అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న వైభవంగా జరగబోతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్ పుణ్యంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను ఆదా చేసుకునే మార్గం ఇక్కడ ఉంది.
పన్ను చెల్లింపుదారులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా రామమందిరానికి నగదు విరాళం అందించవచ్చు. 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ ట్రస్ట్‌లో 15 మంది ట్రస్టీలు ఉన్నారు.
ట్రస్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. ఆలయ పునరుద్ధరణ, మరమ్మతుల నిమిత్తం ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (PAN:AAZTS6197B)ను చారిత్రక ప్రాముఖ్యత, పూజా స్థలంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని, మందిర పునర్నిర్మాణం/మరమ్మతు కోసం ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80G (2)(b) కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవని వెబ్‌సైట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment