allowance
-
ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్ చేసుకోండి..
మీరు ఉద్యోగస్తులైతే, మీకిచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. గవర్నమెంటు, పబ్లిక్ సంస్థల్లో అయితే, వారివారి రూల్స్/ఒప్పందం ప్రకారం ఉంటాయి. అలాగే చెల్లిస్తారు. మీ ప్రమేయమే ఉండదు. ఇచ్చింది.. ఇచ్చినట్లు తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థల్లో కొంచెం వెసులుబాటు ఉండొచ్చు. అక్కడ కూడా బలమైన ఉద్యోగ సంస్థలుంటే మన పప్పులుడకవ్! మీరు ఆ సంస్థలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైతే, ఉద్యోగిగానే కొనసాగుతుంటే బేరసారాలతో పాటు అలవెన్సుల సంగతిలోనూ వెసులుబాటు అడగవచ్చు. ఆ గొడవలన్నీ పక్కన పెడితే, యజమాని ఇచ్చే ‘ఇంటద్దె అలవెన్సు’ జీతంలో ఒక అంశం. మొత్తం జీతభత్యాలతో కలిసి ఉంటుంది. ఈ అలవెన్సును ఆదాయంగా పరిగణిస్తారు. పన్నుకి గురి అవుతుంది. అయితే, అద్దె ఇంట్లో ఉంటూ, మీరు అద్దె ఇచ్చినట్లయితేనే చట్టప్రకారం మినహాయింపు లభిస్తుంది. ఈ అలవెన్సు ఉద్దేశం, మీరు ఆ మొత్తం ఇచ్చి అద్దె ఇంట్లో ఉండటం. అద్దె కోసం ఆ మొత్తాన్ని వినియోగించడం జరగాలి. ఈ మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.మీరు ఆ సంస్థలో ఉద్యోగిగానే ఉండాలి.మీరు అద్దె ఇంట్లోనే ఉంటూ అద్దె చెల్లిస్తుండాలి.అద్దె చెల్లిస్తున్నట్లు కాగితాలు, రుజువులు ఉండాలి.సొంత వ్యాపారస్తులకు, వృత్తి ఉన్నవారికి ఇది వర్తించదు.అద్దె అంటే వసతి కోసం ఇచ్చే అద్దె, నిర్వహణ ఖర్చులు మాత్రమే. కరెంటు చార్జీలు, నీటి చార్జీలు మొదలైనవి కావు.సొంత ఇంట్లో ఉంటూ ఈ మినహాయింపు పొందకూడదు. కుటుంబ సభ్యులతో ఉంటూ అద్దె చెల్లించకపోతే ఈ మినహాయింపు ఇవ్వరు.ఇచ్చే జీతభత్యాల్లో ఈ అలవెన్సు లేకపోతే ఎటువంటి మినహాయింపు ఇవ్వరు.ఈ మూడింట్లో తక్కువ దాన్నే మినహాయిస్తారు. (a) వచ్చిన అలవెన్సు (b) చెల్లించిన అద్దెలో నుంచి 10 శాతం జీతం తీయగా, మిగిలిన మొత్తం (c) మెట్రో నగరాల్లో జీతంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో జీతాల్లో 40 శాతంచెల్లించినట్లు రుజువు కావాలి. అవసరమైతే అగ్రిమెంటు, మీ బ్యాంకు అకౌంటు, ఓనర్ పాన్ కార్డు, ఓనర్ బ్యాంకు అకౌంటు, రశీదులు మొదలైనవి కావాలి.ఆ ప్రాంతంలో సొంత ఇల్లు ఉండకూడదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ప్రాంతంలో అద్దె చెల్లించాలి.ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చుభార్యభర్తలు ఒకే ఇంట్లో కాపురం ఉంటూ ఇద్దరూ మినహాయింపు పొందకండి. ఇద్దరూ వేర్వేరు అగ్రిమెంటు ద్వారా పెద్ద ఇల్లు తీసుకుంటే ఎక్కువ అద్దె అయితే, అగ్రిమెంట్లు వేరు, చెల్లింపులు వేరు, రశీదులు వేరు, లెక్కలు వేరు.ఒక్కరే ఉద్యోగి అయి, మిగతావారు ఓనర్ అయితే, అగ్రిమెంటు రాసుకోండి. చెల్లింపులు సక్రమంగా చేయండి. పాన్ తీసుకోండి. అటు పక్క వ్యక్తికి సంబంధించిన ఇన్‌కంట్యాక్స్ లెక్కల్లో ఆదాయంగా చూపించండి.అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, మావగారింట్లో చూరు పట్టుకు వేళ్లాడుతున్నా.. అగ్రిమెంట్లు ముఖ్యం. చెల్లింపులు, రశీదులు, లెక్కలు పక్కాగా ఉండాలి.దొంగ ఇంటి నంబర్లు వేసి క్లెయిమ్ చేయకండి.మీ ఇంటికి మీరే ఓనర్ అని ఎడమ చేత్తో సంతకం పెట్టి క్లెయిమ్ చేయకండి.హైదరాబాదులాంటి మహానగరంలో స్వంత ఇల్లు ఉండగా అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. స్వంత ఇల్లు మీద అద్దె ఆదాయంగా చూపిస్తూ, క్లెయిమ్ చేయండి.కె.సి.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, కె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
నైట్ డ్యూటీ అలవెన్స్‌లో కోత
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌ల్లో భారీ కోత విధించింది. దీంతో రాష్ట్రంలో సగటున రోజుకు నైట్‌డ్యూటీలు చేసే 10వేలమంది ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా నైట్ డ్యూటీ అలవెన్స్‌లు తీసుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం అందులో సగానికి పైగా కోత పడనుంది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటిస్తూనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులను నిండా ముంచిన తీరు ఇలా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీతాలతోపాటే నైట్‌డ్యూటీ అలవెన్స్లుఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందికి నైట్ డ్యూటీ అలవెన్స్‌లను అమలు చేసింది. అంతేకాదు నైట్ డ్యూటీ అలవెన్స్‌లను ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించింది. నైట్ డ్యూటీ చేస్తే రోజుకు కనీసం రూ.300 అలవెన్స్‌గా నిర్ణయించింది. గరిష్టంగా రోజుకు రూ.500వరకు కూడా వచ్చేట్టుగా చూసింది. దాంతో నైట్ డ్యూటీ చేసే ఒక్కో డ్రైవర్, కండక్టర్, గ్యారేజీ సిబ్బంది నెలకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు అదనపు ప్రయోజనం చేకూరేది.కూటమి ప్రభుత్వంలో అలవెన్స్ నిలిపివేత... భారీ కోతరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైట్ డ్యూటీ అలవెన్స్‌లను నిలిపివేసింది. దాంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోయారు. నైట్‌డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరించాలని ఆర్టీసీ యూనియన్లు ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నాయి. దాంతో తప్పక నైట్‌డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరించిన టీడీపీ ప్రభుత్వం వాటిలో భారీ కోత విధించి తన అసలు బుద్ధిని ప్రదర్శించింది. నైట్ డ్యూటీ అలవెన్స్ రోజుకు రూ.150కు పరిమితం చేసింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఏకంగా 50శాతం కోత విధించింది. దాంతో నైట్‌డ్యూటీ చేసే కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి నెలకు రూ.2వేల నుంచి రూ.3వేలే దక్కనుంది.రోజుకు 10వేలమందికి నష్టంఆర్టీసీ 10వేల బస్ సర్వీసులను నిర్వహిస్తోంది. రోజుకు దాదాపు 4వేల బస్‌లు ఇతర ప్రాంతాల్లో నైట్ హాల్ట్‌గా ఉంటాయి. ఒక బస్సుకు ఇద్దరు (కండక్టర్, డ్రైవర్) చొప్పున 4వేల బస్‌లకు 8వేల మంది నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 129 ఆర్టీసీ గ్యారేజ్‌ల్లో నైట్ డ్యూటీ సిబ్బందితో కలిపి రోజుకు దాదాపు 10వేలమంది ఉద్యోగులు నైట్‌డ్యూటీలు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నైట్ డ్యూటీ అలవెన్స్‌లలో 50శాతం కోత విధించడంతో రోజుకు 10వేలమంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఆర్థికంగా నష్టకలిగించే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
‘చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే’
భోపాల్: వివాహం, భరణం అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వివరాలు .. శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. తనతో నివసించిన మహిళకు నెలవారీ భత్యం రూ.1,500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉతర్వులను శైలేష్ బాప్చే హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియాతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి.. ఆమెకు నెలసరి భత్యం కింద రూ. 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
గుడ్‌న్యూస్! ఒక్కో బొగ్గు గని కార్మికుడికి లక్షన్నర నుంచి రూ.5 లక్షలు..
గోదావరి ఖని: దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు శనివారం ఖరారైంది. 23నెలల ఆలస్యంగా జరిగిన లిఖితపూర్వక వేతన ఒప్పందంపై కోలిండియా యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కోల్‌కత్తాలో రెండు రోజుల పాటు జరిగిన 11వ వేజ్‌బోర్డు 10వ సమావేశంలో కనీస వేతనాలపై 19శాతం పెరుగుదల, అలవెన్స్‌లపై 25శాతం పెరుగుదలతో ఒప్పందం పూర్తయ్యింది. పెరిగిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి రానుండగా, జూలై నుంచి కార్మికులు అందుకోనున్నారు. పెరిగిన 19శాతం కనీస వేతనం బకాయిల మేరకు ఒక్కో కారి్మకునికి రూ.1.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఎరియర్స్ రూపంలో 23నెలల బకాయిలు అందనున్నాయి. ద్విచక్రవాహనాలకు పెట్రోల్ అలవెన్స్ చెల్లిస్తున్నట్టుగానే, ఈసారి కార్లకు కూడా చెల్లించేందుకు అంగీకరించింది. ట్రాన్స్‌పోర్టు, అడిషనల్ ట్రాన్స్‌పోర్టు, వాషింగ్ అలవెన్స్‌తో పాటు పలు అలవెన్స్‌లపై 25శాతం పెరిగింది. ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా 4లక్షల మందికి ప్రయోజనం చేకూరనుండగా, వీరిలో సింగరేణి కారి్మకులు 39వేల మంది ఉన్నారు. సమావేశంలో కోలిండియా చైర్మెన్ ప్రమోద్ అగర్వాల్‌తో పాటు సింగరేణి డైరెక్టర్(పా) బలరాం, పర్సనల్ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్‌ప్రసాద్(ఐఎన్టీయూసీ), రియాజ్ అహ్మద్(హెచ్ఎంఎస్), మంద నర్సింహారావు(సీఐటీయూ), మాధవనాయక్(బీఎంఎస్) పాల్గొన్నారు. -
మార్క్ జుకర్ బర్గ్ అలవెన్స్ భారీగా పెంచిన ఫేస్బుక్
-
లేఆఫ్‌ల ట్రెండ్.. మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్‌బర్గ్‌కు ఏకంగా..!
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచింది. జుకర్‌బర్గ్‌కు, ఆయన కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ అలవెన్సును ఏకంగా 4 మిలియన్ డాలర్లు పెంచి 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ.115 కోట్లు) చేసింది. ప్రస్తుతం పెంచిన సెక్యూరిటీ అలవెన్సుతోపాటు జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద చెల్లిస్తున్న ఖర్చులన్నీ సముచితం, అవసరమైనవేనని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఓ వైపు ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది ఉద్యోగాలకు కోత పెడుతూ మరోవైపు జుకర్‌బర్గ్‌కు ఇంత భారీగా సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచడం చర్చనీయాంశమైంది. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 16వ ర్యాంక్‌లో ఉన్న జకర్బర్గ్ 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్ల జీతభత్యాలను అందుకున్నాడు. అయితే గత సంవత్సరానికి సంబంధించి అతని పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు. మెటా మరిన్ని ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నందునే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్లను ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ ఫైలింగ్..) -
రెల్వే రన్నింగ్ స్టాఫ్ అలవెన్స్ పెంపు
న్యూఢిల్లీ: రైల్వేలో రన్నింగ్ స్టాఫ్ (రైలుతోపాటు వెళ్లే ఉద్యోగులు) అయిన లోకో పైలట్లు, గార్డులకు ఇచ్చే రన్నింగ్ అలవెన్స్‌ను రెండింతలకు పైగా పెంచినట్లు సీనియర్ అధికారి బుధవారం చెప్పారు. రైలు డ్రైవర్లు (లోకో పైలట్), గార్డులకు రన్నింగ్ అలవెన్స్‌ను పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ప్రతి 100 కిలో మీటర్లకు వారికి 253.5 రూపాయలు చెల్లిస్తుండగా, ఇక నుంచి ఆ మొత్తం రూ. 525కి పెరిగింది. లోకో పైలట్లు, గార్డులు తరచుగా తమ ప్రధాన కార్యాలయానికి, కుటుంబానికి చాలా దూరంగా వెళ్లి, పని చేయాల్సి వస్తుంటుంది. వాళ్లు తిరిగిరావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి మిగతా వర్గాల ఉద్యోగులకు అలవెన్స్‌లను 2016లోనే పెంచినప్పటికీ, రన్నింగ్ స్టాఫ్ అలవెన్స్‌ను మాత్రం ఇన్నాళ్లూ పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం రైల్వేలో దాదాపు 1.2 లక్షల మంది ఉద్యోగులు రన్నింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. -
రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ : 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు తీపి కబురు అందించింది. ఈ నెలలోనే (జనవరి15) ఉపాధ్యాయులకు సంబంధించి ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు అంగీకరించిన కేంద్రం, తాజాగా రన్నింగ్ అలవెన్స్ పెంపుపై రైల్వే ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చనుంది. రన్నింగ్ అలవెన్స్‌ను 200శాతం పెంచేందుకు అంగీకరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్యాష్ అండ్ క్యారీ ఉద్యోగులకు 300 శాతం అలవెన్సును పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో క్యాష్ అండ్ ట్రెజరీ ఉద్యోగులకు నెలకు రూ.800 నుండి వెయ్యి రూపాయల వరకు, రైల్వే ఉద్యోగులకు నెలకు సుమారు 12వేల నుంచి 25వేల రూపాయల దాకా అదనపు ప్రయోజనం చేకూరనుంది. దీని ప్రకారం రైల్వే ఉద్యోగుల విషయంలో గార్డులు, లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు ఇప్పుడు ప్రతి 100 కిలోమీటర్‌కు 520 రూపాయల భత్యం పొందుతారు. అంతకుముందు ఇది 255 రూపాయలుగా ఉంది. ఒకవైపు రన్నింగ్ అలవెన్సును ప్రభుత్వం రెట్టింపు చేయగా, మరోవైపు 2017 జూలై నుంచి డిసెంబరు 2018 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ .4,500 కోట్ల బకాయిలను రైల్వేశాఖ చెల్లించనుంది. కేంద్ర బడ్జెట్ 2019 ఫిబ్రవరి 1న ప్రకటించనున్నందున, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆశలను నెరవేర్చేలా ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేయనుందనే ఊహాగానాలు కూడా భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా 7వ వేతన సంఘం నెలకు కనీస వేతనాన్ని రూ.18వేలుగా సిఫారసు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోరిక మేరకు నెలకు కనీస వేతనాన్ని రూ.26వేలుగా నిర్ణయించనుందని సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ !
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఇకపై ఉద్యోగులపై ఇచ్చే ఓవర్ టైం అలవెన్సును నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పర్సనల్ మినిస్ట్రీ ఒక ఉత్తర్వు చేసింది. దీని ప్రకారం కార్యనిర్వాహక సిబ్బంది మినహా ఇతర ఉద్యోగులకు చెల్లించే ఓవర్ టైం అలవెన్సును రద్దు చేసింది. ఏడవ పే కమిషన్ సిఫారసులకనుగుణంగా ఈ చర్య తీసుకుంది. దీని ప్రకారం, అన్ని మంత్రివర్గ విభాగాలతో పాటు భారత ప్రభుత్వ అటాచ్డ్, సబార్డినేట్ కార్యాలయాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషనల్ స్టాఫ్ జాబితాను తయారు చేయవలసిందిగా సంబంధిత విభాగాలను కోరింది. అత్యవసరమైన సమయంలో అతని/ఆమె సీనియర్ అధికారి సంబంధిత ఉద్యోగి (లు)ను నిర్దేశించినప్పుడు మాత్రమే ఓటీఏ చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్యనిర్వాహక సిబ్బంది అంటే నాన్ మినిస్ట్రీరియల్ గెజిటెడ్ సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్ లేదా యాంత్రిక పరికరాల సహాయంతో పనిచేసే ఉద్యోగులు. అలాగే బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఓవర్ టైం భత్యం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఓవర్ టైం అలవెన్స్ లేదా ఓటీ రేటును సవరించేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 లో జారీ చేసిన ఆర్డర్ ప్రకారమే ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. -
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కుచ్చుటోపీ
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ.2,000 చొప్పున భృతి ఇస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగేళ్లుగా ఆ సంగతే మర్చిపోయారు. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో నిరుద్యోగులను మచ్చిక చేసుకునేందుకు భృతి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగ భృతిపై కేబినెట్లో చర్చించామని, ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేశ్ గురువారం తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు ఈ భృతిని అరకొరగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రుణ మాఫీ పేరిట రైతులను, డ్వాక్రా సంఘాలను దగా చేసిన తరహాలోనే నిరుద్యోగులకు వంచించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. బకాయి రూ.96 వేలు: రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హామీ ప్రకారం ఒక్కో కుటుంబంలో ఒక్కరికి నెలకు రూ.2,000 చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చి 48 నెలలవుతోంది. భృతి కిందా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 48 నెలలకు గాను ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.96,000 చొప్పున బకాయి పడింది. ఈ సొమ్ము చెల్లిస్తారని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.1,000 మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. అది కూడా కేవలం 10 లక్షల మందికే ఈ భృతిని పరిమితం చేయాలని నిర్ణయానికొచ్చింది. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. నిరుద్యోగులందరికీ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. అర్హుల సంఖ్య కుదింపు: నిరుద్యోగులకు ఆర్థిక సాయం పేరుతో గత ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. భృతి ఇచ్చే విషయంలో విధివిధానాలు రూపొందించాలంటూ కాలయాపన చేసింది. బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లలో పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం స్పందించింది. అర్హుల సంఖ్యను వీలైనంత మేర కుదించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 22 –35 ఏళ్లలోపు వయసున్న వారే భృతికి అర్హులు. డిగ్రీ చదివిన వారికి మాత్రమే నెలకు రూ.1,000 చొప్పున భృతి అందజేస్తారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదివిన నిరుద్యోగులకు భృతి రాదు. వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి పొందాలంటే రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరిగా ఉండాలి. స్థానికుడై ఉండాలి. 2.50 ఎకరాలలోపు మాగాణి, 5 ఎకరాలలోపు మెట్ట భూమి కలిగి, దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుద్యోగులకు మాత్రమే భృతి అందుతుంది.4 చక్రాల సొంత వాహనం ఉంటే అనర్హులే. ఒక్కో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే నిరుద్యోగ భృతి వర్తింపజేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల కింద స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం లేదా రుణం పొంది ఉంటే భృతికి అనర్హులు. పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వరు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించిన వారు భృతికి అనర్హులని ప్రభుత్వం తేల్చేసింది. రైతులు, డ్వాక్రా సంఘాలకు మొండిచేయి రైతుల రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక షరతులు విధిస్తూ వ్యవసాయ రుణ మాఫీని భారీగా కుదించేశారు. వాస్తవానికి రాష్ట్రంలో రైతుల పేరిట బ్యాంకుల్లో రూ.87,612 కోట్ల అప్పులు ఉండగా, ఇది రూ.24,000 కోట్లేనని ప్రభుత్వం పేర్కొంది. నాలుగేళ్లయినా రూ.24,000 కోట్ల రుణాలను మాఫీ చేయలేదు. రుణమాఫీ పేరిట విడతవారీగా ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీలకూ సరిపోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు ఉన్నాయి. మాఫీ కాదు, పెట్టుబడి రాయితీ అంటూ డ్వాక్రా సంఘాలను బాబు నిలువునా మోసం చేశారు. రుణాలు మాఫీ కాక, వాటిని తీర్చే దారిలేక డ్వాక్రా సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. -
కుమారులూ.. తస్మాత్ జాగ్రత్త!
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోకుంటే ఇక కుదరదు. జీవించి ఉన్నంత కాలం వారి యోగక్షేమాలు చూడాల్సిందే. ఈ మేరకు భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ చట్టం–2007 అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని ముగ్గురికి కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున శనివారం తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా వ్యవహరించే కుమారులను చట్టప్రకారం శిక్షిస్తామనీ స్పష్టం చేశారు. కందుకూరు: పట్టణానికి చెందిన సయ్యద్ నవాజ్ ఖయ్యూంకు ముజీబ్‌బాషా, ఖాదర్‌బాషా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిని తండ్రి పెంచి పెద్ద చేసి వివాహాలు చేశాడు. ప్రస్తుతం నవాజ్‌ఖయ్యూం వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. కొడుకులిద్దరూ తండ్రి ఆస్తులైదే పంచుకున్నారుగానీ ఆయన బాగోగులు గాలికొదిలేశారు. ముజీబ్‌బాషా నెల్లూరులో నివాసం ఉంటుండగా ఖాదర్‌బాషా సింగరాయకొండలో కాపురం పెట్టుకున్డాఉ. పోషణ భారమైన నవాజ్‌ఖయ్యూం తన కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల ఆర్డీఓ మల్లిఖార్జునకు ఫిర్యాదు చేశారు. విచారించిన ఆర్డీఓ సీనియర్ సిటిజన్స్ చట్టం–2007 ప్రకారం ఆయన కుమారులకు నోటీసులు జారీ చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు కుమారులను అరెస్టు చేయాలని తన కోర్టులో ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఖాదర్‌బాషాను అరెస్టు చేసి ఆర్డీఓ కోర్టుకు తెచ్చారు. ముజీబ్‌బాషా కూడా ఆర్డీఓ వద్ద లొంగిపోయాడు. ఖయ్యూం కుమారులను ఆర్డీఓ తీవ్రంగా హెచ్చరించారు. తల్లిదండ్రులను చూడకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరితో చర్చించి తండ్రి పోషణార్థం ప్రతి నెలా చరో రూ.3500 చొప్పున తండ్రి ఖాతాలో జమ చేసేలా ఆర్డీఓ తీర్పు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. మరో కేసులో కుమారుడికి గుణపాఠం ఇదే విధమైన మరో కేసులోను ఆర్డీఓ తీవ్రంగా స్పందించారు. లింగసముద్రం మండలం మొగిలిచర్లకు చెందిన పోతినేని నర్సమ్మ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఒకే ఒక కొడుకు శివన్నారాయణ ఆమె పోషణను పట్టించుకోవడం లేదు. పైగా సర్వే నంబర్ 137/3లో ఉన్న 1.60 ఎకరాలు, సర్వే నంబర్ 144లో ఉన్న 1.44 ఎకరాల భూమిని తల్లికి తెలియకుండా తన పేరుపై మార్చుకున్నాడు. ఆ భూములకు పాస్ పుస్తకాలు తెచ్చుకుని అనుభవిస్తూ తల్లి పోషణను మాత్రం గాలికొదిలేశాడు. ఆమె కూడా ఆర్డీఓ మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్డీఓ విచారణ చేపట్టి చట్టంలోని నిబంధనల మేరకు శివన్నారాయణ పేరుపై ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేస్తూ శనివారం తీర్పు చెప్పారు. ఆ పొలాలను నర్సమ్మ పేరుపై మార్చుతున్నట్లు స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్స్ యాక్టు–2007 చట్టంలో తల్లిదండ్రులను పట్టించుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవచ్చని భారత ప్రభుత్వం పేర్కొందని ఆర్డీఓ పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులపై కఠిన చర్యలు తీసుకునే ఇటువంటి చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. -
కేంద్ర ఉద్యోగుల డిప్యుటేషన్ భత్యం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న భత్యాన్ని రూ.2 వేల నుంచి రూ.4,500కు పెంచుతున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ(డీవోపీటీ) తెలిపింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపు చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలోనే డిప్యుటేషన్‌పై వెళ్లే కేంద్ర ఉద్యోగులకు వారి మూలవేతనంలో 5% లేదా గరిష్టంగా నెలకు రూ.4,500 చెల్లిస్తామని తెలిపింది. ఒకవేళ ఉద్యోగులు మరో ప్రాంతానికి డిప్యుటేషన్‌పై వెళితే..వారి మూలవేతనంలో 10% లేదా గరిష్టంగా రూ.9 వేలు చెల్లిస్తామంది. -
‘చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైంది’
-
ట్రాఫిక్ పోలీసులకు ఊరట!
జీతానికి అదనంగా 30 శాతం భత్యం మంజూరు ఆమోదముద్ర వేసిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మూడేళ్ల క్రితమే ప్రతిపాదించిన సీవీ ఆనంద్ సీఐడీ, ఐఎస్డబ్ల్యూలకూ 25 శాతం కేటాయింపు రోడ్లపైన, జంక్షన్లలో ఏకబిగిన కనిష్టంగా ఎనిమిది గంటల పాటు నిలువుకాళ్లపై డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని ట్రాఫిక్ విభాగాల్లో పని చేస్తున్న వారికి జీతంపై అదనంగా 30 శాతం పొల్యూషన్ పే ఇవ్వాలని ఆదివారం రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ట్రాఫిక్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం నగర అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్)గా పని చేసిన సీవీ ఆనంద్ చేసిన ప్రతిపాదనలకు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ పోలీసులతో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)లో పని చేసే వారికి 25 శాతం అలవెన్స్ ఇవ్వనున్నారు. -సాక్షి, సిటీబ్యూరో రాజధానిలోనే ఎక్కువ ప్రభావం... రాజధానిలో కాలుష్యం నానాటికీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. ఇవి వాహనాలు ప్రయాణిస్తున్న రోడ్లు, సిగ్నల్స్ వల్ల ఆగుతున్న జంక్షన్లలో ఎక్కువగా ఉంటోంది. నగరంలో మొత్తం 585 ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణ (పాయింట్ డ్యూటీ)లో ఉంటున్నారు. అన్నిచోట్లా కాలుష్యం స్థాయి ఒకేలా ఉండట్లేదు. వాహన శ్రేణి, రాకపోకల సంఖ్య ఆధారంగా లెక్కిస్తే 125 జంక్షన్లలో అత్యంత తీవ్రంగా... మరో 200 జంక్షన్లలో తీవ్రంగా ఉంటోంది. కాలుష్య నియంత్రణ మండలి నివేదికల ఆధారంగా ట్రాఫిక్ పోలీసుల ఈ గణాంకాలను రూపొందించారు. సిటీలో సంచరిస్తున్న వాహనాల్లో అన్నీ ఒకేస్థాయి కాలుష్యాన్ని విడుదల చేయట్లేదు. మొత్తమ్మీద అన్ని కేటగిరీలూ కలిపి 28 లక్షల వరకు వాహనాలు ఉండగా... అత్యంత కాలుష్య కారకాలుగా లక్ష వరకు ఉన్న ఆటోలు, 4 వేల ఆర్టీసీ బస్సులు నమోదవుతున్నాయి. వీటితో పాటు 15 నుంచి 20 ఏళ్ల వయస్సున్న వాహనాలు, ప్రభుత్వ, రవాణా వాహనాలు కూడా పరిగణలోకి తీసుకోదగ్గ స్థాయిలోనే కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. వీటికి తోడు ప్రమాణాలు పాటించని/ మోడ్రన్ హారన్లు, శక్తిమంతమైన లైట్లు శబ్ధ, కాంతి కాలుష్యాలకూ కారకాలవుతున్నాయి. వీటికి చెక్ చెప్పేందుకు అవసరమైన యంత్రాలు, యంత్రాంగం లేకపోవడంతో నానాటికీ ఇబ్బందులు పెరుగుతున్నాయి. ప్రమాదపుటుంచుల్లో ట్రాఫిక్ సిబ్బంది.... ఈ పరిస్థితుల్లో పని చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వీరికి కనీసం నోస్ మాస్క్‌లు, కళ్లజోళ్లు వంటివీ అందుబాటులో ఉండేవి కాదు. అయితే గడిచిన కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఇవి అందుతూనే ఉన్నాయి. అయినప్పటికీ 2012 లో ట్రాఫిక్ సిబ్బందికి నిర్వహించిన సామూహిక వైద్య పరీక్షల ఫలితాలను విశ్లేషించిన సీవీ ఆనంద్ ఆందోళనకర అంశాలు గుర్తించారు. నగర ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న వారిలో అనేక మంది ఊపిరితిత్తులు, కళ్లు, చెవులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. సరాసరిన 32 శాతం మందికి ఊపిరితిత్తుల, 25 శాతం మందికి కంటి, ఏడు శాతం మందికి చెవి సంబంధ రుగ్మతలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి అదనపు పే ఇప్పించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ సిబ్బంది నిత్యం కాలుష్యంలో పని చేస్తున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం, నిత్యం వైద్య అవసరాలకు వినియోగించుకోవడం కోసం 30 శాతం అదనపు పే ఇప్పించాలంటూ సీవీ ఆనంద్ గతంలో పార్లమెంట్ స్థాయీ సంఘాన్ని కోరారు. వారు ఆమోదముద్ర వేయడంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వీటిని పరిగణ లోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అనేక మార్పుచేర్పులతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ‘లూప్‌లైన్స్’కు ప్రోత్సాహకంగా... పోలీసు విభాగంలో లూప్‌లైన్లుగా భావించే అవినీతి నిరోధక శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతంపై అదనంగా 30 శాతం చెల్లించే విధానం అమలులో ఉంది. కీలక బాధ్యతలు నిర్వర్తించే సీఐ సెల్, ఆక్టోపస్ల్లోనూ అదనపు చెల్లింపు విధానం అమలవుతోంది. వీటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక విభాగాలైన నేర పరిశోధన విభాగం (సీఐడీ), ప్రముఖల భద్రతను పర్యవేక్షించే ఐఎస్డబ్ల్యూలకూ 25 శాతం అదనపు భత్యం మంజూరు చేసింది. క్యాబినెట్ నిర్ణయంపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘పోలీసుల్లో నైతికస్థైర్యాన్ని నింపే ఈ నిర్ణయం అద్భుతమైంది. దీంతో పోలీసు పనితనంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ కోసం ఉంటున్న ఒత్తిడి తగ్గిపోతుంది. దేశంలోనే తెలంగాణ పోలీసులు వారి సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యమంత్రి, హోమ్‌మంత్రి, డీజీపీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’. అన్నారు. -
ఫ్లిప్‌కార్ట్ రూ.50 వేల భత్యం
పిల్లల దత్తత కోసం... న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే తన ఉద్యోగులకు రూ.50 వేల భత్యాన్ని దత్తత అలవెన్స్ కింద అందించనుంది. ఈ అలవెన్స్‌లు జూలై 10 నుంచి అమలులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. దత్తతకు అవసరమైన చట్టసంబంధ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మహిళా ఉద్యోగులు 12 నెలల లోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకుంటే వారికి అల వెన్సుతో పాటు మెటర్నిటీ పాలసీ కింద అందించే ఆరు నెలల పెయిడ్ లీవ్, 4 నెలల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ వంటి సౌకర్యాలు వర్తిస్తాయి. ఒక ఏడాది పైనున్న పిల్లలను దత్తత తీసుకుంటే 3 నెలల పెయిడ్ లీవ్, 4 నెలల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ సౌకర్యాలు అందుతాయి. మగవారు కూడా పిల్లలను దత్తత తీసుకుంటే వారు కూడా దాదాపుగా ఇవే సౌకర్యాలను పొందవచ్చు. ఇవి మినహ ఇంకా సెలవులు కావాలంటే 3 నెలల వరకు తీసుకోవచ్చు. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ మెటర్నిటీ, ప్యాటర్నల్ లీవ్ పాలసీలను సవరించింది. ఈ సవరణలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. సవరించిన మెటర్నిటీ పాలసీ ప్రకారం కంపెనీ తన ఉద్యోగుల్లో తొలిసారి తల్లులైన మహిళలకు ఆరు నెలలు పెయిడ్ లీవ్స్‌ను, వేతనంతో కూడిన 4 నెలల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్‌ను ఇస్తుంది. అలాగే అవసరమైతే ఒక ఏడాది వరకు వేతనం లేకుండా కెరీర్ బ్రేక్ తీసుకోవచ్చు. -
ఉద్యోగులకు పెరిగిన అలవెన్స్
- యాభై శాతం పెరిగిన టీఏ - ఒకేరోజు ఏడు పీఆర్సీ జీవోల జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీవోలు శనివారం వెలువడ్డాయి. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించే కొత్త అలవెన్సుల వివరాలతో ఆర్థిక శాఖ ఒకేరోజున ఏడు జీవోలను జారీచేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల ప్రయాణాలకు చెల్లించే దినసరి భత్యం యాభై శాతం పెరిగింది. రాష్ట్రంలో చేసే పర్యటనలకు సంబంధించి రూ.49,870-రూ.1,00,770 ఆపైన పేస్కేలు ఉన్న ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం దినసరి భత్యాన్ని రూ.450కి పెంచారు. రాష్ట్రం దాటి వెళ్లే పర్యటనలకు రూ.600కు పెంచారు. గ్రేడ్ 2లో రూ.28,940-రూ.78,910, రూ.46,060 నుంచి రూ.98,440 మధ్య ఉన్న ఉద్యోగులకు రాష్ట్రంలో పర్యటనలకు ఇచ్చే దినసరి భత్యాన్ని రూ.200, రాష్ట్రం దాటి వెళితే రూ.450 చొప్పున చెల్లిస్తారు. గ్రేడ్-3 మిగతా ఉద్యోగులందరికీ రాష్ట్రంలో పర్యటనలకు రూ.225, రాష్ట్రం దాటి వెళితే రూ.300 చెల్లిస్తారు. సబ్ జైలు విధులకు హాజరయ్యే అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు ఇచ్చే జైలు అలవెన్స్‌ను రూ.300కు పెంచారు. హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్లకు ఇచ్చే ఇన్సెంటివ్ అలవెన్స్, ఉపాధ్యాయులకు ఇచ్చే స్కౌట్స్ అలవెన్స్‌కు ప్రత్యేక జీవో జారీ చేశారు. గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందికి ఇచ్చే స్పెషల్ అలవెన్స్లతో మరో జీవో విడుదల చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు ఇచ్చే కబేళా అలవెన్స్ పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. టైప్‌రైటర్, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ లేనట్లయితే న్యాయ విభాగంలో పనిచేస్తున్న కాపీయర్లకు మిషన్ అలవెన్స్ మంజూరుకు వీలుగా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో అంగవైకల్య ఉద్యోగులకు సంబంధించిన అలవెన్సు జీవో తప్ప మిగతావన్నీ విడుదలయ్యాయి. బకాయిల చెల్లింపు విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. -
50 శాతం భృతిని వెంటనే ప్రకటించాలి: జాక్టో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి 50 శాతం తాత్కాలిక భృతిని తక్షణమే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి(జాక్టో) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక పీఆర్టీయూ భవన్లో శుక్రవారం జరిగిన సమావేశానికి 12 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. తామెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేదా ఆందోళనలు చేపట్టాలని తీర్మానించారు. కొత్త పీఆర్సీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 50 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకున్న సదుపాయాలన్నింటినీ ఎయిడెడ్ టీచర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సదుపాయాన్ని పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పి.వెంకట్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.