ఫ్లిప్‌కార్ట్ రూ.50 వేల భత్యం | For Children adoption flipkart allowances | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్ రూ.50 వేల భత్యం

Published Tue, Jul 14 2015 12:54 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

ఫ్లిప్‌కార్ట్ రూ.50 వేల భత్యం - Sakshi

ఫ్లిప్‌కార్ట్ రూ.50 వేల భత్యం

పిల్లల దత్తత కోసం...
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే తన ఉద్యోగులకు రూ.50 వేల భత్యాన్ని దత్తత అలవెన్స్ కింద అందించనుంది. ఈ అలవెన్స్‌లు జూలై 10 నుంచి అమలులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. దత్తతకు అవసరమైన చట్టసంబంధ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మహిళా ఉద్యోగులు 12 నెలల లోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకుంటే వారికి అల వెన్సుతో పాటు మెటర్నిటీ పాలసీ కింద అందించే ఆరు నెలల పెయిడ్ లీవ్, 4 నెలల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ వంటి సౌకర్యాలు వర్తిస్తాయి.

ఒక ఏడాది పైనున్న పిల్లలను దత్తత తీసుకుంటే 3 నెలల పెయిడ్ లీవ్, 4 నెలల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ సౌకర్యాలు అందుతాయి. మగవారు కూడా పిల్లలను దత్తత తీసుకుంటే వారు కూడా దాదాపుగా ఇవే సౌకర్యాలను పొందవచ్చు. ఇవి మినహ ఇంకా సెలవులు కావాలంటే 3 నెలల వరకు తీసుకోవచ్చు. ఇటీవల  ఫ్లిప్‌కార్ట్ మెటర్నిటీ, ప్యాటర్నల్ లీవ్ పాలసీలను సవరించింది. ఈ సవరణలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. సవరించిన మెటర్నిటీ పాలసీ ప్రకారం కంపెనీ తన ఉద్యోగుల్లో తొలిసారి తల్లులైన మహిళలకు ఆరు నెలలు పెయిడ్ లీవ్స్‌ను, వేతనంతో కూడిన 4 నెలల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్‌ను ఇస్తుంది. అలాగే అవసరమైతే ఒక ఏడాది వరకు వేతనం లేకుండా కెరీర్ బ్రేక్ తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement