Tax savings
-
పన్ను ఆదా.. చేద్దాం ఇలా!
ఆదాయపన్ను చట్టంలో పన్ను ఆదాకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే ఎంతో ఆదా చేసుకోవచ్చు. అందుకు గతం నుంచి ఉన్న పాత విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఎన్నో సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే పన్ను ఆదా ప్రయోజనాలను గరిష్ట పరిమితి మేరకు పొందగలరు. అందరికీ అన్ని సాధనాలు అనుకూలమని చెప్పలేం. వీటిల్లో పెట్టుబడులకు నిరీ్ణత కాలం పాటు లాకిన్ ఉంటుంది. కొన్నింటితోపాటు రిస్‌్కను కూడా ఆహా్వనించాల్సి వస్తుంది. తమ లక్ష్యాలు, రాబడి ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాలి. ► రాబడులు 5–6 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు జీవిత బీమా పాలసీలు పన్ను ఆదా కోసం తీసుకునేవి కావు. జీవితంలో అన్ని ఆరి్థక లక్ష్యాలకు రక్షణ కలి్పంచే సాధనం జీవిత బీమా. ఆరోగ్య బీమాని సైతం ఆరోగ్య విపత్తుల నుంచి రక్షించే సాధనంగానే చూడాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్ట వశాత్తూ మరణిస్తే, బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం సదరు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలి. కనుక బీమా పాలసీలను ఎప్పుడూ రక్షణ కోణంలోనే చూసి తీసుకోవాలి. పొదుపుతో సంబంధం లేని, టర్మ్ ప్లాన్లు మెరుగైనవి. టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం 60 ఏళ్లలోపు వారు అయితే సెక్షన్ 80డీ కింద గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపును పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి అయితే ఈ పరిమితి రూ.50,000గా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి బీమాతో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.12,000–14,000 ప్రీమియం కింద చెల్లించాలి. అదే వ్యక్తి రూ.50 లక్షల ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.5 లక్షలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీలలో మరణించిన సందర్భాల్లో వచ్చే పరిహారం, కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్‌పై పూర్తిగా పన్ను మిహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపు కోరుకునే వారు ఎండోమెంట్ ప్లాన్లకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించకూడదు. యులిప్ ప్లాన్లలో అయితే వా ర్షిక ప్రీమియానికి కవరేజీ కనీసం 10 రెట్లు అయినా ఉండాలి. ► రాబడులు 7–8 % మధ్య ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు వీటిల్లో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం ఉంది. కానీ, రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తన ఆదాయంలో చూపించి, ఏ శ్లాబులో ఉంటే ఆ ప్రకారం రేటు చెల్లించాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5 శాతం కంటే తక్కువే. కాకపోతే వేగంగా, సులభంగా ఇన్వెస్ట్ చేసుకోగల సౌలభ్యం ఇందులో ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ, ఎన్ఎస్సీలో పెట్టుబడిని ఐదేళ్లకు ముందే ఉపసంహరించుకోవడం కుదరదు. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే దీనికి మినహాయింపు ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎన్‌ఎస్‌సీలోనే కాస్తంత మెరుగ్గా వడ్డీ రేటు 7.7 శాతం ఉంది. ► ప్రస్తుత రాబడి 7.1% ► లాకిన్: 15 ఏళ్లు ఇది రిస్‌్కలేని డెట్ సాధనం. ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేకపోవడం అదనపు ఆకర్షణ. పీపీఎఫ్ పథకం కాల వ్యవధి 15 ఏళ్లు. ఈ పథకంలో ప్రస్తుత రేటు 7.1 శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద ఈ సాధనంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ సెక్షన్ 80సీ కింద పూర్తి పరిమితి (రూ.1.5 లక్షలు) మేరకు ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, రాబడిపైనా పన్ను మినహాయింపు ప్రయోజనం కోసం పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల ఉన్నత విద్యకు దీన్ని పరిశీలించొచ్చు. ఇందులో పాక్షిక ఉపసంహరణలకే అనుమతి ఉంటుంది. ప్రారంభించి ఐదేళ్లు నిండిన తర్వాత ఇందుకు అనుమతిస్తారు. ప్రముఖ బ్యాంక్‌లు, పోస్టాఫీసుల్లో దీన్ని ప్రారంభించొచ్చు ► ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రిస్‌్కలేని రాబడి సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ప్రస్తుతం ఇందులో రాబడి 8.2 శాతంగా ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే రాబడి ఎక్కువ. పెట్టుబడి కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత నుంచి ప్రతి మూడేళ్లకు ఒకసారి చొప్పున కాల వ్యవధి పెంచుకుంటూ వెళ్లొచ్చు. పొడిగించుకునే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. ఒక వ్యక్తి ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను పరిధిలోకే వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఆదాయపన్ను చట్టం కింద వృద్ధులకు ఉంది. అంటే రూ.6.25 లక్షల వరకు పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను మినహాయింపు అయిన రూ.50 వేలలోపే ఉంటుంది. 60 ఏళ్లు నిండిన వారు, ముందస్తు పదవీ విరమణ పొందిన వారు 58 ఏళ్ల తర్వాత ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రక్షణ సిబ్బందికి వయో పరిమితి లేదు. ► గడిచిన ఐదేళ్లలో కనిష్ట రాబడి: 8.16% ► పెట్టుబడులకు లాకిన్: 60 ఏళ్లు వరకు పన్ను ఆదాకు మెరుగైన సాధనాల్లో ఇదీ ఒకటి. ఒకవైపు విశ్రాంత జీవనం కోసం నిధిని సమకూర్చుకూర్చుకుంటూ, మరోవైపు పన్ను ఆదా చేసుకునే ప్రయోజనంతో వస్తుంది. గరిష్టంగా ఒక వ్యక్తి ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.2 లక్షల పెట్టుబడిపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1) కింద రూ.1.5 లక్షలు, 80సీసీడీ(1బి)కింద రూ.50వేలపై పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల గరిష్ట పరిమితి పరిధిలోకే సెక్షన్ 80సీసీడీ (1) కూడా వస్తుంది. దీనికి అదనంగా మరో రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీసీడీ (1బి) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సెక్షన్ 80సీసీడీ (2) కింద కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తే.. ఉద్యోగి వేతనంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో యాక్టివ్ ఆప్షన్ కింద ఈక్విటీలకు గరష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదిలో పెట్టుబడుల కేటాయింపులను (ఈక్విటీ, డెట్, ఏఐఎఫ్) నాలుగు పర్యాయాలు సవరించుకోవచ్చు. పెన్షన్ ఫండ్ మేనేజర్లనూ మార్చుకోవచ్చు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ఆప్షన్ (ఎస్‌డబ్ల్యూపీ/క్రమానుగతంగా ఉపసంహరణ)ను కూడా పీఎఫ్ఆర్డీఏ ప్రవేశపెట్టింది. దీనివల్ల గడువు తీరిన తర్వాత ఒకే విడత కాకుండా, నెలవారీగా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఎన్పీఎస్ ఫండ్స్ మంచి పనితీరు చూపించాయి. ఇక ముందూ ఇదే పనితీరు ఉంటుందని అంచనా. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ ఫండ్స్ అధిక శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తాయి. కనుక రిస్క్ దాదాపు చాలా తక్కువ. ► ఐదేళ్లలో వార్షిక రాబడి 7–14 శాతం ► లాకిన్ పీరియడ్: రిటైర్మెంట్ వరకు బీమా కంపెనీలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కాకపోతే చార్జీలు, సౌలభ్యం, పన్ను ప్రయోజనాల కోణంలో ఎన్పీఎస్ కంటే ఇవి మెరుగైనవి కావు. జీవిత బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లు సాధారణంగా యులిప్‌ల మాదిరి పనిచేస్తాయి. కానీ, ఎన్పీఎస్, యులిప్‌లలో ఉండే పన్ను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, పెన్షన్ ప్లాన్లు అంత ఆకర్షణీయం కాదని చెప్పుకోవచ్చు. పెన్షన్ ప్లాన్లకు సెక్షన్ 80సీసీడీ కింద పన్ను ప్రయోజనం కలి్పంచాలని బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా, అది సాకారం కావడం లేదు. ప్రస్తుతం ఎన్పీఎస్కు ఈ సెక్షన్ కింద అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తున్నారు. ఎన్‌పీఎస్‌లో ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చకపోతే, మరో ఫండ్ మేనేజర్ కిందకు పెట్టుబడులను మార్చుకోవచ్చు. కానీ బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో చివరి వరకు అదే కంపెనీతో కొసాగాల్సి వస్తుంది. యాన్యుటీలపై పన్ను ఎత్తివేస్తే అప్పుడు ఈ ఉత్పత్తి ఆకర్షణీయంగా మారుతుందన్నది నిపుణుల అంచనా. ► రాబడులు: గత ఐదేళ్లలో 7–9 % ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పెట్టుబడులను పూర్తిగా ఈక్విట్లీలోనే పెట్టేస్తాయి. కానీ, రిటైర్మెంట్ ఫండ్స్ అలా కాదు. ఈక్విటీతోపాటు డెట్ సాధనాల్లోనూ కొంత పెట్టుబడులు పెడతాయి. దీంతో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీ భాగం అధిక రాబడులకు వీలు కలి్పస్తుంది. సెక్షన్ 80సీ కింద వీటిల్లో పెట్టుబడులపై ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ విభాగంలో యూటీఐ రిటైర్మెంట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపించే వాటిల్లో ఒకటి. తక్కువ రిస్‌్కతో, మెరుగైన రాబడులను ఇస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు 40 శాతంలోపే ఉన్నాయి. తక్కువ రిస్క్ కోరుకుంటూ, విశ్రాంత నిధిని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే ఈ పథకాల్లో పెట్టుబడులపై లాకిన్ ఐదేళ్లుగా ఉంటుంది. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్ అయితే 58 ఏళ్లు నిండడానికి ముందే పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ చార్జీలు విధిస్తోంది. ► ఇందులో రాబడి ప్రస్తుతం 8.2 శాతం ► లాకిన్ పీరియడ్: కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు ఇటీవలే ఈ పథకంలో వడ్డీ రేటును 8.2 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మాదిరే వడ్డీ రేటు, కేంద్ర సర్కారు గ్యారంటీతో కూడిన రిస్క్ లేని సాధనం ఇది. తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరి పేరిట గరిష్టంగా ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో రాబడిపై పూర్తి పన్ను మినహాయింపు ఉంది. పథకాన్ని ప్రారంభించాలంటే కుమార్తెల వయసు 10 లోపు ఉండాలన్నది నిబంధన. పోస్టాఫీసులు, బ్యాంక్‌ల్లో ఈ స్కీమ్ కింద ఖాతాను ప్రారంభించొచ్చు. ఆర్బీఐ వచ్చే ఆరి్థక సంవత్సరం ద్వితీయ భాగంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత చేపడుతుందని అంచనా. ప్రతి త్రైమాసికం ఆరంభంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర సర్కారు సవరిస్తుంటుంది. కనుక సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత రేటు 8.2 శాతం ఎక్కువ కాలం కొనసాగుతుందని ఆశించరాదు. కాకపోతే ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేనందున, కుమార్తెల భవిష్యత్ అవసరాలకు సంబంధించిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని రిస్‌్కలేని ఈ పథకానికి కేటాయించుకోవచ్చు. ► గడిచిన ఐదేళ్ల కాలంలో కనిష్ట వార్షిక రాబడి 8.15 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు యూనిట్డ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో (యులిప్‌లు) పెట్టుబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఈఎల్ఎస్ఎస్ మాదిరిగా పెట్టుబడులకు అంత సౌకర్యవంగా ఉండవు. పోర్ట్‌ఫోలియో వివరాలు తెలుసుకోవడం కూడా సౌకర్యంగా కష్టమే. కాకపోతే యులిప్‌ల నుంచి దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఆశించొచ్చు. పైగా పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. బీమా రక్షణ కూడా కొంత లభిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడిపై పన్ను మిననహాయింపు ఉంటుందే కానీ, లాభాల ఉపసంహరణ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో లాభం రూ.లక్షకు మించితే 10 శాతం పన్ను చెల్లించాలి. కానీ, యులిప్‌లలో రాబడి ఎంత వచి్చనా కానీ, గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను ఉండదు. ఈ ప్రయోజనం కోసం చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ కనీసం 10 రెట్లు అధికంగా ఉండాలని సెక్షన్ 10(10డి) చెబుతోంది. యులిప్ పాలసీలోనూ ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య ఇన్వెస్టర్ తన స్వేచ్ఛ ప్రకారం పెట్టుబడుల ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. అలా మార్చుకున్నప్పటికీ పన్ను బాధ్యత ఉండదు. యులిప్ ప్లాన్లలో ఐదేళ్ల తర్వాత నుంచి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ పరిమితంగానే ఉండడం ప్రతికూలం. వార్షిక ప్రీమియానికి 10–12 రెట్ల వరకే రక్షణ ఎంపిక చేసుకోగలరు. అంటే ఏడాదికి రూ.1–1.20 లక్షలు చెల్లించినా, లభించే రక్షణ రూ.10–12 లక్షలకు మించదు. కనుక తగినంత జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవాల్సి రావచ్చు. యులిప్‌ను రిటైర్మెంట్ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పాటు కొనసాగాల్సి ఉంటుంది. ► గడిచిన ఐదేళ్ల కాలంలో ఏటా సగటు రాబడి 17 శాతం ► లాకిన్ పీరియడ్: మూడేళ్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ కూడా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందిస్తున్నాయి. ఇవి ప్రధానంగా లార్జ్‌క్యాప్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడతాయి. కనుక సమీప కాలంలో వీటిల్లో రాబడులు మెరుగ్గానే ఉంటాయని అంచనా. రాబడులు, భద్రత, లాకిన్ పీరియడ్ తదితర అంశాల పరంగా చూస్తే ఎన్పీఎస్ తర్వాత, ఎన్‌పీఎస్‌తో సమానంగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. పైగా పారదర్శకత ఎక్కువ. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పెట్టుబడికి లాకిన్ కేవలం మూడేళ్లుగానే ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రిస్‌్కను సమర్థవంతంగా అధిగమించొచ్చు. సెక్షన్ 80సీ కింద ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో సగటు రాబడులు ఏడాది కాలంలో 19 శాతం, మూడేళ్లలో 18.50 శాతం, ఐదేళ్లలో 17 శాతం, ఏడేళ్లలో 15.46 శాతం, పదేళ్లలో ఏటా 16.60 శాతం చొప్పున ఉన్నాయి. -
Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న వైభవంగా జరగబోతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్ పుణ్యంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను ఆదా చేసుకునే మార్గం ఇక్కడ ఉంది. పన్ను చెల్లింపుదారులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా రామమందిరానికి నగదు విరాళం అందించవచ్చు. 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ ట్రస్ట్‌లో 15 మంది ట్రస్టీలు ఉన్నారు. ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఆలయ పునరుద్ధరణ, మరమ్మతుల నిమిత్తం ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (PAN:AAZTS6197B)ను చారిత్రక ప్రాముఖ్యత, పూజా స్థలంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని, మందిర పునర్నిర్మాణం/మరమ్మతు కోసం ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80G (2)(b) కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవని వెబ్సైట్ పేర్కొంది. -
బడ్జెట్ 2024.. ట్యాక్స్ డబ్బులు ఆదా చేసుకోవాలంటే...?
మార్కెట్ ఆల్‌టైమ్‌హైకి వెళ్లి ఊగిసలాడుతోంది. రానున్న యూనియన్ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులు ఉండబోతున్నాయి. బడ్జెట్ సెషన్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ట్యాక్స్ తగ్గించుకోవాలంటే ఎక్కడ మదుపుచేయాలి. స్టాక్‌మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. బడ్జెట్ ప్రభావం కీలక మార్కెట్ సూచీలపై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకులు మ్రిన్ అగర్వాల్‌తో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు. ఈ వీడియోలో చూడండి. -
Tax saving: ..ఇలా చేస్తే అదనంగా పన్ను ఆదా!
పన్ను ఆదా కోసం సెక్షన్ 80సీ కింద ఇప్పటికే రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. దీనికి అదనంగా పన్ను ఆదా కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – రాకేశ్ వర్మ ఐటీ చట్టం సెక్షన్ 80సీ కింద గరిష్ట పరిమితి రూ.1.5 లక్షల మేరకు ఇప్పటికే మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అప్పుడు అదనపు పన్ను ఆదా కోసం మీ ముందున్న మార్గం నేషనల్ పెన్షన్ సిస్టమ్ టైర్–1. రిటైర్మెంట్ పథకమైన ఎన్‌పీఎస్‌లో గరిష్టంగా రూ.50,000 పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 80సీకి అదనంగా కల్పించిన ప్రయోజనం ఇది. విశ్రాంత జీవనం కోసం నిధి ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యాన్ని సాకారం చేసేందుకు వీలుగా 2004లో కేంద్ర సర్కారు ఎన్పీఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 18–70 ఏళ్ల వయసు పరిధిలోని ఎవరైనా ఇందులో చేరేందుకు అర్హులే. ఒక ఏడాదిలో ఇందులో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. ఇందులో చేసిన పెట్టుబడి ఏదైనా కానీ 60 ఏళ్ల వరకు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. అంటే అప్పటి వరకు లాకిన్ అయి ఉంటుంది. కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైన సందర్భాల్లోనే దీన్నుంచి ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. ఇటీవలి తీసుకొచ్చిన సవరణ నేపథ్యంలో 60 ఏళ్లు నిండిన తర్వాత.. నెల లేదా త్రైమాసికం లేదా ఏడాదికోసారి క్రమంగా కావాల్సినంత ఉపసంహరించుకోవడానికి వీలు ఏర్పడింది. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే వారు 2 రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఆటో లేదా యాక్టివ్. ఆటో ఆప్షన్ ఎంపిక చేసుకోవడం కొంత బెటర్. ఈ ఆప్షన్లో ఈక్విటీలకు కేటాయింపులు ఇన్వెస్టర్ వయసు ఆధారంగా మారుతుంటాయి. ఉదాహరణకు ఇన్వెస్టర్ వయసు 35 ఏళ్లు అనుకుందాం. 100 నుంచి 35 ఏళ్లు తీసివేయగా, మిగిలిన మేర (65%) ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఇన్వెస్టర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. యాక్టివ్ ఆప్షన్లో ఈక్విటీలకు గరిష్టంగా 75% వరకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఈక్విటీ కేటాయింపులు పోను, మిగిలినదాన్ని డెట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు కేటాయించొచ్చు. - సమాధానం: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పన్ను ఆదాలో ఎన్పీఎస్ టాప్.. రెండో స్థానంలో ఈఎల్ఎస్ఎస్
న్యూఢిల్లీ: పన్ను ఆదా కోసం ఏ సాధనంలో ఇన్వెస్ట్ చేయాలా? అన్న సందేహించే వారికి ఎన్పీఎస్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు.! పన్ను ఆదాతోపాటు ఉద్యోగ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఎన్పీఎస్ ఒక మంచి మార్గం అవుతుంది. రాబడులు ఒక్కటే కాకుండా, పెట్టుబడులకు భద్రత, సౌలభ్యం, లిక్విడిటీ, వ్యయాలు, పారదర్శకత, పెట్టుబడుల్లో సౌలభ్యం తదితర అంశాల పరంగా ఎన్పీఎస్ ముందున్నట్టు ఓ సంస్థ నిర్వహించి అధ్యయనంలో తెలిసింది. వరుసగా రెండో ఏడాది పన్ను ఆదాకు టాప్ సాధనంగా నిలిచింది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. అదనంగా, సెక్షన్ 80సీసీడీ (1బి) కింద రూ.50,000ను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ఆదా పొందొచ్చు. ఇక కంపెనీ ఉద్యోగి తరఫున ఎన్‌పీఎస్‌లో జమలపైనా సెక్షన్ 80సీసీడీ (2) కింద.. వేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్ ద్వారా ఈక్విటీలకు 75 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఈక్విడి, డెట్ ఎంపికల ఆధారంగా ఇందులో సగటు వార్షిక రాబడులు 8–16 శాతం మధ్య ఉంటాయి. పన్ను ఆదా, లిక్విడిటీ, రాబడులు వీటన్నింటి విషయంలో ఎన్పీఎస్ తర్వాత ఈఎల్ఎస్ఎస్ రెండో స్థానంలో ఉంది. -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా!
ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) శుభవార్త అందించింది. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే పన్నుకు సంబంధించి విలువను నిర్ణయించే నిబంధనలను సీబీడీటీ సవరించింది. దీంతో ఉద్యోగులకు మరింత ఎక్కువ పన్ను ఆదా అవుతుంది. టేక్-హోమ్ జీతం పెరుగుంది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను నిబంధనలకు సవరణలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు యాజమాన్యాలు కల్పించే అన్ఫర్నిష్డ్ గృహాలకు సంబంధించిన వ్యాల్యుయేషన్ నిబంధనలు మారాయి. తగ్గిన పన్నులు 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులకు వసతిపై పన్ను వారి జీతంలో 10 శాతం ఉంటుంది. ఇది ఇంతకు మందు 15 శాతంగా ఉండేది. ఇక 15 లక్షలకు మించి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది జీతంలో 7.5 శాతం ఉంటుంది. గతంలో 10 శాతంగా ఉండేది. వసతి వ్యాల్యుయేషన్ నిబంధనలను సీబీడీటీ మార్చడం వల్ల అధిక జీతం పొందుతూ యాజమాన్యాలు కల్పించే వసతిలో నివాసముంటున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుకుందని, పెద్ద పన్ను ఆదాతోపాటు వారు పొందే టేక్ హోమ్ జీతం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు! -
పన్ను ఆదా.. మెరుగైన రాబడినిచ్చే ఈ ఫండ్ గురించి తెలుసా?
మెరుగైన రాబడులతోపాటు, పన్ను పరిధిలో ఉన్న వారు కొంత ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) కూడా ఒకటి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇదొక విభాగం. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఒకటి. రాబడులు టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ రాబడులు అద్భుతంగా ఏమీ లేకపోయినా.. ఈ పథకం అన్ని కాలాల్లోనూ స్థిరమైన, మెరుగైన ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. గత ఏడాది కాలంలో ఈ పథకం 14 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో ఏటా 23 శాతం చొప్పున రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 13 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 17.56 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. బెంచ్ మార్క్ సూచీ అయిన ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐతో పోలిస్తే ఈ పథకం కొన్ని కాలాల్లో మెరుగ్గానూ, కొన్ని కాలాల్లో ఫ్లాట్‌గానూ పనితీరు నమోదు చేసింది. దీర్ఘకాలంలో సూచీతో పోలిస్తే టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకంలోనే మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. 1996 మార్చిలో ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా 18.40 శాతం చొప్పున ఇప్ప టి వరకు ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చిపెట్టింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో మార్కెట్ అస్థిరతలను అధిగమించేందుకు, దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలకు రిడెంప్షన్ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబా టు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో అధిక రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) స్టాక్స్ మధ్య మార్పులు, చేర్పులు చేస్తుంది. ఉదాహరణకు 2017లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి 3557 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 97.57 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. 57 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 22.64 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 10 శాతం వరకు కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10.54 ఐసీఐసీఐ బ్యాంక్ 6.53 రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.84 ఇన్ఫోసిస్ 4.42 ఎస్బీఐ 4.36 యాక్సిస్ బ్యాంక్ 3.49 ఎల్అండ్టీ 2.94 రాడికో ఖైతాన్ 2.65 క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్ 2.58 భారతీ ఎయిర్టెల్ 2.35 -
వేతన జీవులకు ఊరట ఉన్నట్టా.. లేనట్టా?
సాక్షి, హైదరాబాద్ 2020 తర్వాత మూడో సంవత్సరం, రెండో నెల, మొదటి రోజున ఐదో సారి 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 6.10 నుంచి 6.80 శాతం అభివృద్ధి రేటు ధీమాతో సప్త ప్రాధాన్యతలతో ఎనిమిది రకాలుగా రూపాయి ఎలా వస్తుందో.. తొమ్మిది రకాలుగా రూపాయి ఎలా ఖర్చు పెట్టనున్నారో పేర్కొన్నారు. ‘‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’’ నినాదంతో సప్తరుషులను స్మరించేలా ఏడు విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. ఇతర విషయాల జోలికి పోకుండా మనం కేవలం ఆదాయ పన్నుకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించుకుందాం. ఈ బడ్జెట్లో చేసిన మార్పులు చట్టంగా మారి 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు వర్తిస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే అసెస్మెంట్ ఇయర్ 2024-25 అని అర్థం చేసుకోవాలి. ఈ మార్పులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తించవు. 2023 మార్చి 31 తర్వాత మీరు దాఖలు చేసే రిటర్న్స్‌కు ఇవి వర్తించవు. ప్రస్తుతం ట్యాక్స్ చెల్లింపుదారులకు రెండు రకాల రిటర్న్స్ పద్ధతులు ఉన్నాయి. ఒకటి పాత ట్యాక్స్ విధానం.. మరొకటి కొత్త విధానం. పాత పద్ధతిలో బేసిక్ లిమిట్ రూ. 2.50 లక్షల తర్వాత 3 శ్లాబులు.. అంటే పన్ను శాతాలు వరుసగా 5 శాతం, 20 శాతం, 30 శాతం. ఈ విధానంలో మినహాయింపులు ఉంటాయి. కొత్త పన్ను విధానంలో ఎటువంటి మినహాయింపులు ఉండవు. బేసిక్ లిమిట్ రూ. 2.50 లక్షలు కాగా, 6 శ్లాబులు అంటే.. 5, 10, 15, 20, 25, 30 శాతంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు ఎంచుకోవచ్చు. రాబోయే బడ్జెట్లో ఈ రెండూ కొనసాగుతాయి. మీకు నచ్చినదాంట్లో మీరు మీ ఆదాయాన్ని లెక్కించుకోవచ్చు. పాత పద్ధతిలో ఎటువంటి మార్పులు లేవు. శ్లాబుల్లోనూ మార్పు లేదు. రేట్లలో కూడా ఎటువంటి మార్పు లేదు. 60 సంవత్సరాల లోపు వారికి 60-80; 80 ఏళ్లు దాటిన వారికి బేసిక్ లిమిట్లలోనూ ఎటువంటి మార్పూ లేదు. సేవింగ్స్, జీవిత బీమా, ఎన్ఎస్సీలు, ఇంటి రుణం మీద వడ్డీ, మినహాయింపుల విషయంలో ఎటువంటి మార్పులు లేవు. ఇతర మినహాయింపులు, తగ్గింపుల విషయంలో ఏ మార్పులు లేవు. ఈ విషయంలో సీతమ్మ ఎటువంటి కరుణ చూపలేదు. కొత్త పద్ధతి కొనసాగిస్తూ కొన్ని మార్పులు చేశారు. కొత్త పద్ధతిలో కూడా రూ. 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తారు. ఈ మేరకు ఆదాయం తగ్గుతుంది. ఫ్యామిలీ పెన్షన్ రూ. 15 వేలు వరకు తగ్గిస్తారు. ఈ మేరకు ఆదాయం తగ్గుతుంది. అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కి చెల్లించిన మొత్తాన్ని కూడా తగ్గిస్తారు. ఆదాయమూ తగ్గుతుంది. బేసిక్ లిమిట్‌ని రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. దీంతో పన్ను భారం తగ్గుతుంది. శ్లాబులు మార్చారు. వీటి వల్ల పన్ను భారం తగ్గుతుంది. రూ. 7 లక్షల వరకు ఎటువంటి పన్ను భారం ఉండకుండా రిబేటును పొందుపర్చారు. ఇది వేతన జీవులకు చిన్న ఊరట. -
ఉమ్మడి కుటుంబంతో ఆదాయ పన్ను తగ్గించుకోవచ్చు! ఎలాగో తెలుసా?
ఈ మధ్య మన కాలమ్‌లో ఒక అయ్యర్ కుటుంబం చేసిన ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ వారం ఉమ్మడి/సమిష్టి కుటుంబం ద్వారా ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సౌలభ్యం కోసం మనం ‘‘ఉమ్మడి కుటుంబం’’ అని ప్రస్తావిద్దాం. ఆదాయపు పన్ను చట్టంలో ఇలాంటి కుటుంబానికి ఒక నిర్వచనం చెప్పారు. అంతే కాదు. ఒక ప్రత్యేకమైన స్టేటస్ కూడా అంటకట్టారు. స్వంతం, ఉమ్మడి కుటుంబం, భాగస్వామ్య సంస్థ, కంపెనీ, వ్యక్తుల కలయిక, ప్రాంతీయ సంస్థలు .. ఇలాంటి ప్రతి ఒక్కరికి ఒక స్టేటస్. ఆ స్టేటస్‌ని బట్టి ఆదాయం శ్లాబులు, పన్ను రేట్లు ఉంటాయి. ఉదాహరణకు స్వంతం, ఉమ్మడి కుటుంబాలకు బేసిక్ లిమిట్ రూ. 2,50,000. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలకు బేసిక్ లిమిట్లు లేవు. స్వంతానికి, ఉమ్మడి కుటుంబాలకు 10 శాతం, 20 శాతం, 30 శాతం రేట్లు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలకు ఒకే రేటు. గతంలో ఉమ్మడి కుటుంబాలు బహు సంఖ్యలో ఉండేవి. అవి కుటుంబపరంగానే వ్యాపారం చేసేవి. ఆదాయం ఉండేది. అందుకని ప్రత్యేక హోదా ఉంది. ఇది హిందువులకే వర్తిస్తుంది. ఆస్తిపాస్తులు పూర్వీకుల నుండి సంక్రమించాలి. కుటుంబంలో హక్కు సహజంగా ఏర్పడుతుంది. ఉదాహరణకు పుట్టుక, పెళ్లి వంటివి. అలాంటి కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఉంటారు. వారినే ‘‘కర్త’’ అని వ్యవహరిస్తారు. ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టి ‘‘పాన్’’ను పొందాలి. దరఖాస్తులో కుటుంబం ఎప్పుడు ఏర్పడింది.. కర్త పేరు.. అడ్రస్సు, కుటుంబ సభ్యుల పేర్లు తదితర వివరాలు ఇవ్వాలి. ఆ రోజు నుండి స్టేటస్ అమల్లోకి వస్తుంది. కర్త అంటే ఎవరు? ఉమ్మడి కుటుంబం బాగోగులు చూసే వ్యక్తిని కర్త అంటారు. కుటుంబపు వ్యవహారాలను చూసే వ్యక్తే కర్త. సీనియర్ కుటుంబీకులు .. మగవారే కర్తలు. నో పార్ట్నర్స్. ఆడవాళ్లు సభ్యులే. అందరికీ వారి వారి వాటా పొందే హక్కుంది. ఆస్తిలోనూ.. ఆదాయంలోనూ. దీనికి సంబంధించి ఎంతో పెద్ద న్యాయ సమీక్ష ఉంటుంది. ఎన్నో కోర్టు జడ్జిమెంట్లు, వివరణలు, భాష్యాలు, వ్యాఖ్యలు, వాదోపవాదాలు ఉన్నాయి. వాటన్నింటిని కాస్త పక్కన పెడితే.. సెపరేటు స్టేటస్ కాబట్టి కుటుంబానికి బేసిక్ లిమిట్ రూ. 2,50,000 వర్తిస్తుంది. ఇది కాకుండా కుటుంబీకులందరికీ వ్యక్తిగతంగా, స్వంతంగా విడిగా, అదనంగా బేసిక్ లిమిట్ వర్తిస్తుంది. అన్ని మినహాయింపులు, తగ్గింపులు ప్రత్యేకం. 80సి, 80డి మొదలైనవి అదనం. ప్రత్యేకమైన డీమ్యాట్ అకౌంటుతో షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు.. వాటిపై వడ్డీ మీద ట్యాక్స్‌లు, టీడీఎస్‌లు వేరు. మూలధన లాభాలు వేరు .. వ్యాపారం, వృత్తిగత లాభాలు వేరుగా ఉంటాయి. ఏయే ఆదాయాలు ఉండవచ్చు ►ఇంటి మీద అద్దె/ఆదాయం ►ఇతర ఆస్తుల మీద ఆదాయం ►మూలధన లాభాలు ►వ్యాపారం/ వృత్తుల మీద ఆదాయం ►ఇతర ఆదాయాలు -
పన్ను భారం తగ్గించుకోండిలా ..
అదొక పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబం. చింతలు లేని కుటుంబం. ‘ట్యాక్స్ కాలమ్’కి ఆ కుటుంబానికి ఏమిటి సంబంధం అంటే .. వాళ్లంతా కలిపి చాలా తక్కువగా పన్ను చెల్లించి పరువుగా బతుకుతున్నారు. కుటుంబ పెద్ద అయ్యర్ గారికి .. 90 సంవత్సరాలు, ఆయన భార్యకు 85 ఏళ్లు. ఇద్దరిది మంచి ఆరోగ్యం. ముగ్గురు మగపిల్లలు. వాళ్లందరికి పెళ్లిళ్లు అయ్యాయి. కోడళ్లు .. మనవళ్లు.. మనవరాళ్లు ఉన్నారు. అయ్యర్గారిది మొదటి నుంచి ఇడ్లీల అమ్మకమే. మొదట్లో ఒక టేబుల్. తర్వాత బండి. తర్వాత గుడిసె.. తర్వాత షెడ్డు .. ఇప్పుడొక స్థిరమైన ఇంట్లో వ్యాపారం. ఇంటిల్లిపాదీ ఇడ్లీలు అమ్ముతారు. ఒకటే వంట. ఒకే మాట. వారి ఐకమత్యమే వారి బలం. ఎప్పుడూ చట్టప్రకారమే వ్యాపారం చేస్తూ వచ్చారు అయ్యర్‌గారు. తనకో పాన్, భార్యకో పాన్. కొడుకులది కూడా అదే పద్ధతి. కోడళ్లు అత్తగారికి ఏమీ తీసిపోరు. హోటల్ నిర్వహణ కాగితాల ప్రకారం ఎవరి పని వారిదే. టర్నోవర్ వారిదే. ప్రతి సంవత్సరం టర్నోవరు రూ. 20,00,000 దాటకుండా జాగ్రత్త పడతారు. జీఎస్టీ వర్తించదు. పెద్దాయన ఆదాయంలో నుంచి ఖర్చులు పోను నికర ఆదాయం రూ. 5,00,000 దాటకుండా జాగ్రత్తపడతారు. అవసరం అయితే సేవింగ్స్, ఎన్ఎస్సీలు.. ఇంకా మెడిక్లెయిమ్.. వైద్య ఖర్చులు అన్ని వెసులుబాట్లు ఉపయోగిస్తారు. అలాగే భార్య విషయంలోనూ అదే జాగ్రత్త. ఒక కొడుక్కి పిల్లలు, వారి చదువులు .. 80సి కింద స్కూల్ ఫీజులను క్లెయిమ్ చేస్తారు. మరొక కొడుక్కి ఒకే సంతానం. ఇంటికి లోన్ తన పేరు మీద తీసుకుని వడ్డీ చెల్లిస్తారు. అసలు చెల్లిస్తారు. దాన్ని 80సి కింద క్లెయిమ్ చేస్తారు. మరొక కొడుక్కి ఒక కూతురు. సేవింగ్స్ చేస్తారు. ఇతని పేరు మీద మరొక ఇల్లు, అప్పులు, వడ్డీలు ఉన్నాయి. ముగ్గురు పిల్లలకు కార్లు ఉన్నాయి. లోన్ మీద కొన్నారు. వడ్డీని ఖర్చుగా చూపుతారు. పెట్రోల్ ఖర్చులు, తరుగుదల వ్యయాలు, డ్రైవర్ కూడా ఉన్నాడని, జీతం ఇస్తున్నామని చెబుతారు. ఎంత లాభం వచ్చినా ఇలాంటి ఖర్చులతో తగ్గుతుంది. కోవిడ్ నేపథ్యంలో ఇంటింటికి టిఫిన్లు ఇవ్వడం ద్వారా స్వామి కార్యంతో పాటు స్వకార్యమూ చక్కబెట్టుకున్నట్లుగా ఆ టిఫిన్లను అందించే ట్రిప్పుల్లోనే స్వంత పనులు కూడా చేసుకుంటారు. ఎందరో పని వాళ్లు. మనిషికి రూ.10,000 జీతం. ఆ ఉద్యోగికి ట్యాక్స్ ఉండదు. టీడీఎస్ ఉండదు. మీకు ఈ ప్లానింగ్ నప్పకపోవచ్చు.. కుదరకపోవచ్చు లేదా వర్తించకపోవచ్చు. కానీ, కాన్సెప్టును అర్థం చేసుకోండి. పైన చెప్పింది కథా కమామీషు కాదు. పేర్లు, అంకెలు గోప్యంగా ఉంచిన ఒక యదార్థ గాధ. -
ఈక్విటీల్లో పన్ను ప్రయోజనం..!
ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోకి అడుగు పెట్టాం. వేతన జీవి తన ఆదాయం, పన్ను భారం, పన్ను ఆదా చేసుకోవడానికి ఇంకా వెసులుబాటు ఉందా? ఉంటే ఏ సాధనంలో ఇన్వెస్ట్ చేయాలి..? ఇలాంటి అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలించుకోవాలి. చాలా మంది ఆర్థిక సంవత్సరం చివర్లోనే పన్ను అంశాన్ని పట్టించుకుంటుంటారు. హడావుడిగా ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేసుకునే వారూ ఉన్నారు. కొత్త పన్నువిధానంలోకి మారిన వారికి ఈ పెట్టుబడులపై హడావుడి అవసరమే లేదు. నూతన విధానంలో పన్ను మినహాయింపులు పెద్దగా లేవు. అదే సమయంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, గతం నుంచి ఉన్న పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80సీసీబీ, 80డీ ఇలా ఎన్నో సెక్షన్ల కింద గణనీయమైన పెట్టుబడి ఆదాకు అవకాశం ఉంది. వీటి గురించి ఓ సారి సమీక్షించుకోవాల్సిందే. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకపోవడం మినహాయింపుల్లో అతి ముఖ్యమైన విభాగం. ఈ ప్రయోజనం కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. లక్ష్యాలు ముఖ్యం.. పెట్టుబడికి సంబంధించి ఏ నిర్ణయమైనా అది మీ ఆర్థిక లక్ష్యానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. పన్ను ఆదాను అదనపు ప్రయోజనంగా చూడాలే కానీ, దానినే ఒక లక్ష్యంగా భావించకూడదు. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి మీరు ఇతర పథకాలలో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. పన్ను ఆదా కోసం తిరిగి ఈఎల్ఎస్ఎస్ తరహా ఈక్విటీ సాధనాల వైపు చూడడం సరికాదు. అప్పుడు ఒకే విభాగంలో (ఈక్విటీల్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం) అధిక రిస్క్ (కాన్సంట్రేషన్ రిస్క్) తీసుకున్నట్టు అవుతుంది. సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షలపై పన్ను ఆదాకోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు ఆఫర్ చేసే ఐదేళ్ల ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అన్నీ కూడా ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఉంది. కాకపోతే ఇందులో పెట్టుబడులకు 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలం కోసం దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, వేతన జీవులు ఈపీఎఫ్‌కు ప్రతీ నెలా చేసే జమను పరిగణనలోకి తీసుకోవాలి. తనకు, తన జీవిత భాగస్వామి లేదా చిన్నారులకు సంబంధించి జీవిత బీమా ప్రీమియంపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు (గరిష్టంగా ఇద్దరు పిల్లలకే), గృహ రుణానికి సంబంధించి అసలుకు చేసే చెల్లింపులను కూడా చూపించుకోవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూడండి. రూ.1.5 లక్షల మొత్తానికి తగ్గితే అప్పుడు.. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఉత్పత్తిని అర్థం చేసుకోవాలి.. ఈఎల్ఎస్ఎస్లో లాకిన్ పీరియడ్ తక్కువగా (మూడేళ్లు) ఉండడం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. లాకిన్ పీరియడ్‌లో ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేరు. సెక్షన్ 80సీ కింద అనుమతి ఉన్న కొన్ని సాధనాల నుంచి నిర్ధేశిత కాలవ్యవధికి ముందే వైదొలగొచ్చు. ఇందుకు జరిమానా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే.. మొత్తం పెట్టుబడి నుంచి 11.5 శాతాన్ని మినహాయిస్తారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై 2 శాతం వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఈపీఎఫ్, పీపీఎఫ్ పథకాల నుంచి పన్ను ఆదా పొందిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. గతంలో పొందిన ప్రయోజనంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఎన్ఎస్సీ పెట్టుబడిని ఐదేళ్లకు ముందుగా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. కేవలం డిపాజిట్‌దారు మరణించిన సందర్భాల్లోనే ఉపసంహరణకు అనుమతిస్తారు. ముందు నుంచే ప్రణాళిక.. ఒకవేళ ఈఎల్ఎస్ఎస్ మీకు అనుకూలమైన సాధనం అని భావించినట్టయితే.. పెట్టుబడులకు ముందు నుంచే ప్రణాళిక రచించుకోవాలి. దేశీయ ఈక్విటీలు గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. కనుక పన్ను ఆదా కోసం ఏక మొత్తంలో పెట్టుబడి సూచనీయం కాదు. జనవరి నుంచి మార్చి వరకు మూడు విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. తదుపరి ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ప్రతీ నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. దీనివల్ల పెట్టుబడి వ్యయం సగటుగా మారి అధిక రాబడులకు అవకాశం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మార్కెట్లలో ఉండే ఆటుపోట్లను సులభంగా అధిగమించి, పెట్టుబడులపై వాటి ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. ఫండ్స్ పథకాల పనితీరును ముందుగానే సమగ్రంగా సమీక్షించుకుని పెట్టుబడులు ప్రారంభించాలి. ఆ పథకాల్లోనే దీర్ఘకాలం పాటు (ఏవైనా అసాధారణ మార్పులు వస్తే తప్ప) కొనసాగాలి. అంతేకానీ, ప్రతీ ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను ఆదా పథకాలను ఎంపిక చేసుకోవడం సరికాదు. ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యం పరిమితి దాటకుండా చూసుకోవాలి. పన్ను బాధ్యతను చూడాలి.. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు రూ.1.5లక్షలపై ఏటా పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ, వీటిని తిరిగి వెనక్కి తీసుకునే సమయంలో లాభాలపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేదు. కనుక లాకిన్ ముగిసిన అనంతరం ఏటా రూ.లక్ష వరకే వెనక్కి తీసుకోవడం ద్వారా అప్పుడు కూడా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలోనూ పన్ను ఉండదని కోరుకునే వారు.. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎండోమెంట్ జీవిత బీమా సాధనాల వంటి వా టికే పరిమితం కావాల్సి ఉంటుంది. అలాగే, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఏటా రూ.2.5 లక్షల పెట్టుబడికి సైతం పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర పన్ను ఆదా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో రాబడుల పరంగా ఈఎల్ఎస్ఎస్ మెరుగైన సాధనం. కనుక దీర్ఘకాల లక్ష్యాల కోసం పన్ను ఆదాతోపాటు, రాబడిని దీని ద్వారా సమకూర్చుకోవచ్చు. ఇందులోనూ గ్రోత్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ సాధనం కనుక పెట్టుబడి అవసరమైన సందర్భంలో (లాకిన్ ముగిసిన అనంతరం) వెనక్కి తీసుకోవాలంటే.. అదే సమయంలో మార్కెట్లు పతనాలను చూస్తుంటే కొంతకాలం వేచి చూడాల్సిన రిస్క్ ఇందులో ఉంటుంది. -
పన్ను ఆదా : వీటిని గమనించారా?
మరో 30 రోజుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. పన్ను ఆదా కోసం ఇప్పటి వరకు ఏమీ చేయకపోతే.. ఇప్పటికి అయినా మించిపోయింది ఏమీ లేదు. సాధారణంగా సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీల గురించి ఎక్కువ మందికి అవగాహన ఉంది. కానీ, పన్నును ఆదా చేసే మరెన్నో సెక్షన్లు కూడా ఐటీ చట్టంలో ఉన్నాయి. వీటి కింద మరింత మొత్తాన్ని పన్ను లేకుండా ఆదా చేసుకునే మార్గాలున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలను గరిష్టంగా సెక్షన్ 80సీ కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను ఆదా చేసుకోవచ్చు. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల వరకు ఉన్నా.. పన్ను రాయితీకి కేంద్రం అవకాశం కల్పిస్తోంది. దీనికి అదనంగా రూ.1.5 లక్షలు సెక్షన్ 80సీ రాయితీలను పూర్తిగా వినియోగించుకున్నట్టయితే రూ.6.5లక్షల ఆదాయంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే నేటి ప్రాఫిట్ ప్లస్ కథనం. హెల్త్ కవరేజీ (సెక్షన్ 80డీ) ఆరోగ్య రక్షణ అవసరాన్ని గతంతో పోలిస్తే కరోనా ఆగమనం తర్వాత చాలా మంది తెలుసుకున్నారు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఆరోగ్యానికే కాదు, ఆర్థికంగానూ కలిసొస్తుంది. ఏటేటా వైద్య చికిత్సల ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్న తరుణంలో.. ఆస్పత్రి పాలైతే ఊహించని ఆర్థిక భారం పడకుండా చూసుకోవడంతోపాటు.. ఏటా హెల్త్‌ప్లాన్‌కు చెల్లించే ప్రీమియంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. సెక్షన్ 80డీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో హెల్త్‌ప్లాన్‌కు చెల్లించే ప్రీమియం రూ.25,000 వరకు పన్ను లేదు. దీన్ని మరింత వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్ కింద రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. ► కరుణాకర్ (60 ఏళ్లలోపు), తన జీవిత భాగస్వామి, తన పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూపేణా చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25వేల మొత్తంపై పన్ను మినహాయింపు కోరొచ్చు. ఒకవేళ ఇదే వ్యక్తి వయసు 60 ఏళ్లు దాటి ఉంటే, తనకు తన కుటుం బం కోసం చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.50,000 మొత్తంపైనా పన్ను మిన హాయింపునకు చట్టం అవకాశం కల్పిస్తోంది. ► ఒకవేళ కరుణాకర్ వయసు 60 ఏళ్లలోపు అయి ఉండి తన కుటుంబానికి, అలాగే, తన తల్లిదండ్రుల కోసం (60 ఏళ్లలోపు వయసు) మరో హెల్త్ ప్లాన్‌కు ప్రీమియం చెల్లిస్తున్నాడని అనుకుంటే.. అప్పుడు కరుణాకర్ రూ.25,000, ఆయన తల్లిదండ్రుల పేరిట మరో రూ.25,000 కలిపి మొత్తం రూ.50,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు. ► మరో కేసులో కరుణాకర్ 60 ఏళ్లు దాటి ఉంటే, సహజంగానే ఆయన తల్లిదండ్రులు కూడా సీనియర్ సిటిజన్లు అయి ఉంటారు కనుక ఇద్దరికీ రూ.50,000 చొప్పున గరిష్టంగా రూ.లక్ష వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ► నగదు కాకుండా డిజిటల్ రూపేణా చెల్లింపులపైనే పన్ను మినహాయింపు పొందగలరు. ప్రీమియం నుంచి జీఎస్టీ, ఇతర సెస్సులను మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తానికే పన్ను ఆదా పొందాల్సి ఉంటుంది. ► ఒక వ్యక్తి తన కుటుంబానికి, తన తల్లిదండ్రుల హెల్త్ కవరేజీ మినహా మరే ఇతర బంధుత్వాలకు సంబంధించి పన్ను మినహాయింపు కోరడానికి లేదు. ► తల్లిదండ్రుల కవరేజీకి ప్రీమియంను తల్లిదండ్రులు కొంత.. వారి కుమారుడు లేదా కుమార్తె కొంత చెల్లించినట్టయితే అప్పుడు ఇరువురూ చెల్లించిన మేరకు నిబంధనలకులోబడి పన్ను ప్రయోజనానికి అర్హులు. ► హిందూ అవిభాజ్య కుటుంబానికి, ఎన్ఆర్ఐలకు సంబంధించి సెక్షన్ 80డీ కింద గరిష్ట పరిమితి రూ.25వేలు అని గుర్తుంచుకోవాలి. హెల్త్ చెకప్ ఒకవేళ హెల్త్ పాలసీ ప్రీమియం గరిష్ట పరిమితి కంటే తక్కువే ఉందనుకుంటే.. ఉదాహరణకు కరుణాకర్ ఏటా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి రూ.20,000 ప్రీమియంగా చెల్లిస్తున్నాడనుకుంటే.. మరో రూ.5 వేలకు హెల్త్ చెకప్‌లకు చేసే ఖర్చును చూపించుకోవచ్చు. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.5వేల మొత్తానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంది. ► సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, న్యూరో సంబంధిత డిమెన్షియా, మోటార్ న్యూరాన్ డిసీజ్, పార్కిన్సన్స్ వ్యాధులకు, ఎయిడ్స్ తదితర తీవ్ర వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చుపై అదనంగా పన్ను రాయితీని క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.40,000 లేదా వాస్తవంగా అయిన ఖర్చు ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై దీన్ని పొం దొచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లు అయినా లేదా పన్ను చెల్లింపుదారుపై ఆధారపడిన వ్యక్తి సీనియర్ సిటిజన్ అయినా వారికి సంబంధించి ఈ వ్యాధుల కోసం చేసే ఖర్చు రూ.1,00,000 వరకు ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంతిల్లు.. (24బీ/80ఈఈ/80ఈఈఏ) సెక్షన్ 80సీ: ఇంటి రుణంలో అసలుకు (ప్రిన్సిపల్) చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్లలోపు విక్రయించకుండా ఉంటేనే ఈ మినహాయింపులకు అర్హులు. ఒకవేళ విక్రయిస్తే తిరిగి పన్ను చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 24బీ: ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే నూతన ఇల్లు కొనుగోలు/నిర్మాణం అన్నది రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా ఇంటి నవీకరణ కోసం తీసుకున్న రుణాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. రుణంతో సమకూర్చుకున్న ఇంటిని అద్దెకు ఇచ్చేసి, ఉద్యోగం లేదా వ్యాపారం, వృత్థి కారణాల రీత్యా మరో చోట నివాసం ఉంటున్నట్టు అయితే అప్పుడు కూడా ఇదే పరిమితి అమలవుతుంది. ఒకవేళ సొంతానికి కాకుండా.. అద్దెకు ఇచ్చేందుకు రుణం తీసుకుని సమకూర్చుకున్న ఇంటికి.. వడ్డీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా ఎంత ఉంటే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఈ ఉదాహరణలో రూ.2లక్షల పరిమితి ఉండదు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకునే కాలంలోనూ చేసిన వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. కొనుగోలు లేదా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి ఐదు సమాన వాయిదాల్లో దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నవీకరణ లేదా పునర్నిర్మాణం కోసం రుణం తీసుకుంటే మాత్రం.. అది పూర్తయ్యే వరకు పన్ను మినహాయింపులు లభించవు. గరిష్ట పరిమితి మేరకు మినహాయింపు పొందాలంటే.. తీసుకున్న రుణంతో మూడేళ్లలోపు ఇంటిని పూర్తి చేసుకోవాల్సి/ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అప్పుడు వడ్డీ చెల్లింపులపై గరిష్ట మినహాయింపు రూ.30,000కు తగ్గిపోతుంది. అద్దెకు ఇచ్చిన ఇంటి కోసం తీసుకున్న రుణంపై పన్ను మినహాయింపులు నూతన పన్ను విధానంలోనూ ఉన్నాయి. కాకపోతే కొన్ని పరిమితులను విధించారు. సెక్షన్ 80ఈఈ: ఈ సెక్షన్ కింద రూ.50,000 వడ్డీ చెల్లింపులపై అదనపు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రుణం రూ.35 లక్షలకు మించకూడదు. ప్రాపర్టీ విలువ రూ.50 లక్షలు మించకూడదు. సెక్షన్ 80ఈఈఏ: రూ.45 లక్షలకు మించని, మొదటిసారి ఇల్లు కొనుగోలుపై సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా (24బీకి అదనంగా) మరో రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.50,000ను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. 80జీజీ: అసంఘటిత రంగంలో ఉద్యోగం చేస్తూ హెచ్ఆర్ఏ సదుపాయం లేని వారు లేదా స్వయం ఉపాధిలోని వారు ఇంటి అద్దె కోసం చేసే చెల్లింపులపై సెక్షన్ 80జీజీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.60,000 మేరకు పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు. సొంతిల్లు ఉండి కూడా అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్టయితే ఈ ప్రయోజనానికి అనర్హులు. అదే విధంగా మరో ప్రాంతంలో ఇంటి కొనుగోలుకు తీసుకున్న రుణంపై సెక్షన్ 24 కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న వారికీ 80జీజీ కింద ప్రయోజనానికి అర్హత ఉండదు. వార్షిక వేతనంలో 25 శాతం.. లేదా వాస్తవంగా చెల్లించే వార్షిక అద్దె నుంచి 10 శాతం వార్షిక వేతనాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం.. లేదా రూ.60,000.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికే మినహాయింపు పొందగలరు. ఎన్పీఎస్ (సెక్షన్ 80సీసీడీ) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అన్నది పింఛను స్కీమ్. రిటైర్మెంట్ కోసం నిధిని సమకూర్చుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో సాధనాల్లో ఇదీ ఒకటి. కానీ, దీనికి పన్ను ప్రయోజనాలు అదనం. పైగా ఫండ్ నిర్వహణ చార్జీలు కూడా ఇతర పథకాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్‌పీఎస్‌లో రూ.2లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద.. మరో రూ.50వేలను సెక్షన్ 80సీసీడీ కింద చూపించుకునేందుకు అవకాశం ఉంది. 5 శాతం పన్ను పరిధిలోని వారికి రూ.50వేలపై రూ.2,600 వరకు పన్ను ఆదా అవుతుంది. అదే 30 శాతం పన్ను పరిధిలోని వారు రూ.15,600 ఆదా చేసుకోవచ్చు. ఏటా ఈ స్థాయి పన్ను ఆదాకు అదనంగా, పథకం నిర్వహణ చార్జీలు తక్కువగా ఉండడం ఆకర్షణీయతలు. విద్యా రుణాలు (80ఈ) విద్యారుణాల చెల్లింపులపైనా సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి తన చదువుకు లేదా తన జీవిత భాగస్వామి, పిల్లలు, చట్టపరంగా ఎవరికైనా సంరక్షకుడిగా ఉంటూ తీసుకునే విద్యా రుణాలపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. కాకపోతే ప్రభుత్వం గుర్తించిన కోర్సుల కోసం తీసుకుంటేనే ఈ ప్రయోజనానికి అర్హులు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థ (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ) లేదా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రుణాన్ని తీసుకోవాలన్నది నిబంధన. ఇలా విద్యా రుణాలపై వడ్డీ చెల్లింపుల మొత్తానికి పన్ను ప్రయోజనాన్ని ఎనిమిదేళ్లపాటు పొందే అవకాశం ఉంది. విద్యా రుణం ఏ సంవత్సరంలో తీసుకున్నారనే దానితో సంబంధం లేకుండా.. రుణ చెల్లింపులు ప్రారంభించిన ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పాటు ఈ మినహాయింపు అమల్లోకి వస్తుంది. ఏ రుణానికి అయినా ఈఎంఐ వాయిదా అసలు, వడ్డీ భాగాలతో ఉంటుంది. వడ్డీ చెల్లింపులను సెక్షన్ 80ఈ కింద చూపించుకోవచ్చు. అలాగే, అసలుకు చేసే చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద అనుమతించిన మేరకు గరిష్టంగా పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. సేవింగ్స్ వడ్డీ (80టీటీఏ/బీ) బ్యాంకుల సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ, అదే విధంగా పోస్టాఫీసు లేదా కో–ఆపరేటివ్ సొసైటీల ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీని కూడా ఆదాయపన్ను వార్షిక రిటర్నుల్లో ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. కాకపోతే ఇలా వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మొత్తంపై సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందడానికి వీలుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయానికి ఈ విధమైన మినహాయింపు లేదు. కనుక ఎఫ్‌డీల ఆదాయాన్ని ఇందులో కలపకూడదు. 60 ఏళ్లు నిండిన వారికి ప్రయోజనాలు మరొక రకంగా ఉన్నాయి. వృద్ధులకు సేవింగ్స్ డిపాజిట్లతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనూ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపై సెక్షన్ 80టీటీబీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. 80టీటీబీ కింద క్లెయిమ్ చేసుకున్న వారికి, 80టీటీఏ కింద క్లెయిమ్‌కు అర్హత ఉండదు. విరాళాలు (80జీ) సంస్థలకు, ప్రభుత్వం ఆమోదించిన నిధులకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. నగదు రూపంలో ఇస్తే రూ.2,000కే పరిమితి. ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే చెక్కు లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ తదితర నగదేతర రూపాల్లో ఇవ్వాలి. ప్రభుత్వ నిర్వహణలోని చాలా సంస్థలకు ఇచ్చే విరాళాలకీ ఈ సెక్షన్ కింద పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇచ్చిన విరాళంలో 50 శాతానికే పన్ను మినహాయింపు పొందగలరు. ఇతర ప్రయోజనాలు.. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీజీసీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం అమల్లో ఉంది. సెక్షన్ 80డీడీ లేదా 80యూ కింద పన్ను చెల్లింపుదారు లేదా వారిపై ఆధారపడిన వారు 40 శాతం వైకల్యంతో ఉంటే లేదా ఆటిజమ్, సెరబ్రల్ పాల్సీ తదితర తీవ్ర వైకల్య సమస్యలతో ఉంటే, వాటి కోసం చేసే చికిత్సల వ్యయాన్ని గరిష్టంగా రూ.1.25 లక్షలను స్థూల ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. ఇంకా వార్షిక ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000తోపాటు.. ఎల్టీసీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (ఉద్యోగానికి వీడ్కోలు పలికే సమయంలో)పైనా పన్ను మినహాయింపులున్నాయి. -
పన్ను ఆదా.. రాచమార్గాలు!
పన్ను ఆదాయం ఉన్న వారు కొంత మొత్తంపై పన్ను పడకుండా చూసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇక్కడ పన్ను ఆదాయే కాదు, చేసే పెట్టుబడిపై మెరుగైన రాబడులు కూడా రావాలి. అప్పుడే పన్ను ఆదా, రాబడులు అనే రెండు లక్ష్యాలు సాకారం అవుతాయి. సరైన సాధనాన్ని ఎంపిక చేసుకుంటేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా కోసం ఏదో ఒకటి ఎంచుకుని పొరపాటు చేయవద్దు. ముఖ్యంగా సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటే.. అందులో రాబడులు ఆశించిన మేర ఉండవు. అలాగే, బీమా రక్షణ విషయంలోనూ వీటికి మార్కులు తక్కువే. పన్ను ఆదా, రాబడులు ఈ రెండింటికీ అస్సలు నప్పని సాధనం ఎండోమెంట్ పాలసీలే. కనుక పన్ను ఆదా సాధనాల్లో వేటిల్లో రాబడులు ఏ మేర ఉన్నాయి, రిస్క్ తదితర వివరాలను తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాన్ని సులభంగా తీసుకోవచ్చు. ఈ వివరాలను తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది. పీపీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుత త్రైమాసికానికి (జనవరి–మార్చి) 7.9 శాతం. ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ గత ఏడాది కాలంలో గణనీయంగా తగ్గాయి. కానీ, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో పెద్దగా మార్పుల్లేవు. ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగైన రాబడులే ఉన్నాయి. అలాగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపైన కాకుండా, రాబడులపైనా పన్ను లేదు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడిపెట్టేది ఎక్కువగాసామాన్యులే. కనుక ప్రభుత్వం మరీ దూకుడుగా వడ్డీ రేట్లను తగ్గించలేదు. దీన్ని గమనంలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ తర్వాత అధిక రాబడులను ఇచ్చే సాధనం పీపీఎఫ్. బ్యాంకు పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్‌తో పోల్చితే పీపీఎఫ్ మెరుగైన సాధనం. 15 ఏళ్ల కాల వ్యవధి కలిగిన పెట్టుబడి పథకం ఇది. ఐదో ఏట తర్వాత పాక్షికంగా ఉపసంహరణకు వీలుంటుంది. పోస్టాఫీసులతో పోలిస్తే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్‌లో పెట్టుబడులకు అనుమతిస్తున్న బ్యాంకుల్లో ఖాతా తెరవడం సౌలభ్యంగా ఉంటుంది. వార్షికంగా రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) కూడా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి. ఇందులో పెట్టుబడులపైనా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. రాబడులు ప్రస్తుత త్రైమాసికానికి పీపీఎఫ్ మాదిరే 7.9%గా ఉన్నాయి. పెట్టుబడి సమయంలో ఉన్న రేటే ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. పెట్టుబడులపై లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. కాకపోతే రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. ఇతర ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి. రాబడులపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అదెలా అంటే.. ఉదాహరణకు 2020 జనవరిలో ఎన్ఎస్సీలో రూ.50 వేలు ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా పొందారనుకుందాం. ఏడాది తర్వాత రూ.3,950 రాబడి లభిస్తుంది. ఇది ఆటోమేటిగ్గా తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక మరుసటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తంపైనా పన్ను ఆదా పొందొచ్చు. కాకపోతే కేవలం పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంది. పెన్షన్ ప్లాన్లు బీమా సంస్థలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా పన్ను ఆదా జాబితాలో ఉన్నాయి. కాకపోతే ఎన్పీఎస్ వచ్చిన తర్వాత ఇవి ఆదరణ కోల్పోయాయి. ఎన్‌పీఎస్‌లో మాదిరే బీమా ఆధారిత పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులపై అదనంగా రూ.50,000పై పన్ను మినహాయింపు ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. కానీ, ఎన్‌పీఎస్‌తో పోల్చి చూస్తే బీమా ఆధారిత పెన్షన్ ప్లాన్లలో చార్జీలు అధికంగా ఉంటాయి. పారదర్శకత కూడా తక్కువే. కనుక రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవాలనుకునే వారు, దానిపై పన్ను ఆదా కోరుకునే వారు ఎన్పీఎస్ను ఆశ్రయించడమే మంచిది. ఇక, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కూడా రిటైర్మెంట్ ఫండ్స్ పేరుతో పథకాలను తీసుకొస్తున్నాయి. ఎన్పీఎస్ మాదిరే వీటిల్లోనూ అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్న రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్స్‌పై ప్రస్తుతానికి ఎటువంటి పన్ను ప్రయోజనాలను కేంద్రం ఇవ్వడం లేదు. బీమా పాలసీలు మనలో ఎక్కువ మంది బీమా పాలసీలు తీసుకోవడం చూడొచ్చు. ముఖ్యంగా పన్ను ఆదా కోసమని, పెట్టుబడుల దృష్ట్యా బీమా పాలసీలు తీసుకునే వారు చాలా మందే ఉంటారు. కానీ, తాము అనుసరిస్తున్న మార్గం సరైంది కాదన్నది తర్వాతే తెలుస్తుంది. ఒక వ్యక్తి మరణానికి గురైతే ఆ వ్యక్తి కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకునేది బీమా రక్షణ. కానీ, దీన్నొక పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా సాధనంగా చూడడం సరైనది కాదు. అలాగే, ఇందులో పెట్టుబడులపై దీర్ఘకాలంలో రాబడులు 20 ఏళ్ల ప్లాన్లలో 4.5–5 శాతంగానే ఉంటాయి. అంటే చాలా తక్కువ రాబడులు. ద్రవ్యోల్బణం స్థాయిలోనే రాబడి రేటు ఉంటే, నికర రాబడి సున్నాయే అవుతుంది. బీమా కవరేజీ కూడా వీటిల్లో చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఒక వ్యక్తి కనీసం తన వార్షిక ఆదాయానికి 10 రెట్ల మొత్తానికి అయినా బీమా తీసుకోవాలి. అంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారు రూ.50 లక్షల పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇంత కవరేజీ ఎండోమెంట్ ప్లాన్‌లో తీసుకోవాలంటే వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.4–5 లక్షలు ఉంటుంది. అదే టర్మ్ ప్లాన్‌లో కేవలం రూ.7,000–8,000 చెల్లించడం ద్వారా రూ.50 లక్షల కవరేజీ పొందొచ్చు. టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపుల మొత్తం కూడా సెక్షన్ 80సీ కింద పన్ను ఆదాకు అర్హమైనదే. సుకన్య సమృద్ధి యోజన కేవలం పన్ను ఆదా కోసం అని కాకుండా, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులు వారి భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోతగినది సుకన్య సమృద్ధి యోజన పథకం (ఎస్ఎస్వై). ఇది సంప్రదాయ పెట్టుబడి సాధనం. ఇందులో రూ.1.5 లక్షల పెట్టుబడిపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చేసుకోవచ్చు. పదేళ్లలోపు బాలికల పేరిట తల్లిదండ్రులు (గరిష్టంగా ఇద్దరు పేరిటే) ఎస్ఎస్వై ఖాతా తెరుచుకోవచ్చు. ఖాతాలు రెండు అయినా కానీ, గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలుగా అమలవుతుంది. ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీ రేటు కూడా ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్‌తో అనుసంధానమై ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మారిపోవచ్చు. ప్రస్తుతానికి (జనవరి–మార్చి త్రైమాసికం) 8.4 శాతం రేటు అమలవుతోంది. పీపీఎఫ్తో పోలిస్తే అధిక వడ్డీ రేటు ఈ పథకంలో కొనసాగుతోంది. పీపీఎఫ్ మాదిరే ఎస్ఎస్వై పథకంలోనూ రాబడులు పూర్తిగా పన్ను రహితమే. పోస్టాఫీసులు, ఎంపిక చేసిన జాతీయ బ్యాంకుల్లో ఎస్ఎస్వై ఖాతా తెరవచ్చు. ఇందులో పెట్టుబడులు, రాబడులను కుమార్తెల ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా డెట్ పథకం. దీనికి బదులు భవిష్యత్తు అవసరాల కోసం అధిక రాబడులను ఇచ్చే మంచి ఈక్విటీ సాధనాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. కనుక ఈ పథకంతో పోలిస్తే కొంత రిస్క్ తీసుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వైపు మొగ్గు చూపొచ్చు. యులిప్‌లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌లు) కూడా సెక్షన్ 80సీ సాధనాల్లో ఒకటి. ఈ విభాగంలో గత మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 8.09 శాతంగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ పథకాల్లో చార్జీలు భారీగా ఉండేవి. ఐఆర్డీఏఐ సంస్కరణలతో చార్జీలు కొంత మేర దిగొచ్చాయి. అయినా ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో చార్జీలు ఎక్కువ. ఎందుకంటే ఒకవైపు బీమా రక్షణనిస్తూనే, మరోవైపు పెట్టుబడులపై రాబడులను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ రెండింటి కోసం వసూలు చేసుకునే చార్జీలు ఎక్కువగానే ఉంటున్నాయి. కనుక దీర్ఘకాలానికి చూసుకుంటే ఇందులో పెట్టుబడులపై రాబడులు మోస్తరుగానే ఉంటున్నాయి. పోనీ బీమా రక్షణ అయినా తగినంతగా ఉంటుందా..? అనుకుంటే అదీ లేదు. వార్షికంగా రూ.24,000 ప్రీమియంపై 10 రెట్ల బీమా అంటే రూ.2.4 లక్షల బీమా వర్తిస్తుంది. దీర్ఘకాల రాబడులు ఆకర్షణీయంగా లేవు. తగినంత బీమా రక్షణకైతే కేవలం టర్మ్ పాలసీలను నమ్ముకోవడం మంచిది. అయితే యులిప్‌లలో ప్రయోజనాలూ ఉన్నాయి. యులిప్‌లో చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ 10 రెట్ల వరకే ఉంటే.. వచ్చే రాబడులపై సెక్షన్ 10(10డి) పూర్తిగా పన్ను ఉండదు. పన్ను ఆదా ఎఫ్డీ సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఉద్దేశించిన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అనే పేరుతో ఈ సాధనంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేసుకోవచ్చు. కాకపోతే ఐదేళ్ల పాటు మళ్లీ విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించరు. పైగా ఇందులో రాబడులు పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై రాబడి రేటు 6.5–7.6 మధ్య ఉంది. ఒక్కో బ్యాంకు ఒక్కో రేటు ఆఫర్ చేస్తోంది. అయితే, 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవారు, అలాగే 10 శాతం, 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రాబడులు మోస్తరుగా ఉన్నాయి కానీ, 30 శాతం శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను అనంతరం రాబడులు 5 శాతమే అని గమనించాలి. ముందస్తు ప్రణాళిక లేని వారు.. చివరి నిమిషంలో పన్ను ఆదా కోసం చూసే వారు.. తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని పరిశీలించొచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ చేసుకునేందుకు కొన్ని బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) పథకాలు గత మూడేళ్ల కాలంలో ఇచ్చిన సగటు వార్షిక రాబడులు 13%. అంతేకాదు సెక్షన్ 80సీ పన్ను ఆదా సాధనాల్లో అత్యధిక రాబడులు, తక్కువ లాకిన్ పీరియడ్ (మూడేళ్లు) ఉన్నది కూడా వీటిల్లోనే. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం వీటిల్లో మంచి పథకాలను ఎంచుకుని సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఈ పథకాలు నాణ్యమైన కంపెనీల ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒకే విభాగానికి పరిమితం కాకుండా మల్టీక్యాప్ (భిన్న మార్కెట్ విలువలతో కూడిన కంపెనీలు) విధానాన్ని అనుసరిస్తుంటాయి. రూ.1.5 లక్షలను వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను ఆదా చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభం రూ.లక్ష (విక్రయించినప్పుడు) వరకు ఉంటే పన్ను ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించిన లాభం వస్తే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధిక రిస్క్‌తో కూడిన సాధనాల కిందకు ఇవి వస్తాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఎన్‌పీఎస్‌లో గత ఐదేళ్ల కాలంలో రాబడులు.. అగ్రెసివ్ విభాగం(ఈక్విటీల్లో పెట్టుబడులు 50%)లో వార్షిక రాబడులు 9.11%. బ్యాలన్స్డ్ విభాగంలో (ఈక్విటీల్లో పెట్టుబడులు 33%) వార్షిక రాబడులు సగటున 9.26%. కన్జర్వేటివ్ విభాగంలో (ఈక్విటీ పెట్టుబడులు 20%) వార్షిక సగటు రాబడులు 9.39%. అలాగే, అల్ట్రా సేఫ్ విభాగంలో (పూర్తిగా డెట్ పెట్టుబడులు) ఐదేళ్ల వార్షిక సగటు రాబడులు 9.57%. అంటే మొత్తం మీద రాబడులు 9.11–9.57% మధ్య ఉన్నాయి. ఈక్విటీ, డెట్ రెండింటి రాబడుల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడానికి ప్రధాన కారణం... ఇటీవలి సంవత్సరాల్లో ఈ రెండు విభాగాలు ర్యాలీ చేయడమే. దీర్ఘకాలంలో 20–30 ఏళ్ల కాలానికి ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో కూడిన విభాగాల్లోనే (అగ్రెసివ్, బ్యాలన్స్డ్, కన్జర్వేటివ్) అధిక రాబడులకు చాన్స్ ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా మరో రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీసీడీ (2) కింద పన్ను లేకుండా ప్రయోజనం పొందే అవకాశం ఇందులోనే ఉంది. -
పన్ను ఆదా.. దీర్ఘకాలంలో మంచి రాబడులు
పన్ను ఆదా కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసే వారున్నారు. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఒకటి. రాబడులు..: టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకం స్వల్ప కాలంలో మోస్తరు పనితీరే చూపించగా, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్‌తో పోలిస్తే మెరుగైన రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. గత ఏడాది కాలంలో ఈ పథకం 14.49 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 14 శాతం వార్షిక రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 12.13 శాతం, పదేళ్లలో 13.28 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. కాకపోతే ఏడాది, మూడేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్ ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐతో పోలిస్తే ఒక శాతం నుంచి రెండు శాతం వరకు తక్కువ రాబడులు ఉన్నాయి. కానీ, ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు 2–5 శాతం వరకు అధిక రాబడులు టాటా ఇండియా ట్యాక్స్సేవింగ్స్లోనే ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, 2014 చివరి వరకు ఈ పథకంలో గ్రోత్ ఆప్షన్ లేదు. రాబడుల చరిత్రను పరిశీలించే వారు ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. పెట్టుబడుల వ్యూహాలు మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో దీర్ఘకాలం కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. ఎందుకంటే మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలకు రిడెంప్షన్ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్మెంట్ విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) స్టాక్స్ మధ్య మార్పులు, చేర్పులు కూడా చేస్తుంది. ఉదాహరణకు 2017లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. పథకం పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 35 స్టాక్స్ ఉండగా, టాప్ 10 స్టాక్స్‌లోనే 58.41 శాతం మేర పెట్టుబడులను కలిగి ఉంది. బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఇంధనం, టెక్నాలజీ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే 44.5 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. -
పన్ను ఆదా కోసం ఈక్విటీ పథకం
న్యూఢిల్లీ: అధిక రిస్క్ తీసుకునేందుకు సంసిద్ధులై ఉండి, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్న వారు, అదే సమయంలో పన్ను ఆదా చేసుకోవాలనుకుంటే అందుకు ఆదిత్య ‘బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96’ ఓ ఎంపిక అవుతుంది. ఇదొక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్). ఇందులో రూ.1.5 లక్షల పెట్టుబడులపై ఓ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకి న్ పీరియడ్ ఉంటుంది. పనితీరులో ఈ పథకం బెంచ్‌మార్క్ కంటే ముందుండడం ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. సెబీ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ట్యాక్స్ సేవింగ్స్ పథకా న్ని ఇందులో విలీనం చేసింది. ఎందుకంటే విలీనం చేసిన పథకం నిర్వహణలోని ఆస్తులు కేవలం రూ.27 కోట్లే. ఏబీఎస్ఎల్ ట్యాక్స్ రిలీఫ్96 పథకం నిర్వహణలో రూ.6,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పనితీరు ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ బీఎస్ఈ 200. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 14.4 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 13.4 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో 12.9 శాతం, ఐదేళ్లలో 24.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఏబీఎస్ఎల్ ట్యాక్స్ రిలీఫ్96 పథకం అందించింది. ఇక బెంచ్ మార్క్ రాబడులు మూడేళ్ల కాలంలో 12.1 శాతం, ఐదేళ్లలో 18.4 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాలంలో చూసుకుంటే ఈ పథకం పనితీరు పోటీ పథకాలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ ట్యాక్స్ సేవర్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ పథకాల కంటే కూడా మెరుగ్గా ఉంది. 2012, 2014, 2017 మార్కెట్ ర్యాలీల సమయాల్లోనూ మంచి పనితీరును చూపించింది. అన్ని వేళలా దాదాపు 95 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లోనే కొనసాగిస్తుంటుంది. మల్టీక్యాప్ విధానంలో అన్ని రకాల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన స్టాక్స్ మధ్య పెట్టుబడులను విభజిస్తుంది. మరో ముఖ్యమైన విషయం 2006 నుంచి ఈ పథకాన్ని అజయ్‌గార్గ్ అనే ఫండ్ మేనేజరే నిర్వహిస్తుండడం. సూక్ష్మదృష్టితో స్టాక్స్, రంగాలను ఎంపిక చేసుకోవడం ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండడానికి కారణం. పోర్ట్‌ఫోలియోలోని సుందరం క్లేటాన్, గిల్లెట్ ఇండియా మల్టీబ్యాగర్ రాబడులను ఇచ్చాయి. అలాగే, హానీవెల్ ఆటోమేషన్స్ కూడా. ఈ స్టాక్‌లో ఇప్పటికీ ఐదు శాతానికి పైగా పెట్టుబడులను కలిగి ఉంది. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్‌లో పెట్టుబడులు ర్యాలీ సమయాల్లో రాబడుల ఆర్జనకు మద్దతుగా నిలిచాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం మొత్తం పెట్టుబడుల్లో 97 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇటీవలి కాలంలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కరెక్షన్ చోటు చేసుకున్నప్పటికీ, ఆయా విభాగాల్లోని పెట్టుబడులను కదిలించకుండా అలాగే కొనసాగించింది. ప్రస్తుతం మిడ్ క్యాప్స్‌లో 23 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉండడం వల్ల కరెక్షన్ చోటు చేసుకున్నప్పటికీ రికవరీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ మిడ్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ మొదలైతే ఎక్కువగా ప్రయోజనం పొందనుంది. -
పన్నుకు మందు..లాభాల్లోనూ ముందు!!
► ఈఎల్ఎస్ఎస్లవైపు మదుపరుల మొగ్గు ► చివరి నిమిషం పన్ను ఆదాకోసం వీటివైపు చూపు ► ఐదేళ్లుగా 20 శాతానికిపైగా రాబడులనిస్తున్న పథకాలు ► గడిచిన ఒక్క ఏడాదిలో చూస్తే 30 శాతంపైనే రాబడి ► దీర్ఘకాలానికి ఇవే ఉత్తమమంటున్న నిపుణులు ► ‘సిప్’ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచిదని సూచన ► గడిచిన 10 నెలల్లోనే రూ.6వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఇది పన్నుల కాలం. అంటే... ఒకవైపు జీతంలో పన్ను కోతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి... వాటిని తప్పించుకోవటానికి హడావుడిగా వివిధ పొదుపు పథకాలవైపు పరుగులు తీసే కాలం. ఎవరెన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టినా... అందరూ ఎక్కువగా లబ్ధి పొందేది సెక్షన్ 80సీ నుంచే. దానిక్కూడా గరిష్ఠ పరిమితి రూ.1.5 లక్షలే. దీన్లో కూడా వివిధ బీమా పథకాలు, పిల్లల స్కూళ్లకు చెల్లించే ట్యూషన్ ఫీజులు తీసేస్తే... మహా అయితే ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సింది ఏ రూ.50 వేలో ఉంటుంది. సరే!! మరి ఈ 50వేలైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడైతే మన సొమ్ముకు కాస్తంత ఎక్కువ రాబడి వస్తుంది? ఎక్కడైతే దీర్ఘకాలంలో ఊహించనంత లాభాలొస్తాయి? ఇలా ఆలోచించే వారందరికీ కనిపించే పరిష్కారమే ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ పథకాలు(ఈఎల్ఎస్ఎస్). సంక్షిప్తంగా ఈఎల్ఎస్ఎస్లు. ఒకవైపు పన్ను ప్రయోజనాలు... మరోవైపు చక్కని రాబడులు.. ఈ రెండూ కలసి ఉండటమే వీటి ప్రత్యేకత. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద బ్యాంకు డిపాజిట్లు, చిన్నమొత్తాల పొదుపు పథకాలు, బాండ్లు తదితరాల్లో పెట్టుబడి పెట్టినా పన్ను భారం తగ్గుతుంది. కానీ, చక్కని రాబడి కావాలంటే ఈఎల్ఎస్ఎస్ను పరిశీలించాల్సిందే. ఇవి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కనక వీటి రాబడికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. కానీ చరిత్ర చూస్తే వీటి రాబడులు మెరుగ్గానే ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ కింద పెట్టే పెట్టుబడుల్లో సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 30 శాతం శ్లాబులో ఉన్నవారికైతే ఏడాదికి రూ.7,500 పన్ను ప్రయోజనం లభించినట్టే. అదే పది, ఇరవై ఏళ్ల కాలంలో ఆదా చేసుకునే పన్ను మొత్తం, రాబడులను అంచనా వేస్తే... ఈ అవకాశాన్ని ఎవరూ కాదనుకోరు. పెరుగుతున్న పెట్టుబడులు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఎంపిక చేసుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. – రాఘవ్ అయ్యంగార్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వైస్ ప్రెసిడెంట్ పథకాల పనితీరు బాగు దీర్ఘకాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు చాలా బాగుంది. చాలా మంది ఈఎల్ఎస్ఎస్ను పన్ను ఆదాకు ఒక అవకాశంగా చూస్తున్నారు – హిమాన్షు వ్యాపక్, రిలయన్స్ కేపిటల్ అస్సెట్ మేనేజ్మెంట్ డిప్యూటీ సీఈవో ‘సిప్’ పద్ధతికి పెరుగుతున్న ఆదరణ బ్యాంకు డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడులు బాగా తగ్గిపోతున్న తరుణంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కువ మందికి తెలిసేవి కావు. ఇపుడా పరిస్థితి మారింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్లలో పెట్టుబడి పెడతాయి కనక వీటికి గణనీయమైన రాబడులందించే సామర్థ్యం ఉంటుంది. వీటిలో రిస్క్ ఉంటుందనేది నిజమే అయినా... నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)లో ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ వెళితే రిస్క్ దాదాపు ఉండదనే చెప్పాలి. పైగా రాబడుల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో మదుపు కంటే ఇది సురక్షితమని చెప్పొచ్చు. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు... ఈఎల్ఎస్ఎస్ల పనితీరు కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లానే ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపుల కోసం ఇందులో పెట్టే పెట్టుబడులను మూడేళ్ల దాకా వెనక్కి తీసుకోవడానికి ఉండదు. దీనివల్ల దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగుతాయి. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో రాబడులు మెరుగ్గా ఉండడానికి ప్రధాన కారణమిదే. దీనివల్ల ఫండ్ మేనేజర్లకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఫలితంగా వారు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి పెట్టుబడుల వరద... మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2016 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పది నెలల కాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి 940 మిలియన్ డాలర్లు్ల వచ్చాయి. అంటే సుమారు రూ.6,194 కోట్లు. ఇదే కాలంలో పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ 29 శాతానికి పైగా ఎగసి జనవరి చివరికి రూ.53,886 కోట్లకు చేరింది. నిజానికి నెలనెలా సిప్ విధానంలో కంటే ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల వైపు చూస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పన్ను భారం తప్పించుకునేందుకు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టే ధోరణి ఎక్కువగా ఉంది. వార్షిక రాబడి 30 శాతం కూడా దాటింది మరి!! మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది డిసెంబర్‌కు రూ.16.46 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది రూ.20 లక్షల కోట్లను దాటుతుందని అంచనా. గడిచిన ఏడాది కాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాలు మెరుగైన రాబడులనిచ్చాయి. 30 శాతానికి పైగా రాబడులను ఇచ్చిన ఈఎల్ఎస్ఎస్ పథకాలు చాలానే ఉన్నాయి. వాటినొకసారి చూస్తే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ఇంటి రుణం.. ఇదీ పన్ను ప్రయోజనం
ఏళ్ళకు ఏళ్లు సాగే గృహ రుణాలు వడ్డీలపరంగా చూస్తే భారంగానే కనిపిస్తాయి. కానీ వీటి వల్ల పన్ను పరమైన లాభాలూ ఉంటాయి. వాటి పరంగా చూస్తే లాభమే. గృహ రుణ చెల్లింపుల్లో అసలుపై, వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. అదెలాగన్నది వివరించేదే ఈ కథనం. ఇల్లు కొనడమంటే మాటలు కాదు. మొదట డౌన్‌పేమెంట్ కింద బోలెడంత కట్టాలి. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకుంటే.. అనేక సంవత్సరాల పాటు ప్రతి నెలా వాయిదాలు కడుతూ పోవాలి. ఇల్లు కొనేవారికిది భారమే. అందుకే ఈ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గృహ రుణాలపై కొంత పన్ను ప్రయోజనాలు కల్పిస్తోంది. దీని ప్రధానోద్దేశం.. ప్రాపర్టీలను కొనేలా ప్రజల్ని ప్రోత్సహించడం, తద్వారా నిర్మాణ రంగానికి, బ్యాంకింగ్‌కు ఊతమివ్వడం. ఇలా చేస్తే ఇది మిగతా రంగాలకూ విస్తరించి ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు లభిస్తుంది. పన్ను మినహాయింపులకొస్తే.. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం-1961 ప్రకారం 24, 80సీ, 80ఈఈ సెక్షన్ల కింద ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పిస్తోంది. కేవలం వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) మాత్రమే ఈ ప్రయోజనాలకు అర్హులు. ఇవి గృహ రుణాలకే తప్ప ప్రాపర్టీపై తీసుకునే లోన్‌కు వర్తించవు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీపైనా అదనపు పన్ను రాయితీలు లభించేలా గత యూపీఏ ప్రభుత్వం సెక్షన్ 80ఈఈని 2013-14లో ప్రవేశపెట్టింది. అప్పట్లో తొలిసారి ఇంటి రుణం తీసుకున్న వారికి వడ్డీపై సెక్షన్ 24కింద ఇచ్చిన మినహాయింపుతో అదనంగా మరో రూ.1 లక్ష దాకా కలిసి వచ్చేది. దీనివల్ల కొనుగోలుదారులకు ఆ మేర పన్నులు తగ్గి చేతిలో కాస్త డబ్బు మిగిలేది. అయితే, ఈ సెక్షన్ 80ఈఈని ఆ తర్వాత కాలంలో మరి పొడిగించలేదు. దీంతో ఇపుడు సెక్షన్ 80సీ, సెక్షన్ 24 కింద మాత్రమే గృహ రుణాలపై పన్ను ప్రయోజనాలు పొందే వీలుంది. సెక్షన్ 80సీ - అసలు, స్టాంప్ డ్యూటీ/రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపులపై .. ఎ) అసలు చెల్లింపుపై: గృహ రుణం రీపేమెంట్లో అసలు భాగానికి 80సీ సెక్షన్ వర్తిస్తుంది. దీనికింద ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల మేర మినహాయింపు పొందవచ్చు. ప్రాపర్టీ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందలేరు. నిర్మాణం పూర్తయి, కంప్లీషన్ సర్టిఫికెట్ లభించాక మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే నిర్మాణ దశలో కట్టిన వడ్డీకి సంబంధించి ఆ తర్వాత వరుసగా ఐదేళ్ల పాటు 5 సమాన వాయిదాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే వీలుంది. మరో విషయం, ఇల్లు మీ అధీనంలోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్ల లోపే ప్రాపర్టీని విక్రయిస్తే అప్పటిదాకా తీసుకున్న పన్ను ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తుంది. ఆ వ్యవధిలో పొందిన పన్ను ప్రయోజనాలు ఆదాయం కిందికి వస్తాయి. దీనిపై పన్నులు కట్టాల్సి వస్తుంది. బి) స్టాంపు డ్యూటీ/ రిజిస్ట్రేషన్ చార్జీలపై: ప్రాపర్టీని కొనేటప్పుడు చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ సెక్షన్లో గరిష్టంగా రూ.1.5 లక్షల పరిమితికి లోబడి దీన్ని అనుమతిస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టిన ఏడాదే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 24 - వడ్డీ చెల్లింపుపై .. ఇంటి నిర్మాణం పూర్తయి, పొజెషన్ సర్టిఫికెట్‌కి ఆమోదముద్ర పడ్డాకే ఈ సెక్షన్ కింద వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపులు పొందడానికి వీలవుతుంది. ఇంటి కొనుగోలే కాక నివాస గృహం నిర్మాణం, రిపేరు, రీకన్స్ట్రక్షన్కి తీసుకునే రుణాలపై వడ్డీకి కూడా ఈ సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఎవరికీ అద్దెకు ఇవ్వకుండా సొంతానికి ఉపయోగించుకుంటున్న ఇంటికైతే గరిష్టంగా రూ. 2 లక్షల దాకా డిడక్షన్ లభిస్తుంది. ఒకవేళ రుణం మంజూరైన తేదీ నుంచి మూడేళ్లలోగా గానీ ప్రాపర్టీ నిర్మాణం పూర్తి కాకపోతే.. వడ్డీ పరమైన ప్రయోజనాలు రూ.2 లక్షల నుంచి ఏకంగా రూ.30,000కు తగ్గిపోతాయి. ఇక, ప్రాపర్టీగానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ కాకపోతే .. ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తి వడ్డీకి పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. -
పన్ను ఆదాకు ఇతర మార్గాలు ఇవే
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్‌కు, వీటికి మధ్య తేడా ఏమిటి? - అనిల్ కుమార్, విజయవాడ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటివే. కొనుగోలు, అమ్మకం వంటి విషయాల్లో వీటికి మ్యూచువల్ ఫండ్స్‌కు తేడా ఉంటుంది. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేయాలనుకుంటే, ఈ సంస్థ ఏజెంట్ ద్వారా ఆ రోజు ముగింపు ఎన్ఏవీ ధరకు ఆయా ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈటీఎఫ్‌ల విషయంలో అలా కాదు. షేర్లను కొనుగోలు చేసినట్లే ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఏదైనా స్టాక్ బ్రోకర్ ద్వారా ఆర్డర్ చేసి ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈటీఎఫ్‌ల కొనుగోలు వ్యయం సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. ఈటీఎఫ్‌లనేవి పాసివ్ ఫండ్స్. వీటిని నిర్వహించడానికి మ్యూచువల్ ఫండ్స్‌కు ఉన్నట్లుగా ఎలాంటి ఫండ్ మేనేజర్ ఉండడు, ఇండెక్స్ కదలికలను బట్టి మీకు రాబడులు వస్తాయి. సెక్షన్ 80సి ప్రకారం రూ. లక్ష వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఇది కాకుండా ఇతరత్రా పన్ను ఆదా మార్గాలున్నాయా? వివరించగలరు. - కార్తికేయ, హైదరాబాద్ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం రూ. లక్ష రూపాయలు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ సెక్షన్ ద్వారానే కాకుండా మరికొన్ని పన్ను ఆదా మార్గాలున్నాయి. వాటి వివరాలు.... సెక్షన్ 80సీసీజీ: రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు రూ.50 వేలలోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 50 శాతం మొత్తానికి పన్ను రాయితీ పొందవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశంగా ఈ స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న నివాసిత భారతీయులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇంతకు ముందు డీ మ్యాట్ అకౌంట్ ద్వారా ఈక్విటీల్లో గానీ, డెరివేటివ్ల్లో కానీ ఇన్వెస్ట్ చేయని వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌కు లాక్-ఇన్ పీరియడ్ మూడేళ్లు. సెక్షన్ 80డి: మెడికల్ బీమాకు చెల్లించిన ప్రీమియమ్‌కు పన్ను మినహాయింపులు పొందవచ్చు. రూ.15,000 వరకూ చెల్లించిన ప్రీమియంలపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక మీ తల్లిదండ్రులకు కూడా మెడికల్ బీమా ప్రీమియం చెల్లిస్తే, అదనంగా మరో రూ.15,000 వరకూ తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ కేటగిరిలోకి వస్తే, రూ.20,000 వరకూ చెల్లించిన ప్రీమియమ్‌నకు పన్ను తగ్గింపు పొందవచ్చు. సెక్షన్ 80డిడి: ఈ సెక్షన్ కింద మీపై ఆధారపడిన పిల్లలు, మీ జీవిత భాగస్వామికై వెచ్చించిన వైద్య చికిత్స ఖర్చులను రూ.50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఒక వేళ రోగం తీవ్రమైనదైతే మినహాయింపు రూ.75,000 వరకూ ఉంటుంది. సెక్షన్ 80డిడిబి: కేన్సర్, కిడ్నీ వైఫల్యం తదితర కొన్ని తీవ్రమైన జబ్బులకు అయిన వైద్య ఖర్చులకు ఈ సెక్షన్ కింద రూ.40,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒక వేళ ఈ ఖర్చులు సీనియర్ సిటిజన్ల కోసం చేసినవైతే, మినహాయింపు పరిమితి రూ.60,000 వరకూ ఉంటుంది. సెక్షన్ 80ఈ: సొంతానికి గాని, భాగస్వామికి గాని, పిల్లల కోసం గానీ తీసుకున్న విద్యా రుణం అసలుకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. సెక్షన్ 80జి: ఈ సెక్షన్ కింద ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చిన విరాళాలకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ మినహాయింపు మీ స్థూల ఆదాయంలో 10 శాతానికి మించకూడదు. సెక్షన్ 80జీజీ: ఈ సెక్షన్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించిన ఇంటి అద్దెలో రూ.24,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. మీ వేతన ప్యాకేజీలో హెచ్ఆర్ఏ కూడా ఒక భాగమై ఉంటే మీకు ఈ మినహాయింపు వర్తించదు. సెక్షన్ 80జీజీసీ: ఈ సెక్షన్ కింద రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. విరాళం విషయంలో పరిమితి లేదు.