
‘ఫిట్‌గా ఉన్నా, ఎన్నికలకు రెడీ’
డెహ్రడూన్: తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తెలిపారు. మెడ సంబంధమైన సమస్యలు ఉన్నప్పటికీ, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో జరగనున్న ఎన్నికలను వెళతానని చెప్పారు. మెడనొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆస్పత్రి దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఫిట్‌గా ఉన్నానని ఉన్నానని అన్నారు.
మార్చి 26న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. తాను రెండు స్థానాల్లో పోటీ చేయాలని హరీశ్ రావత్ భావిస్తున్నారు. కుమావ్, గర్వాల్ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. రెండు సీట్లలో పోటీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిన్నరాష్ట్రమైన ఉత్తరాఖండ్ ఒకే వ్యక్తి రెండు సీట్లలో పోటీ చేయడం సమంజసం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది.