న్యూఢిల్లీ: పన్ను ఆదా కోసం ఏ సాధనంలో ఇన్వెస్ట్ చేయాలా? అన్న సందేహించే వారికి ఎన్‌పీఎస్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు.! పన్ను ఆదాతోపాటు ఉద్యోగ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఎన్‌పీఎస్ ఒక మంచి మార్గం అవుతుంది.
రాబడులు ఒక్కటే కాకుండా, పెట్టుబడులకు భద్రత, సౌలభ్యం, లిక్విడిటీ, వ్యయాలు, పారదర్శకత, పెట్టుబడుల్లో సౌలభ్యం తదితర అంశాల పరంగా ఎన్‌పీఎస్ ముందున్నట్టు ఓ సంస్థ నిర్వహించి అధ్యయనంలో తెలిసింది. వరుసగా రెండో ఏడాది పన్ను ఆదాకు టాప్ సాధనంగా నిలిచింది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. అదనంగా, సెక్షన్ 80సీసీడీ (1బి) కింద రూ.50,000ను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ఆదా పొందొచ్చు.
ఇక కంపెనీ ఉద్యోగి తరఫున ఎన్‌పీఎస్‌లో జమలపైనా సెక్షన్ 80సీసీడీ (2) కింద.. వేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్‌పీఎస్ ద్వారా ఈక్విటీలకు 75 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఈక్విడి, డెట్ ఎంపికల ఆధారంగా ఇందులో సగటు వార్షిక రాబడులు 8–16 శాతం మధ్య ఉంటాయి. పన్ను ఆదా, లిక్విడిటీ, రాబడులు వీటన్నింటి విషయంలో ఎన్‌పీఎస్ తర్వాత ఈఎల్‌ఎస్‌ఎస్ రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment