డెహ్రాడూన్: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు, ప్రమాదాలు అని ఉత్తరాఖండ్ బీజేపీ మంత్రి గణేష్ జోషి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీశ్ రావత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి పిచ్చి పట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అమరులను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. వారి త్యాగాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రావత్ ఈమేరకు ఏఎన్‌ఐ వార్తా సంస్థతో బుధవారం మాట్లాడారు.
మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ప్రధానులు ఇంధిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు ప్రమాదాలు అని గణేష్ జోషి అన్నారు. బలిదానం అనేది గాంధీ కుటంబాల గుత్తాదిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శ్రీనగర్‌లో నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముంగిపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన నానమ్మ, నాన్న చనిపోయిన వార్తలను ఫోన్ ద్వారానే తెలుసుకున్నానని, ఆ ఘటనలు తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుందని అన్నారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చదవండి: ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం..
Comments
Please login to add a commentAdd a comment