బాలికలను దత్తత తీసుకొని చదివిస్తాం | Take the adoption of the girls | Sakshi
Sakshi News home page

బాలికలను దత్తత తీసుకొని చదివిస్తాం

May 10 2018 2:18 AM | Updated on Jul 26 2019 5:58 PM

Take the adoption of the girls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తల్లి సంపాదనపై ఆధారపడి చదువుకుంటున్న నిరుపేద బాలికలను దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జవ్వాది శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ మార్కులతో పాటు ఎంసెట్, తదితర ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన బాలికలకు సహకారం అందిస్తామన్నారు.

ఏపీలో రాజమండ్రి– కాకినాడ, తెలంగాణలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీల్లో మాత్రమే చదివిస్తామని పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు ఆర్యవైశ్య సంఘం ఆశ్రమంలో ఉండి చదువుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 9399926127, 9491294513 నంబర్లను సంప్రదించాలన్నారు. బాలికలను దత్తత తీసుకొని చదివిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement