bhayyaji joshi
-
పౌరసత్వ బిల్లు ఆమోదంపై స్పందించిన ఆరెస్సెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ.. బీజేపీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మతపరమైన వేధింపులు, హింసను ఎదుర్కొని భారత్‌కు వచ్చే హిందువులను చొరబాటుదారులుగా కాకుండా శరణార్థిగా గుర్తించాలని ఆరెస్సెస్ ఎప్పుడూ ఆకాంక్షించేదని అన్నారు. దేశ విభజన జరిగినప్పుడు.. మతపరమైన ప్రాతిపదికన విభజన జరగాలనే డిమాండ్ ఉందని, అయితే భారతదేశానికి 'మతతత్వ దేశంగా' ఏర్పాటు చేసే ఆలోచన అప్పట్లో లేదన్నారు. కానీ, చివరకు దేశం ఈ సమస్యపైనే విభజించబడిందని పేర్కొన్నారు. మన నాయకులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారని అన్నారు. మతపరమైన కారణాల వల్ల విభజన జరగకపోతే, ఆ తరువాత చాలా ఉదంతాలు చోటుచేసుకొనేవి కాదని ఈ సందర్భంగా ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి జోషి తెలిపారు. नागरिकता संशोधन कानून का प्रस्ताव लोकसभा और राज्यसभा में रखा गया और वह बहुमत से पारित हुआ। इस पहल के लिए, इस साहसिक कदम के लिए, हम केंद्र सरकार का और विशेषतः प्रधानमंत्री और गृहमंत्री जी का हृदय से अभिनंदन करते हैं, उनको धन्यवाद देते हैं। - सरकार्यवाहhttps://t.co/UfcVpZLDID pic.twitter.com/dUgs9Kvu12 — RSS (@RSSorg) December 12, 2019 ‘మైనార్టీలకు ఎటువంటి అన్యాయం చేయబోమని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన జనాభా లెక్కలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ తగ్గుతున్న మైనార్టీ జనాభాను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తులు ఎక్కడికి వలస వెళ్లారనే సందేహం తలెత్తుతుంది. అక్కడి మైనారిటీలో చాలామంది భారతదేశానికి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే భారత్‌లో వారికి సంపూర్ణ భద్రతతో పాటు రక్షణ’ లభించడమని అని భయ్యాజీ అన్నారు. అయితే చట్టంలోని లొసుగుల కారణంగా వారు ఏళ్ల తరబడి భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. వేధింపులకు గురై వచ్చిన వారిని 'చొరబాటుదారులు' కాక శరణార్థులు అని పిలిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల నుంచి వస్తున్న మైనారిటీలకు పౌరసత్వ సవరణ బిల్లుతో భారత పౌరులుగా మారి.. దేశంలో ఆత్మ గౌరవంతో పాటు పౌర హక్కుల ప్రయోజనాలను పొందుతారని ఆనంద పడుతున్నాను. ఇక వారి శరణార్థి జీవితం ముగింపు పలకనుంది అన్నారు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదని, ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమిత్ షా స్పష్టం చేశారని అన్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లుపై వస్తున్న వదంతుల కారణంగా అట్టుడుకుతున్నాయని.. అక్కడి ప్రజల సందేహాలను తీర్చడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందని జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో శరణార్థులు ప్రశాంతంగా జీవిస్తారని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో పౌరసత్వ చట్టంపై అవగాహన కార్యక్రమాలు న్యూఢిల్లీ: వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లు చట్టాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పౌరసత్వ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యేరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. పౌరసత్వ సవరణ బిల్లుతో సుమారు 2 కోట్ల మంది శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే.. శనివారం నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మత ఘర్షనలు, హింస కారణంగా డిసెంబరు 31, 2014కు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులను అక్రమ చొరబాటుదారులుగా ఉన్నవారిని ఈ మేరకు భారతీయపౌరులుగా గుర్తించబడతారు. -
2025లోపు రామమందిరం: భయ్యాజీ
ప్రయాగ్‌రాజ్: అయోధ్యలో రామమందిర నిర్మాణం 2025లోపు పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మందిర నిర్మాణం ప్రారంభించాలన్నారు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లుగానే మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుందని ప్రధాని మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాక భయ్యాజీ పైవిధంగా స్పందించారు. -
‘అయోధ్య’ కోసం ఉద్యమానికి సిద్ధం
ఉత్తాన్(మహారాష్ట్ర): అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అవసరమైతే ఉద్యమ బాటపడతామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) హెచ్చరించింది. అయోధ్య కేసు కన్నా తమకు ఇతర ప్రాధమ్యాలున్నాయన్న సుప్రీంకోర్టు ప్రకటనను హిందువులు అవమానంగా భావించారని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందిర నిర్మాణానికి అన్ని మార్గాలు మూసుకుపోతే ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో కేంద్రంపై తాము ఒత్తిడి పెంచడంలేదని, రాజ్యాంగం, చట్టాలను గౌరవిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు అంటే తమకు గౌరవం ఉందని, హిందువుల సెంటిమెంట్లను కూడా కోర్టు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ‘అయోద్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ సాగుతోంది. అక్టోబర్ 29న జరిగిన విచారణలో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడుతుందని భావించారు. కానీ సుప్రీం తీర్పు అందుకు విరుద్ధంగా ఉండటంతో వారు ఆవేదన చెందుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. శబరిమల వివాదంపై స్పందిస్తూ.. మహిళల పట్ల తమకెలాంటి వివక్ష లేదని, కానీ ఆలయ నియమాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశానికి తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ అభిప్రాయపడ్డారు. మరి ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు కదా.. రామ మందిరం కోసం ఉద్యమిస్తామన్న ఆరెస్సెస్ వ్యాఖ్యలను శివసేన ఎద్దేవా చేసింది. ఇప్పుడు కేంద్రం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందని, ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు కదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయోధ్య తీర్పుపై నిరసన మాత్రమే వ్యక్తం చేస్తామని చెప్పిన ఆరెస్సెస్ ఇప్పుడు హడావుడిగా ఉద్యమం చేస్తామని ప్రకటిస్తోందని హేళన చేసింది. -
వందేమాతరమే నిజమైన జాతీయ గీతం: ఆర్ఎస్ఎస్
ముంబై: రాజ్యాంగం గుర్తించిన ‘జనగణ మన’ గీతం కంటే వందేమాతరం గీతమే నిజమైన జాతీయ గీతమని ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భయ్యాజి జోషి వ్యాఖ్యానించారు. శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘జనగణమన’ను గౌరవించాల్సిందేనని, అయితే, నిజమైన అర్థంలో వందేమాతరమే జాతీయ గీతమని ఎవరైనా ఒప్పుకుంటారన్నారు. వందేమాతరం గీతం జాతి వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుందన్నారు. రెండు గీతాలూ గౌరవప్రదమైనవేనని ముక్తాయించారు. అలాగే, భారతీయులు తరతరాలుగా కాషాయ జెండాను భారతీయ సంస్కృతికి ప్రతీకగా గౌరవిస్తూ, అభిమానిస్తున్నారని, అదే సమయంలో మూడు రంగుల జెండాను జాతీయ పతాకంగా 1947లో రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిందని, అందువల్ల ఆ రెండు జండాలనూ గౌరవించాలన్నారు. -
అసలైన జాతీయగీతం.. వందేమాతరం
'భారత్ మాతాకీ జై' నినాదం తాలూకు వివాదం ఇంకా చల్లారక ముందే మరో వివాదం మొదలైంది. అసలైన జాతీయగీతం జనగణమణ కాదని, వందేమాతరమే అసలైన జాతీయ గీతమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. ప్రస్తుతం జనగణమణ మన జాతీయ గీతమని, అందువల్ల దాన్ని గౌరవించాల్సిందేనని, అయితే సరైన అర్థం తీసుకుంటే వందేమాతరమే మన జాతీయ గీతం కావాలని ఆయన అన్నారు. ముంబైలో దీన దయాళ్ ఉపాధ్యాయ రీచ్ సంస్థలో మాట్లాడుతూ ఆయనీ విషయం తెలిపారు. అయితే రాజ్యాంగం ప్రకారం జనగణమణ ఉంది కాబట్టి దాన్నే మనం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. జనగణమణ ఎప్పుడో రాశారని, కానీ అందులో అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారని భయ్యాజీ జోషి అన్నారు. వందేమాతరంలో మాత్రం దేశ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారని చెప్పారు. ఈ రెండింటి మధ్య తేడా ఇదేనని, రెండింటినీ గౌరవించాల్సిందేనని ఆయన తెలిపారు. వందే మాతరం అంటే.. భరతమాతకు వందనం అని అర్థం. దీన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ రాశారు. ఇది స్వాతంత్ర్య సమరం సమయంలో కీలకపాత్ర పోషించింది. 1950లో దీని మొదటి రెండు పాదాలను కలిపి జాతీయ గేయంగా ప్రకటించారు.