Operation Sindoor
-
ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్!
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది.#TravelAdvisoryIn view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.We are monitoring the situation and will keep you updated.For more…— Air India (@airindia) May 12, 2025 -
‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్
-
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు
పుణె: యుద్ధం, పర్యవసానాలపై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధమంటే సరదా కాదు, బాలీవుడ్ సినిమా అంతకంటే కాదు’అని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం నిలిచిపోవడంపై కొందరు చేస్తున్న విమర్శలకు ఆయనీ మేరకు బదులిచ్చారు. ఆదివారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో నరవణె మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర శిబిరాలు, సైనిక మౌలిక వనరులపై భారత ఆర్మీ దాడులు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు వైమానిక దాడులు, సరిహద్దుల్లో కాల్పులతో వారం పాటు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సాగాయని ఆయన తెలిపారు. ‘అనంతరం సైనిక దాడులకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు రెండు దేశాలు ప్రకటనలు చేశాయి. ఇది మిలిటరీ ఆపరేషన్‌కు విరామమే తప్ప, కాల్పుల విరమణ వంటిది మాత్రం కాదని మరోసారి నేను చెప్పాలనుకుంటున్నా. వచ్చే మరికొన్ని రోజుల్లో పరిణామాలు ఎలా మలుపులు తిరుగాయో మీరే చూడండి’అని ఆయన పేర్కొన్నారు. సైనిక దాడులను నిలిపివేయడం మంచిది కాదంటూ కొందరు చేస్తున్న వాదనపై మాట్లాడుతూ ‘యుద్ధంతో కలిగే వ్యయం అంకెలు, గణాంకాలను పరిశీలించండి. ఈ నష్టం మరీ ఎక్కువ కాకముందే, పూడ్చలేనంతగా మారడానికి ముందే యుద్ధాన్ని ఆపేయాలని తెలివైన వారెవరైనా అనుకుంటారు’అని చెప్పారు. దాడుల ద్వారా పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మాత్రమే కాదు, వైమానిక స్థావరాల్లోని మౌలిక సౌకర్యాలకు సైతం తీవ్రంగా నష్టం కలిగించాం. వైఖరి మారకుంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని పాక్ గ్రహించేలా చేయగలిగామని భావిస్తున్నాను. అందుకే పాక్ ఆర్మీ చేసేదిలేక కాల్పుల విరమణ కోసం మన ఆర్మీతో సంప్రదింపుల బేరానికి వచి్చంది’అని ఆర్మీ మాజీ చీఫ్ వివరించారు. రక్షణ వ్యయం కూడా పెట్టుబడే ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి దేశాలు రక్షణ కోసం ఎంత ఖర్చు చేయగలవు? రోజూ టీవీల్లో చూసే సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలా? విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, పారిశుధ్యం, ఇంకా ఇతర చాలా ముఖ్యమైన అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలా?అని ఆయన ప్రశ్నించారు. ‘మన బడ్జెట్లో రక్షణ రంగం వాటా 15 శాతం వరకు ఉంటోంది. ఇదీ ఒక రకమైన పెట్టుబడే. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇలాంటి బ్యాకప్ ప్లాన్ అవసరం. గతవారం ఆపరేషన్ సిందూర్‌తో అటువంటి ప్రణాళిక మనకు ఉందనే విషయం స్పష్టమైంది. రక్షణ బలగాలు సర్వ సన్నద్ధంగా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మనపై దాడి చేయాలనుకునే వాళ్లు ఒకట్రెండు సార్లు ఆలోచిస్తారు’అని ఆర్మీ మాజీ చీఫ్ నరవణె వివరించారు.యుద్ధం చివరి అస్త్రం ఆదేశాలొస్తే వెంటనే కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నానన్న నరవణె..ఈ విషయంలో తన మొట్ట మొదటి ప్రాధాన్యం దౌత్యానికే ఉంటుందన్నారు. ‘ఇతర దేశాలతో సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలే తప్ప, యుద్ధానికి వెళ్లరాదు, హింస పరిష్కారం కాదు’అని కుండబద్దలు కొట్టారు. ‘యుద్ధం ఆషామాషీ కాదు. మన బాలీవుడ్ సినిమా కాదు. చాలా సీరియస్ వ్యవహారం. చిట్టచివరి అవకాశం లేక అస్త్రంగా మాత్రమే యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇది యుద్ధాల శకం కాదని మన ప్రధాని మోదీ చెప్పింది ఇందుకే. కొందరు మూర్ఖులు యుద్ధాన్ని మనపై రుద్దారు. యుద్ధంపై మనం ఉత్సాహం చూపరాదు’అని ఆయన అన్నారు.సామాజిక కోణం మరువరాదు యుద్ధంతో వాటిల్లే నష్టాల్లో సామాజికపరమైన కోణం కూడా ఉందన్న జనరల్ నరవణే..‘ఇతరత్రా నష్టాలతోపాటు యుద్ధంతో ప్రాణ నష్టం సైతం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోయే చిన్నారులుంటారు. ఇటువంటి నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. సన్నిహితులను కోల్పోయిన వారిని ఆ ఆవేదన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధ దృశ్యాలను దగ్గర్నుంచి చూసేవారు పీటీఎస్డీ అనే మానసిక రుగ్మత బారినపడతారు. దీన్నుంచి బయటపడేందుకు కనీసం 20 ఏళ్లపాటు వీరికి చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది’అని వివరించారు. -
షెల్లింగ్ లేదు, కాల్పులు లేవు
జమ్మూ/శ్రీనగర్/చండీగఢ్: భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణ అనంతరం ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జమ్మూకశ్మీర్, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉంది. 19 రోజుల్లో మొదటిసారిగా షెల్లింగ్, కాల్పులు జరగకుండా ఉన్నాయని ఆర్మీ తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘనలలో మొదటిసారి పూర్తిగా విరామం కనిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల తర్వాత, శనివారం రాత్రి, పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు మీదుగా వరుస క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. పూంచ్‌లోని సురాన్‌కోట్‌లో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి. పహల్గాం దాడి తరువాత ఏప్రిల్ 23 నుంచి మే 6 వరకు, నియంత్రణ రేఖ వెంబడి అనేక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట సూరన్‌కోట్‌లో భారీ కాల్పులు జరిగాయి. దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. దాడి తరువాత, నివాసితులు పట్టణం నుంచి పారిపోయారు. కొందరు సమీపంలోని కొండ గ్రామాలు మరియు బంకర్లలో ఆశ్రయం పొందారు. మరికొందరు జమ్మూలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పరిస్థితి ఇప్పుడు మెరుగుపడటంతో, ప్రజలు త్వరలో పూంచ్‌లోని తమ ఇళ్లకు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. శ్రీనగర్, పఠాన్‌కోట్, రాజౌరి, అఖ్నూర్, జమ్మూ, కుల్గాం, శ్రీ గంగానగర్, బుద్గాంలలో సాధారణ పరిస్థితికి అద్దం పడుతూ అనేక దృశ్యాలు ఆన్లైన్లో కనిపించాయి. సరిహద్దు ప్రాంతాలకే కాకుండా, చండీగఢ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ జీవితం తిరిగి ప్రారంభమైందని, పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు సాధారణ సమయాల ప్రకారం తెరిచి ఉండటానికి పోలీసులు అనుతించారు. అయితే పౌరులు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. పగటి పూట ఎలాంటి సమస్యలు లేవని, రాత్రి 7.30 గంటల తరువాత దుకాణాలు మూసివేస్తుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందేమీ లేదని, ప్రజల జీవనోపాధి కూడా ప్రభావితం కావడం లేదని జైసల్మేర్‌కు చెందిన ఓ వ్యక్తి వివరించారు. -
విమానాశ్రయాలు పునఃప్రారంభం
న్యూఢిల్లీ: భారత్–పాక్ ఉద్రిక్తతల కారణంగా మే 9 నుంచి మూసివేసిన విమానాశ్రయాలన్నింటినీ భారత్ సోమవారం తిరిగి ప్రారంభించింది. కాల్పుల విరమణ చర్చల మధ్య పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తగ్గడంతో 32 విమానాశ్రయాలు తిరిగి తెరిచారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం సోమవారం ఉదయం నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. ‘‘15 మే 2025 ఉదయం 05:29 గంటల వరకు తాత్కాలికంగా పౌర విమాన కార్యకలాపాల కోసం మూసివేసిన 32 విమానాశ్రయాలు ఇప్పుడు తక్షణమే సేవల్లోకి వస్తాయి’’అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు విమాన స్థితిని నేరుగా ఎయిర్‌లైన్స్‌తో తనిఖీ చేసుకోవాలని, మార్పుచేర్పులకోసం ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లను పరిశీలించాలని సిఫార్సు చేసింది. దీంతో చండీగఢ్, శ్రీనగర్ సహా ప్రభావిత ప్రాంతాల్లోని విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. క్రమంగా విమాన కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. 3 గంటల ముందే విమానాశ్రయానికి... విమానాశ్రయాలలో కఠినమైన భద్రతా ప్రోటోకాల్ కోసం గురువారం జారీ చేసిన ఉత్తర్వులు మే 18 వరకు అమలులో ఉంటాయి. విమానాశ్రయాలలోకి సందర్శకులకు అనుమతి ఉండదు. చెక్–ఇన్, బోర్డింగ్ సజావుగా జరిగేందుకు ప్రయాణికులు విమానం షెడ్యూల్ చేసిన సమయానికి కనీసం మూడు గంటల ముందే సంబంధిత విమానాశ్రయాలకు చేరుకోవాల్సి ఉంటుంది. క్రమంగా రాకపోకల పెరుగుదలఆదేశాన్ని అనుసరించి మే 12 నుంచి ఉదయం 10 గంటలకు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, కాంగ్రా–గగ్గల్, భటిండా, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్, హల్వారా, పఠాన్‌కోట్, జమ్మూ, లేహ్, ముంద్రా, జామ్‌నగర్, హిరాసర్, భుందార్, పోర్బందర్, రాజ్‌కోట్, సర్సావా, సిమ్లా, థోయిస్, ఉత్తరలై విమానాశ్రయాలు కూడా తమ కార్యకాలాపాలను ప్రారంభించాయి. తమ విమానాల రాకపోకలు క్రమంగా పెరుగుతాయని ఇండిగో తెలిపింది. విమానాల షెడ్యూలింగ్‌లో కొంత జాప్యం ఉంటుందని, వివరాల కోసం ప్రయాణికులు తమ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది. ప్రయాణికులు ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించాలనుకుంటే.. మే 22 వరకు మార్పు, రద్దు రుసుము మినహాయింపులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. -
చూపింది శాంపిలే
న్యూఢిల్లీ: దాయాదికి మన సైన్యం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘పాక్ ఇప్పుడు చవిచూసిన తీవ్ర సైనిక నష్టాలు కేవలం శాంపిల్ మాత్రమే. మరోసారి యుద్ధమంటూ వస్తే అది పూర్తి భిన్నంగా, వాళ్లూ ఊహించలేనంత తీవ్రంగా ఉంటుంది’’ అని స్పష్టం చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ (డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (డీజీఎన్‌ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సోమవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మన సైనిక వ్యవస్థలు, స్థావరాలు నిరంతరం అప్రమత్తంగా, పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఎలాంటి ఆపరేషన్లౖMðనా క్షణాల్లో రంగంలోకి దిగిపోతాయి’’ అని ప్రకటించారు. ‘‘మనం పోరాడింది కేవలం ఉగ్రవాదులతో. కానీ వారికి దన్నుగా పాక్ సైన్యం రంగంలోకి దిగడం శోచనీయం. ఆ దేశాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో చెప్పేందుకు ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు’’ అని డీజీఏఓ భారతి అన్నారు. మన వైమానిక దాడుల్లో కరాచీ సమీపంలోని మరో కీలక వైమానిక స్థావరం కూడా నేలమట్టమైందని ఆయన వెల్లడించారు. అయితే పాక్ తన అణ్వాయుధ, అణు కమాండ్ వ్యవస్థలను దాచి ఉంచినట్టు చెబుతున్న కిరానా హిల్స్‌పై తాము దాడులు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కూల్చేసిన అత్యాధునిక పాక్ యుద్ధ విమానాల్లో ఒక మిరాజ్ కూడా ఉందని చెప్పారు. అనంతరం దాని తాలూకు శకలాల ఫొటోలను సైన్యం ఎక్స్‌లో షేర్ చేసింది.ఆకాశ్.. హైలైట్మనవి కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని డీజీఎంఓ రాజీవ్, డీజీఏఓ భారతి గుర్తు చేశారు. పాక్ దాడులను తిప్పికొట్టడంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ హైలైట్‌గా నిలిచిందంటూ కొనియాడారు. ‘‘నిరంతరాయంగా దూసుకొచ్చిన డ్రోన్లను ఆకాశ్, కాస్ వంటి దేశీయ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసిన తీరు మనకు గర్వకారణం. దశాబ్ద కాలంగా మన రక్షణ వ్యవస్థలు సాధించిన అద్భుత ప్రగతికి నిదర్శనం’’ అని చెప్పారు. పాక్‌కు అతి కీలకమైన రహీంయార్ ఖాన్ వైమానిక స్థావరంలో జరిగిన విధ్వంసం తాలూకు వీడియో, ఫొటోలను ఈ సందర్భంగా విడుదల చేశారు. రాజస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఈ స్థావరంలో ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రన్‌వేపై అతి భారీ గొయ్యి ఏర్పడింది. దాన్ని పూర్తిగా పూడ్చి సరిచేసేదాకా అక్కడ ఎలాంటి వైమానిక కార్యకలాపాలూ జరిగే అవకాశం లేదు. ఇవన్నీ మన దాడుల తాలూకు కచ్చితత్వానికి తిరుగులేని నిదర్శనాలని డీజీఏఓ భారతి చెప్పారు.యోధుని నోట రాముని మాటపాక్పై దాడులు తదితర వివరాలతో సీరియస్‌గా సాగుతున్న మీడియా భేటీలో డీజీఏఓ భారతి ఉన్నట్టుండి రామయణంలోని వారధి ఉదంతాన్ని ఉటంకించి ఆకట్టుకున్నారు. ‘‘లంకకు వెళ్లేందుకు దారివ్వాలని మర్యాదగా కోరితే సముద్రుడు మూడు రోజులైనా స్పందించలేదు. భయపెట్టనిదే పనికాదంటూ రాముడు ఆగ్రహంతో కోదండం ఎక్కుపెట్టగానే తక్షణం కాళ్లబేరానికి వచ్చాడు’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి రామచరిత్ మానస్‌లోని ‘వినయ్ న మానత్ జలధి...’ పద్య పంక్తులను ఆశువుగా చెప్పి అలరించారు. ‘‘నేనేం చెప్పదలచిందీ అర్థమైందిగా! తెలివైనవాడికి కనుసైగ చాలు’’ అంటూ చమత్కరించడంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు. పాక్ నిరంతర కవ్వింపులు మనం గట్టిగా బదులివ్వక తప్పని పరిస్థితి కల్పించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆది, సోమవారాల్లో సైనిక డీజీల మీడియా బ్రీఫింగ్ సందర్భంగా కూడా రాయబార ఘట్టంలో కౌరవులకు కృష్ణుని హిత వచనాలు, హెచ్చరికలకు సంబంధించిన పద్యాలు, శివతాండవ స్తోత్రం తదితరాలను నేపథ్యంలో విన్పించడం విశేషం.ఎయిర్ డిఫెన్స్‌కు క్రికెట్‌పరంగా భాష్యంమన వైమానిక స్థావరాలను, సైనిక కేంద్రాలను లక్ష్యం చేసుకోవడం అత్యంత కష్టమని డీజీఎంఓ రాజీవ్ స్పష్టం చేశారు. పాక్ దాడుల వేళ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత శత్రు దుర్భేద్యంగా నిలిచిందో క్రికెట్ పరిభాషలో వివరించి అలరించారు. ‘‘1970ల్లో జరిగిన ఓ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ద్వయం జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ ఇంగ్లండ్‌కు వణుకు పుట్టించింది. అయితే జెఫ్, లేకపోతే లిల్లీ అన్నట్టుగా సిరీస్ పొడవునా ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలు చేశారు. ఎస్–400 మొదలుకుని ఆకాశ్, కాస్, ఏడీ గన్స్ దాకా పలు శ్రేణులతో కూడిన మన ఎయిర్ డిఫెన్స్ కూడా అంతే. వాటిలో ఏదో ఒక వ్యవస్థ పాక్ వైమానిక దాడులను దీటుగా అడ్డుకుని పూర్తిగా తిప్పికొట్టింది’’ అని చెప్పారు. సోమవారమే టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్ అని చెప్పారాయన. -
మోహరింపుల తగ్గింపు!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల వెంబడి బలగాల మోహరింపును కనీస స్థాయికి తగ్గించే అంశాన్ని పరిశీలించేందుకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. ఇరుదేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్య సోమవారం ఈ అంశంపై కీలక చర్చలు జరిగాయి. పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా, భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హాట్లైన్లో 45 నిమిషాలకు పైగా సంప్రదింపులు జరిపారు. సైనిక చర్యకు తెర దించే మార్గాలపైనా చర్చ జరిపారు. ఇరువైపుల నుంచీ ఒక్క తూటా కూడా కాల్చకుండా సంయమనం పాటించాలని గత భేటీలో తీసుకున్న నిర్ణయం అమలు దిశగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాక జరిగిన తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇదే. తొలుత నిర్ణయించినట్టు మధ్యాహ్నం 12 గంటలకు బదులు భేటీ సాయంత్రం ఐదింటికి జరిగింది. మే 10న కాల్పుల విరమణకు డీజీఎంఓ స్థాయిలోనే సూత్రప్రాయంగా అంగీకారం కుదరడం తెలిసిందే. అనంతర పరిణామాలు తదితరాలపై తాజా భేటీలో డీజీఎంఓలు ఎవరి వాదన వారు వినిపించినట్లు తెలుస్తోంది. భేటీపై అధికారికంగా ప్రకటన రాలేదు. వివరాలను త్వరలో వెల్లడిస్తామని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కిరానా హిల్స్ కథేంటి ?
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్ కొండప్రాంతంపై బాంబులు వేశారనే వార్తలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. పాకిస్తాన్ అణు స్థావరాల జోలికి వెళ్లలేదని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం స్పష్టంచేశారు. ‘‘ ఆ కొండలో అణుస్థావరం ఉన్నట్లు మాకైతే తెలీదు. ఇప్పుడు మీరు చెప్తేనే తెల్సింది. రహస్యం చెప్పినందుకు థాంక్యూ’’ అని ఏకే భారతి సరదాగా మాట్లాడారు. తర్వాత సీరియస్‌గా సమాధానం చెప్పారు. ‘‘ పాక్ అణుస్థావరాలపై భారత్ ఎలాంటి దాడులు చేయలేదు. ముఖ్యంగా మీరు చెబుతున్న కిరానా న్యూక్లియర్ బేస్‌పై బాంబులు వేయలేదు’’ అని సోమవారం మీడియా ప్రతినిధులకు ఏకే భారతి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈ కిరానా కొండల గురించి చర్చ మొదలైంది. పాకిస్తాన్ అణుస్థావరాలు భద్రంగా ఉన్నాయా?. వాటిపై నిజంగానే భారత్ దాడులు చేసిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కిరానా హిల్స్ విశేషాల కోసం నెటిజన్లు ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు. కొండల్లో అణుబాంబులు!?పాకిస్తాన్ తన అణువార్హెడ్లను పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోదా జిల్లాలోని కిరానా కొండల్లో దాచిందని దశాబ్దాల క్రితం వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత వాయుసేన ఇక్కడ కూడా కొన్ని క్షిపణులు, బాంబులను పడేసిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కొండల్లో పేలుళ్లు వినిపించాయని, కనిపించాయంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రక్షణ శాఖ పరిధిలోని అణు విభాగానికి సంబంధించిన స్థావరం ఈ కొండల్లో ఉందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులుచేయడం తెల్సిందే. రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పైనా క్షిపణులు వేసింది. ఈ ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలోనే పాక్ ‘స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్’ ఉంది. పాక్ అణు వార్హెడ్ల నిర్వహణ బాధ్యతలను ఇదే చూసుకుంటుంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసినప్పుడే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్పైనా భారత్ దాడి చేసిందని వార్తలొచ్చాయి. అదీగాక ముషాఫ్ ఎయిర్‌బేస్‌పైనా భారత్ దాడిచేసింది. ఈ బేస్ అడుగుభాగంలోనే అణువార్హెడ్ల నిల్వకేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సర్గోదా ఎయిర్‌బేస్‌కు రోడ్డుమార్గంలో కిరానా హిల్స్ కేవలం 20 కి.మీ.ల దూరంలో ఉంది. కుషాబ్ అణుకేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అణ్వాయుధంలో వాడే ప్లుటోనియం తయారీకోసం నాలుగు భారజల రియాక్టర్లు కుషాబ్లో పనిచేస్తున్నట్లు 3 నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదించింది. 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆ కొండప్రాంతంలో 39 కి.మీ.ల పరిధిని మిలటరీ జోన్‌గా పాక్ ఏనాడో ప్రకటించింది. ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్స్ శాఖ 10 సొరంగాలను తవ్వింది. పొరపాటున లోపల పేలుళ్లు జరిగినా సమీప జనావాసాల్లో ప్రాణనష్టం జరక్కుండా సొరంగాల గోడలను అత్యంత మందంగా నిర్మించారని భారత ఆర్మీలో రిటైర్డ్ కల్నల్ వినాయక్ భట్ ఎనిమిదేళ్ల క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
మళ్లీ డ్రోన్ల కలకలం.. నేలమట్టం చేసిన భారత బలగాలు
జమ్మూ/చండీగఢ్: కాల్పుల విరమణ ఒప్పందం సమగ్రస్థాయిలో అమలుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి. వీటిని వెంటనే భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. చిన్నపాటి డ్రోన్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్మీ అధికారులు స్పష్టంచేశారు. ఆవలి నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి దూసుకొచ్చిన డ్రోన్లను ఆర్మీ డిఫెన్స్ గన్స్‌తో పేల్చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. మే 8వ తేదీన సైతం ఇదే సాంబా సెక్టార్లో పాకిస్తానీ డ్రోన్లు రావడం, భారత బలగాలు పేల్చేయడం తెల్సిందే. అమృత్సర్, హోషియార్‌పూర్‌లో బ్లాక్ఔట్ముందుజాగ్రత్త చర్యగా పంజాబ్‌లోని అమృత్సర్, హోషియార్పూర్ జిల్లాల్లో సోమవారం స్థానిక యంత్రాంగం బ్లాక్ఔట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో సరిహద్దు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. జలంధర్ పరిధిలోని ప్రాంతాల్లోనూ పాక్షికంగా బ్లాక్‌ఔట్‌ను అమలుచేశామని జలంధర్ డిప్యూటీ కమిషన్ హిమాన్షు అగర్వాల్ తెలిపారు. పాకిస్తాన్‌తో పంజాబ్ 553 కి.మీ.ల మేర సరిహద్దు పంచుకుంటోంది. సోమవారం సైతం అమృత్‌సర్‌లో సైరన్ శబ్దాలు వినిపించాయి. కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలని అమృత్సర్ ప్రజలకు ఇప్పటికే సందేశాలు పంపించామని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా అమృత్సర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, ఫిరోజ్‌పూర్, తర్న్ తరన్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. పఠాన్‌కోట్, అమృత్సర్ జిల్లాల్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలకూ మంగళవారం సెలవు ప్రకటించారు. -
'అణు'మాత్రం బెదరం!.. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ‘‘ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్ సిందూర్‌తోనే బదులిస్తాం. ఇదే భారత ప్రభుత్వ నీతి. ఇదే మన నూతన విధానం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘దాయాది అణు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఉగ్రవాదాన్నీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్నీ ఇకనుంచి వేర్వేరుగా చూడబోం. పాక్ చర్యలన్నింటినీ ఇకపై ‘సిందూర్’ గీటురాయితోనే పరిశీలిస్తాం. మనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా ‘సిందూర్’ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తాం. జన్మలో మర్చిపోలేని రీతిలో గుణపాఠం నేర్పుతాం’’ అని కుండబద్దలు కొట్టారు. పాక్ ‘అణు’ ఆటలు మనముందు సాగవని ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే నిరూపించామన్నారు. ‘‘కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్తాన్ ఎడారుల దాకా పాక్ దాడులన్నింటినీ తిప్పికొట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువుపట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చాం. భారత్‌తో యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాక్‌ను మట్టి కరిపించాం’’ అని గుర్తు చేశారు. ఆ విజయ పరంపరలో ఆపరేషన్ సిందూర్‌ను కలికితురాయిగా అభివర్ణించారు. పాక్ ప్రభుత్వం, సైన్యం కలసికట్టుగా దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద భూతం చివరికి ఆ దేశాన్నే కబళిస్తుందని మోదీ హెచ్చరించారు. ‘‘ఆ దేశం మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని దాని గడ్డపై నుంచి కూకటివేళ్లతో పెకిలించాల్సిందే. దానికి మరో మార్గం లేదు’’ అంటూ హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సిందూర్... దేశ భావనకు ప్రతిరూపం ‘‘సిందూరం కేవలం పేరు కాదు. సరైన న్యాయానికి అఖండ ప్రతిజ్ఞ. కోట్లాది భారతీయుల భావనలకు ప్రతిరూపం. ఉగ్రవాదం తాలూకు వికృత రూపమే పహల్గాం దాడి! అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నన్నెంతగానో కలచివేసింది. భార్యాపిల్లల కళ్లముందే ఒక్కొక్కరిని కాల్చి పొట్టన పెట్టుకున్న వికృతత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అందుకు ప్రతీకారం కోసం దేశమంతా ఒక్కటైంది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వారు కలలో కూడా ఊహించని విధంగా పాక్, పీఓకేలోని బహావల్పూర్, మురిద్కే తదితర ఉగ్రవాద కేంద్రాలు, శిక్షణ శిబిరాలపై మన సైన్యం విరుచుకుపడి నేలమట్టం చేసింది. అవన్నీ నిజానికి ప్రపంచ ఉగ్రవాద యూనివర్సిటీలు. అమెరికాపై 9/11, లండన్ మెట్రో తదితర దాడులన్నింటికీ అక్కడినుంచే పథకరచన జరిగింది. అలాంటి కేంద్రాలతో పాటు ఉగ్రవాదుల స్థైర్యాన్ని కూడా మన ధ్వంసం చేసింది. దశాబ్దాలుగా పాక్ గడ్డపై బాహాటంగా రొమ్ములు విరుచుకుని సంచరిస్తున్న 100 మందికి పైగా అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చింది. మన మహిళల నుదుటి సిందూరం తుడిపేస్తే ఏమవుతుందో ప్రతి ఉగ్ర ముఠాకూ తెలిసొచ్చేలా చేశాం. ఉగ్రతండాలనే సమూలంగా తుడిచిపెట్టేశాం. కాల్పులకు కేవలం విరామమే ఉగ్ర కేంద్రాలపై మన దాడితో పాక్ బిక్కచచ్చిపోయింది. మన దాడుల్లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. వాటిలో పాక్ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు. పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు. తన గడ్డ మీది ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్ దుస్సాహసానికి దిగింది. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి. దాంతో బెంబేలెత్తిపోయి దాయాది కాళ్లబేరానికొచ్చింది. ఎలాగోలా పరువు కాపాడుకునే ప్రయత్నాలకు దిగింది. కాపాడండంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మన పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓకు కాల్ చేశారు. ‘‘ఇకపై మా గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ, సైనిక దుస్సాహాసాలూ జరగబోవు’’ అని స్పష్టంగా హామీ ఇచ్చారు. అప్పటికే పాక్ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్ర తండాలన్నింటినీ మనం నేలమట్టం చేయడమే గాక దాని పీచమణచాం. కనుక వారి అభ్యర్థనపై ఆలోచించాం. అయినా కాల్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం. ఎలాంటి కవి్వంపులకు దిగినా పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం, వైమానిక, నావికా దళాలు, బీఎస్ఎఫ్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఐక్యతే మన శక్తి ఉగ్రవాదాన్ని ఇకముందు ఏమాత్రమూ సహించేది లేదు. మన ఐక్యతే దానికి మరణశాసనం. అదే మన అతిపెద్ద శక్తి. ఇది యుద్ధాల యుగం కాదు. నిజమే. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదని ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్పష్టమైన సందేశమివ్వాలి. 21వ శతాబ్దపు అధునాతన యుద్ధ రీతులతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మెరుగైన సమాజానికి బాటలు పరిచిన వాళ్లమవుతాం.’’ పీఓకేను అప్పగించాల్సిందే ఏ చర్చలైనా ఆ అంశంపైనే ఉగ్రవాదంపై భారత వైఖరి సుస్పష్టమని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఏకకాలంలో కొనసాగలేవు. నీళ్లు, రక్తం కలసికట్టుగా పారడం జరగని పని’’ అని స్పష్టం చేశారు. తద్వారా ఉగ్రవాదానికి పాక్ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేదాకా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తదితర చర్యలు కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించి తీరాల్సిందే. పాక్‌తో ఏ చర్చలైనా కేవలం ఈ రెండు అంశాలపైనే జరుగుతాయి. పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నా’’ అంటూ ప్రధాని కుండబద్దలు కొట్టారు. శక్తితోనే శాంతి ‘‘నేను బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి బుద్ధుడు చూపిన శాంతిమార్గం కూడా శక్తి గుండానే సాగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘ప్రతి భారతీయుడూ శాంతియుతంగా జీవించాలి. వికసిత భారత స్వప్నం సాకారం కావాలి. అందుకు భారత్ శక్తిమంతమైన దేశంగా మారడం తప్పనిసరి. ఆ శక్తిని అవసరమైనప్పుడు ప్రదర్శించి చూపాలి. గత కొద్ది రోజులుగా మనం చేసింది సరిగ్గా అదే. ఆ యజ్ఞంలో భాగస్వాములైన సైనిక బలగాలకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు అందరికీ ప్రతి భారతీయుని తరఫునా నా సెల్యూట్. -
మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్, పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో దూసుకొచ్చిన పాకిస్థాన్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు.ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్ రెచ్చిపోయింది. వాస్తవాధీన రేఖ వెంట పాక్ కాల్పులకు తెగబడింది. డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగాయి. సాంబా, ఆర్నియాలో డ్రోన్ కదలికలను గుర్తించారు. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Samba.(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs— ANI (@ANI) May 12, 2025 -
చావుదెబ్బ తిన్నా, విజయోత్సవ ర్యాలీ అంటూ హడావుడి చేసిన అఫ్రిది.. వైరల్ వీడియో
గత వారం రోజులుగా పాక్‌తో జరిగిన యుద్దంలో భారత్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో యుద్దం ముగిసింది. సీస్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా పాక్ కొన్ని గంటల పాటు భారత్‌పై దాడులకు తెగబడింది. ఎట్టకేలకు నిన్నటి నుంచి పాక్ అన్నీ మూసుకుని కామ్‌గా కూర్చుంది. యుద్దానికి పుల్‌స్టాప్ పడిన తర్వాత పైచేయి సాధించిన భారత్ ఎలాంటి గొప్పలకు పోకుండా తమ పని తాము చేసుకుని పోతుండగా.. భారత దళాల చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ మాత్రం హడావుడి చేస్తుంది. Shahid Afridi leading a so called 'victory rally' in Karachi. - Just like their army, everyone is delusional. pic.twitter.com/OnHRvmbzax— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2025భారత్‌పై యుద్ధం గెలిచామని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గొప్పలు చెప్పుకోగా.. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఓ అడుగు ముందుకేసి కరాచీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో అఫ్రిది కారు పైకప్పుపైకి ఎక్కి ఏదో సాధించామన్నట్లు ఫోజులు కొడుతూ కనిపించాడు. అతని వెనుక పలువురు పాకిస్తాన్ జెండాలతో కనిపించారు. ఈ వీడియోపై భారతీయులు భగ్గుమంటున్నారు. చావు దెబ్బ తిన్నా సిగ్గులేకుండా విజయోత్సవ ర్యాలీ ఎలా జరుపుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా అఫ్రిది భారత్‌పై నోరు పారేసుకున్నట్లు తెలుస్తుంది. భారత సైన్యమే ముందుగా పాక్‌పై దాడి చేసిందని అఫ్రిది అన్నాడట. భారత దాడులను పాక్ బలగాలు తిప్పికొట్టాయని బిల్డప్ ఇచ్చాడట. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా అవాక్కులు చవాక్కులు పేలాడట. దయ్యాలు వేదాలు వల్లించినట్లు తాము శాంతికాముకులమని ప్రకటించుకున్నాడట.అఫ్రిది భారత్‌పై, భారత సైన్యంపై కొద్ది రోజుల కిందట కూడా ఇలాంటి చెత్త వాగుడే వాగాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. -
భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్-పాక్‌లపై ఒత్తిడి తెచ్చా. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ నాదే’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. త్వరలో పాక్‌తో కూడా మాట్లాడుతానని వివరించారు. #WATCH | US President Donald Trump says, "...I'm very proud to let you know that the leadership of Indian and Pakistan was unwavering and powerful, but unwavering in both cases - they really were from the standpoint of having the strength and the wisdom and fortitude to fully… pic.twitter.com/rFbznHMJDF— ANI (@ANI) May 12, 2025 -
విక్రమ్ మిస్రీపై ట్రోల్స్.. తిప్పి కొట్టిన ప్రముఖులు
పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను, మన సైన్యం చేపట్టిన చర్యల గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. భారత్- పాక్ కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం ఎక్స్ ద్వారా వెల్లడించారు. భారత్ తరపున విక్రమ్ మిస్రీ దీన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ప్రకటన చేశారు. ఆ మరుక్షణం నుంచే ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులను కూడా పరుష పదజాలంతో దూషిస్తూ పోస్ట్‌లు పెట్టారు. కుట్రదారు, దేశద్రోహి అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. మిస్రీ కుమార్తె పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ కొంత మంది పోస్ట్‌లు పెట్టారు.మిస్రీ బాసటగా ఒవైసీవిక్రమ్ మిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్‌ను ఖండిస్తూ పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు బాసటగా నిలిచారు. విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) ఖండించారు. ఆయన నిజాయితీపరుడైన మంచి అధికారి అని, దేశంలో కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారని, ప్రభుత్వ నిర్ణయాలకు అధికారులను నిందించడం తగదని హితవు చెప్పారు.చర్యలు తీసుకోరా?మిస్రీకి కేంద్ర సర్కారు బాసటగా నిలబడలేదని, ఆయన గౌరవాన్ని కాపాడటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav) నిందించారు. మిస్రీపై ట్రోలింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు బీజేపీ సర్కారు ఆసక్తి చూపించడం లేదని ఆరోపించారు. అధికారులు.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరే సంధానకర్తలు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత, అధికారులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేరని అఖిలేశ్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, సల్మాన్ అనీస్ సోజ్ కూడా మిస్రీపై ట్రోలింగ్‌ను ఖండించారు. ట్రోలింగ్ సిగ్గుచేటువిదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమ మీనన్ రావు కూడా మిస్రీకి అండగా నిలిచారు. మిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. అంకితభావం కలిగిన దౌత్యవేత్త అయిన మిస్రీ.. మన దేశానికి వృత్తి నైపుణ్యం, దృఢ సంకల్పంతో సేవ చేశారని ప్రశంసించారు. ఆయన దూషించడానికి ఎటువంటి కారణం లేదన్నారు. హద్దులు దాటి దూషణలకు పాల్పడటం సరికాదన్నారు. ద్వేషంతో విషపూరితంగా చేసే వ్యాఖ్యలు ఆగిపోవాలి. మన దౌత్యవేత్తలకు భరోసా కల్పించేందుకు వారికి మనమంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.బాధ్యతారహిత చర్యమిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో విషం కక్కడాన్ని జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. మిస్రీ కుమార్తెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంపై ఎన్సీడబ్ల్యూ చీఫ్ విజయ రహత్కర్ ఫైర్ అయ్యారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే బాధ్యతారహిత చర్య అని పేర్కొన్నారు. ట్రోలింగ్ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతాను లాక్ చేశారు విక్రమ్ మిస్రీ. తన పోస్ట్‌లను ఎవరూ చూడకుండా నియంత్రణ విధించారు. చదవండి: విక్రమ్ మిస్రీపై ట్రోల్స్.. కాంగ్రెస్ నేత శశి థరూర్ కౌంటర్ -
ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన
-
ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు: పీఎం మోదీ
ఢిల్లీ : ‘మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై తొలిసారి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు’ అని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి.భారత సైన్యానికి,సైంటిస్టులకు నా సెల్యూట్. పహల్గాంలో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచాన్ని కలిచి వేసింది. పహల్గాం ఘటన నన్ను వ్యక్తి గతం కలిచివేసింది. మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం.ఉగ్రవాదులు కలలో కూడా దాడిని ఊహించి ఉండరుపహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల్నిటార్గెట్ చేశారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.ఆపరేషన్ సిందూర్ అంటే పేరు కాదు, ఆవేదన. ఆపరేషన్ సిందూర్ అంటే ప్రతిజ్ఞ. ఏడో తేదీన తెల్లవారున ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది. పహల్గాం ఘటన తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాంభారత సైన్యం ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేసింది. భారత డ్రోన్లు ఉగ్రవాదుల స్థావరాల్ని మట్టిలో కలిపేశాయి. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ బెంబేలెత్తిపోయింది. పాక్ గుండెలపై భారత సైన్యం దాడి చేసింది. భయంతో,రక్షణ కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలను ఆశ్రయించిందిపాక్ శరణు గోరిందిఈ నెల 10 భారత్ డీజీఎంవోను పాక్ శరణు గోరింది. మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని,సైన్యంపై కాల్పులు జరపొద్దని ప్రాధేయపడింది. 3రోజుల్లో పాక్‌పై ఊహకందని విధంగా దాడి చేశాం. ఎడారి,కొండలు,ఆకాశంలో పాక్‌ను వదిలిపెట్టలేదు. యుద్ధరంగంలో ప్రతిసారి పాక్‌ను మట్టి కరిపించాం. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌ను ఓడించాం.ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాంఅణ్వాయుధాల బ్లాక్ మెయిల్‌ను ఇక సహించేది లేదు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. అదే ఉగ్రవాదం చేతిలో అంతమవుతుంది. ఈ యుద్ధంలో మేకిన్ ఇండియా ఆయుధాలు బాగా పనిచేశాయి. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారని అర్ధమవుతుంది. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాం. భవిష్యత్‌లో పాక్ చర్యను బట్టి భారత్ అదే స్థాయిలో స్పందిస్తోంది.నీరు,రక్తం కలిసి పారలేవు ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు. నీరు,రక్తం కలిసి పారలేవు. పాక్‌తో చర్చించాల్సింది పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే. మన ఐక్యతే.. మన శక్తి.ఈ రోజు బుద్ధపూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపాడు.అదే మనకు ఆదర్శం అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఆపరేషన్ సిందూర్‌ను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్ -పాకిస్తాన్ల మధ్య మూడురోజుల పాటు భీకర కాల్పులు జరిపాయి. భారత్ జరిపిన భీకర దాడులకు పాకిస్తాన్ తోక ముడిచింది. కాల్పులు జరపొద్దంటూ భారత్‌ను ప్రాధేయపడింది. కాల్పుల విరమణతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh— ANI (@ANI) May 12, 2025ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. రక్షణ శాఖ,విదేశాంగ శాఖ, త్రివిధ దళాదిపతులతో ఆపరేషన్ సిందూర్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. -
ఆపరేషన్ సిందూర్ : 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం!
టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ ఉగ్రమూకలకు చుక్కలు చూపింది. కోట్లాదిమంది భారతీయులకు ప్రేరణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మెడికల్ కాలేజీలో ఉత్సాహకరమైన పరిణామం చోటు చేసుకుంది.గత నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే తన బిడ్డలకు సిందూర్ పేరు పెట్టుకునేందుకు చాలామంది దంపతులు ముందుకొచ్చారు. మే 10 -11 తేదీలలో కుషినగర్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల వ్యవధిలో జన్మించిన 17 మంది నవజాత బాలికలకు వారి కుటుంబ సభ్యులు సిందూర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి సోమవారం పిటిఐకి తెలియజేశారు.ఇది తమకు గర్వకారణమంటూ తల్లిదండ్రులను సంతోసం ప్రకటించారు. "పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినందుకు" తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ భారత సాయుధ దళాలను ప్రశంసించారు. "పహల్గామ్ దాడి తరువాత, భర్తలను కోల్పోయిన అనేక మంది వివాహిత మహిళల జీవితాలు నాశనమయ్యాయి. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీనికి గర్విస్తున్నాజ ఇప్పుడు, సిందూర్ అనేది ఒక పదం కాదు, ఒక భావోద్వేగం. కాబట్టి మా కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము" ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చిన కుషినగర్ నివాసి అర్చన షాహి అన్నారు. ఆమె భర్త అజిత్ షాహి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 26 మంది అమాయకులను చంపినందుకు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుండి, తన కోడలు కాజల్ గుప్తా తన నవజాత శిశువుకు సిందూర్ అని పేరు పెట్టాలని కోరుకుంటుందని పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర"ఆ విధంగా, మేము ఈ ఆపరేషన్‌ను గుర్తుంచుకోవడమే కాకుండా ఈ రోజును పండగలా జరుపుకుంటాం" అని మిస్టర్ గుప్తా పిటిఐకి చెప్పారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తమ నిర్ణయం తమ కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని చెప్పాడు."నా కూతురు పెద్దయ్యాక, ఈ పదం అర్థాన్ని , పరమార్థాన్ని’ తెలుసుకుంటుంది. భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఉంటుంది’’ అన్నారు. ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక పట్టణం పహల్గామ్ సమీపంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరవై ఆరు మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళా అధికారిణులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్‌తో సంచలనం రేపడం విశేషం.ఇదీ చదవండి:138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
DGMO press briefing: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏర్పాటు చేసిన త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడిన డీజీఎంవోలు ఆపరేషన్ తీరుతెన్నుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల డీజీఎంవోలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులతోనే మా పోరాటం. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్.కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోంది. ఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోంది. అందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాం. ఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దే. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాం. #WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD— ANI (@ANI) May 12, 2025 పాక్ వివిధ రాకల డ్రోన్లను వినియోగించింది. మనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్‌తో అడ్డుకున్నాం. చైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్ భారత్‌పై దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాం. పాకిస్తాన్‌లోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో నూర్ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమైంది. సైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసింది ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాల్ని మార్చుకుంటున్నారు. లాంగ్ రేంజ్ మిసైళ్లతో శత్రు స్థావరాలపై ప్రయోగించాం. 9,10వ తేదీలలో పాకిస్తాన్ భారత్‌లోని వైమానిక స్థావరాల్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్‌కు సాధ్యం కాలేదు. మనకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కా స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్‌ను వినియోగించాం. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓ వైపు పాక్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేస్తూనే.. మన ఎయిర్ బేస్‌లను సురక్షితంగా ఉండేలా చూసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాలు సమన్వయంతో కలసి పనిచేశాయి. దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు. -
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
భారత్-పాకిస్థాన్ యుద్ధంలో విరోచితంగా పోరాడుతున్న భారత సైన్యం వేతన వివరాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేశాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసే త్యాగధనులకు ఎప్పటికీ ఈ వేతనాలు ప్రాధాన్యం కావు. పుట్టిన భూమి రక్షణ కోసం, తమ వంతు సాకారం చేస్తూ రణరంగంలో ప్రాణాలు వదిలిన సైనికుల కఠోర దీక్ష ముందు ఇవి ఏ మూలకూ సరిపోవు. చట్టపరంగా వారి సేవలకు గౌరవంగా ఇచ్చుకునే ఈ కొద్దిపాటి వేతన వివరాలు (2024 లెక్కల ప్రకారం సుమారుగా) కింది విధంగా ఉన్నాయి.హోదానెల వారీ వేతనంసిపాయిరూ.25,000ల్యాన్స్ నాయక్రూ.30,000నాయక్రూ.35,000హవల్దార్రూ.40,000నాయబ్ సుబేదార్‌రూ.45,000సుబేదార్‌రూ.50,000సుబేదార్ మేజర్‌రూ.65,000లెఫ్ట్నెంట్రూ.68,000కెప్టెన్రూ.75,000మేజర్‌రూ.1,00,000లెఫ్టెనెంట్ కల్నల్‌రూ.1,12,000కల్నల్‌రూ.1,30,000బ్రిగేడియర్రూ.1,39,000 నుంచి రూ.2,27,000 వరకుమేజర్ జనరల్రూ.1,44,000 నుంచి రూ.2,18,200లెఫ్టెనెంట్ జనరల్రూ.1,82,200 నుంచి రూ.2,24,100చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్రూ.2,50,000ఇదీ చదవండి: ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..అదనపు ప్రయోజనాలు, అలవెన్సులుడియర్నెస్ అలవెన్స్ (డీఏ)మిలిటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ)ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)రవాణా భత్యంఫీల్డ్ ఏరియా అలవెన్స్హై ఆల్టిట్యూడ్ అలవెన్స్స్పెషల్ డ్యూటీ అలవెన్స్వైద్య సౌకర్యాలుపెన్షన్ & రిటైర్మెంట్ బెనిఫిట్స్ -
ఇండియన్ ఆర్మీ యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో భారత్ నాలుగు రోజుల పాటు పాక్‌ని గడగడలాడించింది. అంతేగాదు ఈ నాలుగు రోజుల ఘర్షణలో పాక్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తదితరాలు భారత సైన్యం ధ్వంసం చేసింది. అలాగే పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది భారత్. గత శనివారమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేగాదు భారత్ ఉగ్రమూకల్ని మట్టుబెట్టడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అలాగే ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో దాయాది దేశానికి తెలిసి వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి గస్తీ కాస్తూ.. ఆహర్నిశలు దేశాన్ని రక్షిస్తున్నా మన సైనికులు యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.ఎదురులేని ధైర్యసాహసాలకు గర్వకారణమైన మన భారత సైనికుల యూనిఫాం..చూడగానే ఎక్కడ లేని దేశభక్తి ఉప్పొంగుతుంది. ఒక్కసారిగా మన అటెన్షన్ కూడా గౌరవంతో కూడిన బాధ్యతగా వ్యవహరించేలా మారిపోతుంది. అలాటి ఆర్మీ యూనిఫాం వలస పాలన నుంచి ఎలా రూపుదిద్దుకుంటూ..సరికొత్త మార్పులతో వచ్చింది..?. పైగా సైనికులకు సౌకర్యంగా ఉండేలా ఫ్యాబ్రిక్ తీసుకురావడమే గాక ఆ రంగులనే ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటో చూద్దాం..!.75 ఏళ్ల క్రితం..భారతీయ సాయుధ దళాల యూనిఫాంల మూలం వలసరాజ్యాల వారసత్వంగా వచ్చింది. మొదట్లో బ్రిటిష్ సైనిక సంప్రదాయం కొనసాగించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్‌ను తన బలమైన కోటగా మార్చుకున్న తర్వాత దేశాన్ని మూడు ప్రెసిడెన్సీలుగా విభజించింది. అవి బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ. అప్పుడ మన భారతీయ సైనికులు బ్రిటిష్ సహచరుల మాదిరిగానే పాక్షికంగా ఎరుపు రంగు యూనిఫాంలు ధరించేవారు. అయితే ఈ ఎరుపు రంగు వల్ల యుద్ధభూమిలో చాలా స్పష్టంగా కనిపించేవారు. దాంతో విపరీతమైన ప్రాణనష్టం జరిగేదట. అప్పుడే యూనిఫాంలో మార్పు అవసరం అనేది గుర్తించారట. ఖాకీ ఎప్పుడు వచ్చిందంటే..1848లో, అధికారులు సర్ హ్యారీ బర్నెట్ లమ్స్‌డెన్, విలియం స్టీఫెన్ రైక్స్ హాడ్సన్ భారతదేశంలోని బ్రిటిష్ వలస దళాల కోసం ఖాకీ యూనిఫామ్‌లను ప్రవేశపెట్టారు. ఉర్దూలో దుమ్ము రంగు అని అర్థం వచ్చే "ఖాకీ",రంగు భారతీయ ప్రకృతి దృశ్యంతో బాగా కలిసిపోయింది. పైగా దీని కారణంగా ప్రాణ నష్టం తగ్గిందట కూడా. 1857 భారత తిరుగుబాటు సమయానికి, భారతదేశం అంతటా బ్రిటిష్ దళాలు ఖాకీని విస్తృతంగా స్వీకరించాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలను ప్రభావితం చేసి..క్రమంగా వరల్డ్ ఫీల్డ్ యూనిఫామ్‌ల రంగుగా మారింది.స్వేచ్ఛకు సంకేతంగా మార్పు..1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని కాస్తా ఇండియన్ ఆర్మీగా పేరు మార్చారు. అలాగే పాక్ నుంచి వేరై..దేశభక్తిని సూచించేలా ఆలివ ఆకుపచ్చ రంగుని ఎంచుకుంది.అలాగే బ్రిటిష్ యూనిట్ చిహ్నాలు, ర్యాంక్ బ్యాడ్జ్‌లను తీసేసి జాతీయ చిహ్నాలతో భర్తీ చేశారు. ఇక పాక్ సైన్యం నెలవంకను ఎంచుకుంటే..భారత్ తమ సైన్యం కోసం అశోక చిహ్నాన్ని తీసుకుంది. సైనిక సవాళ్లను అధిగమించడం కోసం..1980లు–1990ల సమయంలో భారత సైన్యం చాలా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుండేది. ముఖ్యంగా ఈశాన్య జమ్యూ కశ్మీర్ వంటి క్లిష్ట భూభాగాలలో సైనికులు యూనిఫాం కనిపంచకుండా ఉండేలా చేయాలసి వచ్చేది. అందుకోసం 1980లలో ఆర్మీ మట్టితో కూడిన ఆకుపచ్చ రంగులను, గోధుమ రంగులను ప్రవేశ పెట్టింది. ఇవి సైనికులను అడవులు, కొండప్రాంతా ప్రకృతి దృశ్యాలలో కలిసిపోయేందు ఉపకరించింది. 2000ల ప్రారంభంలో మరింతగా మార్పులు చేశారు..2000ల ప్రారంభం నాటికి, భారత సైన్యం PC DPM (డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ మెటీరియల్) యూనిఫామ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఫ్రెంచ్ సైన్యంలో ఉపయోగించిన నమూనాల నుంచి ప్రేరణ పొందింది. భారతీయ అవసరాలకు అనుగుణంగా, పిక్సెల్ లాంటి నమూనాతో ఆకర్షణీయమైన లుక్‌తో డిజైన్ చేశారు. బాలీవుడ్, టాలీవుడ్‌తో సహా సైనికుడు లుక్‌కి ఓ ప్రేరణగా నిలిచింది. అయితే ఇది అడవులు వంటి ఎత్తైన ప్రాంతాలలో బాగా పనిచేసినప్పటికీ..రాజస్థాన్ వంటి ఎడారి రాష్ట్రాల్లో ఇది సరైనది కాదని తేలింది. 2022: యూనిఫాంలో ఒక మైలురాయి మార్పుప్రస్తుతం భారత సైన్యం ధరిస్తున్న యూనిఫాం మార్పు 2022లో జరిగింది. ఆర్మీ దినోత్సవం నాడు భారత సైన్యం తన తాజా డిజిటల్ కామఫ్లాజ్ యూనిఫామ్‌ను ప్రారంభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దీన్ని రూపొందించింది. తేలికగా, గాలిని పీల్చుకునేలా త్వరగా ఆరిపోయే కాటన్-పాలిస్టర్ మిశ్రమంతో తీసుకొచ్చింది. ఇది ఆధునిక సైనిక అవసరాలకు అనువగా ఉండటమే గాక అడవుల నుంచి ఎడారుల వరకు అన్ని భారతీయ భూభాగాలను అనుగుణంగా ఏకరీతిలో ఉండేలా డిజైన్ చేశారు.(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..) -
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి నరవణే కౌంటర్ ఇచ్చారు. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తాజాగా మాట్లాడుతూ.. ‘భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అందరూ మాట్లాడుతున్నారు. అసలు యుద్ధం అంటే ఏం తెలుసా?. యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?. యుద్ధం అంత రొమాంటిక్‌గా ఉండదు. యుద్ధానికి వెళ్లడానికి నేను సిద్ధమే అయినా దౌత్యాన్ని తొలి అవకాశంగా చూస్తాను. యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశంగా ఉండాలి. అందుకే ప్రధాని మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారు. తెలివితక్కువ వాళ్ల వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా.. దాన్ని నివారించేందుకే మనం మొగ్గు చూపాలి. ఇప్పుడు చాలామంది పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా.. చర్చలతోనే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటాను. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రి పూట ఆశ్రయ కేంద్రాలకు పరిగెత్తాల్సి పరిస్థితులు ఉంటాయి. ఇవేవీ మిగతా వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. కొన్నిసార్లు దాడుల కారణంగా పిల్లలు సైతం తీవ్రంగా గాయపడతారు. యుద్ధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. యుద్ధమంటే ఖరీదైన వ్యాపారం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్‌పై మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో, ఆయన కామెంట్స్‌పై తీవ్రమైన చర్చ జరిగింది.మరోవైపు.. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ ఒప్పందానికి భారత్ ఎందుకు ఒప్పుకుందని అటు ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా భారత్‌కు జరిగిన లాభమేంటి? అని కామెంట్స్ చేశారు. -
ముగిసిన భారత్-పాక్ DGMOల తొలిరౌండ్ చర్చలు
DGMO Meeting Updatesఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా భారత్-పాక్ దేశాల మధ్య తొలిదశ చర్చలు జరిపాయి. హాట్‌లైన్ ద్వారా జరిపిన చర్చల్లో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. సుమారు గంటపాటు కొనసాగింది. భారత్ తరపున సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాల డీజీఎంవోల సమావేశంలో కాల్పుల విరమణపై విధివిధానాలపై చర్చించారు. ఉగ్రవాదులతోనే మా పోరాటం: అంతకుముందుకు ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల డీజీఎంవో (director general of military operations) మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో డీజీఎంవోలు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులతోనే మా పోరాటంమనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాంఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోందిఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోందిఅందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాంఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్దేచర్చలు వాయిదా.. భారత్, పాకిస్తాన్ డీజీఎంవోల చర్చలు వాయిదా. ఈరోజు సాయంత్రం చర్చలు జరిగే అవకాశం. సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్‌లైన్ ద్వారా రెండు దేశాల డీజీఎంవోలు చర్చలు జరపనున్నారు. చర్చలు ప్రారంభం..భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు ప్రారంభం,హాట్లైన్లో భారత్, పాక్ డీజీఎంవోల చర్చలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశంసమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ 👉భారత్-పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.👉ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు. Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM— ANI (@ANI) May 12, 2025👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్ లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. -
క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!
రావల్పిండి: ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో క్షిపణి దాడి నుంచి తప్పించుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, అందులో పాల్గొంటున్న పలువురు విదేశీ ఆటగాళ్లు పాక్‌లోని రావల్పిండి నూర్ ఖాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికి అక్కడ క్షిపణి దాడి జరిగింది.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి బదులుగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ముష్కరులను మట్టుపెట్టగా... దానికి పాక్ ప్రతిదాడి చేసింది. దీంతో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం... పాకిస్తాన్‌లోని మూడు వైమానిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడి జరగడానికి కాసేపు ముందే అంతర్జాతీయ క్రికెటర్లు నూర్ ఖాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.ఈ ఘటనతో మరోసారిఆసీస్కు చెందిన సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, ఆస్టన్ టర్నర్, మిచ్ ఓవెన్ ఆ సమయంలో పాక్‌లో ఉన్నట్లు పేర్కొంది. పీఎస్ఎల్ వాయిదా పడటంతో శనివారం విదేశీ ఆటగాళ్లు చార్టర్ ఫ్లయిట్లో రావల్పిండి నుంచి బయలుదేరగా... గంటల వ్యవధిలోనే అక్కడ క్షిపణి దాడితో పరిస్థితి భయానకంగా మారిందని పేర్కొంది. పౌర విమాన రాకపోకలను కవచంగా వినియోగించుకుంటూ పాకిస్తాన్ దాడులకు పాల్పడిందనే అంశం ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.మరోవైపు పీఎస్ఎల్లోని మిగిలిన 8 మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. మిగిలిన టోర్నీని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించినా... అటువైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నిరవధికంగా వాయిదా వేసింది. ఇదీ చదవండి: బాబ్ కూపర్‌కు నివాళిమెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన టెస్టు క్రికెటర్ బాబ్ కూపర్ (84) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కూపర్ కన్నుమూసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదివారం వెల్లడించింది. ఆసీస్ క్రికెట్‌కు విశేష సేవలందించిన కూపర్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1964 నుంచి 1968 మధ్య జాతీయ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కూపర్ 27 టెస్టులాడి 2,061 పరుగులు చేశారు. తన ఆఫ్‌స్పిన్‌తో 36 వికెట్లు సైతం పడగొట్టాడు. 1966లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూపర్ 12 గంటల పాటు క్రీజులో నిలిచి 589 బంతుల్లో 307 పరుగులు చేశారు. 20వ శతాబ్దంలో ఆస్ట్రేలియాలో నమోదైన ఏకైక త్రిశతకం ఇదే. 28 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం కూపర్ స్టాక్ బ్రోకర్‌గా మారడంతో పాటు ఐసీసీ మ్యాచ్ రిఫరీగానూ పనిచేశారు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ కూపర్‌కు 2023లో ‘మెడల్ ఆఫ్ ద ఆర్డర్’ అవార్డు దక్కింది. చదవండి: 16 లేదా 17 నుంచి ఐపీఎల్! -
భారత్ సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఆపరేషన్ సిందూర..
-
పాక్‌కు చెక్ పెట్టిన భారత్.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉన్నది వీరే..
ఢిల్లీ: ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర స్థావరాలపై దాడులే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే, ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది.వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు.. పాక్ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. అయితే, తొలుత తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్ బుకాయించినా భారత్ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది.ఇక, తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత్ విదేశాంగశాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్నది వీరే.. లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్, బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్, మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ ఉన్నారు. Video showing Pakistani Army officials attending the funerals of slain Lashkar-e-Taiba (LeT) terrorists yesterday. The man leading the Janaza is Hafiz Abdul Rauf - a US designated terrorist.Once again blurring the lines between state and terror - the world is watching you 🇵🇰 pic.twitter.com/MjsJXcyDMl— Vinayak Tripathi (@belikevinayak) May 8, 2025 -
వీరజవాన్ మురళీ నాయక్ అంతిమ వీడ్కోలు.. జైహింద్.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)
-
భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఎంపీ ఇళయరాజా భారత రక్షణశాఖకు తన ఒక్క రోజు పారితోషకాన్ని విరాళంగా ప్రకటించారు. దీని గురించి ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ పహల్గామ్లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడిచేసిందని, మన దేశ సైనికులు దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. వారి ధైర్య సాహసాలు అభినందనీయం అని తెలిపారు. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకంతో,మన దేశ రక్షణ శాఖకు దేశ పౌరుడిగా, ఎంపీగా తన ఒక్క రోజు పొరితోషికాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్– పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో దేశం మొత్తం హై అలెర్ట్ ప్రకటించడం, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనడం తెలిసిందే. -
అన్ని విధాలా భారత్‌దే పైచేయి.. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు చావుదెబ్బ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే.లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేలి్చచెప్పింది. -
పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...
-
ఆపరేషన్ సిందూర్‌పై అలహాబాదియా వివాదాస్పద పోస్ట్
న్యూఢిల్లీ: పాడ్‌కాస్టర్ రణ్వీర్ అలహాబాదియా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్తానీ అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రణ్వీర్.. వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తడంతో పోస్ట్‌ను తొలగించాడు. పహల్గాం ఉగ్రవాదాడి అనంతరం.. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనిపై యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రియమైన పాకిస్తానీ సోదర సోదరీమణులారా.. ఇది రాయడం వల్ల మరో వివాదానికి ఆహ్వానం పలుకుతానని నాకు తెలుసు. చాలా మంది భారతీయులు నాపై ద్వేషం చిందిస్తారు. అయితే.. చాలా మంది భారతీయుల్లా నా హృదయంలో మీ మీద ద్వేషం లేదు. ఎందుకంటే మీలో చాలా మంది మాలాగే శాంతిని కోరుకుంటున్నారు. తరువాత ఎప్పుడైనా మేము మిమ్మల్ని కలిసినప్పుడు మమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తారు. మేం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాం అనిపిస్తే క్షమించేయండి. మిమ్మల్ని కలిసినప్పుడు భారతీయులు కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ, ఇప్పుడు రెండు దేశాల్లో మీడియా చానళ్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఇరుదేశాల్లోని ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉండే ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ.. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిసి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ కోరుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఆర్మీ పెంచి పోషిస్తుందనడానికి మూడు ఉదాహరణలున్నాయి. ఒకటి.. ఇన్నేళ్లలో పట్టుబడిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌వారే. రెండోది.. జైషే మహ్మద్ చీఫ్ సోదరుడు హఫీజ్ అబ్దుర్ రవూఫ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. దానికి పాక్ మిలిటరీ అధికారులు కూడా హాజరయ్యారు. మూడోది.. పాక్ రక్షణ శాఖా మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్‌తో మాట్లాడుతూ టెర్రరిజాన్ని పాక్ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని అంగీకరించాడు. అయినా.. పాకిస్తాన్ ప్రజల పట్ల మాకు సానుభూతి ఉంది. ఈ ఆపరేషన్ భారతీయులు, పాకిస్తానీయుల మధ్య యుద్ధం కాదు. భారత్.. పాకిస్తాన్ మిలిటరీ, ఐఎస్ఐపై చేస్తున్నది. శాంతి కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని పోస్టులో పేర్కొన్నాడు. రణ్వీర్ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన భారత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, భారత ఆర్మీని కూడా అవమానించాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతిస్తున్నాడని మండిపడ్డారు. దీంతో.. ఆయన పోస్టును డెలిట్ చేశారు. రణ్వీర్ అల్లహాబాదియా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. తల్లిదండ్రుల గురించి అనుచిత జోకులు వేసినందుకు ఈ ఏడాది ప్రారంభంలో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. -
నేనూ సైన్యంలో చేరతా
ఝున్ఝును: పెద్దయిన తరువాత తానూ సైన్యంలో చేరతానని, తన తండ్రి ప్రాణాలు తీసిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు సురేంద్ర సింగ్ మోగా కూతురు వర్తిక ప్రతిజ్ఞ చేసింది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ శనివారం జరిపిన డ్రోన్ దాడుల్లో జమ్మూ కశ్మీర్‌లోని ఉద్ధంపూర్ వైమానిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన జవాను సురేంద్ర సింగ్ మోగాతోపాటు బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. పాక్ డ్రోన్ శకలం ఢీకొని సురేంద్ర మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘శనివారం రాత్రి 9 గంటలకు కూడా నాన్నతో మాట్లాడా. ఆకాశంలో పాక్ డ్రోన్లు తిరుగుతున్నాయని, తాము బాగానే ఉన్నామని నాతో చెప్పాడు. అంతలోనే ఇలా జరిగింది’’ అంటూ 11 ఏళ్ల వర్తిక విలపించింది. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వంగా ఉందని చెప్పింది. పాక్ పేరు కూడా వినపడని రీతిలో అంతం కావాలని ఆకాంక్షించింది. ‘‘నా తండ్రి ప్రాణా లు తీసిన పాక్‌ను వదలను. సైన్యంలో చేరి వాళ్లను ఒకరి తర్వాత ఒకరిగా ఖతం చేస్తా’’ అని చెప్పింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సురేంద్రకు నాలుగు రోజుల కిందట సరిహద్దుకు రావాలని పిలుపు వచి్చంది. దీంతో తన భార్య, 11 ఏళ్ల వర్తిక, 7 ఏళ్ల కొడుకు ద„Š ను స్వస్థలమైన రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా మెహ్రదాసికి పంపించాడు. అంనతరం తాను ఉద్ధంపూర్కు బయల్దేరి వెళ్లాడు. అయితే ఊర్లోని కొత్త ఇల్లు గృహప్రవేశానికి వస్తాడనుకున్న కొడుకు.. త్రివర్ణ పతకాన్ని కప్పుకొని నిర్జీవంగా రావడంతో సురేంద్ర తల్లి కుప్పకూలిపోయింది. ధైర్యవంతుడైన సురేంద్రకు వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గ్రామంలో నెలకొన్న ఉద్విగ్నభరిత వాతావరణంలో, ఆదివారం అధికారిక లాంఛనాలతో సురేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
వీరులారా వందనం
జమ్మూ/ముజఫర్‌నగర్: దేశంకోసం ప్రాణాలర్పించారన్న గర్వం ఓవైపు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న బాధ మరోవైపు.. సరిహద్దు వెంబడి పాక్ కాల్పుల్లో మృతి చెందిన సైనికుల అంత్యక్రియల సందర్భంగా స్వగ్రామాల్లో కనిపించిన ఉద్విగ్నభరిత దృశ్యమది. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, కన్న తల్లిదండ్రులే కాదు.. గ్రామాలకు గ్రామాలు దుఃఖ నదులయ్యాయి. వేలాది మంది అమర జవాన్లకు కన్నీటి నివాళులర్పించారు. ‘అమర్ రహే’ అంటూ నినదించారు. కాల్పుల్లో ఆరి్నయా సెక్టార్‌లోని త్రివా గ్రామానికి చెందిన రైఫిల్‌మెన్ సునీల్ కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. 4జేకే లైట్ ఇన్ఫాంటరీ రెజిమెంట్‌లో సేవలందిస్తున్న సునీల్.. ఆర్ఎస్పుర సెక్టార్లో ఉండగా శనివారం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. 25 ఏళ్ల సునీల్ కుటుంబానిది మిలిటరీ నేపథ్యం. తండ్రి గతంలో పనిచేశారు. ప్రస్తుతం ఇద్దరన్నలు సాయుధ దళాల్లో పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితో దేశంకోసం ఆర్మీలో పనిచేయాలని చిన్నతనం నుంచే స్ఫూర్తిని పెంచుకున్న సునీల్.. దేశ సేవలోనే ప్రాణాలర్పించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్‌కు అతని స్వగ్రామంలో కన్నీటి వీడ్కోలు పలికారు. పవన్.. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో షెల్లింగ్‌లో గాయపడి మృతి చెందారు. అతని కొడుకు చితికి నిప్పటించగా.. వేలాది మంది ‘సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమర్ రహే’, ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినాదాలు చేశారు. కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న సర్జెంట్ సురేంద్రకు రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లాలోని స్వగ్రామంలో, ఆంధప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ముడావత్ మురళీనాయక్‌కు అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అర్ఎస్పురా సెక్టార్‌పై డ్రోన్ దాడిలో మరణించిన బీఎస్ఎఫ్ ఎస్ఐ మహమ్మద్ ఇంతియాజ్‌కు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరీ నివాళులర్పించారు. అనంతరం పారి్థవ దేహాన్ని స్వస్థలం బీహార్‌కు తరలించారు. అధికారులు, సామాన్యులు సైతం.. పాక్ శనివారం జరిపిన షెల్లింగ్‌లో సామాన్య పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. తన ఇంట్లో షెల్ పడటంతో రాజౌరీ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్‌కుమార్ థప మృతి చెందారు. జమ్మూ శివార్లలోని రూప్‌నగర్‌లో ఉన్న అతని నివాసానికి పార్థివ దేహాన్ని తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్‌కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజౌరీ జిల్లాలో జరిగిన షెల్లింగ్‌లో 35 ఏళ్ల మహమ్మద్ సాహిబ్, అతని మేనకోడలు రెండేళ్ల అయేషా మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారి స్వగ్రామం ఖాయ్ఖేడిలో వందలాది మంది కన్నీటివీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. -
అన్నివిధాలా పైచేయి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశీ్మర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేల్చిచెప్పింది. -
‘నూర్ఖాన్’ నేలమట్టం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌పై భారత్ చేస్తున్న మెరుపుదాడుల్లో ఆ దేశ వైమానిక స్థావరాలు నేలమట్టమవుతున్నాయి. తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం మీదా భారత్ దాడులు చేసిన విషయం తాజాగా చైనా ఉపగ్రహ చిత్రాలతో స్పష్టమైంది. చైనాకు చెందిన కృత్రిమ ఉపగ్రహాల సంస్థ ‘మిజాజ్విజన్’ తీసిన తాజా శాటిలైట్ ఫొటోలు భారత దాడి తీరును బహిర్గతం చేశాయి. ఇప్పటికే రఫీఖీ, మురీద్, నూర్ ఖాన్, ఛునియన్, సుక్కూర్‌లలో వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. ఈ దాడులను పాకిస్తాన్ సైతం ధృవీకరించింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌తోపాటు ఛక్వాల్‌లోని మురీద్ స్థావరం, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఝంగ్ జిల్లాలోని రఫీఖీ బేస్‌పైనా బాంబులు పడ్డాయని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మెద్ షరీఫ్ వెల్లడించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలోని నూర్ఖాన్ బేస్ ఆ దేశానికి చాలా కీలకమైన వైమానిక స్థావరం. ఇక్కడ చాలా ప్రధానమైన స్క్వాడ్రాన్లు ఉంటాయి. సైనిక, సరకు రవాణా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సీ–130 హెర్క్యులస్, సాబ్ –2000 సైనిక ఉపకరణాల రవాణా విమానాలను ఇక్కడే నిలిపి ఉంచుతారు. గాల్లోనే విమానాలకు ఇంధనాన్ని నింపే ఐఎల్–78 వంటి రీఫ్యూయిలర్ విమానాలతోపాటు పాక్‌లోని వీవీఐపీలకు సంబంధించిన చిన్న విమానాలకూ ఇదే కీలక స్థావరం. -
‘బ్రహ్మోస్’ దెబ్బకే... పాక్ దిగొచ్చిందా?!
జైపూర్/ లఖ్‌నవూ/ న్యూఢిల్లీ: సరిహద్దులపై ఎడాపెడా దాడులకు తెగబడ్డ పాక్ బ్రహ్మాస్త్రం దెబ్బకు దిగొచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అత్యంత శక్తిమంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను పాక్ మీదికి భారత్ ప్రయోగించినట్టు వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్‌లోని బికనీర్‌లో పాక్ సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మోస్ బూస్టర్, నోస్‌క్యాప్ లభించడం దీన్ని ధ్రువీకరిస్తోంది. ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మూలాలను పెకలిస్తూ పాక్‌లోని బహావల్పూర్లో ఉన్న దాని ప్రధాన స్థావరంపై మే 7 అర్ధరాత్రి దాటాక భారత క్షిపణులు విరుచుకుపడటం తెలిసిందే. బ్రహ్మోస్ బూస్టర్, నోస్ క్యాప్ దొరికింది బహావల్పూర్ ఉన్న దిశలోనే. బ్రహ్మోస్‌ను ప్రయోగించాక దాన్నుంచి విడివడే అనుబంధ భాగాల శకలాలతో అవి దాదాపుగా పోలుతున్నాయి. కనుక ఆ గగనతలం గుండానే బ్రహ్మోస్ దూసుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. బహావల్పూర్లోని జైషే భవనాలను కూల్చేందుకు శక్తిమతమైన క్షిపణులను ప్రయోగించినట్లు భారత్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. వాటిలో బ్రహ్మోస్ కూడా ఉందన్న వార్తలకు ఇది కూడా బలం చేకూరుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యుద్ధంలో బ్రహ్మోస్‌ను వాడటం ఇదే తొలిసారి. అయితే దాని వినియోగాన్ని కేంద్రం ధుృవీకరించడం లేదు.బ్రహ్మోస్ దెబ్బ పాక్‌కు తెలుసు: యోగి ‘‘బ్రహ్మోస్ క్షిపణి సత్తా ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంకా ఎవరికైనా తెలియాలంటే తాజాగా ఆ దెబ్బను రుచిచూసిన పాక్‌ను అడిగి తెలుసుకోవచ్చు’’ అని యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖ్‌నవూలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ కేంద్రం ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘ఉగ్రవాదాన్ని అంతంచేయనంత వరకు ఆ సమస్యకు పరిష్కారం లభించదు. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణచివేయాల్సిన తరుణమొచ్చింది. ఉగ్రవాదం కుక్కతోక వంటిది. దాన్నెప్పటికీ సరిచేయలేం. ఉగ్రవాదులకు వాళ్ల బాషలోనే బుద్ధిచెప్పాలి’’ అన్నారు. సైనిక సందేశం బ్రహ్మోస్: రాజ్‌నాథ్ భారత సాయుధ బలగాల సామర్థ్యానికి బ్రహ్మోస్ నిలువెత్తు నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఆదివారం లఖ్‌నవూలో నూతన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేటెడ్ అండ్ టెస్టింగ్ కేంద్రాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘నేషనల్ టెక్నాలజీ డే (ఆదివారం) రోజే బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది శక్తిమంతమైన ఆయుధం మాత్రమే కాదు, మన సాయుధ బలగాల అమేయ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే ఒక సందేశం. శత్రువులకు సింహస్వప్నం. సరిహద్దుల పరిరక్షణలో మన అంకితభావాన్ని ఈ క్షిపణి చాటిచెబుతుంది’’ అన్నారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ తయారీ కేంద్రంలో మ్యాక్ 2.8 వేగంతో 290 నుంచి 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణుల తయారు చేయనున్నారు. -
మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ/న్యూయార్క్/వాషింగ్టన్: రావణకాష్టంగా రగిలిపోతున్న, దశాబ్దాలుగా ఎటూ తేలకుండా సందిగ్ధత, సంఘర్షణలకు కారణమైన జమ్మూకశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి కనబరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆదివారం స్పందించింది. ‘‘కశ్మీర్‌పై మాకు స్పష్టమైన విధానం ఉంది. చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం గురించే. అంతకంటే మాట్లాడేది ఏదీ లేదు. ఉగ్రవాదుల అప్పగింత గురించి పాక్ మాట్లాడదల్చుకుంటే సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి మాట్లాడటానికి మరో టాపికేమీ లేదు. ఇతర అంశాలపై ఇతరుల మధ్యవర్తిత్వం ఆశించట్లేము. ఇతరులు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు’’ అని ప్రకటించింది. జేజేలు అంటూనే జోక్యానికి యత్నం కాల్పుల విరమణకు ముందడుగు వేసి అత్యంత యుక్తితో వ్యవహరించిన శక్తివంతమైన భారత్, పాక్ అగ్రనాయకత్వాలను చూసి ఎంతో గరి్వస్తున్నానని ఓవైపు పొగుడుతూనే మరోవైపు కశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా నిలబడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకోకపోతే వినాశనం తప్పదని భవిష్యత్ దర్శనం చేసి కాల్పుల విరమణకు మొగ్గుచూపిన భారత్, పాక్ నాయకత్వాలను చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. అయితే దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండి పోయిన కశ్మీర్ అంశానికి పరిష్కారం కనుగొనేందుకు మీ రెండు దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ జోక్యాన్ని స్వాగతించిన పాక్ మధ్యవర్తిగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ కాల్పుల విరమణ అంశంలో మధ్యవర్తిగా వ్యవహరించి నిర్మాణాత్మక పాత్ర పోషించినందుకు అమెరికాను అభినందిస్తున్నాం. ఇక జమ్మూకశ్మీర్ వివాద పరిష్కారానికి కృషిచేస్తానని ట్రంప్ ప్రకటన చేయడం ఎంతో సంతోషకరం. ఆయన సుముఖత వ్యక్తంచేయడాన్ని మేం అభినందిస్తున్నాం’’ అని పాకిస్తాన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
పాక్‌ను చావుదెబ్బ కొట్టాం రాజధానిపైనే దాడి చేశాం
న్యూఢిల్లీ: త్రివిధ బలగాలు నాలుగు రోజుల పాటు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నట్టు భారత సైన్యం వెల్లడించింది. పాక్ సైన్యం అత్యంత తీవ్రస్థాయిలో నష్టాలు చవిచూసిందని తెలిపింది. ఇకముందు కూడా పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేసింది. ‘‘పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. కానీ గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం కాల్పులు, దాడులకు దిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. మన బలగాలు అందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు దీటుగా స్పందించేందుకు బలగాలకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలిచ్చారు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రకటించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్(డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్(డీజీఎన్‌ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్‌తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, తదనంతరం సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు, మన సైనిక ప్రతిచర్య తదితరాల అంశాలను కూలంకషంగా వివరించారు. మొత్తం ఆపరేషన్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులైనట్లు వెల్లడించారు. అమర జవాన్లకు, పాక్ మతిలేని దాడుల్లో దుర్మరణం పాలైన భారత పౌరులకు ఘనంగా నివాళులు అరి్పంచారు. సైనిక ఆపరేషన్ల గురించి త్రివిధ దళాల అత్యున్నతాధికారులు ఇలా సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అత్యంత అరుదు కావడం విశేషం. ఆ ముష్కరులు హతం ‘‘పలు అత్యాధునిక పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చాం. మనకున్న సమాచారం మేరకే 40 మందికి పైగా పాక్ సైనికులు మరణించారు. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరడుగట్టిన ఉగ్రవాదులు యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ తదితరులు ఉన్నారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినవారు, 2019లో పుల్వామా దాడికి పాల్పనవారు మరణించారు. పాక్, పీఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ఉగ్రవాద శిక్షణ పొందిన కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కూతవేటు దూరంలోని అతి కీలకమైన చక్లాలా సహా ప్రధాన వైమానిక స్థావరాలన్నీ మన దాడుల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. లాహోర్ తదితర సైనిక స్థావరాల్లోని కీలక రాడార్ వ్యవస్థలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు’’ అని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వివరించారు. ఇకపై తమ భూభాగంలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో తెలిసొచ్చిందన్నారు. ‘‘మనం ఎంతో సంయమనం పాటించాం. కేవలం పాక్ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. సామాన్య ప్రజల నివాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తపడ్డాం. మన దేశ సార్వ¿ౌమత్వం ప్రాదేశిక సమగ్రతకు, పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’’ అని ఉద్ఘాటించారు. పాకిస్తాన్ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం తనతో మాట్లాడారని, దాడులు ఆపాలని కోరారని తెలిపారు. ఉగ్రవాద క్యాంపులు భస్మీపటలం పాక్ దాడుల్లో భారత్ కూడా యుద్ధ విమానాలు నష్టపోయిందా అని ప్రశ్నించగా, యుద్ధంలో కొన్ని నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి బదులిచ్చారు. అయితే, ‘‘లక్ష్యాలన్నీ సాధించాం. మన పైలెట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు’’ అని చెప్పారు. ‘‘పాక్ యుద్ధ విమానాలు మన భూభాగంలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టాం. అయితే, కచ్చితంగా ఎన్ని యుద్ధ విమానాలు కూల్చేశామన్నది ఇప్పుడే బయటపెట్టలేం. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు, కమాండ్ సెంటర్లు, సైనిక మౌలిక సదుపాయాలు, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేశాం. పాక్ రాజధాని ఇస్లామాబాద్ దాకా చొచ్చుకెళ్లాం. అక్కడ వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేశాం. ఉగ్రవాదుల క్యాంప్‌లను నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యం ఇప్పటికే సాధించాం. ఈ ఫలితాలు మొత్తం ప్రపంచానికి అనుభవంలోకి వస్తాయి’’ అని ఎ.కె.భారతి స్పష్టం చేశారు. పాక్ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని ఫొటోల సాయంతో వివరించారు.పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సముద్రంతోపాటు భూఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాలపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేశామని వైస్ అడ్మిరల్ ఎ.ఎన్.ప్రమోద్ చెప్పారు. పాకిస్తాన్లో ప్రధానమైన కరాచీలోనూ దాడులు జరిగాయని తెలిపారు. ‘‘పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం మేము అప్రమత్తమయ్యాం. అరేబియా సముద్రంలో లైవ్–ఫైరింగ్ డ్రిల్స్, లాంచ్ టెస్టులు, కాంబాట్ ఆపరేషన్ డ్రిల్స్ నిర్వహించాం. పాకిస్తాన్ ముష్కరులకు గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో మా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. మన సైనిక దళాలు అరేబియా సముద్రంలో నిత్యం అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాం. పాకిస్తాన్ సైన్యం దాడులను గట్టిగా తిప్పికొట్టాం. పాక్ నావికాదళంపై మన నావికాదళం పైచేయి సాధించింది. పాక్ ఎత్తుగడలు గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాం. ఇండియన్ నేవీ దాడుల్లో పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాక్ చర్యల పట్ల మన ప్రతిస్పందన దీటుగా, ప్రణాళికాబద్ధంగా సాగింది’’ అని ఎ.ఎన్.ప్రమోద్ స్పష్టం చేశారు. -
పాక్ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు. -
సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది
కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్‌లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్ రాయ్ బచ్చన్) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్ సిందూర్... జై హింద్... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్‌ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్. -
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
మాంగోచార్ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం -
2019 Pulwama attack: ‘పుల్వామా దాడి చేసింది మేమే’: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ (Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో (2019 Pulwama attack) 40మంది భారత సీఆర్పీఎఫ్ (central reserve police force) జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి వెనుక తమ హస్తం ఉందని అంగీకరించింది. ఇన్ని రోజులు పుల్వామా దాడిలో తమకు ప్రమేయం లేదన్న పాక్.. ఇప్పుడు బహిరంగంగా అంగీకరించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్‌కు భారత్ తగిన గుణం పాఠం చెబుతోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో ఇండియన్ ఆర్మీ.. పాక్,పాక్ ఆక్రమిత కశ్మీర్లో క్షిపణి దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాల్ని, ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసింది. దీంతో భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత్ కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్‌పై బహిరంగంగా స్పందించింది.Did he really admit about Pulwama attack,,,😳😳😳#ceasefireviolations#IndiaPakistanWar #IndiaFightsTerroristan pic.twitter.com/6C4l5ohSjb— Vyky Garia (@VkyGaria) May 11, 2025 ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీ ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి,పాక్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ వైస్ మార్షల్,పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ ఔరంగజేబ్ అహ్మద్ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పుల్వామా దాడితో మా ఎత్తుగడ ఎలాంటిదో చూపించాం. మా దేశ గగనతలం, భూమి, జలాలు, ప్రజలకు ముప్పు పొంచి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోం. దేశ ప్రజల రుణం తీర్చుకుంటాం. ఇప్పటికే పుల్వామాలో మా వ్యూహాత్మక చతురత ప్రదర్శించాం’ అని ఔరంగజేబ్ అహ్మద్ అన్నారు.ఔరంగజేబ్ అహ్మద్ ప్రకటనతో ఇన్ని రోజులు పుల్వామా దాడి వెనుక తమ పాత్రలేదని బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు బహిరంగంగా ఉగ్రవాదంతో నెరుపుతున్న సంబంధాల గురించి ప్రకటన చేయడంపై విమర్శలకు దారి తీసింది. -
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
న్యూఢిల్లీ: -అగ్రరాజ్యం అమెరికా సాక్షిగా భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడారు జేడీ వాన్స్. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జేడీ వాన్స్. అయితే పాక్ దాడి చేస్తే తాము దాడికి దిగుతామంటూ జేడీ వాన్స్‌కు మోదీ స్పష్టం చేశారు. తమ సంయమనం బలహీనత కాదని, దేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పారు నరేంద్ర మోదీ. రేపు(సోమవారం) పాకిస్తాన్ తో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ నేతృత్వంలో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అంశంపై చర్చలు జరుగునున్న తరుణంలో జేడీ వాన్స్ ముందగా పోన్ చేసి మోదీతో మాట్లాడారు. అయితే అంతకమునుపే కశ్మీర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీవోకే విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. దీనికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా చెప్పేశారు మోదీ. పీవోకే తమదేనని, ఇందులో ఎవరు జోక్యం అవసరం లేదన్నారు. పీవోకేను తమకు అప్పగించడం ఒక్కటే పాకిస్తాన్ కు ఉన్న ఆప్షన్ అని మోదీ తెగేసి చెప్పేశారు. కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి. పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలు పంపింది భారత ప్రభుత్వం. -
‘ఇది చాలా బాధాకరం.. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన తర్వాత ఆయన ట్రోలింగ్ బారిన పడ్డారు. విక్రమ్ మిస్రీని ఆయన కుటుంబంపై కొంతమంది పనిగట్టుకుని విమర్శలకు దిగారు. దీన్ని ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి. ప్రజాస్వామ్య యుత దేశంలో ఉన్న మనం ఈ రకంగా ఓ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, కీలక ఆపరేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించిన క్రమంలో విక్రమ్ మిస్రీని విమర్శించడం తగదంటూ పలువురు నేతలు ఖండించారు.విక్రమ్ మిస్రీపై విమర్శల చేయడాన్నిభారత మాజీ విదేశాంగశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. ‘ మిస్రీని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లది ఆపరేషన్ సిందూర్ లో ఓ కీలక పాత్ర. అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. ఇందులో ఆయన తప్పేముంది. నాగరిక సమాజంలో ఉన్న మనం ఇలా ఓ వ్యక్తిని ఎలా ట్రోల్ చేస్తాం. విక్రమ్ మిస్రీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇది చాలా చాలా బాధాకరం. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?, మన హక్కుల్ని కాపాడుకునే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఈ రకంగా ట్రోలింగ్ చేసి అధికారులపై మానసికంగా ఒత్తిడి కలిగేలా చేయడం సరైంది కాదు’ అంటూ సల్మాల్ ఖుర్షీద్ ధ్వజమెత్తారు.థాంక్స్ చెప్పడం రాకపోతే..నోరు మూసుకుని కూర్చోండిఅంతకుముందు మరొక కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ అనీస్ సోజ్ కూడా విక్రమ్ మిస్రీని కొంతమంది ట్రోల్ చేయడాన్ని తప్పుబట్టారు. కశ్మీర్ కు చెందిన విక్రమ్ మిస్రీ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం విమర్శలా?, చేసిన దానికి కృతజ్ఞత చెప్పే సంస్కృతి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచిది’ అంటూ హితవు పలికారు.Vikram Misri, a Kashmiri, has done India proud. No amount of trolling can diminish his service to the country. If you can't say thank you, learn to shut up.— Salman Anees Soz (@SalmanSoz) May 11, 2025 నిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీనిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీ అంటూ ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆ తరహా వ్యక్తిని ట్రోల్ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని విమర్శలకునుద్దేశించి ట్వీట్ చేశారు. కార్యనిర్వహక వ్యవస్థలో సేవ చేసే వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వహక వ్యవస్థలో ఉన్న వారిని విమర్శించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు ఓవైసీ. Mr Vikram Misri is a decent and an Honest Hard working Diplomat working tirelessly for our Nation.Our Civil Servants work under the Executive this must be remembered & they shouldn’t be blamed for the decisions taken by The Executive /or any Political leadership running Watan E… https://t.co/yfM3ygfiyt— Asaduddin Owaisi (@asadowaisi) May 11, 2025 -
పీవోకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: మోదీ
ఢిల్లీ: పీవోకేపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు.. పీవోకేను మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదన్నారు మోదీ. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని, పాక్ కాల్పులు జరిపితే భారత్ దాడులు చేయడం ఖాయమన్నారు.. ‘వాళ్లు (పాక్) ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో దాడి చేయండి’ అంటూ త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రేపు పాకిస్తాన్‌తో చర్చల వేళ భారత్ వైఖరి ఏమిటో ప్రధాని మోదీ ఒక్కరోజు ముందుగానే ప్రపంచానికి తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, దానిని పాక్ తమకు అప్పగించడం తప్పితే మరో మార్గం లేదని మోదీ వ్యాఖ్యానిండంతో ట్రంప్ దీనికి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదనే విషయాన్ని మోదీ సూటిగా చెప్పేశారు.ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్,సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాదిపతులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రధాని మోదీ పీవోకే విషయంలో ప్రపంచ దేశాలకు ఓ సందేశాన్ని పంపించారు. అదే సమయంలో పాక్‌కు గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాలకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది #WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్. -
మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్.ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండిపాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను. కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025 -
IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?
ఐపీఎల్-2025 టోర్నీని వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలనిఫ్రాంఛైజీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.అదే విధంగా.. విదేశీ ఆటగాళ్లను కూడా వీలైంత త్వరగా భారత్‌కు రప్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ హెడర్ మ్యాచ్లుఇందులో భాగంగా డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ తాజా ఎడిషన్ 57 మ్యాచ్‌లు పూర్తైన తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే.పహల్గామ్ ఉగ్రదాడికి.. భారత్ ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బదులిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్- పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని భారత్ దాడులు చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే, భారత సైన్యం వీటిని సమ ర్థవంతంగా తిప్పికొట్టింది.అర్ధంతరంగా ముగిసిపోయిందిఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది. శత్రువును దారి మళ్లించే క్రమంలో ధర్మశాలలో బ్లాకవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో ఆట మధ్యలోనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.ఈ నేపథ్యంలో తాజా ఐపీఎల్ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. అయితే, శనివారం భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, దాయాది మరోసారి తన వంకర బుద్ధిని చూపి.. దాడులకు తెగబడింది. తెల్లవారిన తర్వాత మాత్రం పరిస్థితులు కాస్త సద్దుమణినట్లు తెలుస్తోంది.ఆ జట్టుకు మాత్రం తటస్థ వేదికఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం భేటీ అయిన బీసీసీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘మంగళవారం నాటికి అన్ని ఫ్రాంఛైజీలు తమ మ్యాచ్‌లు జరిగే వేదికలకు ఆటగాళ్లను చేర్చాలని బోర్డు ఆదేశించింది.పంజాబ్ జట్టుకు మాత్రం తటస్థ వేదిక ఉంటుంది. కాబట్టి ఇంకా వారి గమ్యస్థానాన్ని నిర్దేశించలేదు. త్వరితగతిన టోర్నీని పూర్తి చేసేందుకు డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది’’ అని తెలిపాయి.కాగా ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతేభారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘‘మిగిలిన మ్యాచ్‌లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. వేదికలు, తేదీలు కొత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.స్టేక్హోల్డర్లు, జట్ల యజమానులు, ప్రసారకర్తలు.. ఇలా లీగ్‌లో భాగమైన ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు! -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన
-
ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంచలన ప్రకటన
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ ిసిందూర్ కొనసాగుతుందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఎయిర్‌ఫోర్స్ అధికారులు వివరాలను వెల్లడించనున్నారు. మాకు అప్పగించిన టార్గెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాం. విచక్షణ, వివేకంతో ఆపరేషన్ సిందూర్ కొనసాగించాం. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌పై ఊహాగానాలు, ఫేక్ వార్తలు నమ్మవద్దు అని అధికారులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్‌కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్-పాక్‌లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. #OperationSindoor | Indian Air Force tweets, "...Since the Operations are still ongoing, a detailed briefing will be conducted in due course. The IAF urges all to refrain from speculation and dissemination of unverified information." pic.twitter.com/tRSoEEZj8t— ANI (@ANI) May 11, 2025#WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025 -
పాక్‌ను ఎలా నమ్మగలం.. శశిథరూర్
ఢిల్లీ: పాక్‌ను ఎలా నమ్మగలం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ దేశ తీరుపై మండిపడ్డారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయినా కూడా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడింది. దీనిపై శశి థరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం పాక్ స్వభావం అంటూ దుయ్యబట్టారు.భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని.. కానీ.. ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో కూడా వారికి తెలిసేలా చేసిందన్నారు. పాక్ గుణపాఠం నేర్చుకోవాలని.. ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలంటూ శిశిథరూర్ వార్నింగ్ ఇచ్చారు.కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించి పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కన్పించాయి.మరో వైపు, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కనిపించాయి. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
పాక్ ఫేక్ ప్రచార సారధి ఓ ఉగ్రవాది కొడుకు
-
ఆపరేషన్ సిందూర్.. భారత వజ్రాయుధాలకు పాక్ గజగజ
-
బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌ను దారికి తెచ్చిన భారత్?
ఢిల్లీ: బ్రహ్మోస్ మిసైల్‌తో పాకిస్థాన్‌ను భారత్ దారికి తెచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్-ఏ (ఎయిర్-లాంచ్డ్) క్రూయిజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్ ఎనిమిది సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.అణు ఆయుధ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసుకోవచ్చనే భయంతో అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్ చేసింది. మే 10న తెల్లవారు జామున, భారత వైమానిక దళం రావల్పిండి సమీపంలోని చక్లాలా, పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధా వద్ద బ్రహ్మోస్-ఏ క్షిపణులతో దాడులు చేసింది.కాగా, యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్థానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది.అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. పాక్ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయింది. -
పాకిస్తాన్‌కు మద్దతుపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు. -
వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
శ్రీసత్యసాయి జిల్లా: జమ్మూకశ్మీర్‌లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాలో అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలను ఆర్మీ అధికారులు నిర్వహించారు.కాగా, జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వం దేమాతరం పాడుతూ మురళీనాయక్‌కు ఘన నివాళులర్పించారు.సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది.‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇవాళ(ఆదివారం) అధికార లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించారు. -
కమికాజ్ డ్రోన్లను ప్రయోగించిన పాక్
న్యూఢిల్లీ: స్వార్న్ డ్రోన్లతోపాటు కమికాజ్ డ్రోన్లను భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ ప్రయోగించగా భారత్ వాటిని విజయవంతంగా అడ్డుకుని ముక్కలుచెక్కలు చేసింది. పహల్గాం ఉదంతం తర్వాత భారత్, పాక్ మధ్య మొదలైన సైనిక చర్యల పర్వంలో పాకిస్తాన్ ఈ కామికాజి డ్రోన్లను ఉపయోగించడం ఇదే తొలిసారి అని రక్షణరంగ నిపుణులు శనివారం వెల్లడించారు. గతంలో అర్మేనియా–అజర్బైజాన్ సాయుధ సంఘర్షణలో, ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యద్ధంలో ఈ కమికాజ్ డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఇప్పుడు భారత్ పైకి పాకిస్తాన్ కమికాజ్ డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగించడంతో ఈ తరహా డ్రోన్లపై చర్చ మొదలైంది. కమికాజ్ డ్రోన్‌ను ఆత్మాహుతి డ్రోన్‌గా పేర్కొంటారు. బాంబును లేదా క్షిపణిని మోసుకొస్తూ సంబంధిత లక్ష్యంగా బాంబు/క్షిపణిని జారవిడవడం లేదంటే స్వయంగా అదే కూలిపోయి, పేలిపోవడం ఈ కమికాజ్ డ్రోన్ ప్రత్యేకత. విరుచుకుపడిన వందల కొద్దీ డ్రోన్లు మే 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత లేహ్ నుంచి సర్ క్రీక్ ఉప్పుకయ్య దాకా 36 వేర్వేరు ప్రదేశాల గుండా సరిహద్దు ఆవలి నుంచి దాదాపు 400 డ్రోన్లు దూసుకొచ్చాయి. దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పలు రకాలైన భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అడ్డుకుని కూల్చేశాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సాంకేతికతతో గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన కారణంగానే ఈ డ్రోన్లను నిరీ్వర్యం చేయగలిగిందని, లేదంటే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఈ డ్రోన్లను కూల్చేశాక వీటి శకలాలను భారత మిలటరీ అధికారులు ల్యాబ్‌లకు తరలించి పరిశీలించడంతో ఇవి కమికాజ్ రకానికి చెందినవని నిర్ధారించారు. పంజాబ్, రాజస్తాన్‌లలో ఈ తరహా డ్రోన్ల శకలాలు లభించాయి. తుర్కియే నుంచే తెప్పించారు తుర్కియే దేశంలోని అసిస్‌గార్డ్ సోన్‌గర్ డ్రోన్ కంపెనీ ఈ కామికాజి డ్రోన్లను తయారుచేస్తుంది. దీంతో వీటిని పాకిస్తాన్ తుర్కియే నుంచే తెప్పించినట్లు స్పష్టమైంది. శనివారం తెల్లవారుజామున సైతం బైకర్ వైఐహెచ్ఏ– ఐఐఐ కమికాజ్ డ్రోన్లు పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల గుండా భారత గగనతలంలోకి వచ్చాయి. వీటిని ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో నేలమట్టం చేశామని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎందుకీ పేరు? కమికాజ్ అనేది జపాన్ పేరు. జపాన్ వైమానిక దళంలోని ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక దళం ఇది. ఇది ఆత్మాహుతి ఫైటర్ పైలట్ల విభాగం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల యుద్ధనౌకలను పేల్చేసేందుకు జపాన్ పైలట్లు తమ యుద్ధవిమానాలను వాటితో ఢీకొట్టించేవారు. అలా రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు 3,800 మంది కమికాజ్ పైలట్లు ఆత్మాహుతి దాడులతో ఏకంగా 7,000 మంది శత్రుదేశాల నావికా సిబ్బందిని చంపేశారు. ఈ స్ఫూర్తితో తయారుచేసిన డ్రోన్లకు కమికాజ్ అని పేరుపెట్టారు. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఐదుగురు హతం!
న్యూఢిల్లీ: పహల్గాం పాశవిక ఉగ్రదాడికి ప్రతిస్పందనగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత్ మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత దాడిచేయడం తెల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ గడ్డపై జరిపిన ఈ క్షిపణి దాడుల్లో తొమ్మిది కీలకమైన ఉగ్ర స్థావరాలు నేలమట్టమై కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన ఐదుగురు సైతం చనిపోయినట్లు కేంద్రం సంబంధిత వివరాలను శనివారం వెల్లడించింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు భారత అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఉన్నతాధికారులు, పోలీసులు సిబ్బంది హాజరయ్యారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ తరఫున అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో ఉగ్రసంస్థలతో పాక్ ప్రభుత్వ చెలిమి మరోసారి బహిరంగంగా బట్టబయలైంది. ఆ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల గురించి క్లుప్తంగా..మొహమ్మద్ యూసుఫ్ అజార్ భారతసర్కార్ గతంలో తయారుచేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో 21వ నంబర్‌గా మొహమ్మద్ యూసుఫ్ అజార్ పేరు ఉంది. దాదాపు 50 ఏళ్లకుపైబడిన వయస్సుండే ఇతను జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు బావమరిది. 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ–814 విమానం హైజాక్ ఉదంతంలో ఇతను కీలక సూత్రధారి. 1998లో అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తిద్వారా తప్పుడు పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి వచ్చాడు. జైషేకు చెందిన బహావల్పూర్ ప్రధాన స్థావరంలో కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలను యూసుఫ్ చూసుకునేవాడు. యూసుఫ్ కుటుంబం సైతం అదే స్థావరప్రాంగణంలో నివసిస్తోంది. ఇతనికి ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీమ్, ఘోసీ సాహెబ్ వంటి మారు పేర్లు ఉన్నాయి. ఆయుధాలను ఎలా వాడాలో యువతకు శిక్షణ ఇస్తాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పథకరచన చేశాడు. ఇతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ గతంలోనే రెడ్‌నోటీస్ ఇచి్చంది. ఇతడిని తమకు అప్పగించాలని 2002లోనే భారత్ పాకిస్తాన్‌ను కోరింది. అజార్‌ను జమ్మూ జైలు నుంచి తప్పించేందుకు పలుమార్లు ప్లాన్లు వేసి విఫలమయ్యాడు. చివరకు భారత ఎయిర్‌పోర్టులో భద్రతావైఫల్యాలు ఉన్నట్లు పసిగట్టి హైజాక్ ప్లాన్‌ను అమలుచేశాడు. హైజాక్ జరిగిన 26 ఏళ్ల తర్వాత సూత్రధారిని భారతబలగాలు అంతం చేశాయి. హఫీజ్ మొహమ్మద్ జమీల్ఇతను కూడా జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. యూసుఫ్‌కు ఇతను అన్నయ్య అవుతాడు. జైషేకు చెందిన మర్కాజ్ సుభాన్ అల్లాహ్‌లోని అతిపెద్ద శిక్షణా కేంద్రానికి ముహమ్మెద్ జమీల్ ఇన్చార్జ్గా ఉన్నాడు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసి, టెర్రరిస్ట్‌లుగా మార్చాల్సిన ప్రధాన బాధ్యత ఇతనిదే. జైషే ఉగ్రసంస్థలో కీలకమైన వ్యక్తి. జైషే సంస్థ కోసం నిధులను సేకరించడంలోనూ అత్యంత చురుగ్గా ఉంటాడు. ముదస్సార్ ఖదియాన్ ఖాస్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో ముదస్సార్ ఖదియాన్ ఖాస్ అత్యంత కీలకమైన వ్యక్తి. ఇతనికి అబూ జుందాల్ అనే మారుపేరు ఉంది. సరిహద్దు నుంచి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కేలోని మర్కాజ్ తైబా ఉగ్రస్థావరానికి ఇతనే సారథ్యం వహిస్తున్నాడు. ముంబైదాడుల్లో ప్రాణాలకు తెగించి పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ స్థావరంలోనే శిక్షణ పొందాడు. మే 7 అర్థరాత్రి తర్వాత భారత దాడుల్లో ఖదియాన్ హతమయ్యాడు. ఈ వార్త తెల్సి పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఇతని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది. లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో అంత్యక్రియలు జరిగాయి. ఆర్మీ చీఫ్ మునీర్ తరఫున లెఫ్టినెంట్ జనరల్, పోలీస్‌విభాగం తరఫున పంజాబ్ ప్రావిన్సు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఇతని మృతదేహం వద్ద సైనికవందనం చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ, ఉగ్రసంస్థలకు మధ్య ఉన్న సత్సంబంధాలు ఇతని అంత్యక్రియల వీడియోతో మరోసారి ప్రపంచానికి తెల్సివచ్చాయి. ఖలీద్ అలియాస్ అబూ అకాషా లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ అయిన ఖలీద్ అలియాస్ అబూ అకాషా సైతం ఈ దాడుల్లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులతో ఇతని ప్రత్యక్ష సంబంధం ఉంది. అఫ్గానిస్తాన్ నుంచి లష్కరే తోయిబా కోసం ఆయుధాలను అక్రమంగా తీసుకొచ్చేవాడు. ఇతని అంత్యక్రియలు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు, పోలీస్‌విభాగం తరఫున పైసలాబాద్ డెప్యూటీ కమిషనర్ ఈ ఖనన క్రతువులో పాల్గొన్నారు. మొహమ్మద్ హసన్ ఖాన్ జమ్మూకశ్మీర్‌లో వేర్వేరు ఉగ్రదాడులకు సమన్వయం చేయడంలో, సహాయసహకారాలు అందించడంలో మొహమ్మద్ హసన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రస్థావర నిర్వహణ బాధ్యతలను చూసుకునే సీనియర్ ఉగ్రవాది ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కశ్మీరీ కుమారుడే ఈ హసన్ ఖాన్. -
సరిహద్దుల్లో కాల్పుల మోత
న్యూఢిల్లీ/జమ్మూ/శ్రీనగర్: సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు శనివారం వరుసగా పదహారో రోజు కూడా కొనసాగాయి. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ (పడగొట్టలేని దృఢమైన గోడ) పేరిట శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా సైన్యం భారీ కాల్పులకు పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు సాధారణ జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్, తార్న్‌తరన్, హరియాణాలోని సిర్సాలో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. పాక్ కాల్పులను సైన్యం దీటుగా తిప్పికొట్టింది. మన ప్రతిదాడుల భయంతో శనివారం తెల్లవారుజాము 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. ప్రభుత్వాధికారి సహా ఆరుగురి మృతి పాక్ కాల్పుల్లో జమ్మూలో ఆరుగురు మరణించారు. 8 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో రాజౌరీ జిల్లా అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ రాజ్‌కుమార్ థాపా, ఓ సైనికాధికారితో పాటు రెండేళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాక్ సైన్యం సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటమే గాక డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. జమ్మూ సహా పలు పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. సైరన్లు నిరంతరాయంగా మోగుతుండడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం ఉదయం 5 గంటలకు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజ్‌కుమార్ థాపా అధికారిక నివాసంపై కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. థాపా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాంతో స్థానికంగా విషాదం అలుముకుంది. థాపా శుక్రవారం సైతం విధుల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో కలిసి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. పాక్ దాడుల్లో రాజౌరీ టౌన్లో ఐషా నూర్ (2), మొహమ్మద్ షోహిబ్(35) మృతిచెందారు. పూంఛ్ జిల్లాలో రషీదా బీ(55) ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు. జమ్మూ జిల్లా ఆర్.ఎస్.పురా సెక్టార్లో అశోక్ కుమార్ అనే పౌరుడు విగతజీవిగా మారాడు. పూంఛ్‌లోని కృష్ణఘాటీ సెక్టార్లో బాంబు పేలుడులో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమరుడయ్యాడు. జమ్మూ శివార్లలోని ఖేరీ కేరాన్ గ్రామంలో జకీర్ హుస్సేన్ (45) మరణించాడు. శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు శ్రీనగర్ శనివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం 11.45 గంటల వేళ ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్‌లోని ఓల్డ్ ఎయిర్‌ఫీల్డ్ వైపు దూసుకొచి్చన ఓ డ్రోన్‌ను సైన్యం కూల్చివేసింది. సీఎం ఒమర్ సంతాపం రాజ్‌కుమార్ థాపా మరణం పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. అంకితభావం కలిగిన సీనియర్ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్మూలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒమర్ పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రజలకు స్థైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.హిమాచల్‌లో డ్రోన్, క్షిపణుల శకలాలు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ఉనా జిల్లాలోని బెహాద్ గ్రామంలో శనివారం క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. కాంగ్రా జిల్లా నూర్పూర్లో రెండుచోట్ల డ్రోన్, మిస్సైల్ విడిభాగాలను గుర్తించారు. అవి సైన్యం కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అక్కడ భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైనిక పోస్టులు, ఉగ్ర లాంచ్ప్యాడ్లు ధ్వంసం జమ్మూ సమీపంలో పాకిస్తాన్ భూభాగంలో సైనిక పోస్టులతో ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ‘‘భారత్‌పై డ్రోన్ దాడులకు ఈ లాంచ్ప్యాడ్లనే వాడారు. ఇవి పాక్‌లోని సియాల్కోట్ జిల్లా లూనీలో ఉన్నాయి’’ అని బీఎస్ఎఫ్ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ భూభాగం నుంచి జరిగిన కాల్పులకు గట్టిగా బదులిచ్చామని వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్ఎఫ్ పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులకు దిగింది. దాంతో పాక్ రేంజర్ల క్యాంపులపై బీఎస్ఎఫ్ విరుచుకుపడింది.మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలుకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ: పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు ప్రాంతాల్లోని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, జమ్మూ సెక్టార్లపై నాలుగు రోజుల పాటు జరిగిన కాల్పుల్లో జిల్లా అదనపు అభివృద్ధి కమిషనర్ సహా 19 మంది చనిపోయారు. ‘పాక్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదన కలిగించింది. మా ప్రజలకు కలిగిన నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. ఆప్తులను కోల్పోయిన వారి వేదనను తగ్గించలేకపోవచ్చు గానీ ఆ కుటుంబాలకు మా వంతు మద్దతుగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తాం’అని సీఎం ఒమర్ పేర్కొన్నారు. -
ఉగ్గుపాలతో దేశభక్తి.. మాధవరం వీరుల స్ఫూర్తి!
తాడేపల్లిగూడెం: ఇక్కడి మట్టిలో పోరాట స్ఫూర్తి ఉంది. తల్లుల ఆశీస్సుల్లో సడలని దేశభక్తి ఉంది. భారత్‌తో గతంలో పాక్ జరిపిన రెండు యుద్ధాల్లో ఈ గ్రామం నుంచి దాదాపు 1,850 మంది పాల్గొనగా, ఇప్పుడు కూడా 500 మంది సైనికులుగా దేశానికి సేవలు అందిస్తున్నారు. వీరిలో దాదాపు 300 మంది తాజా ఆపరేషన్ సిందూర్‌లో ప్రత్యక్షంగా కదన రంగంలో ఉండగా, మరో 200 మంది ‘ఏ క్షణమైనా సరిహద్దులకు రెడీ’ అంటూ వివిధ బెటాలియన్లలో సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామమే పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం. పేరుకు ముందు ‘మిలటరీ’ని చేర్చుకుని, ‘మిలటరీ మాధవరం’గా ప్రసిద్ధి చెందిందంటే, భారత సైన్యంలో ఈ పంచాయతీ ముద్ర ఏమిటన్నది తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి మాతృమూర్తులు ఉగ్గు పాలలోనే దేశభక్తిని రంగరిస్తారు. దేశభక్తి గీతాలే లాలిపాటలవుతాయి. సైనిక హోదాల పేర్లే ఆ పాటల్లో పదాలుగా వినిపిస్తాయి. యుద్ధం ఏదైనా కావచ్చు... వాఘా బోర్డర్ కావచ్చు.. శత్రువుతో పోరాడే మరేదైనా ప్రాంతం కావచ్చు.. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా శత్రువు తోకముడిచేలా పోరాటం చేయడం ఈ సైనికుల చిరునామా. బ్రిటిష్ రెజిమెంట్లలో కూడా ఈ గ్రామస్తులు వివిధ హోదాల్లో పనిచేశారు. సిపాయి నుంచి కల్నల్ వరకు మాధవరం వాసులు దేశ సైన్యంలో సేవలు అందచేశారు. ఇప్పటికీ అందజేస్తున్నారు. వివిధ సేవా ప«తకాలను అందుకున్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధం, చైనా, పాకిస్తాన్ యుద్ధాల్లో ఇక్కడి వీర జవానులు పాల్గొన్నారు. తొలి ప్రపంచ యుద్ధంలో 90 మంది. రెండో ప్రపంచ యుద్ధంలో 1,110 మంది. శ్రీలంక పీస్ కీపింగ్ ఫోర్సులో 12 మంది, 1960లో గోవా లిబరేషన్‌లో 150 మంది, 1962లో చైనా యుద్ధంలో 850 మంది, 1965 ఇండో–పాక్ వార్‌లో 900 మంది, 1971 బంగ్లా విముక్తి పోరాటంలో 950 మంది పాల్గొన్నారు.సైనిక సేవల్లో నా కుమారుడు, కోడలు.. నా కుమారుడు మేజర్ డొంకా ప్రవీణ్, కోడలు మేజర్ డాక్టర్ హరిణి. వీరిరువురూ తాజా ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొంటున్నారు. ప్రవీణ్ ఆఫీసర్ స్థాయిలో పనిచేస్తుండగా, మా కోడలు హరిణి డాక్టర్‌గా సైనికులకు సేవలందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ రెండు సంవత్సరాల కుమారుడిని ఇంట్లో వదిలిపెట్టి కదన రంగానికి వెళ్లారు. నా భర్త ఆర్మీలో 20 సంవత్సరాలు ‘నాయక్’గా సేవచేసి మరణించారు. ఇవన్నీ నాకు గర్వకారణాలు. – డొంకా రత్నకుమారిమా అమ్మాయి, అబ్బాయిని పంపుతా.. నా భర్త రాంబాబు. అరుణాచల్ ప్రదేశ్, రాయ్‌బరేలీ, శ్రీనగర్, అంబాలా (హర్యానా) రాజస్ధాన్, గంగానగర్ ప్రాంతాల్లో సైన్యంలో పనిచేశారు. ప్రస్తుతం జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా (జేసీఓ) విధులు నిర్వర్తిస్తున్నారు. మా మావయ్య వేదాల కృష్ణమూర్తి ఆర్మీలో పనిచేశారు. మా ఇద్దరు మరుదులు రామచంద్రరావు, వెంకటేశ్వరరావులు ఆర్మీలో పనిచేస్తున్నారు. దేశం అవకాశం ఇస్తే నా కుమారుడిని, కుమార్తెను కూడా సైన్యంలోకి పంపడానికి సిద్ధం. – వేదాల అనూష -
మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్‌వర్క్‌లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్‌తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు. -
పాక్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ ప్రజలు, జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం శనివారం దాడులకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ చెప్పారు. భారత్‌లో పలు సైనిక స్థావరాలను, ఎస్–400 క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. పాక్ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. మిస్రీ శనివారం సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను ఏమార్చడం పాక్ ప్రభుత్వానికి అలవాటేనని మండిపడ్డారు. ఇండియా వైమానిక, సైనిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఉద్ఘాటించారు. దేశంలో కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్, సైబర్ వ్యవస్థలపై దాడి చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారాన్ని విక్రం మిస్రీ తిప్పికొట్టారు. వాటిపై దాడిచేసే సత్తా పాక్ సైన్యానికి లేదని పేర్కొన్నారు. దుష్ప్రచారంతో మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు సాగిస్తోందని దాయాది దేశంపై ధ్వజమెత్తారు. అమృత్సర్ సాహిబ్ వైపు భారత సైన్యం క్షిపణులు ప్రయోగించిందని పాక్ ప్రకటించడం పట్ల మిస్రీ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారతదేశాన్ని విభజించే కుట్రలు సాగవని తేల్చిచెప్పారు. భారత సైన్యం అఫ్గానిస్తాన్‌పై ఎలాంటి దాడి చేయలేదని అన్నారు. భారత ప్రభుత్వాన్ని సొంత ప్రజలే విమర్శిస్తున్నారంటూ పాక్ మరో తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే దూషిస్తున్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ దాడుల్లో ఆరుగురు మరణించారని చెప్పారు. పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. వాటిని సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొంటోదని వివరించారు. 26 ప్రాంతాలపై దాడులకు పాక్ యత్నం పాక్ సైన్యం శుక్రవారం రాత్రి ఎయిర్‌బేస్‌లు, రవాణా కేంద్రాలు సహా 26 కీలక ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పంజాబ్‌లోని ఎయిర్ బేస్‌పై హైస్పీడ్ మిస్సైల్ ప్రయోగించిందని అన్నారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్ సమీపంలో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో దాడులు జరిగాయని తెలిపారు. పాక్ సైన్యం డ్రోన్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు వెల్లడించారు. భారత సైన్యం మాత్రం ముందుగా గుర్తించిన టార్గెట్లపైనే దాడికి దిగినట్లు స్పష్టంచేశారు. ప్రధానంగా పాక్ సైన్యానికి సంబంధించిన టెక్నికల్ సదుపాయాలు, కమాండ్, కంట్రోల్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు, ఆయుధాగారాలపై దాడి చేసినట్లు వెల్లడించారు. భారత సైనిక దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. పాక్ దాడులను గట్టిగా తిప్పికొట్టినట్లు స్పష్టంచేశారు. భారత్‌కు భారీ నష్టం కలిగించామంటూ పాక్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, వాస్తవాలు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం సిర్సా, సూరత్‌గఢ్, అజంగఢ్ ఎయిర్ బేస్‌ల ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. ఈ ఫొటోలపై తేదీ, సమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.8 పాక్ సైనిక స్థావరాలు ధ్వంసంనాలుగు భారత వైమానిక స్థావరాలపై దాడికి పాక్ విఫలయత్నం చేసినట్టు ఖురేషీ తెలిపారు. ‘‘ఉదంపూర్, పఠాన్‌కోట్, అదంపూర్, భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లపై దాడులకు పాక్ ప్రయత్నించింది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు స్వల్పనష్టం వాటిల్లింది. ఆ దాడులను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. బదులుగా ఆరు పాక్ వైమానిక స్థావరాలు, రెండు రాడార్ కేంద్రాలపై దాడులు చేసింది. వాటిని చాలావరకు ధ్వంసం చేసి భారీ నష్టం మిగిల్చింది. కేవలం పాక్ ఎయిర్‌బేస్‌లపైనే దాడి చేశాం. సామాన్య జనావాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అని వివరించారు. హరియాణాలోని సిర్సాలో పాక్ క్షిపణి ఫతే–2ను భారత సైన్యం విజయవంతంగా నేలమట్టం చేసిందన్నారు. -
పాక్ రెక్కలు కత్తిరించాం
యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.వైమానిక స్థావరాలుచకాలానూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్–78 విమానాలకు స్థావరం. పాక్ ఎయిర్ మొబిలిటీ కమాండ్‌కు ప్రధాన కేంద్రం కూడా. భారత్‌తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్‌పై జరిపిన డ్రోన్ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్. పాక్ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్లకు అడ్డా. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్ వైమానిక దళ (పీఏఎఫ్) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్‌బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్‌బేస్‌పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్‌లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.రఫీకీపంజాబ్ ప్రావిన్స్‌లో జాంగ్ జిల్లాలోని షోర్కోట్లో ఇస్లామాబాద్‌కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్కోట్ బేస్‌గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ సర్ఫరాజ్ అహ్మద్ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన జేఎఫ్–17, మిరాజ్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్‌బేస్ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్ పంజాబ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్‌వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్ రక్షణ నెట్‌వర్క్‌లో అతి కీలకమైన భాగమిది.మురీద్‌చక్వాల్ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్‌పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్ డ్రోన్ వార్ఫేర్కు చక్వాల్ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్ దాడులకు ప్రతి చర్యగా మురీద్ ఎయిర్ బేస్‌ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.రహీం యార్‌ఖాన్‌దక్షిణ పంజాబ్‌లో రహీం యార్ఖాన్ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్, జైసల్మేర్ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్‌తో పాటు ఇక్కడి రన్‌వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.సుక్కుర్‌భొలారీ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. సింధ్ ప్రావిన్స్‌లో కరాచీ, హైదరాబాద్ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేశారు. సదరన్ ఎయిర్ కమాండ్ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్ కన్వర్షన్ యూనిట్ తాలూకు 19 స్క్వాడ్రన్‌కు కేంద్రం. ఎఫ్–15ఏ, ఎఫ్–16, కొన్ని జేఎఫ్–17లతో పాటు ఏడీఎఫ్ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్ఏఏబీ 2000 ఎయిర్‌బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్) ఉంది.రాడార్ కేంద్రాలుసియాల్‌కోట్‌పంజాబ్‌లోని సియాల్కోట్ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్ కేంద్రం వైమానికంగా పాక్‌కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.పస్రూర్‌ఇది కూడా పంజాబ్‌లోనే సియాల్కోట్ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.చునియన్‌పంజాబ్ ప్రావిన్స్‌లో లాహోర్‌కు 70 కి.మీ. దూరంలో చునియన్ వద్ద ఉంటుంది. పాక్‌లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు: జాన్వీ కపూర్
‘‘ఇన్ని రోజులు మనం యుద్ధం రాకూడదనే కోరుకున్నాం. కానీ, ఉగ్రవాదులు మన ప్రజలను చంపుతుంటే సహించేది లేదు. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వలేదు. ఇన్ని రోజులు మన మీద జరిగిన దాడుల తర్వాత ఆ బాధను తీర్చుకోవడానికే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. వారి దుశ్చర్యలను తిప్పి కొడుతున్నాం. మనది దూకుడు కాదు... దశాబ్దాల బాధకు సమాధానం. అసలు ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు’’ అని హీరోయిన్ జాన్వీ కపూర్ పేర్కొన్నారు.కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురుపిస్తూ, వారికి మద్దతుగా సోషల్ మీడియాలోపోస్టులు పెడుతున్నారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే పలుపోస్టులు పెట్టినప్పటికీ, తాజాగా తన ఇన్ స్టా్రగామ్లో సుదీర్ఘమైనపోస్ట్ పెట్టారు. ‘‘ఇండియా– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జమ్మూపై దాడుల విజువల్స్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను.పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులు నన్ను ఎంతో బాధించాయి. ఇది నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని బాధ. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మనవరకు వచ్చింది. మన సైనికులు సరిహద్దు దగ్గరపోరాడుతూ మనల్ని కా పాడుతున్నారు. మన దేశ సార్వభౌమత్వాన్ని రక్షిస్తున్న సైనికులకు ఎప్పటికీ రుణపడి ఉండాలి.వాళ్ల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. ఇలాంటి సమయంలో దేశం మొత్తం మన భారతీయ జవానులకు మద్దతుగా నిలవాలి. ఈ యుద్ధంలో అమాయకులుప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. మన సైనికుల కోసంప్రార్థిస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పుకార్లను ఇతరులతో పంచుకోవద్దు’’ అంటూ జాన్వీ కపూర్పోస్ట్ చేశారు. ఆమెపోస్ట్పై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్వీర్ సింగ్
‘ఆపరేషన్ సిందూర్’ పై హీరో రణ్వీర్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓపోస్ట్ షేర్ చేశారు. ‘‘ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం(భారతీయులు) ఇబ్బంది పెట్టం. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం.మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్. ఈ ఆపరేషన్‌లో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారికి ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చారు. -
విరమణ.. ఉల్లంఘన
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్‌తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్ వైమానిక, రెండు రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్‌లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్‌లకు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్ ప్రకటించింది. బయటపడ్డ పాక్ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ -
IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం
ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం ⇒ పాకిస్తాన్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు హతంశనివారం రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ జమ్మూ బారాముల్లా, శ్రనగర్ టార్గెట్‌గా పాక్ డ్రోన్ల దాడులుపంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్, రాజస్తాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌గుజరాత్‌లోని కచ్‌లో పూరిస్థాయిలో బ్లాకౌట్‌డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్‌లోని ఆర్మీ చినార్ కోర్స్‌లో హెడ్‌క్వార్టర్ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విదించాలని ఆదేశాలుపాక్ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్ జరిపిన ఈ చర్యకు భారత్ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్‌ఫైర్ ఇక లేనట్లే.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్ అవుట్3 గంట్లల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో కాల్పులుపాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్‌జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ -
దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం: భారత ఆర్మీ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈరోజు(శనివారం) సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయగా, దీన్ని భారత కూడా ధృవీకరించడంతో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ముగింపు దొరికింది.అనంతరం ఇండియన్ ఆర్మీ.. ప్రెస్ మీట్ నిర్వహించింది. ‘ దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల యుద్ధంలో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాక్ తప్పుడు కథనాలు ప్రచారం చేసింది. భారత్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు అసత్య ప్రచారం చేశారు. పాక్ చెప్పినట్లు.. భారత్ ఆర్మీకి ఏమీ నష్టం జరగలేదు. భారత సైన్యం.. పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది. భారత్ పై కవ్వింపు చర్యలకు దిగి, పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఎల్ఓసీ దగ్గర పాక్ తీవ్రంగా నష్టపోయింది. బారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది’ అని భారత ఆర్మీ స్పష్టం చేసింది.భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణభారత్-పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం(శనివారం, మే10) 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.ట్రంప్ పెద్దన్న పాత్రఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్రలో ఇరు దేశాల మధ్య రాజీ కోసం ప్రయత్నించారు. కాల్పుల విరమణకు అమెరికాను పాకిస్తాన్ ఆశ్రయించడంతో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి భారత్‌తో చర్చించారు. దీనికి భారత్ కూడా అంగీకరించి మే 12వ తేదీన పాక్‌తో చర్చలకు సిద్ధమైంది. -
సైరన్ల మోత.. మీడియా ఛానెళ్లకు కేంద్రం కీలక సూచన
ఢిల్లీ: మీడియా ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. సైరన్ల శబ్దాలు వాడొద్దంటూ సూచించింది. అలా వాడితే.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. కేవలం అవగాహన కార్యక్రమాల్లోని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది.భారత్-పాకిస్తాన్ల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సంబంధించి స్థానిక, జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇస్తోంది. ఈ క్రమంలో పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్లను న్యూస్ కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్స్ సమయంలో మాత్రమే ప్రజలు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. -
పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం
భారత - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో మరో జవాన్ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో పోరాడుతూ.. మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామానికి చెందిన ఆర్మీ సోల్జర్ 'సచిన్ యాదవ్‌రావు వనాంజే' (29) జమ్మూ కాశ్మీర్లో నేలకొరిగారు. సచిన్ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.యుద్ధంలో ఇప్పటికే తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందారు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నారు.ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించారు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. -
పాకిస్థాన్‌పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాక్ దాడులకు మించి భారత్ దాడి చేస్తుందన్నారు. ‘‘దేవుడి దయతో మనం భారత భూమిని జన్మించాం. భారత భూమి కోసం ప్రాణాలైన ఇస్తాం. ఇస్లాం పేరుతో పాక్ అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.పాకిస్థాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అసదుద్దీన్ అన్నారు. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపడం దారుణమన్నారు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బతకాలి’ అని అసదుద్దీన్ అన్నారు. -
త్రివిధ దళాల అధిపతులతో మోదీ సమావేశం: కీలక విషయాలు
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన.. భారత సాయుధ దళాల అధిపతులతో న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.పాకిస్తాన్ 26 భారత స్థావరాలపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది. భారత్.. పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న పరిణామాల గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈరోజు ఉదయం మీడియాకు వివరించారు.భారతదేశంపై పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలు రెచ్చగొట్టేవిగా కనిపిస్తున్నాయని విక్రమ్ మిస్రి నొక్కిచెప్పారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు సంబంధించిన ఆధారాలను అందించడంతో పాటు.. పాకిస్తాన్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను బహిర్గతం చేస్తూ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. పాకిస్తాన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి మరింత ఉద్రిక్తతకు దారితీశాయని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం బాధ్యతాయుతంగా ప్రవర్తించిందని అన్నారు. కీలకమైన భారత సైనిక ఆస్తులు, మౌలిక సదుపాయాలను నాశనం చేశామని పాకిస్తాన్ తప్పుడు సమాచారం ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు.A high level meeting was chaired by PM @narendramodi at 7, Lok Kalyan Marg. Those who attended the meeting included Defence Minister @rajnathsingh, NSA Ajit Doval, CDS General Anil Chauhan, armed forces chiefs and senior officials. pic.twitter.com/mECIeuREKz— PMO India (@PMOIndia) May 10, 2025 -
పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు!
ఐపీఎల్-2025 (IPL 2025)ని వాయిదా వేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్వాగతించాడు. దేశ సరిహద్దుల వెంబడి నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా బోర్డు సరిగ్గా స్పందించిందని పేర్కొన్నాడు. అయితే, త్వరలోనే ఈ మెగా టోర్నీ మళ్లీ మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.దాయాది దుశ్చర్యలుపాకిస్తాన్కు ఎక్కువ కాలం పోరాడే శక్తి లేదని.. కాబట్టి త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని గంగూలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత్ చేపట్టిన ఈ చర్యను దాయాది జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అనుచితంగా దాడులకు తెగబడుతోంది.ఈ క్రమంలో దాయాది పాక్ దుశ్చర్యలకు భారత్ గట్టి సమాధానిమిస్తోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి.. రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా సరిహద్దుల వెంబడి పాక్ ఎక్కువగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ.. సామాన్యులు, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది.ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ధర్మశాల స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల పాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.పాకిస్తాన్‌కు అంత సీన్ లేదుఈ పరిణామాలపై స్పందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బీసీసీఐ భారత, విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.అయితే, త్వరలోనే లీగ్ మళ్లీ మొదలు కావాలని ఆకాంక్షిద్దాం. ప్రస్తుతం టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, జైపూర్ వంటి ప్రాంతాలు మినహా.. మిగతా చోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది.కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయనే విశ్వాసం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితులను, ఒత్తిడిని ఎక్కువ కాలం భరించలేదు. ఆ దేశానికి అంతటి సామర్థ్యం లేదు. కాబట్టి బీసీసీఐ కచ్చితంగా ఐపీఎల్-2025ని పూర్తి చేస్తుంది’’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.సురక్షితంగా ఢిల్లీకిఇదిలా ఉంటే.. ధర్మశాలలో మ్యాచ్ రద్దు కాగానే.. బీసీసీఐ పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లను సురక్షితంగా ఢిల్లీకి చేర్చింది. అత్యంత భద్రత నడుమ వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025లో ఇప్పటికి 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా మ్యాచ్‌లలో ఢిల్లీ, కోల్‌కతా, లక్నో జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు! -
26/11 దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఢిల్లీ: 26/11 దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై దాడి సూత్రధారిని భారత్ మట్టుబెట్టింది. ఉగ్ర స్థావరాలపై దాడిలో అబూ జిందాల్ హతమయ్యారు. భారత్ దాడిలో టాప్-5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నెల 7న భారత్ దళాలు చేసిన దాడిలో టాప్-5 ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతమయ్యారు.మురిద్కే, బవహాల్పూర్లో జరిగిన దాడుల్లో ఉగ్రనేతలను భారత్ హతమార్చింది. ముర్కిదే దాడిలో అబు జిందాల్ హతమవ్వగా.. అబు అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ హాజరయ్యారు. కాందహార్ హైజాక్ కీలక సూత్రధారి మహమ్మద్ యూసుఫ్ అజార్‌ను కూడా భారత్ హతం చేసేసింది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ తుడిచిపెట్టేసింది. -
‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరీ(Uttam Maheshwari) ప్రకటిస్తూ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. దీనిపై నెటిజన్స్ మండిపడ్డారు. ఒకవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే..ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడం అవసరమా అంటూ దర్శకుడిని ట్రోల్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చిరవకు దర్శకుడు ఉత్తమ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అందులో పేర్కొన్నాడు. (చదవండి: భారత్‌పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!)‘ఈ సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. డబ్బు కోసం లేదా ఫేమస్ అవ్వడం కోసమే ఇలాంటి పని చేయలేదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రపంచానికి తెలియజేసేలా ఓ పవర్ఫుల్ కథగా వెండితెరపై తీసుకురావాలనుకున్నాను. దేశంపట్ల గౌరవంతో నేను ఈ సినిమా చేయాలనుకున్నాడు. అంతేకాని డబ్బుకి ఆశపడి సినిమా ప్రకటన చేయలేదు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఇది సినిమా మాత్రమే కాదు దేశ ప్రజల ఎమోషన్’ అని ఉత్తమ్ మహేశ్వరీ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా, ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. 26 మంది భారత మహిళల నుదుటిన సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఇదే పేరుతో సినిమాను నిర్మించడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. టైటిల్ కోసం విఫల ప్రయత్నాలు చేశాయి. చివరకు నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఉత్తమ్ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’ తెరకెక్కిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో డైరెక్టర్ పై విధంగా స్పందించాడు. -
26 చోట్ల పాక్ దాడులు.. గట్టిగా దెబ్బతీశాం
-
భారత్-పాక్ ఉద్రిక్తతలు.. జై శంకర్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్
ఢిల్లీ: భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియా సూచించారు. జై శంకర్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. రెండు దేశాలు చర్చలు జరుపుకోవాలని కోరారు. పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలన్న రూబియో.. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామంటూ ప్రతిపాదించారు. భారత్ విధానం ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగానే ఉంటుందని జైశంకర్ అన్నారు.అదే విధంగా.. కొన్ని గంటల ముందు.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు కూడా ఫోన్ చేసి రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో రూబియో.. జైశంకర్‌తో మాట్లాడటం ఇది రెండోసారి. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అలాగే, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో కూడా విడిగా మాట్లాడుతూ, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని చెప్పారు.మరోవైపు, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము నిత్యం సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్, చైనా వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. గురువారం సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అడెల్ అల్ జుబేర్ ఢిల్లీకి రావడం తెల్సిందే. అనంతరం శుక్రవారం ఆయన పాక్ చేరుకున్నారు. ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో చర్చలు జరపనున్న వేళ మంత్రి ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
పాక్ కు చావు దెబ్బ.. టాప్ మిస్సైల్స్ కూల్చేసిన భారత్
-
సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు సరిహద్దు రాష్ట్రాల్లోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇరు దేశాల పరస్పర దాడులకు ప్రతిస్పందనగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఈవై ఇండియా సూచించింది. యుద్ధ కార్యకలాపాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ఎన్సీఆర్, ఛండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్‌లోని సిబ్బంది ఈ మేరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.డెలాయిట్, కేపీఎంజీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా ఇతర ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అత్యవసరం కాని ప్రయాణాలపై ఆంక్షలు విధించామని, సరిహద్దు రాష్ట్రాల్లోని ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్లలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ విధించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?సమస్యాత్మక జిల్లాల్లో తాత్కాలిక పాఠశాలల మూసివేతలు, విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన పలు డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి. -
పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)
-
'ఆపరేషన్ సిందూర్'పై బుద్దిలేని వ్యాఖ్యలు.. నటిపై భగ్గుమన్న నెటిజన్లు
ఆపరేషన్ సిందూర్ గురించి మలయాళ నటి చేసిన కామెంట్ విమర్శలకు దారి తీస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అందులో సుమారు 100 మందికి పైగానే ఉగ్రవాదులు మరణించారు. దీంతో సోషల్ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలికింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ తాము ఆర్మీ వెంటే అంటూ నెటిజన్లు, ప్రముఖులు పోస్ట్‌లు పెట్టారు. అయితే, కేరళకు చెందిన నటి అమీనా నిజమ్.. ఆపరేషన్ సిందూర్ కోసం భారతదేశం 'సిగ్గుపడుతుందని' పోస్ట్ చేసింది.అమీనా తన సోషల్‌మీడియాలో ఇలా రాసుకొచ్చింది 'ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గు పడుతున్నాను. చంపుకోవడం ఒక్కటే మార్గం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. యుద్దం శాంతిని తీసుకురాదు, ప్రాణాలను తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ సపోర్ట్ చేయకండి. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే వ్యక్తులను మోసగిస్తున్నారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల నష్టపోయేది పౌరులే. నేను నా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదానిని కాదు.' అంటూ ఆమె షేర్ చేసింది.నటి అమీనాపై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.. అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయం మీకు గుర్తుచేయాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెను దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపం అనడం, వారిపై సానుభూతి చూపించడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదని ఇది మీ కెరీర్‌కు కూడా అంత మంచిది కాదంటూ చిన్నపాటి వార్నింగ్‌లు కూడా నెటిజన్లు ఇస్తున్నారు.ఎవరీ అమీనా..?అమీనా నిజమ్ కేరళకు చెందిన నటి, ఆమె ప్రముఖ మలయాళ టీవీ రియాలిటీ షో అయిన నాయక నాయకన్ ద్వారా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె అనేక సినిమాలతో పాటు పలు షోలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ 18 (2018) సినిమాతో అలరించింది. ఆ తర్వాత ఆమె పతినేట్టం పడి, అంజామ్ పాతిర, పట్టాపాకల్, టర్కిష్ తర్కం, టర్బో వంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by KRISHNA | KOCHI BRIDAL MEHNDI ARTIST (@mehndibykrish) -
బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో బాస్మతి బియ్యం ధరలు పెరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్(ఏఐఆర్ఈఏ) స్పందించింది. ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఇటీవల బాస్మతి బియ్యం ధరలు పెరగడానికి భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ డిమాండ్ పెరగడమే ధరలు పెరిగేందుకు కారణమవుతుందని తెలిపింది. ధరల పెరుగుదల మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ నుంచి బలమైన డిమాండ్ నెలకొందని వివరించింది.అంతర్జాతీయ డిమాండ్బాస్మతి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మిడిల్ఈస్ట్రన్ దేశాల్లో ఈ బియ్యానికి ఆదరణ అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఆ ప్రాంతాల్లో పెరిగిన దిగుమతి డిమాండ్ ధరలపై ఒత్తిడిని పెంచింది. ఇది దేశంలోని బాస్మతి బియ్యం ఎగుమతి ప్రాంతాల్లో ఒక మోస్తరు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సరఫరాకు ఒప్పందం1509, 1718తో సహా ప్రసిద్ధ బాస్మతి రకాల ధర ఇటీవల పెరిగింది. ఇది ఫిబ్రవరి 2025లో కేజీ రూ.52గా ఉండేది. ఇటీవల దీని ధర పెరిగి కేజీ రూ.58కు చేరింది. కానీ ఇది 2024 సెప్టెంబర్‌లో రూ.62గా ఉంది. అప్పటి ధరల కంటే ప్రస్తుత ధరలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయగా, పాకిస్థాన్ 1 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది. -
ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ, రక్షణశాఖ కీలక ప్రెస్ మీట్
-
భారత్-పాక్ యుద్ధం.. మరోసారి స్పందించిన చైనా
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని గట్టిగా కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ సమస్యను ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్రిక్తత పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా.. నిన్న కూడా(శుక్రవారం) స్పందించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’ అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే.. భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు -
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor )ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టినందుకు హీరోయిన్ సెలీనా జైట్లీ(Celina Jaitly )కి బెదిరింపులు వచ్చాయి. భారత్‌ని ప్రశంసిస్తే అన్‌ఫాలో చేస్తామంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను బెదిరించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా సెలినా ఈ ట్రోల్స్,బెదిరింపులపై స్పందించారు. ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని.. నచ్చని వాళ్లు తనను అన్‌ఫాలో చేసుకోవచ్చని చెప్పారు. ‘నా దేశం(భారత్) గురించి మాట్లాడితే అన్‌ఫాలో చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. వారందరిని నేను ఒకటే చెబుతున్నా.. క్షమాపణలు చేప్పే ప్రసక్తే లేదు. నా దేశం కోసం నేను నిలబడాతాను. ఉగ్రవారదం పేరుతో అమాయకులను బలి తీసుకుంటే స్పందించకుండా మౌనంగా ఉండలేను. హింసను ప్రోత్సహించే వారివైపు నేను ఉండను. భారత్‌పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధపెడితే నన్ను అన్‌ఫాలో చేయండి. నేను శాంతి కోసం, సత్యం కోసం నిలబడతాను. నా దేశ సైనికుల వెంటే నేనుంటాను. నా దేశ సైనికులు కులం, మతం అడగకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ట్రోల్స్‌ని గమనిస్తున్నాను. ఇలాంటి వారిని క్షమించను. జైహింద్’అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సెలీనా జైట్లీ.. ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ..మనసంతా భారత్ గురించే ఆలోచిస్తుందని, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న పోరాటాలను, త్యాగాలను మరిచిపోలేమని ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై కొంతమంది నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడంపై పైవిధంగా స్పదించింది.మిస్ యూనివర్స్ 2003 రన్నరప్‌గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్ప్రెన్యూర్ పీటర్‌ను పెళ్లాడింది. వీరికి 13 ఏళ్ల కవలలు విన్స్టన్, విరాజ్‌తో పాటు ఏడేళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్‌గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్' సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) -
India Pakistan War: బోర్డర్ నుంచి లైవ్ అప్డేట్స్
-
మోదీ సిగ్నల్ ఇస్తే..? పాక్ ని 5 రోజుల్లో లేపేస్తాం: మాజీ జర్నల్
-
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
చెన్నై: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న భారత సైన్యాన్ని విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులను అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా కాట్టాన్‌కొళత్తూర్ సమీపంలోని ఓ ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో లోరా అనే మహిళ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆమె.. సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెట్టారు. ఆపరేషన్ సిందూర్, భారత సైన్యాన్ని విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్‌లో పోస్టులు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమెను సస్పెండ్ చేస్తూ వర్సిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఆమె పోస్టులో.. బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో భారత్.. పాకిస్తాన్లో ఒక పిల్లవాడిని చంపేసింది. ఇద్దరు వ్యక్తులను గాయపరిచింది. మీ స్వంత రక్తదాహం కోసం, ఎన్నికల విన్యాసాల కోసం అమాయక ప్రాణాలను చంపడం ధైర్యం కాదు.. అది న్యాయం కాదు. ఇది పిరికి చర్య! అని ఆమె తన స్టేటస్‌లో రాసుకొచ్చారు. లాక్డౌన్లు, ఆహార కొరత వంటి అనిశ్చితుల గురించి కూడా ఆమె హెచ్చరించారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. Meet Lora S., an Assistant Professor at SRM Institute of Science & Technology.⁰In the wake of Operation Sindoor, she repeatedly posted anti-Army content on her social media.Is this what passes for academic responsibility at @SRM_Univ?She has now been suspended. pic.twitter.com/1pufrM7kSj— Rakesh M (@Fitsanatani) May 8, 2025 -
'ఆపరేషన్ సిందూర్' సినిమా పోస్టర్ విడుదల.. వెనక్కి తగ్గిన రిలయన్స్
'ఆపరేషన్ సిందూర్' (Operation Sindhoor) పేరుతో సినిమా పోస్టర్ వచ్చేసింది. ఈ టైటిల్ కోసం బాలీవుడ్ బడా దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారు. అయితే, ఒక నిర్మాణ సంస్థ తమ బ్యానర్ పేరుతో ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని వారి స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు చేసింది. దీంతో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇదే బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్లో సినిమా రానుంది.‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం సినీ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణసంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడ్డాయి. అయితే, నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకం, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కనుందని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళను చూపారు. ఉత్తమ్, నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రకటించారు. ఇందులో నటిస్తున్న నటీనటులను వారు ప్రకటించలేదు.ఆపరేషన్ సిందూర్, మిషన్ సిందూర్, సిందూర్ : ది రివెంజ్అంటూ ఆపరేషన్ కోడ్‌నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి టైటిల్ వచ్చిన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు.టైటిల్ విషయంలో వెనక్కి తగ్గిన రిలయన్స్ఈ పేరుతో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడటం చూసి నెటిజన్లు ఫైర్ అయ్యారు. సెన్సిటివ్ విషయాన్ని ఇలా వ్యాపారంగా మలుచుకుంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందూరు కూడా రాబందులతో సమానమని చెబుతున్నారు. -
దూసుకొచ్చిన పాక్ బాలిస్టిక్ క్షిపణి.. నిర్వీర్యం చేసిన భారత్
-
పాకిస్తాన్ నగరాల్లో భారత్ ఎటాక్
-
ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
ఆపరేషన్ సిందూర్‌పై పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 'ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును కూడా కొందరు తప్పుపడుతున్నారని, దానిని యుద్ధ దాహమంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని రష్మిక (Rashmika) కోరారు."ఉగ్రవాదం నుంచి రక్షణ కోసం చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్ధతిచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు. వారందరూ దేశ భద్రత, న్యాయం విలువైనవిగా భావించే పౌరులు. మేము శాంతిని కోరుకుంటాం.., అలా అని మాకు తలపెట్టిన హానిని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమాత్రం లేము. రెచ్చగొట్టే దురాక్రమణకు, ఆత్మ రక్షణకు మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది. కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మా దేశ బాధ్యతే అవుతుంది. అది ఎంతమాత్రం అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే మౌనంగా హానిని అంగీకరించడం కాదు. మాకు జరిగిన అన్యాయాన్ని బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు.. మీకు చేతనైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి. మా దేశ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపుతున్న దేశాన్ని ప్రశ్నించండి.' అని రష్మిక రాసుకొచ్చారు. -
ఉగ్రవాదులతో సహవాసం.. భారత్ దెబ్బకు కళ్లు తేలేసిన పాక్
-
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
War Live Updates..ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్విక్రమ్ మిస్త్రి, విదేశాంగ శాఖ కార్యదర్శిడీజీఎంఒల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారుదీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాంకాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్ దే బాధ్యతఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలిఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలిసీజ్ఫైర్ ఇక లేనట్లే.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్ సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్ లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్ అవుట్3 గంట్లల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో కాల్పులుపాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్‌జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025 What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025భారత్-పాక్ కాల్పుల విరమణను ధృవీకరించిన భారత్అధికారికంగా ప్రకటించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీఅమల్లోకి భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంసాయంత్రం 5 గంటల నుంచే అమలు: విక్రమ్ మిస్రీభారత్, పాక్‌ల యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటనఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయిభారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్ ఇరు దేశాలతో సుదీర్ఘంగా రాత్రంతా చర్చించాఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయిఇరు దేశాలకు కంగ్రాట్స్ pic.twitter.com/lRPhZpugBV— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025 బెంగళూరు నుంచి కళ్లి తండాకు మురళీ నాయక్ పార్థివదేహంపాకిస్తాన్ తో యుధ్ధంలో వీర మరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ పార్థివదేహం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడ ఆ వీర జవాన్‌కు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆ జవాన్ పార్థివదేహాన్ని శ్రీసత్యసాయి జిల్లాలోని కళ్లితండా తరలిస్తున్నారు. రేపు(ఆదివారం) సైనిక లాంఛనాలతో వీర మరణం పొందిన ఆ జవాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరో జవాన్ వీరమరణంపాక్ కాల్పుల్లో మరో జవాన్ 'సచిన్ యాదవ్‌రావు వనాంజే' (29) వీరమరణం పొందారు. ఈయన స్వగ్రామం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లాలోని తమ్లూర్.సైరన్ల శబ్దాలు వాడొద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచనసైరన్ల సౌండ్లతో.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందికేవలం అవగాహన కార్యక్రమాల్లోనే వినియోగించాలి ఢిల్లీ :32 విమానాశ్రయాలు మూసివేత9 మే 2025 నుండి 14 మే 2025 వరకు (15 మే 2025న 0529 IST వరకు) ఆపరేషనల్ కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేతభారత విమానాశ్రయాల అథారిటీ (AAI) సంబంధిత విమానయాన అధికారులు జారీ చేసిన ఎయిర్‌మెన్‌కు సూచనల (NOTAMs) వివరాలు 1 తాత్కాలిక విమానాశ్రయ మూసివేత: ◦ ప్రభావిత విమానాశ్రయాల జాబితా: ▪ అధంపూర్ ▪ అంబాలా ▪ అమృత్సర్ ▪ అవంతీపూర్ ▪ బఠిండా ▪ భుజ్ ▪ బికనీర్ ▪ చండీగఢ్ ▪ హల్వారా ▪ హిండన్ ▪ జైసల్మీర్ ▪ జమ్మూ ▪ జామ్‌నగర్ ▪ జోధ్‌పూర్ ▪ కాండ్లా ▪ కాంగ్రా (గగ్గల్) ▪ కేశోద్ ▪ కిషన్‌గఢ్ ▪ కుల్లూ మనాలి (భుంటర్) ▪ లేహ్ ▪ లూధియానా ▪ ముంద్రా ▪ నలియా ▪ పఠాన్‌కోట్ ▪ పటియాలా ▪ పోర్బందర్ ▪ రాజ్‌కోట్ (హిరాసర్) ▪ సర్సావా ▪ షిమ్లా ▪ శ్రీనగర్ ▪ థోయిస్ ▪ ఉత్తర్లై ◦ ఈ కాలంలో ఈ విమానాశ్రయాలలో అన్ని పౌర విమాన కార్యకలాపాలు నిలిపివేయబడతాయి. ఆపరేషన్ సిందూర్.. ఐదుగురు టాప్ ఉగ్రవాదులు హతం26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకున్న భారత్.ముంబై దాడి సూత్రధారిని మట్టుబెట్టిన భారత్.ఉగ్రస్థావరాలపై దాడిలో అబు జిందాల్ మృతిఐదుగురు టాప్ ఉగ్రవాదులను హతమార్చిన భారత్.ఆపరేషన్ సిందూర్ దాడుల్లో భాగంగా ఐదుగురు టాప్-5 టెర్రరిస్టులు హతం.ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం.మురిద్కే, బహవల్పూర్లో జరిగిన దాడిలో ఉగ్రనేతలు మృతి,మురిద్కే దాడిలో అబు జుందాల్ హతం.అబు అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ చీప్ మునీర్.జైషీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది హఫీజ్ మహమ్మద్ జమీల్ హతంలష్కరే ఉగ్రనాయకుడు మహమ్మద్ యూసుఫ్ అజార్ హతం. కాందహార్ హైజాక్ కీలక సూత్రధారి మహమ్మద్ యూసఫ్ ఇవి మే 7వ తేదీ(బుధవారం అర్థరాత్రి) భారత్ మట్టుబెట్టిన ఉగ్రవాదులు వివరాలు Details of terrorists killed in the Indian strikes on 7th May in Pakistan: Sources 1) Mudassar Khadian Khas @ Mudassar @ Abu Jundal. Affiliated with Lashkar-e-Taiba. His funeral prayer was held in a government school, led by Hafiz Abdul Rauf of JuD (a designated global…— ANI (@ANI) May 10, 2025మోదీ హైలెవల్ మీటింగ్త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్ మీటింగ్ప్రధాని నివాసంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమావేశంభేటీలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీ..పాకిస్తాన్ దాడులు, భారత్ కౌంటర్‌పై చర్చ.దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీత్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీరాజ్నాథ్ భేటీలో పాల్గొన్న ఎన్ఎస్ఏ ధోవల్.సరిహద్దుల్లో ఉద్రికత్తలపై గంటకుపైగా చర్చ. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు..శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లుఉదయం 11.45 గంటల సమయంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారుల వెల్లడికొన్ని ప్రాంతాల్లో మోగిన సైరన్లు.. పేలుడు శబ్దాలతో వణికిపోయిన ప్రజలుశనివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు Srinagar airport early morning pic.twitter.com/rK9diP6Xov— Maroof (@maroof2221) May 10, 2025పాక్‌కు భారీ నష్టం..పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్న భారత వైమానిక దళం.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్‌పై దాడులురెండు రోజులుగా పాక్‌లోని ప్రధాన నగరాలపై వాయుసేన దాడులుభారత వైమానిక దాడుల్లో లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, పెషావర్, ఇస్లామాబాద్‌లో భారీ నష్టం.నూర్ఖాన్, ముర్షీద్, రఫికీ ఎయిర్‌బేస్‌లపై దాడి.నాలుగు పాక్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్.భారత్ దాడులతో పాక్ ప్రజలు నగరాలు వదిలేసి వెళ్లిపోతున్నారు.కరాచీలోనూ భయంతో పాక్ ప్రజలు తరలి వెళ్తున్నారు.ఇస్లామాబాద్‌లో ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు బంద్.పాకిస్తాన్లో ఎయిర్‌పోర్టులన్నీ షట్‌డౌన్.సియోల్కోట్లో మరో ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత్. అజిత్ దోవల్ భేటీ.. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న అజిత్ దోవల్. సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్న దోవల్.ఇంతకుముందే త్రివిధ దళాలతో భేటీ అయిన దోవల్. ఢిల్లీ..రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం.ౌసౌత్ బ్లాక్‌లో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.పాకిస్తాన్ దాడులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్యలుఉదయం 10:30 గంటకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం. ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించనున్న అధికారులు.పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్‌ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ.జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న పాకిస్తాన్ కాల్పులు.రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ.#WATCH | J&K: Parts of a damaged drone found in a field in RS Pura. pic.twitter.com/Y3akkre6pQ— ANI (@ANI) May 10, 2025#WATCH | J&K: A house in the civilian area in Jammu suffered massive damage due to heavy shelling by Pakistan. pic.twitter.com/eqbHYcqB9w— ANI (@ANI) May 10, 2025అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..భారత్, పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.భారీగా భద్రతా దళాల మోహరింపు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.జమ్ము, రాజస్థాన్, పంజాబ్‌లో జనావాసాలపై పాక్ దాడులు.జానీపూర్ నివాస ప్రాంతంలో పాక్ మిస్సైల్ దాడులు. #WATCH | J&K: SDRF, local police, administration, and other agencies are at the spot. They cordoned off the place near Aap Shambhu Temple where a Pakistani strike occurred.As per the SDRF personnel, there has been no casualty. pic.twitter.com/FLLcHEc96X— ANI (@ANI) May 10, 2025పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు.. పాక్ మిలిటరీ పోస్ట్.. టెర్రర్ లాంఛ్‌ప్యాడ్ ధ్వంసంసరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులునియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీపంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ క్షిపణి శకలాలు లభ్యంజమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యంపౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు. #WATCH | A projectile debris in Rajasthan's Barmer as Pakistan started targeting civilian areas. pic.twitter.com/tENtKWlLOa— ANI (@ANI) May 10, 2025 #WATCH | J&K | Splinters and debris of a projectile retrieved from Akhnoor pic.twitter.com/SR3qe3gHbv— ANI (@ANI) May 10, 2025 పాక్‌కు చుక్కలే..పాక్ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.పాక్ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్. #WATCH | Parts of a projectile found in a field in Amritsar, Punjab. pic.twitter.com/bPxXOxWT8n— ANI (@ANI) May 10, 2025#WATCH | Amritsar, Punjab | Debris of a drone were recovered from a field in Muglani Kot village pic.twitter.com/zxmklvX2tL— ANI (@ANI) May 10, 2025 #WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw— ANI (@ANI) May 10, 2025నేడు భారత సైన్యం మీడియా సమావేశం.నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆపరేషన్ సిందూర్ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్ దాడులు తీవ్రతరం..లాహోర్, ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ దాడులు. మూడు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.వీటిల్లో ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కీలక స్థావరంరెండు పాకిస్థాన్ ఫైటర్ జెట్ల కూల్చివేతశ్రీనగర్ బేస్ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలుశ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుఆకాష్ జెట్‌తో పాక్ క్షిపణులను కూల్చివేసిన భారత్. Pakistan tried to hit the capital of India, New Delhi by it's long range missile Fateh-2But intercepted by Barak-8 missile defence system in Sirsa of Haryana#IndianArmy please ekbar attacking mode me aajao 😡🙏#IndiaPakistanWar #IndianNavyAction pic.twitter.com/x3kd7v87W2— Priyanshu Kumar (@priyanshu__63) May 9, 2025📹VIDEO : Pakistani citizen (lahore) sharing reality of Indo-pak war. exposed Pakistan's failure & pak media lies.India is right on Top. 👍👍 pic.twitter.com/Ff44gptNlc— Vaishnavi (@vaishu_z) May 9, 2025 Lahore, Pakistan is now being targeted by India. Pakistan’s 2nd largest city and one that is fully undisputed.This war is escalating very quickly. pic.twitter.com/6lzojd3DcY— Spencer Hakimian (@SpencerHakimian) May 10, 2025పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు.పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత. పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్, రావాల్పిండి, పెషావర్లపై దాడి చేసింది. నూర్ఖాన్, మురీద్, రఫికి ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిన భారత్. డ్రోన్స్, మిస్సైల్స్‌తో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసిన భారత్.నూర్ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.భారత్ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులను తెగబడింది.జమ్ము,శ్రీనగర్, అమృత్సర్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్.భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.మిస్సైల్స్ ద్వారా పాక్ దాడులను అడ్డుకున్న భారత్.ఫతా వన్ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.#WATCH | Jalandhar, Punjab: Parts of a Pakistan drone recovered after a blast in Kanganiwal village in Rural Jalandhar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZogqS588tR— ANI (@ANI) May 10, 2025 #WATCH | Loud explosions are being heard in Poonch area of Jammu and Kashmir. (Visuals deferred by unspecified time) pic.twitter.com/VkjzgY8jYc— ANI (@ANI) May 10, 2025టార్గెట్ పఠాన్‌కోట్..పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.రెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్.అన్నిచోట్ల పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఎయిర్‌బేస్ బంద్.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్.శ్రీనగర్ టార్గెట్‌గా పాకిస్తాన్ ాదాడులు.శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. At least 4 airbases in Pakistan have been targeted by Indian strikes: Sources pic.twitter.com/3ZegA6YmzM— ANI (@ANI) May 10, 2025పాక్ డ్రోన్లు దాడులు.. సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది.కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జోద్పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు. -
36 నగరాలపై రెచ్చగొట్టేల 400 డ్రోన్లతో పాక్ దాడి
-
దేశవ్యాప్తంగా హై అలర్ట్
-
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్‌కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
ప్రతీ దాడికి పక్కా రికార్డు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను బాంబులు, క్షిపణులతో ధ్వంసం చేస్తున్న భారత బలగాలు.. ఆ దాడుల వివరాలను పక్కాగా రికార్డు చేస్తున్నాయని సమాచారం. ఈ నెల 7న పాక్, పీవోకేలోని 9 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది. ఆయా స్థావరాలు ఎవరివి? ఏ ఉగ్రవాద సంస్థ వాడుతోంది? ప్రస్తుతం అందులో ఎవరు ఉంటున్నారు? అనే వివరాలను భారత బలగాలు రికార్డు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా చిత్రీకరించి భద్రపరిచినట్లు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు సమాచారం. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ఆధారాలను ఉపయోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ఇండియా పవర్ఫుల్ వెపన్స్.. శత్రువులకు సింహస్వప్నం!
పాక్ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్–400, ఆకాశ్ ఎన్జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది సోవియట్ కాలంనాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ (ఎస్ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్ యాంటెన్నాలతో కూడిన 4ఆర్90 యత్నాగన్ రాడార్ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (సీఏయూఎస్). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్ డిటెక్షన్, సాఫ్ట్/హార్డ్ కిల్ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్ (ఎలక్ట్రో–ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్ కిల్ (డ్రోన్ల కమ్యూనికేషన్ సిగ్నల్స్ జామింగ్), హార్డ్ కిల్ (నేలకూల్చడం) చేస్తుంది.సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (సమర్). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్–1 వ్యవస్థ ఆర్–73ఈ, సమర్–2 ఆర్–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్–73ఈ మిసైళ్ల రేంజ్ 8 కి.మీ. ఆర్–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.→ ఎల్–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివాటి ద్వారా ఎల్–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్. షిల్కా అనేది వీటి రష్యన్ నిక్‌నేమ్. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్ ప్రొపెల్డ్ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దాయాది.. మళ్ళీ బరితెగింపు
దాయాది బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్‌పై విరుచుకుపడేందుకు విఫలయత్నం చేసి చావుదెబ్బ తిన్న పాకిస్తాన్.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయతి్నంచింది. శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూకశీ్మర్ మొదలు రాజస్తాన్ దాకా 26కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జో«ద్‌పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో శుక్రవారం రాత్రి సమీక్షించారు. న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. చీకట్లు పడుతూనే జమ్మూ కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జో«ద్‌పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీలో పాల్గొన్నారు. భావి కార్యాచరణపై లోతుగా చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి మిస్రీ, దోవల్‌తో కూడా మోదీ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమై పరిస్థితిపై చర్చించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సరిహద్దుల వెంబడి పరిస్థితిపై కూలంకషంగా సమీక్ష జరిపారు. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా పూర్తిస్థాయిలో విధుల్లో నియోగించాల్సిందిగా ఆర్మీ చీఫ్‌ను కేంద్రం ఆదేశించింది. శత్రువుకు మర్చిపోలేని రీతిలో బుద్ధి చెప్పాలని సైన్యాన్ని రాజ్‌నాథ్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీ వివేక్ శ్రీవాత్సవ సర్క్యులర్ పంపారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పలు విమానాశ్రయాల మూసివేతను మే 15 దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి. పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు. -
ఈ నెల 13న కళ్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ద దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందారు. -
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.ఈ సమయంలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే.. రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం.. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ సెంటర్లకు కాల్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.#TravelAdvisoryFollowing a notification from aviation authorities on continued closure of multiple airports in India, Air India flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Chandigarh, Bhuj, Jamnagar and Rajkot – are being cancelled till…— Air India (@airindia) May 9, 2025 -
'పిల్లల చనిపోతున్నారు': కన్నీళ్లు పెట్టుకున్న జమ్మూ & కాశ్మీర్ మాజీ సీఎం
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. పాక్.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో సరిహద్దులో ఉన్న అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలు సైతం చనిపోతుండటం ఎంతో బాధాకరమని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 'మెహబూబా ముఫ్తీ' పేర్కొన్నారు.పాకిస్తాన్ సైనిక చర్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ కాల్పుల్లో పిల్లలు.. మహిళలు మరణిస్తున్నారని అన్నారు. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ''అప్పటి వరకు ఆడుకుంటున్న కవలలు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయారు''. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జమ్మూ & కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారు ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి?.. తల్లులకు ఎంతకాలం ఈ కడుపుకోత? అని ప్రశ్నిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.పూంచ్, రాజౌరి, జమ్మూ జిల్లాల్లో పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి. పాక్ కాల్పులకు 16 మంది మరణించారు. ఇందులో ఐదుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ చర్యకు భారత సైన్యం కూడా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రోన్లు & క్షిపణులను ఉపయోగించి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ మరో ప్రయత్నం చేసింది. అయితే వీటన్నింటి కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది.#WATCH | Srinagar, J&K | On India-Pakistan tensions, PDP chief Mehbooba Mufti says, "What is the fault of the children and women that they are getting trapped in this crossfire?... Military action treats symptoms, not the root cause. It never provides a solution or peace. Both… pic.twitter.com/n6lCwYlwuj— ANI (@ANI) May 9, 2025 -
పాక్.. ప్రపంచాన్ని మోసం చేసే కుట్ర
-
ఆ డ్రోన్లు టర్కీవే.. పాకిస్తాన్ కుట్రలను బయటపెట్టిన విదేశాంగ శాఖ
పాకిస్తాన్ దుశ్చర్యలను భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. గత రాత్రి(గురువారం) పాకిస్తాన్ చేపట్టిన దుస్సాహసాన్ని భారత్ ఎండగట్టింది. భారత సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసి 300 నుంచి 400 డ్రోన్లను పాక్ ప్రయోగించిందని స్పష్టం చేసింది. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన ఈ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిందని పేర్కొంది.. జమ్మూలో సుమారు 34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందని.. పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీకి చెందినవిగా బహిర్గతం చేసింది.‘నాలుగు ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసుకుని.. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే భారత్ చేసిన దాడితో పాకిస్తాన్ తీవ్ర నష్టాన్ని చూసింది. పౌర విమానాలను సైతం పాక్ టార్గెట్ చేసి దాడులు చేసింది., వాటన్నింటిని పేల్చేశాం.లేహ్ నుంచి సర్‌క్రీక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. పాక్ డ్రోన్లన్నింటిని భారత్ ధ్వంసం చేసింది. డ్రోన్ శిధిలాలను పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి.. ఈ ఘర్షణలకు మత రంగు పులిమెందుకు పాక్ ప్రయత్నం చేస్తోంది. గత రాత్రి పాకిస్తాన్ భారత నగరాలపై.. పౌరులపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపింది. కానీ భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది.పాక్ దాడులకు సంబంధించి ప్రభుత్వ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. పూంఛ్‌లో గుడ్వారాపై జరిపిన దాడిలో స్థానిక సిక్కులతో పాటు.. ధార్మిక గాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ పాక్ ఈ దాడిని ఒప్పుకోకుండా నాటకాలు ఆడుతోంది. నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసినట్టు పాక్ అబద్ద ప్రచారం చేస్తోంది. పాక్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ, నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసిందని అబద్ద ఆరోపణలు చేస్తూ.. భారత్‌ను అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "... IMF meeting is going on today, we will present our side in the meeting. Our perspective on these things will be shared with the fellow members. It is on the board to decide further... India has responsibly and adequately… pic.twitter.com/dyEevy8wfa— ANI (@ANI) May 9, 2025 -
జవాన్ మురళి నాయక్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్భ్రాంతి
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో మరణించిన మురళీ నాయక్ మృతి పట్ల కేంద్ర మంత్రి 'బండి సంజయ్' దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మురళి నాయక్ వీరమరణాన్ని యావత్ భారతదేశం గుర్తుంచుకుంటుంది. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం వెలకట్టలేనిది. మురళీనాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని బండి సంజయ్ అన్నారు. మురళీ నాయక్ తండ్రితో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పిన సంజయ్.. వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు.శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరిన మురళీ నాయక్.. నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు.మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపులు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ తమ సైనిక చర్యలతో దాయాది దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ.. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడి చేస్తూ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది.పాక్ కూడా సరిహద్దు వెంబడి తీవ్ర స్ధాయిలో కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేకాకుండా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్య నగరాల్లో డ్రోన్ దాడికి యత్నించి పాక్ విఫలమైంది. ప్రస్తుతం ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అరుణ్ జైట్లీ స్టేడియంను పేల్చివేస్తామని పేర్కొంటూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కు శుక్రవారం బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని డీడీసీఎ అధికారి ఒకరు ధ్రవీకరించారు."మీ స్టేడియంలో బాంబు పేలుడు జరుగుతుంది. భారత్‌లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ బ్లాస్ట్‌తో ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చు కుంటామని" మెయిల్లో రాసి ఉన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌గా ఉంది. ఈ అరుణ్ జైట్లీ స్టేడియం మే 11న గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా నిలిపివేసింది. -
మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే
ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. మన సైనికులకు అండగా ఉంటానని మాటిచ్చారు. తన లేటెస్ట్ మూవీ వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం మన సైనికులకు విరాళంగా ఇస్తానని మాటిచ్చారు.(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అల్లు అరవింద్.. గతంతో పోలిస్తే సినిమాలు తీయడం బాగా తగ్గించేశారు. కొన్ని చిన్న చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలా తీసిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. శ్రీ విష్ణు, కేతిక, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సందర్భంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను భారత ఆర్మీకి అండగా ఉంటానని, సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతమేర ఆర్థిక సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈయనలానే మిగతా దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్లు కూడా సాయం చేసి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుకుందాం.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో లెక్కకు మించి ఫేక్ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ప్రజలకు తనవంతు బాధ్యతగా ఓ సూచన చేశారు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) 'పాజిటివ్, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ భారత సైనిక చర్యలని మీరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీరు శత్రువలకు సాయం చేసినవాళ్లు అవుతారు. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.మొన్నటివరకు రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి జూన్ లో ప్రారంభించనున్నారు. అప్పటిలోపు పరిస్థితులు సద్దుమణిగితే సరేసరి. లేదంటే సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడొచ్చేమో? ఇకపోతే రాజమౌళి.. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్ గా ఆపరేషన్ సిందూర్ అని రాసి ఉన్న ఫొటోని పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) If you see any movement of the Indian Army, don’t take pictures or videos.Don’t share them as you might be helping the enemy. Stop forwarding unverified news or claims. You’ll only create noise, which the enemy wants.Stay calm, alert and positive.Victory is ours. 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025Saluting our Brave Indian Armed Forces for their unwavering courage in protecting our nation from terrorism. Let’s stand together as a nation, inspired by their valor, to build a future of peace and unity. Jai Hind! 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025 -
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్లను పాక్ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలమైంది. పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు.పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 -
ఇండియా-యూఎస్ వయా యూరప్
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడం ఎయిరిండియాకు కొత్త రూట్లలో తమ కార్గో విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. కార్గో సర్వీసుల్లో భాగంగా యూరప్ మీదుగా యూఎస్, కెనడాకు విమానాలను నడపవలసి వస్తుంది. అయితే పాకిస్థాన్ మీదుగా కాకుండా చుట్టూ తిరిగి అమెరికా వెళ్తుండడంతో కార్గో రవాణాకు ఎక్కువ సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఫలితంగా ఇంధన వినియోగం పెరుగుతున్నట్లు పేర్కొంది. అందుకు కొన్ని నాన్‌స్టాప్ విమానాలు, వన్-స్టాప్ విమానాలను నడుపుతున్నట్లు చెప్పింది.ఆపరేషనల్ మార్పులుముంబై-న్యూయార్క్ విమాన సర్వీసులను నాన్ స్టాప్ సర్వీసులకు పునరుద్ధరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ-అమెరికా/కెనడా విమానాలు వియన్నా లేదా కోపెన్ హాగన్‌లో ఇంధనం నింపుకుంటున్నాయని చెప్పింది. ఢిల్లీ-యూఎస్ మార్గంలో నాన్‌స్టాప్ విమానాల్లో ఇంధనం సాధారణంగా 90-130 టన్నుల వరకు ఖర్చవుతుంది. కానీ వన్-స్టాప్ విమానాలు ఈ ఇంధన భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దాంతోపాటు ఎక్కువ సరుకు రవాణాకు వీలుంటుంది.కార్గో సామర్థ్యం పెంపుయూరప్గుండా ప్రయాణించే వన్-స్టాప్ విమానాలు నాన్‌స్టాప్ విమానాల కంటే 2-3 రెట్లు అధికంగా కార్గోను మోసుకెళ్లగలవని కంపెనీ తెలిపింది. దాంతో ఈమేరకు కొన్ని నాన్‌స్టాఫ్, నాన్ స్టాఫ్ విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?పెరుగుతున్న మామిడి ఎగుమతులుదేశంలో ఉత్పత్తవుతున్న మామిడి ఎగుమతులు పెరుగుతున్నాయి. దాంతో కార్గో అవసరాలు అధికమయ్యాయి. గత వారం ఎయిరిండియా వన్ స్టాప్ విమానాల ద్వారా 20 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేశారు. ఈ సీజన్లో తమ సంస్థ ఇప్పటికే 350 టన్నుల మామిడి పండ్లను రవాణా చేసిందని కేబీ ఎక్స్‌పోర్ట్స్ సీఈఓ కౌశల్ కఖర్ పేర్కొన్నారు. జూన్ నాటికి ఇది 1,200 టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రీ-రూట్ చేసిన కొన్ని సంస్థల విమానాలు వాటి ప్రయాణాల్లో అసౌకర్యాన్ని ఎదుర్కొంటుండగా, ఎయిరిండియా కార్గో ఆదాయాన్ని పెంచుకోవడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. -
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు మన టెర్రరిస్టులకు చెప్పాల్సిందేమో సార్..! -
దెబ్బ మీద దెబ్బ.. భారత్ దాడులతో పాక్ బెంబేలు
పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు. ఇదిలా ఉండగా, పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–9బీఈ, ఎఫ్ డీ– 2000, హెచ్‌క్యూ–16ఎఫ్ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్ ఆధారపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్వై–80, ఎఫ్ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్‌కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్వై–80ను పాక్ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్ చేసిన దాడిలో హెచ్‌క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్‌క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు. -
మరో పెద్ద తలకాయ లేచింది!
-
పాక్ ఆర్మీ బేస్ పై విరుచుకుపడిన భారత్ డ్రోన్లు
-
'థగ్ లైఫ్' ఈవెంట్ వాయిదా.. ఇది వేడుకల సమయం కాదు: కమల్
కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. మే 16న ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరగాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో భారత పౌరలకు ఇబ్బంది కలిగించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.'ఆర్ట్ కెన్ వెయిట్.. ఇండియా కమ్స్ ఫస్ట్' అనే శీర్షికతో కమల్ హాసన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'మన దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మే 16న జరగాల్సిన 'థగ్ లైఫ్' ఆడియో విడుదలను వాయిదా వేస్తున్నాం. తిరిగి షెడ్యూల్ వివరాలను తెలుపుతాము. మన సైనికులు మన మాతృభూమి రక్షణలో అచంచలమైన ధైర్యంతో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. ఇది నిశ్శబ్ద సంఘీభావం కోసం నిర్ణయం తీసుకున్నాం. వేడుకలకు ఇదీ సరైన సమయం కాదని నేను నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం' అని ఆయన పంచుకున్నారు.‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు మళ్లీ కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ సినిమా వస్తుంది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. Statement from Kamal Haasan#Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR @ikamalhaasan #ManiRatnam @arrahman @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan @abhiramiact @C_I_N_E_M_A_A #Nasser @manjrekarmahesh @TanikellaBharni… pic.twitter.com/jkMiXDBNG0— Raaj Kamal Films International (@RKFI) May 9, 2025 -
ఐదేళ్ల క్రితమే కల్నల్ సోఫియా ఘనత!
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరు దేశంలో ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందో.. ఆ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న మహిళా సైనికాధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పేర్లు కూడా అంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషీ గొప్పతనం గురించి ఐదేళ్ల క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. సైన్యంలో మహిళా అధికారుల శాశ్వత నియామకానికి (పర్మనెంట్ కమిషన్) సంబంధించిన కేసులో ఈమె ట్రాక్ రికార్డును న్యాయస్థానం ఉదాహరణగా చూపటం విశేషం.ఆడవాళ్లన్న కారణంతో సైన్యంలో పర్మనెంట్ కమిషన్ (పీసీ)కు అనర్హులుగా నిర్ధారించటం చట్టవ్యతిరేకమని 2020 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఆ కేసులో మహిళల పీసీకి వ్యతిరేకంగా సైన్యం, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై నాడు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 పేరుతో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద అంతర్జాతీయ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత కంటింజెంట్‌కు న్యాయకత్వం వహించిన మొదటి మహిళ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi).2006లోనే ఆమె కాంగోలో ఐక్యరాజ్యసమితి (United Nations) శాంతి పరిరక్షక దళంలో సేవలందించారు. ఆ సమయంలో కాల్పుల విరమణకు అక్కడి దేశాలను ఒప్పించటంతోపాటు మానవతా సాయంలో కూడా ఆమె కీలకపాత్ర పోషించారు. తన శక్తియుక్తులతో అక్కడ శాంతి సాధనకు కృషిచేశారు. సైన్యంలో పురుషులతోపాటు భుజంభుజం కలిపి పనిచేస్తున్న మహిళలకు.. వారి శరీర నిర్మాణాన్ని సాకుగా చూపి పీసీకి అనర్హులుగా ప్రకటించటం సరికాదు’ అని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొంది.చదవండి: అది ఇల్లు కాదు.. చిన్నపాటి సైనిక శిబిరం! -
పాక్‌తో యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం
-
పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్
పాక్ నటుడు ఫవాద్ ఖాన్‌పై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) మండిపడ్డారు. పహల్గాం ఘటనతో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులను ఫవాద్ ఖండించాడు. ఈ సిగ్గుచేటైన దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ పాక్‌కు పూర్తి మద్ధతుగా వ్యాఖ్యలు చేశాడు. ఆపై భారత్‌ను తక్కవ చేస్తూ కామెంట్లు చేశాడు. దీంతో బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఫైర్ అయింది.సోషల్ మీడియా వేదికగా ఫవాద్ గురించి ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ' మీలాంటి వాళ్లు ఇండియన్ సినిమాల్లో నటించడం మాకు సిగ్గుచేటు' అని అతని ఫోటోను షేర్ చేసింది. దానికి ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్ ట్యాగ్‌లను ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఫవాద్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. భారతీయ సినిమాల మీద ఆధారపడి బతికిన నువ్వు మా గురించి మాట్లాడటం ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కూడా అతన్ని విమర్శించకపోవడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్‌పై వ్యాఖ్యలు చేసిన పాక్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌లను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వారిని వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరింది. సినిమాల పేరుతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఇలాంటివారికి గుడ్డిగా ఎవరూ మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్ కోరింది. ఫహల్గామ్ దాడి తర్వాత వెంటనే ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను భారత్‌లో బ్యాన్ చేశారు. ఆపై పాక్ యూట్యూబ్, ఓటీటీ సంస్థల కంటెంట్‌ను ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా పూర్తిగా బ్యాన్ చేశారు. You working in Indian films was also 'shameful' for us.#OperationSindoor #IndianArmy #IndianAirForce pic.twitter.com/B7CeuQcb2t— Rupali Ganguly (@TheRupali) May 7, 2025 -
2-3 రోజులు ఏటీఎం సర్వీసులు రద్దు..?
టెక్నాలజీ, సామాజిక మాధ్యమాల వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి కూడా అధికమవుతుంది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు ఫేక్ వార్తలొస్తున్నాయి. వచ్చే వారం మే 12 సోమవారం వరకు ఏటీఎం సర్వీసులు నిలిపేస్తున్నారని అందులో ఉంది. అయితే ఈ రాన్సమ్వేర్ దాడులు కేవలం భారత్‌ను మాత్రమే కాకుండా 74 ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అబద్ధపు వార్తలు వైరల్ అవుతున్నాయి.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తలను కోట్ చేస్తూ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను గుడ్డిగా నమ్మకూడదని తెలిపింది. దేశంలోని ఏటీఎంలపై ఎలాంటి సైబర్ దాడులు జరగలేదని తెలిపింది. గతంలోలాగే యథావిధిగా ఏటీఎం సర్వీసులు కొనసాగుతాయని పేర్కొంది. ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?Are ATMs closed⁉️A viral #WhatsApp message claims ATMs will be closed for 2–3 days.🛑 This Message is FAKE✅ ATMs will continue to operate as usual❌ Don't share unverified messages.#IndiaFightsPropaganda pic.twitter.com/BXfzjjFpzD— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025ప్రజలు సాధారణ రోజులతోపాటు ఇలాంటి భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ సమయాల్లో ఫేక్ న్యూస్‌కు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని వార్తలపై ఓ నిర్ణయానికి రావాలని చెబుతున్నారు. -
ఆపరేషన్ సిందూర్ పై కేఏ పాల్ రియాక్షన్
-
ఐపీఎల్ రద్దు
-
తెలుగు జవాన్ వీర మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.His supreme sacrifice for the nation will forever inspire us.My heartfelt condolences to his family.We stand with them in this… pic.twitter.com/HfoFixNnZd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2025దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ద పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. ఉద్రిక్తతల కారణంగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దునిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు.మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్‌కోట్ గుండా ఢిల్లీకి తరలించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ స్కోర్ 122/1గా (10.1 ఓవర్లలో) ఉండింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.ఏం జరిగిందంటే..?ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్‌గా ఉన్న భారత్.. ఈ మంగళవారం అర్దరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్ చేసింది. పాక్ దుశ్చర్యకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. సమాంతరంగా పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే భారత బలగాలు పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. అయినా పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కాల్పులకు పాల్పడుతూనే ఉంది. -
భారత్-పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్
భారత్-పాక్ యుద్ధంపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.పొరుగు దేశాలైన భారత్-పాక్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ.. శాంతి, స్థిరత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి.. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు.ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తన విజ్ఞప్తిని మన్నించి దాడులకు తెరదించాలని భారత్, పాక్‌లకు సూచించారు. -
సీఏ (CA) పరీక్షలు వాయిదా
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన సీఏ (CA) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారికంగా ప్రకటించింది. మే 9 నుంచి మే 14 మధ్య జరగాల్సిన మిగిలిన CA ఫైనల్, ఇంటర్మీడియట్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపింది. ప్రస్తుతం ఈ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు మరిన్ని పూర్తి వివరాల కోసం ICAI వెబ్సైట్ icai.orgలో ద్వారా తెలుసుకోగలరు. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని పేపర్లను తిరిగి షెడ్యూల్ చేస్తామని ICAI ధృవీకరించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ఖరారు చేసి విడుదల చేస్తామని ICAI విద్యార్థులకు హామీ ఇచ్చింది. -
ఛండీగఢ్ ఎయిరైడ్ సైరన్ల మోత
-
భారత్ సహనాన్ని పాక్ పరీక్షిస్తోందా! ఆపరేషన్ సిందూర్ 2.0 ఎలా ఉంటుందంటే ?
-
Operation Sindoor 2: పాక్ భవిష్యత్తు తల్చుకుని పార్లమెంట్ లో ఎంపీ కన్నీళ్లు
-
ఆపరేషన్ సిందూర్ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్ దుశ్చర్యలకు బదులుగా ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట భారత బలగాలు ఇస్తున్న ధీటైన సమాధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుందని ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో దుమారం రేపుతుంది. రాయుడును నెటిజన్లు ఆడుకుంటున్నారు.“An eye for an eye makes the whole world blind.”Let’s remember — this isn’t a call for weakness, but a reminder of wisdom.Justice must stand firm, but never lose sight of humanity.We can love our nation fiercely and still hold compassion in our hearts.Patriotism and peace can…— ATR (@RayuduAmbati) May 8, 2025విషయం పూర్తిగా తెలిసే ఇలాంటి కామెంట్లు చేస్తున్నావా అని మండిపడుతున్నారు. ఎవరు మొదలుపెట్టారో తెలిసే వాగుతున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రమూకలపై ప్రతి చర్యకు దిగికపోతే వారు మనల్ని మట్టుబెడతారని అంటున్నారు. పాక్ సానుభూతిపరుడిలా ఉన్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. భారత దళాలు పాక్ దుశ్చర్యలను కేవలం తిప్పికొడుతున్నారన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో భారత దళాలకు మద్దతుగా నిలవాలి కాని, శాంతి అంటూ ఉపోద్ఘాతాలు ఇవ్వకూడదని చురకలంటిస్తున్నారు.Prayers for peace and safety in Jammu & Kashmir, Punjab and other parts of India along the border. Hoping for strength, security and swift resolution for everyone affected. Jai Hind!— ATR (@RayuduAmbati) May 8, 2025తన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయుడు డిఫెన్స్‌లో పడ్డాడు. సదరు ట్వీట్‌ను తొలగించకపోయినా, జనాలను శాంతింప జేసేందుకు మరో రెండు ట్వీట్లు చేశాడు. వీటిలో మొదటి దాంట్లో ఇలా రాసుకొచ్చాడు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రత కోసం ప్రార్ధిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత మరియు త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.In moments like these, we stand united not in fear, but in resolve. I feel immense gratitude to our Indian Army who are the real heroes who carry the weight of a nation with unmatched courage, discipline, and selflessness🙏🏻Your sacrifices don't go unnoticed. Your bravery is what…— ATR (@RayuduAmbati) May 8, 2025రెండో ట్వీట్లో ఇలా రాశాడు. ఇలాంటి క్షణాల్లో మేము భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా ఉన్నాము. అసమాన ధైర్యం, క్రమశిక్షణ మరియు నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న మన భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు. మీ త్యాగాలు గుర్తించబడకుండా ఉండవు. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంది. మీ ధీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రంగా ఉంచాలి. మీ సేవ మరింత శాంతియుత రేపటికి మార్గం సుగమం చేయాలి. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.రాయుడు ముందు చేసిన ట్వీట్‌కు డ్యామేజ్ కంట్రోల్‌గా ఈ ట్వీట్లు చేసినప్పటికీ జనాల ఆగ్రహం తగ్గలేదు. మొదటి ట్వీట్‌నే ఆసరగా చేసుకుని ఏకి పారేస్తున్నారు. టీమిండియా, ఐపీఎల్, రాజకీయాలతో ముడిపెట్టి తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తాన్ని ఐపీఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేల రాయుడు క్రికెట్ అభిమానులకు మంచి స్టఫ్‌గా మారాడు. -
ఐపీఎల్ కు ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్
-
భారత్-పాక్ యుద్ధం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 211 పాయింట్లు నష్టపోయి 24,063కు చేరింది. సెన్సెక్స్(Sensex) 542 పాయింట్లు దిగజారి 79,805 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 1.07 శాతం ఎగబాకింది.ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవడంతో స్టాక్ సూచీలు ఒడిదొడులకు లోనవుతున్నాయి. ఇటీవల భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేసిన పాక్‌పై ప్రతీకార చర్యగా లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు భారత రక్షణ శాఖ ప్రకటనతో దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్ నిన్న ఒక్కసారిగా మారిపోయింది. ట్రేడింగ్ మరో గంటలో ముగుస్తుందనే సమయంలో ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో భారీ విక్రయాలు తలెత్తాయి. అమెరికాతో చైనా, తాజాగా బ్రిటన్ వాణిజ్య ఒప్పంద చర్చలు సఫలం అవ్వొచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువపరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)
-
Operation Sindoor 2.0: భారత్ దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు
ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట భారత దళాలు పాక్‌పై దాడులు జరుపుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 వేదికను మార్చారు. పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే కొనసాగుతున్న పీఎస్ఎల్ 10వ ఎడిషన్‌ను యూఏఈకి మార్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ లీగ్ మరో ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. నిన్న (మే 8) భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్ఎల్ వేదికను పాక్ నుంచి యూఏఈకి తరలించారు. పీఎస్ఎల్లో తదుపరి జరగాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పీఎస్ఎల్ను యూఏఈకి తరలిస్తున్నట్లు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ ప్రకటించాడు.జనావాసాలపై పాక్ దళాల దాడులకు బదులిచ్చే క్రమంలో నిన్న రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత దళాలు డ్రోన్ దాడి చేశాయి. ఈ దాడి తర్వాత కొద్ది గంటల్లోనే పీఎస్ఎల్లో భాగంగా పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. భారత్ దాడుల తీవ్రతను పెంచిందని గ్రహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించి, అప్పటికప్పుడు ఆ మ్యాచ్‌ను రద్దు చేసింది. తాజాగా లీగ్ మొత్తాన్నే యూఏఈకి తరలిస్తున్నట్లు ప్రకటించింది.కాగా, పీఎస్ఎల్లో దాదాపు 40 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. వారి భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. విదేశీ క్రికెటర్ల జాబితాలో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ లాంటి ప్రముఖులు ఉన్నారు. పాక్ నుండి తమ స్వదేశాలను వెళ్లడం ప్రస్తుతం విదేశీ ఆటగాళ్లకు సవాలుగా మారింది. భారత దాడుల నేపథ్యంలో పాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ మూతపడ్డాయి. విదేశీ క్రికెటర్లకు ఎక్కడ తల దాచుకోవాలో అర్దం కావడం లేదు. పాక్ ప్రభుత్వం విదేశీ క్రికెటర్ల భద్రతను గాలికొదిలేసింది. పీసీబీ అధికారులు, పీఎస్ఎల్ ఫ్రాంచైజీ యజమానులు చేతులెత్తేశారు. ప్రస్తుతం పాక్‌లో విదేశీ క్రికెటర్లు బిక్కుబిక్కుమంటున్నారు.మరోవైపు పాక్ దాడుల దృష్ట్యా భారత్‌లో ఐపీఎల్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. నిన్న ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ అర్దంతరంగా రద్దైంది. ధర్మశాలలో బ్లాక్ అవుట్ ప్రకటించడంతో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆర్పేశారు. తొలుత ప్రేక్షకులను బయటకు పంపించిన అధికారులు, ఆతర్వాత పరిస్థితిని వివరించారు. ఐపీఎల్-2025 భవితవ్యంపై ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఇందులో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.అనంతరం పాక్ దళాల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటంతో పాటు మిసైళ్లతో దాడికి దిగారు. జనావాసాలపై దాడికి దిగడంతో సహనం కోల్పోయిన భారత్ పాక్‌కు ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ 2.0ను మొదలుపెట్టింది. ఇప్పటికే భారత దళాలు పాక్‌కు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. రావల్పిండి, ఇస్లామాబాద్, ముల్తాన్, కరాచీ లాంటి నగరాలపై దాడులతో విరుచుకుపడ్డాయి. -
ఢిల్లీలో హై అలర్ట్.. రైళ్లన్నీ నిలిపివేత
ఢిల్లీ: నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను మరింత పెంచారు. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలను కూడా బంద్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 90 విమానాలను వివిధ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. దీంతో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు పలు విమానాలు రద్దయ్యాయి. మొత్తం 46 దేశీయ ప్రయాణాలు, 33 రాకపోకలు రద్దయ్యాయి.మరో వైపు, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్‌లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్‌పూర్, తార్న్ తరన్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.ఇక అమృత్‌సర్‌లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నిత్యావసర వస్తువుల కొరత లేదని, బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించవద్దని, ప్రజలు అనవసరంగా అదనపు వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు కోరారు. మరోవైపు పప్పులు, వంటనూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అమృత్‌సర్‌లోని కిరాణా దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సరిహద్దు జిల్లాల్లో ఒకటైన గురుదాస్‌పూర్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకవుట్ విధించారు. ప్రజల భద్రత కోసం పోలీసు స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది.ప్రజల భద్రత దృష్ట్యా పాక్ సరిహద్దుల్లో రిట్రీట్ వేడుకలను బీఎస్ఎఫ్ నిలిపివేసింది. పంజాబ్‌లోని పాకిస్తాన్ వెంబడి ఉన్న మూడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రిట్రీట్ వేడుకలను నిర్వహించబోమని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. పాకిస్తాన్ వాఘాకు ఎదురుగా ఉన్న అట్టారీ (అమృత్సర్), ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద ఉన్న జేసీపీల వద్ద పాకిస్తాన్ రేంజర్లతో కలిసి బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ సాయంత్రం రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వమిస్తాయి.ఇక గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. తీరం వెంబడి ఉన్న రాజ్‌కోట్ రేంజ్‌లోని జామ్‌నగర్, మోర్బి, దేవభూమి, ద్వారకాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు తీరప్రాంత గ్రామాలు, బోట్‌ల్యాండింగ్ పాయింట్లను సందర్శిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను పోలీసులు కోరుతున్నారు. -
'ఆపరేషన్ సిందూర్'పై నోరెత్తని బాలీవుడ్ ప్రముఖులు
పహల్గామ్లో 26 మంది భారతీయులను కాల్చి చంపిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్'ను భారత్ ప్రారంభించింది. పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్ 100 మందికి పైగానే ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. జమ్మూ ఎయిర్‌పోర్టుతో పాటు జైసల్మేర్ విమానాశ్రయం లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. దీంతో మన సైనికులపై చాలామంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ మాతాకీ జై అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటులు పోస్టులు పెడుతున్నారు. కానీ హిందీ చిత్రపరిశ్రమలో టాప్ హీరోలుగా ఉన్న అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు కనీసం తమ మద్ధతు ఇస్తూ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో వారి అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులకు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా వారికి మనసు రావడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కూడా ఆపరేషన్ సిందూర్‌పై ఎలాంటి పోస్ట్ చేయలేదు. దీంతో ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదైన ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి దానిని వెంటనే తమ సోషల్‌మీడియాలో షేర్ చేసి కోట్ల రూపాయాలు సంపాధిస్తారు. అలాంటిది దేశంలో ఇంత జరుగుతున్నా కూడా కనీసం మన ఆర్మీ కోసం మద్ధతుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. దేశ ప్రజల పట్ల, మన ఆర్మీ పట్ల వారికి ఉన్న గౌరవం ఏపాటిదో సులభంగా అర్థం అవుతుంది అంటూ వారు చెప్పుకొస్తున్నారు. -
భారత్ దెబ్బ.. బంకర్ లో దాక్కున్న పాక్ ప్రధాని
-
ఢిల్లీలో హై అలర్ట్.. సెలవులు రద్దు
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. నగరంలో హై అలర్ట్ ప్రకటించి అత్యవసర పరిస్థితులకు సన్నద్ధంలో భాగంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు సెలవులు రద్దు చేసింది.ఢిల్లీ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ కనిపించారు. ప్రముఖ సందర్శనా స్థలం ఇండియా గేట్ లోని సి-హెక్సాగాన్ చుట్టూ ఉన్న రహదారిలో జనాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. అయితే, ఈ ప్రాంతంలో సాధారణంగా నిర్వహించే సాధారణ ట్రాఫిక్ నియంత్రణ కసరత్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ అధికారికి సెలవులు మంజూరు చేయరాదని కాంపిటెంట్ అథారిటీ ఆదేశించిందని సర్వీసెస్ డిపార్ట్మెంట్ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సెలవులను కూడా రద్దు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. -
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కామెంట్స్ వైరల్
-
వైరల్ వీడియో.. ఆపరేషన్ సిందూర్.. ఏడ్చేసిన పాక్ ఎంపీ
ఢిల్లీ: భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతోపాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.‘భగవంతుడా.. మేమంతా నీముందు మోకరిల్లామ్.. దయచేసి ఈ దేశాన్ని కాపాడు’అని ఇక్బాల్ మొరపెట్టుకున్నాడు. ‘మనదేశం ఇప్పుడు ఎంతో వేదనలో ఉంది. ప్రజాప్రతినిధులంతా ఏకమై, ఈ దేశాన్ని కాపాడాలని భగవంతున్ని ప్రార్థిద్దాం’అని సహచర ఎంపీలకు సూచించారు. అధికార పార్టీ ఎంపీనే ఏడ్చేయటం ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Pakistani Parliament Member breaks down inside National Assembly of Pakistan after #OperationSindoor impact. Cries for help to Allah. This is Major Tahir Iqbal, former officer of Pakistan Army, now a Pakistani politician. This is the real mood in Pakistan. pic.twitter.com/Xeg7GzxRx4— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 8, 2025 -
భారత్, పాక్ యుద్ధం.. అమెరికా మద్ధతుపై జెడి వాన్స్ క్లారిటీ
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వాన్స్ మాట్లాడుతూ.. నన్ ఆఫ్ అవర్ బిజినెస్ (అది ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు) అని అన్నారు.ఈ రెండు దేశాలను తాము నియంత్రించలేమని జెడి వాన్స్ అన్నారు. ఇరుదేశాలు దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. రెండు అణుశక్తి దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు అందరికీ ఆందోళనకరమేనని అమెరికా ఉపాధ్యక్షుడు అన్నారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని తాము కూడా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. సాధరణ ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా కలుగజేసుకోదని క్లారిటీ ఇచ్చారు. తమ సైన్యం ఎవరికి సాయం చేయదని ప్రకటించారు. ఆపై అటు భారత్‌కు గాని పాకిస్థాన్‌కు గాని యుద్ధం ఆపమని చెప్పలేమన్నారు. అలా అని అణ్వాయుధాల ఉపయోగం ఎట్టిపరిస్థితిల్లోనూ జరగదని ఆయన తేల్చి చెప్పారు. 🚨🇺🇸 ‘NONE OF OUR BUSINESS’: JD Vance on 🇮🇳Indo-🇵🇰Pak escalation pic.twitter.com/EgQuySKbLt— Sputnik India (@Sputnik_India) May 8, 2025 -
సాయుధ దళాల వీరత్వానికి గర్విస్తున్నా: ముఖేష్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ డి అంబానీ పేర్కొన్నారు. భారతదేశం అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిలుస్తుందని ఆయన తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేతమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో, భారత సాయుధ దళాలు సరిహద్దు అవతలి నుండి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు కచ్చితత్వం, అసమాన శక్తితో ప్రతిస్పందించాయని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో భాగంగా రిలయన్స్ కుటుంబం ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. -
ఆ 24గంటలు.. ఏం జరిగింది?
-
ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తం
-
పరారీలో పాక్ ప్రధాని?
-
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
India-Pakistan War Updates:పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. శుక్రవారం(మే9వ తేదీ) రాత్రి కాగానే పాకిస్తాన్ మళ్లీ భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీలో పాక్ సైన్యం కాల్పులకు దిగడమే కాకుండా, డ్రోన్లను ప్రయోగిస్తూ సరహద్దు ప్రాంతాల్లో దాడులకు దిగింది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేసింది. దాంతో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శ్రీనగర్ లో భారీ పేలుడు శబ్దాలుపాక్ దాడులు.. ఇప్పటివరకూ దాయాదికి చెందిన 100 డ్రోన్లను కూల్చివేసిన భారత్‌ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన కీలక సమావేశంసమావేశంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్సమావేశానికి హాజరైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులుతాజా పరిణామాలను మోదీకి వివరించిన త్రివిధ దళాధిపతులు ఢిల్లీ :జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపై డ్రోన్లు,మిస్సైల్స్ తో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడులుపాక్ డ్రోన్లను గగనతలం లో నిలువరిస్తున్న భారత రక్షణ వ్యవస్థకొనసాగుతున్న బ్లాక్ అవుట్సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న భద్రతా బలగాలుఎల్ వో సి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘిస్తూ భారీగా కాల్పులుపాక్ కాల్పులను తిప్పి కొడుతున్న భారత సైన్యంఒమర్ అబ్దుల్లా ట్వీట్కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి: ఒమర్ అబ్దుల్లాIt’s my earnest appeal to everyone in & around Jammu please stay off the streets, stay at home or at the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumours, don’t spread unsubstantiated or unverified stories & we will get through this together.— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025 ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశంహాజరైన నేవీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారుసరిహద్దుల్లో తాజా పరిస్థితిపై చర్చ సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్భారత్ - పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతజమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులుసాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులుఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్జైసల్మీర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాకౌట్ఎల్వోసీలో మళ్లీ పాక్ సైన్యం కాల్పులు యూరీ సెక్టార్ హెవీ షెల్లింగ్‌పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.నేవీ చీఫ్, జాతీయ భద్రతా సహదారు తాజా పరిణామాలను వెల్లడించారు.సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.విశాఖ:విశాఖలో అప్రమత్తమైన బలగాలుకేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత పెంపుప్రతి ఒక్క ప్రయనికుడుని పూర్తిగా తనిఖీ చేస్తున్న CISF సిబ్బందివిమానాశ్రయం ఎంట్రీ లోనే చెకింగ్ చేస్తున్న CISF బలగాలుఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ మీడియా సమావేశంగత రాత్రి పాక్.. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసింది300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించిందిఎల్‌ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందిజమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లక్ష్యంగా పాక్ దాడులు చేసిందిజమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందిపాక్ దాడులను తిప్పికొట్టాంపౌర విమానాలను టార్గెట్ గా పాక్ దాడులు చేసిందిఆ డ్రోన్లు టర్కీకి చెందినవి తెలుస్తోందిలేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారులేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారుపాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిపాక్ సైన్యం కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.పాక్ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుందికర్తర్‌పూర్ కారిడార్ ను తాత్కాలికంగా మూసివేశాం అమృత్‌సర్‌లో పాక్ బాంబును నిర్వీర్యం చేసిన ఇండియన్ ఆర్మీమక్నా దిండి విలేజ్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్‌బాంబును నిర్వీర్యం చేసిన భారత సైనికులుసరిహద్దుల్లో పాక్ దాడిని తిప్పికొడుతున్న భారత సైన్యంతిరుమలభారత్- పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత బలగాలు మాక్ డ్రిల్..తిరుమల ప్రవేశ మార్గంలో ఆక్టోపస్, పోలీస్, విజిలెన్స్, ఇతర బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహణఢిల్లీ:అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ లేఖసివిల్ డిఫెన్స్ రూల్స్ కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశంఅత్యవసర సమయంలో కావలసిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్ఢిల్లీ ;ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ఐటీఓ వద్ద టెస్ట్ సైరెన్ చేసిన అధికారులువైమానిక దాడి సైరన్లను పరిశీలించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ8 కి.మీ వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటుఅమరావతి:ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఏపీ సచివాలయ ఉద్యోగులుఅమరుడైన మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలుపాక్‌స్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్‌జమ్మూకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీఢిల్లీ, హరియాణా, హిమాచల్‌లోనూ భద్రత కట్టుదిట్టంపోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసిన సరిహద్దు రాష్ట్రాలుగుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలుఅవసరమైతే టరిటోరియల్ ఆర్మీని పిలిపించుకునేందుకు అనుమతిఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన రక్షణమంత్రి రాజ్ నాథ్‌టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ, మోహన్‌లాల్, సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్ దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపుభద్రతను రెండోస్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు పోర్టులు, టర్మినళ్లు, నౌకలకు భద్రత పెంచిన కేంద్రంఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్‌ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ భద్రత పెంపుశ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళంనెల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచననెల వేతనం విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌అప్రమత్తమైన అధికారులుఎయిర్ పోర్ట్ లో తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సీఎంలతో మాట్లాడిన మోదీసరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచనప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీఢిల్లీ:అమిత్ షా నివాసంలో హైలెవల్‌మీటింగ్‌హాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దుల్లో పరిస్థితులపై అమిత్ షా రివ్యూ ఢిల్లీ:ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ భేటీపాక్ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్ రివ్యూసైబర్ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్ పాక్ పార్లమెంట్ లో రక్షణ మంత్రి అసిఫ్ కీలక వ్యాఖ్యలుమన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలంపాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసిందిమన రక్షణ విభాగం పూర్తి విఫలమైందిపాక్ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలుచేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్‌నాథ్ భేటీపాక్‌పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీఅమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశంహాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దు పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష 👉పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలుమరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరితెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతం👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్ వీర మరణంభారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతిజవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం 👉ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదాఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐభారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం👉జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లుపాకిస్థాన్ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్‌ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టంసరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనబోర్డర్ వెళ్లిన 10 మంది పంజాబ్ మంత్రులుదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్‌సాంబా సెక్టార్లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతంచైనా తయారీ పీఎల్-15 మిస్సైల్‌ను కూల్చేసిన భద్రతా బలగాలుపంజాబ్ పంట పొలాల్లో కూలిన పీఎల్-15 మిస్సైల్‌భారత్ భీకర దాడులతో పాక్ కకావికలంకంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్ ఆర్మీ కుటుంబాలు👉చండీగఢ్‌లో మోగిన సైరన్లుప్రజలు ఇళ్లలోనే ఉండాలిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్ ఫోర్స్👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్ సింగ్👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్.. ఇండియా గేట్ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలు బంద్👉కాసేపట్లో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీపాకిస్థాన్ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ 👉ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్ ఎటాక్ దిగిన భారత్‌లాహోర్, సియాల్కోట్, కరాచీపై భారత్ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన ఇండియన్ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్‌తో అమిత్ షా చర్చించారు. ఇండో–పాక్ సరిహద్దుసహా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భద్రతను బీఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే. -
తోక జాడించిన పాక్.. తాట తీసిన భారత్
-
రంగంలోకి INS విక్రాంత్.. కరాచీ పోర్ట్ ఖతం
-
‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం క్యూ!
ముంబై: ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే.. ఆ పేరు కోసం బాలీవుడ్ దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’, ‘మిషన్ సిందూర్’, ‘సిందూర్ : ది రివెంజ్’అంటూ ఆపరేషన్ కోడ్‌నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ‘ఇది భారతదేశం గరి్వంచదగ్గ విషయం. అందుకే ఈ కథను సినిమా తీయాలని చాలామంది అనుకుంటున్నారు’ అని ఐఎంపీపీఏ కార్యదర్శి అనిల్ నగ్రాత్ తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని టైటిల్స్కైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే మొదట దరఖాస్తు చేసుకున్న వ్యక్తికే టైటిల్ కేటాయిస్తామని తెలిపారు. గతంలో కార్గిల్, ఉరీ, కుంభమేళాలకు కూడా ఇలాగే టైటిల్ అప్లికేషన్లు అధికంగా వచ్చాయి. టైటిల్ నమోదుకు దరఖాస్తు రుసుము రూ.300 ప్లస్ జీఎస్టీ, అత్యవసర ప్రాతిపదికన అయితే రూ.3,000 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. ఒక్కసారి టైటిల్ వచి్చన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు. ఈ పేరుతో ట్రేడ్‌మార్క్ రిజి్రస్టేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. -
పిల్లలకు సిందూర్ పేరు
కతిహార్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి నివాళిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను యావత్ భారతం స్వాగతించింది. అయితే.. ఆ పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటే.. ప్రజలు మాత్రం ఆ ఆపరేషన్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. పాక్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన బుధవారం రోజే పుట్టిన తమ బిడ్డలకు ఆపరేషన్ పేరు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలయితే సిందూరి అని, అబ్బాయికయితే సిందూర్ అని పేరు పెట్టుకుంటున్నారు. బిహార్‌లో ఉన్న కతిహార్ జిల్లాలోని ఓ చిన్న ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ తన కూతురుకు సిందూరి పేరు పెట్టాడు. భారత సాయుధ దళాల ఆపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కుందన్.. ఆ పేరు తన కూతురుకు పెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒక్క కుందన్మాత్రమే కాదు.. ఆ పేరు పెట్టినందుకు కుటుంబమంతా సంతోషంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ పేరును ఆమోదించారు. పెరిగి పెద్దయ్యాక అమ్మాయి తన పేరు వెనుక ఉన్న ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకుంటుందని కుటుంబం ఆశిస్తోంది. ఒక్క కుందన్ మాత్రమే కాదు.. బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో 12 మంది ఈ పేరు పెట్టుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు ముజఫర్‌పూర్‌లో ఈ పేరే పెట్టుకున్నారు. రెండు ఆనందాలు కలిసి వచ్చాయని సంబరపడిపోతున్నారు. పెద్దయ్యాక తమ పిల్లలను సైన్యంలో చేరి్పస్తామని అంటున్నారు. కన్హారా నివాసి హిమాన్షు రాజ్ కూడా తన కూతురికి ‘సిందూరి’అని నామకరణం చేశాడు. ‘సిందూరి’పేరు కుటుంబానికి గర్వకారణంగా మారింది. జాఫర్పూర్కు చెందిన పవన్ సోనీతన కొడుకుకి సిందూర్ అని పేరు పెట్టాడు. ‘సిందూర్’కేవలం పేరు కాదు.. అదొక గర్వమని చెబుతున్నారు.