ayodhya temple
-
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
ఇలా.. అన్నింటిలోనూ డబుల్ గేమ్ నిపుణులే..!
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని శ్రీరాముడు మళ్లీ టెంట్ కిందకు వస్తాడు.. ఆలయంపై బుల్డోజర్ పంపుతారు.. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక వ్యాఖ్య. పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఇంత మాట ఎలా అన్నారో అర్దం కాదు. ఈ మాట విన్నప్పుడు ఒక్కసారిగా దేశ ప్రజలంతా ఆశ్చర్యం చెందారు. మోదీనేనా ఇలా మాట్లాడుతుంది.. అని అంతా విస్తుపోయారు. దాంతో మోదీ ఈసారి ఎందుకో తడబడుతున్నారన్న భావన ఏర్పడింది. గత రెండు ఎన్నికలలో మోదీ ఇంత ఘోరంగా మాట్లాడారన్న విమర్శలు రాలేదు. ఈ ఒక్కటే కాదు. కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ సంతోషిస్తుందని, ముస్లింలను అప్పీజ్ చేస్తోందని, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.⇒ అంటే ఈ విమర్శల ద్వారా హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు మోదీ, ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు ప్రయత్నించారు. ఇక్కడ కూడా వారు డబుల్ గేమ్ ఆడారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. గతంలో కర్నాటకలో కూడా అలాగే చేశారు. అయినా అక్కడ ప్రభుత్వాన్ని నిలబెటుకోలేకపోయారు. తెలంగాణలో ఆ పాయింట్ పైన కూడా గట్టి ఉపన్యాసాలు చేశారు. కానీ ఏపీకి వెళ్లేసరికి అక్కడ మళ్లీ టీడీపీ, జనసేనల కూటమితో కలిసి ఉండడంతో, ముస్లిం రిజర్వేషన్ల గురించి ప్రసంగాలలో ప్రస్తావించకపోవడం కూడా అందరూ గమనించారు.⇒ 2014 ఎన్నికల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన వ్యూహాత్మకంగా దేశం అంతటా గుజరాత్లో జరిగిన అబివృద్ది అంటూ టీవీలలో, పత్రికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తద్వారా ఒక ఇమేజీని తెచ్చుకున్నారు. నిజానికి అప్పటికి ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్దిగా కూడా నిర్ణయం కాలేదు. కానీ తన ప్రచార వ్యూహం ద్వారా బీజేపీని కూడా ఆయన ప్రభావితం చేయగలిగారు. దేశ ప్రజలంతా మోదీ అంటే అభివృద్ది అని నమ్మారు. గుజరాత్లో ఆయన బాగా చేశారన్న భావన బాగా బలపడింది. ఆ రోజుల్లో టీవీలలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే జనం నుంచి నిరసన వచ్చేది. నేను లైవ్ షో చేస్తున్నప్పుడు సైతం ఈ అనుభవం చూశాను. ఎక్కడైనా మోదీని ఒక్క మాట అంటే జనం ఊరుకునేవారుకారు. అలాంటిది దశాబ్దం తర్వాత మోదీని లైవ్ షోలలో ఫోన్ చేసి ప్రజలే విమర్శిస్తున్నారు.⇒ అంతమాత్రాన ఆయనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని కాదు. కానీ ఒక నేత ఎలా ఉండాలని అనుకుంటారో ఆయన అలా లేరన్న భావన పెరుగుతోందన్నమాట. ప్రత్యేకించి రామాలయంపై బుల్డోజర్ నడుపుతారన్న ఆయన ఆరోపణను ఎవరూ జీర్ణించుకోలేదు. ఆయనను సమర్ధించేవారు సైతం మోదీ అలాంటి విమర్శ చేసి ఉండాల్సింది కాదనే అనుకుంటున్నారు. ప్రధాని మోదీ వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసి, రెండువేల రూపాయల నోట్లు తెచ్చినప్పుడు చాలామందికి అంత ఇష్టం లేదు. దానివల్ల సామాన్యులు చాలా కష్టపడ్డారు. అయినా మోదీ చిత్తశుద్దిని జనం శంకించలేదు. దేశం కోసం, నల్లధనం నిర్మూలనకోసమే ఆయన ఇలా చేసి ఉండవచ్చులే అని సర్దుకున్నారు.⇒ జీఎస్టీ వంటివాటిపై కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పట్లో బీజేపీ గెలవదన్న అంచనాకు వచ్చిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు వంటివారు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు. ఆ తరుణంలో జరిగిన పుల్వమా ఘటనతో దేశం మూడ్ మారిపోయింది. పాక్ ఉగ్రవాదులు మన సైనికులు ఉన్న బస్‌ను పేల్చడంతో, మోదీ ధైర్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వైమానిక దళాన్ని పంపించి ఉగ్రవాద శిబిరాలను ద్వంసం చేయించారు. అప్పుడు ఇండియా పైలట్ ఒకరు పాక్‌కు పట్టుబడగా, జాగ్రత్తగా హాండిల్ చేసి ఆయనను భద్రంగా ఇండియాకు తీసుకు రాగలిగారు. దాంతో మోదీపై విశ్వాసం పెరిగింది. మళ్లీ మోదీ వేవ్ వీచి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.⇒ 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని టెర్రరిస్తు అని విమర్శించారు. భార్యను ఏలుకోలేని వ్యక్తి దేశాన్ని ఏమి ఏలతారని అన్నారు, ముస్లింలను బతకనివ్వరని, మంచివాడు కాదని.. అవినీతిపరుడని.. ఇలా ఏవేవో పిచ్చి విమర్శలు చేశారు. దానికి ప్రతిగా చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ మాదిరి వాడుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. లోకేష్ తండ్రి అంటూ చాలా వ్యంగ్యంగా చంద్రబాబు సీనియారిటీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ 2024 నాటికి చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీతో జతకట్టడం ప్రజలందరిని ఆశ్చర్యపరిచింది. మోదీ ఎంతో వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం ఉన్న నేత అని భావిస్తున్న సపోర్టర్లకు ఆయన షాక్ ఇచ్చారని చెప్పాలి.⇒ అలాగే టెర్రరిస్టు అన్న నోటితోనే చంద్రబాబు నాయుడు విశ్వగురు అంటూ మోదీని పొగిడారు. మరి వీళ్లిద్దరూ గతంలో దూషించుకున్న విషయాలను నమ్మిన ప్రజలు ఏమైపోవాలి. వీరు మారితే ప్రజలంతా మారిపోవాలా? అన్న చర్చ జరిగింది. దేశ ప్రధాని అయిన తర్వాత రాజకీయ నేతగా కాకుండా రాజనీతిజ్ఞుడుగా మారాలని అంతా ఆశిస్తారు. గతంలో చేసిన పలువురు ప్రధాన మంత్రులు చాలావరకు అలాగే వ్యవహరించారు. ప్రతిదానిలోను రాజకీయం చూడలేదు. రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేసినా చాలా హుందాగా ఉండేవి. వ్యక్తిగత ఆరోపణలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ మోదీ రాష్ట్రస్థాయి నాయకులతో పోటీపడినట్లుగా, ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి వెనుకాడలేదు.⇒ ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. అవినీతిపరులను జైలులోనే ఉంచుతామని తాజాగా ఆయన చేసిన ప్రకటనను కూడా జనం సీరియస్‌గా తీసుకోవడం లేదు. డిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఒకదానిని తీసుకుని ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను, ఆయన మంత్రులు కొందరిని జైలులో పెట్టి కక్ష తీర్చుకుంటున్నారన్న విమర్శ వచ్చింది. అదే టైమ్‌లో వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసిన వారిని, వందల కోట్ల మోసాలు చేసినవారిని బీజేపీలో చేర్చుకుని వారికి ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇచ్చి, వారికోసం ప్రచారానికి స్వయంగా వెళుతున్న వైనం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. నిజంగా మోదీకి అవినీతిని అంతం చేయాలన్న చిత్తశుద్ది ఉందా అన్న సందేహం కలుగుతుంది.⇒ గతంలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో పలు ఆరోపణలు వచ్చినా జనం పట్టించుకోలేదు. కానీ మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదన్న భావన ప్రజలలో ప్రబలితే అది వారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అసలు మోదీ బుల్డోజర్ విమర్శలు చేయగానే అందరికి గుర్తుకు వచ్చింది యూపీ ముఖ్యమంత్రి యోగి బుల్డోజర్ తోనే ప్రభుత్వం నడిపారన్న వ్యాఖ్య ఉంది. రౌడీ షీటర్లు, అల్లర్లకు పాల్పడిన వారిని చట్టం ప్రకారం శిక్షించడం కాకుండా బుల్డోజర్లతో వారి ఇళ్లు కూల్పించారు. ఇప్పుడు ఆరోపణ మోదీ కాంగ్రెస్ పై చేస్తున్నారు. అంతేకాదు, అయోధ్యలో వివాదాస్పద బాబ్రి మసీదును కూల్చింది కూడా బీజేపీనే అన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మత రాజకీయాలు చేయడంలో బీజేపీదే అగ్రస్థానంగా ఉందన్నది వాస్తవం. అయినా మోదీ కాంగ్రెస్‌పై మతపరమైన ఆరోపణలు చేస్తుంటారు. అలా అని కాంగ్రెస్ ఏదో పత్తిత్తు అనడం లేదు.⇒ తెలంగాణలో ఆర్ఆర్టాక్స్ అంటూ మోదీ విమర్శలు చేశారు. బాగానే ఉంది. మరి గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును అవినీతిపరుడని విమర్శించారు కదా.. ఇప్పుడు ఎలా కలిశారంటే అందుకు జవాబుదొరకదు. చంద్రబాబు పీఎస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు కేంద్రం ప్రకటన చేసింది కదా.. అదేమైంది అని ఎవరైనా అడిగితే బదులు ఉండదు. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చిన విషయంలో ఏమి తేల్చారో ఎవరూ చెప్పరు. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పలు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆయన తమ పార్టీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చి మరీ ఆదరించింది. దీనిని ఏ విధంగా చూడాలి. ఇలా అన్నిటిలొను డబుల్ గేమ్ ఆడుతున్న నేతలలో మోదీ చేరడం ఆయనను అభిమానించేవారికి కాస్త బాధ కలిగించే విషయమే కదా!⇒ మరో విషయం మాట్లాడుకోవాలి. ఒకవైపు బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. ఇంకోవైపు ఆయా రాష్ట్రాలలో రకరకాల ఉచిత వాగ్దానాలు చేస్తుంటారు. ఉదాహరణకు ఒడిషాలో శాసనసభ ఎన్నికలలో ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల ఓచర్ ఇస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిందట. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవులు అధికంగా ఉంటారు కనుక అక్కడ ఉచితంగా జెరుసలెం యాత్రకు హామీ ఇస్తుంటారు.ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రకటించిన మానిఫెస్టోతో తమకు సంబంధం లేదని చెబుతారు. అదే టైమ్ లో వారి మానిఫెస్టోకి మద్దతు ఇస్తున్నామని అంటారు. దీని అర్ధం ఏమిటో ఎవరికి తెలియదు. బీజేపీలో ఇతర పార్టీ అభ్యర్ధులను తీసుకుని టిక్కెట్లు ఇస్తుంటారు. దేశ వ్యాప్తంగా 108 మంది ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం అభ్యర్ధులలో నాలుగో వంతు ఇతర పార్టీలకు చెందినవారే అన్నమాట.⇒ అంతదాకా ఎందుకు ఏపీలో ఆరుగురు అభ్యర్ధులలో ఐదుగురు వేరే పార్టీల నుంచి వచ్చి చేరినవారే. వారిలో కొందరు టీడీపీ కోవర్టులుగా ముద్రపడ్డవారు. తెలంగాణలో సైతం పదిమందికి పైగానే ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితిలో గతంలో కాంగ్రెస్ పార్టీ తీరుకు, ఇప్పుడు బీజేపీ తీరుకు పెద్ద తేడా ఉన్నట్లు అనిపించదు. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పెట్టి ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టారు. ఇప్పుడు ఎమర్జన్సీ లేకుండానే ఏదో కేసులో పెట్టి తమకు గిట్టనివారిని జైలుకు పంపుతున్నారన్న విమర్శలను మోదీ ఎదుర్కుంటున్నారు. అదే టైమ్‌లో బీజేపీలో చేరగానే కేసులు ఏవీ ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నాయన్న బావన ఏర్పడింది. అందుకే ఆయా రాష్ట్రాలలో కొంతమంది తాము ఎన్ని అవినీతి పనులు చేసినా బీజేపీ గొడుగు కిందకు చేరి రక్షణ పొందుతున్నారన్న అబిప్రాయం వ్యాపిస్తోంది.⇒ ఇది మోదీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇలాంటి కారణాల వల్లే ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందా? రాదా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలు పలువురు చెబుతున్నా, అదంతా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ మోదీ వంటి పెద్ద నేత తన ప్రసంగాలలో సంయమనంగా ఉంటేనే మంచిది. దానివల్ల దేశ రాజకీయాలు కొంత ఆరోగ్యకరంగా సాగడానికి అవకాశం ఉంటుంది. విశేషమేమిటంటే శ్రీరాముడిని సొంతం చేసుకుని రాజకీయాలు సాగించాలన్న వ్యూహంలో ఉన్న బీజేపీ రామాలయం ఉన్న అయోధ్యలోనే తీవ్రమైన పోటీ ఎదుర్కుంటోందట.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు -
Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!
ఢిల్లీ: అయోధ్య బాలక్ రామ్ మందిర్‌కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్ రామ్’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది. ఇదీ చదవండి: బాలక్ రామ్ కోసం.. ఈ నిరీక్షణ చూశారా? దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు. ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో నేడే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, ప్రముఖుల సాక్షిగా గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాన వేడుక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. మొత్తం 84 సెకన్లలో గర్భగుడిలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. అపూర్వమైన ఈ వేడుకలో భిన్న మతాలు, సంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. పర్వతాలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు తదితర అన్ని ప్రాంతాలకు చెందినవారు ఒకే చోట ఒక కార్యక్రమంలో పాల్గొంటుండడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో సోమవారం ఉత్సవాలు జరగబోతున్నాయి. నేడు గర్భాలయం లోపల.. ఉదయం 10:00 మంగళ ధ్వనితో శ్రీకారం మధ్యాహ్నం 12.20 ప్రధాన వేడుక ప్రారంభం 12:29:08, 12:30:32 84 సెకన్లలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట 7,000 హాజరుకానున్న అతిథులు ఏకకాలంలో వెలిగించనున్న ప్రమిదలు 10,00,000 అయోధ్యలో నేడు కొలువుదీరనున్న బాలరాముడు అద్భుత వాయిద్యాలతో మంగళ ధ్వని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం ఉదయం 10 గంటలకు ‘మంగళ ధ్వని’తో శ్రీకారం చుడతారు. ఇందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 50కి పైగా అద్భుతమైన వాయిద్యాలను తీసుకొచ్చారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో నిర్వహించే ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందించనుంది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం రామమందిర ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పా ట్లు పూర్తయ్యాయి. ఉదయం ఏడింటి నుంచే ప్రసారాలు మొదలవు తాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రధాన వేడుక జరుగుతుంది. వీటిని డీడీ న్యూస్, డీడీ జాతీయ చానళ్లతోపాటు ప్రైవేట్ చానళ్లలోనూ తిలకించవచ్చు. 84 సెకన్ల శుభ ముహూర్తం గర్భగుడిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు శుభ ముహూర్తం నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు వేడుక ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు మొత్తం 84 సెకన్లలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా 121 మంది రుతి్వక్కులు వేడుక నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్టలో శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణు నామి, వాల్మీకి, వీర శైవ మొదలైన సంప్రదాయాలు భాగం కానున్నాయి. 150 మందికిపైగా సంప్రదాయాల సాధువులు, మహామండలేశ్వర్, మహంత్, నాగాలతో సహా 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సంప్రదాయాల ప్రముఖులు పాల్గొంటారు. ఇలా పర్వతాలు, అడవులు, తీర, ద్వీప వంటి అన్ని ప్రాంతాలకు వారు ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. నగర వీధుల్లో తోరణాలు, కాషాయ జెండాలు అయోధ్య వీధులు కాషాయ రంగు పులుముకున్నాయి. నగరంలో అన్ని వీధులను కాషాయ జెండా, తోరణాలతోపాటు విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. నివాస భవనాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలపైనా పెద్ద సంఖ్యలో జెండాలు దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో వీటి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, నూతన రామాలయ చిత్రాలు, జైశ్రీరామ్ నినాదంతో కూడిన ఈ జెండాలు, తోరణాలు చూపరులకు ఆధ్యాత్మిక భావనలు పంచుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతలు శ్రీరాముడి జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలోని రామ్‌పథ్, ధర్మపథ్‌ను జెండాలతో ప్రత్యేకంగా ఆలంకరించారు. అయోధ్యలో రామచరిత మానస్, రామాయణం పుస్తకాల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీధుల్లో శ్రీరాముడి పాటలు మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రామయ్య పండుగ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుక కేవలం ఆయోధ్యకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాలుపంచుకోబోతున్నారు. సోమవారం ర్యాలీలు, ప్రదర్శనలు, పాదయాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో దాదాపు 300 ప్రాంతాల్లో ప్రాణప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద కూడా స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. పారిస్‌లో హిందూ సమాజం ఆధ్వర్యంలో భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. అలాగే విశ్వ కల్యాణ యజ్ఞం నిర్వహిస్తారు. ఇంగ్లాండ్, ఆ్రస్టేలియా, కెనడా, మారిషస్ సహా 60కిపైగా దేశాల్లో వేడుకలు జరుగుతాయి. ఆయా దేశాల్లోని హిందూ ఆలయాల్లో సాయంత్రం దీపాలు వెలిగించగబోతున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యుత్ దీపాలు, పూలతో ఆలయాలను అందంగా అలకరించారు. అలాగే రామాయణ పారాయణం కోసం ఏర్పాట్లు చేశారు. నేటితో ముగియనున్న ప్రత్యేక క్రతువులు ప్రత్యేక క్రతువుల్లో భాగంగా ఆదివారం ఔషధ జలంతోపాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల తెచి్చన పవిత్ర జలాలతో రామ్‌లల్లాను శుద్ధి చేశారు. రాత్రి జాగరణ అధివస్ జరిపారు. 16న మొదలైన క్రతువులు సోమవారం ముగుస్తాయి. మూడు నిత్య హారతులు ప్రాణప్రతిష్ట అనంతరం భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించడానికి ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. నిత్యం మూడుసార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు జాగరణ్ హారతి, మధ్యాహ్నం 12.00 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఇవ్వనున్నారు. గర్భాలయంలో ఇలా... ► ఉదయం 10 గంటలు: మంగళ ధ్వని ► మధ్యాహ్నం 12.05 నుంచి 12.55: ప్రాణప్రతిష్ట జరుగుతుంది. రామ్‌లల్లా నేత్రాలు తెరిచిన తర్వాత ప్రధాని మోదీ కాటుక దిద్దుతారు. బాలరాముడికి అద్దంలో ప్రతిబింబం చూపిస్తారు. ► మధ్యాహ్నం 12.55: ప్రధాన ఆలయంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తారు. గర్భగుడిలోకి ఆ ఐదుగురు గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. వేడుక పూర్తయిన తర్వాత అతిథులకు రామ్‌లల్లా దర్శనం కల్పిస్తారు. మోదీ పర్యటన ఇలా.. ► ఉదయం 10.25: అయోధ్య విమానాశ్రయం నుంచి ఆలయానికి ► మధ్యాహ్నం 12: గర్భగృహం ఎదుట అతిథులకు పలకరింపు ► మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలు: బహిరంగ సభలో మోదీ ప్రసంగం. ఆరెస్సెస్ చీఫ్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. ► మధ్యాహ్నం 2 గంటలు: శివ మందిరం, కుబేర తిల సందర్శన ► మధ్యాహ్నం 3.30: మోదీ ఢిల్లీకి పయనమవుతారు. 10 లక్షల ప్రమిదల కాంతులు అయోధ్య నగరం సోమవారం సాయంత్రం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 10 లక్షలు ప్రమిదలను ఏకకాలంలో వెలిగించబోతున్నారు. నగరంలోని 100 ఆలయాలు, ప్రధాన ప్రాంతాల్లో ఈ దీపాలు వెలుగులు పంచబోతున్నాయి. ఈ దృశ్యాలు కనులకు పండుగే అనడంలో సందేహం లేదు. భవ్య రామమందిరంతోపాటు రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చౌనీ తదితర ప్రాంతాల్లో ప్రమిదలు వెలిగిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అయోధ్య వాసులు తమ ఇళ్లల్లోనూ దీపాలు వెలిగించబోతున్నారు. దాంతో అయోధ్యాపురం కాంతిమయం కాబోతోంది. రామాలయ ఉపగ్రహ చిత్రాలు విడుదల అయోధ్యలో నూతన రామాలయ ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం విడుదల చేసింది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ అంతరిక్షం నుంచి గత ఏడాది డిసెంబర్ 16న ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. ప్రధాన ఆలయంతోపాటు దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నది వంటివి ఈ చిత్రాల్లో చక్కగా కనిపిస్తున్నాయి. వేదమంత్రాల నడుమ రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట ► మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో కార్యక్రమం ► ఉత్సవానికి ప్రధాన యజమానిగా ప్రధాని నరేంద్ర మోదీ ► ప్రాణప్రతిష్ట అనంతరం ప్రముఖులకు బాలరాముని దర్శనం శుభ ఘడియలు సమీపించాయి. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట వైభవోజ్వల చరిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఐదు శతాబ్దాల వనవాసం వీడి, భవ్య మందిరానికి చేరుకున్న రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కమనీయ వేడుకను కనులారా తిలకించడానికి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లో రామనామ స్మరణతో భక్తులు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 7 వేల మందికిపైగా అతిథులు, ప్రముఖులు హాజరుకాబోతున్నారు. 150 మందికిపైగా ప్రముఖులు ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. సామాన్య భక్తజనం అయోధ్య బాటపట్టారు. కాషాయ పతాకాల రెపరెపలు, రాముడి గీతాలు, భజనలు, స్తోత్రాలు, జైశ్రీరామ్ నినాదాలతో, అందంగా తీర్చిదిద్దిన ప్రధాన భవ్య మందిరంతోపాటు ఇతర ఆలయాలతో అయోధ్య అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. నగరం ఇప్పటికే జనసంద్రంగా మారింది. భక్తుల పూజలు, వేదమంత్రాల ఘోషతో సరయూ నదీ తీరం కనువిందు చేస్తోంది. నగరంలోని చరిత్రాత్మక కట్టడాలను సైతం సుందరంగా అలంకరించారు. దేశమంతా అయోధ్య నామస్మరణతో సర్వం రామమయంగా మారిపోయింది. – సాక్షి, న్యూఢిల్లీ -
Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న వైభవంగా జరగబోతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్ పుణ్యంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను ఆదా చేసుకునే మార్గం ఇక్కడ ఉంది. పన్ను చెల్లింపుదారులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా రామమందిరానికి నగదు విరాళం అందించవచ్చు. 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ ట్రస్ట్‌లో 15 మంది ట్రస్టీలు ఉన్నారు. ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఆలయ పునరుద్ధరణ, మరమ్మతుల నిమిత్తం ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (PAN:AAZTS6197B)ను చారిత్రక ప్రాముఖ్యత, పూజా స్థలంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని, మందిర పునర్నిర్మాణం/మరమ్మతు కోసం ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80G (2)(b) కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవని వెబ్సైట్ పేర్కొంది. -
అయోధ్యకు 1,265 కేజీల లడ్డూ
హైదరాబాద్: కంటోన్మెంట్‌లోని శ్రీరామ్ కేటరర్స్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా లడ్డూ తయారు చేసే భాగ్యం కల్పించారు. ఈ మేరకు లడ్డూ తయారీకి అనుమతులిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర.. శ్రీరామ్ కేటరింగ్‌కు లేఖ పంపింది. ఇంతటి అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని నిర్వాహకులు నాగభూషణం రెడ్డి తెలిపారు. 1,265 కిలోల లడ్డూ.. ఈ నెల 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం తాము 1,265 కిలోల లడ్డూ తయారీ చేయనున్నట్లు శ్రీరామ్ కేటరింగ్ ఎండీ నాగభూషణం రెడ్డి తెలిపారు. సంక్రాంతి రోజున లడ్డూ తయారీ మొదలుపెట్టి 17వ తేదీ కి పూర్తి చేస్తామన్నారు. అదే రోజు ప్రత్యేక పూజల అనంతరం రోడ్డు మార్గాన అయోధ్యకు తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. -
Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయ నిర్మాణంలో హైదరాబాదీలు
తండ్రీ కొడుకుల ఆప్యాయతకు.. అన్నదమ్ముల అనుబంధానికి.. ఆలూమగల అనురాగానికి.. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామ చంద్రుడు. ఆ దైవాంశ సంభూతుడికి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణ వైభవం, కళాత్మకత, నగిషిల రూపకల్పన తదితర అంశాలపై యావత్ దేశంతో పాప్రపంచమంతా చర్చించుకుంటోంది. అయోధ్య రామమందిరం ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు కొందరు నగరవాసులు. ప్రధానంగా అయోధ్య రామమందిర ద్వారాల రూపకల్పన చేసే అరుదైన అవకాశం నగరంలోని బోయిన్‌పల్లికి చెందిన అనురాధ టింబర్స్కు దక్కింది. శ్రీరాముని పాదుకల తయారీ కూడా నగరం వేదికగానే జరగడం విశేషం. రామ మందిర అక్షింతలను ప్రతి ఇంటికీ చేర్చడం వంటి పలు కార్యక్రమాల్లోనూ నగరం తన ప్రత్యేకతను చాటుకుంది. అయోధ్య వేదికగా 1990, 1992లలో చేపట్టిన పరిక్రమలో సైతం ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో కరసేవకులు పాల్గొన్నారు. ఆనాటి నుంచే కొనసాగుతున్న అయోధ్యతో సంబంధం ప్రస్తుత రామ మందిర నిర్మాణంలోనూ భాగ్యనగరం తన పాత్ర పోషించింది. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం. గతంలోనే సుప్రసిద్ధ అనంత శేష శయన మహా విష్ణు కళాఖండాన్ని సృష్టించిన అనురాధ టింబర్స్ ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర ద్వారాల రూపకల్పన చేపట్టారు. స్తపతి కుమారస్వామి రమేశ్ ఆధ్వర్యంలో 60 మంది కళాకారులు ఆరు నెలలుగా శ్రమిస్తూ అయోధ్య రామమందిర ద్వారాలను రూపొందిస్తున్నారు. గతంలో యాదాద్రి, రామేశ్వరం వంటి ఆలయాలకు ప్రధాన ద్వారాలను అనురాధ టింబర్స్ రూపొందించింది. ఇంతటి అరుదైన ఘనత సాధించిన అనురాధ టింబర్స్ నిర్వాహకులు శరత్‌బాబు, కిరణ్ కుమార్‌లను సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్వయంగా వచ్చి అభినందించడం గమనార్హం. పరిక్రమ కోసం ప్రాణాలే పణంగా.. 1990లో అయోధ్యలో తలపెట్టిన మొదటి పరిక్రమలో ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పాల్గొన్నాం. దీని కోసం నగరం నుంచి ఆలె నరేంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందం పాల్గొంది. పరిక్రమ తేదీ కన్నా ముందే అయోధ్యకు చేరుకోవాలని రైలులో ప్రయాణిస్తున్న మమ్మల్ని మధ్యప్రదేశ్‌లో ఆపేశారు. అక్కడి నుంచి వారణాసికి మళ్లీ ప్రయాణించాం. కరసేవకుల సమాచారం ముందే తెలుసుకుని అక్కడ కూడా అడ్డుకోవడంతో నేపాల్ సరిహద్దుల్లోని అడవుల్లో తలదాచుకున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా లాఠీచార్జ్‌లు, ఫైరింగ్‌లు, వాటర్ ఫైరింగ్‌లను ఎదుర్కొన్నాం. ఒకానొక సమయంలో అరెస్టు చేసి లక్నో జైలులో నిర్బంధించారు. అక్కడి నుంచి తప్పించుకున్న నన్ను మళ్లీ అరెస్టు చేసి వారణాసి నైనీ జైలులోనూ (సుభాష్ చంద్రబోస్‌ను ఉంచిన కారాగారం) నిర్బంధించారు. నేను 30 ఏళ్ల వయసులో మా పోరాటం ఇప్పుడు సఫలీకృతం కావడం మహదానందం. – నాయిని బుచ్చి రెడ్డి, అప్పటి కరసేవకుడు మాది సాంకేతిక సహకారం మాత్రమే.. రామాలయ ప్రధాన ద్వారాల రూపకల్పనలో తాము సాంకేతిక సహకారం మాత్రమే అందిస్తున్నాం. అయోధ్య ట్రస్టు మార్గదర్శకత్వంలో టాటా కన్సలి్టంగ్ ఇంజినీరింగ్, ఎల్అండ్టీ సంస్థల సమన్వయంతో కలపతో చేసిన తలుపుల పనుల్లో భాగస్వాములమయ్యాం. తమిళనాడులోని మహాబలిపురం ప్రాంతానికి చెందిన స్తపతి కుమార స్వామి రమేశ్ బృందం ఆధ్వర్యంలో ఆరు నెలలుగా అయోధ్య ఆలయ ప్రాంగణంలోనే తలుపుల తయారీ చేయిస్తున్నాం. తొలుత 18 ప్రధాన ద్వారాలకు తలుపులు తయారు చేశాం. అనంతరం మరో 100కు పైగా అంతర్గత ద్వారాలకూ తలుపులు రూపొందిస్తుం. – శరత్ బాబు, అనూరాధ టింబర్స్ నిర్వాహకులు రఘురాముడి పాదుకల తయారీలో.. ►సాధారణ ఇత్తడి బిందెలు తయారు చేసే పిట్లంపల్లి రామలింగాచారి నిబద్ధతతో కూడిన శిల్పిగా మారి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని పాదుకలను తయారు చేసే అవకాశాన్ని పొందారు. అయోద్య శ్రీరాముని పాదుకలు 12 కిలోల 600 గ్రాముల పంచలోహాలతో తీర్చిదిద్దారు. వాటిపై బంగారు తాపడం చేశారు. నిత్యం నిగనిగలాడేలా పాదుకలపై శంకు, చక్రం, శ్రీరాముని బాణం, దేవాలయంపై ఉండే జెండా వంటివి ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒక్కో పాదుక 6.3 కిలోలు ఉండేలా తయారు చేశారు. 12 తులాలకు పైగా బంగారు తాపడం చేశారు. వందేళ్లకు పైగా పాదుకలు చెక్కు చెదరకుండా తయారు చేయడంలో రామలింగాచారి సఫలీకృతుడయ్యారు. 1987లో బెంగళూరులోని రీజినల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్లో రెండేళ్లు లోహ శిల్ప విద్యలో పట్టా అందుకున్న ఆయన.. 1993లో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని హస్మత్‌పేటలో శ్రీ మది్వరాట్ కళా కుటీర్‌ను ఏర్పాటు చేసుకుని లోహ శిల్పాల తయారీలో నిమగ్నమయ్యారు. ► అద్భుతమైన కళా నైపుణ్యంతో దేవతా మూర్తులు, గాలి గోపురాలు, కంఠాభరణాలు, నాగాభరణాలు, మండపాల నిర్మాణాలు రూపొందించడంలో నిష్ణాతులుగా మారారు. రామలింగాచారి పనితనం తెలుసుకుని భాగ్యనగర సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చర్ల శ్రీనివాస శాస్త్రి అయోధ్య రామాలయంలోని గుర్భగుడిలో ఏర్పాటు చేసే శ్రీరాముని పాదుకలను తయారీ పనులను ఆయనకు ప్రత్యేకంగా అప్పగించారు. 25 రోజుల పాటు నియమ నిష్టలతో ఎంతో శ్రమకోర్చి పాదుకలను తయారు చేశారు రామలింగాచారి. అయోధ్య శ్రీ రాముని పాదుకలతో వెలుగులోకి వచి్చన రామలింగాచారికి అమెరికాలో నిర్మిస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి మూల విరాట్లు, కలశాలు, మకర తోరణాలు, గాలిగోపురాలు వంటివి రూపొందించే అవకాశం వచి్చంది. విశ్వకర్మలకూ నంది అవార్డులివ్వాలి.. ఉగాదిని పురస్కరించుకుని సినిమా వాళ్లకు ఇస్తున్న నంది అవార్డుల మాదిరిగానే శిల్పాలను సృష్టిస్తున్న విశ్వకర్మలకు అవార్డులను అందిస్తే మరింత బాధ్యతగా శిల్పాలను సృష్టించగలుగుతారు. కళాకారుల శ్రమను గుర్తించి మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. – రామలింగాచారి, లోహశిల్పి ఇదో మహదావకాశం.. చారిత్రక అయోధ్య రామాలయ ద్వారాల రూపకల్పన అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. మహాబలిపురంలోని ప్రభుత్వ కళాశాలలో ఎనిమిదేళ్ల పాటు శిల్పశా్రస్తాన్ని నేర్చుకుని 2000 సంవత్సరంలో డిగ్రీ పొందా. 20 ఏళ్లుగా అనురాధ టింబర్స్తో కలిసి పనిచేస్తున్నా. 2005లో రామేశ్వరం దేవాలయ ద్వారాలు రూపొందించాం. 2008లో కాంచీపురం ఏకాంబేశ్వరన్ టెంపుల్ రథాన్ని తయారు చేశాం. 2015లో శ్రీరంగం దేవాలయంలో కలప పనులు చేశాం. 2019లో మలేసియాలోని మురుగన్ టెంపుల్ బంగారు రథం, 2020లో లండన్‌లోని ధనలక్ష్మి దేవాలయ బంగారు రథం, 2021లో జర్మనీలోని గణేశ్ దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కలప పనులు చేశాం. – స్తపతి కుమార స్వామి రమేశ్ -
అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాల రాముడి విగ్రహం
-
ముంబయి నుంచి అయోధ్యకు ముస్లిం మహిళ పాదయాత్ర
లక్నో: రాముడు ఆదర్శపురుషుడు. సర్వవ్యాప్తమైన రాముని జీవన విధానం ఆచరణీయం. రామునిపై విశ్వాసం అందరిసొంతం అని నిరూపిస్తోంది ఓ ముస్లిం మహిళ. అయోధ్య రామున్ని దర్శించుకోవడానికి ముంబయి నుంచి కాలినడకన బయలు దేరింది. ఆమె సహచరులతో కలిసి ఏకంగా 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణిస్తోంది. ముంబయికి చెందిన షబ్నమ్‌కు రాముడంటే ఎంతో ఇష్టం. అయోధ్యలో కొలువుదీరనున్న రామున్ని దర్శించుకోవడానికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. ముస్లిం మహిళను అయినప్పటికీ రామున్ని పూజించడానికి అచంచలమైన భక్తి ఒక్కటే అర్హతని అంటోంది. రామున్ని పూజించడానికి హిందువు కానవసరం లేదని పేర్కొంది. మంచి మనిషిగా జీవించడమే ముఖ్యమని చెబుతోంది. ప్రస్తుతం యాత్రలో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. సుధీర్ఘ యాత్రలో అలసట వచ్చినప్పటికీ రామునిపై ఉన్న భక్తే తమ యాత్రను కొనసాగిస్తోందని షబ్నమ్ తెలిపింది. రాముని ఆరాధన ఏ ప్రత్యేక మతం లేదా ప్రాంతానికి పరిమితం కాదని, అది సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నమ్ గట్టిగా నమ్ముతోంది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడనే ప్రేరణ కలిగించడానికే యాత్రను చెపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరనే అపోహను దూరం చేస్తానంటోంది. యాత్రలో వీరిని కలిసిన పలువురు ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అయితే.. షబ్నమ్ పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నప్పటికీ.. షబ్నమ్ తన ప్రయాణాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. విశేష స్పందనలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని తెలిపింది. రాముని జెండాను పట్టుకుని నడుస్తున్నప్పుడు ముస్లింలతో సహా అనేక మంది 'జై శ్రీరామ్' అని నినదించిన ఆనంద క్షణాలను అనుభవించానని షబ్నమ్ చెబుతోంది. -
2023 చివరి నాటికి అయోధ్య రామాలయం పూర్తి!
పలంపూర్/అన్నీ(యూపీ): అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు సగానికిపైగా పూర్తి అయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణ క్రతువు మొదలైందని పేర్కొన్నారు యోగి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వంలో జరుగుతున్న చారిత్రక పనులుగా అభివర్ణించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారసభలో యూపీ సీఎం యోగి పాల్గొని ప్రసంగించారు. ‘హిమాచల్ ప్రజల గుండె ధైర్యం గొప్పది. వందలాది మంది యువత భారత సైన్యంలో చేరుతోంది. మన శత్రువు ఇప్పుడు మనవైపు చూసేందుకు కూడా భయపడుతున్నాడు’ అని సభలో వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 50వ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం -
అట్టహాసంగా అయోధ్యలో దీపావళి వేడుకలు... హాజరుకానున్న మోదీ
న్యూఢిల్లీ: దీపావళి వేడుకలో యావత్ భారత్ ఆందహేళిలో మునిగితేలే ఒక రోజు ముందు కూడా దీపోత్సవ వేడుకలు పలు చోట్ల జరుగుతుంటాయి. ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ఒక రోజుముందు అనగా... అదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్యలోని దీపోత్సవ వేడుకల సన్నహాలను పరిశీలించేందుకు బుధవారం పవిత్ర నగరాన్ని సందర్శించనున్నారని సమాచారం. ఆయన రామాలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాని మోదీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రాని పరిశీలిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి కొత్తగా నిర్మిస్తున్న భారీ రామాలయాన్ని సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. షెడ్యూల్‌ప్రకారం ఆయన రామలీలా పాత్రలను వేసేవారిని స్వాగతించేందుకు రామ్ కథా పార్కును కూడా సందర్శించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమీక్షా సమావేశం ముగియడంతో ట్రస్ట్ సభ్యలు మీడియాతో మాట్లాడుతూ...రామమందిర నిర్మాణ పనులు దాదాపు 50శాతం జరిగాయని పేర్కొన్నారు. అలాగే ఆదివారం ప్రారంభమయ్యే మూడు రోజుల దీపోత్సవ వేడుకల్లో రష్యా, మలేషియా, శ్రీలంక, ఫిజీ దేశాలకు చెందిన కళాకారుల రాంలీలా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవడమే గాక ఆవుపేడతో తయారు చేసిన దాదాపు 17 లక్షల మట్టి దీపాలను వెలగించి రికార్డు సృష్టించనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు సరయునది వద్ద గ్రీన్ డిజిటల్ బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్ల తెలిపారు. (చదవండి: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....) -
ఆధ్యాత్మిక దివ్యధామం అయోధ్య
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పునర్నిర్మాణం భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవా నికి, శ్రీరాముని జీవితం బోధించిన మానవీయ విలువల పట్ల మన నిబద్ధతకు ప్రతీక అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయో ధ్య పర్యటన భారతీయ ఆధ్యాత్మిక మూలాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ఏకకాలంలో దర్శింపజేస్తుందని అభిప్రాయ పడ్డారు. శుక్రవారం ఉదయం లక్నో నుంచి ప్రత్యేక రైలులో అయోధ్య చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు రామమందిర నిర్మాణ స్థలాన్ని, రామ్‌లల్లా మందిరాన్ని సందర్శించుకున్నారు. అనంతరం హనుమాన్ గఢి లో, తర్వాత సరయు నదీతీరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారణాసి చేరుకుని, దశాశ్వమేథ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొన్నారు. శనివారం విశ్వనాథుని దర్శించుకోనున్నారు. -
2023 ఆఖరి నుంచి అయోధ్య రాముడి దర్శనం!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారమే వేగంగా సాగుతున్నాయి. 2023 సంవత్సరాంతం నుంచి అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తులను అనుమతించే అవకాశం ఉందని రామమందిరం ట్రస్టు వర్గాలు బుధవారం తెలిపాయి. మొత్తం నిర్మాణం 2025 నాటికి పూర్తవుతుందని వెల్లడించాయి. ప్రధాన ఆలయం మూడు అంతస్తులతో ఉంటుందని, ఐదు మండపాలు ఉంటాయని పేర్కొన్నాయి. రామమందిరం నిర్మాణం, దేవుడి దర్శనం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అంతకంటే ముందే మందిర నిర్మాణం పూర్తయి, దర్శనాలకు అనుమతి లభిస్తే అధికార బీజేపీకి గణనీయంగా లబ్ధి చేకూరడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి మరో ప్రచారాస్త్రం సిద్ధమవుతోందని అంటున్నారు. -
మందిర నిర్మాణానికి మహమ్మద్ విరాళం
మొయినాబాద్ (చేవెళ్ల): అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఓ ముస్లిం యువకుడు విరాళం అందజేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తుజగూడలో ఆదివారం రాత్రి బీజేపీ నాయకులు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖలీమ్ అనే యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.5 వేలు విరాళం అందజేశాడు. దీనిపై బీజేపీ మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విరాళాల సేకరణలో కులమతాలకు అతీతంగా స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.(చదవండి: రూ. కోటి విరాళం ఇచ్చిన గంభీర్) ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాలను సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సామాన్యుల మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు సహా ఇతర రంగాల సెలబ్రిటీలు మందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు. -
అయోధ్య: ఊహించని వ్యక్తి నుంచి విరాళం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు విరాళం అందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఓ నాయకుడు రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష 11 వేల 111 విరాళం ఇవ్వడం గమనార్హం. ఆయనే డిగ్గీ రాజాగా పేరొందిన దిగ్విజయ్ సింగ్. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో మత కలహాలకు వ్యతిరేకం కానీ.. ఆలయ నిర్మాణానికి కాదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ హిందూవుల పార్టీ అని విమర్శించిన డిగ్గీ రాజా ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించడం విశేషం. గతంలో ఆయన ఆలయ నిర్మాణంపై విమర్శలు కూడా చేశారు. అలాంటి వ్యక్తి నుంచి విరాళం రావడం ఆశ్చర్యమేస్తోంది. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ 44 రోజుల పాటు విరాళాల సేకరణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. -
భూమిపూజ : రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించాల్సింది
లక్నో : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ పిలిచి ఉండాల్సిందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఆగస్ట్ 5న జరిగిన మందిర శంకుస్ధాపనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ ఆహ్వానించాల్సిందని, ఆయన హాజరు మంచి సందేశం పంపిఉండేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దళిత సాధువులు ఆసక్తి కనబరిచినా వారిని పూర్తిగా విస్మరించారని మాయావతి ఆరోపించారు. మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరుశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఎస్పీ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ హయాంలో వివిధ కులాలకు చెందిన ప్రముఖ సాధుసంతుల పేర్లతో పలు పథకాలు చేపట్టామని, ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల దృక్పథంతో వాటి పేర్లను మార్చారని విమర్శించారు. పరుశురాముడి విగ్రహం గురించి ఎస్పీ ఇప్పుడు మాట్లాడటం కంటే అధికారంలో ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని నిర్మించాల్సిందని చురకలు వేశారు. ఎస్పీ ప్రతిపాదిత విగ్రహం కంటే అధికంగా పరుశురాముడి భారీ విగ్రహాన్ని అయోధ్యలో నిర్మిస్తామని మాయావతి పేర్కొన్నారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతం ఉన్న బ్రాహ్మణుల ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. చదవండి : అమెరికాలో 'అయోధ్య' సంబరాలు -
మందిర నిర్మాణం : పాక్ విమర్శలకు కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభంపై పాకిస్తాన్ విమర్శలను భారత్ గురువారం తోసిపుచ్చింది. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం పొరుగుదేశం మానుకోవాలని హితవు పలికింది. భారత అంతర్గత విషయాల్లో తలదూర్చడం సరికాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పాక్‌కు చురకలు అంటించారు. భారత వ్యవహారాల్లో పాకిస్తాన్ ప్రకటనలను పరిశీలించామని, తమ అంతర్గత వ్యవహారాల్లో పొరుగుదేశం జోక్యం చేసుకోరాదని, మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆయన పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, తమ దేశంలో మైనారిటీల మతపరమైన హక్కులను నిరాకరిస్తున్న పొరుగుదేశం వైఖరి ఆశ్చర్యం కలిగించకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి : భూమి పూజపై పాక్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా బుధవారం భూమిపూజ అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమం నిర్వహించడంపై పాకిస్తాన్ విమర్శలు కురిపించింది. భారత సుప్రీంకోర్టు వెల్లడించిన లోపభూయిష్ట తీర్పుతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని పాక్ వ్యాఖ్యానించింది. ఇది న్యాయం పట్ల విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా భారత్‌లో ముస్లింలు, వారి ప్రార్ధనా స్ధలాలపై దాడులు పెరుగుతున్న తీరుకు అద్దం పడుతోందని పేర్కొంది. భారత్‌లో మైనారిటీలను అణిచివేసేలా మెజారిటీవాదం ప్రబలుతోందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘ఆయన ప్రేమకు ప్రతిరూపం’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. రాముడు ప్రేమకు, న్యాయానికి ప్రతిరూపమని ప్రస్తుతించారు. రాహుల్ తన ట్వీట్లో ఎక్కడా బీజేపీని ప్రస్తావించలేదు. ‘మర్యాద పురుషోత్తముడైన రాముడు ఉత్తమ మానవ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అతను మన మనస్సు లోతుల్లో ఉన్న మానవత్వానికి ప్రతీక.. ప్రేమను చాటే రాముడు ఎన్నడూ ద్వేషాన్ని వ్యక్తపరచరు. కరుణామయుడైన రాముడిలో ఎప్పుడూ క్రూరత్వం కనిపించదు. న్యాయానికి ప్రతిరూపమైన రాముడు ఎన్నడూ అన్యాయం వ్యక్తీకరించర’ని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా అయోధ్యలో జరిగే భూమిపూజ కార్యక్రమం జాతి ఐక్యతకు సంకేతంగా నిలిచే సాంస్కృతిక సమ్మేళనం కావాలని ఆకాంక్షిస్తూ రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అత్యంత వైభవంగా జరిగిన భూమిపూజ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం లభించలేదు. రామాలయ నిర్మాణం ప్రారంభ సూచకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 40 కిలోల వెండి ఇటుకను అమర్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా దాదాపు 150 మంది పాల్గొన్నారు. చదవండి : డిగ్గీ రాజా సలహా : కాంగ్రెస్‌లో గగ్గోలు -
ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం
-
ఐదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది : యోగి
అయోధ్య : దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరిగింది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేద మంత్రోచ్ఛరణల నడుమ శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. భూమి పూజకు నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ప్రవిత్ర నదీ జలాలతో క్రతువు నిర్వహించారు. అయోధ్యలో భూమిపూజకు సమాంతరంగా.. దేశవ్యాప్తంగా రామాలయాల్లో ప్రార్థనలు, పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నిత్య గోపాల్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. (లైవ్ అప్డేట్స్; అయోధ్యలో భూమిపూజ) ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..'ఐదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది. రామమందిరం భూమి పూజలో పాల్గొనడం మా అదృష్టం. ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా కల సాకారమైంది. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకోబోతుంది. ఎందరో త్యాగాల ఫలితమిది' అంటూ చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దశాబ్ధాల కల నెరవేరిన ఆనందం కనిపిస్తోంది. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. అందరూ ఈ వేదికపై లేకపోవచ్చు.. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిది. రామమందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతాయి. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ద్వేషాలు, పాపాల నుంచి దూరంగా.. సర్వమానవ సమాజం కోసం తమకు తాము తయారుచేసుకోవాలి. విశ్వమానవాళికి మార్గదర్శం చేయదగ్గ భవ్యమైన రామమందిరం రూపుదిద్దుకోబోతుంది' అంటూ మోహన్ భగవత్ వెల్లడించారు.(అద్వాని హాజరు కాకపోవడంపై యోగి ఏమన్నారంటే?) -
అయోధ్య:హాస్య బ్రహ్మా అద్భుతమైన స్కెచ్!
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన నటనతో అందరిని ఎంత నవ్విస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ డైలాగ్ చెప్పినా ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. ఆయనలో నటన మాత్రమే కాదు, ఏ టాఫిక్ గురించి అయినా ధారాళంగా మాట్లాడగలరు. అదేవిధంగా ఆయనలో ఇంకా ఎన్నో అద్భుతమైన కళలు కూడా దాగున్నాయి. పెన్సిల్ స్కెచ్‌లు కూడా ఎంతో చక్కగా గీయగలరు. అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా ఇప్పుడు ఆయన వేసిన ఒక స్కెచ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. శ్రీరాముడు ఆంజనేయుడిని గుండెలకు హత్తుకుంటున్న ఆ సెచ్క్ను ఎంతో అందంగా గీశారు హాస్యబ్రహ్మ. ఆ చిత్రాన్ని చూస్తే ఎవరైనా పులకించిపోవాల్సిందే. Another lovely pencil sketch by Hasya Brahma #Brahmanandam #TheArtandTheArtist pic.twitter.com/kpsB5ot1RF — Shreyas Group (@shreyasgroup) August 5, 2020 -
అయోధ్య రామమందిరం: చరిత్రలో లిఖించదగ్గ రోజు
సాక్షి, విజయవాడ : అయోధ్యలో నేడు రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం సంతోషదాయకమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రతి భారతీయ పౌరుడు కోవిడ్-19 నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. బుధవారం అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ భూమి పూజ నేపథ్యంలో విజయవాడ విశ్వహిందు పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరం నిర్మించటం శుభపరిణామమన్నారు.(అయోధ్య అప్డేట్స్; హనుమాన్ గడీలో ప్రధాని) ‘రామమందిరం నిర్మాణం కోసం 7 సార్లు పోరాటాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం నిర్మాణం కోసం ఈ రోజు భూమి పూజ చేసుకోవటం హర్షించదగ్గ విషయం. 1984లో విశ్వహిందు పరిషత్ రామమందిరం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1992 డిసెంబర్ 6వ తేదీన జరిపిన కర సేవ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది మందిగా కర సేవలో పాల్గొన్నారు. తాత్కాలిక రామమందిరం ఏర్పాటు చేసి బాలరాముడిని అందులో ప్రతిష్టించారు’. అని గోకరాజు గంగరాజు తెలిపారు. (అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు) కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా బీజేపీ శ్రేణులు విజయవాడలో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్సి, స్వీట్లు పంచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారత దేశ ప్రజల చిరకాల వాంఛ అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రాజు అన్నారు. రాముని జన్మ స్థలంలో రామాలయం నిర్మించడం శుభపరిణామమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. భారత సంస్కృతిని విదేశీయులు నాశనం చేశారని, ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి భారతదేశానిదని పేర్కొన్నారు. (అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం.) ‘ప్రపంచానికే భారత్ ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి నేర్పిర్పించిన దేశం. భారతదేశంలో పురాతనమైన దేవాలయాలకు పునర్వైభవం ప్రధాని మోడీ తీసుకువస్తారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్య స్థలాలు నదుల నుంచి మట్టి నీరు తెచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. భరతదేశ చరిత్రలో ఈ రోజు లిఖించ దగ్గ రోజు’. అని శ్రీనివాస్ రాజు అన్నారు. -
అయోధ్య: ‘జాతి ఐక్యతకు ప్రతీక’
జాతి ఐక్యతకు ప్రతీక: మోదీ శతాబ్ధాల నిరీక్షణ నేటితో పూర్తవుతోందని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో భూమి పూజ తర్వాత ఆయన మాట్లాడుతూ.. తమ జీవితకాలంలో ఈ కల సాకారమవుతుందని కోట్లమంది నమ్మలేకపోయారన్నారు. దేశం మొత్తం రామమయమైంది, దేశం మొత్తం భావోద్వేగంలో ఉందని వ్యాఖ్యానించారు. భూమి పూజకు తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం రామమందిరం భూమి పూజలో పాల్గొనడం తమ అదృష్టమని, ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఈ సందర్భంగా అన్నారు. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకోబోతుందని పేర్కొన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిదని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. విశ్వమానవాళికి మార్గదర్శం చేయదగ్గ భవ్యమైన రామమందిరం రూపుదిద్దుకోబోతుందన్నారు. అపురూప ఘట్టం ఆవిష్కృతం దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముగిసింది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేద మంత్రోచ్ఛరణల నడుమ శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. భూమి పూజకు నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ప్రవిత్ర నదీ జలాలతో క్రతువు నిర్వహించారు. దేశం యావత్తు ఆ అపురూప ఘట్టాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించింది. అయోధ్యలో భూమిపూజకు సమాంతరంగా.. దేశవ్యాప్తంగా రామాలయాల్లో ప్రార్థనలు, పూజలు జరిగాయి. శంకుస్థాపన క్రతువులో ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. తర్వాత భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన క్రతువు నిర్వహిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామానంద్ ట్రస్ట్ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా హనుమాన్ గడీని సందర్శించారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేకంగా హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే ఉన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వీరిద్దరూ ఆలయంలో కలియ తిరిగారు. దాదాపు 5 నిమిషాల పాటు అక్కడ గడిపారు. అక్కడి నుంచి రామజన్మ భూమికి పయనమయ్యారు. అయోధ్యకు విచ్చేసిన ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్నారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్లో అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి సుప్రసిద్ధ హనుమన్ ఆలయానికి ఆయన వెళ్లారు. ప్రముఖుల రాక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమా భారతి.. అయోధ్యలో రామజన్మభూమికి చేరుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను స్వయంగాపర్యవేక్షిస్తున్నారు. హిందూ మత పెద్దలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యోగా గురువు బాబా రాందేవ్, స్వామి అవదేశానంద్ గిరి, చిదానంద్ మహరాజ్ తదితరులు రామజన్మభూమికి విచ్చేశారు. సీతమ్మధారలో ప్రత్యేక పూజలు విశాఖపట్నం: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంఖుస్ధాపన సంధర్బంగా విశాఖలోని సీతమ్మధార అభయాంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, చెరువు రామకోటయ్య, ఆర్ ఎస్ ఎస్ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి జనార్ధన్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి తదితరులు ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ రోజు ప్రపంచంలో హిందువులు పండగ జరుపుకునే రోజని.. శతాబ్దాల హిందూ ప్రజల కోరిక నేరవేరుతున్న వేళ అని.. ప్రధాని మోదీ చేతుల మీదగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుపుకుంటుండటం శుభసూచకమన్నారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా రాముడిని కొలుస్తారని, రాముడు మతాలకి అతీతంగా పూజించే దేవుడిగా తెలిపారు. కోఠిలో పండగ వాతావరణం హైదరాబాద్‌లోని కోఠి వీహెచ్‌పీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్యాలయం పరిసర ప్రాంతాలు కాషాయామయం అయ్యాయి. అయోధ్య రామాలయ శంకుస్థాపన సందర్భంగా వీహెచ్‌పీ కార్యాలయంలో రామయజ్ఞం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వీహెచ్‌పీ కార్యాలయలలో శంకుస్థాపన అనంతరం సంబరాలకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగరవేయాలని వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలు దేరారు. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో ప్రధాని మోదీ కనిపించారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. ముందుగా హనుమాన్ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. కోవిడ్–19 ప్రొటోకాల్ పాటించేలా... కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అయోధ్య పట్టణాన్ని అధికారులు అణువణువునా శానిటైజ్ చేశారు. ముఖ్యంగా ప్రముఖులు సందర్శించనున్న ఆలయాలను క్రిమినిరోధక ద్రావణాలతో శుభ్రం చేస్తున్నారు. అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు పెట్టారు. కోవిడ్–19 ప్రొటోకాల్‌ను అందరూ పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శోభయమానంగా అయోధ్య అయోధ్య: రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది. రంగు రంగుల పూల దండలు, కాషాయ తోరణాల అలంకరణలతో అయోధ్య శోభయమానంగా మారింది. అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు. రామ మందిర నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రముఖులు రానుండటంతో భారీగా మొహరించిన భద్రతా బలగాలతో అయోధ్య పట్టణం హడావుడిగా ఉంది. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. కార్యక్రమం జరిగే ప్రాంతానికి ఎవరూ రావద్దని స్థానికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరూ అయోధ్యకు రావద్దని కోరారు. మొత్తం శంకుస్థాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుపుతామని, ప్రజలంతా ఇళ్లలోనే ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని అభ్యర్థించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికల్లో తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. నేడు అయోధ్యలో శ్రీ రామ జన్మభూమిలో భారతీయుల చిరకాల కోరిక అయినటువంటి శ్రీరామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుచున్న సందర్బంగా ప్రతిఒక్కరు ఈ క్రింది కార్యక్రమాలను చేద్దాం..! జై శ్రీరామ్ ! భారత్ మాతా కీ జై !! pic.twitter.com/noWnlXZu3A — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 5, 2020 పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి జన్మస్థలం సరయు నది తీరాన అయోధ్య నగరం లో శ్రీరామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ శ్రీ అయోధ్య రామమందిరం శంఖుస్థాపన శుభాకాంక్షలు . pic.twitter.com/5d7xL012ew — Somu Veerraju (@somuveerraju) August 5, 2020 -
ఆకట్టుకునేలా అయోధ్య రామాలయ నమూనా
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్ధాపన జరగనుండగా ఆలయ నమూనాను అయోధ్య ట్రస్ట్ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. 161 అడుగుల ఎత్తైన మూడంతస్తుల రామ మందిరంగా నమూనాకు రూపకల్పన చేశారు. భారత వాస్తు శిల్పాకళా నైపుణ్యాన్ని చాటేలా ఆలయ డిజైన్ ఆకట్టుకుంటోంది. తొలుత అనుకున్న పరిమాణం కంటే దాదాపు రెట్టింపుగా నూతన నమూనాను అభివృద్ధి చేశారని ఆర్కిటెక్ట్ వెల్లడించారు. భారీ డోమ్‌తో పాటు ఇంటీరియర్స్‌ను ఆకర్షణీయంగా మలిచారు. ఆలయ ఆర్కిటెక్టుల కుటుంబానికి చెందని ఆర్కిటెక్ట్ చంద్రకాత్ సొంపురను 30 ఏళ్ల కిందట రామాలయం డిజైన్ కోసం సంప్రదించారు. ఆయన తండ్రి ప్రభాశంకర్ సొంపుర సోమ్‌నాథ్ ఆలయ డిజైన్‌ను రూపొందించడంతో పాటు ఆలయ పునర్మిర్మాణ పనులను పర్యవేక్షించారు. నగారా పద్ధతిలో రామాలయ ఆర్కిటెక్చర్‌కు తుదిరూపు ఇచ్చినట్టు సొంపుర (77) తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మూడేళ్ల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. ఇక బుధవారం జరిగే మందిర నిర్మాణ భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సహా 200 మంది వరకూ ప్రముఖులు, రామమందిర ఉద్యమ నేతలు పాల్గొంటారు. చదవండి : 'శ్రీరామ్' టాటూ వేయించుకున్న ముస్లిం యువతి -
ఆకట్టుకునేలా అయోధ్య రామాలయ నమూనా