Ganesh Joshi
-
బీజేపీకి పిచ్చిపట్టింది.. ఉత్తరాఖండ్ మంత్రి వ్యాఖ్యలపై రావత్ ఫైర్..
డెహ్రాడూన్: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు, ప్రమాదాలు అని ఉత్తరాఖండ్ బీజేపీ మంత్రి గణేష్ జోషి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీశ్ రావత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి పిచ్చి పట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరులను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. వారి త్యాగాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రావత్ ఈమేరకు ఏఎన్ఐ వార్తా సంస్థతో బుధవారం మాట్లాడారు. మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ప్రధానులు ఇంధిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు ప్రమాదాలు అని గణేష్ జోషి అన్నారు. బలిదానం అనేది గాంధీ కుటంబాల గుత్తాదిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముంగిపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన నానమ్మ, నాన్న చనిపోయిన వార్తలను ఫోన్ ద్వారానే తెలుసుకున్నానని, ఆ ఘటనలు తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుందని అన్నారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం.. -
‘ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే’
ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి.. గాంధీ కుటుంబాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలేనని అవి బలదానాలు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా బలిదానం అనేది గాంధీ కుటుంబాల గుత్తాధిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంలో జరిగిన ఆ రెండు హత్యలు ప్రమాదాలేనన్నారు. బలిదానానికి, ప్రమాదానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఐతే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ శ్రీనగర్‌లోని భారత్‌జోడో యాత్ర ముగింపులో ప్రసంగిస్తూ దేశ సేవలోనే తన తండ్రి, నానమ్మలు ప్రాణాలు వదిలారంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే జోషి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో రాహుల్ యాత్ర సజావుగా సాగడంలో ప్రధాన మంత్రి మోదీ ఘనత ఎంతో ఉందని నొక్కి చెప్పారు. అక్కడ భారత్ జోడో యాత్ర జయప్రదం కావడంలో ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఆయన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోనే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అందువల్లే రాహుల్ లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించగలిగారని జోషి అన్నారు. కాగా రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు ప్రసంగంలో తన నానమ్మ, నాన్న చనిపోయారన్న దుర్వార్తను ఫోన్‌కాల్ ద్వారానే తెలుసుకున్నామని, నాటి ఘటనలు తలుచుకున్నా బాధగ అనిపిస్తుందని చెప్పారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్ అన్నారు. ఈ బాధ కేవలం ఒక ఆర్మీ మనిషికే అర్థమవుతుంది. పుల్వామాలో మరణించిని సీర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి అవగతమవుతుంది. ఆ విషాద ఘటనల తాలుకా కాల్స్ ఎలా ఉంటాయో కాశ్మీరులు కూడా బాగా అర్థం చేసుకోగలరని అన్నారు రాహుల్ గాంధీ. (చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. ప్రజల బాధలు విని కన్నీళ్లు పెట్టుకున్నా.. ముగింపు సభలో రాహుల్.) -
బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు: సోనియా అల్లుడు
డెహ్రాడూన్: పోలీసు గుర్రం ‘శక్తిమాన్’ చావుకు కారణమైన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి తనను బెదిరించారని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆరోపించారు. తనపై నోరు పారేసుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీని ఆహ్వానించేందుకు తన అనుచరులతో కలిసి డెహ్రాడూన్ విమానాశ్రయానికి వచ్చిన జోషి.. తన మీదకు దూసుకొచ్చి బెదిరించారని వాద్రా ఆరోపించారు. ‘మీరు దౌర్జన్యం చేస్తున్నా మాట్లాడకపోవడానికి నేను గుర్రాన్ని కాదు. మూగజీవం కాబట్టి గుర్రం మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడగలన’ని జోషికి సమాధానం ఇచ్చినట్టు రాబర్ట్ వాద్రా తెలిపారు. జోషిని ఆయన అనుచరులు విమానాశ్రయం బయటకు తీసుకెళ్లారని చెప్పారు. డెహ్రాడూన్ లో మార్చిలో బీజేపీ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడంతో ‘శక్తిమాన్’ మరణించిన తెలిసిందే. -
పాపం.. ఆ శక్తిమాన్ ఇక లేదు!
శక్తిమాన్ గుర్తుంది కదా.. బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చేతిలో దారుణంగా దెబ్బలు తిని.. ఆ మధ్య దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన ఈ ఉత్తరాఖండ్ పోలీసు గుర్రం ఇక లేదు. గత నెల హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన ఆందోళనలో తీవ్రంగా గాయపడిన ఈ 14 ఏళ్ల గుర్రం ఓ కాలిని వైద్యులు శస్త్రచికిత్స జరిపి తొలగించారు. ఆ కాలి స్థానంలో కృత్రిమ కాలును అమర్చి.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇన్నాళ్లు ప్రాణాలతో పోరాడిన శక్తిమాన్ బుధవారం తుదిశ్వాస విడిచింది. గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ గుర్రం చనిపోవడానికి కారణమని బీజేపీ ఆరోపిస్తున్నది. బీజేపీ ఆందోళనలో గాయపడిన కారణంగా ఈ గుర్రానికి సరైన వైద్యం అందించకుండా చనిపోయేలా హరీశ్ రావత్ ప్రభుత్వం చేసిందని కమలం నేత అజయ్ భట్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ అశ్వ పోలీసు దళంలో శక్తిమాన్ సేవలందించింది. మార్చి 14న డెహ్రాడూన్‌లో బీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా శక్తిమాన్ గాయపడింది. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడం వల్లే ఈ గుర్రం గాయపడిందని పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేశారు. గణేశ్ జోషి గుర్రాన్ని కొడుతున్నట్టు వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆయన మాత్రం తాను గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల అది గాయపడలేదని వాదిస్తున్నారు. -
మూగజీవాన్ని దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే!
డెహ్రాడూన్: ఓ ఎమ్మెల్యే విచక్షణ మరిచి రెచ్చిపోయాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తుండగా.. వారిని చెదరగొట్టడానికి పోలీసులు గుర్రాల మీద వచ్చారు. పోలీసులు తమ ఆందోళన అడ్డుకోవడంతో సహనం కోల్పోయిన ఆ ఎమ్మెల్యే పోలీసు గుర్రంపై కక్ష తీర్చుకున్నాడు. మూగజీవమన్న కనికరం లేకుండా లాఠీతో గుర్రాన్ని చితకబాదాడు. ఈ ఘటన సోమవారం డెహ్రాడూన్‌లో జరిగింది. హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెహ్రాడూన్‌లో బీజేపీ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ నిరసనలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఓ గుర్రంపై తన ప్రతాపం చూపాడు. లాఠీతో నిర్దాక్షిణంగా మూగజీవాన్ని బాదాడు. తీవ్రంగా గాయపడి దీనంగా అరుస్తున్న ఆ గుర్రాన్ని స్థానిక మిలటరీ అకాడమీలోని పశువైద్యశాలకు తరలించారు. చికిత్సలో భాగంగా తీవ్రగాయమైన గుర్రంకాలిని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. గుర్రాన్ని తీవ్రంగా గాయపర్చిన ఎమ్మెల్యే గణేష్ జోషిపై కేసు పెడతామని పోలీసులు తెలిపారు.