Rajiv Gandhi
-
వయనాడ్‌లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్‌లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్‌లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్‌లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్‌కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్‌సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్‌దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్‌గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్‌తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అందుకే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహా స్థాపన అని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోనియా, రాహుల్‌ను నాడు తిట్టిన కారణంగానే నేడు కవర్ చేసుకునేందుకే విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు.కాగా, జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహా స్థాపన చేపట్టారు.నాడు సోనియా గాంధీని బలిదేవత, రాహుల్ గాంధీని ముద్ద పప్పు అని తిట్టారు. వాటిని కవర్ చేసుకోవడానికే రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేశారు. రాజీవ్ కంప్యూటర్ కనిపెట్టారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కంప్యూటర్ కనిపెట్టిన ఛార్టెస్ బాబేజ్ ఆత్మ బాధపడుతుంది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: హైడ్రాపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. -
చీప్ లిక్కర్ తాగావా..? జగ్గారెడ్డి కౌంటర్
-
‘వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేస్తోంది‘: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది అని కేరళ వయనాడు విషాదంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. గురువారం కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లోని చూరల్మల ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల క్షేమ సమాచారాన్ని, భద్రతా బలగాల సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మానాన్న రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో.. ఇప్పుడు అంతే బాధపడుతున్నా.. యావత్ దేశం వయనాడ్ బాధను చూస్తోంది. నేనొక్కడినే కాదు అనేకమంది ఈ బాధను అనుభవిస్తున్నారు. వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్న ఆయన.. బాధితులకు అన్నీ రకాలుగా సహాయం అందించడమే మా ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. వయనాడ్ ప్రజల బాధను చూడలేకపోతున్నాం. బాధితులకు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చాం. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. ఈ విషాదం చూస్తే నాకు మాటలు రావడం లేదు అని ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. #WATCH | On deaths due to Wayanad landslides, Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, "Today, I feel how I felt when my father died. Here people have not just lost a father but an entire family. We all owe these people respect and affection. The whole nation's attention… pic.twitter.com/9dSPI6kQdx— ANI (@ANI) August 1, 2024 -
వంగలపూడి అనితకు కొండా రాజీవ్ కౌంటర్
-
రాజీవ్ వర్ధంతి: 1991 మే 21న ఏం జరిగింది?
ఈరోజు(మే 21) భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. మే 21న ప్రతి ఏటా ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడిలో హతమయ్యారు. ఆత్మాహుతి బాంబర్ బెల్ట్ బాంబును ప్రయోగించారు. రాజీవ్ గాంధీతో పాటు అక్కడున్న పలువురు హతమయ్యారు.రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్ ఎన్నికల సభలో పాల్గొనేముందు ప్రజల అభివాదాలను స్వీకరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తన దుస్తులలో పేలుడు పదార్థాలను దాచుకున్న లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ)కు చెందిన మహిళా సభ్యురాలు రాజీవ్ గాంధీ పాదాలను తాకి, బాంబును పేల్చివేసింది. వెంటనే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ ఎత్తు పొగ బెలూన్లా పైకి లేచింది. ఈ ఘటనలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతో సహా పలువురు అక్కడికక్కడే మృతిచెందారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు.రాజీవ్ గాంధీ హత్యానంతరం విపి సింగ్ ప్రభుత్వం మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉగ్రవాదాన్ని నిర్మూలనకు పాటుపడతామని ప్రమాణం చేస్తారు. అలాగే, ఈ రోజుకు గల ప్రాముఖ్యతను వివరిస్తూ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా ఉగ్రవాద వ్యతిరేక సందేశాలు పంపిస్తారు.భారత ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం తన 40 ఏళ్ల వయస్సులో దేశానికి ప్రధాని అయ్యారు. తన పదవీ కాలంలో రాజీవ్ పలు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. అవి నేడు ఎంతో ఉపయోగకరమైనవిగా నిరూపితమయ్యాయి.రాజీవ్ గాంధీ 1986లో జాతీయ విద్యా విధానాన్ని దేశమంతటా విస్తరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. రాజీవ్ గాంధీ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంతగానో ప్రోత్సహించారు. దేశంలో కంప్యూటర్ల వినియోగానికి ఊతమిచ్చారు. సూపర్ కంప్యూటర్ల రూపకల్పనకు ప్రోత్సాహాన్ని అందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసేందుకు ప్రయత్నించారు. పారిశ్రామిక ఉత్పత్తిని పెంచేందుకు అనేక కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు అందించారు. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
కులగణనపై కాంగ్రెస్ నేత అసమ్మతి వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా 1980 ఎన్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్ శర్మ అన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే భారత సమాజంలో కులతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్ కుల గణన హామీ ఇచ్చారు. -
గీతాంజలి పిల్లల బాధ్యత ఎవరిది? కొండా రాజీవ్ ఎమోషనల్
-
రాజీవ్ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ మృతి!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అకాల విడుదలకు అనుమతి పొందిన ఏడుగురు జీవిత ఖైదీలలో ఒకరైన సంతాన్(55) నేడు (బుధవారం) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. సంతాన్ అలియాస్ సుతేంతిరరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరిలో ఆసుపత్రిలో చేరాడు. క్రిప్టోజెనిక్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న సంతాన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని హెపటాలజీ (లివర్) ఐసీయూ విభాగంలొ చికిత్స పొందుతున్నాడు. అతనికి సోకిన కాలేయ వ్యాధి కారణంగా ఊపిరి ఆడకపోవడం, పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం, అవయవాలు వాపు మొదలైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. సంతాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హాస్పిటల్ డీన్ డాక్టర్ ఇ థెరానీరాజన్ ఇటీవల మీడియాకు తెలిపారు. 2022, నవంబరు 11న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సంతాన్కి విధించిన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. సంతాన్తో పాటు మరో ఐదుగురు దోషులైన నళినీ శ్రీహరన్, శ్రీహరన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్‌లు 32 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత వివిధ జైళ్ల నుండి విడుదలయ్యారు. -
జూ.ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోయినట్టే..!
-
చంద్రబాబును ఎందుకు గుర్తుపెట్టుకోవాలో లోకేష్ చెప్పగలడా ?
-
రాజస్థాన్ ఎన్నికలు: నోరు జారిన ఖర్గే, క్షమాపణలు
రాజస్థాన్ ఎన్నికల సభలో కాంగ్రెస్సీనియర్ నేత నోరుజారి ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును ప్రస్తావించడం వైరల్‌గా మారింది. సోమవారం ఒక బహిరంగ సభలో మాట్లాడిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఒక సందర్భంగా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరుకు బదులుగా ఆయన కుమారుడు రాహుల్ గాంధీపేరును పేర్కొనడం విమర్శలకు తావిచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ ‘యే కబ్ హువా?’ (ఇది ఎప్పుడు జరిగింది?) ట్విటర్లో ఆక్షేపించింది. అనూప్‌గఢ్ (Anupgarh)లో ఏర్పాటు చేసినబహిరంగసభలో ఖర్గేమాట్లాడుతూ ‘రాహుల్‌గాంధీ లాంటి నేతలు దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించారు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, వెంటనే పొరపాటు గ్రహించిన ఆయన క్షమాపణలు చెప్పారు. పొరపాటున రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించానంటూ వివరణ ఇచ్చారు. జాతి సమైక్యత కోసం రాజీవ్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులున్నారు. కానీ బీజేపీలో మాత్రం ప్రాణాలు తీసే నేతలు ఉన్నారంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాగా రాజస్థాన్‌లో నవంబర్ 25వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఖర్గే, సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్, సీపీ జోషి ఇతర పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోకు ‘జన ఘోషన పత్ర’గా పేరు పెట్టారు. 200 స్థానాలు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకం.ఫలితాలు డిసెంబరు 3న వెల్లడికానున్నాయి. ये कब हुआ? pic.twitter.com/OCCR65Q1qc — BJP (@BJP4India) November 20, 2023 -
నాటి రాజీవ్ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం!
అది..1985.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రచారానికి రహ్లీ వచ్చారు. ఈ నేపధ్యంలో ఇక్కడి హైస్కూల్ గ్రౌండ్లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. భారీగా జనం హాజరు కావడంతో ఆ సభ చారిత్రాత్మకంగా నిలిచింది. రాజీవ్ ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. బహిరంగ సభ విజయవంతమైన నేపధ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మహదేవ్ ప్రసాద్ వరుసగా మూడోసారి రికార్డుస్థాయి ఓట్లతో విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలంతా భావించారు. అయితే మహాదేవ్ ప్రసాద్‌కు ప్రత్యర్థిగా బీజేపీ 32 ఏళ్ల గోపాల్ భార్గవ్‌ను రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడగానే అందరూ ఉలిక్కిపడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహదేవ్ తన ప్రత్యర్థి భార్గవపై దాదాపు 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ ఈ ఓటమిపై విశ్లేషణ చేసింది. బుందేల్‌ఖండ్‌లో ఓటర్లు నోటాను విరివిగా ఉపయోగించారని, ఇక్కడి ఓటర్లు అన్ని పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారని తేలింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ నియంత్రణ కార్యక్రమంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అప్పటి అనుభవజ్ఞుడైన కాంగ్రెస్ నేత శ్యామ చరణ్ శుక్లా పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ, రహ్లీ నుండి మహదేవ్ ప్రసాద్ హజారీ పేరును సూచించారు. తొలుత మహదేవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించినా, ఆ తర్వాత అంగీకరించారు. కాగా నాటి నుంచి ఇప్పటి వరకు రహ్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ గెలవలేదు. 1985 నుంచి బీజేపీ ఈ సీటును గెలుచుకుంటూ వస్తోంది. ఈ ట్రెండ్ 2018 వరకు కొనసాగుతూ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో గోపాల్ భార్గవ ఈ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై వరుసగా 9వ సారి పోటీకి దిగారు. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? ఏడు అడుగులు దేనికి చిహ్నం? -
నారా లోకేష్ అరెస్ట్ పక్కా: కొండా రాజీవ్ గాంధీ
-
ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? .. ఆ(మె) బిల్లు వెనక
మహిళలకు చట్ట సభల్లో, ముఖ్యంగా లోక్‌సభ, అసెంబ్లీల్లో మూడో వంతు రిజర్వేషన్లు.. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నఅంశం. అదే సమయంలో, అంతేకాలంగా విజయవంతంగా పెండింగ్‌లోనూ ఉన్న అంశం. అన్ని పార్టీలూ ఇందుకు మద్దతు తెలిపేవే. కానీ తీరా సదరు పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం ఆమోదం పొందకపోవడం, చివరికి సంబంధిత లోక్ సభ కాలపరిమితి తీరడం, దాంతో బిల్లుకు కూడా కాలదోషం పట్టడం... ఇదీ వరస! 1989లో తెరపైకి... మహిళలకు చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం దివంగత ప్రధాని రాజీవ్ గాందీతో మొదలైంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన హయాంలో, అంటే 1989లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. అయితే అది లోక్ సభలో ఆమోదం పొందింది గానీ రాజ్యసభలో గట్టెక్కలేదు. అనంతరం తెలుగు తేజం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా 1992, 1993లో ఈ మేరకు 72 73వ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిని ఉభయ సభలూ ఆమోదించాలి. అలా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని స్థానాలు, చైర్ పర్సన్ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేందుకు ఇది దోహదం చేసింది. దేవేగౌడ నుంచి మన్మోహన్ దాకా.. లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ తొలిసారిగా 1996లో దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కారు పార్లమెంటులో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. కానీ లోక్ సభా ఆమోదం పొందలేక అది కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998, 1999ల్లోనూ, ఆ తర్వాత 2002, 2003ల్లోనూ నాలుగుసార్లు బిల్లు పెట్టినా మోక్షానికి నోచుకోలేదు. 2004లో యూపీయే ఈ అంశాన్ని తమ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చింది. అధికారంలోకి వచ్చాక 2008లో మన్మోహన్ సింగ్ సర్కారు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అక్కడినుంచి స్టాండింగ్ కమిటీకి వెళ్ళడం, దాని నివేదికను కేంద్రం ఆమోదించడం, చివరికి రాజ్యసభ మహిళా బిల్లును ఆమోదించడం జరిగిపోయాయి. అయితే అదంతా సులువుగా ఏమీ జరగలేదు. బిల్లును వ్యతిరేకించిన పలువురు ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటికి పంపి మరీ ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంతా చేస్తే, ఆ బిల్లు దిగువ సభ అయిన లోక్ సభ ముందుకు రానే లేదు. చివరికి 2009లో 15వ లోక్ సభ రద్దుతో అలా పెండింగులోనే ఉండిపోయింది. కాకపోతే శాశ్వత సభ అయిన రాజ్యసభ ఆమోదం పొందింది గనక నేటికీ కాలదోషం పట్టకుండా అలాగే ఉంది. ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు మూడింట ఒక వంతు,అంటే 33 శాతం స్థానాలను కేటాయించడం దీని ముఖ్యోద్దేశం. ఈ మేరకు వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం, లోక్ సభలో మంగళవారం ఈ మేరకు ప్రవేశపెట్టడం తెలిసిందే.ఆ మూడు అసెంబ్లీల్లో అత్యధికం... అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఛత్తీస్‌గఢ్ దే! అయితే అక్కడ వారు ఎందరున్నారో తెలుసా? కేవలం 14.4 శాతం! 13.7 శాతంతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 12.35 శాతంతో జార్ఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి. 15 అసెంబ్లీల్లో 10% కన్నా తక్కువ... గోవా, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక,కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,ఒడిశా, సిక్కిం, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం. 7 అసెంబ్లీల్లో 0–12% కన్నాతక్కువ... బీహార్, హరియాణా,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ. లోక్‌సభలో 15 శాతమైనా లేరు... లోక్ సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 78.మొత్తం సంఖ్య 543లో ఇది 15 శాతం కూడా కాదు. రాజ్యసభలో కూడా మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆయన వాదిస్తే మరణశిక్ష కూడా యావజ్జీవం!
నేడు భారతదేశంలో భారీగా ఫీజులు వసూలు చేసే న్యాయవాదులు చాలామందే ఉన్నారు. అయితే వీరిలో రామ్ జెఠ్మలానీ పేరు ముందుగా వినిపిస్తుంది. అత్యధిక ఫీజులు, వివాదాస్పద కేసులు, క్లయింట్ల జాబితా కారణంగా రామ్‌జఠ్మలానీ పేరును నేటికీ తలచుకుంటుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్ర మంత్రినూ తన హవా చాటారు. రామ్ జెఠ్మలానీ 1923, సెప్టెంబర్ 14న ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్‌లోని షికార్పూర్లో జన్మించారు. తన 17 సంవత్సరాల వయసులో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్‌తో ఎల్ఎల్బీ పట్టా పొందారు. నాటి బొంబాయి శరణార్థుల చట్టానికి వ్యతిరేకంగా జెఠ్మలానీ పిటిషన్ వేశారు. అమానవీయమైన అంశం అయినందున దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదే ఆయన గెలిచిన మొదటి కేసు. ఆ తర్వాత ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1959లో నానావతి కేసులో జెఠ్మలానీ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నేవీ అధికారి కేవాస్ మాణిక్షా నానావతి తన భార్య ప్రియుడి కాల్చి చంపి, పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ కేసులో కేవాస్ మాణిక్షా నానావతి తరపున న్యాయపోరాటం చేయడం ద్వారా జెఠ్మలానీ ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1960వ దశకంలో రామ్‌జెఠ్మలానీ హాజీ మస్తాన్‌తో సహా పలువురు స్మగ్లర్ల కేసులను వాదించారు. ఈనేపధ్యంలో రామ్ జెఠ్మలానీ.. స్మగ్లర్ల లాయర్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. జెఠ్మలానీ చాలా కాలం డిఫెన్స్ లాయర్‌గా ఉన్నారు. తాను న్యాయవాదిగా మాత్రమే తన బాధ్యతను నిర్వర్తిస్తానని ఎప్పుడూ చెబుతుండేవాడు. అందుకే ఆయన తన దగ్గరకు వచ్చేవారు నేరస్తులా కాదా అనేది పట్టించుకోలేదని చాలామంది చెబుతుంటారు. కొన్ని కేసులను స్వీకరించేందుకు రామ్ జఠ్మలానీ రూ. 25 లక్షల వరకు తీసుకునేవారని అంటారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది ఆయనే. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కాశ్మీరీ ఉగ్రవాది అఫ్జల్ గురు తరపున కూడా ఆయన వాదించారు. కానీ ఈ కేసులో రామ్ జఠ్మలానీ విజయం సాధించలేదు. జెఠ్మలానీ గతంలో బీజేపీ నేత ఎల్‌కె అద్వానీ తరపునా న్యాయపోరాటం చేశారు. అద్వానీని సమర్థించారు. అంతే కాకుండా అమిత్ షా, లాలూ ప్రసాద్ యాదవ్, యడ్యూరప్ప, జయలలిత, అరవింద్ కేజ్రీవాల్ మొదలైన రాజకీయ నాయకులపై ఆయన కేసులు పెట్టారు. రాంజెఠ్మలానీ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు.ఆయన రెండుసార్లు బీజేపీ లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా,అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. జెఠ్మలానీ.. కాన్సైన్స్ ఆఫ్ మార్విక్, జస్టిస్ సోవియట్ స్టైల్, బిగ్ ఈగోస్-స్మాల్ మ్యాన్, కాంఫ్లిక్ట్స్ ఆఫ్ లాస్, మార్విక్ అన్‌చేంజ్డ్ అండ్ అన్రిపెంటెంట్ అనే పుస్తకాలను రాశారు. రామ్ జఠ్మలానీ పదవీ విరమణ చేసిన రెండేళ్ల అనంతరం 2019, సెప్టెబరు 8న అనారోగ్యంతో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఆమె మెడలో ‘భర్త కావాలి’ బోర్డు.. 30 నిముషాల్లో మారిన సీన్! -
నాటకీయత లేని యాక్షన్ సినిమా
ఒక దౌత్యవేత్త జీవితంలోని ఘటనలు పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. ముఖ్యంగా ఆయన లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో చురుగ్గా ఉన్నవాడూ; మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డవాడూ అయినప్పుడు! అందుకే ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్’ పుస్తకం ఉర్రూతలూగిస్తుందనుకుంటాం. కానీ విషయ తీవ్రత ఎలాంటిదైనా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా మాట్లాడే శైలి ఆఫ్తాబ్ సేఠ్ది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దశాబ్దాల పాటు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం ఆయన శైలిలో స్పష్టంగా కనబడుతుంది. దౌత్యవేత్తగా ఆయన మనసు ఎప్పుడూ నాటకీయతను శూన్యం చేయడంపైనే ఉంటుందని ఈ పుస్తకం చెబుతుంది. ఒక భారతీయ దౌత్యవేత్త జీవితం ఎలా ఉంటుందోనని మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటే, ఒక్కసారి ఆఫ్తాబ్ సేఠ్ జ్ఞాపకాల్లోకి తొంగిచూడండి. లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో ఆయన చురుగ్గా ఉన్నారు, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డారు. అంతేనా? జపాన్ రాజ కుటుంబంతో విందులారగించడం మొదలుకొని, మంచానపడ్డ గ్రీకు ప్రధాన మంత్రులను ఆసుపత్రుల్లో పలకరించడం, మయన్మార్ విప్లవ నేత ఆంగ్‌సాన్ సూకీ దివంగత భర్త మైకేల్ ఆరిస్‌తో కలిసి కుట్రలు పన్నడం వరకూ దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ చేసిన పనులు ఎన్నో! ఈ ఘటనలన్నీ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. బహుశా ఇవి ఆయన ‘అడ్రినలిన్’ను ఎప్పుడూ పైపైకి ఎగబాకించి ఉంటాయి కూడా. కానీ సుశిక్షితుడైన దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ రాసిన ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్ ’ పుస్తకం ఇలాంటి గాథలను పల్లెసీమల రోడ్ల మీద తిరిగే కారు వేగంలా నెమ్మదిగా వివరిస్తుంది. విషయం చాలా గొప్పది కావచ్చు కానీ చెప్పే శైలి మాత్రం ఆచితూచి, ప్రశాంతంగా ఉంటుంది. విషయ తీవ్రత ఎంత ఉన్నా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా నోట్లోని చుట్టతో పొగలు ఊదుకుంటూ, దేనికీ చలించని వ్యక్తిగా ఆఫ్తాబ్ను మనం ఊహించుకోవచ్చు. పుస్తకంలోని చాలా వాక్యాలు ‘ఒకసారి గుర్తు చేసుకుంటే’, ‘గుర్తుంచుకోవాల్సిన అంశం’, ‘ఇంతకుముందే చెప్పినట్లు’, ‘దీని గురించి క్లుప్తంగా చెప్పుకుని’ వంటి పదబంధాలతో మొదలవుతాయి. ‘దీని వివరాలు మనల్ని నిలిపి ఉంచకూడదు’ అన్నదీ తరచుగా కని పిస్తుంది. కొన్నిసార్లు అధ్యాయాల మధ్యలో ‘ఇప్పుడు మనం అసలు కథలోకి వెళితే’ అని ఉంటుంది. దశాబ్దాలపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కానీ తలుచుకుంటే ఆఫ్తాబ్ సేఠ్ భాష గాల్లోకి లేస్తుంది, ఆయన విశేషణాలు ఆకాశాన్ని అంటుతాయి. ‘‘భయంకరమైన తరచుదనంతో కాండ్రించి ఉమ్మడం ఆయనకున్న ఒకానొక ఇబ్బందికరమైన అల వాటు. అదృష్టం ఏమిటంటే, ఆ ఉమ్మడమేదో తన కుర్చీ దగ్గరగానే పెట్టుకున్న ఉమ్మితొట్టెలోకి పడేలా చాకచక్యంగా ఊసేవాడు.’’ సేఠ్ భాషకు మచ్చుకు ఒక ఉదాహరణ ఇది. జాగ్రత్తగా తూచినట్టుండే ఆయన శైలి అప్పటికి ఆదరణీయం కాకపోయినా, ఆయన చేసిన పనులు, కలిసిన మనుషుల గురించి తెలిస్తే మాత్రం సంబరపడేన్ని కథలు ఉన్నాయనిపిస్తుంది. చిన్న ఉదాహరణ చూద్దాం. లెబనాన్ అంతర్యుద్ధం తీవ్రంగా జరుగుతున్న కాలంలో ఆఫ్తాబ్ బీరూట్‌లో ఉన్నారు. ఒక పక్క బాంబుల వర్షం, ఇంకోపక్క కుప్ప కూలుతున్న భవనాలు... వీటన్నింటి మధ్యలో సేఠ్ తన ఫ్లాట్ ముంగిట్లో నిద్ర పోయారట. పడే బాంబు ఏదో నేరుగా భవనం మీద పడవచ్చునన్న అంచనాతో! వాళ్ల డ్రైవర్ అలీ ‘‘కదులు తున్న దేనిమీదికైనా విచ్చలవిడిగా దూసుకొస్తున్న తుపాకీ గుళ్ల నుంచి తప్పించేందుకు కారును వాయువేగంతో ముందుకు ఉరికించాడు.’’ ఆఫ్తాబ్ భార్య పోలా అప్పుడు రెండోసారి గర్భవతిగా ఉన్నారు. పురిటినొప్పులు తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో మొదలయ్యాయి. ఆ సమయంలో ఆంబులెన్ ్స కూడా అందుబాటులో లేదు. తానే సొంతంగా కాన్పు చేసేందుకు కూడా సేఠ్ సిద్ధమయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. ఈ పుస్తకం మొత్తం ఉత్కంఠభరితంగా ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ చెప్పే విషయంలో ఆఫ్తాబ్ చాలా డిప్లొమాటిక్‌గా వ్యవహరించారని చెప్పాలి. బేనజీర్ భుట్టో విషయాలు చెప్పేటప్పుడు ఆయనెంత జాగ్రత్తగా వ్యవహరించారన్నది స్పష్టంగా తెలుస్తుంది. బేనజీర్ ఓ అద్భుతమైన వ్యక్తి. ఆమె గురించి ఆఫ్తాబ్కూ బాగా తెలుసు. కరాచీ, లార్కానాల్లోని భుట్టో ఇళ్లకు ఆయన వెళ్లేవారు. అలాగే మలేసియా, న్యూఢిల్లీల్లోని హోటళ్లలోనూ సమావేశాలు, చర్చలు నడిచేవి. రాజీవ్ గాంధీ నుంచి వచ్చే రహస్య సందేశాలు ఇలాంటి సమావేశాల్లోనే చేతులు మారేవి. కానీ ఈ సందేశాల గురించి ఆయన మనోహరమైన మౌనం పాటిస్తారు. ఈ అధ్యాయం ఎంత అద్భుతంగా మారి ఉండేది! కానీ ఏం చేస్తాం? తన వజ్రాలను సానపెట్టడం కాకుండా, వాటిని ఇలాంటి వాక్యాలతో రాళ్లలా మార్చేశారు. ‘‘మాజీ ప్రధాని వ్యక్తిత్వం గురించి తమకు తెలిసిన అరుదైన విషయాలను రోషన్(ఆఫ్తాబ్ సోదరుడు)తో భుట్టోలు పంచుకున్నారు’’ అని రాస్తారు. కానీ ఆ విషయాలు ఏమిటో వెల్లడించరు. బేనజీర్తో జరిగిన ఒక సమావేశం గురించి ఆయన రాశారు. ఇందులో బేనజీర్ మిలిటరీ కార్యదర్శి ఆ సమావేశాన్ని అడ్డుకునేందుకు ‘‘తప్పుడు ఆఫ్తాబ్’’ గురించి చెబుతారు. ప్రతిగా బేనజీర్ ‘‘రహస్యంగా వినే మైక్రోఫోన్లను గందరగోళ పరిచేందుకు రేడియో సౌండ్ పెంచారు’’ అని రాశారు. దౌత్యవేత్తగా ఆయన మనసు నాటకీయతను సున్నా చేయడంపైనే ఉంటుంది. ‘‘నింపాదిగా భోంచేస్తూ పాకిస్తాన్ స్థానిక రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించాము’’ అని రాయడం ఇలాంటిదే. అదృష్టం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఆఫ్తాబ్ విచక్షణకు కాకుండా, ధైర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి సందర్భాల్లోనే నియంత్రణలో నడిపే ఆయన వాక్యాలు సంకెళ్ల నుంచి తప్పించుకుంటాయి. కౌలాలంపూర్‌లోని ఓ రెస్టారెంట్లో బేనజీర్తో ఇద్దరిద్దరుగా భోంచేసిన కథ ఈ కోవకు చెందుతుంది. వారిద్దరూ ఒక టేబుల్ మీద ఉండగా, వారి సంభాషణను చెవులు రిక్కించినా వినలేనంతగా పదిహేను అడుగుల దూరంలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గుడ్లగూబలా చూస్తూ ఉండటం! ప్రధానిగా పాక్ అధ్యక్షుడితో తాను ఎదుర్కొంటున్న సమస్య లేమిటో ఆమె వివరంగా ఆఫ్తాబ్కు తెలిపిన సందర్భమిది. దాంతో పాటే ‘‘ఆయన రహస్య కార్యకలాపాల జాబితా’’ గురించి కూడా చర్చకు రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆ క్షణంలోనే విదేశాంగ మంత్రి యాకూబ్ ఖాన్‌ను విస్మరించి చాలా సమయమైందని బేనజీర్ అనుకున్నారో ఏమో, తమతో కలవమన్నట్టుగా ఆయన వైపు చూస్తూ సంజ్ఞ చేశారనీ, అలాగే మాట్లాడుతున్న అంశాన్ని కూడా ‘‘ఏదేదో ఊహించుకునే యాకూబ్ మనసుకు సాంత్వన ఇచ్చేలా’’ పాకిస్తాన్లో ఎవరికైనా చిర్రెత్తించే ‘జిన్నా హౌస్’ వైపు మళ్లించారనీ ఆఫ్తాబ్ రాశారు. ఇలాంటి పూవులే ఆఫ్తాబ్ సేఠ్ ఉద్యానవనంలో మనల్ని ఉల్లాసపరుస్తాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు ?
-
బాలుడిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన టీచర్..
లక్నో: యూపీలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని టీచర్ ఒక ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన సంఘటన పెను సంచలనంగా మారింది. విద్యార్థిని కొట్టించడం సంగతి అటుంచితే ఆమె మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో కూడా అగ్గి రాజుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ అమానుషంగా వ్యవహరించి పసి మనసుల్లో మత విద్వేషాలను నాటే ప్రయత్నం చేసిందని తెలిపారు యూపీ పోలీసులు. వీడియో ఆధారంగా యూపీ పోలీసులు టీచర్‌పైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. How humiliating for a small child to be put through this at a young age. Making the Muslim boy stand in front of the whole class and getting the Hindu kids to come and slap him. That teacher needs a slap tbh pic.twitter.com/n1KDWtTTwQ — Abu Hafsah (@AbuHafsah1) August 25, 2023 పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. టీచర్ కొట్టించిన బాలుడు ముస్లిం. టీచర్ కచ్చితంగా మతపరమైన దూషణలు చేసినట్టు వీడియోలో స్పష్టమైందని అయితే ఆమె నైజం ఏమిటన్నది విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ ముస్లిం విద్యార్థి గణిత పట్టికలను నేర్చుకోలేదని మతపరమైన దూషణ చేస్తూ తోటి విద్యార్థులను ఆ బాలుడిపై దాడి చేయమని ఉసిగొల్పారన్నారు. బాలల హక్కుల సంఘం కూడా టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాలుడి తండ్రి పాఠశాల యాజమాన్యం రాజీకి వచ్చిందని తాము కట్టిన ఫీజును కూడా తిరిగి చెల్లించిందని ఇకపై తమ బిడ్డను ఆ పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయంపై స్పందించే ఉద్దేశ్యం తనకు లేదని దీన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గాంధీ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవిత్రమైన పాఠశాలలో పిల్లల మనసుల్లో విద్వేషాలను నాటడం కంటే దేశద్రోహం మరొకటుండదు. ఇది దేశాన్ని బుగ్గిపాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పోసిన ఆజ్యమే. చిన్న పిల్లలు దేశ భవిష్యత్తు. వారిని ద్వేషించకుండా ప్రేమతత్వాన్ని నేర్పాలని అన్నారు. मासूम बच्चों के मन में भेदभाव का ज़हर घोलना, स्कूल जैसे पवित्र स्थान को नफ़रत का बाज़ार बनाना - एक शिक्षक देश के लिए इससे बुरा कुछ नहीं कर सकता। ये भाजपा का फैलाया वही केरोसिन है जिसने भारत के कोने-कोने में आग लगा रखी है। बच्चे भारत का भविष्य हैं - उनको नफ़रत नहीं, हम सबको मिल… — Rahul Gandhi (@RahulGandhi) August 25, 2023 మరో ఎంపీ జయంత్ సింగ్ స్పందిస్తూ.. హింసను రెచ్చగొడుతూ మైనారిటీలకు వ్యతిరేకంగా మతవిద్వేషాలు ఎంత లోతుగా పాతుకుపోయాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూడాలని.. పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. Muzaffarnagar school video is a painful warning of how deep rooted religious divides can trigger violence against the marginalised, minority communities. Our MLAs from Muzzafarnagar will ensure that UP Police files a case suomoto & the child’s education is not disrupted! — Jayant Singh (@jayantrld) August 25, 2023 ఇది కూడా చదవండి: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో తన భర్త రాజకీయ జీవితం అత్యంత క్రూరంగా ముగిసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్బంగా వీర్ భూమిలో ఆయనకు నివాళులర్పించి ఢిల్లీలోని జవహర్ భవన్లో జరిగిన జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు సోనియా గాంధీ. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 25వ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ.. నా భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం చాలా తొందరగా అత్యంత కిరాతకంగా ముగిసినప్పటికీ ఆయన ఈ కొంత కాలంలోనే ఎవ్వరికి సాధ్యం కాయాన్ని ఎన్నో ఘనతలు సాధించారన్నారు. ఆయనకు దొరికిన కొద్దిపాటి సమయంలోనే దేశం కోసం, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎంతో చేశారని జ్ఞాపకము చేశారు. రాజీవ్ గాంధీ ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా పంచాయతీల్లోనూ, మున్సిపల్ కార్యవర్గాల్లోనూ మహిళలు సుమారు 15 లక్షల మంది ఉన్నారన్నారు. ఇదంతా ఆనాడు రాజీవ్ గాంధీ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడో వంతు స్థానం కల్పించడానికి చేసిన కృషి ఫలితమేనన్నారు. అలాగే ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కుదించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా సోనియా గాంధీ ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ మత సామరస్యాన్ని చెడగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడమే ప్రధాన ఎజెండాగా చేసుకుంటున్నారు. వీరికి మరికొంత మంది మద్దతు తెలపడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ మత, జాతి, భాష, సంస్కృతులను సున్నితమైన అంశాలుగా చెబుతూ వీటిని అందరం కలిసి పండగలా నిర్వహించుకుంటేనే జాతి ఐక్యత సాధ్యమని నమ్మేవారన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1944, ఆగస్టు 24న జన్మించిన ఆయన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో 1991, మే 21న మృతి చెందారు. ఈ జాతీయ సద్భావనా అవార్డు 2021-22 సంవత్సరానికి గాను రాజస్థాన్ లోని గురుకుల పాఠశాల బానస్థలి విద్యాపీఠ్ మహిళల గురుకుల సంస్థకు అందజేశారు. ఆ సంస్థ తరపున సిద్దార్ధ శాస్త్రి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఇది కూడా చదవండి: ‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’ -
రాజీవ్ కృషితోనే ఐటీ, టెలికాం అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడమేకాక, రాజ్యాంగ సవరణలతో పల్లెసీమలకు సర్వ హక్కులు కలి్పంచి, సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈనాటి యువతకు ఒక స్ఫూర్తి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాజీవ్ కృషితోనే దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆదివారం సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి టీపీసీసీ నేతలతో కలసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి అధికారాన్ని పేదల చేతిలో పెట్టిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను తన మిత్రుడికి దోచిపెడుతుంటే, తెలంగాణలో కేసీఆర్ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టిలకు బుద్ధిచెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. గాందీభవన్‌లోనూ.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాం«దీభవన్లోనూ ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను వివరిస్తూ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు దీపాదాస్ మున్షీ, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, శివసేనారెడ్డి, మెట్టుసాయికుమార్, రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భారత ప్రధానుల నిర్ణయ విధానాలు!
ఆరుగురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇదివరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. ప్రధానంగా జీవిత చరిత్రలు నాకు మనో రంజకంగా ఉంటాయి. అందుకు కారణం ఆ ముఖ్య పాత్రల జీవితాలలో మనం పాలుపంచుకోవడం ఒక్కటే కాదు, అవి చదవడానికి సరదాగా అనిపించే అనేక చిన్న చిన్న నిజ జీవితపు ఘటనల ఆసక్తికరమైన కథలతో నిండి ఉంటాయి. గంభీరమైన చరిత్ర పుస్తకాలు ఇందుకు భిన్నమైనవి. అవి మరింత విశ్లేషణాత్మకంగా ఉండడం వల్ల వాటిని చదివేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇక అవి దేనినైనా పునఃమూల్యాంకనం జరుపుతున్నట్లుగా ఉంటే కనుక అవి అర్థం చేసుకునేందుకు దుర్భేద్యంగా తయారవడం కద్దు. పఠనీయతను, పారవశ్యాన్ని రెండు శైలులుగా జతపరచి ఆరు గురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఉదాహరణకు, రాజీవ్ గాంధీపై నీరజ రాసిన అధ్యాయం ఇలా మొదలౌతుంది. ‘‘రాజీవ్! ఈ ముస్లిం మహిళా బిల్లుపై మీరు నన్నే ఒప్పించలేకపోతే, దేశాన్ని ఎలా ఒప్పించబోతారు? అని సోనియా తన భర్తతో అన్నారు.’’ ఇక పీవీ నరసింహారావు అధ్యాయ ప్రారంభ వాక్యం అయితే మరింతగా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ‘‘డిసెంబరు 6వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత మీరు పూజలో కూర్చొని ఉన్నారని విన్నాను అని వామపక్ష పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రధాని నరసింహారావుతో అన్నారు’’ అని ఉంటుంది. ఆ విధమైన ప్రారంభ వాక్యంతో లోపలికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం. ఇప్పుడేమిటంటే, ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇది వరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. నరసింహారావుపై ఆమె చేసిన వ్యాఖ్యలైతే విశేషంగా మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిది – ఆ మనిషి గురించి ఆమెకు ఉన్న అవగాహన. ‘‘పీవీ నరసింహారావు... తనతో తను వాగ్వాదానికి దిగు తారు. ఒక విషయాన్ని ఆయన అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎంత లోతుగా వెళతారంటే, ఏ వైపూ స్పష్ట మైన చిత్రం కనిపించని స్థాయిలో ఆ విషయంలోని రెండు దృక్కోణాలనూ వీక్షి స్తారు’’ అంటారు నీరజ. ఇంకా అంటారూ, 1996లో ఆయన మెజారిటీ కోరుకోలేదనీ, ఆయన కోరుకున్న విధంగానే మెజారిటీ రాలేదనీ! ఎందుకంటే మెజారిటీ వస్తే సోనియాగాంధీకి దారి ఇవ్వవలసి వస్తుంది కదా! ‘‘కాంగ్రెస్ మైనారిటీలో ఉంటేనే రావుకు మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది’’ అని రాశారు నీరజా చౌధరి. ఆమె సరిగ్గానే చెప్పారు. ఇంతకు ముందె ప్పుడూ నాకు ఆ ఆలోచనే తట్టలేదు. వాజ్‌పేయితో నరసింహారావుకు ఉన్న దగ్గరితనం నా దృష్టిని మొత్తం అటు వైపునకే మరల్చింది. ‘‘ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. సంక్షోభ సమయాలలో ఒకరినొకరు కాపాడు కున్నారు’’ అని రాస్తారు నీరజ. 1996 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశంలో వాజ్‌పేయి... నరసింహారావుకూ, భువనేశ్ చతుర్వేది అనే ఒక జూనియర్ మంత్రికీ మధ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు ‘‘వాజ్ పేయి... రావు వైపు ఒరిగి, ‘కల్యాణ్ సింగ్ హమారే బహుత్ విరో«ద్ మే హై, ఉన్ కో నహీ బన్నా చాహియే’ (కల్యాణ్ సింగ్ నన్ను వ్యతిరేకి స్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట కూడదు) అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేదిని ఉటంకిస్తూ నీరజ రాశారు. ఆ సాయంత్రం చతుర్వేది, ‘వాజ్‌పేయికి సహాయం చేయాలా?’ అని రావును అడిగారు. అందుకు ఆయన ‘హా... కెహ్ దో వోరాజీ కో’ (అవును... అవసరమైనది చేయమని వోరాజీకి చెప్పండి) అన్నారు. వోరా ఆనాటి యూపీ గవర్నర్. నరసింహారావు సందేశం వోరాకు అందింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదు. నీరజ వివరణ ఎక్కువ మాటలతో ఉండదు. ‘‘లక్నోలో కల్యాణ్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడం అంటే అధికారం అద్వానీ చేతుల్లోకి వెళ్లడం. ఇది వాజ్‌పేయికి సమస్యల్ని సృష్టించ వచ్చు. వాజ్‌పేయి విషయంలో యూపీకి ఉన్న ప్రాము ఖ్యాన్ని అర్థం చేసుకుని, తన స్నేహితుడికి సహాయం చేయాలని రావు నిర్ణయించు కున్నారు’’ అని ఒక్కమాటలో చెప్పేశారు నీరజ. తిరిగి ఐదేళ్ల తర్వాత పీవీ నరసింహారావుకు ప్రతిఫలంగా వాజ్‌పేయి సహాయం అందించారు. 2000 సెప్టెంబరులో అవిశ్వాస తీర్మానాన్ని వీగి పోయేలా చేసేందుకు ఎంపీలకు లంచం ఇచ్చిన కేసులో ట్రయల్ కోర్టు రావును దోషిగా నిర్ధారించింది. అప్పుడు, ‘‘ఆ కేసును మూసి వేయించడానికి వాజ్‌పేయి సహాయం కోరారు నరసింహారావు’’ అని నీరజ రాశారు. ‘‘మధ్యవర్తిగా తను వాజ్‌పేయి దగ్గరకు వెళ్లినట్లు చతుర్వేది నాతో చెప్పారు: ‘నేను అటల్‌జీని కలవడా నికి వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను లోపలికి పిలిచారు. ‘ఇస్ కో ఖతమ్ కీజియే’ (ఆ విషయాన్ని ముగించండి) అని అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేది తనతో చెప్పి నట్లు నీరజా చౌధరి పేర్కొన్నారు. 2002 మార్చిలో ఢిల్లీ హైకోర్టు నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ‘‘హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయకూడదని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం’’, ‘‘సీబీఐ కూడా కేసును ఉపసంహరించుకుంది’’ అని రాశారు నీరజ. నా ఇన్నేళ్లలోనూ నేను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చూడ లేదు. వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. ప్రధాని పదవి కోసం తలపడ్డవారు. అయినప్పటికీ తమకెదురైన సవాళ్లను మొగ్గలోనే తుంచేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ‘నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా’ అనే మాటకు ఇదొక చక్కని నిదర్శనం. అత్తరు వాసనలా బయటికి కూడా రాదు. ఈ విషయంపై వారి వారి పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలుకోవాలని నాకు ఇప్పుడు కుతూహలంగా ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆధునిక సాంకేతిక సారధి.. టెక్నాలజీకి ఆయనొక వారధి!
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన దివంగత భారత ప్రధాని 'రాజీవ్ గాంధీ' గురించి అందరికి తెలుసు. ఇందిరాగాంధీ మరణాంతరం ప్రధానమంత్రి పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కుడైన ఈయన హయాంలో సమాచార, కమ్యూనికేషన్ పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. నేడు రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెలికామ్ రంగంలో విప్లవం.. అప్పట్లో 'రాజీవ్ గాంధీ' ప్రభుత్వం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ పట్టణాలలో గ్రామాలలో సహాయక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను చేపట్టింది. దీనికోసం టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ శామ్ పిట్రోడాను సలహాదారుగా నియమించుకుని 'సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్' (C-DOT)ని ప్రారంభించారు. ఆ తరువాత క్రమంగా డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీలు, భారత్ నెట్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రధాన కార్యక్రమాలు కూడా పురుడుపోసుకున్నాయి. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) ప్రారంభం.. రాజీవ్ గాంధీ హయాంలో 1986లో టెలిఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరించడం జరిగింది. ఇందులో భాగంగానే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభమైంది. టెలికామ్ నెట్వర్క్ డెవలప్మెంట్.. టెలికామ్ నెట్వర్క్ కూడా ఈయన హయాంలోనే బాగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. పబ్లిక్ కాల్ ఆఫీస్ (PCO) విప్లవం గ్రామీణ భారతదేశం ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడింది. గ్రామీణ & పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడంలో ఇది సహాయపడింది. ఇదీ చదవండి: ఫోన్ కొనుక్కోవడానికి ఏడాది జాబ్.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కంపెనీకే సీజీఓ డిజిటల్ ఇండియా.. భారతదేశంలో డిజిటల్ విప్లవం బాగా అభివృద్ధి చెందటానికి రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని అనుబంధ పరిశ్రమలు చాలా కృషి చేశాయి. అంతే కాకుండా వీరి కాలంలోనే కంప్యూటరైజ్డ్ రైల్వే టిక్కెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా! సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి.. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వాయువేగంగా అభివృద్ధి చెందటం అప్పుడే ప్రారంభమైంది. ఇందులో భాగంగానే పన్నులు, కంప్యూటర్లు, విమానయాన సంస్థలు, రక్షణ, టెలికమ్యూనికేషన్లపై సుంకాలను (ట్యాక్స్) బాగా తగ్గించారు. దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకమని భావించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. -
బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్
నేడు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. లడఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున రాహుల్ తన తండ్రికి నివాళులర్పించారు. 21వ శతాబ్దపు సృష్టికర్తగా పేరొందిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే ఇండియన్ టెలికాం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశంలోకి మొదటిసారిగా కంప్యూటర్లను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇవన్నీ రాజీవ్ విజయాల ఖాతాలో చేరుతాయి. రాజీవ్ గాంధీ జీవితానికి సంబంధించిన పలు అంశాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వీటిలో ఒకటి ఆయన మహాత్మా గాంధీని కలవడం. అప్పుడు రాజీవ్ వయసు 4 సంవత్సరాలు. అది 1948, జనవరి 29... సాయంత్రం మహాత్మా గాంధీని కలవడానికి రాజీవ్‌ను తీసుకుని అతని తల్లి ఇందిరా గాంధీ వెళ్లారు. ఇందిర, రాజీవ్‌లతో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అతని సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు మహాత్ముడిని కలవడానికి వెళ్లినవారిలో ఉన్నారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్రను రాసిన కేథరీన్ ఫ్రాంక్.. ఆ రోజు సాయంత్రం ఇందిర ఇంటి నుండి బయలుదేరే ముందు, వారి ఇంటి తోటమాలి మల్లెపూలను తీసుకువచ్చి, ఆమెకు ఇచ్చారని రాశారు. ఆ మల్లెపూలను గాంధీజీకి ఇవ్వాలని ఇందిరాగాంధీ అనుకున్నారు. వారంతా కలిసి బిర్లా హౌస్‌కు బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లాన్లో సన్‌బాత్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ, నెహ్రూ సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు తదితరులు గాంధీ దగ్గర కూర్చున్నారు. ఆ పక్కనే రాజీవ్ గాంధీ సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్.. మహాత్మా గాంధీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్నారి రాజీవ్ మనసులో ఏమనుకున్నాడోగానీ మహాత్ముని పాదాలపై మల్లెపూలు జల్లడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన జాతిపిత మహాత్మాగాంధీ.. రాజీవ్‌ను పైకి లేపి.. ‘అలా చేయకూడదు. చనిపోయిన వ్యక్తుల పాదాలపై మాత్రమే పూలు జల్లుతారని’ హితవు పలికారు. ఆ మరుసటి రోజే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. 1948, జనవరి 30 న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే జనసమూహం మధ్య నుంచి వచ్చి, గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?