సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు ఏపీ ప్రణాళిక శాఖ మెమో జారీ చేసింది. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అనుమతి లేకుండా విదేశాలకు పారిపోవడంపై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ప్రణాళిక శాఖ మెమో ఇచ్చింది.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో విచారించేందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారయ్యాడు. అనుమతి లేకుండానే అమెరికా చెక్కేశాడు. అయితే స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాంలో శ్రీనివాస్‌ను కీలక వ్యక్తిగా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారపోయిన విషయం తెలిసిందే. నోటీసుల గురించి తెలుసుకున్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లినట్లు అధికారులు గుర్తించగా..పలు కాంట్రాక్టుల్లో షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ కూడా సెప్టెంబర్ 5న దేశం విడిచి దుబాయ్ వెళ్లారు.
యోగేష్ గుప్తాతో చంద్రబాబు పీఎస్‌కు సంబంధాలు
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్ డీజీ సంజయ్ ఇప్పటికే తెలిపారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైంది. పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్‌గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని ఇప్పటికే ఐటీ నోటీసుల ద్వారా వెల్లడయింది
అరెస్ట్ సందర్భంగా చంద్రబాబుకు వాట్సాప్ స్క్రీన్‌షాట్‌లు
2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తో జరిగిన వాట్సాప్ చాట్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను పోలీసు అధికారులు ఇటీవల చంద్రబాబుకు చూపించారు. ఇవి చూపించగా.. తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ బాబు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment