
భారత్-పాకిస్థాన్ యుద్ధంలో విరోచితంగా పోరాడుతున్న భారత సైన్యం వేతన వివరాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేశాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసే త్యాగధనులకు ఎప్పటికీ ఈ వేతనాలు ప్రాధాన్యం కావు. పుట్టిన భూమి రక్షణ కోసం, తమ వంతు సాకారం చేస్తూ రణరంగంలో ప్రాణాలు వదిలిన సైనికుల కఠోర దీక్ష ముందు ఇవి ఏ మూలకూ సరిపోవు. చట్టపరంగా వారి సేవలకు గౌరవంగా ఇచ్చుకునే ఈ కొద్దిపాటి వేతన వివరాలు (2024 లెక్కల ప్రకారం సుమారుగా) కింది విధంగా ఉన్నాయి.
హోదా | నెల వారీ వేతనం |
సిపాయి | రూ.25,000 |
ల్యాన్స్ నాయక్ | రూ.30,000 |
నాయక్ | రూ.35,000 |
హవల్దార్ | రూ.40,000 |
నాయబ్ సుబేదార్ | రూ.45,000 |
సుబేదార్ | రూ.50,000 |
సుబేదార్ మేజర్ | రూ.65,000 |
లెఫ్ట్నెంట్ | రూ.68,000 |
కెప్టెన్ | రూ.75,000 |
మేజర్ | రూ.1,00,000 |
లెఫ్టెనెంట్ కల్నల్ | రూ.1,12,000 |
కల్నల్ | రూ.1,30,000 |
బ్రిగేడియర్ | రూ.1,39,000 నుంచి రూ.2,27,000 వరకు |
మేజర్ జనరల్ | రూ.1,44,000 నుంచి రూ.2,18,200 |
లెఫ్టెనెంట్ జనరల్ | రూ.1,82,200 నుంచి రూ.2,24,100 |
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ | రూ.2,50,000 |
ఇదీ చదవండి: ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..
అదనపు ప్రయోజనాలు, అలవెన్సులు
డియర్నెస్ అలవెన్స్ (డీఏ)
మిలిటరీ సర్వీస్ పే (ఎంఎస్‌పీ)
ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)
రవాణా భత్యం
ఫీల్డ్ ఏరియా అలవెన్స్
హై ఆల్టిట్యూడ్ అలవెన్స్
స్పెషల్ డ్యూటీ అలవెన్స్
వైద్య సౌకర్యాలు
పెన్షన్ & రిటైర్మెంట్ బెనిఫిట్స్