
సిబ్బంది సేవలపై జీఎస్టీని తగ్గించడం అధికారిక ఉపాధికి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోందని అభిప్రాయపడుతోంది ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్. మన దేశం తన విస్తారమైన శ్రామికశక్తి సామర్థ్యాన్ని నిజంగా ఉపయోగించుకోవాలంటే, ముఖ్యమైన విధాన సంస్కరణలు చాలా కీలకమైనవి. కాంట్రాక్ట్ సిబ్బంది వంటి మెరిట్ ఆధారిత సేవలపై వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించడం అటువంటి ఒక సంస్కరణ అని స్పష్టం చేస్తోంది.
కాంట్రాక్ట్ సిబ్బంది, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి లేబర్–ఇంటెన్సివ్ సెక్టార్‌లు ఉపాధిని సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయి, మిలియన్ల మందికి స్థిరమైన ఉద్యోగాలను అందిస్తూ వ్యాపారాలకు ఉపయుక్తంగా ఉండేలా చూసుకుంటాయి. అయితే, ఈ వీటికి ఒక ముఖ్యమైన అడ్డంకిని ఎదుర్కొంటున్నాయి అదే జీఎస్టీ. సిబ్బంది సేవలపై 18% వస్తు సేవల పన్ను (జిఎస్టీ) సంస్థలు ఉద్యోగులను అధికారికంగా నియమించుకోకుండా ఉండేందుకు కారణమవుతోంది. తద్వారాకార్మిక చట్టాలకి కట్టుబడి ఉండకుండా సామాజిక భద్రతా ప్రయోజనాలు అనధికారిక నియామక పద్ధతులను అవి ఎంచుకోవడానికి దారి తీస్తోంది.
ఈ జీఎస్టీ రేటును 5 శాతానికికి తగ్గించడం వలన నియామక ఖర్చులు తగ్గుతాయి.. అంతేకాకుండా ఇది అధికారిక ఉపాధిని కూడా ప్రోత్సహిస్తుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎస్‌ఎమ్‌ఇలు) ప్రభావంతంగా పనిచేసేందుకు ఆర్థిక వృద్ధికి దారితీస్తూ మరింత దోహదం చేస్తుంది. ఈ మార్పు ఉద్యోగ కల్పనకు, ఉపాధిని క్రమబద్ధీకరించడానికి కార్మిక చట్టాలను నిజాయితీగా పాటించడానికి శక్తివంతమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. వ్యాపారాలకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది, మరింత నిర్మాణాత్మకమైన జవాబుదారీతనం గల లేబర్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తుంది.
భారత స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా అభిప్రాయం ప్రకారం,. కాంట్రాక్టు సిబ్బంది సేవలపై జీఎస్టీ రేటును తగ్గించడం అనే సంస్కరణ ద్వారా అనధికారిక రంగంలోని కార్మికులు సామాజిక భద్రత, న్యాయమైన వేతనాలు మెరుగైన పని పరిస్థితుల వంటి ప్రయోజనాలు పొందుతారు. ఈ సంస్కరణ భారతదేశంలో విస్తృత దృష్టితో స్థిరమైన సమగ్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుంది. ఆర్థిక వృద్ధి కార్మికుల హక్కులతో సమతుల్యం అవుతుంది.