
ప్రయాగ్‌రాజ్: అయోధ్యలో రామమందిర నిర్మాణం 2025లోపు పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మందిర నిర్మాణం ప్రారంభించాలన్నారు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లుగానే మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుందని ప్రధాని మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాక భయ్యాజీ పైవిధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment