డెహ్రాడూన్: మద్యం షాపుల లైసెన్స్ల మంజూరుకు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉత్తరఖండ్ సీఎం హరీశ్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి మహ్మద్ షాహిద్ స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయారు. ఓ పత్రిక చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్ మద్యం పాలసీ కేటాయింపుల్లో అవకతకవలు జరిగినట్టు ఈ స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొంటున్న బీజేపీ చేతికి కొత్త అస్త్రం దొరికినట్టయింది. బీజేపీ వెంటనే కాంగ్రెస్పై ఎదురుదాడి ప్రారంభించింది. హరీశ్ రావత్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఉత్తరఖండ్ సీఎం హరీశ్ రావత్పై అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఆయన పదవి నుంచి వైదొలగాలని పేర్కొంది.
Published Wed, Jul 22 2015 4:07 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
Advertisement