
'కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీజేపీ కుట్ర'
డెహ్రడూన్: కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తోందని విమర్శించారు.
సమాఖ్య వ్యవస్థ గురించి మొసలి కన్నీరు కారుస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కపట రాజకీయ వ్యూహాలతో ఎదురుదాడికి దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పోలీసు గుర్రంపై దాడికి చేశారు.. ఇప్పుడు రాజకీయ బేరసారాలకు పాల్పడుతున్నారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందన్న బీజేపీ వాదన నేపథ్యంలో.. మార్చి 28 లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం హరీశ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆదేశించారు.