srinivas
-
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కలకలం
-
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జంట హత్యల కలకలం
-
పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు చేదు అనుభవం
-
రన్నరప్ శిబి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: చదరంగోత్సవ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటేడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్ శిబి శ్రీనివాస్ ఐన్‌స్టీన్ రన్నరప్‌గా నిలిచాడు. బెంగళూరులోని బీఎంఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ముగిసిన ఈ టోరీ్నలో 21 ఏళ్ల శిబి శ్రీనివాస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శిబి శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరు కరణం నాగ సాయి సార్థక్ (కర్ణాటక), అవిరత్ చౌహాన్ (మహారాష్ట్ర) 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... శిబి శ్రీనివాస్‌కు రెండో స్థానం, సాయి సార్థక్‌కు మూడో స్థానం, అవిరత్కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 8 పాయింట్లతో ప్రశాంత్ నాయక్ (కర్ణాటక) విజేతగా నిలిచాడు. శిబి శ్రీనివాస్ ఈ టోరీ్నలో ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ప్రణవ్ వసంత్ కుమార్ రావు, తోట విధు, అద్వైత్, హరి అన్నామలై, ఆనంది, వినాయక్ కులకరి్ణ, రవి గోపాల్ హెగ్డేలపై శిబి శ్రీనివాస్ గెలిచాడు. సంపత్ కుమార్ తిరునారాయణన్ చేతిలో ఓడిన శిబి... సాయి సార్థక్‌తో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. రన్నరప్‌గా నిలిచిన శిబి శ్రీనివాస్‌కు రూ. 40 వేల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. -
జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు ఆధి పత్యం కోసం బస్తీమే సవాల్ అంటున్నారు. కాకినాడ నగరంలో కూటమి నిట్టనిలువునా చీలిపోయింది. జనసేన, టీడీపీ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి ప్రతి చిన్నదానికి తన్నుకుంటున్నారు. అధికారుల బదిలీ కోసం మొదలైన ఆధిపత్య పోరు మద్యం, బాణసంచా షాపులు దక్కించుకునే వరకు దారి తీసింది. ఒక వర్గానికి వచ్చిన షాపులను మరో వర్గం లాగేసుకునే ప్రయత్నాలతో ఇరువర్గాలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తు న్నాయి. జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో రాజుకున్న అగ్గి ఇటీవల కాకినాడ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో ఇరువురి మధ్య సఖ్యత చెడిందంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కాకినాడలో వివిధ హోదాల్లో పనిచేసిన మల్లిబాబును ఆర్డీఓగా తీసుకురావాలనేది ఎంపీ ఉదయ్ ఆలోచన. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేసిన సత్యనారాయణను ఆర్డీఓగా నియమిస్తామని కొండబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. ఆర్టీఓ బదిలీల్లో ఎంపీ పెత్తనం ఏమిటంటూ ఎమ్మెల్యే వర్గీయులు విమర్శలకు దిగారు. చివరకు ఈ బదిలీ వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంపీ సిఫారసు చేసిన మల్లిబాబు ఆర్డీఓగా నియమితులయ్యారు. ఇది చాలదు అన్నట్టుగా ఒకప్పుడు సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన టీడీపీ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబు ఆ శిబిరం నుంచి బయటకు వచ్చేసి ఎంపీ శ్రీనివాస్ శిబిరంలో చేరారు. ఎమ్మెల్యే కొండబాబు వ్యవహారాలను అతని సోదరుడు సత్యనారాయణ సమన్వయం చేసుకునేవారు. సత్యనారాయణతో పాటు దొరబాబు కూడా కలిసే ఉండేవారు. అటువంటిది వీరిద్దరి మధ్య వచ్చిన పొరపొచ్చాలతో దొరబాబు ఎమ్మెల్యే శిబిరం నుంచి బయటకు వచ్చేశారు. సరిగ్గా అదే సమయంలో జనసేన రూపంలో కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గెలుపొందడంతో దొరబాబు ఆ శిబిరంలో చేరి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతూ వచ్చి చివరకు మద్యం, బాణసంచా షాపు ల వ్యవహారంలో పట్టుదలతో తారా స్థాయికి చేరుకుని రోడ్డెక్కే వరకు వెళ్లాయనేది పరిశీలకుల మాట. ముక్కున వేలేసుకుంటున్న జనం కాకినాడ సంజయ్‌నగర్‌లో ఒక మద్యం దుకాణాన్ని డ్రాలో తెలంగాణాలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కౌకుట్ల జీవన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. షాపు ఏర్పాటు కోసం లీజు అగ్రిమెంట్ చేసుకుని పనులు మొదలుపెట్టేసరికి ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అనుచరుడు, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, అతని అనుచరగణం అడ్డుతగిలారు. ఇంతకీ షాపు దక్కించుకున్న లీజుదారుడు ఎంపీ శ్రీనివాస్‌కు సహచరుడు.అదే కారణంతో ఎమ్మెల్యే కొండబాబు తన అనుచరులను రెచ్చగొట్టి దౌర్జన్యంగా మద్యం షాపును లాగేసుకునేందుకు ప్రయతి్నంచారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. ఇది చినికిచినికి గాలివానగా మారి పోలీసుల వరకు వెళ్లింది. ఈ రెండు వర్గాల మధ్య ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా కాకినాడ మెయిన్‌రోడ్డులో బాణసంచా షాపు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కొండబాబు వర్గం ప్రయత్నించింది. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డులో మందుగుండు షాపు ఇచ్చిన దాఖలాలు లేవని, ప్రమాదకరమనే కారణంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.మద్యం దుకాణం విషయంలో గొడవ చేసినందుకు ప్రతీకారంగా ఎంపీ కావాలనే మందుగుండు షాపునకు అను మతి రాకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తూ సోమవారం రాత్రి రోడ్డెక్కడం అటు జనసేన, ఇటు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. ఏదో ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేసినట్టు వ్యక్తిగత లాభాపేక్ష కోసం నిర్వహించే మ ద్యం, బాణసంచా షాపుల కోసం రోడ్డెక్కుతారా అంటూ టీడీపీ నేతల తీరుతో ప్రజలు ముక్కున వేలేసు కుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఏ పార్టీ ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడలేదని ఆక్షేపిస్తున్నారు. ఎంపీని ఏకాకిని చేసే వ్యూహం జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వివిధ కారణాలతో కాకినాడ ఎంపీ శ్రీనివాస్‌ను ఇటీవల కాలంలో దూరం పెట్టారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎంపీ కూటమిలోని ఎమ్మెల్యేలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పోతున్నారని ఆయా నియోజవకర్గాల నేతలు ఆగ్రహంతో ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు చేశారని కూటమి నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో ఎంపీ శ్రీనివాస్‌ను ఏకాకిని చేసే వ్యూహంలో భాగంగానే టీడీపీ నేతలు తెర వెనుక ఉండి కొండబాబును నడిపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. -
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్ చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించాలి
-
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
-
పిఠాపురం ముంపుకు ప్రభుత్వమే కారణం ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్కడ ?
-
చంద్రబాబు మాజీ పీఎస్ పై సస్పెన్షన్ ఎత్తివేత
-
చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, విజయవాడ: చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. పెండ్యాల శ్రీనివాస్‌ని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు అవినీతి కేసుల్లో పలు ఆరోపణలు ఉన్న శ్రీనివాస్‌పై తదుపరి చర్యలు నిలిపేసి పోస్టింగ్ ఇస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.గత టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారైన సంగతి తెలిసిందే. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేసింది.2014-19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్‌గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది.నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
అన్నీ తానై.. తానే నాన్నయి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల. నాన్న చెప్పిన మాట‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న! – బిర్రు బాలకిషన్,సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
తెలంగాణకు 300 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: ఫేమ్ ఇండియా పథకం రెండో దశలో భాగంగా తె లంగాణకు 300 ఎలక్ట్రి క్ బస్సులు మంజూరు చేశామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు తెలంగాణకు ఒక్క ఎలక్ట్రిక్ బస్సును కూడా ఇవ్వలేదని శుక్ర వారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కు మార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఫేమ్ రెండో దశలో దేశ వ్యాప్తంగా మొత్తం 6,862 ఎలక్ట్రిక్ బస్సులను వివిధ రాష్ట్రాలకు అందించాల్సి ఉండగా, 4,901 బస్సులను అందించామన్నారు. -
వివేకా హత్య కేసుపై కథనాలు ఎలా ప్రచురిస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉండగా, ఆ కేసు గురించిన కథనాలు ఎలా ప్రచురిస్తారని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హైకోర్టు నిలదీసింది. కథనాలే కాకుండా ఏకంగా ట్రయల్ నిర్వహించి, తీర్పులు కూడా ఇచ్చేస్తూ ప్రజలను, కేసును ప్రభావితం చేస్తున్నారని తీవ్రంగా మండిపడింది. ఘటన జరిగినట్లు రాస్తే సరిపోతుందని, దానికి కారకులు, ఎవరిది తప్పు వంటి వివరాలేవీ ప్రచురించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవన్నీ చేయాల్సింది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని, దీనిపై తాము ఓ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అప్పటివరకు క్రిమినల్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేయవచ్చని తెలిపింది.దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై గుంటూరు కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ ఆరు వారాల పాటు నిలిపివేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనంవివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న ఓ వ్యక్తిని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి తన కారులో కడప నుంచి తాడేపల్లి తీసుకొచ్చారంటూ ఆంధ్రజ్యోతి గత ఏడాది ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుంటూరు కోర్టు వారిద్దరినీ వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. ఈ కేసును కొట్టేయాలని, తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ రాధాకృష్ణ, శ్రీనివాస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రజ్యోతి కథనం గురించి, ఏ సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారో వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. కోర్టు ముందు విచారణలో ఉన్న కేసు గురించి ఎలా కథనాలు ప్రచురిస్తారని, ట్రయల్ కూడా నిర్వహించి తీర్పులిచ్చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఘటన గురించి మాత్రమే రాశామని సుబ్బారావు చెప్పగా.. ‘ఘటన అంటే ఏమిటి? ఓ వ్యక్తి గాయపడితే గాయపడ్డాడు అని రాయాలి. అంతే తప్ప ఆ వ్యక్తిని ఎవరు గాయపరిచారు, దాని వెనుక ఎవరున్నారు, అంతిమంగా తప్పు ఎవరిది వంటి విషయాల గురించి చెప్పాల్సింది మీరు కాదు. దర్యాప్తు అధికారులు, న్యాయస్థానాలే’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తనను తాను బాధితునిగా పేర్కొంటూ దాఖలు చేసిన ఈ క్రిమినల్ కేసు చెల్లదన్నారు. ఇది కేకే మిశ్రా కేసులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
కత్తిదూసిన ఉన్మాదం
చెన్నారావుపేట: ఓ ఉన్మాది చేతిలో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. యువతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారుచింతల్తండా గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. తండాకు చెందిన భానోతు శ్రీనివాస్(40), సుగుణ(35) దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. దీపిక డిగ్రీ సెకండియర్, కుమారుడు మదన్‌లాల్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కాగా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు(బన్ని)తో దీపిక ప్రేమలో పడింది. నాగరాజు తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లగా నాగరాజు గ్రామంలోనే ఉంటున్నాడు. గత నవంబర్‌లో నాగరాజు, దీపిక వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జనవరిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడమే కాకుండా.. చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యా దులు చేసుకున్నారు. అనేక మార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్న నాగరాజు.. బుధవారం అర్ధరాత్రి పదహారుచింతల్తండాకు చేరుకున్నాడు. ఆరు బయట నిద్రిస్తున్న దీపిక, ఆమె తల్లిదండ్రులు భానోతు శ్రీనివాస్, సుగుణపై వేట కొడవలితో దాడి చేశాడు. ఆ అలజడికి ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు మదన్‌లాల్ బయటికి రాగా అతడిపైనా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు శ్రీనివాస్‌ను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్రంగా గాయపడిన దీపిక, మదన్‌లాల్‌ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు! నిందితుడు నాగరాజు గుండెంగ ప్రభుత్వ పాఠశాల వరండాలో తెల్లవారు వరకు ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అతడితోపాటు హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నర్సంపేటలో పోలీస్‌స్టేషన్ వద్ద, వరంగల్ రోడ్డ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఘటనస్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. ఫోన్లో కలెక్టర్ సత్యశారదాదేవితో మాట్లాడించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, గురువారం రాత్రి నాగరాజును అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రవీందర్ తెలిపారు. కాగా గురువారం పొద్దుపోయాక మృతులిద్దరి అంత్యక్రియలను స్వగ్రామంలో పూర్తి చేశారు. కూతురు దీపిక తల్లిదండ్రుల మృతదేహాలకు తలకొరివి పెట్టారు.పక్కా వ్యూహంతోనే హత్యలకు ప్లాన్ ఇద్దరూ విడిపోయాక హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన నాగరాజు నెల రోజుల క్రితం మళ్లీ గుండెంగ గ్రామంలో అమ్మమ్మ ఇంటికి చేరుకుని ఆటోను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపికకు వివాహ సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న నాగరాజు ఆమె కుటుంబంపై పగ తీర్చుకోవాలని పక్కా వ్యూహంతోనే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: సీతక్క హన్మకొండ: జంట హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దాడిలో గాయపడిన యువతికి, ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపిన సీతక్క, బాధిత కుటుంబానికి రక్షణ కలి్పస్తామని వివరించారు. బతిమిలాడినా వినలేదు.. నాగరాజును చంపేయాలి: దీపిక నాకు తల్లిదండ్రులను లేకుండా చేసిన నాగరాజును చంపేయాలి.. మాకు వాటర్‌ప్లాంట్ నుంచి వాటర్ పోసేందుకు తండాకు వచ్చేవాడు. అలా పరిచయం అయిన తర్వాత నెక్కొండకు వెళ్లే క్రమంలో వెంటపడేవాడు. నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఏడు నెలలైనా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరికీ కుదరలేదు. హైదరాబాద్ నుంచి వచ్చాక తల్లిదండ్రులతో ఉంటున్నా. బుధవారం రాత్రి అమ్మా, నేను, నాన్న బయట పడుకున్నాం. నాపై ఉన్న దుప్పటి తొలగించగా అరవడంతో అమ్మ లేచింది. బతిమిలాడుతున్నా కత్తితో దాడికి పాల్పడ్డాడు. నేను భయంతో నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ స్పృహ తప్పి కిందపడిపోయా. ఆ తర్వాత లేచి సమీపంలో ఉన్న వదిన వాళ్ల ఇంటికి వెళ్లాను.. అక్కడికి సైతం వచ్చి పిలిచాడు. వాళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. అందరు లేచి అరవడంతో పరారయ్యాడు. -
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబు పాపాలే కారణం..
-
Aswaraopeta SI: నా వన్ ప్లస్ ఫోన్ చూడండి
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయ త్నానికి పాల్పడగా.. మంగళవారం పలు విషయాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ‘నా వన్ ప్లస్ ఫోన్ చూడండి.. అందులో అన్ని వివరాలు ఉన్నాయి’ అంటూ ఎస్సై మెసేజ్ పెట్టారనే వార్త చక్కర్లు కొట్టింది. ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే తాను పురుగుల మందు తాగానని, ఆ తర్వాత భార్యాబిడ్డలు గుర్తు రావడంతో బతకాలనిపించి 108కు ఫోన్ చేశానని మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు వీడియోలో వైరల్ అయింది. సీఐ జితేందర్‌రెడ్డి, స్టేషన్ సిబ్బంది అవమానాలకు గురి చేశారని, తనను అవినీతిపరుడిగా ముద్ర వేశారని, ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని వెల్లడించారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి ముందే సర్వీస్ రివాల్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై ఆరోగ్యం విషమంగానే ఉందని, ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపినట్లు సమాచారం.ఆ ఫోన్ ఎక్కడ ఉంది?ఎస్సై శ్రీనివాస్ చెబుతున్న వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఆత్మహత్యాయత్నం సమయంలో ఫోన్ తన వద్దే ఉంటే దాంట్లో నుంచే అందరికీ ఆధారాలు షేర్ చేయొచ్చు కదా.. అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ కుటుంబ సభ్యులకు ఇచ్చారా, ఆత్మహత్యాయత్నం చేసిన ప్రదేశంలో మహబూబాబాద్ పోలీసులకు లేదా 108 సిబ్బందికి లభిస్తే పోలీసులకు అప్పగించారా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఏదేమైనా ఆ ఫోన్లోని వివరాలు పరిశీలిస్తేనే అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కాగా, ఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఇంటెలిజెన్స్ పోలీసులు మంగళవారం అశ్వారావుపేటకు వచ్చి పలు కోణాల్లో విచారణ చేపట్టారు. -
తిరుపతిలో షాడో ఎమ్మెల్యే!
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకరైతే... అన్నీ తానై వ్యవహరిస్తున్న షాడో ఎమ్మెల్యే మరొకరు. ఈ షాడో ఎమ్మెల్యే తీరుపై కూటమి నేతలే విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కుమారుడు ఆరణి శివకుమార్‌కు ఎలాంటి హోదా లేకపోయినా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ఆయన సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అయిన కమిషనర్ అదితి సింగ్‌తో కలిసి విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయం మంగళవారం వెలుగుచూసింది. ఎమ్మెల్యే అన్న కుమారుడు అధికారికంగా సమీక్ష నిర్వహించడం ఏమిటని మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదేవిధంగా స్విమ్స్‌లో నిర్వహించిన డాక్టర్స్ డే వేడుకల్లో కూడా ఆరణి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం తీవ్ర దుమారాన్ని లేపింది. ఆయా కార్యక్రమాల్లో అన్నీ తానే అన్నట్లుగా శివకుమార్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనతోపాటు మరో నలుగురు వ్యక్తులు సైతం తాము ఎమ్మెల్యేకు సమీప బంధువులం.. అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో హల్చల్ చేస్తుండటం కలకలం రేపుతోంది. ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో వింత సంస్కృతిని చూస్తున్నామని అధికారులు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
అజ్ఞాత బాట.. కన్నీటి ఊట..
‘వెనకచ్చే ఆవుల్లారా.. ఎర్ర ఆవుల్లారో.. శ్రీరామ రామచంద్రుడా.. మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామచంద్రుడా.. ముందొచ్చే లేగల్లారా.. ముద్దు లేగల్లారో.. శ్రీరామ రామచంద్రుడా..మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామచంద్రుడా..’ అంటూ చదువు కోసం పట్నం వెళ్లిన కొడుకు కనిపించకుండా పోవడంతో కొడుకు తలపుల్లో తల్లి పడిన వేదనకు అద్దం పట్టే ఈ పాట ‘ఎన్కౌంటర్’ సినిమాలోనిది.సిరిసిల్ల: రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. సీపీఐ(ఎంఎల్) జనశక్తి నక్సలైట్ గ్రూపులో చేరి అడవిబాట పట్టాడు. 26 ఏళ్లు శ్రీనివాస్ జాడ తెలియక అతడి తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ, భూదమ్మలూ ఇదే తరహాలో తల్లడిల్లిపోయారు. చివ రికి శ్రీనివాస్‌ను కడసారి చూడకుండానే కన్నుమూశారు. పోలీస్ కౌన్సెలింగ్‌తో వెలుగులోకి..చాలాకాలం పాటు శ్రీనివాస్ ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో నక్సలైట్ ఉద్యమంలో పని చేస్తున్నాడని గుర్తించారు. దీంతో బండలింగంపల్లిలోని మ్యాదరి నారాయణ ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ కొడుకు లొంగిపోయేలా చూడండి’ అంటూ.. కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజాఉద్యమ నిర్మాణంలో భాగంగా శ్రీనివాస్ ఒడిశా ప్రాంతంలో పనిచేస్తున్నాడని కొద్ది కాలం కిందట తెలిసింది. కానీ, అతని ఆచూకీ లేక కుటుంబసభ్యులు మనోవేదనకు గురయ్యారు. రాత్రిళ్లు వాకిట్లో అలికిడి అయితే చాలు కొడుకు వచ్చాడేమోననని ఆశ పడ్డారు. ఏళ్లతరబడి అతను ఎలా ఉన్నాడో... ఎక్కడున్నాడో తెలియలేదు.శ్రీనివాస్ అజ్ఞాతవాసం ఆ కన్నవారికి తీరని వేదన మిగిల్చింది. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా, ఆ మృతుల్లో ‘మావోడు ఉన్నాడో’నని ఆందోళన చెందారు. చివరకు కొడుకును చూడకుండానే 2017లో తల్లి భూదమ్మ చనిపోయింది. కొడుకు జాడ లేక, భార్య కన్నుమూసిన వేదనలో ఆ తండ్రి కూడా జూన్ 23న బండలింగంపల్లిలో కన్నుమూశాడు. నారాయణ దశదినకర్మ బుధవారం జరగనుంది. అజ్ఞాతంలో ఉన్న శ్రీనివాస్ ఎక్కడ, ఎలా ఉన్నారో జనశక్తి అగ్రనేతలు కూడా చెప్పలేకపోతున్నారు. -
మా ఆస్తులనే అమ్ముకుంటున్నాం
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూములు, ఇతర ఆస్తుల విక్రయాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని విశాఖ ఉక్కు యాజమాన్యం (ఆర్ఐఎన్ఎల్) మంగళవారం హైకోర్టును కోరింది. స్టీల్ ప్లాంట్ ఆర్థిక అవసరాల నిమిత్తం సొంత ఆస్తులను విక్రయించుకునే హక్కు తమకు ఉందని, స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల విక్రయాల ప్రక్రియ నిలిచిపోయిందని ఆర్ఐఎన్ఎల్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ నివేదించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తాము సొంతంగా ఏపీఐఐసీ, హౌసింగ్ బోర్డు నుంచి భూములు కొన్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా భూ సేకరణ ద్వారా పెద్ద మొత్తంలో భూములు సేకరించిందని తెలిపారు. కేంద్రం సేకరించిన భూముల జోలికి తాము వెళ్లడం లేదని, తాము కొనుగోలు చేసిన 24.99 ఎకరాల భూమినే అమ్ముకుంటున్నామని పేర్కొన్నారు. భూముల విక్రయానికి వేలం ప్రక్రియ కూడా మొదలైందని, 170 మంది బిడ్డర్లు పాల్గొనగా 72 మందిని హెచ్–1 బిడ్డర్లుగా ప్రకటించినట్లు చెప్పారు. హెచ్–1 బిడ్డర్ల నుంచి రూ.243 కోట్లు రావాల్సి ఉండగా, రూ.45 కోట్లు ఇప్పటికే జమ చేశారన్నారు. స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల మిగిలిన మొత్తాన్ని జమ చేయకుండా నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. స్టేటస్ కో ఉత్తర్వుల విషయంలో స్పష్టత కోసం హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అనుబంధ పిటిషన్లో కోరిన విధంగా స్టేటస్ కో ఉత్తర్వులను సవరించడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వుల సవరణ కోసం ఆర్ఐఎన్ఎల్ అనుబంధ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లందరినీ ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రైవేటీకరణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు..విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి కూడా వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అమ్మకం కాదు.. పెట్టుబడుల ఉపసంహరణకేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.నరసింహశర్మ వాదనలు వినిపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూ సేకరణ ద్వారా 21 వేల ఎకరాలు సేకరించామన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయన్నారు. మిగిలిన భూములు ఆర్ఐఎన్ఎల్కే చెందుతాయన్నారు. అసలు తాము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మడం లేదని, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100 శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తున్నామని తెలిపారు. ఇదే రీతిలో దేశవ్యాప్తంగా 8 యూనిట్లల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తున్నామన్నారు. ఆర్ఐఎన్ఎల్ ఆస్తులతో తమకు సంబంధం లేదన్నారు. వాళ్ల ఆస్తులను వాళ్లు అమ్ముకోవచ్చునన్నారు. -
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ రీఎంట్రీ కోసం ప్రయత్నం
-
సచివాలయంలో పెండ్యాల ప్రత్యక్షం
సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో విదేశాలకు పరారైన పెండ్యాల శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చారు. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శ్రీనివాస్ అమెరికాలో అజ్ఞాతవాసాన్ని ముగించుకుని సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి, పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను కోరారు. నల్లమూటలు బాబు బంగ్లాకు చేర్చించి పెండ్యాలే2014 – 19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్‌గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పెండ్యాల శ్రీనివాస్‌కు ఉన్న రెండు ఈ మెయిల్ ఐడీలకు మెయిల్చేయడంతోపాటు హైదరాబాద్‌లోని ఆయన చిరునామాకు స్పీడ్‌పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె సీఐడీ అధికారులకు తెలిపారు. నోటీసులు జారీ కాగానే పెండ్యాల శ్రీనివాస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అమెరికాకు పరారయ్యారు. తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్తున్నట్టు ఆయన ప్రణాళిక శాఖకు ఓ మెయిల్ ద్వారా తెలిపి వెళ్లిపోయారు.మెమో జారీ చేసినా బేఖాతరు.. సస్పెన్షన్పెండ్యాల శ్రీనివాస్ అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రణాళిక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆయన సెలవు దరఖాస్తును తిరస్కరించి, మెమో జారీచేసింది. అధికారులు హైదరాబాద్‌లోని పెండ్యాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రికి మెమో కాపీని అందించారు. మెమో అందుకున్నప్పటి నుంచి వారం రోజుల్లో ఆఫీసుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని పెండ్యాల శ్రీనివాసరావును ప్రణాళిక శాఖ ఆదేశించింది. ఆ మెమోను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ సర్వీసు నిబంధనలను అనుసరించి పెండ్యాల శ్రీనివాస్‌ను ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 30న సస్పెండ్ చేసింది.బాబు రాగానే మళ్లీ ప్రత్యక్షంకాగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బుధవారం నేరుగా సచివాలయానికి వచ్చి తనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించి, పోస్టింగ్ ఇవ్వాలని ప్రణాళిక శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందన్నది సుస్పష్టమవుతోంది. ఎందుకంటే స్కిల్ కుంభకోణం కేసులోనే చంద్రబాబు అరెస్ట్ అయి 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్‌ను సీఐడీ సాక్షిగా పేర్కొంది. దాంతో ఆ కేసు దర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు పెండ్యాల శ్రీనివాస్‌ను కూడా ఒక సాధనంగా వాడుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా స్పష్టమవుతోంది. స్కిల్ కుంభకోణం కేసును నీరుగార్చే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పెండ్యాల శ్రీనివాస్ తిరిగి వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే. -
ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్
సాక్షి, అమరావతి: అందరూ ఊహించిన విధంగానే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఏజీగా దమ్మాలపాటిని నియమించాలన్నది చంద్రబాబు అభిలాష అని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కోరారు. దీంతో సీఎస్ ఏజీ నియామక ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే, దమ్మాలపాటి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయి. రెండోసారి ఏజీగా దమ్మాలపాటి ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కావడం ఇది రెండోసారి. 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయన ఏజీగా సేవలందించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన∙వెంటనే సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ అడ్వొకేట్ జనరల్ అయ్యారు. , దమ్మాలపాటి అదనపు ఏజీగా నియమితులయ్యారు. 2016లో వేణుగోపాల్ ఏజీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 2016 మే 28న దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయేంత వరకు ఏజీగా కొనసాగారు. దమ్మాలపాటికే పూర్తి స్వేచ్ఛ ఏజీ నియామకం కొలిక్కి రావడంతో అదనపు ఏజీ (ఏఏజీ), ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు (ఎస్‌జీపీ), ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదుల (ఏజీపీ) పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. అదనపు ఏజీ పోస్టు భర్తీ చేస్తారా లేక గతంలోలా ఆ పోస్టును భర్తీ చేయకుండా వదిలేస్తారా అన్న దానిపై న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవేళ ఏఏజీ పోస్టును భర్తీ చేస్తే జనసేన లేదా బీజేపీల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. అదనపు ఏజీ పోస్టు ఒకటా లేక రెండు ఉంటాయా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఒక అదనపు ఏజీ పోస్టు మాత్రమే భర్తీ చేస్తే జనసేనకే అవకాశం ఉంది. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) నియామకం కొంత సుదీర్ఘ ప్రక్రియ. హైకోర్టును సంప్రదించిన తరువాతే పీపీని నియమించాలి. అందువల్ల పీపీ నియామకం అలస్యమవుతుంది. టీడీపీ నుంచి ఎవరిని జీపీలు, ఏజీపీలు చేయాలన్న విషయంపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. జీపీలు, ఏజీపీలతో పాటు స్టాండింగ్ కౌన్సిల్స్ నియామకాల్లో గతంలోలానే దమ్మాలపాటి శ్రీనివాస్‌కు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిసింది. శ్రీరామ్ తదితరుల రాజీనామాలకు ఆమోదం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిచ్చి0ది. దమ్మాలపాటి వైపే చంద్రబాబు మొగ్గు తాజాగా ఏజీ పోస్టుకి పలువురి పేర్లు వినిపించాయి. సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు సహా పలువురి పేర్లు చర్చకు వచ్చాయి. అయితే చంద్రబాబు చివరకు దమ్మాలపాటి వైపే మొగ్గు చూపారు. గతంలో ఏజీగా పనిచేసి ఉండటం, పలు విపత్కర పరిస్థితుల నుంచి చంద్రబాబుతో సహా పార్టీ ఇతర నేతలను బయటపడేయడం, పార్టీలో అందరికీ అందుబాటులో ఉండటం వంటివి దమ్మలపాటికి కలసి వచ్చాయి. న్యాయవ్యవస్థలో దమ్మాలపాటికి మంచిపట్టు ఉండటం కూడా ఆయనకు సానుకూల అంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతకాలం ఆయన ఏజీ పదవిలో కొనసాగుతారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఫొటోలు)
-
చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే కన్నుమూత
భారతదేశానికి చెందిన చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ హెగ్డే మూడు దశాబ్దాలకు పైగా (1978 నుండి 2014) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేశారు.ఈ సమయంలో అంతరిక్ష సంస్థ నిర్వహించిన అనేక చారిత్రాత్మక మిషన్లలో కీలక పాత్ర పోషించారు. వాటిలో ముఖ్యమైనది 2008లో చేపట్టిన చంద్రయాన్-1. ఇది చంద్రునిపై నీటి అణువులను గుర్తించింది. శ్రీనివాస్ హెగ్డే పదవీ విరమణ అనంతరం బెంగళూరుకు చెందిన స్టార్టప్ టీమ్ ఇండస్‌లో చేరారు. -
మనస్తాపంతో ఇద్దరు వైఎస్సార్సీపీ అభిమానులు ఆత్మహత్య
బల్లికురవ/టి.నరసాపురం: వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గంగపాలెం గ్రామానికి చెందిన పెయ్యల రామయ్య(64) 4వ తేదీ ఉదయం ఎన్నికల ఫలితాలను టీవీలో చూస్తూ బాధపడ్డాడు. ప్రజలకు ఎంతో మేలు చేసిన వైఎస్సార్సీపీని ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ఓడించారంటూ మనోవ్యథకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి గంగపాలెం గ్రామం నుంచి మల్లాయపాలెం వెళ్లే రోడ్డులోæని వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ స్తంభానికి తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని భార్య సులోచన మాట్లాడుతూ.. ‘జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అందడంతో మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో నా భర్త ఎంతో బాధపడ్డాడు. ఆయన్ను ఎంతగానో ఓదార్చాం. కానీ, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ విలపించింది. రామయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి సురేష్, కొణిదెన సర్పంచ్ కె.లేపాక్షి విష్ణు, పెయ్యల రంగనాథ్, గుంజి ఆంజనేయులు తదితరులు పరామర్శించారు. అన్యాయం జరిగిందంటూ.. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం పుట్రేపు గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాస్(24) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైఎస్సార్సీపీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న శ్రీనివాస్.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిచి.. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని భావించాడు. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎక్కడో అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం కొద్దిసేపటికి ఇంటికి వచి్చన కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ను వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న శ్రీనివాస్ మరణించడంతో భార్య, ముగ్గురు పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు.