personal secratary
-
సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ భిభవ్ కుమారుపై వేటు పడింది. ఢిల్లీ డైరెక్టరేట్ ఆప్ విజిలెన్స్ గురువారం ఆయన్ను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. భిభవ్ కుమార్‌పై నమోదైన కేసు, తాత్కాలిక నియామకానికి సంబంధించి సెంట్రల్ సివిల్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి నియమించినందకు ఆయన విధులను రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2007లో తన విధలు నిర్వమించకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడటంతో భిభివ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిపై నోయిడా డెవలప్మెంట్ అథారిటీలో పని చేసే మహేష్ పాల్ అనే ప్రభుత్వ అధికారి కేసు నమోదు చేశాఉ. దీంతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్‌బుక్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిపాలనపరమైన చర్యలో భాగంగా భిభవ్ కుమార్‌ను సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీగా తొలగించారు. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం భిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. అదే విధంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద భిభవ్ కుమార్ వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమమని, ఈడీ అరెస్ట్‌ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై విచారణను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. -
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్
-
చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌కు ప్రణాళిక శాఖ మెమో జారీ
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు ఏపీ ప్రణాళిక శాఖ మెమో జారీ చేసింది. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అనుమతి లేకుండా విదేశాలకు పారిపోవడంపై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ప్రణాళిక శాఖ మెమో ఇచ్చింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో విచారించేందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారయ్యాడు. అనుమతి లేకుండానే అమెరికా చెక్కేశాడు. అయితే స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో శ్రీనివాస్‌ను కీలక వ్యక్తిగా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవెలప్మెంట్ స్కాం వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారపోయిన విషయం తెలిసిందే. నోటీసుల గురించి తెలుసుకున్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లినట్లు అధికారులు గుర్తించగా..పలు కాంట్రాక్టుల్లో షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ కూడా సెప్టెంబర్ 5న దేశం విడిచి దుబాయ్ వెళ్లారు. యోగేష్ గుప్తాతో చంద్రబాబు పీఎస్‌కు సంబంధాలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్ డీజీ సంజయ్ ఇప్పటికే తెలిపారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైంది. పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని ఇప్పటికే ఐటీ నోటీసుల ద్వారా వెల్లడయింది అరెస్ట్ సందర్భంగా చంద్రబాబుకు వాట్సాప్ స్క్రీన్షాట్లు 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తో జరిగిన వాట్సాప్ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసు అధికారులు ఇటీవల చంద్రబాబుకు చూపించారు. ఇవి చూపించగా.. తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ బాబు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. చదవండి: రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి -
కూకట్‌పల్లిలో ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి...
అమీర్‌పేట: సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పరిచయమైన ఓ వ్యక్తి జ్యోతిష్కుడిని మోసం చేశాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూకట్‌పల్లిలో స్థలం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షలు కాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవీ శైలేంద్రనాథ్ అనే వ్యక్తి ఎస్ఆర్నగర్లోని స్వస్థిక్ ప్లాజా హిమాలయా బుక్ స్టోర్ పైఅంతస్తులో నివాసముంటున్నాడు. ప్రసార మాధ్యమాల ద్వారా శైలేంద్రనాథ్ గురించి తెలుసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. తన పేరు సుధాకర్ అని తాను సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. పలుమార్లు జాతకం చూపించుకున్న సుధాకర్ వెంట ఇద్దరు గన్మెన్లు కూడా ఉండటంతో పాటు వారి వద్ద గన్స్ కూడా ఉండేవి. కూకట్‌పల్లిలో ఓ చోట ప్రభుత్వ స్థలం ఉందని, అది నీకు వచ్చేలా చూస్తానని, అందులో ఆధ్యాత్మిక కేంద్రం పెట్టుకోవచ్చని నమ్మించాడు. దీంతో శైలేంద్ర విడతలవారీగా 2019 నుంచి 2021 ఫిబ్రవరి వరకు రూ.25 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకుని సంవత్సరాలు గడస్తున్నా స్థలం ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చి తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శైలేంద్ర కోరారు. డబ్బులు అడిగితే గన్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. -
చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో మూడో రోజు సోదాలు
-
రావత్‌పై ముడుపుల ఆరోపణలు
* ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై స్టింగ్ ఆపరేషన్ * సీడీ విడుదల చేసిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ న్యూఢిల్లీ: అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడిచేస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురు దాడి ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్.. ప్రయివేటు పంపిణీదారులకు అనుకూలంగా మద్యం విధానాన్ని మార్చివేసి డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కూడా ఆ పార్టీ నేతల అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఆరోపించింది. కేరళ మొదలుకొని అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ దోపిడీ వ్యాపారులుగా మారారని.. వారు గాంధీ కుటుంబానికి కమిషన్లు ఇస్తున్నారని పేర్కొంది. రావత్‌ను తక్షణమే తొలగించాలి డెహ్రాడూన్‌లో మద్యం పంపిణీని ప్రభుత్వ సంస్థలకు కాకుండా ప్రయివేటు పంపిణీదారులకు ఇచ్చేందుకు తనకు ముట్టజెప్పాల్సిన కమిషన్లపై.. ప్రయివేటు మద్యం పంపిణీదారులు, మధ్యవర్తులుగా చెప్తున్న వారితో హరీశ్‌రావత్ వ్యక్తిగత కార్యదర్శి మొహమ్మద్ షాహిద్ బేరమాడుతున్నట్లుగా ఉన్న వీడియో దృశ్యంతో ఒక సీడీని బీజేపీ నేత, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో విడుదలచేశారు. ఈ సీడీలోని దృశ్యాల్లో రావత్ లేరు. కానీ సీఎం కార్యదర్శి షాహిద్ బేరమాడుతున్నారని నిర్మలా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కార్యదర్శి కూడా అయిన షాహిద్.. సీఎం రావత్‌తో ఎంతో కాలంగా పనిచేస్తున్నారని.. రావత్ గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నపుడు కూడా ఆయనతో కలిసి షాహిద్ పనిచేశారని ఆమె చెప్పారు. రావత్ ఉత్తరాఖండ్‌లో మద్యం విధానాన్ని వక్రీకరించి ముడుపులు దండుకుంటున్నారని.. ఆయనను కాంగ్రెస్ పార్టీ తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. దేశం దృష్టి మరల్చటానికే: రావత్ డెహ్రాడూన్: బీజేపీ తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్ తిరస్కరించారు. తమ పార్టీ అగ్రనేతల కుంభకోణాల నుంచి దేశం దృష్టిని మరల్చాలనే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. అయితే.. ఆ వీడియో టేపుపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించినట్లు రావత్ తెలిపారు. -
స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన సీఎం కార్యదర్శి