్చింది. కాబట్టే, ఆయన రచనలు కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో పాఠ్యపుస్తకాలయ్యాయి. టీనేజ్ విద్యార్థులు సైతం చరిత్రలోకి డైవ్ చేసేందుకు సుంకిరెడ్డి రచనలు ప్రేరణనిస్తున్నాయి. ‘ముంగిలి’కి ద్వానాశాస్త్రి పురస్కారం, ‘తెలంగాణ చరిత్ర’కు బి.ఎన్.శాస్త్రి పురస్కారం అందుకున్న డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవి, పరిశోధకుడు, వివిధ రచనలను సంకలనం చేసిన సంపాదకుడు కూడా. యు.జి.సి ప్రాజెక్ట్‌లో భాగంగా ‘తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం’ చేస్తోన్న సుంకిరెడ్డితో సంభాషణా సారాంశం: ‘ప్రతిజ్ఞ’ చేయించిన ఊరు.. నల్లగొండ జిల్లా పానగల్లు మండలం పగిడిమర్రి మా ఊరు. ఇరు రాష్ట్రాల విద్యార్థులు నిత్యం పఠించే ‘ప్రతిజ్ఞ’ రచయితది మా ఊరే. నల్లగొండలో డిగ్రీ, ఉస్మానియాలో పీజీ, పీహెచ్డీ చేసిన. బెంగాలీ, సంస్కృతం భాషలంటే కుతూహలం. వాటిని సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేసిన. నందిని సిధారెడ్డి, రఘునాథం, జింబో.. అందరం కలిసి ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ అయ్యాం. 1970-80ల మధ్యకాలంలో వెలువడిన కవితల్లో నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి మేం వేసిన ‘ఈతరం యుద్ధకవిత’ సంకలనం చాలామందికి ప్రేరణనిచ్చింది. తెలంగాణ రైటర్స్... 1998 నవంబర్ 1న - అప్పటికి తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశను గమనించి- సిధారెడ్డి, కె.శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి తదితరులం ‘తెలంగాణ రైటర్స్’ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి తొలి ఉద్యమ వేదిక ఇదే. మరుసటి సంవత్సరం ఇది ‘తెలంగాణ సాంస్కృతిక వేదిక’గా మారింది. తెలంగాణ సంస్కృతి, కవిత్వంపై శతాబ్దం కాలంగా (1917-2002) పరచిన చీకట్లను ఛేదిస్తూ వేదిక తరఫున తొలి సంకలనం ‘మత్తడి’ ప్రచురించాం. కవిత్వపు ఆదిమయుగం నుంచి క్రీ.శ.1700 వరకూ తెలంగాణ ప్రాచీన కవిత్వాన్ని ‘ముంగిలి’గా పాఠకుల ముందుంచాం. వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ‘తెలంగాణ చరిత్ర ఎందుకు లేదు’ అనే కోణంలో యువతను చైతన్యవంతం చేశాం. ఎందరో మహానుభావులు... తెలంగాణలో ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి కృషిని వెలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆధునిక సాహిత్యంలో తెలంగాణ నుంచి కృషి చేసిన గవ్వా సోదరులు (మురహరిరెడ్డి-జానకిరామిరెడ్డి-అమృతరెడ్డి) చేసిన కృషి ఎందరికి తెలుసు? వారి రచనలు వెతికి వెలికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’కు ముందే తెలంగాణకు చెందిన సాయిరెడ్డి ‘కాపుబిడ్డ’ రాశారు. ఆ సంగతి ఎందరికి తెలుసు? కరుణశ్రీ పుష్పవిలాపం కంటే ముందే ‘సుమవిలాపం’ గోల్కొండ పత్రికలో ప్రచురితం. పోతన ఇక్కడి వాడు కాదన్నారు. పాల్కురికి సోమననూ కాదన్నారు. మూడు వేల సంవత్సరాలుగా తెలుగువారంతా కలిసే ఉన్నారన్నారు. ఈ వాదనలకు తిరుగులేని ఆధారాలతో బదులిచ్చాం. తరతరాల తెలంగాణను ఆవిష్కరించాలనే మా ప్రయత్నం. తగ్గింపబడువారు హెచ్చింపబడతారనే చారిత్రక వాస్తవాన్ని చెబుతున్నాం. తెలంగాణ రైటర్స్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ ప్రజాసంఘాలు, తెలంగాణ రాజకీయపార్టీలు చేసిన కృషి ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. మేనిఫెస్టోను అవతరింప చేయలేదని కొందరు తెలంగాణ సాహిత్యకారులు ప్రభుత్వంపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు. కొంత వ్యవధినివ్వాలని నేను భావిస్తున్నాను. - పున్నా కృష్ణమూర్తి -
ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ వాటా విక్రయం
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాల విక్రయం పూర్తయినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. టర్కీలోని ఇంస్తాంబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని 40 శాతం వాటాను రూ.1,740 కోట్లకు విక్రయించామని, దీనికి సంబంధించిన మొత్తం అందుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. గతేడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు జీఎంఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వాటాను మరో భాగస్వామ్య కంపెనీ మలేషియా ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ)కి విక్రయించింది. దీంతో జీఎంఆర్‌కి రూ. 1,740 కోట్ల మూలధనం చేతికి రావడమే కాకుండా, రూ.1,412 కోట్ల రుణ భారం తగ్గనుంది. ఈ ఒప్పందం పూర్తి కావడంపై జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎంఆర్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విదేశీ ఆస్తుల విక్రయించడంలో మా సమర్థతో మరోసారి రుజువయ్యిందన్నారు. -
మానవ నాడీ వ్యవస్థ..నిర్మాణం.. విధులు
సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ శరీరంలోని వివిధ భాగాల మధ్య వేగవంతమైన సమన్వయానికి ఉపయోగపడేది నాడీ వ్యవస్థ.. సకశేరుకాల్లో ఉన్నతమైన నాడీ వ్యవస్థ ఉంటుంది. జంతువుల్లో పూర్వపరమైన నాడీవ్యవస్థ ప్రోటోన్యూరాన్స రూపంలో సీలెంటరేటా అనే వర్గంలో కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా నాడీవ్యవస్థ సంక్లిష్టత పెరుగుతుంది. సకశేరుకాల్లో ముఖ్యంగా క్షీరదాల్లో అత్యంత సంక్లిష్టతతో కూడిన నాడీ వ్యవస్థ ఉంటుంది. మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ మొత్తం ప్రత్యేక నాడీ కణాలు లేదా న్యూరాన్స్ (Nerve cells)తో తయారవుతుంది. నాడీకణాన్ని తొలిసారిగా ఫాసిల్, హిస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడీ వ్యవస్థ మొత్తం నాడీ కణా లతో తయారవుతుందన్న నాడీకణ సిద్ధాంతాన్ని కజాల్ (cajal) అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. నాడీ వ్యవస్థలోని మెదడు, వెన్నుపాము, నాడులు ఇలా అన్ని భాగాలు నాడీకణాలతోనే తయారవుతాయి. పుట్టినప్పుడు ఉండే నాడీకణాలు ఆ తర్వాత కూడా అదే సంఖ్యలో ఉంటాయి. కారణం శరీరంలో నాడీకణాలకు విభజన శక్తి ఉండదు. మిగతా శరీర భాగాలు కణ విభజన ద్వారా, నాడీకణం పెరుగుదల ద్వారా పరిమాణంలో పెరుగుతాయి. కాబట్టి నాడీకణాలు శరీరంలో అత్యంత పొడవైన కణాలు అయ్యాయి. నాడీకణ నిర్మాణం: ఇందులో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. సైటిన్ లేదా కణదేహం, ఏక్సాన్. సైటాన్ వెడల్పుగా ఉంటుంది. దీనిలో కేంద్రకం చుట్టూ కణద్రవ్యంలో ప్రత్యేక నిసిల్స్ కణికలు ఉంటాయి. కణదేహం అంచుల నుంచి డెండ్రైట్స్ అనే విభజనలు ఏర్పడతాయి. సైటాన్ నుంచి పొడవుగా సాగే తంతువు వంటి నిర్మాణమే అక్షీయతంతువు లేదా ఏక్సాన్. దీని చివర కూడా టెలీడెండ్రైట్స్ అనే సూక్ష్మ విభజనలు ఉంటాయి. ఏక్సాన్ చుట్టూ మైలిన్ అనే కొవ్వు పదార్థంతో తయారైన ఒక మందమైన పొర ఉంటుంది. ఇది విద్యుత్ బంధకంగా వ్యవహరిస్తుంది. నాడీకణంలో సాగే నాడీ ప్రచోదనం బయటకు చేరకుండా ఇది అడ్డుకుంటుంది. మైలిన్ పొర లేదా మెడుల్లరీ షీట్‌కు బాహ్యంగా న్యూరిలెమ్మ అనే పల్చటి పొర ఉంటుంది. ఇది మైలిన్ పొర పని తీరును నియంత్రిస్తుంది. మైలిన్ పొర, న్యూరిలెమ్మల మధ్య ష్క్వాన్ కణాలు అనే ప్రత్యేక సూక్ష్మకణాలు ఉంటాయి. ఇవి మైలిన్ పొరను స్రవిస్తాయి. ఏక్సాన్పై అక్కడక్కడ మైలిన్ పొర, న్యూరిలెమ్మ లేని నొక్కుల వంటి ప్రాంతాలు ఉంటాయి. వీటిని Ranvier nodes అంటారు. ఇవి నాడీకణం ద్వారా సాగే నాడీ ప్రచోదన వేగాన్ని పెంచుతాయి. ఇలాంటి అనేక నాడీకణాల కట్టను నాడి లేదా ూ్ఛటఠ్ఛి అంటారు. ఒక నాడిలో అనేక నాడీకణాలు ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటాయి. ఏ రెండు నాడీకణాలు భౌతికంగా అతుక్కొని ఉండవు. వాటి మధ్య ఉన్న ఖాళీ ప్రాంతాన్ని నాడీ కణసంధి (synapse) అంటారు. నాడీ ప్రచోదనం: శరీరంలో సాగే వేగవంతమైన నాడీ సమాచార ప్రసారం నాడీ ప్రచోదనం. ఇది విద్యుత్ రసాయన ప్రవాహం. ఇది ఒక నాడీ కణంలో విద్యుత్ రూపంలో ప్రవహిస్తుంది. రెండు నాడీ కణాల మధ్య నాడీ కణ సంధి వద్ద ఒక రసాయన మాధ్యమంతో ముందుకు సాగుతుంది. ఈ విధంగా నాడీ ప్రచోదనంలో ఉపయోగపడే రసాయనాలను నాడీకణ అభివాహక పదార్థాలు లేదా న్యూరో ట్రాన్సమీటర్లు అంటారు. అసిటైల్ కొలిన్, డోపమైన్, సెంటోనిన్ వంటివి ముఖ్యమైన న్యూరో ట్రాన్సమీటర్లు. నాడీవ్యవస్థ: మానవ నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజిస్తారు. అవి.. కేంద్రనాడీ మండలం, పరధీయ నాడీమండలం, స్వయం చోదిత నాడీమండలం. మెదడు, వెన్నుపాములను కలిపి కేంద్రనాడీమండలం అంటారు. కీలక భాగం: మెదడు కీలకమైన భాగం. మెదడు నుంచి సాగే పొడవైన దారం వంటి నిర్మాణం వెన్నుపాము. ఈ రెండింటి చుట్టూ రక్షణ కవచాలుగా మూడు పొరలు ఉంటాయి. వీటిని మెనింజిస్ పొరలు అంటారు. వీటి మధ్య ఉన్న మస్తిష్కమేరు ద్రవం (cerebro spinal fluid) shock absorber గా వ్యవహరిస్తూ మెదడు, వెన్నుపాములను యాంత్రిక అగాధాల నుంచి రక్షిస్తుంది. వీటికి అదనంగా మెదడుకు కపాలం, వెన్నుపాముకు వెన్నెముక రక్షణనిస్తాయి. మస్తిష్కం: మెదడులోని అతిపెద్ద భాగం పూర్వ మెదడులోని ప్రధాన భాగం మస్తిష్కం (cerebrum). ఇది రెండు మస్తిష్క గోళార్థాల రూపంలో ఉంటుంది. దీని ఉపరితలం అంతా గైరీ, సల్సీ పలు ఎత్తుపల్లాలతో కూడిన ముడతలు పడి ఉంటుంది. ఇవి మస్తిష్కం, ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఫలితంగా మస్తిష్కం విధులు బాగా పెరుగుతాయి. ఆలోచన, తెలివి తేటలు, విచక్షణశక్తి, జ్ఞాపకశక్తి సమస్య పరిష్కారం, సాధన, అనుభవం నుంచి నేర్చు కోవడం ప్రేమ, ద్వేషం, బాధ, దుఃఖం, వంటి భావాలను మస్తిష్కం నియంత్రిస్తుంది. అనుమస్తిష్కం: మస్తిష్కం తర్వాత అతి పెద్దభాగం అనుమస్తిష్కం (cerebellum). ఇది శరీర సమతాస్థితి, కండర సంకోచం, కండర సంకోచ వేగం వంటి చర్యలను నియంత్రిస్తుంది. మెదడు దిగువన పాన్‌స, మజ్జాముఖం ఉంటాయి. మెదడు వెన్నుపాముల మధ్య సమాచార మార్పిడికి పాన్‌స ఉపకరిస్తుంది. శ్వాస, మింగడం వంటి అనియంత్రిత చర్యలను ఇది నియంత్రిస్తుంది. ఇది చాలా సున్నితమైన భాగం. దీనికి బలమైన గాయమైతే శ్వాస ఆగి వ్యక్తి వెంటనే మరణించే ప్రమాదం ఉంది. మెదడులోని మరో ముఖ్యమైన భాగం అథాపర్వంకం (Hyphothalamus). ఆకలి, దప్పిక, నిద్ర, మెలకువ, లైంగిక వాంఛ, శరీర ఉష్ణోగ్రతలను ఇది నియంత్రిస్తుంది. వెన్నుపాము: వెన్నుపాము మెదడు నుంచి ఒక దారంలాగా కొనసాగుతుంది. ఇది వెన్నెముకలో సంరక్షింపబడుతుంది. ఇది ఒక సెంటీమీటర్ వ్యాసంలో ఉంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్యల్లో పాల్గొంటుంది. వేడి తగిలినపుడు లేదా ఏదైనా గుచ్చుకున్నపుడు ఉన్నట్టుండి స్పందించే చర్యనే అసంక ల్పిత ప్రతీకారచర్య అంటారు. ఇందులో మెదడు ప్రమే యం ఉండదు. పరధీయ నాడీ మండలం : మెదడు, వెన్నుపాము నుంచి సాగే నాడులను కలిపి పరధీయ నాడీ మండలం అంటారు. మెదడు నుంచి సాగే నాడులను కపాల నాడులు (Cranial nerves) అంటారు. ఇవి 12 జతలు. వెన్నుపాము నుంచి సాగే నాడులు.. వెన్నునాడులు. ఇవి 31 జతలు. విధుల ఆధారంగా వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించవచ్చు. జ్ఞానేంద్రియాల నుంచి మెదడు వెన్నుపాములకు నాడీ సమాచారాన్ని ప్రసారం చేసేవి జ్ఞాననాడులు (sensory nerves). మెదడు, వెన్నుపాముల నుంచి శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న అస్థికండరాలకు ప్రధానంగా సమాచారాన్ని అందించేవి చాలక నాడులు (Motor nerves). ఈ రెండు రకాల చర్యలను ప్రదర్శించే నాడులు మిశ్రమనాడులు. వెన్నునాడులన్నీ మిశ్రమ నాడులే. స్వయంచోదిత నాడీ మండలం: శరీర అంతర్భాగాలు అంతటా ఆవరించి ఉన్న ప్రత్యేక నాడీ కేంద్రాల వంటి నిర్మాణం స్వయంచోదిత నాడీమండలం. ఇది మెదడు, వెన్నుపాములకు స్వతంత్రంగా పని చేస్తుంది. రెండు రకాలుగా ఉంటుంది. అవి.. సహానుభ్యత నాడీవ్యవస్థ, పరసహానుభ్యత నాడీవ్యవస్థ. పేగు, జీర్ణాశయం, మూత్రపిండాలు, పిత్తాశయం సంకోచాన్ని సహానుభ్యత నాడీవ్యవస్థ ప్రేరేపిస్తుంది. వీటి సడలికను పరసహానుభ్యత నాడీ వ్యవస్థ నిర్వహిస్తుంది. గుండెలయ, లాలాజల స్రావం, రక్తనాళాల సంకోచ సడలికలను కూడా స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రిస్తుంది. మాదిరి ప్రశ్నలు 1.పార్కిన్సన్స్ వ్యాధి ఏ న్యూరోట్రాన్స్మీటర్ లోపం ద్వారా సంభవిస్తుంది? ఎ) అసిటైల్ కొలిన్ బి) డోపమైన్ సి) సెరటోనిన్ డి) హిస్టమైన్ 2.మెనింజస్ పొరలో బాహ్యంగా ఉండేవి? ఎ) డయామేటర్ బి) అరక్నాయిడ్ సి) డ్యూరామేటర్ డి) ఏదీకాదు 3.మెనింజస్ పొరల వాపు, మెనింజై టిస్ వ్యాధి కారకం? ఎ) బ్యాక్టీరియం బి) వైరస్ సి) శిలీంద్రం డి) అన్నీ 4.మెదడులో థర్మోస్టాట్‌గా వ్యవహరించే భాగం? ఎ) అథాపర్యంకం బి) మస్తిష్కం సి) అనుమస్తిష్కం డి) మజ్జముఖం 5.ప్రపంచ అల్జీమర్స్ దినం? ఎ) సెప్టెంబర్ 12 బి) సెప్టెంబర్ 21 సి) డిసెంబర్ 21 డి) డిసెంబర్ 12 6.మస్తిష్క గోళార్థాలను అనుసంధానించే నాడీ దండం? ఎ) కార్పస్ కాల్లోజం బి) కార్పస్ ఆల్బికన్స్ సి) కార్పస్ స్ట్రయేట్ డి) కార్పస్ ల్యూటియం 7.అనుమస్తిష్కం బరువు మెదడులో ఏ మేరకు ఉంటుంది? ఎ) 50 శాతం బి) 30 శాతం సి) 20 శాతం డి) 10 శాతం 8.అంథాపర్యంకం బరువు? ఎ) 100 గ్రాములు బి) 4 గ్రాములు సి) 1 గ్రాము డి) 50 గ్రాములు 9.మెదడు విద్యుత్ తీవ్రతను కొలిచే పరికరం? ఎ) ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ బి) ఎలక్ట్రో ఎన్సిఫలోగ్రాఫ్ సి) స్ట్రోమర్ డి) స్ఫిగ్మామానోమీటరు 10.జపనీస్ ఎన్సిఫలైటిస్ వ్యాధి ఏ కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఎ) అనాఫిలస్ దోమ బి) ఎడిస్ దోమ సి) క్యూలెక్స్ దోమ డి) ఏదీకాదు 11. మెదడు బరువు సాధారణంగా? ఎ) 250 గ్రాములు బి) 1350గ్రాములు సి) 900 గ్రాములు డి) 600 గ్రాములు 12.ఎలక్ట్రోఎన్సిఫలోగ్రాఫ్లో మొత్తం ఎన్ని తరంగాల్లో మెదడు విద్యుత్ తీవ్రతను కొలుస్తారు? ఎ) 4 బి) 3 సి) 2 డి) 1 13.మస్తిష్క మేరు రసంలో అధిక మోతాదులో ఉండే ఖనిజం? ఎ) సోడియం బి) పొటాషియం సి) క్లోరిన్ డి) కాల్షియం 14.నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఎ) పుణే బి) గుర్గావ్ సి) నాసిక్ డి) ముంబై 15.ప్రపంచ పార్కిన్సన్స్ డే? ఎ) జనవరి 22 బి) ఏప్రిల్ 11 సి) మే 10 డి) జూన్ 21 16.మెదడు క్షిణత వ్యాధి పేరు? ఎ) కురు బి) స్క్రేపీ సి) మ్యాడ్ కౌ వ్యాధి డి) అన్నీ 17.శరీర వివిధ భాగల కదలికల మధ్య సమన్వయం లేని స్థితి? ఎ) అస్థీనియ బి) అటాక్సియ సి) డిమెన్షియ డి) ఏదీకాదు 18.అల్జీమర్స్ వ్యాధి గ్రస్తుల ప్రధాన లక్షణం? ఎ) మతిమరుపు బి) మూర్చ సి) గుండెనొప్పి డి) కండరనొప్పి 19.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్ ఎక్కడ ఉంది? ఎ) న్యూఢిల్లీ బి) హైదరాబాద్ సి) బెంగళూరు డి) ముంబై 20.హైపోథలామస్ ద్వారా ఏ గ్రంధి నియంత్రణ జరుగుతుంది? ఎ) కాలేయం బి) పీయూష సి) లాలాజల గ్రంధి డి) క్లోమం