Uttarakhand CM
-
ప్రధాని మోదీ లక్ష్యం అదే.. ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుపొందాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగానే అభ్యర్థులు కూడా అడుగులు వేస్తున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్ సింగ్ ధామి' దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలపైన విశ్వాసం ఉండటం వల్ల 400 సీట్లకు గెలుస్తామని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని పుష్కర్ సింగ్ అన్నారు. మీ కృషి, అంకితభావం బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చాయని అన్నారు. 2014, 2019 కంటే ఈసారి బీజేపీని మరింత పెద్ద విజయాన్ని సాధించేలా ప్రతిజ్ఞ చేయాలని పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు. ప్రధాని మోదీని మూడవసారి అధికారంలోకి తీసుకురావడానికి మన వంతు సహకారం అందించాలని, అందుకు రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాలను మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని ధామి అన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక సంచిక కూడా విడుదల చేశారు. उत्तराखण्ड फिर चुनेगा मोदी सरकार अबकी बार 400 पार.. बंडिया, खटीमा (ऊधम सिंह नगर) में भाजपा नौसर मण्डल द्वारा आयोजित 'जनमिलन कार्यक्रम' में सम्मिलित हुआ। इस अवसर पर बड़ी संख्या में मातृशक्ति, बुजुर्गों एवं युवाओं द्वारा मिले असीम प्रेम एवं अपार जनसमर्थन से अभिभूत हूँ। pic.twitter.com/cP06b2RzkB — Pushkar Singh Dhami (Modi Ka Parivar) (@pushkardhami) April 6, 2024 -
ఉత్తరాఖండ్ సీఎం హోలీ డ్యాన్స్ - వీడియో
దేశంలో హోలీ సంబరాలు మొదలైపోయాయి. సాధారణ ప్రజల మాదిరిగానే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్‌సింగ్ ధామి' కూడా తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్నారు. తన తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితో కలిసి హోలీ పాటకు డ్యాన్స్ చేశారు. హోలీని ప్రేమ, సోదరభావం, సామరస్యానికి సంబంధించిన వేడుకగా సీఎం పుష్కర్‌సింగ్ ధామి అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లో హోలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన అన్నారు. సీఎం ధామి హోలీ జరుపుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి హోలీ రేపు (మార్చి 25) జరగాల్సి ఉండగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించారు. పండుగ ముందు హోలికా దహన్ పేరుతో భోగి మంటలను వెలిగించే ఆచారం ఉంటుంది. ఇది హోలికా అనే రాక్షసిని దహనం చేసే కార్యక్రమం. ఆనందోత్సాహాల మధ్య, సాంప్రదాయ స్వీట్లు పంచుకుంటారు, ప్రజలలో స్నేహం, ఐక్యత భావాన్ని ఈ పండుగల ద్వారా పెంపొందించుకుంటారు. #WATCH | Dehradun | On the occasion of Holi, Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dances to a Holi song with his mother Vishna Devi, wife Geeta Dhami and others. pic.twitter.com/p8JeSNSm8A — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024 -
ఉత్తరాఖండ్ సీఎం, నేషనల్ హైవే అథారిటీ మధ్య డైలాగ్ వార్
-
హ్యాట్రిక్ ‘వందన కథ చెపుతుందిదే..బేటీ ఖేల్నేదో!
మూడు నెలల క్రితం హాకీ ప్లేయర్ వందనా కటారియా తండ్రి మరణించాడు. చివరి చూపులకు నోచుకోలేని దూరంలో ఒలింపిక్స్ ట్రయినింగ్లో ఉంది వందన. ‘అన్నీ వదిలేసి నాన్న కోసం ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తా’ అని ఏడ్చింది వందన. కాని దేశం కోసం ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ‘తక్కువ కులం’ అమ్మాయి ఇంత ఎదగడం ఇష్టం లేని ‘అగ్రవర్ణ కుర్రాళ్లు’ ఆమె ఇంటి ముందు హంగామా సృష్టించారు. కాని విజేత ఎప్పుడూ విజేతే. దేశమే ఆమె కులం. అందుకే నేడు ఆమెను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి అంబాసిడర్‌ని చేసింది. కొందరు పూలదండలు పొందుతారు. మరి కొందరు రాళ్లనూ పూలు చేసుకుంటారు. ఉత్తరాఖండ్ సి.ఎం. పుష్కర్ సింగ్ ధమి ఆదివారం (ఆగస్టు 8) వందనా కటారియాను తమ రాష్ట్ర ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. వందనా కటారియా హరిద్వార్ జిల్లాలోని రోష్నాబాద్‌లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీలో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ చేసి, అలాంటి రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె చేసిన అద్భుత ప్రయాణం ఈ ఊరి నుంచే మొదలైంది. నిజానికి వందనను ‘బేటీ బచావో’ కాంపెయిన్తోపాటు ‘బేటీ ఖేల్నేదో’ (అమ్మాయిలను ఆడనివ్వండి) క్యాంపెయిన్‌కి కూడా అంబాసిడర్ ని చేయాలి. ఎందుకంటే కుటుంబం, ఊరు కూడా ఆమె ఆటకు అభ్యంతరాలు చెప్పాయి. చెట్ల కొమ్మలతో బి.హెచ్.ఇ.ఎల్లో టెక్నిషియన్‌గా పని చేసే నహర్ సింగ్ తొమ్మిది మంది సంతానంలో ఒకమ్మాయి వందన. ఆమె అక్క, చెల్లి.. ముగ్గురూ కలిసి చెట్ల కొమ్మలతో హాకీ ఆడేవారు. అక్క, చెల్లి జిల్లాస్థాయిలోనే ఉండిపోతే వందనా ఒలింపిక్స్ దాకా ఎదిగింది. కాని వీళ్లు ముగ్గురూ క్రీడల్లోకి వెళతామంటే వాళ్ల నానమ్మ ఒప్పుకోలేదు. అన్నయ్యలు కూడా ఒప్పుకోలేదు. మిగిలిన చెల్లెళ్లు ఆటలో ఆగిపోయినా వందనా మీరట్ కు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ స్కూల్‌కు జాయిన్ అవుదామని నిశ్చయించుకున్నప్పుడు అన్నయ్యలు ఎక్కడ చదివిస్తాం అని పెదవి విరిచారు. పైగా ఊరి వాళ్లు ఎందుకు ఆడపిల్లలకు ఆటలు అని ఎప్పుడూ వందన తండ్రికి సుద్దులు చెప్పేవారే. కాని తండ్రి ఆమె ప్రతిభను గౌరవించాడు. సపోర్ట్ చేశాడు. నువ్వు ఒకరోజు దేశానికి పేరు తేవాలి... మన ఊరికి పేరు తేవాలి అనేవాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితమే ఆయన చనిపోయాడు. అప్పుడు వందన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉంది. రావడం సులువు కాదు. రాకుండా ఉండలేదు. ‘నాన్న కోసం వచ్చేస్తాను అన్నయ్యా... ఆయన్ను చివరి చూపు చూడాలని ఉంది’ అని ఏడ్చింది వందన. ‘వద్దమ్మా... ఇక్కడి పనులు మేము చూసుకుంటాం. నాన్నకు నువ్వు మెడల్ తీసుకురావడమే అసలైన నివాళి’ అని అన్నయ్య చెప్పాడు. ఆమె ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో ఆడింది. ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్ కొట్టింది. అది ఆమె ఘనత. ఎదగకూడదా? పాలేరు కొడుకు పాలేరు కావాలి... పని మనిషి కూతురు పని మనిషి కావాలి అనే భావజాలం మన దేశంలో కొందరిలో ఉంది. ఒక కులం వాళ్లు ఇంతలోనే ఉండాలి ఒక కులం వాళ్లు రాజ్యాలు ఏలాలి అనుకునే సంకుచిత మనస్తత్వం ఉందనేది వాస్తవం. వందన సొంత ఊరు రోష్నాబాద్‌లో ఉంది. చిన్న గల్లీలో ఉంటుంది వందన ఇల్లు. వందన ఎదగడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడటం, పేరు రావడం ఆ ఊరిలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కుర్రాళ్లకు నచ్చలేదు. వందన సోదరుడు ‘మమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ల బాధ పడలేక సిసి కెమెరాలు బిగించాం’ అన్నాడు. అవమానించాలని చూసిన రోజు భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్ సెమి ఫైనల్స్‌కు వెళ్లి దేశమంతా గొప్ప ప్రశంసలు పొందింది. అర్జెంటీనాతో మేచ్ గెలిస్తే ఫైనల్స్‌లోకి వెళ్లేది. నిజానికి వందనా హాకీ స్టార్ అయ్యాక ఊళ్లో ఎంతో మార్పు వచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అగ్రవర్ణాల వారు కూడా వందనను ఎంతో మెచ్చుకున్నారు. ఊళ్లో వందన కుటుంబానికి ఎంతో గౌరవం కూడా పెరిగింది. కాని అదే సమయంలో కొందరు కుర్రాళ్లు మాత్రం భరించలేకపోయారు. అర్జెంటీనాతో మ్యాచ్ ఓడిన రోజు మ్యాచ్ అయిన వెంటనే వారు వందన ఇంటి ముందుకు వచ్చి టపాకాయలు కాల్చారు. ‘ఇలాంటి వాళ్లు (తక్కువ వర్ణాల వాళ్లు) టీమ్‌లో ఉండటం వల్లే ఇండియా ఓడిపోయింది’ అనే అర్థంలో కామెంట్లు చేశారు. చాలా అవమానించే ప్రయత్నం చేశారు. వందన కుటుంబం ఆ దాడికి దిగ్భ్రాంతి చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా దీనిపై నిరసనలు జరిగాయి. ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రభుత్వమే అడ్డుగా నిలబడి.. దేశం కోసం ఆడిన వందన ఇలాంటి దాడి ఎదుర్కొనడం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా సహించలేకపోయింది. వెంటనే ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రంగంలో దిగి వందన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆమెను తమ మహిళా, శిశు సంక్షేమ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన గొప్ప క్రీడాకారిణిగా ఆమెను గౌరవిస్తున్నామని తెలిపారు. మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో రాణించాలంటే అదీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి రాణించాలనంటే ముందు ‘అమ్మాయి’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత ‘వనరులు’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత వెనుకబడిన వర్గాల నుంచి అయినట్టయితే ‘సామాజిక వివక్ష’నూ దాటాలి. ఇన్ని అడ్డంకులను దాటి, దాటుతూ కూడా వందన సమున్నతంగా నిలబడింది. వందన ఉదంతం ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్లకు క్రీడల్లో ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలియజేస్తోంది. ఇలాంటి నేపథ్యం ఉన్నా ఈ దేశంలో విజయం సాధించేందుకు సకల అవకాశాలు ఉన్నాయని కూడా తెలియచేస్తోంది. మనం చూడాల్సింది ఈ రెండో కోణాన్నే. వందనా కటారియా -
నాలుగు నెలల్లో మూడో కృష్ణుడు
నాలుగునెలలు.. ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఒకే పార్టీ. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లోని రాజకీయ ఊగిసలాటకు ఇది ఓ దర్పణం. ఇరవై ఒక్కేళ్ళ చరిత్ర గల ఉత్తరాఖండ్‌లో ఇప్పటికి 11 మంది ముఖ్యమంత్రులైతే, అందులో ఒకరికి ముగ్గురు సీఎంలను తాజా బీజేపీ హయాంలోనే జనం చూశారు. తాజాగా ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ స్థానంలోకి పుష్కర్‌సింగ్ ధామీ రావడంతో దేవభూమిగా పేరుపడ్డ ఉత్తరాఖండ్ రాజకీయ రంగస్థలిపైకి ముచ్చటగా మూడో కృష్ణుడు వచ్చిన ట్టయింది. అధికార పక్షం న్యాయపరమైన చిక్కులను సాకుగా చెబుతూ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, కొద్ది నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇది రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు చేసిన ముఖ్యమంత్రి మార్పు అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉత్తరప్రదేశ్ నుంచి విడివడి ఏర్పడిన ఉత్తరాఖండ్ ఎప్పటిలానే తన రాజకీయ అస్థిరత రికార్డును మరోసారి నిలబెట్టుకున్నట్టయింది. 2017లో మోదీ ప్రజాదరణ హవా ఆసరాగా ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి అధికారపక్షానికి బాలారిష్టాలే. మొదట త్రివేంద్ర రావత్, తరువాత తీరథ్ సింగ్ రావత్, ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామీ – ఒకరి తరువాత ఒకరు గద్దెనెక్కారు. తాజా సీఎంకు ముందున్న ఇద్దరి హయాంలోనూ పార్టీ ఇమేజ్ దిగజారడం గమనార్హం. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలోనూ అంతర్గత కలహాలు అనేకం బయటపడ్డాయి. చార్ధామ్ పుణ్యక్షేత్రాలైన బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి – నాలుగింటినీ చార్ధామ్ దేవస్థానం బోర్డు కిందకు తేవాలన్న త్రివేంద్ర నిర్ణయం తీవ్ర విమర్శలు, వ్యతిరేకత తెచ్చింది. దాంతో, ఆయన స్థానంలో ఈ ఏడాది మార్చిలో తీరథ్‌ను తెచ్చిపెట్టారు. త్రివేంద్ర తీసుకున్న అనేక నిర్ణయాలను తిరగదోడిన తీరథ్ ఇప్పుడిలా నాలుగునెలలకే సీఎం సీటుకు గుడ్‌బై కొట్టాల్సి రావడం కొంత ఆయన స్వయంకృతమే. మార్చిలో పదవి చేపట్టినప్పటి నుంచి అమ్మాయిల చిరిగిన జీన్స్‌పైన, ఆధ్యాత్మికతతో కరోనాపై పోరాటం లాంటి తీరథ్ వ్యాఖ్యలు పలు వివాదాలు రేపాయి. కరోనా రెండో ఉద్ధృతి వేళ కుంభమేళా నిర్వహణ తెచ్చిన చెడ్డపేరు, పార్టీలోనూ – పాలనలోనూ గందరగోళం... ఇలా అన్నీ కలిసి ఆయనకు పదవీగండం తెచ్చాయి. తీరథ్ నిజానికి ఎమ్మెల్యే కూడా కాదు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో కొనసాగాలంటే, ఆరు నెలల లోపలే చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ, కోవిడ్–19 వల్ల ఉప ఎన్నికలు జరిగి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేకపోయిందనీ, ‘ప్రస్తుతమున్న రాజ్యాంగ సంక్షోభ పరిస్థితుల రీత్యా’ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తు న్నాననీ ఆయన డాంబికాలు పోయారు. కోవిడ్ సాకును ఆయన కవచంగా వాడుకుంటున్నా, వాస్తవం వేరు. నిజానికి, తీరథ్ తన ఎన్నికపై స్పష్టత కోసం గత నెలలో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ వెళ్ళారు. పార్టీ సైతం నైనిటాల్లో మూడు రోజులు ‘చింతన్ బైఠక్’ జరిపి మల్లగుల్లాలు పడింది. చివరకు, అధికారులపై అతిగా ఆధారపడుతూ, పరిపాలనలో ముద్ర వేయలేకపోయిన తీరథ్‌ను తప్పిస్తేనే మంచిదని అధిష్ఠానం భావించింది. ఫలితమే తీరథ్ స్థానంలో ధామీకి పట్టాభిషేకం. కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఒక రకంగా ఇది ముళ్ళకిరీటమే. 21 ఏళ్ళ ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలో ఆ పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయసు వ్యక్తి ఆయనే. మాజీ సీఎం కోష్యారీ వద్ద ప్రత్యేక విధుల అధికారిగా పనిచేసి, స్వయంగా సీఎం కావడం ధామీకి దక్కిన అరుదైన ఘనత. చెప్పుకోవడానికి రికార్డుగా అది బాగానే ఉన్నా, చిక్కులూ చాలానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ కనీసం మామూలు మంత్రి పదవి చేసిన అనుభవమైనా ధామీకి లేదు. ఏబీవీపీతో అనుబంధ మున్నా, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సీనియర్లను సమన్వయం చేసు కుంటూ, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అందరినీ ఒక్క తాటిపై నడిపించడం కూడా నల్లేరుపై బండి నడకేమీ కాదు. కుమావూ ప్రాంతంలోని ఖతిమా నుంచి గడచిన రెండు ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు. నలభై అయిదేళ్ళ ధామీకి ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆరెస్సెస్)తోనూ, ఏబీవీపీ లాంటి దాని అనుబంధ సంస్థలతోనూ ముప్ఫయ్యేళ్ళ పైగా అనుబంధం. అలా పార్టీని నడిపే సిద్ధాంతాలు, పార్టీ యంత్రాంగం పనితీరుపై సంపాదించిన అనుభవమే ఆయనకిప్పుడు పెట్టుబడి. మరికొద్ది నెలల్లోనే 2022లో జరిగే ఆ రాష్ట్ర ఎన్నికల్లో సీఎంగా పార్టీకి సారథ్యం వహించడానికి అది సరిపోతుందా అన్నది ఇప్పుడు ప్రశ్న. పాలన ఆఖరేడులో బీజేపీ ఇలా తక్షణ పరిష్కారాలు వెతుకుతూ, పదే పదే సీఎంలను మార్చడం ప్రతిపక్షాల చేతిలో బలమైన అస్త్రం కానుంది. వరుసగా రెండుసార్లు బీజేపీ ఆ రాష్ట్రంలో గెలిచిన చరిత్ర లేదు. పైపెచ్చు, 2017 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి రకరకాల కారణాలతో అక్కడ ఆ పార్టీ ప్రతిష్ఠ మసకబారుతూ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, కుంభమేళాతో వచ్చిపడ్డ ప్రజారోగ్య సంక్షోభం దానికి తోడయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లోనూ అధికారం నిలబెట్టుకోవడం ఆ పార్టీకీ, కొత్తగా పగ్గాలు చేపట్టిన ధామీకీ పెద్ద సవాలే. ధామీ వచ్చీ రాగానే, ప్రతిపక్షాలు ‘అఖండ భారత్’ పేరిట ఆయన చేసిన పాత సోషల్‌మీడియా వ్యాఖ్యలను వెలికితీసి, విమర్శలకు పదును పెట్టడం భవిష్యత్ పోరాటాలకు ఓ మచ్చుతునక. అయితే, రాష్ట్రాలకు తాయిలాల మొదలు ఎన్నికల నిర్వహణ దాకా కేంద్రం కనుసన్నల్లోనే సాగడం రాష్ట్ర బీజేపీకి అనుకూలం. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన దార్శనికత, పార్టీకి అవసరమైన ఎన్నికల చతురత చూపాల్సింది మాత్రం కొత్త ముఖ్యమంత్రే! -
రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు
‘మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ (రిప్డ్ జీన్స్) ధరించిన ఆడవాళ్లు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’... ఇది ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ కామెంట్. వెంటనే స్త్రీలు ప్రతిస్పందించారు. ‘హాష్స్టాగ్రిప్డ్జీన్స్’ మూవ్‌మెంట్‌ను ట్విటర్లో వరదలా వెల్లువెత్తించారు. అందరూ తమ రిప్డ్ జీన్స్‌తో ట్విటర్లో ఫొటోలు పెట్టి ‘ఏమంటారు సి.ఎం గారూ’ అని అడగడమే. మగవాళ్లు ఎందుచేత తమకు స్త్రీల బట్టల మీద వ్యాఖ్యానించే ఆధిపత్యం ఉందని అనుకుంటారో అని వీరు ప్రశ్నిస్తున్నారు. కంగనా రనౌత్ ఇదే సమయంలో ఒక కామెంట్ చేసింది. కుర్రకారును ఇంకో రకంగా హెచ్చరించింది. ఈ మొత్తం ట్రెండ్‌పై కథనం. మంగళవారం (మార్చి 16) డెహ్రాడూన్‌లో బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సి.ఎం. పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల గురించిన కార్యక్రమం కాబట్టి బాలల విషయంలో తల్లిదండ్రులకు హితవు చెప్పాలనుకున్నారు. అయితే ఆ హితవు స్త్రీల దుస్తులకు సంబంధించిందిగా మారి వ్యతిరేకత ఎదురైంది. ‘నేనొకసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న మహిళ ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తోంది. ఆమె తన మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ ధరించింది. ఆమె తన పిల్లలకు ఈ ‘కత్తిరింపుల సంస్కృతి’ ద్వారా ఏం చెప్పదలుచుకుంది. ఇటువంటి వారు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’ అన్నారు. ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ ‘పాశ్చాత్యులు మనల్ని చూసి యోగా చేస్తున్నారు. ఒంటి నిండా బట్టకప్పుకుంటున్నారు. మనం నగ్నత్వం వైపు వెళుతున్నాం’ అని కూడా ఆయన అన్నారు. వెంటనే అక్కడి ప్రతిపక్షం వారు దీనిని ఖండించారు. ‘మహిళలను అవమానించే ఈ వ్యాఖ్య చేసినందుకు సి.ఎం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు స్త్రీల దుస్తులపై గతంలో వచ్చిన పురుషాధిపత్య వ్యాఖ్యల వంటివే ఇవి కూడా అని వెంటనే స్త్రీల వైపు నుంచి వ్యతిరేక స్పందన మొదలైపోయింది. క్షణాల్లో ‘హ్యాష్స్టాగ్రిప్డ్జీన్స్ట్విటర్’ అంటూ ట్విటర్లో సెలబ్రిటీలు, సాధారణ స్త్రీలు రిప్డ్ జీన్స్‌లో ఉన్న తమ ఫొటోలను పోస్ట్ చేశారు. వీరిలో యువత ఉంది. తల్లులూ ఉన్నారు. ‘దేశంలో రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు. స్త్రీ ద్వేష వ్యాఖ్యలు చేసే పురుషుల వల్ల’ అని వారు వ్యాఖ్యలు రాశారు. ‘సోచ్ బద్లో దేశ్ బద్లేగా’ (ఆలోచనాధోరణి మారిస్తే దేశం మారుతుంది) అని కూడా వారు రాశారు. ‘బిజెపి ఇంకో 50 ఏళ్లు పరిపాలించవచ్చు. కాని రిప్డ్ జీన్స్ ఎప్పటికీ ఉంటాయి’ అని ఒకరు రాశారు. ఒకామె ‘జీన్స్ సంగతి వదిలిపెట్టండి. నేను రిప్డ్ స్కర్ట్ వేసుకుంటాను’ అని పెట్టింది. ఇంకా ఎన్నో వ్యాఖ్యలు. పదవిలోకి వచ్చిన పదిరోజుల్లోనే సి.ఎం తిరత్‌సింగ్ ఈ వివాదంలో పడ్డారు. రిప్డ్ జీన్స్‌తో ఫొటోలు పెట్టినవారిలో అమితాబ్ మనవరాలు నవేలి నందా కూడా ఉంది. అయితే ఆ తర్వాత ఆమె ఆ పోస్ట్ తొలగించింది. ఆమె అమ్మమ్మ జయభాదురి ‘ఇలాంటి వ్యాఖ్యలు ఒక సి.ఎంకు తగవు. అధికారంలో ఉన్నవారు ఇలా మాట్లాడటం వల్ల స్త్రీల మీద నేరాలకు ఊతం దొరుకుతుంది’ అని విమర్శించారు. ఎందుకు ఈ ట్రెండ్ రిప్డ్ జీన్స్ 1870లలోనే తయారైనా 1970లలో ఇవి ఫ్యాషన్ అయ్యాయి. వ్యవస్థ మీద కోపం, నిదర్శన ప్రదర్శించడానికి నాటి కుర్రకారు తమ జీన్స్ ప్యాంట్లను చించి తొడుక్కునేవారు. గాయని మడోనా ఈ ధోరణిని విస్తృతం చేసింది. ఆమె అభిమానులు ఆ ఫ్యాషన్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత జీన్స్ కంపెనీలు చిరిగిన జీన్స్‌ను తయారు చేసి మార్కెట్ చేయడం మొదలెట్టాయి. భారతదేశంలో కొత్తల్లో ఇవి అవహేళనకు గురైనా ‘ఎయిర్పోర్ట్ ఫ్యాషన్’గా గుర్తింపు పొందాయి. ప్రయాణాలు చేసే వారు వీటిని ధరించేవారు. ఇవాళ ఈ జీన్స్ ఇతర అన్ని జీన్స్ వలే సర్వసాధారణం. కంగనా ప్రమేయం ఒకవైపు హ్యాష్స్టాగ్ రిప్డ్జీన్స్ ట్రెండ్ నడుస్తుంటే మరోవైపు ఇవే జీన్స్ గురించి నటి కంగనా రనౌత్ వాటితో ఉన్న తన ఫొటోలు ట్విటర్లో పెట్టి కామెంట్ రాసింది. ‘రిప్డ్ జీన్స్ వేసుకున్నా మీరు అవి మీ కూల్‌నెస్‌ను స్టయిల్‌ను తెలిపేలా ఉన్నవే వేసుకోండి. అంతేతప్ప (అమ్మాయిలైనా అబ్బాయిలైనా) దిక్కులేని బిచ్చగాళ్ల వలే కనిపించే రిప్డ్జీన్స్ వేసుకోకండి’ అని చెప్పింది. ఈ కామెంట్స్‌కు ప్రతిస్పందన ఇంకా మొదలు కాలేదు.దేశ సంస్కృతి సభ్యత స్త్రీల బట్టల్లోనే ఉంది అని పురుషులు మాట్లాడుతున్న ప్రతిసారీ స్త్రీల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను చూసైనా పురుషులు తమ వ్యాఖ్యల్లోని అసంబద్ధతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల కోసం ఎదురు చూడక తప్పదు. -
జీన్స్ వద్దన్న సీఎం! బరాబర్ వేస్తానంటున్న బిగ్‌బీ మనవరాలు
అమ్మాయిల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! చిరిగిపోయిన జీన్స్ వేసుకుని ఎక్స్పోజింగ్ చేయడం, వాటిని ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం దురదృష్టకరమని, ఇది సంస్కృతిని దెబ్బ తీయడమేనని పేర్కొన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా పోటీపడి మరి స్కిన్ షో చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా మీరు చెప్పాలా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ సైతం సీఎం వ్యాఖ్యలపై ఒంటికాలిన దిగ్గున లేచింది. "మా వస్త్రధారణ మార్చే ముందు మీరు మీ ఆలోచనలను మార్చుకోండి. ఎందుకంటే మీరు సమాజానికి ఇస్తున్న సందేశాలు మమ్మల్ని మరింత షాక్‌కు గురి చేస్తున్నాయి" అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. అంతే కాదు తను జీన్స్ ధరించిన ఫొటోను షేర్ చేస్తూ "నేను సగర్వంగా ఈ జీన్స్‌ను ధరిస్తాను" అని చెప్పుకొచ్చింది. చదవండి: చిరిగిన జీన్స్ ధరించడంపై ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు -
మోకాళ్లు కనిపించేలా జీన్స్‌లా.. సమాజానికి ఏం సందేశమిద్దామని
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అమ్మాయిల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాల వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు చిరిగిపోయిన జీన్స్ ధరించడం సామాజిక విచ్ఛిన్నానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వస్త్రధారణతో భవిష్యత్తు తరాలకు ఏం సందేశమిస్తారని ఆయన నిలదీశారు. ఈ రకమైన వస్త్రధారణ మాదకద్రవ్యాల వినియోగానికి దారితీస్తుందని పేర్కొన్నారు. చిరిగిన డెనిమ్ జీన్స్‌లు ధరిస్తూ ఎక్స్పోజింగ్ చేయడం, అవి ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం నేటి తరాలు సంస్కృతిలా భావించడం దురదృష్టకరమని, ఇది కేవలం కత్తెర సంస్కృతి (కైంచి సే సాన్స్కార్) మాత్రమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేటితరం తలిదండ్రులు ఇలాంటి వస్త్రధారణకు అలవాటుపడితే.. తమ పిల్ల్లలకు ఇళ్లలో ఏం నేర్పుతారని ప్రశ్నించారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లు పోటీపడి మరీ స్కిన్ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాశ్చాత్యీకరణ పేరుతో మనం చిరిగిన పేలికలను వేసుకుంటుంటే.. పాశ్చాత్య ప్రపంచం మాత్రం మనల్ని అనుసరిస్తూ యోగాభ్యాసం చేస్తుందని అన్నారు. వారు తమ శరీరాలను పూర్తిగా కప్పుకొని యోగాభ్యాసం చేయడం చూస్తుంటే మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఓ మహిళ గురించి ప్రస్తావిస్తూ.. చిరిగిన జీన్స్ ధరించి ఆమె సేవ చేస్తూ సమాజానికి ఏం సందేశమిస్తుందని విమర్శించారు. -
మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..
హరిద్వార్: భారతీయులు రాముడిని ఎలా కొలుస్తారో, ప్రధాని మోదీ చేసే మంచి పనులకు రాబోయే రోజుల్లో ఆయనను కూడా అలాగే ఆరాధిస్తారంటూ ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన నేత్ర కుంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు సమాజం కోసం పని చేశారు. అందుకే రాముడిని ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. అలాగే ప్రధాని మోదీ కూడా సమాజం కోసం పని చేస్తున్నారు, కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనను కూడా రాముడి అవతారంలా భావించి కొలుస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎంగా ఎన్నికయ్యాక పాల్గొన్న తొలి కార్యక్రమంలో తీరత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH | Lord Ram worked for the same society & people started to believe that He was a God. In the coming time, Narendra Modi will also be seen at par with Him (Lord Ram): Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/xjw04hSsai — ANI (@ANI) March 15, 2021 కాగా, ప్రధాని మోదీ రాముడంతటి గొప్పవాడంటూ గతంలో బీజేపీ నేతలు చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బహిరంగ సభలో మోదీని రాముడితో పోల్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం ఆయన ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్థిని
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి బాధ్యతలు చేపట్టనుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉండేది మాత్రం ఒక్కరోజే. ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి ఆ యువతి విధులు నిర్వహించనుంది. ఎందుకంటే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకోనుంది. ప్రతియేటా జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అందులో భాగంగా రేపు జరగబోయే బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం కుర్చీలో బాలిక కూర్చోనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంతకీ సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరో కాదు హరిద్వార్ జిల్లా దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి. ఈమె బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. ఉత్తరాఖండ్ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ మేరకు సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆదివారం ఉత్తరాఖండ్ వేసవి రాజధాని అయిన గైర్‌సెన్‌లో సృష్టి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. ఆయుష్మాన్‌భవ, స్మార్ట్ సిటీ, పర్యాటకతో పాటు ఇతర శాఖల కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సీఎం హోదాలో సృష్టి చర్చించనుంది. ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని.. నివేదికలు రూపొందించి సమావేశానికి రావాలని ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపు ఉత్తరాఖండ్‌లో నవ పాలన సాగనుంది. అయితే సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2009లో థాయిలాండ్‌లో జరిగిన బాలికల అంతర్జాతీయ లీడర్షిప్ కార్యక్రమానికి సృష్టి హాజరైంది. -
అనుకున్నట్లే ఆయనకే కొత్త సీఎం పదవి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. అందరూ ఊహించినట్లుగానే త్రివేంద్ర సింగ్ రావత్‌నే తమ ముఖ్యమంత్రిగా ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నారు. ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు బీజేపీకే దక్కాయి. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. దీనిపైనే శుక్రవారం డెహ్రాడూన్‌లో కేంద్రమంత్రులు జేపీ నడ్డాతోపాటు డీ ప్రధాన్ తదితరులు వెళ్లి కొత్త సీఎం అభ్యర్థిపై చర్చించారు. సీఎం రేసులో ప్రకాశ్ పంత్, త్రివేంద్ర సింగ్ రావత్, సత్పాల్ మహారాజ్ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం త్రివేంద్రను వరించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుంచి తన జీవితాన్ని త్రివేంద్ర ప్రారంభించారు. 2014లో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. రావత్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పనిచేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితుడైనందునే ఈయన ఎంపిక ఖరారయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టింది. శనివారం రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవనున్నారు. -
‘ఫిట్‌గా ఉన్నా, ఎన్నికలకు రెడీ’
డెహ్రడూన్: తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తెలిపారు. మెడ సంబంధమైన సమస్యలు ఉన్నప్పటికీ, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో జరగనున్న ఎన్నికలను వెళతానని చెప్పారు. మెడనొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆస్పత్రి దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఫిట్‌గా ఉన్నానని ఉన్నానని అన్నారు. మార్చి 26న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. తాను రెండు స్థానాల్లో పోటీ చేయాలని హరీశ్ రావత్ భావిస్తున్నారు. కుమావ్, గర్వాల్ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. రెండు సీట్లలో పోటీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిన్నరాష్ట్రమైన ఉత్తరాఖండ్ ఒకే వ్యక్తి రెండు సీట్లలో పోటీ చేయడం సమంజసం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. -
కొన్ని గంటలకే మాటమార్చిన సీఎం
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాలు చొరబడిన విషయం నిజమేనని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ మాట మార్చారు. భారత సరిహద్దు వెంట చైనా బలగాల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే గానీ, ఉత్తరాఖండ్ భూభాగంలోకి మాత్రం చైనా దళాలు వచ్చాయంటూ వస్తున్న కథనాలు సరికాదని ఆయన అన్నారు. తమ భూభాగాన్ని మ్యాపింగ్ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర రెవెన్యూ బలగాలకు చైనా దళాలు కనిపించాయని, అంతకుముదు అప్పుడప్పుడు చైనా వాళ్లు కనిపించి పోయినా.. ఈసారి మాత్రం పెద్ద సంఖ్యలో చైనా సైనికులు వచ్చారని ఆయన అన్నారు. అయితే.. ఆ బలగాలు చైనా భూభాగంలోనే ఉండటంతో వాళ్ల కార్యకలాపాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజాగా చెప్పారు. వాళ్ల కదలికలు కనిపించడంతో తాము అప్రమత్తమయ్యామని, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉందని.. తగిన సమయంలో సరైన చర్యలు తీసుకుంటారని రావత్ అన్నారు. ఇదే విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. సరిహద్దుల్లో కదలికల గురించి ఇండో టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ) సునిశితంగా పరిశీలిస్తోందని, చైనా దళాలు నిజంగా మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయా.. లేవా అనే విషయాన్ని, పరిస్థితి తీవ్రతను వాళ్లు అంచనా వేస్తున్నారని అన్నారు. సమగ్ర నివేదిక తీసుకుని.. ఏం చేయాలో చేస్తామని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. -
'కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీజేపీ కుట్ర'
డెహ్రడూన్: కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తోందని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థ గురించి మొసలి కన్నీరు కారుస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కపట రాజకీయ వ్యూహాలతో ఎదురుదాడికి దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పోలీసు గుర్రంపై దాడికి చేశారు.. ఇప్పుడు రాజకీయ బేరసారాలకు పాల్పడుతున్నారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందన్న బీజేపీ వాదన నేపథ్యంలో.. మార్చి 28 లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం హరీశ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆదేశించారు. -
ముఖ్యమంత్రి పీఎస్ అని పరిచయం చేసుకుని..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి అని పరిచయం చేసుకుని పలువురిని మోసం చేసిన సౌరభ్ వత్స్ అనే వ్యక్తిని (30) ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. తన పలుకుబడిని ఉపయోగించి పనులు చేసిపెడతానని చెప్పి కొందరి నుంచి సౌరభ్ డబ్బులు తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శిని అని చెప్పి సౌరభ్ తమను మోసం చేశాడని కొందరు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. డెహ్రాడూన్‌లోని పటేల్ నగర్ ప్రాంతంలో సౌరభ్‌ను అతని ఇంట్లో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నామని చెప్పారు. -
రావత్‌పై ముడుపుల ఆరోపణలు
* ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై స్టింగ్ ఆపరేషన్ * సీడీ విడుదల చేసిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ న్యూఢిల్లీ: అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడిచేస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురు దాడి ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్.. ప్రయివేటు పంపిణీదారులకు అనుకూలంగా మద్యం విధానాన్ని మార్చివేసి డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కూడా ఆ పార్టీ నేతల అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఆరోపించింది. కేరళ మొదలుకొని అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ దోపిడీ వ్యాపారులుగా మారారని.. వారు గాంధీ కుటుంబానికి కమిషన్లు ఇస్తున్నారని పేర్కొంది. రావత్‌ను తక్షణమే తొలగించాలి డెహ్రాడూన్‌లో మద్యం పంపిణీని ప్రభుత్వ సంస్థలకు కాకుండా ప్రయివేటు పంపిణీదారులకు ఇచ్చేందుకు తనకు ముట్టజెప్పాల్సిన కమిషన్లపై.. ప్రయివేటు మద్యం పంపిణీదారులు, మధ్యవర్తులుగా చెప్తున్న వారితో హరీశ్‌రావత్ వ్యక్తిగత కార్యదర్శి మొహమ్మద్ షాహిద్ బేరమాడుతున్నట్లుగా ఉన్న వీడియో దృశ్యంతో ఒక సీడీని బీజేపీ నేత, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో విడుదలచేశారు. ఈ సీడీలోని దృశ్యాల్లో రావత్ లేరు. కానీ సీఎం కార్యదర్శి షాహిద్ బేరమాడుతున్నారని నిర్మలా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కార్యదర్శి కూడా అయిన షాహిద్.. సీఎం రావత్‌తో ఎంతో కాలంగా పనిచేస్తున్నారని.. రావత్ గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నపుడు కూడా ఆయనతో కలిసి షాహిద్ పనిచేశారని ఆమె చెప్పారు. రావత్ ఉత్తరాఖండ్‌లో మద్యం విధానాన్ని వక్రీకరించి ముడుపులు దండుకుంటున్నారని.. ఆయనను కాంగ్రెస్ పార్టీ తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. దేశం దృష్టి మరల్చటానికే: రావత్ డెహ్రాడూన్: బీజేపీ తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్ తిరస్కరించారు. తమ పార్టీ అగ్రనేతల కుంభకోణాల నుంచి దేశం దృష్టిని మరల్చాలనే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. అయితే.. ఆ వీడియో టేపుపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించినట్లు రావత్ తెలిపారు. -
స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన సీఎం కార్యదర్శి