adoption
-
చట్టబద్ధతే దత్తతకు మార్గం!
సాక్షి, హైదరాబాద్: అమ్మా, నాన్న అనే పిలుపు కోసం తపన.. తల్లినయ్యానంటూ చెప్పాలనే కోరిక.. తండ్రిగా బిడ్డ వేలుపట్టి నడిపించాలనే తహతహ కొందరు దంపతులను అక్రమ మార్గంలో నడిచేలా చేస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా, చికిత్సలు చేయించుకున్నా వేధిస్తున్న సంతానలేమి సమస్యలు, వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో సమాజంలో చిన్నచూపు, చట్టబద్ధంగా పిల్లల దత్తతకు(Child Adoption) ఏళ్ల కాలం పాటు పట్టే సమయం వెరసీ.. దళారుల మాటలు నమ్మేలా చేస్తున్నాయి. విద్యావంతులు, గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వారు సైతం అక్రమ మార్గంలో పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులకు నవజాత శిశువులను విక్రయిస్తున్న రెండు ముఠాలను మంగళవారం రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పిల్లలను విక్రయించే నేరస్తులపైనే కాదు శిశువులను కొనుగోలు చేసిన బాధిత తల్లిదండ్రుల పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా పిల్లల దత్తత ఎంత అవసరమో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ‘కారా’.. పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడానికి జాతీయ స్థాయిలో ‘కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ’ (కారా) పని చేస్తోంది. ఈ ఏజెన్సీ కింద రాష్ట్ర దత్తత వనరుల ఏజెన్సీలు పని చేస్తాయి. అసహాయ పరిస్థితులు, ఆర్థిక భారంతో తల్లిదండ్రులు వదిలేసిన, అప్పగించిన పిల్లలను శిశు సంక్షేమశాఖ అధికారులు చేరదీస్తారు. వీరినే దత్తత ఇస్తారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో శిశువిహార్, జిల్లా స్థాయిలో శిశుగృహాలు ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్లలోపు చిన్నారులకు మాత్రమే సంరక్షణ ఉంటుంది. ఆరేళ్లు దాటితే శిశుగృహాల నుంచి బాలసదన్‌కు పంపించి చదువు నేరి్పస్తారు. చిన్నారుల దత్తత కోసం నమోదు చేసుకున్నాక వచి్చన సీనియారిటీ, పిల్లల వయసు, ఆడ, మగ, ఆరోగ్యం తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే దత్తతకు కనీసం ఏడాది నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. బంధువుల పిల్లల దత్తతకూ అనుమతి తప్పనిసరి.. ఇలాంటి చిన్నారులే కాదు బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలన్నా ‘కారా’ ద్వారా అనుమతి పొందాల్సిందే. దంపతుల వయసు, వైవాహిక బంధం ఆధారంగా చిన్నారులను దత్తత ఇస్తారు. కనీసం రెండేళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా జీవిస్తున్న వారే అర్హులు. సింగిల్ పేరెంట్ అయితే మహిళ మాత్రమే దత్తత తీసుకునేందుకు అర్హురాలు. పురుషులు దత్తత తీసుకోవడానికి చట్టం అనుమతించదు. కేరింగ్స్ పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దంపతులు కుటుంబ పరిస్థితులు, తనిఖీ చేసిన అనంతరం జిల్లా బాలల సంరక్షణ విభాగం (డీసీపీయూ) నివేదిక అందిస్తుంది. అనంతరం ‘కారా’ ప్రాథమిక అనుమతి లేఖను ఇస్తుంది. అప్పుడు డీసీపీయూ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఈ వివరాలన్నీ పరిశీలించాక జిల్లా కలెక్టరు దత్తత ఆదేశాలు జారీచేస్తారు. -
40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా! ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయ్యింది చిలీలోని శాన్ ఆంటోనియో. వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్లకిందట.. శాన్ అంటోనియాకు చెందిన 24 ఏళ్ల ఎడిటా బిజామాకు అప్పటికే ఇద్దరమ్మాయిలు. మూడో సారి కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి అగస్టో పినోచెట్ నాయకత్వంలోని సైనిక నియంతృత్వ ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతలే మార్గమని భావించింది. అట్లా దాదాపు 20వేల మంది పిల్లలను బలవంతపు దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా.. బిజామా సైతం దత్తతకు అంగీకరించింది. కానీ.. పాప పుట్టిన తరువాత పంపించడానికామె ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావ్’అంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతురిని తీసుకెళ్లిపోయారు. బిజామా కుటుంబంలోని చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. కానీ పేగు తెంచుకు పుట్టింది కదా.. బిజామా బిడ్డకోసం రోదిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు తెలియదు. మార్గం కూడా లేదు. మరోవైపు.. ఆమె కూతురు అడామరీ గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది. ఇప్పుడు ప్యూర్టో రికోలో నివసిస్తోంది. తనను దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడమెలాగో తెలియదు. అలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు.. శిశువుగా దత్తతకు వచ్చి.. చిలీలోని తన సొంత కుటుంబాన్ని కలుసుకున్న టెక్సాస్ అగ్నిమాపక అధికారి టేలర్ గ్రాఫ్ గురించి చెప్పారు. అలాంటివారికోసం సాయం చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ రూట్స్’స్వచ్ఛంద సంస్థ గురించి వివరించారు. వెంటనే ఆ సంస్థను కలిసింది గార్సియా. కుటుంబం గురించి తెలుసుకోవడానికి గార్సియా తపన చూసి.. ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహమందించారు. సోదరి బర్త్ సరి్టఫికెట్ ద్వారా కుటుంబ వివరాలు తెలిసాయి. అయినా.. డీఎన్ఏ పరీక్షతో బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది. వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు. గార్సియాది ప్యూర్టో రికన్ స్పానిష్, మయామీ యాస. కానీ తల్లి, అక్కలది విలక్షణమైన చిలీ యాస. మొదటిసారి సంభాషణ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా. 41 ఏళ్ల గార్సియాకు తల్లికి, ఇద్దరు అక్కలకు దగ్గరకు పోలికలున్నాయి. అంతేకాదు.. పెద్దక్కకు ఇష్టమున్నట్టే ఆమెకూ కుక్కలంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్సియా చిలీయాస, వంటకాలు, సంగీతం అన్నింటినీ నేర్చుకుంటోంది. అక్కలతో ఎక్కువకాలం గడపాలని నిర్ణయించుకుంది. కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చిలీకి తీసుకువచి్చన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు. ఇది ఆ ఎన్జీవో చేసిన నాలుగవ పునరేకీకరణ. ఎన్జీవో చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు. కొందరు చనిపోయారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జంతు ప్రపంచం... దత్తత మీ ఇష్టం..!
ఆరిలోవ : విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పాటు అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ వన్యప్రాణులను జూ అధికారులు దత్తత ఇస్తున్నారు. ఇందుకు దాతలు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దాతల పేరుతో జూ సిబ్బంది వాటికి ఆహారం అందిస్తారు. జూలో ఏ జంతువు, ఏ పక్షిని దత్తత తీసుకొంటే వాటి ఎన్‌క్లోజరు వద్ద వాటి ఫొటోతో పాటు దాతల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.అవి సందర్శకులకు స్పష్టంగా కనిపించే విధంగా ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పలువురు దాతల పేర్లతో కూడిన బోర్డులను వారు దత్తత తీసుకొన్న వన్యప్రాణుల ఎన్క్లోజర్ల వద్ద సిద్ధం చేశారు. ఆకర్షణీయంగా దాతల పేర్లతో బోర్డులు జూ పార్కులో వివిధ జాతులకు చెందిన జంతువులు, రకరకాల పక్షులు, తాబేళ్లు, మొసళ్లు, పాములు జూకి వెళుతున్న సందర్శకులను అలరిస్తుంటాయి. ఆయా ఎన్క్లోజర్ల వద్ద దాతల బోర్డులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. జూలో వందల కొలది వన్యప్రాణులు, పక్షులు ఉన్నాయి. వాటిపై ప్రేమ, వాత్సల్యం చూపుతూ జూ అధికారులకు సహకరిస్తున్నారు. వాటిని దత్తత తీసుకుని నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఆహారం అందించడానికి బాధ్యతగా తీసుకొని సహాయపడుతున్నారు. ఇక్కడ తెల్ల పులి, ఖఢ్గమృగం, జిరాఫీ తదితర పెద్ద జంతువులను పలు కంపెనీలు ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. మరికొన్ని చిన్న జంతువులు, పక్షులను కూడా కొందరు నెల, ఆరు నెలలు పాటు దత్తత తీసుకొని ఆహారం అందిస్తున్నారు. » ఫ్లూయంట్ గ్రిడ్ లిమిటెడ్ జిరాఫీని ఒక ఏడాది పాటు దత్తత తీసుకొంది. దీంతో ఆ కంపెనీ పేరు, జిరాఫీ చిత్రపటంతో దాని ఎన్‌క్లోజరు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు.. » ఎన్‌క్లోజరు వద్ద ఐఓసీఎల్ కంపెనీ ఖఢ్గమృగాన్ని ఏడాది కాలం దత్తత తీసుకొన్నారు. దాన్ని మళ్లీ మరో ఏడాది దత్తత కొనసాగించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. ఖఢ్గమృగం ఉన్న చిత్రపటంపై లిమిటెడ్ పేరుతో బోర్డును దాని ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేశారు. » ఆర్సిలోర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్(ఏఎన్/ఎంఎస్) తెల్ల పులిని ఒక సంత్సరం పాటు దత్తత తీసుకొంది. తెల్లపులుల ఎన్‌క్లోజరు వద్ద ఆ కంపెనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. » వీటితో పాటు మరికొందరు ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల, ఒక్కరోజు కూడా ఇక్కడ వన్యప్రాణులకు ఆహారం అందించడానికి దత్తత తీసుకొన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.ఆదాయం పన్ను మినహాయింపు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. వాటి కోసం ఒక రోజు, నెల, ఏడాది వారిగా అయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయం పన్నులో మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ దత్తత పద్ధతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులకు ఆహారం అందిస్తున్నారు. దాతలు ముందుకు రావాలి జూలో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలి. వాటికి ఆహారం అందించడంలో భాగస్వాములు కావాలి. ఇప్పటికే కొందరు దాతలు సంస్థల పరంగా, వ్యక్తిగతంగా ముందుకు వచ్చి కొన్ని జంతువులను, పక్షులను వారం, నెల, ఏడాది కాలానికి ఆహారం అందించడానికి వన్యప్రాణులను దత్తత తీసుకొన్నారు.ఎక్కువమంది దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే మూగజీవాలకు సహకరించినవారవుతారు. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. – మంగమ్మ, జూ క్యూరేటర్ ఆహారం ఇలా... సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పళ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పళ్లు ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పళ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికీ వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు. డెలాయిట్ ఏషియా పసిఫిక్ రూపొందించిన ‘ఏఐ ఎట్ క్రాస్‌రోడ్స్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.ఇదీ చదవండి: ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్పార్ట్స్ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్ వర్కర్లు తెలిపారు.గవర్నెన్స్‌పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్ వివరించింది.ఏఐ వినియోగంపై కంపెనీలకు ఆశావహ భావం కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.నైతిక విలువలతో ఏఐను వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని తెలిపింది.ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది.విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న టెక్ కంపెనీలకు సంబంధించిన 900 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. -
ఏఐ ప్రభావం.. వచ్చే ఏడాది జరిగేది ఇదే..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో 2025లో టెక్నాలజీ అమలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరుగుతుందని నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ అభిప్రాయపడ్డారు. ఏఐతో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు ఉంటాయన్న అంశంపై స్పందిస్తూ.. నైపుణ్యాల పెంపు, ఉత్పాదకత పెంపొందించడంలో ఏఐని సహాయకారిగా చూడాలన్నారు.దీన్ని అసాధారణ సాంకేతికతగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్యోగాల నష్టం తక్కువేనంటూ.. ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని, ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొనసాగాలంటే వ్యాపార సంస్థలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇందుకు సంస్థ పరిమాణంతో సంబంధం లేదన్నారు.టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో బలమైన భాగస్వామ్యాలతోనే పెద్ద సవాళ్లను అధిగమించి, రాణించగలమన్నారు. లాంగ్వేజ్ నమూనాలను అర్థం చేసుకుని, వాటిని ఏ విధంగా వినియోగించుకోగలమో చూడాలని సూచించారు. భారత్‌లో ఏఐ మిషన్, నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా చీఫ్‌గానూ పనిచేస్తున్న గంగాధరన్ ఏటా 2,500–3,000 మేర ఉద్యోగులను పెంచుకుంటున్నట్టు చెప్పారు. బెంగళూరు, గురుగ్రామ్, పుణె, ముంబై, హైదరాబాద్‌లో ఎస్ఏపీకి కేంద్రాలున్నాయి. ఇక్కడ అత్యుత్తమ నైపుణ్యాలను గుర్తించడం తమకు కీలకమన్నారు. ఎస్ఏపీకి భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి కేంద్రంగా ఉందని సంస్థ సీఈవో క్రిస్టియన్ క్లీన్ తెలిపారు. భవిష్యత్‌లో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్ఏపీకి టాప్–10 దేశాల్లో ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. -
ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తోంది. దీన్ని అందిపుచ్చుకోవడంలో భారత్.. ప్రపంచం కంటే ముందుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) తాజా పరిశోధన ప్రకారం.. 30 శాతం భారతీయ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగిస్తూ విలువను పెంచుతున్నాయి.బీసీజీ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 26 శాతం కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తున్నాయి. ఫిన్‌టెక్, సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ రంగాలు తమ కార్యకలాపాలలో ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. కొన్నేళ్ల పెట్టుబడి, నియామకం, పైలట్ ప్రాజెక్ట్‌ల తర్వాత ఇప్పుడు సీఈవోలు ఈ సాంకేతికత నుండి స్పష్టమైన రాబడి కోసం ప్రయత్నిస్తున్నారని నివేదిక పేర్కొంది. అదే సమయంలో దాని పూర్తి విలువను పొందడం కష్టంగా ఉందని వివరించింది.పరిశ్రమల అంతటా ఏఐ ప్రోగ్రామ్‌లు విస్తృతంగా అమలు చేస్తున్నప్పటికీ, బీసీజీ తాజా పరిశోధన ప్రకారం, కేవలం 26 శాతం కంపెనీలు మాత్రమే ఇంకా కాన్సెప్ట్‌ను దాటి ముందుకు వెళ్లడానికి, స్పష్టమైన విలువను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేశాయి.ఆసియా, యూరప్ ఉత్తర అమెరికాలోని 59 దేశాలలో విస్తరించి ఉన్న 20 రంగాలకు చెందిన పది ప్రధాన పరిశ్రమలలో 1,000 మంది చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సర్వే ఆధారంగా బీసీజీ ఈ నివేదికను రూపొందించింది. -
తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత
అమెరికా, పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యత పై అవగాహన కల్పిస్తూ "అడాప్ట్ ఏ హైవే" కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా, అత్యంత రద్దీ గల రహదారిని తానా ఆధ్వర్యంలో దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిడ్-అట్లాంటిక్ తానా బృందం రహదారి పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా పచ్చదనాన్ని పరిరక్షించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. హ్యారిస్ బర్గ్ తానా టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు, పలువురు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమెరికా సమాజంతో మమేకమై సమాజ సేవ చేయాలనే సంకల్పం కలిగించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ కార్యక్రమం చేపట్టిందని మిడ్ అట్లాంటిక్ తానా రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు తెలిపారు. ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన హ్యారిస్ బర్గ్ తానా బృందానికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.ఈ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు సమాజానికి ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమం ప్రకృతి పట్ల చక్కటి అవగాహన కలిగించి, ప్రకృతిని, పచ్చదనాన్ని ఎలా సంరక్షించుకోవాలో నేర్చుకున్నామని తెలిపారు. తానా ఆధ్వర్యంలో విద్యార్థులలో సేవా భావం పెంపొందించేలా సమాజానికి మేలు చేసే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ఆకాంక్షించారు. -
చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం!
అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తెలుగు వారిలో సామాజిక బాధ్యత పెంచేలా హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో నాట్స్ దత్తత తీసుకున్న హైవే (రూట్.59 స్ట్రీట్) లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది. హైవే పక్కన చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు అక్కడ పచ్చదనాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టింది. అమెరికాలో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచేందుకు హైవే దత్తత లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. నాట్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అక్కడ ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. విద్యార్థుల సేవా సమయానికి గుర్తింపు ఇస్తుంది. విద్యార్థి దశ నుంచే సేవ చేయాలనే సంకల్పాన్ని కలిగించేందుకు నాట్స్ చికాగోలో హైవే దత్తత కార్యక్రమాన్ని తీసుకుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసిన విద్యార్ధులను, నాట్స్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన చికాగో చాప్టర్ సమన్వయకర్తలు నరేందర్ కడియాల, వీర తక్కెళ్లపాటి లను అందరూ ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చికాగో చాప్టర్ సభ్యులు హవిల మద్దెల, చంద్రిమ దాడి, చెన్నయ్య కంబల, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, వినోత్ కన్నన్, దివాకర్ ప్రతాపుల మరియు ఇతర చాప్టర్ సభ్యులు తదితరులు కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యుయేల్ నీలాతో పాటు నాట్స్ బోర్డు మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బోపన్నలు వాలంటీర్లకు విలువైన సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సామాజిక బాధ్యతను పెంచే అడాప్ట్ ఏ హైవే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సివిల్ సర్వీసెస్ వ్రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!) -
ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా బిక్షాటన ..నేడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని..!
మన చుట్టూ తరిచి చూస్తే స్ఫూర్తిని కలిగించే ఎన్నో కథలు మనమందు మెదులుతాయి. అలాంటి ప్రేరణ కలిగించే కథ మైసూరులో చోటు చేసుకుంది. ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా దుర్భరమైన జీవితాన్ని అనుభవించింది. ఆ తర్వాత ఓ చిన్నారిని దత్తత తీసుకుని తల్లిగా అద్భుతమైన అమ్మాయిగా తీర్చిదిద్ది సమాజమే సెల్యూట్ చేసేలా ఎదిగింది. అవమానాలను, అసమానతలకు తట్టుకుని..శక్తిమంతమైన మహిళగా ఎదుగుతూ మరొకరికి మంచి జీవితాన్ని ఇచ్చే మహత్తర కార్యం చేసి శెభాష్ అనిపించుకుంది. ఎవరా ట్రాన్స్ జెండర్ అంటే..ఆ ట్రాన్స్‌జెండర్ పేరు షబనా అక్రం పాషా. దాదాపు రెండు దశాబ్దాల క్రితం బీబీ ఫాతిమాను దత్తత తీసుకుంది. నిజానికి షబనా ట్రాన్స్‌జెండర్‌గా చిన్ననాటి నుంచి ఎన్నో చిత్కారాలు, అవమానాల మధ్య దుర్భరమైన జీవితాన్ని గడిపింది. బతకటం కోసం బిక్షాటన వృత్తిని కూడా చేసింది. అలాంటి షబానా తమలాంటి వాళ్లలో ఉన్న మంచి కోణాన్ని పరిచయం చేసింది. ఒకసారి ఫబానా దగ్గరి బంధువు నలుగురు కూతుళ్లను విడిచిపెట్టేసి పరారయ్యాడు. అయితే షబానా తాను బతుకు ఈడ్చటమే గగనం అన్న పరిస్థితుల్లో ఉండి కూడా ఏ మాత్రం సంకోచించకుండా ఆ నలుగురిని దత్తత తీసుకుంది. వారిని తన పిల్లలుగా పెంచడం ప్రారంభించింది. వారికి తల్లిగా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే దానిపైన దృష్టిపెట్టింది. అలా ఒక్కో పైసా పోగు చేసి బీబీ ఫాతిమా అనే అమ్మాయిని బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించి కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌గా తీర్చిదిద్దింది. ఈ క్రమంలో కూడా షబానా ఎన్నో అవమానాలు ఎదుర్కొక తప్పలేదు. ఎందుకంటే షబానే అనే ట్రాన్స్ జెండర్ కూతురు కాబట్టి ట్రైనింగ్‌లో అందరితో కాకుండా ఫాతిమాకు వేరుగా శిక్షణ ఇచ్చేవారు. అందుకోసం గంటలు తరబడి ఇన్స్టిట్యూట్ వెలుపలే వేచి ఉండాల్సి వచ్చేది. అయినా సరే ఈ తల్లి కూతుళ్ల ద్వయం 'తగ్గేదే లే' అంటూ ఆ అసమానతలు, వివక్షతను దాటి ప్రపంచానికి తామెంటో చూపించారు. శక్తిమంతమైన మహిళలుగా ఎదిగారు. షబానా కష్టం ఫలించి ఫాతిమా రాష్ట్ర, జాతీయ కిక్‌బాక్సర్‌గా రాణించడమే గాక ఏకంగా మొత్తం 23 పతకాలు సాధించింది. ప్రస్తుతం ఫాతిమాకు 20 ఏళ్లు. ఆమె పెంచిన కూతురు విజయంతో ఒక్కసారిగా షబానా ట్రాన్స్‌జెండర్ పేరు ప్రపంచానికి తెలిసేలా మారుమ్రోగింది. ఈ మేరకు షబానా మాట్లాడుతూ.." మా జీవితాలు తరచు వివక్ష, కళకంతో దెబ్బతిన్నాయి. అయినా మేము గొప్ప ప్రేమ, బాధ్యతను విస్మరించం. కేవలం ఈ అమ్మాయిలను దత్తత తీసుకుని తీర్చదిద్ది.. మాలాంటి వాళ్లను మనుషులుగా గుర్తించండి అని చెప్పాలనుకుంటున్నా. అన్ని రకాలుగా బాగున్న వాళ్లకంటే తామలాంటి వాళ్లే ఎంతో ఉదారంగా ఉంటారని చాటి చెప్పాలనుకున్నా అంటూ ఆవేదన చెప్పుకొచ్చింది." షబానా. మనలో చాలామంది ఆడపిల్ల అనగానే భారం అనే భావన నుంచి బయటపడటం లేదు. ఒకరికి మించి ఇద్దరు ఆడపిల్లలు అంటే నోరు బార్లా తెరుస్తారు.. వెంటనే చేతులు దులుపుకునే యత్నం చేస్తారు. కానీ షబానా తన బతకు గడవటమే కష్టంగా ఉన్నా..ఆ అమ్మాయిలను దత్తత తీసుకోవడమే గాక వారికి మంచి జీవితం ఇవ్వాలని తాపత్రయం పడటం అనేది ఎంతో స్ఫూర్తిదాయకం కదూ. (చదవండి: ఫరా ఖాన్ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!) -
ఖమ్మంలో సంచలనం రేకెత్తించిన బాలుడి దత్తత ఘటన సుఖాంతం
-
పెంపుడు కొడుకును ఇంటి నుంచి తరిమేసిన తండ్రి
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం...అంటూ ఓ సినీ కవి మానవీయత లేని కుటుంబ సంబంధాల్లోని డొల్లతనాన్ని ఏనాడో ఎండగట్టాడు. కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు. కానీ డబ్బు ముందు అన్ని ప్రేమలూ దిగదుడుపే అనడానికి ఇక్కడో తండ్రి నిదర్శనగా నిలిచాడు. ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని 35 ఏళ్లుగా పెంచుకున్న కొడుకును ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు.. బుచ్చెయ్యపేట: కొడుకులు లేరని అన్న కొడుకును 35 ఏళ్ల కిందట దత్తత తీసుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. తీరా ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని పెంచిన ప్రేమను పక్కన పెట్టి పెంపుడు కొడుకును, కోడలు, మనవరాళ్ల సహా ఇంట్లోంచి బయటకు గెంటేసిన ఘటన బుచ్చెయ్యపేట మండలం మల్లాంలో జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బొట్టా పోతురాజు, దేముడమ్మకు ఆరుగురు ఆడపిల్లలు. పోతురాజు అన్న రామునాయుడుకు ముగ్గురు మగ సంతానం. మగ సంతానం లేని పోతురాజు అన్న కుమారుల్లో ఆఖరివాడైన రమణను 35 ఏళ్ల కిందట దత్తత తీసుకున్నాడు. రమణ నాలుగో ఏడాది నుంచి పోతురాజు, దేముడమ్మ వద్దే పెరిగాడు. వీరి రేషన్ కార్డులోను, ఆధార్ కార్డులోను రమణ పేరు కూడా నమోదు చేశారు. 15 ఏళ్ల కిందట పోతురాజు, దేముడమ్మల పెద్ద కూతురు వరహాలమ్మ కుమార్తెను రమణకిచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఇప్పటి వరకు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవించారు. ఇటీవల పోతురాజు అల్లుడొకరు రమణను ఇంట్లో నుంచి బయటకు పంపేయాలని, లేకపోతే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని అత్తమామలకు నూరిపోయడంతో రమణ, దేవిలను రెండేళ్లుగా వేరే గదిలో ఉంచారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణం ఇంట్లోంచి వెళ్లిపోవాలంటూ బుధవారం తన పెంపుడు కొడుకు రమణను, అతని భార్య దేవిలను పోతురాజు ఇంట్లో నుంచి బయటకు గెంటి వేశాడు. వారి వంట సామాన్లు, బట్టలను బయటకు విసిరేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రమణ, దేవి ఉదయం నుంచి రాత్రి వరకు ఆరు బయటే అర్ధాకలితో ఉండిపోయారు. రమణ ఇద్దరు కుమార్తెలు కశింకోట హాస్టల్లో చదువుతుండగా చిన్న కుమార్తెతో కలిసి భార్తభర్తలిద్దరూ వర్షం కురుస్తున్నా ఇంటి బయటే ఉండిపోయారు. తనను అన్యాయంగా ఇంటి నుంచి గెంటివేయడంపై బాధితుడు రమణ బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోతురాజుకు ఎకరా 20 సెంట్లు జిరాయితీ భూమి, 5 ఎకరాలు డి పట్టా భూమి, ఇల్లు ఉంది. ఈ ఆస్తిలో వాటా ఇవ్వబడుతుందని చిన్నప్పటి నుంచి పెంచిన రమణను అతని భార్య, పిల్లలను ఇలా అర్ధంతరంగా ఇంటి నుంచి వెళ్లగొట్టడంపై గ్రామస్తులు కూడా మండిపడుతున్నారు. అమాయకుడైన రమణకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. -
పిల్లల దత్తతకు డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శిశువుల (పిల్లల) దత్తతకు డిమాండ్ పెరుగుతోంది. సంతాన భాగ్యంలేని వేలాది మంది దంపతులు అనాధ బిడ్డలను పెంచుకొనేందుకు పోటీ పడుతున్నారు. తమకు శిశువులను దత్తత ఇస్తే వారిని బాధ్యతగా పెంచి ప్రయోజకులను చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియను నిర్వహిస్తుంది. సమీకృత బాలల సంరక్షణ పథకం(ఐసీపీఎస్)లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 14 ప్రత్యేక దత్తత ఏజేన్సీలు (శిశు గృహాలు) ఉన్నాయి. వాటి పరిధిలో 110 మంది పిల్లలు (శిశువులు) ఉన్నారు. కాగా, శిశువుల దత్తత కోసం ఏకంగా 1,018 మంది దంపతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దత్తత నిబంధనలకు లోబడి అధికారులు అర్హులైన దంపతులను ఆచి తూచి ఎంపిక చేస్తారు. 2020 నుంచి 2024 వరకు మొత్తం 325 మంది పిల్లలను దత్తత ఇవ్వగా వారిలో 186 ఆడ శిశువులు ఉండటం గమనార్హం.నిర్లక్ష్యానికి గురైన బిడ్డలకు వరం దత్తత..కుటుంబ నేపధ్యంలో వదిలివేసిన, నిరాశ్రయమైన, నిర్లక్ష్యానికి గురైన పిల్లల సంరక్షణ, రక్షణకు దత్తత అనేది గొప్ప వరం. అటువంటి పిల్లలకు ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణం లభిస్తుంది. అనాథ పిల్లలను దత్తత ద్వారా కుటుంబాల్లోకి తిరిగి చేర్చడమే ముఖ్య ఉద్ధేశం. దత్తత అనేది కుటుంబాల కోసం పిల్లలను ఇవ్వడం కాదు.. పిల్లల కోసం కుటుంబాలను అందించడమే ప్రధానంగా ఉంటుంది. అనాథలైన బిడ్డలకు వసతి, విద్య, వారి ప్రతిభా సామర్థ్యాలు పెంపొందించడంతోపాటు వారికి ప్రేమ, వాత్సల్యం అందించేందుకు దోహదం చేస్తుంది. పిల్లల సరైన అభివృద్ధికి అవసరమైన భావోద్వేగ, శారీరక, మానసిక భద్రతను అందిస్తుంది. పిల్లలు సామాజిక దుర్వినియోగానికి గురికాకుండా నివారిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రత్యేక ఏజెన్సీదత్తతకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం 1990 జూలై 3న జాతీయ స్థాయిలో ‘సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్ఏ)’ ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సీఏఆర్ఏ 2011 ఫిబ్రవరిలో ‘చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ – గైడెన్స్ సిస్టమ్ (కేరింగ్స్)’ పేరుతో ప్రత్యేకంగా అధికారికంగా https://cara.wcd.gov.in అనే వెబ్సైట్ ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా దత్తతకు ఆన్లైన్ దరఖాస్తులు, గైడ్‌లైన్స్ వంటి అనేక అంశాలను పారదర్శకంగా పర్యవేక్షిస్తుంది. దత్తత ప్రక్రియ సులభతరం చేయడంతోపాటు వాటిలో కీలకపాత్ర పోషించే ఏజెన్సీల జవాబుదారీతనాన్ని పెంచుతుంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దత్తతకు ముందు తర్వాత కూడా ఆన్లైన్ పర్యవేక్షణ చేస్తుంది. -
హైదరాబాద్‌లో పెరుగుతున్న సంతాన లేమి జంటలు
అధిక బరువు..ఆలస్యపు పెళ్లిళ్లు..రోజంతా ల్యాప్‌ట్యాప్‌లతో సహవాసం..కాలుష్యం..మారిన జీవనశైలి..మానసిక ఒత్తిడి..వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.ఎన్ని మందులు వాడినా సంతానం కలుగక..ఒంటరిగా ఉండలేక చాలా మంది యువ దంపతులు అనాథ పిల్లలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దత్తతకు పిల్లలు కావాలని కోరుతూ ఇప్పటి వరకు 2,050 మంది దంపతులు శిశువిహార్‌కు దరఖాస్తు చేసుకోవడం ఇందుకు నిదర్శనం. సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరక్క ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. గంటల తరబడి ల్యాప్‌టాప్‌లతో గడపడం..జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, వీకెండ్లో పార్టీల పేరుతో మద్యం అతిగా తాగడం వంటి అలవాట్లు స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాకు పరుగులు తీస్తున్నారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్(ఐవీఎఫ్), ఇంట్రాసైటో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ఐసీఎస్ఐ)చికిత్సలు చేయించుకున్నా..ఫలితం లేక పోవడంతో చివరకు కొందరు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. ఒంటిరిగా జీవించలేక, పిల్లలపై మమకారం చంపుకోలేక అనాథ పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. 186 మంది పిల్లలు..2050 దరఖాస్తులు గతంతో పోలిస్తే దంపతుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. ఆడపిల్లలు ఇంటికి భారమని భావించే రోజులు పోయాయి. శిశు విహార్‌లో పిల్లలను దత్తత తీసుకుంటున్న జంటల జాబితాను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం శిశువిహార్‌లో 2050 మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకుని ఉండగా, 186 మంది పిల్లలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దత్తతకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో ఎక్కువ మంది మగపిల్లలు కావాలని కోరగా, అందులో అత్యధికంగా ఏడాదిలోపు పిల్లలను కోరుకుంటున్న వారే అధికం. రంగు, ఎత్తు, బరువు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆడ శిశువుకు రెండు నుంచి మూడేళ్లు సమయం పడుతుండగా, మగ శిశువుకు ఐదు నుంచి ఆరేళ్లు పడుతోంది. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నా..అది కూడా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే గత పదిహేనేళ్లలో శిశువిహార్ ద్వారా మొత్తం మూడు వేల మందికిపైనే దత్తత ఇస్తే, కేవలం నాలుగేళ్లలో 798 మంది పిల్లలను మాత్రమే దత్తత ఇవ్వగా, వీరిలో 527 మంది ఆడపిల్లలు ఉన్నారు.మహిళల్లోనే కాదు పురుషుల్లోనూ.. గతంలో 5 నుంచి 10 శాతం మందిలోనే ఇన్‌ఫెరి్టలిటీ సమస్య ఉండేది. ఇప్పుడది 15 నుంచి 20 శాతానికి పెరిగింది. మహిళల కంటే పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువ కని్పస్తుంది. చిన్న వయసులోనే మెనోపాజ్ వస్తుండటం వల్ల చాలా మంది రెండోసారి గర్భధారణకు నోచుకోవడం లేదు. దంపతుల్లో ఉన్న బలహీనతను ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ చికిత్సలతో పిల్లలు జని్మంచే అవకాశం ఉన్నా.. ఐవీఎఫ్, ఐయూవీ వంటి చికిత్సల పేరుతో బాధితులను లూటీ చేస్తున్నారు. మంచి ఆహారపు, జీవన శైలి అలవాట్లు, త్వరగా వివాహం చేసుకోవడం ద్వారా సంతాన లేమిని నిరోధించవచ్చు. – డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్ట్ప్రాధాన్యతను బట్టి కేటాయింపు గతంతో పోలిస్తే పిల్లలను దత్తతకు తీసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. దత్తతకు ఇక్కడ పిల్లలు లేక చాలా మంది నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా వందకుపైగా దరఖాస్తులు అందుతున్నాయి. దంపతుల అభీష్టం మేరకు పిల్లలను దత్తత ఇస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా ఇక్కడి పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న దంపతుల ప్రాధాన్యతను బట్టి పిల్లల దత్తతకు అవకాశం కలి్పస్తున్నాం. – మోతీ నాయక్, అదనపు డైరెక్టర్, శిశువిహార్ -
ప్రధాని మోదీ దత్తత గ్రామం ఇప్పుడెలావుంది?
కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నాడు ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కింద ఎంపీలంతా తమ ప్రాంతంలోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ యూపీలోని సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలోగల జయపూర్ గ్రామాన్ని పదేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. మరి ఆ గ్రామ పరిస్థితి ఇప్పుడెలా ఉంది? ప్రధాని మోదీ జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈ పదేళ్లలో ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సందీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. గతంలో ఇక్కడ బ్యాంకులు, రోడ్లు ఉండేవి కావని, ఇప్పుడు గ్రామంలో కాంక్రీట్ రోడ్లు కూడా ఏర్పడ్డాయని, బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయని అన్నారు. గ్రామంలో జల్ నిగం ఏర్పాటైన తర్వాత ఇంటింటికి పైపులైన్ ద్వారా నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఏర్పడిందని, ఉజ్వల పథకం కింద పలువురు లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్లు పొందారన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. గ్రామానికి చెందిన మరో యువకుడు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జయపూర్ గ్రామంలో రెండు బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసు తెరుచుకున్నాయన్నారు. రోడ్ల నిర్మాణం, నీటి వసతి ఏర్పాట్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు నోచుకున్నాయన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలని అన్నారు. గ్రామానికి చెందిన మహిళ ధర్మశీల మాట్లాడుతూ ప్రధాని మోదీ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తమకు ఉపాధి అవకాశాలు వచ్చాయని, కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతున్నామన్నారు. ఇంతకు ముందు గ్రామ శివార్లలోని బావి నుంచి నీటిని తెచ్చుకునేవారమని, ఇప్పుడు ఇంట్లోనే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ప్రధాని మోదీ దత్తత తీసుకున్న ఈ జయపూర్ గ్రామ జనాభా సుమారు 3,100. ఈ గ్రామంలో మొత్తం 2,700 మంది ఓటర్లు ఉన్నారు. వారణాసి రైల్వే స్టేషన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. -
నా బిడ్డను ఎవరైనా తీసుకోండి
చిక్కబళ్లాపురం: జిల్లాలోని బాగేపల్లి తాలూకా మరసనహళ్లి గ్రామంలో నివాసముంటున్న రాజమ్మ అనే మహిళ ఆడబిడ్డను ఎవరైనా దత్తత తీసుకోండి అని ప్రాధేయ పడుతోంది. భర్త లక్ష్మినారాయణ వేధింపులే ఇందుకు కారణం. వీరికి ఒక ఆడకూతురు ఉంది. ఇటీవల రెండో కాన్పులోను ఆడ శిశువు జన్మించింది. అప్పటినుంచి భర్త, అత్తమామలు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని తెలిపింది. చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పసికందుతో వచ్చి తన బిడ్డను ఎవరైనా దానం తీసుకోవాలని మొర పెట్టుకుంది. ఆమె దీనస్థితిని చూసినవారి కళ్లు చెమర్చాయి. తల్లిదండ్రులు లేని రాజమ్మ ఇటు భర్త ఆసరా లేక, ఇద్దరు బిడ్డలను పోషించేదెలా అని వాపోయింది. తాను గర్భిణిగా ఉండగా భర్త బాగా చూసుకొనేవారు, మగపిల్లాడు పుడతాడని చాలా ఆశతో ఉన్నారు, అయితే ఆడబిడ్డ పుట్టగానే తాత్సారంగా చూస్తున్నారు, నాకు చాలా బాధ కలుగుతోంది అని ఆమె విలపించారు. -
Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి
న్యూయార్క్: మలి వయసులో తన బాగోగులు చూసుకున్న వ్యక్తిని దత్తత తీసుకుని ఆస్తి మొత్తం కట్టబెట్టాలని స్విట్జర్లాండ్‌కు చెందిన కుబేరుడు నికోలస్ ప్యూచ్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన ఆస్తి అంతాఇంతా కాదు. ఏకంగా 1,100 కోట్ల డాలర్లు. అంటే దాదాపు రూ.91,700 కోట్లు. 80 ఏళ్ల ప్యూచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఉత్పత్తుల సంస్థ థియరీ హెర్మెస్ వారసుల్లో ఒకరు. 220 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థలో నికోలస్ ప్యూచ్కు 6 శాతం దాకా వాటాలున్నాయి. ప్యూచ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడంతో వారసులెవరూ లేరు. దాంతో ఆయన తదనంతరం భారీ ఆస్తులు ఎవరికి చెందుతాయి? అన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, గతంలో తన బాగోగులు చూసుకున్న 51 ఏళ్ల నడి వయసు్కడిని దత్తత తీసుకుని వేల కోట్ల ఆస్తులన్నీ అప్పగించనున్నారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లోని కోట్ల రూపాయల విలువచేసే కొన్ని భవంతులను అతని పేరిట రాసేశారట. దత్తత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు!
ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ఇలా అయినవారిపై విసుగు చెందిన ఓ బిలియనీర్ తన యావదాస్తిని తన వద్ద పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆస్తి ఎంతనుకుంటున్నారు? ఏకంగా రూ.91 వేల కోట్ల విలువైన ఆస్తి. ఇందు కోసం అతన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు స్విట్జర్లాండ్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్విట్జర్లాండ్‌లో ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ హెర్పెస్ (Hermes)ను స్థాపించిన థియరీ హెర్మెస్ మనవడు 80 ఏళ్ల నికోలస్ ప్యూచ్ (Nicolas Puech) తన దగ్గర పనిచేసే 51 ఏళ్ల తోటమాలిని దత్తత తీసుకుని అతనికి 11 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.91 వేల కోట్లు) సంపదను అప్పగించాలని యోచిస్తున్నట్లు ట్రిబ్యూన్ డి జెనీవ్ ఫార్చ్యూన్ అనే స్విస్ పత్రిక నివేదించింది. ఐదో తరం వారసుడు హెర్మెస్ కంపెనీని థియరీ హెర్మెస్1837లో స్థాపించారు. థియరీ హెర్మెస్ కుటుంబంలో ఐదవ తరం వారసుడే నికోలస్ ప్యూచ్. ఈయన కంపెనీలో 9 బిలియన్ నుంచి 10 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన 5- 6 శాతం వాటా కలిగి ఉన్నారు. అయితే నికోలస్‌కు పెళ్లి, పిల్లలు లేరు. దీంతో ఆయన తన తదనంతరం సంపదను తన వద్ద పనిచేస్తున్న మాజీ తోటమాలికి రాసిచ్చే ప్రక్రియలో ఉన్నారు. దీని కోసం న్యాయవాద బృందాన్ని సైతం నియమించినట్లు సమాచారం. ఇప్పటికే రూ.49 కోట్లు అయితే నికోలస్ దత్తత తీసుకుని ఆస్తిని రాసివ్వాలనుకుంటున్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఆయన స్పానిష్ మహిళను వివాహం చేసుకున్నట్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యక్తికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్లు (రూ.49 కోట్లు) విలువైన ఆస్తిని ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మొరాకోలోని మరకేష్‌లోని ఆస్తి, స్విట్జర్లాండ్‌లోని మాంట్రీక్స్లోని ఒక విల్లా ఉన్నాయి. కుటుంబంలో విభేదాలు ఫార్చ్యూన్ కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా 220 బిలియన్ డాలర్ల విలువైన హెర్మెస్ కంపెనీలో తనకున్న 5-6 శాతం వాటాను తన దగ్గర పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు నికోలస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెర్మెస్ కంపెనీ సూపర్వైజరీ బోర్డు నుంచి నికోలస్ ప్యూచ్ 2014లో తప్పుకొన్నారు. ఆ తర్వాత ఎల్వీఎంహెచ్ అనే మరో ఫ్యాషన్ కంపెనీ హెర్మెస్లో 23 శాతం వాటాను బలవంతంగా దక్కించుకుంది. దీన్ని అడ్డుకునేందుకు ఇతర కుటుంబ సభ్యులు తమ షేర్లతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్యూచ్ మాత్రం తన వాటాను కొనసాగించారు. ఈ విభేదాలే నికోలస్ తన వారసులుగా కుటుంబ సభ్యులను కాకుండా బయటి వ్యక్తిని తన వారసుడిగా చేయడానికి కారణంగా భావిస్తున్నారు. దత్తత సాధ్యమేనా? నికోలస్ ప్యూచ్ తన దగ్గర పనిచేసే వ్యక్తిని దత్తత తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నా ఆయన పెద్దవారు కావడంతో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల దత్తతకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమతుందో చూడాలి. -
దత్తత ఇచ్చిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష వద్దు
ముంబై: అత్యాచారానికి గురైన బాధితురాలికి జన్మించిన బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్న తర్వాత ఆ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని బాంబే హైకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డ ప్రయోజనాలను కాపాడాలని, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డీఎన్ఏ పరీక్ష నిర్వహించవద్దని పోలీసులను ఆదేశించింది. బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఈ నెల 10న తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2020లో ఓ వ్యక్తి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చింది. బిడ్డకు జన్మనిచి్చంది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని జైలుకు పంపించారు. మైనర్ బాలికకు జన్మించిన బిడ్డను గుర్తుతెలియని దంపతులు దత్తత తీసుకున్నారు. నిందితుడు 2 సంవత్సరాల 10 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. బాధితురాలి బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేశారా? అని ఆరా తీసింది. బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్నారని పోలీసులు బదులివ్వడంతో ఇక డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని ఆదేశించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. -
తల్లి ప్రేమకు సరిహద్దులు లేవు
అమెరికన్ మహిళ మేఘన్ గత సంవత్సరం అక్టోబర్‌లో మన దేశానికి చెందిన బీదింటి చిన్నారిని దత్తత తీసుకొని ‘అమీ’ అని పేరు పెట్టింది. అమీకు డౌన్‌సిండ్రోమ్ ఉంది. దత్తత తీసుకొని సంవత్సరం పూర్తయిన సందర్భంగా హృదయాన్ని కదిలించే వీడియోను మేఘన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మేఘన్‌కు ఇద్దరు అబ్బాయిలు. వీరితో కలిసి అమీ సంతోషంగా ఆడుకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. గత ఫిబ్రవరిలో ఇంటిని దీపావళి పండగ అలంకరణలతో ముస్తాబు చేసి అమీ బర్త్‌డేను ఘనంగా జరిపారు. ‘చిలిపి, తెలివైన, అందమైన చిన్నారికి తల్లి అయినందుకు గర్వపడుతున్నాం. మా ఫ్యామిలీ పజిల్ నుంచి తప్పిపోయి మళ్లీ దొరికిన మిస్సింగ్ పీస్ అమీ’ అంటూ రాసింది మేఘన్. ‘మీ సంతోషం సంగతి ఎలా ఉన్నా మీరు ఒక అమ్మాయికి అందమైన, అద్భుతమైన భవిష్యత్తును ఇచ్చారు. దయార్ద్ర హృదయం ఉన్న మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే..
ఢిల్లీ:జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందింది. సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్ సాధించింది. ప్రధాని మోదీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనక కష్టించి పనిచేసిన జీ20షేర్పా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. G-20 in India| G 20 Sherpa Amitabh Kant tweets, "The New Delhi Leaders Declaration focuses on - Strong, Sustainable, Balanced, and Inclusive Growth, Accelerating Progress on SDGs, Multilateral Institutions for the 21st Century, Reinvigorating Multilateralism https://t.co/4Q3nGh4do1 pic.twitter.com/DJbSe6830a — ANI (@ANI) September 9, 2023 ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రధానంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. అవి.. ► బలమైన, స్థిరమైన, సమతుల్యమైన, సమగ్ర వృద్ధి ► వేగవంతమైన సుస్థిరాభివృద్ధి ► సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం ► 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు ► బహుపాక్షికతను పునరుద్ధరించడం PM Modi highlights human-centric development at G20 Summit Read @ANI Story | https://t.co/Tq2OriXV0G#PMModi #NarendraModi #G20India2023 #G20SummitDelhi pic.twitter.com/RLZjCIXcus — ANI Digital (@ani_digital) September 9, 2023 జీ20 సదస్సులో అభివృద్ధి, భౌగోళిక-రాజకీయ సమస్యలపై 100 శాతం ఏకాభిప్రాయం కుదిరిందని జీ20 భారత షేర్పా అమితాబ్ కాంత్ అన్నారు. 'జీ20 లీడర్స్ సమ్మిట్‌లో ఢిల్లీ నాయకుల డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందింది. భారత్ నాయకత్వంలో జీ20 సదస్సు నిర్వహించడం ప్రపంచీకరణకు స్వర్ణ యుగంగా గుర్తింపు పొందింది.' అని అమితాబ్ కాంత్ అన్నారు. డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు భౌగోళిక, రాజకీయ అంశాల్లో భూమి, ప్రపంచ శాంతి, ప్రజల శ్రేయస్సుకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ దిశగానే భారత్ అడుగులు వేస్తున్నట్లు అమితాబ్ కాంత్ చెప్పారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్: ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై 'భారత్' పేరు -
అమ్మ.. నాన్న.. ఓ చిన్నారి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పిల్లలు లేని దంపతులకు ఆ లోటు ఉండకూడనే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ దత్తత ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విభాగం కూడా ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో శిశు గృహాలను ఏర్పాటు చేసింది. అనాథలు, ఆదరణకు నోచుకోని పిల్లలను శిశుగృహలో సంరక్షిస్తుంటారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆ లోటును పూడ్చేందుకు, అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐసీడీఎస్ పని చేస్తోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలు దత్తతకు అర్హులు. దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు వారి అర్హత ఆధారంగా పిల్లలను ఇస్తారు. దత్తత కోసం దరఖాస్తుల వెల్లువ రాష్ట్రంలో చిన్నారులను దత్తత చేసుకోవాలని వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా విశాఖ, ఆ తర్వాతి స్థానం ఉమ్మడి అనంతపురం జిల్లాదే. గడిచిన ఏడాది 172 మంది దంపతులు చిన్నారుల కోసం దత్తతకు వచ్చారు. వీరిలో 21 మందికి మాత్రమే దత్తత అవకాశం దక్కింది. మిగతా 151 దరఖాస్తులు వెయిటింగ్లో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు వచ్చిన దరఖాస్తుల్లో ఇతర దేశాల వారూ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,184 దరఖాస్తులు వెయిటింగ్లో ఉండగా అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 151 ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ఒక చిన్నారిని దత్తత చేసుకోవాలంటే వివిధ దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం www.cara.nic.in వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును పైన పేర్కొన్న వెబ్‌సైట్‌కు రూ.6వేలు డీడీ సమర్పించి అప్లోడ్ చేయాలి. అనంతరం దత్తత ఏజెన్సీ వారు అధ్యయనం చేసి నివేదికను వెబ్సైట్లో పెడతారు. దత్తతకు దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఈ సమాచారం మేరకు 48 గంటల్లో బిడ్డ నచ్చితే రిజర్వు చేసుకోవచ్చు. రిజర్వు చేసుకున్న బిడ్డను నచ్చిందని ఆమోదం తెలియజేసి, రూ.40 వేలు డీడీ సమర్పించి బిడ్డను పొందాలి. బిడ్డను పొందిన వారం రోజుల్లో పాన్‌కార్డు, ఆదాయ ధ్రువపత్రం, వయసు ధ్రువీకరణ, దంపతుల ఫొటో, నివాస ధ్రువపత్రం, వివాహ ధ్రువపత్రం, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు ఏజెన్సీకి ఇవ్వాలి. బిడ్డను పొందిన వారం రోజుల్లో ఈ ధ్రువపత్రాలన్నీ స్థానిక కుటుంబ న్యాయస్థానం/జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో సమర్పిస్తే ఉత్తర్వులిస్తారు. బిడ్డను దత్తత తీసుకున్నాక దత్తత ఇచ్చిన సంస్థకు సంబంధించిన సోషల్ వర్కర్ బిడ్డ యోగ క్షేమాల పరిశీలన రెండేళ్లపాటు చూస్తారు. ఈ సమయంలో 4 దఫాలు ఒక్కోసారి రూ.2వేల చొప్పున దత్తత తీసుకున్న దంపతులు డీడీ రూపంలో సొమ్ము చెల్లించాలి. నిబంధనల ప్రకారం దత్తత కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని దత్తత సంస్థ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) నిబంధనల మేరకు దత్తతకు వచ్చే దంపతుల పూర్వాపరాలను పరిశీలించాకే దత్తత ఇస్తున్నాం. ఈ ఏడాది ముగ్గురి దత్తత ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం అనంతపురం శిశు గృహలో ఐదుగురు చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. –శ్రీదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు?
పెన్సిల్వేనియాకు చెందిన 5 ఏళ్ల బాలుడిని అతని పెంపుడు తల్లి, ఆమె భర్త చిత్రహింసలకు గురిచేసి చంపేశారని వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో చెప్పడంతో పోలీసులు ఆ భార్యాభర్తలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. బాలుని హత్య గత ఫిబ్రవరిలో జరిగింది. డెల్మాంట్కు చెందిన లారెన్, జాకబ్ మలోబెర్టిలు గత ఫిబ్రవరి 7న చిన్నారి లాండన్ మలోబెర్టిని అత్యంత కరాతకంగా హత్యచేశారని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ వెల్లడించారు. తల్లిదండ్రుల చేతుల్లో చిత్రహింసకు గురై.. లాండన్‌కు తల, మెడపై తీవ్రమైన గాయాలున్నాయని, బాలుని మొండెంపై కూడా గాయాలున్నాయని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ నికోల్ జిక్కారెల్లి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాగా జనవరి 30న గాయాలపాలై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న చిన్నారిని ఆ దంపతులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. జిక్కారెల్లి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం తల్లిండ్రుల చిత్రహింసలకు గురైన ఆ చిన్నారి ఒక వారం రోజుల తర్వాత మరణించాడు. అతనిని దత్తత తీసుకున్న కుటుంబం చేతిలోనే ఆ బాలుడు విలవిలలాడిపోయి చివరికి కన్నుమూశాడు. అంత్యక్రియల ఖర్చుల పేరుతో.. అయితే ఆ బాలుని తల్లిదండ్రులు గో ఫండ్ ద్వారా నిధులను సేకరించారు. పిల్లవాడి అంత్యక్రియల ఖర్చుల కోసం $5,000లకుపైగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు బృంద తెలిపింది. యూపీఎంసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఐదేళ్ల చిన్నారికి మెదడులో రక్తస్రావం జరిగింది. ఆ బాలుని తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక రోజంతా వేచి చూశారు. పిల్లవాడి శరీరంపై గతంలో అయిన గాయాలు, క్తొతగా అయిన గాయాలు ఉన్నాయని, ఇవి శారీరక వేధింపుల కారణంగా అయిన గాయాలేనని వైద్యులు చెప్పారు. ఇది కూడా చదవండి: కెనడా మానవ అక్రమ రవాణా కేసులో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష.. దుర్భర స్థితిలో.. బాలునికి గాయాలు సంభవించిన సమయంలో విపరీతమైన నొప్పిని అనుభవించాడని వైద్యులు తెలిపారు. ఆ బాలుడు కనీసం నిలబడలేకపోయాడని, తినడానికి, తాగడానికి వీలుకాని పరిస్థితిలో దుర్భర స్థితిని ఎదుర్కొన్నాడని వారు పేర్కొన్నారు. బాలుడు స్పృహ కోల్పోవడంతో అతని అవయవాల పనితీరు మరింతగా బలహీనపడిందని వైద్యులు తెలిపారు. కాగా లాండన్‌కు బొమ్మ రాక్షసునితో, ట్రక్కులతో ఆడుకోవడం, దేశీయ సంగీతాన్ని పాడడం అంటే ఎంతో ఇష్టం. అయితే అతని పెంపుడు తండ్రి లారెన్ తన కుమారుని విషయంలో విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శించాడు. లాండన్ తోబుట్టువులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం తమ తండ్రి.. లాండన్‌ను చెక్క గరిటతో కొట్టడం లేదా స్ప్రే బాటిల్‌తో స్ప్రే చేయడం ద్వారా అతనిని ఏడ్పించేవారని తెలిపారు. బాలునిపై విపరీతమైన ద్వేషం అయితే లాండన్ పాఠం నేర్చుకోకపోవడం కారణంగానే అతని తల్లి లాండన్‌ను దండించేదని తోటి పిల్లలు తెలిపారు. లాండన్ తల్లి సహోద్యోగులు మాట్లాడుతూ ఆమె తన కొడుకుపై ద్వేషం పెంచుకున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 2022 నుండి బాలుడు చనిపోయే వరకు దంపతుల మధ్య నడిచిన సందేశాలు గమనిస్తే వారు లాండన్ విషయంలో విపరీతమైన ద్వేషం చూపారని దర్యాప్తు బృందం సభ్యులు కనుగొన్నారు. లాండన్ తల్లి లారెన్ ఒకసారి తాను కుమారుడిని చంపబోతున్నాను అని అని టెక్స్ట్ చేసింది. కాగా తన 25 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని డెల్మాంట్ పోలీస్ చీఫ్ టిజె క్లోబుకర్ పేర్కొన్నారు. లాండన్ తల్లిపై హత్య కేసుతో పాటు పిల్లల సంక్షేమానికి అపాయం కలిగించడం, వారిపై దాడి చేయడం, నేరపూరిత కుట్ర మొదలైన నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిస్పక్షపాతంగా విచారణ ఆమె భర్త కూడా ఇదేవిధమైన నేరాలకు పాల్పడ్డాడంటూ అతనిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు వీరిద్దరికీ బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం వీరు వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ జైలులో ఉన్నారు. ఆగస్టు 8న కోర్టులో తదుపరి విచారణకు వీరు హాజరుకానున్నారు. లాండన్ తన స్వల్ప జీవితంలోనే తీవ్రమైన గాయాలను చవిచూశాడని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ నికోల్ జిక్కారెల్లి అన్నారు. లాండన్‌కు తగిన గౌరవాన్ని కల్పిస్తూ, కేసును నిస్పక్షపాతంగా విచారించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: దారుణం: మూడు రోజులపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుని.. మహిళ గొంతు పోయేలా అరిచినా.. -
కోతి పిల్లకు పిల్లి ఆసరా.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..!
ఏ జంతువైనా తమ బిడ్డలను తప్పా ఇంకే జంతువు పిల్లలను దగ్గరికి తీసుకోవు. అంతేకాదు.. పొరబడి వచ్చినా.. తమ పిల్లలు కాదని గుర్తించి దాడి చేస్తాయి. అందునా వేరే జాతి జంతువు పిల్లలనయితే.. అసలే దగ్గరికి రానియ్యవు. కానీ మీరు చూడబోయే ఈ వీడియోలో ఓ కోతి పిల్లను అక్కున చేర్చుకుంటుంది పిల్లి. వేరే జాతి జంతువు పిల్లను ఓ పిల్లి దగ్గరికి తీసుకుని పోషించడం గ్రేట్ కదా..? వీడియో ప్రకారం.. ఓ కోతి పిల్ల తన తల్లి నుంచి దూరమవుతుంది. దీంతో ఓ పిల్లి కోతి పిల్లను దగ్గరికి తీసుకుంటుంది. తన సొంత తల్లిపై ఎక్కినట్లు పిల్లి బొజ్జకు హత్తుకుని కూర్చుంటుంది కోతి పిల్ల. ఇక.. ఆ కోతి పిల్లని బరువని భావించక.. తనతో పాటే మోసుకుపోతుంది పిల్లి. This lost baby monkey was adopted by this cat. ❤️pic.twitter.com/goRlTYyZJ6 — Figen (@TheFigen_) July 13, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది. తెలివి ఉన్న మనుషులే ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే ఈ రోజుల్లో ఈ పిల్లి అందరికీ ఆదర్శం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇస్తోందంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
హిమాన్షు అన్నా.. మా బడినీ జర దత్తత తీసుకోరాదే..!
హైదరాబాద్: ‘హాయ్.. హిమాన్షు అన్నా. మేం హిమాయత్‌నగర్ దత్తానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులం. మా బడి పరిస్థితేమీ బాలేదు. అన్నీ సమస్యలే. మీరు మాపై దయ చూపి మా స్కూల్‌ను కూడా దత్తత తీసుకోండన్నా’ అంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును అభ్యర్థించారు. వీరికి ఏఐవైఎఫ్, బాలసంఘం విద్యార్థి నాయకులు మద్దతు పలికారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మంచినీళ్లు సరిగా లేవు. మరుగుదొడ్లకు తలుపులు లేవు. నీరు లీకేజీ అవుతోంది. మెట్లన్నీ పగిలిపోయాయి. ప్రవేశం ద్వారం వద్ద ఉన్న మోరీకి మ్యాన్‌హోల్ లేకపోవడంతో అందులో పడిపోతామేమో అని భయమేస్తోంది’.. ఇలా సమస్యలను ఏకరువు పెడుతూ ప్లకార్డుల ద్వారా తెలిపారు. ‘మన బస్తీ– మన బడి’లో భాగంగా ఈ పాఠశాలకు ఇంకా నిధులు రాలేదని, ఇక్కడ అన్నీ సమస్యలేనని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర తెలిపారు. –హిమాయత్‌నగర్ -
శిశువు దత్తత వ్యవహారంలో అనూహ్య ఘటన.. చివరికి విషాదం..
సాక్షి, వరంగల్: వరంగల్‌లో విదేశీ దంపతుల శిశువు దత్తత వ్యవహారంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలోని శిశువిహార్‌కు చేరేంత వరకు చలాకీగా ఉన్న ఏడు నెలల పాప.. చివరికి మత్యుఒడికి చేరుకుంది. గురువారం ఉదయం పిల్లల డాక్టర్ నవీన్ వద్ద వైద్యపరీక్షలు చేస్తే అంతా సాఫీగానే ఉన్నా.. గురువారం రాత్రితోపాటు శుక్రవారం ఉదయం పాపకు పలుచటి విరేచనాలు కావడంతో మందులు ఇచ్చినా తగ్గలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లినా గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. అయితే ఇది శిశువిహార్ సిబ్బంది నిర్లక్ష్యమా లేదా దీని వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరముంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విదేశీ దంపతుల అక్రమ దత్తత కేసు ఇంకా విచారణ ఆరంభ దశలో ఉండగానే ఆ పాప చనిపోవడంతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. ఏడు నెలల పాటు వారి వద్ద బాగానే ఉన్న పాప.. శిశువిహార్‌కు రాగానే చనిపోవడం వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ముఖ్య రాజకీయ నేతల ఒత్తిడి ఉండడం కూడా అనుమానాలను రేపుతోంది. ఇప్పటికే జేజే యాక్ట్ 81 సెక్షన్ కింద అక్రమ దత్తత వ్యవహారంలో అమెరికాలో స్థిరపడిన కొంపల్లి వాసి కరీమ్విరాణి, అమెరికా సిటిజన్ అయిన అశామావిరాణితో పాటు వరంగల్‌కు చెందిన రషీదాభాను భోజని, అమ్యన్అలీ భోజానిపై కేసు నమోదైంది. ఆ 36 గంటల్లో ఏం జరిగిందంటే.. ఏడు నెలల పాపను బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ, జిల్లా బాలల సంరక్షణ విభాగంలో పనిచేసే ఎన్ఐసీ పీఓ సరిత హనుమకొండలోని శిశు విహార్‌లో చేర్పించారు. అయితే, గురువారం రాత్రి 10.30 గంటలకు పాపకు పలుచటి విరేచనాలు కావడంతో అక్కడ విధుల్లో ఉన్న ఏఎన్ఎం పౌడర్ కలిపి తాగించడంతో 12 గంటలకు పడుకుంది. మళ్లీ శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మళ్లీ పలుచటి విరేచనాలు కావడంతో మెడిసిన్ ఇవ్వడంతో పడుకుంది. అప్పటివరకు విధుల్లో ఉన్న ఏఎన్ఎం 8.30 గంటలకు వెళ్లిపోగా.. 9.30 గంటలకు మరో ఏఎన్ఎం విధుల్లో చేరింది. అప్పటికే ఆ పాపను పరిశీలించగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా కనిపించడంతో గవర్నమెంట్ మెటర్నిటీ ఆస్పత్రి (జీఎంహెచ్)కు తీసుకెళ్లారు. అక్కడినుంచి 10.30 గంటల వరకు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇది 174 సీఆర్పీసీ (అసహజ మరణం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ తల్లి కన్నబిడ్డనో.. పాపం.. చివరికి అనాథగా మారిన ఆ పాపకు బల్దియా సిబ్బంది అంత్యక్రియలు జరిపారు. అనుమానాలెన్నో.. తేల్చాల్సినవెన్నో? ► కేసు నమోదైన 48 గంటల్లోనే అనారోగ్యంతో పాప మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయి. ►విదేశీ దంపతుల కారాకు దరఖాస్తు చేసుకున్న ఇన్కంట్రీ అడాప్షన్ నుంచి విత్ డ్రా ఎందుకయ్యారు అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అదే సమయంలో వీరిపై అక్రమ దత్తత కింద మట్టెవాడ ఠాణాలో కేసు నమోదైంది. ► ఆ పాప అనారోగ్యంతో బాధపడుతుంటే విరాణి దంపతులు ఎందుకు దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపారన్నది తేల్చాల్సి ఉంది. ► ఈ పాప దత్తత విషయంలో ఢిల్లీ నుంచి వరంగల్ వరకు కారా, సారా అధికారులనుంచి ఎందుకు ఒత్తిడి తెచ్చారన్నది తేల్చాల్సి ఉంది. ► అసలు వీళ్లకు నిజంగా సంతానం ఉన్నారా లేదా ఒకవేళ లేకుంటే ఆపా ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకొని కారా ద్వారా శిశు విహార్‌లో ఉంటున్న ఏ పాపనైనా దత్తత తీసుకుంటే ప్రొసీజర్ ప్రకారం ఉండేది కదా. అసలు ఈ పాపనే ఎందుకు దత్తత తీసుకున్నారు అన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ► ఇప్పటికే భోజాని దంపతులకు పాప ఇచ్చినట్లు చెబుతున్న మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే రాణితోపాటు కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆ పాప జాడ తెలుస్తుంది. ► అన్నింటికీ మూలమైన ఈ పాప తల్లిదండ్రుల ఆచూకీ దొరుకుతుందా.. లేదా దీని వెనుక ఉన్న అక్రమ రవాణా ముఠా మూలాలను వెలుగులోకి తెస్తారా.. లేదా పాప చనిపోయిందని కేసు పట్టించుకోకుండా ఉంటారా అన్నది ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. పాప కేసును వెలుగులోకి తెచ్చిన సాక్షి పాప అక్రమ దత్తత విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. పాప అడాప్షన్ విషయంలో ఉన్న లొసుగులు.. పాపను ఎవరు ఇచ్చారు.. మేడ్చల్ జిల్లానుంచి ఇక్కడికి ఉన్న లింకులు ఏమిటీ విషయాలను ‘సాక్షి’లో ఎక్స్‌క్లూజివ్‌గా ఇవ్వగా స్పందించిన పోలీస్, శిశు సంక్షేమ అధికారులు విచారణ జరిపి మరిన్ని విషయాలు రాబట్టారు. -
వరంగల్‌లో అమెరికా దంపతుల దత్తత వివాదం.. ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంతో
సాక్షి, వరంగల్: అమెరికా దంపతులు.. వరంగల్‌కు చెందిన ఓ ఆరేళ్ల శిశువును దతత్త తీసుకునే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ పాపకు జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఏకంగా వీసా తీసుకుని అమెరికాకు తీసుకెళ్లేందుకు మూడు నెలల క్రితం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరాకరించారు. ఆ తర్వాత జరిగిన దత్తత విధానమే ఇప్పుడూ అనుమానాలకు తావిస్తోంది. ఆ పాపను దత్తత ఇచ్చే విధానాన్ని వేగిరం చేయాలని కొందరు స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఆథారిటీ(సారా) అధికారులతో పాటు శిశు గృహ సందర్శన నివేదికను సమర్పించాలంటూ హనుమకొండ జిల్లా సంక్షేమ శాఖలోని ఓ విభాగాధికారి ఒకరు అత్యుత్సాహం చూపారనే విమర్శలున్నాయి. వాస్తవానికి ఆ పాప వరంగల్ సిటీకి చెందినట్లు జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నా.. ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఆన్లైన్ ద్వారా హనుమకొండలోని బాలల సంరక్షణ విభాగానికి దరఖాస్తు వచ్చింది. దీంతో వరంగల్ జిల్లాలో దత్తత కార్యక్రమాలను పర్యవేక్షించే వారిని గృహ సందర్శన చేసి నివేదిక సమర్పించాలంటూ అడిగినట్లు తెలిసింది. అక్కడా కుదరదనే...ఇక్కడకు వచ్చి.. అమెరికాకు చెందిన దంపతులు కరీం విరాణి, అశామా విరాణి అమెరికా నుంచి వచ్చి కొంపల్లిలో తాత్కాలిక నివాసం ఉంటున్నారు. వాస్తవానికి ఇంటర్ కంట్రీ అడాప్షన్ (ఓఏఎస్) చిల్డ్రన్ కోసం ఫారెన్ అడాప్షన్ ఏజెన్సీ(ఏఎఫ్ఏ) నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) సంబంధిత దేశం ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీవివిధ దేశాల్లో ఉన్న ఎంబసీలోని ఫారెన్ అథరైజ్డ్ ఏజెన్సీ (ఆపా) వద్ద పిల్లలు దత్తత కావాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడా వారి స్థితిగతులను అధ్యయనం చేశాకే ఆ దంపతులను కారాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆపా కోరుతుంది. అయితే కరీం, అశామీ విరాణి విషయంలో ఆపాను సంప్రదిస్తే అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం బతికున్న తల్లిదండ్రుల నుంచి పిల్లలను దత్తత తీసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అందుకే హైదరాబాద్‌కు వచ్చిన వీరు ఇన్నర్ కంట్రీ అడాప్షన్ అనే ఆప్షన్ ద్వారా కారాలో దరఖాస్తు చేసుకున్నారు. కరీం విరాణి కొంపల్లిలో తాత్కాలిక నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి..తన సోదరి, వరంగల్‌కు చెందిన రషీదాబాను భోజని శిశువును దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అమ్యన్ అలీ భోజని, రషీదాబాను భోజని దంపతులకు 10, 8 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గతేడాది ఆమె గర్భవతి కాలేదని సమాచారం. దీంతో ఆ పాప ఎక్కడి నుంచి వచ్చింది...ఎవరి పాప...కొనుగోలు చేశారా అనే దిశగా అనుమానాలు వస్తున్నాయి. వీరు రారు.. వారు రారు.. వరంగల్‌కు చెందిన అడ్వకేట్ కృష్ణ ద్వారా ఈ దంపతులకు సంబంధించి దత్తత ఆదేశాలు ఇవ్వాలంటూ కలెక్టర్ ద్వారా జిల్లా సంక్షేమ అధికారికి కొద్దిరోజుల క్రితం పిటిషన్ వచ్చింది. దీనిని పరిశీలించిన జిల్లా బాలల సంరక్షణ విభాగం.. ఇంటర్ కంట్రీ అడాప్షన్ పేరేంట్స్ (పాప్స్) కిందకు వస్తుందంటూ చెబుతూనే..అథరైజ్డ్ ఫారెన్ అడప్షన్ ఏజెన్సీ(ఏఎఫ్ఏ) నుంచి నిరంభ్యంతర పత్రం సమర్పించాలన్నారు. దీని ఆధారంగానే దత్తతను ముందకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే పాప కోసం దరఖాస్తు చేసుకున్న విరాణి దంపతులు, ఆ పాప బయోలాజికల్ పేరెంట్స్ అయిన భోజని దంపతులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరు కాలేదు. ఇంకోవైపు శ్రీహోమ్ స్టడీ రిపోర్ట్శ్రీ ఇవ్వాలని లోకల్ రాజకీయ నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వరంగల్ చార్బౌలీకి చెందిన ఫిజియో థెరపీ షర్మిలా.. దత్తత విషయంలో పలుమార్లు అధికారులను కలిశారు. వరంగల్ ఎంపీ పసనూరి దయాకర్ అనుచరుడినంటూ శ్రీనివాస్ గౌడ్ కూడా ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. అయితే రషీదాబాను గర్భవతి కాకపోతే ఆ పాప ఎవరనే అనుమానం కలుగుతోంది. దీన్ని నిగ్గు తేల్చే దిశగా అధికారులు దృష్టి సారించాలి. -
దత్తపుత్రుడికి ఆస్తి హక్కులుండవ్: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: దత్తత వెళ్లక ముందు సొంత (పుట్టిన) తల్లిదండ్రులు ఏదైనా ఆస్తిని కేటాయించి ఉంటే దానిపై దత్తత వెళ్లిన వ్యక్తికి హక్కులు ఉంటాయి తప్ప.. దత్తత వెళ్లిన అనంతరం ఎలాంటి హక్కులు ఉండవని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తికి మాత్రమే వారసుడవుతారని వ్యాఖ్యానించింది. దత్తత వెళ్లిన తర్వాత సొంత తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పింది. అలాంటప్పుడు వారి ఆస్తికి వారసులు కాలేరని స్పష్టం చేసింది. దత్తతకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దత్తత వెళ్లినప్పటికీ తనకు సొంత తల్లిదండ్రుల కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఏవీఆర్‌ఎల్ నరసింహారావు కింది కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు సొంత తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుందని తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అతని సోదరుడు ఎ.నాగేశ్వరరావు హైకోర్టులో లెటర్స్ పేటెంట్ అప్పీల్ దాఖలు చేశారు. దీని విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఫుల్ బెంచ్ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే! -
మా బంగారు కొండే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లాలో అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన బంగారుకొండ పథకం సత్పలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. శనివారం స్థానిక ఐదుబండ్ల మార్కెట్ సమీపంలో రేలంటి ఇవాంశిక అనే చిన్నారి ఇంటిని ఆమె సందర్శించారు. తాను దత్తత తీసుకున్న ఈ బాలికను కలెక్టర్ ఎత్తుకుని కొద్దిసేపు ముచ్చటించారు. వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం, రక్తహీనతతో బాధపడుతుండటంతో ఇవాంశికను బంగారుకొండ పథకం కింద కలెక్టర్ ఎంపిక చేసుకుని దత్తత తీసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద బలవర్థకమైన ఆహారం, బాలామృతం, కోడిగుడ్లను చిన్నారికి క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. బంగారుకొండ కిట్ ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్న తీరు పట్ల కలెక్టరు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా డాక్టర్ల సలహా మేరకు తగిన విధంగా పర్యవేక్షిస్తుండటంతో 10 రోజుల వ్యవధిలో కేజీ బరువు పెరిగింది. రెండు అంగుళాల పొడవు కూడా పెరగడం గమనించినట్లు మాధవీలత పేర్కొన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ 7.5 శాతం నుంచి 9.5 శాతానికి పెరింగిందని అధికారులు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరు నెలలు నిండి ఆరేళ్ల లోపు 1293 మంది పిల్లలను బంగారుకొండ కింద గుర్తించామని కలెక్టరు తెలిపారు. ప్రతి బుధవారం బాలమిత్రలు చిన్నారుల ఇంటికి వెళ్లి ఆహార పదార్థాలు, ఆరోగ్య వివరాలు పర్యవేక్షిస్తారన్నారు. బంగారుకొండ కిట్ పౌష్టికాహారాన్ని మాత్రమే పిల్లలకు అందించాలన్నారు. ప్రతి నెలా ఒక కిట్ ఇవ్వడం ద్వారా ఆరు నెలలు పాటు పర్యవేక్షిస్తామన్నారు. ఇవాంశికలో చక్కటి పురోగతి కనిపించడంతో ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. జిల్లా శిశుసంక్షేమ .. సాధికారిత ఇన్చార్జి అధికారి,డీఆర్డీఏ పీడీ సిరిపురపు సుభాషిణి, అంగనవాడీసూపర్వైజర్,వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దత్తత ఇప్పుడు మరింత సులభం.. అనాథలకు ‘అమ్మ’తోడు
సాక్షి, అమరావతి: చెత్త కుండీలో అప్పుడే పుట్టిన పసికందు.. హాస్టల్లో బాలిక ప్రసవం–కిటికీ నుంచి బిడ్డను విసిరేసిన వైనం వంటి వార్తలు వింటుంటే హృదయం ద్రవించి పోతుంది. మరోవైపు.. ఐవీఎఫ్ సెంటర్లలో శిశు విక్రయాలు.. పిల్లలను కిడ్నాప్ చేసి రూ.లక్షలకు అమ్మేస్తున్న ఘటనలూ చూస్తున్నాం. అవాంఛిత బిడ్డలను వదిలించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే.. సంతానం కలగని తల్లిదండ్రులు ఎందరో పిల్లల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మారుతున్న జీవన శైలి, అనారోగ్యం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవటం, కెరీర్ కోసం పిల్లలను వాయిదా వేయటం వంటి కారణాల వల్ల సంతానలేమి సమస్య బాగా పెరిగిపోయింది. ఫలితంగానే.. ప్రతి పట్టణంలో ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్లు వెలిశాయి. అయితే, వైద్య విధానాల ద్వారానూ సంతానం కలగని తల్లిదండ్రులు దత్తత తీసుకోవచ్చు. దత్తత ఎంతో మేలు గతంలో దత్తత నిబంధనలు కఠినతరంగా ఉండేవి. కేంద్రప్రభుత్వం 2022 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చిన నూతన మార్గదర్శకాల ప్రకారం దత్తత పొందటం ఇప్పుడు సులభం. దత్తత తీసుకోదలిచిన తల్లిదండ్రులు చట్టబద్ధంగా మాత్రమే ఆ పని చేయాల్సి ఉంటుంది. మరే ఇతర పద్ధతుల్లో పిల్లలను దత్తత తీసుకుంటే చట్టరీత్యా నేరం. అలాంటి వారు శిక్షార్హులు అవుతారు. గతంలో పిల్లలు కలగని దంపతులు మాత్రమే దత్తత తీసుకునేందుకు అర్హులు. తాజాగా ఈ నిబంధనను తొలగించి.. పిల్లలు ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత కలిగిన వారు దత్తత తీసుకునే అవకాశం ఇచ్చారు. పిల్లలు కావాలనుకున్న వారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి దరఖాస్తు చేసుకుంటే.. వారు వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లోని శిశుగృహాల్లో దత్తతకు సిద్ధంగా ఉన్న పిల్లల వివరాలు తెలియజేస్తారు. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటైన స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు దత్తత ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు తోడ్పడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న శిశు గృహాల్లో అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు 2,188 మంది దత్తతకు సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్రంలోని శిశు గృహాల్లో సుమారు 120 మంది బాల బాలికలు ఉన్నారు. మరోవైపు దేశ విదేశాలకు చెందిన 31 వేల మందికి పైగా తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుని ఉన్నాÆý‡ు. రంగు, భాష, ప్రాంతం తదితర ప్రాధాన్యతల కారణంగా పిల్లలందరినీ దత్తతకు అప్పగించటంలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు సైతం ఏజెన్సీలు కృషి చేస్తున్నాయి. దత్తత కోరే తల్లిదండ్రులకు అవగాహన కల్పించటంతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. సమాచారాన్ని వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు కావాలంటే.. దత్తతకు సంబంధించిన మరిన్ని వివరాలు అంగన్వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్ అధికారులు, జిల్లా బాలల సంరక్షణాధికారి కార్యాలయంలో లభిస్తాయి. అనాథ శిశువులను సంరక్షించేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రోడ్డు పక్కన, కాలువలోనూ చెత్త కుండీల్లోనూ శిశువులను గుర్తిస్తే సమాచారం తెలిపేందుకు టోల్‌ఫ్రీ ఫోన్ నంబర్లు 1098, 181, 100లను ఏర్పాటు చేసింది. ఎలా దరఖాస్తు చేయాలంటే.. దత్తత తీసుకోదలచిన వారు పాన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయసు ధ్రువీకరణ పత్రం, దంపతుల ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, ఆరోగ్య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దత్తత కోసం ఏడు దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ► దత్తత తీసుకోవాలనుకుంటున్న తల్లిదండ్రులు వారి పాన్‌కార్డు ద్వారా ఠీఠీఠీ.ఛ్చిట్చ.nజీఛి. జీn వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ► సిద్ధం చేసుకున్న ధ్రువీకరణ పత్రాలను వెబ్సైట్లో వారి లాగిన్ ఐడీ ద్వారా 30 రోజులలోపు అప్లోడ్ చేయాలి. దత్తత ఏజెన్సీకి గృహ అధ్యయన నివేదిక సమయంలో రూ.6 వేలు డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. ► తర్వాత దత్తత ఏజెన్సీ గృహ అధ్యయన నివేదికను తయారు చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. ► అర్జీదారు కోరుకున్న లక్షణాలున్న పిల్లల వివరాలు రిఫర్ చేస్తూ వారి మొబైల్‌కు సమాచారం అందుతుంది. ఆ సమాచారం ప్రకారం 48 గంటలలోపు వెబ్సైట్లో లాగిన్ అయి నచ్చిన బిడ్డను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ► రిజర్వు చేసుకున్న బిడ్డను 20 రోజులలోపు సరిపోల్చుకుని దత్తత ఏజెన్సీ వద్దకు వెళ్లి బిడ్డ నచ్చిందని ఆమోదం తెలియజేసి రూ.40 వేలు డీడీ ద్వారా చెల్లించి బిడ్డను పొందవచ్చు. ► బిడ్డను పొందిన వారం రోజులలోపు సదరు దత్తత ఏజెన్సీ దత్తతకు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలన్నింటినీ స్థానిక కుటుంబ న్యాయస్థానం లేదా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో సమర్పించి దత్తత ఉత్తర్వుల ప్రతిని పొందాలి. ► దత్తత తీసుకున్న బిడ్డ సంక్షేమం కోసం స్థానిక దత్తత ఏజెన్సీకి చెందిన సోషల్ వర్కర్ రెండు సంవత్సరాల పాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గృహ సందర్శన చేసి ఫాలోఅప్ రిపోర్టును ‘కారా’ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఫాలోఅప్ సందర్శనకు వచ్చిన ప్రతిసారి దత్తత ఏజెన్సీకి రూ.2 వేలు డీడీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. -
పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి
మలయాళ నటి అభిరామి దంపతులు తల్లిదండ్రులయ్యారు. అదేంటి, ప్రెగ్నెన్సీ విషయాన్ని నటి ఇంతకాలంగా దాచిపెట్టిందేంటి? అనుకునేరు. బిడ్డను కనకుండానే ఆమె తల్లయింది. అభిరామి దంపతులు ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఏడాది కాలంగా ఆ పాప వీళ్ల దగ్గరే ఉంటోంది. తాజాగా ఈ విషయాన్ని మదర్స్ డే సందర్భంగా మే 14న సోషల్ మీడియాలో వెల్లడించింది నటి. తమ కూతురికి కల్కి అని నామకరణం చేసినట్లు తెలిపింది. ఒక తల్లిగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు కూతురితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ అభిరామి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ మదర్స్ డే అంటూ నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిరామి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అభిరామి ప్రముఖ రచయిత పవనన్ మనవడు రాహుల్ పవనన్ను 2009లో పెళ్లాడింది. ఇంతవరకు వీరికి పిల్లలు లేకపోవడంతోనే ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆమె తెలుగులో చెప్పవే చిరుగాలి, అమర్ అక్బర్ ఆంటోని, చార్మినార్, థాంక్యూ సుబ్బారావు వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అనేక చిత్రాలు చేసింది. ప్రస్తుతం సురేశ్ గోపీ ప్రధాన పాత్రలో నటిస్తున్న గరుడన్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. View this post on Instagram A post shared by Abhirami (@abhiramiact) చదవండి: ది కేరళ స్టోరీ టీమ్‌కు యాక్సిడెంట్.. స్పందించిన హీరోయిన్ -
'కొడుకు పోయిన బాధ ఎలా ఉంటదో తెలుసు.. హాత్విక్‌ను దత్తత తీసుకుంటా'
సాక్షి, నల్గొండ: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన నరేశ్, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్ మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. నరేశ్ స్వగ్రామం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయిన నరేశ్ పెద్ద కుమారుడు హాత్విక్‌ను దత్తత తీసు కుంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ఆయన తన పీఏ సైదులుతో హాత్విక్ పేరిట బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్ చేయించారు. ఖర్చుల నిమిత్తం నరేశ్ తల్లిదండ్రులకు రూ.25వేలను అందజేయించారు. నరేశ్ తల్లిదండ్రులను ఫోన్లో ఓదార్చారు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, అధైర్య పడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నరేశ్ కొడుకును ఇంటర్నేషనల్ స్కూ ల్లో చదివిస్తానని, పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని, ఢిల్లీ నుంచి రాగానే, గ్రామానికొచ్చి కలుస్తానని నరేష్ కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. చదవండి: బీఆర్ఎస్తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు -
రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. 150 మంది చిన్నారుల దత్తత
తమిళ స్టార్ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 150 మంది చిన్నారులను ఆయన దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పిల్లలతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. వారికి నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తానన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ లారెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'రుద్రన్' (తెలుగులో 'రుద్రుడు') మూవీ ఆడియా లాంఛ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. పిల్లలకు అభిమానుల ఆశీస్సులు కావాలని కోరారు. కాగా.. గతంలో గుండె సమస్యలతో బాధపడుతున్న 141 మంది చిన్నారులకు సర్జరీ చేయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవరైనా.. ఆర్థిక సమస్య కారణంగా చదువుకు దూరమవుతున్నా, హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నా.. వెంటనే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. లారెన్స్ నటించిన 'రుద్రన్' తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో లారెన్స్ మాట్లాడారు. సేవ చేసే విషయంలో రాఘవేంద్ర స్వామి తనను ముందుకు నడిపిస్తున్నాడని తెలిపారు. తెరపైనే కాదు.. నిజ జీవితంలో హీరోగా ఉండాలన్న తన మాతృమూర్తి చెప్పిన మాటను ఆయన గుర్తుచేసుకున్నారు. కతిరేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన‘రుద్రన్’ ఈ నెల 14న విడుదలకానుంది. ఇప్పటికే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు లారెన్స్ ‘చంద్రముఖి 2’లో నటిస్తున్నారు. వాసు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక పాత్ర పోషించారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. I’m extremely happy to share the news of adopting 150 children and provide them with education as a new venture from rudhran audio launch. I need all your blessings #Serviceisgod 🙏🏼 pic.twitter.com/lSwns10Grs — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2023 -
Anchor Suma: గొప్ప మనసు చాటుకున్న యాంకర్ సుమ
తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడుతూ.. సమాయానుకూలంగా పంచ్‌లు వేస్తూ ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ బిగినింగ్‌లో పలు సీరియల్స్‌లో నటించిన సుమ.. ఆ తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చి యాంకర్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న సుమ.. అప్పుడప్పుడు తనలో ఉన్న నటిని కూడా పరిచయం చేస్తుంది. ఆ మధ్య ఆమె లీడ్ రోల్లో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా చేసింది. అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ, నటన పరంగా సుమకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా ఒకవైపు యాంకరింగ్ మరోవైపు యాక్టింగ్‌తో ఇప్పటికీ ఫుల్ బిజీగా ఉంది సుమ. ఇదిలా ఉంటే తాజాగా సుమ చేసిన ఓ మంచి పనికి నెటిజన్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సుమ చెన్నై లోని ఒక కాలేజ్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. ప్రేక్షకులు నన్ను ఆదరించి ఇంతదాన్ని చేశారు. అందుకే వారి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్” అనే సంస్థ నా డ్రీమ్. నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను’అని సుమ చెప్పుకొచ్చింది. సుమ చేస్తున్న మంచి పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
సంక్రాంతి పండుగను వారితోనే.. ప్రస్తుతం 31 మంది పిల్లలు ఉన్నారు
దక్షిణాదిలో బబ్లీగర్ల్‌గా పేరు తెచ్చుకున్న నటి హన్సిక. ముంబైకి చెందిన ఈ భామను దక్షిణాది సినిమానే అక్కున చేర్చుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటిస్తూ పేరు తెచ్చుకుంది. ఇక్కడ విజయ్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్, ఆర్య వంటి ప్రముఖ నటులతో జత కట్టింది. నటుడు శింబు సరసన నటించి ఆయన ప్రేమలో కొంతకాలం మునిగి తేలింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే అది మనస్పర్థలతోనే నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్ 4న సోహైల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆ మధురమైన తరుణాలను ఆస్వాదిస్తోంది. హన్సికలో సేవాగుణం ఎక్కువే. అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. కాగా సంక్రాంతి పండుగను వారితో గడిపి సంతోషాన్ని పంచుకుంది. దీని గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో పండగ రోజుల్లో ఇతరులకు సాయం చేయాలని తన తల్లి చిన్న వయసులోనే చెప్పిందని పేర్కొంది. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని చెప్పిందని, అందుకే తాను నటి అయిన తరువాత అనాథ పిల్లలను దత్తత తీసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం 31 మంది పిల్లలు ఉన్నారని తెలిపింది. వారిని దత్తత తీసుకుని పోషించడం సంతోషంగా ఉందని చెప్పింది. సంక్రాంతి రోజున వారికి నూతన వ్రస్తాలు కొని ఇవ్వడంతో వారిలో సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంది. భగవంతుడి ఆశీస్సులతో తన జీవితం ఆనందంగా సాగుతోందని చెప్పింది. పెళ్లి తరువాత సినిమాకు కొంచెం గ్యాప్ ఇచ్చానని, సమీప కాలంలో ఒక వాణిజ్య ప్రకటనలో నటించానని చెప్పింది. అయితే ఈ నెల 20వ తీదీ నుంచి మళ్లీ షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పింది. చేతిలో 7 చిత్రాలు, 2 వెబ్ సిరీస్ ఉన్నాయని, తాను నటిగా బిజీగా ఉన్నానని హన్సిక పేర్కొంది. -
‘దత్తత’కు మార్గం సులువు..
నేరడిగొండ: శిశువు ‘దత్తత’కు ప్రభుత్వం సులువైన మార్గం తీసుకొచి్చంది. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధత ప్రకారం పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కల్పించింది. గతంలో చాలామంది అడ్డదారులు తొక్కి శిశువులను దత్తత తీసుకున్న ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఇకపై అలాంటి చర్యలకు దిగితే న్యాయపరంగా పోలీసు కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. దత్తత కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రక్రియను పూర్తిచేసి శిశువును దత్తత తీసుకునే వెసులుబాటు కల్పించింది. శిశువుల విక్రయాలు దత్తత పేరుతో గతంలో ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శిశువులను విక్రయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతోపాటు ఆడపిల్లలపై వివక్షతో భ్రూణహత్యలు జరగడంతో పాటు చెత్తకుప్పల్లో పడేస్తున్న విషయం విధితమే. దీన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పూర్తిస్థాయిలో ఫలితం లేకుండా పోయింది. చిన్నారులను దత్తత తీసుకునే ప్రక్రియ గతంలో చాలా సంక్లిష్టంగా ఉండేది. అనేక రకాల పత్రాలు పొందుపర్చాల్సి వచ్చేది. దీంతో చాలా మంది దంపతులు అడ్డదారుల్లో శిశువులను దత్తత తీసునేవారు. అలా కొనుగోలు చేసిన వారిలో చాలా మంది న్యాయ సమస్యలు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది. దత్తత విధానం.. శిశువు దత్తత తీసుకునే దంపతులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన అవకాశం ఉంటుంది. దంపతులు, శిశువు వివరాలని్నంటిని గోప్యంగా ఉంచుతారు. దంపతుల ఫొటో, పాన్‌కార్డు, జనన ధ్రువపత్రాలు, నివాస, ఆదాయ, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు లేవంటూ వైద్యాధికారి జారీ చేసిన పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ తదితర ఆరు రకాల పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దంపతులకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. వారి సీనియారిటీ ప్రకారం దరఖాస్తులు ప్రస్తుత దశ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటే దత్తత ఇస్తారు. శిశువు, లింగం వివరాలు, వయస్సు, ఏ ప్రాంతానికి చెందిన శిశువు అవసరం తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు దత్తత ఇచ్చే అధికారాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దాఖలు పర్చారు. నూతన విధానం అమలు చేసిన తర్వాత శిశువుల దత్తత కోసం దంపతులు ముందుకొస్తునట్లు అధికారులు పేర్కొంటున్నారు. కావల్సిన ధ్రువపత్రాలు శిశువును దత్తత తీసుకునే దంపతులు ఇద్దరు కూడా పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువపత్రం, పెళ్లి రిజిస్ట్రేషన్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్, జనన ధ్రువపత్రాలు, జంట ఫొటోలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్రాలను ఐసీపీఎస్ కార్యాలయంలో సమర్పించాలి. వీటితో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్, డీడబ్ల్యూఅండ్ సీడీఏ ఆదిలాబాద్ పేరిట రూ.6 వేల డీడీ తీయాల్సి ఉంటుంది. Cara.nic.in వెబ్సైట్ పారెంట్ లాగిన్‌లో రెసిడెంట్ ఇండియన్ పారెన్్టలో దత్తత కోరే తల్లిదండ్రుల వివరాలన్నీ పొందుపర్చాలి. అనంతరం అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. Praspective Adoptive Pareents(PAPs) పొందిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను భద్రపర్చుకొని సీనియారిటీని ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.6 వేలు, దత్తత తీసుకునే సమయంలో రూ.40 వేలు, దత్తత పొందిన ఆరు నెలలకు రూ.8 వేలు ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దత్తత కోసం ఇప్పటివరకు 269 దరఖాస్తులు జిల్లా కేంద్రంలో 2005లో శిశుగృహను ఏర్పాటు చేశారు. శిశువుల దత్తత కోసం ఇప్పటివరకు 269 మంది దంపతులు దరఖాస్తులు చేసుకున్నారు. 108 మంది శిశువులను దత్తత ఇచ్చారు. 73 మంది బాలికలు, 36 బాలుర శిశువులను అందజేశారు. మరో 183 మంది వెయిటింగ్లో ఉన్నారు. ఇందులో 96 మంది శిశువులను భారతదేశానికి, 12 మందిని ఇతర దేశాలకు దత్తత ఇచ్చారు. పారదర్శకంగా ప్రక్రియ దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. శిశువును దత్తత తీసుకునే వారు మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైరవీలకు ఆస్కారం లేకుండా చూస్తున్నాం. సీరియల్ ప్రకారం పక్షపాతం లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తాం. దరఖాస్తు పరిశీలన అనంతరం చిన్నారులను దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది. – రాజేంద్రప్రసాద్, డీసీపీఓ, ఆదిలాబాద్ -
అల్లు అర్జున్ గొప్ప మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న కేరళ కలెక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ పేద విద్యార్థిని మెడికల్ చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు బన్నీ ముందుకు వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. గతంలో కేరళలో భారీ వర్షాల కారణంగా అక్కడ వరదలు వచ్చి ఎన్నో గ్రామాలు కొట్టుకొని పోయిన సంగతి తెలిసిందే. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. ముఖ్యంగా అలెప్పీ ప్రాంతం పూర్తిగా నేలమట్టం అయ్యింది. దీంతో నిరాశ్రయులకు చేయూతనిచ్చేందుకు ‘వీ ఆర్ ఫర్ అలెపి’ అంటూ కలెక్టర్ కృష్ణ తేజ దాతలకు పిలుపు నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ కారణంగా తండ్రిని కొల్పోయిన ఓ మెడికల్ విద్యార్థినికి పై చదువులు చదివేందుకు ఆర్థిక సమస్యలు అడ్డుగా వచ్చాయి. చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి 92 శాతం మార్కులతో మెరిట్ తెచ్చుకున్న ఆమెను నర్సింగ్ చదివించేందుకు అలెపీ కలెక్టర్ మద్దతుగా నిలిచారు. అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి సదరు విద్యార్థినిని ఒక ఏడాది ఫిజుకు అయ్యే ఖర్చును సాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో ఆ విద్యార్థిని పరిస్థితి గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ ఒక సంవత్సరం కాదు.. నాలుగు సంవత్సరాలు తనకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని.. హాస్టల్ ఫీజుల చెలించడమే కాకుండా తనని దత్తత తీసుకుంటానని బన్నీ కలెక్టర్‌కు మాట ఇచ్చాడట. ఇక బన్నీ సేవ గుణాన్ని ప్రశంసిస్తూ కలెక్టర్ కృష్ణ తేజ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో అల్లు అర్జున్ను ఇటూ తెలుగు ప్రజలతో పాటు కేరళ ప్రేక్షకులు కూడా ప్రశంసలతో ముంచేత్తున్నారు. చదవండి: రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణం ఇదే! ఆ ఒక్క మాటకే విమర్శల దాడి -
కిషన్‌రెడ్డి స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న కార్తికేయ 2 నిర్మాత అభిషేక్
సాక్షి, హైదరాబాద్: పల్లెల అభివృద్ధికి కృషి చేయడం నిజమైన ధర్మం, దేశభక్తి అని కశ్మీర్ ఫైల్స్ చిత్రం దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి పేర్కొన్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం కావడం విశేషం. ఆదివారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన తన చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్‌లో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ ఆవిష్కరణ సభకు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, యూపీ మంత్రి మంత్రి నందగోపాల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, కావ్యరెడ్డి, నటి పల్లవి జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ తన తండ్రి తేజ్ నారాయణ్ పుట్టిన రోజున గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ గ్రామ విద్యార్థులు వసతులను సరిగ్గా వినియోగించుకుని భవిష్యత్‌లో స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. యూపీ మంత్రి నందగోపాల్ మాట్లాడుతూ.. తిమ్మాపూర్ ఆదర్శ గ్రామంగా మారేలా సేవా కార్యక్రమాలు ముందుకు సాగాలని కోరారు. తన అత్తగారి గ్రామమైన తిమ్మాపూర్‌ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి తెలిపారు. చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్‌లో భాగంగా తిమ్మాపూర్ గ్రామ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను వితరణ చేశారు. కార్యక్రమాన్ని చేపట్టిన అభిషేక్ అగర్వాల్‌ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీశ్రీ రవిశంకర్ వర్చువల్‌గా అభినందించారు. -
తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్
-
పెంచిన తండ్రినే కడతేర్చిన కసాయి కూతురు
ఉత్తరప్రదేశ్: ఒక బాలిక తన స్నేహితుడుతో కలిసి పెంచిన తండ్రినే కడతేర్చింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో వైశాలి అపార్టమెంట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ బాలికను పుట్టిన వారం రోజులకే ఘజియాబాద్‌లోని ఒక దంపతులు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. 14 ఏళ్ల బాలిక తన స్నేహితుడుతో కలిసి 58 ఏళ్ల పెంచిన తండ్రిని చేతులు కాళ్లు కట్టేసి.. ఒక రోప్‌తో చంపేసి పరారయ్యింది. సాయంత్రం బాధితుడు భార్య ఇంటికి వచ్చి చూడగా అతను చనిపోయి ఉన్నాడు. ఐతే బాధితుడు భార్య తాము పెంచుకుంటున్న కూతురుపైన అనుమానంగా ఉందని తెలిపింది. ఆమె గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తితో తరుచుగా మాట్లాడటం, చాటింగ్‌లు వంటివి చేసిందని కూడా ఆమె చెప్పింది. కొన్ని నెలల క్రితం సదరు బాలిక 19 ఏళ్ల యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడు బాధితుడు పోలీస్ స్టేషన్లో సదరు యువకుడిపై పోస్కో చట్టం కింద కేసు పెట్లి జైలుకి పంపించి, కూతురుని ఇంటికి తీసుకు వచ్చారు. తండ్రి ఇలాంటి యువకులను వదిలిపెట్టకూడదని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు చెబితే కూతురు మాత్రం ఆ యువకుడికి అనుకూలంగా పోలీస్టేషన్లో స్టేట్మెంట్లు ఇచ్చింది. ఐతే ఆ బాలిక మాత్రం తండ్రి తీరుపై కక్ష పెంచుకుని జైల్లో ఉన్న యువకుడితో టచ్‌లోనే ఉంది. అంతేగాదు తన తండ్రి వేధిస్తున్నాడని తనను తీసుకుపోవాలని చెబుతుండేది. దీంతో ఆ యువకుడు ఆమె మాటలకు జాలిపడి ఆమెతో కలిసి అతన్ని చంపేందుకు కుట్రపన్నాడు. దీంతో సదరు యువకుడు 23 ఏళ్ల మరో యువకుడిని పురమాయించి ఈ హత్యకు పథకం వేశాడు. బాలిక ఆ యువకుడితో కలిసి తండ్రిని రోప్‌తో చంపేసి ఇంట్లోంచి కొన్ని క్రెడిట్ కార్డులు తీసుకుని పరారయ్యింది. ఐతే పోలీసులు సీసీటీపీ పుటేజ్‌లు ఆధారంగా సదరు నిందితులను గుర్తించి ఫోన్ కాల్స్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నారు. విచారణలో నిందితులిద్దరు నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. (చదవండి: దారుణం...బ్లాక్మెయిల్ చేసి 8 మంది అత్యాచారం) -
'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత
హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్‌కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్‌ను అధికారికం చేసింది. ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్‌లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి. చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా.. -
కేటీఆర్ ప్రశంసపై కొండారెడ్డిపల్లివాసుల ఆగ్రహం
కేశంపేట: సినీనటుడు ప్రకాశ్‌రాజ్ తన దత్తత గ్రామమైన రంగారెడ్డి జిల్లా కేశంపేట పరిధిలోని కొండారెడ్డిపల్లిని బాగా అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలసి సర్పంచ్ పల్లె స్వాతి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిపై కేటీఆర్ పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రకాశ్‌రాజ్ 2019 వరకే తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన చేసిన అభివృద్ధి కంటే తాము సొంత నిధులతో చేసిన అభివృద్ధి ఎక్కువగా ఉందని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్లుగా సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న తమను అభినందించాల్సి పోయి.. ప్రకాశ్‌రాజ్ అభివృద్ధి చేశారని చెప్పడం ఎంతవరకు సమంజసమని సర్పంచ్ స్వాతి ప్రశ్నించారు. పనిచేసింది మేమైతే.. ప్రశంసలు ప్రకాశ్‌రాజ్‌కా? అంటూ కేటీఆర్‌కు ప్రశ్న సంధించారు ఆ ఊరి ప్రజలు. This is the village adopted by @prakashraaj Great progress made in tandem with local MLA @AnjaiahYTRS Garu 👏 https://t.co/yGfYdloaFT — KTR (@KTRTRS) September 20, 2022 -
పిల్లలు లేరా.. అయితే ఉందిగా ఒక మార్గం!
నెహ్రూనగర్(గుంటూరు జిల్లా): పండంటి బిడ్డ కోసం పెళ్లయిన దగ్గర నుంచి దంపతులంతా తాపత్రయపడుతుంటారు. అయితే, ప్రస్తుత యాంత్రిక జీవనంలో దాన్ని నోచుకోక ఎంతో మంది ఆవేదనకు గురవుతున్నారు. పిల్లలు పుట్టడం కష్టతరమవుతుంది. కొంత మంది ఎంతో ఖర్చుపెట్టి కృత్రిమంగా పిల్లల్ని కంటున్నారు. మరికొంత మంది అదీ కూడా అవకాశం లేక అల్లాడుతున్నారు. అటువంటి వారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. చదవండి: సీతా ఫలంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? 2011 సంవత్సరం నుంచి అందుబాటులోకి దత్తత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2011 నుంచి చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని నియమ, నిబంధనల్ని ఏర్పాటు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 149 మంది చిన్నారుల్ని స్వదేశంలో, ఏడుగురిని ఇతర దేశాల వారికి అధికారులు దత్తత ఇచ్చారు. చిన్నారుల్ని దత్తతకు ఇచ్చేటప్పుడు అన్ని నియమ, నిబంధనలకు లోబడి అర్హత కలిగిన దంపతులకు మాత్రమే అప్పగిస్తారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి దత్తత తీసుకునే దంపతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న www.cara. nic.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦వెబ్ సైట్లోకి వెళ్ళి న్యూ రిజి్రస్టేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦బేసిక్ ఇన్ఫార్మేషన్ ఇవ్వాలి( వయస్సు, పెళ్లి తదితర వివరాలు) ♦దంపతుల్లో ఎవరిదో ఒకరి పాన్‌కార్డ్‌తో రిజిస్టర్ అయిన వెంటనే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ (మెయిల్‌కి, మొబైల్) వస్తుంది. ♦యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయిన తరువాత తగిన ధ్రువ పత్రాలైన రెసిడెన్స్ సరి్టఫికెట్, బర్త్ సరి్టఫికెట్(10వ తరగతి మార్క్ లిస్ట్, 10లోపు చదివిన వారైతే స్టడీ సర్టిఫికెట్స్), ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఉద్యోగి అయితే జీతం సరి్టఫికెట్, ఇతరులైతే 1.50లక్షకు పైగా పత్రం పొందాల్సి ఉంటుంది), పెళ్లి సరి్టఫికెట్, డాక్టర్ సర్టిఫికెట్ ( ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు, ప్రాణాంతకరమైన వ్యాధులుగాని లేవని ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ డాక్టర్ నుంచి) తీసుకోవాలి. –దంపతులిద్దరూ కలిసి దిగిన ఫోటోల్ని వెబ్సైట్లో ఆప్‌లోడ్ చేయాలి. ♦తరువాత ఈ వివరాలన్నీ మహిళా, శిశు సంక్షేమ శాఖ లాగిన్లోకి వెళతాయి. ♦ఇచ్చిన వివరాలు సక్రమంగా ఉన్నాయా...లేవా? అని శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేకంగా కేటాయించిన సిబ్బంది దంపతుల ఇంటికి వెళ్లి విచారణ(హోం స్టడీ) చేపడతారు. ♦అంతా సక్రమంగా ఉంటే ఆ వివరాల్ని ఐసీడీఎస్ పీడీ లాగిన్‌కి వెళుతుంది. ♦అక్కడ నుంచి వారి సీనియార్టీ ప్రకారం చిన్నారుల్ని దత్తత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ♦అర్జీదారు కోరుకున్న బిడ్డను రిఫర్ చేస్తూ వారి మొబైల్‌కు సమాచారం అందుతుంది. ఆ సమాచారం మేరకు 48 గంటల్లో కారా వెబ్ సైట్లో లాగిన్ అయి సదరు బిడ్డ నచ్చితే రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ♦రిజర్వు చేసుకున్న బిడ్డను ఇరవై రోజుల్లోపు పోలికలు సరిపోల్చుకుని బిడ్డ నచ్చినట్లయితే, దత్తత ఏజెన్సీ వద్దకు వెళ్ళి ఆమోదం తెలియజేసి రూ.40వేల డీడీ సమరి్పంచి పొందవచ్చు. ♦బిడ్డను పొందిన వారం రోజుల్లోపు సదరు దత్తత ఏజెన్సీ వారు సమరి్పంచిన ధ్రువపత్రాలన్నింటినీ స్థానిక కుటుంబ న్యాయస్థానంలో సమరి్పంచి కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేస్తారు. ♦ప్రతిది వారి మెయిల్, మొబైల్‌కి ఆప్ టూ డేట్ కారా వెబ్ సైట్ నుంచి వస్తూ ఉంటుంది. ♦ప్రస్తుతం 2018–19 ఎన్రోల్ చేసుకున్న వారికి సీనియార్టీ ప్రకారం పూర్తి పారదర్శకంగా పిల్లలను దత్తత కింద అప్పగిస్తున్నారు. ♦పిల్లల్ని అప్పగించిన తరువాత కూడా రెండు సంవత్సరాల పాటు దత్తత తీసుకున్న చిన్నారుల్ని శిశు సంక్షేమ శాక అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. వయస్సును బట్టి బిడ్డల అప్పగింత ♦తల్లిదండ్రుల వయస్సు 55 సంవత్సరాలు మించకూడదు. ♦తల్లి, తండ్రి వయస్సు ఇద్దరిది కలిపి 90 సంవత్సరాలుగా ఉంటే(తండ్రికి 50, తల్లికి 40 వయస్సు) 0 నుంచి 4 సంవత్సరాల పాప/బాబు దత్తత ఇస్తారు. ఇద్దరి వయస్సు కలిపి 100 సంవత్సరాలు ఉంటే 4 నుంచి 8 సంవత్సరాలలోపు పిల్లల్ని దత్తతకు ఇస్తారు. ♦సింగిల్ పేరెంట్ 45 సంవత్సరాలు కలిగి ఉన్న తండ్రికి మగ బిడ్డను ఇస్తారు. అదే తల్లికి అయితే మగ/ఆడ బిడ్డను దత్తకు ఇస్తారు. పారదర్శకంగా ప్రక్రియ దత్తత ప్రక్రియ అంతా కూడా కారా అనే వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా జరుగుతుంది. పిల్లలు కావాలనుకున్న దంపతులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే వారి సీనియార్టీ ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాలలోపు వయస్సున్న పిల్లలను దత్తత తీసుకోవచ్చు. జిల్లాలో శిశు గృహాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్ని పెంచలేము అనే వారు ఇక్కడ అందజేస్తే వారిని దత్తత ఇస్తారు. – బి. మనోరంజని, పీడీ, ఐసీడీఎస్ గుంటూరు -
గాంధీజీ భక్తురాలు మీరాబెన్
మీరాబెన్ భారతీయురాలు కారు. ఆమె పేరు కూడా మీరాబెన్ కాదు. ఆమె అసలు పేరు మెడిలియన్ స్లేడ్. బ్రిటన్ దేశస్థురాలు. బ్రిటిష్ సైన్యాధిపతి సర్. ఎడ్మిరల్ స్లేడ్ కుమార్తె. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతో కలిసి పనిచేయడానికి తన దేశాన్ని, ఇంటిని వదిలి వచ్చిన మానవతావాది. ఆమె పేరు మార్చింది గాంధీజీనే! శ్రీకృష్ణపరమాత్ముని భక్తురాలైన మీరాబాయ్ పేరునే ఆయన ఆమెకు పెట్టారు. మీరాబాయ్ క్రమంగా మీరాబెన్ అయ్యారు. ఆమె 1925 నవంబరు 7న భారతదేశంలో అడుగు పెట్టారు. ఆరోజు మహదేవ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, స్వామీ ఆనంద్ ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత మీరాబెన్ 34 ఏళ్లు పాటు భారతదేశంలోనే ఉండిపోయారు. హిందీ నేర్చుకున్నారు. 1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ, ఇతర ప్రముఖులతో పాటు మీరాబెన్ కూడా హాజరయ్యారు. లండన్ నుండి వచ్చాక, ఇండియాలో తిరిగి ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా 1932–33లో జైలు జీవితం గడిపారు. అనంతర కాలంలో మీరాబెన్ గాంధీతో పాటు 1942 నుండి 1944 వరకూ పుణేలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో నిర్భంధంలో ఉన్నారు. ఆ జైల్లోనే ఆమె మహాదేవ్ దేశాయ్, కస్తూరీబాయ్ మరణాలు చూసి చలించిపోయారు. అంతేకాదు. ఆ రోజుల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్నీ కళ్లారా చూసిన ప్రత్యక్షసాక్షి మీరాయే. చివరికి గాంధీజీ అంతిమ యాత్రలో కూడా మీరా సాక్షీభూతురాలై నిలిచారు. ఆగాఖాన్ ప్యాలెస్ నుండి విడుదలయిన తర్వాత గాంధీజీ అనుమతితో మీరాబెన్ రూర్కీలో కిసాన్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమ నిర్మాణానికి గ్రామీణులు పెద్ద ఎత్తున స్థలాన్ని సమకూర్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఋషికేశ్‌లో పశులోక్ ఆశ్రమాన్ని స్థాపించి, ఆ ప్రాంతానికి బాపూ గ్రామ్ అనే పేరుని పెట్టారు. అలాగే 1952లో భిలాంగనలో గోపాల్ ఆశ్రమం కూడా స్థాపించారు. ఆ ఆశ్రమంలోనే గడుపుతూ పాల సరఫరా, వ్యవసాయంలో పరిశోధనలు చేస్తుండేవారు. అలాగే ఒకొక్కసారి కశ్మీర్ వెళ్లి కొంతకాలం గడిపి వచ్చేవారు. ఆ రోజుల్లోనే ‘సమ్‌థింగ్ రాంగ్ ఇన్ ది హిమాలయ’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. మనదేశానికి ఇంత సేవచేసిన మీరాబెన్ 1959లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయారు. 1960లో ఆస్ట్రేలియాలో, తర్వాత 22 ఏళ్ల పాటు వియన్నాలో గడిపారు. 1982లో మరణించారు. భారత ప్రభుత్వం 1981లో మీరాబెన్‌ను భారతీయ పౌరురాలుగా పరిగణించి, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. (చదవండి: మహోజ్వల భారతి: నూరేళ్ల రావి చెట్టు) -
యాదాద్రిలో 50 ప్రభుత్వ స్కూల్స్ దత్తత తీసుకున్న మంచులక్ష్మీ
-
సార్.. నన్ను చదివించండి!
నవాబుపేట: మండలంలోని మైసమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్ అమ్ము తున్న ఓ బాలుడిని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దత్తత తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కాకర్లపహాడ్‌కు చెందిన మల్లెల బుజ్జమ్మ, వెంకటేష్ దంపతుల కుమారుడు విజయ్‌కుమార్ స్థానికంగా ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రతి ఆదివారం మైసమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్ అమ్ముతుంటాడు. ఆదివారం అమ్ముతుండగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అలా వెళుతున్న మంత్రి బాలుడిని చూసి పలకరించాడు. ‘ఏం చదువుతున్నావ్?’అనగానే మంత్రి చేయి పట్టుకుని ‘సార్! నేను చదువుకుంటా.. నన్ను చదివించండి. ప్లీజ్’అంటూ విలపించాడు. వెంటనే బాలుని పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని భరోసానిచ్చారు. బాలుడిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాలలో బాలుడిని చేర్పించి, అక్కడే హాస్టల్ వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. తమ కొడుకుపై మంత్రి చూపిన ఔదార్యాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
40 ఏళ్ల వయసులో తల్లయిన నటి!
బుల్లితెర నటి, యాంకర్, సింగర్ అనూష దండేకర్ ఓ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తాను అమ్మనయ్యానంటూ సంతోషం వ్యక్తం చేసింది. 'ఈ చిన్నారి ఏంజెల్ సహారా నా సొంతం' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. ఇందులో కూతురి కళ్లలోకి చూస్తూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది అనూష. అలాగే తన కుటుంబంలో భాగమైన చిన్నారితో సరదాగా ఆడుకుంటూ కనిపించింది. పెళ్లి కాకుండానే కూతురిని దత్తత తీసుకుని తల్లయిన నటికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అనూష గతంలో నటుడు కరణ్ కుంద్రాతో ప్రేమాయణం నడిపింది. కానీ వీరి బంధం ఎంతోకాలం నిలబడలేదు. ఆ తర్వాత మోడల్ జాసన్ షాను ప్రేమించింది. వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు కూడా! కానీ గతేడాది జాసన్ సోషల్ మీడియాలో అనూష ఫొటోలను తొలగించడంతో వీరు కూడా విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) చదవండి: డబ్బు చాలా అవసరమైంది, అందుకే వాటికి ఒప్పుకున్నాను డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
Kakinada: కలెక్టర్, జేసీ పెద్ద మనసు.. కోవిడ్‌తో అనాథలైన చిన్నారులను
కాకినాడ సిటీ: కలెక్టరు కృతికాశుక్లా, జేసీ ఇలక్కియ పెద్ద మనసు చాటుకున్నారు. కోవిడ్‌తో అనాథలైన చిన్నారుల్లో తలో బిడ్డ బాధ్యతను స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. వారికి సంబంధించిన అన్ని విషయాలు ఇకపై వీరు చూస్తారు. మిగిలిన అధికారులు కూడా చొరవ తీసుకుని తలో చిన్నారి దత్తత బాధ్యతలను తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. సోమవారం కలెక్టరేట్ స్పందన హాలులో స్పందన అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్–19 కారణంగా 23 మంది చిన్నారులు అనాథలయ్యారన్నారు. చదవండి: నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో! వీరి విషయంలో జిల్లా స్థాయి మహిళా అధికారులు ఆలన, పాలన పరంగా చొరవ చూపాలని కలెక్టర్ కోరారు. మాతృత్వ భావనతో చిన్నారులు మహిళ అధికారులకు చేరువ అవుతారనే ఉద్దేశంతో తాము దత్తత బాధ్యత తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. పురుష జిల్లా అధికారులు కూడా ఔదార్యంతో పిల్లల సంక్షేమానికి తమ వంతు సేవలను అందించవచ్చన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం 44 ల్యాప్‌టాప్‌లు, 19 స్మార్ట్ టచ్ ఫోన్లు, 300 హియరింగ్ ఎయిడ్లు, 40 కాలిపర్స్ పరికరాలు జిల్లా విభాగానికి కేటాయించామన్నారు. వీటికి అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టి ఆన్లైన్ దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో ముగ్గురు బధిరులకు స్మార్ట్ టచ్ ఫోన్లను, ఒక దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్‌ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. స్పందనలో 237 అర్జీలు అధికారులకు అందాయి. -
ట్రెండు మారుతోంది...ఆడబిడ్డే కావాలి..! ‘కారా’ దరఖాస్తు విధానం ఇలా!
సాక్షి, హైదరాబాద్: పిల్లల దత్తతలో ట్రెండు మారుతోంది. ఇప్పుడు అమ్మాయి కావాలనే డిమాండ్ పెరుగుతోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలను పరిశీలిస్తే... దత్తత కోసం వచ్చే దంపతులు అమ్మాయిలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విదేశీ దంపతులు సైతం అమ్మాయిల దత్తతకే మొగ్గు చూపుతున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 663 మంది పిల్లల్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దత్తత ఇచ్చింది. ఇందులో 190 మంది బాలురు, 473 మంది బాలికలు. వీరిలో విదేశీ దంపతులు 127 మందిని దత్తత తీసుకోగా... వారిలో బాలురు 38 మంది, 89 మంది బాలికలున్నారు. దత్తత వెళ్లినవారిలో బాలురతో పోలిస్తే బాలికలు దాదాపు రెండున్నర రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇద్దరూ సమానమైనా... పిల్లల విషయంలో ఇప్పుడు ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇదివరకు మగపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.. వారిని ప్రైవేటు స్కూల్లో చేర్పించడం, ఉన్నత చదువులు చదివించడం కనిపించేది. కొన్నేళ్లుగా ఆ పరిస్థితులు మారిపోయాయి. అబ్బా యి, అమ్మాయి అనే తేడా కనుమరుగవుతోంది. పిల్లలెవరైనా సమాన దృష్టితో చూసే భావన పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకే కాస్త ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రులిద్దరికీ ఆడబిడ్డతోనే అనుబంధం ఎక్కువగా ఉంటోందని పలు సర్వేలు సైతం చెబుతున్నాయి. ‘కారా’ దరఖాస్తుతో దత్తత కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పిల్లల దత్తత కోసం కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్న దంపతులు ముందు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు, అర్జీదారుల ఇంటికెళ్లి ప్రత్యేకంగా పరిశీలిస్తారు. దత్తత తీసుకుంటే.. పిల్లలను పోషించే స్తోమత ఉందా? కుటుంబ నేపథ్యం ఏమిటి? వంటివి తెలుసుకున్న తర్వాతే ఆన్లైన్ దరఖాస్తును ఫార్వర్డ్ చేస్తారు. తరువాత.. పిల్లల లభ్యత ఆధారంగా దరఖాస్తుదారులకు ఫోన్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు. దరఖాస్తుదారు సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని అధికారులు ఆ మేరకు సమాచారమిస్తుంటారు. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలనైనా దత్తత తీసుకో వచ్చు. భారత ప్రభుత్వం, విదేశీ దంపతులకు సైతం దత్తత వెసులుబాటును కల్పించింది. -
చిన్నారిని ఇంత వరకు దత్తత తీసుకోలేదు : కరాటే కల్యాణి
అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి హైదరాబాద్ కలెక్టర్ కార్యాయలంలో విచారణకు హాజరయ్యింది. కల్యాణీతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా సీడబ్లూసీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కరాటే కల్యాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి దత్తత జరగలేదని పేర్కొంది. ఇదే విషయాన్ని కలెక్టర్ ముందు కూడా చెప్పామని వివరించింది. 'ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు' అంటూ కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది. కాగా యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో వివాదం, ఆ తర్వాత చిన్నారి దత్తత విషయం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోటీసులకు స్పందిచకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల అనంతరం కరాటే కల్యాణి అఙ్ఞాతంలోకి వెళ్లడం, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం వంటి నాటకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. -
సేవా సంపన్నత
అది 1993, సెప్టెబర్ 13వ తేదీ. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కిందో పీజీ స్టూడెంట్. ఆ అమ్మాయి కడపలో దిగాలి. నడవలేని వ్యక్తి, అతడికి సహాయంగా మరో వ్యక్తి కూడా అదే కంపార్ట్మెంట్లో ఎక్కారు. రైలు కదిలింది. ఆ నడవలేని వ్యక్తి సీట్లో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ‘మేము తినాలి, పడుకోవాలి. మీరు లేవండి’ అని గట్టిగా చెబుతున్నారొకరు. అప్పుడర్థమైందా అమ్మాయికి ఆ వ్యక్తికి రిజర్వేషన్ లేదని... ఆ బెర్తును రిజర్వ్ చేసుకున్న వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని! అంతే... సీట్లో స్థిమితంగా కూర్చోవడం కష్టమైందామెకి. ఎదుటి వారు కష్టంలో ఉంటే ‘నాకెందుకు, నా బెర్త్ నాకుంది చాలు’ అనుకోలేని సున్నితమైన గుణమే... ఈ రోజు ఆమెను ఓ శ్రీమంతురాలిని చేసింది. శ్రీమంతుడు సినిమాలో రీల్ హీరో మహేశ్ బాబు ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం మనకు తెలుసు. ఈ రియల్ శ్రీమంతురాలు కామారెడ్డి జిల్లా, సీతారామ పల్లి గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్రీమంతురాలి పేరు మారంరెడ్డి రజనీరెడ్డి. తండ్రి కడప గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. పెళ్లితో పాతికేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, జనగామలో అడుగుపెట్టారు. ఎల్ఐసీ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తన లైఫ్ జర్నీని సాక్షితో పంచుకున్నారామె. ‘‘మాది విద్యావంతుల కుటుంబం. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవడమే లక్ష్యంగా ఉండేది. నా భర్త నన్ను బైక్ మీద ఎక్కించుకుని ఆఫీస్ దగ్గర దించి తాను ఆఫీస్‌కి వెళ్లాలని, సాయంత్రం పికప్ చేసుకుని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరాలని... నా ఊహలు సాగుతుండేవి. మా వారిది వ్యవసాయ కుటుంబం. ఆడవాళ్లు పెద్ద చదువులు చదవడం, ఉద్యోగం చేయడం అలవాటు లేదు. బాగా చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి కోడలిగా రావడం మా మామయ్యకు ఇష్టంగా ఉండేది. కానీ ‘మన గ్రామాల్లో ఉండగలదా’ అనే సందేహం ఇంట్లో వాళ్లలో. మా అత్తమ్మ మాత్రం ‘ఒకమ్మాయికి మాట ఇచ్చిన తర్వాత ఇక వెనక్కి పోకూడదు’ అని మా వారికి మద్దతుగా నిలిచింది. అలా రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చాను. గొప్ప మలుపు అప్పట్లో మా దగ్గర డబ్బు పెద్దగా ఉండేది కాదు. ఓ రోజు మావారు ఒక దోమకొండ కుర్రాడి గురించి చెప్పారు. ఆ కుర్రాడికి టెన్త్ క్లాస్‌లో మంచి మార్కులు వచ్చాయి. కాలేజ్ ఫీజులు కట్టడం కూడా కష్టమే. దాంతో కాలేజ్ వాళ్లతో మాట్లాడి ఫీజు తగ్గించి, ఆ కుర్రాడికి ఐదు వేలు ఇవ్వగలిగాం. సుభాష్ బిల్డర్‌గా కామారెడ్డిలో చిన్న కాంట్రాక్ట్‌లు చేసినప్పటికీ జీవితం అప్పటికింకా గాడిలో పడలేదు. 2004లో హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి కూడా మినిమమ్ గ్యారంటీ నా ఉద్యోగమే. అయితే హైదరాబాద్ రావడం మా లైఫ్‌లో గొప్ప టర్నింగ్ పాయింట్. ఒక ఏడాదిలోనే నిలదొక్కుకోగలిగాం. మరో ఏడాదికి భరోసా వచ్చింది. ‘కష్టపడినంత కాలం కష్టపడ్డావు, రోజూ హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్లడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఉద్యోగం మానేయచ్చు కదా’ అన్నారు. చదువుకోవడానికి వచ్చే బంధువుల పిల్లలతో నాకు ఇంటి బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. సమాజం గురించి ఆలోచించే సమయం వచ్చింది కూడా అప్పటి నుంచే. మా ఊరికి అవసరమైన పనులు చేసే వెసులుబాటు కూడా వచ్చింది. భర్త చదువుకున్న స్కూల్ జనగామలో ‘ఇంటిగ్రేటెడ్ సచివాలయం’ పేరుతో పంచాయితీ భవనం కట్టాం. అన్ని ఆఫీసులూ అందులోనే. ఆ తర్వాత లైబ్రరీ, వీథుల్లో ఎల్ఈడీ లైట్లు కూడా వేయించాం. మా ఊరిని చూసి పొరుగు గ్రామాల వాళ్లు కూడా అడిగేవాళ్లు. అలా మరో 30 గ్రామాలకు కూడా ఎల్ఈడీ లైట్లు వేయించాం. మంచి నీటి కోసం ఐదు గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు పెట్టించాం. బీబీపేటలో మా వారు చదువుకున్న స్కూల్‌ని పునర్నిర్మించాం. ఆ స్కూల్‌ని చూసిన వాళ్లు మా వారి చేతికి ఎముకలేదంటుంటారు. కోటితో మొదలు పెట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఆరు కోట్లకు చేరింది. ఆయన బిల్డర్ కావడం తో నాణ్యత విషయంలో రాజీ పడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే... మా ఊరిలో పేదవాళ్లకు ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే. ఆ బడ్జెట్ నుంచి మిగుల్చుకోవడానికే చూస్తారెవరైనా. అత్తమామలు సుశీల – నారాయణ రెడ్డిల పేరిట బీబీపేటలో కట్టించిన స్కూల్ ఆయన మాత్రం ప్రతి ఇంటికి అదనంగా రెండు లక్షలు కలిపి యాభై రెండు ఇళ్లు మంచి క్వాలిటీతో కట్టారు. మన ఊరి వాళ్లకే కదా, లెక్క చూసుకోవడం ఎందుకన్నారు. మా ఊరితోపాటు జంగంపల్లిలో మరో యాభై ఇళ్లను కూడా అలాగే కట్టారు. నాలుగు నెలల కిందట సీతారామపల్లిని దత్తత చేసుకున్నాం. ఆరు వందల జనాభా ఉన్న గ్రామం అది. ఊరంతా డ్రైనేజ్ పనులు, సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయి. ఇక ఇంటిగ్రేటెడ్ సచివాలయం, కమ్యూనిటీ హాలు, లైట్లు... చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇళ్లకు మంచి నీటి సరఫరా లైన్లు మామూలుగా వేస్తే ఊరంతటికీ సమంగా అందవు. కొన్ని ఇళ్లకు ప్రెషర్ బాగా ఉంటుంది, కొన్ని వీథులకు యావరేజ్‌గా, మరికొన్ని ఇళ్లకు అరకొరగా అందుతాయి. ఆ ఇబ్బంది లేకుండా న్యూమాటిక్ సిస్టమ్ అనుసరించాలని ఎక్స్‌పర్ట్‌లతో మాట్లాడుతున్నాం’’ అని వివరించారు రజని. ఇరవై శాతం సమాజం కోసం సమాజం కోసం ఇంతగా చేస్తున్నా ఎప్పుడూ వార్తల్లో కనిపించరామె. ‘‘గ్రౌండ్ వర్క్ నాది, ప్రశంసలందుకునేది మా వారు. మహేశ్‌బాబు నుంచి కేటీఆర్ వరకు ప్రశంస లు కురిపించేది ఆయనకే. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టులో ఇరవై శాతం లాభాలు సొసైటీ కోసమే అనే నియమం పెట్టుకున్నాం. ఆయన లాభాలెంత, మిగులు ఎంత అనే లెక్క నా దగ్గరే ఉంటుంది. అందుకే ఎప్పుడు కొత్త పని తీసుకోవచ్చు, ఎంత బడ్జెట్లో తీసుకోవచ్చనే అంచనా కూడా నాకే బాగా తెలుసు. తన ఖర్చులకు కూడా డబ్బు నేనే ఇవ్వాలి’’ అన్నారామె నవ్వుతూ. వీటితో సంతృప్తి చెందినట్లేనా ఇంకా చేయాలనుకుంటున్నవేమైనా ఉన్నాయా అన్నప్పుడు... తన డ్రీమ్ ప్రాజెక్ట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు రజని. ‘మంచి వైద్యం కోసం మా గ్రామాల వాళ్లు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కువమందికి అనువైన ప్రదేశం చూసి చారిటీ హాస్పిటల్ కట్టించాలి. తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలి. కంఫర్టబుల్‌గా జీవించే అవకాశం వచ్చింది, ఇప్పుడైనా పదిమందికి ఉపయోగపడాలి కదా’ అన్నారామె సౌమ్యంగా. తన బెర్త్‌ను దివ్యాంగుడికి ఇచ్చి తాను నిలబడిన నాటి సౌమ్యతే ఇప్పుడు కూడా ఆమె మాటల్లో. రియల్ లవ్ స్టోరీ మా పరిచయం చాలా సినిమాటిక్‌గా, రీల్ లవ్‌స్టోరీలా జరిగింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి వెళ్తున్నాను. ఆమె కడపకు వెళ్తోంది. చాలా సేపటి నుంచి నిలబడి ఉంది... బహుశా టికెట్ కన్ఫర్మ్ కాలేదేమో అనుకుని పలకరించాను. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్‌కి తన బెర్త్ ఇచ్చి తాను నిలబడి ఉండడం నా మనసును కదిలించింది. అలా మాటలు కలిశాయి. ఆమె రైలు దిగి వెళ్లి పోతే ఇక ఎప్పటికీ కనిపించదేమోనని భయం పట్టుకుంది. మొబైల్ ఫోన్లు లేని రోజులవి. పేపర్ మీద నా అడ్రస్ రాసి, ‘నేను తిరుపతి నుంచి తిరిగి మా ఊరికి వెళ్లేటప్పటికి మీ నుంచి ఉత్తరం ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఆ కాగితాన్నిచ్చాను. నేను కోరుకున్నట్లే ఆమె నుంచి ఉత్తరం వచ్చింది. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో ప్రతి పనిలో నన్ను వెన్నంటి నడిపిస్తోంది. మనం సెటిల్ అయిన తర్వాత లాభాల్లో మిగులును సమాజానికి తిరిగి ఇవ్వాలనే తన పాలసీనే నేను ఫాలో అయిపోతున్నాను. – టి. సుభాష్ రెడ్డి, ఎం.డి, కెడాల్ డెవలపర్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
తల్లీబిడ్డలను బలవంతంగా విడగొడుతున్నారు: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్ యుద్ధంలో తూర్పు ప్రాంతాలపై పట్టుకోసం రష్యా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భారీగా బలగాలను తరలిస్తోంది కూడా. అయితే తమ గడ్డపై, వర్ణించలేని రీతిలో అకృత్యాలకు తెగబడుతోందంటూ ఆరోపిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగాడు. సుమారు ఐదు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను బలవంతంగా రష్యా తమ ఆధీనంలోకి తీసుకుందని ఆరోపించాడు జెలెన్స్కీ. వీళ్లందరినీ రష్యా ఫెడరేషన్ పరిధిలో ఉండే రహస్య స్థావరాల్లో దాచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. బుధవారం రాత్రి.. ఎస్టోనియన్(ఎస్టోనియ) పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్స్కీ, యుద్ధ భయంతో వీడుతున్న ఉక్రెయిన్ పౌరులను.. వాళ్ల వాళ్ల డాక్యుమెంట్లను, వస్తువులను, ఫోన్లను స్వాధీనం చేసుకుని మరీ తరలించుకుని పోతోందని రష్యా బలగాలపై ఆరోపణలకు దిగాడు. అంతేకాదు ఉక్రెయిన్ పిల్లలను రష్యాలోని కుటుంబాలు అక్రమంగా దత్తత తీసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని, తల్లీబిడ్డలను బలవంతంగా వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశౠడు. ఈ విషయంలో యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవాలని కోరాడు జెలెన్స్కీ. ఇక ఇదే ప్రసంగంలో.. రష్యా పాస్పరస్ బాంబులు ప్రయోగిస్తోందని, ఉక్రెయిన్ పౌరులను భయంతో సైన్యం లొంగదీసుకుంటోందని ఆరోపించాడు. అయితే కఠిన ఆంక్షల ద్వారా రష్యాను శాంతి చర్చలకు తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డాడు జెలెన్స్కీ. చదవండి: రష్యాది ముమ్మాటికీ నరమేధమే! -
అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు!
మన జీవితాన్ని మనం రాసుకుంటామా? మరెవరైనా రాస్తారా? యాగ్నెస్ నుదుటిన మదర్ థెరిసా అనే మకుటాన్ని చేర్చింది ఎవరు? అనుకోకుండా ఓ రోజు... నిర్మల అనే యువతి నలుగురు పిల్లలకు అమ్మ కావాలని రాసింది ఎవరు? యాభై ఏళ్లు వచ్చే లోపే డెబ్బై మంది పిల్లలకు తల్లయింది గూడపాటి నిర్మల. మరో ముగ్గురు పాపాయిలకు అమ్మమ్మ కూడా. గుడివాడలో పుట్టిన నిర్మలది ఆంగ్లో ఇండియన్ నేపథ్యం ఉన్న కుటుంబం. హైదరాబాద్, మోతీనగర్‌లో జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్‌లో నలభై మంది పిల్లలతో సాగుతోంది ఆమె జీవితం. అమ్మకు వైద్యం కోసం 2006లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఊహకు కూడా అందని విషయం ఇది. అలాంటి ఏ మాత్రం ఊహించని విషయాలు తన జీవితంలో ఎన్నో జరిగాయన్నారు నిర్మల. తాను ఒక డైరెక్షన్ అనుకుంటే తన ప్రమేయం లేకుండా ఏదో ఓ సంఘటన తన మార్గాన్ని మలుపు తిప్పుతూ వచ్చిందని చెప్పారామె. నాటి రైలు ప్రయాణం ‘‘అమ్మానాన్నలు స్కూల్ హెడ్మాస్టర్లు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయిని. ఇంటర్ తర్వాత లా చదవాలనేది నా కోరిక. అయితే ఆ సెలవుల్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ సంఘటన... నా తోటి ప్రయాణికులు మాతోపాటు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు లెప్రసీ పేషెంట్లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫామ్ మీదకు తోసేశారు. ‘అదేంటి, అలా చేశారు’ అని అడిగితే ‘ఇదెవత్తో పిచ్చి పిల్లలా ఉంద’ని నన్ను ఈసడించుకున్నారు కూడా. అప్పటికి నాకు లెప్రసీ అంటే ఏమిటో తెలియదు. ఇంటికి వెళ్లి మా తాతయ్యను అడిగినప్పుడు వాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పారాయన. అప్పుడు డిగ్రీకి చెన్నైకి వెళ్లి లెప్రసీ సంబంధిత కోర్సు చేశాను. అలాగే టీబీ, హెచ్ఐవీ నిర్మూలన సర్వీస్ కోర్సులు చేశాను. అమ్మ కోసం హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఓ ఆంగ్లో ఇండియన్ ఎంఎల్ఏ సూచనతో బోరబండ, పర్వత్ నగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో సర్వీస్ మొదలు పెట్టాను. ఓ రోజు మాదాపూర్‌లో మాణింగ్ వాక్ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఓ దుర్ఘటన. ఓ తల్లిదండ్రులు ఆటో స్టాండ్ దగ్గర లగేజ్‌తో ఉన్నారు. వాళ్ల నలుగురు పిల్లల్ని అప్పుడే రోడ్డుకు ఒక పక్కగా ఉంచి, తల్లిదండ్రులు సామాను ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఇంతలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఓ లారీ... రాంగ్‌సైడ్ వచ్చి వాళ్లను ఢీకొట్టింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు వచ్చారు. అంటే... నలుగురు చిన్న పిల్లల అమ్మమ్మ – తాత, నానమ్మ –తాతలన్నమాట. వాళ్లు ఆ పిల్లలను చూస్తూ ‘నష్టజాతకులు’ అని ఓ మాట అనేసి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. లెప్రసీ కాలనీ సర్వీస్‌తో అప్పటికే ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు పరిచయం అయ్యారు. వారు ఆ పిల్లలను స్టేట్ హోమ్‌లో చేర్చే బాధ్యత నాకప్పగించారు. నలుగురు పిల్లలకు గార్డియన్‌గా నేనే సంతకం చేసి స్టేట్‌హోమ్‌లో చేర్చాను. అయితే... ఆ బాధ్యత అంతటితో తీరలేదు. స్టేట్ హోమ్ నుంచి ఫోన్ కాల్ ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లైన్లో ఉంది. ‘అమ్మా! మమ్మల్ని హోమ్‌లో చేర్చేటప్పుడు మీరు సంతకం చేశారట. హోమ్ వాళ్లు మమ్మల్ని బయటకు పంపించాలన్నా కూడా మీరే సంతకం చేయాలట. మీరు వచ్చి సంతకం చేస్తే మేము బయటకు వెళ్లిపోతాం. ఇక్కడ ఉండలేం’ ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఎక్కడికి వెళ్తారు. నీకు పదేళ్లు కూడా లేవు. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లికి ఏడాది కూడా నిండలేదు. వాళ్లను నువ్వు ఎలా చూసుకుంటావని అడిగితే సమాధానం లేదు. ‘ఎక్కడికో ఒక చోటకు వెళ్లిపోతాం, ఇక్కడ మాత్రం ఉండలేం’ అదే మంకుపట్టు. అప్పుడు పోలీసుల నుంచి ఓ రిక్వెస్ట్. ఆ పిల్లలను మీరు సంతకం చేసి బయటకు తీసుకురాకపోతే గోడదూకి వెళ్లిపోతారు. ఆ పోవడం రోడ్డు మీదకే. సిగ్నళ్ల దగ్గర బెగ్గర్‌గా మారిపోతారు. వాళ్లను దగ్గర పెట్టుకుని చదివించే మార్గం చూడమన్నారు. దాంతో వాళ్లను మా ఇంటికి తీసుకువచ్చాను. ఆలా ఆ రోజు నలుగురు పిల్లలకు అమ్మనయ్యాను. చంటిబిడ్డను చూసుకోవడానికి మా ఊరి నుంచి ఒక డొమెస్టిక్ హెల్పర్‌ను పిలిపించుకున్నాను. ఆ తర్వాత పోలీసుల నుంచి తరచూ ఓ ఫోన్. అమ్మానాన్నలకు దూరమైన పిల్లల్లో పోలీసుల దృష్టికి వచ్చిన వాళ్లను తెచ్చి వదిలిపెట్టసాగారు. అలా మూడు నెలలకు నా ఇల్లు ఇరవై మంది పిల్లల ఇల్లయింది. అంతమంది పిల్లలను ఇంట్లో ఉంచడానికి ఇంటి ఓనరు అభ్యంతరం చెప్పడంతో పూర్తి స్థాయి హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు మా హోమ్ నుంచి మొత్తం డెబ్బై మంది పిల్లలు సహాయం పొందుతున్నారు. నలభై మంది ఈ హోమ్‌లో ఉన్నారు. పన్నెండు మంది అబ్బాయిలు విజయవాడలో ఉన్నారు. ఎనిమిది మంది సెమీ ఆర్ఫన్లకు ఈ హోమ్ నుంచే భోజనం వెళ్తుంది. వాళ్లకు తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెకు తన పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి శక్తి లేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, భోజనం, దుస్తులు అన్నీ మా హోమ్ చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఉదయం వాళ్ల ఇంటి నుంచి స్కూలుకు వస్తారు, రాత్రికి తల్లి దగ్గరకు వెళ్లిపోతారు. ఇక కాలేజ్‌కెళ్లే వాళ్ల విషయానికి వస్తే... ఎనిమిది మంది ఇంటర్, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై మంది నర్సింగ్, పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఐదుగురు కర్నాటకలో మెడిసిన్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉన్నారు. మొదట నేను ఇంటికి తెచ్చుకున్న ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి, సంతకం చేస్తే వెళ్లిపోతానని ఫోన్ చేసిన అమ్మాయి కూడా ఇప్పుడు కర్నాటకలో మెడిసిన్ చేస్తున్న వాళ్లలో ఉంది. మా పిల్లల్లో ముగ్గురు పూనా, వైజాగ్, బెంగళూరుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక్కొక్కరూ నలుగురు పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్లు ముగ్గురూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రసవాలు కూడా మా హోమ్‌లోనే. ఆ పిల్లలు నన్ను ‘అమ్మమ్మ’ అంటారు. ఆ చిన్న పిల్లలకు నలభై మంది పిన్నమ్మలు. మాది జగమంత కుటుంబం’’ అన్నారు నిర్మల తన పిల్లల మధ్య కూర్చుని వాళ్లను ముద్దు చేస్తూ. నిర్మల ఆఫీసు గదిలో గోడకు మదర్ థెరిసా ఒక బిడ్డను ఎత్తుకున్న ఫొటో ఉంది. ఈ మదర్... చుట్టూ పిల్లలతో ఆ మదర్‌కు మరోరూపంగా కనిపించింది. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లకు కండిషన్లుంటాయి. వాళ్లను ఉద్యోగం మాన్పించకూడదు. పెళ్లికి ముందే కొంత మొత్తం అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. అనాథ అని సంబోధించరాదు. అలాగే తమ అభ్యుదయ భావాలను సమాజం ముందు ప్రదర్శించుకోవడానికి ‘అనాథను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పుకోరాదు. పాట నడిపేది నేను సింగర్‌ని. పాటలు పాడడం ద్వారా మంచి రాబడి ఉండేది. దాంతో హోమ్ నడపడం ఏ మాత్రం కష్టం కాలేదప్పట్లో. థైరాయిడ్ సమస్యతో గొంతుకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పాడలేను. ప్రధాన ఆదాయ వనరు ఆగిపోయింది. పిల్లలకు దుస్తులు, భోజనం వరకు ఇబ్బంది లేదు. మా హోమ్‌ని చూసిన వాళ్లు వాటిని విరాళంగా ఇస్తుంటారు. బర్త్‌డేలు మా పిల్లలతో కలిసి చేసుకోవడం కూడా మాకు బాగా ఉపకరిస్తోంది. స్కూలు, కాలేజ్ ఫీజులు, ఇంటి అద్దెకు మాత్రం డబ్బుగా కావాల్సిందే. డబ్బుగా ఇస్తే దారి మళ్లుతుందేమోననే సందేహం ఉంటుంది. నేను అభ్యర్థించేది ఒక్కటే. నా చేతికి డబ్బు ఇవ్వవద్దు. ఈ పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం, స్కూల్కెళ్లి ఫీజులు చెల్లించడం స్వయంగా వారే చేయవచ్చు. ఏడాది పాటు ఒక బిడ్డను చదివించవచ్చు. మనసుంటే మార్గాలూ ఉంటాయి. – గూడపాటి నిర్మల, జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
దత్తత తీసుకుందాం రండి..!
కరోనా మహమ్మారి మీతో పాటు మమ్మల్నీ ఇబ్బంది పెడుతోంది..అది మీ శరీరంలో ప్రవేశించి ప్రాణాలు తీస్తుంది. మమ్మల్ని ఆకలితో అలమటించేటట్లు చేస్తోంది... కొందరు దాతలు పేదలకు భోజనాలు పెడుతున్నారు.. అలాంటి దాతలే ముందుకొచ్చి మమ్మల్ని దత్తత తీసుకొని మా ఆకలి తీర్చండి.. ఇదీ ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాల వేదన.. ఆరిలోవ (విశాఖ తూర్పు) ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణులను దత్తత ఇస్తున్నారు.. జూ అధికారులు ఇక్కడ జంతువులు, పక్షుల ఆకలి తీర్చడానికి వాటిని దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులకు అవకాశం కల్పిస్తున్నారు. వాటిని మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరంలేదు. దత్తత తీసుకొన్నవారు వాటిని జూలోనే ఉంచి ఆహారం మాత్రమే అందిస్తారు. ఖర్చు మాత్రమే మనం జూ అధికారులకు ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బులతో వన్యప్రాణులకు వారే ఆహారం సరఫరా చేస్తుంటారు.. రెండేళ్లు నుంచి ఆకలి బాధలు.. జూ పార్కు నగరంలో ప్రధానమైన పర్యాటక కేంద్రం. సాధారణ రోజుల్లో 3,000 పైగా సందర్శకులు వెళుతుంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య 4,000 దాటుతుంది. దీని ప్రకారం రోజులో రూ 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు ఆదాయం లభిస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి ఆ ఆదాయానికి గండిపడింది. 2020 మార్చి 23 నుంచి అక్టోబర్ వరకు లాక్డౌన్లో భాగంగా జూ పార్కు మూసేశారు. దానివల్ల సుమారు రూ.4 కోట్లు ఆదాయం కోల్పోయింది. 2021లో మళ్లీ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దానివల్ల మరింత ఆదాయం కోల్పోయింది. సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ వన్యప్రాణులకు జూ అధికారులు ఆహారం అందిస్తారు. ఆదాయం రాకపోవడంతో గతంలో ఆదా చేసిన డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోంది. జూ నిధి ఖాళీ అవుతోందని జూ అధికారులు ఆందోళనలో పడ్డారు. దాతలు ఆదుకోకపోతే ఇక్కడ వన్యప్రాణుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.. ఎంతైనా ఇవ్వవచ్చు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. వాటి కోసం ఒక రోజుకు, నెల రోజులకు, ఏడాదికి వాటికయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయ పన్నులో మినహాయింపు ఉంటుంది. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పండ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పండ్ల ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పండ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికి వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.. జూలో 810కు పైగా వన్యప్రాణులు జూలో ప్రస్తుతం 90 జాతులకు చెందిన 810కు పైగా వన్యప్రాణులున్నాయి. వాటిలో ఏనుగులు, జీబ్రాలు, పులులు, సింహాలు, జింకలు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, నీటి ఏనుగులు, కోతులు, చింపాంజీలు, ఖడ్గమృగం, అడవి కుక్కలు, కణుజులు, అడవిదున్నలు, పాములు, మొసళ్లతో పాటు నెమళ్లు, నిప్పుకోళ్లు, ఈమూలు, హంసలు, మరికొన్ని రంగురంగుల పక్షులు ఉన్నాయి. వాటన్నింటికీ ఆహారం కోసం రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు సహకరించాలని జూ అధికారులు జంతు ప్రేమికులను కోరుతున్నారు. వ్యక్తులు, స్వచ్ఛంద సంఘాలతో పాటు కొన్ని పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఇవ్వడానికి ఇప్పటికే ముందుకొచ్చాయి. మరింత ఎక్కువమంది ఇక్కడ వన్యప్రాణుల దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని జూ అధికారులు కోరుతున్నారు.. ఖడ్గమృగాన్ని మూడేళ్లు దత్తత తీసుకున్న ఐఓసీఎల్ జూలో నకుల్ అని పిలవబడే ఇండియన్ ఖడ్గమృగాన్ని (మగది) ఐఓసీఎల్ ప్రతినిధులు మూడేళ్లు పాటు దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. దీనికోసం జూ క్యూరేటర్ నందనీ సలారియాతో ఐఓసీఎల్ ప్రతినిధులు వరుసగా మూడేళ్లు పాటు దత్తత తీసుకొన్నట్లు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13న ఒక ఏడాదికి సరిపడగా రూ.3 లక్షలు చెక్కును ఐవోసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ జూ క్యూరేటర్ నందనీ సలారియాకు అందజేశారు. ఒక జంతువు/పక్షికి దత్తతకు చెల్లించాల్సిన మొత్తం.. ► ఏనుగుకు ఒక రోజుకు–రూ.1200 ► ఖడ్గమృగానికి ఒక రోజుకు–820 ► నీటి ఏనుగుకు ఒక రోజుకు–600 ► సింహానికి ఒక రోజుకు–600 ► పెద్ద పులికి ఒక రోజుకు రూ.600 ► జిరాఫీకి ఒక రోజుకు రూ.500 ► చిరుత పులికి ఒక రోజుకు రూ400 ► ఎలుగుబంటి ఒక రోజుకు రూ.300 ► చింపాంజీకి ఒక రోజుకు రూ.210 ► అడవి దున్నకు ఒక రోజుకు రూ.200 ► జీబ్రా రెండింటికి ఒక రోజుకు రూ.330 ► తోడేళ్లు రెండింటికి ఒక రోజుకు రూ.300 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 ► చుక్కల దుప్పి ఒక రోజుకు రూ.100 ► రింగ్‌టైల్డ్ లెమూర్కు ఒక రోజుకు రూ.100 ► మొసలి/ఘరియల్ రెండింటికి ఒక రోజుకు రూ.150 ► హంసలు రెండింటికి రెండు రోజులకు రూ.100 ► నక్షిత్ర తాబేళ్లు పదింటికి ఐదు రోజులకు రూ.150 ► సారస్ కొంగ/నిప్పుకోడి/ పాములకు నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 గుడ్లగూబలు నాలుగింటికి ఒక రోజుకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 మకావ్‌లు నాలుగింటికి మూడు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 పీజియన్/నెమళ్లు నాలుగింటికి నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 రామ చిలుకలు/ఆఫ్రికన్ చిలుకలకు ఐదు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 లవ్ బర్డ్స్ పదింటికి ఐదు రోజులకు రూ.100 దాతలు ముందుకు రావాలి... కరోనా కారణంగా రెండేళ్లగా జూ ఆదాయం తగ్గిపోయింది. సందర్శకులు జూకి రావడం మానేశారు. దీంతో ఆదాయానికి గండిపడింది. దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలి. సంచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి వాటి ఆకలి తీర్చడంలో భాగస్వాములు కావాలి. వాటిని దత్తత తీసుకోవడానికి చెల్లించే మొత్తానికి ఆదాయం పన్ను మినహాయింపు ఉంది. ఈ దత్తత పద్దతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులు దత్తత తీసుకొన్నారు. ఇటీవల ఐవోసీఎల్సంస్థ ముందుకొచ్చి ఖడ్గమృగాన్ని మూడేళ్లు పాటు దత్తత తీసుకొంది. స్పందించిన దాతలు 9440810160, 0891–2552081 ఫోన్ నంబర్లకు సంప్రదించాలి. – నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
‘నన్ను ఎందుకు అమ్మేశారు’.. పేరెంట్స్‌పై కోర్టుకెక్కిన కొడుకు!
పుట్టగానే ఆ తల్లిదండ్రులు అతన్ని వేరే వాళ్లకు అమ్మేశారు. నాలుగేళ్లు గడిచాక ఆ పిలగాడిని దురదృష్టం వెంటాడింది. దత్తత తీసుకున్న జంట కూడా ఓ ప్రమాదంలో చనిపోవడంతో మళ్లీ అనాథ అయ్యాడు. గత్యంతరం లేక ఆ పెంపుడు తల్లిదండ్రుల బంధువుల ఇళ్లలో పెరిగి పెద్దయ్యాడు. గూడు చెదిరి పోవడంతో ఎగురుకుంటూ కన్నవాళ్ల చెంతకు చేరే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ బిడ్డకు భంగపాటే ఎదురైంది.. చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో ఉంటున్నాడు 17 ఏళ్ల లియు జుజౌ. బంధువుల ఇళ్లలో జీవనం కష్టమవుతుండడంతో.. మరో దారి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో తనకి అసలు తల్లిదండ్రులు వేరే ఉన్నారని తెలుసుకున్న లియు వారి కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంత కాలం వెతికినా ప్రయోజనం లేకపోయింది. దారులు ఇరుకు అవుతున్న క్రమంలో.. ఆన్లైన్లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆపై ఇంటి పేరు ఆధారంగా.. ఎలాగోలా కన్నతండ్రిని కనిపెట్టగలిగాడు. 21 డిసెంబర్ 2021లో లియు.. తన తండ్రిని కలిశాడు. కానీ, అక్కడ అతనికి ట్విస్ట్ ఎదురైంది. లూయు తన కొడుకే కాదని డింగ్ షుంజిక్కులన్ బయటికి పొమ్మన్నాడు. దీంతో పోలీసుల సహకారంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా లియు.. డింగ్ కుమారుడే అని తేలింది. కథలో మరో ట్విస్ట్ ఏంటంటే.. డింగ్‌తో ఉంది లియు కన్నతల్లి కాదు. తన భార్యకు(లియు కన్నతల్లి).. ఆమె ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వడానికే పుట్టిన బిడ్డను(లియు) అమ్మేసినట్లు డింగ్ ఒప్పుకున్నాడు. లియుని అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బును పంచుకుని ఆ జంట విడాకులతో వేరు పడింది. కొంతకాలానికి మళ్లీ వివాహం చేసుకుని వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారు. పేరెంట్స్ దరిద్రపుగొట్టు ప్లాష్‌బ్యాక్ గురించి తెలిశాక లియు ఛీ అనుకున్నాడు. ఆపై కన్నతల్లిని వెతుక్కుంటూ వెళ్లాడు లియు. కొడుకుని సాదరంగా హత్తకున్న తల్లి.. కొడుకు వినిపించిన డిమాండ్ విని షాక్ తింది. తనకు ఇల్లు లేదని, సాయం చేయాలని కోరాడు ఆమెను. ఆమె దానికి నిరాకరించింది. దీంతో కన్నవాళ్లను ఒక దగ్గరికి చేర్చి పంచాయితీ పెట్టాడు లియు. తనకు ఇల్లు కట్టించి తీరాల్సిందేనని లియు డిమాండ్ చేయగా.. చదువుకోవడానికి ఫీజులు చెల్లిస్తామని, బతకడానికి కొంత డబ్బు ఇస్తానని ఆ తండ్రి మాత్రం అంగీకరించాడు. దీంతో లుయు కొర్టుకెక్కాడు. తనకు కోర్టులో న్యాయం జరుగుతందని ఆశిస్తున్నాడు. తనను పెంచుకున్న తల్లిందండ్రులు ఇచ్చిన ఇల్లు మొత్తం శిధిలావస్థలో ఉందని, కనీసం దానిని బాగు చేసిచ్చినా చాలని అంటున్నాడు పాపం లియు. -
'పల్లె నాడి పట్టే మెడికో'.. ఎన్ఎంసీ వినూత్న ఆలోచన
వారు వైద్య విద్యార్థులు.. రెండు వారాలకోసారి మీ ఊరిలో నేరుగా మీ ఇంటికి వస్తారు. మీతో, మీ ఇంట్లో వారితో మాట్లాడుతారు. అందరి ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. ఏదైనా సమస్య ఉంటే తగిన సూచనలు చేస్తారు. మీ ఆరోగ్య సమస్యకు కారణాలను గుర్తించి పరిష్కారాలను సూచిస్తారు. మంచి అలవాట్లు, పరిశుభ్రత కోసం ఏం చేయాలో చెప్తారు. అదే సమయంలో వైద్యం, ఆరోగ్యంపై తామూ కొంత నేర్చుకుంటారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన సిఫార్సులు అమల్లోకి వస్తే.. ఇది అమల్లోకి రానుంది. సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కోర్సులో గ్రామాలు/ప్రజల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సిఫా ర్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావ డం, అదే సమయంలో వైద్య విద్యార్థుల్లో వివిధ వ్యాధులు, క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. సమాజంలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్ఎంసీకి చెందిన యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈడీ) ఒక నివేదికను రూపొందించింది. అందులో కీలక సిఫార్సులు చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉండనుంది. క్షేత్రస్థాయికి వెళ్లేలా.. ఎన్ఎంసీ సిఫార్సుల ప్రకారం.. ఒక్కో బ్యాచ్ ఎంబీ బీఎస్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవా లి. బ్యాచ్‌లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. వారు ఆ కుటుంబా ల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను గుర్తించి, ఏవైనా సమస్యలు వస్తే ప్రాథమిక సలహా ఇవ్వాలి. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వారికి స్థానిక ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్సు తొలి ఏడాదిలో కనీసం 10 సార్లయినా గ్రామాలను సందర్శించాలి. వారు గ్రామా ల్లో గడిపే సమయాన్ని కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందేలా పాఠ్యాంశాలు, సిలబస్‌ను రూపొందిస్తారు. ఇక ఈ దత్తత కార్యక్రమంతో విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళతారు. ఎంబీబీఎస్ తొలి ఏడాది కోర్సు నుంచే ప్రజలతో మమేకమవుతారు. గ్రామాల ఆరోగ్యానికి.. గ్రామాలను దత్తత తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో స్వయంగా ప్రజల ఆరో గ్య సమస్యలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇదివారిలో సామాజిక బాధ్యత, అవగాహన పెరగడానికి తోడ్పడనుంది. సరైన ఆహార అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, అనారోగ్యం బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే వీలు కలుగుతుంది. ఒక్కో విద్యార్థికి ఏడు కుటుంబాల వరకు బాధ్యత ఇవ్వడం వల్ల.. ఆయా కుటుంబాల్లోని వారిలో ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే తాము చదివే మెడికల్ కాలేజీకి రమ్మనడానికి, ఏదైనా ఆస్పత్రికి రిఫర్ చేయడానికి వీలుంటుంది. ఇలా మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఆయా గ్రామాలు ఆరోగ్యంగా మారుతాయని చెప్తున్నారు. 33 కాలేజీలు.. 20 వేల మంది విద్యార్థులు రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 165 బ్యాచ్‌ల్లో కలిపి దాదాపు 20 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. వీరితోపాటు ఆయుష్, డెంటల్ విద్యార్థులకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడితే మరో ఐదారు వేల మంది అవుతారు. ఇంతమందికి గ్రామాల దత్తత బాధ్యత ఇస్తే ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందుతాయని.. విడతల వారీగా కొత్త గ్రామాల్లోనూ వైద్య చైతన్యం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. పల్లెల్లో ఏం చేయాలంటే? ►తమకు కేటాయించిన ఐదు నుంచి ఏడు కుటుంబాల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలి. ►కుటుంబాల్లోని వారు ఎటువంటి జబ్బులతో బాధపడుతున్నారో గుర్తించి నోట్ చేసుకోవాలి. ► ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారుంటే.. అవసరమైన వైద్య సలహాలు ఇవ్వాలి. ► ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. ► రోజువారీ ఆహారపు అలవాట్లు, వ్యసనాలు వంటివి గుర్తించాలి. ► రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేయాలి. ► సమీపంలోని ప్రభుత్వ డయాగ్నొస్టిక్ సెంటర్లలో వారికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు చేయించాలి. ► కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ టెస్టులు చేయించాలి. ఈ మేరకు వారిని ప్రోత్సహించాలి. ► పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు ఇతర చెకప్‌లు చేయించుకోవాల్సిందిగా సూచించాలి. ► అవసరమైనప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటూ.. వైద్య సలహాలు ఇవ్వాలి. -
జపాన్ నుంచి నెహ్రూ జూ పార్క్‌కు అరుదైన అతిథులు! జనవరిలోనే..
అరుదైన అతిథులు అడుగిడనున్నాయి. చెంగు చెంగున గంతులేస్తూ కనువిందు చేయనున్నాయి. రానున్న వేసవిలో చిన్నారులను, పెద్దలను అలరించనున్నాయి. ఇక్కడి వాతావరణంలో కంగారూలు మనుగడ సాగిస్తాయా? లేదా అనే మీమాంస మధ్య జపాన్ నుంచి నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్క్)లోకి జత కంగారూలు రానున్నాయి. జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా వీటిని ఇక్కడికి తీసుకురానున్నారు. – సాక్షి, సిటీబ్యూరో జపాన్‌లోని యోకోహామా జంతు ప్రదర్శనశాలలోని జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర, రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ, విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ జనరల్ అనుమతి లభించిన తర్వాత కంగారూల తరలింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తానికి ఎండాకాలం సెలవులు మొదలయ్యేనాటికి కంగారూలు రంగప్రవేశం చేస్తాయని నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ వెల్లడించారు. జపాన్‌లోని యోకోహామా జూ నుంచి కంగారూలు, మీర్‌క్యాట్ (అడవి పిల్లి)కి బదులుగా యోకోహామా జూకు ఆసియా సింహాన్ని ఇవ్వనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. గ్లాండ్ ఫార్మా ద్వారా ఎన్‌క్లోజర్ ►జూకు రానున్న కంగారూల కోసం ఎన్‌క్లోజర్ నిర్మాణ పనులకయ్యే ఖర్చును భరించడానికి దుండిగల్‌లోని గ్లాండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. కంగారూల ఎన్‌క్లోజర్ నిర్మాణ పనుల నిమిత్తం రూ.20 లక్షల చెక్కును గ్లాండ్ ఫార్మా అధికారులు ఇప్పటికే జూ అధికారులకు అందజేశారు. ఎన్‌క్లోజర్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ►కరోనా మహమ్మారి సీజన్లో నిధుల కొరత కారణంగా జూ అభివృద్ధికి రాజీ పడకుండా జంతువుల కందకాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని, జంతువులను దత్తత తీసుకుని జూలోని వన్యప్రాణుల సంరక్షణలో పాలుపంచుకునేందుకు పౌరులు, కార్పొరేట్ సంస్థలు అందరూ ముందుకు రావాలని క్యూరేటర్ విజ్ఞప్తి చేశారు. 173 జాతులు.. 1,800 ప్రాణులు.. 380 ఎకరాల్లో విస్తరించిన నెహ్రూ జూపార్క్‌లో ప్రస్తుతానికి 173 జాతులకు చెందిన 1,800 జీవాలు ఉన్నాయి. కొత్తగా రాబోయే కంగారూలు, మీర్ క్యాట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతువుల మార్పిడిలో భాగంగా గత ఏడాది నెహ్రూ జూపార్కుకు రెండు హిప్పొపొటమస్, సింహం లాంటి తోకలుండే రెండు ముకాన్, బూడిద రంగు తోడేలు, జిరాఫీల జంట, నాలుగు కింగ్ కోబ్రాలను తీసుకొచ్చారు. జంతు మార్పిడి కింద తీసుకువచ్చినవి ఇవీ.. ►రాజ్‌కోట్ జంతు ప్రదర్శనశాలకు చెందిన ఆసియా జాతి సింహం ఆడ బదులుగా మగ ఆసియాటిక్ సింహం ఆగస్టులో వచ్చింది. ►రెండు జతల అడవి కుక్కలు, కొండ చిలువలు 2 జతలు మంగళూర్ బయోలాజికల్ పార్క్ నుంచి తీసుకువచ్చారు. వీటికి బదులుగా ఒకటి మగ, మూడు ఆడ మూషిక జింకలను జూ పార్కు నుంచి ఇచ్చారు. పెద్ద ఎగ్రెట్ 3 మగ , 3 ఆడ, గ్రే పెలికాన్ 1 మగ, 1 ఆడ మంగళూర్ పిలికుల జూకు అందజేశారు. ►త్రివేండ్రం జూ నుంచి సౌత్ అమెరికా వైట్ రియా 2 జతలు, బ్రౌన్ రియా 2 జతలకు ఎగరని పక్షి జాతి, జత ఎలుగుబంటి, తొండ జాతి ఇగ్వానా సెంట్రల్ అమెరికన్ జత వచ్చే జనవరిలో జూకు వచ్చే అవకాశం ఉంది ►జపాన్‌లోని ఓకోహామా జూ నుంచి ఒక జత బూడిద రంగు కంగారూ, 1 జత మీర్ క్యాట్ జూకు రానున్నాయి. బదులుగా 1 ఆడ ఆసియా సింహాన్ని ఇస్తారు. దత్తత తీసుకోవడం హర్షణీయం జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్‌లోని యోకోహామా జూపార్కు నుంచి నెహ్రూ జూపార్కుకు జత కంగారూలు రెండు నెలల్లో రానున్నాయి. కంగారులు జూకు వచ్చిన తర్వాత ఏడాది అనంతరం వాటిని దత్తత తీసుకుంటామని పలు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు రావడం సంతోషకర విషయం. రానున్న రోజుల్లో జంతు మార్పిడిలో భాగంగా దేశంలోని ఇతర జూల నుంచి కూడా జంతువులు రానున్నాయి. నగర జూ నుంచి కూడా కొన్ని వన్యప్రాణులు బదులుగా ఇస్తాం. – రాజశేఖర్, నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ చదవండి: 2 రోజుల కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిమానాలు అక్షరాలా రూ. 1.5 కోట్లు! -
ఆ రెండింటిని దత్తత తీసుకున్న ఉపాసన.. ఎందుకంటే ?
Upasana Konidela Adopted Two Lions In Nehru Zoological Park: మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో ఫిట్నెస్, ఆయుర్వేదం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సైతం షేర్ చేస్తుంటారు. తాజాగా రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన కొణిదెల. వాటి సంరంక్షణ బాధ్యతలు, ఆహారపు ఖర్చులను ఏడాదిపాటు చూసుకోనున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజశేఖర్‌కు అందించారు ఉపాసన. పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఉపాసన తెలిపారు. క్యూరేటర్, అతని బృంద సభ్యులను ఆమె అభినందించారు. జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని, వాటి పరిశుభ్రతగా ఉంచడంలో సిబ్బంది అంకితభావంపై ఉపాసన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఉపాసనకు నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజసేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెది మంచి మనసు అని కొనియాడారు. వన్యప్రాణుల పరిరక్షణపై వారు చూపించిన నిబద్ధత ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇలా పార్కులోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పౌరులు ముందుకు రావాలని కోరారు. ఇదీ చదవండి: ట్రాన్స్‌జెండర్ కమ్యునిటీతో ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, ఆశీర్వాదాలు -
నేపాలీ అమ్మాయిని దత్తత తీసుకున్న బండ్ల గణేష్
Bandla Ganesh Adopted Nepali Girl: కమెడియన్, నిర్మాతగా సత్తా చాటిన బండ్ల గణేష్..ఇటీవలె హీరోగానూ మారాడు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే బండ్లగణేష్‌కు ప్రత్యేకమైన అభిమానులు సైతం ఉన్నారు. కరోనా సమయంలో సోషల్ మీడియాలో సాయం అడిగిన కొందరికి తనవంతు సాయం అందించిన మంచి మనసు చాటుకున్నాడు బండ్ల గణేష్. తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రం ఈ పాపను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఆ పాట తమ ఇంట్లో మెంబర్ అయిపోయిందని, ఇప్పుడు తామందరినీ బెదిరించే స్థాయికి వచ్చిందని ఫన్నీగా పేర్కొన్నాడు. @ganeshbandla అన్న నిన్ను నిందించి అగౌరవ పారిచే అంతా స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికి సరిపోదు అన్న.....🙏💯 pic.twitter.com/w0FDBDDH68 — Rock ⭐ Rockey🔥👑 (@RavitejanaiduS2) November 27, 2021 -
కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..
కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఈ సోమవారం నాడు చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమం యథావిధిగా నడుస్తోంది. మీడియా అటెన్షన్ కూడా ఈ విషయం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు అది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం. కన్నపేగు చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక అనుపమ చేతిలో పెట్టడమే తరువాయి. బిడ్డను చూపించండి! ఆదివారం నాటి రాత్రి పోలీసులు బిడ్డతో కేరళ రాజధాని తిరువనంతపురం చేరారు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశం మేరకు డీఎన్ఏ పరీక్ష కోసం సోమవారం నాడు బిడ్డ నుంచి నమూనా సేకరించారు. డీఎన్ఏ పరీక్ష తమ కళ్ల ముందే జరగాలని అనుపమ పట్టుపట్టింది. తన బిడ్డ నమూనాలను మార్చివేయరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించింది అనుపమ. ఒక్కసారి బిడ్డను కళ్లారా చూస్తానని ప్రాధేయపడింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆమె పడుతున్న ఆవేదన, ఆందోళన అందరికీ అర్థమవుతోంది. నమూనా సేకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు చెబుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. అనుపమ, ఆమె ప్రేమికుడు, బిడ్డ నమూనాలు స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చేరినట్లు ఆ రాష్ట్రంలోని కౌముది మీడియా తెలిపింది. నమూనాలు సరిపోలినట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత న్యాయపరమైన నిబంధనలు పూర్తి చేసి బిడ్డకు అనుపమకు ఇస్తారు. అప్పటివరకు బిడ్డను జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారు. ఆ బిడ్డ ఈ బిడ్డేనా! జరుగుతున్న పరిణామాలు అనుపమకు సంతోషాన్నిస్తున్నట్లే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా చెప్తోంది. అలాగే పోలీసులు తీసుకువచ్చిన బిడ్డ అనుపమకు పుట్టిన బిడ్డ అనడానికి తార్కికపరమైన ఆధారాలు అందుతున్నాయి. బిడ్డ మాయమైన తర్వాత ఒకటి– రెండు రోజుల తేడాలో ఆ రాష్ట్రంలో అమ్మ తొట్టిల్ (ఉయ్యాల) పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారిలో ఒక బిడ్డకు గత నెలలో పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఓ బిడ్డను దత్తత ఇచ్చినట్లు తెలిసింది. ఆ బిడ్డ కోసం గాలించి ఆదివారం నాడు విజయవంతంగా ఛేదించారు. కన్నపేగు పోరాటం వృథా కాదని, ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అనుపమ ఒడికి చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇదీ జరిగింది! అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లయింది. ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి. అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. ఆమె కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. ‘బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు’ కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు. తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా కావడంతో పోలీసులు మొదట్లో ఆమె కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. ఆమె పోలీసులు, శిశు సంక్షేమశాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి తన బిడ్డను తనకు ఇప్పించమని వేడుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. అనుపమ తండ్రి చేసిన ఘోరం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 18వ తేదీన వెలువడిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన పోలీసులు బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువెళ్లారు. బిడ్డ రాష్ట్రానికి చేరిన వార్త సోమవారంనాడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. -
మంత్రి కేటీఆర్ చొరవ.. ఐదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న కలెక్టర్
సాక్షి, నిర్మల్: ‘రోషిణి నువ్వు చాలా హుషారుగా ఉన్నావ్. బాగా చదవాలి..’ అంటూ కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖి ఓ చిన్నారిని ప్రశంసించారు. ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామానికి చెందిన భూమవ్వ అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం చనిపోయింది. ఆమెకు భర్త కూడా లేకపోవడంతో కూతురు రోషిణి(5) అనాథలా మారింది. ఈ విషయం ఇటీవల ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేయగా.. కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖికి రీట్వీట్ చేశారు. మంత్రి సూచన మేరకు ఆయన బుధవారం ఎడ్బిడ్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్.. చిన్నారి రోషిణితో మాట్లాడారు. నీ పేరేంటి అని ప్రశ్నించగా.. రోషిణి అని సమాధానమిచ్చింది. చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి Request @WCDTelangana and @Collector_NML to take full care of this child’s well-being https://t.co/kDOqgnOPV3 — KTR (@KTRTRS) November 17, 2021 ‘‘నువ్వు స్కూల్‌కెళ్తున్నవా..’’ అనగా.. బాలబడికి వెళ్తున్నానని చెప్పింది. ‘‘మీ అంగన్వాడీ టీచర్ ఎవరు..’’ అనగా.. ‘‘అగో ఆమెనే..’’ అని చూపించింది. ‘‘అంగన్వాడీలో ఏం పెడుతున్నరనగా.. ‘‘అన్నము, గుడ్డు..’’ అంటూ మెరుస్తున్న కళ్లు.. ఆడిస్తున్న చేతులతో చూపించగానే కలెక్టర్ ఒక్కసారిగా నవ్వారు. అనంతరం రోషిణి తన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. శిశుసంరక్షణ అధికారులతో మాట్లాడి, రోషిణిని ఆదిలాబాద్ శిశుగృహానికి పంపించారు. గ్రామస్తులు దాతల ద్వారా సేకరించిన రూ.1.80లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ శివప్రసాద్, సీడీపీవో శ్రీమతి పాల్గొన్నారు. Many thanks Collector Garu 👍 https://t.co/9LDueudg6Q — KTR (@KTRTRS) November 17, 2021 -
కడుపు తరుక్కుపోయే దారుణం.. నోటికి టేప్ వేసి, కుక్కల బోనులో బంధించి
వాషింగ్టన్: ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులకు భారమై అనథాశ్రమంలో చేరారు. ఓ రోజు ఇద్దరు దంపతులు వచ్చి.. ఆ అక్కాచెల్లళ్లను దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ దొరికిందని ఆ చిన్నారులు ఎంతో సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేవదు. చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులు రాక్షసులు, సైకోలు. ఈ క్రమంలో దత్తత తీసుకున్న వారిలో ఓ చిన్నారిని అత్యంత పాశవీకంగా హత్య చేశారు. ఈ దారుణం అమెరికాలో సంచలనం సృష్టించింది. కనీసం అనాథశ్రమంలో ఉంటేనైనా చిన్నారి బతికి ఉండేది కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్లు. ఆ వివరాలు.. హవాయికి చెందిన దంపతులు ఐజాక్ కలువా (52), లెహువా కలువా (43) దంపతులు హత్య గావించబడిన ఇసాబెల్లాను 2018లో దత్తత తీసుకున్నారు. ఇసబెల్లా కంటే ముందు ఆమె సోదరిని 2009లో దత్తత తీసుకున్నారు కలువా దంపతులు. ఆ తర్వాత ఇసబెల్లా మరో ఇద్దరు తోబుట్టువులను 2018, 2020లో దత్తత తీసుకున్నారు. ఇసాబెల్లా తల్లిదండ్రులు వైమన ప్రాంతంలో నివసిస్తుండేవారు. వారు కటిక పేదరికం అనుభవిస్తుండటంతో పిల్లలను కలువా దంపతులకు దత్తతకు ఇచ్చారు. (చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష) కలువా దంపతులు రాక్షసులకు మారుపేరులాంటి వారు. చిన్నారులను దత్తతకు తీసుకున్న వీరు వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే ఆరేళ్ల ఇసాబెల్లాను అత్యంత దారుణంగా హింసించేవారు. చిన్నారికి సరిగా తిండి పెట్టేవారు కారు. ఆకలికి తట్టుకోలేక రాత్రిళ్లు లేచి ఆహారం కోసం వెదికేది ఇసాబెల్లా. ఈ క్రమంలో కలువా దంపతులు ఇసాబెల్లాను బంధించడం కోసం కుక్కల బోనును ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించారు. చిన్నారిని హత్య జరిగిన నాడు.. రోజు లానే ఇసాబెల్లాకు ఆహారం పెట్టకుండా హింసించారు. రాత్రిళ్లు ఆహారం కోసం వెదకకుండా ఉండేందుకు గాను ఇసాబెల్లా నోటికి, చేతులకు డక్ టేప్ వేసి కుక్కల బోనులో బంధించారు. ఆ తర్వాత బోనును బాత్రూంలో పెట్టారు. (చదవండి: కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని!) ఈ క్రమంలో ఇసాబెల్లా కన్నా ముందు కలువా ఇంటికి దత్తత వచ్చిన ఆమె సోదరి.. చెల్లెలు బెడ్ మీద కనిపించకపోవడంతో ఇల్లంతా వెదికింది. బాత్రూంలో కుక్కల బోనులో ఉన్న ఇసాబెల్లాను గుర్తించి.. బెడ్రూంలోకి తీసుకువచ్చింది. అప్పటికే ఇసాబెల్లా అపస్మారక స్థితిలో ఉంది. దీని గురించి బాధిత చిన్నారి అక్క కలువా దంపతులకు చెప్పింది. వారు వచ్చి ఇసాబెల్లాను బాత్‌టబ్‌లో పడుకోబెట్టి నీరు పెట్టారు. కానీ ఇసాబెల్లా మేల్కొలేదు. చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించుకున్న కలువా దంపతులు.. మిగతా పిల్లలకు తెలియకుండా బాలిక మృతదేహాన్ని మాయం చేశారు. దీని గురించి ఎవరికి చెప్పవద్దని ఇసాబెల్లా అక్కను బెదిరించారు. అనంతరం బాత్‌టబ్, కుక్కల బోనును ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఐజాక్ కలువ తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి.. ఆస్పత్రిలో చేరాడు. (చదవండి: కాబోయే కోడలు కన్నకూతురని తెలిసింది.. ట్విస్ట్ ఏంటంటే ) 2021, సెప్టెంబర్ 12న ఇసాబెల్లాను హత్య చేసిన నెల రోజుల తర్వాత అనగా అక్టోబర్ 12న కలువా దంపతులు అనుమానం రాకుండా ఉండటం కోసం చిన్నారి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు నెల రోజుల పాటు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇసాబెల్లా కోసం వందలాది మంది వలంటీర్లు గాలించారు. చిన్నారి వారి సొంత తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి ఉంటుందని భావించి.. వైమన ప్రాంతం అంతా గాలించారు. చిన్నారి అదృశ్యానికి సంబంధించి చిన్న ఆధారం కూడా దొరక్కపోవడంతో పోలీసులు డిటెక్టివ్ సాయం కూడా తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇసాబెల్లా అక్క జరిగిన దారుణం గురించి డిటెక్టివ్‌కు వివరించింది. ఈ క్రమంలో పోలీసులు కలువా దంపతుల ఆన్లైన్ ఆర్డర్ హిస్టరీ గురించి చెక్ చేయగా కుక్కల బోను ఆర్డర్ చేసినట్లు తెలిసింది. (చదవండి: పిల్లల దత్తత పేరుతో రూ.8.34 లక్షలు వసూలు.. ఆపై) ఆధారులు అన్ని సేకరించిన హోనలులూ పోలీసు డిపార్ట్మెంట్ అధికారులు కలువా దంపతులును అరెస్ట్ చేశారు. విచారణలో కోర్టు కలువా దంపతులు క్షమాభిక్షకు అనర్హులని తేల్చింది. చిన్నారి కనీసం అనాథశ్రమంలో ఉంటే బతికి ఉండేదని.. ఈ హింస తప్పేదని కోర్టు విచారణ వ్యక్తం చేసింది. కలువా దంపతులు కఠిన శిక్షకు అర్హులని తేల్చింది. చదవండి: ఆమెకు గర్భసంచితోపాటు.. ప్రేమ సంచి కూడా ఉంది.. -
మా పల్లెకు మళ్లొచ్చిపోతరా.. సీఎం సారూ..
సాక్షి, హైదరాబాద్: సీఎం ప్రత్యేక దృష్టితో ఉమ్మడి శామీర్‌పేట మండలం నుంచి కొన్ని గ్రామాలను కలుపుతూ మూడుచింతలపల్లి కేంద్రంగా మండలం ఏర్పడి ఐదేళ్లు పూర్తయ్యింది. నూతనంగా ఏర్పడిన మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల కోసం రూ.66కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో అధికారులు, కాంట్రాక్టర్లు ఆగమేఘాల మీద భవనాలను నిర్మించారు. రెండేళ్లుగా ఈ భవనాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా ‘సీఎం కేసీఆర్ సారూ’వచ్చి ప్రారంభిస్తారని అంటున్నారు. ప్రారంభోత్సవం పేరుతో ఇలా భవనాలను నిరుపయోగంగా మార్చడం ఎంత వరకు సమంజసమంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. – శామీర్‌పేట్ సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.66 కోట్ల కేటాయింపు... మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం, నాగిశెట్టిపల్లి, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, లింగాపూర్ తాండా తదితర గ్రామాలను 2017లో సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయా గ్రామాల అభివృద్ధి కోసం రూ.66 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రతీ గ్రామానికి ఓ మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాల్, డంపింగ్‌యార్డ్, ధోబీఘాట్లు, మోడల్ వైకుంఠధామాలు, డ్వాక్రా, గ్రామ పంచాయతీ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటి తదితర అభివృద్ధి పనులు చేపట్టాని నిర్ణయించారు. ఆగమేఘాల మీద పనులు పూర్తి... సీఎం కేసీఆర్ దత్తత మండలం కావడంతో రాష్ట్ర స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించారు. దీంతో కాంట్రాక్టర్లు ఆగమేఘాల మీద పనులు పూర్తి చేశారు. భవనాలు, పలు అభివృద్ధి పనులు పూర్తయినా సీఎం ముహూర్తం ఖరారు కాకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే అధికారులు, పాలకులు కార్యకలాపాలు కొనసాగిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ( చదవండి: Snehalata Mogili: ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు కలెక్టర్ ప్రసవం ) అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.... ► మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, కేశవరం గ్రామాల్లో నిర్మించిన ఫంక్షన్హాల్లు, భవనాలు అందుబాటులోకి రాకపోడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గ్రామాలకు దూరంగా ఈ భవనాలు నిర్మించడంతో మందుబాబులకు మంచి సిట్టింగ్ స్పాట్‌గా మారాయి. ► ఫంక్షన్‌హాల్‌లలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు, విద్యుత్ వైర్లు, స్విచ్‌లు వాడుకలోకి రాకముందే పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు, ఫంక్షన్‌హాల్‌ల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసిన మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. నిర్మానుష్య ప్రాంతం కావడంతో పోకిరీలు గంజాయి సైతం పీల్చుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ► ఇప్పటికైనా సీఎం కేసీఆర్ దత్తత మండలమైన మూడుచింతలపల్లికి సమయం కేటాయించి.. భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శిథిలావస్థలో గ్రామపంచాయతీ భవనం సీఎం దతత్త తీసుకున్న కేశవరం గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థలో ఉంది. అందులో కార్యకలాపాలు కొనసాగించడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు మళ్లీ పాడవుతున్నాయి. ఇకనైనా సీఎం కేసీఆర్ నూతన భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలి. – నర్సింలు, కాంగ్రెస్ పార్టీ మూడుచింతలపల్లి మండల అధ్యక్షుడు వ్యామోహమంతా అధికారం మీదనే.. సీఎం కేసీఆర్‌కు అధికారం మీద ఉన్న మోజు ప్రజల సమస్యల ఉండదు. అసలు మూడుచింతలపల్లి మండలం తన దత్తత మండలమని గుర్తుందో లేదో. ప్రజాధనంతో కేసీఆర్ కుటుంబం మాత్రమే భోగాలు అనుభవిస్తోంది. కాని ప్రజలకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది. ఎన్నికలు వచ్చినపుడే సీఎం కేసీఆర్‌కు ప్రజలు, అభివృద్ధి కార్యకమాలు గుర్తొస్తాయి. ఇకనైనా భవనాల ప్రారంభానికి సమయం కేటాయించాలి. – సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, మేడ్చల్ జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ చదవండి: Tsrtc: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’ -
నా బిడ్డను నాకివ్వండి! ప్లీజ్!!
అనుపమ ఓ బిడ్డకు తల్లి. బిడ్డ పుట్టి మొన్నటికి (ఈ నెల 19వ తేదీకి) ఏడాదైంది. సంతోషంగా బిడ్డ తొలి పుట్టిన రోజును పండగ చేసుకోవాల్సిన సమయం. ఈ ఏడాది లోపు పాపాయి బోర్లా పడడం, పాకడం, అన్నప్రాశన, తల నీలాలు తీయడం... ప్రతిదీ ఓ వేడుకగా జరిగి ఉండాల్సింది. కానీ ఏ ఒక్క వేడుకా జరగలేదు. పుట్టినరోజు వేడుక కూడా జరగలేదు. అనుపమకు తన బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ప్రసవం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాక ముందు వరకే బిడ్డను పొత్తిళ్లలో చూసుకుంది అనుపమ. హాస్పిటల్ నుంచి తల్లీ బిడ్డ వేరయ్యారు. ఇంతవరకూ కలవలేదు. బిడ్డ కోసం అనుపమ పోరాడుతోంది. ఆ (కేరళ) రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా విన్నవించుకుంది. అయినా సరే... బిడ్డ ఆచూకీ అగమ్యంగానే ఉంది. మరీ ఇంత వ్యూహాత్మకమా! ఇలాంటి సంఘటనల్లో సాధారణంగా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిడ్డ మాయం కావడం చూస్తుంటాం. పిల్లలు లేని మహిళలు పేషెంట్ల రూపంలో హాస్పిటల్లో సంచరిస్తూ చంటిబిడ్డను ఎత్తుకెళ్లిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చంటిబిడ్డ మాయం కావడానికి కారణం ఆ బిడ్డ తాత జయచంద్రన్. అతడు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. బిడ్డ ఏమైందని అడిగితే అతడు ‘నా కూతురు అనుపమ అనుమతితో ఆమె బిడ్డను దత్తత ఇచ్చేశాను’ అని చెప్తున్నాడు. ‘తన మానసిక, ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా బిడ్డను పోషించే స్థితిలో లేదని, ఈ కారణాల వల్ల బిడ్డను దత్తత ఇవ్వడానికి అంగీరిస్తున్నట్లు... నా కూతురు సంతకం చేసింది చూడండి’ అని అనుపమ సంతకంతో కూడిన పత్రాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇదీ కారణం! అనుపమది మలబార్ ఎరావా సామాజిక వర్గం. ఆ సామాజికవర్గానికి సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు ఉంది. ఆమె ప్రేమించిన అజిత్ దళిత క్రిస్టియన్. అనుపమ ప్రేమను ఆమె తండ్రి అంగీకరించకపోవడానికి కారణం సామాజిక వర్గమే. గర్భవతిగా ఉన్న కూతురికి మంచి మాటలు చెప్పి ప్రసవానికి పుట్టింటికి తీసుకువచ్చారు ఆమె తల్లిదండ్రులు. అనుపమ అక్కకు పెళ్లయ్యే వరకు అనుపమ పెళ్లి, బిడ్డ వివరాలను గోప్యంగా ఉంచుదామని అనుపమను నమ్మించారు. డెలివరీ తర్వాత హాస్పిటల్ నుంచి అనుపమను నేరుగా జయచంద్రన్ స్నేహితుని ఇంటికి తీసుకు వెళ్లారు. బిడ్డను మరోచోట సురక్షితంగా ఉంచామని చెప్పారు. కొన్నాళ్లకు అనుపమను పుట్టింటికి తీసుకువెళ్లారు, ఆ తీసుకువెళ్లడమే ఆమెను గదిలో బంధించారు. బిడ్డ వివరాలు అడిగితే చెప్పేవాళ్లు లేరు. పైగా అనుక్షణం ఆమెతో ఇంట్లో వాళ్లు ఎవరో ఒకరు నీడలా అంటిపెట్టుకునే ఉండేవారు. అనుపమ అక్క పెళ్లికి ఊరి వాళ్లను ఆహ్వానించే సమయంలో అనుపమను కూడా వెంట తీసుకువెళ్లారు. అనుపమ ఎక్కడా నోరు విప్పకూడదనే ఆంక్ష విధించి మరీ. అలాగే నడుచుకుంది అనుపమ. అక్క పెళ్లి తర్వాత తన బిడ్డను ఇవ్వమని, అజిత్ దగ్గరకు వెళ్తానని అడిగింది. ‘కుటుంబ ఆస్తిలో తనకు వారసత్వంగా రావాల్సిన హక్కు వదులుకుంటున్నట్లు’ సంతకం చేయమన్నాడు తండ్రి. అలాగే అతడు చెప్పిన చోటల్లా సంతకం చేసింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల అసలు కుట్ర బయటపడింది. ‘బిడ్డను నీ అంగీకారం ప్రకారమే దత్తత ఇచ్చేశాను’ అనేశాడు అనుపమ తండ్రి. ఇన్నాళ్లూ బిడ్డ కోసం తండ్రి చెప్పినట్లల్లా చేసింది. ఇప్పుడా బిడ్డ ఆచూకీనే లేనప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా బిడ్డను దక్కించుకోవాలనే మొండిపట్టుదలతో ఇల్లు దాటి వచ్చేసింది. అజత్తోపాటు పోలీసులను ఆశ్రయించింది. తన బిడ్డ ఆచూకీ తెలిస్తే చెప్పమని కనిపించిన బంధువులను, కుటుంబ స్నేహితులను అర్థిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారులు, పార్టీ అగ్రశ్రేణి నాయకులను కలిసి న్యాయం చేయమని మొరపెట్టుకుంది. ఆఖరుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. ఇంత జరిగినా బిడ్డ ఏమైందో ఎవరికీ తెలియడం లేదు. తన డెలివరీ లోపు ఒకసారి తల్లిదండ్రులు తనకు అబార్షన్ చేయించడానికి కూడా ప్రయత్నించినట్లు అనుపమ చెప్తోంది. తన గోడు విన్న వాళ్లందరూ సానుభూతితో స్పందిస్తున్నారు, కానీ బిడ్డ ఆచూకీ మాత్రం లభించలేదు. ‘బిడ్డకు పాలివ్వడానికి నోచుకోలేని తల్లిగా తాను, తల్లిపాలకు దూరమైన తన బిడ్డ దురదృష్టవంతుల’మని కన్నీరు పెట్టుకుంటోంది అనుపమ. కేరళ రాష్ట్రం మనదేశంలో అత్యున్నత శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని అభ్యుదయపథంలో నడుస్తున్న రాష్ట్రంగా పరిగణిస్తాం. అలాంటిది ఈ డిజిటల్ యుగంలో కూడా ‘కులం, మతం’ మనిషి జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. బిడ్డను తల్లికి దూరం చేస్తున్నాయి. బిడ్డ ఎక్కడ ఉన్నట్లు? అనుపమ ఈ ఏడాది మార్చిలో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చింది, అదే నెలలో పోలీసును ఆశ్రయించింది, పోరాడగా పోరాడగా... విషయం మీడియాలో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని, కానీ ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పాడు అజిత్ ఆవేదనగా. ఇక జయచంద్రన్ మాత్రం అనాథ బిడ్డల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మతొట్టిల్ పథకం ఉయ్యాల్లో వేసినట్లు ఒకసారి చెప్పాడు, శిశు సంక్షేమ శాఖ కమిటీకి అప్పగించినట్లు మరోసారి చెప్పాడు. శిశు సంక్షేమ కమిటీ నిర్వహకురాలు సునంద ఈ విషయంలో స్పందిస్తూ... ’ఏప్రిల్‌లో బిడ్డ తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ కోసం వచ్చినట్లు చెబుతూ తమ వద్దకు వచ్చిన ప్రతి బిడ్డ గురించిన రికార్డు ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నతల్లితో స్వయంగా మాట్లాడిన తర్వాత మాత్రమే బిడ్డను స్వీకరిస్తామని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో అమ్మతొట్టిల్కి వచ్చిన ఇద్దరు శిశువుల్లో ఒక శిశువును దత్తత ఇచ్చేయడం జరిగింది. మరో శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. నిజానిజాలు పోలీసు దర్యాప్తులో మాత్రమే తేలతాయని, ఒకవేళ దత్తత ఇచ్చిన శిశువే అనుపమ బిడ్డ అయితే ఆ బిడ్డను తిరిగి అనుపమ దంపతులకు ఇవ్వడం చట్టరీత్యా చాలా కష్టమని చెప్పింది సునంద. -
వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ
పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో టీచర్లదే ప్రముఖ పాత్ర. అయితే, తరగతిలో ఉన్న విద్యార్థుల్నే కాదు.. వీధుల్లో చిల్లర డబ్బులు అడుగుతూ (యాచిస్తూ) తిరుగుతున్న వీధి బాలలను కూడా బడిలో చేర్పించి, తానే స్వయంగా పాఠాలు బోధిస్తూ... వారి జీవితాలనే మార్చేస్తున్నారు మనోరమ టీచర్. ఆసరాలేని పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తూ వారిని చేరదీసి, ఆశ్రయమివ్వడమే కాకుండా విద్యాబుద్ధులు సైతం నేర్పించి భవిష్యత్‌ను బంగారు మయం చేస్తుండడంతో మనోరమను అంతా మమ్మీజీ అని పిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ పరివాహక జిల్లా బల్లియాలో పుట్టింది మనోరమ. చిన్నప్పటినుంచి ఆడుతూ పాడుతూ రోజూ గుడికి వెళ్తుండేది. గుళ్లో వచ్చే సాంబ్రాణీ, పూల పరిమళాలను ఆస్వాదిస్తోన్న మనోరమకు.. గుడినుండి బయటకు వచ్చేటప్పుడు మాసిన, చిరిగిపోయిన దుస్తులు ధరించి దీనంగా యాచించే పిల్లలు కనిపించేవారు. వాళ్లు కొన్నిసార్లు మనోరమ దగ్గరకు వచ్చి ప్రసాదం పెట్టమని అడిగేవారు. చిన్న లడ్డు ముక్క ఇస్తే వాళ్ల సమస్య తీరిపోతుందా? అనిపించేది తనకు. కానీ ఏం చేయాలో అప్పట్లో అర్థం కాలేదు. వాళ్లకెలా సాయం చేయాలి? అన్న ఆలోచనలతోనే ఇంటర్ కాగానే బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసి, తర్వాత పూర్వాంచల్ యూనివర్శిటీలో బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సంపాదించింది. పాఠాలతోపాటు.. పోస్టింగ్ డెహ్రాడూన్‌లో రావడంతో అక్కడ టీచర్‌గా పనిచేస్తూనే, ఆల్ ఇండియా రేడియోలో అంధ విద్యార్థులకు కథల పుస్తకాలను చదివి వినిపించేది. కథల విన్న విద్యార్థుల వ్యక్తం చేసే సంతోషం ఆమెకు చాలా సంతృప్తినిచ్చేది. ఇంతలోనే మనోరమకు పెళ్లి అవడం, భర్త లక్నోలో ఉండడంతో తను కూడా లక్నో వెళ్లింది. లక్నోలో కూడా గుడికి వెళ్లినప్పుడు యాచించే పిల్లలు కనిపించేవారు. చిన్నప్పటినుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్న మనోరమ... యాచించే పిల్లల వద్దకు వెళ్లి ఇలా ‘అడుక్కోవడం తప్పు, మీరు ఈ వయసులో ఇటువంటి పనులు చేయకూడదు. చదువుకోవాలి’ అని హితవు చెప్పేది. ఆమె మాటలు వినడానికి పిల్లలు గుంపుగా పోగయ్యేవారు. అప్పుడు ఆ పిల్లలకు స్నానాలు చేయించి, కొత్తబట్టలు తొడిగి, తలకు నూనె రాసి, దువ్వి వాళ్లను అద్దంలో చూపిస్తూ ‘చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో’... అడుక్కోవడం అంటే దేవుడిని కించపరచడంతో సమానమని చెప్పి, అడుక్కోవద్దని వారించేవారు. ఈ మాటలు విన్న పిల్లలు, కొంతమంది తల్దిండ్రులు నిజమే కదా! అని అర్థం చేసుకుని తమ పిల్లలను స్కూళ్లలో చేర్చి చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. మనోరమ పనిచేసే స్కూలు, ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పించి, వారి పిల్లల యాచకత్వాన్ని మాన్పించారు. దత్తత సెంటర్.. మనోరమ ప్రారంభంలో డెభ్బై మంది దాకా పిల్లలను స్కూళ్లలో చేర్పించింది. రోజురోజుకి నిరాశ్రయ యాచక పిల్లల సంఖ్య పెరగడం, వాళ్లను ఆదరించే వారు లేకపోవడం వంటి కన్నీటి గాథలకు చలించి పోయిన మనోరమ వారికోసం దత్తత కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. 2004లో ‘జమి అప్ని ఆస్మా మేరా’ పేరుతో దత్తత కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్లో ఇల్లువాకిలి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, నా అనేవారు లేని వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది. ఎవరైనా ఈ సెంటర్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే వారికి దత్తత ఇస్తుంది. అలా ఇప్పటిదాకా పదకొండు వందలమంది పిల్లలను యాచన నుంచి మాన్పించగలిగింది. వీరిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది క్యాటరింగ్, డ్రైవర్స్, హౌస్‌కీపింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు బీఏ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయిలైతే బ్యూటీపార్లర్, కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ వర్క్ లు నేర్చుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మనోరమ భర్త కూడా తనకి అన్ని పను ల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సాయం చేయడం వల్ల ఆమె ఇంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగారు. లక్నోలో యాచకత్వం చేసే పిల్లల సంఖ్య కూడా తగ్గింది. నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లల్ని చేరదీసి బడికి పంపిస్తూ, భవిష్యత్‌ను మారుస్తున్న మనోరమను అంతా ‘మమ్మీజీ’ అని పిలుస్తున్నారు. అవార్డులు.. టీచర్‌గా పాఠాలు చెప్పి సరిపెట్టుకోకుండా స్కూలు బయట ఉన్న పిల్లల్ని స్కూలుకు వచ్చేలా చేసి వారి జీవితాలనే తీర్చిదిద్దిన మనోరమను గుర్తించిన హిందుస్థాన్ టైమ్స్ ‘ఉమెన్ ఎచీవర్స్ అవార్డుతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘గోమతి గౌరవ్ సమ్మాన్’ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది టీచర్‌గా రిటైర్ అయిన మనోరమ తన సమాజసేవను కొనసాగిస్తున్నారు. భర్తతో మనోరమ -
ఆమెకు గర్భసంచితోపాటు.. ప్రేమ సంచి కూడా ఉంది..
స్త్రీలందరికీ గర్భసంచి ఉంటుంది. కాని అమెరికా టీచరమ్మ క్రిస్టిన్ గ్రేకు ప్రేమ సంచి ఉంది. జీవితంలో మగతోడు లేకుండా జీవించాలనుకున్న క్రిస్టిన్ అనాథ ఆడపిల్లలకు అమ్మ కాదలుచుకుంది. మున్ని, రూప, మోహిని, సోనాలి, సిగ్ధ... 2013తో మొదలయ్యి 2020లోపు ఐదుమంది మన దేశపు అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకుంది క్రిస్టిన్. ఆడపిల్లలు అనాథాశ్రమంలో కంటే ఇళ్లల్లో కూతుళ్లుగా పెరగడం మంచిది అంటుందామె. ఆ కూతుళ్లను సొంత కూతుళ్లుగా అడాప్ట్ చేసుకునే అమ్మను మించిన ప్రేమ అందరికీ ఉండొద్దూ... 2015. గుజరాత్. కచ్‌లోని అనాథ బాలికల కేంద్రం ‘కచ్ మహిళా కల్యాణ్ కేంద్ర’లోని మూడున్నరేళ్ల బాలికను దత్తత తీసుకోవడానికి అమెరికా నుంచి క్రిస్టిన్ వచ్చింది. ఆ బాలిక పేరు రూప. సాధారణంగా అనాథ బాలికలను దత్తత తీసుకునేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు. కాని వారంతా రూపను దత్తత తీసుకోవడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఆ పాపకు ముక్కు లేకపోవడమే. ఆ పాపను కన్నతల్లి చెత్త కుప్పలో పారేస్తే కుక్కలు ముక్కును కొరికేశాయి. కొనప్రాణంతో ఉన్న రూపను కాపాడి పెంచారు. ఇప్పుడు ఆ పాపను ఎంతో ప్రేమగా దత్తత తీసుకోవడానికి వచ్చింది క్రిస్టిన్. ‘ఈ పాపకు కూడా ఒక కుటుంబం ఉండే హక్కు ఉంది’ అందామె. ‘పాపకు తగిన వయసు వచ్చాక అమెరికాలో ముక్కుకు సర్జరీ చేయిస్తాను’ అని కూడా అంది. ఆమె గొప్పతనానికి అందరూ తల వొంచి నమస్కరించారు. రూపకు ఒక గొప్ప తల్లి దొరికింది. 2013. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటీలో సెకండరీ టీచర్‌గా పని చేస్తున్న క్రిస్టిన్ గ్రేకు 39 ఏళ్లు వచ్చాయి. జీవితంలో తారసపడిన మగవారు ఎవరూ ఆమెకు పెళ్ళి బంధంలోకి వెళ్లదగ్గ గట్టివాళ్లుగా కనిపించలేదు. ‘నేను నా శేషజీవితాన్ని ఒంటరిగా గడపదలుచుకున్నాను’ అని నిర్ణయం తీసుకుందామె. జీవించడానికి కావలసినవి ఆమె వద్ద ఉన్నాయి– మాతృత్వ భావన తప్ప. ‘అమ్మను కాలేకపోయాను కదా’ అనుకుంది. కొన్నాళ్లు ఆలోచించాక ‘నేనే కనాలా? ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారు. వారిని దత్తత తీసుకుంటాను’ అని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆమె అన్వేషణ మొదలైంది. మొదట నేపాల్ నుంచి తీసుకోవడానికి బోలెడు డబ్బు ఖర్చు పెట్టింది. తీరా అడాప్ట్ చేసుకునే సమయానికి అమెరికాలో నిబంధన వచ్చింది– నేపాల్ నుంచి దత్తత తీసుకోరాదని. ఆ తర్వాత ఆమె ఇండియాను ఎంచుకుంది. రెండేళ్ల ప్రయత్నం తర్వాత ఇక్కడి దత్తత ఏజెన్సీ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ‘పాప ఉంది. అయితే ఆమెకు ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. తీసుకుంటారా?’ అని. ఆ పాప పేరు మున్నీ. వెంటనే సంతోషంతో క్రిస్టిన్ అంగీకరించింది. కాని తండ్రి ‘ఆ తీసుకునేదేదో మన దేశంలోని తెల్లమ్మాయిని తీసుకోవచ్చు కదా’ అన్నాడు. క్రిస్టిన్ ఆ మాటకు నొచ్చుకుంది. తండ్రి సర్దుకున్నాడు. అంతే కాదు మున్నీని అమెరికా తీసుకురావడంలో కావలసిన ధన సహాయం చేస్తూ ‘మున్నీ గ్రే’ కోసం అని చెక్ రాసి ఇచ్చాడు. అలా క్రిస్టిన్ జీవితంలో మొదటిసారి అమ్మ అయ్యింది. రెండేళ్లు గడిచాయి. మళ్లీ భారత్ నుంచి ఫోన్ వచ్చింది– ముక్కు లేని అమ్మాయి ఉంది తీసుకుంటారా అని. ముక్కు లేకపోతే పాప పాప కాకుండా పోతుందా... నేను అమ్మనవుతాను అంది క్రిస్టిన్. అలా రూప ఆమె జీవితంలోకి వచ్చింది. కాని రూప కొన్నాళ్ల పాటు రోజంతా ఏడుస్తూ ఉండేది. అప్పటికే దత్తతకు వచ్చిన మున్నీకి, రూపకు అసలు పడేది కాదు. ‘రూపను దత్తత తీసుకుని తప్పు చేశానా?’ అని అనుకుంది క్రిస్టిన్. కాని ఒకరోజు హటాత్తుగా మున్ని,రూప బెలూన్‌తో ఆడుకోవడం మొదలెట్టారు. క్రిస్టిన్ కన్నతల్లి వారితో జతయ్యింది. సంతోషాలు క్రిస్టిన్ జీవితంలో మొదలయ్యాయి. మన దేశంలో అనాథలకు కొదవలేదు. కని వదిలిపెట్టేవారు, ఇళ్ల నుంచి పారిపోయేవారు, భిక్షాటన కోసం ఎత్తుకు రాబడ్డవాళ్ళు, అయినవారిని కోల్పోయిన వారు... అలా మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు... దత్తత తీసుకుంటారా అంటే సరే అంది క్రిస్టిన్. మోహిని, సోనాలి ఆమె జీవితంలోకి వచ్చారు. ‘ఇప్పుడు నా కుటుంబం నిజంగానే కొంచెం పెద్దదయ్యింది’ అంది క్రిస్టిన్. అప్పటికే స్కూల్ జీతం చాలదని రియల్ ఎస్టేట్‌లో దిగిన క్రిస్టిన్ తన పిల్లల కోసం ఎక్కువ సంపాదించడానికి కావలసిన పనులన్నీ చేయసాగింది. నలుగురు ఆడపిల్లల తల్లి తను. ఎంత ఖర్చు ఉంటుంది. ‘నేను ఇంట్లో నుంచి ఒక్క క్షణం బయటకు వెళ్లడానికి ఇష్టపడను. నా పని కంప్యూటర్ మీదే చేస్తాను. నా సమయం అంతా ఆ నలుగురు పిల్లల నవ్వుల్ని, కొట్లాటల్ని చూడటమే సరిపోతుంది’ అంటుంది క్రిస్టిన్. ఇంతవరకు కూడా ఆమె సగటు స్త్రీ అనే అనుకోవచ్చు. కాని ఆమెకు డౌన్ సిండ్రోమ్ ఉన్న అనాథ అమ్మాయిల పరిస్థితి ఏమిటి... అలాంటి ఒక అమ్మాయిని దత్తత తీసుకుందాం అని ఎంచి మరీ డౌన్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిని 2020లో అమెరికా తెచ్చుకుంది. ఐదుగురు పిల్లల తల్లి క్రిస్టిన్ ఇప్పుడు. అమ్మల్ని మించిన అమ్మ. సంతోషంగా జీవించాలని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఆ సంతోషం కోసం కొందరు పిల్లల్ని వద్దు అనుకుంటుంటే క్రిస్టిన్లాంటి వాళ్లు తమకు పుట్టకపోయినా పిల్లలు కావాలనుకుంటున్నారు. జీవితం అర్థవంతం చేసుకోవడం ఇలాంటి వారి వల్లే అవుతుంది. వెల్డన్ క్రిస్టిన్. -
చక్కగా సంరక్షిస్తే ‘దత్తత’కు ఓకే
సాక్షి, అమరావతి: కోరుకున్న వారికి అనాథ బాలలను సంరక్షణకు అప్పగించిన అనంతరం.. రెండేళ్లపాటు ఆ బాలలను సంరక్షకులు బాధ్యతతో చూస్తారనే నమ్మకం అధికారులకు కలిగితే దత్తత ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పోస్టర్ కేర్ (సంరక్షణ)కు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకనుగుణంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అవసరమైన కసరత్తు చేపట్టింది. బాలల సంరక్షణ ఇలా.. పిల్లలు లేనివారు, అనాథలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకునే ఆదర్శవాదులు, ఎవరులేని వారిని పెంచి పెద్దచేయాలనుకునే సంస్థలు బాలల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. వాటిపై మహిళా శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, పోలీస్ తదితర శాఖలు ఆరా తీసిన అనంతరం ఆయా వ్యక్తులు, సంస్థలకు బాలలను అప్పగించేలా అధికారిక అనుమతి ఇస్తారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరేళ్లలోపు బిడ్దలను మాత్రమే దత్తత ఇస్తుంటారు. ఆరేళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలను సంరక్షణ(పోస్టర్ కేర్)కు అప్పగిస్తారు. సంరక్షకులు వారిని ఎలా చూస్తున్నారనే దానిపై ప్రతి ఆరు నెలలకు ఒక మారు అధికారులు పర్యవేక్షిస్తారు. ఇలా రెండేళ్లపాటు అధికారుల స్వీయ పరిశీలన అనంతరం.. నమ్మకం కలిగితే దత్తతకు అనుమతిస్తారు. అలాగే 8 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాలలను కోరుకున్న సంరక్షకులకు అప్పగిస్తారు. వారిని సంరక్షకులు ఎలా చూస్తున్నారని ఏడాదిపాటు అధికారులు పరిశీలించిన అనంతరమే సంతృప్తికరంగా ఉంటే పూర్తిస్థాయిలో దత్తతకు అనుమతిస్తారు. అలాగే దత్తతతో నిమిత్తం లేకుండా బాలల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటామని ముందుకు వచ్చే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి పోస్టర్ కేర్(సంరక్షణ)కోసం అధికారులు అప్పగించనున్నారు. రాష్ట్రంలో 3,354 దరఖాస్తులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సంరక్షకులకు బాలలను అప్పగించే కార్యాచరణ చేపడతాం. రాష్ట్రంలోని జిల్లా కేంద్రంగా నిర్వహించే బాలల సంరక్షణ కేంద్రాల్లో 18 ఏళ్ల లోపు బాలలు 143 మంది ఉన్నారు. వారిలో 75 మంది బాలలతోపాటు 68 మంది విభిన్న ప్రతిభావంతులున్నారు. అనాథ బాలలను ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 3,354 మంది సంరక్షకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 2 ఏళ్లలోపు బాలలను దత్తతకు ఇవ్వాలని కోరినవారు 2,304 మంది ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు తీసుకుని పరిశీలించి బాలలను సంరక్షణకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. -
ZOOలో జంతువులను దత్తత తీసుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణులకు తమవంతు సేవ చేయాలనుకునే వారికి నెహ్రూ జూలాజికల్ పార్కు స్వాగతం పలుకుతోంది. వన్యప్రాణులను దత్తత తీసుకోవాలనుకునేవారికి ఎర్రతివాచీ పరుస్తోంది. జూపార్కును తిలకించేందుకు వస్తున్న సందర్శకులు తమకు నచ్చిన జంతువును లేదా పక్షిని ఎంచుకుని వాటి ఆలనా పాలనకయ్యే ఖర్చులను చెల్లించి దత్తత స్కీమ్‌లో చేరుతున్నారు. ఇటీవల ఓ కుటుంబంలోని చిన్నారులు అయిదు పక్షులను మూడు నెలల పాటు దత్తతకు స్వీకరించడమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులతో కలసి క్యూరేటర్ వీవీఎల్ సుభద్రా దేవికి అందజేశారు. వన్యప్రాణుల దత్తత ద్వారా ఏడాదికి జూకు కోటి రూపాయల ఆదాయం వస్తోంది. ఏడాది జూ బడ్జెట్ రూ.15 కోట్లుగా ఉంది. పుట్టిన రోజు సందర్భంగా.. పక్షులను దత్తతకు స్వీకరించిన బేబీ సహస్ర శ్రీ, మాస్టర్ చర్విక్ తమ పుట్టిన రోజు వేడుకకు ఖర్చు చేసే మొత్తాన్ని పక్షుల ఆహారం కోసం ఇచ్చారు. సాధారణ సందర్శకులతో పాటు మెగా కోడలు కొణిదెల ఉపాసన, మహేష్‌బాబు కుమార్తె ఘట్టమనేని సితార, మాజీ ఐపీఎస్ అధికారి ఎన్ఎస్ రామ్‌జీ, తుమ్మల రచన చౌదరి, గ్లాండ్ ఫార్మా కంపెనీ యానిమల్ అడాప్షన్ స్కీమ్‌లో చేరారు. ఎస్బీఐ ఇప్పటికే ఇక్కడి పెద్ద పులులను దత్తతకు వరుసగా ప్రతి ఏడాది స్వీకరిస్తూ వస్తోంది. ఫార్మారంగ దిగ్గజం గ్లాండ్ ఫార్మాతోపాటు సినీనటుల కుటుంబ సభ్యులు, అవిశ్రాంత ఉద్యోగులు, ఐటీరంగ నిపుణులు ఉన్నారు. దత్తత ఇలా.. జూలోని వన్యప్రాణులను దత్తత తీసుకోవాలంటే జూ పార్కుకు వెళ్లి క్యూరేటర్‌ను సంప్రదించాలి. జూలోని మీకు నచ్చిన జంతువు లేదా పక్షులను ఎంపిక చేసుకోవాలి. దత్తత తీసుకున్న వన్యప్రాణి నివసించే ప్రదేశంలో మీరు దత్తత తీసుకున్నట్లు పేరు వివరాలు బోర్డుపై రాసి పెడతారు. దత్తత తీసుకున్న వన్యప్రాణిని చూడడానికి మీకు జూలో అనుమతి ఉంటుంది. సంప్రదించాల్సిన నంబర్లు: 040– 24477355, 94408 10182. ఎంతో సంతృప్తిగా ఉంది వ్యప్రాణుల పట్ల చిన్నప్పటి నుంచే సేవ చేయాలని ఉండేది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో జూలోని పక్షులను దత్తత తీసుకొవాలని నిర్ణయించాం. పుట్టిన రోజుకు అయ్యే ఖర్చుతో మూగ జీవాల ఆలనపాలన చూసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. – సహస్ర శ్రీ -
వదిలేశారా కన్నా! నీ కోసం మేమున్నాం
సాక్షి,ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆ కన్న తల్లికి ఏం కష్టమొచ్చిందో.. లేక ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. భూమిపై పడిన కాసేపటికే ఆ పసికందు కన్నవారికి దూరమై.. సజీవంగా.. ఓ అట్టపెట్టెలో.. శ్మశానవాటిక వద్ద కనిపించడం కలకలం రేపింది. ఏడో నెలలోనే పుట్టినప్పటికీ ఆయుర్దాయం గట్టిదేమో.. పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఆ పసికందును అక్కున చేర్చుకున్నారు. ఆ చిన్నారి ఆయువును నిలిపేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు 108 నియోనేటల్ అంబులెన్స్ సిబ్బంది ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గుర్తు తెలియని ఓ గర్భిణి నాలుగు రోజుల క్రితం ఏడో నెలలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తరఫు వారు ఆ బిడ్డ చనిపోయాడనుకున్నారో లేక మరేవైనా కారణాలతో వద్దనుకున్నారో కానీ.. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు శ్మశానవాటిక వద్ద బాక్స్‌లో పెట్టి వదిలేశారు. ఆ పెట్టెలోనే సజీవంగా ఉన్న ఆ పసికందు క్యార్క్యార్ మంటూ ఏడుస్తూండటం వినిపించి.. అక్కడే ఉన్న ఓ వ్యాన్ డ్రైవర్ శివ దగ్గరకు వెళ్లి చూశాడు. అట్టపెట్టెలో అనారోగ్యంతో ఉన్న పసికందును గమనించాడు. విషయం తెలియడంతో స్థానిక మల్లికార్జున నగర్‌కు చెందిన తుంపాటి వెంకటేష్, దేవి దంపతులు ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో దేవుడే ఆ బిడ్డను ఇచ్చాడని భావించారు. పసికందు అస్వస్థతకు గురవడంతో తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో శనివారం సాయంత్రం వెంకటేష్ దంపతులు ఆ బిడ్డను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకువచ్చారు. అయితే శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొవ్వూరులోని 108 నియోనేటల్ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆ అంబులెన్స్ ఈఎంటీ శాంతకుమార్, పైలట్ బుల్లిరాజు వెంటనే ఇక్కడకు చేరుకుని, ఆ పసికందుకు అత్యవసర వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు సురక్షితంగా తరలించారు. ఐసీడీఎస్ అధికారులకు, పశ్చిమ గోదావరి జిల్లా 108 జిల్లా మేనేజర్ కె.గణేష్‌కు దీనిపై సమాచారం అందించారు. ఏడో నెలలో పుట్టిన పసికందును నిర్దయగా బాక్సులో పెట్టి శ్మశానవాటిక వద్ద వదిలివేయడం చూపరులను కలచివేసింది. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఆ పసికందును తన భార్య దేవి దగ్గరుండి చూసుకుంటోందని ఆమె భర్త వెంకటేష్ తెలిపారు. పసికందు ప్రాణాలతో ఉంటే తమకు అదే పదివేలని ఆయనన్నారు. -
పిల్లల దత్తత పేరుతో రూ.8.34 లక్షలు వసూలు.. ఆపై
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): సంతానం లేని వారికి పిల్లలను దత్తత ఇప్పిస్తానంటూ ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.8.34 లక్షలు వసూలు చేసిన ఓ వ్యక్తి తర్వాత పరారయ్యాడు. దీంతో బాధితులు జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా నర్సాపూర్ కాలనీకి చెందిన నల్ల రాజేశ్ జగిత్యాల మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. స్థానిక ద్వారకానగర్‌కు చెందిన సీహెచ్.వెంకటేశ్వర్లు, శ్వేత దంపతులకు సంతానం కలగకపోవడంతో పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రాజేశ్ వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి, తాను ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగినని చెప్పాడు. ఇప్పటివరకు నాందేడ్, గోవా, మహారాష్ట్ర నుంచి పిల్లలను తీసుకువచ్చి చాలా మందికి దత్తత ఇప్పించానని నమ్మించాడు. ఆయన వద్ద రెండు రూ.2.46 లక్షలు తీసుకున్నాడు. గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన వెంగళదాస్ గంగాధర్–మాధవి దంపతులనూ సంప్రదించి, రూ.2.36 లక్షలు తీసుకున్నాడు. మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మల్యాల కనకయ్య–పున్నమ్మ దంపతులు రాజేశ్‌ను కలిసి రూ.3.46 లక్షలు ఇచ్చారు. వీరందరికి 2, 3 రోజుల్లో పిల్లలను దత్తత ఇప్పిస్తానని నమ్మించాడు. తర్వాత ఫోన్ చేస్తే రేపు మాపు అంటూ దాటవేశాడు. డబ్బులు తీసుకొని నెలలు గడుస్తున్నా పిల్లలను దత్తత ఇప్పించకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో జగిత్యాలలోని మాతా, శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, బాలల సంరక్షణ కేంద్రానికి వెళ్లి రాజేశ్ గురించి ఆరా తీయగా అతను ప్రభుత్వ ఉద్యోగి కాదని తేలింది. శుక్రవారం సాయంత్రం జగిత్యాల పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ జయేశ్‌రెడ్డి శనివారం తెలిపారు. కాగా పిల్లల దత్తత పేరుతో రాజేశ్ జిల్లావ్యాప్తంగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: బావ కోసం దళంలో చేరి... -
రాహుల్ గాంధీ పేరున ‘అర్జున’ దత్తత
బెంగళూరు: జూన్ 19 న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 51 వ పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద కార్యకర్తలు అర్జునను దత్తత తీసుకున్నారు. ఇంతకు ఎవరీ అర్జున అనుకుంటున్నారా.. తెల్ల పులి. కర్ణాటకలోని విజయనగర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బృందం హంపిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్ పార్క్‌లో ఉన్న అర్జున అనే తెల్లపులిని ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకుంది. బల్లారి, విజయనగర గ్రామీణ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సిద్దూ హల్లెగౌడ, అతని స్నేహితులు జూన్ 19 న దత్తత తీసుకోవడానికి కర్ణాటక జూ అథారిటీకి రూ .1 లక్ష మొత్తాన్ని చెల్లించారు. ఈ సందర్భంగా హల్లెగౌడ మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాము. అందులో భాగంగానే నిధుల కొరత ఎదుర్కొంటున్న జూకు సాయం చేసినట్లు ఉంటుందని భావించి.. మా నాయకుడి పేరు మీద ఇలా పులిని దత్తత తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము” అని తెలిపాడు. దత్తత ప్రక్రియ సాధారణంగా ఆన్లైన్లో జరుగుతుందని త్వరలోనే ధ్రువీకరణ పత్రం అందజేస్తామని జూ అధికారులు తెలిపారు. ఇటీవల, కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపా, జూలను నిర్వహించడానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ.. జంతువులను దత్తత తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నటుడు విజ్ఞప్తి తరువాత గత కొన్ని వారాలుగా వ్యక్తులు, సంస్థల నుంచి 1 కోటి రూపాయలకు పైగా విరాళాలు వచ్చినట్లు జూ అధికారులు తెలిపారు. చదవండి: కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని! -
మానవత్వం చాటుకున్న లేడీ కానిస్టేబుల్
ముంబై: ఖాకీలు అంటే కరుడుగట్టిన కఠినాత్ములే అనుకుంటే పొరపాటు. వారిలో కూడా మానవతావాదులు ఉంటారు. తోటి వారికి కష్టం వచ్చిందంటే చాలు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా సాయం చేయడానికి ముందుకు వస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ కథనం ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది. ఈ దశాబ్దపు మదర్ థెరీసా అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతలా మెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే సదరు మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రెహనా షేక్ ఈ మేరకు ఉదారత చాటారు. ఒక స్కూలుకు చెందిన 50 మంది నిరుపేద పిల్లలను ఆమె దత్తత తీసుకున్నారు. ఆ వివరాలు.. ముంబైలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రెహనా కొద్ది రోజుల క్రితమే ఎస్సై టెస్ట్ పాసయ్యారు. ఆమె భర్త కూడా డిపార్ట్మెంట్లోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఇక వారి కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వారందరి బాగోగులు చూడటమే కాక రెహనా ఇప్పుడు ఏకంగా మరో 50 మందిని దత్తత తీసుకోవడం అంటే మామూలు కాదు. ‘‘గతేడాది నా కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటికి వచ్చిన నా స్నేహితురాలు ఒక పాఠశాలకు చెందిన కొన్ని ఫొటోలు నాకు చూపించింది. అక్కడి పిల్లలను చూసిన తరువాత వారికి నా సహాయం అవసరమని నేను గ్రహించాను. వారంతా మారుమూల గ్రామాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసింది. దాంతో ఆ 50 మంది పిల్లలను దత్తత తీసుకున్నాను. 10 వ తరగతి వరకు వారి విద్యా ఖర్చులను నేను భరిస్తాను అని తెలిపాను. ఇక నా కుమార్తె పుట్టిన రోజు, ఈద్ కోసం దాచిన డబ్బును వారికి ఇచ్చాను” అని కానిస్టేబుల్ రెహనా షేక్ వెల్లడించారు. ఇక గతేడాది మహమ్మారి సమయంలో రక్తం, ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్ కావాలంటూ తనను ఆశ్రయించిన వారందరికి తన శక్తి మేరకు సాయం చేశారు రెహనా. బయటి వారికే కాక.. డిపార్ట్మెంట్ వారికి కూడా సాయం చేశారు. ఇక రెహనా చేస్తున్న సేవలను నగర కమిషనర్ హేమంత్ నాగ్రేల్ ప్రశంసించారు. సన్మానం చేసి ప్రశంసా పత్రం ఇచ్చారు. చదవండి: తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు.. -
కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని!
భారతదేశాన్ని సందర్శించడానికి ఎంతోమంది విదేశీయులు వస్తుంటారు. వీరిలో ఎక్కువమంది వచ్చిన పని చూసుకుని వెళ్లేవారే. కానీ న్యూజెర్సీకి చెందిన 34 ఏళ్ల కోర్ట్ని లలోత్రా మాత్రం అలాకాదు. ఓ ప్రాజెక్టు పనిలో భాగంగా ఇండియా వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులు చూసి చలించిపోయి.. స్వదేశంలో ఉన్న ఆస్తులను విక్రయించి..ఇండియా తిరిగొచ్చి ఏకంగా11 మంది పిల్లలను దత్తత తీసుకుని అమ్మలా లాలిస్తోంది. అది 2010 మన్‌హట్టన్‌లోని ఫ్యాషన్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ చదువుతోన్న కోర్ట్ని ఫ్యాబ్రిక్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా ఇండియా వచ్చింది. విమానం దిగగానే.. ‘‘రోడ్లమీద సరిగ్గా బట్టలు లేకుండా యాచించే చిన్నచిన్న పిల్లలు! చంకలో పసిబిడ్డల్ని పెట్టుకుని యాచించే తల్లులు! ఒకపక్క చేతిలో ఉన్న పిల్లలు ఏడుస్తున్నా.. డబ్బుల కోసం ఆగి ఉన్న వాహనాల చుట్టూ తిరుగుతున్న తల్లులు..! వంటి హృదయ విదారక çఘటనలు కోర్ట్నికి కనిపించాయి. అంతేగాకుండా ఈశాన్య ఢిల్లీలోని మురికివాడల్లో వలంటీర్‌గా పర్యటించినప్పుడు తల్లిదండ్రులు లేక, ఆదరించే వారు లేక వీధిపాలైన అనేకమంది అనాథ పిల్లలు తారసపడ్డారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు అని అడిగి వారి వివరాలు తెలుసుకుని ‘ఇండియాలో ఇంత పేదరికం ఉందా...’ అనుకుంది. ఇక్కడ సాయం కోసం ఎదురు చూస్తోన్న చిన్నారులు ఎందరో ఉన్నారు అనుకుంటుండగానే.. కొద్దిరోజుల్లో తన విసా కాలపరిమితి ముగియడంతో.. అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ‘తిరిగి ఇండియా వచ్చి ఈ పిల్లలను ఆదుకోవాలి’ అని నిర్ణయించుకుని స్వదేశానికి తిరిగి వెళ్లింది. దత్తత తీసుకున్న అనాథ పిల్లతో... ఆస్తులు అమ్మి.. అమెరికా వెళ్లిన కోర్ట్ని .. తనకున్న ఆస్తులు విక్రయించి 15000 డాలర్లు కూడబెట్టింది. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఇంటికి కావాల్సిన సామాన్లు, పిల్లలకు ఆహారం పెట్టడానికి ఇవి సరిపోతాయనుకుని 2011 మార్చిలో ఇండియా వచ్చింది. రాగానే ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. తల్లిదండ్రులు సాయం చేయడంతో.. 2012లో ఒక సొంత ఇంటిని నిర్మించుకుంది. మొదట్లో కోర్ట్నిని తల్లిదండ్రులు వారించినప్పటికీ తరువాత ఆమె మనసెరిగి ఆమెను సేవాకార్యక్రమాల దిశగా ప్రోత్సహించారు. పెళ్లి... పిల్లలు.. కోర్ట్ని 2014లో యోగేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదికల్లా వీరికి ‘ఎడి’ పుట్టాడు. తరువాత కోర్ట్ని యోగేష్‌లు కలిసి..ఆలనా పాలన చూసేవారు లేని అనాథ పిల్లలైన.. దీపు, శివ, జై, రోషిత్, పియూష్, రాజు, సైలేష్, శివమ్‌లను దత్తత తీసుకుంది. అలా మొత్తం పదకొండు మందిని అక్కున చేర్చుకున్నారు. తన కొడుకు ఎడితో కలిపి పన్నెండు మంది పిల్లలను అమ్మలా సాకుతోంది కోర్ట్ని. గతేడాది నుంచి ఇప్పటిదాకా కరోనా మహమ్మారి పంజా విసురుతుండడంతో.. కోర్ట్ని రెండు వేలకు పైగా కుటుంబాలకు రేషన్ అందించడమేగాక, ఆకలితో ఉన్నవారికి అన్నంపెట్టి ఆదుకుంది. భర్త యోగేష్ కొడుకు ‘ఎడి’తో కోర్ట్ని లలోత్రా నీలాంటి వాళ్లు వస్తుంటారు..వెళ్తుంటారు.. ‘‘నేను ఇండియా వచ్చినప్పుడు చూసిన కొన్ని సంఘటనలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకు సాయం చేయాలనుకున్నాను. అయితే వీసా గడువు ముగియడంతో ‘‘తిరిగి ఇండియా వచ్చి ఇక్కడ కొంతమందికి సాయం చేస్తానని చెప్పాను కానీ అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదు. నీలాంటి వాళ్లు వస్తుంటారు వెళుతుంటారు అని అన్నారు. అవేవీ పట్టించుకోకుండా కొంత నగదును సమకూర్చుకుని వచ్చి పదకొండు మందిని దత్తత తీసుకుని పెంచుతున్నాను. కోవిడ్ విజృంభించక ముందు ఇండియాలో కొంతమంది అనాథలను చూశాను. కోవిడ్ వచ్చాక రోజూ వేలమంది పిల్లలు తమవారిని కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. ఇది చాలా బాధాకరం’’‡అని కోర్ట్ని చెప్పింది. ఈ ఏడాది అమెరికా వెళ్లి అమ్మా నాన్నలను కలుద్దాం అనుకున్నాను. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పిల్లలను వదిలి వెళ్లడం ఇష్టంలేక ట్రిప్పును రద్దు చేసుకున్నాను’’ అని కోర్ట్ని తెలిపింది. -
కాబోయే కోడలు కన్నకూతురని తెలిసింది.. ట్విస్ట్ ఏంటంటే
బీజింగ్: చైనాలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. గంటలో కొడుకు పెళ్లి.. అంతా కోలాహాలంగా ఉంది. ఇంతలో పెళ్లి కుమారుడి తల్లి.. కాబోయే కోడలిని పరీక్షగా చూసింది. ఆమె చేతి మీద కనిపించిన పుట్టు మచ్చ చూసి ఆ తల్లి షాకయ్యింది. ఎందుకు అంటే తనకు కోడలు కాబోయే ఆ అమ్మాయి.. పాతికేళ్ల క్రితం తప్పిపోయిన తన కుమార్తెగా ఆ తల్లి గుర్తించింది. ట్విస్ట్ ఏంటంటే.. వివాహం ఆగిపోలేదు. ఎందుకో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే. ఈ సంఘటన గత నెల 31న జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌ ప్రాంతంలో చోటు చేసుకుంది. పెళ్లికి మరి కొద్ది సమయం ఉందనగా.. కాబోయే అత్తగారికి వధువు చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కనిపించింది. అది చూడగానే ఆమెకు గతం గుర్తుకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కుమార్తె చేతి మీద కూడా ఇలాంటి మచ్చే ఉండేది. దాంతో అనుమానం వచ్చిన తల్లి.. వధువు తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి పెళ్లి కుమార్తె గురించి ప్రశ్నించింది. దాంతో వధువు తల్లిదండ్రులు ముందు కాస్త ఆలోచించారు. ఆ తర్వాత 20 ఏళ్లుగా తమ కడుపులో దాచుకున్న రహస్యాన్ని వెల్లడించారు. వధువు తల్లిదండ్రులు చెప్పిన ఆ రహస్యం అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. ఇంతకు వారు చెప్పిన ఆ సీక్రెట్ ఏంటంటే.. పిల్లలు లేని ఆ దంపతులకు 20 ఏళ్ల క్రితం ఓ చిన్నారి దొరికింది. దాంతో ఆ పాపను వారితో పాటు తీసుకువచ్చి.. పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించారు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయించారు. తాము అనుకున్నట్లు జరిగితే మరొక గంటలో వారి పెంపుడు కుమార్తె వివాహం పూర్తయ్యేది. కానీ వధువు చేతి మీద ఉన్న పుట్టుమచ్చిన చూసిన అత్తగారు.. తనకు కోడలు కాబోతున్న అమ్మాయి ఒకప్పుడు తప్పిపోయిన తన కుమార్తెగా గుర్తించారు. 20 ఏళ్ల తర్వాత కన్నతల్లి చూసిన ఆ అమ్మాయి కన్నీళ్లపర్యంతం అయ్యింది. ఆ దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ముందు అనుకున్న ప్రకారమే వారి వివాహం జరిగింది. ఇదేంటి అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం ఏంటనుకుంటున్నారా.. ఎందుకంటే.. కుమార్తె తప్పిపోయిన తర్వాత సదరు మహిళ ఓ అబ్బాయిని దత్తత తీసుకుంది. అతడే ఈ పెళ్లి కుమారుడు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘నా కుమార్తె, పెంపుడు కుమారుడి వివాహం విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వారిద్దరూ రక్తం పంచుకుపుట్టిన వారు కాదు. కనుక వారి వివాహం నాకు ఆమోదమే’’ అని తెలిపింది. ఆ తర్వాత యథావిధిగా వారి వివాహ తంతు పూర్తయ్యింది. ఇక పెళ్లి వేడుకకు వచ్చిన వారు ఈ వింత సంఘటనకు తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు నూతన దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదించారు. చదవండి: కరోనా వ్యాప్తికి ‘గే పెళ్లిళ్లు’ కారణమంట -
అలా చేస్తే నాకు పెళ్లవదన్నారు: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్లు సుస్మితా సేన్, రవీనా టాండన్ వంటి వారు పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు తల్లయ్యారు. చిన్నారులను దత్తత తీసుకుని.. అమ్మ అవ్వడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నిరూపించారు. ఇక సుస్మితా సేన్ నేటికి కూడా పెళ్లి ఊసు ఎత్తలేదు. కానీ రవీనా టాండన్ మాత్రం వివాహం చేసుకున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగ్జైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా పిల్లలని దత్తత తీసుకోవడం.. వారి పెంపకం.. ఎదుర్కొన్న పరిస్థితులు వంటి తదితర విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా 21వ ఏట.. 1995లో ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని వారికి తల్లిని అయ్యాను. అయితే నా నిర్ణయం పలు అనుమానాలను రేకెత్తించగా.. అనుభవం మాత్రం ఎన్నో సంతోషాలని ఇచ్చింది. ఇక పూజా, ఛాయలను దత్తత తీసుకున్నప్పుడు నా నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నించారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రమాదం అని.. ఫలితంగా నా కెరీర్ ముగిసిపోతుందని.. ఇక నాకు పెళ్లవ్వదని భయపెట్టారు’ అని తెలిపారు రవీనా. (చదవండి: ‘అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది’) అయితే ‘ఈ విషయాలు ఏవి నన్ను పెద్దగా ప్రభావం చేయ్యలేదు. పైగా నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇది ఒకటి. తొలిసారి వారిని నా చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారితో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో మధురమైన జ్ఞాపకం. నా బిడ్డలిద్దరికి సంబంధించిన ప్రతి సందర్భాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. వారిద్దరూ దేవుడు నాకిచ్చిన వరం. ఇక పిల్లల తల్లిగా మారిన నన్ను ఎవరూ వివాహం చేసుకోరని బెదిరించారు. కానీ దేవుడు నన్ను ఎంతో ఉన్నతంగా నిలబెట్టాడు. గొప్పగా ఆశీర్వదించాడు’ అని తెలిపారు రవీనా. (చదవండి: ముగ్గురు డాన్స్.. కానీ ఒక్కరే!) ఇక ఆ తర్వాత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానిని వివాహం చేసుకున్నారు రవీనా. ఈ దంపతులకు కుమార్తె రాషా, కుమారుడు రణబీర్వర్ధన్ జన్మించారు. ఇక ప్రస్తుతం రవీనా దత్త పుత్రికలు ఛాయ ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తుండగా.. పూజ ఈవెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో రవీనా తన ఇద్దరు కుమార్తెలు తన బెస్ట్ ఫ్రెండ్స్‌ని పేర్కొన్నారు. ఇక తన వివాహ సమయంలో ఇద్దరు తన పక్కన నిల్చుని మండపానికి తీసుకువచ్చారని.. ఇది తనకు ఎంతో ప్రత్యేక సందర్భం అని గుర్తు చేసుకున్నారు రవీనా. ఇక ప్రస్తుత రవీనా కేజీఎఫ్2 చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
నీ ఉత్తరం అందింది
కథలైతే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టొచ్చు. జీవితం అలాక్కాదు. ఎప్పుడూ ఒక ముగింపు దగ్గరే మొదలౌతుంది. 68 ఏళ్ల మేరీ బెత్ డిశాంటో జీవితం కూడా ఈ ఏడాది ఆగస్టులో ఓరోజు పెన్సిల్వేనియా మిల్‌క్రీక్ టౌన్‌షిప్‌లోని ఆమె ఇంటి డోర్ బెల్ మోగడంతో మొదలైంది! తలుపులు తెరిచారు మేరీ బెత్. ఎదురుగా విక్టోరియా రిచ్. ‘మామ్.. నేను విక్టోరియా రిచ్!’ యాభై ఏళ్ల వయసున్న మహిళ తనని మామ్ అంటోంది! తన పేరు విక్టోరియా రిచ్ అంటోంది. పేరైనా పెట్టకుండా యాభై ఏళ్ల క్రితం తను ఎవరికో ఇచ్చేసిన నెలల బిడ్డేనా విక్టోరియా! మేరీ బెత్ డిశాంటోకు యాభై ఏళ్ల క్రితం కడుపులోని బిడ్డ కాలితో తన్నినట్లనిపించింది. ∙∙ ఈ ప్రారంభానికి ముగింపు రోజు 1970 ఆగస్టు 20. న్యూయార్క్‌లోని విక్టోరియా ఇన్ఫాంట్ హోమ్. మేరీ బెత్ పక్కలో అప్పుడే పేగు తెగిన బిడ్డ! నవమాసాల బరువు దించిన బిడ్డ. గ్రాడ్యుయేషన్ అయిపోగానే.. బెత్కి పద్దెనిమిదేళ్లకే పుట్టిన బిడ్డ. పెళ్లి కాకుండా పుట్టిన బిడ్డ. ‘బిడ్డను ఎవరికైనా ఇచ్చేద్దాం’ అని ఆసుపత్రిలోనే అనేశారు బెత్ అమ్మానాన్న. బెత్ మాట్లాడలేదు. బిడ్డను ఇచ్చేసి తర్వాతి జీవితాన్ని గడిపేయడమా? బిడ్డతోనే జీవితం అనుకోవడమా? ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. తల్లీబిడ్డ కొన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉండవలసి వచ్చింది. ఇంకా మాటలే రాని ఆ బిడ్డతో బెత్ సంభాషణ మొదలు పెట్టింది. బిడ్డకు ఉత్తరాలు రాస్తోంది. బిడ్డపై మురిపెంగా కవిత్వం అల్లుతోంది. ఉండుండి అకస్మాత్తుగా ‘ఇచ్చేద్దాం’ అని అమ్మానాన్న అన్న మాట గుర్తొచ్చేది. అప్పుడు ఆమెకు కొన్ని ఆలోచనలు వచ్చేవి. బిడ్డను తను దత్తత ఇచ్చేస్తుంది. వాళ్లు తన బిడ్డను అదృష్టంలా, వరంలా చూసుకుంటుంటారు. ఇదొక ఆలోచన. తను దత్తత ఇవ్వనే ఇవ్వదు. ఇంటికి తీసుకెళుతుంది. బిడ్డను గుండెలకు ఆన్చుకుని, ఆ పసికందును ప్రపంచంలోకి ఎలా నడిపించాలో తెలియక ఒక చీకటి గదిలో ఏడుస్తూ కూర్చుంటుంది. ఇది ఇంకొక ఆలోచన. తన జీవితాన్నెలాగూ నాశనం చేసుకుంది. తన కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయకూడదు. ఇది చివరి ఆలోచన. గుండె దిటవు చేసుకుని బిడ్డను దత్తతకు ఆసుపత్రిలోనే ఉంచి ఇంటికి వచ్చేసింది. రోజుల పాటు బిడ్డ కోసం ఏడ్చింది. చివరికి ధ్యాస మళ్లడానికి ఓ ఉద్యోగం వెతుక్కుంది. అక్కడ పరిచయమైన ర్యాండీ డిశాంటోని పెళ్లి చేసుకుంది. నలభై ఎనిమిదేళ్లు గడిచాయి. ఇద్దరు మగపిల్లలు. ప్రతి ఆగస్టు 20న వాళ్లు ముగ్గురు పిల్లలవుతారు. దగ్గర లేని కూతురును మిగతా రోజుల కన్నా ఎక్కువగా ఆ రోజు పదే పదే తలచుకుంటుంది బెత్. భర్తకు ఆ సంగతి తెలుసు. భార్యను దగ్గరకు తీసుకుంటాడు. ∙∙ యు.ఎస్.లోనే మరోచోట పెరుగుతున్న విక్టోరియా రిచ్‌కి కూడా తల్లిదండ్రులకు తను సొంత బిడ్డను కాదన్న సంగతి తెలుసు. సొంత తల్లిని కలుసుకోవాలని అనిపించనంత ప్రేమతో ఆమె పెరిగింది. ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఫొటోగ్రఫీ ఎడిటర్, వీడియో ప్రొడ్యూజర్ అయింది. ఎప్పుడైనా తల్లిని కలుసుకోవాలని అనిపించేది కానీ, ఒక అన్వేషణే ప్రారంభించేంతగా కాదు. 2006లో యాన్ ఫెస్లర్ రాసిన ‘పిల్లల్ని దత్తత ఇచ్చిన తల్లుల దాపరికాలు’ అనే పుస్తకం చదివాక తొలిసారి తల్లిని చూడాలని రిచ్‌కి అనిపించింది. పుస్తకం కోసం ఫెస్లర్ ఇంటర్వ్యూ చేసిన తల్లులందరూ.. ‘తమ బిడ్డ ఎలా ఉందో’ అని దుఃఖపడినవారే. తన తల్లీ దుఃఖపడుతూ ఉంటుంది. ఆమె దుఃఖాన్ని పోగొట్టడం కూతురుగా తన బాధ్యత అనుకుంది. ఆమె అదృష్టం! దత్తతు వెళ్లిన వాళ్లు కోరితే జనన ధృవీకరణ పత్రం మంజూరు చేయాలన్న చట్టం న్యూయార్క్‌లో వచ్చింది. గత ఏడాది జనవరి 15న ఆ చట్టం అమల్లోకి రాగానే బర్త్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కొన్ని వేల మందిలో విక్టోరియా రిచ్ కూడా ఒకరు. పత్రం చేతికొచ్చింది. తల్లి పేరు చూసుకుంది. మేరీ బెర్త్ ఊల్ఫ్! ఆ అక్షరాలను కళ్లతో, వేళ్లతో, మనసుతో స్పృశించింది. ‘మామ్’అనే మాట అప్రయత్నంగా ఆమె నోటి వెంట వచ్చింది. రిచ్ స్నేహితులు ఇంటర్నెట్లో మేరీ బెర్త్‌ను వెదకడంలో సహాయపడ్డారు. తేలికైన విషయమా? తప్పిపోయిన బిడ్డలా, తప్పిపోయిన తల్లి.. బెర్త్! చివరికి చిరునామా దొరికింది! తన ఫొటోలు జతచేసి, తల్లికి మాత్రమే అర్థమయ్యేలా జాగ్రత్తగా ఒక ఉత్తరం రాసింది రిచ్. వేరే ఎవరి చేతిలో పడినా సమస్యలేదు. మామూలు ‘ఆల్ ఈజ్ వెల్’ ఉత్తరంలానే అనిపిస్తుంది. తన వివరాలు కూడా పెద్దగా ఇవ్వలేదు. కూతుర్ని కలుసుకోవాలన్న ఆశ ఆ తల్లికి నిజంగా ఉంటే కనుక అందుకు ఉపయోగపడేలా అవసరమైన వివరాల వరకే ఉన్నాయి. ఆ ఉత్తరాన్ని ఈ ఏడాది మార్చి 3 న పోస్ట్ చేసింది. చేశాక ఆందోళన పడింది. ∙∙ దత్తత ఇచ్చేసిన పిల్లల్ని మళ్లీ కలుసుకోవాలని తల్లులకు ఉండదని ఫేస్‌బుక్‌లోని ‘అడాప్షన్ గ్రూప్’ అనుభవాలలో చదివి ఉంది రిచ్. అది జ్ఞాపకం వచ్చింది. ఉత్తరం రాసి తన తల్లినేమైనా ఇబ్బంది పెట్టానా అనుకుంది. రెండు రోజులు గడిచాయి. ఆఫీస్‌లో ఉండగా మార్చి 5న ఆమెకో కాల్ వచ్చింది. కాలర్ ఐడీలో ఈరి, పి.ఎ. అని ఉంది. పెన్సిల్వేనియాలోని ఈరి ప్రాంతం. అది తన తల్లి ఉండే ప్రదేశమే! రిచ్ ఒక్కసారిగా లేచి, ఉద్వేగాన్ని అణచుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. ‘‘ఈజ్ దిస్ విక్టోరియా? ఇటీజ్ మేరీ బెత్. నేను నీ ఉత్తరం అందుకున్నాను’’ అని అక్కడితో మాట ఆగిపోయింది. ఫోన్ కట్ అవడం కాదు. మాట కట్ అయింది. ఆ తర్వాత తల్లి ఏం చెప్పబోతుందో రిచ్ ఊహించింది. ‘దయచేసి నన్నెప్పుడూ కలుసుకునే ప్రయత్నం చేయకు’ అనే మాటకు సిద్ధపడటం కోసం ధైర్యాన్ని కూడగట్టుకుంటోంది. అయితే ఆమె విన్న మాట వేరు. ‘‘మనం కలుసుకుందాం’’ అంది బెత్. రిచ్ ఆనందానికి అవధుల్లేవు. మాట్లాడుకోవడం, మెజేస్‌లు ఇచ్చుకోవడం మొదలైంది. కలుసుకునే రోజు కూడా ఫిక్స్ అయింది. తల్లి ఉండే ఈరి ప్రాంతానికి వెస్ట్రన్ న్యూయార్క్ దూరమేమీ కాదు. రిచ్ ఉండేది క్వీన్స్‌లో. కానీ మే నెలలో కాలేజ్ గ్రాడ్యుయేషన్‌కి, జూన్‌లో ఒక పెళ్లికి ఆమె వెస్ట్రన్ న్యూయార్క్ వెళ్లవలసి ఉంది. అప్పుడు అట్నుంచటు తల్లి దగ్గరకు వెళ్లొచ్చని ప్లాన్ చేసుకుంది. అయితే కరోనా వల్ల వెళ్లడం కుదర్లేదు. మళ్లీ కాల్స్, మెసేజ్‌లు.. అంతవరకే. ∙∙ విక్టోరియా రిచ్ పెరిగింది ఇటాలియన్ల ఇంట్లో. బెత్ కుటుంబంలో ఐరిష్, జర్మన్ సంస్కృతులు ఉన్నాయి. రెండు కుటుంబాలవీ క్యాథలిక్ విశ్వాసాలు. అవి కూడా తల్లీకూతుళ్లను దగ్గర చేశాయి. విక్టోరియా రిచ్ తన 50 వ పుట్టిన రోజుకు ముందు తల్లిని కలుసుకోవడం మాత్రం కాలం కుదిర్చిన ఏర్పాటు అనుకోవాలి. ‘సినిమాలో కనుక తల్లీకూతుళ్లు ఇలా కలుసుకున్నట్లయితే నాకేమీ అనిపించేది కాదు. మామూలు కథలా ఉండేది. నాకు జరిగింది కాబట్టేమో జీవితంలా అనిపిస్తోంది’ అంటున్నారు విక్టోరియా రిచ్. మార్చి 5న కూతురు రాసిన ఉత్తరం అందే సమయానికి మేరీ బెత్ కిచెన్‌లో గిన్నెలు కడుగుతూ, టీవీలో ‘లాంగ్ లాస్ట్ ఫ్యామిలీ’ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. కలుసుకున్న కుటుంబ సభ్యుల నిజ జీవిత కథలు అవి. సుఖాంతం అవుతాయి కనుక ఆమె ఆ ప్రోగ్రామ్‌ను ఇష్టంగా చూస్తుంటారు. ఆ రోజు మాత్రం చివరి వరకు చూడకుండానే టీవీని ముందే కట్టేశారు. ఆమె కథమాత్రం ‘పోస్ట్’అనే మాటతో మార్చిలో ఒకసారి, కాలింగ్ బెల్‌తో ఆగస్టులో ఒకసారి కొత్తగా ప్రారంభం అయింది. ఈ కథను ‘ది కాలర్ ఐడి సెడ్ ఈరీ, పి.ఎ.’ అనే పేరుతో ‘అమెరికన్ పబ్లిక్ బ్రాడ్‌క్యాస్టింగ్’ తన నెట్‌వర్క్‌లోని యూట్యూబ్‌లో, వాయిసెస్లో, ఫేస్బుక్లో పెట్టింది. తల్లిని చేరిన బిడ్డ -
ఐదు గ్రామాల దత్తత.. ఈ హీరో ఎవరో తెలుసా!
లాహిరి లాహిరి లాహిరి, ధనలక్క్క్ష్మీ ఐ లవ్ యూ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు ఆదిత్య ఓం.. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ హీరో కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం చేరువలోనే ఉన్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ మారిన ఆదిత్య తెలంగాణలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చేరుపల్లి సమీపంలోని గ్రామాలను గత అయిదేళ్లుగా దత్తత తీసుకుని వాటి అభివృద్ధి బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. (చదవండి: 42 లీటర్ల చనుబాలను డొనేట్ చేసిన నిర్మాత) వీటిని రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్య తన స్నేహితుడు, నిర్మాత పీవీఎస్ వర్మతో కలిసి ఇటీవల గ్రామాల్లోని 500 రైతులకు మామిడి, కొబ్బరి మొక్కలను అందించారు. అలాగే దత్తత గ్రామాల్లోని యువతను విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. చేరువల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. కాగా చాలా రోజుల గ్యాప్ ఆనంతరం ఆదిత్య ప్రస్తుతం రాఘవ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బందీ అనే సినిమాతో రీఎంటీ ఇవ్వనున్నారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో కేవలం ఒకే పాత్ర ఉండబోతుంది. చదవండి: ప్రయోగాత్మక కథతో వస్తున్న ఆదిత్య .@adityaaom has been working for the upliftment of tribal villages in Telangana for last 5 yrs. He adopted Cherupally and surrounding villages in Bhadradri Kothagudem dist and launched various development works His next #Bandhi directed by #RaghavaT is a multi-lingual film pic.twitter.com/BU6L8a5bpy — BARaju (@baraju_SuperHit) November 17, 2020 -
సీఎం దత్తత గ్రామాల్లో పెండింగ్ పనులు
సాక్షి, మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి మూడు చింతలపల్లి (ఎంసీపల్లి) మండల కేంద్రంలో పర్యటించి వెళ్లిన తర్వాత.. ఆ మండలంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎంసీపల్లిపై రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందునే జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ‘ధరణి’ పోర్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా గురువారం ఎంసీపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి మూడోసారి ఈ మండలంలో పర్యటించారు. గతంలో 2017 ఆగస్టులోనూ రెండు సార్లు పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు ఎస్డీఎఫ్ నుంచి నిధులు కేటాయించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పక్కనే ఉన్నందున సమీప గ్రామాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారయంత్రాంగం ఎంసీపల్లి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పెండింగ్ పనులు వేగవంతం 2017లో మూడు చింతలపల్లి మండలంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఐదు గ్రామాల పరిధిలో 117 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమేగాక, సీడీఎఎఫ్ నుంచి రూ.66 కోట్లు మంజూరు చేయించారు. అయితే మూడేళ్లు గడచినా పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదు. దీనిపై సీఎంకు సమాచారం అందడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంసీపల్లి పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పెండింగ్ పనులపై దృష్టి సారించింది. కేశవరంలో నిర్మాణంలో ఉన్న మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాల్ అభివృద్ధి పనులివీ.. ఎంసీపల్లి మండల పరిధిలోని కేశవరం, లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, నాగిశెట్టి పల్లి, లింగాపూర్ తండాలో 117 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు దాదాపు రూ.66 కోట్లు నిధులు మంజూరు చేశారు. అదే పర్యటనలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మిగిలిన పనులకు నెల రోజుల వ్యవధిలోనే అప్పటి రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులను ఆర్అండ్బీ, ఇరిగేషన్, పీఆర్, విద్య, విద్యుత్, వ్యవసాయ శాఖలు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినా పురోగతి కనిపించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లలో 78 కార్యక్రమాలకు సంబంధించి 80 పనులు శాతం పూర్తికాగా, మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ల్లో చేపట్టిన 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పునాది దశలో ఉండగా, కేశవరంలో 100 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నిధుల మంజూరు ఇలా.. కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు, అభివృద్ధి పనులకు సీఎంఓ ప్రత్యేక అభివృద్ధి ఫండ్స్ కింద రూ.27.76 కోట్లు విడుదల చేశారు. ఇందులో కేశవరం గ్రామానికి రూ. 12.26 కోట్లు కాగా, లక్ష్మాపూర్ గ్రామానికి 15.50 కోట్లు మంజూరు చేశారు. మూడు చింతలపల్లి గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి నిర్వహించి, పంచాయతీ పరిధిలో మౌలిక వసతులు,పలు అభివద్ధి కార్యక్రమాలకు రూ. రూ.27.29 కోట్లు మంజూరు చేశారు. ఐదు గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాలువలు, కమ్యూనిటీ హాలు, మినీ స్టేడియం, దోభిఘాట్, స్మశానవాటిక, ట్రాన్స్పార్మర్లు, మహిళా భవనం, నీటి ట్యాంక్, ఆసుపత్రి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర 117 అభివృద్ధి కార్యక్రమాలకు రూ.66 కోట్లు మంజూరు చేశారు. -
వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. సీఎం శనివారం జనగామ జిల్లా కొడకండ్లకు రోడ్డుమార్గంలో వెళ్లి వస్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సర్పంచ్‌ను ఆదివారం ఫాంహౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంపీపీ సుశీల, ఎంపీటీసీ సభ్యుడు నవీన్, కొందరు టీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎంను కలిశారు. వినతిపత్రం ఇవ్వబోగా అవసరం లేదని, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.100 కోట్లు ఖర్చయినా అభివృద్ధి చేస్తానని సీఎం ప్రకటించారు. వెంటనే జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో మాట్లాడి వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్ తయారు చేయాలని ఆదేశించారు. గ్రామస్తులను ఎక్స్పోజర్ విజిట్ కోసం నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు తీసుకుపోవాలని ఆదేశించారు. మరో 10 రోజుల్లో ఊరుకు వచ్చి గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేస్తానని చెప్పారు. ఎర్రవల్లిని అభివృద్ధి చేసిన అప్పటి సిద్దిపేట, ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ, కలెక్టర్ అనితారామచంద్రన్, పలువురు అధికారులు సోమవారం వాసాలమర్రికి రానున్నారు. గ్రామసమస్యలపై సర్వే చేపట్టనున్నారు. గ్రామాభివృద్ధికిగాను బ్లూ ప్రింట్ తయారీ కోసం ప్రత్యేకాధికారిగా డీఆర్డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డిని నియమించారు. కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదివారం వాసాలమర్రిని సందర్శించి సర్పంచ్, గ్రామస్తులతో అభివృద్ధి, ఉపాధి అంశాలపై చర్చించారు. -
నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో
సాక్షి, హైదరాబాద్/జిన్నారం (పటాన్చెరు): ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సంస్థ సామాజిక బాధ్యతలో మరో ముందడుగు వేసింది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్–నల్లవెల్లిలో విస్తరించిన 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని హెటిరో డ్రగ్స్ సోమవారం దత్తత తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5 కోట్ల చెక్కును హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా అక్కడ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు సమీపంలోని నర్సాపూర్ అడవిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ఆ మేరకు అడవులను రక్షించేలా ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు భేష్.. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గొప్పగా ఉన్నాయని హెటిరో డ్రగ్స్ చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో ఎంపీ సంతోష్ కృషి తమను ఆకర్షించిందని, అందుకే సామాజిక బాధ్యతగా అడవిని దత్తత తీసుకుని అభివృద్దికి సంకల్పించినట్టు తెలిపారు. హెటిరో డ్రగ్స్ చొరవను సంతోష్ ఈ సందర్భంగా అభినందించారు. వీరి దారిలోనే మరికొందరు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పర్యావరణ పరిరక్షణకు ముందుకు వస్తున్నారని వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అటవీశాఖ ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలను గురించి హెటిరో ప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. మంబాపూర్ అటవీ ప్రాంతం ప్రాధాన్యత మంబాపూర్ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి చేయనున్నారు. అలాగే మొత్తం 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని స్థిరీకరించటం, ఆక్రమణలకు గురికాకుండా 25 కి.మీ. పరిధిలో అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేయటం, రక్షిత అటవీ ప్రాంతంలోకి మానవ, పెంపుడు జంతువుల ప్రవేశాన్ని నియంత్రించటం ద్వారా సహజ అడవి పునరుద్ధరణను హెటిరో నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌తో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ విస్తరిస్తున్న టౌన్షిప్లకు ఈ అడవి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే లంగ్ స్పేస్‌గా ఉపయోగపడనుంది. నర్సాపూర్ రోడ్డు నుంచి అడవిలో ప్రవేశించిన తర్వాత 2 కి.మీ. దూరంలో చుక్కగుట్ట కొండ ప్రాంతంలో (సుమారు 630 మీటర్ల ఎత్తు) వ్యూ పాయింట్ ఏర్పాటు, ఎకో ట్రెక్కింగ్, విద్యార్థులకు పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.మహిపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతకుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. -
మా నాన్న కలెక్టర్.. ఆయనే మా ధైర్యం
‘అమ్మలేదంటూ బెంగపడవద్దు.. అయినవారెవ్వరూ లేరనే చింత అసలే వద్దు.. నాన్నగా ధైర్యమై మీ వెంటే ఉంటాను’ అంటూ జిల్లా కలెక్టర్ అనాథలైన ఇద్దరు కవల ఆడపిల్లలకు ఆండగా నిలుస్తున్నారు. కలెక్టర్ నాన్నగా అందరి మదిని గెలుచుకుంటున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో చదువుకునే పిల్లలకు అక్కడ వసతి సదుపాయం కూడా ఉంది. ఆ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు రాధా, రాధికలు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. పదవ తరగతి పూర్తి అవుతూనే అందరు పిల్లలు వారి వారి ఇండ్లకు వెళ్లిపోయారు. ‘మేం ఎక్కడికి వెళ్లాలి?!’ ఈ ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణారెడ్డి వద్దకు వెళ్లి తమ విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. దీంతో డీఈవో ఇద్దరు పిల్లలను తీసుకొని జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణికి వెళ్లారు. అక్కడ అర్జీలు తీసుకుంటున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ ఇద్దరు కవలల ఆడపిల్లల స్థితి చూసి చలించిపోయారు. వారి కష్టాలు నేరుగా విని చెమ్మగిల్లిన కళ్లతో అప్పటికప్పుడే ఇద్దరి పేరున చెరొక లక్ష రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. అదే సమయంలో దసరా పండుగ రావడంతో ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇచ్చి కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పారు. వెంటనే జిల్లా స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులను పిలిచి వారికి ఆశ్రయం కల్పించాలని అదేశించారు. విషయమేంటంటే... సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలోని బంగారం పనిచేసుకుంటూ జీవించే వెంకటేశం, పార్వతిలకు రాధా, రాధికలు కవల పిల్లలు. భార్య ఆరోగ్యం సక్రమంగా ఉండకపోవడంతో ఇద్దరు ఆడపిల్లల భారం తానే మోయాల్సి వస్తుందని తండ్రి వెంకటేశం చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తల్లి వారు ఏడవ తరగతి చదువుతుండగానే ఆరోగ్యం క్షీణించి మరణించింది. ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. పిల్లలు దగ్గరకు వస్తే ఆ భారం తమమీద పడుతుందనే భయంతో బంధువులు చిన్నారులను సూటిపోటి మాటలతో దూరంగా ఉంచారు. దీంతో గ్రామస్తులు అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయుల సహకారంతో సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించారు. ఆ పాఠశాలలో ఇన్నాళ్లూ చదువుకున్న పిల్లలకు దేవుడే వారి బాధ్యతను తీసుకునే నాన్నను వరంగా ఇచ్చాడు. కష్టాల కడలిలో ఉన్న ఆ ఇద్దరి జీవితాల్లో ఆనందాన్ని నింపడానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వారికి నాన్నయ్యాడు. నాటి నుండి పర్యవేక్షణ.. రోజూ తమ వద్దకు వచ్చే వందలాది అర్జీలను తీసుకొని పరిష్కరించి మర్చిపోతారు. కానీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాత్రం ఈ రాధా, రాధికలను తానే దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. తనకు వీలునప్పుడల్లా ఆ పిల్లల బాగోగులను స్వయంగా పర్యవేక్షించడం లేదా వారినే తన కార్యాలయానికి, ఇంటికి పిలిపించుకొని యోగ క్షేమాలు తెలుసుకోవడం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పిల్లలకు ప్రతీ పుట్టినరోజు, పండుగలకు కొత్త బట్టలు తేవడం, ఇతర పిల్లలతో పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా పెరిగిన పిల్లలు ఇప్పుడు సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కలెక్టర్ బిడ్డలు.. ‘మీరు నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు. మీకు ఎవ్వరూ లేరనే దిగులే అవసరం లేదు. మీ నాన్న జిల్లా కలెక్టర్. మీకు ఏం కావాలన్నా డిమాండ్‌గా అడగచ్చు’ అని చెప్పి మరీ పిల్లలకు మనోధైర్యం కల్గిస్తున్నారు. ‘ఎక్కడా తక్కువ కాకుండా సంతోషంగా ఉండండి. బాగా చదువుకోండి. మీ చదువుల బాధ్యతే కాదు, పెళ్లిళ్లు చేసి మిమ్మల్ని ఓ ఇంటివారిని చేసే బాధ్యత కూడా తండ్రిగా నాదే’ అంటున్నారు ఈ కలెక్టర్. మనసున్న కలెక్టర్‌గా అందరిచేత అభినందనలు అందుకుంటున్నారు. – ఈరగాని భిక్షం, సాక్షి, సిద్దిపేట నాన్నే మా ధైర్యం అమ్మ ఆరోగ్యం బాగున్నన్ని రోజులు మాకే ఇబ్బందులు రాలేదు. తర్వాత అన్నీ కష్టాలే. ఆకలికి తట్టుకోలేక ఎన్నో రోజులు బాధలు పడ్డాం. ఇప్పుడు మాకు దేవుడే నాన్నగా వచ్చాడు. మాకే లోటు లేకుండా చూసుకుంటున్నారు. మా నాన్న కలెక్టర్. మా నాన్న మా ధైర్యం. మాకు స్ఫూర్తి. బాగా చదువుకొని నాన్నకు మంచి పేరు తీసుకొస్తాం. -
అటవీ భూమిని దత్తత తీసుకున్న ప్రభాస్
సాక్షి, హైదరాబాద్/జిన్నారం: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ హీరో ప్రభాస్ అర్బన్ ఫారెస్టును దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ సమీపంలో 1,650 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ నిర్ణయం వల్ల ఔటర్ రింగ్‌రోడ్డు వెంట దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకోటూరిజం సెంటర్ అందుబాటులోకి రానుంది. సోమవారం సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ప్రభాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్బన్ పార్క్ మోడల్, ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ స్ఫూర్తితోనే: ప్రభాస్ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తి, ప్రేరణతో పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఈ అటవీ ప్రాంతం అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పారు. ముందస్తుగా రూ.2 కోట్ల విలువైన చెక్కును ప్రభుత్వానికి ఆయన అందజేశారు. దశల వారీగా అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తానని వెల్లడించారు. తన తండ్రి వెంకట సూర్యనారాయణ రాజు పేరు మీదుగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మాట నిలబెట్టుకున్న ఎంపీ సంతోష్‌కుమార్.. గతేడాది మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద కీసర అడవిని ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా గత ఏడాది ఆగస్టు 31న కీసరలో అటవీ పునరుజ్జీవన చర్యలు, ఎకో టూరిజం పార్కు అభివృద్ధికి మొక్కలు నాటి శంకుస్థాపన చేశారు. ఆ రోజు జరిగిన సభలో మాట్లాడిన సంతోష్‌కుమార్ తన స్నేహితులు, సన్నిహితులను కూడా ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు ఏడాదిలోనే దీనిని కార్యరూపంలోకి తెచ్చారు. కాగా, ఈ ఏడాది జూన్ 11న నాలుగో విడత గ్రీన్ చాలెంజ్‌ను ప్రారంభించి మొక్క నాటిన హీరో ప్రభాస్, ఎంపీ సంతోష్ సూచన మేరకు రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు అటవీ శాఖతో సంప్రదింపులు జరిపిన మీదట ఖాజీపల్లి అటవీ ప్రాంతం ఖరారు చేశారు. -
ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్
సాక్షి, సంగారెడ్డి: గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దుండిగల్ సమీపంలోని ఖాజీపేట అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి యంగ్ రెబల్ స్టార్ సోమవారం పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను తన తండ్రి దివంగత యూవీఎస్‌రాజు పేరు మీద ప్రభాస్ దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలను అందించడమే కాకుండా, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (నిర్మాతలను నామినేట్ చేసిన శర్వానంద్) కాగా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. ఇక ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మార్చనున్నారు. (ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్) -
అన్ని మతాలకూ ఒకే దత్తత చట్టం కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకేరకమైన దత్తత చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దత్తత చట్టం, సంరక్షణ బాధ్యత, వివక్షా పూరితంగా ఉన్నాయనీ, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని ఉల్లంఘిస్తున్నందున దత్తతకు సంబంధించిన యూనిఫాం మార్గదర్శకాలు ఉండాలని కోరారు. ప్రస్తుత దత్తత పద్ధతి వివక్షా పూరితంగా ఉందనీ, హిందువులకు ప్రత్యేక చట్టం ఉంది, కానీ ముస్లింలు, క్రిస్టియన్లు, పార్శీలకు ఎటువంటి చట్టం లేదని, తెలిపారు. (మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్) -
సోనూ సూద్ మనసు బంగారం
సాక్షి, బళ్లారి : ప్రముఖ నటుడు, సినిమాల్లో విలన్‌గా అందరినీ విసిగించే సోనూ సూద్ నిజజీవితంలో దాతృత్వానికి ఎల్లలు లేకుండా పోతున్నాయి. ఎక్కడ కష్టం ఉందని తెలిసినా నేనున్నానని సహాయ హస్తం అందిస్తున్నారు. గత శనివారం కన్నడనాట యాదగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేద మహిళ పద్మ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. పూట గడవక కష్టాలు పడుతున్న పద్మ– నాగరాజ్ దంపతులకు ముగ్గురు బిడ్డలను పోషించడం తలకు మించిన భారమైంది. పాడుబడిన చిన్న ఇంటిలో బతికేదెలా అని ఆ దంపతులు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై పత్రికలు, టీవీ చానెళ్లలో వచ్చిన వార్తలు సోనూ సూద్ దృష్టికి వెళ్లగా ఆయన వెంటనే మానవతను చాటుకున్నారు. ఆ ముగ్గురు శిశువులను దత్తత తీసుకుంటానని, వారి పోషణకు, పద్మ ఇల్లు మరమ్మతులకు ఖర్చులను తాను భరిస్తానని హామీ ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు. -
వారందరికీ సోనూసూద్ విజ్ఞప్తి
ముంబై: సోనూసూద్ ఇప్పుడు సాయానికి మారుపేరు లాగా మారిపోయాడు. ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సాయాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సోనూసూద్ ఒక విజ్ఞప్తి చేశాడు. ఎవరైనా సాయం చేయగలిగిన వారు ఉంటే ఒక రోగిని దత్తత తీసుకోని వారి వైద్య భారాన్ని అంతా మొత్తం భరించాలని కోరారు. అలా చేస్తే పేదరికం సగం పోతుంది అని చెప్పారు. వీలైనంత మంది సాయం చేయాలని అని సోనూసూద్ కోరారు. చదవండి: ‘సోనూ సూద్ పీఎస్4 కావాలి ప్లీజ్’ -
నువ్వక్కడ, నేనిక్కడ! ఎంచక్కా!!
సాక్షి, న్యూఢిల్లీ : రాఘవ్ చాబ్రా, 28 ఏళ్ల యువకుడు. ఢిల్లీలో చార్టెట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఇంకా పెళ్లి కాలేదు. ఒంటరి వాడు. ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. ఇంట్లో వంట పనులు, లాండ్రీ పనులు తానే చూసుకుంటున్నారు. కరోనా భయం కారణంగా బయటి నుంచి తెచ్చిన సరకుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటు సాయంత్రం ఏడయ్యే సరికి ఆయన శరీరం అలసిపోతోంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తగ్గించుకుని ఉల్లాసంగా ఉండేందుకు ఆయన ప్రతి రోజు ఏడు గంటలకు ఓ గంట కాలాన్ని ఆనంద కాలక్షేపానికి కేటాయిస్తారు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మిగిలి పనులు చక్క బెట్టుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు. అయితే, ఆనందం కోసం గంట కాలాన్ని ఎలా వెచ్చిస్తున్నాడన్న అనుమానం రావొచ్చు. మద్యం సేవిస్తూ ఆయన గంటపాటు అనందంగా కాలక్షేపం చేస్తారనుకుంటే పొరపాటు. ఆ ఆనంద సమయంలో చాబ్రా తన దత్తత తీసుకున్న కుక్క పిల్లతో ఆడుకుంటారు. ముచ్చట్లు పెడతారు. అలా అని ఆ కుక్క పిల్ల ఆయనతోని ఆయన ఇంట్లో ఉంటుందనుకుంటే కూడా పొరపాటే. అది ఢిల్లీకి శివారులోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతంలోని జంతు సంరక్షణ కేంద్రం ఆవరణలో ఉంటోంది. దానితోని చాబ్రా తన ల్యాప్‌టాప్‌లో స్కైప్ ద్వారా ఆడుకుంటారు. మాటల ద్వారా, సైగల ద్వారా ఆ కుక్కతో ఆత్మీయ అనుబంధాన్ని ఆస్వాదిస్తారు. చాబ్రా అదష్టవశాత్తు దేశంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీకి కొన్ని రోజుల ముందే ఆ కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. దానికి ఫ్రన్నీ అని పేరు కూడా పెట్టుకున్నారు. అక్కడ సంరక్షణ కేంద్రంలో దాని పోషణకు అయ్యే ఖర్చును చాబ్రానే భరిస్తారు. నెలకు లేదా రెండు నెలలకోసారి ఆ ఖర్చును డిజిటల్ పేపెంట్ ద్వారా చెల్లిస్తారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశాక పెంపుడు కుక్కల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ‘ఉమ్మీద్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ కార్యాలయానికి వెళ్లి దాన్ని ప్రత్యక్షంగా చూద్దామని, ఓ వారం రోజులపాటు దాన్ని తీసుకొని ఊళ్లు తిరుగుదామని చాబ్రా అనుకుంటున్నారు. పెంపుడు జంతువులతో మానసిక ఉల్లాసం కరోనా కష్ట కాలంలో చాబ్రా లాంటి జంతు ప్రేమికులకు, ఒంటరి వాళ్లకు పెంపుడు కుక్కలను దత్తత తీసుకోవడం అనే కొత్త ట్రెండ్ ఇప్పుడు పెరిగిపోయింది. సొంతిళ్లు లేని జంతు ప్రేమికులు కుక్కల్ని పెంచుకునేందుకు భయపడతారు. సొంతిళ్లు ఉన్న వాళ్లలో కూడా ఇంట్లోని పెద్ద వాళ్లకు భయపడి పెంచుకోరు. ఇక ఒంటిరి వాళ్లయితే ఆఫీసుకు, ఇంటికి మధ్యలో దాని ఆలనాపాలనా చూసుకోలేమని భయపడతారు. ఇక అలాంటి భయాలు లేకుండా కుక్కలను దత్తత తీసుకునే పద్ధతి ఆచరణలోకి రావడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానితో ఆడుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా జంతు ప్రేమికులు భావిస్తున్నారు. ఒంటరితనంతో బాధ పడే యువతీ, యువకులు లేదా పెద్ద వారికి పెంపుడు కుక్కలతోని ఎంతో మానసిక ఉపశమనం లభిస్తుందని గురుగ్రామ్‌లోని ‘మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్’ అధిపతి డాక్టర్ కామ్నా చిబ్బర్ తెలియజేస్తున్నారు. ఓ పెంపుడు కుక్క పోషణకు నెలకు కనీసం మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ‘పీపుల్ ఫర్ ఎనిమల్’ సభ్యులు విక్రమ్ కొచ్చార్ తెలిపారు. దేశంలోని జంతు సంక్షేమ సంఘాల్లో ఈ సంస్థ అతి పెద్దదనే విషయం తెల్సిందే. కరోనా సందర్భంగా ఊర కుక్కల వల్లనే ‘దత్తత’ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చిందని ఆయన తెలిపారు. లాక్డౌన్ వల్ల ఊర కుక్కలకు తిండి దొరక్క పోవడం, వైరస్ సోకుతుందనే భయంతో కొందరు పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేశారని, వాటన్నింటిని వివిధ సంరక్షణ కేంద్రాలకు తరలించి, దత్తత ద్వారా వాటిని పోషిస్తున్నట్లు ఆయన వివరించారు. గురుగావ్‌లో మనోజ్ మీనన్ అనే జంతు ప్రేమికులు రెండు ఎకరాల గార్డెన్లో ఈ కుక్కలను పోషిస్తున్నారు. వాటి కోసం స్మిమ్మింగ్ పూల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ల్యాప్‌టాప్, సెల్ఫోన్ల ద్వారా వాటి దత్తత యజమానులతో కాలక్షేపం చేసేలా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ కొంత కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని విక్రమ్ కొచ్చార్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
అక్రమ దత్తత: బాలుడి దీనగాద
పటాన్చెరు టౌన్: అక్రమ దత్తత వ్యవహారంలో ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లికి చెందిన హరణ్ పాత బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది వినాయక చవితి రోజున హైటెక్ సిటీ సమీపంలో పాత బట్టలు అమ్ముతున్న సమయంలో వర్షం రాకతో రెండు సంవత్సరాల బాలుడు అతని వద్దకు తడుస్తూ వచ్చాడు. దీంతో హరణ్ చుట్టు పక్కల బాలుడికి సంబంధించిన వారు లేకపోవడంతో ఆ బాలుడి తీసుకొని పటాన్చెరు సాయి కాలనీలో ఉండే మామా యాకోబ్ ఇంటికి వచ్చాడు. దీంతో యాకోబ్, అతడి భార్య సరోజ పిల్లలు లేని కారణంగా ఆ బాలుడిని వారి వద్ద ఉంచుకున్నారు. అప్పటి నుంచి వారు ఆ బాలుడిని పెంచుకుంటున్నారు. బాలుడి దత్తత అక్రమని వారు సొంత తల్లిదండ్రులు కాదని జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు బాలుడిని తెచ్చిన హరణ్, అక్రమ దత్తత తీసుకున్న యాకోబ్, సరోజ ముగ్గురు పై కేసు నమోదు చేశారు. కాగా బాలుడిని సంగారెడ్డి శిశువిహార్‌కు పంపించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడో దశ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు శ్రీకారం చుట్టారు. దీంతో ‘పుడమి పచ్చగుండాలే–మన బతుకులు చల్లగుండాలే’అనే నినాదంతో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ మూడో దశ మొదలైంది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ఉన్నత విలువలతో కూడుకున్నది. ఇందులో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చింది. సంతోష్ ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడతాను. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’అని చెప్పారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ను ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు. ‘గ్రీన్ చాలెంజ్’ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్ఫూర్తిదాయకం. ప్రభాస్ చేతులమీదుగా ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడో దశ కార్యక్రమం జరగడం సంతోషం. కోట్లాదిగా ఉన్న వారి అభిమానులంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’అని అన్నారు. కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’సమన్వయకర్త సంజీవ్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా: మోదీ ఇలాకాలో ఆకలి కేకలు
లక్నో : ఊహించని విపత్తులా దూసుకొచ్చిన ప్రాణాంత కరోనా వైరస్ పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. వైరస్ వ్యాప్తికి విధించిన లాక్డౌన్ పలు ప్రాంతాల్లో ఆకలి చావులకు దారితీస్తోంది. ఇక వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ముఖ్యంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక తిండికరువై అల్లాడుతున్నారు. ఉత్తరభారతంలో బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు. కరోనా విపత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దత్తత గ్రామంలోనూ ఆకలి కేకలు పుట్టిస్తోంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి కూతవేటు దూరంగా ఉన్న దోమరి గ్రామస్తులు తిండిలేక అలమటిస్తున్నారు. (దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు) నరేంద్ర మోదీ తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పథకం ‘సస్సద్ ఆదర్శ గ్రామ యోజన’. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను ఎంపీలు దత్తత తీసుకోవడమే ఈ పథకం స్వరూపం. పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్స్) నుంచి ఆయా గ్రామాలకు కేంద్రం నిధులు సమకూర్చుతుంది. దీనిలో భాగంగానే 2014లో వారణాసి సమీపంలోని జయపుర గ్రామాన్ని మోదీ తొలుత దత్తత తీసుకున్నారు. అనంతరం తన నియోజకవర్గంలో వెనుకబడిన మరో మూడు గ్రామాలను సైతం దత్తత తీసుకుంటున్నట్లు 2019లో ప్రకటించారు. దీంతో అప్పటివరకు అంధకారంలో ఉన్న తమ బతుకులు ఇక మారుతాయని స్థానిక ప్రజలంతా భావించారు. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరిలో దోమరి గ్రామంలో పర్యటించిన మోదీ.. 63 అడుగుల దీన్‌దయాల్ ఉపాధ్యాయ విగ్రహ ఆవిష్కరణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. (కరోనా పోరులో విజయం: సంబరపడొద్దు) మోదీ పర్యటన అనంతరం గ్రామస్తులపై కరోనా పిడుగులా పడింది. లాక్‌డౌన్‌తో స్థానిక పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. స్థానిక బెనారాస్ పట్టణంలో ఉపాధి పొందే వందలాది కూలీలకు కరోనా మరిన్ని కష్టాలను తీసుకువచ్చింది. రోజూ పని దొరికితే గానీ ఇళ్లు గడవని ఆ కుటుంబాల్లో కరోనా చిచ్చుపెట్టింది. ఓవైపు ఉపాధి లేక, మరోవైపు తింటానికి తిండిలేక గ్రామస్తులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తమను ఆదుకునే వారు ఎవరూ లేరని భావించారేమో.. పక్క గ్రామాలకు వెళ్లి చేతులు చాస్తున్నారు. దీనిపై కళ్లో అనే గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘రోజూ ఉదయం 8 కిలోమీటర్లు నడిచి.. ఆహారం వెతుక్కుంటున్నాం. రొట్టె, నీళ్లు తాగి ఉండాల్సి వస్తుంది. ఒక్కో రోజు కనీసం ఏమీ దొరకదు. గడిచిన రెండునెలల్లో చాలాసార్లు పస్తులు ఉన్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్‌తో తన పది నెలల పాపకు కనీసం పాలు కూడా పట్టలేని పరిస్థితి ఎదురైందని స్థానిక మహిళా రంజూ దేవీ తన గోడును వెళ్లబోసుకున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రోజూ రూ. 60తో పిల్లలకు పాలు, బిస్కెట్స్ కొనిపెట్టే వాళ్లమని, ప్రస్తుతం రూ.20తో రోజంతా సరిపుచ్చుతున్నామని చెప్పుకొచ్చారు. తన భర్త ఇంతకుముందు చేపలవేటకు వెళ్లి రోజూ రూ. 300 వరకు సంపాదించేవారని, ఇప్పుడు అది కూడా లేకపోవడంతో ఇళ్లు గడవడం కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరేకాదు ఇంకా అనేక మంది పేదలు దోమరి, దాని చుట్టపక్కల గ్రామాల్లో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమను ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు వారణాసి పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ తరువాత పరిస్థితులపై ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. -
ఒడి పట్టిన హీరో
లాక్డౌన్ వల్ల నడిచినవారు ఎందరో. వారిలో గమ్యం చేరిన వారు ఎందరో. మధ్యలో రాలిపోయినవారు ఎందరో. కరోనా కలకలంలో కొన్నే తెలిశాయి. కొన్ని తెలియకనే ముగిశాయి. తెలిసినవి మాత్రం అందరినీ కలవర పరిచాయి. స్పందించేవారు స్పందిస్తున్నా సాయం చేసేవారు చేస్తున్నా అనంతమైన సహాయం అందాల్సిన పరిస్థితిలో పేదలు ఉన్నారు. ఊహించని చోట నుంచి ఓదార్పు లభించినప్పుడు వారు కాస్తయినా ఊరట చెందుతున్నారు. బిహార్‌లోని ముజప్ఫర్పూర్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన అందరికీ తెలుసు. మే 25న మధ్యాహ్నం బిహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో ఒక శ్రామిక్ రైల్ ఆగింది. అందులో నుంచి ఒక శవాన్ని దించేశారు. అది ఒక స్త్రీ శవం. ఆమె పేరు అర్బినా ఖాతూన్. ఆమెకు రెండేళ్ల పసివాడు ఉన్నాడు. స్టేషన్లో శవానికి ఒక దుప్పటి కప్పి నేలన పరుండబెట్టాడు. ఆమె కొడుకు తల్లి నిద్రపోతూ ఉందని ఆడుకోవడం మొదలుపెట్టాడు. మధ్య మధ్య వచ్చి దుప్పటి తొలగించి తల్లిని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. కన్నతల్లి చనిపోయిందని తెలియని ఆ పసి కందు ప్రయత్నాన్ని వీడియో ద్వారా చూసి దేశమంతా మనసు బరువు చేసుకుంది. ఆ పసివాడి కోసం ఇప్పుడు నటుడు షారూక్ ఖాన్ స్పందించాడు. వాడి భవిష్యత్తు తానే చూసుకుంటానని అన్నాడు. లాక్డౌన్ తర్వాత ఎక్కడి వారక్కడే చిక్కుకుపోయిన వలస కార్మికులలో అర్బినా ఖాతూన్ ఒకామె. ఆమెను భర్త ఒదిలేశాడు. బిహార్ నుంచి గుజరాత్ వలస వెళ్లి పిల్లవాడితో బతుకుతూ ఉంది. మే 25న ఆమె అహ్మదాబాద్ నుంచి తన స్వస్థలం కతిహార్‌కు శ్రామిక్‌రైలులో బయలుదేరి మార్గమధ్యలో చనిపోయింది. ముజప్ఫర్‌పూర్‌లో ఆమె శవాన్ని దించేయాల్సి వచ్చింది. ఆకలి వల్ల చనిపోయిందో అనారోగ్యం వల్ల చనిపోయిందోగాని కడుపున పుట్టిన బిడ్డను అనాథను చేసింది. ఆ పిల్లాడు ఇప్పుడు కతిహార్‌లోని తాత, అమ్మమ్మల దగ్గర ఉన్నాడు. ఈ ఘటన షారుక్ ఖాన్ వరకూ చేరింది. పిల్లవాడిని తన ఆధ్వర్యంలో నడిచే మీర్ ఫౌండేషన్ దత్తత తీసుకొని వాడి బాగోగులు చూస్తుందని వెల్లడి చేశాడు. ‘తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని అతడు వ్యాఖ్యానించాడు. ‘ఆ వీడియోను నలుగురికీ తెలిసేలా చేసిన మిత్రులకు ధన్యవాదాలు’ అని తెలియచేశాడు. ఒక చిన్నారికి గట్టి ఆసరా దొరికింది. ఇంకా దొరకాల్సిన వారు వేనవేలు. -
కరోనాతో వాటికి మంచి జరిగింది!
న్యూయార్క్ : మనం చెడు అనుకున్నది ఇంకొకరికి మంచి అనిపించవచ్చు. కొందరికి నష్టం కలిగించేది.. మరికొందరికి లాభం చేకూర్చవచ్చు. కరోనా వైరస్ విషయంలో ఈ రెండు వాఖ్యాలు చెల్లుబాటవుతాయి. వైరస్ కారణంగా అమెరికా మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఒంటరిగా తమను పెంచుకునే వారు లేక ఇబ్బందిపడ్డ కొన్ని జంతువులు మాత్రం ఓ ఇంటివవుతున్నాయి. దేశంలోని జంతు సంరక్షణ కేంద్రాలు ఖాళీ అవుతున్నాయి. వివరాలు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇంటికి పరిమితమైన చాలామంది సంరక్షణ కేంద్రాల్లోని జంతువులను దత్తత తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో అమెరికాలోని చాలా మటుకు జంతు సంరక్షణ కేంద్రాలు ఖాళీ అవటం మొదలుపెట్టాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, గెనిపిగ్స్, కోళ్లను దత్తత తీసుకుంటున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో అమెరికన్లు ఇష్టమైన జంతువుల్ని దత్తత తీసుకుని సంతోషపడుతున్నారు. ( థూ.. నువ్వసలు మనిషివేనా? : వైరల్ ) -
రతన్ టాటా పోస్టుపై ప్రశంసల వర్షం!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (82) ఎక్కువగా సామాజిక సమస్యలపై స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పది నెలల వయసున్న ఓ శునకాన్ని ఎవరైనా దత్తత తీసుకోవాలని ఆయన కోరారు. ‘ఈ శునకం పేరు సూర్. ఇప్పటికే దీనిని చాలా మంది దత్తత తీసుకున్నారు. కానీ, ఇప్పుడది ఒంటరి అయింది. సూర్ని ఎవరైనా దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే మీకు తెలిసిన ఎవరైనా దీనిని దత్తత తీసుకునేందుకు సహకరించండి. గతంలో ఇలాగే ఓసారి మైరా అనే శునకానికి సంబంధించి పోస్టు పెడితే నన్ను ఫాలో అవుతున్న వాళ్లు ఆ శునకానికి మేలు చేశారు’ అని టాటా పేర్కొన్నారు. సూర్కు ఆశ్రయం కల్పించాలనే మంచి ఆలోచన కలిగిన వారు తన ఇన్స్టాగ్రామ్ లింక్‌లో పోస్ట్ చేయాలంటూ టాటా తెలిపారు. మైరాలాగే సూర్కు కూడా మంచి ఫ్యామిలీ దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక టాటా పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ తన వ్యాపారంలో బిజీగా ఉండే టాటా సామాజిక సమస్యలపై స్పందించే తీరు అభినందనీయమని ప్రశంసిస్తున్నారు. View this post on Instagram After having changed families multiple times, “Sur” no longer has a family to look after her. One can still see the spirit and love she carries and the hope to belong somewhere. It is heartbreaking to get attached to someone never to see them again. The last time, all of you generously helped me find Myra a loving family. I hope together we can do the same for “Sur”. If you think you can open your home to her, or know someone who can, give it some serious thought and fill in the link in my bio. I truly wait for the day when we no longer have to do this again. #onehomeatatime A post shared by Ratan Tata (@ratantata) on Mar 16, 2020 at 10:54pm PDT -
అడ్డగోలు దత్తత..!
మచిలీపట్నం: జిల్లాలోని కలిదిండి మండల కేంద్రంలో నిర్వహించిన దత్తత వ్యవహారం రిజిస్ట్రార్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారుల వైఫల్యాన్ని ఎత్తు చూపుతోంది. పిల్లలను పెంచుకోవాలనే ఆసక్తితో ‘దత్తత’ తీసుకునేందుకు ముందుకొచ్చే వారికి తగిన అవగాహన కల్పించటంలో ఐసీడీఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన నిబంధనలు పాటించకుండా దత్తతకు ప్రోత్సహిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలకు తూట్లుపడుతున్నాయి. ఫిర్యాదుల నేపథ్యంలో బాలల సంక్షేమ జిల్లా కమిటీ చైర్మన్ బీవీఎస్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పోలీసు, స్థానిక ఐసీడీఎస్ అధికారులు సమక్షంలో దత్తత విషయమై విచారణ చేపట్టారు. అసలేం జరిగిందంటే.. కలిదిండి మండల కేంద్రానికి చెందిన భోగేశ్వరరావు దంపతులు, ఇదే మండలంలోని కొండంగి గ్రామం నుంచి శిశువును దత్తత తీసుకున్నారు. అదే విధంగా కలిదిండికి చెందిన సాంబశివరావు దపంతులు ఒంగోలుకు చెందిన ఓ శిశువును దత్తత తీసుకున్నారు. దత్తతకు సంబంధించి జ్యుడీషియల్ స్టాంప్ పేపరుపై ఇరువురు అంగీకార పత్రాలను రాయించుకొని, వాటిని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. అయితే దత్తత స్వీకారంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ(కారా) నిబంధనలు పాటించలేదు. కానీరిజిస్ట్రార్ కార్యాలయంలో వీటికి చట్టబద్ధతకల్పించటం గమనార్హం. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ తప్పుపడుతోంది. పిల్లల దత్తత విషయంలో కఠినమైన చట్టాలు, పట్టిష్టమైన యంత్రాంగం ఉన్నప్పటకీ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. అధికారుల పాత్రపై అనుమానాలు.. పిల్లలపై ఆసక్తి ఉన్నందున దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన వారిని ఏమాత్రం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ వారిని చైతన్యపరిచి, పద్ధతి ప్రకారం దత్తత తీసుకునేలా చూడాల్సిన స్త్రీ శిశు సంక్షేమశాఖలోని సమగ్ర బాలల పరిరక్షణ విభాగపు (ఐసీపీఎస్) అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం వలనే సమస్య జఠిలమైంది. దత్తత తీసుకునే వారిని విజయవాడలోని ఐసీపీఎస్ విభాగపు అధికారుల వద్దకు పంపించామని స్థానిక ఐసీడీఎస్ సూపర్ వైజర్ లక్ష్మి చెబుతున్నారు. కానీ ఆ తరువాత ఎందుకిలా నిబంధనలను పక్కన పెట్టి దత్తతకు చట్టబద్ధత కల్పించారనేది తేలాల్సి ఉంది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. శిశు గృహాలు, లేదా ఇతరులు ఎవరివద్దనైనా పిల్లలను దత్తతు తీసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు రాష్ట్ర దత్తత రిసోర్స్ ఏజెన్సీ(సారా) నిబంధనల మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు దారుల వాస్తవికతను తెలుసుకునేందుకు సంబంధిత శాఖ వారు హోమ్ స్టడీ రిపోర్ట్(హెచ్ఆర్సీ), దత్తత తీసుకునే వారి ఆరోగ్యపరమైన అంశాలను ప్రస్తావిస్తూ నివేదిక ఇస్తారు. పిల్లలను దత్తత తీసుకున్న తరువాత వారి పోషణకు ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా, ఏదైనా సంక్రమిత వ్యాధులు ఉన్నాయా అనే దానిపై సమగ్ర పరిశీలన చేసిన మీదటనే నివేదిక ఇస్తారు. అన్ని రకాలుగా సంతృప్తి (లీగల్లీ ఫిట్ ఫర్ అడాప్షన్) చెందిన వారికే దత్తత తీసుకునేందుకు అనుమతులిస్తూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ధ్రువీకరిస్తుంది. పూర్తి వివరాలను ఆన్లైన్లో పెడతారు. పిల్లలు దత్తత తీసుకున్న తరువాత కూడా రెండు నెలల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాతనే పూర్తి స్థాయిలో దత్తత ప్రక్రియను ధ్రువీకరిస్తారు. పిల్లల విక్రయాలు, బాల కార్మికులుగా మారుస్తుండం, హెచ్ఐవీ వంటి వ్యాధులను విస్తరింపజేస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం దత్తత విషయంలో నిబంధనలు కఠిన తరం చేసింది. -
ఒక్కో మొక్కకు రూ.5,000
సాక్షి, హైదరాబాద్: ‘చెట్ల దత్తత’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఒక్కో పెద్ద మొక్క/చెట్టును రూ.5 వేలు చెల్లించి దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఏనుగులు మొదలుకుని చిన్న జంతువుల వరకు కార్పొరేట్ కంపెనీలు జంతు ప్రేమికులు, దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో భాగంగా ఆయా జంతువులను ఏడాది పాటే దత్తత తీసుకునే వీలుంది. ఒక సంవత్సరం పాటు ఆ జంతువులæ ఆహారం, పరిరక్షణకు అయ్యే ఖర్చును దత్తత తీసుకునే వారు భరించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా చెట్లను దత్తత తీసుకునే వారి పేరిట ఒక పెద్ద మొక్కను నాటి, అది పెరిగి పెద్దదయ్యే వరకు సంరక్షించే బాధ్యతను ఈ సంస్థ తీసుకుంటుంది. ఆ చెట్టుకు వారి పేరు పెట్టి, ఎప్పుడైనా సందర్శించి దానిని చూసుకునే వీలు కల్పిస్తోంది. ఈ మొక్కలను దత్తత ప్రక్రియ పూర్తయ్యాక తమ నర్సరీల్లో 12 నుంచి 15 అడుగుల ఎత్తున్న పెద్ద మొక్కలను నాటుతారు. ప్రస్తుతం ఈ కార్యక్ర మం కింద కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్ పార్కు, కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటి, సంరక్షించే కార్యక్రమాన్ని ఈ సంస్థ కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని కెనరా బ్యాంక్ మాసబ్‌ట్యాంక్ బ్రాంచ్ 200 పెద్ద మొక్కలను దత్తత తీసుకుంది. ఈ మొక్కల నిర్వహణ, పరిరక్షణ కోసం రూ.5 లక్షల మొత్తాన్ని కూడా విడుదల చేసింది. ఐటీ రంగానికి చెందిన పలువురు ఉద్యోగులు ఈ మొక్కలను దత్తత తీసుకునేందుకు ఈ సంస్థకు హామీ (ప్లెడ్జ్లు) పత్రాలిచ్చినట్టు అధికారులు తెలిపారు. దత్తతకు 3,500 అందుబాటులో.. ‘‘ప్రస్తుతం 3,500 మొక్కలు వెంటనే దత్తత తీసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. దత్తత తీసుకున్న మొక్కలను ఎంపిక చేసిన పార్కుల్లో నాటుతాం. ఒక క్యూబిక్ మీటర్ లోతులో ఎరువులు, ఎర్రమట్టి, ఇతర జాగ్రత్తలు తీసుకుని మొక్కలు నాటుతాం. దత్తత తీసుకున్న వారు అప్పుడప్పుడు వచ్చి మొక్కలను చూసుకోవచ్చు. 12 నుంచి 15 అడుగుల ఎత్తున పెద్ద మొక్కలు నాటుతున్నందున త్వరగా అవి పెరగడంతో పాటు మంచి ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. – ‘సాక్షి’తో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ పి.రఘువీర్ -
పిల్లలను దత్తత తీసుకున్నా మెటర్నిటీ లీవ్
సాక్షి బెంగళూరు: ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ఇచ్చే మెటర్నిటీ సెలవును ఇకపై పిల్లలను దత్తత తీసుకున్నావారికీ ఇవ్వనున్నారు. పిల్లలను దత్తత తీసుకున్న మహిళా ఉద్యోగికి 180 రోజులు, పురుష ఉద్యోగికి 15 రోజులు సెలవు లభించనుంది. చిన్నారిని దత్తత తీసుకున్న రోజునుంచే సెలవు అన్వయమవుతుంది. ప్రభుత్వ నియమాలప్రకారం ఇద్దరు పిల్లల దత్తతవరకే ఆ సెలవుకు అవకాశంఉంటుంది. -
భారత్‌లో బాలుడి హత్యకు లండన్‌లో కుట్ర!
సాక్షి, న్యూఢిల్లీ : గోపాల్ సజానిని రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లి పోయింది. అప్పటికే తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. సమీపంలో ఉండే అక్క వరుసయ్యే ఆల్ఫా కర్దాని జాలి తలిచి ఆ అబ్బాయిని చేరదీసింది. రెండంటే రెండే గదులుగల చిన్న ఇంట్లో గోపాల్ సహా తొమ్మిది మంది ఉండేవారు. గోపాల్ ఇంట్లో అన్ని పనులు చేయడంతోపాటు తోటి పిల్లలతోని దొంగా, పోలీసు ఆట ఆడుతూ పెరిగాడు. పెద్దయ్యాక బాలీవుడ్ చిత్రంలోలాగా ‘బాజీరావ్ సింగం’ అవుతానని చెబుతూ వచ్చే వాడు. గుజరాత్ జిల్లాలోని జునాగౌడ్ జిల్లా, మాలియా హతీనా గ్రామీణ ప్రాంతంలో నివసించే గోపాల్ అక్కడికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. 2017లో ఒక రోజు రాత్రి 9.30 గంటలకు రాంచీ నుంచి ఇంటికి కారులో తిరిగి వస్తుండగా, మోటారు సైకిళ్ల మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపాల్‌ను ఎత్తుకు పోయేందుకు ప్రయత్నించారు. పక్కనే తనతో వస్తోన్న అక్క అల్ఫా కర్దానీ భర్త, గోపాల్‌ను కాపాడేందుకు ప్రయత్నించగా, ఆగంతకులిద్దరు గోపాల్‌తో పాటు ఆయన్ని పొడిచారు. ఆగంతుకులకే కారు డ్రైవర్ సహకరించాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని రోడ్డు పక్కన పడేసి ఆగంతకులు వెళ్లి పోయారు. అల్ఫా కర్దాని భర్త అక్కడికక్కడే మరణించగా, గోపాల్ ఆస్పత్రిలో మరణించాడు. అప్పటికీ గోపాల్‌కు పదేళ్లు. ఈ హత్యపై దర్యాప్తు జరిపిన గుజరాత్ పోలీసులు హత్యకు మూలాలు లండన్‌లోని హాల్వెల్ నగరంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆర్తి ధీర్ అనే 55 ఏళ్ల మహిళ, ఆమె భర్త 31 ఏళ్ల కావల్ రాయ్‌జాడ కలిసి గోపాల్ హత్యకు కుట్రపన్నారు. 2013లో రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్న వారు తమకు పిల్లలు లేరంటూ గోపాల్‌ను దత్తతు తీసుకుంటామంటూ 2014వో చివరిలో వారు ఊరు వెళ్లారు. గోపాల్ దత్తతకు అతని అక్కతోని, బావతోని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే ప్రాంతంలో కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న కావల్ తండ్రి సహకారంతో ఈ ఒప్పందం కుదిరింది. 2015, జూలై నెలలో లండన్ దంపతులకు గోపాల్ దత్తత పత్రాలు అందాయి. ఇద్దరు కలిసి ముంబై వచ్చి 2015, ఆగస్టు 26వ తేదీన గోపాల్ పేరిట ‘వెల్త్ బిల్డిర్’ అనే ప్రత్యేకమైన పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీకి మామూలుకన్నా పది రెట్లు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అక్కడ లక్షా యాభై వేల పౌండ్ల పాలసీ, అంటే దాదాపు కోటి నలభై లక్షల రూపాయల పాలసీని తీసుకున్నారు. వీసా వచ్చాక గోపాల్‌ను తీసుకెళతామని చెప్పి వెళ్లిన ఆ లండన్ దంపతులు తిరిగి 2017లో వచ్చి వీసా ప్రాసెస్ కోసం అంటూ వచ్చి రాంచీకి గోపాల్‌ను కారులో తీసుకెళ్లి తిరిగి వస్తుండగా వారే కుట్ర పన్ని చంపించారు. గోపాల్ బతికి ఉంటే ఇప్పుడు అతనికి 13 ఏళ్లు ఉండేవి. వారు రెండు హత్యలు చేశారంటూ వెస్ట్ లండన్ హైకోర్టు గత జూలై నెలలోనే నిర్ధారించింది. అయితే ఆ దోషులను తమకు అప్పగించాలంటూ భారత్ పెట్టుకున్న పిటిషన్‌ను అక్కడి హైకోర్టు నాలుగు రోజుల క్రితమే కొట్టివేసింది. రెండు హత్య కేసుల్లో వారికి ఎలాంటి పెరోల్ సదుపాయం కూడా లేకుండా యావజ్జీవ కారాగారా శిక్ష విధించే అవకాశం ఉందని, ఇది తమ పౌరులకు ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తున్న చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందంటూ భారత్ పిటిషన్‌ను కొట్టివేశారు. దోషులను వదిలేశారు. వారు అక్కడ ప్రస్తుతం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తామెలాంటి నేరం చేయలేదని వారు ఇప్పటికీ వాదిస్తున్నారు. గోపాల్ది హత్య కేసుగా తేలడంతో ఎల్ఐసీ డబ్బులు కూడా వారికి అందలేదు. ఈ విషయమై భారత్ జాతీయ మీడియా పోలీసు ఉన్నతాధికారులను సంప్రతించగా, అక్కడి హైకోర్టు నిర్ణయాన్ని పైకోర్టులో సవాల్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఎప్పటికైనా గోపాల్ విషయంలో న్యాయం జరుగుతుందని, బ్రిటిష్ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గోపాల్ అక్కా అల్పా కర్దాని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానంతం నేరస్థులకు కూడా ప్రాథమిక హక్కులు వర్తించే విధంగా యురోపియిన్ యూనియన్ ఒడంబడిక మేరకు బ్రిటన్ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టాలను అడ్డు పెట్టుకొని బ్రిటన్ పౌరసత్వం కలిగిన భారతీయ ఆర్థిక నేరగాళ్లెందరో భారత్‌కు తీసుకరాకుండా తప్పించుకుంటున్నారు. -
అప్పుడు ఎన్కౌంటర్, ఇపుడు బిడ్డ దత్తత
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోనిఫరూకాబాద్‌లో పోలీసు అధికారి మానవత్వానికి పరిమళాన్ని అద్దారు. తండ్రి చేసిన నేరానికి అనాథగా మిగిలిన ఆడబిడ్డను ఆదుకునేందుకు చొరవ చూపారు. తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన ఉన్మాది సుభాష్ బాథమ్ కుమార్తె గౌరి (1)ని దత్తత తీసుకునేందుకు కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ ముందుకొచ్చారు. చట్టపరమైన అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ అధికారికంగా గౌరిని దత్తత తీసుకోనున్నారు. అంతేకాదు ఆ పాప బాగా చదువుకొని ఐపీఎస్ స్థాయికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. గౌరీ స్వతంత్రంగా మారే వరకు విద్య, ఇతర ఖర్చులను తామే భరిస్తామని, ఆమె ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నానని మోహిత్ అగర్వాల్ తెలిపారు.. ఆమెను తన స్వంత పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. గౌరీ ప్రస్తుతం పోలీసులు పర్యవేక్షణలో ఫరూఖాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని ముహమ్మదాబాద్ పట్టణంలోని కార్తియా గ్రామానికి చెందిన సుభాష్ బాథమ్..హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తూ..ఇటీవల బెయిల్‌మీద విడుదలయ్యాడు. ఇతనిపై ఇతర క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అయితే తనను జైలుకు పంపించారన్న ఆగ్రహంతో ఊరిమీద పగ తీర్చుకోవాలనుకున్నాడో ఏమో కానీ మారిపోయానంటూ ఊరివారినందరినీ నమ్మించాడు. జనవరి 30 న తమ కుమార్తె బర్త్‌డే వేడుకలకు రమ్మని స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచాడు. అలా వచ్చిన మొత్తం 23మంది చిన్నారులను ఇంటి నేలమాళిగలో బంధించడంతో పాటు కాల్చిపారేస్తానని బెదరించారు. దీంతో తమ పిల్లల్ని కాపాడాలంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ అనంతరం ఎట్టకేలకు సుభాష్‌ను ఎన్కౌంటర్ చేసి పిల్లలను విడిపించారు. ఈ క్రమంలో పారిపోతున్న సుభాష్ భార్య రూబీపై గ్రామస్తులు రాళ్లఎఒ దాడి చేయడంతో హాస్పిటల్ లో చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో సుభాష్, రుబీల కుమార్తె అనాథగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. చదవండి : ఫోన్లో చూసి, ఖైదీల సాయంతో పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య! దుర్మార్గుడి నుంచి పిల్లల్ని సురక్షితంగా కాపాడిన ఎన్ఎస్జీ -
గొంతు తగ్గించాల్సిన విషయం కాదు
కొన్ని విషయాలను మనమింకా గొంతు తగ్గించే మాట్లాడుతున్నాం. అయితే రుతుక్రమం విషయంలో స్వేచ్ఛగా బయటికి మాట్లాడితేనే సమాజంలో పేరుకు పోయిన నిషిద్ధ భావనను తొలగించగలం.. అని యు.కె.కి చెందిన చార్లెట్ అంటున్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదివిస్తున్నారు, ఉద్యోగాలకు పంపిస్తున్నారు. అయినప్పటికీ వాళ్లు చాలా సందర్భాల్లో మగపిల్లలతో పోటీ పడాల్సిన పరుగులో ఒకింత వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతోంది. మెన్స్ట్రువల్ పీరియడ్స్ వల్ల క్లాసులు మిస్ అవడం ఇందుకు ప్రధాన కారణం. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక ఎంట్రప్రెన్యూర్, ఒక ఆస్ట్రోనాట్... ఇలా ఎన్నో రంగాల్లో మహిళలకు అవకాశాలున్నాయి. వీటన్నింటిలోనూ అబ్బాయిలు ఉన్నంత సంఖ్యలో అమ్మాయిలు లేరు. పీరియడ్స్ అంటే సమాజంలో కరడు గట్టిపోయి ఉన్న ఒక కళంకిత భావనను తొలగించగలితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకోసమే యూకే నుంచి ఇండియాకి వచ్చాను’’ అన్నారు చార్లెట్ లియోన్హార్డ్సెన్. మాంచెస్టర్‌లోని ‘ద బ్యూరో కమ్యూనిటీ వెల్ బీయింగ్’ సంస్థలో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మేనేజర్‌గా ఉన్న చార్లెట్ బుధవారం ఇండియా వచ్చారు. మెదక్ జిల్లా, ఇస్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వెళ్తూ హైదరాబాద్‌లో సాక్షితో మాట్లాడారు. ‘‘కొన్ని మతపరమైన నిబంధనలు భారతీయ మహిళకు కనిపించని సంకెళ్లుగా మారుతున్నాయి. రుతుక్రమం అపరిశుభ్రం అనే భావనను వదిలించుకున్నప్పుడే సమాజం సమానత్వం దిశగా నడుస్తుంది. మరొక ప్రాణికి జన్మనివ్వాల్సిన ప్రకృతి సహజమైన ఏర్పాటును మలినం అని ఎలాగంటారు? ఈ విషయంలో మహిళలకు అవగాహన కల్పించడం అన్నది మనకు బయటకు కనిపిస్తున్న అంశం. నిజానికి మగవాళ్లను సెన్సిటైజ్ చేయడం అవసరం. మహిళల్లో ఈ కళంకిత భావనను తొలగించాలంటే వీలయినంత ఎక్కువగా దీని గురించి మాట్లాడడం ఒక్కటే మార్గం’’ అన్నారు చార్లెట్. ‘‘లండన్‌లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి భావన ఉంది. కానీ అక్కడ స్కూళ్లలో ఆడపిల్లలకు, మగపిల్లలకు కూడా పదేళ్ల వయసు నుంచే స్త్రీ–పురుష దేహాల మధ్య ఉండే తేడాలను వివరిస్తారు. అది అక్కడ పాఠ్యాంశాలలో భాగం. అలా పెరిగిన పిల్లలకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది గొంతు తగ్గించి మాట్లాడాల్సిన విషయంగా అనిపించదు. ఓపెన్‌గా మాట్లాడగలిగినప్పుడు ఇక సిగ్గుతో ముడుచుకోవాల్సిన అవసరమే ఉండదు కదా? బజారు నుంచి వచ్చేటప్పుడు స్టోర్ నుంచి తన కోసం శానిటరీ పాడ్స్ తీసుకురమ్మని అక్కడ ఒక మహిళ భర్తను అడగగలుగుతుంది. ఇండియాలో చదువుకున్న మహిళ కూడా భర్త ఎదురుగా స్టోర్ నుంచి శానిటరీ నాప్కిన్స్ పాకెట్ తీసుకోవడానికి బిడియ పడుతుంటుంది. ఇండియాలో ఉన్నంత తీవ్రంగా కాకపోయినప్పటికీ ప్రపంచంలో మరికొన్ని చోట్ల ఇలాంటి భావన ఇంకా ఉంది. దాని నుంచి మహిళకు విముక్తి కలిగించాలి. అందుకోసం ప్రపంచ దేశాల్లోని స్కూళ్లు, కాలేజ్‌లు, యూనివర్సిటీలను సందర్శించడమే పనిగా పెట్టుకున్నాను. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు రీ యూజబుల్ నాప్కిన్స్ని పరిచయం చేయడం కూడా నా పర్యటనలో ముఖ్యమైన భాగం. ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఇండియాలోని ‘రోజ్’ అనే స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంది. అమ్మాయిల కోసం స్కూల్లో ఆ సంస్థ ప్యాడ్స్ వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేసిన విషయం మాకు తెలిసింది. అక్కడి అమ్మాయిలకు టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు. వారికి రీ యూజబుల్ నాప్కిన్స్ తయారీలో శిక్షణ ఇవ్వడానికి వెళ్తున్నాను. తప్పని సరిగా పర్యావరణ హితమైన జీవనశైలితోపాటు, వ్యక్తిగత ఆరోగ్యకరమైన జీవనశైలిని పరిచయం చేయడమే నా ఈ పర్యటన ఉద్దేశం’’ అన్నారు చార్లెట్. – వాకా మంజులారెడ్డి -
షాహిదా బేగం ఇక నా దత్త పుత్రిక : ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు : ఓ పేద విద్యార్థినిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అక్కున చేర్చుకున్నారు. ఆమెను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రొద్దుటూరులో టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ సన్మాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు 6 తరగతి విద్యార్థిని షాహిదా బేగం జానపద గేయం పాడి అందరినీ అలరించింది. ఎమ్మెల్యే స్పందించి విద్యార్థినిని వేదికపైకి పిలిచారు. రూ.5వేలు నగదు బహుమతి అందించారు. మండలంలోని మీనాపురం గ్రామానికి చెందిన షాహిదాబేగంకు తండ్రి లేడని ఆయన తెలుసుకున్నారు. పేదరికంలో పుట్టిన ఆమె చదువుకు తాను పూర్తిగా సహకరిస్తానని వెంటనే ప్రకటించారు. ఎంత వరకు చదివినా ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. పెళ్లి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పడంతో హర్షధ్వానాలు మారుమోగాయి. ఎమ్మెల్యే నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. -
దొరికిన పాపాయి
‘అమృత’ సినిమా గుర్తుంది కదా.. మాధవన్ హీరోగా.. సీత, పార్థిబన్ల కూతురు టైటిల్ రోల్ పోషించిన మణిరత్నం సినిమా! శ్రీలంకలో అస్తిత్వ పోరాటం చేస్తున్న ఓ తమిళ యోధురాలు రామేశ్వరం (తమిళనాడు) కాందీశీకుల శిబిరంలో బిడ్డను కని.. పాపను ఇక్కడే వదిలేసి వెంటనే శ్రీలంక వెళ్లిపోతుంది అక్కడి తమిళుల విముక్తి పోరును ముందుకు నడిపించడానికి. ఆ శిబిరంలో ఈ పసికూనను వృత్తిరీత్యా ఇంజనీర్, ప్రవృత్తిరీత్యా రచయిత అయిన శ్రీనివాస్ దత్తత తీసుకుంటాడు. ఆ చంటిదాన్ని దత్తత తీసుకోవడం కోసమే ఇందిర అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ బిడ్డకు ‘అమృత’ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా చూసుకుంటూంటుంది ఆ జంట. ఇన్నేళ్లకు ఈ సినిమాను ఎందుకు గుర్తుచేయాల్సి వచ్చిందంటే.. ఇంచుమించు ‘అమృత’ లాంటి కథే బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి జీవితంలోనూ ఉంది. మిథున్ దత్తత తీసుకున్న అమ్మాయి పేరు దిశాని. చాన్నాళ్ల కిందటి సంగతి ఇది. బహుశా అప్పటికి అమృత సినిమా విడుదలై ఉండకపోవచ్చు. పశ్చిమ బెంగాల్లో జరిగిందీ సంఘటన. ఆడపిల్ల భారమనే అభిప్రాయంతో ఉన్న ఓ జంట తమకు పుట్టిన కూతురును రోడ్డు పక్కనున్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు.సన్నగా .. గొంతులో ఊపిరి పెట్టుకున్న ఆ పిల్ల పాలకోసం గుక్కపట్టి ఏడుస్తుంటే ఆ రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్లు చూసి.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థకూ విషయం తెలిసింది. ఆ పసిగుడ్డును తీసుకెళ్లి తమ హోమ్‌లో పెట్టుకున్నారు. ఇది వార్తగా మారి తెల్లవారి పత్రికల్లో, టీవీ చానళ్లలో వచ్చింది. అది మిథున్చక్రవర్తి కంటా పడింది. అతని మనసును కలిచివేసింది. అప్పటికే ముగ్గురు పిల్లలున్న మిథున్ నాలుగో బిడ్డగా ఆ పాపను సాకాలనుకున్నారు. భార్య యోగితాకు చెప్పాడు. ‘‘పదండి పాపను తెచ్చుకుందాం’’ అంది. వెంటనే ఆ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న హోమ్‌కు వెళ్లి .. ఆ పాపను దత్తత తీసుకుంటామని చెప్పారు ఈ తల్లిదండ్రులు. సంబంధించిన నియమ నిబంధలన్నిటికీ రాతపూర్వకమైన పూచీకత్తు ఇస్తూ ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకున్నారు. ‘దిశాని’ అని పేరు పెట్టుకున్నారు. ముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు... దిశానీకి తండ్రిలాగే సినిమాల్లో నటించడం ఇష్టం. దాన్నే కెరీర్‌గా ఎంచుకుంటానని తల్లి, తండ్రికి చెప్పింది. వాళ్లూ ‘‘ఓకే’’ అని.. అమ్మాయిని న్యూయార్క్‌లోని ఫిల్మ్ అకాడమీలో చేర్పించారు. నటనలో తర్ఫీదు కోసం. శిక్షణ తీసుకుంటున్న దిశాని చక్రవర్తి తెరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదీ మిథున్ చక్రవర్తి ‘అమృత’ కథ.సైలెంట్‌గా ఇలాంటి మంచి పనులెన్నో చేస్తూంటాడు మిథున్. ఓ ట్రస్ట్ పెట్టి దాని తరపున పేదవాళ్ల కొరకు ఆసుపత్రి, స్కూల్‌నూ నడిపిస్తున్నాడు. కుడిచేత్తో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే మాటను బాగా నమ్ముతాడట మిథున్ చక్రవర్తి. -
24 ఏళ్లకే మాతృత్వాన్ని అనుభవించా..
ముంబై : మాతృత్వం చాలా గొప్పదని, తాను 24 సంవత్సరాలకే అమ్మతనాన్ని అనుభవించానని మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇద్దరు కూతుర్లతో గడిపే ఫోటోలను నిత్యం పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకునే ఈ 43 ఏళ్ల బాలీవుడ్ నటికి ఇంతవరకూ పెళ్లికాలేదు. ఈమె 24 ఏళ్ల వయసులోనే రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 2010లో అలీసా అనే మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సుస్మితాసేన్ ఇటీవల ఓ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. దత్తత తీసుకోవడం సహజ మాతృత్వానికి ఏ మాత్రం తక్కువకాదని, సహజబంధం పేగు బంధం ద్వారా కనెక్ట్ అయితే.. దత్తత బంధం హృదయంతో కనెక్ట్ అయి ఉంటుందని తెలిపారు. ‘24 సంవత్సరాల వయసులోనే నేను తెలివైన నిర్ణయం తీసుకున్నాను. కొందరు ఇది ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయం అని, దాతృత్వం ఓ నటన అని విమర్శించారు. కానీ, నా దృష్టితో చూస్తే దత్తత అనేది సహజంగా పుట్టిన బంధానికి ఏమాత్రం తీసిపోదు. దత్తతతో నేను హృదయం నుంచి జన్మనిచ్చిన తల్లిని అయ్యాను. మాతృత్వం అనుభవించడాన్ని నేను ఏ రోజు కోల్పోలేదు. నా పిల్లలకి కూడా దత్తత అనే భావన లేదు. వారికి పుట్టుక రెండు రకాలని చెప్పాను. ఒకటి సహజంగా జరిగేది. అది ఒక జీవశాస్త్ర సంబంధమైనది. అందరూ ఎవరో ఒకరి కడుపు నుంచి పుడతారు. కాని మీరు నా హృదయం నుంచి పుట్టిన వారు, అందుకే నాకు ప్రత్యేకమైనవారు’ అని చెప్పానని తెలిపారు. సుస్మితాసేన్ ప్రస్తుతం మోడల్ రోహ్మన్ షాల్‌తో డేటింగ్లో ఉంది. వీరు వచ్చే శీతాకాలంలో పెళ్లిచేసుకోబోతున్నారని బాలీవుడ్ సమాచారం. -
దత్తత పేరుతో ఎన్నారై ఆలీ గ్రామాన్నే మింగేశాడు
ఎర్రావారిపాళెం(చిత్తూరు) : దత్తత ముసుగులో భారీ కుంభకోణానికి తెరలేపారంటూ ఎన్ఆర్ఐ అబ్దుల్ అలీ భూ ఆక్రమణపై రైతులు తిరుగుబాటు చేశారు. బుధవారం ఎర్రావారిపాళెం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. వారు మాట్లాడుతూ, దత్తత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రభుత్వ ఫలాలన్నీ బొక్కేశాడంటూ మండిపడ్డారు. గ్రామంలో కక్కూసు బిల్లుల నుంచి రైతులకందే ఉద్యాన నిధుల వరకు కాజేయడంలో అబ్దుల్‌అలీ సిద్ధ హస్తుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్ప్ ఫ్యాక్టరీ నిర్మిస్తానంటూ రైతులను బెదిరించి ఎర్రావారిపాళెం సమీపంలోని మబ్బుతోపు వద్దనున్న రైతుల భూములను ఆక్రమించడానికి పన్నాగం పన్నాడన్నారు. పలుమార్లు ఉన్నతాధికారులకు అబ్దుల్ అలీపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు ట్రైనింగ్ పేరిట ఉద్యానశాఖలోని ఉన్నత స్థాయి అధికారి అండతో నిధులను మింగేశారని చెప్పారు. దీన్‌దార్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్‌ను రైతుల కోసమంటూ ప్రభుత్వ రాయితీతో నిర్మించుకొని ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలను నడుపుతూ రైతులను అడ్డదిడ్డంగా బెదిరించ సాగారన్నారు. రైతులకు న్యాయం చేయాలి ఎన్ఆర్ఐ అబ్దుల్‌అలీ బారి నుంచి తమ వ్యవసాయ భూములను తమకు ఇప్పించాలంటూ రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. రైతు సంఘం పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన అబ్దుల్ అలీపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు న్యాయం చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. రైతులంతా ఏకమై వందలాదిగా తరలివచ్చారు. అబ్దుల్ అలీ అక్రమంగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో తమ భూములు కోల్పోయామంటూ తహసీల్దార్ దైవాదీనంకు విన్నవించారు. -
చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్సీపీ సత్తా
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబర్చింది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత చంద్రబాబు స్మార్ట్ విలేజ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానంటూ ప్రకటించారు. వరుసగా రెండేళ్లపాటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అరకులోయలోనే నిర్వహించి తాను దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీకి లెక్కలేనన్ని వరాలు ప్రకటించారు. కానీ గడిచిన ఐదేళ్లలో ఇక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అనే చందంగా ఉండడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. దత్తత పేరుతో తమను మోసగించిన చంద్రబాబుకు ఓట్ల రూపంలో గిరిజనులు బుద్ధి చెప్పారు. పరిణామాలిలా.. 2014 ఎన్నికల్లో అరకులోయతో పాటు పాడేరు నుంచి వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి తీసుకున్నారు. సర్వేశ్వరరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో పలుమార్లు హెచ్చరించిన మావోలు చివరకు గతేడాది సెప్టెంబర్‌లో హతమార్చారు. తర్వాత ఆయన తనయుడు శ్రావణ్‌కుమార్‌ను చట్టసభల్లో సభ్యత్వం కల్పించకుండానే మంత్రిని చేశారు. ఆరు నెలల గడువు ముగియడంతో ఎన్నికలముందే శ్రావణ్‌కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో కిడారి శ్రావణ్‌కుమార్ వైఎస్సార్సీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ చేతిలో ఘోర పరాజయంపాలయ్యారు. మిగిలిన పంచాయతీల మాటెలా ఉన్నా కనీసం చంద్రబాబు దత్తత తీసుకున్న పంచాయతీ పరిధిలో కూడా టీడీపీకి మెజార్టీ ఓట్లురాని దుస్థితి నెలకొంది. పెదలబుడు పంచాయతీలోని 22 గ్రామాల్లోనూ వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. పెదలబుడు పంచాయతీ పరిధిలోని 7 బూత్‌లలో పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణకు 1,176 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శ్రావణ్‌కుమార్‌కు 806 ఓట్లు దక్కాయి. 25,495 ఓట్ల మెజార్టీతో చెట్టి ఫల్గుణ ఘన విజయం సాధించారు. చంద్రబాబు దత్తత పంచాయతీ పెదలబుడులో ఉన్నవి 22 గ్రామాలు పెదలబుడు పంచాయతీలో ఓటర్లు 3,612 మంది + బూత్‌ల వారీగా లభించిన ఓట్లు పెదలబుడు బూత్ శ్రావణ్ ఫల్గుణ 216 71 134 217 58 89 208 88 140 209 104 113 210 109 196 211 216 343 పానిరంగిణి గ్రామం 235 160 161 -
తల్లిదండ్రుల కోసం.. ఇరవై ఏళ్ల తరువాత ఇండియాకు
టీ.నగర్: నాలుగేళ్ల వయసులో నెదర్లాండ్ కుటుంబానికి దత్తత వెళ్లిన యువకుడు ప్రస్తుతం తన తల్లిదండ్రుల కోసం చెన్నైలో అన్వేషిస్తున్నాడు. ఇందుకు అతని పెంపుడు తల్లి, సోదరుడు సహకరిస్తున్నారు. వివరాలు.. చెన్నై తిరువేర్కాడు శ్రీ షణ్ముగనగర్‌లోగల అనాథాశ్రమంలో 20 ఏళ్ల క్రితం నెదర్లాండ్‌కు చెందిన జూరీ ట్రెండ్, విల్మానెయిస్ట్ దంపతులు నాలుగేళ్ల వయసున్న లక్ష్మణ్‌ను దత్తత తీసుకుని తమతో పాటు తీసుకెళ్లారు. వీరికి ఇది వరకే నీల్స్ ట్రెండ్ అనే కుమారుడు ఉన్నాడు. గత 20 ఏళ్లుగా నెదర్లాండ్‌లో ఉంటున్న లక్ష్మణ్‌కు తన అసలైన తల్లిదండ్రులను చూడాలన్న ఆశ కలిగింది. దీంతో అతను పెంపుడు తల్లిదండ్రులకు తన కోరిక తెలపడంతో వారు సమ్మతించారు. జూరి ట్రెండ్ తన భార్య, కుమారుడితో ఈనెల ఐదో తేదీన లక్ష్మణ్‌ను భారత్‌కు పంపాడు. కొన్ని రోజుల క్రితం చెన్నై చేరుకున్న వారు లక్ష్మణ్ తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. దీనిగురించి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోను, రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలోను వారు పిటిషన్ అందజేశారు. లక్ష్మణ్ నెదర్లాండ్‌లోని ఒక సూపర్మార్కెట్లో పనిచేస్తున్నాడు. -
దత్తత మాట గుర్తేలేదు
సాక్షి, శ్రీకాకుళం : మాట్లాడితే అక్కడ అభివృద్ధి చేశాం. ఇక్కడ అభివృద్ధి చేశామని బీరాలు పలికే ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వారి సొంత గ్రామం, దత్తత గ్రామాలనే గాలికొదిలేశారు. దీంతో తల్లికి తిండి పెట్టనోడు పిన తల్లికి గాజులు పెడతాడా అంటూ ఆయా గ్రామాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం మౌలిక వసతులు కల్పించండి మహా ప్రభో అంటూ వేడుకుంటున్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సొంత గ్రామం పెనుబర్తి. ఈ గ్రామాన్ని సందర్శించిన వారెవరైనా అయ్యోపాపం అనే అంటారు. ఎందుకంటే ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామాన్ని కూన రవికుమార్ కుటుంబమే గత 15 ఏళ్లుగా పాలిస్తున్నారు. అయినప్పటికీ అభివృద్ధి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అన్నీ అవస్థలే పెనుబర్తి గ్రామాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గ్రామానికి కనీసం పంచాయతీ భవనం లేకపోవడం దారుణం. కొన్ని వీధుల్లో మురికి కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్డు మీదనే నిలిచిపోతోంది. అంగన్వాడీ భవనాలు లేకపోవడంతో ఒకటో నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని పెనుబర్తి ప్రాథమిక పాఠశాలలో, రెండో నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐఆర్‌పురం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇకపోతే గ్రామంలోకి ప్రవేశించే రహదారి పూర్తిగా రాళ్లు తేలి అధ్వానంగా ఉంది. అలాగే ఆరేళ్ల క్రితం నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. పశువుల ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల బిల్లులు అందలేదని స్థానికులు వాపోతున్నారు. బిల్లులు అందించడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులకు పింఛన్లు అందడం లేదని, ఎరువులను ఎక్కువ ధరకే కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. కబ్జాల్లో మాత్రం ముందంజ దత్తత గ్రామం అభివృద్ధికి నోచుకోపోయినా భూకబ్జాలకు నిలయంగా మారిందని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిట్టివలస గ్రామం సంగమేశ్వర కొండ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో పట్టాలు మంజూరు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిళ్లకు, మామూళ్లకు తలొగ్గిన రెవిన్యూ అధికారులు సుమారు 10 ఎకరాల కొండ భూమిలో టీడీపీ కార్యకర్తలకు పట్టాలు మంజూరు చేశారు. దీంతో భూమిని కబ్జా చేసుకుని దత్తత గ్రామాన్ని కబ్జా పర్వంలో ముందంజలో ఉంచారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను అమ్ముకోలేక పోయాం ఈ ఏడాది వరి పంటను పండించినప్పటికీ అమ్ముకోలేకపోయాం. ధాన్యం కొనుగోలుకు కూడా ఎమ్మెల్యే ఎటువంటి సాయం చేయలేదు. సొసైటీలు ద్వారా యూరియా రూ.320లకు కొనుగోలు చేశాం కానీ అదే యూరియా బయట రూ.300లకే దొరికింది. విత్తనాలను కూడా అధిక ధరలకే అమ్మారు. గ్రామాన్ని, రైతులను ఆదుకోవడానకి ఆయన దృష్టి సారించలేదు. – కూన రాజ్‌కుమార్, రైతు, పెనుబర్తి -
ఇబ్రహీంపూర్‌కు ప్రశంసలు
సిద్దిపేట రూరల్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పలువురు ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. బుధవారం మండల పరిధిలోని ఇబ్రహీంపూర్‌ను హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందు తున్న నూతన సర్పంచ్‌లు, ట్రైనీ అధికారులు సందర్శించారు. ఇంకుడు గుంతలు, ఉపాధి హమీ పను ల్లో భాగంగా నిర్మించిన సామూహిక గొర్రెల షెడ్లు, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, బాలవికాస నీటి శుద్ధీకరణ పథకం, ఫాం పాండ్స్, గోదాం, పార్క్, పందిరి సాగు వంటి అభివృద్ధి పనులను పరిశీలించి అబ్బుర పడ్డారు. హరితహారం, స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులు అవలంభిస్తున్న ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు గ్రామం అంతటా తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతోపాటు, గ్రామస్తుల ఐక్యత ఎంతో బాగుందని, ఎక్కడా చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచడం చాలా గొప్పవిషయమని అన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న ప్రణాళికలను తమ గ్రామాల్లో అవలంభిస్తామన్నారు. కార్యక్రమంలో సుమారు 35 మంది ప్రతినిధులు, అధికారుతోపాటు గ్రామ సర్పంచ్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మానాన్నలు దొరికారోచ్..
కన్నవారు పేగు బంధాన్నితెంచుకుంటే.. మనసున్న వారు ఆ బంధాన్ని అపురూపంగా అందుకున్నారు.కర్కశంగా వదిలి వెళ్లిన ఆ చిన్నారులకు అన్నీ తామవుతామని ముందుకు వచ్చారు. వారు అనాథలు కాదని ఇక నుంచి అందరూ ఉన్న వారంటూ ఆప్యాయంగా వారిని ఒడిలో చేర్చుకున్నారు. ఇప్పటి వరకు శిశుగృహ సంరక్షణలో ఉన్న వారికి నేడు ‘అమ్మానాన్నలు దొరికారు’. తూర్పుగోదావరి , కాకినాడ సిటీ: కాకినాడ శిశుగృహ సంరక్షణలో ఉన్న ఆడ శిశువులను కారా నిబంధనలకనుగుణంగా దత్తత స్వీకరణకు దరఖాస్తు చేసుకున్న దంపతులకు మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా అప్పగించారు. 2017 జూన్ 12న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎన్ఐసీయూలో వదిలివెళ్లిన ఆడశిశువును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు కాకినాడలోని శిశు గృహం సంరక్షణలో చేర్పించారు. ఈ శిశువు కోసం బయోలాజికల్ తల్లిదండ్రులు తగిన ధ్రువీకరణలతో క్లెయిమ్ చేయాలని పత్రికా ముఖంగా ప్రకటన జారీ చేయగా ఎవరి నుంచి క్లెయిమ్ దాఖలు కాకపోవడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ బాలికకు అరుణ పేరున నామకరణం చేసి 2017 సెప్టెంబర్ 1న చట్టప్రకారం దత్తత అప్పగించేందుకు బాలిక వివరాలను కారా వెబ్సైట్లో ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గ్రాండ్ ఫోర్క్స్ ఏఎఫ్‌బీ నార్త్ డకోటా నివాసులైన జాషువా ఓబోల్జ్, ఎమి ఓబోల్జ్ దంపతులు అరుణను దత్తత స్వీకరించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలను పరిశీలించి న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఒక సంవత్సరం 9 నెలలు వయస్సు కలిగిన బాలిక అరుణను చట్టప్రకారం మంగళవారం ఓబోల్జ్ దంపతులకు దత్తత అప్పగించారు. దత్తత తల్లిదండ్రులు తమ బిడ్డకు లిడియా అరుణ ఓబోల్జ్గా పేరు పెట్టుకున్నారు. చెన్నై నివాసులకు.. 2018 సెప్టెంబర్ 30న ముమ్మిడివరం ప్రకాష్ కాంప్లెక్స్ సమీపంలోని విష్ణాలయం వద్ద 15 రోజుల వయస్సు కలిగిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు విడిచి వెళ్లారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ఈ శిశువుకు సంజన అని నామకరణం చేసి కాకినాడ శిశుగృహం సంరక్షణలో ఉంచారు. బయోలాజికల్ తల్లిదండ్రులు తగిన ధ్రువీకరణలతో క్లెయిమ్ చేయాలని పత్రికా ముఖంగా కోరినా ఎవరూ రాలేదు. దీంతో డిసెంబర్ 7, 2018న చట్టబద్ధమైన దత్తత అప్పగించేందుకు కారా వెబ్సైట్లో సంజన వివరాలు ప్రకటించారు. దీంతో దత్తత స్వీకరణకు చట్టపరమైన అన్ని అర్హతలు పూర్తి చేసి తమిళనాడు, చెన్నై నివాసులు జి నటరాజు, విష్ణుప్రియ దంపతులకు సంజనను దత్తత అప్పగించారు. ఈ బిడ్డలను దత్తత చేపట్టిన దంపతులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్–2 సీహెచ్ సత్తిబాబు, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, ఏపీడీ పి.మణెమ్మ, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సిహెచ్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
సింహానికి చిరుత దత్తత!
అహ్మదాబాద్: సాధారణంగా చిరుతపులులను చూస్తే సింహాలు వేటాడతాయి. అయితే గుజరాత్లో ఓ ఆడ సింహం చిరుత పులి పసికూనను కంటికి రెప్పలా చూసుకుంటూ దానికి పాలు కూడా ఇస్తోంది. ఇలా జరగడం చాలా అసాధారణమని అటవీ అధికారులు చెబుతున్నారు. నెలన్నర వయసున్న చిరుతకూన గిర్ అడవిలో ఎలానో తన తల్లి నుంచి వేరుపడింది. దీనిని సింహం అక్కున చేర్చుకుంది. తన పిల్లలతోపాటే దీనికీ పాలిస్తూ, మగ సింహాల దాడి నుంచి కాపాడుతోంది. వారం క్రితం ఈ వింతను అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా విడుదల చేశారు. ‘చిరుతపులి పిల్లపై ఈ సింహం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ కాపాడుతోంది. అలాగే సింహం సంకేతాలు, శబ్దాలను పులి పిల్ల ఎలా అర్థం చేసుకుంటుందోనని మేం ఆశ్చర్యపోతున్నాం. ఏదేమైనా ఇది చాలా అరుదైన ఘటన’ అని గిర్ అడవి పశ్చిమ విభాగ కన్జర్వేటర్ ధీరజ్ మిత్తల్ చెప్పారు. -
మరోసారి దాతృత్వాన్ని చాటిన లారెన్స్
సామాజిక సేవలో నిత్యం ముందుంటారు నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్. ఇప్పటికే ఎందరో దివ్యాంగులకు పునర్జన్మనిస్తూ.. అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకోవడానికి నేనున్నానంటూ ముందుంటారు లారెన్స్. తాజాగా లారెన్స్ రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంగోట్టయ్యన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాఠశాలలే భవిష్యత్ సంతతిని ఉన్నతంగా తీర్చిదిద్దే దేవాలయాలని పేర్కొన్నారు. ఆ పాఠశాలలకు ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరిస్తే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్ధులు వాటిని దత్తత తీసుకుని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వ్యాఖ్యలకు నటుడు రాఘవ లారెన్స్ స్పందించి.. చెన్నై, పాడి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల, చెంజీ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల దత్తత తీసుకున్నారు. ఈ పాఠశాలలు లారెన్స్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం పునఃప్రారంభోత్సవ వేడుకను జరుపుకున్నాయి. ఈ వేడకల్లో పాల్గొనాల్సిన రాఘవలారెన్స్.. తన తల్లి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి పొందుతున్నందున హాజరు కాలేకపోయారు. ఆయనకు బదులుగా నటి ఓవియాను ఆ వేడుకలకు పంపిచారు. పాఠశాలల దత్తత అన్నది ఈ రెండు ప్రభుత్వ పాఠశాలతో ఆగదని, తన వల్ల ఎంత సాధ్యమో అన్ని పాఠశాలను దత్తత తీసుకుంటానని తెలిపారు. తాను ఎలాగూ చదువుకోలేకపోయానని, చదువుకునే పిల్లలైనా ప్రశాంతంగా చదువుకోవాలని ఆయన అన్నారు. -
దత్తత తీసుకుంటున్నా
‘తిత్లీ’ తుఫాను బాధితులకు సినీ ఇండస్ట్రీ సాయంగా నిలుస్తోంది. పలువురు హీరోలు తమ వంతు సహాయం చేస్తున్నారు. తాజాగా హీరో రామ్ చరణ్ వరద బాధిత గ్రామాల్లో ఒకదాన్ని దత్తత తీసుకుంటానని ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ‘‘శ్రీకాకుళం, విజయనగరంలోని వరద బాధిత ప్రదేశాలను బాబాయ్ పవన్‌కల్యాణ్ సందర్శించారు. ఒక బాధిత గ్రామాన్ని దత్తత తీసుకోమని నాకు చెప్పారు. ఒకరికి సహాయం చేసి, చిన్న మార్పు తీసుకురాగలిగే స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాబాయ్ ఇలాంటి ఆలోచనతో రావడం సంతోషంగా అనిపించింది. ఈ దిశగా మా టీమ్‌తో చర్చలు జరుపుతున్నాను. ఏ గ్రామాన్ని దత్తత తీసుకుని సహాయం చేయబోతున్నామో మా టీమ్ సర్వే జరిపి, త్వరలోనే మీ అందరికీ తెలియజేస్తాం’’ అన్నారు. -
తిత్లీ బాధిత గ్రామాన్ని దత్తత తీసుకోనున్న చెర్రీ
ఏపీలో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. తుపాను ప్రభావంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్ద మొత్తంలో సంభవించింది. తిత్లీ తుపాను బాధితులకు సహాయంగా ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు ఆపద సమయంలో తమ వంతు సహాయాన్ని అందిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. అయితే తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ విపత్తు పై స్పందించారు. తుపాను బాధిత ప్రాంతాల్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తానని తెలిపాడు. ఇప్పటికే తిత్లీ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ సెలబ్రెటీలు అల్లు అర్జున్ 25 లక్షలు, ఎన్టీఆర్ 15లక్షలు, విజయ్ దేవరకొండ 5లక్షలు, నందమూరి కళ్యాణ్ రామ్ 5లక్షలు, వరుణ్ తేజ్ 5లక్షలు, కొరటాల శివ 3లక్షలు, అనిల్ రావిపూడి లక్ష, సంపూర్ణేష్ బాబు యాభై వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకున్న ప్రణీత
యశవంతపుర : సొంత గడ్డపై నటి ప్రణీత తన మమకారం చాటుకున్నారు. అక్కడ ఎలాంటి సదుపాయాలకు నోచుకొని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. రూ.5 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ప్రణీత మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది బెంగళూరు అయినప్పటికీ తన తండ్రి పుట్టింది మాత్రం ఆలూరులోనని పేర్కొన్నారు. సొంతూరు ఆలూరులో ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని భావించి పాఠశాలను దతత్త తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించడంతోపాటు తరగతి గదుల రూపురేఖలను మార్చి విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలలను దత్తత తీసుకొనే ఆలోచన ఉందన్నారు. అంతేగాకుండా విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించేందుకు కృషి చేస్తానన్నారు. -
బడిని దత్తత తీసుకున్న నటి ప్రణీత
బెంగళూరు: నటి ప్రణీత తన పెద్ద మనసును చాటుకుంది. అందరూ ఊర్లను, పిల్లల్ని దత్తత తీసుకుంటే ప్రణీత ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. స్నేహితులు కోరడంతో... గతేడాది బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి సిద్ధమైంది. ఆ సమయంలో బడి వాతావరణాన్ని, పిల్లలు చదివే విధానాన్ని గమనించింది. అక్కడ ఏడో తరగతి చదివే విద్యార్థికి కూడా ఆంగ్లభాషలో కనీస పరిజ్ఞానం లేదని గుర్తించింది. అదే కాదు ఆ బడిలో ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. అది చూసి అలాంటి పాఠశాలల రూపురేఖల్ని మార్చాలని అనుకుంది. అందులో భాగంగా మొదట హసన్ జిల్లా, ఆలూరులోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. ఈ విషయమై ప్రణీత మాట్లాడుతూ.. ‘మా నాన్న పుట్టిన ఊరు హసన్‌లోని ఆలూరు గ్రామం. తరువాత బెంగళూరుకు వచ్చేశారు. నేను పుట్టి, పెరిగింది బెంగళూరులోనే అయినా మా సొంతూరుని మర్చిపోలేనుగా. అందుకే ఆలూరును ఎంచుకున్నా. అక్కడి పాఠశాల అభివృద్ధికోసం రూ.5లక్షలను అందించా. విద్యార్థినులకు మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించడానికి, తరగతి గదుల రూపురేఖల్ని మార్చడానికి ఈ సొమ్మును వినియోగిస్తున్నాం. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలల్ని దత్తత తీసుకునే ఆలోచన కూడా ఉంది. కేవలం బడికి సౌకర్యాలు అందించడమే కాదు... వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నాం. ఇందుకు అవసరమైన ప్రణాళికల్ని మా స్నేహితులమంతా ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటున్నామ’ని చెప్పింది. -
కేరళ వరదలు: హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ విరాళం
సాక్షి, ముంబై: ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేరళ వరద బాధితులకు భారీ సహాయాన్ని ప్రకటించింది. పదికోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే కేరళలో వరదలకు గురైన 30 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతోపాటు ఆగస్టు మాసానికి సంబంధించి పలు లోన్లపై చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులపై లేటు ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని డొనేట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఆపద సమయంలో కేరళ ప్రజలకు అండగా నిలబడాలని తాము భావించామని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి చెప్పారు. త్వరలోనే కేరళ ప్రజలు కోలుకొని సాధారణమైన స్థితికి చేరుకోవాలని ప్రార్థించారు. గ్రామాల దత్తతలో భాగంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని బ్యాంకు తెలిపింది. దీంతోపాటు ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అంతేకాదు జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నామని బ్యాంకు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోపాటు లాభాపేక్ష లేని స్థానిక భాగస్వాముల సహాకారం ఈ కార్యక్రమాలను సుదీర్ఘ ప్రణాళికగా చేపడతామని వివరించింది. -
నేను.. మా మమ్మీ, డాడీ!
సాక్షి, హైదరాబాద్: ఫ్రాంక్ ఆంటోనీ–పమేలా దంపతులది అమెరికాలోని న్యూజెర్సీ. ఉన్నత కుటుంబానికి చెందిన ఆంటోనీ–పమేలా వ్యాపార రంగంలో ఉంటూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. కానీ వారికి సంతానం కలగలేదు. పిల్లలు లేక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ శిశు గృహంలోని ఓ మూడేళ్ల బాలికను దత్తత తీసుకున్నారు. ఇలాంటి దంపతులు ఎందరో.. శిశుగృహాల్లోని పిల్లలు ఇప్పుడు విదేశాలకు దత్తతకు వెళ్తున్నారు. రాçష్ట్రంలో ఇప్పటికి 43 మంది పిల్లలు ఇలా దత్తత తీసుకోవడంతో విదేశాలకు వెళ్లారు. అనాథ శిశువులను దత్తత తీసుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్లైన్ దత్తత కార్యక్రమం ఎల్లలు దాటిపోతోంది. ప్రపంచం నలుమూలల నుంచి చిన్నారులను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల దత్తత ప్రక్రియలో ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి చెందిన పిల్లలను విదేశీ యులు దత్తత తీసుకుంటున్నారు. అమెరికా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌కు చెందిన కుటుంబాలు మన రాష్ట్రంలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. డెన్మార్క్ దేశానికి చెందిన మార్టిన్ దంపతులు నల్లగొండ జిల్లాకు చెందిన బాలికను దత్తత తీసుకున్నారు. నిబంధనలు మార్చాక ఇలా.. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న అనాథ చిన్నారులను అయినా దత్తత తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. దీని కోసం ప్రత్యేకంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. దత్తత తీసుకోవాలనుకునే వారు ఈ వెబ్సైట్ విధానంతోనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దీంట్లోనూ స్వదేశం(ఇన్ కంట్రీ), విదేశీ(ఇంటర్ కంట్రీ) పేరుతో రెండు విధానాలున్నాయి. స్వదేశీ విధానంతో భారతీయులు, రెండో విధానంతో విదేశీయులు మన దేశంలోని పిల్లలను దత్తత తీసుకోవచ్చు. మన దేశంలోని అనాథ పిల్ల లను విదేశీయులు దత్తత తీసుకునేందుకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ప్రక్రియ జరుగుతుంది. ఆన్లైన్లో నమోదు చేసిన ప్రభుత్వ సంస్థలలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు మన దేశీయులు ఎవరూ సుముఖత వ్యక్తం చేయని సందర్భాల్లో రెండో ఆప్షన్ కింద విదేశీ దత్తత కేటగిరీలోకి మారుస్తారు. దీనికి 90 రోజులు గడువు ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఆ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చిన విదేశీయులు ‘కారా’ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అక్కడి ఏజెన్సీలు దత్తతకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. పిల్లల పెంపకానికి ఇబ్బంది లేదని నిర్ధారించిన అనంతరం దత్తత ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే స్వదేశీ దత్తత మార్గదర్శ కాల మేరకు దత్తత పొందేందుకు దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దంపతుల సొంత రాష్ట్రంతోపాటు మరో రెండు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా మూడు రాష్ట్రాల నుంచి పిల్లలను ఎంపిక చేసుకోవచ్చు. ఆన్లైన్ పద్ధతితో జాప్యం లేకుండా గరి ష్టంగా 30 రోజులలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పాత నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలంటే కనీసం ఏడాదిన్నరపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. -
అమ్మ ప్రేమ గెలిచింది
నర్సంపేట : కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతీ దేవత అమ్మే కదా... అనే సినీగీతాన్ని సార్థకం చేసింది ఓ పెంపుడు తల్లి ఉదంతం.. సరిగ్గా ఏడాది క్రితం నర్సంపేట బస్టాండ్ సమీపంలో ఓ మహిళకు పసిపాప దొరకగా అక్కున చేర్చుకుంది. చావుబతుకుల్లో ఉన్న పాపకు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించి పెంచుకుంది. అయితే తను కట్టుకున్న భర్త చైల్డ్‌లైన్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నాలుగు నెలల క్రితం వారు బిడ్డను స్వాధీనం చేసుకున్నా రు. చట్టం ఒప్పుకోదనే సాకుతో అమ్మ ప్రేమకు దూరం చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ పెంపుడు తల్లి అధికారులను ప్రతిఘటించి న్యా య పోరాటం చేసింది. ఆమె పోరాటం ఫలించి ఆ బిడ్డను తానే దక్కించుకుంది. మంగళవారం అధికారికంగా ఆ బిడ్డను అధికారుల నుంచి స్వాధీనం చేసుకుని తల్లిప్రేమను చాటుకుంది. నర్సంపేట పట్టణంలో నివాసముంటున్న దాసరి హైమావతిది చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామం.. 25 సంవత్సరాల క్రితం సాంబయ్య అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో భర్త సాంబయ్య హైమావతితో గొడవపడి చాలా కాలంగా వేరొక మహిళతో కలిసి ఉంటున్నాడు. న్యాయం చేయాలని పెద్దమనుషులను ఆశ్రయించడంతో నెలకు రూ.3000లు భర్త నుంచి ఇప్పించేందుకు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలోనే 2017 ఆగస్టులో పట్టణంలోని బస్టాండ్ వద్ద .. పాన్‌షాపుల మధ్యలో పసిగుడ్డు అరుపులు వినపడింది.. అటుగా వెళ్తున్న హైమావతి గమనించి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండగా అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది. స్థానికంగా ఉన్న వైద్యులు పాప పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తీసుకువెళ్లి బతికించుకుంది. నాటి నుంచి ఆ పాపను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటోంది. తనపేరుతో ఉన్న కొద్దిపాటి ఆస్తి.. హైమావతి పెంచుకుంటున్న పాపకు దక్కుతుందనే దురుద్దేశంతో భర్త సాంబయ్య బెదిరింపులకు దిగి 2018 ఏప్రిల్ 13న చైల్డ్‌లైన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అదేరోజు అధికారులు హైమావతి నివసిస్తున్న ఇంటికి వచ్చి పాప గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏప్రిల్ 16న బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచగా విచారణ చేస్తున్న క్రమంలోనే.. పాపను తన నుండి దూరం చేయవద్దని తన పేర ఉన్న ఆస్తిని పాప పేరిట రిజిస్టర్ చేయిస్తానని హైమావతి వేడుకుంది . ఈ క్రమంలోనే ఏప్రిల్ 30న జిల్లా కలెక్టర్ హరిత వద్దకు నర్సంపేటకు చెందిన కౌన్సిలర్ బండి ప్రవీణ్ , అంగన్వాడీ సంఘం బాధ్యురాలు నల్లా భారతితో కలిసి వెళ్లి విన్నవించింది. దీంతో కలెక్టర్ మే 5న సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ముందు హాజరుకావాలని సూచిం చారు. హైమావతి పోరాటానికి మహిళా సంఘాలు మద్దతుగా నిలుస్తూ సంఘీభావాన్ని తెలిపా యి. ఇటీవల చైల్డ్వెల్ఫేర్ కమిటీ నూతన చైర్మన్ మండల పరశురాములును కలిసి పాపను తనకు ఇవ్వాలని వేడుకుంది. ఎట్టకేలకు మంగళవారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధ్యులు పాపను పెంచుకునేందుకు అధికారికంగా అంగీకరించి హైమావతికి అప్పగించారు. దీంతో ఆమె పోరాటం విజయవంతమైంది. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం డివిజన్ అధ్యక్షుడు కామిశెట్టి రాజు, సీపీఐ ఎంఎల్ పార్టీ డివిజన్ కార్యదర్శి మోడెం మల్లేషం పాల్గొని పెంపుడు తల్లికి బిడ్డను ఇవ్వడంపై అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రేమా? రుగ్మతా?
హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీకి ఆరుగురు పిల్లలున్నారు. అందులో ముగ్గురు దత్త పుత్రులు కాగా మరో ముగ్గురు బ్రాడ్ పిట్, ఏంజెలినా దంపతులకు జన్మించినవారు. ఇప్పుడు మరో బాబు లేదా పాపను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట ఏంజెలినా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంజెలినాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. బ్రాడ్‌పిట్‌తో విడాకుల తర్వాత పిల్లల సంరక్షణ, తండ్రితో ఎక్కువ సమయం గడపనివ్వడం లేదని కేస్ విషయమై ప్రస్తుతం ఈ మాజీ భార్యా భర్తలు కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. ఏంజెలినా నటించిన తాజా చిత్రం ‘మాలిఫిసెంట్ 2’. ఈ సినిమా ప్రమోషన్స్ తర్వాత దత్తత తీసుకోవాలనుకుంటున్నారట. ఏంజెలినాకు పిల్లలంటే భలే ఇష్టమని కొందరు, ‘ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్’తో (జీవితంలో ఏదో వెలితి ఉందనే రుగ్మత) బాధపడటం వల్లే ఇలా చేస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు. పిల్లలు పెద్ద వాళ్లు అవ్వడంతో తన అవసరం ఇంక ఉండకపోవచ్చని భావించడం ఆ సిండ్రోమ్ లక్షణాలట. మరి ఏంజెలినాది ప్రేమా? సిండ్రోమా? ఏదైతేనేం.. ఆమె దత్తత తీసుకునే బిడ్డ లక్కీ అని చెప్పాలి. మంచి జీవితం దొరుకుతుంది కదా. అన్నట్లు.. ఏంజెలినా తన కడుపున పుట్టిన బిడ్డలకు సమానంగా దత్తత తీసుకున్నవారిని కూడా చూస్తారట. కంటేనే అమ్మ అని అంటే.. ఎలా? కడుపు తీపి తెలిసిన ప్రతి తల్లీ తల్లే అనాలి. ఏంజెలినా.. ఓ మంచి మదర్ అని హాలీవుడ్ వారు అంటారు. -
చిన్నారి దత్తతపై వివాదం
సాక్షి, బోనకల్ ఖమ్మంజిల్లా : మండలంలోని రావినూతల గ్రామంలో రెండు నెలల చిన్నారి దత్తతపై గ్రామస్తుల ఫిర్యాదుతో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన దారెల్లి సునీల్, ఉషారాణి దంపతులకు ఐదుగురు కుమార్తెలున్నారు. రెండు నెలల క్రితం పుట్టిన ఐదవ కుమార్తెను కృష్ణా జిల్లా నందిగామ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి భీమయ్య, సంధ్య దంపతులకు దత్తత ఇచ్చేదుకు రాసుకున్న ఒప్పందంలో చిన్నారి సంరక్షణకు అర ఎకరం పొలం ఇచ్చేటట్లు అంగీకరించారు. ఈ నెల 9న చిన్నారిని భీమయ్య దంపతులు తీసుకెళ్లారు. చిన్నారికి ఇస్తనన్న పొలం విషయంలో సమస్య రావడంతో పాటు గ్రామంలో చిన్నారి వ్యవహారంపై చర్చ జరిగి కొందరు 1098కు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ మాలతి, 1098 అధికారి నాగమణి, పోలీసు సిబ్బంది రావినూతలలో సోమవారం విచారణ నిర్వహించారు. పాప తల్లిదండ్రులను వివరాలు అడిగి మంగళవారం పాపను ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకు రావాలని ఆదేశించారు. -
వీధి కుక్కలు విదేశాలకు చెక్కేస్తున్నాయి..
నోయిడా : ఆ వీధి కుక్కల దశ తిరిగింది. ఒకప్పుడు తిండి దొరక్క దుర్భర జీవితాన్ని గడిపి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆ కుక్కలు ఇప్పుడు ఖరీదైన ఆహారం తింటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ‘‘కన్నన్ ఎనిమల్ వెల్ఫేర్’’ అనే స్వచ్ఛంద సంస్థ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వీధి కుక్కలను చేరదీస్తోంది. వాటి ఆరోగ్యం మెరుగు పరిచి శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది. అందులో భాగంగా కుక్కలను పెంచుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపే విదేశీయులకు వాటిని దత్తత ఇస్తున్నారు. వీరు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా దాదాపు 90కుక్కలను విదేశాలకు పంపారు. వీధి కుక్కలను పెంచుకుంటున్న విదేశీయులు సైతం వాటి ప్రవర్తన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఆనందాన్ని దత్తత తీసుకున్నాం
‘‘సరిగ్గా ఏడాది క్రితం మా లైఫ్‌లోకి మరింత ఆనందాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ ఆనందం పేరే నిషా’’ అంటున్నారు సన్నీ లియోన్. ఆనందాన్ని అడాప్ట్ చేసుకోవడమేంటీ అనుకుంటున్నారా? గతేడాది జూలైలో సన్నీ లియోన్, ఆమె భర్త డానియల్ కలసి నిషా కౌర్‌ను దత్తత తీసుకున్నారు. నిషాని మా ఫ్యామిలీలో భాగం చేసుకొని ఏడాది అయిపోతోందంటూ ట్వీటర్లో తమ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు సన్నీ లియోన్. ‘‘ఒక సంవత్సరం క్రితం నిన్ను (నిషా) మాతో తీసుకురావడంతో మా లైఫ్‌ని మార్చేసుకున్నాం. ఈరోజు నీ ఫస్ట్ యానివర్శరీ. గడిచింది కేవలం ఒక్క సంవత్సరమే అయిందంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అప్పుడే నీతో జీవితకాల పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తోంది. నా హార్ట్, సోల్లో నువ్వు భాగం అయిపోయావు. ప్రపంచంలోనే బ్యూటిఫుల్ గర్ల్ నువ్వు’’ అని నిషాని ఉద్దేశించి పేర్కొన్నారు సన్నీ లియోన్. -
ఏకకాల ఎన్నికలకు రజినీ మద్దతు
సాక్షి, చెన్నై: లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్రం ప్రతిపాదనకు ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ మద్దతు తెలిపారు.అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగితే సమయం, ఖర్చు ఆదా అవుతాయని రజినీ అన్నారు. అలాగే 277 కి.మీ. పొడవైన, రూ.పదివేల కోట్లతో చేపట్టనున్న చెన్నై–సేలం 8 వరుసల రహదారి ప్రాజెక్టునూ ఆయన సమర్థించారు. ఈ ప్రాజెక్టు సాగు, అటవీ భూములకు చేటు అంటూ కొందరు వ్యతిరేకిస్తుండగా.. అభివృద్ధి జరగాలంటే ఇలాంటివి అవసరమేననీ, అయితే భూములు కోల్పోయే వారికి తగిన నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. బాలుడి దత్తత: పాఠశాలకు వెళ్తున్నప్పుడు రూ.50 వేలు డబ్బు దొరకగా నిజాయితీతో దానిని పోలీసులకు అప్పగించిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్‌ను దత్తత తీసుకుంటానని రజినీ ప్రకటించారు. ఈరోడ్‌కు చెందిన యాసిన్‌తోపాటు, అతని తల్లిదండ్రుల్ని రజినీకాంత్ తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. బాలుడికి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఆయన.. ఆ పిల్లాడి ఉన్నత విద్యకయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని చెప్పారు. -
అనాథ శిశువు అయ్యింది అమెరికా అమ్మాయి
శివాజీనగర(కర్ణాటక): ఏడాది కిందట చెత్తకుప్పలో అనాథ శిశువుగా దొరికిన అన్విత తొలి పుట్టినరోజు వేడుకలు శనివారం హాసన్‌లోని తవరు చారిటబుల్ ట్రస్ట్‌లో ఘనంగా జరిగాయి. విదేశాల నుంచి వచ్చిన దంపతులు ఈ శిశువును దత్తత తీసుకున్నారు. ఒక ఆడశిశువును హొళె నరసిపురలో కుప్పతొట్టిలో పడేసి వెళ్లిపోవడంతో చీమలు, ఉడుతలు కరవడంతో పసిగుడ్డు రోదిస్తుండగా, స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. తరువాత హాసన్ జిల్లా ఆసుపత్రికి చేర్చగా వైద్యుల చికిత్సలో ప్రాణాలతో బయటపడింది. త్వరలో అమెరికాకు హాసన్‌లో డాక్టర్ పాలాక్షప్ప నేతృత్వంలోని తవరు చారిటబల్ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందిన అన్వితా శనివారం తొలి పుట్టిన రోజును జరుపుకుంది. కలెక్టర్ రోహిణి సింధూరి ప్రత్యేకంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈసందర్భంగా అమెరికాకు చెందిన రెండు జంటలు ఇందులో పాల్గొన్నాయి. అన్వితతో పాటు మరొక చిన్నారిని వారు దత్తత తీసుకున్నారు. దీంతో అనాథ శిశువు అమెరికా అమ్మాయి అయ్యిందని పలువురు ఆనందం వ్యక్తంచేశారు. వీసా తదితరాలు కొన్ని రోజుల్లో పూర్తిచేసుకుని అన్వితను అమెరికాకు తీసుకెళ్తామని అమెరికన్ దంపతులు తెలిపారు. -
చంపింది దత్త పుత్రుడే..
ఆదిలాబాద్‌రూరల్: దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కొడుకే కాలయముడయ్యాడు. నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన ఎల్ఐసీ ఉద్యోగి గేడాం గోవర్ధన్‌ను అతని దత్తత కుమారుడు నితీన్తోపాటు నితిన్ అన్న మడావి లింగేశ్వర్, స్నేహితులు మెస్రం రాము, డి.అమర్, కుమ్రె సాహిర్, గేడాం పింటులు హత్య చేశారని డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం మావల పోలీస్‌స్టేషన్‌లో ఆదిలాబాద్‌రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై అనిల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దత్తత కుమారుడు నితిన్ వ్యవహర శైలి నచ్చకపోవడంతో తండ్రి గోవర్ధన్ నా వద్ద నుంచి వెళ్లిపో అని మందలించాడు. దీంతో నితిన్ అప్పటి నుంచి తండ్రితో గొడవ పడుతూవస్తున్నాడు. దత్తత తీసుకున్న తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోమన్నడంతో తాను ఆస్తి కోకొల్పోతానని భావించిన నితిన్ హత్యకు పథకం పన్నాడు. ఇదే విషయంపై నితిన్ సోదరుడు జైనథ్ మండలంలోని పెండల్వాడకు చెందిన మడావి లింగేశ్వర్తో చర్చించాడు. సోదరుడు లింగేశ్వర్ మహారాష్ట్రలోని బోరి గ్రామానికి చెందిన మెస్రం రాము, దాడంజే అమర్, కుమ్రె సాహిర్‌తో మాట్లాడారు. గోవర్ధన్‌ను హత్య చేయడానికి వారితో రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. లింగేశ్వర్ వద్ద డబ్బులు లేకపోవడంతో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకొని, అడ్వాన్స్ కింద రూ.10వేలు ఇచ్చాడు. కారులో వెళ్లి అదే రోజు రాత్రి సినిమా చూశారు. అనంతరం 26న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో గోవర్ధన్ నిద్రిస్తున్న సమయంలో మెస్రం రాము, దడేంజ అమర్ ఇంట్లోకి వెళ్లి క్లచ్ వైర్ మెడకు వేసి నోటి నుంచి శబ్ధం రాకుండా గొంతు నొక్కి చంపారు. భార్య రాధాబాయి గోవర్ధన్ మృతిపై తనకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దత్తత కుమారుడు నితిన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు తెలిశాయని డీఎస్పీ వివరించారు. ఈ మేరకు గేడం నితిన్, మడావి లింగేశ్వర్, మెస్రం రాము, కెమ్రె సాహిర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మిగతా ఇద్దరు దడంజే అమర్, కారుడ్రైవర్ గేడం పింటు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి నుంచి కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
చట్టవిరుద్ధంగా బాలుడి స్వీకరణ
కనిగిరి: ఏడేళ్లుగా పిల్లలు లేక తిరుగుతున్న ఓ నిరక్షరాస్య జంట.. బిడ్డను వదలించుకోవాలనే ఓ బాధ్యత రహిత్యం గల తల్లి.. వెరసి ఓ బాలుడిని చట్టవిరుద్ధ దత్తత శ్రీకారానికి దారితీసింది. వాస్తవానికి ఆ బాలుడు దత్తతస్వీకర్తల వద్ద అల్లారుముద్దుగా పెరుగుతున్నా.. ఆ నోట ఈనోట విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి చేరింది. ఐసీడీఎస్ అధికారులు బాలుడిని దత్తత తీసుకున్న దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం కనిగిరిలో వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసుస్టేషన్లో ఐసీడీఎస్ అధికారులు బాలుడిని స్వాధీనం చేసుకుని ఒంగోలు డీసీపీఓకు అప్పగించారు. వివరాలు.. హెచ్‌ఎంపాడు మండలం వేములపాడుకు చెందిన ధనలక్ష్మి, చెన్నకేశవులు దంపతులకు పెళ్లి జరిగి ఏడేళ్లయినా సంతానం లేరు. కూలీనాలి చేసుకుని జీవించే వీరు పిల్లల కోసం ఆస్పత్రిల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వేములపాడుకు చెందిన లారీ డ్రైవర్ అంకయ్య.. వేరే ప్రాంతం నుంచి వెన్నపూస ధనలక్ష్మిని (రెండో భార్యగా, వివాహం లేదు) తెచ్చుకుని సహజీవనం చేస్తున్నాడు. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. ఈ క్రమంలో కొద్దికాలం నుంచి అంకయ్యకు, వెన్నపూస ధనలక్ష్మికి మనస్పర్థలు వచ్చి రోజూ గోడవపడి కొట్టుకుంటున్నారు. ధనలక్ష్మి కూలి పనులకు వెళ్లే మహిళలతో తన బిడ్డను ఎవరికైనా ఇస్తానని చెబుతోంది. పిల్లలు లేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ధనలక్ష్మి అత్త తిరుపాలమ్మకు కొందరు విషయం చేరవేశారు. ధనలక్ష్మి కూడా తిరుపాలమ్మకు ఫోన్ చేసింది. ఈ నెల 11న కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్‌లో చెట్టు వద్ద వెన్నపూసల ధనలక్ష్మి తన బిడ్డను ఇష్టపూర్వకంగా ఇస్తున్నానని.. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మూడు నెలల బాలుడిని అప్పగించింది. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం వేములపాడులో సెక్టార్ సమావేశానికి వెళ్లిన సీడీపీఐ లక్ష్మీప్రసన్న దృష్టికి బాలుడి దత్తత విషయం వెళ్లింది. ఆమె విచారణ చేపట్టి వారి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది నిరక్ష్యరాస్యులైన తిరుపాలమ్మ, కొడలు ధనలక్ష్మిలు జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు. నగదు ఇచ్చి బాలుడిని చట్టవిరుద్ధ దత్తతగా(కొనుగోలు చేయడం) నేరంగా తెలిపి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసుస్టేషన్లో మూడు నెలల బాలుడిని సీడీపీఓకు అప్పగించారు. బాలల సంరక్షణ కార్యాలయానికి సమాచారం అందించారు. డీసీపీఓ జిల్లా అధికారి జ్యోతి సుప్రియకు బాలుడిని అప్పగించినట్లు సీడీపీఓ లక్ష్మీప్రసన్న విలేకరులకు తెలిపారు. అత్త, కొడలిపై కేసు రూ.20 వేలు ఇచ్చి అత్త, కొడలు తిరుపాలమ్మ, ధనలక్ష్మిలు చట్టవిరుద్ధంగా బాలుడిని కొనుగోలు చేశారని ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీడీపీఓ ఫిర్యాదు మేరకు అత్త, కోడలిపై సెక్షన్ 81 బాలల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. -
యువతిని దత్తత తీసుకున్న కమల్
తిరువళ్లూరు: మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ దత్తత తీసుకున్న గ్రామంలో సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు. సినీనటుడు కమల్‌హసన్ రాజకీయ పార్టీనీ ఏర్పాటు చేసిన తరువాత ప్రజల్లో తిరుగుతూ సేవాకార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా దినోత్సవం రోజున (మార్చి 8) జరిగిన కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని అధిగత్తూరు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అనంతరం తన టీమ్‌ను అధిగత్తూరులో పర్యటింప చేసి వాస్తవ పరిస్తితులను అడిగి తెలుసుకోవడంతో పాటు మే 1న గ్రామంలో పర్యటించి పలు హమీలు ఇచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి కోసం ప్రత్యేక ప్రాజెక్టులు పక్కా గృహాలు ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్టు ప్రకటించారు. అయితే కమల్ పర్యటన ముగిసిన రెండు నెలల తరువాత సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు. యువతిని దత్తత తీసుకున్న కమల్: తాజాగా కమల్ కార్యచరణలో వేగం పెంచారు. అధిగత్తూరు గ్రామానికి చెందిన దినసరి కూలీ ముత్తు. ఇతని భార్య లక్ష్మి. వీరికి సునీత అనే కుమార్తె వుంది. ముత్తు 2010లో మరణించాడు. లక్ష్మి కూలీ పనులను చేసుకుంటూ కుమార్తె సునీతను చదివిస్తోంది. పదో తరగతి పరీక్షల్లో 370 మార్కులు సాధించిన సునిత, ప్లస్‌టూలోనూ 652 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అయితే పైచదువులు చదివించే స్తోమత లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని పంచాయతీ మాజీ అధ్యక్షుడు చిదంబరనాథన్ కమల్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని చెన్నైకు పిలిపించుకున్న కమల్ వారి ఆర్థిక స్థితిగతులను ఆరా తీశారు. సునీత చెప్పిన మాటల్లో ఆత్మవిశ్వాసాన్ని గుర్తించిన కమల్ యువతిని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. మూడేళ్లు ఉచితంగా చదివిస్తానని ఆపై పోషణ బాధ్యత తీసుకుంటానని ప్రకటించి వెంటనే తిరునిండ్రవూర్‌లోని ప్రైవేటు కళాశాల్లో డిగ్రీలో చేర్పించారు. ఆదే విధంగా అధిగత్తూరు కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న మాలశ్రీ, డేవిడ్ ప్రియా తదితరులకు ఐదు లక్షల వ్యయంతో అరుదైన ఆపరేషన్ చేయించారు. మొత్తానికి కమల్ దత్తత తీసుకున్న గ్రామంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు. గ్రామంలో 130 ఉచిత మరుగుదొడ్ల నిర్మాణం సైతం సోమవారం ఉదయం ప్రారంభమైంది. -
పూస పూసలో ప్రేమ
ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఒక్కోలా వ్యక్తపరుస్తారు. బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ మాత్రం పూసల్లో ప్రేమను చూపించారు. విషయం ఏంటంటే... తన దత్తపుత్రిక నిషా కోసం ఏదైనా గిఫ్ట్‌గా ఇవ్వదలుచుకున్నారు సన్నీ లియోన్. చిన్న చిన్న పూసలతో ఒక ఆర్ట్‌ని డిజైన్ చేయడం మొదలెట్టారు. 2017 అక్టోబర్‌లో మొదలెట్టిన ఈ ఆర్ట్ వర్క్‌ని కంప్లీట్ చేయడానికి సన్నీకి సుమారు ఏడు నెలలకుపైగా పట్టిందట. ఒక్కో పూసను తన చేత్తోనే బోర్డ్‌పై అంటిస్తూ 12 రామచిలుకలు వరుసగా కూర్చున్న ఫొటోను తయారు చేశారు సన్నీ లియోన్. కంప్లీట్ అయిన ఆర్ట్‌వర్క్ ఫొటోను షేర్ చేస్తూ ‘‘నిషా కోసం పూసలతో ఓ ఆర్ట్ వర్క్ చేయాలనుకున్నాను. లాస్ట్ అక్టోబర్‌లో స్టార్ట్ చేసిన ఈ పెద్ద ప్రాజెక్ట్‌ను రీసెంట్గా కంప్లీట్ చేశాను. కొన్ని వేల పూసలని నేనే స్వయంగా అంటించాను’’ అన్నారు. కుమార్తె నిషాని ఉద్దేశించి... ‘ఈ బొమ్మలో ప్రతి పూస అంటిస్తున్నప్పుడు నీ గురించే ఆలోచించాను. నీ మీద నాకెంత ప్రేమ ఉందో తెలుసుకున్నాను’’ అని పేర్కొనారు సన్నీ లియోన్. ఆర్ట్ స్టార్టింగ్ ఫైనల్ ఆర్ట్ -
ఎల్లలు దాటిన ‘ప్రేమ’
మహబూబ్‌నగర్ రూరల్ : మాతృత్వం.. ఆ భావన అనిర్వచనీయం.. పెళ్లయిన ప్రతీ మహిళా తల్లి కావాలని కోరుకుంటుంది.. పుట్టిన బిడ్డలో తమ ప్రతిరూపాన్ని చూసుకుంటూ చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తారు.. అదే భావన పురుషులకూ ఉంటుంది.. అయితే, మారుతున్న జీవనశైలితో సంతాన లేమి సమస్య పలువురికి చెప్పలేని ఆవేదనను మిగులుస్తోంది.. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్న పలువురు తమకు సంతానం లేదన్న బెంగ తీర్చుకుంటున్నారు... అలాంటి వారిలో విదేశీయులు కూడా ఉండడం.. వారు పాల మూరు శిశుగృహ నుంచి పిల్లల దత్తత తీసుకుని తల్దిండ్రుల ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తుండడం విశేషం. అభాగ్యులు ఎందరో.. ఏ పాపం తెలియని పలువురు శిశువులను అమ్మ పేగు తెంచుకుని పుట్టిన మరుక్షణమే ముళ్ల పొదలపాలు చేస్తున్నారు. కళ్లు కూడా తెరవని పసికందులను అనాథలుగా మారుస్తున్నారు. కారణాలేమైనా ఇలాంటి పిల్లలెందరో తమ తప్పు లేకున్నా రోడ్డు పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనలు పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఆయా సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో పిల్లలను శిశుగృహకు చేర్చుతున్నారు. ఇంకా కొందరు తల్లిదండ్రులు తాము పిల్లలను పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇలాం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు చేరుకుంటున్న వారిలో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. వేధిస్తున్న సంతాన లేమి ఆధునిక జీవన విధానం, మానసిక ఒత్తిడి తదిత కారణాలు సంతాన లేమికి దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆధునిక వైద్య విధా నాలు అందుబాటులోకి వచ్చినా.. అందరికీ సంతాన భాగ్యం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో సంతానం కోసం ఏళ్ల తరబడి పరితపిస్తున్న జంటలు చివరికి చట్టపరమైన దత్తతకు మొగ్గు చూపుతున్నాయి. దత్తత ప్రక్రియ ఆన్లైన్ విధా నంలో పారదర్శకంగా జరుగుతుండడంతో గడిచిన ఏడేళ్లలో పాలమూరు శిశుగృహ ద్వారా ఎందరో చిన్నారులు ‘అమ్మానాన్న’ల ఒడికి చేరా రు. 2010లో శిశుగృహ ఏర్పాటు చేయగా, 2011 నుంచి దత్తత ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు 111 మంది శిశువులు దత్తతకు వెళ్లగా.. అందులో నలుగురు బాలికలు విదేశాలకు వెళ్లారు. సంతాన లేమితో బాధపడుతున్న జంటలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ చట్టపరంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తోంది. రోజుల వయçస్సు ఉన్న పసికందుల నుంచి 18 ఏళ్ల వయసున్న బాలల వరకు చట్ట ప్రకారం దత్తత తీసుకునే వీలుంది. ఎక్కువ శాతం నాలుగేళ్ల లోపు పిల్లలను దత్తత తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గడిచిన ఏడేళ్లలో శిశుగృహ నుంచి 111 మంది చిన్నారులను దత్తత ఇచ్చారు. అందులో 93 మంది బాలికలు, 18 మంది బాలురు ఉన్నారు. సులువైన చట్టాలు రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పిల్లలను దత్తత తీసుకునేందుకు పలువురు విదేశీ దంపతులు ముందుకొస్తున్నారు. స్వీడన్, ఇటలీ, మాల్టా వంటి దేశాలకు చెందిన దంపతులు పిల్లలు లేరనే బాధను విడనాడి జిల్లాకు వచ్చి అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారం విదేశాలకు శిశువులను దత్తత తీసుకువెళ్లాలంటే ఎన్నో అవరోధాలు ఉంటాయని తొలుత భావించేవారు. అయితే అందుకు భిన్నంగా సులువైన చట్టాలు ఉండడంతో ఇక్కడి చిన్నారులను విదేశాలకు తీసుకువెళ్లి తల్లిదండ్రుల ప్రేమను పంచుతున్నారు. విదేశాలకు.. శిశుగృహలోని చిన్నారులను ఎంతోమందికి చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నారు. ఇందులో స్వీడన్‌కు ఒకరు, ఇటలీ దేశానికి ఇద్దరు ఆడపిల్లలు, మాల్టా దేశానికి ఒక పాప చొప్పున దత్తత ఇచ్చారు. ప్రస్తుతం స్పెయిన్ దేశానికి ఒక మగ, ఒక ఆడ శిశువు, మాల్టా దేశానికి ఒక పాప, అమెరికాకు ఒక పాపను దత్తత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో చట్టబద్ధంగా అన్ని అర్హతలు గుర్తించి, ప్రక్రియ పూర్తయ్యాక వీరిని ఆయా దంపతులకు అప్పగించనున్నారు. పారదర్శక విధానం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత ప్రక్రియను పారదర్శక విధానంలో నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా శిశుగృహలో 11 మంది పిల్లలను దత్తత ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా 47 మంది దంపతులు దత్తత కోరుతూ దరఖాస్తులు ఇచ్చి వేచి చూస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలుకుని దత్తత కోరుకునే జంటలకు పిల్లలను అప్పగించడం వరకు ప్రక్రియలన్నీ ఆన్లైన్ విధానంలోనే స్త్రీ, శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తుంది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి జాబితాలో సీనియార్టీ ప్రకారం చట్టపరమైన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను దత్తత ఇస్తున్నారు. దత్తతకు వెళ్లిన పిల్లలు తాము వెళ్లిన చోట ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని రెండేళ్ల పాటు సంబంధిత శాఖ పర్యవేక్షిస్తుంది. మగ, ఆడ పిల్లలనే తేడా లేకుండా తమకంటూ సొంత వారు ఉంటే చాలు అనే భావన దత్తత కోరుకుంటున్న జంటల్లో కనిపిస్తుంది. దత్తతకు వెళ్తున్న వారిలో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. కాగా, ఆరోగ్యం, ఆర్థిక స్థోమత కలిగి భార్యాభర్తల వయస్సు కలుపుకుని 90 ఏళ్ల నుంచి 110 ఏళ్లు కలిగిన వారికే పిల్లలను దత్తత ఇస్తారు. చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆడపిల్లలకైతే ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లల విషయంలోనైతే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. చట్టబద్ధంగా దత్తతకు ఓకే.. పిల్లలు కావాలనే తపనతో చాలామంది దళారుల వలలో పడి మోసపోతున్న ఘటనలు అక్కడకక్కడా చూస్తున్నాం. అయితే శిశువులను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న దంపతులు చట్టబద్ధంగానే ముందుకు సాగాలి. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకుంటే జైలుశిక్ష, జరిమానా ఉంటుంది, న్యాయపరమైన ఇబ్బందులు సైతం ఎదురవుతాయి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్ ద్వారా లేదా మా కార్యాలయంలో సంప్రదించడం ద్వారా దత్తత నిబంధనలు, వివరాలు తీసుకోవచ్చు. -
ఎల్లలు దాటిన ‘ప్రేమ’
మహబూబ్‌నగర్ రూరల్: మాతృత్వం.. ఆ భావన అనిర్వచనీయం.. పెళ్లయిన ప్రతీ మహిళా తల్లి కావాలని కోరుకుంటుంది.. పుట్టిన బిడ్డలో తమ ప్రతిరూపాన్ని చూసుకుంటూ చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తారు.. అదే భావన పురుషులకూ ఉంటుంది.. అయితే, మారుతున్న జీవనశైలితో సంతాన లేమి సమస్య పలువురికి చెప్పలేని ఆవేదనను మిగులుస్తోంది.. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్న పలువురు తమకు సంతానం లేదన్న బెంగ తీర్చుకుంటున్నారు... అలాంటి వారిలో విదేశీయులు కూడా ఉండడం.. వారు పాలమూరు శిశుగృహ నుంచి పిల్లల దత్తత తీసుకుని తల్దిండ్రుల ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తుండడం విశేషం. అభాగ్యులు ఎందరో.. ఏ పాపం తెలియని పలువురు శిశువులను అమ్మ పేగు తెంచుకుని పుట్టిన మరుక్షణమే ముళ్ల పొదలపాలు చేస్తున్నారు. కళ్లు కూడా తెరవని పసికందులను అనాథలుగా మారుస్తున్నారు. కారణాలేమైనా ఇలాంటి పిల్లలెందరో తమ తప్పు లేకున్నా రోడ్డు పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనలు పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఆయా సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో పిల్లలను శిశుగృహకు చేర్చుతున్నారు. ఇంకా కొందరు తల్లిదండ్రులు తాము పిల్లలను పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇలాం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు చేరుకుంటున్న వారిలో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. వేధిస్తున్న సంతాన లేమి ఆధునిక జీవన విధానం, మానసిక ఒత్తిడి తదిత కారణాలు సంతాన లేమికి దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆధునిక వైద్య విధా నాలు అందుబాటులోకి వచ్చినా.. అందరికీ సంతాన భాగ్యం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో సంతానం కోసం ఏళ్ల తరబడి పరితపిస్తున్న జంటలు చివరికి చట్టపరమైన దత్తతకు మొగ్గు చూపుతున్నాయి. దత్తత ప్రక్రియ ఆన్లైన్ విధా నంలో పారదర్శకంగా జరుగుతుండడంతో గడిచిన ఏడేళ్లలో పాలమూరు శిశుగృహ ద్వారా ఎందరో చిన్నారులు ‘అమ్మానాన్న’ల ఒడికి చేరా రు. 2010లో శిశుగృహ ఏర్పాటు చేయగా, 2011 నుంచి దత్తత ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు 111 మంది శిశువులు దత్తతకు వెళ్లగా.. అందులో నలుగురు బాలికలు విదేశాలకు వెళ్లారు. సంతాన లేమితో బాధపడుతున్న జంటలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ చట్టపరంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తోంది. రోజుల వయçస్సు ఉన్న పసికందుల నుంచి 18 ఏళ్ల వయసున్న బాలల వరకు చట్ట ప్రకారం దత్తత తీసుకునే వీలుంది. ఎక్కువ శాతం నాలుగేళ్ల లోపు పిల్లలను దత్తత తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గడిచిన ఏడేళ్లలో శిశుగృహ నుంచి 111 మంది చిన్నారులను దత్తత ఇచ్చారు. అందులో 93 మంది బాలికలు, 18 మంది బాలురు ఉన్నారు. సులువైన చట్టాలు రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పిల్లలను దత్తత తీసుకునేందుకు పలువురు విదేశీ దంపతులు ముందుకొస్తున్నారు. స్వీడన్, ఇటలీ, మాల్టా వంటి దేశాలకు చెందిన దంపతులు పిల్లలు లేరనే బాధను విడనాడి జిల్లాకు వచ్చి అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారం విదేశాలకు శిశువులను దత్తత తీసుకువెళ్లాలంటే ఎన్నో అవరోధాలు ఉంటాయని తొలుత భావించేవారు. అయితే అందుకు భిన్నంగా సులువైన చట్టాలు ఉండడంతో ఇక్కడి చిన్నారులను విదేశాలకు తీసుకువెళ్లి తల్లిదండ్రుల ప్రేమను పంచుతున్నారు. విదేశాలకు.. శిశుగృహలోని చిన్నారులను ఎంతోమందికి చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నారు. ఇందులో స్వీడన్‌కు ఒకరు, ఇటలీ దేశానికి ఇద్దరు ఆడపిల్లలు, మాల్టా దేశానికి ఒక పాప చొప్పున దత్తత ఇచ్చారు. ప్రస్తుతం స్పెయిన్ దేశానికి ఒక మగ, ఒక ఆడ శిశువు, మాల్టా దేశానికి ఒక పాప, అమెరికాకు ఒక పాపను దత్తత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో చట్టబద్ధంగా అన్ని అర్హతలు గుర్తించి, ప్రక్రియ పూర్తయ్యాక వీరిని ఆయా దంపతులకు అప్పగించనున్నారు. పారదర్శక విధానం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత ప్రక్రియను పారదర్శక విధానంలో నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా శిశుగృహలో 11 మంది పిల్లలను దత్తత ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా 47 మంది దంపతులు దత్తత కోరుతూ దరఖాస్తులు ఇచ్చి వేచి చూస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలుకుని దత్తత కోరుకునే జంటలకు పిల్లలను అప్పగించడం వరకు ప్రక్రియలన్నీ ఆన్లైన్ విధానంలోనే స్త్రీ, శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తుంది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి జాబితాలో సీనియార్టీ ప్రకారం చట్టపరమైన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను దత్తత ఇస్తున్నారు. దత్తతకు వెళ్లిన పిల్లలు తాము వెళ్లిన చోట ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని రెండేళ్ల పాటు సంబంధిత శాఖ పర్యవేక్షిస్తుంది. మగ, ఆడ పిల్లలనే తేడా లేకుండా తమకంటూ సొంత వారు ఉంటే చాలు అనే భావన దత్తత కోరుకుంటున్న జంటల్లో కనిపిస్తుంది. దత్తతకు వెళ్తున్న వారిలో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. కాగా, ఆరోగ్యం, ఆర్థిక స్థోమత కలిగి భార్యాభర్తల వయస్సు కలుపుకుని 90 ఏళ్ల నుంచి 110 ఏళ్లు కలిగిన వారికే పిల్లలను దత్తత ఇస్తారు. చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆడపిల్లలకైతే ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లల విషయంలోనైతే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. చట్టబద్ధంగా దత్తతకు ఓకే పిల్లలు కావాలనే తపనతో చాలామంది దళారుల వలలో పడి మోసపోతున్న ఘటనలు అక్కడకక్కడా చూస్తున్నాం. అయితే శిశువులను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న దంపతులు చట్టబద్ధంగానే ముందుకు సాగాలి. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకుంటే జైలుశిక్ష, జరిమానా ఉంటుంది, న్యాయపరమైన ఇబ్బందులు సైతం ఎదురవుతాయి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్ ద్వారా లేదా మా కార్యాలయంలో సంప్రదించడం ద్వారా దత్తత నిబంధనలు, వివరాలు తీసుకోవచ్చు. – జి.శంకరాచారి, డీడబ్ల్యూఓ, మహబూబ్‌నగర్ -
తల్లి యశోద
కృష్ణుడిని యశోద పెంచింది. యశోదా నందనుడిగానే జీవించాడు. అయితే... కన్నతల్లి దేవకి అనే వాస్తవాన్ని కృష్ణుడి దగ్గర దాచలేదెవ్వరూ. దేవకి కడుపులో పుట్టిన తనను యశోద పెంచిందనే ఎరుకతోనే పెరిగాడు కృష్ణుడు. ఒక తల్లి కడుపున పుట్టి, మరో తల్లి ఒడిలో పెరిగే ప్రతి బిడ్డకీ ఆ వాస్తవం తెలియాలి. ‘ఊహ తెలియని వయసులో దత్తత తల్లి ఒడిని చేరినప్పటికీ, ఊహ తెలిసిన తరువాత లేదా లోకం తెలిసేవయసు వచ్చాక పిల్లలకు ఆ నిజాన్ని చెప్పి తీరాలి’ అంటున్నారు స్మృతి. స్మృతి పుణెలో ఉంటా రు. వయసు 37 ఏళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొంతకాలం యూరప్‌లో వికీమీడియా ఫౌండేషన్‌లో పని చేసి 2014లో ఇండియాకి వచ్చేశారు. ఇద్దరు పాపాయిలను దత్తత తీసుకున్నారు. ఆమె దత్తత తీసుకునే నాటికి ఒక పాపకు ఆరేళ్లు, మరొక పాపాయికి ఐదేళ్లు. ఇప్పుడామె దత్తత గురించి సమాజంలో నెలకొని ఉన్న అపోహలు తొలగించడానికి, పిల్లలు లేని భార్యాభర్తలను చైతన్య వంతం చేయడానికే పూర్తి సమయాన్ని కేటాయించారు. దత్తతకు ఆవైపు ఈవైపు దత్తత అనే మాటకు... మనందరిలో ఒక అభిప్రాయం స్థిరపడిపోయి ఉంది. పిల్లలు లేని భార్యాభర్తలకు పిల్లలు లేని లోటును భర్తీ చేయడానికే దత్తత అనుకుంటాం. వాళ్లకు అమ్మానాన్నా అనే పిలుపు కోసమే అనీ అనుకుంటాం. కానీ దత్తత అంటే.. తనకంటూ ఇల్లు, కుటుంబం లేని బిడ్డకు ఓ కుటుంబాన్ని ఇవ్వడం కూడా. పిల్లలు లేని వారికి ఓ బిడ్డను ఇచ్చి వారిలో సంతోషాన్ని పెంచడం ఒక కోణం అయితే, తల్లిదండ్రులు లేని ఓ బిడ్డకు... అమ్మా, నాన్నలతో ఓ కుటుంబాన్నివ్వడమే మహోన్నతమైన పని. రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య వారధి కట్టి ఆ ప్రపంచాలను దగ్గర చేయడం.చూడనట్లు వెళ్లిపోకండి‘‘మనదేశంలో ఈ వారధి పటిష్టం కావాల్సిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను షెల్టర్లకు చేర్చడానికి తెలిసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. కన్న తల్లిదండ్రులు లేని కారణంగా ఏ బిడ్డ జీవితమూ అగమ్యంగా, అలక్ష్యంగా మారకూడదు. పుట్టిన ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఉంది. చక్కగా పెరిగి, చదువుకుని ఇష్టమైన వృత్తిలో స్థిరపడి ఫలవంతమైన జీవితాన్ని జీవించే హక్కు కూడా ఉంది. పిల్లలను పోషిస్తూ, దత్తతకు పిల్లలు కావాలని వచ్చే వారితో అనుసంధానం చేయడానికి అనేక సంస్థలున్నాయి’’ అని చెబుతారు స్మృతి. మరో విషయాన్ని ఆమె తరచూ గుర్తు చేస్తుంటారు. అదేంటంటే.. ఆ తండ్రి జాడలేదు పుణెలో జాయ్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నారు స్మృతి. అక్కడికి ఓ వ్యక్తి కొన్ని ఏళ్ల కిందట మూడు నెలల పాపాయితో వచ్చాడు. తన భార్య చనిపోయిందని చెప్పి, మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డను తీసుకెళ్తానని, అప్పటి వరకు సంరక్షించమని కోరాడు. ఏళ్లు గడిచినా అతడు రాలేదు. పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు. ఆ పాపాయి చక్కగా పెరుగుతోంది. అయితే ఆమెను ఎవరికైనా దత్తత ఇవ్వాలంటే నిబంధనలు ఒప్పుకోవు. తండ్రి వచ్చి తన బిడ్డను ఇవ్వమన్నప్పుడు ఇవ్వగలగాలంటే... ఆ బిడ్డను దత్తత ఇవ్వకూడదు. ఆ తండ్రి వస్తాడో రాడో తెలియదు. ఎలా మరి? ఆచరణలో ఎదురయ్యే ఇలాంటి కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు స్మృతి. ఆ బిడ్డకు మంచి జీవితాన్నివ్వగలిగిన అవకాశం ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అది. ఇలాంటి పిల్లల విషయంలో తల్లి, తండ్రి లేదా సంరక్షకులు (ఎవరైతే షెల్టర్‌లో చేరుస్తారో వారు) సంవత్సరాల పాటు బిడ్డ కోసం రాకపోతే, షెల్టర్ హోమ్స్ ఆ పిల్లలను దత్తత ఇవ్వవచ్చు అని సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ నియమావళిలో మార్పులు చేయవచ్చని స్మృతి సూచించారు. ఆ సూచన పరిశీలనలో ఉంది. మనసు విశాలం అవ్వాలి దత్తత కోసం వచ్చే తల్లిదండ్రులకు స్మృతి వేడికోలు ఒక్కటే. ‘‘స్వల్ప అనారోగ్యాలు, మెల్లకన్ను వంటి చిన్న లోపాలు ఉన్న పిల్లలను కూడా దత్తత తీసుకోండి. వారికి వైద్యం చేయించగలిగిన ఆర్థిక స్థోమత మీకున్నప్పుడు అలాంటి పిల్లలను మెరుగ్గా మార్చగలిగిన అవకాశం మీ చేతులో ఉన్నప్పుడు ఆ మేరకు కొంత మీ మనసును విశాలం చేసుకోండి’’ అని అభ్యర్థిస్తున్నారు స్మృతి. ఆమె కౌన్సెలింగ్‌తో కన్విన్స్ అయిన ఒక జంట కాలు లేని పిల్లవాడిని దత్తత తీసుకుని ఆపరేషన్ చేయించి కృత్రిమ కాలు పెట్టించిన సంగతిని కూడా ఆమె గుర్తు చేస్తారు. అలాగే పెద్ద పిల్లలను కూడా దత్తత తీసుకోవలసిందిగా మరీ మరీ చెబుతుంటారు. పెద్ద పిల్లలను దత్తత తీసుకుంటే వాళ్లు తమను అసలైన తల్లిదండ్రులుగా స్వీకరించలేరేమోననే భయం దత్తత తీసుకునే వాళ్లను వేధిస్తుంటుంది. నిజానికి అలాంటిదేమీ ఉండదని, అందుకు తానే నిదర్శనం అంటారు.. తనే పిల్లలకు దత్తతగా వెళ్లిపోయానని ఎప్పుడూ చెబుతుండే.. ఈ మాతృమూర్తి చిరునవ్వులు చిందిస్తూ. అమ్మా.. మా అమ్మ ఎవరు? ‘నేను దత్తత తీసుకున్న చిన్న పాపాయి ఏమీ అడగదు, కానీ పెద్ద పాపాయి అడిగింది... అమ్మా! నాకు నువ్వు అమ్మవు అయ్యే వరకు నాకు అమ్మ ఎవరు? అని. తనకు వివరంగా చెప్పాను. ఆ ప్రశ్నకు ముందు ఎలా ప్రేమగా ఉండేదో ఆ తర్వాతా అలాగే ఉంది నాతో. కాబట్టి పిల్లలు పేరెంట్స్‌గా రిసీవ్ చేసుకోరనే భయం వద్దు. ఊహ తెలిసిన పిల్లలను కూడా దత్తత తీసుకోండి’ అని కోరుతున్నారామె. అలాగే దత్తత తీసుకున్న తల్లులు అంతటితో ఆగిపోకుండా సమాజంలో దత్తత మీద ఉన్న అపోహలను తొలగించే బాధ్యతను కూడా తీసుకోమని అభ్యర్థిస్తుంటారు స్మృతి. – మంజీర -
సీఎం దత్తత.. ఇదేనా దక్షత?
అరకులోయ: పెదలబుడు పంచాయతీని సీఎం చంద్రబాబు దత్తత చేసుకోవడంతో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆనందించారు. ముఖ్యంగా ఉన్నత వైద్యసేవలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంతోషించారు. కానీ అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి దుస్థితి అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది. పేరుకు 100 పడకల ఆస్పత్రి అయినప్పటికీ రోగులకు మంచాలు తప్ప సకాలంలో ఉన్నత వైద్యం మాత్రం కరువైంది. అనంతగిరి, డుంబ్రిగుడ, డుంబ్రిగుడ మండలాలతోపాటు, హుకుంపేట మండలంలోని ఐదు పంచాయతీల గిరిజనులందరికీ అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ప్రధాన ఆధారం. కానీ ఇక్కడ సాధారణ వైద్యులే ఉండడంతో ఉన్నత వైద్యసేవలకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాల్సివస్తోంది. మత్తు వైద్యుడు తప్ప స్పెషలిస్టులు కరువు ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేసే ఉన్నత వైద్యనిపుణులు లేనప్పటికీ మత్తు వైద్యనిపుణుడు డాక్టర్ దయాకర్ మాత్రం పనిచేస్తున్నారు. మత్తు ఇచ్చే వైద్యుడు ఉన్నా ఆపరేషన్ చేసే నాధుడు లేక ఆపరేషన్ ధియేటర్ ఎప్పుడూ మూసివుంటుంది. సివిల్ సర్జన్, చిన్నపిల్లలు, స్త్రీ వైద్యనిపుణుల వైద్య పోస్టులను ప్రభుత్వం ఇంతవరకు భర్తీ చేయలేదు. మత్తు వైద్యనిపుణుడు కాక ముగ్గురు కాంట్రాక్ట్ వైద్యులు పనిచేస్తున్నారు. గర్భిణులు, చిన్నారులకు నరకమే ముఖ్యమైన గైనిక్, చిన్నపిల్లల వైద్యనిపుణుల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఉన్నత వైద్యం కరువైంది. గతంలో 15 రోజులకు ఒకరు చొప్పున గైనికాలజిస్టులను డిప్యూటేషన్‌పై మైదాన ప్రాంతాల నుంచి ఈ ఆస్పత్రికి రప్పించేవారు. అయితే మే నెల ఒకటో తేదీ నుంచి వారు కూడా ఆస్పత్రికి రావడం మానేశారు. దీంతో గర్భిణులకు వైద్యపరీక్షలు, డెలివరీలను సాధారణ వైద్యులే చూస్తున్నారు. డెలివరీ కష్టంగా మారితే కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. విశాఖ వెళ్లేంతవరకు దారి మధ్యలో గర్భిణులు నరకం చూస్తున్నారు. అంబులెన్స్ సేవలూ కరువే ఆస్పత్రిలో రోగులను కేజీహెచ్‌కు తరలించేందుకు అవసరమైన అంబులెన్స్ సేవలు కూడా గత రెండేళ్ల నుంచి అందుబాటులో లేవు. అంబులెన్స్ మరమ్మతులతో మూలకు చేరడంతో విజయనగరం జిల్లా కొత్తవలస గ్యారేజీకి తరలించారు. దీంతో ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు అత్యవసర రోగులను తరలించేందుకు 108 వాహనం పైనే ఆధారపడుతున్నారు. సకాలంలో 108 రాకపోతే రోగులకు మరణమే శరణ్యంగా మారింది. భయమేస్తోంది.. ఆస్పత్రిలో తనిఖీలు జరుపుకుని, డెలివరీలు ఇక్కడే జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ అరకులోయ ఆస్పత్రిలో గైనిక్ డాక్టర్ లేకపోవడంతో సాధారణ వైద్యులే పరీక్షలు జరుపుతున్నారు. నా కడుపులో బిడ్డ ఎదుగుదల, ఆరోగ్య సమాచారం పూర్తిగా చెప్పలేకపోతున్నారు. మొదటి కాన్పు కావడంతో ఇక్కడ ప్రసవించేందుకు నాకు భయమేస్తోంది. –సమర్ధి శీరిష, గర్భిణి,కొత్తభల్లుగుడ, అరకులోయ మండలం -
బాలికలను దత్తత తీసుకొని చదివిస్తాం
సాక్షి, హైదరాబాద్: తల్లి సంపాదనపై ఆధారపడి చదువుకుంటున్న నిరుపేద బాలికలను దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జవ్వాది శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ మార్కులతో పాటు ఎంసెట్, తదితర ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన బాలికలకు సహకారం అందిస్తామన్నారు. ఏపీలో రాజమండ్రి– కాకినాడ, తెలంగాణలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీల్లో మాత్రమే చదివిస్తామని పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు ఆర్యవైశ్య సంఘం ఆశ్రమంలో ఉండి చదువుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 9399926127, 9491294513 నంబర్లను సంప్రదించాలన్నారు. బాలికలను దత్తత తీసుకొని చదివిస్తాం -
ఇక జాతీయ జెండా ఎగిరేది ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ను 1830లో అప్పటి బ్రిటీష్ ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’ విలియం బెంటింక్ అమ్మేస్తున్నారనే వార్త సంచలనం రేపింది. తమ అలవెన్సుల్లో విలియం కోత విధించారన్న కోపంతో అప్పట్లో బెంగాల్ ఆర్మీ ఈ వదంతును సష్టించింది. అది ఎంతగా ప్రచారం జరిగిందంటే భారత జాతీయవాదులు తాజ్ మహల్‌ను అమ్మవద్దంటూ ధర్నా చేశారు. బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేసిన భారత పురాతత్వ సంస్థ (ఏఎస్ఐ)కూడా ఆ వదంతిని నమ్మింది. ఆ తర్వాత అదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ఢిల్లీలోని ఎర్రకోటను ‘దాల్మియా భారత్ గ్రూప్’నకు కేంద్ర ప్రభుత్వం నిజంగా అమ్మేసిన ఎవరు నమ్మరు. ఐదేళ్లపాటు ఎర్రకోటను పరిరక్షించాల్సిన బాధ్యతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాల్మియా సంస్థకు అప్పగించడం పట్ల వివాదం చెలరేగుతున్న విషయం తెల్సిందే. చక్కెర, సిమ్మెంట్, విద్యుత్ వ్యాపారాలను చేసుకొనే దాల్మియా సంస్థకు ఓ అద్భుత చారిత్రక కట్టడం పరిరక్షణ బాధ్యతలు అప్పగించడం ఏమిటీ? దాని పట్ల ఆ సంస్థ ఆసక్తి చూపడం ఏమిటీ? అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి విస్తత ప్రచారం చేయడమే కాకుండా, కేసులో నిందితుడు కూడా అయిన విష్ణు దాల్మియాకు చెందిన సంస్థకు చారిత్రక కట్టడాల పట్ల ఆసక్తి ఎందుకు ఉంటుంది? పోనీ బాబ్రీ విధ్వంసానికి ప్రతిఫలంగానే బీజేపీ ప్రభుత్వం ఈ కట్టడాన్ని దాల్మియా సంస్థకు అప్పగిస్తుందా? మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్‌ను కూలగొట్టాలంటూ మాట్లాడిన బీజేపీ ప్రభుత్వ నేతలు అదే షాజహాన్ 1639లో నిర్మించిన ఢిల్లీ కోటను ఎందుకు పరిరక్షించాలనుకుంటున్నారో అర్థం కాదు? ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లపాటు దత్తత పేరిట ఎర్రకోటను దాల్మియా సంస్థకు లీజుకు ఇచ్చింది. ఎర్రకోట ఎంట్రీ టిక్కెట్‌పై వచ్చిన డబ్బులను విధిగా ఎర్రకోట పరిరక్షణకే ఖర్చు పెట్టాలన్నది అందులో ఓ షరతు. నిర్మాణం దెబ్బతినకుండా మిగతా కోటలో ఎన్ని రెస్లారెంట్లనైనా, ఎన్ని హోటళ్లనైనా నడుపుకోవచ్చు. ఎంత రేటైన పెట్టుకోవచ్చు. ఖరీదైన పర్యాటకుల కోసం సకల కళలను పోషించవచ్చు. ఎంత సొమ్మయిన ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఎర్రకోట సందర్శనకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి భారతీయులు ఒక్కరికి 35 రూపాయలు, విదేశీయులకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. రేపు భారతీయుల నుంచే 500 రూపాయలు వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఎంట్రీకి రెండు స్నాక్స్ ఇస్తామంటూ ఆ స్నాక్‌ల బిల్లును కంపెనీ తన ఖాతాలో కూడా వేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ద్వారా తాజ్ గ్రూప్ ఎంత సంపాదిస్తుందో, అంతకన్నా పదింతలు ఎర్రకోట ద్వారా సంపాదించవచ్చన్నది ఎవరైనా ఊహించవచ్చు. సమైక్య భారత్ చిహ్నంగా ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై త్రివర్ణ ప్రతాకాన్ని ఎగురవేసి దేశ ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కొనసాగిస్తూ వచ్చారు. మహారాష్ట్ర మీదుగా అఫ్ఘానిస్తాన్ వరకు విస్తరించిన మొఘల్ చక్రవర్తుల చరిత్రను చెరిపేసి ఆధునిక మహారాష్ట్రలో కొన్ని జిల్లాల విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను విస్తరించేందుకు 210 మీటర్ల విగ్రహాన్ని నిర్మిస్తున్న బీజేపీ పాలకులు....ఎర్రకోటను దాల్మియా స్వాధీనం చేసుకున్నాక శివాజీ రాజ్యానికి రాజధాని అయిన ‘రాయ్‌గఢ్’ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ జెండాను ఎగురవేస్తారా?! -
నా నుంచి పాపను దూరం చేయకండి
కట్టుకున్న భర్త కాదు పొమ్మని దూరం ఉంటున్నాడు.. నా అనే వారు నాకు లేని సమయంలో వేరే ఒకరు జన్మనిచ్చిన పాపను వద్దని పడేయగా అక్కున చేర్చుకుని ఖర్చు పెట్టి వైద్యం చేయించా.. కంటేనే కన్నతల్లి కాదని కడుపులో పెట్టుకుని ఎనిమిది నెలలు పెంచి ప్రేమతో అన్నీ పాపే నాకు ప్రాణమని భావించా.. నాకు ఉన్న కొద్దిపాటి ఆస్తిని కాజేసేందుకు కట్టుకున్నోడు మళ్లీ కన్నెర్రజేసి కుట్రలు పన్ని కన్నబిడ్డ కంటే ప్రాణంగా చూసే పెంచుకుంటున్న బిడ్డను దూరం చేయాలనుకుంటున్నారు.. నా నుంచి పాపను దూరం చేస్తే నేను బతకలేనంటూ కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తూ అధికారులను వేడుకుంటోంది ఓ పెంచిన అమ్మ.. నర్సంపేట : నర్సంపేట పట్టణంలో నివాసముంటున్న దాసరి హైమావతిది చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామం. 25 సంవత్సరాల క్రితం సాంబయ్య అనే వ్యక్తితో వివాహమైంది. సంతానం కలగకపోవడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భర్త సాంబయ్య తన భార్య హైమావతితో గొడవపడి చాలా కాలంగా వేరొక మహిళతో కలిసి దూరంగా ఉంటున్నాడు. దీంతో హైమావతి తన భర్త విషయంపై కోర్టును ఆశ్రయించగా సమస్య పరిష్కారం కాలేదు. న్యాయం చేయాలని పెద్దమనుషులను ఆశ్రయించడంతో నెలకు రూ.3 వేలు భర్త నుంచి ఇప్పించేందుకు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలోనే 2017 ఆగస్టులో బస్టాండ్ వద్ద ఉన్న పాన్‌షాపుల మధ్య పసిగుడ్డు అరుపులు వినపడగా రక్తపు మరకలతో అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండగా హైమావతి అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పాప పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకుంది. అయితే తన పేరుతో ఉన్న కొద్దిపాటి ఆస్తి పెంచుకుంటున్న దక్కుతుందనే దురుద్దేశంతో హైమావతి నుంచి పాపను దూరం చేసేందుకు భర్త సాంబయ్య బెదిరింపులకు దిగి 2018 ఏప్రిల్ 13న చైల్డ్‌లైన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అదేరోజు అధికారులు హైమావతి నివసిస్తున్న ఇంటికి వచ్చి పాప గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏప్రిల్ 16 న బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచగా వివరాలు తెలుసుకుని విచారణ చేస్తున్న క్రమంలోనే హైమావతి పాపను తన నుంచి దూరం చేయవద్దని తనపై ఉన్న ఆస్తిని పాపపై చేయిస్తానని వేడుకుంది. నేటికీ అధికారుల చుట్టూ హైమావతి తిరుగుతూ వస్తుంది. సోమవారం జిల్లా కలెక్టర్ హరిత వద్దకు నర్సంపేటకు చెందిన కౌన్సిలర్ బండి ప్రవీణ్ , అంగన్వాడీ సంఘం బాధ్యురాలు నల్లా భారతితో కలిసి వేడుకుంది. దీంతో కలెక్టర్ మే5న సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఎదుట హాజరుకావాలని సూచించారు. దీంతో పెంచుకున్న బిడ్డను తన నుంచి దూరం చేయవద్దని వేడుకుంటూ హైమావతి చేస్తున్న పోరాటానికి మహిళా సంఘాలు మద్దతుగా నిలుస్తూ సంఘీభావాన్ని తెలిపాయి. -
దాల్మియాకు ఎర్రకోట
న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడాప్ట్ ఎ హెరిటేజ్ (ఓ చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకోండి) పథకంలో భాగంగా ఎర్రకోట, వైఎస్సార్ కడప జిల్లా ‘గండికోట’ కోట నిర్వహణ బాధ్యతలను నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలతో దాల్మియా భారత్ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద కాలం ఐదేళ్లు. ఎర్రకోట కోసం తీవ్రమైన పోటీ నెలకొనగా.. ఇండిగో, జీఎంఆర్ గ్రూపులను వెనక్కు నెట్టి రూ. 25కోట్లకు (ఈ మొత్తాన్ని ఎర్రకోట నిర్వహణకు వెచ్చించాలి) దాల్మియా ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ‘ ఎర్రకోట నిర్వహణ బాధ్యతలు పొందటం ఆనందంగా ఉంది. 30 రోజుల్లో మేం పనిని ప్రారంభించాలి. భారత్‌తో దాల్మియా బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఈ అవకాశం దోహదపడుతుంది. ఎర్రకోట వైశాల్యంతో పోలిస్తే చాలా చిన్నగా ఉండే యూరప్‌లోని కొన్ని కట్టడాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఆ పద్ధతిలోనే మేం ఎర్రకోటను ప్రపంచ ఉత్తమ కట్టడాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం’ అని దాల్మియా భారత్ సిమెంట్స్ గ్రూప్ సీఈవో మహేంద్ర సింఘీ తెలిపారు. చారిత్రక కట్టడాల నిర్వహణలో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని తీసుకువచ్చేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ ఎ హెరిటేజ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 70 ఏళ్లు ఏం చేశారు?: కేంద్రం ఈ పథకంలో భాగస్వాములైన కంపెనీలు కేవలం డబ్బులు ఖర్చుపెట్టి సదుపాయాలను మెరుగుపరుస్తాయే తప్ప.. పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయబోవని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ స్పష్టం చేశారు. కట్టడాలను ప్రైవేటీకరించే ఆలోచన అర్థరహితమని పర్యాటక మంత్రి కేజే అల్ఫోన్స్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఏం చేసింది? అన్ని కట్టడాలు, వాటిలోని వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు వసతులే లేవు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కట్టడాల నిర్వహణ కాంట్రాక్టుల జాబితాలో కుతుబ్ మినార్ (ఢిల్లీ), హంపి (కర్ణాటక), సూర్య దేవాలయం (ఒడిశా), అజంతా గుహలు (మహారాష్ట్ర), చార్మినార్ (తెలంగాణ), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) వంటి 95 ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి. కాంగ్రెస్ మండిపాటు ప్రముఖ కట్టడం నిర్వహణను ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్, తృణమూల్, వామపక్ష పార్టీలు ప్రశ్నించాయి. భారత స్వాతంత్య్ర ప్రతీకైన ఎర్రకోట బాధ్యతలను ఇతరులకు ఎలా అప్పగిస్తారని మండిపడ్డాయి. ‘ప్రైవేటు సంస్థకు చారిత్రక కట్టడాన్ని నిర్వహించే బాధ్యతను ఎలా అప్పజెబుతారు? ఇది మీరు (ప్రభుత్వం) చేయలేరా? భారత చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ విధానమేంటి? నిధుల కొరత ఉందా? భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ)కి కేటాయించిన నిధులు మురిగిపోతున్నాయి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. -
ప్రామిస్ చేస్తున్నా.. కదిలిస్తున్న సన్నీ సందేశం
దేశంలో అఘాయిత్యాల పర్వాలపై చర్చ కొనసాగుతున్న వేళ.. కథువా ఘటన మాత్రం ప్రతీ ఒక్కరినీ కదిలించి వేస్తోంది. ప్రముఖులంతా తమకు తోచిన రీతిలో ఘటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి సన్నీ లియోన్ చేసిన ఓ ట్వీట్ కదిలించి వేస్తోంది. తన కూతురు(దత్త పుత్రిక) నిషా కౌర్ ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ఓ సందేశంతో ఆమె ట్వీటర్లో పోస్ట్ చేసింది. ‘తల్లీ.. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. నా హృదయం, ఆత్మ, దేహం... ఇవన్నీ నిన్ను రక్షించుకునేందుకే. ఈ లోకంలో చెడు పెరిగిపోయింది. అందుకే నీ కోసం నేను ఎల్లవేళలా కృషి చేస్తుంటా. నీ రక్షణ కోసం నా ప్రాణాలైన పణంగా పెడతా. ప్రస్తుతం చిన్నారులకు సైతం రక్షణ అనేదే లేకుండా పోయింది. కాబట్టి వారిని జాగ్రత్తగా సంరక్షికోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అంటూ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌కు సానుకూలంగా స్పందన వస్తోంది. I promise with every ounce of my heart,soul&body 2protect u from everything&everyone who is evil in this world.Even if that means giving my life for ur safety.children should feel safe against evil hurtful people.Let's hold our children a little closer to us!Protect at all costs! pic.twitter.com/d9xijmD6kF — Sunny Leone (@SunnyLeone) 14 April 2018 -
పరిమితి దాటిన హెచ్–1బీ వీసా దరఖాస్తులు
వాషింగ్టన్: 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తులు నిర్దేశిత పరిమితి అయిన 65 వేలను దాటిపోయాయని అమెరికా వీసా సేవల సంస్థ యూఎస్సీఐఎస్ ప్రకటించింది. తదుపరి దశలో లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసి వీసాలు జారీ చేయనున్నారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం 2018, అక్టోబర్ 1న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2న హెచ్–1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక కాలేకపోయిన దరఖాస్తుదారులకు ఫైలింగ్ రుసుమును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మాస్టర్స్(అడ్వాన్స్డ్ డిగ్రీ) విభాగంలోనూ పరిమితి 20 వేలకు సరిపడ హెచ్–1బీ దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. -
పెంపుడు తల్లి చెంతకే...
ఇల్లెందు: ఇల్లెందు పట్టణంలోని స్ట్రట్‌ఫిట్ బస్తీకి చెందిన వేముల స్వరూప – రాజేందర్ల దత్త పుత్రిక తన్వితకు తాత్కాలికంగా విముక్తి లభించింది. 160 రోజుల పాటు ఖమ్మం బాలల సదనంలో ఉన్న తన్విత.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బుధవారం రాత్రి బాలల సదనం నుంచి పెంపుడు తల్లి వేముల స్వరూప చెంతకు చేరింది. తన్వితను తనకే అప్పగించాలని, కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు తనవద్దే ఉంచే లా ఆదేశించాలని స్వరూప కోర్టును అభ్యర్థించింది. ఆమె ఫిర్యాదును విచారించిన కోర్టు.. అభం, శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి తన్వితను బాలల సదనంలో ఉంచటం కంటే పెంపుడు తల్లి విన్నపం మేరకు ఆమెకే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగింది... తన్విత కన్న తల్లిదండ్రులు భావ్‌సింగ్ – ఉమ ఇల్లెందులోని ఓ గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తూ స్టేషన్‌బస్తీలో నివాసం ఉండేవారు. వారికి తొ లి సంతానంగా పాప జన్మించింది. ఆ తర్వా త ఉమ మరోసారి గర్భం దాల్చడంతో రెండో సంతానంలోనూ పాప పుడితే ఎలా అనే సందేహం వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి దృష్టికి తెచ్చారు. ఉమకు అబార్షన్ చేయించాలని కోరారు. అయితే అప్పటికే ఆమెకు ఆరో నెల రావడంతో అబార్షన్ సాధ్యం కాదని ఆర్ఎంపీ సూచించారు. ఒకవేళ ఆడబిడ్డ పుడితే సంతానం లేని వారికి ఇస్తారా అని ఆ వైద్యుడు అడగడంతో భావ్‌సింగ్ అంగీకరించాడు. కాగా, వేముల స్వ రూప – రాజేందర్ దంపతులు కూడా ఎక్కడైనా పాప దొరికితే పెంచుకుంటామని ఆర్ఎ ంపీ వైద్యుడి వద్ద పలుమార్లు ప్రస్తావించారు. దీంతో ఆర్ఎంపీ ఉమకు పుట్టబోయే బిడ్డను స్వరూపకు అప్పగించేలా లైన్ క్లియర్ చేశారు. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2015 జనవరి 28న ఉమ ప్రసవించింది. అదే రోజున రాజేందర్ దంపతులకు పాపను అప్పగించారు. ప్రసూతి ఖర్చులు రూ. 20 వేలు, భావ్‌సింగ్‌కు నగదు రూ. 5 వేలు అప్పగించి దత్తత అగ్రిమెంటు రాయించుకుని పాపను తీసుకెళ్లారు. రెండున్నర ఏళ్ల తర్వాత తమ బిడ్డ తమకే కావాలని ఉమ అక్టోబర్ 22న ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ బి.రాజు విచారణ చేపట్టారు. ఈ కేసును స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్. దయామణికి, అప్పటి సూపర్వైజర్ కమలాదేవి, బాలల సంరక్షణాధికారి శివకుమారిలకు అప్పగించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అధికారులు తన్వితను ఖమ్మం బాలల సదనానికి అప్పగించారు. ఆనందంగా ఉంది నాకు దూరంగా ఖమ్మం బాలల సదనంలో 160 రోజుల పాటు ఉన్న చిన్నారి తన్వితను నా సంరక్షణలో ఉంచాలని కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉంది. పాప నా వద్దకు చేరాలని ఎన్నో మొక్కలు మొక్కాను, ప్రతీ రోజు తల్లడిల్లాను. అన్నపానీయాలు మానేశాను. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ నాకే చెందాలని ఎంతోమంది అండగా నిలిచారు. మానవతా ధృక్పథంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. – స్వరూప -
రాయితో రుద్దితే తెల్లగా మారతాడని..
భోపాల్ : తెలుపు అంటే చాలామందికి విపరీతమైన పిచ్చి. ఈ పిచ్చి బాగా ముదిరితే ఎలా ఉంటుందో ఈ మహిళని చూస్తే అర్థం అవుతుంది. రాయితో రుద్దితే తెల్లగా మారతారని నమ్మి తన అయిదేళ్ల కొడుకుని తీవ్రంగా హింసించింది. చివరకు బాలల సంరక్షణ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి, బాలుడిని కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం... నిషత్‌పూర్ ప్రాంతంలో నివాసం ఉండే సుధా తివారి పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె భర్త ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కాంట్రక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో సుధా తివారి ఏడాదిన్నర క్రితం ఉత్తరాఖండ్‌లోని ‘మాతృచ్ఛాయ’ ఆశ్రమం నుంచి ఒక బాలుడిని దత్తత తీసుకుంది. బాలుడు నల్లగా ఉండటంతో సుధా అత్తగారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో సుధా ఆ పిల్లవాడిని తెల్లగా మార్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా రాయితో రుద్దితే తెల్లగా అవుతారని ఎవరో చెప్పిన సలహ విని పసివాడిని రాయితో రుద్దడం ప్రారంభించింది. దీంతో ఆ చిన్నారికి ఛాతీ, భుజం, వీపు, కాళ్ల మీద గాయాలయ్యాయి. పసివాడిని అలా హింసించవద్దంటూ సుధా సోదరి కూతురు శోభన శర్మ ఆమెకు ఎన్నోసార్లు చెప్పింది. అయినా సుధ వినకపోవడంతో శోభన శర్మ ఆదివారం బాలల సంరక్షణ అధికారులకు ఫోన్ చేసింది. సమాచారం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు, నిషత్‌పూర్ పోలీసులు... సుధ ఇంటి నుంచి బాలుడిని విడిపించి... హమిదియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం తదుపరి విచారణ నిమిత్తం ఆ చిన్నారిని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు. తన సుధా తివారి తనను ఆమె పనిచేసే పాఠశాలకు తీసుకెళ్లేదని... అయితే చదివించడానికి కాదంటూ విచారణలో తెలిపాడు. (ఇవాళ) బాలుడిని బాలల సంరక్షణ కమిషన్ సభ్యుల ముందు హజరుపరచనున్నారు. కాగా నిబంధనల ప్రకారం దత్తత తర్వాత ఆశ్రమం వారు ఆ పిల్లల బాగోగుల గురించి ఆరా తీయాలి. కానీ ‘మాతృచ్ఛాయ’ ఆశ్రమం వారు ఆ పని చేయలేదని శోభన ఆరోపించారు. దీని గురించి ‘మాతృచ్ఛాయ’ జాయింట్ సెక్రటరీ అమిత్ జైన్‌ను విచారించగా ‘మేము పిల్లలను దత్తత ఇచ్చిన అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లల క్షేమ సమాచారం తెలుసుకుంటాము. మేము సుధకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఆమె మాకు దీని గురించి చెప్పలేదు’ అన్నారు. మధ్యప్రదేశ్ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్మన్ రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ ‘ఈ విషయం గురించి నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. కానీ దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటానని’ తెలిపారు. -
నేటి నుంచే హెచ్1బీ ప్రక్రియ
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాల కోసం విదేశీయులకు అందించే హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. భారత ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసే ఈ వర్క్ వీసా నిబంధనలను ఇటీవల ట్రంప్ యంత్రాంగం కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1బీ దరఖాస్తులను ఈ నెల 2 నుంచి స్వీకరించనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) వెల్లడించింది. వీసాల జారీలో పొరపాట్లు జరగకుండా కఠిన చర్యలను చేపట్టినట్టు పేర్కొంది. వివిధ సోషల్ మీడియా వెబ్సైట్లు, గ్రూపుల్లో ఇమిగ్రేషన్ అటార్నీలు స్పందిస్తూ.. ఈసారి తిరస్కరణకు గురయ్యే దరఖాస్తుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. హెచ్1బీ అనేది నాన్–ఇమిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు ఈ వీసా ఉన్న విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కంపెనీలు ఎక్కువగా ఈ వీసా కలిగి ఉండే భారత్, చైనా లాంటి దేశాలకు చెందిన వారికి ఎక్కువగా ఉద్యోగాలు ఇస్తుంటాయి. ఈసారి ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే అన్నిటినీ తిరస్కరించే అవకాశం ఉందని యూఎస్సీఐఎస్ చెప్పింది. -
ఎమ్మెల్యే దత్తత గ్రామంలో తాగునీటి ఎద్దడి
కోనరావుపేట(వేములవాడ): తమ కాలనీల్లో తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మామిడిపల్లిలో మహిళలు ఖాళీబిందెలతో ఆదివారం రోడ్డెక్కారు. మామిడిపల్లిలోని 2, 3, 4 వార్డుల్లో కొన్నిరోజులుగా తాగునీటికి తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన చెందారు. సుమారు రెండు నెలలుగా నీరు దొరకక అవస్థలు పడుతుమన్నారు. నీటి సమస్యలు అధికం కావడంతో రోడ్డెక్కామని వివరించారు. వేములవాడ–సిరికొండ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. తమ కాలనీల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మామిడిపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు దత్తత తీసుకుని, అభివృద్ధి పనులు చేయడం మర్చిపోయారని ఆరోపించారు. గ్రామంలో నీటి సమస్యలు ఎక్కువ అవుతున్నా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ పన్నాల విజయ.. సంఘటనా స్థలతానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడారు. నీటి సమస్యలు ఎక్కువగా ఉన్న వార్డుల్లో ఇంటికో డ్రమ్ము నీరు రోజూ అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ∙ రోడ్డెక్కి మహిళల నిరసన -
దత్తతకి తాజ్
చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకంలా చిరకాలం మిగిలిపోవడానికి ఏం చేయాలి ? పండువెన్నెల్లో వెండికొండలా మళ్లీ మెరవాలంటే ఏం చర్యలుతీసుకోవాలి ? కాలుష్యంకోరల్లో చిక్కుకొని, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతూ ప్రమాదంలో ఉన్న మన చారిత్రక సంపద తాజ్‌మహల్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టే ఉన్నాయి. అందుకే తాజ్‌ని దత్తతకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన వారసత్వ కట్టడాల దత్తత పథకం కింద తాజ్‌మహల్‌ని కూడా చేర్చింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తాజ్‌మహల్‌ని కూడా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అలా తీసుకున్న వారు తాజ్ నిర్వహణ, , పర్యాటకులకు సదుపాయాల కల్పన, వారి భద్రత , తాగునీటి సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత, తాజ్ చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యలన్నీ తీసుకోవాలి.ఇప్పటికే తాజ్‌ని దత్తత తీసుకోవడానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో జీఎంఆర్ గ్రూప్, ఐటీసీ లిమిటెడ్‌లు రేసులో ముందున్నాయి. తాజ్‌ను దత్తతకిస్తే దాని పరిరక్షణలో ఇక పురావస్తు శాఖ పాత్ర పరిమితమైపోతోంది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో ఏముంది ? మన దేశంలో ఎన్నో వారసత్వ కట్టడాలు జీర్ణా వస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవడం పురావస్తు శాఖకు తలకు మించిన భారంగా మారింది. అందుకే మన వారసత్వ సంపదని కాపాడుకోవడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ సహకారంతో సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ కట్టడాల సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కార్పొరేట్ కంపెనీలన్నీ తమకు వచ్చిన లాభాల్లో 2 శాతం సేవా కార్యక్రమాలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ బడ్జెట్‌ని చారిత్రక కట్టడాలపై కూడా ఖర్చు చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చారిత్రక కట్టడాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజ్‌పై జీఎంఆర్ విజన్ డాక్యుమెంట్ తాజ్‌మహల్‌కి ఉన్న చారిత్రక ప్రా«ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానిని మొదట ఈ పథకం కింద చేర్చలేదు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యజమాని జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజ్‌మహల్‌ని దత్తత తీసుకుంటామంటూ పర్యాటక శాఖకు దరఖాస్తు చేసుకుంది. దానిని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో వివరిస్తూ ఒక నివేదిక రూపొందించింది. తాజ్‌మహల్ నుంచి ఆగ్రా కోటని కలిపే తాజ్ కారిడార్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామని ఆ నివేదికలో పేర్కొంది. మరోవైపు వినియోగదారుల ఉత్పత్తులు, సిగరెట్ల కంపెనీ ఐటీసీ కూడా తాజ్‌ని దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చింది. పర్యాటక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఒక అధికార బృందం వారి నివేదికలను పరిశీలించిన తర్వాత ఎవరికి దత్తతకివ్వాలో నిర్ణయిస్తుంది. తాజ్‌తో పాటుగా ఎర్రకోట, ఇతిమాద్–ఉద్–దౌలా కూడా దత్తతకివ్వాలని జీఎంఆర్ కోరుతోంది. మరోవైపు ఐటీసీ కంపెనీ హైదరాబాద్‌లో చార్మినార్, ఆంధ్రప్రదేశ్‌లోని రాతి ఆలయాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 వారసత్వ కట్టడాలను దత్తత తీసుకోవడానికి వివిధ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
గీత రాత మారింది
ఒంగోలు టౌన్: ఆ ఆడ శిశువు జన్మించిన తరువాత రెండు నెలలే తల్లి పొత్తిళ్లలో ఉంది. ఆ మాతృమూర్తి కన్న పేగును దారుణంగా తెంచేసుకుంది. రెండు నెలల పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా వదిలేసింది. మహిళా శిశు సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఆ శిశువు ఒంగోలులోని శారా హోమ్‌లో ఉంటోంది. ఆ శిశువుకు గీత అని పేరు పెట్టారు. ఒకటిన్నరేళ్ల వయస్సు(18నెలలు) కలిగిన గీత చలాకీగా ఆడుకుంటూ ఉంటోంది. అయితే ప్రస్తుతం గీత తలరాత ఒక్కసారిగా మారిపోయింది. ప్రత్యేక అవసరాలు కలిగిన ఆ చిన్నారిని స్వీడన్ దేశానికి చెందిన యువతి కరీనా జూలియన్ మంగళవారం దత్తత తీసుకుంది. కలెక్టర్ వి.వినయ్‌చంద్ సమక్షంలో స్వీడన్ యువతి గీతను దత్తత కింద స్వీకరించింది. ఈ సందర్భంగా కరీనా జూలియన్ మాట్లాడుతూ స్వీడన్లో ఉద్యోగం చేస్తున్న తాను ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారతదేశంలోని రెండేళ్లలోపు వయస్సు కలిగిన శిశువును తీసుకునేందుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ సమగ్ర బాలల పరిరక్షణ పథకం దత్తత విభాగం ద్వారా స్వీడన్ యువతికి గీతను దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పీ సరోజిని, ఐసీపీఎస్ డీసీపీఓ ఎన్ జ్యోతిసుప్రియ, ప్రత్యేక దత్తత విభాగం మేనేజర్ శ్రీలత, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హీనాప్రతిభ ఉన్నారు. -
గుండెలో పెరిగిన పాప
ఒక పాఠశాలలో ఫ్యామిలీ ఫొటో గురించిన పాఠం చెబుతోంది టీచరు. విద్యార్థులంతా చిన్నపిల్లలు. అందులో భాగంగా రకరకాల ఫొటోలు చూపిస్తోంది టీచరు. తరువాతి ఒక ఫొటో చూపించింది. అందులో ఉన్న ఇంటి సభ్యులందరి జుట్టు గోధుమ రంగులో ఉండగా, ఒక పాప జుట్టురంగు మాత్రం నల్లగా ఉంది. చూడగానే ఆ పాప ఆ ఇంట్లో పుట్టలేదని కొందరు పిల్లలు గుర్తించారు. ‘ఆ పాపను వాళ్లు దత్తత తీసుకున్నారు కావొచ్చు,’ అన్నాడు ఒకబ్బాయి. ‘మీకు దత్తత అంటే ఏమిటో తెలుసా?’ క్లాసును ఉద్దేశించి ప్రశ్నించింది టీచర్. ‘నాకు తెలుసు’ వెంటనే ఒక చిన్నారి లేచి నిలబడింది. ‘ఎందుకంటే నేను కూడా దత్తతగా వచ్చినదాన్నే’. క్లాసు అంతా ఆమె వైపే చూస్తోంది. ‘దత్తత అంటే ఏమిటో చెప్పమ్మా?’ అడిగింది టీచర్. ‘మామూలు పిల్లలు తల్లి కడుపులో పెరుగుతారు; దత్తుపిల్లలు తల్లి హృదయంలో పెరుగుతారు’ తడుముకోకుండా బదులిచ్చింది పాప. క్లాసంతా మొదట నిశ్శబ్దం. ఆ వెంటనే చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ పాప ఎలాంటి పరిస్థితుల్లో మరో ఇల్లు, మరో తల్లి మారిందో తెలీదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోంచి వచ్చినా ఆ పాపలాంటి వారి మనసు గెలుచుకునే అవకాశం మరో తల్లికి, మరో ఇంటికి ఉంటుందనేది ఇందులోని బ్యూటీ. -
రండి.. దత్తత తీసుకోండి
సాక్షి, బెంగళూరు : మూడు రోజులుగా బెంగళూరులోని యశ్వంతపూర్‌లో పెట్ అడాప్షన్ అనే పెంపుడు కుక్కల ప్రదర్శన జరుగుతోంది. ఈ ప్రదర్శనకు వచ్చిన వీక్షకులు తమకు నచ్చిన పెంపుడు కుక్కలను దత్తత చేసుకుని ఇంటికి తీసుకెళుతున్నారు. ఈ ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. పెడిగ్రీ, బెంగళూరు ఆప్షన్ టు అడాప్ట్, మెట్రో సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. -
అన్నీ ఇస్తున్నా అభివృద్ధి ఏదీ?
గోపాలపురం: అడిగినవన్నీ ఇస్తున్నా అభివృద్ధి పనులు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను నిలదీశారు. గోపాలపురం మండలంలోని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ దత్తత తీసుకున్న సంజీవపురంలో ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఎంపీ దత్తత గ్రామానికి కావాల్సినన్ని నిధులు కేటాయించినా పనులు ఎందుకు పూర్తి చేయలేదని, పనుల్లో అలసత్వం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి మధ్యలోనే వదిలేశారని గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో పంచాయతీ రాజ్ డీఈ డి.సత్యనారాయణ, ఏఈ పి.సీతయ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజుల్లోగా పనులు పూర్తిచేయకుంటే చర్యలు తప్పవన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ మూడన్నరేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయని అధికారుల బాధ్యత తీసుకుని పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులు సమన్వయంతో అభివృద్ధి దిశగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ మురళీమోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేద్దామని అత్యదిక నిధులు కేటాయించినా పనులు పూర్తిచేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. నాయకులు అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సర్పంచ్ కురసం మహాలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు కె.దుర్గారావు, ఎంపీపీ గద్దే అరుణకుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు ఈలి మోహినీ పద్మజారాణి, ఏఎంసీ చైర్మన్ ముమ్మిడి సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు మేణ్ణి సుధాకర్, ముప్పిడి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం పెండింగ్ పనులు పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి ఏలూరు (మెట్రో): స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరుశాతం ఉండాల్సిందేనని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. గురువారం సంక్షేమ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గతంలో విద్యార్థులు లేకపోయినా ఫీజు రీయిబర్స్‌మెంట్ పేరుతో నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనిని నివారించేందుకు హాజరు ఆన్లైన్ విధానాన్ని అమలు చేశామని వెల్లడించారు. జిల్లాలోని 523 కళాశాలల్లో ఫిబ్రవరి 1 నుంచి ఖచ్చితంగా నూరుశాతం బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓలు, గృహ నిర్మాణశాఖ ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఉపాధి హామీ సిబ్బందితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం, మీ కోసం, జన్మభూమి వినతుల పరిష్కారం, బయోమెట్రిక్ హాజరు, ఉపాధి హామీ వంటి అంశాలపై సమీక్షించారు. అంతకుముందు ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2కే రన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. పశువుల సంరక్షణకు కేంద్రం రోడ్డుపై సంచరించే పశువుల సంరక్షణ కోసం ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో రూ.25 లక్షలతో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పశువుల సంరక్షణా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. -
ఆస్తి కోసం కడతేర్చాడు
ఆస్తి కోసం దత్తపుత్రుడు ఉన్మాదిగా మారాడు. తనను పెంచి పెద్ద వాడ్ని చేసిన కుటుంబంలో విషాదాన్ని నింపాడు. వృద్ధులు అన్న కనికరం కూడా చూపించకుండా ఇద్దరు వృద్ధురాళ్లను అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. తిరువేర్కాడు సమీపంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా ఆదివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సాక్షి, చెన్నై: చెన్నై శివారులోని తిరువేర్కాడు, పాదిరివేడు, మేట్టడు వీధిలో చెందిన ఏలుమలై (58) కుటుంబం నివాసం ఉంటోంది. వ్యాపార వేత్తగా ఉన్న ఆయనకు భార్య సబినా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితోపాటు ఆ ఇంట్లో ఏలుమలై తల్లి రంగనాయకి (85), ఆమె సోదరి కృష్ణవేణి (70) కూడా ఉంటున్నారు. అప్పట్లో రంగనాయకి బాలకృష్ణన్‌ను దత్తతకు తీసుకుని పెంచి పెద్దవాడ్ని చేసింది. చెడు వ్యసనాల బారిన పడ్డ బాలకృష్ణన్ ప్రస్తుతం డ్రైవర్‌గా ఉన్నాడు. ఏలుమలై ఇంటికి సమీపంలోని తన కుటుంబంతో బాలకృష్ణన్ నివాసం ఉంటున్నాడు. తరచూ ఏలుమలై ఇంటి వద్దకు వచ్చి ఆస్తి కోసం రంగనాయకి, కృష్ణవేణి వద్ద బాలకృష్ణన్ గొడవ పడే వాడు. ఆస్తికోసం కోర్టులో కేసు సైతం వేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తన కుటుంబంతో ఏలుమలై హొసూర్కు వెళ్లాడు. దీంతో ఇంట్లో రంగనాయకి, కృష్ణవేణి మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికి బంధువు శరవణన్ ఇంటి నుంచి టీ, కాఫీ, టిఫిన్ వచ్చేది. శనివారం కూడా శరవణన్ ఆ ఇంటికి వచ్చి వెళ్లాడు. ఆదివారం ఉదయాన్నే అక్కడికి రాగా, తలుపులు తెరిచే ఉండడంతో శరవణన్ ఆందోళనలో పడ్డాడు. లోనికి వెళ్లి చూడగా హాలులో రంగనాయకి రక్తపు మడుగులో గొంతు కోసిన స్థితిలో విగత జీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. అలాగే, బాత్రూంలో కృష్ణవేణి గొంతు కోసిన స్థితిలో మృతదేహంగా పడి ఉండడంతో ఆందోళనతో కేకలు పెట్టాడు. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న తిరువేర్కాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రంగనాయకి, కృష్ణవేణి మృతదేహాలను శవపంచనామాకు తరలించారు. పోలీసు శునకాలు ఆ ఇంటికి సమీపంలోని ఓ ప్రాంతం వద్దకు వెళ్లి ఆగాయి. దత్త పుత్రుడి కిరాతకం తొలుత ఈ హత్యలు ఉత్తరాది దొంగల ముఠా పనిగా పోలీసులు భావించారు. అయితే, ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు తెంచి పడేసి ఉండడం, అక్కడున్న పరిస్థితిని బట్టి బాగా తెలిసిన వాళ్లెవరో పథకం ప్రకారం హతమార్చి ఉండవచ్చన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. దీంతో విచారణను వేగవంతం చేశారు. అదే సమయంలో రంగనాయకి దత్తపుత్రుడు బాలకృష్ణన్ మీద అనుమానాలు బయలుదేరాయి. ఆస్తిలో తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని పదేపదే అతగాడు సాగించిన రాద్ధాంతం, కోర్టు కేసులు పోలీసుల దృష్టికి చేరాయి. దీంతో అతడి మీద అనుమానాలు బలపడ్డాయి. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తిరువేర్కాడు సమీపంలోని ఓ ప్రాంతంలో నక్కి ఉన్న బాలకృష్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మోటార్‌సైకిల్‌లో రక్తపు మరకలతో దుస్తులు ఉండడంతో తమ దైన స్టైల్లో విచారించారు. ఆస్తిలో భాగం ఇవ్వలేదన్న ఆగ్రహంతో శనివారం అక్కడకు వచ్చినట్టు, గొడవ ముదరడంతో తానే హతమార్చినట్టుగా బాలకృష్ణన్ విచారణలో అంగీకరించాడు. నగల కోసం వచ్చిన దొంగలు ఈ హత్య చేసినట్టుగా చిత్రీకరించే యత్నం చేసి ఉండడం గమనార్హం. అతగాడి వద్ద నుంచి నగలను సైతం పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. ఇతడికి ఉత్తరాదికి చెందిన ముగ్గురు వ్యక్తులు సహకరించినట్టు సమాచారం రావడంతో వారి కోసం గాలింపు సాగుతోంది. కాగా, పెంచి పెద్దవాడ్ని చేసిన కుటుంబంలోనే విషాదాన్ని నింపే విధంగా దత్త పుత్రుడు ఉన్మాదిగా మారి కిరాతకానికి పాల్పడడం ఆ పరిసరాల్లో కలకలం రేపింది. ఆ ఇంటి వద్ద పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు శ్రమగా మారింది. -
అందుకే సినిమాను దత్తత తీసుకున్న
ఖైరతాబాద్: ‘చిన్న సినిమాలను ఆదరిద్దాం.. నా వంతుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు ‘‘రచయిత’’ సినిమాను నేను దత్తత తీసుకున్నా’ని నటుడు జగపతిబాబు అన్నారు. మంగళవారం ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్‌వ్యూ పార్క్‌లో రచయిత సినిమా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా అనేక సినిమాలు చేశానన్నారు. రచయిత సినిమాను దత్తత తీసుకొని రెండు రోజులుగా వైజాగ్, విజయవాడల్లో నడక పూర్తిచేసి హైదరాబాద్‌లో సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలు సూపర్ హిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొన్ని మంచి సినిమాలు కూడా కనిపించకుండా పోయాయని, దానికి పబ్లిసిటీ లేక, థియేటర్లు దొరకక, ఎవ్వరూ కొనక వంటి కారణాలు అయి ఉండవచ్చన్నారు. చిన్న సినిమాలను కాపాడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదన్నారు. -
తన్విత దత్తత కేసులో కొత్త ట్విస్ట్..!
సాక్షి, కొత్తగూడెం: ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన తన్విత దత్తత విషయం కొత్త మలుపు తిరిగింది. ఆడపిల్ల.. సాకలేమని అమ్ము కున్నందుకు కన్నతల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీకోనందున పెంచిన తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిత్వం వహించిన ఆర్.ఎం.పి. కూడా బాధ్యుడేనని తన్విత కేసులో పోలీసులు కోర్టుకు నివేదించారు. వివరాలివీ.. మహబుబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన మాలోతు భావు సింగ్, ఉమ దంపతులు తమ కూతురు తన్వితను రెండేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాజేంద్రప్రసాద్ స్వరూపలకు దత్తత ఇచ్చారు. భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీసులు ఈ కేసులో దర్యాప్తును చేపట్టి ఖమ్మంలోని శిశు గృహంలో ఉంచారు. ఈ క్రమంలో తల్లి ఉమ తనకే అప్పగించాలని, పెంచిన తల్లి తనకే ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉండగా తన్విత మహబూబాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిందని, అక్కడే దత్తత తంతు జరిగిందని భద్రాద్రి జిల్లా పోలీసులు దర్యాప్తులో తెలపడంతో కేసును మహబూబాబాద్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పోలీసులు కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ జరిపారు. చివరకు తన్విత కన్నతల్లి ఉమకు తెలిసే దత్తత వ్యవహారం జరిగిందని, దత్తత ఒప్పంద పత్రంలో ఉన్న సంతకం కన్నతల్లి ఉమదేనని నిర్ధారించారు. బాగా చూసుకోవడం లేదనే భావుసింగ్ , ఉమలకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన భావు సింగ్ ఆబార్షన్ కోసం ప్రయత్నించాడు. అది తల్లికి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్నరాజేంద్రప్రసాద్ స్వరూపలకు వారి విషయం తెలిసింది. ఇందులో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మధ్యవర్తిత్వం వహించాడు. తన్విత జన్మించాక వారికి అప్పగించాలని ఒప్పంద పత్రం రాసుకున్నారు. దీనిపై పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్‌తో పాటు భావు సింగ్ పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఉమ కేసు వాపసు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గుంటూరుకు చెందిన ఉన్నత కుటుంబానికి దత్తత ఇస్తున్నట్లు తనకు చెప్పారని.. కాని దత్తత తీసుకున్న వారు బాగా చూసుకోవడం లేదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఉమ వాంగ్మూలం ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకే అప్పగింత దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు మహబూబాబాద్ కోర్టులో నివేదించారు. ఆడపిల్ల అని అమ్ముకున్నందుకు కన్న తల్లిదండ్రులు.. చట్టబద్ధంగా పాపను దత్తత తీసుకోనందున పెంచిన తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిత్వం వహించిన ఆర్ఎంపీ కూడా శిక్షకు అర్హులేనన్న పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం గృహంలో ఉన్న బాలిక తన్వితను కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరికి అప్పగించమంటే వారికి అప్పగిస్తామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. -
దత్తపుత్రుడు దూరమయ్యాడు
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలోని గద్దలగుంట రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న నున్నా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం అలముకుంది. కృష్ణా నదిలో ఆదివారం నాటి బోటు ప్రమాదంలో కృష్ణమూర్తి పెంపుడు కుమారుడు కోసూరి రిషిత్రాయ్(14) మృతి చెందాడు. రిషిత్రాయ్ను పెంచుకుంటున్న నున్నా కృష్ణమూర్తి, వాణి దంపతులు కూడా యాత్రకు వెళ్లారు. బోటులో వెళ్లేందుకు ఖాళీ లేకపోవడంతో కృష్ణమూర్తి దంపతులు ఒడ్డున ఉండిపోయారు. బోటులో వెళ్తానని రిషిత్రాయ్ మారాం చేయడంతో.. కృష్ణమూర్తి బాల్య స్నేహితుడైన న్యాయవాది జెట్టి ప్రభాకరరెడ్డి తనతో తీసుకెళ్తానని చెప్పారు. బోటు బోల్తా పడిన ఘటనలో రిషిత్రాయ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కృష్ణమూర్తి కుటుంబంతోపాటు రిషిత్రాయ్ కుటుంబంలో విషాదం అలముకుంది. కోసూరి రిషిత్రాయ్ కృష్ణమూర్తి తోడల్లుడి కుమారుడు. రిషిత్రాయ్ తండ్రి మృతి చెందడంతో కృష్ణమూర్తి దంపతులు పెంచుకుంటున్నారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో రిషిత్ ఏడో తరగతి చదువుతున్నాడు. రిషిత్రాయ్ తల్లితోపాటు కుటుంబ సభ్యులు వేటపాలెంలో ఉంటున్నారు. కృష్ణమూర్తి ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. కృష్ణమూర్తికి ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహం చేశారు. తండ్రి లేని బిడ్డ అని, తనకూ మగబిడ్డ లేడన్న బాధ తీరుతుందన్న ఉద్దేశంతో రిషిత్‌ను పెంచుకుంటున్నారు. -
ముద్దులొలికే చిన్నారి.. ఎవరికి చెందాలి?
సాక్షి, ఖమ్మం: ఒకవైపు పేగు బంధం, మరో వైపు పెంచిన మమకారం. పేగు తెంచుకుని పుట్టిన వెంటనే కన్నకూతురిని మరొకరికి పెంపకానికి ఇచ్చిన తల్లి మనసు తల్లడిల్లింది. తప్పు తెలుసుకుని కన్నబిడ్డను తిరిగి తెచ్చుకునేందుకు పోలీసులను ఆశ్రయించింది. కంటిపాపలా పెంచుకున్న దత్తపుత్రికను వదులుకునేందుకు పెంచిన తల్లికి మనసు రాకపోవడంతో పంచాయతీ అధికారుల వద్దకు చేరింది. ఏం జరుగుతుందో తెలియక.. ఇద్దరు తల్లులకు తాత్కాలికంగా దూరమై చిన్నారి తన్విత అమ్మ ప్రేమ కోసం అమాయకంగా ఎదురు చూస్తోంది. చిన్నారి తన్విత కోసం ఇద్దరు తల్లులు ఆరాటపడుతున్నారు. పాప తమకు కావాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటు కన్నతల్లి, అటు పెంచిన తల్లి నడుమ చిన్నారి నలిగిపోతోంది. తనను పెంచిన తల్లి దగ్గరకు తీసుకెళ్లాలని అధికారులను అమాయంగా అడుగుతోంది. తన్వితను చూసేందుకు ఇద్దరు తల్లులు రావడంతో ఖమ్మం బాలవికాస్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాపను చూసేందుకు ఇద్దరినీ అధికారులు అనుమతించలేదు. దీంతో వారిద్దరూ అక్కడ బైఠాయించారు. తన బిడ్డను ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కన్నతల్లి మాలోతు ఉమ బెదిరించింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తనకే పాపను ఇవ్వాలని భోరున విలపించింది. పెంచిన తల్లి వేముల స్వరూపకే తన్వితను అప్పగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇద్దరు తల్లులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. డీఎన్ఏ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత పాపను ఎవరికి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. వివాదం ఇదీ.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్నా కిష్టాపురం గ్రామానికి చెందిన మాలోతు ఉమ-భావ్‌సింగ్ దంపతులు ఇల్లెందులోని గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తూ స్టేషన్ బస్తీలో నివాసముంటున్నారు. వీరికి తొలి సంతానంలో పాప పుట్టింది. రెండో సంతానంగా జన్మించిన తన్వితను 2015, జనవరి 28న స్ట్రట్‌ఫిట్ బస్తీకి చెందిన వేముల స్వరూప-రాజేందర్ దంపతులకు దత్తత ఇచ్చారు. ఇందుకోసం తన్విత తల్లి, తండ్రికి రూ. 25 వేలు తీసుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత వచ్చి తన కుమార్తెను ఇచ్చేయాలని ఈ నెల 22న ఇల్లెందు పోలీసులను ఉమ ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే పాపను ఇచ్చేది లేదని పెంచిన తల్లి స్వరూప స్పష్టం చేసింది. రెండున్నరేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న తన్వితను తన నుంచి దూరం చేయడం భావ్యం కాదని ఆమె వాదిస్తోంది.